Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునారవ అధ్యాయము

మూ|| సూత ఉవాచ -

శృణుధ్వం మునయః శ్రేష్ఠా వామదేవస్య భాషితం || 1 ||

వామదేవ ఉవాచ -

పురామందర శూలేంద్రేన ఆ నాథాతు విచిత్రితే | నానాసత్వ సమాకీర్ణే నానాద్రేమలతాయుతే || 2 ||

కాలాగ్నిరుద్రో భగవాన్‌ కదాచిద్విశ్వ వందితః | సమాససాదభూతేశః స్వేచ్ఛయా పరమేశ్వరః || 3 ||

సమంతాత్‌ సముపాతిష్ఠన్‌ రుద్రాణాం శతకోటయుః | తేషాం మధ్యేసమాసీనో దేవదేవస్త్రిలోచనః 4 ||

తత్రాగచ్ఛత్‌ సురశ్రేష్ఠో దేవైః సహపురందరః | తథాగ్నిర్వరుణో వాయుః యమోనైవ స్వతస్తథా || 5 ||

గంధర్వాశ్చిత్రోసేనాద్యాః ఖేచరాః పన్నగా దయః | విద్యాధరాః కింపురుషాః సిద్ధాః సాధ్యాశ్చగుహ్యకాః || 6 ||

బ్రహ్మర్షయో వసిష్ఠాద్యాః నారదాద్యా సురర్షయః పితరశ్చ మహాత్మానో దక్షాద్యశ్చ ప్రజేశ్వరాః || 7 ||

ఉర్వశ్యాద్యాశ్చా ప్సరసః చండికాద్యాశ్చ మాతరః | ఆదిత్యావ నవోదస్రౌ విశ్వేదేవా మహౌజనః || 8 ||

అథాన్యే భూత పతయో లోక సంహారణక్షమాః | మహాకాలశ్చ నందీ చతధావై శంఖ పాలకౌ || 9 ||

వీరభద్రో మహాతేజాః శంకుకర్ణో మహాబలః | ఘంటాకర్ణశ్చ దుర్థర్షో మణి భద్రో వృకోదరః || 10 ||

కుండోదరశ్చ వికటాః తథాకుంభోదరోబలీ | మందోదరః కర్ణధారః కేతుః భృంగీరిటిస్తథా || 11 ||

భూతనాధాస్త ధాన్యేచ మహాకాయా మహౌజనః | కృష్ణ వర్ణాస్తథా శ్వేతాః కేచిన్మండూక సప్రభాః || 12 ||

హరితా థూనరాధూమ్రాః కర్బురాః పీతలోహితాః | చిత్రవర్ణావిచిత్రాంగాః చిత్రలీలా మదోత్కటాః || 13 ||

నానా యుధోద్యత కరానానావాహన భూషణాః | కేచిద్వ్యాఘ్రముఖాః కేచిత్‌ సూకరాస్యామృగాసనాః || 14 ||

కేచిచ్చన క్రవదనాః సారమేయముఖాః వరే | నృగాల వదనాశ్చాన్యే ఉష్ట్రా భవదనాః వరే || 15 ||

కేచిచ్ఛరభ##భేరుండ సింహాశ్వోష్ట్రబకాసవాః | ఏకవక్త్రా ద్వి వక్త్రాశ్చ త్రిముఖాశ్చైవ నిర్ముఖాః || 16 ||

ఏకహస్తాః త్రిహస్తాశ్చ పంచహస్తాస్త్వహస్తకాః | అపాదాబహు పాదాశ్చ బహుకర్ణైక కర్ణకాః || 17 ||

తా || సూతుని వచనము - ఓ శ్రేష్ఠమైన మునులారా ! వామదేవుని భాషణము వినండి (1) వామదేవుని వచనము - నానా ధాతువులతో చిత్రంగా ఉన్న మందర పర్వతంలో పూర్వము నానా సత్వములతో కూడిన నానా ద్రుమములతో, లతలతో కూడిన (2) ఆచోటుకు ఒకసారి విశ్వపందితుడు భగవాన్‌ కాలాగ్ని రుద్రుడు భూతేశుడు పరమేశ్వరుడు స్వేచ్ఛగా వచ్చాడు (3) శతకోటి రుద్రులు (గణాలు) ఎదురుగా ఉన్నారు. వారి మధ్యలో దేవదేవుడు త్రిలోచనుడు కూర్చున్నాడు (4) అక్కడికి దేవతలతోపాటు సురశ్రేష్ఠుడు పురందరుడు వచ్చాడు. అట్లాగే అగ్ని వరుణ వాయు యమ నైవ స్వతులు వచ్చారు (5) చిత్ర సేనాది గంధర్వులు, ఖేచరులు, పన్నగులు, విద్యాధరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, గుహ్యకులు (6) బ్రహ్మర్షులు వసిష్ఠాదులు, సురర్షులు, నారదాదులు, మహాత్ములు పితరులు ప్రజేశ్వరులు దక్షాదులు (7) ఊర్వశ్యాద్య ప్సరసలు చండికాది మాతలు, ఆదిత్యులు వసువులు దస్రులు, విశ్వే దేవులు మహొజనులు (8) లోక సంహారణక్షములైన ఇతర భూతపతులు, మహాకాలుడు, నంది అట్లాగే శంఖపాలకులు (9) మహాతేజశ్శాలి వీరభద్రుడు, మహాబలుడు శంకు కర్ణుడు, ఘంటాకర్ణుడు, దుర్ధర్షుడు, మణిభద్రుడు, పృకోదరుడు (10) కుండోదరుడు, వికటులు, బలశాలి కుంభోదరుడు, మందోదరుడు, కర్ణధారుడు, కేతువు భృంగి, రిటి (11) భూతనాధులు అట్లాగే ఇతరులైన మహొజనులు, మహాకాయులు, కృష్ణ వర్ణులు, శ్వేతవర్ణులు, కొందరు మండూకం వంటి కాంతి గలవారు (12) హరిత వర్ణంవారు ధూసర, ధూమ్ర, కర్బుర, పీత, లోహిత వర్ణములవారు, చిత్ర వర్ణులు, విచిత్ర అంగములవారు, చిత్ర లీలలవారు, మదోత్కటులు (13) నానా ఆయుధములు చేత ధరించిన వారు నానా వాహనములవారు, భూషణములవారు కొందరు వ్యాఘ్రముఖులు, కొందరు సూకరముఖులు, మృగాననులు (14) మొసలి మొగాలవారు కొందరు కుక్కల వంటి ముఖాలవారు నక్కలవంటి మొగాలవారు ఒంటెల ముఖాలవారు (15) శరభ##భేరుండ, సింహఅశ్వ, ఉష్ట్ర, బక ఆసనులు ఏకవక్త్ర ద్వివక్త్ర, త్రివక్త్రులు, నిర్ముఖులు (16) పాదహీనులు అనేక పాదాల వారు, అనేక చెవులవారు, ఒకే చెవి వారు, మూడు చేతుల వారు ఐదు చేతులవారు, చేతుల లేనివారు (17).

మూ || ఏకనేత్రాః చతుర్నేత్రాః దీర్ఘాఃకేచనవామనాః | సమంతాత్పరివార్యేశం భూతనాథ ముపానతే || 18 ||

అధాగచ్ఛన్మ హాతేజా మునీనాం ప్రవరః సుధీః | సనత్కు మారోధర్మాత్మా తంద్రష్టుం జగదీశ్వరం || 19 ||

తందే వదేవం విశ్వేశం సూర్యకోటి సమప్రభం | మహా ప్రలయం సంక్షుబ్ధ సప్తార్ణ వఘన స్వనం || 20 ||

సంవర్తాగ్ని సమాటోపంజటామండలశోభితం | అక్షీణ ఫాలనయనం జ్వాలావ్లూన ముఖత్విషం || 21 ||

ప్రదీప్త చూడామణి నా శశిఖండేన శోభితం | తక్షకం వామ కర్ణేన దక్షిణన చవాసుకిం || 22 ||

బిభ్రాణం కుండల యుగం నీలరత్న మహాహనుం నీలగ్రవం మహబాహుం నాగహార విరాజితం || 23 ||

ఫణిరాజ పరిభ్రాజత్‌ కంకణాంగద ముద్రికం | అనంతగుణ సాహస్ర మణి రంజితమే ఖలం || 24 ||

వ్యాఘ్రచర్మ పరీధానం ఘంలాదర్పణ భూషితం | కర్కోటక మహా పద్మ దృతరాష్ట్ర ధనం జయైః || 25 ||

కూజన్నూపుర సంఘుష్ట పాదపద్మ విరాజితం | ప్రాసతో మరఖట్వాంగశూలటం కధనుర్థనం || 26 ||

అప్రధృష్య మనిర్దేశ్యం అచింత్యాకార మీశ్వరం | రత్నసింహాసనా రూఢం ప్రణనామ మహామునిః || 27 ||

తంభక్తి భారోచ్ఛ్వసితాంత రాత్మా నంస్తూయ వాగ్భిః శ్రుతి సంమితాభిః |

కృతాంజలిః ప్రశ్రయనమ్రకంధరః వ ప్రచ్ఛధర్మాసఖిలాన్‌ శుభప్రదాన్‌ || 28 ||

యాన్‌యాన్‌ అపృచ్ఛతమునిఃతాంస్తాన్‌ధర్మానశేషతః|ప్రోవాచభగవాన్‌రుద్రోభూయోమునిరపృచ్చత || 29 ||

సనత్కుమార ఉవాచ-

శ్రుతాస్తే భగవాన్‌ ధర్మాః త్వన్ముఖాన్ముక్తి హెతవః | యైర్ముక్త పాపామనుజాస్తరిష్యంతి భవార్ణవం || 30 ||

అథావరంవిభోధర్మ మల్పాయానం మహాఫలం|బ్రూహికారుణ్యతో మహ్యంసద్యోముక్తి ప్రదంనృణాం || 31 ||

అభ్యాస బహులా ధర్మాః శాస్త్ర దృష్టాః సహస్రశః|సమ్యక్సం సేవితాః కాలాత్సిద్ధిం యచ్ఛంతివానవా || 32 ||

అతోలోకహితం గుహ్యం భక్తిముక్త్యోశ్చ సాధనం|ధర్మం విజ్ఞాతుమిచ్ఛామి త్వత్ర్ప సాదాన్మహెశ్వర || 33 ||

శ్రీ రుద్ర ఉవాచ-

సర్వేషా మపి ధర్మాణాం ఉత్తమంశ్రుతిచోదితం|రహస్యం సర్వ జంతూనాం యత్త్రిపుంcడస్యధారణం || 34 ||

తా || ఏకనేత్రులు, చతుర్నేత్రులు, పొడుగువారు, పొట్టివారు, ఈశుడైన భూతనాథుని చుట్టుముట్టి సేవిస్తున్నారు (18) అప్పుడు మహాతేజస్సంపన్నుడు మునులలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు ధర్మాత్ముడు సనత్కుమారుడు ఆ జగదీశ్వరుని చూడటానికి వచ్చాడు (19) ఆ దేవదేవుని విశ్వేశుని, కోటి సూర్యులకాంతి గల వానిని మహా ప్రళయ కాలమందు క్షోభించే ఏడు సముద్రముల వంటి పెద్ద ధ్వని గలవానిని (20) ప్రళయకాలాగ్ని వంటి ఆటో వంకల వానిని (వేగిరపాటు) జటామండలము కలవానిని, క్షీణించని ఫాలనయనుని జ్వాలతో వ్లూనం కాని ముఖం గలవానిని (21) వెలుగుతున్న చూడామణితో శశిఖండంతో శోభించేవానిని వామకర్ణ మందు తక్షకుని, దక్షిణమందు వాసుకిని (22) కుండలములుగా ధరించిన వానిని నీలరత్నము వంటి గొప్ప హనువు గలవానిని (చెక్కిలి) నీలగ్రీవుని మహాబాహువును, నాగహారంతో వెలిగేవానిని (23) ఫణిరాజులే కంకణ, అంగద ముద్రికలుగా వెలిగే వానిని, అనంత గుణములు గల సహస్ర మణులతో వెలిగే ఒడ్డాణము కలవానిని (24) వ్యాఘ్ర చరవ్ధురుని, ఘంట, దర్పణములతో అలంకరింపబడినవానిని, కర్కోటకుడు, మహాపద్ముడు, ధృతరాష్ట్ర ధనంజయులు (25) వీరితో ధ్వనించే సూపుర సంఘర్షణ గల పాదపద్మములతో వెలిగే వానిని, ప్రాసతో మరఖ ట్వాంగశూలటం కధనుస్సులను ధరించిన వానిని (26) అప్రధృష్యుడు, అనిర్దేశ్యుడు, అచింత్యాకారుడు ఐన ఈశ్వరుని, రత్నసింహాసనారూఢుని ఆ మహాముని నమస్కరించాడు. (27) భక్తి భారంతో నిండిన అంతరాత్మ కలవాడై ఆతడు శ్రుతి సమ్మతమైన వాక్కులతో ఆ శివుని స్తుతించి చేతులు జోడించి, వినయంతో వంచిన తలగలవాడై శుభప్రదమైన ధర్మములనన్నిటిని అడిగాడు (28) ముని, ఏ ఏ ధర్మాల నడిగాడో వాటినన్నిటిని పూర్తిగా రుద్రుడు భగవాన్‌ చెప్పాడు. తిరిగి ముని అడిగాడు (29) సనత్కుమారుని వచనము - ఓ భగవాన్‌ ! నీ ముఖము నుండి ముక్తి హెతువైన ధర్మములను నేను విన్నాను. ఏ ధర్మాలతో నరులు ముక్త పాపులై సంసార సముద్రాన్ని దాటుతారో విన్నాను. (30) విభు! తక్కువ ఆయాసము, గొప్ప ఫలము గల గొప్ప ధర్మాన్ని నరులకు వెంటనే ముక్తినిచ్చేదాన్ని నాకు దయతో చెప్పండి (31) అభ్యాసంలో ఎక్కువగా ఉన్న ధర్మములు, శాస్త్రాల్లో కనిపించే వేలాది ధర్మములు వాటిని బాగాసేవిస్తే కాలమందు సిద్ధినిస్తాయా ఇవ్వనా (32) అందువల్ల లోకంలో హితమైన, రహస్యమైన, భుక్తిముక్తి సాధనమైన ధర్మాన్ని నీ అనుగ్రహం వల్లతెలుసుకోదలిచాను ఓ మహెశ్వర! (33) అని అనగా శ్రీ రుద్రుని వచనము - ధర్మములన్నింటిలో ఉత్తమమైనది శ్రుతిలో చెప్పబడ్డదే. సర్వ ప్రాణులకు రహస్యమైనది ఏమిటి అంటే త్రిపుండ్రధారణము (34).

మూ || సనత్కుమార ఉవాచ -

త్రిపుండ్రస్య విధింబ్రూహి భగవాన్‌ జగతాంపతే | తత్వతో జ్ఞాతుమిచ్ఛామి త్వత్ర్పసాదాన్మహెశ్వర || 35 ||

కతిస్థానాని కింద్రవ్యం కాశక్తిః కాచదేవతా | కింప్రమాణంచకః కర్తాకేమంత్రాః తస్యకింఫలం || 36 ||

ఏతత్సర్వమశేషేణ త్రిపుండ్రస్య చలక్షణం | బ్రూహిమే జగతాం నాథ లోకాను గ్రహకామ్యయా || 37 ||

శ్రీ రుద్ర ఉవాచ -

ఆగ్నేయముచ్యతే భస్మ దగ్థ గోమయసంభవం | తదేవ ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే || 38 ||

సద్యోజాతాదిభిః బ్రహ్మమయైర్మంత్రైశ్చ పంచభిః | పరిగృహ్యాగ్ని రిత్యాది మంత్రైః భస్మాభి మంత్రయేత్‌ || 39 ||

మానస్తోకేతి సంమృజ్య శిరోలింపేచ్చత్ర్యం బకం | త్రియా యుషాదిభిర్మంcతైః లలాటేచ భుజద్వయే

స్కంధేచలేవయే ద్భన్మ సజలం మంత్ర భావితం || 40 ||

తిస్రోరేఖా భవంత్యేషు స్థానేషు మునిపుంగవ | భ్రువోర్మధ్యం సమారభ్య యాపదంతో భ్రువోర్భవేత్‌ || 41 ||

మధ్యమానామికాంగుల్యోః మధ్యైతు ప్రతిలోమతః | అంగుష్ఠేన కృతారేఖా త్రిపుండ్రస్యాభి ధీయతే || 42 ||

తినృణా మపిరేభాణాం ప్రత్యేకం నవదేవతాః | అకారో గార్హపత్యశ్చ ఋక్‌ భూర్లో కోరజస్తథా || 43 ||

ఆత్మాచైవక్రియాశక్తిః ప్రాతః నవనమేవచ | మహాదేవస్తు రేఖాయాః ప్రథమాయాస్తు దేవతా || 44 ||

ఉకారో దక్షిణాగ్నిశ్చసభః సత్వం యజుస్తధా | మధ్యందినంచ నవనం ఇచ్ఛాశక్త్యంత రాత్మకౌ || 45 ||

మహెశ్వరశ్చరేఖాయా ద్వితీయాయాశ్చ దేవతా | మకారాహవనీ¸°చ పరమాత్మా తమోదివః || 46 ||

జ్ఞానశక్తిః సామవేదః తృతీయ సవనం తథా | శివశ్చేతి తృతీయా యారేఖాయాశ్చాది దేవతా || 47 ||

ఏతానిత్యం నమస్కృత్య త్రిపుండ్రం ధారయేత్సుధీః | మహేశ్వర వ్రతమిదం సర్వదేవేషు కీర్తితం || 48 ||

ముక్తికామైః నరైః సేవ్యం పునస్తేషాం నసంభవః | త్రిపుండ్రంకురుతేయస్తు భస్మనావిధి పూర్వకం || 49 ||

బ్రహ్మచారీ గృహస్థోవా వనస్థోయతి రేవనా | మహాపాతక సంఘాతైః ముచ్యతే చోపపాతకైః || 50 ||

తా || సత్కుమారుని వచనము - ఓ జగత్పతి! భగవాన్‌! త్రిపుండ్రవిధిని చెప్పండి ఓ మహేశ్వర! నీ అనుగ్రహంతో యథార్థంగా తెలుసుకోదలిచాను (35) స్థానములెన్ని. ద్రవ్యమైది శక్తి ఎవరు. దేవత ఎవరు. ప్రమాణమేమి. కర్త ఎవరు మంత్రములేవి. దాని ఫలమేమి (36) ఇదంతా మొత్తం త్రిపుండ్ర లక్షణాన్ని చెప్పండి, జగత్పతి! లోకములను అనుగ్రహించే కొరకు (37) రుద్రులిట్లన్నారు - కాలిన గోమయం నుండి వచ్చే భస్మము ఆగ్నేయమున బడుతుంది. అదే ద్రవ్యము త్రిపుండ్రమునకు అని అన్నారు ఓ మహాముని (38) బ్రహ్మమయములైన సద్యోజాతాది ఐదు మంత్రములతో పరిగృహ్యాగ్ని అనే మొదలగు మంత్రములతో భస్మాన్ని అభిమంత్రించాలి (39) మానస్తోక అనే మంత్రంతో రాసుకొని త్ర్యంబక మును శిరస్సు యందు పూనుకోవాలి. త్రియాయుషాది మంత్రములతో లలాటమందు రెండు భుజములందు ధరించాలి. మంత్రముతో భావించి జలముతో కూడిన భస్మమును స్కందమందు ధరించాలి. (40) ఈ స్థానములందు మూడు రేఖలుంటాయి. ఓ ముని పుంగవ. కనుబొమల మధ్య నుండి ఆరంభించి కనుబొమల చివర వరకు ఉండాలి (41) మధ్య మఅనామిక అంగుళుల మధ్య అవరోహణ క్రమంగా అంగుష్ఠముతో చేసిన రేఖ త్రిపుండ్రమనబడుతుంది (42) మూడు రేఖలకు ప్రత్యేకంగా తొమ్మిదిమంది దేవతలు. అకారము, గార్హపత్యము ఋక్‌, భూలోకము, రజస్సు (43) ఆత్మ, క్రియా శక్తి, ప్రాతః సవనము, మహాదేవుడు ప్రథమరేఖకు దేవతలు (44) ఉకారము, దక్షిణాగ్ని సభస్సు, సత్వగుణము, యజుస్సు, మధ్యందిన నవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ (45) మహెశ్వరుడు రెండవ రేఖకు దేవతలు, మకారము ఆహవనీయము పరమాత్మ తమస్సు, దివము (46) జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ నవనము, శివుడు వీరు మూడవ రేఖకు దేవతలు (47) వీరిని రోజూ నమస్కరించి త్రిపుండ్రమును ధరించాలి బుధుడు. ఈ మహేశ్వర వ్రతము సర్వవేదములలో చెప్పబడింది (48) ముక్తి కాములైన నరులు దీనిని సేవించాలి తిరిగి వారికి పుట్టుక ఉండదు. భస్మంతో శాస్త్ర ప్రకారము త్రిపుండ్రాన్ని ఎవరు ధరిస్తారో (49) బ్రహ్మచారి, గృహస్థు, వనస్థుడు, యతికాని, మహాపాతక సంఘాతముల నుండి, ఉపపాతకముల నుండి ముక్తులౌతారు (50).

మూ || తథాన్యైఃక్షత్రవిట్‌శూద్రస్త్రీగోహత్యాదిపాతకైః | వీరహత్యాశ్వహత్యాభ్యాంముచ్యతేనాత్రసంశయః || 51 ||

అమంత్రేణా పియః కుర్యాత్‌ దజ్ఞాత్వా మహిమోన్నతిం | త్రిపుండ్రం ఫాలపటలేముచ్యతే సర్వపాతకైః || 52 ||

పరద్రవ్యాపహరణం వరదారాభిమర్శనం | పరనిందా పరక్షేత్రహరణం పరపీడనం || 53 ||

సస్యారామాది హరణం గృహదా హాదికర్మచ | అసత్యవాదంపైశున్యం పారుష్యం వేద విక్రయః

కూటసాక్ష్యం వత్రత్యాగః కైతవంనీచ సేవనం || 54 ||

గోభూహిరణ్య మహిషీ తిలకంబలవాససాం | అన్నధాన్య జలాదీనాం నీచే భ్యశ్చ పరిగ్రహః || 55 ||

దాసీవేశ్యా భుజంగేషు వృషలీషున టీషుచ | రజస్వలాసు కన్యాసు విధవానుచ సంగమః || 56 ||

మాంసచర్మ రసాదీనాం రవణస్యచ విక్రయః | ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధానిచ || 57 ||

సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చధారణాత్‌ | శివద్రవ్యా పహరణం శివనిందాచ కుత్రచిత్‌ || 58 ||

నిందాచ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్నశుధ్యతి | రుద్రాక్షాయస్య గాత్రేషు లలాటే చత్రిపుండ్రకం || 59 ||

నచాండాలో7పి సంపూజ్యః సర్వవర్ణోత్తమోభ##వేత్‌ | యాని తీర్థానిలోకే7స్మిన్‌గంగాద్యాఃసరితశ్చయాః || 60 ||

స్నాతో భవతి సర్వత్ర లలాటేయస్త్రి పుంద్రధృక్‌ | సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురః సరాః || 61 ||

తధాన్యే కోటి శోమంత్రాః శైవాః కైవల్యహెతవః | తేసర్వేయేన జప్తాః స్యుఃయోభిభర్తి త్రిపుండ్రకం || 62 ||

సహస్రం పూర్వజాతానాం సహస్రంచజనిష్యతాం | నృవం శజానాం మర్త్యానాం ఉద్ధరేద్యస్త్రి పుండ్రధృక్‌ || 63 ||

ఇహభుక్త్వాఖిలాన్‌ భోగాన్‌ దీర్ఘాయుః వ్యాధి వర్ణితః | జీవితాంతేచ మరణం సుఖేనైవ ప్రపద్యతే || 64 ||

అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యం వపుఃశుభం | దివ్యం విమాన మారుహ్య దివ్యస్త్రీ శతసేవితః || 65 ||

విద్యాధరాణాం సిద్ధానాం గంధర్వాణాం మహౌజసాం | ఇంద్రాది లోకపాలానాం లోకేషుచ యథాక్రమం || 66 ||

తా || అట్లాగే ఇతరమైన క్షత్రవిట్‌ శూద్రస్త్రీ గోహత్యాది పాతకముల నుండి వీరహత్య, అశ్వహత్యాది పాతకముల నుండి ముక్తుడౌతాడు. అనుమానంలేదు (51) మంత్రం లేకుండ కూడా ఎవరు ఉన్నతమైన మహత్తును తెలుసుకోకుండా కూడా ఆచరిస్తారో ఫాలభాగమందు త్రిపుండ్రమును ధరిస్తారో వారు సర్వ పాపముల నుండి ముక్తులౌతారు (52) పర ద్రవ్య అపహరణము, పరదార స్పర్శ పరనింద, పరక్షేత్ర హరణము, పరపీడనము (53) సస్య ఆరామాదిహరణము, గృహదాహాదికర్మ, అసత్యవాదము, పిశునత, పారుష్యము, వేదవిక్రయము, కూటసాక్ష్యము, వ్రత త్యాగము,కైతవము, నీచసేవ (54) గోభూహిరణ్యమహిషి(బఱ్ఱ) నువ్వులు, కంబలము, వస్త్రములు, అన్న, ధాన్య, జలాదులు నీచుల నుండి గ్రహించటం (55) దాసి, వేశ్య విటురాలు, శూద్రస్త్రీ, నటి, రజస్వల, కన్య, విధవ, వీరితో సంగమము (56) మాంస చర్మరసాదుల విక్రయముల వణ విక్రయము ఈ విధంగా ఇవి మొదలుగా అసంఖ్యాక పాపములు రకరకములైనవి ((57) ఇవన్ని త్రిపుండ్ర ధారణ వల్ల వెంటనే నశిస్తాయి. శివ ద్రవ్యాపహరణము,శివనింద ఎక్కడైనా (58) శివ భక్తుల నింద ప్రాయశ్చిత్తములతో శుద్ధి నందదు. ఎవని కంఠమందు రుద్రాక్షమాల లలాటమందు త్రిపుండ్రకము (59) ఉంటే ఆతడు చండాలుడైనా సర్వవర్ణోత్తముడు పూజించతగిన వాడౌతాడు. ఈలోకంలో ఎన్నితీర్థాలున్నాయో, గంగాది ఎన్ని నదులున్నాయో (60) వాటన్నిట స్నానంచేసిన వాడౌతాడు. నొసట త్రిపుండ్రధారణ చేసినవాడు. పంచాక్షరముమొదలుగా సప్తకోటిమహామంత్రములు (61) అట్లాగే ఇతరమైన కోట్లకొలదిశివమంత్రాలు కైవల్యహెతువులు. వాటన్నింటిని జపించిన వారౌతారు. ఎవరుత్రిపుండ్రకాన్ని ధరిస్తారో (62) పూర్వమందు జన్మించిన వేయి మందిని, పుట్టబోయే వేయిమందిని తన వంశంలో పుట్టిన నరులను త్రిపుండ్రాధారి ఉద్ధరిస్తాడు (63) ఇక్కడ అన్ని భోగాలను అనుభవించి దీర్ఘాయువు గలవాడై, వ్యాధి వర్ణితుడై జీవిత అంతమందు మరణాన్ని సుఖంగా పొందుతాడు (64) అష్టైశ్వర్యములతో గుణములతో కూడిన శుభ##మైన దివ్య శరీరాన్ని పొంది, దివ్యవిమానాన్ని అధిరోహించి, దివ్యస్త్రీ శతములతో సేవించబడుతూ (65) విద్యాధరుల, సిద్ధుల, గంధర్వుల, మహౌజస్సు కల ఇంద్రాది లోకపాలుర లోకములందు యథా క్రమముగా భోగములు అనుభవించి (66). మూ || భుక్త్వా భోగాన్‌ సువిపులాన్‌ప్రజేశానాంపురేషుచ|బ్రహ్మణఃపదమాసాద్యతత్రకల్పశతంరమేత్‌ || 67 ||

విష్ణోర్లోకే చరమతే యావద్ర్బహ్మ శతత్రయం || 68 ||

శివలోకంతతః ప్రాప్యరమతే కాలమక్షయం | శివసాయుజ్య మాప్నోతి నసభూయో7భిజాయతే || 69 ||

సర్వోపనిషదాం సారం సమాలోచ్యముహుర్ముహుః ఇదమేవహినిర్జీతం పరంశ్రేయస్త్రి పుండ్రకం || 70 ||

ఏతత్త్రిపుండ్రమాహాత్మ్యంసమాసాత్కథితం మయా|రహస్యంసర్వబూతానాంగోపనీయమిదం త్వయా || 71 ||

ఇత్యుక్త్వా భగవాన్‌ రుద్రః తత్రైవాంతర ధీయత|సనత్కుమారో7పిమునిః జగామ బ్రహ్మణః పదం || 72 ||

తవాపి భస్మ సంపర్కాత్‌ సంజాతా విమలామతిః త్వమపి శ్రద్ధయా పుణ్యం ధారయస్వత్రిపుండ్రకం || 73 ||

సూత ఉవాచ -

ఇత్యుక్తా వామదేవస్తు శివయోగీ మహాతపాః | అభిమంత్ర్యదదౌ భస్మఘోరాయబ్రహ్మరక్షసే || 74 ||

తేనాసౌఫాల పటలే చక్రేతి ర్యక్త్రిపుండ్రకం | బ్రహ్మరాక్షసతాం సద్యోజహౌత్యసాసుభావతః || 75 ||

సబభౌ సూర్య సంకాశః తేజో మండల మండితః | దివ్యావయవరూపైశ్చ దివ్యమాల్యాంబరోజ్జ్వలః || 76 ||

భక్త్వా ప్రదక్షిణీ కృత్య తంగురుం శివయోగినం|దివ్యం విమాన మారుహ్య పుణ్యలోకాన్‌ జగామనః || 77 ||

వామదేవో మాహాయోగీ దత్వాతసై#్మ పరాంగతిం | చచారలోకే గూఢాత్మా సాక్షాదివ శివః స్వయం || 78 ||

య ఏతద్భస్మ మాహాత్మ్య ంత్రిపుండ్రం శృణుయాన్నరః | శ్రావయే ద్వాపఠేద్వాపి సహియాతివరాంగతిం || 79 ||

కథయతి శివ కీర్తిం సంనృతే ర్ముక్తి హెతుం ప్రణమతి శివయోగి ధ్యేయ మీ శాంఘ్రిపద్మం

రచయతి శివభక్తో ద్భాసి ఫాలేత్రి పుండ్రం నపున రిహజసన్యా గర్భవాసం భ##జేత్సః 80 ||

ఇతి శ్రీస్కాందమహాపురాణ ఏకాశీతి సాహస్ర్యం సంహితా యాంతృతీయే బ్రహ్మోత్తరఖండే భస్మమాహాత్మ్య కధనం నామ షోడశో7ధ్యాయః || 16 ||

తా || ప్రజేశుల పురములందు విపులంగా భోగములనుభవించి బ్రహ్మపదవిని పొంది అక్కడ కల్పములు. ఆనందిస్తాడు (67) మూడువందల సంవత్సరాలు బ్రహ్మకల్పముల వరకు విష్ణలోకమందు రమిస్తాడు (68) పిదవశివ లోకానికిచేరి అక్షయకాలము అక్కడరమిస్తాడు. శివసాయుజ్యాన్నిపొందుతాడు. ఆతడు తిరిగి జన్మనెత్తడు (69) సర్వఉపనిషత్తుల సారమును మాటిమాటికి ఆలోచించి ఇదే త్రిపుండ్రకమే పరమశ్రేయమనినిర్ణయించబడింది (70) ఈ త్రిపుండ్ర మాహాత్మ్యాన్ని నేను క్లుప్తంగా చెప్పాను. సర్వప్రాణులకు రహస్యమైనది. దీనినినీవుదాచాలి (71) అని పలికి భగవాన్‌ రుద్రుడు అక్కడే అదృశ్యమాయ్యడు సనత్కుమారమునికూడా బ్రహ్మపదమునకు చేరాడు (72) భస్మసంపర్కం వల్ల నీకు గూడ విమలమైన బుద్ధికలిగింది. నీవుకూడా శ్రద్ధతో పుణ్‌యప్రదమైన త్రిపుండ్రాన్ని ధరించు. (73) సూతుని వచనము - అనిపలికి వామదేవుడు శివయోగి మహాతపస్సంపన్నుడు భస్మాన్ని అభిమంత్రించి ఘోరుడైన బ్రహ్మరాక్షసునకిచ్చాడు (74) దానితో ఆతడు నొసటియందుఅడ్డముగా త్రిపుండ్రకమును ధరించాడు. దానిశక్తి వల్ల వెంటనే బ్రహ్మరాక్షసత్వాన్ని వదిలాడు. (75) తేజోమండలముతో ప్రకాశిస్తూసూర్యసంకాశుడైనాడు. దివ్యఅవయవములు, రూపము, దివ్యమాలలు, వస్త్రములు,వీనితో ఉజ్జ్వలుడై (76) ఆగురువైన శివయోగికిభక్తితో ప్రదక్షిణంచేసి దివ్యవిమానానని అధిరోహించి ఆతడు పుణ్యలోకములకు వెళ్ళాడు. (77) మహాయోగి వామదేవుడు ఆతనికి పరమగతినిచ్చి గూఢ ఆత్మ కలవాడై లోకంలో సాక్షాత్తు స్వయంగా శివునివలె తిరిగాడు. (78) ఎవరు ఈ భస్మమాహాత్మ్యాన్ని త్రిపుండ్రమును వింటారో వినిపిస్తారో చదువుతారో ఆనరులు పరమైన గతికిచేరుతారు. (79) సంసారం నుండి ముక్తి హెతువైన శివకీర్తిని ఎవరు చెబుతారో, శివయోగులు ధ్యానించే శివపాద పద్మములకు ఎవరు నమస్కరిస్తారో శివభక్తులవలె భాసిస్తూ ఎవరు ఫాలమందు త్రిపుండ్రాన్ని ధరిస్తారో వారు తిరిగి ఇక్కడ జననీ గర్భవాసాన్ని పొందరు (80) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు భస్మ మాహాత్మ్యాన్ని చెప్పటమనేది పదహారవ అధ్యాయము || 116 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters