Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది నాల్గవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

చక్రతీర్థే నరః స్నాత్వా శివ తీర్థం తతోవ్రజేత్‌ | యత్రహి స్నానమాత్రేణ మహాపాతకకోటయః || 1 ||

తత్సంసర్గాశ్చనశ్యంతి తత్‌ క్షణాదేవతాపసాః అత్రస్నాత్వా బ్రహ్మహత్యాం మముచేకాలభైరవః || 2 ||

ఋషయఊచుః -

కాలభైరవ రుద్రస్య బ్రహ్మహత్యా మహామునే | కిమర్థమ భవత్సూత తన్నో వక్తుమిహార్హసి || 3 ||

శ్రీ సూత ఉవాచ :

వక్ష్యామి మునయః సర్వే పురావృత్తం విముక్తి దం | యస్యశ్రవణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే || 4 ||

ప్రజావతేశ్చవిష్ణోశ్చ బభూవకలహః పురా | కించిత్కారణ ముద్దిశ్య సమస్త జనసన్నిధౌ || 5 ||

అహమేవజగత్కర్తా నాన్యః కర్తాస్తి కశ్చన | అహం సర్వ ప్రపంచానాం నిగ్రహానుగ్రహప్రదః || 6 ||

మత్తో నాస్త్యధికః కశ్చిత్‌ మత్సమోవానురేష్వపి | ఏవం సమనుతే బ్రహ్మాదైవానాం సన్నిధౌ పురా || 7 ||

తదానారాయణః ప్రాహప్రహసన్‌ ద్విజ పుంగవాః | కిమర్థమేవంబ్రూషేత్వం అహంకారేణ సాంప్రతం || 8 ||

వాక్యమేవం విధం భూయో వక్తుం నార్హుసి వై విధే | అహమే వజగత్కర్తాయజ్ఞో నారాయణోవిభుః || 9 ||

మాంవినాస్య ప్రపంచస్య జీవనం దుర్లభం భ##వేత్‌ | మత్ర్పసాదాత్‌ జగత్‌ స్పష్టం త్వయాస్థావరం జంగమం || 10 ||

వివాదం కుర్వతోరేవం బ్రహ్మవిష్ణ్వోః జయైషిణోః

దేవానాం పురతస్తత్ర వేదాశ్చత్వార ఆగతాః | ప్రోచుఃవాక్యమిదం తథ్యం పరమార్థప్రకాశం || 11 ||

వేదా ఊచుః -

త్వం విష్ణోన జగత్కర్తా నత్వం బ్రహ్మన్‌ ప్రజాపతే || 12 ||

కింత్వీశ్వరో జగత్కర్తా పరాత్పరతరో విభుః తన్మాయాశక్తి సంక్లుప్త మిదం స్థాపర జంగమం || 13 ||

సర్వదేవాభివంద్యోహి సాంబః సత్యాదిలక్షణః | స్రష్టాచ పాలకోహర్తా స ఏవజగతాం ప్రభు ః || 14 ||

ఏవం సమీరితం వేదైః శ్రుత్వా వాక్యం శుభాక్షరం | బ్రహ్మవిష్ణుస్తదాతత్ర ప్రోచతుర్ద్విజ పుంగవాః || 15 ||

తా || శ్రీ సూతులిట్లనిరి | చక్రతీర్థంలో స్నానం చేసి పిదప శివ తీర్థమునకు వెళ్ళాలి. అక్కడ స్నానం చేసినంత మాత్రమున మహా పాతకకోటులు (1) వాటి - సంసర్గములు ఆ క్షణంలోనే నశిస్తాయి. ఓ తాపసులారా | ఇక్కడ స్నానం చేసి, కాల భైరవుడు బ్రహ్మ హత్య నుండి ముక్తుడైనాడు (2) ఋషులిట్లనిరి | కాల భైరవరుద్రునకు బ్రహ్మహత్య ఎందుకు సంభవించింది. ఓ సూత ! మాకు మీరు చెప్పవలసింది (3) శ్రీ సూతుల వచనము - ఓ మునులార ఇది వరలో జరిగింది, ముక్తినిచ్చేది, దీనిని చెప్తాను. దీనిని విన్న మాత్రమున పాపములనుండి ముక్తులౌతారు. (4) పూర్వం ప్రజాపతికి విష్ణువునకు తగాదా ఏర్పడింది. అందరి ఎదుట చిన్న కారణంగా (5) నేనే జగత్కర్తను మరొకడు ఇతరుడు కర్తలేడు. నేను ప్రపంచాలన్నింటికి విగ్రహానుగ్రహముల ఇచ్చేవాణ్ణి (6) నా కన్న అధికుడు మరొకడు లేడు నాతో సమానమైన వాడు కూడా దేవతలలో లేడు. ఇట్లా బ్రహ్మ దేవతల ఎదుట పూర్వం తలిచాడు (7) అప్పుడు నారాయణుడు నవ్వుతూ ఇట్లన్నాడు, ఓ బ్రాహ్మణులారా ! అహంకారంతో, ఇప్పుడు ఇట్లా నీవు ఎందుకంటున్నావు (8) ఓ విధి ! ఇటువంటి మాటను మళ్ళీ అనటానికి అనర్హుడవు. నేనే జగత్కర్తను. యజ్ఞము. నారాయణుడు. విభువునేనే (9) నేను లేకుండా ఈ ప్రపంచమునకు జీవనం దుర్లభమౌతుంది. నా అనుగ్రహంవల్ల నీవు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించావు (10) ఈ విధముగా జయం కోరుతూ దేవతలముందు తగాదా పడుతున్న బ్రహ్మ విష్ణువుల ముందరకు నాలుగు వేదములు వచ్చాయి. పరమార్ధ ప్రకాశకమైన తథ్యమైన వాక్యమునిట్లా చెప్పాయి (11) వేదముల మాట - ఓ విష్ణు ! నీవు జగత్కర్తవు కావు. ఓ ప్రజాపతి ! బ్రహ్మ ! నీవు కాదు (12) ఈశ్వరుడు జగత్కర్త. వరునికన్న పరతరుడు, విభువు. ఈ స్థావర జంగమమంత ఆతని మాయాశక్తితో ఏర్పరుపబడింది. (13) సర్వదేవతలచే నమస్కరించ తగినవాడు సాంబుడు సత్యాది లక్షణములు కలవాడు, స్రష్ట, పాలకుడు, హర్త జగత్తున కంత ఆతడే ప్రభువు (14) శుభాక్షర వాక్యములు ఈ రకంగా వేదములు చెప్పగా విని బ్రహ్మ విష్ణువులు అప్పుడు అక్కడ ఇట్లా అన్నారు. ఓ బ్రహ్మణులార! (15)

మూ || బ్రహ్మ విష్ణూ ఊచతుః -

పార్వత్యాలింగితః శంభుః మూర్తిమాన్‌ ప్రమథాధివః | కథంభ##వేత్‌ పరంబ్రహ్మ సర్వసంగవివర్జితం || 16 ||

తాభ్యామితీరితే తత్రప్రణవః ప్రాహతౌతదా | అరూపోరూపమాదాయ మహతా ధ్వనినా ద్విజాః || 17 ||

ప్రణవ ఉవాచ -

అసౌశంభుర్మ హాదేవః పార్వత్యాస్వాతిరిక్తయా | సంక్రీడతే కదాచిన్నో కింతు స్వాత్మ స్వరూపయా || 18 ||

అసౌశం భురనీశానః స్వప్రకాశోనిరంజనః | విశ్వాధికో మహాదేవో విశ్వాధిక ఇతిశ్రుతః || 19 ||

సర్వాత్మా సర్వకర్తాసౌ స్వతంత్రః సర్వభావనః | బ్రహ్మన్నయం సృష్టికాలేత్వాం నియుంక్తేరజోగుణౖః || 20 ||

సత్వేన రక్షణశంభుః త్వాం ప్రేషయతికేశవ | తమ సాకాల రుద్రాఖ్యం సంప్రేరయతి సంహృతౌ || 21 ||

అతః స్వతంత్రతా విష్ణో యువయోర్నకదాచన | నాపి ప్రజాపతే రస్తికింతుశంభోః స్వతంత్రతా || 22 ||

బ్రహ్మన్‌ విష్ణోయువాభ్యాంతు కిమర్థం నమహేశ్వరః | జ్ఞాయతే సర్వలోకానాం కర్తావిశ్వాధికస్తథా || 23 ||

సాపిశక్తి రుమాదేవీ నవృథక్‌ శంకరాత్పదా | శంభో రా నంద భూతాసా దేవీ నాగంతుకీ స్మృతా || 24 ||

అతో విశ్వాధికోరుద్రః స్వతంత్రో నిర్వికల్పకః సర్వదే వైరయం వంద్యో యావాభ్యామపి శంకరః || 25 ||

కర్తానా స్యాప్తి రుద్రస్య నాధికో స్మా చ్చవిద్యతే | న తత్సమోపి లోకేషు విద్యతే శతశస్తథా || 26 ||

అతోమోహంన కురుతం బ్రహ్మవిష్ణోయువాం వృథా | ఇత్యుక్తం ప్రణవేనాథ శ్రుత్వాబ్రహ్మాచకేశవః || 27 ||

మాయయామోహితౌశంభోర్నైవాజ్ఞానమముంచతాం | ఏతస్మిన్నంతరేబ్రహ్మాప్రదదర్శమహాద్భుతం || 28 ||

వ్యాప్నుపద్గగనం సర్వం అనంతాదిత్య సన్నిభం | తేజో మండల మాకాశ మధ్యగం విశ్వతో ముఖం || 29 ||

తన్నిరూపయితుం బ్రహ్మాసనర్జోద్ధ్వగతం ముఖం | తపోబలవిసృష్టేన పంచమేన ముభేసనః || 30 ||

నిరూపయామానవిభుః తత్తేజోమండలం ముహుః | తత్ర్పజజ్వాలకోపేన ముఖం తేజోవిలోకనాత్‌ || 31 ||

అనంతా దిత్య సంకాశం జ్వలత్తత్‌ పంచమంశిరః | దిధుక్షుః ప్రలయేలోకాన్‌ వడవాగ్ని రివాబభౌ || 32 ||

వ్యదృశ్యతచతత్తేజః పురుషో నీలలోహితః | దృష్ట్వాస్రష్టాతదాబ్రహ్మాబభాషేపరమేశ్వరం || 33 ||

వేదాహంత్వాంమహదేవలలాటాన్మేపురాభవాన్‌ | వినిర్గతోసిశంభోత్వం రుద్రనామామమాత్మజః || 34 ||

ఇతిగర్వేణసంయుక్తంవచః శ్రుత్వామహేశ్వరః | కాలభైరవనామానం పురుషం ప్రాహిణోత్తదా || 35 ||

అయుద్ధ్యతచిరంకాలంబ్రహ్మణాకాలభైరవః | మహాదేవాంశసంభూతః శూలటంకగదాధరః || 36 ||

యుద్ధ్వాతుసుచిరంకాలంబ్రహ్మణాకాలభైరవః | వదనంబ్రహ్మణఃశుభ్రం వ్యలోకయతపంచమం || 37 ||

విలోక్యోర్థ్యగతంవక్త్రం పంచమంభారతీపతేః | గర్వేణమహతాయుక్తం ప్రజజ్వాలాతికోపితః || 38 ||

తా || బ్రహ్మ విష్ణువులు ఇట్లా అన్నారు - పార్వతిని ఆ లింగనం చేసుకునే శంభువు ప్రథమాధిపుడు. సర్వసంగవివర్జితమైన పరం బ్రహ్మ ఎట్లౌతాడు (16) వారిద్దరు ఇట్లా అనగా వారితో ప్రణవం అప్పుడు ఇట్లా అంది. పెద్ద శబ్దంతో రూపంలేని ప్రణవం రూపంధరించి అంది (17) ప్రణవం మాట - ఈ శంభుడు, మహాదేవుడు తన కన్న వేరైన పార్వతితో ఎప్పుడో ఒకప్పుడు క్రీడిస్తాడు గదా. కాని స్వాత్మస్వరూపంతో (18) ఈ శంభువు స్వ ప్రకాశుడు, నిరంజనుడు, తనకన్న ఈశుడు లేనివాడు, విశ్వాధికుడు, మహాదేవుడు విశ్వాధికుడని ప్రసిద్ధమైనాడు (19) సర్వాత్ముడు, సర్వకర్త, స్వతంత్రుడు, అన్ని భావించే వాడు (కలవాడు). బ్రహ్మ! సృష్టికాలంలో ఈతడు రజోగుణంతో నిన్ను నియమించాడు. (20) ఓకేశవ! శంభువు సత్వగుణంతో రక్షించటానికి నిన్ను పంపిస్తాడు. తమోగుణంతో లయకాలమందు కాల రుద్రుడను వానిని ప్రేరేపిస్తాడు (21) అందువల్ల ఓ విష్ణు ! మీకు ఇద్దరికి స్వతంత్రత లేదు ప్రజాపతికికూడా లేదు. కాని శంభువునకు స్వతంత్రత కలదు (22) ఓ బ్రహ్మ! విష్ణు! మీరిద్దరు మహేశ్వరుని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు. సర్వలోకములకు కర్త, విశ్వాధికుడు అని (23) ఆ శక్తి, ఉమాదేవి శంకరుని నుండి ఎప్పుడు విడిగా ఉండదు. శంభునకు ఆనందకారణము ఆ దేవి. ఆ గంతుకి కాదు (24) అందువల్ల రుద్రుడు విశ్వాధికుడు, స్వతంత్రుడు. నిర్వికల్పకుడు దేవతలందరితో నమస్కరింప తగినవాడు. మీతో కూడా శంకరుడు నమస్కరింప తగినవాడే (25) ఈతనికి కర్త ఎవ్వరు లేరు. ఈతని కన్న అధికుడు లేడు. అట్లాగే నూరువిధాల రుద్రునితో సమమైనవాడు కూడ లోకంలో లేడు (26) అందువల్ల బ్రహ్మ విష్ణులార ! మీరు వృథాగా మోహం పొందకండి. అవి ప్రణవం ఇట్లా చెప్పాక దీనిని విని బ్రహ్మ కేశవులు (27) శంభుమాయా మోహితులై అజ్ఞానమును వదలలేదు. ఇంతలో బ్రహ్మగొప్ప అద్భుతాన్ని చూచాడు (28) ఆకాశాన్నంతా వ్యాపిస్తూ, అనంత ఆదిత్యులతో సమానకాంతిగల తేజోమండలాన్ని, ఆకాశం మధ్యలో ఉన్న దాన్ని, విశ్వతో ముఖమైన దాన్ని చూచాడు (29) దాన్ని నిరూపించుటకు (చూచుటకు) బ్రహ్మ ఊర్థ్వమైన ముఖమును సృష్టించెను. తపోబలంతో సృష్టింపబడ్డ ఐదవ ముఖంతో ఆతడు (30) మాటిమాటికి ఆ తేజోమండలాన్ని బ్రహ్మ నిరూపించ (చూడ) సాగాడు. ఆ తేజస్సును చూడటం వల్ల కోపంతో ఆ ముఖం మండి పోయింది. (31) అనంతాదిత్య సంకాశ##మై మండుతున్న ఆ ఐదవశిరస్సు ప్రలయంలో లోకాలను కాల్చుటకు ఏర్పడే బడబాగ్నివలె కన్పించింది. (32) ఆ తేజస్సు నీలలోహితుడు, పురుషుడుగా కన్పించింది. చూచి సృష్టికర్తయైన బ్రహ్మ పరమేశ్వరునితో ఇట్లా అన్నాడు. (33) ఓ మహాదేవ! నేను నిన్ను గుర్తించాను. పూర్వం నీవు నా నొసటి నుండి బయటికొచ్చావు. ఓ శంభు రుద్రుడను పేరుగల నా కుమారుడవు (34) అని గర్వంతో కూడిన మాటలనగావిని మహేశ్వరుడు, కాల భైరవుడను పేరు గల పురుషుని పంపాడు (35) బ్రహ్మతో చాల కాలము కాల భైరవుడు యుద్ధం చేశాడు. మహా దేవాంశ సంభూతుడై శూలటంక (కత్తి) గదలను ధరించి (36) కాల భైరవుడు బ్రహ్మతో చాలా కాలం యుద్ధంచేసి బ్రహ్మయొక్క శుభ్రమైన ఐదవ ముఖాన్ని చూచాడు (37) ఊర్ధ్వగతమైన బ్రహ్మ ఐదవముఖాన్ని చూచి, అతి గర్వంకలదిగా చూసి, అతి కోపముతో కాల్చాడు (38).

మూ || తతస్తత్‌ పంచమం వక్త్రం భైరవః ప్రాచ్ఛినత్‌ ఋషా|తతోమమార బ్రహ్మాసౌ కాల భైరవహింసితః || 39 ||

ఈశ్వరస్యప్రసాదేన ప్రపేదే జీవితం పునః | తతోవిలోకయామానశంకరం శశిభూషణం || 40 ||

వాసుక్యాద్యష్ట భోగీంద్ర విభూషణ విభూషితం | దృష్ట్వా వేధామహాదేవం పార్వత్యాహశంకరం || 41 ||

లేభే మాహేశ్వరం జ్ఞానం మహాదేవ ప్రసాదతః తతస్తుష్టావగిరిశం వరేణ్యం వరదం శివం || 42 ||

బ్రహ్మోవాచ -

మహ్యం ప్రసీదగిరిశ, శశాంకకృతశేఖర | యన్మయాపకృతం శంభో తత్‌ క్షమస్వదయానిధే || 43 ||

క్షమస్వమమగర్వంత్వం శంకరేతిపునః పునః | నమశ్చకారసోమంతం సోమార్ధకృతశేఖరం || 44 ||

అధదేవః ప్రసన్నోసై#్మ బ్రహ్మణ స్వాంశజాయతు | మా భైరిత్య బ్రవీత్‌ శంభుర్భైరవం చాభ్యభాషత || 45 ||

ఈశ్వర ఉవాచ -

ఏష సర్వస్యజగతః పూజ్యో బ్రహ్మసనాతనః హతస్యాస్య విరించస్య ధారయత్వంశిరోధునా || 46 ||

బ్రహ్మహత్యావిశుద్ధ్యర్ధం లోకసంగ్రహకామ్యయా | భిక్షామటకపాలేన భైరవత్వం మమాజ్ఞయా || 47 ||

ఉక్త్వైవంశంకరో విప్రాః తత్రైవాంతర ధీయత | నీలకంఠో మహాదేవో గిరిజార్ధ తనుస్తతః || 48 ||

భైరవంగ్రాహయామాన వదనంవే ధసోద్విజాః | చరస్వ పాప శుద్ధ్యర్థం లోకసంగ్రహణాయవై || 49 ||

కపాలధారీ హస్తేన భిక్షాం గృహ్ణాతు భైరవః | ఇతీరయిత్వాగిరిశః కన్యాం కాంచిత్‌ భయంకరీం || 50 ||

బ్రహ్మహత్యాభిధాం క్రూరాం వడవానల సన్నిభాం | తాంప్రేరయిత్వాగిరిశో భైరవం పునరబ్రవీత్‌ || 51 ||

ఈశ్వర ఉవాచ -

భైరవైతత్‌ వ్రతం త్వబ్దం బ్రహ్మహత్యా విశుద్ధయే | చరత్వం సర్వతీర్థేషు స్నాహిశుద్ధ్యర్థమాత్మనః || 52 ||

తతోవారణాసీం గచ్ఛ బ్రహ్మహత్యాప్రశాంతయే | వారాణసీ ప్రవేశేన బ్రహ్మహత్యాతవాధమా || 53 ||

పాదశేషావినష్టాస్యాత్‌ చతుర్థాంశోసనశ్యతి | తస్యనాశం ప్రవక్ష్యామి తవభైరవతచ్ఛృణు || 54 ||

దక్షిణాం భోనిధేస్తీరే గంధమాదన పర్వతే | సర్వప్రాణ్యు వకారాయ కృతం తీర్థం మయాశుభం || 55 ||

శివ సంజ్ఞం మహాపుణ్యం తత్రయాహిత్వమాదరాత్‌ | తత్ర్పవేశన మాత్రేణ బ్రహ్మహత్యాతవాశుభా || 56 ||

శివతీర్థస్యమాహాత్మ్యాత్‌ నిఃశేషం నశ్యతిధ్రువం | ఉక్త్వైవం భైరవం రుద్రఃకైలాసం ప్రయ¸°క్షణాత్‌ || 57 ||

తా || పిదప ఆ ఐదవ ముఖాన్ని భైరవుడు కోపంతో ఛేదించాడు. కాలభైరవునితో హింసింపబడ్డ బ్రహ్మ అప్పుడు మరణించాడు. (39) ఈశ్వరుని అనుగ్రహంతో తిరిగి జీవితాన్ని పొందాడు. పిదప శశిభూషణుడైన శంకరుని చూచాడు (40) వాసుకి మొదలగు అష్టభోగీంద్రులనే సొమ్ములతో అలంకరింపబడ్డ పార్వతితో కూడిన శంకరుని మహాదేవుని బ్రహ్మ చూచి (41) మహా దేవానుగ్రహం వలన మాహేశ్వర జ్ఞానాన్ని పొందాడు. వరేణ్యుడు వరదుడు గిరిశుడు అయిన శివుని స్తుతించాడు. (42) బ్రహ్మమాట - చంద్రుని తల భూషణముగా గల ఓ గిరిశ నన్ననుగ్రహించు. నేను చేసిన అపకారాన్ని ఓదయానిధి ! శంభు క్షమించు (43) నా గర్వాన్ని నీవు క్షమించు శంకర అని మాటిమాటికి స్తుతించాడు. సగము చంద్రుని తలలో ధరించిన ఆ సోమునికి నమస్కరించాడు. (44) అప్పుడు ఆ దేవుడు స్వాంశజుడైన ఈ బ్రహ్మకు ప్రసన్నుడై భయపడకు అని శంభుడన్నాడు భైరవునితో ఇట్లా అన్నాడు (45) ఈశ్వరోక్తి - జగత్తునకంతకు పూజ్యుడు బ్రహ్మ సనాతనుడు. చంపబడిన ఈ బ్రహ్మ శిరమును నీవు ఇప్పుడు ధరించు. (46) బ్రహ్మహత్యనుండి శుద్ధికొరకు లోకక్షేమము కొరకు, ఓ భైరవ ! నీవు నా ఆజ్ఞతో ఈ కపాలంతో భిక్షాటన చేయి (47) ఓ విప్రులార ! ఇట్లా పలికి శంకరుడు నీలకంఠుడు, మహాదేవుడు, గిరిజార్థ తనువు అక్కడే అంతర్ధానమైనాడు (48) బ్రహ్మ ముఖము భైరవుని పట్టుకొంది పాపశుద్ధి కొరకు లోక క్షేమం కొరకు తిరుగు (49) చేతక పాలం ధరించి భైరవుడు భిక్షమెత్తని అని పలికి గిరిశుడు భయంకరమైన కన్యను (50) బ్రహ్మ హత్య అనుపేరుగలదానిని క్రూరమైనదానిని బడ బానలంతో సమానమైన దానిని ప్రేరేపించి గిరిశుడు భైరవునితో తిరిగి ఇట్లన్నాడు (51) ఈశ్వరోక్తి - భైరవ ! ఈ వ్రతాన్ని ఒక సంవత్సరకాలము బ్రహ్మ హత్యనుండి శుద్ధి కొరకు అన్ని తీర్థములకు తిరిగు నీ శుద్ధి కొరకు అన్ని తీర్థములలో స్నానం చేయి (52) బ్రహ్మహత్యా నాశనం కొరకు వారణాసికి వెళ్ళు. వారణాసీ ప్రవేశంతో నీ అధమమైన బ్రహ్మహత్య (53) ముప్పాతిక భాగం నశిస్తుంది ఒక భాగం నశించదు. దాని నాశనాన్ని కూడా నీకు చెపుతాను. భైరవ దాన్ని విను. (54) దక్షిణ సముద్ర తీరమందు గంధమాధవ పర్వతమందు సర్వప్రాణులకు ఉపకారం చేసే కొరకు నేను శుభ##మైన తీర్థాన్ని ఏర్పరచాను. (55) శివ అనుపేరుగలది, పుణ్యప్రదమైనది, నీవు ప్రేమతో అక్కడికి వెళ్ళు. అక్కడికి ప్రవేశించినంత మాత్రమున నీ అశుభ##మైన బ్రహ్మహత్య (56) శివతీర్థ మాహాత్మ్యం వల్లనిఃశేషంగా నశిస్తుంది. నిశ్చయము. అని భైరవునితో రుద్రుడు పలికి క్షణంలో కైలాసమునకు వెళ్ళాడు (57).

మూ || తతః కపాలపాణిస్తు భైరవః శివచోదితః | దేవదాన వయక్షాదిలోకేషు విచచారసః || 58 ||

తంయాంతం అనుయాతిస్మబ్రహ్మహత్యాతి భీషణా | భైరవః సర్వతీర్థాని పుణ్యాన్యాయతనానిచ || 59 ||

చరిత్వాలీలయాదేవః తతో వారాణసీం య¸° | వారణాసీం ప్రవిష్టేతు భైరవే శంకరాంశ##జే || 60 ||

చతుర్థాంశం వినానష్టా బ్రహ్మహత్యాతి కుత్సితా | చతుర్థాంశేన దుద్రావ భైరవం శంకరాం శజం || 61 ||

తతః స భైరవోదేవః శూలపాణిః కపాలధృక్‌ | శివాజ్ఞ యా య¸° పశ్చాత్‌ గంధమాదన పర్వతం || 62 ||

శివతీర్థం తతోగత్వా భైరవః స్నాతవాన్‌ ద్విజాః | స్నానమాత్రేణ తత్రాస్యశివతీర్థేమహత్తరే || 63 ||

నిః శేషం విలయం యాతా బ్రహ్మహత్యాతి భీషణా | అస్మిన్నవసరేశంభుః ప్రాదురాసీత్తదగ్రతః

ప్రాదుర్భూతో మహాదేవో భైరవం వాక్యమబ్రవీత్‌ | || 64 ||

ఈశ్వర ఉవాచ -

నిః శేషం బ్రహ్మ హత్యా తే శివతీర్థే నిమజ్జనాత్‌ || 65 ||

నష్టా భైరవ నాస్త్యత్ర సందేహస్తవనువ్రత | ఇదం కపాలం కాశ్యాంత్వం స్థాపయస్వక్వచిత్‌స్థలే || 66 ||

ఇత్యుక్త్వా భగవాన్‌ శంభుః తత్రై వాంతర ధీయత | భైరవోపి తదా విప్రా బ్రహ్మహత్యా విమోచితః || 67 ||

శివతీర్థస్య మాహాత్మ్యాత్‌ య¸°వారాణసీం పురీం | కపాలం స్థాపయామాన ప్రదేశే కుత్రచిద్ద్విజాః

కపాలతీర్థమిత్యాఖ్యాం అలభత్తత్‌ స్థలంతదా | || 68 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవం ప్రభావం తత్పుణ్యం శివతీర్థం విముక్తి దం || 69 ||

మహాదుఃఖ ప్రశమనం మహా పాతకనాశనం | నరకక్లేశశమనం స్వర్గదంమోక్షదంతథా || 70 ||

శివతీర్థస్య మాహాత్మ్యం మయా ప్రోక్తం విముక్తిదం | ఇదం పఠన్‌ సదామర్త్యో దుఃఖ గ్రామాద్విముచ్యతే || 71 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయ బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే శివతీర్థ ప్రశంసాయాం భైరవ బ్రహ్మహత్యా విమోక్షణ వర్ణనం నామ చతుర్వింశోధ్యాయః || 24 ||

తా || పిదప కపాలపాణియైన భైరవుడు శివప్రేరితుడై దేవదానవ యక్షాదిలోకములలో తిరిగాడు (58) అట్లా వెళ్తున్న ఆతనిని అతి భీషణమైన బ్రహ్మహత్య అనుసరించసాగింది. భైరవుడు అన్ని తీర్థములను పుణ్య ప్రదేశములను (59) తిరిగి అదృష్టవశాత్తు వారణాసికి వెళ్ళాడు. వారణాసిని ప్రవేశించగానే శంకరాంశజుడైన భైరవుని (60) అతికుత్సితమైన బ్రహ్మహత్య పాతకములో మూడు భాగములు నశించింది. శంకారంశజుడైన భైరవుని నాల్గవ భాగంతో పరుగెత్తించింది (61) ఆ భైరవుడు శూలపాణి, కపాలధారి, శివుని ఆజ్ఞతో పిదప గంధమాదన పర్వతమునకు వెళ్ళాడు. (62) అటనుండి శివ తీర్థమునకు వెళ్ళి భైరవుడు స్నానం చేశాడు. అక్కడ మహత్తరమైన శివ తీర్థంలో ఈతడు స్నానం చేసినంత మాత్రం చేత (63) అతి భీషణమైన బ్రహ్మహత్య ఏమిలేకుండ నశించి పోయింది. ఈ సందర్భంలో అతని ఎదుట శంభువు ప్రత్యక్షమైనాడు. ప్రాదుర్భవించిన మహాదేవుడు భైరవునితో ఇట్లా అన్నాడు. (64) ఈశ్వరునిమాట శివతీర్థంలో స్నానం చేసి నందువలన బ్రహ్మహత్య నిః శేషముగా (65) పోయింది. ఓ భైరవ! సువ్రత! ఈ విషయంలో సందేహము లేదు. ఈ కపాలాన్ని కాశిలో ఏదో స్థలంలో నీవు స్థాపించు (66) అని పలికి శంభువు అక్కడే అంతర్థానమైనాడు. భైరవుడు కూడా అప్పుడు బ్రహ్మహత్యచే విముక్తుడై (67) శివతీర్థమాహాత్మ్యమువల్ల, వారణాసి పురికి వెళ్ళాడు. కపాలమును ఏదో ఒక ప్రదేశంలో స్థాపించాడు. ఆ స్థలము కపాలతీర్థమనే పేరును పొందింది. (68) శ్రీ సూతుల వచనము - ఇట్టి ప్రభావము కలది, పుణ్యప్రదము, ముక్తినిచ్చేది శివతీర్థము (69) మహా దుఃఖముల నశింపచేసేది. మహాపాతకముల నశింపచేసేది నరకక్లేశమును తగ్గించేది. స్వర్గము నిచ్చేది, మోక్షమునిచ్చేది కూడ (70) ముక్తినిచ్చే శివతీర్థమాహాత్మ్యమును నేను చెప్పాను. దీనిని చదివిన నరుడు దుఃఖముల నుండి ముక్తుడౌతాడు. (71) అని స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు శివతీర్థ ప్రశంస యందు భైరవుని బ్రహ్మహత్య విమోక్షణ వర్ణన మనునది ఇరువది నాల్గవ అధ్యాయము || 24 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters