Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునాల్గవ అద్యాయము

మూll శ్రీసూత ఉవాచ-

స్నాత్వాత్వమృత వాప్యాంవైసే విత్వైకాంతరాఘవంl జితేంద్రియోసరః స్నాతుం బ్రహ్మకుండంతతో ప్రజేత్‌ ll 1 ll

సేతుమధ్యే మహాతీర్థం గంధమానద పర్వతేl బ్రహ్మకుండమితిఖ్యాతం సర్వదారిద్య్రభేషజం ll 2ll

విద్యతే బ్రహ్మహత్యానాం అయుతాయుతనాశనం l దర్శనం బ్రహ్మకుండన్య సర్వపాపౌఘనాశనం ll 3ll

కింతస్యబహుభిస్తీ ర్థెః కింతపోభిఃకిమధ్వరైఃl మహాదానైశ్చకింతస్య బ్రహ్మకుండ విలోకినః ll 4 ll

బ్రహ్మకుండే సకృత్‌ స్నానం వైకుంఠప్రాప్తి కారణం l బ్రహ్మకుండ సముద్భూత భస్మయేనధృతంద్విజాః ll 5ll

తస్యానుగా స్త్రయోదేవాః బ్రహ్మవిష్ణుమహేశ్వరా ః l బ్రహ్మకుండ సముద్భూత భస్మనా యస్త్రి పుండ్రకం ll 6 ll

కరోతి తస్యకైవల్యం కరస్థం నాత్ర సంశయః lతద్భస్మపరమాణుర్వాయోలలాటే ధృతోభ##వేత్‌ ll 7 ll

తావదేవాస్యముక్తిస్స్యాత్‌ నాత్రకార్యావిచారణా l తత్కుండ భస్మనామర్త్యః

కుర్యాదుద్దూలనంతుయః ll 8 ll

తస్యపుణ్య ఫలం పక్తుం శంకరోవేత్తి వానవా l బ్రహ్మంకుడ సముద్భూతం భస్మయోనైవధారయేత్‌ ll 9 ll

రౌరవేనరకేసో7యం పతే, దా చంద్రతారకం l ఉద్ధూలనం త్రిపుండ్రంవా బ్రహ్మకుండ స్థ భస్మనా ll 10 ll

నరాధమోనకుర్యాద్యః సుఖం నాస్యకదాచన l బ్రహ్మకుండ సముద్భూత భస్మ్బనిందారతస్తుయః ll 11 ll

ఉత్పత్తౌతస్యసాంకర్యమనుమేయం నివశ్చితా l బ్రహ్మకుండ ము%ుద్భూతం భ##సై#్మతల్లోక పావనం ll 12 ll

అన్యభస్మసయం యస్తున్యూనరు వాపక్తిమానవః ఉత్పత్తౌతస్య సాంకర్యమనువేయం విపశ్చితా ll 13 ll

బ్రహ్మకుండసమద్భూతే7ప్యస్మిన్‌ భస్మని జాగ్రతి l భస్మాంతరేణమనుజోధారయేద్యస్త్రి పుండ్రకం ll 14 ll

ఉత్పత్తౌ తస్యసాంకర్యం అనుమేయం నిపశ్చితాl కదాచిదపియోమర్త్యోభ##సై#్మతత్తునధారయేత్‌ ll 15ll

ఉత్పత్తౌ తస్య సాంకర్యమను మేయం విపశ్చితా lబ్రహ్మకుండ సముద్భూతం భస్మదద్యాత్‌ ద్విజాయముః ll 16 ll

చతురర్ణవపర్యంతాతేన దత్తావసుంధరా l సందేహో నాత్రకర్తవ్యః త్రిర్వాశపధయామ్యహం ll 17 ll

సత్యంసత్యం పునస్సత్యం ఉద్ధృత్యభుజముచ్యతే l బ్రహ్మకుడోద్భవం భస్మధారయధ్వం ద్విజోత్తమాః ll 18 ll

ఏతద్ధిపావనం భస్మబ్రహ్మ యజ్ఞసముద్భవం పురాహిభగవాన్‌ బ్రహ్మా సర్వలోకపితామహః ll 19 ll

సన్నిధౌ సర్వదేవానాం పర్వతే గంధమాదనే l ఈశశాపనివృత్యర్థం క్రతూన్‌ సర్వాన్‌ సమాతనోత్‌ ll 20 ll

విధాయవిధివత్‌ సర్వాన్‌ అధ్వరాన్‌ బహుదక్షిణాన్‌ l మముచే సహసాబ్రహ్మశంభుశాపాత్‌ ద్విజోత్తమాః ll 21 ll

తదేతత్తీర్థమాసాద్యస్నానం కుర్వంతియేనరాః l తేమహాదేవసాయుజ్యం ప్రాప్నువంతిన సంశయంః ll 22 ll

తా ll శ్రీనూతులిట్లనిరి - అమృతవాపి యందు స్నానం చేసి, ఏకాంతరాఘవుని సేవించి జితేంద్రియుడైన నరుడు స్నానం చేయటానికి తర్వాత బ్రహ్మకుండానికి వెళ్ళాలి (1) సేతుమధ్య మందు గంధమాదన పర్వతంలో మహాతీర్థము బ్రహ్మకుండమని ప్రసిద్ధమైది . అది అన్ని దరిద్రములకు ఔషధము వంటది (2)బ్రహ్మహత్యల పదికోట్ల పాపమును నశింప చేసేది. బ్రహ్మకుండ దర్‌శనము సమస్త పాపరాశిని నశింపచేసేది . (3)అనేక తీర్థ స్నానము, తపశ్చర్య, యజ్ఞములు, మహాదానములు వీటితో పనిలేదు. వీటన్నిటికన్న బ్రహ్మకుండదర్శనము గొప్పది. (4) బ్రహ్మకుండంలో ఒక్కసారి స్నానం చేయటం వైకుంఠప్రాప్తికి కారణమౌతుంది. బ్రహ్మకుండలంలోపుట్టిన భస్మాన్ని దరించిన వానిని (5)ముగ్గురు దేవతలు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అనుసరిస్తారు. బ్రహ్మకుండంలోని భస్మంతో త్రిపుండ్రధారణ (6) చేసిన వానికి కైవల్యము అరచేతి యందున్నట్టే అనుమానం లేదు . ఆ భస్మం యొక్క పరమఅణుభాగాన్నైనా నొసటధరించిన వారికి (7)వెంటనే ముక్తి లభిస్తుంది . దీన్ని విచారించవలసిన పనిలేదు. బ్రహ్మకుండ భస్మమునుపైన చల్లుకొన్ననరుని (8)పుణ్య ఫలము శంకరునికి గూడా తెలియునో తెలియదో బ్రహ్మకుండ మందు పుట్టిన భస్మమును ధరించని నరుడు (9) చంద్రుడు నక్షత్రములున్నంత కాలము రౌరవనరకమందు పడ్తాడు. బ్రహ్మకుండ భస్మాన్ని చల్లుకోవటమో త్రిపుండ్ర ధారణమో (10) చేయని నరుడు సుఖం పొందలేడు. బ్రహ్మకుండ భస్మాన్ని నిందిచిన నరుని (11) ఉత్పత్తిలో సాంకర్యాన్ని పండితులు అనుమానించాలి .బ్రహ్మకుండమందలి భస్మము లోకములను పవిత్రం చేసేది. (12) ఇతర భస్మములతో ఇది సమానమైనదనో తక్కువైనదనో చెప్పే నరుని ఉత్పత్తి (పుట్టుక) విషయంలో పండితుడు సాంకర్యమును అనుమానించాలి (13)బ్రహ్మకుండమందు కలిగిన ఈ భస్మము ఉండగా, వేరే భస్మంతో త్రిపుండ్ర ముధరించే మనుజుని (14) ఉత్పత్తి విషయంలో పండితుడు సాంకర్యమును అనుమానించాలి. ఒక్కసారైనా ఈ భస్మంధరించని నరుని (15) ఉత్పత్తి విషయంలో పండితుడు సాంకర్యాన్ని అనుమానించాలి. బ్రహ్మకుండ భస్మాన్ని బ్రాహ్మణునకు దానముచేసిన నరుడు, (16) నాల్గు సముద్రముల వరకున్న భూమిని దానం చేసినంత పుణ్యము. ఈ విషయంలో అనుమానించరాదు. మూడుమార్లు నేను శపధం చేస్తున్నాను (17) సత్యము, సత్యము, సత్యము. చేయెత్తి పలుకుతున్నాను. బ్రహ్మకుండ మందు పుట్టిన భస్మమును దరించండి . ఓద్విజులారా !(18) ఇది పవిత్రమైన భస్మము. బ్రహ్మయజ్ఞం వల్ల కల్గింది . పూర్వం భగవంతుడైన బ్రహ్మ సర్వలోక పితామహుడు (19) దేవతలందరి సన్నిధిలో గంధమాదన పర్వతమందు, శివుని శాపనివృత్తి కొరకు అన్ని క్రతువులను ఆచరించాడు (20) అనేకదక్షిణలు గల అన్ని అధ్వరములను శాస్త్ర ప్రకారము చేసి శివుని శాపము నుండి తొందరగా బ్రహ్మ ముక్తుడైనాడు. (21) అట్టి ఈ తీర్థమునకు వచ్చి స్నానం చేసిన నరులు మహా దేవసాయుజ్యమును పొందుతారు. అనుమానంలేదు (22).

మూll ఋషయ ఊచు:-

వ్యాసశిష్యమహా ప్రాజ్ఞ పురాణార్థవిశారదl చతుర్థశానాంలోకానాం స్రష్టారం చతురాననం ll 23 ll

శంభుః కేనా పరాధేన శప్తవాన్‌ భారతీపతిం l శాపశ్చకీదృశస్తస్య పురాదత్తోహరేణవై ll 24 ll

ఏతత్సర్వంమునే బ్రూహి తత్వతో7స్మాకమాదరాత్‌ l

శ్రీసూత ఉవాచఉ

పురాబభూపకలహం బ్రహ్మవిష్ణోః పరస్పరం ll 25 ll

కంచిద్ధేతు సముద్ధిశ్యస్పర్దయా శ్లాఘ్యమానయోః l అహంకర్తానమత్తో 7న్యఃకర్తాస్తి జగతీతలే ll 26 ll

ఏవమాహహరిం బ్రహ్మాబ్రహ్మాణంప చహరిస్తథాl ఏవం వివాదః సుమహాన్‌ ప్రావర్తత పురాతయోః ll 27 ll

ఏతస్మిన్నంతరే విప్రాః కుర్వతోః కలహం మిథః l తయోర్గర్వ వినాశాయ ప్రబోధార్థంచదేవయోః ll 28 ll

మధ్యేప్రాదురభూల్లింగం స్వయంజ్యోతి రనామయం l తౌదృష్ట్యావిస్మితౌ లింగం బ్రహ్మవిష్ణూపరస్పరం ll 29 ll

సమయం చక్రతుర్విప్రాః దేవానాం సన్నిధౌపురా l అనాద్యంతం మహా లింగం యదేతత్‌ దృశ్యతేపురః ll 30 ll

అనంతా దిత్యసంకాశంప అనంతాగ్ని సమప్రభం అవయోరస్య లింపగస్య యోం 7త మాదించ ద్రక్ష్యతి ll 31 ll

సభ##వే దధికోలోకే లోకకర్తాచ సప్రభుః l అహమూర్థ్వం గమిష్యామిలింగస్యాంతంగ వేషయన్‌ ll 32 ll

గవేషణాయమూలస్యత్వమధస్తాత్‌ హరేవ్రజ l ఇతి తస్యవచః శ్రుత్వా తథేత్యాహ రమాపతిః ll 33 ll

ఏవంతౌ సమయంకృత్వామార్గణాయవి నిర్గతౌ l విష్ణుర్వరాహరూపేణ గతో 7ధస్తాధ్గవేషితుం ll 34 ll

హంసతాంభారతీజానిః స్వీకృత్యోపరినిర్య¸° l అధోకోకాన్‌ విచిత్యాథో విష్ణు ర్వర్షగణాన్‌ బహూన్‌ ll 35 lkl

యథాస్థానం సమాగత్యబభాషే దేవసన్నిధౌ l

విష్ణురువాచ -

అహంలింగస్య నాద్రాక్షం అదిమస్యేతి సత్యవాక్‌ ll 36 ll

ఊర్ధ్వంగ వేషయిత్వాథ బ్రహ్మాప్యాగచ్ఛదత్రసః lఅగత్యచవచః ప్రాహఛద్మనా చతురాననః ll 37 ll

బ్రహ్మోవాచ-

అహమద్రాక్ష మస్యాంతం పలింపగస్యేతిమృషాపునఃl తయోస్తద్వచనం శ్రుత్వాబ్రహ్మవిష్ణ్వోః మహేశ్వరః ll 38 ll

మిథ్యావాదిన మాహెదం ప్రహస్య చతురాననం

ఈశ్వర ఉవాచ -

అసత్యం యదవోచస్త్వం చతురానన మత్పురః ll 39 ll

తస్మాత్‌ పూజానతే భూయాతే లోకే సర్వత్ర సర్వదా l అథవిష్ణుం పునః ప్రాహా భగవాన్‌ పరమేశ్వరః ll 40 ll

యస్మాత్‌ సత్యమవోచస్త్వంప కమలాయాః పతే హరే l తస్మాత్తే మత్సమాపూజా భవిష్యతి నసంపశయః ll 41 ll

తాll ఋషులిట్లనిరి - వ్యాసుని శిష్య ! గొప్ప ప్రజ్ఞకలవాడ! పురాణార్థములు బాగా తిలిసినవాడ, పదునాల్గులోకములకు సృష్టికర్తయైన చతురాననుని (23) భారతీపతిని శంభుడు ఏ అపరాధంవల్ల శపించాడు. శివుడు అతనికి ఎటువంటి శాపమిచ్చాడు. ఇదంతా ఓముని! యథార్థంగా ఆదరంగా మాకు చెప్పండి (24) శ్రీ సూతులిట్లనిరి - బ్రహ్మవిష్ణువులకు పరస్పరము పూర్వం కలహమైంది (25)ఒక చిన్నకారణాన్ని పురస్కరించుకొని స్పర్థతో పొగుడుకుంటున్న వారికి కలహమైంది నేనే కర్తను, నాకంటేవేరైన కర్త భూతలమందు లేడు (26)ఈరకంగా బ్రహ్మవిష్ణువునన్నాడు. బ్రహ్మను విష్ణువన్నాడు. పూర్వం వారిద్దరికి ఈ విధంగా వివాదము చాలా పెద్దగా జరిగింది (27)ఈరకంగా పరస్పరం కలహించుకుంటున్నంతలో, వారి గర్వమునశింపచేసే కొరకు వారికి ప్రభోధం కల్గించే కొరకు (28) వారిద్దరి మధ్య స్వయంజ్యోతి, అనామయము ఐన లింగము ఉద్భవించింది . ఆ లింగాన్ని చూచి బ్రహ్మవిపష్ణువులిద్దరు పరస్పరము ఆశ్చర్య పడ్డారు (29) దేవతల ఎదురుగా వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మనకు ఎదురుగా ఆద్యంతములు లేక, కన్పిస్తున్న మహాలింగము (30) అనంతమైన అదిత్యులలో సమానమైన కాంతిగలది. అనంత అగ్నులతో సమానమైన వెలుగుగలది. మనిద్దరిలో ఈ లింగము యొక్క అంతమును అదిని చూచినవారు (31)లోకంలో గొప్పవారు ఆతడే లోకకర్తా. ప్రభువు . నేను లింగము యొక్క అంతం వెతుకుతూ పైకి పోతాను . (32)ఓ విష్ణువు నీవు మూలాన్ని వెతుకుతూ క్రిందకుపో అని బ్రహ్మఅన్నాడు. అతని మాటలు విని విష్ణువు సరె అని అన్నాడు (33) ఈ విధంగా వారు ఒప్పందం కుదుర్చుకొని అద్యంతములు వెతుకుటకు బయలు దేరారు. విష్ణువు పరాహరూపధారయై వెతుకుటకు క్రిందకి వెళ్ళాడు. (34) బ్రహ్మ హంస రూపాన్ని వరాహరూపాన్ని ధరించి పైకి వెళ్ళాడు . విష్ణువు అనేక సంవత్సరాలు క్రింది లోకములు వెతికి తన స్థానమునకు తిరిగి వచ్చి దేవతల సన్నిధిలో ఇట్లా అన్నాడు (35) విష్ణువు వచనము- నేను ఈ లింగముయొక్క అదిని చూడలేదు అని నిజం చెప్పాడు (36)పైలోకాలు వెతికి బ్రహ్మకూడా ఇక్కడికే వచ్చాడు. వచ్చి ఇట్లా అన్నాడు, మోసంతో బ్రహ్మ (37)బ్రహ్మమాట - నేను ఈ లింగముయొక్క అంతాన్ని చూచాను అని అబద్ధం చెప్పాడు. మహేశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణువుల మాటలువిని అబద్ధం చెప్పిన బ్రహ్మతో నవ్వుతూ ఇట్లా అన్నాడు(38)ఈశ్వరుని మాట-ఓబ్రహ్మనాఎదురుగా అబద్ధం చెప్పావుగదా (39) అందువల్ల లోకంలో నీకు పూజ అంతట, ఎల్లప్పుడు ఉండదు. పరమేశ్వరుడు విష్ణువుతో ఇట్లా అన్నాడు (40) ఓ కమాలాపతి ! హరి నీవు నిజం చెప్పావుగద కనుక నీకు నాతో సమానమైన పూజలభిస్తుంది అనుమానం లేదు అని (41).

మూllతతో బ్రహ్మావిషణ్ణః సన్‌ శంకరం ప్రత్యభాషతl స్వామిన్‌ మమా పరాధంత్వం క్షమ స్వకరుణానిధే ll 42 ll

ఏకోపరాధః క్షంతవ్యః స్వామిభిః జగదీశ్వరైఃl తతోమహెశ్వరో7 వాదీత్‌ బ్రహ్మాణం పరిసాంత్వయన్‌ ll 43 ll

ఈశ్వం ఉవాచ -

నమిథా వచనం మేస్యాత్‌ బ్రహ్మన్‌ వక్ష్యామి తేశ్రుణు l గచ్ఛత్వం సహసావత్సగంధమానద పర్వతం ll 44 ll

తత్రక్రతూనే కురుష్వత్వం మిథ్యా దోషప్రశాంతయే lతతో విధూతపాపస్త్వం భవిష్యసిన సంశయః ll 45 ll

తేనశ్రౌతేషు తే బ్రహ్మన్‌ స్మార్తేష్వపిచకర్మను l పూజభవిష్యతి సదాన పూజాప్రతిమానుతే ll 46 ll

ఇత్యుక్త్వాభగవానీశః తత్రైవాంతరధీయత lతతోబ్రహ్మాయమౌవిప్రాగంధమాదన పర్వతం ll 47 ll

ఈజేక్రతుకర్తారం క్రతుభి ః పార్వతీపతిం lఅష్టాశీతిసహస్రాణి వర్షాణిముని పుంగవాః ll 48 ll

పౌండరీకాదిభస్సర్వైః అధ్వరైః భూరిదక్షిణౖః ఇంద్రాది సర్వదేవానాం సన్నిధావయజచ్ఛివం ll 49 ll

తేన తుష్టోభవత్‌ శంభుః పరమసై#్మ ప్రదత్తవాన్‌l

ఈశ్వర ఉవాచ-

మిధ్యోక్తిదోషస్తే నష్టః కృతైరేతైర్మ ఖైరిహ ll 50 ll

చతురాననతే పూజా శ్రౌతస్మార్తేషు కర్మసు l భవిష్యత్యమలా బ్రహ్మన్‌నపూజా ప్రతిమానుతే ll 51 ll

యాగస్థలమిదంతే 7ద్యబ్రహ్మకుండమితి ప్రథాం l గమిష్యతి త్రిలోకేస్మిన్‌ పుణ్యం పాపవినాశనం ll 52 ll

బ్రహ్మకుండాభిదేతీర్థే సకృద్యః స్నానమాచరేత్‌l ముక్తిద్వారార్గలంతస్యభిద్యతేతత్‌క్షణాద్విధే ll 53 ll

బ్రహ్మకుండసముద్భూతం లలాటేభస్మధారయన్‌ l మాయాకపాటం నిర్భిద్యముక్తి ద్వారం ప్రయాస్యతి ll 54v ll

బ్రహ్మకుండోత్థితం భస్మలలాటేయోసధారయేత్‌ l స్వపితుర్బీజ సంభూతో సమాతరి సుతస్తుసః ll 55 ll

బ్రహ్మకుండసముద్భూత భస్మధారణతోవిధే l బ్రహ్మహత్యాయుతం సశ్యేత్‌ సురాపానాయుతం తథా ll 56 ll

గురుతల్పాయుతంసశ్యేత్‌ స్వర్ణస్తే యాయుతం తథా l తత్సంసర్గాయుతం సశ్యేత్‌ సత్యముక్తంమయావిధె ll 57 ll

బ్రహ్మకుండ సముధ్భూత భస్మధారణ వైభవాత్‌ l భూతప్రేత పిశాచాద్యాసశ్యంతిక్షణమాత్రతః ll 58 ll

ఇత్యుక్త్వా భగవానీశః తత్రై వాంతరధీయత ll 58 1/2 ll

తాll అప్పుడు బ్రహ్మ విషణ్ణుడై శంకరునితో ఇట్లా అన్నాడు . ఓ కరుణానిది ! నా అపరాధాన్ని నీవు క్షమించు (42) జగదీశ్వరులైన మీరు ఈ ఒక్క అపరాధాన్ని మన్నించాలి అని అనగా బ్రహ్మను ఓదారుస్తూ శివుడిట్లన్నాడు (43) ఈశ్వరుని మాట- బ్రహ్మచెబుతున్నాను విను, నామట అబద్ధం కాదు. ఓ వత్స! నీవు తొందరగా గంధమాన పర్వతానికి వెళ్ళు. (44) విధ్యాదోషం పోవటానికి ఆక్కడ నీవు క్రతువుల నాచరించు పిదప నీపాపములన్ని పోతాయి అనుమానం లేదు .(45) పిదప శ్రౌతస్మార్తకర్మలలో నీకెప్పుడు పూజలభిస్తుంది. విగ్రహరూపంలో పూజలేదు (46) అని పలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు. పిదప బ్రహ్మ గంధమాదన పర్వతానికి వెళ్ళాడు (47)క్రతువులకర్తయైన పార్వతీపతిని క్రతువులతో యజించాడు . ఇట్లా ఎనుబది వేల సంవత్సరాలు చేశాడు (48)పౌండరీకముమొదలగు అన్నిరకములైన అధ్వరములతో, అనేక దక్షిణలతో , ఇంద్రాదిదేవతలందరి సన్నిధిలో శివునియజించాడు. వానితో శంభుడు సంతుష్టుడైనాడు . ఈతనికి వరమిచ్చాడు (49) ఈశ్వరుని వచనము - ఇక్కడ చేసిన ఈ యజ్ఞములతో నీవు అబద్ధమాడిన దోషం పోయింది (50) ఓచతురానన! శ్రౌత స్మార్త కర్మలలో నీకు పూజలభిస్తుంది. నీకు విగ్రహరూపంలో పూజ జరగదు (51) నీ ఈ యాగస్థలము బ్రహ్మకుండమని ప్రసిద్ధిని పొందుతుంది . ముల్లోకములలో ఇది పాపనాశకము పుణ్యప్రదము (52) బ్రహ్మకుండమనే ఈ తీర్థంలో ఒకసారి స్నానమాచరించినవారి ముక్తిద్వారపుగొళ్ళెము ఆక్షణంలోనే తొలగి పోతుంది (53) బ్రహ్మకుండంలో పుట్టినభస్మమును లలాటమున ధరించిన వారు తమతల్లి తండ్రి బీజంవల్ల కల్గిన పుత్రుడు కాడు (55) బ్రహ్మకుండమందలి భస్మధారణవలన పదివేల బ్రహ్మహత్మల దోషమ, పదివేల సురాపానముల దోషము నశిస్తుంది (56) గురుతల్పముల పదివేల కొలది దోషము, పదివేల బంగారు దొంగతనముల దోషము నశిస్తుంది . దాని సంసర్గం వల్లవచ్చిన పదివేల దోషము నశిస్తుంది ఓవిధి l నేను సత్యం చెప్పాను (57) బ్రహ్మకుండంలోని భస్మధారణ వైభవంవలన క్షణమాత్రంలో భూతప్రేతపిశాచాదులు నశిస్తాయి (58)అని పలికి ఈశుడు అక్కడే అంతర్థానమైనాడు (58)

మూll యజ్ఞే ష్వథ సమాప్తేషు మునయశ్చజితేంద్రియాః ll 59 ll

ఇంద్రాది దేవతాశ్చైవ సిద్ధచారణ కిన్నరాః l అన్నేచ దేవనిపహ గంధమాదన పర్వతే ll 60 ll

తాం యజ్ఞ భుమి మాశ్రిత్య స్వయంరుద్రేణ సేవితాం l నిరంతరంమవర్తంత విదిత్వా తస్య వైభవం ll 61 ll

యథావిధి తతోయజ్ఞాన్‌ సమావ్యబహుదక్షిణాన్‌ l సత్యలోకమగాత్‌ బ్రహ్మ శివాల్లబ్దమనోరథః ll 62 ll

తదా ప్రభృతిదేవాశ్చమున యశ్చద్విజోత్తమాఃlబ్రహ్మకుండం సమాసాద్యచక్రుఃయాగాన్విధానతః ll 63 ll

తస్మాదియక్షవోమర్త్యాః కుర్యుర్యజ్ఞానిహైవహి ll 64 ll

మనుజదేవ మునీశ్వర పందితం l సకలసంసృతినాశకరం ద్విజాః l

జలజసంభవకుండమిదం శుభం l సకల పాపహరం సకలార్థదం ll 65 ll

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీత సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్య్మే బ్రహ్మకుండ ప్రశంసాయాం బ్రహ్మశాపవిమోక్షణ వర్ణనంనామ చతుర్దశో7ధ్యాయః ll 14 ll

తాll యజ్ఞములు సమాస్తమైనాక జితేంద్రియులైనమునులు (59) ఇంద్రాది దేవతలు, సిద్ధ చారణ కిన్నరులు ఇతరదేవతాసమూహములుగంధమాదన పర్వతమందు (60)స్వయంగా రుద్రుడు సేవించిన ఆ యజ్ఞభూమినాశ్రయించి, దాని వైభవాన్ని తెలుసుకొని నిరంతరము అక్కడే ఉన్నారు. (61)బహుదక్షిణాకములైన యజ్ఞములను శాస్త్రప్రకారము సమాప్తిచేసి, శివుని నుండి కోరికలను పొందిన బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళాడు. (62)నాటినుండి దేవతలు, మునులు, బ్రాహ్మణులు, బ్రహ్మకుండంచేరి శాస్త్రప్రకారము యాగములు చేశారు (63)అందువలన యజ్ఞం చేయదలచిన నరులారా యజ్ఞములను ఇక్కడే చేయాలి (64)మనుజదేవమున్వీరులతో నమస్కరింపబడినట్టిది, సమస్త సంసార పాపములను నశింపచేసేది సకల పాపములనశింపచేసేది, సకలార్థములనిచ్చేది శుభకరమైనది ఈ బ్రహ్మకుండము (65) అని శ్రీస్కాంద మహాపురాణమందు ఎనబది ఒక్కవేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మహాత్మ్యమందు బ్రహ్మకుండ ప్రశంసయందు బ్రహ్మశాప విమోక్షణ వర్ణన మనునది పదునాల్గవ అధ్యాయము సమాస్తము ll 14 ll

Sri Scanda Mahapuranamu-3    Chapters