Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది రెండవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

లక్ష్మీతీర్థేశుభేపుంసాం సర్వైశ్వర్యకారణ | స్నాత్వానరస్తతోగచ్ఛేత్‌ అగ్నితీర్థం ద్విజోత్తమాః || 1 ||

అగ్నితీర్ధం మహాపుణ్యం మహాపాతకనాశనం | తీర్ధానాముత్తమం తీర్ధం సర్వాభీష్టైక సాధనం

తత్రస్నాయాన్నరోభక్త్యా స్వపావపరిశుద్ధయే | || 2 ||

ఋషయ ఊచుః -

అగ్నితీర్థమితిఖ్యాతిః కథంతస్యమునీశ్వర || 3 ||

కుత్రేదమగ్నితీర్థంచ కీదృశం తస్యవైభవం | ఏతన్నఃశ్రద్ధధానానాం విస్తరాద్వక్తుమర్హసి || 4 ||

శ్రీ సూత ఉవాచ -

సమ్యక్‌పృష్టంహి యుష్మాభిః శృణుధ్వం మునిపుంగవాః | పురాహిరాఘవోహత్వారావణం సపరిచ్ఛదం || 5 ||

స్థావయిత్వాతులంకాయాం భర్తారంచవిభీషణం | సీతాసౌమిత్రిసంయుక్తోరామోదశరధాత్మజః || 6 ||

సిద్థచారణ గంధర్వైః దేవైరప్సరసాంగణౖః | స్తూయమానోమునిగణౖః సత్యాశీః తీర్థకౌతుకీ || 7 ||

ధారయన్‌లీలయాచాపం రామో7సహ్యపరాక్రమః | ఆత్మనఃశుద్ధిమాధాతుం జానకీం శోధితుంతథా || 8 ||

ఇంద్రాదిదేవవృందైశ్చమునిభిః పితృసన్నిధౌ | విభీషణనసహితః సర్వైరపిచవానరైః || 9 ||

ఆయ¸°సేతుమార్గేణ గంధమాదన పర్వతం | లక్ష్మీతీర్థతటేస్థిత్వాజానకీశోధనాయసః || 10 ||

అగ్నిమావాహయామాస దేవర్షిపితృసన్నిధౌ | అథోత్తస్థౌమహాంభోధేః లక్ష్మీతీర్థాద్విదూరతః || 11 ||

పశ్యత్సుసర్వలోకేషులిహన్నం భాంసిపావకః | ఆతామ్రలోచనః పీతః పీతవాసాధనుర్థరః || 12 ||

సప్తభిశ్చైవజిహ్వాభిః లేలిహానోదిశోదశ | దృష్ట్వారఘుపతింశూరంలీలామానుషరూపిణం || 13 ||

జగాదవచనంరమ్యంజానకీశుద్ధికారణాత్‌ | రామరామమహాబాహోరాక్షసానాం భయావహ || 14 ||

పాతివ్రత్యేన జానక్యారావణం హతవాన్భవాన్‌ | సత్యంసత్యం పునస్సత్యం నాత్రకార్యావిచారణా || 15 ||

కమలేయం జగన్మాతా లీలామానుషవిగ్రహా | దేవత్వేదేవదేహెయం మనుష్యత్వేచమానుషీ || 16 ||

విష్ణోర్దేహానురూపాంవైకరోత్యేషాత్మనస్తనుం | యాదాయదాజగత్స్వామిన్‌ దేవదేవజనార్దన || 17 ||

అవతారాన్‌ కరోషిత్వం తదేయం త్వత్సహాయినీ | యదాత్వంభార్గవోరామః తదాభూద్ధరణీత్వియం || 18 ||

అధునాజానకీజాతాభవిత్రీరుక్మిణీతతః | అన్యేషుచావతారేషువిష్ణోరేషాసహాయినీ || 19 ||

తస్మాన్మద్వచనాదేనాం ప్రతిగృహ్ణీష్వరాఘవ || 19 ½ ||

తా|| శ్రీ సూతులిట్లనిరి - శుభ##మైన సర్వైశ్వర్య కారణమైన లక్ష్మీతీర్థమందు స్నానం చేసి నరులు పిదప అగ్ని తీర్థమునకు వెళ్ళాలి (1) మహాపుణ్యము, మహాపాతకనాశకము, తీర్థములలో ఉత్తమతీర్థము, అన్ని కోరికలకుఒకే సాధనమైనది అగ్ని తీర్థము భక్తితో స్వపాప పరిశుద్ధి కొరకు నరుడు అక్కడ స్నానం చేయాలి (2) ఋషుల మాట- ఓ మునీశ్వర దానికి అగ్ని తీర్థమనే పేరు ఎట్లా వచ్చింది (3) ఈ అగ్ని తీర్థం ఎక్కడుంది. దాని వైభవం ఎలాంటిది. శ్రద్ధ గలిగిన మాకు దీనిని విస్తారంగా చెప్పండి (4) శ్రీ సూతుల వచనము మీరు బాగా అడిగారు. మునులారా వినండి. పూర్వం రాముడు పరిజనములతో సహరావణుని చంపి (5) లంకయందు విభీషణుని రాజుగానిలిపి, సీతసౌమిత్రులతో కూడి దశరధ రాముడు (6) సిద్ధచారణ గంధర్వదేవ అప్సరసగణములతో పొగడబడుతూ, మునిగణములతో ఆశీర్వదింపబడి తీర్థము చూడదలచి (7) అసహ్యపరాక్రముడైన రాముడు విలాసముగా చాపమును ధరించి తనను శుద్ధి చేసుకునే కొరకు, జానకిని శుద్ధి పరచేకొరకు (8) ఇంద్రాది దేవతలతో మునులతో పితరులతో కూడా కలిసి విభీషణునితో కలిసి వానరులందరితో కలిసి (9) సేతుమార్గంగా గంధమాదన పర్వతానికొచ్చాడు. లక్ష్మీతీర్థతటమందు నిలిచి జానకి శుద్ధి కొరకు ఆతడు (10) అగ్నిని ఆవాహనచేశాడు, దేవర్షి పితరుల సన్నిధిలో లక్ష్మీతీర్థానికి కొద్దిదూరంలో, (11) లోకములన్ని చూస్తుండగా సముద్రమునుండి నీళ్ళను నాకుతూ అగ్ని లేచాడు. ఎఱ్ఱని కళ్ళు, పీతవర్ణము, పీత వస్త్రము, ధనుర్థారి (12) ఏడు నాల్కలతో పదిదిక్కులను నాకుతూ, నాలా మానుషరూపుడైన శూరుడైన రఘుపతిని చూచి (13) జానకిశుద్ధి కారణముగా రమ్యమైన మాటను చెప్పాడు. ఓ మహాబాహు! రాక్షసులకు భయము కల్గించే ఓ రామ (14) సీతపాతివ్రత్యంవల్ల నీవు రావణుని చంపావు. ఇదిమాటిమాటికి సత్యమే సత్యమే. ఇక్కడ విచారించ (చర్చించ) వలసినది లేదు (15) ఈమె కమల, జగన్మాత, లీలగా మానుషరూపాన్ని ధరించింది. దేవతదశలో ఈమె దేవదేహముకలది మనుష్య దశలోమానుష రూపంకలది (16) విష్ణువు యొక్క దేహమునకు అనురూపముగా ఈమె తన శరీరాన్ని మార్చుకుంటుంది. ఓ జగత్స్వామి జనార్థన! దేవదేవ (17) నీవు అవతారమెత్తినప్పుడు ఈమె నీకు సహాయం చేసేది. నీవు భార్గవరాముడవైనపుడు ఈమె ధరణి ఐంది (18) ఇప్పుడు జానకి ఐంది. భవిష్యత్తులో రుక్మిణీ ఔతుంది. ఇతరావతారములలో ఈమె విష్ణువునకు సహాయం చేసేది (19) అందువలన నామాట ప్రకారం ఈమెను ఓరామ స్వీకరించు (19 ½)

మూ|| పాపకస్యతుతద్వాక్యంశ్రుత్వాదేవామహర్షయః || 20 ||

విద్యాధరాశ్చగంధర్వామానవాపన్నగాస్తథా | అన్యేచ భూతనివహారామందశరథాత్మజం || 21 ||

జానకీంమైధిలీంచైవప్రశసంసుఃపునఃపునః | రామోగ్నివచనాత్సీతాంప్రతిజగ్రాహనిర్మలాం || 22 ||

ఏవంసీతావిశుద్ధ్యర్థం రామేణాక్లిష్టకర్మణా | ఆవాహనేకృతేవహ్నిః లక్ష్మీతీర్థాద్విదూరతః || 23 ||

యతః ప్రదేశాదుత్తస్థావంబుధేఃద్విజసత్తమాః | అగ్నితీర్థంవిజానీతతంప్రదేశమనుత్తమం || 24 ||

తతోవినిర్గమాదగ్నేః అగ్నితీర్థమితీర్యతే | అత్రస్నాత్వానరోభక్త్యా హ్నెస్తీర్థేవిముక్తిదే || 25 ||

ఉపోష్యవేదవిదుషోబ్రాహ్మణాన పిభోజయేత్‌ | తేభ్యోవస్త్రంధనం భూమిం దద్యాత్‌ కన్యాంచభూషితాం || 26 ||

సర్వపాపవినిర్ముక్తోవిష్ణుసాయుజ్యమాప్నుయాత్‌ | అగ్నితీర్థస్యకూలేస్మిన్నన్నదానం విశిష్యతే || 27 ||

అగ్నితీర్థసమం తీర్థంసభూతం సభవిష్యతి | దుష్పణ్యోపిమహాపాపోయత్రస్నానాత్‌ పిశాచతాం || 28 ||

పరిత్యజ్యమహాఘోరాం దివ్యంరూపమవాప్తవాన్‌ | పశుమాన్నామవైశ్యోభూత్‌పురాపాటలిపుత్రకే || 29 ||

సవైధర్మపరోనిత్యం బ్రాహ్మణారాధనేరతః | కృషింనిరంతరం కుర్వన్‌ గోరక్షాంచైవసర్వదా || 30 ||

పణ్యవీథ్యాంచ విక్రీణన్‌ కాంచనాదీనిధర్మతః | పశుమన్నామధేయస్యవణిక్‌ శ్రేష్ణస్యతస్యవై || 31 ||

బభూవభార్యాత్రితయం పతిశుశ్రూషణరతం | జ్యేష్ఠాత్రీన్‌ సుషువేపుత్రాన్‌ వైశ్యవంశవివర్థనాన్‌ || 32 ||

సుపణ్యంపణ్యవంతంచ చారుపణ్యం తథైవచ | మధ్యమానుషువేపుత్రౌ సుకోశబహుకోశకౌ || 33 ||

తృతీయాయాంత్రయః పుత్రాస్తస్యవైశ్యస్యజజ్ఞిరే | మహాపణ్యో మహాకోశో దుష్పణ్య ఇతివిశ్రుతాః || 34 ||

ఏవం పశుమతస్తస్యవైశ్యస్యద్విజసత్తమాః | బభూవురష్టతనయాః తానుస్త్రీ షుతిసృష్వపి || 35 ||

తా|| అగ్నియొక్క ఆ మాటలను దేవతలు ఋషులువిని (20) విద్యాధర గంధర్వ మానవ పన్నగులు, ఇతర ప్రాణి కోటి దశరధరాముని (21) మిధిలకు చెందిన జనకుని కూతురును మాటిమాటికి ప్రశంసించారు. రాముడు అగ్నిమాట ప్రకారము నిర్మలమైన సీతను పరిగ్రహించాడు (22) ఈ విధముగా సీత విశుద్ధి కొరకు సులభంగా పనులనుసాధించే రాముడు వహ్నిని ఆ వాహన చేయగా, లక్ష్మీతీర్థమునకు కొద్ది దూరంలో, (23) సముద్రం నుండి అగ్ని పుట్టిన ప్రదేశాన్ని, ఉత్తమమైన అగ్ని తీర్థమని తెలుసుకోండి ఓ ద్విజులార! (24) అక్కడినుండి అగ్ని నిర్గమించింది కనుక అగ్ని తీర్థమని పిలువబడుతోంది. ముక్తినిచ్చే ఈ వహ్నితీర్థమందు భక్తితో స్నానం చేసి నరులు (25) వేదవిద్వాంసులు తాము ఉపవాస ముండి బ్రాహ్మణులను భుజింపచేయాలి. వారికి వస్త్రము, ధనము, భూమి, అలంకృతమైన కన్యను దానం చేయాలి (26) అన్ని పాపములనుండి ముక్తుడై విష్ణు సాయుజ్యమును పొందుతాడు. అగ్నితీర్థము ఒడ్డున అన్నదానము శ్రేష్ఠమైనది (27) అగ్ని తీర్థముతో సమానమైనది ముందులేదు భవిష్యత్తులో కలగదు. మహాపాపి, దుష్పణ్యుడు (చెడ్డవ్యాపారి) ఇక్కడ స్నానం చేసి ఘోరమైన పిశాచ రూపాన్ని (28) వదలి దివ్యరూపాన్ని పొందాడు. పాటలిపుత్రంలో పూర్వం పశుమంతుడనే వైశ్యుడు ఉండేవాడు. (29) ఆతడు ధర్మపరుడు రోజు బ్రాహ్మణారాధన యందాసక్తి కలవాడు. ఎప్పుడూ కృషిని గోరక్షను చూస్తూ (30) అంగడిలో బంగారం మొదలగు వానిని ధర్మంగా అమ్ముతూ ఉండేవాడు. పశుమంతుడను పేరుగల ఆవణిక్‌ శ్రేష్ఠునకు (31) ముగ్గురు భార్యలుండే వారు భర్త శుశ్రూషయందు ఆసక్తి గలవారు. పెద్ద భార్య ముగ్గురు కుమారులను వైశ్య వంశమును వృద్ధిచేసే వారిని కన్నది (32) సుపుణ్యుడు పుణ్యవంతుడు చారుపణ్యుడు అని వారి పేర్లు. మధ్యభార్యిఇద్దరు పుత్రులను సుకోశ, బహుకోశులను వారిని కన్నది. (33) మూడవ భార్యయందు ఆ వైశ్యునకు ముగ్గురుపుత్రులు కలిగారు. మహాపుణ్య మహా కోశులు దుష్పణ్యులని (చెడ్డ వ్యాపారులని) ప్రసిద్ధి కెక్కారు. (34) ఈ విధముగా ఆ పశుమతునకు ఎనిమిది మంది కుమారులు ఆ ముగ్గురు స్త్రీలలో కలిగారు (35).

మూ|| తేనుపణ్యముఖాస్సర్వే పుత్రావవృధిరే క్రమాత్‌ | ధూలికేలింవితన్వంతః పితరంతోషయంతితే || 36 ||

పంచహాయనతాంప్రాప్తాః క్రమాత్తేవైశ్యనందనాః | పశుమానపివైశ్యేంద్రః సర్వానపిచతాన్సుతాన్‌ || 37 ||

బాల్యమారభ్యసతతంస్వకృత్యేషు వ్యశిక్షయత్‌ | కృషిగోత్రాణ వాణిజ్య కర్మసుక్రమశిక్షితాః || 38 ||

సువణ్యముఖ్యాః సపై#్తవపితృవాక్యమశృణ్వత | పశుమాన్‌ పక్తియత్కార్యం తత్‌క్షణాన్నిరవర్తయన్‌ || 39 ||

నైపుణ్యం ప్రాపురత్యంతం తేసువర్ణక్రియాస్వపి || దుష్పణ్యస్త్వమః పుత్రోబాల్య మారభ్యసంతతం || 40 ||

దుర్మార్గనిరతోభూత్వానాశృణోత్‌ పితృభాషితం | ధూలికేలింసమారభ్యదుర్మార్గనిరతోభవత్‌ || 41 ||

నబాలఏవసన్‌పుత్రోబాలానన్యానబాధత | దుష్కర్మనిరతం దృష్ట్వా తంపితా పశుమాంస్తథా || 42 ||

ఉపేక్షామేవకృతవాన్‌ బాలిశోయమితీరయన్‌ | అధాష్టావపి వైశ్యస్యప్రాపుర్యౌవనమాత్మజాః || 43 ||

తతోయమష్టమఃపుత్రో దుష్పణ్యోబలినాంవరః | గృహీత్వాపాణియుగలేబాలాన్నగరవర్తినః || 44 ||

నిచిక్షేపన కూపేషుసరిత్సుచ సరఃస్వపి | నకోపితస్యజానాతి దుశ్చరిత్రమిదంజనః || 45 ||

యావన్మ్రియంతే తే బాలాః తావన్నిక్షిప్తవాంజలే | తేషాంమృతానాంబాలానాం పితరోమాతరస్తథా || 46 ||

గవేషయంతి తాన్సర్వాన్‌ నగరెషుహినర్వశః | తాన్‌ దృష్ట్వాచమృతాన్‌ పుత్రాన్‌ కేవలం ప్రారుదన్‌జనాః || 47 ||

జలేష్వధవశవాన్‌ దృష్ట్వాజనాశ్చక్రుర్యధోచితం | ఏవం ప్రతి దినం బాలాన్‌ దుష్పణ్యోమారయన్‌ పురే || 48 ||

జనైరవ్యపరిజ్ఞాతః చిరమేవమవర్తత | మ్రియమాణషుబాలేషువైశ్యపుత్రస్యకర్మణా || 49 ||

ప్రజానాంవృద్ధిరాహిత్యాత్‌ శూన్యప్రాయమభూత్పురం | తతః సమేత్యపౌరాస్తద్వృత్తం రాజ్జేన్యవేదయన్‌ || 50 ||

శ్రుత్వానృపస్తద్వచనం ఆహూయగ్రామపాలకాన్‌ | కారణం బాలమరణచింత్యతామితిసోస్వశాత్‌ || 51 ||

గ్రామపాలాస్తథేత్యుక్త్వాతత్రత్రవ్యవస్థితాః | తేపునర్‌నృపమాసాద్యభీతావాక్యమథాబ్రువన్‌ || 53 ||

గ వేషయంతోపివయం తన్నవిందామహేనృప | యోబాలా న్నగరేస్థిత్వాసతతం మారయత్యపి || 54 ||

పునశ్చనాగరాః సర్వేరాజానం ప్రాప్యదుఃభితాః | పునః ప్రజానాం మరణం అబ్రువన్‌ భాష్పసంకులాః || 55 ||

రాజాతత్కారణాజ్ఞానాత్‌ తూక్ష్‌ణీమాస్తే విచింత్యతు || 55 ½ ||

తా|| ఆ సుపణ్యుడు మొదలుగా అందరు పుత్రులు క్రమంగా పెరిగారు. దుమ్ములో ఆడుకుంటూ తండ్రిని సంతోష పరిచారు (36) క్రమంగా ఆ వైశ్యకుమారులు ఐదు సంవత్సరాల వయస్సువారైనారు. వైశ్యశ్రేష్ఠుడైన పశుమంతుడు, కూడా ఆకొడుకులందరికి (37) చిన్ననాటి నుండి ఎల్లప్పుడు తమ వృత్తిలో శిక్షణనిచ్చాడు. కృషి, గోరక్షణ, వాణిజ్యకర్మలందు క్రమంగా శిక్షింపబడ్డారు (38) సుపణ్యుడు మొదలగు ఏడుగురు కుమారులు తండ్రి మాటను విన్నారు. పశుమానుడు చెప్పిన పనిని వెంటనే నిర్వర్తించేవారు (39) సువర్ణక్రియయందు కూడా వారు నైపుణ్యాన్ని సంపాదించారు. దుష్పణ్యుడు ఎనిమిదవ కుమారుడు బాల్యం నుండి ఎప్పుడూ (40) దుర్మార్గ నిరతుడై తండ్రి మాట వినలేదు. దుమ్ములో ఆడుకునేనాటి నుండి దుర్గార్గనిరతుడైనాడు (41) అతడు పిల్లవాడి దశలోనే ఇతర పిల్లలను బాధించేవాడు. దుష్కర్మనిరతుడైన వానిని చూచి తండ్రి పశుమంతుడు (42) ఉపేక్షించాడు. ఈతడు పిల్లవాడు అని తలిచేవాడు. కొంతకాలానికి ఆ వైశ్యుని ఎనిమిది మంది కుమారులు ¸°వ్వనాన్ని పొందారు (43) ఈ ఎనిమిదవ కుమారుడు దుష్పణ్యుడు బలవంతులలో శ్రేష్ఠుడు, చేతులలో, పట్నంలో ఉండే పిల్లవాళ్ళను తీసుకొని (44) బావులలో నదులలో సరస్సులలో పారవేశాడు. ఆతని ఈ దుశ్చరిత్రను ఎవ్వడు తెలుసుకోలేదు (45) పిల్లలు చచ్చే వరకు నీటిలో ఉంచేవాడు. చచ్చిన పిల్లల తల్లిదండ్రులు (46) ఆ పిల్లలను నగరమంతటా వెతికేవారు చనిపోయిన తమ పుత్రులను చూచి ప్రజలు ఏడ్చారు (47) నీటిలో శవాలను చూచి అందుకు తగిన శవసంస్కారం చేశారు. ఈ విధంగా ప్రతిరోజు దుష్పణ్యుడు పిల్లలను నగరంలో చంపి (48) జనులచే గుర్తింప బడకుండా చాలా రోజులిట్లాగే ఉన్నాడు. వైశ్యపుత్రుని పనితో పిల్లలు మరణించగా (49) ప్రజలు (సంతానం) వృద్ధి చెందనందువల్ల పురము శూన్యప్రాయమైంది. పిదప ప్రజలు గుమిగూడివచ్చి ఆ వృత్తాంతమును రాజుతో చెప్పారు. (50) రాజు ఆ వృత్తాంతమును విని గ్రామ పాలకులను పిలిచి పిల్లల చావుకు కారణమేమిటో విచారించండి అని ఆదేశించాడు (51) గ్రామపాలులు అట్లాగే అని పలికి అక్కడక్కడ ఉండి బాల మరణంలో కారణాన్ని బాగా వెతకసాగారు (52) వారట్లా వెతికినా బాలమారకుని తెలుసుకోలేకపోయారు. వారు తిరిగి రాజు దగ్గరకు వచ్చి భయంతో ఇట్లా అన్నారు (53) ఎంతవెదికినా మేము, నగరంలో ఉంటూ ఎల్లప్పుడూ పిల్లలను చంపే వానిని తెలుసుకోలేక పోతున్నాము ఓరాజ! అని (54) నగరవాసులందరు మరల రాజుగారి దగ్గరకు వచ్చి దుఃఖిస్తూ తమ సంతాన మరణాన్ని గూర్చి కన్నీళ్ళతో చెప్పారు (55) రాజు ఆ కారణాన్ని తెలుసుకోలేక పోయినందువల్ల ఆలోచించి మౌనంగా ఉన్నాడు. (55 ½).

మూ|| కదాచిత్‌ వైశ్యపుత్రోయం పంచభిర్బాలకైః సహ || 56 ||

తటాకాంతికమాపేదే పంకజాహరణచ్ఛలాత్‌ | బలాద్గృహీత్వాతాన్‌ బాలాన్‌ దుష్పణ్యఃక్రోశతస్తదా || 57 ||

క్రూరాత్మామజ్జయామాన కంఠదఘ్నే సరోజలే | మృతాన్‌మత్వాచతాన్‌శీఘ్రందుష్పణ్యఃస్వగృహంయ¸° || 58 ||

వంచానాంపితరసైషాంమార్గయంతఃసుతాన్‌పురే | తేషువైమార్గమాణషు పంచతేనాతిబాలకాః || 59 ||

నిక్షిప్తాఅపితోయేషునామ్రియంతయదృచ్ఛయా | తేశ##నైః కూల మాసాద్య పంచాపిక్లిన్న మౌలయః || 60 ||

అశక్తా నగరం గంతుం బాల్యాత్తత్రైవ బభ్రముః | దూరాదుచ్చార్యమాణాని స్వనామాని స్వబంధుభిః || 61 ||

శ్రుత్వాపంచాపి తేబాలాః ప్రతిశబ్ద మకుర్వత | తతస్తత్‌ పితరః శ్రుత్వాతత్రాగత్యసరస్తటే || 62 ||

పుత్రాన్‌ దృష్ట్వాతు సప్రాణాన్‌ ప్రహర్ష మతులం గతాః | కిమేత దితిపి త్రాద్యైః పృష్టాస్తే బాలకాస్తదా || 63 ||

దుష్పణ్యస్యాథ దుష్కృత్యం బంధుభ్యస్తేన్యవేదయన్‌ | తతోవిదిత వృత్తాంతా రాజానం ప్రాప్యనాగరాః || 64 ||

పంచభిః కధితం వృత్తం దుష్పణ్యస్యన్యవేదయన్‌ | తతోరాజాసమాహూయ పశుమంతం వణిగ్వరం || 65 ||

పౌరేష్వపిచశృణ్వత్సువాక్యమేతదభాషత

రాజోవాచ -

దుష్పణ్యనామ్నాపశుమన్‌ బహు ప్రజమిదంపురం || 66 ||

శూన్యప్రాయంకృతం పశ్యత్వత్పుత్రేణ దురాత్మనా | ఇదానీం బాలిశానేతాన్‌ మజ్జయామాసవైజలే || 67 ||

యదృచ్ఛయాచనప్రాణాః పునరప్యాగతాః పురం | అస్మిన్నిత్థం గతేకార్యే కింకర్తవ్యం వదాధునా || 68 ||

అద్యత్వామేవ పృచ్ఛామియతస్త్వంధర్మతత్పరః | ఇత్యుక్తః పశుమాన్‌రాజ్ఞో ధర్మజ్ఞోయుక్తమబ్రవీత్‌ || 69 ||

పశుమానువాచ -

పురం నిఃశేషితం యేన వధమే వాయమర్హతి | సహ్యత్ర విషయేకించిత్‌ వ్రష్టవ్యం విద్యతేనృవ || 70 ||

సహ్యయం మమపుత్రః స్యాత్‌ శత్రురేవాతి పాపకృత్‌ | సహ్యస్య నిష్కృతిం పశ్యేయేననిః శేషితం పురం || 71 ||

వధ్యతామేషదుష్టాత్మాసత్యమేవ బ్రవీమ్యహం || 71 ½ ||

తా|| ఒక సారి ఈ వైశ్య పుత్రుడు ఐదుగురు పిల్లలతో కలిసి (56) తామరపూలు తెద్దామనే నెపంతో చెరువు సమీపానికి వచ్చాడు. ఏడుస్తున్నా బలవంతంగా తీసుకొని ఆ పిల్లలను దుష్పణ్యుడు (57) కంఠంలోతు నీళ్ళలో క్రూరుడు ముంచాడు. వారు చనిపోయారనుకొని శీఘ్రముగా దుష్పణ్యుడు తన ఇంటికి వెళ్ళాడు. (58) ఆ ఐదుగురు పిల్లల తండ్రులు తమ కొడుకులను నగరంలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఆ ఐదుగురు అసామాన్య బాలకులు (59) నీళ్ళల్లో ముంచినా అదృష్టవశాత్తు చావలేదు. వారు మెల్లగా ఒడ్డుకు వచ్చి వాడిన తలలు గలవారై ఆ ఐదుగురు (60) నగరంలోకి వెళ్ళుటకు అశక్తులై బాల్యంవల్ల అక్కడే తిరుగసాగారు. తమపేర్లు బంధువులు దూరంగా ఉండి ఉచ్చరిస్తుంటే (61) విని ఆ ఐదుగురు పిల్లలు తిరిగి అరిచారు. దానిని వారి పితరులు విని ఆ సరస్సుతీరమునకు వచ్చి (62) బ్రతికిన తమ పిల్లలను చూసి చాలా ఆనందపడ్డారు. ఇదేమిటని తండ్రులడగగా ఆపిల్లలప్పుడు (63) తమ బంధువలకు ఇది దుష్పణ్యుని పని అని చెప్పారు. పిదప విషయం తెలుసుకొని ప్రజలు రాజు దగ్గరకు వచ్చి (64) ఐదుగురు చెప్పిన వృత్తాంతాన్ని దుష్పణ్యుడు చేసిన దాన్ని చెప్పారు. అప్పుడు రాజు పశుమంతుని వైశ్యశ్రేష్ఠుని పిలిచి ప్రజలు వింటుండగా ఇట్లా అన్నాడు. (65) రాజుమాట - ఓ పశుమంత! దుష్పణ్యుడనే పేరుగలవాడు బహు ప్రజగల ఈ నగరాన్ని (66) శూన్యప్రాయంగా చేశాడు. దురాత్ముడైన నీ పుత్రుడు చూడు ఈ రోజు ఈ పిల్లలను నీటిలో ముంచాడు (67) అదృష్టవశాత్తు ప్రాణంతో తిరిగి నగరానికి వచ్చారు. ఈతడిట్లా చేస్తుండగా ఇప్పుడేం చేయాలో చెప్పు (68) నీవు ధర్మ తత్పరుడవు కనుక నిన్నే అడుగుతున్నాను. అని అనగా పశుమంతుడు దర్మజ్ఞుడు తగిన విధంగా ఇట్లన్నాడు (69) పశుమంతునిమాట - పురమును మిగలకుండాచేసిన ఈతనికి చావే తగును. ఈవిషయంలో అడుగతగింది ఏమీలేదు ఓరాజ! (70) వీడునా కొడుకు కాడు వీడు శత్రువే. అతి పాపమాచరించినవాడు. వీడికి నిష్కృతి లేదు నగరమంతా ఏమి మిగులకుండా చేశాడు గదా (71) ఈ దుష్టాత్ముని చంపండి నేను నిజమే చెబుతున్నాను.

మూ|| శ్రుత్వాపశుమతో వాక్యం నాగరాః సర్వేఏవహి || 72 ||

వణిగ్వరం శ్లాఘమానా, రాజాసమిద మూచిరే | నవధ్యతామయం దుష్టఃతూష్ణీంనిర్వాస్యతాం పురాత్‌ || 73 ||

తతఃసరాజా దుష్పణ్యంసమాహూయేదమబ్రవీత్‌ | అస్మాద్దేశాత్‌ భవాన్‌ శీఘ్రం దుష్టాత్మన్‌ గచ్ఛసాంప్రతం || 74 ||

యదితిష్ఠేత్‌ త్వమత్రైవ దండయేయం వధేనవై | ఇతిరాజ్ఞా వినిర్‌భర్త్ప్య దూతైః నిర్వాసితః పురాత్‌ || 75 ||

దుష్పణ్య స్త్వథ తందేశంపరిత్యజ్య భయాన్వితః | మునిమండల సంబాధం వనమేవ య¸°తదా || 76 ||

తత్రాప్యేకం మునిసుతం సతో యేషున్య మజ్జయత్‌ | కేల్యర్థ మాగతాదృష్ట్యామునిపుత్రా మృతం శిశుం || 77 ||

తత్పిత్రే కథయామానుః అభ్యేత్యభృశ దుఃఖితాః | తతుగ్రశ్రవాః శ్రుత్వాతేభ్యః పుత్రం జలేమృతం || 78 ||

తపోమహిమ్నా దుష్పణ్య చరితం తదమన్యత | ఉగ్రశ్రవాః శశాపైనం దుష్పణ్యం వైశ్యనందనం || 79 ||

ఉగ్రశ్రవా ఉవాచ -

మత్సుతం పయసిక్షిప్యయత్త్వం మారితవానసి | తవాపి మరణం భూయాత్‌ జలేఏవనిమజ్జనాత్‌ || 80 ||

మృతశ్చసుచిరంకాలం పిశాచస్త్వం భవిష్యసి | ఇతిశాపేశ్రుతే సద్యో దుష్పణ్యః భిన్నమానసః || 81 ||

తద్వైవనం పరిత్యజ్య ఘోరమన్యద్వనం య¸° | సంహాదిక్రూరసత్వాఢ్యం తస్మిన్ప్రాప్తేవనాంతరం || 82 ||

పాంసువర్షంమహద్వర్షన్‌ వృక్షానామోటయన్‌ముహుః | వజ్రఘాతసమస్పర్శోవవౌఝంఝానిలోమహాన్‌ || 83 ||

వేగేనగాత్రం భిందంతీ వృష్టిశ్చాసీత్‌ సుదుః సహా | తద్దృష్ట్వా సతుదుష్పణ్యః చింతయన్‌ భృశదుఃఖితః || 84 ||

మృతం శుష్కం మహాకాయః గజమేకం అపశ్యత | మహావాతం మహావర్షం తదాసోఢుమశక్నువన్‌ || 85 ||

గజాస్యవివరేణౖవ వివేశోదరగహ్వరం | తస్మిన్‌ ప్రవిష్టమాత్రేతు వృష్ఠిరాసీత్సుభూయసీ || 86 ||

తతోవర్షజలైన్సర్వైః ప్రవాహః సుమహానభూత్‌ | సప్రవాహోవనేతస్మిన్‌ నదీకాచి దజాయత || 87 ||

అథతైర్వర్షసలిలైః సగజః పూరితోదరః | ప్లవమానోమహాపూరేనీరంధ్రః సమజాయత || 88 ||

తతోనిర్వివరస్యాస్య జలపూర్ణోదరస్యచ | గజస్యజఠరాత్సోయం నిర్గతుం నశశాకహ || 89 ||

తతశ్చవృష్టితో యానాం ప్రవాహోభీమవేగవాన్‌ | ఉదరస్థిత దుష్పణ్యం సముద్రం ప్రాపయద్గజం || 90 ||

దుష్పణ్యః సలిలే మగ్నః క్షణాత్‌ ప్రాణౖర్వ్య యుజ్యత | మృతేఏవసదుష్పణ్యః పిశాచత్వమవాప్తవాన్‌ || 91 ||

తా|| పశుమతుని వాక్యాన్ని విని నగరప్రజలందరు (72) వణిగ్వరుని పొగడుతూ రాజుతో ఇట్లా అన్నారు. ఈ దుర్మార్గుణి చంపొద్దు . ఊరికే నగరం నుండి బహిష్కరించండి. (73) అప్పుడు రాజు దుష్పణ్యుని పిలిచి ఇట్లా అన్నాడు. ఓ దుష్టాత్మ ఈ దేశం నుండి నీవు ఇప్పుడు త్వరగా వెళ్ళు (74) ఒకవేళ ఇక్కడే ఉంటే చావుతో నిన్ను శిక్షిస్తాను. అని రాజు భయపెట్టి పట్టణం నుండి దూతద్వారా బహిష్కరింపచేశాడు (75) దుష్పణ్యుడు ఆ దేశాన్ని వదలి భయంతో ముని మండలంతో నిండిన అడవికి వెళ్ళాడు (76) అక్కడ కూడా ఒక ముని కుమారుని ఆతడు నీటిలో ముంచాడు. ఆట కొరకు వచ్చిన ముని పుత్రులు మృతశిశువును చూచి (77) అతి దుఃఖంతో వచ్చి ఆతని తండ్రికి చెప్పారు అప్పుడు ఉగ్రశ్రవుడు వారి ద్వారా కొడుకు నీటిలో చనిపోయినాడని విని (78) తపోమహిమవల్ల ఇది దుష్పణ్యుని పని అని గ్రహించాడు. వైశ్యుని కుమారుడైన దుష్పణ్యుని ఉగ్రశ్రవుడు శపించాడు (79) ఉగ్రశ్రవుని మాట - నాకొడుకును నీటిలో ఉంచిచంపావుగదా నీకుమరణం కూడా నీటిలో మునగటం వల్లే కల్గుతుంది (80) చనిపోయాక చాలా కాలము నీవు పిశాచి వౌతావు అని శాపం వినగానే దుష్పణ్యుడు భిన్నమానసుడై (81) ఆ వనం వదలి ఘోరమైన మరో అడవికి వెళ్ళాడు. సింహాది క్రూర సత్వములతో కూడిన మరో అడవికి వచ్చాక (82) దుమ్ము వర్షము బాగా పడి చెట్లను మాటిమాటికి కదిలిస్తూ (కోస్తూ) ఉండగా, వజ్రాఘాతములో సమానమైన స్పర్శగల ఝంఝానిలము పెద్దగా వీచింది (83) వేగంతో శరీరాన్ని భేదిస్తూ భరింపరాని వర్షంకూడా పడింది. దాన్ని చూసి ఆ దుష్పణ్యుడు చాలా దుఃఖించి ఆలోచిస్తూ (84) చనిపోయిన ఎండిన భారీ శరీరముగల ఒక ఏనుగను చూచాడు. గాలి, వర్షము వీటిని సహించలేనివాడై (85) ఏనుగు ముఖము ద్వారా దాని కడుపులోకి ప్రవేశించాడు. అందులే ప్రవేశించగానే ఇంకా ఎక్కువ వర్షం పడింది (86) ఆ వర్షపునీటితో పెద్ద ప్రవాహమేర్పడింది. ఆ ప్రవాహంతో అడవిలో ఒక నది ఏర్పడింది (87) ఆ వర్షపునీటితో ఏనుగ కడుపునిండి తేలుతూ ప్రవాహంలో రంధ్రం లేకుండా ఐపోయింది (88) రంధ్రంలేని, నీటితో నిండిన ఏనుగు కడుపు నుండి ఈ దుష్పణ్యుడు బయటికి రాలేక పోయాడు. (89) మహా వేగముగల వర్షపు నీటి ప్రవాహము, కడుపులో దుష్పణ్యుని గల ఏనుగును సముద్రానికి చేర్చింది (90) దుష్పణ్యుడు నీటిలో మునిగి క్షణంలో ప్రాణాలు వదిలాడు. చావగానే ఆ దుష్పణ్యుడు పిశాచ రూపాన్ని పొందాడు (91)

మూ|| పీడితఃక్షుత్పి పాసాభ్యాందుర్గమం వనమాశ్రితః | ఘోరేషుషుర్మకాలేషు సమాక్రోశన్భయానకం || 92 ||

అతిష్ఠత్‌ గహనేరణ్యదుఃఖాన్యనుభవన్‌ బహు | కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతానిచ || 93 ||

సపిశాచోమహాదుఃఖీన్యవసత్‌ ఘోరకాననే | వనాత్‌ వనాంతరం ధావన్‌ దేశాద్దేశాంతరం తథా || 94 ||

సర్వత్రానుభవన్‌ దుంఖమాయ¸° దండకాన్‌ క్రమాత్‌ | అగస్త్యాదాశ్రమాత్పుణ్యాన్నాతిదూరేససంచరన్‌ || 95 ||

సదన్‌భైరవనాదంచ వాక్యముచ్చైర భాషత | భోభోస్త పోధనాస్సర్వే శృణుధ్వం మామకంవచః || 96 ||

భవన్తో హికృపావన్తః సర్వభూతహితేరతాః | కృపాదృష్ట్యాను గృహ్ణీత మాందుః ఖైరతి పీడితం || 97 ||

పురా దుష్పణ్య నామహం వైశ్యః పాటలి పుత్రకే | పుత్రః పశుమతశ్చాపి బహూన్బాలా నమారయం || 98 ||

తతోవివాసితో రాజ్ఞాత స్మాదేశాద్వనంగతః | అమారయంజలేపుత్రం తత్రోగ్రశ్రవసోమునేః || 99 ||

సమునిర్దత్తవాన్‌ శాపం మమాపి మరణంజలె | పిశాచతాంచ మేఘోరాం దత్తవాన్‌ దుఃఖ భూయసీం || 100 ||

కల్పకోటిసహస్రాణి కల్పకోటి శతాన్యపి | పిశాచ తాను భూతేయం శూన్య కాననభూమిషు || 101 ||

నాహంసోఢుం సమర్థోస్మిపిపాసాంక్షుధమేవచ | రక్షధ్వం కృపయాయూయం అతోమాం బహుదుఃఖినం || 102 ||

యథాముచ్యేయ పైశాచ్యాత్‌ తథాకురతతాపసాః | ఇతి శ్రుత్వాపిశాచస్యవచనంతేతపోధనాః || 103 ||

లోపాముద్రాసహచరం ఊచిరే కుంభసంభవం | || 103 ||

తాపసాఊచుః -

పిశాచస్యాస్య భగవన్‌ బ్రూహి నిష్కృతి ముత్తమాం || 104 ||

ఏవం విధానాం పాపానాం త్వం సమర్థోహి రక్షణ | తేషా మగస్త్యః శ్రుతవాన్‌ కృపయా పరయాయుతః

ప్రియ శిష్యం సమాహూయ సుతీక్ణం వాక్యమబ్రవీత్‌ | || 105 ||

అగస్త్య ఉవాచ -

సుతీక్ణ గచ్ఛత్వరితం పర్వతం గంధమాదనం || 106 ||

తత్రాగ్ని తీర్థం సుమహత్‌ విద్యతే పాపనాశనం | పిశాచ మోక్షణార్ధయా తత్రస్నాహి మహామతే || 107 ||

పిశాచార్ధం త్వయిస్నాతే తత్ర సంకల్ప పూర్వకం పిశాచ భావమున్ముచ్య దివ్య తామేషయాస్యతి || 108 ||

నిష్కృతిం నాన్యపశ్యామి వినాతత్తీర్థసేవనాత్‌ | అతః సుతీక్ష్‌ణకృపయా రక్షసై#్వనంపిశాచకం || 109 ||

అగస్త్యే నైవముక్తస్తు సుతీక్షోణగంధమాదనం | ప్రాప్యాగ్ని తీర్థే సంకల్ప్య పిశాచార్థం కృపానిధిః || 110 ||

సస్నౌతత్రపిశాచార్థం నియమేన దినత్రయం || 110½ ||

తా|| ఆకలి దప్పులతో పీడింపబడి దుర్గమమైన వనమును చేరాడు. ఘోరమైన వేసవి కాలములో భయంకరముగా అరుస్తూ (92) అనేక దుఃఖములను భవిస్తూ గహనమైన అరణ్యంలో ఉన్నాడు. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు (93) ఆ పిశాచము దుఃఖిస్తూ ఘోరకాననంలో ఉన్నాడు. వనమునుండి మరోవనానికి ఒక దేశము నుండి మరో దేశానికి వెళ్తూ (94) అంతటా దుఃఖాన్ని అనుభవిస్తూ క్రమంగా దండకారణ్యమునకు వచ్చాడు. అగస్త్యాశ్రమమునకు కొద్ది దూరంలో ఆతడు సంచరిస్తూ (95) భయంకరంగా అరుస్తూ ఇట్లా అన్నాడు. ఓ తపోధనులారా! అందరు నామాట వినండి (96) మీరు దయగలవారు. అన్ని ప్రాణుల హితం కోరేవారు. దుఃఖములతో బాగా పీడింపబడ్డ నన్ను కృపాదృష్టితో అనుగ్రహించండి (97) పూర్వం నేను పాటలీ పుత్రంలో దుష్పణ్యుడను పేరుగల వైశ్యుణ్ణి. పశుమతుని కుమారుణ్ణి. అనేక మంది పిల్లలను చంపాను (98) రాజు బహిష్కృతుడు చేయగా ఆ దేశం నుండి వనమునకు చేరాను. అక్కడ ఉగ్రశ్రవుని కుమారుని నీటిలో చంపాను (99) ఆముని నాకు శాపమిచ్చాడు. నాకు కూడా చావు నీటిలోనే అని. దుఃఖ భూయసి ఐన ఘోరమైన పిశాచత్వమునుకూడా ఇచ్చాడు (100) కల్పకోటి సహస్రములు కల్పకోటి శతములు, శూన్యమైన అడవులలో ఈ పిశాచత్వాన్ని అనుభవించాను. (101) నేనింకా దప్పికను ఆకలిని సహించే స్థితిలోలేను. దీనితో బాగా దుఃఖించిన నన్ను దయతో మీరు రక్షించండి (102) ఈ పిశాచ దశనుండి ముక్తుణ్ణయ్యేట్టుగా చేయండి ఓ తాపసులార! అనే పిశాచి మాటలను తపోధనులు విని లోపాముద్ర సహచరుడైన కుంభసంభవునితో ఇట్లా అన్నారు. (103) తాపసుల మాట- ఓ భగవాన్‌ ! ఈ పిశాచమునకు ఉత్తమమైన నిష్కృతిని చెప్పండి (104) ఇటువంటి పాపములనుండి రక్షించటంలో నీవు సమర్థుడవు. వారి మాలను చాలా దయతో అగస్త్యుడు విన్నాడు. సుతీక్షుణడనే ప్రియశిష్యుని పిలిచి ఇట్లా అన్నాడు. (105) అగస్త్యోక్తి - సుతీక్ణ! గంధమాదన పర్వతానికి త్వరగా పో (106) అక్కడ పాపనాశకమైన అగ్నితీర్థముంది. పిశాచమోక్షణము కొరకు, ఓ మహామతి! అక్కడ స్నానం చేయి (107) అక్కడ సంకల్ప పూర్వకముగా పిశాచము కొరకు నీవు స్నానం చేస్తే, పిశాచ భావమును వదలి నీవు దివ్యత్వాన్ని పొందుతావు. (108) ఆ తీర్థసేవనము కాకుండా నీకు నిష్కృతి మరో విధంగా లేదు. అందువల్ల ఓ సుతీక్ణ! దయతో ఈ పిశాచాన్ని రక్షించు (109) అగస్త్యుడు ఇట్లా చెప్పగానే సుతీక్షుణడు గంధమాదనమునకు వచ్చి, దయగలవాడై పిశాచము కొరకు సంకల్పించి, అగ్నితీర్థంలో (110) అక్కడ పిశాచము కొరకు నియమంగా మూడు రోజులు స్నానం చేశాడు (110½).

మూ|| రామనాథాదికంసేవ్య తత్తీర్థం ప్రతిగృహ్యచ || 111 ||

స్వాశ్రమం ప్రతిగత్వాథ సుతీక్షోణ విప్రసత్తమః | తత్తీర్థప్రోక్షణా త్సద్యః సవిసృజ్యపిశాచతాం || 112 ||

వైభవాత్త స్యతీర్థస్య సద్యోదివ్యత్వమాప్తవాన్‌ | విమానవరమారుఢో దివ్యస్త్రీ పరివారితః || 113 ||

సుతీక్ణంచావ్య గస్త్యం చతథాన్యాం శ్చతపోధనాన్‌ | పునఃపునః నమస్కృత్య తాంశ్చామంత్ర్య ప్రహర్షితః || 114 ||

స్వర్గమేవారు హత్తూర్ణం దే వైరపి సపూజితః | అగ్నితీర్థస్యమాహాత్మ్యాత్‌ దుష్పణ్యో వైశ్యనందనః || 115 ||

పైశాచ్యం శాపజం త్యక్త్వా దివ్యతా మిత్థమాప్తవాన్‌ | ఏవంపః కథితం విప్రా అగ్నితీర్థస్యవైభవం || 116 ||

యఃపఠేది మమధ్యాయం శృణు యాద్వాన భక్తికం | పిశాచ మోక్షణా ఖ్యానం ముచ్యతే సర్వపాతకైః || 117 ||

ఇహభుక్త్వా మహాభోగాన్‌ పరత్రాపి సుఖంలభేత్‌ || 118 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే అగ్ని తీర్థప్రశంసాయాం దుష్‌పణ్య పైశాచ్య మోక్షణం నామద్వా వింశోధ్యాయః || 22 ||

తా|| రామనాథాది తీర్థముల సేవించి, ఆ తీర్థముతీసుకొని (111) సుతీక్షుణడు తన ఆశ్రమమునకు వచ్చాడు. ఆ తీర్థ ప్రోక్షణముతో వెంటనే ఆతడు పిశాచత్వమును వదలి (112) ఆ తీర్థ వైభవం వల్ల వెంటనే దివ్యత్వాన్ని పొందాడు. విమానవరము నధిరోహించి, దివ్యస్త్రీలతో పరివేష్టింపబడి (113) సతీక్షుణనకు, అగస్త్యునకు అట్లాగే ఇతర తపోధనులకు మరల మరల నమస్కరించి ఆనందంతో వారితో పోయి వస్తానని చెప్పి (114) త్వరగా స్వర్గము అధిరోహించాడు. దేవతలతో కూడా పూజింపబడ్డాడు. అగ్నితీర్థమాహాత్మ్యంవల్ల వైశ్యకుమారుడు దుష్పణ్యుడు (115) శాపం వల్ల వచ్చిన పిశాచత్వమును వదలి ఈ విధంగా దివ్యత్వాన్ని పొందాడు. అగ్ని తీర్థవైభవాన్ని ఇట్టిదాన్ని మీకు చెప్పాను (116) ఈ అధ్యాయము చదివినవారు, భక్తితో విన్నవారు పిశాచమోక్షణమును కథను విన్న సర్వపాపములనుండి ముక్తులౌతారు. (117) ఈ లోకంలో భోగములననుభవించి పరమందు సుఖాన్ని పొందుతారు (118) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్త్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు అగ్నితీర్థ ప్రశంసలో దుష్పణ్యుని పిశాచమోక్షణ మనునది ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Scanda Mahapuranamu-3    Chapters