Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టనవతితమో7ధ్యాయః.

విభూతిద్వాదశీవ్రతమ్‌.

నన్దికేశ్వరః ; అథాన్యదపి వక్ష్యామి విష్ణో ర్ర్వత మనుత్తమమ్‌ l విభూతిద్వాదశీ నామ సర్వామర నమస్కృతా. 1

కార్తికే చైత్రవైశాఖే మార్గశీర్షే7థ ఫాల్గునే l ఆషాఢేచ దశమ్యాంతు శుక్లాయాం లఘుభు జ్నరః. 2

కృత్వా సాయన్తనీం సన్ధ్యాం గృహ్ణీయా న్నియమం నరః l ఏకాదశ్యాం నిరాహార స్సమభ్యర్చ్య జనార్దనమ్‌ 3

ద్వాదశ్యాం ద్విజసంయుక్తః కరిష్యే భోజనం విభో l తదవిఘ్నం మమైవాస్తు సఫలం మధుసూదన. 4

నమో నారాయణాయేతి వాచ్యంచ స్వపతా నిశి l తతః ప్రభాత ఉత్థాయ ¨కృతస్నానజప శ్శుచిః. 5

పూజయే త్పుణ్డరీకాక్షం గన్ధమాల్యానులేపనైః l విభూతయే నమః పాదౌ విశోకాయచ జానునీ . 6

నమ శ్శివాయేత్యూరూచ విశ్వమూర్తే నమః కటిమ్‌ l కన్దర్పాయ నమో మేఢ్ర మాదిత్యాయనమః కరౌ. 7

దామోదరాయేత్యుదర మాదిదేవాయచ స్తనౌ l మాధవాయే త్యురో విష్ణోః కణ్ఠం వైకుణ్ఠినే నమః. 8

శ్రీధరాయ ముఖం కేశా న్కేశవాయేతి నారద l వృష్ఠం శార్‌జ్గ్‌ ధరాయేతి శ్రవణ ధనదాయ వై. 9

స్వనామ్నా శజ్ఖచక్రాసిగదాజలజపాణయే l శిర స్సర్వాత్మనే బ్రహ్మ న్నమ ఇత్యభిపూజయేత్‌. 10

మత్స్య ముత్పలసంయుక్తం హైమం కృత్వాతు శక్తితః l ఉదకుమ్భసమాయుక్త మగ్రత స్థ్సాపయే ద్విభోః. 11

గుడపాత్రం తిలై ర్యుక్తం పీతవస్త్రాభివేష్టితమ్‌ l కృత్వా జాగరణం కుర్యాదితిహాసకథాదినా. 12

ప్రభాతాయాంతు శర్వర్యాం బ్రాహ్మణాయ కుటుమ్బినే l సకాఞ్చనోత్పలం దేవం సోదకుమ్భం నివేదయేత్‌.

_________________________________________________________________

¨గాయత్ర్యష్టశతం జపేత్‌

యథా న ముచ్యసే విష్ణో సదా సర్వవిభూతిభిః l తథా మాముద్ధరాశేషదుఃఖసంసారకర్ధమాత్‌. 14

దశావతారరూపాణి ప్రతిమాసం క్రమా న్మునే l దత్తాత్రేయం తథా వ్యాస ముత్పలేన సమన్వితమ్‌. 15

దద్యా దేవం సమా యావ త్పాషణ్డా నభివ్జయేత్‌ l

తొంబది ఎనిమిదవ అధ్యాయము.

విభూతి ద్వాదశీ వ్రతము.

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పసాగెను! సర్వోత్తమమగు విష్ణుదేవతాక వ్రతమును మరియొక దానిని చెప్పెదను. విభూతి ద్వాదశీ వ్రతమనునది సర్వామరుల ప్రశంసలనందుకొనునది. చైత్ర వైశాఖాషాడ కార్తిక మార్గశీర్ష ఫాల్గున మాసములలో దేనియందైన శుక్ల దశమినాడు లఘు భోజనముచేసి ఆనాటి సాయం సంధ్యావందనమయిన తరువాత ''నేను రేపు ఏకాదశినాడు నిరాహారుడనై జనార్థనుని అభ్యర్చించి ద్వాదశినాడు ద్విజులతో కూడి భుజింతును. నా ఈ వ్రతము నిర్విఘ్నమును సఫలమును అగుగాక! మధుసూదనా!'' అని సంకల్పించి నియమము పూనవలెను. రాత్రి నిద్రించునపుడును 'నమో నారాయణాయ' అని ధ్యానించుచుండవలెను.

ఏకాదశినాటి ఉదయమున మేల్కాంచి స్నాన జపములు చేసి శుచియై గంధమాల్యాను లేపనములతో పుండరీ కాక్షుని పూజించవలెను.

పూజా మంత్రములు: 1. విభూతయేనమః-పాదౌ పూజయామి; 2. విశోకాయనుః-జానునీ పూజయామి; 3.శివాయనమః-ఊరూ పూజయామి; 4.విశ్వమూర్తయేనమః -కటిం పూజయామి; 5.కందర్పాయనమః-మేఢ్రం పూజయామి; 6.ఆదిత్యాయనమః- కరౌ పూజయామి; 7. దామోదరాయనమః-ఉదరం పూజయామి; 8. ఆదిదేవాయనమః-స్తనౌ పూజయామి; 9. మాధవాయ నమః-ఉరః పూజయామి; 10.వైకుంఠినే నమః-కంఠం పూజయామి; 11. శ్రీధరాయ నమః-ముఖం పూజయామి; 12.ధనదాయ నమః-శ్రవణ పూజయామి; 13.సర్వాత్మనే నమః-శిరః పూజయామి; 14.కేశవాయ నమః-కేశాన్‌ పూజయామి; 15. శార్జగధరాయ నమః- పృష్ఠం పూజయామి; 16. శంఖచక్రాసిగదా జలజపాణయే బ్రహ్మణ నమః అని పూజించవలయును.

బంగారుతో కలువపూవును మత్స్యమును చేయించి అవియును-వానితోపాటు ఉదకుంభమను-పాత్రయందు నూవులును బెల్లమును నింపి పచ్చని వస్త్రముతో దానిని కప్పి అదియు స్వామి ముందు చవలెను. ఇతిహాస కథాది శ్రవణముతో జాగరణము చేసి ఆ రాత్రి గడుపవలెను. ద్వాదశినాటి ఉదయమున కుటుంబియగు బ్రాహ్మణునకు కలువపూవును మత్స్యమును ఉదకుంభమును గుడతిలపాత్రమును దానము చేయవలెను. దాన ప్రార్థనామంత్రము; ''విష్ణో! సర్వ విభూతి యుక్తుడవగు నీవు అశేష దుఃఖ సంసార పంకమునుండి నన్నుద్ధరించుము.'' ఇట్లే సంవత్సరముపాటు మత్స్యాది దశావ తార ప్రతిమలను దత్తాత్రేయ వ్యాసాదుల ప్రతిమలను కలువపూవును బంగారుతో చేయించి ఇచ్చుచుండవలెను. ఈ కాలమునందు పాషండుల (వేద నిందకుల)తో సంబంధమును ఏ మాత్రము పెట్టుకొనరాదు.

సమాపై#్యవం యథాశక్త్యా ద్వాదశ ద్వాదశీ ర్నరః. 16

సంవత్సరాన్తే లవణపర్వతేన సమన్వితామ్‌ l శయ్యాం దద్యా న్మునిశ్రేష్ఠ గురువే ధేనుసంయుతామ్‌. 17

గ్రామంచ శక్తిమా న్దద్యా తక్షేత్రంచ భవనాన్వితమ్‌ l గురుం సమ్పూజ్య విధివ ద్వస్త్రాలజ్కారభూషణౖః.

అన్యానపి యథాశక్త్యా భోజయిత్వా ద్విజోత్తమ&l తర్పయే ద్వస్త్రగోదానై రత్నాదిధన సఞ్చయైః. 18

అల్పవిత్తో యథాశక్త్యాస్తోకం స్తోకం సమాచరేత్‌ l యశ్చా ప్యతీవ నిస్స్వ స్స్యా ద్భక్తిమా న్మాధవంప్రతి.

పుష్పార్చనవిధానేన స కుర్యా ద్వత్సరత్రయమ్‌ l అనేన విధినా యస్తు విభూతిద్వాదశీవ్రతమ్‌.21

కుర్యా త్పాపవినిర్ముక్తః పితౄణాం తారయే చ్ఛతమ్‌ l జన్మనాం శతసాహస్రం సఏవ ఫలభా గ్భవేత్‌. 22

న వా వ్యాధి ర్భవే త్తస్య న దారిద్య్రం న బన్ధనమ్‌ l వైష్ణవో వా7థ శైవో వా భ##వే జ్జన్మని జన్మని. 23

యావ ద్యుగసహస్రాణాం శత మష్టోత్తరం భ##వేత్‌ l తావ త్స్వర్గే వసే ద్బ్రహ్మ న్భూపతిశ్చ పున ర్భవేత్‌. 24

ఇట్లు యథాశక్తిగా పండ్రెండు ద్వాదశులను గడపి సంవత్సరాంతమున గురుని వస్త్రాలకార భూషణములతో పూజించి లవణ పర్వతమును శయ్యను పాడియావును గ్రామమును పొలమును భవనమును (శక్తిని బట్టి) ఈయవలెను. ఇతర బ్రాహ్మణులను కూడ యథాశక్తి భుజింపజేసి వస్త్ర గోరత్నధనాదిక దానములచే సంతోషపరచవలెను. శక్తిలేనివాడు అల్పముగను ఈయవచ్చును. మరియు అల్పధనుడు పుష్పార్చన విధానముతో మూడు సంవత్సరములు మాధవుని ఇట్లర్చించవచ్చును.

దీని నాచరించుటచే తాను తరించి పాపనిర్ముక్తుడై నూర్గురను పితరలను కూడ తరింపజేయును. ఈఫలము అతనికి నూర్ల-వేల జన్మములవరకు వెంట నుండును. అతనికి వ్యాధులు దారిద్ర్యము బంధనము కలుగవు. అతడు శైవుడైనను వైష్ణవుడైనను దీని ఫలముగ నూట ఎనిమిది వేల యుగములపాటు స్వర్గమున వసించి కల్పాంతానంతర సృష్టిలో భూపతిగా జన్మించును.

పుష్పవాహనోపాఖ్యానమ్‌.

పురా రాథన్తరే కల్పే రాజా77సీ త్పుష్పవాహనః l నామ్నాలోకేషు విఖ్యాత స్తేజసా సూర్యసన్నిభః. 25

తపసా తస్య తుష్టేన చతుర్వక్త్రేణ నారద l కమలం కాఞ్చనం దత్తం యథాకామగమం మునే. 26

లోకై స్సమసై#్త ర్నగరవాసిభి స్సహితో నృపః l ద్వీపాని సురలోకాంశ్చ యథేష్టం వ్యచర త్సదా. 27

కల్పాదౌ సప్తమే ద్వీపే తస్య పుష్కరవాసినా l లోకేన పూజితం యస్మా త్పుష్కర ద్వీప ముచ్యతే. 28

తదేవ బ్రహ్మణా దత్తం యాన మస్య యతో7మ్బుజమ్‌ l పుష్పవాహన మిత్యాహు స్తస్మా త్తం దేవదానవాః. 29

న సామ్య మస్యాస్తి జగత్త్రయే 7పి బ్రహ్మామ్బజస్థస్యతు తస్య రాజ్ఞః l తపోనుభావా దథ తస్య పత్నీ నారీసహసై#్రరభివన్ద్యమానా. 30

నామ్నాచ లావణ్యవతీ బభూవ సా పార్వతీవేష్టతమా భవస్య l తస్యా స్సుతానా మయుతం బభూవ ధర్మాత్మనా మగ్య్రధనుర్ధరాణామ్‌. 31

తథా77త్మజాం స్తానథ వీక్ష్య రాజా ముహుర్ముహు ర్విస్మయ మాససాదl సో7భ్యాగతం వీక్ష్య మునిప్రవీరం ప్రచేతసం వాక్య మిదం బభాషే. 32

పుష్పవాహనః: కస్మా ద్విభూతి రచలా7మరమర్త్యపూజ్యా జాయాచ రూపవిజితామరనున్దరీయమ్‌ l భార్యా మమాల్పతపసా పరితోషితేన దత్తా తథా7మ్బుజగృహం మునివర్యదత్తమ్‌. 33

యస్మాత్ప్రవిష్టమపి కోటిశతం నృపాణాం సామాత్యకుఞ్జరరథౌఘ జనావృతానమ్‌ l నోలక్ష్యతే క్వ గత మమ్బరమధ్య ఇన్దు స్తారాగణౖరివ వృతః పరిత స్స్పురద్భిః. 34

తస్మా త్కిమన్యజననీజఠరోద్భవేన ధార్మాదికం కృత మశేషఫలాప్తిహేతు l స్వామి న్మయా7థ తనయై రథవా 7నయాపి మద్భార్యయా తదఖిలం కథయ ప్రచేతః. 35

పుష్పవాహనోపాఖ్యానము

పూర్వము రాథంతర కల్పమున రవితేజస్కుడగు పుష్పవాహనుడను రాజుండెను. అతడు తపముచే బ్రహ్మను మెప్పించి కామగమనముగల కాంచన కమలమును సంపాదించి తన నగరవాసి జనముతోకూడ సమస్త ద్వీపములందును సురలోకమునందును సంచరించుచుండెను. అతడు కల్పాదియందు ద్వీపములలో ఏడవదియగు పుష్కర ద్వీపమున వసించుచుండెడివాడు. బ్రహ్మ అతని కిచ్చిన పుష్కరము(పద్మము) అదియే. దీనిచే అతని దేవదానవాదులు పుష్పవాహనుడనిరి. నాడా రాజునకు సాటి ఎవరును లేరు. అతని తపోనుభావ మట్టిది. ఆతని పత్ని నారీసహస్రముచే వంద్యమానయు లావణ్యవతియునై భవునకు పార్వతివలె ఆ రాజునకు ప్రియయై యుండెను. ఆమెకు ధర్మాత్ములు ధానుష్కశ్రేష్ఠులు నగు పదివేల మంది తనయులు కలిగిరి. ఇదియంతయు చూచికొని రాజు తరచు వెరగొందుచుండి యొకనాడు తన కడ కభ్యాగతుడై వచ్చిన ప్రచేతసు నిట్లడిగెను: ''నాకు దేవమానవ పూజ్యమగు ఈ యచల సంపద అమరసుందరులకంటె మిన్నయగు ఈ పత్ని అల్పతపముతోనే తుష్టుడై బ్రహ్మ ఇచ్చిన ఈ పుష్పయానము చంద్రుని పరివేష్టించిన తారాగణమువలె నా ముందు కాంతిహీనులై నన్ను పరివేష్టించి యుండు చతురంగ బలసమేతులగు ఈ శతకోటి నృపులు -ఇదంతయును కలుగుటకు గత జన్మమున నేనో నా పత్నియో నాతనయులో అశేష ఫలాప్తిహేతువగు పుణ్యమేమి చేసియుంటిమో దయార్ద్ర చేతస్కుడవై తెలుపుము.''

ప్రచేతఃకథిత పుష్పవాహన పూర్వచరితమ్‌.

ప్రచేతాః: ప్రభవాన్తరితం సమీక్ష్య పుణ్యం పృథివీపతేః ప్రసభవిభూతి హేతువృత్తమ్‌ l జన్మా7భవ త్తవతు త్తవతు లుబ్ధకులేపి రాజ& జాతో భవా ననుదినం కిల పాపకారీ. 36

వపుర ప్యభూ త్తవ పురా పరుషాఙ్గసన్ధి దుర్గన్ధి సత్త్వభరుతాపకరం ప్రజానామ్‌ l న చ తే సుహృజ్జనగణ స్సుతబన్ధువర్గో న చ తే పితా నజననీ చ తదా. 37

అభిసమ్మతా పర మభీష్టతమా చ పత్నీ విముఖాతు పర్వతచరా7వ్యభవత్‌ l సీ దనావృష్టి రతీవ రౌద్రా కదాచి దాహారనిమిత్త మస్మి&. 38

క్షుత్పీడితేన భవతా తు యదా న కించి దాసాదితం ధాన్యఫలాదికంచ l తదా తు దృష్టం మహదమ్బుజాఢ్యం సరోవరం పజ్కపరీతరోధః. 39

పద్మా న్యథాదాయ తతో బహూని గతః పురం వైదిశనామధేయమ్‌ l తన్మూల్యలాభాయ పురం సమస్తం భ్రాన్తం త్వయా 7శేష మహ స్తదాసీత్‌. 40

క్రేతా న కశ్చి త్కమలేషు జాతః క్లాన్తః పరం క్షుత్పరిపీడితశ్చ l ఉపవిష్ట స్త్వ మేకస్మి న్త్సభార్యో భవనాఙ్గణ. 41

అథ మజ్గళశబ్దశ్చ త్వయా రాత్రౌ మహా ఞ్ర్ఛ్‌ తః l సభార్య స్తత్ర గతవా న్యత్రాసీ న్మజ్గళధ్వనిః . 42

తత్ర మణ్డపమద్యస్థా విష్ణో రర్చా7వలోకితా l వేశ్యానఙ్గవతీ నామ విభూతిద్వాదశీవ్రతమ్‌. 43

సమాప్య మాఘమాసస్య ద్వాదశ్యాం లవణాచలమ్‌ l నివేదయన్తీ గురవే శయ్యాం చోపస్కరాన్వితామ్‌.

అలజ్కృత్య హృషీకేశం సౌవర్ణామరపాదపా& l తాంచ దృష్ట్వా తతస్తాభ్యా మిదంచ పరిచిన్తితమ్‌. 45

కిమేభిః కమలైః కార్యం పరం విష్ణు రలజ్కృతః l ఇతి భక్తి స్తదా జాతా దమ్పత్యస్య నరేశ్వర. 46

తత్ర సఙ్గా త్సమభ్యర్చ్య కేశవం లవణాచలే l శయ్యాం పుష్పప్రకరైః పూజయిత్వాచ సర్వశః. 47

అథానఙ్గవతీ తుష్టా తాభ్యాం ధేను శతత్రయమ్‌ l దీయతా మాదిదేశాథ కలథౌతవలత్రుయమ్‌. 48

నగృహీతం తతస్తాభ్యాం మహత్సత్త్వావలమ్బనాత్‌ l

అనగా ప్రచేతు డిట్లు పలికెను: రాజా! నీకీ సర్వసంపదలకును హేతువగు నీ పూర్వ జన్మవృత్తమును చూచితిని. గత జన్మమున నీవు అనుదినము పాపకారియగు లుబ్ధకుడవు. నీ శరీరమును పరుషాంగసంధులు దుర్గంధము కలిగి ప్రాణులకు భయతాపకరమయియుండెను. పర్వతచరురాలయినను నీయందు విముఖయైనను నీకు అత్యంత ప్రియతమయగు భార్య తప్ప జననీ సుత సుహృద్బంధుజన మెవ్వరును నీకు లేకుండిరి.

ఇట్లుండ ఒకప్పుడు రౌద్రమగు అనావృష్టిచే ఆహారము లేకపోగా నీవు క్షుత్పీడితుడవై ధాన్య ఫలాదికము కూడ దొరుకని తరి నీకు పంకావృత తటము కలిగి అనేక పద్మయుతమగు కొలను కనబడెను. నీవు దానినుండి అనేక పద్మములు కోసి వాని నమ్మి లాభ మార్జించుటకై విదిశయను నగరమేగి అట పగలంతయు తిరిగితివి. వానిని కొనువా రెవ్వరును దొరుకక నీవు నీ పత్నితో అలసి క్షుత్పీడితుడవై యొక భవనాంగణమున కూర్చుంటివి. అంత రాత్రి కాగా వినవచ్చిన మంగళవాద్య ధ్వని జాడబట్టి అది వినవచ్చు చోటికి భార్యతో ఏగితివి. అచట అనంగవతియను వేశ్య చేయుచుండిన విష్ణుపూజను చూచితివి. ఆమె అపుడు తన విభూతి ద్వాదశీ వ్రత సమాప్తికై మాఘ శుక్ల ద్వాదశినాడు గురునకు లవణాచలమును సర్వోపస్కరయుక్త శయ్యను దాన మిచ్చుచుండెను. అది చూచి మీ రిరువురును భక్తికలగి 'ఈ కమలములతో పని యేమి?' అని వానితో విష్ణుని అలంకరించి అర్చించితిరి.

అది చూచి తుష్టయై అనంగవతి వారికి మూడు వందల పాడియావులను మూడు పలముల సువర్ణమును నిమ్మని తనవారి నాదేశించెను. కాని మీరు అధిక సత్త్వము నవలంభించి అవి తీసికొనకుంటిరి.

అనజ్గవత్యాచ పునస్తాభ్యా మన్నం చతుర్విధమ్‌. 49

అనీయ వ్యాహృతం చాత్ర భుజ్యతామితి భూపతే l తాభ్యాం తదా తథేత్యుక్తం భోక్ష్యావ శ్శ్వో వరాననే. 50

ప్రసజ్గా దుపవాసేన ¡గతా రాత్రి శ్శుభావహా l జన్మప్రభృతి పాపిష్ఠా వావాం దేవి శుభవ్రతే. 51

త్వత్ప్రసఙ్గా త్తయోర్మధ్యే ధర్మలేశ స్తతో 7నఘః l ఇతి జాగరణం తాభ్యాం తత్స్రసజ్గా దనుష్ఠితమ్‌. 52

ప్రభాతేతు తయా దత్తా శయ్యా సలవణాచలా l గ్రామాశ్చ గురవే భక్త్యా విప్రేభ్యో ద్వాదశైవతు. 53

వస్త్రాలఙ్గారసంయుక్తా గావశ్చ కనకాన్వితాః l భోజనంచ సుహృన్మిత్రదీనాద్ధకృపణౖ స్సమమ్‌. 54

తద్వ ల్లుబ్ధకదమ్పత్యం పూజయిత్వా విసర్జితమ్‌ l స భవా న్లుబ్ధకో జాత స్సపత్నీకో జనేశ్వర. 55

పుష్కరప్రభవా త్తస్మా త్కేశవస్యచ పూజనాత్‌ l వినష్టా7శేషపాపస్య తవ పుష్కరమన్దిరమ్‌ . 56

తస్య వ్రతస్య మాహాత్మ్యా దల్పేన తపసా నృప l అదా త్కామగమం యానం లోకనాధ శ్చతుర్ముఖః. 57

సన్తుష్ట స్తవ రాజేన్ద్ర బ్రహ్మరూపీ జనార్దనః l సా7ప్యనఙ్గవతీ వేశ్యా కామదేవస్య సామ్ప్రతమ్‌. 58

పత్నీ సపత్నీ సఞాత సా స్యాత్ప్రీతిరితి శ్రుతా l లోకే ష్వానన్దజననీ సకలామరపూజితా. 59

తస్మా దుత్స్యజ్య రాజేన్ద్ర పుష్కరం త్వం మహీతలే l గఙ్గాతటం సమాసాద్య విభూతిద్వాదశీవ్రతమ్‌. 60

కురు రాజేన్ద్ర నిర్వాణ మవశ్యం సమవాప్స్యసి l నన్దికేశ్వరః: ఇత్యుక్త్వా స ముని ర్బ్రహ్మా తత్రైవా న్తరధీయత. 61

రాజా యథోక్తంచ పున రకరో త్పుష్పవాహనః l ఇమా మాచరతో బ్రహ్మ న్నఖణ్డఫలభా గ్భవేత్‌. 62

యథాకథంచి త్కాలేన ద్వాదశ ద్వాదశీ ర్మునే l కర్తవ్యా భక్తితో దేయా విప్రేభ్యో దక్షిణా అపి. 63

విత్తశాఠ్యం న కుర్వీత భక్త్యా తుష్యతి కేశవః l ఇతి కలుషవిదారణం నరాణా మపి పఠతీహ శృణోతి వా7థ భక్త్యా. 64

మతిమపిచ దదాతి దేవలోకే వసతి* స రోమసమాని వత్సరాణి.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ విభూతిద్వాదశీవ్రత మాహాత్య్మ

కథనం నామాష్ట నవతితమో7ధ్యాయః.

అంతట అనంగవతి భక్ష్యభోజ్య లేహ్యచోష్య రూప చతుర్విధాన్నములు తెప్పించి మిమ్ము తినుడన మీరును 'అమ్మా! ప్రసంగవశమున అనుకొనకుండగనే ఉపవాసముతో శుభావహమయి రాత్రి గడచినది. కాన రేపు భుజింతుము. మేము జన్మప్రభృతిగా ఓ శుభవ్రతా! దేవీ! పాపిష్ఠులము. అంటిరి. ఇట్లు ఈ ప్రసంగమున మీ ఇరువురకును ధర్మలేశమును జాగరణానుష్ఠానఫలమును అబ్బినవి.

ఉదయమున ఆ అనంగవతి శయ్యయు లవణపర్వతమును గ్రామములను గురువునకును వస్త్రాలంకారకనక యుతములైన పండ్రెండు పాడియావులు బ్రాహ్మణులకును దానము చేసెను. సుహృన్మిత్ర దీనాంధకృపణులతోపాటు ఆమె ఈ లుబ్దక దంపతులకును భోజనము పెట్టి వీడ్కొనెను. రాజా! ఆ లుబ్దక దంపతులుగా నుండిన మీరు వ్రతమున చేసిన పూజా మహాత్మ్యమున మీపాపములన్నియు నశించి ఈ పద్మ గృహమును కామగమనమును ఈ సంపదాదికమంతయును బ్రహ్మరూపుడగు నారాయణునిచే మీకు ఈయబడినవి. ఆ అనంగవతియను వేశ్యయు ఇపుడు మన్మధుని రెండవ భార్యయై ప్రీతియను పేర రతీదేవికి సవతిగా నున్నదై లోకానందజననియు సకలామర పూజితయునై యున్నది.

కావున నో రాజేంద్రా! నీవును ఈ పద్మ గృహయానమును భూతలమున విడిచి గంగాతీరమున విభూతి ద్వాదశీ వ్రతము నాచరింపుము . మోక్షము నందెదవు.

ఇట్లు ప్రచేతుడు పలికి యంతర్హితుడు కాగా ఆ రాజును నాతడు చెప్పినది యెల్ల అట్లే ఆచరించెను. ఆ ఫలమును కూడ పొందెను.

కావున నారదా! దీని నాచరించిన యాతడు అఖండఫలము నందును. éశక్తి యున్నంతలో పండ్రెండు ద్వాదశులయం దుపవాస పూజా దక్షిణాదానాదికమును విత్తశాఠ్యము చేయక భక్తితో నాచరించుటచే కేశవుడు తుష్టుడగును.

కలుషనాశకమగు దీనిని భక్తితో వినినను చదివినను నితరులకు తెలిపినను కోటి శత వత్సరములపాటు దేవలోకమున వసించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున విభూతి ద్వాదశీవ్రత మాహాత్య్మ కథనమను

తొంబది ఎనిమిదవ అధ్యాయము.

__________________________________________________________________________

¡గతారాత్రిస్తదావయోః *సకోటిశతానివత్సరాణి.

Sri Matsya Mahapuranam-1    Chapters