Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఆరవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

విధాయాభిషవం మర్త్యాః శంఖతీర్థే ద్విజోత్తమాః యమునాం చైవగంగాంచ గయాంచాపిక్రమాద్ర్వజేత్‌ || 1 ||

యమునాఖ్యం మహాతీర్థం గంగాతీర్థమనుత్తమం | గయాతీర్థంచ మర్త్యానాం మహాపాతకనాశనం || 2 ||

ఏతత్తీర్ణత్రయం పుణ్యం సర్వలోకేషువిశ్రుతం | సర్వవిఘ్నప్రశమనం సర్వరోగనిబర్హణం || 3 ||

ఏతద్ధితీర్థత్రితయం సకలాజ్ఞాన నాశనం | అవిద్యాయాం వినష్టాయాం తథాజ్ఞాన ప్రదంనృణాం || 4 ||

జానశ్రుతి ర్మహారాజ ఏషుతీర్థేషు వైపురా | స్నాత్వా రైక్వాత్‌ ద్విజశ్రేష్ఠాత్‌ ప్రాప్తవాన్‌ జ్ఞానముత్తమం || 5 ||

ఋషయ ఊచుః -

సూత సర్వార్థ తత్వజ్ఞ వ్యాసశిష్యమహామతే | యమునా చైవగంగాచ గయాచైవేతి విశ్రుతం || 6 ||

ఏతత్తీర్థత్రయంకస్మాత్‌ ఆగతం గంధమాదవే | జాన శ్రుతేశ్చరాజర్షేః స్నానాత్తీర్థత్రయేపిచ

జ్ఞానావాప్తిః కథం రైక్వాదస్మాకం సూతతద్వద | || 7 ||

శ్రీ సూత ఉవాచ -

రైక్వనామా మహర్షిస్తు పురావై గంధమాదనే | || 8 ||

తపస్సు దుశ్చరం కుర్వన్‌ న్యవసత్తపసాం నిధిః దీర్ఘకాలం తపః కుర్వన్‌ సవైరై క్వో మహామునిః || 9 ||

తపోబలేన మహతా దీర్ఘమాయుర వాస్తవాన్‌ | జన్మనా పంగురే వాసీత్‌ రైక్వనా మా మహామునిః || 10 ||

పంగుత్వాద సమర్థోభూత్‌ గంతుంతీర్థాస్యసౌమునిః | సంతియానితు తీర్థాని గంధమాదన పర్వతే || 11 ||

తాని గచ్ఛతి సామీప్యాత్‌ శకటే నైవ సంచరన్‌ | సయద్‌ రైక్వోమునివరో యుగ్వేన సహవర్తతే || 12 ||

తపస్వీ వైదికై ర్లోకే సయుగ్వే త్యభిధీయతే | యుగ్వేతి శకటం ప్రోక్తం సతేన సహవర్తతే || 13 ||

సఖల్వే వం ముని శ్రేష్ఠః సయుగ్వానామవైమునిః | పూర్ణజ్ఞాన స్తపస్తేపే గంధమాదన పర్వతే || 14 ||

గ్రీష్మేపంచాగ్ని మధ్యస్థః సోతప్యతమహత్తవః | వర్షాయాం కంఠదఘ్నేషు జలేషు సమవర్తత || 15 ||

తవసాశోషితే గాత్రే పామాతస్యవ్యజాయత | కండూయత సపామానం దివారాత్రం మునీశ్వరః || 16 ||

కండూయమాన ఏవాయం పామానం నతపోత్యజిత్‌ | అజాయతమనస్త్వేవం తస్యసయుగ్వనోమునేః || 17 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులార ! నరులు శంఖ తీర్థమందు స్నానముచేసి, పిదప క్రమముగా యమున, గంగ, గయలకు వెళ్ళాలి. (1) మహా తీర్థమైన యమున అత్యుత్తమమైన గంగాతీర్థము, గయాతీర్థము ఇవి నరుల పాపముల నశింపచేసేవి (2) ఈ మూడు తీర్థములు పుణ్యప్రదమైనవి సర్వలోకములలో ప్రసిద్ధమైనవి. సర్వవిఘ్నముల నశింపచేసేవి. సర్వరోగముల తొలగించేవి (3) ఈ మూడు తీర్థములు సమస్త అజ్ఞానముల తొలగించేవి. అవిద్య నశించగా జ్ఞానము నిచ్చేవి కూడా (4) జ్ఞానశ్రుతి అనే మహారాజు పూర్వం ఈ తీర్థములలో స్నానం చేసి రైక్వుడను బ్రాహ్మణ శ్రేష్ఠుని నుండి ఉత్తమమైన జ్ఞానాన్ని పొందాడు. (5) ఋషులిట్లనిరి - సూత! సర్వార్థముల తత్వమెరిగిన వాడ ! వ్యాసుని శిష్యుడ! మహామతి ! యమున,గంగ, గయ అని ప్రసిద్ధమైన (6) ఇవి గంధమాదన పర్వతం పైకి ఎట్లా వచ్చాయి. జ్ఞానశ్రుతి అనే రాజర్షి మూడు తీర్థములలో స్నానం చేయటం వల్ల రైక్వుని నుండి జ్ఞానాన్ని ఎట్లా పొందాడు. సూత ! మాకు చెప్పండి (7) శ్రీ సూతులిట్లనిరి - రైక్వుడను పేరు గల మహర్షి పూర్వం గంధమాదనంలో (8) చాలా కఠినమైన తపస్సు నాచరిస్తూ ఆతపోనిధి ఉండేవాడు. దీర్ఘకాలము ఆ రైక్వమహాముని తపస్సు చేస్తూ (9) గొప్పతపోబలంతో దీర్ఘాయుస్సును పొందాడు. రైక్వుడను ఈ మునిజన్మ చేత పంగువు (ఈచబోయిన కాలువాడు) (10) పంగువైనందువల్ల ఈ ముని తీర్థములకు వెళ్ళుటకు అసమర్థుడైనాడు. గంధమాదన పర్వతంలోని తీర్థాలను (11) దగ్గరలో ఉండటం వల్ల బండిమీదనే తిరుగుతూ వెళ్ళేవాడు. ముని పరుడైన రైక్వుడు బండితో సహా ఉండేవాడు (12) తపస్వి, లోకంలో వైదికులు ఈతనిని సయుగ్వ అను పేరుగల అని పిలిచేవారు. యుగ్వమనగా బండి. అతడు దానితో కూడి ఉంటాడు. (13) ఈ విధంగా ఆముని శ్రేష్ఠుడు సయుగ్వ అను పేరుగల ముని, గంధమాదన పర్వతంలో పూర్వజ్ఞానము కలవాడై తపమాచరించాడు. (14) గ్రీష్మ మందు పంచాగ్ని మధ్యమందుండి గొప్పతపమాచరించాడు. వర్షాకాలంలో కుత్తుక బంటి నీటిలో ఉండి తపమాచరించాడు (15) తపస్సు వల్ల శరీరం కృశించిపోగా అతనికి దురద (గోకుడు) పుట్టింది. ఆ ముని రాత్రింబగళ్ళు అతడు గోకుడును గోకేవాడు (16) గోకుడును గోకుతూనే తపస్సును మాత్రం వదలలేదు. ఆ యుగ్వమునికి మనస్సులో ఇట్లా అనిపించింది. (17)

మూ|| యమునాయాంచగంగాయాంగయాయాంచాధునైవహి|అస్మింస్తీర్థత్రయేపుణ్యస్నాతవ్యంహిమయాత్వితి || 18 ||

ఏవం విచింత్యసమునిః అన్యాం చింతా మధాకరోత్‌ | అహంహిజన్మనాపంగుః అతఃస్నానంహి దుర్లభం || 19 ||

అతిదూరం మయా గంతుంశకటేన నశక్యతే | కింకరోమ్యధునే త్యేవం సవితర్క్య మహామతిః || 20 ||

తీర్థత్రయేషు స్నానార్థం కర్తవ్యం నిశ్చికాయవై | అప్రసహ్యమనాధృష్యం విద్యతే మే తపోబలం || 21 ||

తెనైవావాహ యిష్యామి తద్ధితీర్థత్రయం త్విహ | ఇతినిశ్చిత్య మనసా ప్రాజ్‌ ముఖో నియతేంద్రియః || 22 ||

త్రిరాచమ్యచ సయుగ్వాన్‌ దధ్యౌక్షణ మతంద్రిత ః | తస్యమంత్రప్రభావేన యమునా సామహానదీ || 23 ||

గంగాచ జహ్ను తనయాగయా సా పాపనాశినీ | భూమిం నిర్భిద్య తిస్రోపి పాతాలాత్సహసోత్థితాః || 24 ||

మానుషం రూపమాస్థాయ సయుగ్వానముపేత్యచ | ఊచుః పరమసంహృష్టాః హర్షయంత్యశ్చతంమునిం || 25 ||

సయుగ్వన్‌ రైక్వభద్రంతే ధ్యానాదస్మాదుపారమ | త్వన్మంత్రేణ సమాకృష్టావయమత్రసమాగతాః || 26 ||

కింకర్తవ్యంతవాస్మాభిః తద్వదస్వమునీశ్వర | ఇతితాసాం వచః శ్రుత్వా సయుగ్వాన్‌హి మహామునిః || 27 ||

ధ్యానాదుపారమత్తూర్ణం తాశ్చాపశ్యత్పురః స్థితాః | సతాః సంపూజ్య విధివత్‌ రైక్వోవాచమభాషత || 28 ||

యమునే దేవి హేగంగే హేగయే పాప నాశిని | సన్నిధానం కురుథ్వం మే గంధమాదన పర్వతే || 29 ||

యత్రభూమిం వినిర్భిద్య భవత్య ఇహనిర్గతాః | తాని పుణ్యాని తీర్థాని భ##వే యుర్వోభిధానతః || 30 ||

సహసాంతరథీయంతత ధాస్త్విత్యేవ తత్రతాః | తదా ప్రభృతి తీర్థాని తాని త్రీణ్యపి భూతలే || 31 ||

తేన తేనాభిధానేన గీయన్తే సర్వదాజనైః | యత్రభూమిం వినిర్భిద్య యమునా నిర్గతాతదా || 32 ||

యమునా తీర్థమితి వై తజ్జనైరభిధీయతే | యతోవైపృథివీరం ధ్రాత్‌ జాహ్నవీసహసోత్థితా || 33 ||

గంగాతీర్థమితి ఖ్యాతం తల్లోకే పాపనాశనం | గయాహిమానుషం రూపం యత అస్థాయ నిర్య¸° || 34 ||

తదేవ భూమి వివరం గయా తీర్థం ప్రచక్షతే | ఏవమేతన్మహాపుణ్యం తీర్థత్రయమనుత్తమం || 35 ||

తా || యమున, గంగ, గయ వీటి యందు ఇప్పుడే ఈ మూడు పుణ్య తీర్థములలో నేను స్నానం చేయాలి అని (18) ఆలోచించి ఆముని మరి ఇట్లా ఆలోచించాడు. నేను జన్మతో కాళ్ళు లేనివాడను. అందువల్ల స్నానం చేయటం కష్టం (19) బండిమీద ఎక్కువ దూరం నేను వెళ్ళలేను. ఇప్పుడేం చేయాలి అని ఇట్లా ఆ మహామతి ఆలోచించి (20) మూడు తీర్థములలో స్నానం చేయాలని నిశ్చయించుకొని, నాతపశ్శక్తి సంహించరానిది, తిరస్కరించరానిది (21) ఆతపశ్శక్తితోనే ఆ మూడు తీర్థములను ఆ వాహన చేస్తాను ఇక్కడే. అని మనస్సులో నిశ్చయించి తూర్పు ముఖంగా ఉండి ఇంద్రియములను అరికట్టి (22) మూడుసార్లు ఆచమనం చేసి సయుగ్వుడు క్షణకాలము నిశ్చలంగా ధ్యానం చేశాడు. ఆతని మంత్ర ప్రభావముతో ఆ మహానది యమున (23) జహ్ను తనయయైనగంగ, పాపనాశిని గయ, భూమిని ఛేదించి మూడుకూడా పాతాళమునుండి తొందరగా పైకి వచ్చి (24) మానుష రూపము ధరించి, సయుగ్వుని దరికి వచ్చి చాలా ఆనందపడి, ఆమునిని ఆనందపరుస్తూ ఇట్లా అన్నాయి (25) సయుగ్వ ! రైక్వ! క్షేమమా. ఈ ధ్యానం నుండి విరమించు. నీమంత్రంతో ఆకర్షింపబడి మేము ఇక్కడికి వచ్చాము (26) నీ కోసం మేం ఏం చేయాలో చెప్పు. ఓ మునీశ్వర ! అని అన్నవారి మాటలను విని మహాముని సయుగ్వుడు (27) ధ్యానం నుండి త్వరగా విరమించాడు. ముందర ఉన్నవారిని చూచాడు. ఆతడు శాస్త్ర ప్రకారము వారిని పూజించి రైక్వుడు ఇట్లా అన్నాడు. (28) ఓ యమున ! ఓ గంగ ! ఓ పాపనాశిని గయ ! ఈ గంధమాదన పర్వతమందు మీరు నాకు సన్నిధిలో ఉండండి. (29) ఎక్కడ భూమిని ఛేదించి మీరు ఇక్కడ పైకి వచ్చారో, అవి మీ పేరుతో పుణ్యతీర్థములు కావాలి (30) అట్లాగే కానిమ్మని పలికి అక్కడ వారు తొందరగా అంతర్థానమైనారు. నాటినుండి ఆ తీర్థములు మూడు భూమియందు (31) వారి వారి పేర్లతో ఎప్పుడూ జనులతో పొగడబడుతున్నాయి. ఎక్కడ భూమిని ఛేదించుకొని యమున బయటికి వచ్చిందో అప్పుడు (32) ఆ ప్రదేశము జనులతో యమునా తీర్థమని పిలువబడుతోంది. ఏ పృథివీరంధ్రమునుండి గంగ త్వరగా పైకి వచిందో (33) అది లోకంలో పాపనాశకమైన గంగా తీర్థముగా ప్రసిద్ధి చెందింది. ఎక్కడ నుండి గయ మనుష్యరూపధారియై పైకి వచ్చిందో (34) ఆ భూమి పరమే గయా తీర్థమని చెప్పబడుతోంది. ఈ విధముగా మహా పుణ్యప్రదమై, ఉత్తమమైన ఈ తీర్థములు మూడు (35).

మూ|| రైక్వమంత్రప్రభావేణ పృథివ్యాః సహసోత్థితం | అత్రతీర్థత్రయే స్నానం యేకుర్వం తినరోత్తమాః || 36 ||

తేషామజ్ఞాననాశః స్యాత్‌ జ్ఞానమప్యుదయంలభేత్‌ | స్వమంత్రేణ సమాకృష్టే తత్ర తీర్థత్రయేమునిః || 37 ||

స్నానంసమాచరన్నిత్యంసకాలాసత్యవాహయత్‌ | ఏతస్మిన్నేపకాలేతు రాజాజాన శ్రుతిర్మహాన్‌ || 38 ||

పుత్రసంజ్ఞస్యరాజర్షేః పుత్రోధర్మైకతత్పరః | దేయమన్నాది సతదాహ్యర్ధిభ్యః శ్రద్ధయైవయత్‌ || 39 ||

తస్మాదేనం నజనాలోకేశ్రద్ధాదేయం ప్రచక్షతే | యతో బహుతరం వాక్యం అన్నాద్యస్యమహీపతేః || 40 ||

అర్ధినాంక్షుధితానాంతు తృప్త్యర్థం వర్తతేగృహే | అతో యమర్ధిభిః సర్వైః బహువాక్య ఇతీర్యతే || 41 ||

సవై పౌత్రాయణోరాజాజానశ్రుత సుతోబలీ | ప్రియాతిధిర్చభూవాసౌ బహుదాయీ తథాభవత్‌ || 42 ||

నగరేషుచ రాష్ట్రేషు గ్రామేషుచ వనేషుచ | చతుష్పదేషు సర్వేషు మహామార్గేషు సర్వశః || 43 ||

బహ్వన్నపాన సంయుక్తం సూపశాకాది సంయుతం | అతిథ్యం కల్పయామాన తృప్తయేర్థి జనన్యవై || 44 ||

అన్నపానాదికం సర్వం ఉపయుజ్‌ ధ్వమిహార్థినః | ఇత్యసౌఘోషయామాన తత్రతత్రజనాస్పదే || 45 ||

తస్యప్రియాతిథేరేవ నృపస్య బహుదాయినః | అర్థిభ్యోదాన శౌండన్యగుణాః సర్వత్రవిశ్రుతాః || 46 ||

అథపౌత్రాయణ స్యాస్యగుణగ్రామేణ వర్తతః | దేవర్షయో మహాభాగాః తస్యానుగ్రహకాంక్షిణః || 47 ||

హంసరూపం సమాస్థాయ నిదాఘసమయేనిశి | రమణీయాం విధాయాశుశ్రేణీ మాకాశమార్గతః || 48 ||

సౌధవాతాయనస్థస్యతస్యో పరిమహీవతేః ఉడ్డీయోడ్డీ యవేగేన తరసాజగ్మురుచ్చక్తైః || 49 ||

తరసావతతాం తేషాం హంసానాం వృష్ఠతోవ్రజన్‌ | ఏకోహంసస్తు సంబోధ్య హంసమగ్రేసరం తదా || 50 ||

సోపహాసమిదం వాక్యం ప్రాహశ్రుణ్వతి రాజని | భో భో భల్లాక్షభల్లాక్ష పురోగచ్ఛన్మరాలక || 51 ||

సౌధమధ్యే పురస్తాద్వై జానశ్రుత సుతోనృపః వర్తతే పూజనీయోయం న పశ్యసి కమంధవత్‌ || 52 ||

యస్యతేజోదురాధర్షమాబ్రహ్మభవనాదిదం | అనంతాదిత్య సంకాశం జ్వలతే పురతోభృశం || 53 ||

తమతిక్రమ్యరాజర్షిం మాగాన్త్వమపరిద్రుతం | యదిగచ్ఛసి తత్తేజః సాంప్రతం త్వాం ప్రధక్ష్యతి || 54 ||

ఇత్యుక్త వంతం తంహం సమగ్రతః ప్రత్యభాషత || 54 1/2 ||

తా || రైక్వుని మంత్ర ప్రభావముతో పృథివిపై తొందరగా లేచిన ఈ తీర్థత్రయమందు స్నానం చేసిన నరుల (36) అజ్ఞానము నశించి, వారికి జ్ఞాన ముదయిస్తుంది. తన మంత్రంతో సమాకృష్టమైన ఆ తీర్థత్రయ మందు ఆముని (37) రోజు స్నానం చేస్తూ ఆతడు కాలాన్ని గడిపాడు. ఈ కాలంలోనే జానశ్రుతి అనే గొప్పరాజు, (38) పుత్రుడను పేరుగల రాజర్షి పౌత్రుడు ధర్మైక బుద్ధి గలవాడు, శ్రద్ధతో యాచకులకు అన్నాదులను ఇవ్వతగిన వానిని ఇస్తూ ఉండటం వల్ల (39) ఈతనిని జనులు లోకంలో శ్రద్ధాదేయుడు అని అన్నారు. ఎక్కువ మాటలు, అన్నంకంటే గూడా రాజు (40) ఆకలిగొన్న అతిథుల తృప్తి కొరకు మాట్లాడేవాడు. అందువల్ల అర్థులందరు బహువాక్యుడని అన్నారు. (41) ఆ పౌత్రాయణరాజు, జానశ్రుతని సుతుడు బలవంతుడు ప్రియాతిథి) అతిథి (ప్రియుడైనాడు. బహుదాయి కూడా ఐనాడు. (42) నగరములందు రాష్ట్రములందు గ్రామములందు వనములందు, అన్ని నాలుగు మార్గముల కూడలిలో, అన్ని మహా మార్గములలో (43) బహు అన్నపానములతో కూడి సూ పశాకాదులతో కూడి, అర్థిజనుల తృప్తి కొరకు ఆతిథ్యాన్ని కల్పించాడు. (44) ఇక్కడ అర్థులు అన్న పానాదికము అంతా ఉపయోగించండి. అని ఆ రాజు అక్కడక్కడ జనులున్నచోట చాటింపు వేయించాడు. (45) అప్రియాతిథి, బహు దాయి యాచకులకు దానశౌండుడైన రాజుగుణములు అంతట ప్రసిద్ధమైనాయి (46) గుణ సమూహముగల ఈ పౌత్రాయణుని అనుగ్రహమును కాంక్షించి మహా భాగులైన దేవర్షులు (47) హంసరూపమును ధరించి ఎండాకాలంలో రాత్రిపూట, రమణీయమైన శ్రేణులుగా ఏర్పడి ఆకాశమార్గంగా (48) మేడకిటికీ వద్ద ఉన్న ఆ రాజుగారి పై భాగంలో ఎగిరి ఎగిరి వేగంగా ఇంకా పైకి పోయారు (49) వేగంగా ఎగురుతున్న ఆ హంసల వెనుకవెళ్తూ, ఒక హంస, ముందు వెళ్తున్న హంసను సంబోధిస్తూ (50) వెక్కిరిస్తూ రాజు వింటుండగా ఇట్లా పలికింది. ఓ భల్లాక్ష ! ఓ భల్లాక్ష ముందువెళ్తున్న మరాళమ (51) ముందు సౌథం మధ్య జానశ్రుతుని సుతుడు రాజు, ఉన్నాడు. ఈతడు పూజనీయుడు, గుడ్డిదానివలె చూడటం లేదా ఏమి (52) ఆ బ్రహ్మ భవనము నుండి ఇది ఈతని తేజస్సు తిరస్కరించరానిది. అనంత ఆదిత్యుల వెలుగువలెనున్నట్టిది ముందట బాగా వెలుగుతోంది. (53) ఆ రాజర్షిని అతిక్రమించి నీవు పైన వేగంగా పోవద్దు. ఒక వేళపోయిన యెడల ఆ తేజస్సు ఇప్పుడు నిన్ను శాసించగలదు (54) అని పలుకుతున్న ఆ హంసతో ముందున్న హంస ఇట్లా పలికింది. (54 1/2)

మూ || అహోభవాన భిజ్ఞోసిశ్లాఘనీయోసిసూరిభిః || 55 ||

అశ్లాఘనీయంకితవం యత్త్వమేనం ప్రశంససే | ప్రశంససేకి మర్ధంత్వం అల్పం సంతమిమంజసం || 56 ||

భస్రావత్‌ పశుపచ్చైవ కేవలం శ్వాసధారిణం | సహ్యయం వేత్తిధర్మాణాం రహస్యం పృధివీపతిః || 57 ||

తత్వజ్ఞానీయథారైక్వః సయుగ్వాన్‌ బ్రాహ్మణోత్తమః | రైక్వస్యచ మహాజ్జ్యోతి రహస్యం దైవతైరపి || 58 ||

నహ్యస్య ప్రాణమా త్రస్య తేజస్తాదృశమస్తివై | రైక్వస్యపుణ్యరాశీనా మియత్తానైవ విద్యతే || 59 ||

గణ్యంతే పాంసవోభూమేః గణ్‌యంతేదివితారకాః | రైక్వపుణ్యమహామేరుసమూహోనైవగణ్యతే || 60 ||

కించతిష్ఠం త్విమేధర్మాః నశ్వరాస్తన్యవైమునేః | బ్రహ్మజ్ఞానమబాధ్యం యత్‌తేనసశ్లాఘ్యతేమునిః || 61 ||

జానశ్రుతేస్తు తాదృక్షో ధర్మ ఏవన విద్యతే | దుర్లభం యత్తు యోగీంద్రైః కృతస్తత్‌ జ్ఞాన వైభవం || 62 ||

పరిత్యజ్య దురాత్మానం తద్వరాకమిమంజనం | సఏవరైక్వః సయుగ్వాన్‌ శ్లాఘత్యాం భవతామునిః || 63 ||

జన్మనా పంగురపియః స్వస్యస్నాన చికీర్షయా | గంగాంచ యమునాంచాపి గయామపిమునీశ్వరః || 64 ||

అహ్వయామానమంత్రేణ నిజాశ్రమ సమీపతః | తస్యబ్రహ్మవిదోరైక్వ మహర్షేః ధర్మసంచయే || 65 ||

అంతర్భవంతి ధర్మౌఘాః త్రైలోక్యోదరవర్తినాం | రైక్వస్య ధర్మకక్షాతున హిత్రైలోక్యవర్తినాం || 66 ||

ప్రాణినాంధర్మకక్షాయాం అంతర్భవతి కర్హిచిత్‌ | ఏవమగ్రేసరేహంసేకథిత్వోపరతేనతి || 67 ||

హంసరూపామునీంద్రాస్తే బ్రహ్మలోకం యయుః పునః || 67 1/2 ||

తా || నీవు తెలిసిన వాడివి. పండితులతో పొగడబడే దానివి (55) శ్లాఘించతగని మోసగానిని ఈతనిని ప్రశంసిస్తున్నావు. అల్పమైన ఈతనిని నీవు ఎందుకు ప్రశంసిస్తున్నావు (56) తిత్తివలె, పశువువలె కేవలం శ్వాసధారియైనది ఈతని ప్రశంస. ఈ పృథివీపతి ధర్మముల రహస్యాన్ని ఎరుగడు (57) సయుగ్వుడు బ్రాహ్మణోత్తముడు రైక్వుడు ఎంత బ్రహ్మజ్ఞానో ఈతడంతకాదు. రైక్వుని మహాజ్యోతి రహస్యము దేవతలుకూడా తెలుసుకోలేదు (58) ప్రాణమాతృడైన ఈతని తేజస్సు అటువంటిది కాదు. రైక్వుని పుణ్యరాశులు ఇంత అని చెప్పవీలుకానివి (59) భూమియందలి ధూళి రేణువులను లెక్కించవచ్చు. ఆకాశంలో తారకలను లెక్కించవచ్చు. రైక్వుని పుణ్యమనే మహామేరు సమూహమును లెక్కించలేము. (60) నశ్వరమైన ఈ ధర్మములుండనీ. ఆముని బ్రహ్మజ్ఞానము ఆబాధ్యము అందుకే అతడు పొగడబడుతున్నాడు. (61) జానశ్రుతికి అటువంటి ధర్మమే లేదు. యోగీంద్రులకే దుర్లభ##మైన ఆ జ్ఞాన వైభవము ఈతనికెక్కడ లభిస్తుంది. (62) దురాత్ముడైన పరాకుడైన ఈ మనిషిని వదలండి. సయుగ్వుని రైక్వుని మునిని మీరు పొగడండి. (63) జన్మతో కుంటివాడైనా తను స్నానం చేయటం కొరకు మునీశ్వరుడు గంగయమున గయ నదులను (64) మంత్రంతో నిజ ఆశ్రమ సమీపానికి పిలిచాడు. అబ్రహ్మవిదుడైన రైక్వుని ధర్మసంచయమందు (65) త్రైలోక్యం మధ్యభాగంలో ఉండేవారి ధర్మసమూహములు అంతర్భవిస్తాయి. రైక్వుని ధర్మకక్ష మాత్రము త్రిలోకములందుండే (66) ప్రాణుల ధర్మకక్షయందు మాత్రము అంతర్భవించదు. అని ముందున్న హంస పలికి విరమించాక (67) హంసరూపులైన మునీంద్రులు తిరిగి బ్రహ్మలోకమునకు వెళ్ళారు (67 1/2)

మూ || అథపౌత్రాయణోరాజాజాన శ్రుతిరరిందమః || 68 ||

రైక్వంచోత్కర్షకాష్ఠాయాం నిశమ్యపరమావధిం | విషణ్ణోభవదత్యర్థం పరాకోక్షజితోయథా || 69 ||

చింతయామాససనృపః పౌనః పున్యేన నిశ్వసన్‌ | హంస ఉత్కర్షయన్‌ రైక్వంనికృష్టం మామిహాబ్రవీత్‌ || 70 ||

అహోరైక్వస్యమాహాత్మ్యం యం ప్రశంసంతి పక్షిణః | తత్పరిత్యజ్య సంసారం సర్వం రాజ్యమిహాధునా || 71 ||

సయుగ్వానం మహాత్మానం తమేవశరణం ప్రజే | కృపానిధిః సవైరైక్వః శరణం మాముపాగతం || 72 ||

ప్రతిగృహ్యాత్మవిజ్ఞానం మహ్యం సమువదేక్ష్యతి | ఇత్యసౌచింతయన్నేవకధం కథమసిద్విజాః || 73 ||

జాగ్రన్నే వాయముద్వేలాం రాత్రిం తామత్యవాహయత్‌ | ని శావసానే సంప్రాప్తే వంది వృందప్రవర్తితం || 74 ||

అశ్రుణోన్మం గలరవం తూర్యఘోష సమన్వితం | తదాకర్ణ్యమహారాజః తదాతల్పస్థ ఏవసన్‌ || 75 ||

సారథిం శీఘ్రమాహూయబభాషే సాదరం వచః | సారధేసత్వరం గత్వా రథమారుహ్యవేగవత్‌ || 76 ||

ఆశ్రమేషు మహర్షీణాం పుణ్యషునిపినేషుచ | వివిక్తేషు ప్రదేశేషు సతామా వాస భూమిషు || 77 ||

తీర్థానాంచ నదీనాంచ కూలేషు పులినేషుచ | అన్యేషుచ ప్రదేశేషు యత్ర సంతిమునీశ్వరాః || 78 ||

తేషు సర్వేషు యోగీంద్ర పంగుంశకటసంస్థితం | రైక్వాభిధానం సర్వేషాం ధర్మాణాం ఏకసంశ్రయం || 79 ||

బ్రహ్మజ్ఞానైకనిలయం సయుగ్వానం గవేషయ | అన్విష్య తూర్ణం మత్ర్పీత్యై పునరాగచ్ఛసావధే || 80 ||

సతథేతి వినిర్గత్య వేగవద్రథసంస్థితః | సర్వత్రాన్వేష యామానరైక్వం బ్రహ్మవిదం మునిం || 81 ||

గుహానుపర్వతానాంచ మునీవా మాశ్రమేషుచ | సంచచార మహీంకృత్స్నాం తత్రతత్రగవేషయన్‌ || 82 ||

అన్విష్య వివిధాన్‌ దేశాన్‌ సారథిస్త్వరయాసహ | క్రమాన్‌ మహర్షి సంబాధం గంధమాదన మన్వగాత్‌ || 83 ||

మార్గమాణః సతత్రాపితం దదర్శమునీశ్వరం | కండూయమానం పామానం శకటీయస్థలస్థితం || 84 ||

అద్వైతనిష్కలం బ్రహ్మచింతయంతం నిరంతరం | తం దృష్ట్వాసారదిస్తత్ర సయుగ్వానం మహామునిం || 85 ||

రైక్వోయమితి సంచింత్య తమా సాద్యప్రణమ్యచ | వినయాన్ముని మ ప్రాక్షీత్‌ ఉపవిశ్యతదంతికే || 86 ||

తా || అరింద ముడు పౌత్రాయణుడు రాజు ఐన జానశ్రుతి (68) పరమావధియైన రైక్వుని గూర్చి అత్యంత ఉత్కర్షతో విని పాచికలలో ఓడిన వరాకునిలా మిక్కిలి విషణ్ణవదనుడైనాడు (69) మాటిమాటికి నిశ్వసిస్తు ఆ రాజు ఆలోచించసాగాడు. హంస రైక్వుని గొప్ప చేస్తూ నన్నుని కృష్ణుడని అంది (70) రైక్వుని మహత్తు ఎంత గొప్పది. పక్షులు గూడా అతన్ని ప్రశంసిస్తున్నాయి. అందువల్ల ఈ సంసారాన్ని వదలి రాజ్యాన్నంత వదలి ఇప్పుడు (71) సయుగ్వుడైన మహాత్ముని శరణు వేడుతాను. దయగల ఆ రైక్వుడు శరణు అని వచ్చిననన్ను (72) స్వీకరించి తన విజ్ఞానాన్ని నాకు బాగా ఉపదేశిస్తాడు. అని అతడు ఆలోచిస్తూనే ఏదో ఒకరకంగా (73) మెలుకువతోనే ఉద్వేలమైన ఆ రాత్రిని గడిపాడు. రాత్రి చివరరాగానే వంది బృందము చేసిన (74) మంగలరవమును తూర్యముల ఘోషతో కూడా విన్నాడు. దానిని విని మహారాజు పడక మీద ఉంటూనే (75) సారథిని తొందరగా పిలిచి సాదరంగా ఇట్లా అన్నాడు. సారథి తొందరగా వెళ్ళి రథమెక్కి వేగంతో (76) మహర్షుల ఆశ్రమాల్లో పుణ్యమైన అడవులలో, ఒంటరి ప్రదేశాలలో సజ్జనుల నివాస స్థానాలలో (77) తీర్థముల నదుల ఒడ్డులలో, ఇసుక ప్రదేశములలో ఇతర ప్రదేశములలో మునులున్న చోట (78) ఆ అన్ని చోట్ల యోగీంద్రుడు, పంగువు, శకటమందున్నవాడు ధర్మములన్నింటికి ఒకే ఆ ధారము ఐన రైక్వుడను పేరుగలవానిని (79) బ్రహ్మజ్ఞానమునకు నిలయమైన వానిని సయుగ్వుని వెతుకు. తొందరగా వెతికి నా సంతోషం కొరకు తిరిగి రా ఓ సారథి! అని చెప్పగా (80) ఆతడు అట్లాగే అని చెప్పి బయలుదేరి వేగముగల రథమందధిరోహించి బ్రహ్మవిదుడైన రైక్వమునిని అంతటా వెతకసాగాడు. (81) పర్వతగుహలలో మునుల ఆశ్రమాలలో, అక్కడక్కడ వెతుకుతు భూమి అంతా తిరిగాడు. (82) వివిధ దేశములను సారధి వేగంగా వెతికి క్రమంగా మహర్షులతో నిండిన గంధమాదనమునకు వెళ్ళాడు. (83) అక్కడ కూడా వెతుకుతూ ఆతడు ఆ మునీశ్వరుని చూచాడు. దురదను గోక్కుంటున్న, బండ్లుండేచోట ఉన్న (84) నిష్కలమైన అద్వైత బ్రహ్మను గూర్చి ఎప్పుడూ చింతించే సయుగ్వుని మహామునిని అక్కడ చూచి సారధి (85) ఈతడు రైక్వుడని గ్రహించి అతని దరికి చేరి నమస్కరించి అతని సమీపమందు కూర్చొని వినయంతో మునిని అడిగాడు (86)

మూ|| సయుగ్వాన్‌ రైక్వనామాచ బ్రహ్మన్‌ కింవైభవానితి | తస్యవాక్యం సమాకర్ణ్యసమునిః ప్రత్యభాషత || 87 ||

అహమేవ సయుగ్వాన్వై రైక్వనామేతి వైతదా | ఇత్యాకర్ణ్యమునే ర్వాక్యం ఇంగితైర్బహుభిస్తథా || 88 ||

కుటుంబ భరణార్థాయ ధనేచ్ఛామపగమ్యచ | సర్వం న్యవేదయద్రాజ్ఞే నివృత్తో గంధమాదనాత్‌ || 89 ||

జానశ్రుతిర్నిశమ్యాథ సారథే ర్వాక్యమాదరాత్‌ | షట్‌ శతాని గవాంచాపి నిష్కభారం ధనస్యచ || 90 ||

రథంచాశ్వతరీయుక్తం సమాదాయ త్వరాన్వితః | పౌత్రాయణః సరాజర్షిః తం రైక్వం ప్రతి చక్రమే || 91 ||

గత్వాచ వచనం ప్రాహతంరైక్వం సమహపతిః | భగవన్‌ రైక్వ సయుగ్వన్‌ మద్దత్తం ప్రతి గృహ్యతాం || 92 ||

షట్‌ శతాని గవాంచాపి నిష్కభారం ధనస్యచ | రథం చాశ్వతరీయుక్తం ప్రతిగృహ్ణీష్వమామకం || 93 ||

గృహీత్వా సర్వమేతత్తు భో బ్రహ్మన్నను శాధిమాం | అ ద్వైత బ్రహ్మ విజ్ఞానం మహ్యం సముపదిశ్యతాం || 94 ||

ఇతిత స్యవచః శ్రుత్వా సస్పృహంచ నసంభ్రమమ్‌ | రైక్వః ప్రత్యాహసయుగ్వాన్‌ జానశ్రుతి రరిందమం || 95 ||

రైక్వ ఉవాచ -

ఏతాగావః తవైవాస్తు నిష్కభారస్తథా రథః కిమల్పేన మమానేన బహుకల్పేషు జీవతః || 96 ||

సమేకుటుంబ నిర్వాహో పర్యాప్తమిదమంజసా | ఏవంశతగుణంచాపి యది దత్తం త్వయామమ || 97 ||

నాలం తదపి రాజేంద్ర కుంటుంబ భరణా యవై | ఇతిరైక్వవచః శ్రుత్వాజానశ్రుతిర భాషత || 98 ||

జానశ్రుతి రువాచ -

త్వయోపదిశ్యమానస్య బ్రహ్మజ్ఞాన స్యవైమునే | సహిమూల్యమిదం బ్రహ్మన్‌ గోధనం రథ ఏవచ || 99 ||

ప్రతిగృహ్ణీష్వ వా మావా మమైతత్తు గవాదికం | నిష్కలాద్వైత విజ్ఞానం బ్రహ్మన్నుపదిశస్వమే

తదాకర్ణ్య పచస్తస్యసయుగ్వాన్‌ వాక్యమబ్రవీత్‌ || 100 ||

తా || సయుగ్వుడు రైక్వుడు అనుపేరుగల వారు ఓ బ్రహ్మ! మీరేనా అని అనగా అతని మాటలను విని ఆ ముని ఇట్లా సమాధానము చెప్పాడు (87) నేను సయుగ్వుణ్ణి, రైక్వుణ్ణి కూడా అని అనగా ఆ ముని మాటలను విని, అనేకమైన గుర్తులను బట్టి కూడా గ్రహించి (88) కుటుంబ పోషణ కొరకు ఈతనికి ధనేచ్చ కలదని గ్రహించి గంధమాదనం నుండి తిరిగివచ్చి అంతారాజుగారికి చెప్పాడు (89) సారధి మాటలను జానశ్రుతి ఆదరంతో విని ఆరునూర్ల గోవులను నిష్కభారము ధనము (90) అశ్వతరితో కూడిన రథమును తీసుకొని వేగంగా పౌత్రాయణ రాజర్షి ఆ రైక్వుని గూర్చి బయలు దేరాడు (91) వెళ్ళి ఆ రైక్వునితో రాజు ఇట్లా అన్నాడు - భగవాన్‌ రైక్వ! సంయుగ్వ! నేనిచ్చేదాన్ని స్వీకరించు (92) గోవులు షట్‌ శతము, నిష్కభారము (108మాడలు) ధనము కంచరగాడితో కూడిన రథము నావాటిని స్వీకరించు (93) వీటన్నిటిని స్వీకరించి ఓ బ్రహ్మనన్ను అనుశాసించు. నాకు అద్వైత బ్రహ్మవిజ్ఞానాన్ని ఉపదేశించు (94) అనే ఆతని మాటలను విని స్పృహ కలవాడై తొట్రుపడుతూ, సయుగ్వుడు రైక్వుడు అరిందముడైన జానశ్రుతితో ఇట్లా అన్నాడు (95) రైక్వోక్తి - ఈ ఆవులు నిష్కభారము రధమునీకే ఉండని. బహుకల్పములలో జీవించే నాకు ఈ అల్పమైన దానితో నేమి (96) కుటుంబ పోషణకు ఇది సరిపోదు. దీనికి వందరెట్లు నీవు నాకిచ్చినా (97) అది కుటుంబపోషణకు సరిపోదు ఓ రాజ! అనే రైక్వుని మాటలను విని జానశ్రుతి ఇట్లా అన్నాడు. (98) జానశ్రుతి మాటలు - నీవు ఉపదేశం చేసే బ్రహ్మ జ్ఞానమునకు ఇది మూల్యముకాదు, గోధనముకాని రథముకాని ఓ బ్రహ్మ (99) నా ఈ గోవులు మొదలగు వానిని స్వీకరించినా స్వీకరించకపోయినా ఓ బ్రహ్మ నిష్కల అద్వైత విజ్ఞానమును నాకు ఉపదేశించు. అతని మాటలను విని సయుగ్వుడు ఇట్లా అన్నాడు (100)

మూ || రైక్వ ఉవాచ-

నిర్వేదో యస్యసంసారే తథావై పుణ్యపాపయోః || 101 ||

ప్రారబ్ధయోర్వినాశశ్చసవైజ్ఞానోపదేశభాక్‌ | తపయద్యపి సంసారే నిర్వేదః సమజాయత ||102 ||

తథాపిపుణ్య పాపానాం సహినాశోవ్యజాయత | పుణ్యపాపౌషు సంఘాశ్చ పునర్జన్మనిహేతవః || 103 ||

సహిభోగం వినాతేషాం నాశోభవతి భూపతే | తన్నాశోపాయమద్యాహం తథాపి ప్రబ్రవీమితే || 104

యతో మాంశరణం ప్రాప్తః తచ్ఛృణుష్వసమాహితః | అత్రతీర్థత్రయం పుణ్యం వర్తతే భీష్టదాయకం || 105 ||

ముముక్షూణాం హి సర్వేషాం సర్వప్రారబ్ధనాశనం | ఏతద్ధియమునాతీర్థం గంగాతీర్థంత థైవచ || 106 ||

గయాతీర్థమిదం చాపి తదేషు స్నాహిమాచిరం | సర్వప్రారబ్ధనాశః స్యాత్‌ తదానైవాత్ర సంశయః || 107 ||

తతస్తే శుద్ధచిత్తస్యజ్ఞానం చైవదిశామ్యహం | ఇత్యుక్తేరైక్వమునినాహర్ష సంపుల్లలోచనః || 108 |

ససంభ్రమముపాగమ్య నస్నౌతీర్థత్రయేపిసః | తత్తీర్థస్నానమాత్రేణ శుద్ధచిత్తోభవన్పృపః || 109 ||

ఉపాతిష్ఠత రాజుసౌనయుగ్వానం గురుంపునః | సయుగ్వాసచరైక్వోపి మునీంద్రైరపి దుర్లభం || 110 ||

తజ్జానశ్రుతయేజ్ఞానం కృపయా సముపాదిశత్‌ | తేనో పదిష్ట మాత్రేతు విజ్ఞానే బ్రహ్మరూపిణి || 111 ||

అబాధితాను భవ వాన భవద్రాజసత్తమః | బ్రహ్మరూపంగతస్యాస్యప్రసాదా ద్రైక్వయోగినః || 112 ||

ఘటకుడ్యకు సూలాత్మా స ప్రపంచస్సమస్ఫురత్‌ | నిర్భిద్యసహసామాయా మభూద్ర్బహ్మైవకేవలం || 113 ||

ఇత్థంతీర్థత్రయేస్నానాత్‌ జానశ్రుతి రహోనృపః | దుర్లభం యోగి వృందైశ్చబ్రహ్మభూయత్వ మాప్తవాన్‌ || 114 ||

ఏవంవః కథితం విప్రాః తత్తీర్థత్రయ వైభవం | యస్త్వియం పఠతే ధ్యాయం తీర్థత్రితయ వైభవం || 115 ||

నిర్భిద్యాజ్ఞాన తిమిరం బ్రహ్మభూయాయ కల్పతే

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే యమునా గంగా గయాతీర్థప్రశంసాయాం జానశ్రుతి జ్ఞానావాప్తి వర్ణనం నామ షడ్వింశోధ్యాయః || 26 ||

తా || రైక్వునిమాట - సంసారమందు నిర్వేదము కల్గిన వాడు పుణ్యపాపముల యందు నిర్వేదము కలవాడు (101) ప్రారబ్ధములు నశించినవాడు జ్ఞానోపదేశమును పొందుటకు అర్హుడు, నీకు సంసారమందు నిర్వేదము కలిగినా (102) పుణ్య పాపముల నాశము కలుగలేదు. పుణ్యపాపముల సంఘములు పునర్జన్మకు కారణములు (103) అనుభవము లేకుండా వాటికి నాశముండదు. ఓ మహారాజ ! ఐనా నీకు వాటినా శోపాయమును ఈ వేళ నేను చెబుతాను (104) నన్ను శరణు వేడావు కనుక శ్రద్ధతో విను. ఇక్కడ అభీష్టములనిచ్చే పుణ్యప్రదమైన మూడు తీర్థములున్నాయి (105) మోక్షంకోరే వారందరి సర్వప్రారబ్ధములను నశింపచేసేవి. ఇవి యమునా తీర్థము, గంగా తీర్థము (106) గయాతీర్థము త్వరగా వీనిలో స్నాన మాచరించు. అప్పుడ ప్రారబ్ధమంతా నశిస్తుంది. ఇందులో అనుమానం లేదు (107) పిదప శుద్ధచిత్తుడవైన నీకు జ్ఞానాన్ని కూడా ఇస్తాను. అని రైక్వముని అనగా ఆనందంతో విప్పారిన కళ్ళు కలిగి (108) త్వరగా వచ్చి మూడు తీర్థములలో అతడు స్నానం చేశాడు. ఆ తీర్థ స్నానమాత్రం చేతనే రాజు శుద్ధచిత్తుడైనాడు (109) గురువైన సయుగ్వుని రాజు సమీపించాడు. సయుగ్వుడైన రైక్వుడు కూడా మునీంద్రులకు కూడా దుర్లభ##మైన (110) జ్ఞానమును జానశ్రుతికి దయతో ఉపదేశించాడు. అతడు బ్రహ్మ స్వరూపమైన విజ్ఞానాన్ని ఉపదేశించగానే (111) రాజు సుఖకరమైన అనుభవం కలవాడైనాడు. రైక్వయోగి అనుగ్రహంవల్ల బ్రహ్మరూపమును పొందిన ఈ రాజునకు (112) కుండ గోడకు సూలము (గరిసె) మొదలగు స్వరూపము గల ఈ ప్రపంచము స్ఫురించలేదు. మాయను ఛేదించుకొని కేవలం బ్రహ్మయే ఐనాడు (113) ఈ విధముగా మూడు తీర్థములలో స్నానం చేయటంవలన జానశ్రుతిరాజు యోగి బృందములకు దుర్లభ##మైన బ్రహ్మ భూయత్వమును పొందాడు (114) ఆ మూడు తీర్థముల వైభవాన్ని ఈ విధంగా మీకు చెప్పాను ఓ బ్రాహ్మణులార ! ఈ అధ్యాయమును చదివిన వారు మూడు తీర్థముల వైభవమును విన్నవారు (115) అజ్ఞాన తిమిరము నశించి బ్రహ్మ భూయంతో సమానమౌతారు (116) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు యమున గంగ, గయ తీర్థ ప్రశంస యందు జానశ్రుతికి జ్ఞానం రావట మనునది ఇరువది ఆరవ అధ్యాయము 26.

Sri Scanda Mahapuranamu-3    Chapters