Sri Scanda Mahapuranamu-3    Chapters   

ద్వితీయోధ్యాయము

ఋషయ ఊచుః-

కథంసూత మహాభాగరామేణా క్లిష్టకర్మణా l సేతుర్బద్ధోనదీనాథే హ్యగాధేవరుణాలయే ll 1 ll

సేతౌచకతితీర్థాని గంధమాదన పర్వతే l ఏతన్నః శ్రద్ధధానానాం బ్రూహి పౌరాణికోత్తమ ll2 ll

తా ll ఋషులు ఇట్లా అడిగారు. ఓ మహానుభావ! సూతుడ ! ఏపనినైనా సులభంగా చేయగల రాముడు, అగాధమైన లోతుగల, నదులకు నాథుడైన సముద్రునిమీద సేతువును ఎట్లా నిర్మించాడు. (1) సేతువు యందు, గంధ మాదన పర్వతమందు ఎన్ని తీర్థములున్నాయో శ్రద్ధగా (వినదలచిన) మాకు ఈ విషయాలు చెప్పండి ఓపౌరాణిక శ్రేష్ఠ! అని (2).

సూత ఉవాచ ll

రామేణహి యథాసేతుః నిబద్ధో వరుణాలయే l తదహం సంప్రవక్ష్యామి యుష్మాకంముని వుంగవాః ll3 ll

అజ్ఞయాహి పితూరామోన్యవ సద్దండకావనే l సీతాలక్ష్మణ సంయుక్తః పంచపట్యాం సమాహితః ll 4 ll

తస్మిన్నివసతః తస్యరాఘవస్య మహాత్మనః రావణన హృతాభార్యా మారీచ ఛద్మనాద్విజాః ll 5 ll

మార్గమాణోవనే భార్యాం రామోదశరధాత్మజః | పంపాతీరేజగామాసౌ శోకమోహ సమన్వితః ll 6 ll

దృష్టవాన్‌ వానరం తత్ర కంచిద్ద శరథాత్మజః l వానరేణాథ వృష్టో యం కోభవానీతిరాఘవః ll 7 ll

ఆదితః స్వస్య వృత్తాంతం తసై#్మప్రోవాచ తత్త్వతః | అథారాఘవ సంపృష్టో వానరః కోభవానితి ll 8 ll

సోపివిజ్ఞాపయామాన రాఘవాయ మహాత్మనే l అహం సుగ్రీవ సచివోహనుమాన్నామ వానరః ll9 ll

తేనచప్రేరితో 7భ్యాగాం యువాభ్యాం సఖ్యమిచ్ఛతా l అగచ్ఛతంతత్‌ భద్రంవాం సుగ్రీవాంతి కమాశువై ll10 ll

తథాస్త్వితి సరామో7పి తేన సాకం మునీశ్వరాః సుగ్రీవాంతిక మాగత్య సఖ్యం చక్రేగ్ని సాక్షికం ll 11 ll

ప్రతిజజ్ఞే7థ రామోపి తసై#్మ వాలి వధం ప్రతి | సుగ్రీవశ్చాపి వైదేహ్యాః పునరాయనం ద్విజాః ll 12 ll

తా ll సూతుడు ఇట్లా అన్నాడు - ఓమహర్షి శ్రేష్ఠులారా ! సముద్రమందు రాముడు సేతువును ఎట్లా నిర్మించాడో దానిని మీకు బాగా వివరిస్తాను (3) తండ్రి అజ్ఞతో రాముడు దండకారణ్యంలో ఉంటున్నాడు - సీతాలక్ష్మణులతో కూడి పంచవటి యందు బాగా ఉన్నప్పుడు (4) మహాత్ముడైన రాముని భార్యను మారీచునినెపంగా రావణుడు అపహరించాడు. (5) దశరధకుమారుడైన రాముడు తన భార్యను అరణ్యంలో వెతుకుతూ, శోకమోహములకులోనౌతూ పంపానదీతీరానికి చేరాడు (6) అక్కడ రాముడు ఒక వానరుణ్ణి చూచాడు ''నీవెవరు?'' అని ఆవానరుడు రాముణ్ణి అడిగాడు (7) అప్పుడు రాముడు తన వృత్తాంతాన్ని మొదటి నుండి ఆ వానరునికి ఉన్నదున్నట్టుగా చెప్పాడు. ఆ తరువాత రాముడు, ఆ వానరుణ్ణి ''నీవెవరు'' అని అడిగాడు (8) అప్పుడాతడు తన వృత్తాంతాన్ని రామునకు చెప్పాడు ఇట్లా - నేను హనుమంతుడను పేరుగల వానరుడను. సుగ్రీవునకు మంత్రిని (9) మీతో స్నేహంకోరి, ఆతడు పంపగా వచ్చాను. రండి సుగ్రీవుని దగ్గర మీకంతా భద్రమే (క్షేమమే) అని (10) అట్లాగే కానిమ్మని రాముడు కూడా ఆ వానరునితో పాటు సుగ్రీవుని దగ్గరకొచ్చాడు. సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు రాముడు. (11) వాలిని వధిస్తానని సుగ్రీవునితో ప్రతిజ్ఞచేశాడు రాముడు. సీతను తిరిగి తెప్పిస్తానని సుగ్రీవుడు రామునితో అన్నాడు (12).

మూ ll ఇత్యేవం సమయం కృత్వా విశ్వాస్య చవరస్పరం l ముదా పరమయా యుక్తౌ సరేశ్వర కపీశ్వరౌ ll13 ll

ఆసాతే బ్రహ్మణ శ్రేష్ఠాః ఋష్యమూకగిరౌతథా l సుగ్రీవ ప్రత్యయార్థంచ దుందుభేః కాయమాశువై ll14 ll

పా దాంగుష్ఠేన చిక్షేపరాఘవో బహుయోజనం l సప్తతాలా వినిర్భిన్నా రాఘవేణ మహాత్మనా ll15 ll

తతఃప్రీతమనావీరః సుగ్రీవోరామమ బ్రవీత్‌ l ఇంద్రాది దేవతా భ్యో పినాస్తి రాఘవ మే భయం ll16 ll

భవాన్‌ మిత్రంమయాలబ్ధోయుస్మాదతి పరాక్రమః | అహంలంకేశ్వరం హత్వా భార్యామానయితాస్మితే ll 17 ll

తతఃసుగ్రీవ సహితో రామచంద్రో మహాబలః l సలక్ష్మణోయ¸°తూర్ణం కిష్కంధాం వాలిపాలితాం ll 18 ll

తతోజగర్ణ సుగ్రీవో వాల్యాగ మన కాంక్షయా l అమృష్‌యమాణోవాలీ చగర్జితం స్వానుజస్యవై ll 19 ll

అంతః పురాద్వినిష్క్రమ్యయు యుధే7 పరజేనసః l వాలిముష్టిప్రహారేణతాడితోభృశ విహ్వలం ll 20 ll

సుగ్రీవోనిర్గతః తూర్ణం యత్రరామో మహాబలః l తతోరామో మహాబాహుః సుగ్రీవస్యశిరోధరే ll 21 ll

లతామాబధ్య చిహ్నంతు యుద్ధాయాచోదయత్తదా l గర్జితేన సమాహూయు సుగ్రీవో వాలినం పునః ll 22 ll

రామప్రేరణయా తేన బాహుయుద్ధమథా కరోత్‌ l తతో వాలిన మాజఘ్నేశ##రేణౖకేన రాఘవః ll 23 ll

హతేవాలిని సుగ్రీవః కిష్కింధాం ప్రత్యపద్యత l తతోవర్షాస్వతీతాను సుగ్రీవో వానరాధిపః ll24 ll

సీతామానయితుం తూర్ణం వానరాణాం మహాచమూం l సమాదాయ సమాగచ్ఛ దంతికంనృపపుత్రయోః ll 25 ll

ప్రస్థావయామా సకపీన్‌ సీతాన్వేషణ కాంక్షయా l విదితాయాంతువైదేహ్యాం లంకాయాం వాయుసూనునా ll 26 ll

దత్తే చూడామణౌచాపి రాఘవోహర్షశోకవాన్‌ l సుగ్రీవేణానుజే నాపి వాయువుత్రేణ ధీమతా ll27 ll

తథాన్యైః కపిభిశ్చైవ జాం బవన్నల ముఖ్యకైః l అన్నీయమానోరామో సౌ ముహూర్తే 7భితిద్విజాః ll28 ll

విలంఘ్యవి విధాన్‌ దేశాన్‌ మహేంద్రం పర్వతం య¸° l చక్రతీర్థం తతోగత్వానివాస మకరోత్తదా ll 29 ll

తాll ఈరకంగా ఇద్దరు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని, ఒకరినొకరు సమ్మికపీశ్వరనరేశ్వరులు (సుగ్రీవరాములు) పరమసంతోషంతో కలిసి(13) ఉన్నారు, ఋష్యమూకపర్వతం మీద సుగ్రీవునకు కలగటంకోసం రాముడు దుందుభిశరీరాన్ని (14) తనకాలి బొటన వేలితో అనేకయోజనముల దూరం చిమ్మాడు. అట్లాగే ఏడు తాటిచెట్లను రాముడు ఛేదించాడు (15) అప్పుడు సంతోషపడ్డ సుగ్రీవుడు రామునితో ఇట్లా అన్నాడు. ఓరామ ! నాకు ఇంద్రాది దేవతల నుండి కూడా భయంలేదు (16) ఎందువల్లనంటే, బాగా పరాక్రమవంతుడవైన నీవునాకు స్నేహితునిగా లభించావుగదా. నేను రావణుని చంపి నీ భార్యను తీసుకొస్తాను, అని (17) ఆ పిదప బలవంతుడైన రాముడు సుగ్రీవ లక్ష్మణులతో కూడివాలి పాలించే కిష్కింధా నగరానికి త్వరగా వెళ్ళాడు (18) వాలి (నగరంనుండి) బమటికి రావాలనే ఉద్దేశ్యంతో, సుగ్రీవుడు గర్జించాడు. వాలి, తన తమ్ముని గర్జననుసహించలేనివాడై, (19) అంతఃపురం నుండి బయటకి వచ్చి తమ్మునితో కూడా యుద్ధం చేశాడు. వాలి, పిడికిలి దెబ్బలను తిని బాగా కలత చెంది (20) సుగ్రీవుడు రాముడున్న చోటికి వేగంగా వచ్చాడు. అప్పుడు రాముడు సుగ్రీవుని తల క్రింద (మెడలో) (21) గుర్తుగా ఒక తీగను కట్టి యుద్ధానికి తిరిగి ప్రేరేపించాడు. తన గర్జనతో సుగ్రీవుడు వాలిని తిరిగి (యుద్ధానికి) పిలిచి (22) రాముని ప్రేరణతో సుగ్రీవుడు వాలితో బాహుయుద్ధం చేయునారంభించాడు. అంతలో రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు (23) వాలి మరణించాక సుగ్రీవుడు కిష్కింధకు చేరాడు. ఆ తర్వాత వర్షాకాలం గడిచాక వానరుల కథిపతియైన సుగ్రీవుడు (24) సీతను తొందరగా తీసుకురావటంకోసం వానరుల మహాసైన్యాన్ని తీసుకొని రాకుమారుల దగ్గరకు వచ్చాడు (25) సీతను వెతుకుట కొరకు వానరులను బయలుదేర దీశాడు. హనుమంతుడు లంకలో సీతజాడతెలుసుకున్నాక (26) చూడామణులను (హనుమంతుడు) ఇచ్చాక, ఆనందమున ధుఃఖమును పొందిన (జాడ తెలియటం ఆనందం, ఆమెదుఃఖం గురించి వినటం దుఃఖకారణం) రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, (27) జాంబవంతుడు, నలుడు ఇంకా ఇతరులైన వానరులతో కూడినవాడై (రాముడు) అభిజిత్‌ ముహూర్తంలో బయలుదేరి (28) అనేక దేశములను దాటి మహేంద్ర పర్వత ప్రాంతం చేరాడు. అక్కడున్న చక్రతీర్థమునకు వెళ్ళి అక్కడ నివాసం చేశాడు (29).

మూ ll తత్రైవతు సధర్మాత్మా సమాగచ్ఛ ద్విభీషణః l భ్రాతావైరాక్ష సేంద్ర స్యచతుర్భిః సచివైః సహ ll 30 ll

ప్రతి జగ్రాహరామస్తం స్వాగతేన మహత్మనా l సుగ్రీవస్యతు శంకాభూత్‌ ప్రణిదిః స్యాదయంత్వితి ll 31 ll

రాఘవ ః తస్యచేష్టాభిః సమ్యక్‌స్వచరితైర్‌ హితైః | అదుష్టమేనం దృష్ట్వై వతత ఏనమపూజయత్‌ ll 32 ll

సర్వరాక్షస రాజ్యేతం అభిషించ ద్విభీషణం l చక్రేచమంత్రి ప్రవరం సదృశం రవిసూనునా ll33ll

చక్రతీర్థం సమాసాద్య నివసద్రఘునందనః | చింతయన్‌ రాఘవః శ్రీమాన్‌ సుగ్రీవాదీన భాషత ll34ll

మధ్యేవానరమఖ్యానాం ప్రాస్తకాలమిదం వచః | ఉపాయః కోను భవతాం ఏత త్సాగర లంఘనే ll 35 ll

ఇయంచ మహతీ సేనా సాగరశ్చాపి దుస్తరః l అంభోరాశిరయం నీలః చంచలోర్మి సమాకులః ll36 ll

ఉద్యన్మత్స్యో మహాసక్ర శంఖశుక్తిసమాకులః l క్వచిదౌర్వాసలాక్రాంతః ఫేన వానతి భీషణః ll37 ll

ప్రకృష్టపవనాకృష్టనీల మేఘ సమన్వితః l ప్రలయాం భోధరా రావః సారవాననిలో ధ్ధతః ll38 ll

కధంసాగర మక్షోభ్యం తరామో వరుణాలయం l సైన్యైః పరివృతాః సర్వే వానరాణాం మహౌజసాం ll39 ll

ఉపాయైరధిగచ్ఛామో యథానదనదీపతిం l కథంతరామః సహసాససైన్యా వరుణాలయం ll 40 ll

శతయోజన మాయాతం మనసాపి దురాసదం l అతోనువిఘ్నాబహవః కథం ప్రాప్యాచమైథిలీ ll41 ll

కష్టాత్‌కష్టతరం ప్రాప్తా వయమద్యనిరాశ్రయాః l మహాజలే మహావాతే సముద్రేహి నిరాశ్రయే ll 42 ll

ఉపాయంకం విధాస్యామః తరణార్థం వనౌకసాం l రాజ్యాత్‌ భ్రష్టోవనం ప్రాప్తో హృతాసీతామృతః పితా ll 43 ll

ఇతోపిదుస్సహందుఃఖ యత్‌ సాగర విలంఘనం l ధిక్‌ ధిక్‌ గర్జిత మంభోధేః ధిగేతాం వారిరాశితాం ll44 ll

కథం తద్వచనం మిథామహర్షేః కుంభజన్మనః l హత్వాత్వం రావణం తత్ర పవిత్రే గంధమాదనే ll 45 ll

పాపోవశమనాయాశు గచ్ఛస్వేతి యదీరితం ll 45 1/2 ll

తా|| రావణునికి తమ్ముడైన, ధర్మాత్ముడైన విభీషణుడు నలుగురు మంత్రులతో కూడి అక్కడికే (చక్రతీర్థం) వచ్చాడు. (30) గొప్పగా స్వాగతంచేసి రాముడు ఆ విభీషణుని స్వీకరించాడు. ఈ విభీషణుడు గూఢచారి ఐయ్యుండవచ్చు అని సుగ్రీవునకు అనుమానం వచ్చింది (31) రాముడు మాత్రము, విభీషణుని చేష్టలతో, ఆతనిహితకరమైన నడవడికలతో ఆతనిని మంచివానిగా (అదుష్టునిగా) గ్రహించి, ఆ పిదప ఆతనిని పూజించాడు. (32) రాక్షసరాజ్యమునకంతకు ఆ విభీషణుని రాజుగా అభిషేకించాడు. సుగ్రీవునితో సమానమైన వానిని శ్రేష్టుని మంత్రిగా ఏర్పరచాడు (33) ఆపిదప రాముడు చక్రతీర్థానికి వచ్చి వసించాడు. సుగ్రీవుడు మొదలగువారు ఇతర వానర శ్రేష్ఠులు చుట్టూ ఉండగా విచారంతో రాముడు (34) యోగ్యమైన కాలాన్ని గమనించి ఇట్లా వారితో అన్నాడు. ఈ సముద్రాన్ని దాటటానికి మీకు (తోచిన) ఉపాయం ఏది? (35) ఇదేమో పెద్ద సైన్యము. ఈ సముద్రమో దాటడానికి శక్యం కానిది. ఈ నీలపువర్ణం కల జలరాశి (సముద్రము) చంచలమైన అలలతో కూడి ఉంది. (36) ఎగురుతున్న చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు, శంఖములు, ముత్యములు వీటితో వ్యాకులమైంది. ఒక్కోచోట బడబానలంతో ఆక్రమించబడింది. ఒక్కోచోట నురుగుతోనిండి, మహాభయంకరంగా ఉంది. (37) పెద్ద పెద్ద గాలులతో లాగబడ్డ నల్లని మేఘములతో కూడిందిది. ప్రళయ కాలమందలి మేఘగర్జన వంటి ధ్వని గలది. గాలితో చాలా ఉద్దృతంగా ఉంది. జల సమృద్ధమైంది (38) ఈ సముద్రమును ఏకలత లేకుండా ఎట్లా దాటగలము అందరూ తమ వానర సైన్యములతో కూడి ఉన్నారు (39) నదములకు నదులకు పతియైన ఈ సముద్రుణ్ణి ఏ ఉపాయంతో అధిగమిద్దాము. తొందరగా, సైన్యములతో కూడి ఈ సముద్రాన్ని ఎట్లా దాటుదాము (40) శతయోజన విస్తీర్ణమైనదిది మనస్సుతోకూడా చేరడానికి వీలు కానిదిది. పైగా అనేక విఘ్నాలు. మరి సీతను పొందుట ఎట్లా? (41) కష్టముకన్న ఇంకా కష్టమైన స్థితికి వచ్చాము. ఇవ్వాళ మనము ఆశ్రయంలేని వాళ్ళమైనాము. నిరాశ్రయులమై బాగా నీళ్ళు, అధికమైన గాలిగల సముద్రాన్ని (42) ఈ వానరులంతా దాటే కొరకు ఏ ఉపాయాన్ని చేద్దాము. రాజ్యము పోవటం అడవికి రావటం, సీతను (రావణుడు) ఎత్తుకు పోవటం, తండ్రి మరణించటం (43) వీటన్నింటికంటే భరింపరాని దుఃఖము ఏమంటే ఈ సముద్రాన్ని దాటటం అయ్యో! ఎంతటి దయనీయస్థితి ఈ సముద్ర గర్జనలకు (సిగ్గు సిగ్గు) జలరాశికి తిరస్కారము (44) మహర్షియైన అగస్త్యుని వచనము అబద్ధం ఎట్లా ఔతుంది. పవిత్రమైన గంధమాన పర్వత ప్రాంతంమునకు నీవు రావణుని చంపి (45) పాపం నశింపచేసే కొరకు తొందరగా వెళ్ళు అని అగస్త్యుడు చెప్పిన మాట అబద్ధం ఎట్లా ఔతుంది. (451/2).

శ్రీనూత ఉవాచ ||

ఇతిరామవచః (శుత్వా సుగ్రీవప్రముఖాః తదా || 46 ||

ఊచుః ప్రాంజలయః సర్వే రాఘవంతం మహాబలం నౌభిరేనం తరిష్యామః ప్లవైశ్చ వివిధైరతి || 47 ||

మధ్యేవానర కోటీనాం తదోవాచ విభీషణః |సముద్రం రాఘవోరాజా శరణం గంతుమర్హతి || 48 ||

ఖనితః సాగరై రేష సముద్రో వరుణాలయః | కర్తు మర్హతి రామస్య తత్‌ జ్ఞాతేః కార్యమంబుధిః || 49 ||

విభీషణ నైవముక్తో రాక్షసేన విపశ్చితా | సాంత్వయన్‌ రాఘవ న్సర్వాన్‌ వానరానిదమ బ్రవీత్‌ || 50 ||

శతయోజన విస్తార మశక్తాః సర్వవానరాః | తర్తుం ప్లవోడుపై రేనం సముద్రమతి భీషణం || 51 ||

నావో న సంతిసేనాయాః బహ్వ్యా నానరవుంగవాః | వణి జాముపఘాతంచకథమస్మద్విధశ్చరేత్‌ || 52 ||

వస్తీర్ణం చైవనః సైన్యం హన్యాత్‌ ఛిద్రేషువా పరః | ప్ల వోడు పప్రతారో7 తోనైవాత్రమ మరోచతే || 53 ||

విభీషణోక్తమేవేదం మోదతే మమవానరాః | అహంత్విమంజలనిధిం ఉపాస్యే మార్గసిద్ధయే || 54 ||

నో చేద్దర్శయి తామార్గం ధక్షామేన మహంతదా | మహాసై#్రః అప్రతి హతైః అత్యగ్ని వవనోజ్జ్వలైః || 55 ||

ఇత్యుక్త్వాసహసౌమిత్రిః ఉపస్పృశ్యాథరాఘవః | ప్రతిశిష్యే జలనిధిం విధివత్‌ కుశసంస్తరే || 56 ||

తా || శ్రీ నూతులు ఇట్లా అన్నారు. అనే రాముని మాటలను విని, సుగ్రీవుడు మొదలగు పెద్దలంతా (46) చేతులు జోడించి మహా బలవంతుడైన రామునితో ఇట్లా అన్నారు. నావలతో వివిధములైన తెప్పలతో సముద్రాన్ని దాటుదాము అని (47) అప్పుడు వానర సమూహం మధ్యలోనున్న విభీషణుడు ఇట్లా అన్నాడు. రాజైన రాఘవుడు సముద్రుణ్ణి శరణు వేడాలి (48) ఈ వరుణునకు నిలయమైన సముద్రము సగరపుత్రులచే త్రవ్వబడింది. వారికి జ్ఞాతియైన ఈ రాముని కార్యాన్ని సముద్రుడు చేయవలసినవాడు (49) అని విద్వాంసుడైన రాక్షసుడైన విభీషణుడు ఇట్లా చెప్పిన పిదప, రాముడు వానరులందరిని ఓదారుస్తూ ఇట్లా అన్నాడు (50) శతయోజన విస్తీర్ణమైన అతి భయంకరమైన, సముద్రమును వానరులందరు దోనెలతో తెప్పలతో దాటలేరు (51) వానర శ్రేష్టులు ఎక్కువగా ఉన్నారు. ఈ సైన్యానికి సరిపోయే ఎక్కువ నావలులేవు నాలాంటివాడు వ్యాపారస్థులకు ఇబ్బందికలిగేట్టుగా ఎట్లానడుస్తాడు (52) మనసైన్యం చాలా విస్తారంగా ఉంది. శత్రువు మన లోపం గుర్తించి చంపవచ్చు. అందువల్ల నాకు తెప్పలతో బల్లకట్టులతో, దోనెలతో, మోసపోవటం ఇష్టం లేదు. (53) విభీషణుడు చెప్పిందే నాకు ఇష్టమైంది ఓ వానరులారా! మార్గసిద్ధికొరకు నేను ఈ సముద్రాన్ని ఉపాసిస్తాను. (54) మార్గం చూపని పక్షంలో అప్పుడు సముద్రుణ్ణి నేను కోపగిస్తాను. ఎదురు లేని మహాస్త్రములతో, అగ్నిని మించిన వాయువును మించి వెలిగిపోతున్న బాణములతో (బెదిరిస్తాను) (55) అని రాముడు పలికి లక్ష్మణునితో కూడిన వాడై రాముడు సముద్రపు నీటిని ముట్టి (సంకల్పించి) శాస్త్ర ప్రకారము దర్భలతో చేసిన పడక యందు కూర్చొనెను.

మూllతదారామ ః కుశాస్తీర్ణే తీరేనదన దీపతేః సం వివేశమహాబాహు ః వేద్యామివ హుతాశనః ll57ll

శేషభోగనిభంబాహుమువధాయ రఘాద్వహ ఃl దక్షిణో దక్షిణం బాహుముపాస్తే మకరాలయం ll58ll

తస్యరామస్య సుప్తస్యకు శాస్తీర్ణేమహీతలే l నియమాదప్రమత్తస్యనిశాస్తి సో7తిచక్రముః ll59ll

సత్రిరాత్రోషితస్తత్ర నయజ్ఞో ధర్మతత్పరఃl ఉపాస్తే స్మతదారామ ః సాగరం మార్గసిద్ధయే ll60 ll

నచ దర్శయ తేమంద ః తదారామస్య సాగరః l ప్రయతేనాపిరామేణ యథామపిపూజిత ll61ll

తథాపి సాగరోరామం సదర్శయతిచాత్మన ః l సముద్రాయ తతః క్రుద్ధోరామో రక్తాం తలోచనః ll62ll

సమీపర్తినం చేదం లక్ష్మణం ప్రత్యభాషత l అధ్యమద్బాణ నిర్భన్నైః మకరై ః వరుణాలయం ll63ll

నిరుద్ధతోయం సౌమిత్రే కరిష్యామి క్షణాదహం సశంఖ శుక్తా జాలంహి సమీన మకరం శ##నైః ll64ll

అద్యబాణౖ రమోఘాసై#్రః వారిధిం పరిశోషయే!క్షమయామీనమాయుక్తం మామయం మకరాలయః ll 65 ll

అసమర్థం విజానాతి ధిక్‌ క్షమామీదృశేజనే l న దర్శయతి సామౄమే సాగరోరూపమాత్మన ః ll66ll

చాపమానయసౌమిత్రే శరాంశ్చాశి విషోపమాన్‌ l సాగరం శోషయిష్యామి వద్భ్యాం యాంతాప్లవంగమాః ll67ll

ఏనం లంఫిత మర్యదం సహస్రోర్మి సమాకులం lనిర్మద్యాదం కరిష్యామి సాయకైర్వరూణాలరుం l ll68ll

మహార్ణవం శోషయిష్యే మహాదానవ సంకులం l మహామకర న క్రాఢ్యం మహావీచి సమాకులం ll69ll

ఏవముక్త్వాధనుష్పాణి ః క్రోధవర్యాకులేక్షణః l రామోబభూవదుర్ధర్షః త్రిపురఘ్నోయధాశివః ll70ll

ఆకృష్యచాపం కోపేన కం పయిత్వాశ##రైర్‌ జగత్‌ l ముమోచవి శిఖానుగ్రాన్‌ త్రిపురేషు యథాభవ ః ll71ll

దీప్తా బాణాశ్చయేఘోరాః భాసయన్తోదిశోదశ l ప్రావిశన్‌ వారిధే స్తోయం దృప్తదానవసంకులం ll72ll

సముద్రస్తు తతోభీతో వేపమాన ః క్తృతాంజలి ః l అనన్యశరణోవిప్రాఃపాతాలాత్‌ స్వయముత్థితః ll 73 ll

శరణం రాఘవ భేజే కైవల్యపదకారణం l తుష్టావరాఘవం విప్రాభూత్వాశ##బ్దైః మనోరమైః ll74ll

తాll నదములకు నదులకు పతియైన సముద్రుని తీరమందు, కుశాస్తరణమందు దీర్ఝబాహువులు కలరాముడు, వేదికయందు అగ్ని వలె ప్రవేశించాడు (ఉన్నాడు) (57)దాక్షిణ్యము గల రాముడు, అదిశేషుని పడగవంటి తన దక్షిణ బాహువును తలగడగా ఉంచుకొని సముద్రతీర మందు ఉపాసిస్తూ ఉన్నాడు (58)భుమిపై దర్భల పడకయందు, నియమాలనుండి అతిజాగరూకడై నిద్రిస్తున్న రామునకు మూడురోజలు గడిచాయి (59)నీతి తెలిసిన, ధర్మతత్పరుడైన రాముడు అక్కడ అట్లా మూడు రాత్రులు ఉండి మార్గసిద్ధి కొరకు సమద్రుణ్ణి ఉపాసిస్తున్నాడు (60) రాముడు యోగ్య మగునట్లుగా పూజించి, ప్రయత్నించినా సముద్రుడు కొంచంగానైనా రామునకు కన్పించలేదు (61)రామునకు, తన రూపం కొంచమైనా చూపని సముద్రునిపై రాముడుకోపగించి కళ్లు ఎర్రబడ్డవాడై(62)దగ్గరలో ఉన్న లక్ష్మణునితో ఇట్లా అన్నాడు ఈ వేళనా బాణములతో మొసళ్ళను ఛేదించి వాటితో సముద్రము (63)నీరంత అడ్డగించబడేట్టు క్షణాల్లో నేను చేస్తాను. శంఖముల ముత్యముల సమూహములు, చేపలు మొసళ్ళు (64)గల సముద్రమును మెల్లగా, వ్యర్థము కాని అస్త్రములుగల నాబాణములతో ఎండింపచేస్తాను . ఓర్పువహించిన నన్ను ఈ సముద్రుడు (65)అసమర్ధునిగా భావిస్తున్నాడు. ఇటువంటి వానిపై ఓర్పువహించటం వ్యర్థము. సామమ (ఒక ఉపాయం) తో ఈ సముద్రుడు తన రూపాన్ని నాకు చూపటం లేదు (66)ఓ లక్ష్మణా! ధనస్సును, సర్పములవంటి బాణములను తీసుకొనిరా . ఈ సముద్రాన్ని ఎండగొడ్తాను. వానరులందరు నడిచివెళ్ళని. (67)వేల అలలతో కూడిన మర్యాదనతిక్రమించిన ఈ సముద్రుణ్ణి నాబాణాలతో మర్యాదలేకుండా చేస్తాను . (68)గొప్పదానవులతో కూడిన, గొప్పగొప్ప మకరములతో సక్రములతో కూడిన (పెద్దచేపలు) పెద్దపెద్ద అలలతో కుడిన ఈ పెద్ద సముద్రాన్ని ఎండింప చేస్తాను. (69) అని లక్ష్మణునితో ఇట్లా అని కోపముతో నిండిన చూపులుగలవాడై చేత ధనస్సు ధరించిన రాముడు, త్రిపురులను సంహారం చేసిన శివునిలా ఎదిరింపరాకుండా ఉన్నాడు. (70)కోపంతో ధనస్సునులాగి, తన బాణములతో ప్రపంచాన్ని కంపింపచేస్తూ, త్రిపురాసులపై భవుడు బాణములు వదలినట్టు, ఉగ్రమైన బాణములను రాముడు సముద్రునిపై వదిలాడు (71) మండిపోతున్న ఘోరమైన బాణములు దిక్కులన్నింటిని వెలిగింప చేస్తూ, మదించిన దానవులతో సంకులమైన సముద్రపు నీటిలోకి ప్రవేశించాయి (72)ఆపిదప, సముద్రుడు భయపడి, వణుకుతూ, చేతులు జోడించి, మరొక రక్షకుడు లేనివాడై బ్రాహ్మణుడుగా పాతాళము నుండి స్వయంగా వచ్చాడు (73)ముక్తిపదమునకు కారకుడైన రాముణ్ణి శరణు వేడాడు. బ్రాహ్మణుడుగా మారి మధురమైన మాటలతో రాముణ్ణి సంతోష పరిచాడు (74).

మూll సముద్ర ఉవాచ -నమామి తేరాఘవ పాదపంకజం l సీతాపతేసౌఖ్యదపాదసేవనాతే

నమామితే గౌతమ దారమోక్షజం lశ్రీపాదరేణుం సురవృందసేవ్యం ll75ll

సుంద ప్రియాదేహ విదారిణనమో l నమోస్తు తేకౌశిక యాగరక్షిణ

నమోమహాదేవ శరాసభేదినే నమోనమో రాక్షస సంఘనాశినే ll76ll

రామరామనమస్యామి భక్తానామిష్ట దాయినం lఅవతీర్ణో రఘకులే దేవకార్యచి కీర్షయా ll77ll

నారాయణ మనాద్యంతం పమోక్షదంశివ మచ్యుతంlరామరామ మహాబాహో రక్షమా శరణాగతం ll78ll

కోపం సంహర రాజేంద్ర క్షమస్వకరుణాలయl భూమిర్వాతో వియచ్చాపోజ్యోతీంషిచరఘాద్వహ ll79ll

యత్‌ స్వభావాని సృష్టాని బ్రహ్మణా పరమేష్ఠినా l వర్తంతే తత్‌ స్వభావాని స్వభావోమే హ్యగాధతా ll80ll

వికారస్తు భ##వేద్గాథ ఏతత్సత్యం వదామ్మహం lలోభాత్‌ కామాత్‌ భయాద్వాపి రాగాద్వాపి రఘూద్వహ ll81ll

నవంశ జంగుణంహాతు ముత్సహోయం కథంచన l తత్కరిష్యే చసాహాయ్యంం సేనాయాస్తరణతవ ll82ll

ఇత్యుక్తవంతం జలధిం రామో7వా దీన్న దీపతిం lససైన్యో హంగమిష్యామిలంకాంరావణ పాలితాం ll83ll

తచ్ఛోషముపయాహిత్వం తరణార్థం మమాధునా lఇత్యుక్తస్తంపునః ప్రాహరాఘవం వరుణాలయఃll84ll

శృణుష్వావహితో రామశ్రుత్వాకర్తవ్యమాచర l యద్యాజ్ఞయా తేశుష్యామి ససైన్యస్యయియా సతః ll85ll

అన్యేప్యాజ్ఞాన యిష్యంతి మావేవంధనుషో బూల్‌ l ఉపాయమన్యం వక్ష్యామి తరణార్థం బలస్యతే ll86ll

అస్తిహ్యత్రనలో నామనానరః శిల్పి సంమతః lత్వష్టుః కాకుతే స్థతనయోబలవాన్‌ విశ్వకర్మణః ll87ll

సయత్‌ కాష్ఠం తృణం వాపి శిలాం వాక్షేప్స్యతేమయి lసర్వం తద్ధారయిష్యామి సతే సేతుర్భవిష్మతి ll88ll

సేతునాతేనగచ్ఛత్వం లంకాం రావణ పాలితాం l ఉక్త్వేత్యం తర్వితే తస్మిన్‌ రామోనలమువాచహ ll89ll

కురుసేతుం సముద్రేత్వం శక్తోహ్యపి మహామతే l తదా బ్రవీన్నలో వాక్యం పరామం ధర్మభృతాంవరం ll90ll

అహం సేతుం విధాస్యామి హ్యగా ధేవరుణాలయే lపిత్రాదత్త వరశ్చాహం సామర్థ్యే చాపి తత్సమః ll 91 ll

మాతుర్మమవరోదత్తో మందరే విశ్వకర్మణా l శిల్పకర్మణి మత్తుల్యో భవితా తే సుతస్త్వితి ll 92 ll

పుత్రో హామౌరసస్తస్యతుల్యోవై విశ్వకర్మణా l అద్వైవ కామంబ ధ్నంతు సేతుం వానరపుంగవా ః ll93ll

తాll సముద్రుడు ఇట్లా అన్నాడు - ఓరాఘవనీ పద్మములవంటి పాదములకు నమస్కరింస్తున్నాను ఓసీతాపతి !నీపాదసేవవలన సౌఖ్యాన్ని ఇస్తావు. గౌతముని భార్యకు మోక్షమిచ్చిన, దేవతల సమూహంతో సేవించబడే నీ శ్రీ పాదముల ధూళికి సమస్కరింస్తున్నాను (75)సుందుని ప్రియురాలి దేహమను నాశనమ చేసిన నీకు నమస్కారము విశ్వామిత్ర యాగమును రక్షించిన నీకు నమస్కారము. శివుని ధనస్సును విరిచిన నీకు నమస్కారము, రాక్షస సంఘమును నాశనము చేసిన నీకు నమస్కారము (76)భక్తులకు ఇష్టమైన దానిని ఇచ్చేరామ ! నమస్కరిస్తున్నాను. దేవతల కార్యం నెరవేర్చుట కొరకు రఘకులంలో అవతరించావు (77)నారాయణుడవు. ఆద్యంతరహితుడవు, మెక్షప్రదుడవు, మంగళకరుడవు, నాశరహితుడవు ఐన ఓరామ!మహాబాహో ! శరణాగతుడనైన, నన్ను రక్షించు (78)ఓ రాజేంద్ర !కోపాన్ని ఉపసంహరించుకో . ఓదయామయుడ!నన్ను క్షమించు. భూమి, వాయువు, ఆకాశము, నీరు, జ్యోతిస్సు (79)వీటిని పరమేష్ఠియైన బ్రహ్మ ఎంత స్వభావ సిద్ధములైనవిగా నిర్మించాడో, అటువంటి స్వభావ సిద్ధములు నాకూ ఉన్నవి. నా స్వభావము అగాధంగా ఉండుటయే. (80)నాకు వికారం ఏర్పడుతుంది . అదే గాధత (అగాధంకాకపోవటం) ఇది నిజం నేను చెప్తున్నాను. లోభం వల్లకాని, కామం వల్ల కాని, భయం వల్లకాని, రాగంవల్లకాని ఓరామ!(81) వంశం వల్ల, వచ్చిన గుణాన్ని వదలటానికి ఏరకంగా ఉత్సాహం లేను. అందువల్లనీ సేనను సముద్రం (నన్ను) దాటటానికి సహాయంచేస్తాను (82)ఈ రకంగా చెప్పుచున్న నదీపతియైన సముద్రుణ్ణి గూర్చి రాముడిట్లా అన్నాడు. రావణుడు పాలించే లంకానగరానికి సైన్యంతో సహానేను వెళ్ళాలి. (83) అందువల్ల నేను ఇప్పుడు నిన్నుదాటే కొరకు నీవు ఎండిపో. అని అన్న రామునితో మరల సముద్రుడు ఇట్లా అన్నాడు. (84)ఓరామ !జాగ్రత్తగా విను . విని చేయవలసినదేమిటోచేయి. సైన్యముతో పాటువెళ్ళుటకు సిద్ధపడ్డ నీ ఆజ్ఞతో నేను ఎండిపోయినట్టైతే (85)ఇతరులు కూడా తమ ధనుర్బలముతో నన్ను ఈ విధముగా ఆజ్ఞాపించుదురు. నీ సైన్యము దాటుటకొరకు మరొక ఉపాయమును చెప్పెదను. (86)శిల్పులు అంగీకరించిన నలుడను పేరుగల వానరుడు ఇక్కడున్నాడు. ఓరామ !అతడు బలవంతుడు. త్వష్టయైన విశ్వకర్మయొక్క కుమారుడు (87)ఆతడు కర్రను గడ్డిని, రాయని దేన్నైనా నాలో వేసినచో అదంతా నేను ధరిస్తాను . అదినాకు సేతువు అవుతుంది. (88)ఆసేతువుద్వారా రావణుడు పాలించే లంకానగరానికి నీవు వెళ్ళు . ఇట్లా చెప్పి, సముద్రుడు అంతర్హితుడుకాగా, రాముడు నలునితో ఇట్లా అన్నాడు .(89) ఓబుద్ధిమంతుడా !నీవు సముద్రమందు సేతువు నిర్మించుటకు సమర్థుడవు. నిర్మించు అని అనగా ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన రామునితో నలుడు ఇట్లాఅన్నాడు. (90)నేను అగాధమైన సముద్రమందు సేతువును నిర్మిస్తాను. మాతండ్రిగారితో నేను వరం కుడా పొందాను. సామర్థ్యంలో నా తండ్రితో సమానమైనవాణ్ణి. (91)మందరంలో విశ్వకర్మ మా అమ్మగారికి వరమిచ్చాడు. శిల్పకర్మలో నీకుమారుడు నాతో సమానమైన వాడు కాగలడు అని (92)నేను ఆతనిఔరసపుత్రుణ్ణి. విశ్వకర్మతో సమానమైన వాణ్ణి. ఈ రోజే వానర శ్రేష్ఠులు సేతువును స్వేచ్ఛగా నిర్మంచని (93)అని.

మూllతతోరామనిసృష్టాస్తే వానరా బలవత్తరా ఃlపర్వతాన్‌ గిరి శృంగాణిలతాతృణ మహీరుహాన్‌ll94ll

సమాజహ్రుర్మహా కాయాగరుడా నిలరంహనః lనలశ్చక్రే మహా సేతుర్మధ్యే నదనదీపతేః ll95ll

దశయోజన విస్తీర్ణం శతయోజన మాయతంlజానకీరమణోరామః సేతుమేవమకారయత్‌ ll96ll

సలేన వానరేంద్రేణ విశ్వకర్మసుతేనవై l తమేవం సేతు మాసాద్యరామచంద్రేణ కారితం ll97ll

సర్వేపాతకి నోమర్త్యా ముచ్యంతే సర్వపాతకై ః వ్రతదానతపోహోమైః నతథాతుష్యతేశివః ll98ll

సేతుమజ్జనమాత్రేణ యథాతుష్యతి శంకరఃl నతుల్యం విద్యతే తేజో యథాసౌరేణ తేజసా ll99ll

సేతుస్నానేన చ తధానతుల్యం విద్యతేక్వచిత్‌ తత్సేతుమూలం లంకాయాం యత్ర రామోయియానయా ll100ll

వానరైః సేతుమారేభేపుణ్యం పాపప్రణాశనం lతద్దర్భశయనం నామ్నాపశ్చాల్లోకేషువిశ్రుతం ll101ll

ఏవముక్తం మయావిప్రాః సముద్రే సేతుబంధనం l అర్థతీర్థాన్యనేకాని సంతిపుణ్యాన్యనేకశం ll102ll

న సంఖ్యాంనామధేయం వాశేషోగణ యితుంక్షమః l కింత్వహం ప్రబ్రవీమ్యద్యతత్ర తీర్థాని కానిచిత్‌ ll103ll

చతుర్వింశతి తీర్థాని సంతిసేతౌ ప్రధానతః l ప్రథమం చక్కతీర్థం స్యాత్‌ బేతాల వరదం తతః ll104ll

తతఃపాప వినాశార్థం తీర్థంలో కేషు విశ్రుతం l తతః సీతాసరః పుణ్యం తతో మంగళ తీర్థకం ll105ll

తతః సకల పాపఘ్నీనామ్నచామృతవాపికా l బ్రహ్మకుండం తతస్తీర్థం తతఃకుండం హనూమతః ll106ll

అగస్త్యంహితతః తీర్థం రామతీర్థమతః వరం l తతో లక్ష్మణ తీర్థం స్యాత్‌ రామతీర్థమతః వరం ll107 ll

తతో లక్ష్మ్యాః వరం తీర్థం అగ్ని తీర్థమతః వరం l చక్ర తీర్థం తతః పుణ్మం శివ తీర్థమతః వరం ll108 ll

తతః శంఖాభిదం తీర్థం తతోయామున తీర్థకం lగంగాతీర్థం తతః పశ్చాత్‌ గయా తీర్థమనంతరం ll109ll

తతఃస్యాత్కోటి తీర్థాఖ్యం సాధ్యానా మమృతంతతః l మానసాఖ్యం తతస్తీర్థం ధనుష్కోటి స్తతఃపరం 110

ప్రధాన తీర్థాన్యేతాని మహాపావ హరాణిచ l కధితాని ద్విజశ్రేష్ఠాః సేతుమధ్య గతానివై ll111ll

యథా సేతుశ్చబద్ధో భూత్‌ రామేణ జలధౌమహాన్‌ l కథితం తచ్చవిప్రేంద్రాః పుణ్యం పావహారం తథా ll112ll

యచ్ఛృత్వాచ పఠిత్వాచ ముచ్యతే మానవోభువి ll 112 1/2 ll (13)

అధ్యాయ మేనం పఠతే మనుష్యః శృణోతివాభక్తి యుతోద్విజేంద్రాః

సోనంత మాప్నోతి జయంపరత్ర l పునర్భవక్లేశము సౌన గచ్ఛేత్‌ ll 114ll

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే సేతునిర్మాణాది వర్ణనం నామద్వితీయోద్యాయః.

తాll పిదప రామునితో ఆజ్ఞాపింప బడిన బలవంతులైన ఆవానరులు, పర్వతములను, పర్వతశిఖరాలను, తీగలను, గడ్డిని, చెట్లను (94) గరుడినితో, వాయువుతో సమానమైన వేగం కల పెద్ద శరీరాలు కల(95)అ వానరులు తీసుకవచ్చారు. సముద్ర మధ్య్రలో నలుడు గొప్ప సేతువును నిర్మించాడు(95) పదియోజనముల విస్తీర్ణము, పదియోజనముల పొడవుగల సేతువును జానకి భర్తయైన రాముడు నిర్మింప జేసెను. (96) విశ్వకర్మ సుతుడైన నలుడనే వానరశ్రేష్ఠునితో నిర్మింపబడిన రామచంద్రుడు నిర్మింపచేసిన (97)ఈ సేతువును పొందిన పాపాత్ములైన నరులందరు అన్ని పాపముల నుండి విముక్తులౌతారు. వ్రతదాన తపోహోమములతో శివుడు అంత సంతృప్తి చెందడు, (98) సేతువుయందు స్నానం చేసినంతమాత్రముననే ఎంతగా శివుడు ఆనంద పడ్తాడో. సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సుతో సమానమైన తేజస్సులేనట్లే (99)సేతుస్నానంతో సమానమైనది ఎక్కడాలేదు . రాముడెక్కడికి పొదల్చుకున్నాడో, కోతులతో సేతువును అరంభింపచేశాడో ఆ సేతువుయొక్క మూలము లంకలో ఉంది (100) వానరులు ఆరంభించిన సేతువుపుణ్యప్రదము, పాపనాశకము, అదే తర్వాత దర్భశయనమని లోకమన ప్రసిద్ధమైంది (101) ఈ విధంగా సముద్రమందు సేతు నిర్మాణాన్ని గురించి నేను చెప్పాను. ఇక్కడ పుణ్యప్రదమైన తీర్థములు అనేకం ఉన్నాయి.(102) అనేకములైన ఈ తీర్థముల సంఖ్యనుకాని, పేర్లుకాని శేషుడు కూడా లెక్కింపలేడు. కాని నేను ఈవేళ అక్కడీ తీర్థములను కొన్నింటిని చెప్తాను. (103)సేతువుయందు ప్రధానంగా ఇరువదినాల్గు తీర్థములున్నాయి. ఒకటి చక్రతీర్థము, పిదప బేతాళ వరద తీర్థం (104) పిదప పాపవినాశ నము, పిదప సీతాసరస్సు, పిదవ మంగళతీర్థము (105) సకల పాపఘ్నీ, అమృత వాపిక, బ్రహ్మకుండం, హనుమత్కుండం, (106) అగస్త్యతీర్థం, రామతీర్థం, లక్ష్మణతీర్థం జటా తీర్థం (107)లక్ష్మితీర్థం, అగ్ని తీర్థం, చక్ర తీర్థం, శివతీర్థం (108) శంఖతీర్థం, యమునతీర్థం, గంగాతీర్థం, గయాతీర్థం (109)కోటి తీర్థం, సాధ్యతీర్థం, మానసతీర్థం ధనుష్కోటి (110)ఇవి ప్రధానమైన పాపనాశకమైన తీర్థం, సేతు మధ్యంలో ఉన్న వీని గూర్చి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ! నేను చెప్పాను (111) రాముడు సముద్రమందు గొప్ప సేతువును నిర్మించాడు. దన్ని గూర్చి పుణ్మప్రదమై, పాపనాశకమైన దాని గూర్చి నేను చెప్పాను (112)దానిని, విని చదివి మనుష్యుడు ఈలోకమందు ముక్తడౌతాడు (113)ఈ అధ్యాయమును భక్తి కల్గినవాడై చదివిన, విన్న మనుష్యుడు అనంత జయమును ఈ లోకంలో పొందుతాడు. వరంలో తిరిగి జన్మనెత్తే క్లేశాన్ని పొందడు. అనిశ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒకటవ వేల సంహితమందు తృతీయబ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు సేతు నిర్మాణము మొదలుగా వర్ణన మనునది ఇది ద్వితీయ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters