Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదమూడవ అధ్యాయము

మూ || సూత ఉవాచ-

దశార్ణాధిపతే స్తస్యవజ్రబాహోర్మహాభుజః | బభూవశత్రుః బలవాన్‌ రాజా మగధరాట్‌తతః || 1 ||

నవైహే మరథో నామబాహుశాలీరణోత్కటః | బలేన మహాతావృత్య దశార్ణంన్యరుధత్‌బలీ || 2 ||

చమూపాః తస్యదుర్థర్షాః ప్రాప్యదేశం దశార్ణకం | వ్యలుంపన్‌వసురత్నాని గృహాణి దదహుఃపదే || 3 ||

కేచిద్ధనానిజగృహుః కేచిత్‌బాలా స్త్రియో7పరే | గోధనాన్య పరే7గృహ్ణాన్‌ కేచిద్థాన్య పరిచ్ఛదాన్‌ || 4 ||

కేచిదా రామనస్యాని గృహోద్యానాన్య నాశయన్‌

ఏవంవినాశ్య తద్రాజ్యం స్త్రీ గోధన జిఘృక్షవః | అవృత్యత స్యనగరీం వజ్రబాహోస్తుమాగథః || 5 ||

ఏవం పర్యాకులంవీక్ష్య రాజా నగరమేవచ | యుద్ధాయ నిర్జగా మాశువజ్రబాహుః నసైనికః || 6 ||

వజ్రబాహుశ్చభూపాలఃతధామంత్రిపురఃనరాః | యుయుధుఃమాగదైఃసార్ధం నిజఘ్నుఃశత్రువాహినీః || 7 ||

వజ్రబాహుః మహేష్వాసో దంశితో రథమాస్థితః | వికిరన్‌ బాణ వర్షాణి చకారకదనం మహత్‌ || 8 ||

దశార్ణ రాజం యుధ్యంతం దృష్ట్వాయుద్ధేసుదుఃసహం | తమేవ తరసావప్రుః సర్వే మాగధసైనికాః || 9 ||

కృత్వాతుసుచిరం యుద్ధంమాగధా దృఢవిక్రమాః | తత్సైన్యం నాశయామానుఃలేభిరేచజయశ్రియం || 10 ||

కేచిత్తస్య రథం జఘ్నుః కేచిత్త ద్థనురాచ్చినన్‌ | సూతంత న్యజఘానైనః త్వపరః ఖడ్గమాచ్ఛినత్‌ || 11 ||

సంభిన్న ఖడ్గధన్వానం హరథః రథసారధిం | బలాద్గృహీత్వా బలినోబ బంధుః నృపతింరుషా || 12 ||

తస్యమంత్రిగణం సర్వంతత్సైన్యంచ విజిత్యతే | మాగధాస్తస్య నగరీం వివిశుః జయకాశినః || 13 ||

అశ్వాన్నరాన్‌ గజానుష్ట్రాన్‌ పశూంశ్చైవ ధనానిచ | జగృహుః యువతీః సర్వాః చార్వం గీశ్చైవకన్యకాః || 14 ||

రాజ్ఞోబబంధుః మహిషీః దాసీశ్చైవ సహస్రశః | కోశంచ రత్న సంపూర్ణం జహ్నేస్తే 7 ప్యాతతాయినః || 15 ||

ఏవం వినాశ్య నగరీం హృత్వాస్త్రీ గోధనాదికం | వజ్రబాహుంబలాద్బద్ధారథే స్థాప్య వినిర్యయుః || 16 ||

ఏవం కోలాహలేజాతే రాష్ట్రనా శేచదారుణ | రాజపుత్రో7ధభద్రాయుః తద్వార్తా మశృణోద్బలీ || 17 ||

పితరం శత్రునిర్బద్ధం పితృపత్నీః తథాహృతాః | నష్టం దశార్ణ రాష్ట్రంచ శ్రుత్వా చుక్రోశ సింహవత్‌ || 18 ||

సఖడ్గశంఖావాదాయవైశ్యపుత్రసహాయవాన్‌ | దంశితో హయమారుహ్య కుమారో విజిగీషయా || 19 ||

జవేనాగత్యతం దేశం మాగధైర భిపూరితం | దహ్యమానం క్రందమానం హృతస్త్రీ సుతగోధనం || 20 ||

దృష్ట్వా రాజజనం సర్వం రాజ్యంశూన్యం భయాకులం | క్రోధాధ్మాత మనాస్తూర్ణం ప్రవిశ్య రిపువాహినీం

ఆ కర్ణాకృష్ణ కోదండో వవర్ష శరసంతతీః || 21 ||

తేహస్యమానారి పవోరాజపుత్రేణ సాయకైః | తమభిద్రుత్య వేగేన శ##రైః వివ్యధురుల్బణౖః || 22 ||

తా || సూతులిట్లన్నారు - దశార్ణ అధిపతియైన మహాభుజుడైన ఆ వజ్రబాహునకు మగధరాజు బలవంతుడైన రాజు శత్రువైనాడు. (1) ఆతనిపేరు హెమరథుడు. బాహుశాలి. రణోత్కటుడు. అనేక సైన్యంతో ఆవరించి ఆ బలవంతుడు దశార్ణమును అడ్డగించాడు (2) ఆతని, అణచవీలులేని సైన్యాధిపతులు దశార్ణదేశానికి చేరి పనురత్నములను గ్రహించారు. ఇళ్ళను తగులబెట్టారు. (3) కొందరు ధనం స్వీకరించారు. కొందరు బాలురను కొందరు స్త్రీలను గ్రహించారు. కొందరు గోవులను స్వీకరించారు. కొందరు ధాన్యపురాశులు గ్రహించారు. కొందరు ఆరామధాన్యములను గృహ ఉద్యానములను నశిపంచేశారు. (4) ఈ విధముగా ఆ రాజ్యాన్ని నశింపచేసి స్త్రీ, గోధనములను స్వీకరింపదలిచి ఆ వజ్రబాహునగరిని మాగధుడు ఆవరించినాడు. (5) రాజు పర్యాకులమైన నగరాన్ని చూచి వజ్రబాహువు సైనికులతో కూడి త్వరగా యుద్ధానికి బయలుదేరాడు. (6) వజ్రబాహు రాజు మంత్రులతో కూడి మగధులతో యుద్ధంచేశాడు. శత్రువులను చంపాడు (7) వజ్రబాహువు, మహెష్వానువు పండ్లు కొరుకుతూ రథమందుండి బాణవర్షములు విసురుతూ చాలా యుద్ధంచేశారు (8) యుద్ధం చేస్తున్న దశార్ణ రాజును చూచి యుద్ధ మందు ఎదరులేని వానిని చూచి మగధ సైనికులంతా ఆతనినే త్వరగా చుట్టముట్టారు. (9) ధృడవిక్రములైన మాగధులు బాగా యుద్ధంచేసి ఆ సైన్యాన్ని నశింపచేశారు. జయశ్రీని పొందారు. (10) కొందరతని రధాన్ని విరిచారు. కొందరాతని ధనుస్సును విరిచారు. ఒకడాతని సూతుని చంపాడు. ఇంకొకడు కత్తిని లాక్కున్నాడు (11) ఖడ్గ ధనస్సులు విరిగి, రథం విరగి సారధి చచ్చిన వానిని బలవంతంగా పట్టుకొని బలవంతులు నృపతిని కోపంతో బంధించారు (12) ఆతని మంత్రి గణాన్ని ఆతని సైన్యాన్ని జయించినారు, జయంకోరే మాగధులు ఆతని నగరంలో ప్రవేశించారు (13) అశ్వములను నరులను గజములను ఉస్త్రములను పశువులను ధనమును గ్రహించారు. యువతుల నందరిని అందమైన కన్యకలను స్వీకరించారు (14) రాజుగారి మహిమలను (భార్యలు) వేలకొలది దాసీజనాన్ని బంధించారు. రత్నములతో, నిండిన కోశాగారాన్ని ఆ ఆతతాయులు గ్రహించారు. (15) నగరిని నశింప చేసి స్త్రీగోధనాదికమును హరించి వజ్రబాహువును బలవంతంగా బంధించి రథమందుంచి వెళ్ళి పోయారు (16) ఇట్లా కోలాహలంకాగా దారుణంగా రాష్ట్రం నాశనం కాగా బలవంతుడైన భద్రాయువు రాజపుత్రుడు ఆ వార్తను విన్నాడు. (17) శత్రువులు బంధించిన తండ్రిని అపహరింపబడిన తల్లులను, నశించిన దశార్ణ రాష్ట్రమును గూర్చి విని సింహంవలె అరిచాడు (18) ఆతడు ఖడ్గశంఖములను తీసుకొని వైశ్యపుత్రుని సహాయం కలవాడై పళ్ళు కొరుకుతూ గుఱ్ణన్నెక్కి కుమారుడు జయకాంక్షతో (19) వేగంగా ఆ ప్రదేశానికి వచ్చి మాగధులతో నిండిన చోటికి వచ్చి, తగులబడిపోతున్న ఏడుస్తున్న, స్త్రీసుత గోధనములు పొగొట్టుకున్న దానిని (20) రాజ జనమునంతా చూచి భయంతో శూన్యమైన రాజ్యాన్ని చూచి, క్రోథంతో నిండిన మనస్సుగలవాడై, వేగంగా శత్రుసైన్యంలో ప్రవేశించి, చెవిదాకా ధనుస్సును లాగి బాణ పరంపరను వదిలాడు (21) రాజపుత్రుని బాణములతో ఆ శత్రువులను చంపుతూ ఉండగా, అతనికి ఎదురేగి వారు వేగంగా బాణములతో అధికంగా బాధించారు (22).

మూ || హస్యమానో7స్త్ర పూగేనరిపుభిః యుద్ధదుర్ముదైః | సచచాలరణధీరః శివవర్మాభి రక్షితః || 23 ||

సో7స్త్ర కర్షం ప్రసహ్యాశు ప్రవిశ్య గజలీలయా | జఘానాశురథాన్నాగాన్‌ పదాతీన సిభూరిశః || 24 ||

తత్రైకం రథిసంహత్వానసూతం నృపనందనః | తమేవ రథమాస్థాయ వైశ్యనందన సారధిః

విచచారరణధీరః సింహోమృగ కులంయథా || 25 ||

అథసర్వే సుసరంబ్థాః శూరాః ప్రోద్యత కార్ముకాః | అభిసస్రు తమేవైకం చమూపాబలశాలినః || 26 ||

తేషామాపతతామగ్రే ఖడ్గముద్యమ్య దారుణం | అభ్యుద్య¸° మహావీరాన్‌ ధర్శయన్నివపౌరుషం || 27 ||

కరాలాంతక జిహ్వాభం తస్యఖడ్గం మహోజ్జ్వలం | దృష్ట్వై సహసామమ్రుశ్చ మూపాః తత్ర్పభావతః || 28 ||

యేయే పశ్యంతి తంఖడ్గం ప్రస్ఫురంతం రణాంగణ | తేసర్వేని ధనం జగ్ముః వజ్రం ప్రాప్యే వకీటకః || 29 ||

అథాసౌ సర్వసైన్యనాం వినాశాయ మహాభుజః | శంఖందధ్మౌ మహారావం పూరయన్నివరోదసీ || 30 ||

తేనశంఖనినాదేన విషాక్తేనైవ భూయసా | శ్రుతమాత్రేణ రివవోమూర్ఛితాః పతితాభువి || 31 ||

యే7శ్వ పృష్ఠే రథేయేచ యేచదంతిషు సంస్థితాః | తేవి సంజ్ఞాః క్షణాత్పేతుః శంఖనాద హతౌజనః || 32 ||

తాన్భూమౌవతితాన్‌సర్వాన్‌ నష్టసంజ్ఞాన్నిరాయుధాన్‌ | విగణయ్య శవప్రాయాన్‌నావధీత్‌ధర్మశాస్త్రవిత్‌ || 33 ||

ఆత్మనః పితరం బద్ధంమోచ యిత్వారణాజిరే | తత్పత్నీః శత్రు వశగాః సర్వాః నద్యోప్యమోచయన్‌ || 34 ||

పత్నీశ్చమంత్రి ముఖ్యానాం తథాన్వేషాం పురౌకసాం

స్త్రియో బాలాంశ్చ కన్యాంశ్చ గోధనాధీన్యనేకశః || 35 ||

మోచమిత్వా రిపుభయాత్‌ తమాశ్వాసయదాకులః | అథారి సైన్యేషు చంరస్తేషాం జగ్రాహయోషితః || 36 ||

మరున్మనో జవానశ్వాన్‌ మాతంగాన్గిరిసన్నిభాన్‌ | స్యందనానిచ రౌక్మాణి దాసీశ్చ రుచిరాననాః || 37 ||

యుగ్మం-సర్వమాహృత్యవేగేనగృహీత్వాతద్థసంబాహు | మాగధీశంహెమరథంనిర్బబంధపరాజితం || 38 ||

తన్మంత్రిణశ్చ భూపాంశ్చతత్రముఖ్యాంశ్చనాయకాన్‌ | గృహీత్వాతర సబద్ధ్వాపురీంప్రావే శయద్ద్రుతం || 39 ||

పూర్వంయే సమరేభగ్నావి వృత్తా సర్వతోదిశం | తేమంత్రి ముఖ్యా విశ్వస్తా నాయకాశ్చసమాయయుః || 40 ||

కుమార విక్రమం దృష్ట్వా సర్వే విస్మిత మానసాః | తంమేనిరే సురశ్రేష్ఠం కారణాదాగతం భువం || 41 ||

అహోనః సుమహాభాగ్య మహోనస్తవనః ఫలం | కేనాప్యనేన వీరేణ మృతాః సంజీవితాఃఖలు || 42 ||

తా || బాణ సమూహంతో యుద్ధ దుర్మదులు శత్రువులు కొడ్తుండగా శివవర్మతో (కవచం) రక్షింపబడి ధీరుడు రణంలో చలించలేదు. (23) అస్త్రకర్షణను ఆతడు సహించి త్వరగా గజవిలాసంతో ప్రవేశించి రథములను, ఏనుగులను, పదాతులనుకూడా అధికంగా త్వరగా చంపాడు (254) సూతునితో కూడా ఒక యజమానిని చంపి ఆరాకుమారుడు ఆ రథాన్నే ఎక్కివైశ్యనందనుడు సారథికాగా సింహము మృగకులంలో ప్రవేశించినట్లుగా ఆధీరుడు రణంలో సంచరించాడు. (25) ఇక అందరు సిద్ధమై ఆతురతతో శూరులు ధనస్సులు ధరించి బలశాలురైన సైన్యాధిపతులు ఆ ఒక్కనినే అనుసరించారు. (26) ఆవస్తున్న వారి ఎదుట దారుణమైన ఖడ్గాన్ని ఎత్తి తన పౌరుషాన్ని చూపిస్తున్నట్లుగా ఆ మహావీరులను ఎదిరించాడు (27) కరాళుడైన అంతకుని జిహ్వలా ఉన్న ఆ ఖడ్గము మహోజ్జ్వలమైనది. దానిని చూస్తునే ఆ ప్రభావంవల్ల ఆచమూపులు (సైన్యాధిపతులు) త్వరగా మరణించారు (28) రణాంగణమందు వెలిగిపోతున్న ఆ ఖడ్గమును ఎవరెవరు చూస్తున్నారో వారంతా కీటకం వజ్రమును పొంది మరణించినట్లు మరణించారు. (29) ఇక ఈతడు సర్వసైన్యముల వినాశనం కొరకు ఈ మహాభుజుడు ఆకాశాన్ని నింపుతూ (ధ్వనితో) మహాధ్వనిగల శంఖమును పూరించాడు. (30) ఎక్కువ విషాక్తమైనట్లుగా ఉన్న ఆ శంఖనాదంను వినినంత, మాత్రంతో శత్రువులు మూర్ఛితులై భూమిపై పడినారు (31) గుఱ్ఱంపై కూర్చున్నవారు, రథమందు, ఏనుగుపైన ఉన్నవారు వారంతా క్షణంలోస్పృహ లేకుండా ఐ శంఖనాదంతో కాంతి హీనులైపడిపోయారు (32) భూమి యందు పడిన, స్పృహలేని ఆయుధహీనులైన వారి నందరిని శవప్రాయులుగా భావించి ధర్మశాస్త్రమెరిగిన ఆతడు చంపలేదు. (33) యుద్ధమందు బద్ధుడైన తన తండ్రిని విడిపించి, శత్రువశగులైన ఆరాజు భార్యలను అందరిని వెంటనే విడిపించాడు (34) మంత్రిముఖ్యుల ఇతరులైనపుర శ్రేష్ఠుల భార్యలను , స్త్రీలను, బాలురను, క్యలను, అనేకమైన గోధనమును (35) విడిపించి, వారిని శత్రు భయం నుండి ఓదార్చాడు. ఇక శత్రుసైన్యంలో తిరుగుతూ వారి స్త్రీలను పట్టుకున్నాడు (36) గాలివేగం, మనోవేగంగా గల గుఱ్ఱాలను, పర్వతములంత ఏనుగులను బంగారు రథములను, అందమైన దాసీలను (37) వేగంగా అంతా తీసుకొని అధనమును బాగా తీసుకొని పరీజితుడైన హేమరథమందున్న మాగధేశుని భంధించాడు (38) అతని మంత్రులను రాజులను, ముఖ్యనాయకులను తీసుకుని త్వరగా బంధించి తొందరగా పట్టణంలో ప్రవేశించాడు (39) పూర్వం సమరంలో ఎవరు భగ్నమైనారో, అన్ని దిక్కులు పరుగెత్తారో ఆ మంత్రిముఖ్యులు విశ్వాస పాత్రులైన నాయకులు తిరిగి వచ్చారు (40) రాకుమారుని పరాక్రమాన్ని చూచి అందరు ఆశ్చర్యపడిన మనస్సు గలవారై వారు అతనిని సురశ్రేష్ఠునిగా భూమికి వచ్చిన కారణ జన్మునిగా తలిచారు (41) అహో, మా, గొప్ప భాగ్యము. అహో, మా, తపః పలము. ఏదో రకంగా ఈతనితో చంపబడ్డవారు బ్రతికారుగదా (42)

మూ||ఏషకింయోగసిద్దోవాతపఃసిద్దో7ధవా7మరః|అమానుషమిదంకర్మయదనేనకృతం మహత్‌ || 43 ||

నూనమస్యభ##వేన్మాతా సాగౌరీతిశివః పితా | అక్షౌహిణీనాం నవకంజిగాయానంత శక్తిథృక్‌ || 44 ||

ఇత్యాశ్చర్య యుతైః హృష్టైః ప్రశంసద్భిః పరస్సరం | వృష్టో7 మాత్యజనేనాసావాత్మనం ప్రాహతత్వతః ||45 ||

సమాగతం స్వపితరం విస్మయాహ్లాద విప్లుతం | ముంచంత మానంద జలంవవందే ప్రేమ విహ్వలః || 46 ||

నరాజానిజ పుత్రేణ ప్రణయాదభి వందితః | అశ్లిష్య గాఢంతరసాబభాషే ప్రేమకాతరః || 47||

కస్త్వందేవో మనుష్యోవా గంధర్వోవా మహామతే | కామాతా జనకః కోవాకోదేశస్తవనామకిం || 48 ||

కస్మాన్నఃశత్రుభిః బద్దాస్మృతానివ హతౌజనః | కారుణ్యాదిహ సంప్రాప్య సపత్నీకావ్‌ ముమోచయః || 49 ||

కుతోలబ్థమిదం శౌర్యం ధైర్యంతేజోబలోన్నతిః | జిగీషసీవలోకాం స్త్రీన్‌ సదేవాసురమానుషాన్‌ || 50 ||

అపిజన్మ సహస్రేణ తవానృణ్యం మహౌజనః | కర్తుం నాహం సమర్థోస్మి నహైభిర్దారబాంధవైః || 51 ||

ఇమాన్‌పుత్రా నిమాః పత్నీరిదం రాజ్యమిదం పురం | సర్వంవిహాయమచ్ఛిత్తంత్వయ్యేవప్రేమబంధనం || 52 ||

సర్వం కథయమేతా తమత్ర్పాణ పరిరక్షక | ఏతాసాం మమపత్నీనాం త్వదధీనం హి జీవితం || 53 ||

సూత ఉవాచ -

ఇతిపపృష్టః సభద్రాయుః స్వపిత్రాతమ భాషత | ఏషవైశ్యనుతోరాజన్‌ సునయోనామమత్సఖా || 54 ||

అహమన్య గృహేరమ్యేవ సామి సహమాతృకః | భద్రాయుర్నామ మద్వృత్తం పశ్చాద్విజ్ఞాపయామితే || 55 ||

పురం ప్రవిశ్య భద్రంతే సదారః ననుహృజ్జనః త్యక్త్వాభయమరాతి భ్యోవిహరస్వయధాసుఖం || 56 ||

నైతాస్ముంచరి పూంస్తా పద్యావదాగమనం మమ | అహమద్య గమిష్యామి శీఘ్రమాత్మ నివేశనం || 57||

ఇత్యుక్తా నృపమామంత్ర్య భద్రాయుఃనృపనందనః | అజగామ స్వభావనం మాత్రే సర్వంస్యవేదయత్‌ || 58||

సాహిహృష్టా స్వతనయం పరిరేభే7శ్రులోచనా | నచవైశ్యపతిః ప్రేవ్జూ పరిష్వజ్యాభ్య పూజయత్‌ || 59 ||

వజ్రబాహుశ్చ రాజేంద్రః ప్రవిష్టో నిజమందిరం | స్త్రీపుత్రా మాత్య సహితః ప్రహర్షమతులంయ¸° || 60 ||

తస్యాంనిశాయాంవ్యుష్టాయాంఋషభోయోగినాంవరః|చంద్రాంగదంసమాగత్యసీమం తిన్యాఃపతింనృపః || 61

భద్రాయుషః సముత్పత్తిం తస్యకర్మాప్యమానుషం | ఆవేద్యరహసి ప్రేవ్ణూత్వత్సుతాం కీర్తిమాలినీం || 62 ||

భద్రాయుషేవ్రయచ్ఛే తిబోథయిత్వాచనైషథం | ఋషభో నిర్జగామాథ దేశకాలార్థతత్వవిత్‌ || 63 ||

తా|| ఈతడు యోగ సిద్దుడా , తపస్సిద్దుడా , అమరుడా ఈతడు చేసిన ఈ గొప్పపని మనుష్య సాధ్యముకాదు (43) ఈతని తల్లి ఆ గౌరి, తండ్రి శివుడు కావచ్చు. తొమ్మిది అక్షౌహిణుల సైన్యాన్ని అనంత శక్తితో జయించాడు. (44) అని ఆశ్చర్యం కలవారై ఆనందంతో పరస్పరము ప్రశంసిస్తున్నారు. అమాత్య జనులు అడుగగా ఈతడు తన గూర్చి ఉన్నదున్నట్లు చెప్పాడు. (45) విస్మయము అహ్లాదము అధికమై వచ్చిన, తన తండ్రికి ఆనందబాష్పములను విడుస్తున్న తండ్రికి ప్రేమ విహ్వలుడై నమస్కరించాడు (46) ఆ రాజు, తనకొడుకు ప్రేమతో నమస్కరించగా త్వరగా గాఢంగా కౌగిలించుకొని ప్రేమకాతరుడై ఇట్లన్నాడు (47) ఓ మహామతి! నీవెవరు దేవుడవా, మనుష్యుడవా, గంధర్వుడవా, నీతల్లి ఎవరు, తండ్రి ఎవరు నీ దేశ##మేది నీపేరేమి (48) శత్రువులు బంధించిన చచ్చిన వారివలె తజోహీనులైన మమ్ములను , దయతో ఇక్కడికి వచ్చి శత్రువుల నుండి విడిపించావు (49) ఈ శౌర్యం నీకెట్లా కలిగింది. ధైర్యము తేజస్సు బలోన్నతి ఎట్లా లభించాయి. దేవ అసుర మనుషులతో కూడిన ముల్లోకములను గెలిచేవానివలె ఉన్నావు. (50) వేయి జన్మలతోనైనా మహా తేజస్సు గల నీ ఋణం నుండి విముక్తుడనౌటకు నా శక్తి చాలదు. ఈ దార బంధువులతో కూడినా చేయలేను (51) ఈ పుత్రులు, ఈ భార్యలు, ఈ రాజ్యము, ఈపురము అన్ని వదలి నా చిత్తము నీ యందే ప్రేమతో బద్దమైంది (52) ఓ కుమార! నా ప్రాణ రక్షకుడ! నాకంతా చెప్పు. ఈ నాభార్యల జీవితము నీ ఆధీనంలో ఉంది. (53) సూతులిట్లన్నారు. అని అడుగగా భద్రాయువు తన తండ్రితో ఇట్లన్నాడు ఈతడు వైశ్యసుతుడు సునయుడు నా స్నేహితుడు ఓరాజ! (54) నేను ఈతని ఇంటి యందు నా తల్లితో కూడి బాగా ఉంటున్నాడు. నా పేరు భద్రాయువు నా వృత్తాంతామును నీకు తర్వాత చెబుతాను. (55) భార్యలతో సుహృజ్జనులతో కూడి పురం ప్రవేశించి ఉండు. నీకు క్షేమం కలగని. శత్రు భయంవదలి సుఖంగా విహరించు (56) ఈ శత్రువులను నేను వచ్చేదాకా వదలకు. నేనీవేళ త్వరగా నా ఇంటికి (స్థానానికి) వెళ్తాను. (57) అని పలికి రాజుకు పోయివస్తానని చెప్పి ఆ రాకుమారుడు భద్రాయువు తన భవనమునకు వచ్చి తల్లికి అంతా చెప్పాడు. (58) ఆమె ఆనందపడి ఆనందబాష్పాలు కలిగి తన కొడుకును కౌగిలించుకొంది. ఆ వైశ్యపతి ప్రేమతో కౌగిలించుకొని పూజించాడు. (59) ఆ రాజేంద్రడు వజ్రబాహువు తన మందిరంలో ప్రవేశించి స్త్రీలు పుత్రులు, అమాత్యులతో కూడి చాలా ఆనందించాడు (60) ఆ రాత్రి వేకువ జామున ఋషభుడు యోగిశ్రేశష్ఠుడు చంద్రాగదుని వద్దకు సీమంతిని పతి వద్దకు రాజు వద్దకు వచ్చి (61) భద్రాయుస్సు ఉత్పత్తిని అతని అమానుష కర్మను రహస్యంగా ప్రేమతో చెప్పి, నీ కూతురు కీర్తిమాలినిని (62) భద్రాయుస్సునకు ఇవ్వు అని ఆ నిషధ రాజునకు చెప్పి దేశకాల అర్థముల తత్వమెరిగిన ఋషభుడు వెళ్ళిపోయాడు (63)

మూ|| విశేషకం - అథచంద్రాంగదో రాజా ముహూర్తే మంగలోచితే | భద్రాయుషంసమాహూయ ప్రాయచ్ఛత్‌ కీర్తిమలినీం|| 64 ||

కృతోద్వాహః సరాజేంద్రతనయః సహభార్యయా | హేమాననస్థః శుశుభే రోహిణ్య వనిశాకరః || 65 ||

వజ్రబాహుంతి త్పితరంసమాహూయసనైషధః | పురం ప్రవేశ్యసామాత్యఃప్రథ్యుద్గామాభ్యపూజయత్‌ || 66 ||

తత్రాపశ్యత్‌ కృతోద్వాహం భద్రాయుషమరిందమంప్రాదయోః పతితం ప్రేవ్జూ హర్షాత్తం పరిషస్వజే || 67 ||

ఏషమే ప్రాణ దోవీర ఏషశత్రునిషూదనః | అధాప్యజ్ఞాత వంశో7యం మయానంత పరాక్రమః || 68 ||

ఏషతే నృపజామాతా చంద్రాంగద మహాబలః | అన్యవంశమధోత్పత్తిం శ్రోతుమిచ్ఛామిత త్వతః || 69 ||

ఇత్థం దశార్ణ రాజేన ప్రార్థితో నిషదాధిపః | వివిక్త ఉపసంగమ్య ప్రహసన్నిదమ బ్రవీత్‌ || 70 ||

ఏషతే తనయో రాజన్‌ శైశ వేరోగ పీడితః | త్వయావనే పరిత్యక్తః సహమత్రా ఋజార్తయా || 71||

పరిభ్రమంతీ విపినే సానారీ శిశునామునా | దైవాత్‌ వైశ్య గృహం ప్రాప్తాతేన వైశ్యేన రక్షితా || 72 ||

అథాసౌ బహురోగార్తో మృతస్తవకుమారకః | కేనాపి యోగిరాజేన మృతః సంజీవితః పునః || 73 ||

ఋషభాక్యస్య తసై#్యవ ప్రభావాచ్ఛివయోగినః | రూపంచదేవ సదృశం ప్రాప్తౌ మాతృకుమారకౌ || 74 ||

తేనదత్తేన ఖడ్గేన శంఖేన రిపుఘాతినా | జిగాయ సమరే శత్రూన్‌ శివపర్మాభి రక్షితః || 75 ||

ద్విషట్‌ సహస్రనాగానాం బలమేకోబి భర్త్యసౌ | సర్వ విద్యాసు నిష్టాతో మమజా మాతృతాంగతః || 76 ||

అత ఏనం సమాదాయ మాతరం చాన్య సువ్రతాం | గచ్ఛస్వ నగరీం రాజన్‌ ప్రావ్య్ససి శ్రేయఉత్తమం || 77||

ఇతి చంద్రాగదః సర్వం అఖ్యాయాంతర్‌ గృహేస్థితాం|తస్యాగ్రవత్నీమాహూయదర్శ యామానభూషితాం || 78 ||

ఇత్యాది పర్వమాకర్ణ్య దృష్ట్యాచ సమహీపతిః | ప్రీడితోనితరాం మౌఢ్యాత్‌ స్వకృతం కర్మ గర్హయన్‌ || 79 ||

ప్రాప్తశ్చ పరమానందం తయోర్దర్శన కైతుకాత్‌ | పులకాంకిత సర్వాంగః తావు భౌ పరిషన్వజే || 80 ||

యుగ్మం - ఏవంవిషధరాజేనపూజితశ్చాభినందిత ః | సభోజయిత్వాతంసమ్యక్‌స్వయంచసహమంత్రిభి ః || 81 ||

తామాత్మనోగ్ర మహిషీం పుత్రం తమపితాం స్నుషాం | ఆదాయ సపరీవారో వజ్రబాహుఃపురీం య¸° || 82 ||

స సంభ్రమేణ మహతాభ్రదాయుః పితృమందిరం | సంప్రావ్య పరమానందం చక్రే సర్వపురౌకసాం || 83 ||

భద్రాయుః పృథివీం సర్వాంశశాసాద్భుతవిక్రమః || 84 ||

మాగధేశం హెమరథం మోచయామాన బంధనాత్‌ | సంధాయమైత్రీం పరమాం బ్రహ్మర్షీణాంచ సన్నిధౌ || 85 ||

ఇత్థం త్రిలోక మహితాం శివయోగి పూజాం కృత్వా పురాతన భ##వేపి సరాజసూనుః |

విస్తీర్యదుః సహవిపద్గణ మాప్తరాజ్యశ్చంద్రాగదస్య సుతయా సహసాధురేమే 86 ఇతి శ్రీ స్మాందే హాపురాణ ఏకాశితి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే భద్రాయు వివాహ కథనం నామత్రయోదశో7ధ్యాయః 13

తా || చంద్రాగదరాజు మంగళమునకు ఉచితమైన ముహూర్తమందు భద్రాయుస్సును పిలిచి కీర్తిమాలినిని ఇచ్చాడు (64) వివాహమయ్యాక ఆ రాజేంద్ర కుమారుడు భార్యతో కూడి హెమాననస్థుడై చంద్రుడు రోహిణితో కూడినట్లు ప్రకాశించాడు. (65) అతని తండ్రిని వజ్రబాహువును పిలిచి ఆ నైషధరాజు అమాత్యులతో గూడి నగరులో ప్రవేశించి ఎదురేగి పూజించాడు. (66) వివాహితుడైన, శత్రునాశకుడైన భద్రాయుస్సును అక్కడ చూచాడు. పాదములపై పడిన అతనిని ప్రేమతో అనందంతో కౌగిలించుకున్నాడు. (67) ఈతడు నాకు ప్రాణములనిచ్చినవాడు, వీరుడు ఈతడు శత్రునిషాదనుడు. ఇప్పటికి ఈతని వంశ##మేదో నాకు తెలియదు. అనంత పరాక్రముడీతడు (68) ఓ రాజా! ఈనీ అల్లుడు చంద్రాంగదుడు మహాబలుడు. ఈతని వంశమును. ఉత్పత్తిని నిజంగా వినదలిచాను. (69) అని దశార్ణరాజు ప్రార్థించగా నిషథరాజు ఒంటరిగా కలిసి నవ్వుతూ ఇట్లా చెప్పాడు (70) ఈతడు నీ కుమారుడు ఓ రాజా! శైశవంలో రోగపీడితుడు. రుజార్తురాలైన తల్లితోపాటు నీవీతనిని అడవిలో విడిచిపెట్టావు (71) ఈ పిల్లవానితో కూడా ఆ నారి అడవిలో తిరుగుతూ అదృష్టవశాత్తు వైశ్యగృహమును చేరి అవైశ్యనితో రక్షింపబడింది. (72) బహు రోగార్తుడైన ఈ నీకుమారుడు చనిపోయాడు. ఎవరో ఒక యోగి రాజు చనిపోయిన ఈతనిని బ్రతికించాడు (73) ఋషభుడను పేరుగల శివయోగి ప్రభావం వల్ల మాత, కుమారుడు దేవసదృశ రూపాన్ని పొందారు. (74) అతడిచ్చిన ఖడ్గంతో శ్రతువుల చంపే శంఖంతో శివకవచంతో అభిరక్షితుడై యుద్దంలో శత్రువులను జయించాడు. (75) ఈతనికి ఒక్కనికే పన్నెండు వేల ఏనుగుల బలాన్ని ఇచ్చాడు (కలిగి ఉన్నాడు) అని విద్యలలో నిష్టాతుడు. నాకు అల్లుడైనాడు (76) ఈతనిని తీసుకొని సువ్రత ఐన ఈతని తల్లిని తీసుకొని, రాజా నగరానపికి వెళ్ళు. ఉత్తమ శ్రేయస్సును పొందుతావు. (77) అని చంద్రాంగదుడు అంతా చెప్పి, అంతఃపురంలో ఉన్న అతని పెద్ద భార్యను పిలిచి, భూషితురాలైన ఆమెను చూపించాడు. (78) అని అంతా విని చూచి ఆ రాజు సిగ్గుపడి మిక్కిలి మూర్ఖత్వం వల్ల పీడింపబడి తనపనిని వదించుకొని (79) వారిద్దరి దర్శన కౌతుకం వల్ల పరమానందాన్ని పొందాడు. పులకాంకిత సర్వాంగుడై వారిద్దరిని కౌగిలించుకున్నాడు. (80) ఈ విధముగానిషిధ రాజుతో పూజింపబడి, అభినందింపబడినాడు. అతడు చక్కగా భుజించి, మంత్రులతో కూడి (81) తన ఆగ్రమహిషితో, పుత్రునితో, కోడలుతో కూడి సపరివారుడై వజ్రబాహువు తన నగరానికి వెళ్ళాడు (82) అతడు, త్వరగా, అభద్రాయువు తండ్రి మందిరమునకు వచ్చి పట్టణ ప్రజలందరికి ఎంతో ఆనందాన్ని కల్గించాడు (83) కాలాంతరమున తండ్రి మరణించాక ప్రాప్త¸°వ్వనుడై భద్రాయువు అద్భుత విక్రయుడై భూమినంతా పాలించాడు. (84) హేమరథుడైన మాగధేశుని బంధనం నుండి విడిపించాడు. బ్రహ్మర్షల సన్నిధిలో పరమ మైత్రిని ఏర్పరచుకున్నాడు. (85) ఇట్లా త్రిలోక మహితుడైన శియోగి పూజను చేసి పురాతన భవమందు కూడా ఆ రాజ నూనుడు, సహించరాని విపద్గణమును దాటి, రాజ్యాన్ని పొంది, చంద్రాంగదుని సుతతోపాటు బాగా ఆనందించాడు (86) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు భ్రదాయు వివాహ కథన మనునది పదమూడవ అధ్యాయము 13.

Sri Scanda Mahapuranamu-3    Chapters