Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఒకటవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

జటాతీర్థా భిదే తీర్ధే సర్వపాతకనాశ##నే | స్నానం కృత్వావిశుద్ధాత్మా లక్ష్మీతీర్థం తతోవ్రజేత్‌ || 1 ||

యంయంకామం సముద్దిశ్యలక్ష్మీతీర్థే ద్విజోత్తమాః | స్నానం సమాచరేన్మర్త్యః తంతం కామం సమశ్నుతే || 2 ||

మహాదారిద్ర్య శమనం మహాధాన్యసమృద్ధిదం | మహాదుఃఖ ప్రశమనం మహా సంపద్వివర్ధనం || 3 ||

అత్రస్నాత్వా ధర్మపుత్రో మహదైశ్వర్యమాప్తవాన్‌ | ఇంద్రప్రస్థేవసన్‌ పూర్వం శ్రీ కృష్ణేన ప్రచోదితః || 4 ||

ఋషయ ఊచుః -

యథైశ్వర్యం ధర్మపుత్రోలక్ష్మీతీర్థేనిమజ్జనాత్‌ | ఆప్తవాన్‌ కృష్ణవచనాత్‌ తన్నో బ్రూహి మహామునే || 5 ||

శ్రీ సూత ఉవాచ -

ఇంద్రప్రస్థే పురావిప్రా ధృతరాష్ట్రే ణచోదితాః | న్యవసన్‌ పాండవాః పంచమహాబలపరాక్రమాః || 6 ||

ఇంద్ర ప్రస్థం య¸°కృష్ణః కదాచిత్తాన్ని రీక్షితుం | తమాగత మభిప్రేక్ష్య పాండవాస్తే సముత్సుకాః || 7 ||

స్వగృహం ప్రావయామాసుః ముదా పరమయాయుతాః | కంచి త్కాలమసౌకృష్ణః తత్రావాత్సీర్పురోత్తమే || 8 ||

కదాచిత్‌కృష్ణమాహూయ పూజయిత్వాయుధిష్ఠిరః | పప్రచ్ఛపుండరీకాక్షం వాసుదేవం జగత్పతిం || 9 ||

యుధిష్ఠిర ఉవాచ -

కృష్ణ కృష్ణ మహాప్రాజ్‌ఞ యేనధర్మేణ మానవాః | లభంతే మహదైశ్వర్యం తన్నోబ్రూహిమహామతే

ఇత్యుక్తో ధర్మ పుత్రేణ కృష్ణః ప్రాహయుధిష్ఠిరం || 10 ||

శ్రీ కృష్ణ ఉవాచ -

ధర్మపుత్ర మహాభాగ గంధమాదన పర్వతే || 11 ||

లక్ష్మీతీర్థమితిఖ్యాతం అసై#్త్యశ్వర్యైకకారణం | తత్రస్నానం కురుష్వత్వం ఐశ్వర్యంతే భవిష్యతి || 12 ||

తత్రస్నానేన వర్థంతే ధనధాన్యసమృద్ధయః | సర్వేసపత్నానశ్యంతి క్షాత్రమేషాం వివర్థతే || 13 ||

తీర్థేసస్నుః పురాదేవాః లక్ష్మీనామనిపుణ్యదే | అలభన్‌ సర్వమైశ్వర్యం తేనపుణ్యన ధర్మజ || 14 ||

అనురాంశ్చమహావీర్యాన్‌ సమరేజఘ్నురంజసా | మహీలక్ష్మీశ్చ ధర్మశ్చ తత్తీర్థస్నాయినాంనృణాం || 15 ||

భవిష్యం త్యచిరాదేవ సంశయం మా కృధా ఇహ | తపోభిః క్రతుభిః దానైః ఆశీర్వాదైశ్చపాండవ || 16 ||

ఐశ్వర్యం ప్రాప్యతేయద్యత్‌ లక్ష్మీతీర్థని మజ్జనాత్‌ | సర్వపాపానినశ్యంతి విఘ్నాయాంతిలయం సదా || 17 ||

వ్యాధయశ్చ వినశ్యంతి లక్ష్మీతీర్థనిషేవణాత్‌ | శ్రేయః సువిపులం లోకే లభ్యతే నాత్ర సంశయః || 18 ||

స్నానమాత్రేణవైలక్ష్మాః తీర్థేస్మిస్ధర్మనందన | రంభామప్సరసాంశ్రేష్ఠాం లబ్ధవాన వధోనృపః || 19 ||

స్నాత్వాత్రతీర్థేపుణ్యతుకుబేరో నరవాహనః | సమహా పద్మముఖ్యానాం నిధీనాం నాయకోభవత్‌ || 20 ||

తస్మాత్త్వ మపిరాజేంద్ర లక్ష్మీతీర్థేశుభప్రదే | స్నాత్వావృకోధరముఖైః అనుజైర పి సంవృతః || 21 ||

లప్స్యసే మహతీం లక్ష్మీం జేష్య సేచరిపూనపి | సందేహో నాత్రకర్తవ్యః పై తృష్వస్రేయ ధర్మజ || 22 ||

ఇత్యుక్తో ధర్మపుత్రోయం కృష్ణే నాద్భుత దర్శనః | సానుజః ప్రయ¸°శీఘ్రం గంధమాదన పర్వతం || 23 ||

తా|| శ్రీ సూతులిట్లనిరి - సర్వపాతకనాశకమైన జటాతీర్థమను పేరుగల తీర్థంలో స్నానముచేసి విశుద్ధాత్ముడై పిదప లక్ష్మీ తీర్థమునకు వెళ్ళాలి (1) లక్ష్మీతీర్థంలో ఏ ఏ కోరికల నుద్దేశించి స్నానం చేస్తారో వారు ఆయా ఆయా కోరికలను పొందుతారు (2) మహా దారిద్ర్యాన్ని తగ్గించేది మహా ధాన్యసమృద్ధి నిచ్చేది మహా దుఃఖమును శమింపచేసేది మహా సంపదను వృద్ధి పొందించేది (3) ఇక్కడ ధర్మరాజు స్నానం చేసి మహదైశ్వర్యాన్ని పొందాడు. ఇంద్రప్రస్థంలో ఉంటూ శ్రీ కృష్ణునితో ప్రేరేపింపబడి లక్ష్మిని పొందాడు (4) ఋషుల మాట - లక్ష్మీతీర్థంలో స్నానం చేయటంవల్ల ధర్మపుత్రుడు కృష్ణుని మాటవల్ల ఐశ్వర్యం పొందిన విధాన్ని మాకు చెప్పండి ముని అని (5) శ్రీ సూత వచనం - ధృతరాష్ట్రునితో పంపబడి ఇంద్రప్రస్థంలో పాండవులు మహా బలపరాక్రమవంతులు ఐదుగురు ఉండేవారు (6) వాళ్ళను చూడటానికి ఒకసారి కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. వచ్చిన ఆతనిని చూచి పాండవులు ఉత్సాహము కలవారై (7) పరమానంద భరితులై తమ ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ పట్టణంలో కొంతకాలము ఈ కృష్ణుడున్నాడు (8) ఒకసారి ధర్మరాజు కృష్ణుని ఆహ్వానించి పూజించి వాసుదేవుని జగత్పతిని, పుండరీకాక్షుని ఇట్లా అడిగాడు (9) యుధిష్ఠిరోక్తి - ఓ కృష్ణ! ఏ ధర్మంతో మనుష్యుడు మహాదైశ్వర్యాన్ని పొందుతున్నారోదాన్ని నాకు చెప్పండి. అని ధర్మరాజు అనగానే కృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు (10) శ్రీకృష్ణోక్తి - ఓ మహాభాగ! ధర్మపుత్ర ! గంధమాదన పర్వతమందు (11) ఐశ్వర్యమునకు కారణమైన లక్ష్మీతీర్థమని ప్రసిద్ధిగల తీర్థముంది. నీవక్కడ స్నానం చేయి. నీకు ఐశ్వర్యం లభిస్తుంది. (12) అక్కడ స్నానం చేయటంవల్ల ధనధాన్య సమృద్ధి పెరుగుతుంది. పాలివారు నశిస్తారు. వీరిక్షాత్రం పెరుగుతుంది (13) లక్ష్మి అను పేరు గల పుణ్యప్రదమైన తీర్థమందు పూర్వం దేవతలు స్నానం చేశారు. ఆ పుణ్యంతో అన్ని ఐశ్వర్యములు పొందారు (14) మహా పరాక్రమవంతులైన రాక్షసులను తొందరగా యుద్ధంలో చంపారు. భూమి లక్ష్మి ధర్మము ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి (15) త్వరలోనే కల్గుతుంది. ఇందులో అనుమానం వద్దు. తపస్సుతో, యజ్ఞములతో, దానములతో, ఆశీస్సులతో (16) ఐశ్వర్యం లభించినట్లుగా లక్ష్మీతీర్థంలో స్నానం చేయటంవల్ల పాపములన్ని నశించి, విఘ్నములన్ని లయమౌతాయి (17) వ్యాధులు నశిస్తాయి. లక్ష్మీ తీర్థ స్నానం వల్ల లోకంలో విపులమైన శ్రేయస్సు లభిస్తుంది అనుమానం లేదు 918) ఈ లక్ష్మీతీర్థంలో స్నానం చేసినందువల్లనే అవధరాజు శ్రేష్ఠమైన రంభ అనే అప్సరసను పొందాడు (19) ఈ తీర్థంలో స్నానం చేసి నరవాహానుడైన కుబేరుడు మహా పద్మం మొదలుగా ముఖ్య నిధులకు నాయకుడైనాడు (20) అందువల్ల ఓ రాజేంద్ర! నీవు కూడా శుభప్రదమైన లక్ష్మీతీర్థంలో స్నానం చేసి, భీముడు మొదలగు తమ్ములతో కూడి ఉండి (21) గొప్ప లక్ష్మిని పొందుతావు. శత్రువులను జయిస్తావు. ఇందులో అనుమానంలేదు. ఓ ధర్మజ! ఓ మేనత్త కొడుక! (22) అని అద్భుత దర్శనంకల ధర్మపుత్రుడు కృష్ణునితో చెప్పబడి, తమ్ములతో కూడి త్వరగా గంధమాదన పర్వతమునకు వెళ్ళాడు (23).

మూ|| లక్ష్మీతీర్థంతతో గత్వామహదైశ్వర్యకారణం | సస్నౌయుధిష్ఠిరస్తత్ర సానుజోనియమాన్వితః || 24 ||

లక్ష్మీతీర్థస్యతోయేస సర్వపాతకనాశ##నే | సానుజోమానమే కంతునస్నౌనియమపూర్వకం || 25 ||

గోభూతిల హిరణ్యాదీన్‌ బ్రాహ్మణభ్యోదదౌబహూన్‌ | సానుజోధర్మపుత్రోసౌ ఇంద్రప్రస్థం య¸°తతః || 26 ||

రాజసూయక్రతుంకర్తుంతత ఐచ్ఛత్‌యుధిష్ఠిరః | కృష్ణం సమహ్వయామానయియక్షుః ధర్మనందనః || 27 ||

కృష్ణోధర్మజదూతేన సమాహూతః ససంభ్రమః | చతుర్భిరశ్వై సంయుక్తం రథమారుహ్యవేగినం || 28 ||

సత్యభామా సహచర ఇంద్రప్రస్థం సమాయమౌ | తమాగతం సమాలోక్య ప్రమోదాద్థర్మనందనః || 29 ||

న్యవేదయత్సకృష్ణాయ రాజపసూయోద్యమంతదా | అస్వమన్యత కృష్ణో పితధైవక్రియతామితి || 30 ||

వాక్యంచయుక్తి సంయుక్తం ధర్మపుత్రమభాషత | పైతృష్వస్రేయ ధర్మాత్మన్‌ శృణు పథ్యం పచోమమ || 31 ||

దుష్కరోరాజసూయోయం సర్వైరపి మహీశ్వరైః | అనేకశతపాదాత రధకుంజర వాజిమాన్‌ || 32 ||

మహీపతిరిమంయజ్ఞం కర్తుమర్హతినేతరః | దిశోదశ విజేతవ్యాః ప్రథమంబలినాత్వయా || 33 ||

పరాజితేభ్యః శత్రుభ్యోగృహీత్వాకరముత్తమం | తేనకాంచన జాతేన కర్తవ్యోయంక్రతూత్తమః || 34 ||

రోచతేయుక్తివిదహంనహిత్వాంభీషయామిభోః | అతఃక్రతుసమారం భాత్పూర్వం దిగ్విజయంకురు || 35 ||

తతోధర్మాత్మజః శ్రుత్వా కృష్ణస్య వచనంహితం | ప్రశంసన్‌ దేవకీ పుత్రమాజుహావ నిజానుజాన్‌ || 36 ||

ఆహూయచతురోభ్రాతౄన్‌ ధర్మజః ప్రాహహర్షయన్‌ | అయిభీమ మహాబాహో బహువీర్యధనం జయ || 37 ||

యమౌచసుకుమారాంగౌ శత్రుసంహారదీక్షితౌ | చికీర్షామి మహాయజ్ఞం రాజసూయ మనుత్తమం || 38 ||

సచసర్వాన్‌ రణజిత్వాకర్తవ్యః పృధివీపతీన్‌ | అతోవిజేతుం భూపాలాన్‌ చత్వరోపినసైనికాః || 39 ||

దిశశ్చతస్రోగచ్ఛంతుభవంతో వీర్యవత్తరాః | యుష్మాభిరాహృతైర్ద్రవ్యైః కరిష్యామి మహాక్రతుం || 40 ||

తా|| మహాదైశ్వర్య కారణమైన లక్ష్మీతీర్థమునకు వెళ్ళి తమ్ములతో కూడి నియమము కలవాడై ధర్మరాజు అక్కడ స్నానం చేశాడు (24) సర్వపాతకముల నశింపచేసే లక్ష్మీతీర్థము నీటియందు తమ్ములతో కూడి నియమ పూర్వకముగా నెల రోజులు స్నానం చేశాడు (25) అనేకముగా గోభూతిలహిరణ్యాదులను బ్రాహ్మణులకిచ్చాడు. పిదప తమ్ములతో కూడి ధర్మపుత్రుడు ఇంద్రప్రస్థమునకు వెళ్ళాడు (26) పిదప యుదిష్ఠిరుడు రాజసూయక్రతువును చేయటానికి ఇష్టపడ్డాడు. ధర్మరాజు యజ్ఞంచేయదలచి కృష్ణుని పిలిపించాడు. (27) కృష్ణుడు ధర్మరాజు దూతతో పిలువబడి, త్వరగా, వేగముగలనాల్గు గుఱ్ఱములతో కూడిన రథమెక్కి (28) సత్యభామతో కూడినవాడై ఇంద్రప్రస్థమునకు వచ్చాడు. వచ్చిన ఆతనిని చూచి ఆనందంతో ధర్మరాజు (29) కృష్ణునకు రాజసూయ ప్రయత్నమును గూర్చి చెప్పాడు. కృష్ణుడు కూడా సరే అట్లాగే కానిమ్మని అంగీకరించాడు (30) యుక్తితో కూడిన మాటలను ధర్మరాజుతో ఇట్లా అన్నాడు బావ (మేనత్తకొడుక) ధర్మరాజ! నామేలైన మాటను విను (31) ఈ రాజసూయము దుష్కరమైంది రాజు లందరికికూడా. అనేకనూర్లవదాతి, రథకుంజర, వాజులసైన్యముగలవాడైన (32) రాజు ఈ యజ్ఞం చేయటానికర్హుడు - ఇతరులు కాదు. బలవంతుడవైన నీవు పది దిక్కులను జయించాలి (33) ఓడినరాజల నుండి ఉత్తమమైన పన్నును గ్రహించాలి. (33) ఆ బంగారముతో ఈ ఉత్తమ క్రతువును ఆచరించాలి (34) యుక్తి ఎరగిన నేను నీకు రుచిస్తున్నానా. నేను నిన్ను భయపెట్టటం లేదు. అందువల్ల క్రతు ఆరంభంకన్న ముందు దిగ్విజయమాచరించు (35) కృష్ణుని హితమైన మాటను ధర్మాత్మజుడు విని కృష్ణుని ప్రశంసిస్తూ తన తమ్ములను పిలిచాడు (36) ధర్మజుడు నలుగురు తమ్ములను పిలిచి సంతోషంగా పలికాడు. మహాబాహువులు కల భీమ, బహుపరాక్రమము కల ధనంజయ (37) శత్రుసంహారదీక్షితులు, సుకుమారాంగములు కలకవలలారా, ఉత్తమమైన రాజసూయయజ్ఞమును చేయదలిచాను (38) రాజులందరిని యుద్ధంలో జయించి అది ఆచరించాలి. అందువల్ల రాజులను జయించటానికి నలుగురూ సైనికులతో కూడి (39) నాల్గు దిక్కులకు వెళ్ళండి. మీరు పరాక్రమవంతులు. మీరు తెచ్చిన ద్రవ్యంతో మహా యజ్ఞాన్ని చేస్తాను. (40)

మూ|| ఇత్యుక్తాః సాదరం సర్వేవృకోదర ముఖాస్తదా | ప్రసన్నవదనాభూత్వా ధర్మపుత్రానుజాః పురాత్‌ || 41 ||

రాజ్ఞాంజయాయసర్వాసు నిర్యయుః దిక్షుపాండవాః | తే సర్వేనృపతీన్‌ జిత్వాచతుర్దిక్షుస్థితాన్‌ బహూన్‌ || 42 ||

స్వవశేష్థాపయిత్వాతాన్‌ నృపతీన్‌ పాండునందనాః | తైర్దత్తం బహుధాద్రవ్యం అసంఖ్యాతమనుత్తమం || 43 ||

ఆదాయస్వపురం తూర్ణం ఆయయుః కృష్ణ సంశ్రయాః | భీమః సమాయమౌ తత్ర మహాబలపరాక్రమః || 44 ||

శతభారసువర్ణాని సమాదాయ పురోత్తమం | సహస్రం భారమాదాయ సువర్ణానాంతతోర్జునః || 45 ||

శక్రప్రస్థం సమాయాతో మహాబలపరాక్రమః | శతభారం సువర్ణానాం ప్రగృహ్యసకులస్తధా || 46 ||

సమాగతో మహాతేజాః శక్రప్రస్థం పురోత్తమం | దత్తాన్‌ విభీషణనాథ స్వర్ణతాలాంశ్చతుర్దశ || 47 ||

దాక్షిణాత్యమహీపానాం గృహీత్వాధనసంచయం | సహదేవోపినహసానమాయాతోనిజాం పురీం || 48 ||

లక్షకోటి సహస్రాణి లక్షకోటి శతాన్యపి | సువర్ణానిదదౌకృష్ణో ధర్మపుత్రాయయాదవః || 49 ||

స్వానుజైరాహృతైరేవ మ సంఖ్యాతైర్మహాధనైః | కృష్ణదత్తైరసంఖ్యాతైః ధనైరపియుధిష్ఠిరః || 50 ||

కృష్ణాశ్రయోయ జద్విప్రారాజసూయేన పాండవః | తస్మిన్‌ యాగేదదౌద్రవ్యం బ్రాహ్మణ భ్యోయథేష్టతః || 51 ||

అన్నానిప్రదదౌతత్రబ్రాహ్మణభ్యో యుధిష్ఠిరః | వస్త్రాణిగాశ్చభూమించ భూషణానిదదౌతథా || 52 ||

అర్థినః పరితుష్యంతి యావతా కాంచనాదినా | తతోపిద్విగుణంతేభ్యోదావయామాన ధర్మజః || 53 ||

తా|| అని ధర్మరాజు చెప్పగా వృకోదరుడు మొదలగువారు సాదరంగా ప్రసన్న వదనులై ధర్మపుత్రానుజులు పురంనుండి (41) పాండవులు రాజుల జయించే కొరకు అన్ని దిక్కులకు వెళ్ళారు. వారురాజులందరిని జయించి నాల్గు దిక్కులందున్న వారిని చాలా మందిని (42) రాజులను పాండవులు తమ యథీనమందుంచుకొని, వారిచ్చిన లెక్కలేని చాలా ధనమును ఉత్తమమైన దానిని (43) తీసుకొని కృష్ణుని ఆశ్రయించి త్వరగా తమ నగరానికి వచ్చారు. మహాబల పరాక్రమవంతుడైన భీముడు (44) శతభార సువర్ణములను తీసుకొని తన నగరాని కొచ్చాడు. సువర్ణముల సహస్ర భారమును తీసుకొని అర్జునుడు (45) మహాబలపరాక్రమశాలి శక్రప్రస్థానికి వచ్చాడు. శత భారసువర్ణముల గ్రహించిన నకులుడు కూడా (46) తేజశ్శాలి శక్రప్రస్థపురమునకు వచ్చాడు. వీభీషణుడిచ్చిన బంగారు తాలములను పదునాల్గిటిని (47) దక్షిణ దేశపురాజుల ధనసంచయముతీసుకొని, సహదేవుడు కూడా తన నగరానికి త్వరగా వచ్చాడు (48) లక్షకోటి సహస్రములు, లక్షకోటి శతముల సువర్ణములను యాదవకృష్ణుడు ధర్మపుత్రునికిచ్చాడు (49) తమ్ములు తెచ్చిన అసంఖ్యాత ధనముతో, కృష్ణుడిచ్చిన అసంఖ్యాత ధనముతో ధర్మజుడు (50) కృష్ణుని ఆశ్రయించి రాజసూయాన్ని పాండవుడైన ధర్మరాజు యజించాడు. ఆయాగమందు యథేష్టంగా బ్రాహ్మణులకు ద్రవ్యమిచ్చాడు (51) యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. వస్త్రములు, గోవులు, భూమి భూషణములు ఇచ్చాడు. (52) ఎంత ద్రవ్యమిస్తే యాచకులు సంతృప్తి చెందుతారో, అంతకంటే రెట్టింపు ధనాన్ని ధర్మరాజు వారికిప్పించాడు (53)

మూ|| ఇయంతి దత్తాన్యర్థిభ్యోధనానివివిధాన్యపి | ఇతీయత్తాం పరిచ్ఛేత్తుం నశక్తాబ్రహ్మకోటయః || 54 ||

అర్థిభిర్దీయమానాని దృష్ట్వాతత్ర ధనానివై | సర్వస్వమవ్యహోరాజ్ఞా దత్తమిత్యబ్రవీజ్జనః || 55 ||

దృష్ట్వాకోశాంస్తథానంతాన్‌ అనంతమణికాంచనాన్‌ || 56 ||

స్వల్పంహిదత్తమర్ధి భ్యః ఇత్యవోచన్‌ జనాస్తదా | ఇష్ట్వైవంరాజసూయేన ధర్మపుత్రః సహానుజః || 57 ||

బహువిత్తనమృద్ధః సన్‌రేమేతత్ర పురోత్తమే | లక్ష్మీతీర్థస్యమాహాత్మ్యాత్‌ ధర్మపుత్రోయుధిష్ఠిరః || 58 ||

లేభేసర్వమిదం విప్రాఅహోతీర్థస్యవైభవం | ఇదంతీర్థం మహాపుణ్యం మహాదారిద్ర్యనాశనం || 59 ||

ధనధాన్య ప్రదం పుంసాం మహాపాతకనాశనం | మహానరక సంవర్తృమహాదుఃఖనివర్తకం || 60 ||

మోక్షదం స్వర్గదం నిత్యం మహాఋణవిమోచనం | సుకలత్ర ప్రదం పుంసాం సుపుత్రప్రదమేవచ || 61 ||

ఏతత్తీర్థసమంతీర్థంనభూతంన భవిష్యతి | ఏతద్వః కథితం విప్రాలక్ష్మీతీర్థస్యవైభవం || 62 ||

దుః స్వప్ననాశనం పుణ్యం సర్వాభీష్టప్రసాదకం | యఃవఠేదిమ మధ్యాయం శృణుతే వాసభక్తికం || 63 ||

దుః ధాన్య సమృద్ధః స్యాత్‌ సనరోనాస్తి సంశయః | భ##క్వేవసకలాన్‌ భోగాన్‌ దేహాంతే ముక్తిమాప్నుయాత్‌ || 64 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే లక్ష్మీతీర్థ ప్రశంసాయాం ధర్మపుత్రనిరతిశయ సంపదవాప్తి వర్ణనం నామేకవింశోధ్యాయః || 21 ||

తా|| వివిధములైన ధనములు ఇంతగా యాచకులకు ఇచ్చాడు, అని ఇంత అని నిర్ణయించుటకు శక్యము కాదు. బ్రహ్మకోటులు (54) అర్థులకు ఇవ్వబడే ధనములను చూచి రాజు సర్వస్వము ఇచ్చాడని జనులన్నారు (55) అనంతమైన కోశాగారమును అనంతమణికాంచనములను చూచి (56) అర్థులకు స్వల్పమే ఇచ్చాడని అప్పుడు జనులన్నారు. ఈ విధముగా రాజసూయ యజ్ఞముచేసి ధర్మపుత్రుడు తమ్ములతో కలసి (57) బహువిత్త సమృద్ధికలవాడై ఆ పట్టణంలో ఆనందించసాగాడు. లక్ష్మీతీర్థ మహాత్మ్యంవల్ల ధర్మపుత్రుడు యుధిష్ఠురుడు (58) ఇదంతా పొందాడు. ఓ విప్రులారా! ఇది తీర్థవైభవము. ఈ తీర్థము మహాపుణ్యప్రదము. మహాదారిద్ర్యనాశనము (59) ధనధాన్యప్రదము, మహాపాతక నాశకము మహా నరకాన్ని సంహరించేది, మహాదుఃఖనివర్తకము (60) మోక్షాన్నిచ్చేది, స్వర్గాన్నిచ్చేది, నిత్యమైనది, మహాఋణ విమోచకమైనది, సుకలత్రమునిచ్చేది, సుపుత్రుల నిచ్చేదికూడా (61) ఈ తీర్థముతో సమానమైన తీర్థము గతంలోలేదు, భవిష్యత్తులో కలగదు. ఈ లక్ష్మీతీర్థవైభవమును మీకు చెప్పాను (62) దుఃస్వప్ననాశకము, పుణ్యమైనది, అన్ని అభీష్టములు నెరవేర్చేది. ఈ అధ్యాయమును చదివినవారు భక్తితో వినినవారు (63) ధనధాన్యసమృద్ధి కలిగి ఉంటారు. అనుమానము లేదు. ఈ లోకమున సకలభోగములను అనుభవించి దేహాంతమందు ముక్తిని పొందుతాడు (64) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు లక్ష్మీ తీర్థప్రశంసయందు ధర్మపుత్రునకు నిరతిశయ సంపద లభించడమనేది ఇరువదొకటవ అధ్యాయము || 21 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters