Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునైదవ అధ్యాయము

మూll శ్రీసూత ఉవాచ-

బ్రహ్మకుండే మహాపుణ్య స్నానం కృత్వాసమాహితః నరోహనూమతః కుండం అథగచ్ఛే ద్ద్వి జోత్తమాః ll 1ll

వురాహతేషురక్షస్సు సమాప్తే రణకర్మణి l రామాదిషునివృత్తేషు గంధమాదన పర్వతే ll 2ll

సర్వలోకోవకారాయహనుమాన్మారుతాత్మజః సర్వతీర్థోత్తమం చక్రేస్వనామ్నా తీర్థముత్తమం ll 3 ll

విదిత్వావైభవంయస్య స్వయంరుద్రేణ సేవ్యతే l తస్యతీర్థస్య సదృశం సభూతం సభవిష్యతి ll 4 ll

యత్రస్నాతానరాయంతిశివలోకం సనాతనం lయస్మింస్తీర్థే మహాపుణ్య మహాపుణ్య మహాపాతకనాశ##నే ll 5 ll

సర్వలోకో పకారాయనిర్మితే వాయుసూసునా l సర్వాణి నరకాణ్యాసన్‌శూన్యాన్యేవ చిరాయవై ll 6 ll

వైభవంతస్య తీర్థస్య శంకరోవేత్తివానవా l యత్ర దర్మసఖోనామరాజాకేకయ వంశజః ll 7 ll

భక్త్యాసహపురాస్నాత్వా శతం పుత్రాన వాప్తవాన్‌ l

ఋషయ ఊచు:-

సూత ధర్మసఖస్యాద్య చరితం వక్తుమర్హసి ll 8 ll

హనుమత్‌ కుండతీర్థే యోలేభేస్నా త్వాశతం సుతాన్‌ l

శ్రీసూత ఉవాచ-

శ్రుణధ్వం ఋషయో యూయంచరితం తస్యభూపతేః ll 9 ll

తా ll శ్రీసూతులిట్లనిరి - మహా పుణ్యప్రదమైన బ్రహ్మకుండమందు శ్రద్ధతోస్నానంచేసి, పిదపనరులు హనుమత్‌ కుండానికి వెళ్ళాలి (1) రాక్షసులుచచ్చాక, యుద్ధం ముగిశాక, రామాదులు తిరిగి పోయాక గంధమాదన పర్వతమందు (2) సర్వలోకములకు ఉపకారంకొరకు మారుతాత్మజుడైన హనుమంతుడు, తన పేరు సర్వతీర్థములలో ఉత్తమమైన, ఉత్తమతీర్థమును ఏర్పరచాడు (3) దాని వైభవాన్ని విని రుద్రుడు స్వయంగా సేవిస్తున్నాడు. ఆ తీర్థంతో సమానమైంది భూతంలో లేదు భవిష్యత్తులో రాదు (4) అక్కడ స్నానం చేసిన నరులు సనాతనమైన శివలోకానికి వెళ్తారు అది మహాపుణ్య ప్రదము, మహా పాతక నాశకము (5) సర్వలోకముల ఉపకారంకొరకు హనుమంతుడు నిర్మించిన దానివలన, నరకములన్ని చాలా కాలము శూన్యముగానే ఉండిపోయినాయి (6) ఆ తీర్థవైభవము శంకరునకు తెలుసునో తెలియదో, కేకయవంశమునకు చెందిన ధర్మ సఖుడనే రాజు (7) ఇది వరలో భక్తితో స్నానం చేసి నూర్గురు పుత్రులను పొందాడు. ఋషులిట్లనిరి - ఓ సూత! ఈ రోజు ధర్మసఖుని చరితమును చెప్పవలసింది. హనుమత్కుండ తీర్థంలో స్నానం చేసి నూర్గురు పుత్రులను పొందాడు గదా (8) శ్రీ సూతులిట్లనిరి - ఓ ఋషులారా! ఆ మహారాజుచరిత్రను వినండి (9).

మూ|| అద్యధర్మ సఖస్యాహం ప్రవక్ష్యామినమాసతః | రాజాధర్మసఖోనామవిజితారిః సధార్మికః || 10 ||

బభూవనీతిమాన్‌ పూర్వం ప్రజాపాలన తత్పరః | తస్య భార్యాశతం విప్రాః బభూవపతిదైవతం || 11 ||

సపాలయన్‌ మహీం రాజాసశైలవన కాననాం | తాసుభార్యాసుతనయం నా విందత్‌ వంశ వర్ధనం || 12 ||

పుత్రార్థం సమహీపాలో బహూన్‌ యత్నాన థాకరోత్‌ | అకరోచ్చమహాదానం పుత్రార్థం సమహీపతిః || 13 ||

అశ్వమేధాధిభిర్యజ్ఞేఃఅజయచ్చసురాన్‌ప్రతి | తులాపురుషముఖ్యానిదదౌదానానిభూరిశః || 14 ||

ఆమధ్యరాత్రమన్నాని సర్వేభ్యోప్యనివారితం | ప్రాయచ్ఛత్‌ బహుసూపాని సస్యోపేతానిభూమిపః || 15 ||

పితౄనుద్దిశ్య చశ్రాద్ధమకరోత్‌ విధిపూర్వకం | సంతానదాయినో మంత్రాన్‌ జజాపనియతేంద్రియః || 16 ||

ఏవమాదీన్‌ బహూన్‌ ధర్మాన్‌ పుత్రార్థం కృతవాన్‌ నృపః | పుత్రముద్దిశ్య సతతం కుర్వన్‌ధర్మాననుత్తమాన్‌ || 17 ||

రాజాదీర్ఘేణకాలేన వృద్ధతాం ప్రత్యపద్యత|కదాచిత్తస్యవృద్ధస్య యతమానస్యభూపతేః || 18 ||

పుత్రస్సుచంద్రనామాభూత్‌ జ్యేష్ఠపత్న్యాం మనోరమః | జాతంపుత్రం జనన్యఃతాః సర్వావైషమ్యవర్జితాః || 19 ||

సమంసంవర్దయామాసుః క్షీరాదిభిరసుత్తమాః | రాజ్ఞశ్చ సర్వమాతౄణాం పౌరాణాం మంత్రిణాంతథా || 20 ||

మనోనయన సంతోష జనకోయంసుతోభవత్‌ | లాలయానః సుతంరాజాముదంలేభేవరాత్పరాం || 21 ||

ఆందోలికాశయానస్యసూనోస్త స్యకదాచన | వృశ్చికోకుట్టయత్‌పాదే పుచ్ఛేనోద్యత్‌ విషాగ్నినా || 22 ||

కుట్టనాత్‌ వృశ్చికస్యాసౌ అరుదత్‌ తనయోభృశం | తతస్తన్మాతరః సర్వాః ప్రారుదన్‌ శోకకాతరాః || 23 ||

పరివార్యాత్మజం విప్రాః సధ్వని సంకులోభవత్‌ | ఆర్త ధ్వనింసశుశ్రావరాజాధర్మసఖస్తదా || 24 ||

తా|| ఈ రోజుధర్మ సఖుని వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెబుతాను. శత్రువుల జయించినవాడు, ధర్మబుద్ధిగలవాడు ధర్మసఖుడనేవాడు రాజు (10) నీతిమంతుడు ప్రజాపాలన తత్పరుడు పతియేదైవముగా గల భార్యలు నూరుగురు ఆతని కుండేవారు (11) శైలవనకాననములతో కూడిన భూమిని రాజు పాలిస్తూ, ఆ భార్యలలో వంశవర్ధనుడైన కుమారుణ్ణి పొందలేకపోయాడు (12) పుత్రునికొరకు ఆ రాజు అనేక ప్రయత్నములను చేశాడు. ఆ రాజు సంతానము కొరకు గొప్ప దానములు చేశాడు (13) అశ్వమేధాది యజ్ఞములతో దేవతల గూర్చి యాగం చేశాడు. తులాపురుష ముఖ్యమైన దానములెన్నో ఆ రాజు చేశాడు (14) అందరికి, అడ్డంకి లేకుండా, మధ్యరాత్రి వరకు అన్నదానం చేశాడు. ధాన్యములతో కూడా అనేకరకాలైన పప్పులను ఇచ్చాడారాజు (15) శాస్త్రప్రకారము పితరులనుద్దేశించి రాజు శ్రాద్ధము - చేశాడు. నియతేంద్రియుడై సంతానాన్నిచ్చే మంత్రములను జపించాడు. (16) ఈ విధములైన ధర్మములను రాజు పుత్రోత్పత్తికొరకు ఆచరించాడు. పుత్రుని కొరకు ఎప్పుడూ ఉత్తమ ధర్మములను ఆచరిస్తూ (17) చాలా కాలమునకు రాజు వృద్ధుడైనాడు. ఆవృద్ధుడైన రాజునకు ప్రయత్నిస్తున్న వానికి (18) జ్యేష్ఠపత్ని యందు అందమైన సుచంద్రుడను పేరుగల, పుత్రుడుదయించాడు. పుట్టిన కుమారుని తల్లులందరు వైషమ్యాన్ని వదలి (19) పాలు మొదలగు వానితో ఉత్తమంగా సమానంగా పెంచసాగారు. రాజు, అందరుమంత్రులు, పౌరులు, మంత్రులు (20) వీరందరి మనస్సులకు కళ్ళకు సంతోషం కల్గించేవాడుగా ఈ పిల్లవాడైనాడు. రాజు పుత్రుణ్ణి లాలిస్తూ అంతకంతకెక్కువగా ఆనందాన్ని పొందాడు (21) ఒకసారి ఊయలలో నిద్రించిన ఆ పిల్లవానిని అగ్నిలాంటి విషం గల తోకతో తేలు పాదంలో కుట్టింది (22) తేలు కుట్టటం వల్ల ఈ పిల్లవాడు మాటిమాటికి ఏడ్చాడు. అప్పుడు ఆతని తల్లులందరు శోకంతో చంచలులై దుఃఖించారు. (23) కొడుకును చుట్టుముట్టి ఏడ్వగా ఆధ్వని చాలా ఎక్కువై పోయింది. ధర్మసఖరాజు ఆ ఆర్తధ్వనిని అప్పుడు విన్నాడు (24).

మూ|| ఉపవిష్టః సభామధ్యే సహామాత్య పురోహితః | అథప్రాతిష్ఠివత్‌ రాజా సౌవిదల్లం స వేదితుం || 25 ||

అంతః పురబహిర్‌ ద్వారం సౌవిదల్లః సమేత్యసః | షంఢవృద్ధాన్‌సమాహూయ వాక్యమేతదభాషత || 26 ||

షంఢాః కిమర్థ మధునారుదంత్యంతః పురస్త్రియః | తత్పరిజ్ఞాయతాం తత్రగత్వారోదనకారణం || 27 ||

ఏతదర్థంహిమాంరాజా ప్రేరయామాన సంసది | ఇత్యుక్తాస్తు పరిజ్ఞాయ నిదానం రోదన స్యతే || 28 ||

నిర్గమ్యాంతః పురాత్తసై#్మ యథావృత్తంస్యవేదయత్‌ | సషంఢక వచః శ్రుత్వాసౌవిదల్లః సభాంగతః || 29 ||

రాజ్ఞేనివేద యామానపుత్రం వృశ్చికపీడితం | తతోధర్మసఖోరాజా శ్రుత్వావృత్తాంతమీదృశం || 30 ||

త్వరమానః సముత్థాయ సామాత్యః స పురోహితః | ప్రవిశ్యాంతః పురంసార్థం మాంత్రకైర్విషహారిభిః || 31 ||

చికిత్సయామాససుతం ఔషధాద్యైరనేకశః | జాతస్వస్థ్యంతతః పుత్రం లాలయిత్వాస భూపతిః || 32 ||

మానయిత్వాచమంత్రజ్ఞాన్‌ రత్నకాంచనమౌక్తికైః | నిష్ర్కమ్యాంతః పురాద్రాజా భృశంచింతాసమాకులః || 33 ||

ఋత్విక్‌ పురోహితామాత్యైఃతాంసభాంసముపావిశత్‌ | తత్రధర్మ సఖోరాజా సమాసీనో పరాసనే || 34 ||

ఉవాచేదంవచోయుక్తం ఋత్విజః నపురోహితాన్‌

ధర్మసఖ ఉవాచ -

దుఃఖాయై వైక పుత్రత్వం భవతి బ్రాహ్మణోత్తమాః || 35 ||

ఏకపుత్రత్వతోనౄణాం వరాచైవహ్య పుత్రతా | నిత్యం వ్యపాయ యుక్తత్వాత్‌ పరమేవహ్య పుత్రతా || 36 ||

అహంభార్యాశతం విప్రా ఉదవోఢం విచింత్యతు | వయశ్చసమతిక్రాంతం సపత్నీకస్యమేద్విజాః || 37 ||

ప్రాణామమచ భార్యాణాం అస్మిన్‌ పుత్రేవ్యవస్థితాః | తన్నాశేమమభార్యాణాం సర్వాసాంచమృతిర్‌ధ్రువా || 38 ||

మమాపి ప్రాణనాశః స్యాత్‌ ఏకపుత్రస్యమారణ | అతోమేబహుపుత్రత్వం కేనోపాయేన వైభ##వేత్‌ || 39 ||

తముపాయంమమబ్రూత బ్రాహ్మణావేదవిత్తమాః | ఏకైకః శతభార్యాసుపుత్రోమేస్యాద్‌ యథాగుణీ || 40 ||

తత్కర్మబ్రూత యూయంతుశాస్త్రమాలోక్యధర్మతః | మహతాలఘునావాపికర్మణా దుష్కరేణవా || 41 ||

ఫలంయద్యపి తత్సాధ్యం కరిష్యేహంస సంశయః

యుష్మాభిరుదితం కర్మ కరిష్యామిన సంశయః | కృతమేవహితద్విత్తశ##పేహం సుకృతైర్మమ || 42 ||

అస్తిచేదీదృశంకర్మయేన పుత్రశతం భ##వేత్‌ | తత్కర్మకు త్రకర్తవ్యం మయేతి వదాతాథునా || 43 ||

ఇతిపృష్టస్తదా రాజ్ఞా ఋత్విజః సపురోహితాః | సంభూయసర్వేరాజాన మిదమూచుః సునిశ్చితం || 44 ||

తా|| మహా అమాత్య పురోహితులతో సభామధ్యంలో కూర్చున్న రాజు ఆ విషయాన్ని తెలుసుకోవటానికి అంతఃపురపు కావలివానిని పంపాడు (25) ఆసౌవిదల్లుడు అంతఃపుర బహిర్‌ ద్వారము వరకు వచ్చి షంఢ వృద్ధులను పిలిచి ఇట్లా అన్నాడు (26) ఓ షంఢులారా! అంతః పుర స్త్రీలు ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు. అక్కడికివెళ్ళి రోదన కారణమేమిటో అది తెలుసుకోండి (27) దీని కోసమే రాజు సభనుండి నన్ను పంపాడు. అని చెప్పగా వారు రోదనమునకు కారణాన్ని తెలుసుకొని (28) అంతః పురం నుండి బయటికి వచ్చి ఆతనికి జరిగినది జరిగినట్టు చెప్పారు. ఆతడు షంఢుని మాటలు విని సౌవిదల్లుడు సభకు వెళ్ళాడు (29) పుత్రునకు తేలుకరచి బాధ పడుతున్నాడని రాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మసఖరాజు ఇలాంటి వృత్తాంతాన్ని విని (30) తొందరపడుతూ లేచి మంత్రి పురోహితులతోకూడి అంతః పురం ప్రవేశించి, విషమును హరించే మాంత్రికులతో కూడి (31) కొడుకుకు చికిత్స చేయించాడు. అనేకమైన మందులతో కూడా చికిత్స చేయించాడు. పుత్రుడు ఆరోగ్యవంతుడు కాగా ఆతనిని ఆరాజు లాలించి (32) రత్నకాంచనముత్యములతో మంత్రజ్ఞులను గౌరవించి అంతఃపురము నుండి రాజు నిష్ర్కమించి చాలా విచారంతోకూడినవాడై (33) ఋత్విక్‌ పురోహిత అమాత్యులతో కూడి ఆ సభయందు కూర్చున్నాడు. అక్కడ ధర్మసఖుడనే రాజు మంచి ఆసనమందు కూర్చొని పురోహితులతో కూడిన ఋత్విజులతో, యుక్తమైన ఈ మాటను పలికాడు. (34) ధర్మసఖునిమాట - ఒక్క కొడుకు ఉండటం దుఃఖము కొరకే ఓ బ్రాహ్మణులారా! (35) ఒక్కకొడుకు ఉండేకన్న నరులకు పుత్రులు లేకుండ ఉండటమే వరము. రోజు అపాయంతో కూడుకొని ఉంది. కాబట్టి అపుత్రతే మేలు. ఆలోచించగా, నేను నూర్గురు భార్యలను వివాహమాడాను. (36) వయస్సు గడిచి పోయింది భార్యలతో ఉన్నాకూడా.. నా ప్రాణములునా భార్యల ప్రాణములు ఈ పుత్రుని యందే ఉన్నాయి (37) ఆతడు మరణిస్తే నా భార్యలందరు మరణించటం నిశ్చయము. ఒక్క పుత్రుడు మరణిస్తే నా ప్రాణాలు పోతాయి (38) అందువల్ల నాకు బహుపుత్రత్వము ఏ విధంగా కల్గుతుంది. ఆ ఉపాయాన్ని నాకు చెప్పండి ఓ బ్రాహ్మణు లారా, వేదవిదులారా! (39) నూర్గురు భార్యలలో ఒకరికంటే ఒకరికి రెట్టింపు అయ్యేట్టుగా పుత్రులు కల్గనీ మీరు నాకు ఆకర్మచెప్పండి ధర్మంగా శాస్త్రాన్ని చూసి చెప్పండి (40) చిన్నదిగాని, పెద్దదిగాని దుష్కరమైన కర్మగాని ఎటువంటిదైనా నేను ఆఫలం సిద్ధించేట్టుగా చేస్తాను, అనుమానంలేదు (41) మీరు చెప్పిన పనిని చేస్తాను అనుమానంలేదు. నా సుకృతముల మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఆ పనిని చేసినట్టుగానే భావించండి (42) ఇటువంటి పని ఉందా, నూర్గురుకొడుకులు కలిగేది. ఆ పనినేనెక్కడ చేయాలో ఇప్పుడే చెప్పండి (43) అని రాజు అడుగగా పురోహితునితో కూడిన ఋత్విజులు అందరు ఏకమై నిశ్చయించి రాజుతో ఇట్లా అన్నాడు.

మూ|| ఋత్విజ ఊచుః -

అస్తిరాజన్‌ ప్రవక్ష్యామో యేన పుత్రశతంతవ | భ##వేద్ధర్మేణమహతా శతభార్యాసుకైకయ || 45 ||

అస్తికశ్చిస్మహాపుణ్యో గంధమాదన పర్వతః | దక్షిణాం బుధి మధ్యేయః సేతురూపేణ వర్తతే || 46 ||

సిద్ధచారణ గంధర్వదే వర్షిగణసంకులః | దర్శనాత్‌ స్పర్శనాత్‌ నౄణాం మహాపాతక నాశనః || 47 ||

తత్రాస్తి హనుమత్కుండమితిలోకేషు విశ్రుతం | మహాదుఃఖ ప్రశమనం స్వర్గమోక్షఫలప్రదం || 48 ||

నరకక్లేశశమనం తథా దారిద్ర్యమోచనం | పుత్రప్రదమపుత్రాణాం అస్త్రీణాంస్త్రీవదం నృణాం || 49 ||

తత్రత్వం ప్రయతః స్నాత్వాసర్వాభీష్ట ప్రదాయినీం | పుత్రీయేష్టించతత్తీరేకురుష్వనుసమాహితః || 50 ||

తేనతే శతభార్యాసుప్రత్యేకం తనయోనృప | ఏకైకస్తు భ##వేచ్ఛీఘ్రం మాకురుష్వాత్ర సంశయం || 51 ||

తథోక్తోనృపతిర్విపై#్రః ఋత్విక్‌భిః న పురోహితైః | తత్‌క్షణనైవఋత్విక్భిః భార్యాభిశ్చపురోధసా || 52 ||

వృతోమాత్యైశ్చభృత్యైశ్చయజ్ఞసంభారసంయుతః | ప్రయ¸°దక్షిణాం భోధౌ గంధమాన పర్వతం || 53 ||

హనుమత్కుండ మాసాద్యతత్ర సస్నౌస సైనికః | మాసమాత్రం సతత్తీరేన్యవసత్‌ స్నానమాచరన్‌ || 54 ||

తతోవసంతే సంప్రాప్తే చైత్ర మాసినృపోత్తమః | ఇష్టిమారబ్ధవాన్‌ తత్ర పుత్రీయాం స పురోహితః || 55 ||

సమ్యక్కర్మాణి చక్రుస్తే ఋత్విజః సపురోధసః | సపత్నీకస్యరాజర్షేః తథాధర్మసఖస్యతు || 56 ||

ఇష్టౌతస్యసమాప్తాయాం హనుమత్‌కుండతీరతః | పురోహితోహుతోచ్ఛిష్టం ప్రాశయద్రాజయోషితః || 57 ||

తతోధర్మసఖో రాజా హనూమత్కుండవారిషు | సమక్చకారావభాధస్నానం భార్యా శతాన్వితః ||58||

ఋత్విక్‌భ్యోదక్షిణాః ప్రాదాత్‌ అసంఖ్యాతాస్తు భూరిశః | గ్రామాంశ్చప్రదదౌరాజాబ్రాహ్మణభ్యోద్విజోత్తమాః || 59 ||

సామాత్యః సపరీవారః సపత్నీకః సధార్మికః | రాజాతతో నివవృతే పురీం స్వాం ప్రతి నందితః || 60 ||

తా|| ఋత్విజులిట్లనిరి - నీకు నూర్గురు పుత్రులు కలిగే కర్మ ఉంది. దాన్ని చెబుతాము ఓ రాజ! గొప్ప ధర్మంతో నూర్గురు భార్యల యందు సంతానం కల్గుతుంది (45) మహా పుణ్యప్రదమైన గంధమాదన పర్వతం ఉంది. దక్షిణ సముద్రం మధ్యలో సేతు రూపంలో ఉంది. (46) సిద్ధచారణ గంధర్వులు దేవర్షులతో నిండి ఉంటుంది. దర్శనం వల్ల స్పర్శనం వల్ల అన్ని పాపాలను నశింపచేసేది (47) అక్కడ లోకంలో ప్రసిద్ధమైనది హనుమత్కుండమని ఉంది. అది గొప్ప దుఃఖాలను శమింపచేసేది. స్వర్గమోక్షఫలములనిచ్చేది (48) నరకక్లేశమును తగ్గించేది, అట్లేగే దారిద్ర్యాన్ని తొలగించేది. సంతాన హీనులకు సంతానాన్నిచ్చేది. స్త్రీలు కాని వారికి స్త్రీ పదమునిచ్చేది (49) అక్కడ నీవు ప్రయత్న పూర్వకముగా స్నానం చేసి అన్ని కోరికలను తీర్చే పుత్రీయమైన ఇష్టిని దాని తీరంలో శ్రద్ధతో చేయుము. (50) దాని వలన నీకు నీ నూర్గురు భార్యలలో ఒక్కొక్కరికి పుత్రుడు ఒక్కొక్కడు త్వరగా జన్మిస్తాడు. ఇందులో అనుమానం లేదు (51) అట్టాగే అని రాజు విప్రులు ఋత్విక్కులు పురోహితులు మొదలగువారికి చెప్పి, వెంటనే ఋత్విక్కులతో భార్యలతో పురోహితునితో (52) అమాత్యులతో భృత్యులతో కూడుకొని, యజ్ఞసంభారముకలవాడై దక్షిణ సముద్రంలోని గంధమాదన పర్వతానికి వెళ్ళాడు (53) హనుమత్కుండముచేరి సైన్యంతో పాటు స్నానం చేశాడు. స్నానం ఆచరిస్తూ దాని తీరంలో నెల రోజులు ఉన్నాడు (54) పిదప వసంతం వచ్చాక, చైత్రమాసంలో రాజు, పురోహితునితో కూడుకొని, పుత్రాకామేష్టిని ఆరంభించాడు (55) పురోహితునితో కూడిన ఋత్విక్కులు భార్యలతో కూడిన ధర్మసఖుడనురాజర్షి యొక్క పనులన్ని చక్కగా చేశారు (56) హనుమత్కుండతీరంలో ఇష్టి సమాప్తి అయ్యాక పురోహితుడు హోమం చేయగా మిగిలిన దానిని రాజు భార్యలకు తినిపించాడు. (57) పిదపరాజు హనుమత్కుండము నీటిలో నూర్గురు భార్యలతో కూడి అవభృథస్నానం చేశాడు (58) ఋత్విక్కులకు అసంఖ్యాతముగా, చాలా ఎక్కువగా దక్షిణలు ఇచ్చాడు. బ్రాహ్మణులకు గ్రామములను దానం చేశాడు (59) అమాత్యులు పరివారము, భార్యలు వీరితో కూడిన ధార్మికుడైన ఆ రాజు ఆనందంతో తననగరానికి మరలివచ్చాడు (60).

మూ|| తతః కతివయేకాలేగతే దశమమాసివై | శతం భార్యాః శతం పుత్రాన్‌ నుషువుర్గుణవత్తరాన్‌ || 61 ||

అథప్రీత మనారాజా వీరోధర్మనఖోమహాన్‌ | స్నాతః శుద్ధశ్చ సంకల్ప్య జాతకర్మాకరోత్తదా || 62 ||

గోభూతిలహిరణ్యాది బ్రాహ్మణ భ్యోదదౌబహు | ద్వౌపుత్రౌజ్యేష్ఠభార్యాయాః పూర్వజోవరజస్తదా || 63 ||

సర్వేవవృధిరేపుత్రాః ఏకాధికశతం ద్విజాః | ప్రౌఢేషు తేషురాజాసౌ తే భ్యోరాజ్యం విభజ్యతు || 64 ||

దత్వాచ ప్రయ¸°సేతుం సభార్యోగంధమాదనం | హనుమత్కుండమాసాద్య తపోతప్యత తత్తటే || 65 ||

మహాన్‌ కాలో వ్యతీయాయ రాజ్ఞస్తస్య తపస్యతః | రాజ్ఞోధర్మస ఖస్యాస్యధ్యాయ మానస్యశూలినం || 66||

తతోబహుతిథేకాలేగతే ధర్మసఖోనృపః | కాలధర్మ య¸° తత్ర ధార్మికశ్శాంత మనావః || 67 ||

పత్న్యోపితస్యరాజర్షేః అనుజగ్ముః పతింతదా | జ్యేష్ఠపుత్రః సుచంద్రో పి సంస్కృత్య పితరం తతః || 68 ||

అకరోచ్ఛ్రా ద్ధ పర్యంతం కర్మాణి శ్రద్ధయాసహ | రాజాసభార్యో వైకుంఠం మరణాదత్రజగ్మివాన్‌ || 69 ||

సుచంద్ర ముఖ్యాస్తే సర్వేరాజపుత్రామహౌజసః | స్వస్వరాజ్యం బుభుజిరే భ్రాతరస్త్యక్త మత్సరాః || 70 ||

ఏవంవః కథితం విప్రాః హనుమత్‌కుండవైభవం | రాజ్ఞోధర్మసఖస్యాపి చరిత్రం పరమాద్భుతం || 71 ||

తత్సర్వం కామసిద్ధ్యర్థం స్నాయాత్కుండే హునూమతః || 72 ||

అధ్యాయమే సంపఠతే మనుష్యః | శ్రుణోతి వా యః సుసమాహితో ద్విజాః

సోనంత మాప్నోతి సుఖం పరత్ర | క్రీడేత సార్ధం దివిదేవవృందైః || 73 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే హనుమత్కుండ ప్రశంసాయాం ధర్మసఖశత పుత్రావాప్తి వర్ణనం నామపంచదశోధ్యాయః || 15 ||

తా|| కొంతకాలం గడిచాక పదవమాసంలో నూర్గురు భార్యలు నూర్గురు గుణవంతులైన పుత్రులను ప్రసవించారు (61) వీరుడు ధర్మసఖరాజు సంతోషపడి, స్నానం చేసి శుద్ధుడై సంకల్పంచేసి వారికి జాతకర్మ ఆచరించాడు (62) బ్రాహ్మణులకు గోభూతిల హిరణ్యాదులను చాలా దానం చేశాడు. పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు ముందు పుట్టిన వాడు తర్వాతివాడు (63) అందరూనూ టొక్కకుమారులు వృద్ధి చెందారు. వారు ప్రౌఢులయ్యాక ఈ రాజు వారికి రాజ్యం విభజించి ఇచ్చి (64) గంధమాదన పర్వతమునకు సేతువునకు భార్యతో కూడా వెళ్ళాడు. హనుమత్కుండం చేరి దాని తీరంలో తపమాచరించాడు (65) తపస్సుచేస్తున్న రాజునకు చాలాకాలం గడిచిపోయింది. శివుని ధ్యానించే ఈ ధర్మసఖరాజునకు చాలా కాలం గడిచింది. (66) గడిచాక రాజు, ధార్మికుడు శాంతమానసుడు అక్కడ మరణించాడు (67) ఆతని భార్యలు, భర్తను అనుసరించారు. జ్యేష్ఠపుత్రుడు సుచంద్రుడు తండ్రికి నంస్కారంచేసి (68) శ్రద్ధతో శ్రాద్ధపర్యంతమైన కర్మలన్నీ ఆచరించాడు. ఇక్కడ మరణించటంవల్ల రాజు భార్యలతో సహ వైకుంఠం చేరాడు (69) ప్రకాశవంతులైన సుచంద్రముఖ్యులైన రాజపుత్రులందరు అన్నతమ్ములు మాత్సర్యం వదలి తమతమ రాజ్యాన్ని అనుభవించారు. (70) ఈ విధముగా మీకు హనుమత్కుండ వైభావాన్ని చెప్పాను ఓ బ్రాహ్మణులారా ! రాజైన ధర్మసఖుని చరిత్రాన్ని అద్భుతమైన దాన్ని చెప్పాను (71) హనుమత్కుండంలో కామసిద్ధి కొరకు స్నానం చేయాలి (72) ఈ అధ్యాయాన్ని పఠించేవారు, శ్రద్ధతో వినేవారు ఇక్కడ అనంతసుఖాన్ని పొందుతారు పరలోకంలో దేవలోకంలో దేవతలో సహా క్రీడిస్తారు. (73) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఎనుబది ఒక్క వేల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు హనుమత్కుండ ప్రశంసయందు ధర్మసఖునకు నూర్గురు పుత్రులు కల్గుటను వర్ణించుట అనునది పదునైదవ అధ్యాయము || 15 ||.

Sri Scanda Mahapuranamu-3    Chapters