Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ |

లక్ష్మణస్యమహాతీర్ధే బ్రహ్మహత్యావినాశ##నే | స్నాత్వాస్వచిత్తశుద్ధ్యర్థం జటాతీర్థంతతోవ్రజేత్‌ || 1 ||

జన్మమృత్యుజరాక్రాంత సంసారాతురచేతసాం | అజ్ఞాననాశకం నాస్తి జటాతీర్ధాదృతే ద్విజాః || 2 ||

లోకేముముక్షవః కేచిత్‌ చిత్త శుద్ధిమభీప్సవః | వాచాపఠంతి వేదాంతాన్‌ తూక్ష్‌ణీన్నానుభవంతితే || 3 ||

పూర్వపక్షమహాగ్రాహాసిద్ధాంతఝషసంకులే | వేదాంతా బ్ధా విహాజ్ఞానం ముహ్యంతి పతితాద్విజాః || 4 ||

ప్రథమం చిత్త శుద్ధ్యర్థం వేదాంతాన్‌సంపఠంతియే |వివదంతే పఠిత్వాతే కలహంచ వితన్వతే || 5 ||

చిత్తశుద్ధి ర్న వేదాంతాత్‌ బహువ్యామోహకారణాత్‌ | తతోవయంన వేదాంతాన్‌మునీంద్రా బహుమన్మహె || 6 ||

చిత్తశుద్ధిం యదీచ్ఛధ్వం లఘాపాయేనతాపసాః | ఉద్ఘోషయామి సర్వేషాం జటాతీర్థం నిషేవత || 7 ||

పురాసర్వోపకారార్థం తీర్థమజ్ఞాన నాశనం | ఏతద్వినిర్మితం సాక్షాత్‌ శంభునా గంధమాదనే || 8 ||

నిహతే రావణ విప్రా జటాంరామస్తు ధార్మికః | క్షాలయామాస యత్తోయేతజ్జటాతీర్థముచ్యతే || 9 ||

వర్షాణాం షష్టిసాహస్త్రం జాహ్నవీ జలమజ్జనం | గోదావర్యాం సకృత్‌ స్నానం సింహస్థేచ బృహస్పతౌ || 10 ||

తావత్‌సహస్రస్నానానిసింహందేవగురేగతౌ | గోమత్యాం లభ్యతే వర్షైః తజ్జటాతీర్ధదర్శనాత్‌ || 11 ||

జటాతీర్థేమనుష్యాణాం స్నాతానాం ద్విజపుంగవాః | అంతఃకరణశుద్ధి స్స్యాత్‌ తతో7జ్ఞానం వినశ్యతి || 12 ||

అజ్ఞాన నాశేజ్ఞానం స్యాత్‌ తతోముక్తి మవాప్స్యసి | అఖండ సచ్చిదానంద సంపూర్ణః స్యాత్తతః పరం || 13 ||

అత్రాప్యుదాహరం తీయం ఇతి హాసం పురాతనం | పితుః పుత్రస్యసంవాదం వ్యాసస్యచశుకస్యచ || 14 ||

పురాముని వరం కృష్ణం భావితాత్మానమచ్యుతం

పారంపర్యవిశేషజ్ఞం సర్వశాస్త్రార్థకోవిదం | ప్రణమ్య శిరసావ్యాసం శుకః పప్రచ్ఛవైద్విజాః || 15 ||

శ్రీ శుక ఉవాచ -

భగవంస్తాత సర్వజ్ఞ బ్రూహిగుహ్యమనుత్తమం || 16 ||

అంతఃకరణ శుద్ధిస్స్యాత్‌ తథాజ్ఞాన వినాశనం | జ్ఞానోదయశ్చయేనస్యాదంతే ముక్తిశ్చశాశ్వతీ || 17 ||

తముపాయం పదస్వాద్యస్నేహాన్మమ మహామునే | వేదాంతాశ్చేతిహాసాశ్చ పురాణాదీనికృత్సన్నశః || 18 ||

అధీతానిమయాత్వత్తః శోధయంతి సమానసం | అతోమేచిత్తశుద్ధిః స్యాత్‌ యథాతాతతథావద || 19 ||

ఇతి పృష్ఠః తదావ్యాసః శుకేనముని సత్తమాః | రహస్యం కథయామానయేనా విద్యావినశ్యతి || 20 ||

తా|| శ్రీ సూతులిట్లనిరి - బ్రహ్మహత్యానాశకమైన లక్ష్మణ మహాతీర్థమందు స్నానం చేసి తమ చిత్తశుద్ధి కొరకు పిదప జటా తీర్థానికి వెళ్ళాలి (1) జన్మమృత్యుజరలతో ఆ క్రాంతులై సంసారాతుర, చేతసులైనవారికి అజ్ఞానాన్ని నశింపచేసేది జటా తీర్థంకన్న మరొకటి లేదు (2) లోకంలో ముముక్షువులు కొందరు చిత్తశుద్ధిని కోరేవారు వేదాంతములను ఊరికే నోటిద్వారా చదువుతారు తప్ప వాటిని అనుభవించరు. (3) పూర్వపక్షమనే గొప్పమొనళ్ళు, సిద్ధాంతములనే చేపలతో సంకులమైన వేదాంతమనే సముద్రంలో పడిన బ్రాహ్మణులు అజ్ఞాన మోహంతో నిండిపోతారు (4) మొదట చిత్తశుద్ధి కొరకు వేదాంతం చదివేవారు, చదివి వాగ్వాదం సాగిస్తారు తగాదా పడతారు (5) బహు వ్యామోహకారణమైన వేదాంతమువలన చిత్తశుద్ధి కలగదు. అందువల్లమేము వేదాంతములను గొప్పవానిగా భావించము (6) ఓతాపసులార! చిన్న ఉపాయముతో చిత్తశుద్ధిని కోరేవారి కందరకు గట్టిగా చెపుతున్నాను. జటాతీర్థం సేవించండి. అని (7) పూర్వము అందరికి ఉపకారము కొరకు అజ్ఞాననాశకమైన తీర్థమును దీనిని గంధమాదనంలో శంభువు నిర్మించాడు (8) ఓ బ్రాహ్మణులారా ! రావణుని చంపాక ధార్మికుడైన రాముడు జటలను కడిగిన తీర్థమును జటాతీర్థమని అంటారు. (9) అరవై వేల ఏళ్ళు గంగానదిలో మునగటం, బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి యందు ఒకసారి స్నానం చేయటం, (10) దేవ గురువు సింహరాశిని పొందగా అటువంటి వేలకొలది స్నానములు, సంవత్సరములలో గోమతీస్నానం వల్ల లభించేశుద్ధి అంతా జటా తీర్థ దర్శనం వల్ల లభిస్తుంది (11) ఓ బ్రాహ్మణులారా ! జటాతీర్థంలో స్నానం చేసిన నరులకు అంతః కరణ శుద్ధి లభిస్తుంది. పిదప అజ్ఞానం నశిస్తుంది కూడా (12) అజ్ఞానం నశిస్తే జ్ఞానం లభిస్తుంది. పిదప ముక్తి లభిస్తుంది. పిదప అఖండ సచ్చిదానంద సంపూర్ణుడౌతాడు (13) ఇక్కడ ప్రాచీనమైన ఈ ఇతిహాసమును ఉదాహరిస్తారు. వ్యాసుడు శుకుడు (తండ్రి కొడుకుల) వీరల సంభాషణము (14 భావితాత్ముడైన అచ్యుతుడైన మునివరుడైన, పారంపర్య విశేషజ్ఞుడైన సర్వశాస్త్రార్థకోవిదుడైన కృష్ణుని అనగా వ్యాసుని శిరస్సుతో నమస్కరించి శుకుడు ఇట్లా అడిగాడు. (15) శ్రీ శుకులమాట - భగవాన్‌ ! తండ్రి ! సర్వజ్ఞుడ ! ఉత్తమమైన రహస్యమును చెప్పండి. (16) అంతః కరణశుద్ధి, అట్లాగే అజ్ఞాన నాశనము, జ్ఞానోదయము చివరశాశ్వతమైనముక్తిదేనివల్లలభిస్తుంది (17) ఓ మహాముని స్నేహంతోనాకీవేళఆఉపా యాన్ని చెప్పండి. వేదాంతములు ఇతిహాసములు, సంపూర్ణపురాణములు (18) మీద్వారానేనుచదువుకున్నాను. అవినామన స్సునుశుద్ధిపరచలేదు. అందువల్ల నాకుచిత్తశుద్ధిఎట్లాకలుగుతుందోదాన్నిచెప్పండి. (19) అనిశుకుడువ్యాసునిఅడుగగా అప్పుడు వ్యాసుడు అవిద్యానాశకమైన రహస్యమునుచెప్పసాగాడు. (20)

మూ|| వ్యాసఉవాచ -

శుకవక్ష్యామితేగుహ్యంఅవిద్యాగ్రంధిఛేదనం | బుద్ధిశుద్ధిప్రదంపుంసాంజన్మాదిభయనాశనం || 21 ||

రామసేతౌమహాపుణ్యగంధమాదనపర్వతే| విద్యతేపాపసంహారిజటాతీర్థమితిశ్రుతం || 22 ||

జటాంస్వాంశోధయామానయత్రరామోహరిఃస్వయం|రామోదాశరధిఃశ్రీమాన్‌తీర్థాయచవరందదౌ || 23 ||

స్నాంతియే7త్రసమాగత్యజటాతీర్థే7తిపావనే | అంతకఃరణశుద్ధిశ్చతేషాంభూయాదితిస్మనః || 24 ||

వినాయజ్ఞంవినాజ్ఞానంవినాజాప్యముపోషణం | స్నానమాత్రాజ్జటాతీర్థేబుద్ధిశుద్ధిర్భవేన్నృణాం || 25 ||

సర్వదాస సమంపుణ్యంస్నానాదత్రభవిష్యతి | దుర్గాణ్యనేనతరతిపుణ్యలోకాన్సమశ్నుతే || 26 ||

మహత్వమశ్నుతేస్నానాత్‌జటాతీర్థేశుభోదకే | జటాతీర్థంవినానాన్యత్‌అంతఃకరణశుద్ధయే || 27 ||

విద్యతేనియమోవాపిజపోవానాన్యదేవతా | ధన్యంయశస్యమాయుష్యంసర్వలోకేషువిశ్రుతం || 28 ||

పవిత్రాణాం పవిత్రంచజటాతీర్థంశుకాధునా | సర్వపాపప్రశమనం మంగలానాంచమంగలం || 29 ||

భృగర్వైవారుణిఃపూర్వంవరుణంపితరంశుక | బుద్ధిశుద్ధిప్రదోపాయమవృచ్ఛత్పావసంశుభం || 30 ||

ప్రోవాచవరుణప్తసై#్మబుద్ధిశుద్ధిప్రదం శుభం | వరుణువాచ - రామసేతౌభృగోవుణ్యగంధమాదనపర్వతే || 31 ||

స్నానమాత్రాజ్జటాతీర్థేబుద్ధిశుద్ధిర్భవేత్‌ధ్రువం | సపితుర్వచనాత్సద్యోభృగుర్వైవరుణాత్మజః || 32 ||

గత్వాస్నాత్వాజటాతీర్థేబుద్ధిశుద్ధిమవాప్తవాన్‌ | వినష్టౌజ్ఞానసంతానః తయాశుద్ధ్యాతదాభృగుః || 33 ||

ఉత్పన్నాద్వైతవిజ్ఞానః స్వపితుర్వరుణాదయం | అఖండ సచ్చిదానంద పూర్ణాకారో7భవచ్ఛుక || 34 ||

శంకరాంశో7పిదుర్వాసాజటాతీర్థేభిషేకతః | మనః శుద్ధిమవాప్యాశు బ్రహ్మానందమయోభవత్‌ || 35 ||

దత్తాత్రేయో7పి విష్ణ్వంశః తీర్థే7స్మిన్నభిషేచనాత్‌ | శుద్ధాంతః కరణోభూత్వాబ్రహ్మాకారో7భవచ్ఛుక || 36 ||

ఇచ్చేదజ్ఞాననాశంయః సస్నాయాత్తు జటాభిధే| తీర్థేశుద్ధతమేపుణ్యసర్వపాపవినాశ##నే || 37 ||

జటాతీర్థమతస్త్వంచ శుకగచ్ఛమహామతే | మనః శుద్ధి ప్రదేతస్మిన్‌ స్నానం చకురుపుణ్యదే || 38 ||

పిత్రైవ ముక్తోవ్యాసేన శుకః పుత్రస్తదాద్విజాః | రామసేతుం మహాపుణ్యం గంధమాదన పర్వతం || 39 ||

అగమత్‌స్నాతు కామస్సన్‌ జటాతీర్థే విశుద్ధిదే | స్నాత్వాసంకల్పపూర్వంచ జటాతీర్థేశుకోమునిః || 40 ||

మనఃశుద్ధిమను ప్రాప్య తేన చాజ్ఞాననాశ##నే | స్వస్వరూపం సమాపన్నః పరమానంద రూపకం || 41 ||

తా|| వ్యాసోక్తి - అవిద్యా గ్రంధిని భేదించే రహస్యమైన దానిని శుక ! నీకు చెప్తాను. పురుషులకు బుద్ధిని శుద్ధి చేసేది. జన్మాది భయమును నశింపచేసేది. (21) రామసేతువు యందు మహా పుణ్యప్రదమైన గంధమాదన పర్వత మందు పాపములను సంహరించేది జటాతీర్థమనునది ప్రసిద్ధమైనది ఉంది. (22) హరియైన రాముడు ఇచ్చట స్వయముగా తన జటలను శుద్ధి చేసుకున్నాడు. దశరథరాముడు తీర్థమునకు వరము కూడా ఇచ్చాడు (23) అతి పావనమైన జటాతీర్థమునకు వచ్చి స్నానము చేసిన వారికి అంతఃకరణ శుద్ధి కలగనీ అని (24) యజ్ఞము, జ్ఞానము, జపము, ఉపవాసము లేకుండానే జటాతీర్థంలో స్నానంచేసినంత మాత్రమున నరులకు బుద్ధిశుద్ధి జరుగుతుంది. (25) ఇక్కడ స్నానం చేయటంవల్ల సర్వదానసమమైన పుణ్యం లభిస్తుంది. దీనితో దుర్గమమైన వాటిని తరిస్తాడు. పుణ్యలోకములను పొందుతాడు (26) శుభ ఉదకముగల జటాతీర్థంలో స్నానం చేసి మహత్వాన్ని పొందుతాడు. అంతఃకరణ శుద్ధికి జటాతీర్థము వినా మరొకటి లేదు (27) నియమముకాని జపముకాని మరో దేవత కాని లేదు. ధన్యమైనది, యశస్కరమైనది, ఆయుస్సునిచ్చేది సర్వలోకములలో ప్రసిద్ధమైంది (28) పవిత్రములలో పవిత్రమైనది జటాతీర్థము. ఓ శుక ! అన్ని పాపములను నశింపచేసేది మంగలములకన్న మంగలప్రదమైనది (29) ఓ శుక! భృగువంశమునకు చెందిన వారుణి, తన తండ్రియైన వరుణుని చేరి పావన శుభకరమైన బుద్ధి శుద్ధి ప్రదుపాయమును అడిగాడు. వరుణుడు ఆతనికి బుద్ధి శుద్ధిని చేసే శుభ##మైన దానిని చెప్పాడు (30) వరుణోక్తి - ఓ భృగు! రామసేతువుయందు పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు (31) స్నాన మాత్రమును జటా తీర్థంలో చేస్తే బుద్ధి శుద్ధి తప్పకుండా జరుగుతుంది. ఆతడు తండ్రి ఆజ్ఞప్రకారం వెంటనే వరుణాత్మజుడైన భృగువు (32) జటాతీర్థమునకు వెళ్ళి స్నానం చేసి బుద్ధి శుద్ధిని పొందాడు. అజ్ఞాన సంతానము నశించి ఆ శుద్ధితో భృగువు (33) అద్వైత విజ్ఞానమును పొందినవాడై తన తండ్రియైన వరుణుని నుండి ఈతడు అఖండ సచ్చిదానంద పూర్ణాకారుడైనాడు ఓ శుక! (34) శంకర అంశుడైన దుర్వాసుడు జటాతీర్థంలో స్నానం చేసి త్వరగా మనః శుద్ధిని పొంది బ్రహ్మానందమయుడైనాడు (35) విష్ణ్వంశ##యైన దత్తాత్రేయుడు కూడా ఈ తీర్థంలో అభిషేకంవలన శుద్ధాంతః కరణుడై బ్రహ్మకారుడైనాడు (36) అజ్ఞాననాశనం కోరేవారు జటాతీర్థమందు శుద్ధతమమైన పుణ్యమైన సర్వపాపనాశకమైన దీనిలో స్నానం చేయాలి (37) అందు వల్ల ఓ శుక! మహామతి ! నీవు కూడా జటాతీర్థమునకు వెళ్ళు. మనఃశుద్ధినిచ్చే పుణ్యప్రదమైన దానిలో స్నానం కూడా చేయి (38) తండ్రి వ్యాసుడు ఇలా కొడుకైన శుకునితో అనగా ఆతడప్పుడు రామసేతువును మహాపుణ్యమైన గంధమాదన పర్వతమందు (39) విశుద్ధినిచ్చే జటాతీర్థమందు స్నానం చేయటానికి వెళ్ళాడు. జటాతీర్థంలో శుకముని సంకల్పపూర్వకముగా స్నానము చేసి (40) మనః శుద్ధిని పొంది దానితో అజ్ఞానం నశించి పరమానందరూపమైన స్వస్వరూపమును పొందాడు (41)

మూ || యేచాప్యన్యే మనః శుద్ధికామాః సంతి ద్విజోత్తమాః | జటా తీర్థేతుతే సర్వేస్నాంతు భక్తి పురః సరం || 42 ||

అహో జనాజటాతీర్థే కామధేను సమేశుభే | విద్యమానే7పి కింతుచ్ఛే రమంతేన్యత్రమోహితాః || 43 ||

భుక్తికామోలభేద్భుక్తిం ముక్తి కామస్తు తాం లభేత్‌ | స్నాన మాత్రాజ్జటాతీర్థేసత్యముక్తం మయాద్విజాః || 44 ||

వేదాను వచనాత్‌ పుణ్యాత్‌ యజ్ఞాద్దానాత్‌ తపోవ్రతాత్‌ | ఉపవాసాజ్జపాద్యోగాన్మనః శుద్ధిః నృణాం భ##వేత్‌ || 45 ||

వినాప్యేతాని విప్రేంద్రా జాటాతీర్థే7తిపావనే | స్నానమాత్రాన్మనః శుద్ధిః బ్రాహ్మణానాం ధ్రువం భ##వేత్‌ || 46 ||

జటాతీర్థస్యమాహ్మాత్మ్యం మయావక్తుం నశక్యతే | శంకరోవేత్తి తత్తీర్థం హరిర్వేత్తి విధిస్తథా || 47 ||

జటాతీర్థసమంతీర్థం న భూతంస భవిష్యతి | జటాతీర్థస్య తీరేయః క్షేత్రపిండం సమాచరేత్‌ || 48 ||

గయాశ్రాద్ధసమంపుణ్యంతస్యస్యాన్నాత్రసంశయః | జటాతీర్థేనరః స్నాత్వా న పాపేన విలిప్యతే

దారిద్ర్యం న సమాప్నోతి నే యాచ్చనరకార్ణవం | || 49 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవంవః కధితం విప్రాజటాతీర్థస్య వైభవం || 50 ||

యత్రవ్యాసనుతో యోగీ స్నాత్వా పాపవిమోచనే | అవాప్త వాస్మనః శుద్ధిం అద్వైత జ్ఞాన సాధనాం || 51 ||

యస్త్విమం పఠతే7ధ్యాయం శ్రుణుతే వాసమాహితః | సవిధూ యేవా పాపా నిలభ##తే వైష్ణవం పదం || 52 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే జటాతీర్థ ప్రశంసాయాం శుకచిత్త శుద్ధి వర్ణనం నామవింశో7ధ్యాయః || 20 ||

తా|| ఓ బ్రాహ్మణులారా ! మనః శుద్ధి కాములైన ఇతరులందరు భక్తి పూర్వకముగా జటా తీర్థమందు స్నానం చేయండి (42) కామధేనువుతో సమానమైన జటా తీర్థము ఉండగా ఇతరమైన తుచ్ఛమైన వాటిపై మోహముతోరమిస్తారు (43) ముక్తి కాముడు ముక్తిని భుక్తి కాముడు భుక్తిని పొందుతాడు. జటాతీర్థంలో స్నానం చేయటం వల్లనే ఇవి లభిస్తాయి. నేను నిజం చెప్పాను, ఓ ద్విజులార ! (44) వేదపఠనంవల్ల పుణ్యమైన యజ్ఞం వల్ల దాన తపస్సులవల్ల ఉపవాస జవయోగాదులవల్ల నరులకు మనఃశుద్ధి కల్గుతుంది (45) ఇదేవీ లేకుండా అతి పావనమైన జటాతీర్థంలో స్నానమాత్రంవల్లనే బ్రాహ్మణులకు మనఃశుద్ధి తప్పకుండా కల్గుతుంది (46) జటాతీర్థమాహాత్మ్యాన్ని నేను వర్ణించలేను. శంకరుడు, విష్ణువు, బ్రహ్మ ఆ తీర్థం గురించి ఎరిగి ఉన్నారు. (47) జటాతీర్థంతో సమానమైంది గతంలో లేదు. భవిష్యత్తులో కలుగదు. జటాతీర్థ తీరమందు క్షేత్రపిండ మాచరించిన వారు (48) గయాశ్రాద్ధసమమైన పుణ్యమును పొందుతారు. అనుమానంలేదు. జటాతీర్థంలో స్నానం చేసిన నరుడు పాపలిప్తుడు కాడు దారిద్ర్యాన్ని పొందడు నరకార్ణవమును చేరడు (49) శ్రీసూత వచనము - ఈ విధముగా ఓ విప్రులార మీకు జటా తీర్థవైభవాన్ని చెప్పాను (50) పాపవిమోచనమైన దీని యందు యోగియైన వ్యాససుతుడు స్నానం చేసి అద్వైతజ్ఞాన సాధనమైన మనఃశుద్ధిని పొందాడు (51) ఈ అధ్యాయమును చదివినవారు శ్రద్ధతో విన్నవారు పాపముల పోగొట్టుకొని వైష్ణవపదాన్ని చేరుకుంటారు (52) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు జటా తీర్థ ప్రశంస యందు శుకుని చిత్తశుద్ధి వర్ణన అనునది ఇరువదవ అధ్యాయము || 20 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters