Sri Scanda Mahapuranamu-3    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

మూ || ఋషయ ఊచు ః -

సాధు సాధు మహాభాగ త్వయా కధిత ముత్తమం | అఖ్యాసం పునరస్యచ్చ విచిత్రం పక్తుమర్హసి || 1 ||

నూత ఉవాచ -

విదర్భ విషయే పూర్వ మాసిదేకో ద్వజోత్తమ ః | వేదమిత్ర ఇతిఖ్యాతో వేదశాస్త్రార్థ విత్సుధీ ః || 2 ||

తస్యాసీద పరోవిప్రః సఖాసారస్వతాహ్వయః | తావుభౌవరమస్నిగ్దౌ ఏకదేశ నివాసినౌ || 3 ||

వేదమిత్రస్య పుత్రో7 భూత్‌ సుమేధా నామసువ్రత ః | సారస్వతన్యతనయః సోమవానితి విశ్రుతః || 4 ||

ఉభౌసవయసౌ బాలౌ సమవేషా సమస్థితి | సమంచ కృత సంస్కారౌ సమవిద్యౌ బశూవతుః || 5 ||

సాంగానధీత్యతౌ వేదాంస్తర్క వ్యాకరణానిచ | ఇతి హానపురాణాని ధర్మశాస్త్రాణి కృత్స్నశః || 6 ||

సర్వవిద్యా కుశలినౌ బాల్య ఏవమనీషిణౌ | ప్రహర్ష మతులం పిత్రో ః దదతుః సకలైర్గుణౖః || 7 ||

తావేక దాస్వతన¸° తవుభౌ బ్రాహ్మణోత్తమౌ | అహూయా వోచతాం ప్రీత్యాషోడశాభ్దౌశుభాకృతీ || 8 ||

హేపుత్రకౌ యువాంబాల్యే కృత విద్యౌ సువర్బసౌ | వై వాహికోయం సమయో వర్తతే యువయోః నమం || 9 ||

ఇమంప్రసాద్య రాజానం విదర్భేశం స్వవిద్యయా | తతః ప్రావ్యధనం భూరి కృతో ద్వాహౌ భవిష్యధః || 10 ||

ఏవముక్తౌ సుతౌతభ్యాం తావు భౌ ద్విజనందనౌ | విదర్భ రాజమాసాద్య సమతో షయతాంగుణౖః || 11 ||

విద్యయా పరితుష్టాయ తసై#్మద్విజకమారకౌ | వివాహార్థం కృతోద్యోగౌ ధనహీనా వశం సతాం || 12 ||

తయోరపిమతం జ్ఞత్వాన విదర్భ మహీవతి ః | ప్రహస్య కించిత్ర్పోవాచ లోకతత్వ వివిత్సయా || 13 ||

ఆస్తే నిషథ రాజస్య రాజ్జీ సీమంతి నీసతీ |సోమవారే మహాదేవం పూజయత్యం బికాయుతం || 14 ||

తస్మిన్‌దినేన పత్నీకాన్‌ ద్విజాగ్ర్యాన్‌ వేదవిత్తమాన్‌ | సంపూజ్య పరయాభక్త్యా ధనం భూరి దదాతిచ || 15 ||

తా || బుషులిట్లన్నారు. ఓ మహాభాగ ! సాధువు (మంచిది) సాధువు. నీవు ఉత్తమమైనదాన్ని చెప్పావు. మరింకో విచిత్రమైన కథను మీరు చెప్పండి (1) నూతులిట్లన్నారు. విదర్భ ప్రాంతంలో పూర్వం ఒక బ్రాహ్మణుడుండేవాడు. వేద మిత్రుడని పేరు. వేదము శాస్త్రార్థములు తెలిసినవాడు. సుధీ (2) అతనికి మరో బ్రాహ్మణుడు సారస్వతుడను పేరు గలవాడు స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళిద్దరు మిక్కిలి స్నేహితులు, ఒకేచోట ఉండేవారు (3) వేదమిత్రునకు సుమేధ అని పేరు గల సుప్రతుడు పుత్రుడున్నాడు. సారస్వతుని కొడుకు సోమవంతుడు అని ప్రసిద్ధి (4) వారిద్దరు సమవస్కులు బాలురు సమానమైన వేషం, సమానమైన స్థానం గలవారు. సమంగా సంస్కారం పొందారు. సమాన విద్య గలవారు. (5) వారు వేదములను అంగములతో కూడా చదవి, తర్క వ్యాకరణములు చదివి, ఇతిహాస పురాణములు చదవి, ధర్మశాస్త్రాలన్ని చదవి (6) అన్ని విద్యలలో కుశలురై బాల్య మందే ముద్ది మంతులైనారు. సకల గుణములతో తలిదండ్రులకు చాలా నందాన్ని కల్గించారు. (7) ఆ ఇద్దరు బ్రాహ్మణోత్తములు ఇద్దరు ఒకసారి తమ కుమారులను పిలిచి పదమారు సంవత్సరాలు, అందమైన అకారంగలవారితో ప్రేమగా ఇట్లన్నారు (8) ఓ పుత్రులారా ! మీరు బాల్యంలోనే విద్యలు నేర్పారు. మంచి వర్ఛస్సు గలవారైనారు. మీ ఇద్దరికి సమంగా ఇది వివాహ సమయము (9) ఈ విదర్భేశుడైన రాజును చేరి మీ విద్యతో అతని నుండి బాగా ధనం పొంది వివాహం చేసుకోండి. (10) వారిట్లా చెప్పగా ఆ బ్రహ్మణ కుమారులిద్దరు విదర్భరాజును చేరి తమ గుణములతో రాజును సంతోషపరిచారు. (11) వారి విద్యను చూచి రాజు అనందించాక, అతనితో ఆ బ్రాహ్మణకుమారులు, వివాహం కొరకు ప్రయత్నించువారు తమ ధనహీనతను తెల్పారు. (12) వారి అభిప్రాయాన్ని ఎరిగి ఈ విదర్భరాజు నవ్వి లోకతత్త్వాన్ని తెలసుకోదలచి ఇట్లా కొంచెం పలికాడు (13) నిషద రాజునకు రాణి సీమంతిని ఆను పేరుగల సతిఉంది. సోమవారమందు అంబికతో కూడిన మహాదేవుని పూజించేది (14) ఆ రోజు ఆమె భార్యలతో కూడిన బ్రాహ్మణులను వేదవిత్తములను మిక్కిలి భక్తితో పూజించి బాగా ధనమిస్తుంది (15)

మూ || అతో త్రయువయోరేకో నారీ విభ్రమవేషధృక్‌ | ఏకస్తస్యాః పతిర్భూత్వాజాయేతాంవిప్రదంపతీ || 16 ||

యువాం వధూవరేభ్యూత్వాప్రావ్యసీమంతినీగృహం | భుక్త్వాభూరిధనం లభ్ధ్వాపునర్యాతంమమాంతికం || 17 ||

ఇతిరాజ్ఞా సమాధిష్టా భీ తౌద్విజకుమారకౌ | ప్రత్యూచ తురిదం కర్మకర్తుం నౌజాయతే భయం || 18 ||

దేవతానుగురౌ పిత్రో ః తథా రాజకులేషుచ | కౌటిల్య మాచరన్‌ మోహాత్‌ సద్యోనశ్యతి సాన్వయః || 19 ||

కథమంతర్‌ గృహం రాజ్ఞాం ఛద్మనాప్రవిశేత్‌ పుమాన్‌ | గోప్యమానమపిఛద్మ కదాచిత్‌ ఖ్యాతి మేష్యతి || 20 ||

యేగుణా ః సాధితా ః పూర్వం శీలాచార శ్రుతాదిభి ః | సద్యస్తే నాశమాయాంతి కౌటిల్య పథగామినః || 21||

పాపం నిందాభయంవైరం చత్వార్వేతానిదేహినాం | ఛద్మమార్గ ప్రసన్నానాం తిష్టంత్యేవహిసర్వదా || 22 ||

అతః అవాంశుభాచారౌజాతే చశుచినాంశులే | వృత్తంధూర్త జనశ్లాఘ్యం నాశ్రయావః కదాచన || 23 ||

రాజోవాచ -

దైవతానాం గూరూణాంచ పిత్రోశ్చ పృథి విపతేః | శాసనస్యాప్యలంఘ్యత్వాత్‌ ప్రత్యాదేశోన కర్హిచిత్‌ || 24 ||

ఏతైః యద్యత్స మాదిష్టంశుభంవాయుదివా7 శుభం | కర్తవ్యం నియంతం భీతైః అప్రమత్తైర్భుభూషుభిః || 25 ||

అహోవయం హిరాజానః ప్రజాయుయంహినమ్మతా ః రాజాజ్ఞయాప్రవృత్తానాం శ్రేయః స్యాదన్యధాభయం || 26 ||

అతోమచ్ఛాసనం కార్యం భవద్భ్యామవిలంబితం | ఇత్యుక్తౌ నరదేవేన తౌ తథేత్యూ చతుర్భయాత్‌ || 27 ||

సారస్వతస్యతనయం సామవంతం సరాధిఫః | స్త్రీరూపధారిణం చక్రేవస్త్రా కల్పాంజనాదిభిః || 28 ||

నకృత్రిమోద్భూతి కలత్రభావః ప్రత్యుక్త కర్ణాభరణాంగరాగ ః |

స్నిగ్థాం జనాక్షః స్పృహణీయ రూపోబ భూవసద్యః ప్రమదోత్తమాభః || 29 ||

తావు భౌదంపతి భూత్యా ద్విజ పుత్రౌ నృపాజ్ఞయా | జగ్మతుః నైషధం దేశం యద్వాయద్వా భవత్వితి || 30 ||

ఉపేత్య రాజసదనం సోమవారే ద్విజోత్తమైః | సపత్నీకౌః కృతాతిథౌ ధౌత పాదౌ బభూవతుః || 31 ||

తా || అందువల్ల మీలో ఒకరు భ్రమింపచేసే స్త్రీ వేషం ధరించి మరి ఒకరు ఆమెకు భర్తయై విప్రదంపతులు కండి (16) మీరు వధూవరులై సీమంతినీ గృహానికి వెళ్ళి భుజించి బాగా ధనాన్ని పొంది తిరిగి నా దగ్గరకు రండి (17) అని ఆదేశించగా అ ద్విజకుమారులు భయపడి ఇట్లా అన్నారు. ఈ పని చేయటానికి మాకు భయం కల్గుతోంది. (18) దేవతలందు గురువు యందు, తండ్రియందు రాజకులమందు మోహంవల్ల కౌటిల్య మాచరిస్తే వంశంతోపాటు నశిస్తాడు. (19) రాజుల అంతఃపురానికి మగవాడు మోసంతో ఎట్లా ప్రవేశిస్తాడు. మోసం వల్ల దాచిపెట్టినా ఏదో ఒకసారి బయటపడుతుంది. (20) శీల ఆచార శ్రుతాదులతో ఇంతకుముందు ఏగుణాలను సాధించామో అవి కౌటిల్య పథంలో సంచరించేవానివి వెంటనే నశిస్తాయి. (21) పాపము, నింద, భయము, వైరము ఈ నాల్గు ప్రాణులకు ఛదర్మ మార్గాన్ని ఆశ్రయించే వారికిఎల్లప్పుడు ఉండే ఉంటాయి. (22) అందువల్ల శుభాచారులమైన మేము ఉత్తమ కులంలో జన్మించాము. ఎప్పుడూ ధూర్తులు మెచ్చుకొనే వృత్తిని ఆశ్రయించము (23)రాజిట్లన్నాడు - దైవతముల గురువుల తండ్రి రాజు గారి శాసనం దాటరానిది కనుక ఎక్కడా దానికి ఎదురులేదు (24) వీరు దేన్ని దేన్నీ చేస్తరాఓ మంచిగాని చెడుగాని, తప్పకుండా ఆచరించాలి. భీతులైన అప్రమత్తులైన బుభూషులైనా ( సొమ్ములుకావలసినవారైనా) (25) మేము రాజులము, మీరు సంమతమైన ప్రజలు రాజాజ్ఞ ప్రకారము ప్రవర్తించిన వారికి శ్రేయస్సు లేకున్నభయము కల్గుతుంది. (26) అందువల్ల నా ఆజ్ఞను ఆచరించాలి. మీరు ఆలసించకుండా అని రాజు అనగా వారు భయంతో అట్లాగే అని అన్నారు. (27)రాజు సారస్వతుని కొడుకైన సామవంతుని ఆడరూపం కలవానిగా చేశాడు. వస్త్రములు కాటుక మొదలగు అలంకారములతో (28) వాడు కృత్రిమంగా ఐన భార్యగా మారి కర్ణాభరణ అంగరాగములు కలిగి, నిగనిగలాడు కాటుకను కళ్ళకు కలిగి, కోరతగిన రూపం కలవాడై వెంటనే స్త్రీవలె ఉత్తతమైన కాంతి గలవాడైనాడు (29) వారిద్దరు దంతపులై ఆ బ్రహ్మణ పుత్రులు రాజాజ్ఞతో ఏమైనా కానిమ్మని భావించి నిషధ దేశానికి వెళ్ళారు (30) రాజ సదనం చేరి సోమవారం నాడు భార్యలతో కూడిన ధ్వజోత్తములతో కూడా అతిథ్యం చేయబడి కాళ్ళు కడుగుకున్నారు. (31)

మూ || సారాజ్ఞీ బ్రాహ్మణాన్‌ సర్వాన్‌ ఉపవిష్టాన్‌ పరాననే ప్రతే%్‌యక మర్చయాంచక్రేసవత్నీకాన్‌ద్విజోత్తమాన్‌ || 32 ||

తౌచ విప్రసుతౌ దృష్ట్యా ప్రాప్తౌ కృతక దంపతీ | జ్ఞాత్వా కించి ద్విహస్యాథ మేనే గౌరీ మహేశ్వరౌ || 33 ||

అవాహ్య ద్విజముఖ్యేషు దేవదేవం సదాశివం | పత్నీష్వా వాహయామాన సాదేవీ జగదంబికాం || 34||

గంధైర్మాల్యైః సురభిభిః ధూపై ః నీరాజనైరపి | అర్ఛయిత్వాద్విజ శ్రేష్టాన్‌ నమశ్చక్రే సమాహితా || 35 ||

హిరణ్మయేషుపాత్రేషుపాయసంఘృతసంయుతం | శర్కరామధుసంయుక్తం శాకైర్జుష్టం మనోరమైః || 36 ||

గంధశాల్యోదనైః హృద్యైః మోదకావూపరాశిభిః | శష్కులీభిశ్చ సంయావై ః కృనరైః మాషపక్వకైః || 37 ||

తథాన్యైరప్యసంఖ్యాతై ః భ##క్ష్యైః భోజ్యైః మనోరమైః | సుగంధైః స్వాదుభిః నూపై ః పానీయైరపి శీతలై ః || 38 ||

క్లుప్తమన్నం ద్విజాగ్రేభ్యః సాభక్త్యా పర్యవేషయత్‌ | దధ్యోదనం నిరుపమం నివేద్య నమతోషయత్‌ || 39 ||

భుక్తవత్సు ద్విజాగ్ర్యేషు స్వాచాంతే షునృపాంగనా | ప్రణమ్యదత్వా తాంబూలం దక్షిణాం చయధార్హతః || 40 ||

దేనూర్హి రణ్యనా సాంసి రత్నస్ర గ్భూషణానిచ | దత్వాభూయో నమస్కృత్య విససర్జ ద్విజోత్తమాన్‌ || 41 ||

తయోః ద్వయోః భూనురవర్యపుత్రయోరేకస్తయా హైమవతీ ధియార్చితః |

ఏకో మహాదేవధి యాభిపూజితః కృతప్రణామౌ యయతు స్తదాజ్ఞయా || 42 ||

సాతు విస్మృత వుంభావా తస్మిన్నేవ ద్విజోత్తమే | జాత స్పృహమధోత్సిక్తా కందర్ప వివశాబ్రవీత్‌ || 43 ||

అయినాథ విశాలాక్ష సర్వాయవ సుందర | తిష్టతిష్ట క్వయాయాసి మాంసవశ్యసి తేప్రియాం || 44 ||

ఇదమగ్రేవసంరమ్య నుపుష్పిత మహాద్రుమం | అస్మిన్విహర్తు మిచ్ఛామిత్వ యా సహయసుఖం || 45 ||

ఇత్థం తయోక్త మాకర్ణ్యపురో7 గతచ్ఛత్‌ ద్విజాత్మజః విచింత్య పరిహాసోక్తిం గచ్ఛతి స్మయథాపుర || 46 ||

పునరప్యాహసా బాల తిష్టతిష్ట క్వయాన్యసిః దురుత్సహ స్మరావేశాం పరిభోక్తు ముపేత్యమాం || 47 ||

తా || ఆ రాణి శ్రేష్టమైన అసనముందు కూర్చున్న వారినందరని బ్రాహ్మణులను ప్రత్యేకంగా పూజించింది. భార్యలతో కూడిన బ్రాహ్మణులను (32) అవిప్ర సుతులను చూచి కృత్రిమంగా దంపతులైన వారినిగా గ్రహించి కొద్దిగా నవ్వి వారిని గౌరీ మహేశ్వరులనుగా భావించింది. (33) ఆ ద్విజముఖ్యులందు దేవతుని సదా శివుని అవహన చేసి, వాని పత్నుల యందు దేవియైన జగదంబికను అవహన చేయసాగింది (34) గంధము, మాలలు, వాసనగల ధూపములు, నీరాజనములు వీనితో పూజించి ద్విజశ్రేష్టులను చక్కగానమస్కరించింది. (35)బంగారు పాత్రలలో నేయితోకూడినపాయనము శర్కరమధువుతోకూడినది, మనోరమమైనశాకములు (36) గంధము గల శాల్యన్నము మనోహరమైన లడ్డులు అపూవ రాశులు, జిలేబీలు, జంతికలు మినుములతోచేసినవి, పులగము (37) అట్లాగే లెక్కలేని ఇతర భక్ష్యములు మనోరమమైన భోజ్యములు వాసనగలరుచికరమైన సూపములు శీతల పానీయములు (38) ఇన్నిటితో కూడిన అన్నాన్ని బ్రాహ్మణులకు ఆమె భక్తితో వడ్డించింది. సాటిలేని పెరుగన్నమును వడ్డించి వారిని సంతోషపరిచింది (39) బ్రాహ్మణులు భుజించాక, బాగా చేతులు కడుగుకున్నాక, ఆ రాజస్త్రీ నమస్కరించి, తాంబూలమిచ్చి తగినట్టుగా దక్షిణయిచ్చి (40) ధేనువులు బంగారము, వస్త్రములు, రత్నములు, మాలలు, భూషణములు ఇచ్చి తిరిగి నమస్కరించి బ్రాహ్మణ శ్రేష్ఠులను విడిచి పెట్టింది (41) వారిద్దరు బ్రాహ్‌మణకుమారులలో ఒకనిని ఆమె పార్వతిగా పూజించింది. ఒకనిని శివునిగా పూజించింది, నమస్కరించి ఆమె ఆజ్ఞతో వారు వెడలి పోయారు (42) ఆమె తన పురుష లక్షణాన్ని మరచిపోయి ఆ బ్రాహ్మణుని అనురాగం కలిగి మదోత్సిక్తురాలై మన్మథుని ఆథీనురాలై ఇట్లా అంది. (43) ఓ నాథ! విశాలాక్ష! అన్ని అవయవములతోను నందరుడ! ఉండు ఉండు ఎక్కడికి కెళ్తున్నావు. నీ భార్యను నన్ను చూడటంలేదు (44) ఇక్కడ ఎదురుగా అందమైన వనముంది. చెట్లన్నీ బాగా పుష్పించాయి. ఇందులోవిహరించదలిచాను సుఖం కలిగేట్టు నీతో సహ తిరగదలిచాను (45) అని ఆమె అనగా విని ముందు వెళ్తున్న బ్రాహ్మణ కుమారుడు ఆలోచించి పరిహాసోక్తిగా భావించి ఇది వకరటిలా వెళ్ళసాగాడు. (46) తిరిగి ఆ బాల ఇట్లా అంది. ఉండు ఉండు ఎక్కడికి కెళ్తావు. భరింపరాని స్మరావేశముగల నన్ను అనుభవించటానికి వచ్చి (47).

మూ || పరిస్వజన్వమాంకాంతాంసాయయస్వతవాధరం | నాహంగంతుంసమర్థాస్మిన్మరణబాణప్రపీడితా || 48 ||

ఇత్థమశ్రుత పూర్వాంతాం నిశమ్య పరిశంకితః | ఆయాంతీం పృష్ఠతోవీక్ష్య సహసావిస్మయం గతః || 49 ||

కైషా పద్మపలాశాక్షి పీనోన్నత పయోధరా | కృశోదరీ బృహచ్ఛ్రోణీనవ పల్లవకోమలా || 50 ||

స ఏవమే సఖాకింన్ను జాత ఏవవరాంగనా | పృచ్ఛామ్యేసమతః సర్వమితి సంచిత్య సో7బ్రవీత్‌ || 51 ||

కిమపూర్వ ఇవాభాసి సఖేరూప గుణాదిభిః | అపూర్వం భాషసే వాక్యం కామినీన సమాకులా || 52 ||

యస్త్వంవేద పురాణజ్ఞో బ్రహ్మచారీ జితేంద్రియః | సారస్వతాత్మజః శాంతః కథమేవం ప్రభాషసే || 53 ||

ఇత్యుక్తాసాపునః ప్రాహనాహమస్మిపుమాన్‌ ప్రభో | నామ్నాసామవతీ బాలా తవాస్మిరతి దాయినీ || 54 ||

యథితే సంశయఃకాంతమమాంగాని విలోకయ | ఇత్యుక్తః సహసామార్గే రహస్యేనాం విలోకయత్‌ || 55 ||

తామకృత్రిమధమ్మిల్లాం జఘనస్తన శోభినీం | సురూపాం వీక్ష్య కామేన కించి ద్వ్యాకులతామగాత్‌ || 56 ||

పునః సంస్తభ్యయత్నేన చేతసో వికృతిం బుధః | ముహూర్తం విస్మయా విష్టో నకించిత్ర్పత్య భాషత || 57 ||

సామవత్యువాచ-

గతస్తే సంశయః కశ్చిత్‌ తదాహ్యా గచ్ఛ భజస్వమాం | పశ్యేదం విపినం కాంత పరస్త్రీ సరతోచితం || 58 ||

సుమేధా ఉవాచ -

మైవం కథయ మర్యాదాం మాహింసీః మదమత్తవత్‌ | ఆవాం విజ్ఞాత శాస్త్రార్థౌ త్వమేవంభాషసే కథం || 59 ||

ఆధీతస్యచ శాస్త్రస్య వివేకస్యకులస్చ | కిమేష సదృశోధర్మో జారధర్మనిషేవణం || 60 ||

సత్వం స్త్రీపురుషోవిద్వాన్‌జానీహ్యాత్మాసమాత్మనా | అయంస్వయంకృతో7నర్ధఆవాభ్యాంయద్విచేష్టితం || 61 ||

పంచయిత్వాత్మ పితరౌధూర్త రాజాను శాసనాత్‌ | కృత్వాచాను చితం కర్మ తసై#్య తద్భుజ్యతే ఫలం || 62 ||

సర్వంత్వసుచితం కర్మనృణాం శ్రేయో వినాశనం | యస్త్వం విపరాత్మణో విద్వాన్‌ గతః స్త్రీత్వంవిగర్హితం || 63 ||

తా || భార్యను సుందరిని నన్ను కౌగిలించుకో. నీ అధరాన్ని తాగనివ్వు. నేను వెళ్ళలేకుండా ఉన్నాను. మన్మథ బాణంతో పీడింపబడ్డాను. (48) అని ఇంతకుముందు వినని ఆమె మాటను విని శంకించి, వెనుక వస్తున్న దానిని చూచి వెంటనే ఆశ్చర్యపడ్డాడు. (49) పద్మము ఆకులవలె విశాలమైన కన్నులు గలది, బలిసిన ఎత్తైన రొమ్ములు గలది ఈమె ఎవరు. కృశించిన నడుము గలది, పెద్దదైన పిరుదులు గలది, కొత్తనైన చిగుళ్ళవలె కోమలమైనది (50) ఆనా మిత్రుడే పరమైన ఆంగనగా మారాడా. అందువల్ల ఇతనిని అంతా అడుగుతాను. అని ఆలోచించి ఆతడిట్లన్నాడు (51) ఓ మిత్రమ! రూప గుణములతో కొత్తగా అన్పిస్తున్నావు. అపూర్వంగా మాట్లాడుతున్నావు, ఆకులయైన స్త్రీలాగ (52) వేద పురాణజ్ఞుడు బ్రహ్మచారి జితేంద్రియుడు, సారస్వతుని కొడుక, శాంతుడు ఐన వాడినేనా నువ్వు. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు. (53) అని పలుకగా ఆమె తిరిగి ఇట్లా అంది ఓ ప్రభు! నేన పురుషుడను కాను నాపేరు సామవతి బాలను నీకు రతిని కూర్చుదానిని (54) నీక నుమానమైతే ఓ ప్రియుడ! నా అవయవాలను చూడుఅని పలుకగా త్వరగా మార్గంలో ఈమెను రహస్యంగా చూచాడు (55) సహజమైన కేశపాశం జఘనస్తనములతో శోభిస్తుంది. మంచి రూపంగలది ఐన ఆమెను చూచి కామంతో కొద్దిగా వ్యాకులుడైనాడు (56) తిరిగి ప్రయత్న పూర్వకముగా తననుతాను నిగ్రహించుకొని బుధుడు మనోవికారాన్ని చూచి క్షణకాలం విస్మయా నిష్టుడై ఏమీ మాట్లాడలేదు (57) సామవతి ఇట్లా అంది - నీ అనుమానం పోయిందా ఐతే రా నన్ను పొందు. ఓ కాంత!ఈ అడవిని చూడు పరస్త్రీ సురతమునకు తగినది (58) సుమేధుడు అన్నాడు - ఇట్లా అనకు. మదంతో మత్తెక్కిన వానిలా మర్యాదను దాటొద్దు. మనిద్దరం శాస్త్రార్ధ మెరిగిన వాళ్ళము. నీవిట్లా ఎట్లా మాట్లాడుతున్నావు. (59) చదివిన శాస్త్రానికి వివేకమునకు, కులమునకు ఈ ధర్మంతగునా, జార ధర్మాన్ని అనుసరించవచ్చా (60) నీవు ఆడదానివి కాదు పురుషుడివి విద్వాంసుడివి. నిన్ను నీవు తెలుసుకో. ఇది స్వయంగా చేసుకున్న అనర్థము, మనమేం చేశామో అది అనర్థము (61) తలిదండ్రులను వంచించి, ధూర్తుడైన రాజు ఆజ్ఞ ప్రకారం అనుచితమైన పనిచేసి నందుకు ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాము (62) అంతా అనుచితమైన కర్మనే రాజు శ్రేయస్సును నశింపచేసేది. నీవు విప్రాత్మజుడవు విద్వాంసుడవు. నీచమైన స్త్రీత్వాన్ని పొందావు (63).

మూ|| మార్గంత్యక్త్వాగతో7రణ్యంనరోవిధ్యేతకంటకైఃబలాద్థింస్యేతవాహింసై#్త్రఃయదాత్యక్తసమాగమః || 64 ||

ఏవం వివేక మాశ్రిత్య తూష్ణీమేహి స్వయంగృహం | దేవద్విజ ప్రసాదేన స్త్రీత్వం తవ విలీయతే || 65 ||

అథవాదైవ యోగేన స్త్రీత్వమేవ భ##వేత్తవ | పిత్రాదత్తా మయాసాకరంం స్యసే పరవర్ణినీ || 66 ||

అహోచిత్ర మహోదుఃఖం అహోపాప బలం మహత్‌ | అహోరాజ్ఞః ప్రభావోయం శివారాధన సంభృతః || 67 ||

ఇత్యుక్తా వ్యసకృత్తేన సాపధూరతి విహ్వాలా | బలేసతం సమాలింగ్య చుచుం బాధరపల్లవం || 68 ||

ధర్షితో పితయాధీరః సుమేధా నూతన స్త్రియం | యత్నాదానీయ సదనం కృత్స్నం ం తత్రస్యవేదయత్‌ || 69 ||

తదాకర్ణ్యాథ తద్విప్రౌ కుపితౌ శోకవిహ్వలౌ | తాభ్యాం సహకుమారాభ్యాం వైదర్భాంతి కమీయతుః || 70 ||

తతః సారస్వతః ప్రోహరాజానం ధూర్త చేష్టితం | రాజన్మమాత్మజం పశ్యతవశాసన యంత్రితం || 71 ||

ఏతౌత వాజ్ఞా వశగౌచక్రతుః కర్మగర్హితం | మత్పుత్రః తత్ఫలం భుంక్తే స్త్రీత్వం ప్రాప్యజుగుప్సితం || 72 ||

అద్యమే సంతతిర్నష్టా నిరాశాః పితరోమమ | నాపుత్రస్య హిలోకోస్తిలుప్త పిండాది సంస్కృతేః || 73 ||

శిఖోపవీతమజినం మౌంజీం దండంకమండలుం | బ్రహ్మచర్యోచితం చిహ్నంవిహాయేమాందశాంగతః || 74 ||

బ్రహ్మసూత్రంచ సావిత్రీం స్నానం సంధ్యాం జపార్చనం | విసృజ్య స్త్రీత్వమాప్తోస్య కాగతిర్వద పార్థివ || 75 ||

త్వయామే సంతతి ర్నష్టా నష్టోవేద పథశ్చమే | ఏకాత్మజన్యమే రాజన్‌ కాగతి ర్వద శాశ్వతీ || 76 ||

ఇతి సారస్వతీ నోక్తం వాక్యమాకర్ణ్య భూపతిః | సీమంతి న్యాః ప్రభావేన విస్మయం పరమంగతః || 77 ||

అథసర్వాన్‌సమాహూయ మహర్షీన మితద్యుతీన్‌ | ప్రసాద్యప్రార్థయామాస తస్యపుంస్త్వం మహీపతిః || 78 ||

తే7బ్రుపన్నథ పార్వత్యాః శివస్యచ సమీహితం | తద్భక్తానాంచ మాహాత్మ్యం కోస్యధాకర్తుమీశ్వరః || 79 ||

అథరాజా భరద్వాజమాదాయమునిపుంగవం | తాభ్యాం సహద్విజాగ్రాభ్యాంతత్సుతాభ్యాంసమన్వితః || 80 ||

అంబికా భవనం ప్రాప్య భరద్వాజోపదేశతః | తాందేవీం నియమైః తీవ్రైః ఉపాస్తే న్మహానిశి || 81 ||

ఏవంత్రి రాత్రం సువినృష్ట భోజనః స పార్వతీ ధ్యాన రతో మహీపతిః |

సమ్యక్‌ ప్రణామైః వివిదైశ్చ సంస్తవైః గౌరీం ప్రసన్నార్తి హరామాతోషయత్‌ || 82 ||

తతః ప్రసన్నా సాదేవీ భక్తస్య పృధివీపతేః | స్వరూపం దర్శయా మాస చంద్రకోటి సమప్రభం || 83 ||

అథాహ గౌరీ రాజానం కింతే బ్రూహిసమీహితం | సో7ప్యాహపుంస్త్వమేతస్య కృపయాదీయతామితి || 84 ||

భూయో ప్యాహమహాదేవీ మద్భక్తైః కర్మయత్కృతం | శక్యతేనాన్యథా కర్తుం వర్షాయుతశ##తైరపి || 85 ||

తా || తోవను విడిచి అడవికి పోతే నరుడు ముళ్ళు గుచ్చుకొని బాధపడుతాడు. బలవంతంగా క్రూర మృగములతో హింసింపబడుతాడు, ఒకవేళ తన గుంపును వదలిపెడితే (64) ఈ విధంగా వివేకాన్ని ఆశ్రయించి మాట్లాడకుండా నీ ఇంటికి వెళ్ళు. దేవతల ద్విజుల అనుగ్రహం వల్ల నీ స్త్రీ రూపము నశిస్తుంది. (65) లేదాదైవయోగంవల్ల నీకు స్త్రీత్వమే కలుగనీ. నీ తండ్రివల్ల ఇవ్వబడి నాతో సుఖిస్తావు. ఓ వరవర్ణిని (66) ఎంత చిత్రము, ఎంత దుఃఖ కరము. పాపబలము ఎంత గొప్పది. శివారాధన పరుడైన రాజు ప్రభావమెంతటిది (67) అని చెప్పినా మాటిమాటికి ఆతడు, ఆమె అతిచంచలయై బలవంతంగా ఆతనిని కౌగిలించుకొని, ఆతని చిగురు వంటి పెదవిని ముద్దాడింది. (69) ఆమెతో బెదరింపబడ్డా ధీరుడు సుమేధ, ఆ కొత్తస్త్రీని, ప్రయత్న పూర్వముకముగా ఇంటికి తీసుకువచ్చి అంతా అక్కడ చెప్పాడు. (69) ఆ బ్రాహ్మణులిద్దరు ఆ విషయాన్ని విని కోపగించారు. శోక విహ్వలులైనారు. ఆ కుమారులతో కలిసి వైదర్భుని దరికి (రాజు) వెళ్ళారు (70) ధూర్త చేష్టగల రాజుతో సారస్వతుడిట్లన్నాడు. నీ శాసనానికి కట్టుబడ్డ నాకుమారుని చూడు, ఓరాజ! (71) వీరుఇద్దరు, నీ ఆజ్ఞకు బద్థులు. నీచమైన పనిచేశారు. నా కొడుకు ఆ పలితాన్ని అనుభవిస్తున్నాడు. అదే నీచమైన స్త్రీత్వాన్ని పొందాడు (72) ఈనాటికి నా సంతతి నశించింది. నా పితరులు నిరాశులైనారు. పుత్రహీనునకు మంచి లోకములు లేవు. పిండాది సంస్కృతి లేదు. (73) శిఖ, ఉపవీతము, జింకచర్మము, మౌంజి, దండము, కమండలువు ఈ చిహ్నాలు బ్రహ్మచర్యానికి తగినట్టివి, వీనిని వదలి ఈ దశకు చేరాడు (74) బ్రహ్మ సూత్రము, సావిత్రి, స్నానము, సంధ్య, జప, అర్చనము ఇవన్నీ పోయి స్త్రీ రూపాన్ని పొందిన వీనికి మరోగతి ఏది చెప్పు, ఓరాజ! (75) నీ మూలంగానా సంతతి నశించింది. నా వేద మార్గము నశించింది. నా కొక్కడే కొడుకు. నాకిక శాశ్వతమైన గతిఏది చెప్పు ఓరాజ! (76) అని సారస్వతుడనగా రాజు ఆమాటవిని సీమంతిని ప్రభావంవల్ల ఇట్లైందిగదా అని చాలా ఆశ్చర్యపడ్డాడు (77) పిదప అందరిని పిలిచి, తేజస్వంతులైన ఋషులను పిలచి, శాంతపరచి, వానికి మగరూపం ఇమ్మని వారిని ప్రార్థించాడు. రాజు (78) వారిట్లన్నారు. పార్వతి శివుల ఆలోచనను చెప్పారు. (వారి ఇష్టమిది అని) ఆతని భక్తుల మాహాత్మ్యాన్ని ఎవడు మార్చగలడు. ఈశుడుకూడా ఏమీ చేయలేడు (79) పిదప రాజు భరద్వాజునిముని పుంగవుని తీసుకొని, ఆబ్రాహ్మణులతో, వారి కుమారులతోకూడి (80) అంబిక భవనమునకు వచ్చి భరద్వాజుని ఉపదేశానుసారము ఆదేవిని, ఆ అర్థరాత్రి తీవ్ర నియమములతో ఉపాసించసాగాడు (81) ఈ విధంగా మూడు రాత్రులు, ఆహారం వదలి ఆరాజు పార్వతీ ధ్యానరతుడైనాడు. నమస్కారములతో రకరకాల స్తోత్రాలతో, ప్రపన్నుల ఆర్తిని తీర్చే గౌరిని సంతోషపరచాడు (82) పిదప ఆ దేవి ప్రసన్నురాలై భక్తుడైన ఆ రాజునకు కోటి చంద్రులతో సమానమైన తన రూపాన్ని చూపించింది (83) అప్పుడు గౌరి రాజుతో ఇట్లా అంది. నీకు కావాల్సింది ఏమిటో చెప్పు అనగా అప్పుడాతడు, ఈతనికి మగతనాన్ని దయచేసి ఇవ్వు అని అన్నాడు. (84) తిరిగి మహాదేవి ఇట్లా అంది నా భక్తులు ఏ పని చేస్తారో దానిని మరోరకంగా నేను మార్చలేను, పదివేల ఏండ్లైనా సరే (85)

రాజోవాచ -

ఏకాత్మజోహి విప్రోయం కర్మణా నష్ట సంతతిః | కథం సుఖంప్రపద్యేత వినాపుత్రేణ తాదృశః || 86 ||

దేవ్యువాచ -

తవాన్యో మత్ర్పసాదేన భవిష్యతి సుతోత్తమః | విద్యా వినయ సంపన్నో దీర్ఘాయు రమలాశయః || 87 ||

ఏషా సామవతీనామ సుతాతస్య ద్విజన్మనః | భూత్వా సుమేధనః పత్నీ కామభోగేన యుజ్యతాం || 88 ||

ఇత్యుక్త్వాం తర్హితా దేవీ తేజరాజపురోగమాః | గతాః స్వంస్వం గృహం సర్వే చక్రుః తచ్ఛాననే స్థితిం || 89 ||

సోపి సారస్వతో విప్రః పుత్రం పూర్వసుతోత్తమం | లేభే దేవ్యా ప్రసాదేన హ్యచిరాదేవ కాలతః || 90 ||

తాంచ సామవతీం కన్యాం దదౌతసై#్మ సుమేధసే | తౌదంపతీ చిరంకాలం బుభుజాతే పరం సుఖం || 91 ||

సూత ఉవాచ -

ఇత్యేష శివభక్తాయః సీమంతిన్యాః నృపస్త్రియాః | ప్రభావః కథితః శంభోః మాహాత్మ్య మపి వర్ణితం || 92 ||

భూయో పిశివ భక్తానాంప్రభావంవిస్మయావహం | సమాసా ద్వర్ణయిష్యామిశ్రోతౄణాంమంగలాయనం || 93 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే సీమంతి న్యాః ప్రభా వర్ణనం నామ నవమో7ధ్యాయః || 9 ||

తా || రాజిట్లన్నాడు - ఈ బ్రాహ్మణునకు వీడొక్కడేకొడుకు. దీనివల్ల ఈతని సంతతి నశించింది. అలాంటివాడు పుత్రుడు లేకుండా ఎట్లా సుఖపడుతాడు. (86) అనగా దేవి ఇట్లా అంది - నా అనుగ్రహం వల్ల ఆతనికి మరోపుత్రుడు కల్గుతాడు. విద్యా వినయములు కలవాడు,దీర్ఘాయువు, స్వచ్ఛమైన ఆశయం కలవాడు (87)ఆ బ్రాహ్మణునకు ఈ సామవతి కూతురు ఐ సుమేధనుని భార్యఐ కామభోగం అనుభవించని (88) అని పలికి అంతర్హితురాలు కాగా దేవి, ఆ రాజు మొదలగు వారు అందరు తమ తమ ఇళ్ళకు వెళ్ళారు. ఆ రాజాజ్ఞను పాలించారు. (89) ఆ సారస్వతుడు బ్రాహ్మణుడు. పూర్వసుతుని కన్న ఉత్తముడైన పుత్రుని దేవి అనుగ్రహం వల్ల కొద్ది కాలంలోనే పొందాడు (90) ఆ సామవతి అను కన్యను అనుమేథసునికిచ్చాడు. ఆ దంపతులు చాలా కాలము చాలా సుఖాన్ని అనుభవించారు (91) సూతులిట్లన్నారు - అని ఇది శివభక్తురాలైన సీమంతిని అను పేరుగల రాజస్త్రీ ప్రభావాన్ని మీకు చెప్పాను శివుని మాహాత్మ్యాన్ని కూడా వర్ణించాను. (92) తిరిగి ఆశ్చర్యకరమైన శివభక్తుల ప్రభావాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తాను. అది శ్రోతలకు మేలు చేకూర్చేది (93) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు సీమంతినీప్రభావవర్ణన మనునది తొమ్మిదవ అధ్యాయము || 9 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters