Sri Matsya Mahapuranam-1    Chapters   

షణ్ణవతితమో7ధ్యాయః.

ఆదిత్యవారనక్తవ్రతమ్‌.

నారదః: య దారోగ్యకరం పుంసాం యదనన్తఫలప్రదమ్‌ l

య చ్ఛాన్తయే చ మర్త్యానాం వద నన్దీశ తద్ర్వతమ్‌. 1

నన్దికేశ్వర : య త్త ద్విశ్వాత్మనో ధామ పరం బ్రహ్మ సనాతనమ్‌ l

సూర్యాగ్ని చన్ద్రరూపేణ తత్త్రిధా జగతి స్థితమ్‌. 2

తదారాధ్య పుమా న్విప్రః ప్రాప్నోతి కుశలం సదా l తస్మా దాదిత్యవారేషు సదా నక్తాశనో భ##వేత్‌ . 3

యది హస్తేన సంయుక్త మాదిత్యస్య దినం భ##వేత l తదా శనిదినే కుర్యా దేకభుక్తం విమత్సరః. 4

నక్త మాదిత్యవారేణ భోజయిత్వా ద్విజోత్తమా& l పత్త్రె ర్ద్వాదశభి ర్యుక్తం రక్తచన్దనపఙ్కజమ్‌. 5

విలిఖ్య విన్యసే త్సూర్యం నమస్కారేణ పూర్వతః l దివాకరం తథాగ్నేయ్యాం వివస్వన్తం తతఃపరమ్‌. 6

భగంతు నైరృతే దేవం వరుణం పశ్చిమేదళే l మాహేన్ద్ర మనిలే తద్వ దాదిత్యంచ

తథోత్తరే. 7

శాన్త మీశానభాగేతు నమస్కారేణ విన్యసేత్‌ l కర్ణికాపూర్వపత్రేతు సూర్యస్యతురగా న్న్యసేత్‌. 8

దక్షిణ యమనామానం మార్తాణ్డం పశ్చిమే దళే l ఉత్తరేణ రవిం దేవం కర్ణికాయాంతు భాస్కరమ్‌. 9

తొంబది ఆరవ అధ్యాయము.

ఆదిత్యవార నక్తవ్రతము.

నందీశ్వరా ! మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మకమును సనాతనమునునగు పరబ్రహ్మ తత్త్వపు తేజము జగమున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నారాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య వారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాత్రియందు) భుజించవలెను. ఎట్లన- ఆదిత్య వారముతో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు-శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తముచే విమత్సరుడై యుండి ఆదిత్యవారమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.

(దానికి ముందు) రక్తచందనముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతేనమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున 'మహేంద్రాయనమః' ఉత్తరమున 'ఆదిత్యాయనమః' ఈశాన్యమన ' శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణికలో తూర్పున 'రవితురగేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున 'మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణకనడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

రక్తపుష్పోదకేనార్ఝ్యం సతిలారుణచన్దనమ్‌ l తస్మి న్పద్మే తతో దద్యా దిమం మన్త్ర ముదీరయేత్‌ . 10

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా సర్వతోముఖః l యస్మా దగ్నీన్ద్రరూప స్త్వం నమస్తే ప్రాగ్దివాకర.

అగ్నిమీళే నమస్తుభ్య మిషేత్వోర్జేతి భాస్కరమ్‌ lఅగ్న ఆయాహి వరద నమస్తే జ్యోతిషాం పతే . 12

అర్ఝ్యం దత్వా విసృజ్యాథ నిశి తైలవివర్జితం l భుఞ్జీత వత్సరాన్తేతు కాఞ్చనం కమలోత్తమమ్‌.13

పురుషంచ యధా శక్త్యా కుర్వీత ద్విభుజం తథా l

సువర్గశృఙ్గీం మనర్ఝ్యాం రౌప్యాం ఖురైః కాంస్య దోహాం సవత్సామ్‌.14

పూర్ణే గుడస్యోపరి తామ్రపాత్రే నిధాయ పద్మం పురుషంచ దద్యాత్‌ l

సమ్పూజ్య శయ్యామ్బరధూపమాల్యై ర్ద్విజంచ రక్తై రథవా పిశ##ఙ్గై. 15

ప్రక్షాళయిత్వా పురుషంచ పద్మం దద్యా దనేక వ్రతదానకాయ l

అవ్యఙ్గరూపాయ జితేన్ద్రియాయ కుటుమ్బినే దేయ మనుద్ధతాయ. 16

నమో నమః పాపవినాశనాయ విశ్వాత్మనే సప్తతురఙ్గమాయ l

సామర్గ్యజుర్ధామనిధే విధాత్రే భవాభ్ధిపోతాయ జగత్పవిత్ర. 17

ఇత్యనేన విధినా సమాచరే దబ్ద మేక మిహ యస్తు మానవః l

సో7ధిరోహతి వినష్టకల్మష స్సూర్యధామ సకలామరావృతః. 17

కర్మసంక్షయ మవాప్య భూపతి శ్శోకదుఃఖభయ రోగవర్జితః l

సోభ##వే ద్భువనసప్తసంయుతో ధర్మమూర్తి రమితాయురాత్మవా &. 19

యాచ భర్తృగురుదేవతత్పరా వేదకర్తు రిహ నక్త మాచరేత్‌ l

సా7పి లోక మమరౌఘపూజితం యాతి నారద పదం న సంశయః. 20

యః పఠే ధథ నర శ్శృణోతి వా పఠ్యమాన మథవా7నుమోదతే l

సోపి శక్రభవనే దివౌకసైః పూజ్యతే7బ్దశతకోటివిస్తరమ్‌. 21

ఇతి శ్రీమత్స్యమహాపురాణ ఆదిత్యవారనక్తవ్రతమాహాత్య్యకథనం నామ షణ్డవతితమో7ధ్యాయః.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఝ్యమీయవలెను. (మంత్రార్థము): దివాకరా! నీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు ; అగ్నీంద్రరూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్నిమీళే' ఇత్యాది ఋక్కులతో నీకు నమస్కారము. 'ఇషేత్వోర్జేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మంత్రముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్ఝ్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆరాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక వ్రతములను దానములను ఆచరించినవాడు అంగవైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్రమాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశక్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అపంలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు అగు పాడి యావును దానమీయవలెను. (దానమంత్రము): ''పాపవినాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సాను వేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము.''

ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతల తను సేవింప సూర్యపదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు అమితాయువునై ఊర్ద్వ సప్తలోకములను చేరి సుఖించును.

స్త్రీయైనను భర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతమును ఇట్లాచరించినచో ఆమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును . సందియము లేదు.

ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదిం (ప్రశంసిం)చినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంత్రభవనమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రతమాహాత్య్మ కథనమను తొంబది ఆరవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters