Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనశతతమో7ధ్యాయః.

దేవవ్రతాది వ్రతషష్టికథనమ్‌.

నన్దికేశ్వరః: అథాత స్సమ్ప్రవక్ష్యామి వ్రతషష్టి మనుత్తమామ్‌ l రుద్రేణాభిహితాం దివ్యాం మహాపాపప్రణాశనీమ్‌. 1

నక్తమబ్దం చరిత్వాతు గవా సార్ధం కుటుమ్బినే l హైమచక్రం త్రిశూలంచ దద్యా ద్విప్రాయ వాససీ. 2

శివో రుద్రో7హ మస్మీతి శివలోకే మహీయతే l ఏత ద్దేవవ్రతవం నామ మహాపాతకనాశనమ్‌. 3

యస్త్వేకం త్వేకభ##క్తేన సంక్షిపేద్ధి వృషాన్వితామ్‌ l ధేనుం తిలమయీం దద్యా త్స పదం యాతి శాఙ్కరమ్‌. 4

ఏత ద్రుద్రవ్రతవం నామ పాపశోకవినాశమ్‌ l యస్తు నీలోత్పలం హైమం శర్కరాపాత్రసంయుతమ్‌. 5

ఏకాన్తరితనక్తాశీ సమాన్తే వృషసంయుతమ్‌ l స వైష్ణవపదం యాతి లీలావ్రత మిదం స్మృతమ్‌ . 6

ఆషాఢాది చతుర్మాస మభ్యఙ్గం వర్జయే న్నరః l భోజనోపస్కరం దద్యా త్స యాతి భవనం హరేః. 7

éజనప్రీతకరం నౄణాం ప్రీతివ్రత మిహోచ్యతే l వర్జయిత్వా మధౌ యస్తు దధిక్షీరఘృతైక్షోవమ్‌ . 8

ఏత ద్గౌరీవ్రతం నామ *సదా మోహవినాశనమ్‌ l పుష్యాదౌచ త్రయోదశ్యాం కృత్వా నక్త మథోపునః. 10

అశోకం కాఞ్చనం కృత్వా ఇక్షుయుక్తం దశాజ్గుళమ్‌ l విప్రాయ వస్త్రసంయుక్తం ప్రద్యుమ్నః ప్రీయతా మితి. 11

కల్పం విష్ణుపదే స్థిత్వా విశోక స్స్యా త్పున ర్నరః l ఏత త్కామవ్రతం నామ సవా శోకవినాశనమ్‌ . 12

ఆషాఢాదౌ వ్రతాద్యేతు వర్జయే న్నఖకృన్తనమ్‌ l వార్తాకంచ చతుర్మాసం మధుసర్పిర్గుడాన్వితమ్‌. 13

కార్తిక్యాం తత్పుసనర్హైమం బ్రాహ్మణాయ నివేదయేత్‌ l స రుద్రలోకమాప్నోతి శివవ్రత మిదం స్మృతమ్‌. 14

వర్జయే ద్యస్తు పుష్పాణి హేమన్తశిశిరా వృతూ l పుష్పత్రయంతు ఫాల్గున్యాం కృత్వా శక్త్యాథ కాఞ్చనమ్‌. 15

దద్యా త్త్రికాలవేళాయాం ప్రీయేతాం శివకేశవౌ l దత్వా పరంపదం యాతి సౌమ్యవ్రత మిదం స్మృతమ్‌.

*భవానీలోక దాయకమ్‌.

తొంబది తొమ్మిదవ అధ్యయము

దేవవ్రతాది వ్రతషష్టి (అరువది వ్రతముల) కథనము.

నందికేశ్వరుడు నారదునితో ఇట్లు చెప్పనారంభించెను: ఇక మీదట సర్వోత్తమములగు అరువది వ్రతములను నీకు తెలిపెదను . ఇవి సాక్షాత్‌ రుద్రుడు చెప్పినవి. సర్వపాప ప్రాణాశనములు.

1.ఏడాదిపాటు నక్తవ్రతము జరిపి కుటుంబియగు విప్రునకు పాడిగోవును బంగరు త్రిశూల చక్రములను వస్త్రములను 'శివో7హమస్మి' 'రుద్రోహమస్మి' అను భావనతో దానమీయవలెను. దీని ఫలమున శివలోకమున పూజితుడై సుఖించును. ఇది మహాపాతక నాశనమగు దేవవ్రతము.

2.దినము విడిచి దినము సంవత్సరకాలము నక్తవ్రతము జరిపి సంవత్సరాంతమున బంగారుకలువ పూవు శర్కరా పాత్రను బంగరు వృషభ ప్రతిమను విప్రునకు ఈయవలయును. ఇట్టి వారు విష్ణు స్థానమందుదురు. ఇది లీలావ్రతము.

3. ఆషాఢాది మాస చతుష్టయమున అభ్యంగముచేయక బ్రాహ్మణునకు కాని పాత్రునకు ఎవనికైన కాని భోజన సామగ్రి నిచ్చుచుండవలెను. ఇట్టివాడు విష్ణుభవనము చేరును. ఇది జనప్రీతికరమగు ప్రీతి వ్రతము.

4. చైత్ర మాసము పొడవున పాలు పెరుగు నేయి చెరకు రసము వదలి విప్రదంపతులను పూజించి 'గౌరీ మేప్రీయతామ్‌' అనుచు రసపాత్రను (ఈ వదలిన నాలుగిటిలో దేనితో నిండినదైనను) సన్నని వస్త్రములను దానమీయవలెను. ఇది అజ్ఞాన నాశమగు గౌరీవ్రతము.

5. వసంత ఋత్వారంభమున (చైత్ర శుక్ల) త్రయోదశినాడు నక్తముండి బంగరు అశోక పుష్పమును పది (భారతీయ) అంగుళముల చెరకుగడను నూతన వస్త్ర (ద్వయ)మును బ్రాహ్మణునకు 'ప్రద్యుమ్నః- ప్రీయతామ్‌' అను మంత్రముతో దానమీయ వలెను. సదాశోక వినాశునమగు కామవ్రతము ఇది. దీని నాచరించినవారు ఒకకల్పమంత కాలము విష్ణులోకమున సుఖింతురు. ఇహమున శోకరహితులౌదురు.

6. ఆషాఢాది తిథియందీ వ్రతమును పూని నాటినుండి వరుసగ నాలుగు మాసములు గోళ్లు కత్తిరిచుకొనకుండవలెను. అంతకాలమును వార్తాకము (పందిరి వంగకాయ) తేనె నేయి బెల్లము తినకుండవలెను. కార్తికమాసారంభమున బంగారు వార్తాకమును బ్రాహ్మణునకు దానమీయవలెను. ఇది యాచరించినవాడు రుద్ర లోకమందును. దీనపేరు శివవ్రతము.

7.హేమంతశిశిర ఋతువులయందు ఏపుష్పములను (తనకై) ఉపయోగించకుండ వలెను-ఫాల్గున మాసమున (కడపట) బంగారుతో (ఆరెండు ఋతువులలోపూచెడి) మూడు పూవులు చేయించి మూడు వేళలందు మూడిటిని వేరు వేరుగా 'శివకేశవౌ ప్రీయేతామ్‌' అనుచు విప్రునకు దానమీయవలెను. దీనిని పరమపద మందును . దీనిని సౌమ్య వ్రతమందురు.

ఫాల్గునాదితృతీయాయాం లవణం యస్తు వర్జయేత్‌ l సమాప్తౌశ యనం దద్యాద్గృహం చోపస్కరాన్వితమ్‌.

సమ్పూజ్య విప్రమిథునం భవానీ ప్రీయతామితి l గౌరీలోకే వసేత్కల్పం సౌభాగ్యవ్రతముచ్యతే. 18

సన్ధ్యామౌనం నరః కృత్వా సమాప్తే ఘృతకుమ్భకమ్‌ l వస్త్రయుగ్మం తిలాన్ఝణ్టాం బ్రాహ్మణాయ నివేదయేత్‌. 19

లోకం సారస్వతం యాతి పునరావృత్తిదుర్లభమ్‌ l ఏత త్సారస్వతంనామ రూపవిద్యాప్రదాయకమ్‌. 20

లక్ష్మీమభ్యర్చ్య పఞ్చమ్యా ముపవాసీ భ##వేన్నరః l సమాప్తే హేమకలశం దద్యా ద్ధేమసమన్వితమ్‌. 21

స పదం వైష్ణవం యాతి లక్ష్మీవా న్జన్మజన్మని l +ఏతత్సంపద్‌ వ్రతం నామ దుఃఖశోకవినాశనమ్‌. 22

కృత్వానులేపనం శమ్భో రగ్రతః కేశవస్యవా l యావదబ్దం వునర్దద్యా ద్ధేనుం జలఘటాన్వితామ్‌ . 23

జన్మాయుతం స రాజా స్యా త్తత శ్శివపురం వ్రజేత్‌ l ఏత చ్ఛుద్ధివ్రతంనామ సదా పాపవినాశనమ్‌ .24

అశ్వత్థం భాస్కరం గఙ్గాం ప్రణమ్యైకత్ర వాగ్యతః l ఏకభక్తం నరః కుర్యా దబ్దమేకం విమత్సరః . 25

వ్రతాన్తే విప్రమిథునం పూజ్యం ధేనుత్రయాన్వితమ్‌ l వృషం హిరణ్మయం దద్యా త్సో7శ్వమేధఫలం లభేత్‌.

ఏత త్కీర్తివ్రతంనామ భూతికీ ర్తిఫలప్రదమ్‌ l ఘృతేన స్నపనం కృత్వా శమ్భోర్వా కేశవస్యవా. 27

అక్షతాభి స్సపుషౌభిః కృత్వా గోమయమణ్డలమ్‌ l సమాప్తే హేమకమలం తిలధేనుసమన్వితమ్‌. 28

శుద్ధ మష్టాఙ్గుళం దద్యా చ్ఛివలోకే మహీయతే l సామగాయ యతశ్చైత త్కామధుగ్వ్రత ముచ్యతే . 29

నవమ్యా మేకభక్తంతు కృత్వా కన్యాంచ శక్తితః l భోజయిత్వా సమం దద్యా ద్ధేమకఞ్చుకవాససీ. 30

lహేమ విప్రాయచ పున ర్దద్యా చ్ఛివపురం వ్రజేత్‌ l జన్మార్బుదం సురూపీ స్యా చ్ఛత్రుభి శ్చాపరాజితః.

ఏత ద్వీర వ్రతం నామ నారీణాం సుఖప్రదమ్‌ l ఏత త్సమాచరే ద్యస్తు పఞ్చదశ్యాం పయోవ్రతమ్‌. 32

సమాప్తే శ్రాద్ధకృ ద్దద్యా ద్గాశ్చ పఞ్చ పయస్వినీః | వాసాంసిచ పిశఙ్గాని జలకుమ్భయుతానిచ. 33

స యాతి వైష్ణవం లోకం పితౄణాం తారయేచ్ఛతమ్‌ l కల్పాన్తే రాజరాజ స్స్యా త్పితృవ్రత మిదం స్మృతమ్‌. 34

8. పాల్గున శుక్ల తృతీయ మొదలు మాసాంతమువరకు లవణము విడువవలెను. కడపట విప్రదంపతులను పూజించి వారికి సర్వోపస్కరములతో ఇంటిని మంచమును 'భవానీ ప్రీయతామ్‌' అనుచు దానమీయవలెను. దీనిచే కల్పకాలము గౌరీ లోకవాసము లభించును. ఇది సౌభాగ్యవ్రతము.

9. సంధ్యా కాలములందు (కొంత కాలము) మౌనము పాటించి వ్రతాంతమున నేతిపాత్రను వస్త్రముల జతను నూవులను ఘంటను బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే ఇహమున రూప విద్యాలాభమును పరమున పునరావృత్తి రహితమగు సారస్వత లోకమును సిద్ధించును. దీనిని సారస్వత వ్రతమందురు.

10. పంచమినాడుపవసించి ఉపవాసాంతమున షష్ఠినాడు బంగారు పాత్రయందు బంగారముంచి విప్రునకు దానమీయవలెను. అతడు జన్మ జన్మమందును సంపద్యుక్తుడై విష్ణు లోకమందును. దీనిని సంపద్ర్వతమందురు. ఇది దుఃఖ శోక వినాశకము.

11. సంవత్సర కాలము శివసన్నిధిలోకాని విష్ణు సన్నిధియందుకాని నిలిచి గంధాను లేపనములు (బొట్టుకాని) ధరించి కడపట పాడియాపును ఉదకుంభమును(విప్రునకు) దానమీయవలెను. దీనిచే పదివేల జన్మములందు రాజుగా జన్మించుచుండి కడపట శివలోక ప్రాప్తుడగును . సదా పాప వినాశనమగు ఇది శుద్ధి వ్రతము.

12. సంవత్సరముపాటు విమత్సరుడై (అకలుష చిత్తముతో) ఒకే స్థానమునందు అశ్వత్థమునకు భాస్కరునకు గంగకు ప్రణమిల్లి మౌనవ్రతుడై ఏక భుక్తముతో ఉండవలెను. వ్రతాంతమున విప్రదంపతుల నర్చించి మూడు పాడి యావులను వృషభమును బంగరుతో చేయించి దానమీయవలెను. దీనిచే ఆశ్వమేధ మాచరించిన ఫలము లభించును . కీర్త్యైశ్వర్యముల సిద్ధింపజేయు దీనిని కీర్తి వ్రతమందురు.

13.గోమయముతో మండలము నేర్పరచి అచట శివునకుగాని కేశవునకుగాని నేతితో అభ##షేకము జరిపిపిమ్మట ఆ దేవునికి అక్షతలతో పుష్పములతో పూజను జరిపి అది ముగిసిన తరువాత సామగానమున నిపుణుడగు విప్రునకు తిలలను పాడి ఆవును ఎనిమిది (భారతీయ) అంగుళముల పొడవు కల స్వర్ణకమలమును దానమీయవలెను. దీనిచే శివలోక ప్రాప్తియగును. ఇది కామధుగ్ర్వతము.

__________________________________________________________________________

+ ఏతత్సమ్పద్వ్రతంనామ. lహైమంసింహంచవిప్రాయదత్వాశివ

14. నవమినాడు ఏకభుక్తముండి యథాశక్తిగ కన్యనుకూడ భుజింపజేసి ఆమెకు బంగరు జరీగల రవికను చీరను ఈయవలెను. బ్రాహ్మణునకు బంగారు దానమీవలెను. దీనిచే ఇహమున అర్బుద జన్మములందు చక్కని రూపము శత్రువులచే అపరాజితత్వము పరమున శివలోక ప్రాప్తియగును. ఇది వీరవ్రతమనబడును. ఇది స్త్రీలకు పుణ్యమును ఆనందమును ఇచ్చునది.

15. పూర్ణిమ నాడు పాలు మాత్రము త్రాగి ఉపవాసముండి అది ముగియగానే పాడ్యమినాడు పితరులనుద్దేశించి శ్రాద్దము జరిపి బ్రాహ్మణులకు ఐదు పాడియావులను పిశంగ (ఎరుపు పసుపు వన్నెలు కలిసిన రంగుగల) వస్త్రముల నైదింటిని ఉదకుంభమల నైదింటిని దానము ఈయవలెను. దీనిచే తానును తన పితరులును తరింతురు. విష్ణులోకమునందుదురు. కల్పాంతా (ప్రళయా) నంతరమున కల్పాదియందు సృష్ట్యారంభమున చక్రవర్తియై జన్మించును. ఇది పితృవ్రతము.

చైత్రాది చతురో మాసా న్జలం దద్యా దయాచితమ్‌ l వ్రతాన్తే మతికం దద్యా దన్నవస్త్రసమన్వితమ్‌. 35

తిలపాత్రం హిరణ్యంచ బ్రహ్మలోకే మహీయతే | కల్పాన్తే నృపతిర్నూన మానన్దవ్రత ముచ్యతే . 36

పఞ్చామృతేన స్నపనం కృత్వా సంవత్సరం విభోః l వ్రతాన్తేతు పునర్దద్యా ద్ధేనుం పఞ్చామృతై ర్యుతామ్‌. 37

విప్రాయ దద్యాచ్ఛంఖంచ స పదం యాతి శాఙ్కరమ్‌ l రాజా భవతి కల్పాన్తే*రాజ్య వ్రత మిదం స్మృతమ్‌.

వర్జయిత్వా పుమాన్మాంస మబ్ధాన్తే గోప్రదో భ##వేత్‌ l తద్వ ద్ధేమమృగం దద్యా త్సోశ్వమేధఫలం లభేత్‌. 39

అహింసావ్రత మిత్యుక్తం కల్పాన్తే నృపతి ర్భవేత్‌ l బ్రహ్మలోక మవాప్నోతి పునరావృత్తిదుర్లభమ్‌. 40

మాఘమాస్యుషసి స్నానం కృత్వా దమ్పత్య మర్చయేత్‌ l భోజయిత్వా యథాశక్తి మాల్యవస్త్రవిభూషణౖః 41

సూర్యలోకే వసేత్కల్పం సూర్యవ్రత మిదంస్మృతమ్‌ l ఆషాఢాదిచతుర్మాస్యాం ప్రాతస్స్నాయీ భ##వేన్నరః. 42

విప్రేషు భోజనం దద్యా త్కార్తిక్యాం గోప్రదో భ##వేత్‌ l స వైష్ణవపదం యాతి విష్ణువ్రత మిదం స్మృతమ్‌.

నిత్యమేవార్చనం విష్ణోః కల్పాన్తే రాజరాడ్భవేత్‌ l అయనా దయనం యావ ద్వర్జయే త్పుష్పసర్పిషీ. 44

తదన్తే పుష్పదామాని ఘృతధేన్వా సహైవతు l దత్వా శివపదం యాతి విప్రాయ ఘృతపాయసమ్‌ . 45

ఏతచ్ఛీలవ్రతం నామ శీలారోగ్యఫలప్రదమ్‌ l సన్ధ్యాదీపప్రదో యస్తు సమాం తైలం వివర్జయేత్‌ . 46

సమాన్తేవాపి దద్యాచ్చ చక్రశూలేచ కాఞ్చనే l వస్త్రయుగ్మంచ విప్రాయ తేజస్వీ స భ##వేదిహ. 47

రుద్రలోక మవాప్నోతి దీపవ్రత మిదం స్మృతమ్‌ l కార్తికే కృత్తికాదౌ యః ప్రాశ్య గోమూత్రయావకమ్‌.

నక్తం చరే దబ్దమేక మబ్దాన్తే గోప్రదో భ##వేత్‌ l గౌరీలోకే వసేత్కల్పం తతో రాజా భ##వేదిహ. 49

ఏత ద్గౌరీవ్రతం నామ సదా కల్యాణకారకం l వర్జయే చ్చైత్రమాసేతు యస్తు గన్దానులేపనమ్‌. 50

శుక్తిం గన్ధభృతం దత్వా విప్రాయ శ్వేతవాససీ l వారుణం పద మాప్నోతి దీప్యవ్రత మిదం స్మృతమ్‌. 51

16. చైత్రము మొదలుగ నాలుగు మాసములపాటు ఆయాచితముగ జలదానము చేయవలెను. వ్రతాంతమున మణికమును (దుత్త అనెడి మట్టిపాత్ర) అన్న వస్త్రములను తిల పాత్రమును బంగారును ఈయవలెను. దీనిచే బ్రహ్మలోక ప్రాప్తియగును. కల్పాంతము (అయిన తరువాతను సృష్ట్యాదియందు) రాజై జన్మించును. ఇది ఆనంద వ్రతము.

___________________________________________________________________________

*ధృతి

17. ఏడాదిపాటు శివునకు పంచామృత స్నానము జరిపించి వ్రతాంతమున ధేనువును పంచామృతములను శంఖమును బ్రాహ్మణునకు దానమీయవలెను. దీనిచే శివలోక ప్రాప్తియగును. కల్పాంతమున (మరల సృష్ట్యాదియందు) రాజై జన్మించును. దీనిని రాజ్య వ్రతమందురు.

18. ఏడాదిపాటు (మాంసాహారులగు వారు) మాంసము తినకుండి కడపట పాడియావును బంగారు లేడి ప్రతిమను దానమీయవలెను. దీని నహింసావ్రతమందురు. దీనిచే అశ్వ మేదఫలమంది పునరావృత్తి రహిత బ్రహ్మలోక ప్రాప్తుడై కల్పాంతమున (మరల సృష్ట్యాదియందు) నృపతియై జన్మించును.

19. మాఘ మాసమున ఉషస్సున స్నానముచేసి (మాసాంతమున) వస్త్రమాల్యభూషణములతో దంపతులనర్చించి భుజింప జేయవలెను. దీనిచే కల్పకాలము రవిలోకవాసి యగును. దీనిని సూర్యవ్రత మందురు.

20. ఆషాఢాది మాస చతుష్టయమున వరుసగా ప్రాతః స్నానముచేసి కార్తికారంభమున బ్రాహ్మణులకు భోజనము చేయించి ధేను దానము చేయవలెను. దీనిచే విష్ణులోక ప్రాప్తుడగును. ఇది విష్ణు వ్రతము.

é 21. ఒక అయనమున పూవులను మరియొక అయనమున నేతిని విడువవలయును ఇట్లు సంవత్సరమయిన తరువాత పూలదండలను (లోగడ చెప్పిన) ఘృత ధేనువును దానము చేయవలెను. విప్రునకు నేతిపాయసముతో భోజనము పెట్టవలెను. దీనిచే శివలోక ప్రాప్తుడగును. ఇది ఇహమున శీలారోగ్య ఫలప్రదము. దీనిని శీలవ్రతమందురు.

22. సంవత్సర కాలము తైలమును (ఆహారమున గ్రహింపక) విడువవలెను. (ఇంతకాలము) సంధ్యా కాలమున (దేవునికడ) దీపము వెలిగించవలెను. సంవత్సరాంతమున బ్రాహ్మణునకు బంగారు చక్రశూలములను వస్త్ర యుగ్మమును దానమీయవలెను. దీనిచే తేజస్వియగును. రుద్రలోక ప్రాప్తుడగును. ఇది దీప వ్రతము.

23. కార్తికమున కృత్తికానక్షత్ర దినము మొదలు (సంవత్సరము వరకు) గోమూత్రమును గోధుమ రవ్వను పాలతో వండిన అన్నమును తినుచు ఏడాదిపాటు నక్తము ఆచరించివలెను. కడపట గోదానము చేయవలెను. కల్పకాలము గౌరీలోకవాసియై పిమ్మట సృష్టియందు రాజైపుట్టును. ఇది కల్యాణకరమగు గౌరీ వ్రతము.

24. చైత్ర మాసమంతయు గంధానులేపనములు విడిచి మాసాంతమున విప్రునకు గంధముతో నిండిన ముత్తెపు చిప్పను తెల్లని వస్త్రములను దానమీయవలెను. దీనిచే వరుణలోక ప్రాప్తుడగును . దీనిని దీప్య వ్రతమందురు.

వైశాఖే పుష్పలవణం «వర్జయే ద్ఝటగోప్రదః l భుక్త్వా విష్ణుపదే కల్పం స్థిత్వా రాజా భ##వేదిహ. 52

¡ఏత త్కీర్తి వ్రతంనామ కాన్తికీర్తి ఫలప్రదమ్‌ l బ్రహ్మాణ్డం కాఞ్చనం కృత్వా తిలరాశి సమన్వితమ్‌ .

త్ర్యహం తిలప్రదో భూత్వా వహ్నిం సన్తర్ప్యచ ద్విజా& l సమ్పూజ్య విప్రమిథునం మాల్యవస్త్ర విభూషణౖః. 54

శక్తిత స్త్రిపలాదూర్ధ్వం విశ్వాత్మా ప్రీయతామితి l పుణ్య7హ్ని దద్యాత్స పరం బ్రహ్మ యాత్యపునర్భవమ్‌.

ఏతద్ర్బహ్మవ్రతం నామ నిర్వాణవదదాయకమ్‌ l యశ్చోభయముఖీం దద్యా త్ప్రభూతకనకాన్వితామ్‌. 56

దినం వయోవ్రతే తిష్ఠేత్సయాతి పరమం పదమ్‌ l ఏతద్వై సువ్రతంనామ పునరావృత్తిదుర్లభమ్‌. 57

త్య్రహం పయోవ్రతే స్థిత్వా కాఞ్చనం కల్పపాదపమ్‌ l పలాదూర్ధ్వం యథాశక్త్యా తణ్డులై శ్చోపసంయుతమ్‌.

దత్వా బ్రహ్మపదం యాతి కల్పవ్రత మిదం స్మృతమ్‌ l మసోపవాసీ యో దద్యా ద్ధేనుం విప్రాయ శోభనామ్‌.

స వైష్ణవం పదం యాతి భీమవ్రత మిదం స్మృతమ్‌ l *దద్యా ద్వంశత్పలా దూర్ధ్వం మహీం కృత్వా7థ కాఞ్చనీమ్‌. 60

దినం పయోవ్రత స్తిష్ఠే ద్రుద్రలోకే మహీయతే l +దరావ్రత మిదం ప్రోక్తం సప్తకల్పశతానుగమ్‌. 61

__________________________________________________________________________

«వర్జయిత్వాతుగోప్రదః ¡ఏతత్కాన్తి

* దద్యాద్వింశత్పలాదూర్ధ్వమగ్నింకృత్వాథకాఞ్చనమ్‌ + అగ్ని వ్రతమిదం

మాఘమాస్యథ చైత్రేవా గుడధేనుప్రదో భ##వేత్‌ l గుడప్రత స్తృతీయాయాం గౌరీలోకే మహీయతే . 62

మహావ్రత మిదంనామ సరసానన్దకారకమ్‌ l పక్షోపవాసీ యో దద్యా ద్విప్రాయ కపిలాద్వయమ్‌ . 63

స బ్రహ్మలోకమాప్నోతి దేవాసురసుపూజితః l కల్పాన్తే సచ రాజా స్యా త్ప్రభావ్రత మిదంస్మృతమ్‌ . 64

వత్సరం త్వేకభక్తాశీ సభక్ష్యజలకుమ్భదః l శివలోకే వసేత్కల్పం ప్రాప్తివ్రత మిదంస్మృతమ్‌. 65

నక్తాశీ త్వష్టమీషు స్యా ద్వత్సరాన్తేషు ధేనుదః l పౌరన్దరపదం యాతి సుగతివ్రత ముచ్యతే. 66

విప్రాయేన్దనదో యస్తు వర్షాది చతురః పుమా& l ఘృతధేను ప్రదో7న్తేచ స పరం బ్రహ్మగచ్ఛతి. 67

వైశ్వనరవ్రతం నామ సర్వపాపప్రణాశనమ్‌ l ఏకాదశ్యాంతు నక్తాశీ యశ్చక్రం వినివేదయేత్‌. 68

సమాన్తే వైష్ణవం హైమం స విష్ణోః పద మాప్నుయాత్‌ l ఏత త్కృష్ణవ్రతం నామ కల్పాన్తే రాజ్యలాభకృత్‌. 69

25. వైశాఖ మాసమంతయు పూవులను ఉప్పును విడువవలెను. మాసాంతమున లవణ ఘటములనుగాని లవణ ధేనువునుగాని దానమీయవలెను. దీనిచే ఇహమున కాంతికీర్తులు పొందును. పరమున కల్పకాలము విష్ణులోకమనుభవించును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజైపుట్టును. ఇది కీర్తివ్రతము.

26. మూడు వలములకు తక్కువకాని తూకపు బంగారుతో బ్రహ్మాండమును చేయించవలెను. తిలరాశినేర్పరచవలెను. మూడు దినములు ఆతిలలతో వహ్నియందు హోమముచేసి కడపట విప్రులకు భోజనముతో సంతర్పణముచేసి ఒక పుణ్యదినమున విప్రదంపతులను వస్త్రమాల్యభుషణములతో పూజించి 'విశ్వాత్మా ప్రీయతామ్‌' అనుచు ఆ బ్రహ్మాండమును వారికి దానమీయవలెను. దీనిచే పునర్జన్మమేలేక పరబ్రహ్మమును పొందును. ఇది మోక్షప్రదమగు బ్రహ్మవ్రతము.

27. చాల బంగారుతోకూడ ఉభయముఖీగోదానము (అప్పుడే ఈనుచున్న గోదానము) చేసిన ఆదినమంతయు పాలు ఆహారముగా నుండవలెను. దీనిచే పునరావృత్తి రహిత పరమపదము లభించును. ఇది సువ్రతమను వ్రతము.

28. మూడు దినములు పాలుఆహారమగా (పయోవ్రతముతో) ఉండి నాల్గవనాడు పలమునకు తక్కువకాని బంగారుతో కల్పవృక్షము చేయించి దానిని బియ్యముతో కూడ దానము చేయవలెను. దీనిచే బ్రహ్మలోకము ప్రాప్తించును. ఇది కల్పవ్రతము.

29. నెలపాటు (ఏకభుక్తముతోకాని నక్తవ్రతముతోకాని) ఉపవసించి మాసాంతమున విప్రునకు పాడియావు నీవలెను. దీనిచే విష్ణులోక ప్రాప్తుడగును. ఇది భీమవ్రతము.

30. ఇరువది పలములకు తక్కువకాని బంగారుతో చేయించిన భూప్రతిమ విప్రునకు దాన మిచ్చి ఒక దినమంతయు పయోవ్రతముతో (పాలు ఆహారముగా) ఉండవలెను. దీనిచే రుద్రలోకప్రాప్తుడగును. దీనివలని పుణ్యము సప్తకల్పములపాటు వెంటవచ్చును: ఇది ధరావ్రతము.

31. మాఘమునకాని చైత్రమునకాని శుక్ల తృతీయనాడు గుడాన్న మాహారముగా ఉండి గుడధేనుదానము చేయవలెను. దీనిచే గౌరీలోకప్రాప్తుడగును. ఇది సరసమును ఆనందప్రదమునగు మహావ్రతము.

32. పక్షము దినములు (ఏకభుక్తముతోనో నక్తముతోనో) ఉపవసించి కడపట రెండు కపిల గోవులను దానమీయవలెను. దీనిచే దేవాసుర పూజితుడగుచు బ్రహ్మలోకమున సుఖించును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును. ఇది ప్రభావ్రతము.

33. ఏడాదిపాటు ఏకభ(భు)క్తము చేయుచు ఉపవసించి కడపట భక్ష్యములతోను జలముతోను నిండిన కడవలను దాన మీవలెను. దీనిచే కల్పకాలము శివలోకప్రాప్తుడగును. ఇది ప్రాప్తి వ్రతము.

34. ఏడాదిపాటు అష్టములయందు నక్తవ్రతము చేయుచు కడపట గోదానము చేసినచో ఇంద్రపద మందును. ఇది సుగతివ్రతము.

35. వర్షాకాలపు నాలుగు నెలలు విప్రునకు వంటకట్టెల నిచ్చుచు కడపట ఘృతధేను దానము చేయవలెను. ఇది సర్వపాప ప్ర్పణాశనమగు వైశ్వానరవ్రతము. దీనిచే పరబ్రహ్మప్రాప్తుడగును.

36. ఏడాదిపాటు ఏకాదశులందు నక్తవ్రతము చేసి కడపట బంగారు విష్ణుచక్రము దాన మీవలెను. దీనిచే విష్ణులోకప్రాప్తుడగును. కల్పాంతము తరువాత సృష్టిలో రాజై పుట్టును. ఇది కృష్ణవ్రతము.

పాయసాశీ సమాన్తేతు దత్వా విప్రాయ గోయుగమ్‌ l లక్ష్మీలోకే వసేత్కల్ప మేతద్దేవీవ్రతం స్మృతమ్‌. 70

సప్తమ్యాం నక్తభు గ్దద్యాత్సమాన్తే గాం పయస్వినీమ్‌ l సూర్యలోక మవాప్నోతి భానువ్రత మిదంస్మృతమ్‌. 71

చతుర్థ్యాం నక్తభు గ్ధద్యా త్సమాన్తే హేమవారణమ్‌ l వ్రతం వైనాయకం నామ శివలోక ఫలప్రదమ్‌. 72

మహాఫలాని యస్త్యక్త్వా చతుర్మాసం ద్విజాతయే l హైమాని కార్తికే దద్యా ద్గోయుగేన సమం నరః. 73

ఏత త్కాలవ్రతం నామ విష్ణులోకఫలప్రదమ్‌ l యశ్చోపవాసీ సప్తమ్యాం హేమన్తే హేమపంకజమ్‌.74

గాంచైవ శక్తితో దద్యాత్సమాన్తే ఘటసంయుతామ్‌ l ఏత త్సౌరవ్రతంనామ సూర్యలోకఫలప్రదమ్‌. 75

ద్వాదశ ద్వాదశీర్యస్తు సమాప్యోషోషణం ద్విజః l గోవస్త్రకాఞ్చనై ర్విప్రా న్పూజయే చ్ఛక్తితోనరః. 76

శైవం పద మవాప్నోతి విష్ణువ్రత మిదం స్మృతమ్‌ | కార్తిక్యాం యో వృషోత్సర్గం కృత్వా నక్తం సమాచరేత్‌. 77

శైవం పద మవాప్నోతి వృషవ్రత మిదం స్మృతమ్‌ l కృచ్ఛ్రాన్తే గోప్రదః కుర్యా ద్భోజనం శక్తితః పదమ్‌. 78

విప్రాణాం శాఙ్కరం యాతి ప్రాజాపత్య మిదం వ్రతమ్‌ l చతుర్దశ్యాంతు నక్తాశీ సమాన్తే గోధనప్రదః. 79

శైవంపద మవాప్నోతి త్రైయమ్బక మిదం వ్రతమ్‌ l సప్తరాత్రోషితో దద్యా ద్ఝృతకుమ్భం ద్విజాతయే. 80

ఘృతవ్రతమిదం ప్రాహు ర్బ్రహ్మలోకఫలప్రదమ్‌ l కుశశాయీ సమాం దద్యా ద్ధేనుమన్తే పయస్వినిమ్‌. 81

శక్రలోకే వసేత్కల్ప మిద మిన్ద్రవ్రతం స్మృతమ్‌ l అనగ్నిపక్వ మశ్నాతి తృతీయాయాంతు యో నరః.

గాం దత్వా శివమభ్యేతి పునరావృత్తిదుర్లభమ్‌ l బృహదానన్దకృత్పుంసాం శివవ్రత మిదం స్మృతమ్‌. 83

హైమం పలద్వయా దూర్ధ్వం రథ మశ్వయుగాన్వితమ్‌ l దత్వా కృతోపవాస స్స్యాద్దివి కల్పశతం వసేత్‌.

తదన్తే రాజరాజస్స్యా దశ్వవ్రత మిదం స్మృతమ్‌ l తద్వ ద్ధేమరధం దద్యా త్కరిభ్యాం సంయుతం నరః.

సత్యలోకే వసేత్కల్పసహస్ర మథ భూపతిః l భ##వే దుపోషితో భూత్వా కరివ్రత మిదం స్మృతమ్‌. 86

37. ఏడాదిపాటు పాల అన్నము మాత్రమే తిని కడపట విప్రునకు రెండు పాడి ఆవుల నీవలెను. కల్పకాలము లక్ష్మీలోకప్రాప్తి నిచ్చు ఇది దేవీవ్రతము.

38. ఏడాదిపాటు సప్తములయందు నక్తముండి కడపట పాడియావును దాన మీవలెను. దీనిచే రవిలోకప్రాప్తుడగును. ఇది భానువ్రతము.

39. ఏడాదిపాటు చవితులయందు నక్తముండి కడపట బంగారు ఏనుగు ప్రతిమ దాన మీవలెను. ఇది శివలోక ఫలదమగు వైనాయకవ్రతము.

40. ఆషాఢాది మాస చతుష్టయమునందు మహా (ఆ ఋతువునుందు లభించు) ఫలములను విడిచి కార్తికమున ఆ ఫలముల బంగారు ప్రతిమలు చేయించి వాటిని రెండు పాడి ఆవులను విప్రులకు దాన మీయవలెను . ఇది విష్ణులోక ఫలప్రదమగు కాలవ్రతము.

41. హేమంతఋతువు మొదలుగ సంవత్సరకాలము సప్తములందు ఉపవసించుచు సంవత్సరాంతమున హేమంతమునందు యథాశక్తిగ బంగారు కమలమును గోవును ఉదకుంభమును దాన మీవలెను. ఇది సూర్యలోకఫలప్రదమగు సౌరవ్రతము.

42. పండ్రెండు ద్వాదశులయం దుపవసించి కడపట గోవస్త్ర కాంచనములతో విప్రుల నర్చించవలెను. ఇది పరమపదప్రదమగు విష్ణువ్రతము.

43. కార్తిక మాసమున వృషోత్సర్గము చేసి నక్తవ్రతము పాటించవలెను. దీనిచే శివస్థానప్రాప్తుడగును. ఇది వృషవ్రతము.

44. చాంద్రాయణమువంటి కృచ్ఛ్రవ్రతము పాటించి కడపట గోదానము చేసి యథాశక్తిగా విప్రులకు భోజనము పెట్టించి తానును భుజించవలయును. ఇది ప్రాజాపత్యవ్రతము.

45. చతుర్దశులందు ఏడాదిపాటు నక్తవ్రతము పాటించి కడపట గోవులను ధనమును దానమిచ్చినచో శివ పదప్రాప్తుడగును . ఇది త్రైయంబక వ్రతము.

46. ఏడు దినములపాటు ఉపవాసముండి కడపట విప్రునకు ఘృతకుంభమును దాన మీయవలెను. ఇది బ్రహ్మలోక ఫలప్రదమగు ఘృతవ్రతము.

47. ఏడాది పాటు దర్భలపై శయనించుచు కడపట సువర్ణమును పాడియాపును దాన మీయవలెను. దీనిచే కల్పకాలము ఇంద్రలోకమున సుఖించును . ఇది ఇంద్రవ్రతము.

48. (ఏడాదిపాటు) తదియలందు అగ్నిపై ఉడుకని ఆహారము తినుచు కడపట గోదానము చేసినచో పునరావృత్తిరహిత శివలోకప్రాప్తుడగును. ఇది మహానందకరమగు శివవ్రతము.

49. రెండు పలములకు తగ్గని బంగారుతో రథమును రెండు గుర్రములను చేయించి దాన మిచ్చి ఆనాడుపవసించినచో నూరు కల్పములు స్వర్గమున వసించి కల్పాంతమున సృష్ట్యాదియందు చక్రవిర్తియై పుట్టును . ఇది అశ్వవ్రతము.

50. బంగారు రథమును రెండు ఏనుగులను రెండు పలములకు తక్కువ కాని బంగారముతో చేయించి దానమిచ్చి ఆనాడు ఉపవాసముండవలెను. దీనిచే సత్యలోకప్రాప్తుడై కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది కరివ్రతము.

*మలమాసం పరిత్యక్త్వా సమాన్తే గోప్రదో భ##వేత్‌ l యక్షాధిపత్య మాప్నోతి నిర్దుఃఖవ్రత ముచ్యతే . 87

నిశి కృత్వా జలే వాసం ప్రభాతే గోప్రదో భ##వేత్‌ l వారుణం లోక మాప్నోతి వరుణవ్రత ముచ్యతే . 88

చాన్ద్రాయణంచ యః కుర్యా ద్ధేమచన్ద్రం నివేదయేత్‌ l చన్ద్రవ్రతమిదం ప్రోక్తం చన్ద్రలోక ఫలప్రదమ్‌. 89

జ్యేష్ఠే పఞ్చతపా స్సాయం హేమధేనుప్రదో దివమ్‌ l యాత్యష్టమీచతుర్దశ్యో రుద్రవ్రత మిదం స్మృతమ్‌.

+సకృద్వితానకం కుర్యా త్తృతీయాయాం శివాలయే l సమాప్తే ధేనుదో యాతి భవనీ వ్రత ముచ్యతే . 91

మాఘే నిశ్యార్ద్రవాసా స్స్యా త్సప్తమ్యాం గోప్రదో భ##వేత్‌ l దివి కల్పముషిత్వేహ రాజాస్యా త్స్నాపకవ్రతమ్‌. 92

త్రిరాత్రోపోషితో దద్యా త్ఫాల్గున్యాం భవనం శుభమ్‌ l ఆదిత్యలోక మాప్నోతి ధామవ్రత మిదం స్మృతమ్‌.

త్రిసన్ధ్యం పూజ్య దమ్పత్య ముపవాసీ విభూషణౖః l అన్తేచ సమవాప్నోతి మోక్షమిన్ద్రవ్రతా దిహ. 94

దత్వా సితద్వితీయాయా మిన్దో ర్లవణభాజనమ్‌ l సమాన్తే గోప్రదో యాతి విప్రాయ శివమన్దిరమ్‌. 95

కల్పాన్తే రాజ్యలాభ స్స్యా త్సోమవ్రత మిదం స్మృతమ్‌ l ప్రతిపత్స్వేకభక్తాశీ సమాన్తే కపిలాప్రదః 96

___________________________________________________________________________

* ఉపవాసం . + సకృత్కరకకం.

వైశ్వానరపదం యాతి శిఖివ్రత మిదం స్మృతమ్‌ l దశమ్యా మేకభక్తాశీ సమాన్తే దశ##ధేనుదః. 97

దిశశ్చ కాఞ్చనీ ర్దద్యా ద్బ్రహ్మాణ్ణాధిపతి ర్భవేత్‌ l బ్రహ్మాణ మచ్యుతం శమ్భుం సమభ్యర్చ్య ద్విజోత్తమః. 98

ఏత ద్విప్రవ్రతం నామ మహా పాతకనాశనమ్‌ l యః పఠే చ్ఛృణుయాద్వాపి వ్రతషష్టి మనుత్తమామ్‌. 99

మన్వ న్తరశతం సోపి గన్ధర్వాధిపతి ర్బవేత్‌ l షష్టివ్రతం నారద పుణ్య మేత త్తవోదితం విశ్వజనీనవన్ద్యమ్‌. 100

శ్రోతుం యదీచ్ఛా తదుదీరయస్వ విప్రేషు; కింవా కధనీయ మస్తి.

ఇది శ్రీమత్స్యమహాపురాణ నన్దికేశ్వర నారదసంవాదే షష్టివ్రత

కథనం నామైకోన శతతమో7ధ్యాయః.

51. సంవత్సరముపాటు (ఏక భక్తముతోగాని నక్తముతో కాని) ఉపవసించి సంవత్సరాంతమున గోదానము చేయవలెను. దీనిచే యక్షాధిపతిత్వము లభించును. ఇది నిర్దుఃఖ వ్రతము. సంవత్సరముపాటు చేయు వ్రతముల విషయమున ఆ ఏడాది నడుమ అధిక మాసము వచ్చినచో దానిని పండ్రెండు మాసములలోని దానినిగా లెక్కించరాదు.

52. ఒక రేయియంతయు నీటియందు గడపి ఆ రాత్రి గడచిన తరువాత ఉదయమున గోదానము చేయవలెను. దీనిచే వరుణలోక ప్రాప్తుడగును. ఇది వరుణ వ్రతము.

53. (నెలపాటు) చాంద్రాయణ వ్రతము జరిపి వ్రతాంతమున బంగారు చంద్రుని దానవీయవలెను. చంద్రలోక ప్రాప్తిఫలమునిచ్చు ఇది చంద్రవ్రతము.

54. జ్యేష్ఠ శుక్లమున అష్టమీ చతుర్దశులందు పగలు పంచతపస్కుడె (నాలుగు వైపుల అగ్నియు పైని రవియు వెలుగుచుండ నడుమ నిలిచి) సాయంకాలమున గోదానము చేయవలెను. ఇది రుద్రవ్రతము; దీనిచే స్వర్గప్రాప్తియగును.

55. ఏడాది పాటు ప్రతి తదియనాడు చాందినీ నిర్మింపజేసి వ్రతాంతమున గోదానము చేయవలెను. భవానీ లోకప్రాప్తి కలిగించు ఇది భవానీ వ్రతము.

56. మాఘ శుక్ల సప్తమి రాత్రి అంతయు తడిబట్టలతో ఉండి గడపి మరునాడు గోదానము చేయవలెను. స్వర్గమున కల్పముపాటుండి కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది స్నాపక వ్రతము.

57. ఒకనాడు ఉపవసించి ఆనాటి మూడు సంధ్యలయందును భూషణములతో దంపతులనర్చించవలెను. దీనిచే ముక్తి లభించును . ఇది ఇంద్రవ్రతము.

58. ప్రతి శుక్ల ద్వితీయనాడు చంద్రునుద్దేశించి ఏడాదిపాటు లవణ పాత్రను దానమిచ్చుచు కడపట విప్రునకు గోదానము చేసినచో శివలోక ప్రాప్తుడగును. కల్పాంతము తరువాత సృష్టికి మొదట రాజై పుట్టును. ఇది సోమవ్రతము.

59. ఏడాదిపాటు పాడ్యములయందు ఏకభక్తము చేయుచు కడపట కపిల గోదానము చేసినచో అగ్నిలోక ప్రాప్తుడగును. ఇది వైశ్వానర వ్రతము.

60. ఏడాదిపాటు ప్రతి దశమినాడును ఏకభక్తము చేయుచు కడపట పది గోవులను బంగారుతో చేసిన దశదిశలను దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు రుద్రులను ద్విజోత్తములను అర్చించవలెను. ఇది మహా పాతకనాశనమగు విప్ర వ్రతము.

సర్వోత్తమమగు ఈ షష్టి వ్రతకల్పమును వినినను చదివినను నూరు మన్వంతరముల కాలము గంధర్వాధి పతియగును. నారదా! ఇది పుణ్యకరము; విశ్వజన వంద్యము; వినగోరిన బ్రాహ్మణులకు (ను ఇతరులకును కూడ) దీనిని వినిపింపుము. నీకు ఈ విషయము చెప్పవలసిన పని ఏమున్నది,

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షష్టివ్రత మాహాత్మ్య కథనమను తొంబది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters