Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదిఐదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

శివతీర్థేనరః స్నాత్వా బ్రహ్మహత్యావిమోక్షణ | స్వపాప జాలశాంత్యర్థం శంఖతీర్థంతతో ప్రజేత్‌ ||1 ||

యత్రమజ్జన మాత్రేణకృతఘ్నోపి విముచ్యతే | మాతౄః పితౄన్‌ గురూంశ్చాపియేనమన్యంతిమోహితాః || 2 ||

యేచాప్యన్యే దురాత్మానః కృతఘ్నానిరపత్రపాః | తే సర్వే శంఖతీర్థస్మిన్‌ శుద్ధ్యంతి స్నానమాత్రతః || 3 ||

శంఖనామామునిః పూర్వం గంధమాదన పర్వతే | అవర్తతతపః కుర్వన్‌ విష్ణుం ధ్యాయన్‌ సమాహితః || 4 ||

సతత్ర కల్పయామానస్నానార్థం తీర్థముత్తమం | శంఖేన నిర్మితం తీర్థం శంఖతీర్థం మితీర్యతే || 5 ||

తత్రస్నాత్వానకృన్మర్త్యః కృతఘ్నోపి విముచ్యతే | అత్రేతి హసంవక్ష్యామి పురాణం పాపనాశనం || 6 ||

యస్య శ్రవణ మాత్రేణ నరోముక్తి మవాప్నుయాత్‌ | పురా బభూవ విప్రేంద్రో వత్సనాభోమహామునిః || 7 ||

సత్యవాన్‌ శీలవాన్‌ వాగ్మీ సర్వభూతదయాపరః | శత్రుమిత్ర నమోదాంతః తపస్వీ విజితేంద్రియః || 8 ||

పరబ్రహ్మణి నిష్ణాతః తత్త్వబ్రహ్మైక సంశ్రయః | ఏవ ప్రభావః సమునిః తపసై పే నిజాశ్రమే || 9 ||

సవై నిశ్చల సర్వాంగః తిష్ఠం స్త త్రైవ భూతలే | పరమాణ్వంతరం వాపి న స్వస్థానాత్‌ చచాలనః || 10 ||

స్థిత్వైకత్ర తపస్యంతం అనేకశతవత్సరాన్‌ | తమాచక్రామ వల్మీకం ఛాదితాంగం చకారచ || 11 ||

వల్మీకాక్రాంతదేహో పివత్సనాభోమహామునిః | అకరోత్తవఏవాసౌ వల్మీకంనత్వబుద్ధ్యత || 12 |

తస్మింశ్చతప్యతి తపోవాసవోముని పుంగవాః | విసృజ్యమేఘజాలాని వర్షయామానవేగవాన్‌ || 13 ||

ఏవందినాని సప్తాయం న వవర్షనిరంతరం | ఆ సారేణాతి మహతా తృష్యమాణోపివైమునిః || 14 ||

తంవర్షం ప్రతిజగ్రాహ నిమీలిత విలోచనః | మహతాన్తనితేనాశుత దాబధిరయన్‌ శ్రుతీ || 15 ||

వల్మీకస్యో పరిష్టాద్వై నిపపాత మహాశనిః | తస్మిస్వర్షతి వర్జన్యే శీతవాతాతి దుఃనహే || 16 ||

వల్మీక శిఖరం ధ్వస్తం బభూవాశనితాడితం | విశీర్ణశిఖరేతస్మిన్‌ వల్మీకేశనితాడితే || 17 ||

సేహేతి దుఃసహాంవృష్టిం వత్సనాభోవిచితంయన్‌ | మహర్షౌ వర్షధారాభిః పిడ్యమానే దివానిశం || 18 ||

ధర్మన్యచేతసి కృపా సంబభూవాతి భూయసీ | సధర్మశ్చింత యా మాన వత్సనాభే తపస్యతి || 19 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - బ్రహ్మ హత్య విమోక్షకమైన శివతీర్థమందు నరుడుస్నానం చేసి స్వపాప జాలశాంతి కొరకు పిదప శంఖ తీర్థమునకు వెళ్ళాలి (1) అక్కడ స్నానం చేస్తే కృతఘ్నుడు కూడా ముక్తుడౌతాడు. తల్లి తండ్రి గురువులను మోహితులై గౌరవించనివారు (2) కృతఘ్నులు, సిగ్గులేనివారు ఇతర విధములైన దుర్మార్గులు, వారందరు ఈ శంఖ తీర్థంలో స్నానం చేసినందువలన శుద్ధులౌతారు (3) పూర్వము శంఖుడు అనుముని గంధమాదన పర్వతమందు తపమాచరిస్తూ శ్రద్ధగా విష్ణువును ధ్యానిస్తూ ఉండేవాడు (4) ఆతడు స్నానం కొరకు అక్కడ ఉత్తమ తీర్థాన్ని కల్పించాడు. శంఖుడు నిర్మించిన తీర్థము శంఖ తీర్థమని పిలువబడుతోంది (5) అక్కడ ఒక్కసారి స్నానం చేసిన నరుడు కృతఘ్నుడైనా ముక్తుడౌతాడు. ఇక్కడొక ప్రాచీనమైన పాపనాశకమైన ఇతి హాసమును చెబుతాను (6) దానిని విన్నంత మాత్రమున నరుడు ముక్తినందుతాడు. పూర్వము వివ్రశ్రేష్ఠుడు మహాముని వత్సనాభుడని ఉండేవాడు (7) సత్యవంతుడు. శీలవంతుడు అన్ని భూతములపై దయ కలవాడు. యుక్తముగా మాట్లాడువాడు శత్రుమిత్రులందు సమభావన కలవాడు, తపః క్లేశాన్ని సహించేవాడు. ఇంద్రియముల జయించిన తపస్వి (8) పరబ్రహ్మ జ్ఞానమందు నిష్ణాతుడు తత్వ బ్రహ్మనే ఆశ్రయించిన వాడు. ఇట్టి ప్రభావము గల ఆ ముని తన ఆశ్రమంలో తపమాచరించాడు. (9) ఆతడు సర్వాంగములను నిశ్చలంగా ఉంచి అక్కడే భూమిపై ఉండి, పరమాణ్వంతకూడా తన స్థానం నుండి కదలకుండా ఉన్నాడు (10) ఒకేచోట ఉండి అనే కశతవత్సరములు తపస్సు చేస్తున్న ఆతనిని పుట్ట ఆక్రమించింది. ఆతని శరీరాన్ని కప్పి వేసింది. (11) పుట్ట తన శరీరాన్ని ఆక్రమించినా వత్సనాభ మహాముని తపస్సుచేస్తూనే ఉన్నాడు. పుట్టను గమనించలేదు. (12) ఆతడు తపస్సు చేస్తుండగా ఓ మునులార! ఇంద్రుడు మేఘములను వదిలి వేగంగా వర్షింపసాగాడు. (13) ఈ విధముగా ఏడు రోజులు అంతరాయంలేకుండ వర్షించాడు. మిక్కిలి పెద్దదైన వర్షంతో వర్షిస్తున్నా, ఆముని (14) కళ్ళుమూసుకొని ఆవర్షాన్ని స్వీకరించాడు అప్పుడు పెద్ద గర్జనతో తొందరగా చెవులను చెవిటివిగా చేస్తూ (15) పుట్టపైన పెద్ద పిడుగు పడింది. చలిగాలితో అతి దుఃసహమై అట్లా మేఘం వర్షింస్తుండగా (16) పిడుగు తాకిడికి పుట్టయొక్క శిఖర భాగము ధ్వంసమైంది. పుట్ట పిడుగుతో, తాకబడి శిఖరం లేనిది కాగా (17) వత్సనాభుడు అతి దుఃసహమైన వర్షాన్ని బాగా చింతిస్తూ సహించాడు. వర్షాధారలతో మహర్షి రాత్రింబగళ్ళు పీడింపబడగా (18) మిక్కిలి ఎక్కువగా ధర్మం యొక్క హృదయంలో దయ కలిగింది. వత్సనాభుడు తపస్సు చేస్తుండగా ధర్ముడు ఇట్లా ఆలోచించాడు. (19)

మూ|| పతత్యవ్యతిర్షేయంతపసోననివర్తతే | అహోస్యవత్సనాభస్య ధర్మైకాయత్తచిత్తతా || 20 ||

ఇతిచింతయతస్తస్య మతిరేవమజాయత | అహం వైమాహిషం రూపం సుమహాంతం మనోహరం || 21 ||

వర్షధారా ని పాతానాం సోఢారం కఠినత్వచం | స్వీకృత్యమాహిషం రూపం స్థాస్యామ్యుపరియోగినః || 22 ||

నహిబాధిష్యతే వర్షం మహా వేగయుతం త్వపి | ధర్మం ఏ వం వినిశ్చిత్య ధారాః వృష్ఠేన ధారయన్‌ || 23 ||

వత్సనాభోపరితదాగాత్రమాసాద్యతస్థివాన్‌ | తతఃసప్తదినాంతేతు తద్వైవర్షముపారమత్‌ || 24 ||

తతోమహిరుషరూపీన ధర్మోతి కృపయాయుతః | తద్వైవల్మీకముత్సృజ్యనాతిదూరేహ్యవర్తత || 25 ||

తతోనివృత్తే వర్షేతు వత్సనాభోమహామునిః | నివృత్తస్తపసన్తూర్ణం దిశః సర్వావ్యలోకయన్‌ || 26 ||

స్థితోహం వృష్టి సంపాతే కుర్వన్నద్యమహంతవః | పృథివీ సలిలక్లిన్నాదృశ్యతే సర్వతోదిశం || 27 ||

శిఖరాణి గిరీణాంచ వనాన్యుపవనానిచ | ఆశ్రమాణి మహర్షీణాం ఆ ప్లుతాని జలైర్నవైః || 28 ||

ఏవమాదీని సర్వాణి దృష్ట్వా ప్రముదితోభవత్‌ | చింతయామా సథర్మాత్మా వత్సనాభోమహామునిః || 29 ||

అహమస్మిన్‌ మహావర్షే నూనం కేనాపి రక్షితః వర్షత్యస్మిన్‌ మహావర్షే జీవితం త్వన్యథాకృతః || 30 ||

విచింత్యై వం మునిశ్రేష్టః సర్వత్ర సమలోకయత్‌ | అతోపశ్యన్మహాకాయ అదూరాదగ్రతః స్థితం || 31 ||

మహిషం నీల వర్ణంచ వత్సనాభస్త పోధనః | మహిషంతం సముద్దిశ్య మనసా సమచింతయత్‌ || 32 ||

తిర్యగ్యోనిష్వపికథం దృశ్యతే ధర్మశీలతా | యతోహ్యహం మహా వర్షాత్‌ మహిషేనాభిరక్షితః || 33 ||

దీర్ఘమాయురముష్యాన్తుయన్మాం రక్షితవానిహ | ఇత్యాది సవిచింత్యైవం తపసే పునరుద్య¸° || 34 ||

తా || బాగా వర్షం పడుతున్నా ఈతడు తపస్సు నుండి విరమించటం లేదు. ఈ వత్సనాభుని ధర్మైకమైన చిత్తము ఆశ్చర్యకరముగదా! (20) ఇట్లా ఆలోచిస్తున్న ఆతనికి ఇటువంటి ఆలోచన వచ్చింది. చాలా పెద్దదైన మనోహరమైన మహిషరూపాన్ని నేను ధరించి, (21) వర్షధారను సహించగల కఠినమైన చర్మము గలిగి మహిషరూపంతో యోగి యొక్క పై భాగాన ఉంటాను (22) వర్షం ఎంత వేగంకలదైన భాదించదు. ధర్ముడు ఇట్లా నిశ్చయించి వర్షధారలను వృష్ఠముపై ధరించి (23) వత్సనాభునిపై తన శరీరాన్ని కప్పి ఉన్నాడు. ఏడు రోజుల తరువాత ఆ వర్షం ఆగిపోయింది (24) మహిష రూపియైన ఆ ధర్మము మిక్కిలి దయగలిగి ఆ పుట్టను వదలి కొద్ది దూరంలో నిలిచింది (25) వర్షం వెలిశాక వత్సనాభమహాముని తపస్సు నుండి త్వరగా విరమించి చుట్టు పక్కల చూచాడు (26) వర్షం పడుతుండగా గొప్ప తపస్సు చేస్తూనే నున్నాను. అన్ని దిక్కుల భూమి నీటితో తడిసి కన్పిస్తోంది (27) పర్వత శిఖరాలు, వనములు ఉపనాణలు, మహర్షుల ఆశ్రమాలు కొత్త నీటితో తేలుతున్నాయి (28) వీటన్నిటిని చూచి ఆనందపడ్డాడు. ధర్మాత్ముడైన వత్సనాభమహాముని చింతంచసాగాడు (29) ఈ మహా వర్షంలో నేను ఎవరితోనో రక్షింపబడ్డాను. నిశ్చయము. ఈ మహావర్షము ఇట్లా కురుస్తుండగా జీవితం మరోరకంగా ఎట్లా ఉంది (సుఖంగా) (30) ఇట్లా ఆలోచించి ముని శ్రేష్ఠుడు అంతటా చూచాడు. గొప్ప శరీరాన్ని దగ్గరలో ఎదురుగా ఉన్నదానిని చూచాడు (31) తపోధనుడైన వత్సనాభుడు నీలవర్ణముగల మహిషమును చూచాడు. ఆ మహిషమును గూర్చి మనస్సులో ఇట్లా అనుకున్నాడు. (32) తిర్యక్‌ యోనులందుకూడా ధర్మశీలత కన్పిస్తోంది. ఆశ్చర్యము. ఎందుకంటే నేను మహావర్షం నుండి మహిషముచే రక్షింపబడ్డాను. (33) ఇక్కడ నన్ను రక్షించింది కనుక దీనికి దీర్ఘమైన ఆయుస్సు కలగని. అని మొదలుగా ఇట్లా చింతించి తపస్సు చేయటం ఆరంభించాడు. (34)

మూ || తం పునశ్చతపస్యంతం దృష్ట్వామహిషరూపధృక్‌ | రోమాంచావృత సర్వాంగః ప్రమోదమగమద్బృశం || 35 ||

వత్సనాభస్యహిమునేః పునశ్చైవతపస్యతః | మనః పూర్వపదే కాగ్రం పరబ్రహ్మణినాభవత్‌ || 36 ||

సవిషణ్ణమనాభూత్వావత్సనాభోవ్యచింతయత్‌ | స భ##వేద్యదినైర్మల్యం తదాస్యాచ్చంచలం మనః || 37 ||

మనశ్చపాపబాహుల్యే నిర్మలం నైవజాయతే | పాపలేశోపిమేనాస్తి కథంలోలాయతేమనః || 38 ||

అచింతయద్దోషహేతుంవత్సనాభః పునఃపునః | సవిచింత్య వినిశ్చత్యని నిందాత్మాన మంజసా || 39 ||

ధిజ్‌మామద్యదురాత్మానమహోమూఢోన్మ్యహంభృశం | కృతఘ్నతామహాన్‌దోషోమామద్యసముపాగతః || 40 ||

యదీదృశాన్‌ మహావర్షాన్‌ త్రాతారం మహిషోత్తమం | తిష్ఠామ్యపూజయన్నేవతతోమేభూత్కృతఘ్నతా || 41 ||

కృతఘ్నతామహాన్‌దోషః కృతఘ్నేనాస్తినిష్కృతిః | కృతఘ్నస్యనవైలోకాః కృతఘ్నస్యనబాంధవాః || 42 ||

కృతఘ్నతాదోషబలాత్‌ మమచిత్తం మలీమనం | కృతఘ్నానరకం యాంతియేచ విశ్వస్తఘాతినః || 43 ||

నిష్కృతింనైవపశ్యామికృతఘ్నానాం కథంచన | ఋతేప్రాణ పరిత్యాగాత్‌ ధర్మజ్ఞానం వచోయథా || 44 ||

పిత్రోరభరణం కృత్వాహ్యదత్వాగురుదక్షిణాం | కృతఘ్నతాంచ సంప్రాప్యమరణాంతాహినిష్కృతిః || 45 ||

తస్మాత్‌ ప్రాణాస్పరిత్యజ్య ప్రాయశ్చిత్తం చరామ్యహం | ఇతినిశ్చిత్య మనసావత్సనాభోమహామునిః || 46 ||

తృణీకృత్యనిజాన్‌ ప్రాణాన్‌ నిఃసంగేనాంతర్మానా | మేరోఃశిఖరమారూఢ ః ప్రాయశ్చిత్త చికీర్షయా || 47 ||

సుమేరుశిఖరాత్‌ తస్మాదియేష పతితుంమునిః | తస్మిన్‌ పతితుమారభ్దేమాత్వరిష్ఠా ఇతి బ్రువన్‌

త్యక్తమాహిషరూపః సన్‌ ధర్మ ఏవన్యవారయత్‌ | || 48 ||

ధర్మ ఉవాచ -

వత్సనాభమహాప్రాజ్ఞ జీవస్వబాహువత్సరాన్‌ || 49 ||

పరితుష్టోస్మి భద్రంతే దేహత్యాగచికీర్షయా | సహిత్వద్ధర్మ కక్షాయాంలోకేకశ్చిత్సమోస్తివై || 50 ||

యద్యపి ప్రాణ సంత్యాగః కృతఘ్నేనిష్కృతిర్భవేత్‌ | తథాపి ధర్మశీలత్వాత్‌ తవాన్యాం నిష్కృతింవదే || 51 ||

శంఖతీర్థాభిధంతీర్థమస్తివైగంధమాదనే | శాంత్యర్థమస్యపాపస్య తత్రస్నాహి సమాహితః || 52 ||

ప్రాప్స్యసేచిత్తశుద్ధింత్వమతోవిగతకల్మషః | తతశ్చలబ్ధవిజ్ఞానః ప్రాస్స్యసేశాశ్వతంపదం || 53 ||

అహంధర్మో స్మియోగీంద్రసత్యమేవబ్రవీమితే | ఇతిధర్మవచః శ్రుత్వావత్సనాభోమహామునిః || 54 ||

స్నాతుకామః శంఖతీర్థే గంధమాదన మన్వగాత్‌ | శంఖతీర్థం చసంప్రాప్యతత్రసస్నౌమహామునిః || 55 ||

తా || తిరిగి తపస్సు చేస్తున్న ఆతనిని చూచి మహిషరూపధారి సర్వాంగములందు రోమాంచమును పొంది మిక్కిలి ఆనందాన్ని పొందాడు (35) తిరిగి తపస్సు చేస్తున్న వత్సనాభమునికి మనస్సు పూర్వం వలె పరబ్రహ్మయందు ఏకాగ్రం కాలేదు. (36) ఆ వత్సనాభుడు విషణ్ణమానసుడై చింతించసాగాడు. నైర్మల్యములేకపోతే మనస్సు చంచలమౌతుంది (37) పాపబాహుల్యముంటే మనస్సు నిర్మలం కాదు. నాకు పాపలేశంకూడా లేదు ఎందుకు మనస్సు చంచలమౌతుంది. (38) దోషకారణమును వత్సనాభుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు. ఆలోచించి నిశ్చయించుకొని త్వరగా తన్నుతాను నిందించుకున్నాడు (39) దురాత్ముడనైన నాకు ధిక్కారము నేను మిక్కిలి మూఢుడను. కృతఘ్నత గొప్పదోషము. అది నాకు చేరింది. (40) ఇటువంటి ఇన్ని వర్షములనుండి నన్ను రక్షించిన మహిషోత్తమమును పూజించకుండానే కూర్చున్నాను అందువల్లనే నాకు కృతఘ్నత కల్గింది (41) కృతఘ్నత గొప్పదోషము కృతఘ్నతకు నిష్కృతి లేదు. కృతఘ్ననకు పుణ్యలోకాలులేవు. బంధువులు లేరు. (42) కృతఘ్నతా దోషబలము వలన నా చిత్తము మలినమైంది. విశ్వాస ఘాతులు, కృతఘ్నులు నరకానికి పోతారు (43) కృతఘ్నులకు ఏ విధమైన నిష్కృతి కన్పించటం లేదు. ధర్మజ్ఞుల మాట ప్రకారం ప్రాణపరిత్యాగం తప్ప మరొకటి లేదు (44) పితరుల ఋణముక్తుడు కాకుండ, గురుదక్షిణ ఇవ్వకుండ, కృతఘ్నతను పొందిన వీరులకు మరణముతోనే నిష్కృతి (45) అందువల్ల ప్రాణములను వదలి ప్రాయశ్చిత్తమాచరిస్తాను. అని మనసులో నిశ్చయించుకొని వత్సనాభ మహాముని (46) తన ప్రాణములను తృణముగాభావించినిః సంగమైన అంతరాత్మతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే అభిప్రాయంతో మేరు పర్వత శిఖరాన్ని అధిరోహించాడు (47) అమేరుశిఖరం నుండి పడటానికి ముని ప్రయత్నించాడు. ఆతడు పడటానికి సిద్ధంకాగా తొందరపడకు అని పలుకుతూ మహిష రూపమును విడిచి ధర్మమే ఇట్లా వారించింది. (48) ధర్మోక్తి - ఓ వత్సనాభ. మహా ప్రాజ్ఞ, అనేక సంవత్సరాలు జీవించండి (49) నీదేహ త్యాగం చేయటమనే అభిప్రాయంతో నేనుచాలా ఆనందిస్తున్నాను. నీకుభద్రము. నీధర్మకాంక్షతో సమానమైన వాడు లోకంలో మరొకడు లేదు (50) ప్రాణసంత్యాగము కృతఘ్నతకు నిష్కృతిఐనా ధర్మశీలుడవు కనుక నీకు మరో నిష్కృతిని చెప్తాను (51) గంధమాదనంలో శంఖ తీర్థమనే తీర్థం ఉంది. ఈ పాపశాంతి కొరకు శ్రద్ధగా అక్కడ స్నానం చేయి (52) దానితో విగత కల్మషుడవై నీవు చిత్తశుద్ధిని పొందుతావు. పిదప విజ్ఞానాన్ని పొంది శాశ్వత పదాన్ని పొందుతావు (53) ఓ యోగి! నేను ధర్మాన్ని నిజం చెబుతున్నాను అనే ధర్ముని మాటలను విని వత్సనాభముని (54) శంఖతీర్థంలో స్నానం చేయదలచి గంధమాదనానికి వెళ్ళాడు. శంఖతీర్థమునకు వచ్చి ఆ ముని! అక్కడ స్నానం చేశాడు. (55)

మూ|| తతో విగత పాపస్య మనో నిర్మల తాంగతం | తతోచిరేణ కాలేన బ్రహ్మభూయ మగాన్మునిః || 56 ||

ఏవం వః కథితం విప్రాః శంఖ తీర్థస్యవైభవం | యత్రహిస్నాన మాత్రేణ కృతఘ్నోపి విముచ్యతే || 57 ||

మాతృద్రోహి పితృద్రోహి గురుద్రోహితథైవచ | అన్యేకృతఘ్నునివహా ముచ్యంతేత్రనిమజ్జనాత్‌ || 58 ||

అతః కృతఘ్నైర్మనుజైః సేవనీయమిదం సదా | అహోతీర్థస్యమాహాత్మ్యం యత్కృతఘ్నోపిముచ్యతే || 59 ||

అకృత్వాభరణం పిత్రోః అదత్వా గురుదక్షిణాం | కృతఘ్నతాంచ సంప్రాప్య మరణాంతాహి నిష్కృతిః || 60 ||

ఇహతుస్నానమాత్రేణ కృతఘ్నస్యాపి నిష్కృతిః | కృతఘ్నతాపితత్తీర్థేస్నాన మాత్రాద్వినశ్యతి || 61 ||

అన్యేషాంతుచ్ఛపాపానాం సర్వేషాం కిముతాధునా || 62 ||

అధ్యాయమేనం పఠేద్భక్తి యుక్తః | కృతఘ్నోపి మర్త్యాః సపాపాద్విముక్తః

విశుద్ధాంతరాత్మాగతః సత్యలోకం | సమం బ్రహ్మణామోక్షమప్యాశుగచ్ఛేత్‌ || 63 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే శంఖ తీర్థ ప్రశంసాయాం వత్సనాభ కృతఘ్నదోషశాంతి వర్ణనం నామ పంచవింశోధ్యాయః || 25 ||

తా || పిదప పాపం పోయి మనస్సు నిర్మలమైంది. తర్వాత త్వరలోనే ముని బ్రహ్మస్థానమునకు వెళ్ళాడు (56) ఈ విధంగా మీకు శంఖ తీర్థ వైభవాన్ని చెప్పాను. అక్కడ స్నానం చేసినంతలోనే కృతఘ్నుడు కూడా ముక్తుడౌతాడు. (57) మాతృద్రోహి, పితృద్రోహి, గురు ద్రోహి, ఇతర విధములైన కృతఘ్నులు ఇక్కడస్నానం చేసిముక్తులౌతారు. (58) అందువల్ల కృతఘ్నులైనమనుజులు ఈ తీర్థాన్ని సేవించాలి. కృతఘ్నుడుకూడా ముక్తుడయ్యే ఈ తీర్థము ఎంత గొప్పది (59) మాతా పితరుల ఋణం తీర్చని, గురుదక్షిణ ఇవ్వని, కృతఘ్నతను పొందిన వానికి నిష్కృతి మరణంతోనే (60) ఇక్కడ స్నాన మాత్రం వల్లనే కృతఘ్నునకు కూడా నిష్కృతి. కృతఘ్నతకూడా ఆ తీర్థమందు స్నాన మాత్రంవల్ల నశిస్తుంది. (61) ఇతరమైన తుచ్ఛపాపముల విముక్తి గురించి చెప్పేదేముంది (62) భక్తితో ఈ అధ్యాయాన్ని చదివిన కృతఘ్నుడైన నరుడు కూడ పాపము నుండి ముక్తుడౌతాడు. విశుద్ధ అంతరాత్మకలవాడై సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మతో సహ మోక్షమును కూడా త్వరగా పొందుతాడు. (63) అని స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు శంఖతీర్థప్రశంస మందు వత్సనాభుని కృతఘ్నతా దోషశాంతి వర్ణనమనునది ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Scanda Mahapuranamu-3    Chapters