Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునేడవ అధ్యాయము

మూ|| ఋషయ ఊచుః -

వేద వేదాంగతత్వజ్ఞైః గురుభిర్ర్బహ్మవాదిభిః | నృణాం కృతో పదేశానాం సద్యస్సిద్ధిర్హిజాయతే || 1 ||

అధాన్య జన సామాన్యైః గురుభిః నీతికోవిదైః | నృణాం కృతో వదేశానాం సిద్ధిర్భవతికీ దృశీ || 2 ||

సూత ఉవాచ -

శ్రద్ధైవ సర్వధర్మస్య చాతీవహిత కారిణీ | శ్రద్ధయైవ నృణాం సిద్ధిః జాయతే లోయయోర్ద్వయోః || 3 ||

శ్రద్ధయా భజతః పుంసః శిలాపి ఫలదాయినీ | మూర్థో7పి పూజితో భక్త్యా గురుర్భవతి సిద్ధిదః || 4 ||

శ్రద్ధయా పఠితో మంత్రస్త్వ బద్ధోపి ఫలప్రదః | శ్రద్ధయా పూజితో దేవో నీ చస్యాపి ఫలప్రదః || 5 ||

అశ్రద్ధయా కృతా పూజా దానం యజ్ఞస్తపోవ్రతం | సర్వం నిష్ఫలతాం యాతి పుష్పం వం ధ్యస్తరోరివ || 6 ||

సర్వత్ర సంశయావిష్టః శ్రద్ధాహీనో7తిచంచలః | పరమార్థాత్పరిభ్రష్టః సంసృతే ర్నహిముచ్యతే || 7 ||

మంత్రే తీర్థే ద్విజేదేవే దైవజ్ఞే భేషజే గురౌ | యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తా దృశీ || 8 ||

అతో భావమయం విశ్వం పుణ్యం పాపంచభావతః | తే ఉభే భావహీనస్యన భ##వేతాం కదాచన || 9 ||

అత్రేదం పరమాశ్చర్య మాఖ్యాన మనువర్ణ్యతే | అశ్రద్ధా సర్వ మర్త్యానాం యేన సద్యో నివర్తతే || 10 ||

ఆ సీత్పాంచాల రాజస్య సింహకేతురితిశ్రుతః | పుత్రః సర్వగుణోపేతః క్షాత్ర ధర్మరతః సదా || 11 ||

స ఏకదాకతివయైః భృత్యై ర్యుక్తోమహాబలః | జగామమృగయాహెతోః బహుసత్వాన్వితం వనం || 12 ||

తద్‌భృత్యఃశబరః కశ్చిత్‌ విచరన్‌ మృగయాంవనే | దదర్శ జీర్ణం స్ఫుటితం పతితం దేవతాలయం || 13 ||

తత్రాపశ్యద్భిన్నం పీఠం పతితం స్థండిలోపరి | శివలింగం ఋజుం సూక్ష్మం మూర్తం భాగ్యమివాత్మనః || 14 ||

నసమాదాయవేగేన పూర్వకర్మ ప్రచోదితః | తసై#్మ సందర్శయా మాస రాజపుత్రాయ ధీమతే || 15 ||

తా || ఋషులిట్టన్నారు - వేదవేదాంగ తత్వజ్ఞులైన గురువులతో బ్రహ్మవాదులతో ఉపదేశంపొందిన నరులు వెంటనే సిద్ధిని పొందుతారు. (1) ఇతర జనుల వలె సామాన్యులైన గురువులతో నీతికోవిదులతో ఉపదేశం పొందిన నరులకు ఎటువంటి సిద్ధి లభిస్తుంది. (2) అనగాసూతులిట్లన్నారు. శ్రద్ధయే సర్వధర్మములకు ఎక్కువ హితం చేసేది శ్రద్ధవల్ల నే నరులకు రెండు లోకములలో సిద్ధికలుగుతుంది (3) శ్రద్ధతో భజించేవారికి శిల కూడా ఫలితాన్నిస్తుంది. భక్తితో మూర్ఖుడు పూజించినా గురువు సిద్ధిని కల్గిస్తాడు (4) శ్రద్ధతో మంత్రాన్ని చదివితే అది అబద్ధమైనా (బద్ధంకానిది) ఫలాన్నిస్తుంది. శ్రద్ధతో దేవుని పూజిస్తే ఆతడు నీచునకు కూడా ఫలమిస్తాడు. (5) అశ్రద్ధతో చేసిన పూజ దానము యజ్ఞము, తపస్సు, వ్రతము, నిష్ఫలమౌతాయి అంతా, వంధ్యవృక్షంయొక్క పూవువలె (6) అంతటా సంశయం గలవాడై శ్రద్ధా హీనుడై అతి చంచలుడై పరమార్థం నుండి భ్రష్టుడైన వాడు సంసారం నుండి ముక్తినందడు (7) మంత్రము, తీర్థము, ద్విజుడు, దేవుడు, దైవజ్ఞుడు, మందు, గురువు వీరి యందు ఎటువంటి భావన ఉంటే అటువంటి ఫలితం కల్గుతుంది (8) అందువల్ల ప్రపంచమంతా భావంతో నిండింది. పుణ్యము, పాపము అన్ని భావంను అనుసరించే భావహీనునకు ఆ రెండు ఎప్పుడూ కలుగవు. (9) ఇక్కడ పరమ ఆశ్చర్యకరమైన కథను వర్ణిస్తున్నాను. సర్వ మర్త్యులకు అశ్రద్ధ దేని నుండి (పుణ్యం) వెంట నేని వర్తింపచేస్తుందో (10) పాంచాల రాజునకు సింహకేతువు అని ప్రసిద్ధుడైన పుత్రుడు ఉండేవాడు. సర్వ గుణములు కలవాడు. ఎప్పుడూ క్షత్ర ధర్మాన్ని అనుసరించేవాడు (11) ఆతడొకసారి కొద్ది మంది భృత్యులతో కలిసి ఆ మహాబలుడు వేటకై అనేక మృగములతో కూడిన అడవికి వెళ్ళాడు (12) ఆతని భృత్యుడు ఒక శబరుడు వేటకై అడవిలో తిరుగుతూ జీర్ణమైన, చీలిన పతితమైన దేవాలయాన్ని చూచాడు (13) అక్కడ స్థండిలంపైన పడిభిన్నమైన పీఠమును చూచాడు ఋజువైన శివలింగమును సూక్ష్మమైన దానిని తన భాగ్యమే మూర్తీ భవించినట్లుగా ఉన్న దానిని చూచాడు (14) ఆతడు దాన్ని తీసుకొని పూర్వకర్మప్రేరితుడై వేగంగా వచ్చి ధీమంతుడైన ఆ రాజపుత్రునకు చూపాడు (15).

మూ || వశ్యేదంరుచిరంలింగమయాదృష్టమిహప్రభో|తదేతత్పూజయిష్యామియధావిభవమాదరాత్‌ || 16 ||

అస్యపూజావిధిం బ్రూహి యథాదేవో మహెశ్వరః | అమంత్రజ్ఞైశ్చ మంత్రజ్ఞైః ప్రీతో భవతి పూజితః || 17 ||

ఇతితేన నిషాదేన పృష్టః పార్థివ నందనః | ప్రత్యువాచ ప్రహసైన్యం పరిహాస విచక్షణః || 18 ||

సంకల్పేన సదాకుర్యాత్‌ అభిషేకం నవాంభసా | ఉపవేశ్యాననే శుద్ధేశుభైర్గంధాక్ష తైర్నవైః

వన్యైః పత్రైశ్చ కుసుమైః ధూపైః దీపైశ్చ పూజయేత్‌ || 19 ||

చితాభస్మోపహారంచ ప్రథమం పరికల్పయేత్‌| ఆత్మోవభోగ్యే నాన్నే ననైవేద్యం కల్పయేద్బుధః || 20 ||

పునశ్చధూపదీపాదీన్‌ ఉపచారాన్‌ ప్రకల్పయేత్‌ | నృత్యవాదిత్ర గీతాదీన్‌ యథా వత్పరి కల్పయేత్‌ || 21 ||

నమస్కృత్వాతు విధివత్‌ ప్రసాదం ధారయేద్భుధః | ఏష సాధారణః ప్రోక్తః శివపూజా విధిస్తవ || 22 ||

చితా భస్మోపహారేణ సద్యస్తుష్యతి శంకరః || 23 ||

సూత ఉవాచ -

పరిహానరసేనేత్థం శాసితః స్వామినా7మునా | నచండకాఖ్యః శబరో మూర్ధ్నా జగ్రాహతద్వచః || 24 ||

తతః స్వభవనం ప్రాప్య లింగరూపం మహెశ్‌పరం | ప్రత్యహం పూజయామానచితాభస్మోపహారకృత్‌ || 25 ||

యచ్చాత్మనఃప్రియంవస్తు గంధపుష్పాక్ష తాదికం | నివేద్యశం భ##వేనిత్యం ఉపాయుక్తం తతః స్వయం || 26 ||

ఏవం మహెశ్వరం భక్త్యా సహవత్న్యాభ్య పూజయత్‌ | శబరః సుఖమాసాద్య నినాయకతిచిత్సమాః || 27 ||

ఏకదా శివపూజా యై ప్రవృత్తః శబరోత్తమః | సదదర్శచితా భస్మపాత్రే పూరిత మణ్వపి || 28 ||

అథాసౌ త్వరితో దూరమన్విష్యన్‌ పరితోభ్రమన్‌ | నలబ్థ వాంశ్చితా భస్మశ్రాంతో గృహమగాత్పునః || 29 ||

తత ఆహూయ పత్నీం స్వాం శబరో వాక్యమబ్రవీత్‌ | నలబ్‌ఋం మేచితాభస్మ కింకరో మివద ప్రియే || 30 ||

తా || ఓ ప్రభు ! ఈ అందమైన లింగాన్ని చూడు నేను దీనని ఇక్కడ చూచాను. దీనిని పూజిస్తాను, నాకున్నంతలో, ఆదరంగా (16) దీని పూజా విధానమేమిటో చెప్పు. దేవుడైన మహేశ్వరుడు మంత్రమెరిగిన వారితో, ఎరుగని వారితో పూజింపబడితే సంతోషించే ఆ పూజచెప్పు (17) అని అనిషాదుడు రాకుమారుని అడుగగా ఆతడు వీనిని చూచినవ్వి పరిహాసమెరిగినవాడై ఇట్లా చెప్పాడు. (18) సంకల్ప పూర్వకముగా ఎప్పుడూ కొత్త నీటితో అభిషేకం చేయాలి. శుద్ధమైన ఆసన మందు కూర్చొని శుభ##మైన గంధముతో కొత్త అక్షతలతో అడవి ఆకులు, పూలతో ధూదీపములతో పూజించాలి (19) చితాభస్మమును మొదట ఉపహారంగా కల్పించాలి. తాను అనుభవించ తగిన అన్నముతో బుధుడు నైవేద్యం కల్పించాలి. (20) పిదప ధూదీపాదులను ఉపచారములను కల్పించాలి. నృత్యము వాదిత్రము, గీతాదులను చెప్పిన ప్రకారం కల్పించాలి (21) విధి ప్రకారము నమస్కరించి బుధుడు ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది సాధారణమై శివపూజావిధి నీకు చెప్పాను. (22) చితాభస్మ ఉపహారంతో శివుడు వెంటనే సంతోషిస్తాడు (23) సూతులిట్లన్నారు - పరిహాసరసంతో ఈ విధంగా ఈ యజమానితో శాసింపబడి ఆ చండకుడనే శబరుడు ఆ మాటలను శిరసావహించాడు (24) పిదప తన ఇంటికి వచ్చి లింగరూప మహెశ్వరుని ప్రతిరోజు పూజించసాగాడు. చితాభస్మాన్ని ఉపహారంగా చేయసాగాడు. (25) తనకు ప్రియమైన గంధ పుష్ప అక్షతాదులను శంభునకు నివేదన చేసి నిత్యము ఆ పిదప, తానే ఉపయోగించేవాడు (26) ఇట్లా మహెశ్వరుని భక్తితో భార్యతో కూడి పూజించసాగాడు. శబరుడు సుఖాన్ని పొంది కొన్ని సంవత్సరాలు గడిపాడు (27) ఒకసారి శబరోత్తముడు శివపూజకూ ఆరంభించాడు. పాత్రమందు నింపిన చితాభస్మము ఏ కొంచం కూడా కన్పించలేదు. (28) ఇక ఆతడు తొందరగా దూరంగా వెతుకుతూ, అంతటా తిరుగుతూ చితా భస్మాన్ని పొందలేక పోయాడు. అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్ళాడు (29) పిదప తన భార్యను పిలిచి శబరుడు ఇట్లా అన్నాడు. నాకు చితా భస్మం లభించలేదు. ఏమిచేయాలో చెప్పు ఓ ప్రియ! (30).

మూ || శివపూజాంతరాయోమే జాతోద్యబత పాప్మనః | పూజాం వినాక్షణ మపినాహం జీవితుముత్సహె || 31 ||

ఉపాయం నా త్రపశ్యామి పూజోపకరణ హతే | నగురోశ్చ విహన్యేత శాసనంస కలార్థదం || 32 ||

ఇతి వ్యాకులితం దృష్ట్వా భర్తారం శబరాంగనా | ప్రత్యభాషత మాభైస్త్వముపాయం ప్రవదామితే || 33 ||

ఇదమే వగృహం జగ్థ్వా బహుకాలోప బృంహితం | అహమగ్నిం ప్రవేక్ష్యామి చితాభస్మభ##వేత్తతః || 34 ||

శబర ఉవాచ -

ధర్మార్థ కామమోక్షాణాం దేహః పరమసాధనం | కధంత్యజసితం దేహంసుఖార్థం నవ¸°వనం || 35 ||

అధునాత్వస పత్యాత్వమ భుక్త విషయానవా | భోగయోగ్యమి మందేహం కథం దగ్థుమిహెచ్ఛసి || 36 ||

శబర్యువాచ -

ఏతావదేవ సాఫల్యం జీవితస్య చ జన్మనః | పరార్థేయస్త్యజేత్‌ ప్రాణాన్‌ శివార్థేకిముతస్వయం || 37 ||

కింసుతప్తంతపోఘోరం కింవాదత్తం మయాపురా | కింవార్చనంకృతం శంభోః పూర్వజన్మశతాంతర || 38 ||

కింవాపుణ్యం మమపితుః కావామాతుఃకృతార్థతా |యచ్ఛివానే సమిద్ధే7గ్నౌ త్యజామ్యే తత్కలేబరం || 39 ||

ఇత్థం స్థిరమతిం దృష్ట్వా తస్యా భక్తించశంకరే | తథేతి దృఢ సంకల్పః శబరః ప్రత్య పూజయత్‌ || 40 ||

సా భర్తారమనుప్రాప్య స్నాత్వా శుచిరలంకృతా | గృహమాదీప్యతం వహ్నిం భక్త్యా చక్రే ప్రదక్షిణం || 41 ||

నమస్కృత్వాత్మగురవే ధ్యాత్వా హృది సదాశివం | అగ్ని ప్రవేశాభిముఖీ కృతాంజలిరి దంజగౌ || 42 ||

శబర్యువాచ -

పుష్పాణి సంతుతవదేవ మమేంద్రియాణి ధూపో7 గురు ర్వపురిదం హృదయం ప్రదీపః |

ప్రాణాహ వీంషి కరణానితవాక్ష తాశ్చ పూజా ఫలం వ్రజతుసాం వ్రతమేష జీవః || 43 ||

వాంఛామినా హమపి సర్వధనాది పత్యంస స్వర్గ భూమి మచలాంన వదం విధాతుః

భూయో భవామియది జన్మ నిజన్మనిస్యాం త్వత్వాద పంకజల నస్మకరంద భృంగీ || 44 ||

జన్మాని సంతు మమదేవ శతాధికాని మాయానమే విశతుచిత్తమ బోధహెతుః |

కించిత్‌ క్షణార్థమ పితేచరణార విందాన్నా పైతుమే హృదయమీశనమో నమస్తే || 45 ||

తా || ఈ వేళ నాకు పాపాత్ముడనైనందుకు శివపూజకు అంతరాయం ఏర్పడింది. పూజలేకుండా క్షణం కూడా నేను జీవించదలుచు కోలేదు (31) పూజ ఉపకరణం లభించకపోతే ఉపాయమేమిటో నాకు తెలియదు. సకల అర్థములనిచ్చే గురువు ఆజ్ఞ తప్పి పోగూడదు (32) అని వ్యాకులితుడైన భర్తను చూచి శబరాంగన ఇట్లా అంది. భయపడొద్దు నీవు. నీకు ఉపాయం చెప్తాను (33) చాలా కాలం నుండి ఉన్న ఈ గృహాన్ని తగులబెట్టి నేను అగ్నిలో ప్రవేశిస్తాను. అప్పుడు చితా భస్మమౌతుంది (34) శబరుడిట్లన్నాడు. ధర్మార్థకామమోక్షములకు దేహము పరమ సాధనము. సుఖార్థమైన నవ¸°వనమైన ఆదేహాన్ని ఎట్లా విడుస్తావు. (35) ఇప్పుడునీకు సంతానంలేదు విషయములను అనుభవించలేదు. ఈ శరీరము అనుభవములకు తగినది ఇట్టి దేహాన్ని తగుల బెట్టడానికి ఎట్లా ఇష్టపడుతున్నావు (36) అనగా శబరి ఇట్లా అంది. జీవితమునకు జన్మకు ఇదే సాఫల్యము, పరుల కొరకు ఎవడు ప్రాణాన్ని వదులుతాడో ప్వయంగా శివుని కొరకై వదిలితే చెప్పేదేముంది (37) ఘోరమైన తపస్సు చేశామా. పూర్వం నేనేమైనా దానం చేశానా. శివపూజ ఏమైనా చేశానా నూర్ల పూర్వజన్మలలో (38) నా తండ్రి పుణ్యమేమో. నా తల్లి కృతార్థ తపమో శివుని కొరకు సమిధనై అగ్నిలో ఈ శరీరాన్ని వదులుతాను (39) అని ఆమె స్థిరమైన బుద్ధిని చూచి శంకరుని యందు ఆమెకు గల భక్తిని చూచి అట్లాగే అని పలికిదృఢ సంకల్పంతో శబరుడు పూజించాడు (40) ఆమె భర్తను చేరి స్నానం చేసి హృదయంలో అలంకరించుకొని ఇంటిని తగులబెట్టి ఆ అగ్నికి భక్తితో ప్రదక్షిణం చేసింది (41) తన గురువు నకు నమస్కారం చేసి హృదయంలో సదాశివుని ధ్యానించి, అగ్ని ప్రవేశమునకు అభిముఖియై చేతులు జోడించి ఇట్లా పలికింది. (42) శబరి వచనము - నా ఇంద్రియములు నీకు పూలుకాని. ఓ దేవ! ఈ శరీరము నీకు అగరు ధూపంకాని నా హృదయం నీకు దీపం కాని నా ప్రాణములు హవిన్సు కాని కరణములు నీకు అక్షతలు కాని ఈ జీవుడు ఇప్పుడు పూజా ఫలంకాని (43) నాకు సర్వధనాధి పత్యమువద్దు. స్వర్గభూమి పదము వద్దు. విధాత యొక్క అచలమైన పదము వద్దు. మళ్ళీపుడ్తే జన్మజన్మలలోనేను నీ పాద పద్మములందుండే మకరంద మునా స్వాదించే తుమ్మెదనుకావాలి (44) నూర్లకన్న ఎక్కువగా నాకు జన్మలు కలుగని ఓ దేవ! నా చిత్తమందుఆబోధహెతువైన మాయ కలుగొద్దు. క్షణంలో సగంకాలం కూడా నీ చరణార విందముల నుండి నా హృదయము. తొలగిపోరాదు. ఓ ఈశ నమస్కారము, నీకు నమస్కారము (45).

మూ || ఇతి ప్రాసాద్యదేవేశం భవరీదృఢ నిశ్చయా | వివేక జ్వలితం వహ్నిం భస్మసాదభవత్‌ క్షణాత్‌ || 46 ||

శబరోపిచత ద్భన్మ యత్నేన పరిగృహ్యనః | చక్రేదగ్థగృహూపాంతే శివపూజాం సమాహితః || 47 ||

అథ సస్మార పూజాంతే ప్రసాద గ్రహణోచితాం|దయితాంనిత్యమాయాంతీ ప్రాంజలిం వినయాన్వితాం || 48 ||

స్మృతమాత్రాం తదాపశ్య దాగతాం పృష్ఠతః స్థితాం | పూర్వేణావయవేనైవ భక్తినమ్రాం శుచిస్మితాం || 49 ||

తాంవీక్ష్యశబరః పత్నీం పూర్వవత్‌ ప్రాంజలింస్థితాం | భస్మావశేషిత గృహం యథా పూర్వమవస్థితం || 50 ||

అగ్నిర్దహతి తేజోభిః సూర్యో దహతి రశ్మిభిః | రాజాదహతి దండేన బ్రాహ్మణో మనసాదహెత్‌ || 51 ||

కిమయంస్వప్నాహోస్విత్‌కింవామాయాభ్రమాత్మికా | ఇతివిస్యయసంభ్రాంతఃతంభూయః పర్యపృచ్ఛత || 52 ||

అపిత్వంచ కథంప్రాప్తా భస్మభూతాసి పాపకే | దగ్థంచ భవనం భూయః కథంపూర్వపదాస్థితం || 53 ||

శబర్యువాచ -

యదాగృహం సముద్దిశ్య ప్రవిష్టాహం హుతాశ##నే | తదాత్మానం నజానామిన పశ్యామిహుతాశనం || 54 ||

నతావలేశోప్యాసీన్మే ప్రవిష్టాయాఇవోదకం | సుషుప్తే వక్షణార్ధెన ప్రబుద్ధాస్మిపునః క్షణాత్‌ || 55 ||

తావద్భవనమద్రాక్షం అదగ్థమివసుస్థితం | అధునాదేవపూజాంతే ప్రసాదం లబ్థుమాగతా || 56 ||

ఏవం పరస్పరం ప్రేవ్ణూదం సంత్యోర్భాషమాణయోః | ప్రాదురాసీత్త యోరగ్రేవిమానందివ్యమద్భుతం || 57 ||

తస్మిన్‌ విమానే శత చంద్ర భాస్వరే చత్వార ఈశా సుచరాః పురః సరాః |

హస్తే గృహీత్వా ధనిషా దదంపతీ ఆరోపాయామానురముక్త విగ్రహౌ || 58 ||

తయోర్నిషాదదంపత్యోః తత్‌క్షణాదేవతద్వపుః | శివదూతకరస్పర్శాత్‌ తత్సారూప్యమవావహ || 59 ||

తస్మాచ్ఛ్రద్ధైవ సర్వేషు విధేయా పుణ్యకర్మసు | నీచోపి శబరః ప్రాప శ్రద్ధయా యోగినాంగితం || 60 ||

కింజన్మనా సకల వర్ణ జనోత్తమేవ కింవిద్య యాసకల శాస్త్ర విచారవత్యా |

యస్యాస్తి చేతసి సదాపరమేశ భక్తిః కో7న్యస్త తస్త్రి భువనే పురుషోస్తి ధన్యః || 61 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే భస్మమాహాత్మ్య వర్ణనం నామ సప్తదశోధ్యాయుః || 17 ||

తా || అని దేవేశుని ప్రార్థించి శబరి దృఢ నిశ్యయంతో మండుతున్న అగ్నిలో ప్రవేశించింది. క్షణంలో భస్మమై పోయింది (46) శబరుడు ఆ భస్మాన్ని ప్రయత్న పూర్వకముగా గ్రహించి కాలిపోయిన ఇంటి సమీపమందు చక్కగా శివపూజచేశాడు (47) ఇక పూజాంతమందు ప్రసాద గ్రహణమునకు తగిన, రోజువస్తున్న, చేతులు జోడించిన వినయముగల భార్యను స్మరించాడు. (48) స్మరించినంతలో వచ్చిన వెనుక నిల్చున్న ఆమెను చూచాడు. పూర్వపు అవయవములతోనే భక్తినమ్రురాలై స్వచ్ఛంగా నవ్వుతున్నదానిని (49) ఆమెను శబరుడు వెనుకటిలా చేతులు జోడించి ఉన్న భార్యను చూచి, భస్మంగా మిగిలిన ఇల్లు వెనుకటిలా ఉండటం చూచి (50) అగ్ని తేజస్సుతో దహిస్తుంది. సూర్యుడు కిరణాలతో దహిస్తాడు. రాజు దండంతో దహిస్తాడు. బ్రాహ్మణుడు మనస్సుతో దహిస్తాడు (51) ఇది కలాకాక మాయా భ్రమనా అని విస్మయ సంభ్రాంతుడై ఆమెను తిరిగి అడిగాడు (52) నీవెట్లా వచ్చావు. అగ్నిలో బూడిదవైనావుకదా. ఇల్లు కాలిపోయింది. ఎట్లా పూర్వంవలె తిరిగి నిలిచింది (53) అనగా శబరి ఇట్లా అంది. ఇంటిని మండించి అగ్నిలో నేను ప్రవేశించినపుడు నన్ను నేనెరుగను. అగ్నిని చూడలేదు (54) ఏ కొంచెం తాపము కలుగలేదు. నీటిలో ప్రవేశించినట్లనిపించింది. సుషుప్తునివలె అరక్షణంలో తిరిగి క్షణంలో మేల్కొన్నాను. (55) ఇంతలో భవనము తగలబడకుండా బాగానే ఉన్నట్లు చూచాను. ఇప్పుడు దేవపూజాంతమందు ప్రసాదం తీసుకోవటానికి వచ్చాను (56) ఈ విధముగా పరస్పరము ప్రేమతో దంపతులు మాట్లాడుకుంటుండగా వారి ఎదుట అద్భుతమైన దేవ విమానము ప్రత్యక్షమైనది (57) నూరు చంద్రునివలె వెలిగే ఆ విమానమందు నలుగురు ఈశ అనుచరులు ముందున్నారు. నిషాద దంపతులను చేతితో తీసుకొని రూపంవదలని వారిని విమానంపై ఉంచారు (58) ఆనిషాదదంపతుల అశరీరము ఆక్షణంలోనే శివదూతల కరస్పర్శవల్ల వారి సారూప్యాన్ని పొందింది (59) అందువల్ల పుణ్యకర్మలన్నింటిలో శ్రద్ధను ఆచరించాలి. నీచుడైన శబరుడు కూడా శ్రద్ధతో యోగులరతిని పొందాడు. (60) సకల వర్ణ జనులలోని ఉత్తమమైన జన్మతో పనిలేదు. సకలశాస్త్ర విచారము కలిగిన విద్యతో పనిలేదు. ఎవని హృదయంలో ఎప్పుడూ పరమేశభక్తి ఉందో వానికన్న ధన్యుడైన పురుషుడు ముల్లోకములలో ఎవడున్నాడు (61) అని శ్రీ స్కాందే మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మోత్తర ఖండమందు భస్మ మాహాత్మ్య వర్ణనమనునది పదునేడవ అధ్యాయము || 17 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters