Sri Scanda Mahapuranamu-3    Chapters   

తృతీయాధ్యాయము

ఋషయ

ఊచుః

చతుర్విం శతి తీర్థాని యాన్యుక్తానిత్వయామునే lతేషాం ప్రధాన తీర్థానాం సేతౌ పాపవినాశ##నే ll 1 ll

ఆదిమస్యతు తీర్థస్య చక్రతీర్థ మిత్రి ప్రథా l కథం సమాగతా సూత వదాస్మాకం పిపావృచ్ఛతః ll 2ll

తాll ఓ ముని ! మీరు చెప్పిన ఇరువది నాలుగు తీర్థములలో, పాపవినాశకమైన సేతువు యందలి ఆ ప్రధాన తీర్థములలో, (1) మొదట తీర్థము యొక్క పేరు చక్రతీర్థము అని . దానికా పేరు ఎట్లా వచ్చినదో మాకు చెప్పండి, అని ఋషులన్నారు.

శ్రీసూత ఉవాచ -

చతుర్వింశతి తీర్థానాం ప్రధానానాం ద్విజోత్తమాః | యదుక్తమాది మంతీర్థం సర్వలోకేషు విశ్రుతం || 3 ||

స్మరణాత్తస్యతీర్థస్య గర్భవాసోన విద్యతే | విలయం యాంతి పాపానిలక్షజన్మకృతాన్యపి || 4 ||

తస్మిం స్తీర్థేనకృత్‌ స్నానాత్‌ స్మరణాత్కీర్తనాదపి | లోకేతతోధికం తీర్థం తత్తుల్యం వాద్విజోత్తమాః || 5 ||

నవిద్యతేముని శ్రేష్ఠాః సత్యముక్తమిదం మయా | గంగా సరస్వతీ రేవా పంపాగోదావరీనదీ || 7 ||

అస్య తీర్థస్య విప్రేంద్రాః కోట్యం శేనాపి నోపమాః | ధర్మతీర్థమితి ప్రాహుః తత్తీర్థం హిపురావిదః || 8 ||

యథా సమాగతాతస్య చక్రతీర్థమితి ప్రథా | తది దానీం ప్రవక్ష్యామి శృణుధ్వం ముని పుంగవాః || 9 ||

సేతు మూలం హిత త్ప్రోక్తం తత్‌ దర్భశయనం మతం| తత్రైవ చక్రతీర్థంతు మహాపాతకమర్దనం || 10 ||

పురాహిగాల వోనామమునిః విష్ణుపరాయణః | దక్షిణాంభోనిధేస్తీరేహాలాస్యా దవిదూరతః || 11 ||

పుల్ల గ్రామ సమీపేచ తథా క్షీరసరోంతికే | ధర్మపుష్కరిణీ తీరే సోతవ్యత మహత్తవః || 12 ||

యుగానా మయుతం బ్రహ్మగృణన్వి ప్రాఃసనాతనం | దయాయుక్తోనిరాహారః సత్యవాన్విజితేంద్రియః || 13 ||

ఆత్మవత్సర్వభూతాని పశ్యన్విషయనిస్పృహః | సర్వభూత హితోదాంతః సర్వద్వంద్వ వివర్జితః || 14 ||

వర్షాణికతిచిత్‌సోయం జీర్ణపర్ణాశనో భవత్‌ | కించిత్కాలం జలాహారోవాయుభక్షః కియత్‌ సమాః || 15 ||

ఏవపంచ సహస్రాణి వర్షాణి సమహామునిః | అతప్యత త పోఘోరం దే వైరపిసుదుష్కరం || 16 ||

తతఃపంచ సహస్రాణి వర్షాణి మునిపుంగవః | నిరాహారోనిరాలోకో నిరుచ్ఛ్వాసోనిరాస్పదః || 17 ||

వర్షాస్వాసార సహనం హోమంతేషుజలేశయః | గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థోవిష్ణు ధ్యాన పరాయణః || 18 ||

జపన్నష్టాక్షరం మంత్రం ధ్యాయన్‌ హృది జనార్దనం | తతాపసుమహాతే జాగాలవో మునిపుంగవః || 19 ||

తా || శ్రీ సూతులు ఇట్లా అన్నారు - ఓ బ్రాహ్మణులారా ! ప్రధానమైన ఇరువది నాలుగు తీర్థములలో మొదట చెప్పబడ్డ తీర్థము సర్వలోకములందు ప్రసిద్ధమైంది (3) ఆ తీర్థమును స్మరించుట వలన గర్భవాసము (పునర్జన్మ) ఉండదు. లక్ష జన్మలందు చేసిన పాపములు కూడా నాశనమౌతాయి (4) ఆ తీర్థమందు ఒక్కసారి స్నానము, స్మరణము, కీర్తనము చేసిన యెడల సమస్తపాపములు నాశనమౌతాయి. ప్రపంచములో అంతకన్న గొప్ప తీర్థము, దానితో సమానమైన తీర్థము (5) మరొకటి లేదు. ఇది నిజము గంగ, సరస్వతి, రేవ, పంప, గోదావరి, (6) కాళింది, కావేరి, నర్మద, మణికర్ణిక, ఇవేకాక ఇతరములైన తీర్థములు, పుణ్యప్రదమైన నదులు ఎన్ని ఉన్నాయో అవన్నీ (7) ఈ తీర్థము యొక్క కోటి అంశతో కూడా సమము కావు. దీనిని పూర్వజ్ఞులు ధర్మతీర్థమని అన్నారు (8) దానికి చక్రతీర్థమనే పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు చెపుతాను ఓమునులారా వినండి (9) అది సేతుమూలము. దాన్ని దర్భశయనము అని అంటారు. అక్కడే పాపముల నశింపచేసే చక్రతీర్థము ఉంది (10) విష్ణు భక్తుడైన గాలవుడనే ముని, దక్షిణసముద్ర తీరంలో, హాలాస్య (ప్రాంతమునకు) మునకు దగ్గరలో (11) పుల్లగ్రామ సమీపంలో, క్షీరసరస్సుకి దగ్గరలో ధర్మపుష్కరిణి తీరంలో గొప్ప తపస్సు చేశాడు (12) పదివేలయుగాలకాలము సనాతనుడైన పరబ్రహ్మనామమును జపిస్తూ, దయగలవాడై, ఆహారం లేకుండా సత్యంమాట్లాడుతూ, ఇంద్రియముల జయించి (13) అన్ని ప్రాణులను తన ఆత్మవలె చూచుకుంటూ, విషయముల యందు నిస్పృహుడై, సర్వభూతముల ప్రాణుల హితము కోరుతూ, దాంతుడై (తపః క్లేశమును సహిస్తూ), ద్వంద్వాతీతుడై (14) కొన్ని సంవత్సరములు వాడిన ఆకులను భుజిస్తూ గడిపాడు. కొన్నాళ్ళు నీరు మాత్రమే సేవించాడు. కొన్నాళ్ళు వాయు భక్షణ మాత్రమే చేశాడు (15) ఈ రకంగా ఐదువేల సంవత్సరాలు ఆ ఋషి, దేవతలు కూడా ఆచరించలేని ఘోరమైన తపస్సును తపించాడు. (చేశారు) (16) ఆ పిదప ఐదువేల సంవత్సరాలు ఆ ఋషి ఆహారములేక, కళ్ళతో చూడకుండా (వెలుగులేక) ఉచ్ఛ్వాసమును బంధించి, నిలకడైన స్థానం లేకుండా (17) వర్షఋతువులో వర్షధారను సహిస్తూ, చలికాలంలో నీళ్ళలో ఉంటూ, ఎండాకాలంలో ఐదగ్నుల మధ్య ఉంటూ, విష్ణుమూర్తిని ధ్యానిస్తూ, (18) అష్టాక్షరమంత్రాన్ని జపిస్తూ, మనస్సులో జనార్దనుని ధ్యానిస్తూ, గాలవ మహాముని తేజస్సంపనుడై తపస్సు చేశాడు.

మూ || ఏవంత్వయుత వర్షాణి సమతీతానివైమునేః | అథతత్త పసాతుష్టః భగవాన్‌ కమలావతిః || 20 ||

ప్రత్యక్షతా మగాత్త స్యశంఖచక్రగదాధరః | వికచాంబుజ పత్రాక్షః సూర్య కోటి సమప్రభః || 21 ||

వినతానందనారూఢః ఛత్రచామర శోభితః | హారకే యూరముకుట కటకాది విభూషితః || 22 ||

విష్వక్సేన సునందాది కింకరైః పరివారితః | వీణావేణుమృదంగాది వాదకైః నారదాదిభిః || 23 ||

ఉపగీయమాన విజయః పీతాంబర విరాజితః | లక్ష్మీ విరాజితోరస్కః నీల మేఘ సమచ్ఛవిః || 24 ||

ధునానః పద్మమేకేన పాణినా మధుసూదనః | సనకాది మహాయోగి సేవితః పార్శ్వయోర్ద్వయోః || 25 ||

మందస్మితేన సకలం మోహయన్‌ భువన త్రయం | స్వభాసాభాసయన్‌ సర్వాన్‌ దిశోదశచ భూసురాః || 26 ||

కంఠలగ్నేన మణినా కౌస్తు భేన చశోభితః | సువర్ణ వేత్ర హసై#్తశ్చ సౌ విదల్లెరనేకశః | || 27 ||

అనన్య దుర్లభా చింత్య గీయమాన నిజాద్భుతం | సుభక్త సులభోదేవో లక్ష్మీకాంతో హరిః స్వయం || 28 ||

సస్య ధత్త పురస్త స్యగాలవస్య మహామునేః | ఆవిర్భూతం తదాదృష్ట్వా శ్రీవత్సాం కితవక్షసం || 29 ||

పీతాం బరధరం దేవం తుష్టిం ప్రాపమహామునిః | భక్త్యా పరమయా యుక్తః తుష్టావ జదగీశ్వరం || 30 ||

తా|| ఈ విధముగా పదివేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మహర్షి తపస్సుతో తుష్టుడైన కమలాపతి (20) ప్రత్యక్షమయ్యాడు. శంఖము, ఛక్రము, గద ధరించి వికసించిన తామరరేకువంటినేత్రములు కలవాడై, కోటిసూర్యుల కాంతితో సమానంగా వెలుగుతూ (21) గరుత్మంతుని అధిరోహించి, ఛత్రచామరములతో శోభిస్తూ, హారములు, కేయూరముల, శిరోభూషణములు, కటకములు (కడియం) మొదలగు ఆభరణములతో అలంకరింపబడి, (22) విష్వక్సేనుడు సునందుడు మొదలగు సేవకులతో చుట్టబడి, వీణ, వేణువు, మృదంగము మొదలగు వానిని వాయిస్తున్న నారదాది ఋషులతో (23) గానం చేయబడుతున్న తన విజయం గలిగినవాడై, పీతాంబరముతో వెలిగిపోతున్నవాడు, లక్ష్మిని వక్షస్థలమందు గల, నీలమేఘంతో సమానమైన శరీరకాంతిగల (24) ఒక చేతిలో పద్మమును ధరించిన మధుసూదనుడు (విష్ణువు) సనకాది మహాయోగులు రెండు ప్రక్కల సేవిస్తుండగా, (25) తన చిరునవ్వుతో ముల్లోకాలను మోహింపచేస్తూ, తన కాంతితో అన్ని దిక్కులను వెలిగింపచేస్తూ (26) కంఠంలో ఉన్న కౌస్తు భమణితో శోభిస్తూ, బంగారు బెత్తములను ధరించిన అనేకమంది అంతః పురపుకావలివారు, (27) ఇతరులకు దుర్లభ##మైన, చింతించ వీలులేని ఆతని అద్భుతములను గానంచేస్తుండగా, సుభక్తులకు సులభుడైన దేవుడైన లక్ష్మీకాంతుడైన హరి (28) మహామునియైన గాలవుని ఎదుట ప్రత్యక్షమైనాడు. శ్రీవత్స చిహ్నము ఉరస్సు యందు గలహరిని ప్రత్యక్షమైన వాణ్ణి అప్పుడు చూచి (29) పీతాంబరధరుడైన ఆ దేవుణ్ణి చూచి ఆ మహాముని సంతోషమును పొందాడు. మిక్కిలి భక్తితో కూడిన వాడై ఆ జగదీశ్వరుణ్ణి స్తుతించాడు. (30)

మూ| గాలవ ఉవాచ

నమోదేవాది దేవాయ శంఖచక్రగదాభృతే | నమోనిత్యాయ శుద్ధాయ సచ్చిదానందరూపిణ || 31 ||

నమో భక్తార్తి హంత్రే తేహవ్యకవ్య స్వరూపిణ | సమస్త్రిమూర్తయేతుభ్యం సృష్టిస్థిత్యంతకారిణ || 32 ||

నమః పరేశాయనమోవిభూమ్నే | నమోస్తులక్ష్మీపతయేవిధాcతే,

నమోస్తు సూర్యేందు విలోచనాయ | నమోవిరించ్యాద్యభివందితాయ || 33 ||

యోనామ జాత్యాదివికల్పహీనః | సమస్త దోషైరపి వర్జితో యః |

సమస్త సంసార భయా పహారిణ | తసై#్మనమోదైత్య వినాశనాయ || 34 ||

వేదాంతవేద్యాయ రమేశ్వరాయ | వైకుంఠ వాసాయ విధాతృపిత్రే

నమోనమః సత్యజనార్తి హారిణ | నారాయణాయా మిత విక్రమాయ || 35 ||

నమస్తు భ్యం భగవతే వాసుదేవాయ శార్‌ఙ్గిణ | భూయో భూయో నమస్తు భ్యం శేషపర్యం కశాయినే || 36 ||

ఇతిస్తుత్వా హరింవిప్రాః తూష్ణీమాస్తే సగాలవః | శ్రుత్వాస్తుత్తిం శ్రుతిసుఖాం హరిస్త స్యమహాత్మనః || 37 ||

అవాపపరమంతోషం శంఖచక్ర గదాధరః | అథాలింగ్యమునింశౌరిః చతుర్భిః బాహుభిః తదా || 38 ||

బభాషే ప్రీతి సంయుక్తో వరోవైవ్రియతామితి | తుష్టోస్మితపసోతే ద్యస్తో త్రేణాపిచగాలవ || 39 ||

నమస్కారేణ చప్రీతో వరదో హం తవాగతః || 391/2 ||

తా|| గాలవుడు ఇట్లా స్తుతించాడు - శంఖచక్రములను గదను ధరించిన దేవాది దేవునకు నమస్కారము. నిత్యునకు, శుద్ధనకు సచ్చిదానందరూపునకు నమస్కారము (31) భక్తుల ఆర్తిని తొలగించేనీకు, హవ్యకవ్యస్వరూపుడవైన నీకు నమస్కారము. త్రిమూర్తి స్వరూపుడవైననీకు, సృష్టి సంహార కారకుడవైన నీకు నమస్కారము. (32) పరులందరికి ప్రభువైన నీకు నమస్కారము. విశేష స్థలమందు వసించే నీకు నమస్కారము. సృష్టికర్తవైన, లక్ష్మీపతివైన నీకు నమస్కారము. సూర్యచంద్రులను నేత్రములుగా గల నీకు నమస్సులు. బ్రహ్మ మొదలగు వారితో నమస్కరింపబడే నీకు నమస్కారము (33) నామము జాతి మొదలగు వికల్పములు లేనివాడు, సమస్త దోషములు లేనివాడు, సమస్త సంసార భయమును వారించేవాడు, దైత్య నాశకుడు ఐనవానికి (నీకు) నమస్కారము(34) వేదాంతములతో తెలుసుకోదగినవాడు, రమకుఈశుడు, వైకుంఠనివాసి, విధాతకు తండ్రి, సత్య జనుల బాధను హరించేవాడు. అమిత విక్రమ సంపన్నుడు ఐన నారాయణునకు (నీకు) నమస్సులు (35) భగవంతుడైన, వాసుదేవుడైన శార్‌ఙ్గమును ధరించిన నీకు నమస్కారము ఆదిశేషుని పడక యందు పవళించే నీకు మరి మరి నమస్కారములు (36) అని విష్ణువును స్తుతించి గాలవుడు మౌనముగా నిలుచొనెను. శ్రుతి సుఖమైన ఆతనిస్తుతిని విష్ణువువిని (37) శంఖచక్రగదలను దరించిన విష్ణువు చాలా సంతోషమును పొందెను. పిదప విష్ణువు నాలుగు చేతులతోను ఆమునిని కౌగలించుకొని (38) సంతోషపడి ఇట్లా అనెను. వరముకోరుకో, అని ఓ గాలవ! నీ తపస్సుతో, నీ స్తోత్రముతో నేను ఈ వేళ చాలా సంతోషపడ్డాను (39) నీ నమస్కారముతోను సంతుష్టుడనై నీకు వరము ఇచ్చుటకై నేను వచ్చాను, అని (39 1/2)

మూ|| గాలవువాచ-

నారాయణ రమానాధపీతాంబర జగన్మయ || 40 ||

జనార్దన జగద్ధామన్‌ గోవింద నరకాంతక | త్వద్దర్శనాత్‌కృతా ర్థోస్మిసర్వ స్మాద థికస్తథా || 41 ||

త్వాంస పశ్యంత్య ధర్మిష్ఠా యత స్త్వం ధర్మపాలకః | యన్నవేత్తి భవో బ్రహ్మాయన్నవేత్తి త్రయీతథా || 42 ||

తం వేద్మి పరమాత్మానంకి మస్మాదధికం వరం | యోగినో యం నపశ్యంతియం నపశ్యంతి కర్మఠాః || 43 ||

తంపశ్యామి పరాత్మానం కి మస్మాదిధికం వరం | ఏతేన చకృతార్థో స్మి జనార్దన జగత్పతే || 44 ||

యన్నామస్మృతి మాత్రేణ మహాపాతకి నో పిచ | ముక్తిం ప్రయాంతి మునయః తం పశ్యామి జనార్దనం || 45 ||

త్వత్పాద పద్మయుగళే నిశ్చలా భక్తిరస్తుమే.

హరి రువాచ -

మయిభక్తి ర్‌ ధృఢా తేస్తునిష్కామా గాలవాధునా || 46 ||

శృణుచాప్యపరం వాక్యం ఉచ్యమానం మయామునే | మదర్థం కర్మకుర్వాణో మద్ధ్యానో మత్సరాయణః || 47 ||

ఏతత్‌ ప్రారబ్ధ దేహాంతే మత్స్వరూపమవాప్స్య సి | అస్మిన్నే వా శ్రమేవాసం కురుష్వముని పుంగవ || 48 ||

ధర్మపుష్కరిణీ చేయం పుణ్యా పాపవినాశినీ | అస్యాస్తీ రేతపః కుర్వన్‌ తపస్సిద్ధి మవాప్నుయాత్‌ || 49 ||

ధర్మః పురా సమాగత్య దక్షిణస్యోద ధేన్తటే | తపస్తే పే మహాదేవం చింతయన్మన సాతదా || 50 ||

స్నానార్థమేకం తీర్థంచ, చక్రే ధర్మో మహామునే | ధర్మపుష్కరిణీ తేన ప్రసిద్ధా తత్కృతాయతః || 51 ||

త్వయాయథా తపస్తప్త మిదానీం మునిసత్తమ | తథాతప్తం తపస్తేన ధర్మేణ హరసేవినా || 52 ||

తపసాతస్యతుష్టః సన్‌శూలపాణిర్మహేశ్వరః | ప్రాదురాసీత్‌ స్వయాదీప్త్యా దిశోదశవిభాసయన్‌ || 53 ||

అథాశ్రమ మనుప్రాప్తం మహాదేవం కృపానిధిం | ధర్మః పరమ సంతుష్టః తుష్టావ పరమేశ్వరం || 54 ||

ధర్మ ఉవాచ -

ప్రణమామి జగన్నాథ మీశానం ప్రణవాత్మకం | సమస్త దేవతా రూపమాది మధ్యాంత వర్ణితం || 55 ||

ఊర్థ్వ రేతం విరూపాక్షం విశ్వరూపం నమామ్యహం | సమస్త జగదాధారం అనన్త మజమవ్యయం || 56 ||

యమా మసంతి యోగీంద్రాః తంవందే పుష్టి వర్ధనం | నమోలోకాథి నాధాయ వంచతే పరివంచతే || 57 ||

నమోస్తు నీలకంఠాయ పశూనాం పతయేనమః | నమః కల్మషనాశాయ నమో మీఢుష్ట మాయచ || 58 ||

నమోరుద్రాయ దేవాయ కద్రుద్రాయ వ్రచేతసే | నమః పినాకహస్తాయ శూలహస్తాయతే నమః || 59 ||

నమ శ్చైతన్యరూపాయ పుష్టీనాంపతయేనమః | నమః వంచాస్యదేవాయ క్షేత్రాణాం పతయేనమః || 60 ||

ఇతిస్తుతో మహాదేవః శంకరోలోకశంకరః | ధర్మ న్యపరమాంతుష్టి ఆపన్నస్తము వాచవై || 61 ||

తా || గాలవుడు ఇట్లా అనెను. నారాయణ! రమానాథ! పీతాంబర! జగన్మయుడ! (40) జనార్దన, జగత్తు స్థానంగా కలవాడ! గోవింద, నరకుని చంపినవాడా! నీ దర్శనం వల్ల నేను కృతార్థుడనైనాను. అందరికన్న గొప్పవాడినైనాను (41) అధర్మపరులు నిన్ను చూడలేరు ఎందువల్లనంటే నీవు ధర్మాన్ని పాలించే వాడివి. శివుడు, బ్రహ్మ, వేదములు తెలుసుకోలేని (42) నిన్ను పరమాత్మను, నేను తెలుసుకున్నాను. ఇంత కన్నా వరం ఏం కావాలి. యోగులు, కర్మఠులు చూడలేని (43) పరమాత్మను నేను చూస్తున్నాను ఇంతకన్న ఇంకేం వరం కావాలి దీనితోనేను కృతార్థుణ్ణౖనాను. ఓ జనర్దాన! ఓ జగత్పతి! (44) ఎవని నామస్మరణమాత్రమున మహా పాతకులు, మునులు కూడా ముక్తిని పొందుతారో అట్టి జనార్దునుని నేను చూస్తున్నాను (45) మీ పాద పద్మములందు నాకు నిశ్చలభక్తి ఉండనీ, అని అప్పుడు విష్ణువు ఇట్లా అన్నాడు - నా మీద నీకు భక్తి దృఢంగా ఉండనీ. ఓ గాలవ ఇప్పుడు నిష్కామమైన భక్తి కల్గిన (46) నేను చెప్పే మరోమాటకూడా విను ఓమునీ! నా ధ్యానపరుడవై, నాయందే ఆసక్తి కలవాడవై నా కోసం పనులు చేస్తూ ఉంటే (47) ఈ ఆరంభ##మైన (ప్రారబ్ధం) దేహాంతమందు నా స్వరూపమును పొందుతావు. ఓ మునిశ్రేష్ఠ! ఈ ఆశ్రమంలోనేనివసించు (48) ఇది పాపములను నశింపచేసేది, పుణ్యప్రదమైనది ఇది ధర్మపుష్కరిణి. దీని తీరంలో తపస్సు చేస్తూ తపస్సిద్ధిని పొందాలి (49) పూర్వము ధర్మమువచ్చి దక్షిణ సముద్రం యొక్క ఒడ్డు యందు, మనస్సులో మహాదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేసింది. అప్పుడు (50) స్నానం కొరకు ధర్మము ఒక తీర్థాన్ని కూడా ఏర్పరచుకుంది. ధర్మము ఏర్పరచింది కనుక అది ధర్మపుష్కరిణీ అని ప్రసిద్ధమైంది. (51) ఓ ముని సత్తమ నీవు ఇప్పుడు ఎట్లా తపస్సు చేశావో అట్లాగే ధర్మము శివుణ్ణి సేవిస్తూ తపస్సు చేశాడు (52) శూలపాణియైన మహేశ్వరుడు ఆ తపస్సుతో సంతుష్టుడై తనకాంతితో పదిదిక్కులను ప్రకాశింపచేస్తూ ప్రత్యక్షమయ్యాడు (53) తన ఆశ్రమానికి వచ్చిన కృపానిధియైన పరమేశ్వరుని చూచి ధర్మము చాలా సంతోషడి (పొగిడాడు) స్తుతించాడు. (54) ధర్ముడు ఇట్లా అన్నాడు - జగన్నాధుడవైన, అందరికి ప్రభువు ఐన ప్రణవస్వరూపుడవైన నిన్ను నమస్కరిస్తున్నాను. సమస్త దేవతా రూపుడవు. ఆది మధ్యాంతములు లేని వాడవు (55) ఊర్ధ్వ రేతుడవు (బ్రహ్మచర్యము) విరూపాక్షుడవు (త్రినేత్రుడు) విశ్వరూపుడవు నీకు నమస్కారము. సమస్త జగత్తునకు ఆధార భూతుడవు, ఆనంతుడవు, పుట్టుకలేనివాడవు, నాశములేనవాడవు (56) యోగీంద్రులు ఎవనిని తెలుసుకుంటారో ఆ పుష్టివర్ధనునకు (శుభకారకుడు) నీకు నమస్కారము. లోకాధినాధునకు నమస్కారము. తేజస్వివి, మిక్కిలి తేజస్వివి నీకు నమస్కారము (57) నీలకంఠునకు నమస్కారము. పశుపతికి నమస్కారము. కల్మషములు నశింపచేయువానికి నమస్కారము. మీఢుష్టమునకు నమస్కారము. (58) రుద్రునకు దేవునకు, క ద్రుcదునకు ప్రచేతనునకు నమస్కారము (గొప్ప మనసుకల) పినాక ధనువు చేత దరించిన వానికి, శూలము హస్తమున ధరించిన వానికి నీకు నమస్కారము (59) చైతన్య రూపునకు, పుష్టులకు పతియైన వానికి నమస్కారము. ఐదు ముఖములు గల దేవునకు, క్షేత్రములకు పతియైన వానికి నమస్కారము (60) అని మహాదేవుని ధర్ముడు స్తుతించగా శంకరుడు, లోకములకు క్షేమముకూర్చువాడు ధర్మునినుండి పరమానందమును పొందినవాడై ఆతనితో ఇట్లనెను (61).

మూ || మహేశ్వర ఉవాచ-ప్రీతోస్మ్యనేన స్తోత్రేణ తవధర్మ మహామతే |

వరం మత్తో వృణీష్వత్వం మా విలంబంకు రుష్వవై || 62 ||

ఈశ్వరేణౖవ ముక్తస్తు ధర్మోదేవ మథాబ్రవీత్‌ | వాహనం తేభవిష్యామి సదాపాం పార్వతీపతే || 63 ||

అయమేవవరో మహ్యం దాతవ్యస్త్రి పురాంతక | తవోద్వహనమాత్రేణ కృతార్థోహం భవా మిభోః || 64 ||

ఇత్థం ధర్మేణ కథితో దేవో ధర్మమథా బ్రవీత్‌ |

ఈశ్వర ఉవాచ -

వాహనం భవమే ధర్మ సర్వదాలోకపూజితః || 65 ||

మమచోద్వహనే శక్తిర మోఘాతే భవిష్యతి | త్వత్‌ సేవినాం సదాభక్తిః మయిస్యాన్నాత్ర సంశయః || 66 ||

ఇత్యుక్తే శం కరేణాథ ధర్మోపి వృషరూపధృక్‌ | ఉవాహ పరమేశానం తదా ప్రభృతి గాలవ || 67 ||

మాహాదేవస్తమారుహ్య ధర్మం వైవృషరూపిణం | శోభమానోభృశంధర్మ మువాచ పరమామృతం || 68 ||

ఈశ్వర ఉవాచ -

త్వయా కృతం హియత్తీర్థం దక్షిణ స్యోదధేస్తటే | ధర్మపుష్కరిణీ త్యేషా లోకేఖ్యాతా భవిష్యతి || 69 ||

అస్యాస్తీ రేజపోహోమో దానం స్వాధ్యాయ ఏవచ | అన్యేచ ధర్మని వహాః క్రియామాణా నరైః ముదా || 70 ||

అనంత ఫలదాజ్ఞేయా నాత్రకార్యా విచారణా | ఇతిదత్వా వరంతసై#్మ ధర్మతీర్థాయ శంకరః || 71 ||

ఆరుహ్య వృషభంధర్మం కైలాసం పర్వతం య¸° | ధర్మ పుష్కరిణీ తీరే గాలవ త్వమతోధునా || 72 ||

శరీర పాత పర్యంతం తవః కుర్వన్‌ సమాహితః | వసత్వం మునిశార్దూల పశ్చాన్మా మాప్స్యసేధ్రువం || 73 ||

యదాతేజాయతే భీతిః తదాతాం నా శయామ్యహం | మయాయుథేన చక్రేణ ప్రేరితేన మయాక్షణాత్‌ || 74 ||

ఇత్యుక్త్వా భగవాన్విష్ణుః తత్రైవాం తరధీయత |

శ్రీ సూత ఉవాచ - తస్మిన్నంతర్హితే విష్ణౌగాలవోముని పుంగవః

తా|| మహేశ్వరుడు ఇట్లనెను - ఓధర్మ! మహామతి, ఈ నీస్తోత్రంతో సంతోషపడ్డాను. నా నుండి వరం కోరుకో, ఆలస్యం చేయకు (62) అని ఈశ్వరుడనగానే ధర్ముడు ఈశ్వరునితో ఇట్లనెను. ఓ పార్వతీపతి ! ఎల్లప్పుడు నేను నీకు వాహనమౌతాను (63) ఓ త్రిపురాంతక! ఈ వరాన్నే నాకు ఇవ్వాలి. నిన్ను మోయటంతోనే నేను కృతార్థుణ్ణౌతాను. (64) ఈరకంగా ధర్ముడనగానే ఈశుడు ధర్మునితో ఇట్లనెను. ఈశ్వరుని మాట - ఎల్లప్పుడు లోకములతో పూజింపబడుతూ ఓథర్ముడ! నాకు వాహనంకా (65) నన్నుమోయటంలో నీకు శక్తి అమోఘంగా ఉంటుంది. నిన్ను సేవించే వారికి ఎల్లప్పుడూ నాయందు భక్తి ఉంటుంది. అనుమానం లేదు. (66) శంకరుడు ఇట్లా చెప్పిన పిదప ధర్ముడు కూడ వృషభరూపమును ధరించి అప్పటి నుండి పరమేశ్వరుని మోస్తున్నాడు. ఓ గాలవ (67) మహాదేవుడు ఆ వృషభరూపుడైన ధర్మునెక్కి, మిక్కిలి శోభిస్తూ పరమ అమృతమైన ధర్మమును పలికెను (68) ఈశ్వరుడిట్లనెను - నీవు దక్షిణ సముద్రతటమందు నీవు ఏర్పరచిన తీర్థమేదైతే ఉన్నదో అది ధర్మపుష్కరిణీ అని లోకంలో ఖ్యాతిని పొందుతుంది (69) దీని తీరమందు జపము హోమము దానము స్వాధ్యాయము, ఇతరములైన ధర్మకార్యములు నరులు చేసిన (70) అనంత ఫలమును ఇస్తాయి అని తెలుసుకో. ఇక్కడ సంశయించాల్సిందిలేదు. అని ధర్మతీర్థమునకు వరమిచ్చి శంకరుడు (71) ధర్మ వృషభము నెక్కి కైలాస పర్వతమునకు వెళ్ళెను. ఓ గాలవ! నీకు ఇప్పుడు ధర్మపుష్కరిణీ తీరంలో (72) మరణించేవరకు శ్రద్ధతో తప్పస్సు చేస్తూ ఉండు. తర్వాత నన్ను తప్పకుండా పొందుతావు (73) నీకు భయం కల్గినప్పుడు నేను దాన్ని నాశనం చేస్తాను. క్షణంలో, నేను ప్రేరేపించిన, నా చక్రాయుధంతో భయం నశింపచేస్తాను (74) అని చెప్పి భగవంతుడైన విష్ణువు అక్కడే అదృశ్యమయ్యాడు. సూతుడిట్లనెను - విష్ణువు అంతర్హితుడైనా క గాలవముని (75).

మూ|| ధర్మపుష్కరిణీ తీరే విష్ణు ధ్యాన పరాయణః | త్రికాలమర్చయన్విష్ణుం శాలగ్రామే విముక్తిదే || 76 ||

ఉవా సమతిమాన్‌ ధీరో విరక్తో విజితేంద్రియః | కదాచిన్మా ఘమాసేతు శుక్లపక్షే హారేర్దినే || 77 ||

ఉషోష్య జాగరం కృత్వారాత్రౌ విష్ణు మపూజయత్‌ | స్నాత్వాపరేద్యుః ద్వాదశ్యాం ధర్మపుష్కరిణీ జలే || 78 ||

సంధ్యా వందన పూర్వాణి నిత్యకర్మాణి చాకరోత్‌ | తతః పూజాం విధా తుంసహరేః సముపచక్రమే || 79 ||

తులస్యాదీని పుష్పాణి సమాహృత్యచ గాలవః | విధాయపూజాం కృష్ణస్య స్తోత్రమేత దుదైరయత్‌ || 80 ||

గాలవ ఉవాచ -

సహస్రశిరసంవిష్ణుం మత్స్య రూపధరం హరిం | నమస్యామి హృషీకేశం కూర్మవారాహరూపిణం || 81 ||

నారసింహంవామనాఖ్యం జామదగ్న్యంచ రాఘవం | బలభద్రంచ కృష్ణంచ కల్కిం విష్ణుంనమామ్యహం || 82 ||

వాసుదేవ మనాధారం ప్రణతార్తి వినాశనం | ఆధారం సర్వభూతానాం ప్రణమామి జనార్దనం || 83 ||

సర్వజ్ఞం సర్వకర్తారం సచ్చిదానంద విగ్రహం | అప్రతర్క్య మనిర్దేశ్యం ప్రణతోస్మి జనార్దనం || 84 ||

ఏ వంస్తువన్‌ మహాయోగీ గాలవో మునిపుంగవః | ధర్మపుష్కరిణీ తరే తస్థౌధ్యాన పరాయణః || 85 ||

ఏతస్మిన్నంతరేకశ్చిత్‌ రాక్షసోగాలవం మునిం | ఆయ¸° భక్షితుంఘోరః క్షుథయాపీడితో భృశం || 86 ||

గాలవం తరసాసో యంరాక్షసోజగృహెతదా | గృహీతస్తరసాతేన గాలవోనైఋతేనసః || 87 ||

ప్రచుక్రోశదయాంభోధిం ఆపన్నానాం పరాయణం | నారయణిం చక్రపాణిం రక్షరక్షేతివై ముహుః || 88 ||

పరేశవరమానంద శరణాగత పాలక| త్రాహిమాంకరుణా సింధో రక్షోవశముపాగతం || 89 ||

లక్ష్మీకాంతహరేవిష్ణో వైకుంఠ గరుడధ్వజ | మాంరక్ష రక్షసాక్రాంతం గ్రాహాక్రాంతం గజంయథా || 90 ||

దామోదర జగన్నాథ హిరణాసురమర్దన | ప్రహ్లాద మివమాం రక్ష రక్ష సేనాతి పీడితం || 91 ||

ఇత్యేవంస్తువతః తస్యగాలవస్య ద్విజోత్తమాః | స్వభక్త స్యభయం జ్ఞాత్వా చక్రపాణిః వృషాకపిః || 92 ||

స్వచక్రం ప్రేషయామాన భక్త రక్షణ కారణాత్‌ | ప్రేరితం విష్ణు చక్రంతత్‌ విష్ణునా ప్రభవిష్ణునా || 93 ||

ఆజగామాథ వేగేన ధర్మపుష్కరిణీతటం | అనంతాదిత్య సంకాశం అనంతాగ్ని సమప్రభం || 94 ||

మహాజ్వాల మహానాదం మహాసురవిమర్దనం | దృష్ట్యా సుదర్శనం విష్ణోరాక్షసోzథ ప్రదుద్రువే || 95 ||

ద్రవ మాణస్యతస్యాశు రాక్షసస్య సుదర్శనం | శిరశ్చకర్త సహసా జ్వాలా మాలా దురాసదం || 96 ||

తతస్తు గాలవోదృష్ట్వా రాక్షసంపతితంభువి | ముదాపరమయాయుక్తః తుష్టావచ సుదర్శనం || 97 ||

తా || ధర్మపుష్కరిణీ తీరమందు విష్ణు ధ్యాన పరాయణుడై ముక్తినిచ్చే శాల గ్రామమందు విష్ణువును మూడు కాలములందు పూజిస్తూ (76) విరక్తుడై, ఇంద్రియములను జయించినవాడై, ధీరుడైన, బుద్ధిమంతుడైన గాలవుడు నివసించెను. ఒకసారి మాఘమాసం శుక్లపక్షం హరివాసరమందు (77) ఉపవసించి, జాగరణచేసి రాత్రి యందు విష్ణువును పూజించెను. తర్వాతి రోజు ధర్మపుష్కరిణీజల మందు ద్వాదశిన స్నానం చేసి (78) సంధ్యావందన పూర్వకమైన నిత్యకర్మలను కూడా ఆచరించాడు. ఆ పిదప విష్ణు పూజను ఆచరించుటకు ఆరంభించాడు (79) ఆగాలవుడు తులసి మొదలగు పుష్పములను తీసుకొని వచ్చి విష్ణుపూజ చేసి ఈ స్తోత్రమును పఠించెను (80) గాలవుని వాక్కులు - సహస్త్ర శిరస్సులు గల విష్ణువును, మత్స్య రూపధారియైన హృషీకేశుని నమస్కరిస్తున్నాను (81) నారసింహుని, వామనుని, పరుశురాముని, రాముని, బలరాముని, కృష్ణుని, కల్కిని విష్ణువును నేను నమస్కరిస్తున్నాను (82) వాసుదేవుని, ఆధారము అవసరంలేని వానిని, ప్రణుతులైన వారి బాధలను తొలగించే వానిని సర్వభూతములకు ఆధారభూతమైన వానిని ఐన జనార్దనుని నమస్కరిస్తున్నాను. (83) సర్వజ్ఞుని, అన్నింటికి కర్తైన వానిని, సత్‌చిత్‌ ఆనందస్వరూపుని, ఊహించవీలుకాని వానిని, నిర్దేశించవీలుకాని వానిని, జనార్దనుని నమస్కరిస్తున్నాను. (84) ఈరకముగా మహాయోగి, మునిశ్రేష్ఠుడైన గాలవుడుస్తుతిస్తూ, ధ్యాన పరాయణుడై దనుః పుష్కరిణీ తీరమందుండెను (85) ఇంతలో ఒక ఘోరమైన రాక్షసుడు గాలవమునిని భక్షించుటకు మిక్కిలి ఆకలిగొన్నవాడై వచ్చెను (86) ఆ రాక్షసుడు గాలవుని వేగంగా పట్టుకొనెను. ఆ రాక్షసుడు వేగంగా పట్టుకోగానే, ఆ గాలవుడు (87) దయాసముద్రుడు, ఆ పన్నులయందు ఆసక్తి కలవాడు, చక్రపాణి, ఐన నారాయణుని రక్షించు రక్షించు అని ప్రార్థించాడు. (88) పరేశ! పరమానంద స్వరూప! శరణాగతుల రక్షించేవాడా! దయా సముద్ర! రాక్షసాధీనుడనైన నన్ను రక్షించు (89) లక్ష్మీకాంత! హరి! విష్ణు! వైకుంఠవాస! ధ్వజమందు గరుత్మంతుని గలవాడా! స్వామి, రాక్షసునిచే ఆక్రమించబడ్డనన్ను మొసలిచే ఆక్రమించబడ్డ గజమును రక్షించినట్లు రక్షించు. (90) దామోదర! జగన్నాథ! హిరణ్యాసురుని శిక్షించినవాడా! రాక్షసునిచే బాగా పీడింపబడ్డనన్ను ప్రహ్లాదుని రక్షించినట్లు రక్షించు (91) ఈ రకంగా స్తుతిస్తున్న తన భక్తుడైన ఆ గాలవుని యొక్క భయమును తెలుసుకొని వృషాకపి! చక్రపాణి (92) భక్తుని రక్షించేకొరకు తన చక్రమును పంపించెను. ప్రభవిష్ణువైన విష్ణువుతో పంపబడ్డ ఆ విష్ణుచక్రము (93) ధర్మపుష్కరిణీ తీరమునకు వేగంగా వచ్చింది. ఆ చక్రము ఆనంతములైన సూర్యులతో సమానకాంతిగలది. అనంతములైన అగ్నులతో సమమైంది (94) గొప్ప జ్వాల, గొప్పశబ్దము గలది, రాక్షసుని సంహరించగలది. విష్ణువు యొక్క సుదర్శనమును చూచి రాక్షసుడు పరుగెత్తెను (95) వేగంగా పరుగెత్తుచున్న ఆ రాక్షసుని యొక్క శిరమును ఆ సుదర్శనము ఖండించెను. జ్వాలా పరంపరతో ఆ చక్రము దరిచేరవీలులేనట్టిది (96) భూమి యందు పడిన ఆ రాక్షసుని గాలవుడు చూచి చాలా సంతోషపడినవాడై సుదర్శనమును స్తుతించెను (97).

మూ|| గాలవ ఉవాచ -

విష్ణుచక్ర నమస్తేస్తు విశ్వరక్షణదీక్షిత | నారాయణకరాం భోజ భూషణాయనమోస్తుతే || 98 ||

యుద్దేష్వసురసంహారకుశలాయ మహారవ | సుదర్శననమస్తుభ్యం భక్తానాం ఆర్తినాశినే || 99 ||

రక్షమాం భయసంవిగ్నం సర్వస్మాదపికల్మషాత్‌ | స్వామిన్‌ సుదర్శనవిభోధర్మతీర్దేనదాభవాన్‌ || 100 ||

సంనిధేహి హితాయత్వం జగతోముక్తి కాంక్షిణః | గాలవేనైవ ముక్తంతత్‌ విష్ణుచక్రం మునీశ్వరాః || 101 ||

తంప్రాహగాలవ మునిం ప్రీణయన్ని వసౌ హృదాత్‌ |

సుదర్శన ఉవాచ -

గాలవై తన్మహాపుణ్యం ధర్మతీర్థమనుత్తమం || 102 ||

అస్మిన్‌వసా మిసతతంలోకానాం హితకామ్యయా | త్వత్పీడాం పరిచింత్యాహం రాక్షసేన దురాత్మనా || 103 ||

ప్రేరితో విష్ణునా విప్ర త్వరయానము పాగతః | త్వత్పీడకోథనిహతో మయాయం రాక్షసాధమః || 104 ||

మోచితస్త్వం భయాదస్మాత్‌ త్వంహిభక్తో హరేః సదా|పుష్కరిణ్యాం అహంత్వస్యాం ధర్మస్యముని పుంగవ || 105 ||

సతతంలోకరక్షార్థం సన్నిధానం కరోమివై | అస్యాం మత్సన్నిధానాత్తే తథాన్యేషా మపిద్విజ || 106 ||

ఇతఃపరంన పీడాస్యాత్‌ భూతరాక్షస సంభవా | ధర్మ పుష్కరిణీ హ్యెషా సర్వపాప వినాశినీ || 107 ||

దేవీ పట్టణ పర్యంతాకృతా ధర్మేణ వైపురా | అత్ర సర్వత్ర వత్స్యామి సర్వదాముని పుంగవ || 108 ||

అస్యమత్సన్ని ధానాత్‌ స్యాత్‌ చక్రతీర్థమితి ప్రథా | స్నానం యేత్ర ప్రకుర్వంతి చక్రతీర్థే విముక్తి దే || 109 ||

తేషాం పుత్రాశ్చపౌత్రాశ్చ వంశజాః సర్వ ఏవహి | విధూత పాపాయాస్యంతి తద్విష్ణోః పరమం పదం || 110 ||

పితౄనుద్దిశ్యపిండానాం దాతారోయేzత్రగాలవ | స్వర్గం ప్రయాంతితే సర్వే పితరశ్చాపితర్పితాః || 111 ||

ఇత్యుక్త్వా విష్ణు చక్రంతత్‌ గాలవ స్యాపి పశ్యతః | అన్యేషామపి విప్రాణాం పశ్యతాం సహసాద్విజాః || 112 ||

ధర్మ పుష్కరిణీం తాంతు ప్రావిశత్‌ పాపనాశినీం

శ్రీసూత ఉవాచ -

ధర్మతీర్థస్యవిప్రేంద్రాః చక్రతీర్థమితి ప్రథా || 113 ||

ప్రాప్తాయథా తత్కధి తం యుష్మాకం హి మయాముదా | చక్రతీర్థ సమం తీర్థంన భూతం నభవిష్యతి || 114 ||

అత్రస్నాతానరావిప్రాః మోక్షభాజోన సంశయః | కీర్త యేదిమమధ్యాయం శ్రుణుయాద్వాసమాహితః || 115 ||

చక్రతీర్థాభిషేకస్య ప్రాప్నోతి ఫలముత్తమం | ఇహలోకే సుఖం ప్రాప్య పరత్రాపిసుఖం లభేత్‌ || 116 ||

యోధర్మ తీర్థంచ తథైవగాలవం | కుర్వాణ మత్యుగ్ర సమాధి యోగం |

సుదర్శనం రాక్షస నాశనంచ | స్మరేత్‌ సకృద్వాన సపాపభాక్‌ జనః | || 117 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే గాలవాఖ్యానే ధర్మతీర్థస్య చక్రతీర్థప్రథా వర్ణనం నామ తృతీయోzధ్యాయః.

తా || గాలవుడు ఇట్లా అనెను - ఓ విష్ణు చక్రమ నీకు నమస్కారము. ప్రపంచమును రక్షించుటకు దీక్షవహించిన దాన నారాయణుని కరకమలములకు భూషణమైన నీకు నమస్కారము (98) గొప్ప శబ్దం కలదానా! యుద్ధములందు రాక్షస సంభారమందు సమర్థమైన దాన! భక్తుల ఆర్తిని నశింపచేసే ఓ సుదర్శనమా! నీకు నమస్కారము (99) భయముతో కూడిననన్ను అన్ని పాపముల నుండి రక్షించు. ఓ సుదర్శనవిభు! ఈ ధర్మ తీర్థ మందు ఎల్లప్పుడూ నీవు (100) ముక్తిని కోరే లోకముల క్షేమం కొరకు ఉంటాడు. గాలవుడు ఇట్లా అనగా ఆ సుదర్శనము అతన్ని సంతోషపరుస్తున్నట్లుగా ప్రేమతో అతనితో ఇట్లనెను (101) సుదర్శనము ఇట్లా అనెను. ఓ గాలవ! ఇది పుణ్యకరమైన, అత్యుత్తమమైన ధర్మతీర్థమిది. (102) లోకములక్షేమము కొరకు ఎల్లప్పుడూ ఇందులో ఉంటాను దుర్భుద్ధి గల రాక్షసులు నిన్ను పీడించటం చూశాక నేను ఉండదలిచాను (103) విష్ణువుచే పంపబడి తొందరగా వచ్చాను. నేను ఈ రాక్షసాధముణ్ణి నిన్ను పీడించేవాణ్ణి చంపాను (104) ఈ భయంనుండి నీవు ముక్తుడవైనావు. నీవు సర్వదాహరి భక్తుడవు. ఓ మునిశ్రేష్ఠ! ధర్ముని యొక్క ఈ పుష్కరిణి యందు నేను (105) ఎల్లప్పుడూ లోక రక్ష కొరకు నివసిస్తాను. ఇందులో నేను ఉండటంవల్లనీకు, ఇతరులకు కూడా (106) ఇక ముందు భూతములు, రాక్షసులనుండి సంభవించే పీడ ఉండదు. ఈ ధర్మపుష్కరిణి అన్ని పాపములను నశింపచేసేది (107) ధర్ముడు దేవీపట్టణ పర్యంతము దీన్ని చేశాడు. ఇక్కడ అంతటా ఎల్లప్పుడూ ఉంటాను. (108) ఇందు నేను ఉండటం వల్ల దీనికి చక్రతీర్థమని ప్రసిద్ధి వస్తుంది. ముక్తినిచ్చే చక్రతీర్థమందు స్నానం చేసినవారు (109) వారి పుత్రులు, వారి పౌత్రులు, వారి వంశజులందరు పాపములను పోగొట్టుకున్నవారై విష్ణువు యొక్క పరమ పదమును చేరుకుంటారు (110) ఇక్కడ పితరులనుద్దేశించి పిండము నిచ్చిన వారు అందరు స్వర్గానికి వెళ్ళుతారు. పితరులు కూడా తర్పితులై స్వర్గమునకు వెళ్తారు (111) ఈ విధముగా ఆ విష్ణు చక్రము చెప్పి గాలవుడు చూస్తుండగానే, మిగిలిన వారందరు చూస్తుండగా (112) ఆ పాపనాశినియైన ధర్మపుష్కరిణి యందు ప్రవేశించెను. శ్రీసూతులు ఇట్లనిరిధర్మతీర్థమునకు చక్రతీర్థమనే ప్రసిద్ధి (113) ఎట్లా వచ్చిందో అదంతా మీకు నేను సంతోషంతో చెప్పాను. చక్రతీర్థము వంటి తీర్థము ఇదివరలోలేదు. భవిష్యత్తులో కలగబోదు (114) ఇక్కడ స్నానము చేసిన నరులు బ్రాహ్మణులు ముక్తినందుతారు. అనుమానంలేదు. ఈ అధ్యాయమును చదివినా, ఏకాగ్రతతో విన్నాను (116) చక్రతీర్థ అభిషేకము వల్ల కలిగే ఉత్తమ ఫలమును పొందుతారు ఈ లోకంలో సుఖం పొంది పరమందు సుఖం పొందుతారు (116) ధర్మతీర్థమును, మిక్కిలి కఠోరమైన సమాధిని పొందేగాలవమునిని, రాక్షసనాశకమైన సుదర్శనమును ఒక్కసారైనా స్మరించినవారు పాపభాజనులు కారు. అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది యొక్కవేల సంహితమందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు గాలవ చరితమందు ధర్మతీర్థమునకు చక్రతీర్థమను ప్రసిద్ధి వచ్చిన విధమును వర్ణించుటయనునది తృతీయోzధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters