Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఒకటవ అధ్యాయము

మూ|| ఋషయ ఊచుః -

అశ్వత్థామా కధం సూత సుప్తమారణ మాచరత్‌ | కథంచ ముక్తస్తత్పా పాత్‌ ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ || 1 ||

ఏతన్నః శ్రద్ధ ధానానాం బ్రూహి పౌరాణి కోత్తమ | తృప్తి ర్నజాయతే7స్మాకంత్వ ద్వచోమృత పాయినాం || 2 ||

ఇతిపృష్టః తదాసూతో నైమిశారణ్య వాసిభిః | వక్తుం ప్రచక్రమే తత్రవ్యాసం సత్వాగురుం ముదా || 3 ||

శ్రీ సూత ఉవాచ -

రాజ్యార్థం కలహేజాతే పాండవానాం పురాద్విజాః ధార్త రాష్ట్రెః మహాయుద్ధే మహదక్షౌహిణీయుతే || 4 ||

యుద్ధం దశదినం కృత్వాభీష్మే శాంత సవేహతే | ద్రోణపంచ దినం కృత్వాకర్ణేచ ద్విదినంతథా || 5 ||

తధైవైక దినం యుద్ధ్వా శ##ల్యేచనిధనంగతే | అష్టాదశ దినే తత్రరణ దుర్యోధనే ద్విజాః || 6 ||

భగ్నోరౌభీమగదయా పతితే రాజసత్తమే | సర్వేనృపతయో విప్రాని వేశాయ కృతత్వరాః || 7 ||

యేజివితాస్తురాజానః తేయయుః హృష్టమానసాః ధృష్టద్యుమ్న శిఖం డ్యాద్యాః సృంజయాఃసర్వఏవహి || 8 ||

అన్యేచాపి మహీపాలా జగ్ముః స్వశిబిరాణ్యథ | అథపార్ధా మహావీరా కృష్ణ సాత్యకి సంయుతాః || 9 ||

దుర్యోధనస్య శిబిరం ప్రావిశన్నిర్జనం ద్విజాః | వృద్ధైరమాత్యైః తత్రస్థేః షండైః స్త్రీరక్షకైస్తథా || 10 ||

కృతాంజలి పుటైః ప్రహ్వైః కాషాయమలినాంబరైః | ప్రణమ్యమానాస్తే పార్థాః కురురాజస్య వేశ్మని || 11 ||

తత్రత్య ద్రవ్యజాతాని సమాదాయమహాబలాః | సుయోధన న్యశిబిరే న్యవసంతనుఖేనతే || 12 ||

అథతానబ్రవీత్‌ పార్ధాన్‌ శ్రీ కృష్ణః ప్రీణయన్నివ | మంగలార్ధాయ చాస్మాభిః వస్తవ్యం శిబిరాద్బహిః || 13 ||

ఇత్యుక్తా వాసుదేవేన తథేత్యుక్త్వాథ పాండవాః | కృష్ణసాత్య కి సంయుక్తాః ప్రయయుః శిబిరాద్బహిః || 14 ||

వాసుదేవేన సహితా మంగలార్థం హిపాండవాః | ఓఘవత్యాః నమాసాద్యతీరం సద్యాన రోత్తమాః || 15 ||

ఊషు స్తాంరజనీం తత్రహత శత్రుగుణాః సుఖం | కృతవర్మా కృపోద్రోణిః తథాదుర్యోధనాంతికం || 16 ||

ఆదిత్యాస్తమయా త్పూర్వం అపరాహ్ణేసమాయయుః || 16 1/2 ||

తా || ఋషులిట్లనిరి - ఓ సూత ! అశ్వత్థామ నిద్రించిన వారిని చంపటం ఎట్లా చేశాడు. ధనుష్కోటిలో స్నానం చేసి ఆ పాపం నుండి ఎట్లా ముక్తుడైనాడు (1) ఓ పౌరాణికోత్తమ శ్రద్ధకలిగిన మాకు ఈ విషయాన్ని చెప్పండి. మీ వాగమృతాన్ని తాగే మాకు తృప్తి కలగటం లేదు (2) అనినైమి శారణ్యవాసులు అడుగగా సూతుడు సంతోషంతో గురువైన వ్యాసునకు నమస్కరించి ఇట్లా చెప్పటమారంభించాడు (3) శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులార ! పూర్వం రాజ్యము కొరకు పాండవులకు కలహము జరుగగా, మహత్‌ అక్షౌహిణితో కూడిన యుద్ధమందు ధర్తారాష్ట్రులతో (4) పదిరోజులు శాంతనపుడైన భీష్ముడు యుద్ధంచేసి హతుడుకాగ, ద్రోణుడు ఐదురోజులు, కర్ణుడు రెండురోజులుచేసిపోగా (5) ఒకరోజు యుద్ధంచేసిశల్యుడుమరణించగా పదునెనిమిదివరోజు యుద్ధమందు దుర్యోధనుడు (6) రాజసత్తముడు భీమునిగదతో తొడలువిరిగిపడిపోగా రాజులందరుతమతమసెలవులకు వెళ్ళటానికిత్వరపడగా (7) జీవించిఉన్నరాజులందరు సంతుష్ట మానసులైవెళ్ళారు. ధృష్టద్యుమ్నుడు శిఖండి మొదలగువారు సృంజయులందరు (8) ఇతర రాజులందరు తమతమ శిబిరములకువెళ్ళారు. మహావీరులైనవృధాకుమారులు కృష్ణసాత్యకులతోకూడి (9) నిర్జనమైన దుర్యోధనునిశిబిరాన్ని ప్రవేశించారు. వృద్ధులైన అమాత్యులు, అక్కడున్న షండులు, స్త్రీరక్షకులు, (10) చేతులుజోడించి, నమ్రులై,కాషాయమలి నాంబరములుగలిగి నమస్కరించగా ఆపార్థులుకురురాజునివాసమున (11) అక్కడున్నవస్తుసముదాయమును తీసికొని మహాబలులైనవారు దుర్యోధనుని శిబిరంలో సుఖంగా ఉన్నారు. (12) అప్పుడువారితో పార్థులతో శ్రీకృష్ణుడు సంతోషపెడుతున్నట్లుగా ఇట్లాఅన్నాడు.మంగళముకొరకు మనముశిబిరానికి బయట ఉందాము. (13) అనికృష్ణుడనగా అట్లాగేకానిమ్మని పాండవులు, కృష్ణసాత్యకులతోకూడి శిబిరానికి బయటవెళ్ళారు. (14) కృష్ణునితోకూడి మంగళార్థమైపాండవులు,నరోత్తములు ఓఘవతినదీతీరంచేరి (15) చచ్చినశత్రువులుగల వారు ఆరాత్రిఅక్కడ సుఖంగావసించారు. కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ వీరుదుర్యోధునునిసమీపమునకు (16) సూర్యాస్తమయముకన్నముందే అపరాహ్ణమునకేవచ్చారు - 16 1/2

మూ || సుయోధనంతదాదృష్ట్వారణపాంసుషురూషితం || 17 ||

భగ్నోరుదండంగదయాభీమసేనన్యభీమయా | రుధిరాసిక్తసర్వాంగంచేష్టమానంమహీతలే || 18 || అశోచంతతదాతత్రద్రోణపుత్రాదయన్త్రయః | శుశోచసోపితాన్‌దృష్ట్వారణదుర్యోధనోనృపః || 19 ||

దృష్ట్వాతదాతురాజానంబాష్పవ్యాకులలోచనం | అశ్వత్థామాతదాకోపాత్‌జ్వలన్నివమహానలః || 20 ||

పాణౌపాణింవినిష్పిష్యక్రోధవిస్ఫారితేక్షణః | అశ్రువిక్లవయావాచాదుర్యోధనమభాషత || 21 ||

పితామేపాతితఃక్షుద్రైఃఛలేనైవరణాజిరే | నతధాతేనశోచామియధానిష్పాతితేత్వయి || 22 ||

శృణువాక్యంమమాద్యత్వంయధార్థంవదతోనృప | సుకృతేనశ##పేచాహంసుయోధనమహామతే || 23 ||

అద్యరాత్రౌహనిష్యామిపాండవాన్‌సహసృంజయైః | వశ్యతోవాసుదేవస్యత్వమనుజ్ఞాంప్రయచ్ఛమే || 24 ||

తస్యతద్వచనంశ్రుత్వాద్రౌణింరాజాతదాబ్రవీత్‌ | తథాస్త్వితిపునఃప్రాహకృపరాజాద్విజోత్తమా || 25 ||

ఆచార్యైసంద్రోణపుత్రంకలశోత్థేనవారిణా | సైనాపత్యేభిషించస్వేత్యధసోపితధాకరోత్‌ || 26 ||

సోభిషిక్తన్తదాద్రౌణిఃపరిష్వజ్యసృపోత్తమం | కృతవర్మకృపాభ్యాంచసహితస్త్వరితంయ¸° || 27 ||

తతస్తేతుత్రయోవీరాఃప్రయాతాదక్షిణోన్ముఖాః | ఆదిత్యాస్తమయాత్పూర్వంశిబిరాంతికమానత || 28 ||

పార్థానాంభీషణంశబ్దంశ్రుత్వాతత్రజయైషిణః | పాండవానుద్రుతాభీతాఃతదాద్రౌణ్యాదయన్త్రయః || 29 ||

ప్రాఙ్‌ముఖాదుద్రుపర్ఫీత్యాకియద్దూరంశ్రమాతురాః | ముహుర్తంతేతతోగత్వాక్రోధామర్షవశానుగాః || 30 ||

దుర్యోధనవధార్తాస్తేక్షణంతత్రావతస్థిరే | తతోవశ్యస్నరణ్యంవైనానాతరులతావృతం || 31 ||

అనేకమృగసంబాధంక్రూరపక్షిగణాకులం | సమృద్‌ధజలసంపూర్ణతటాకపరిశోభితం || 32 ||

పద్మేందీవరకల్హారసరసీశతవంకులం | తత్రపీత్వాజలంతేతుపాయయిత్వాహయాంస్తధా || 33 ||

అనేకశాఖానంబాధన్యగ్రోధందదృశుస్తతః || 33 1/2 ||

తా || యుద్ధధూళియందుకప్పబడిన దుర్యోధనునిచూచి (17) భీమసేనునిభయంకరమైనగదతోవిరిగిన తోడలుగల, రక్తంతోతడిసిన సర్వావయవములు కలిగి భూమియందు పడియున్న (18) వానినిచూచి ద్రోణపుత్రుడు మొదలగు ముగ్గురు అక్కడ అప్పుడు ఏడ్చారు. ఆ ధుర్యోధనుడుకూడా యుద్ధంలో వారినిచూచిఏడ్చాడు. (19) కన్నీళ్ళతోనిండినకళ్ళుగల రాజునిచూచి అప్పుడుఅశ్వత్థామ కోపంతో,మండుతున్నఅగ్నిలా (20) చేతితో చేతిని పిసుకుతూ కోపంతో విప్పారిన కళ్ళు గల్గి, కన్నీళ్ళతో దీనమైన మాటలు గలిగి ఇట్లా దుర్యోధనునితో అన్నాడు (21) ఈ క్షుద్రులు యుద్ధరంగమందు మోసంతోనే నాతండ్రిని పడవేశారు. నిన్ను పడవేయగా నేనెంత బాధపడుతున్నానో దానితో నేనంత బాధపడటం లేదు (22) నిజం చెబుతున్న నా మాటను ఈ వేళ నీవు విను ఓరాజ ! సుయోధన ! మహామతి ! సుకృతంతో నేను శపిస్తున్నాను కూడా (23) ఈ రాత్రి పాండవులను సృంజయులతో కూడ చంపేస్తాను. వాసుదేవుడు చూస్తుండగా చేస్తాను. నీవు అనుజ్ఞ ఇవ్వు (24) అతని ఆ మాటలను విని అశ్వత్థామతో రాజు అప్పుడు ఇట్లా అన్నాడు. అట్లాగే కాని అని తిరిగి కృపునితో రాజు ఇట్లా అన్నాడు. (25) ఓ ఆచార్య ఈ ద్రోణపుత్రుని కలశంతో తెచ్చిన నీటితో సేనాపతిగా అభిషేకం చేయిఅని. ఆతడు కూడా అట్లాగే చేశాడు (26) అభిషిక్తుడైన ఆ ద్రౌణి అప్పుడు రాజును కౌగిలించుకొని కృతవర్మ కృపులతో కలిసి త్వరగా వెళ్ళిపోయాడు (27) దక్షిణోన్ముఖులై ఆ ముగ్గురు వీరులు బయలుదేరారు. సూర్యాస్తమయం కన్నముందు శిబిరం సమీపానికి వచ్చారు. (28) జయమును కోరే వీరు పార్థుల భీషణమైన శబ్దమును విని పాండవులననుసరిస్తున్నవారు భయపడి, ఆ అశ్వత్థామ మొదలగు ముగ్గురు (29) శ్రమాతురులై భయంతో కొంత దూరము తూర్పు దిక్కుగా పరుగెత్తారు. ముహూర్త కాలము వారట్లా వెళ్ళి పిదప క్రోధ అమర్షములకు గురియైనవారై (30) దుర్యోధనుని వధ వలన బాధపడినవారై వారు క్షణకాలము అక్కడే నిలిచారు. పిదప అనేకరకాల తరుల తలతో నిండిన అరణ్యమును చూచారు (31) అనేక మృగములతో నిండినది క్రూరమైన పక్షుల సమూహములుగలది, సమృద్ధమైన జలములతో నిండిన తటాకములతో శోభిస్తున్న (32) పద్మములు, ఇందీవర, కల్హారములతో నిండిన నూర్లకొలది సరస్సులతో సంకులమైనది ఆ అరణ్యము. వారక్కడ నీరుత్రాగి, గుఱ్ఱములుకు నీరు త్రాగించి (33) అనేక శాఖలతో కూడిన మణ్ణిచెట్టును చూచారు.

మూ || సంప్రాప్యతు మహావృక్షంస్యగ్రోధంతేత్రయస్తదా || 34 ||

అవతీర్య రథేఛ్యశ్చమోచ యిత్వా తురంగమాన్‌ | ఉపస్పృశ్యజలం తత్ర సాయం సంధ్యాముపాసత || 35 ||

అథచాస్త గిరింభానుః ప్రపేదే చ గతప్రభః | తతశ్చరజనీ ఘోరా సమభూత్తి మిరాకులా || 36 ||

రాత్రించరాణి సత్వాని సంచరం తి తతస్తతః దివాచరాణి సత్వాని నిద్రావశ ముపాయయుః || 37 ||

కృతవర్మాకృపో ద్రౌణిః ప్రదోష సమయేహితే | న్యగ్రోధస్యోపవినిశుః అంతికే శోకకర్షితాః || 38 ||

కృపభోజా తదానిద్రాం భేజాతేతి పరాక్రమౌ | సుఖోచితాన్త్వదుః ఖార్హానిషేదుర్ధరణీతలే || 39 ||

ద్రోణ పుత్రస్తుకోపేన కటాక్షీకృతమానసః | య¸°నని ద్రాం విప్రేంద్రా నిశ్‌వసన్నురగోయథా || 40 ||

తతోవలో కయాం చక్రేతదరణ్యం భయానకం | న్యగ్రోధంచతతోపశ్యద్బహువాయనసంకులం || 41 ||

తత్రవాయనవృందాని నిశాయాం వాసమాయయుః | సుఖంభిన్నామశాఖాను సుషుపుస్తేవృథక్‌వృధక్‌ || 42 ||

కాకేషు తేషుసుప్తేషు విశ్వస్తేషు సమంతతః | తతోపశ్యత్సమాయాంతం భాసంద్రౌణిర్భయంకరం || 43 ||

క్రూరశబ్దం క్రూరకాయం బభ్రుపింగకలేవరం | సభాసోథ భృశం శబ్దం కృత్వాలీయత శాఖిని || 44 ||

ఉత్ల్సుత్య తస్యశాఖాయాం న్యగ్రోధస్య విహంగమః | సుప్తాన్‌ కాకాన్‌ నిజఘ్నేసా వనేకా న్వాయసాంతకః || 45 ||

కాకానామభినత్‌ పక్షాన్‌ సకేషాం చిద్విహంగమః | ఇతరేషాంచ చరణాన్‌ శిరాంసి చరణాయుధః || 46 ||

విచకర్తక్షణనాసా వులూకో బలవాన్ద్విజాః నభిన్నదేహా పయవైః కాకానాం బహుభిస్తదా || 47 ||

సమంతా దావృతం సర్వం న్యగ్రోధపరిమండలం | వాయుసాంస్తాన్ని హత్యాసావులూకోముముదే తదా || 48 ||

ద్రౌణిః దృష్ట్వాతుతత్కర్మభాసేనైవంకృతం నిశి | కరిష్యామ్యహమప్యేవం శత్రూణాం నిధనంనిశి || 49 ||

ఇత్యచింతయదే కన్సన్‌ ఉపదేశమిమం స్మరన్‌ | జేతుంనశక్యాః పార్థాహి ఋజుమార్గేణయుద్ధ్యతా || 50 ||

మయాతచ్ఛద్మనాతేద్య హంతవ్యాజితకాశినః | సుయోధన నకాశేచ ప్రతిజ్ఞాతో మయావధః || 51 ||

తా || ఆ ముగ్గురు న్యగ్రోధమహావృక్షమును చేరి (34) రథములనుండి దిగి, గుఱ్ఱములను విడిచి జలమును స్పృశించి సాయంసంద్యను ఉపాసించారు (35) కాంతి హీనుడై సూర్యుడు అస్తమయ గిరికి చేరాడు. చీకటితో నిండినదై ఘోరమైన రాత్రి ఐంది. (36) రాత్రిపూట తిరిగే ప్రాణులు ఇటూ అటూ తిరుగుతున్నాయి. పగలుతిరిగే ప్రాణులు నిద్రాధీనమైనాయి (37) కృతవర్మ కృపుడు అ అశ్వత్థామ ప్రదోష సమయమందే వారు న్యగ్రోధవృక్ష సమీపమందు శోకకర్షితులై కూర్చున్నారు (38) అతి పరాక్రమ వంతులైన కృపభోజులు అప్పుడు నిద్రపోయారు. సుఖంగా ఉండాల్సినవారు, దుఃఖానికి అనర్హమైనవారు, భూమియందు కూర్చున్నారు. (39) ద్రోణపుత్రుడు కోపంతో కలుషమైన మనస్సు కలవాడై పామువలె బుసకొడ్తూ నిద్రపోలేదు (40) ఆ భయానకమైన అరణ్యమును చూడసాగాడు. అనేకమైన కాకులతో కూడిన అన్యగ్రోధ వృక్షమును చూచాడు (41) అక్కడ కాకులు గుంపులు రాత్రి యందు నివసించసాగాయి. భిన్నమైన భిన్నమైన కొమ్మలపై విడివిడిగా అవిసుఖంగా నిద్రపోయాయి. (42) ఆకాకులు నిద్రపోయాక అంతటా విశ్వాసం కుదిరాక, ఆ పిదప వస్తున్న భయంకరమైన భాసమును అశ్వత్థామ చూచాడు (43) క్రూరమైన శబ్దము క్రూరమైన శరీరము పసుపు గోరోజన వర్ణముగల శరీరము గల ఆ గుడ్లగూబ శబ్దంచేసి కొమ్మలలో కలిసిపోయింది (44) ఈ పక్షి అన్యగ్రోధశాఖయందు ఎగిరి ఈ వాయుసాంతకము అనేకమైన నిద్రపోతున్న కాకులను చంపింది (45) ఆ పక్షి కొన్ని కాకుల రెక్కలను విరిచింది. చరణములే ఆయుధముగాగల ఆపక్షిఇతరకాకుల చరణములను తలలనువిరించింది. (46) ఈ బలమైన గుడ్లగూబ క్షణంలో విరిచింది. కాకుల యొక్క అనేకమైన భిన్నదేహ అవయవములతో (47) అన్య గ్రోధమండలము సర్వము చుట్టూ ఆవరించబడింది. ఆకాకులను చంపి ఈ గుడ్లగూబ అప్పుడు ఆనందపడింది (48) గుడ్లగూబ రాత్రిపూట ఇట్లా చేయటం చూసి అశ్వత్థామ, నేను ఇట్లాగే చేస్తాను. శత్రునాశనాన్ని రాత్రిపూట చేస్తాను (49) ఈ ఉపదేశాన్ని స్మరిస్తూ ఒంటరిగా అతడు అదే ఆలోచించాడు. చక్కని మార్గంలో యుద్ధం చేసి పార్థులను నేను జయించలేను (50) యుద్ధంలో జయించిన వీరిని నేను ఈరోజు కపటంగా చంపాలి. దుర్యోధనుని సమీపంలో నేను వారిని వధిస్తానని ప్రతిజ్ఞచేశాను (51).

మూ || ఋజుమార్గేణ యుద్ధేమే ప్రాననాశోభవిష్యతి | ఛలేన యుధ్యమానస్య జయశ్చాస్య రిపుక్షయః || 52 ||

యచ్చనింద్యం భ##వేత్కార్యం లోకే సర్వజనైరపి | కార్యమేవహితత్కర్మ క్షత్ర ధర్మానువర్తిహి || 53 ||

పార్థైరపిఛలేనైవకృతం కర్మసుయోధనే | అస్మిన్నర్థేపురావిద్భిః ప్రోక్తాః శ్లోకాః భవంతిహి || 54 ||

పరిశ్రాంతే విదీర్ణేచ భుంజానే చరిపోర్బలే | ప్రస్థానేచ ప్రవేశేచ ప్రహర్తవ్యం న సంశయః || 55 ||

నిద్రార్తమర్ధరాత్రేచ తథాత్యక్తాయుధంరణ | భిన్నయోధంబలం సర్వం ప్రహర్తవ్య మరాతిభిః || 56 ||

ఏవంసనియమంకృత్వాసుప్తమారణ కర్మణీ | ప్రాబోధయత్‌ భోజకృపౌ సుప్తౌరాత్రౌ ససాహసీ

ద్రోణిర్ధ్యాత్వాముహూర్తంతు తావుభావభ్యభాషత | || 57 ||

అశ్వత్థామ ఉవాచ -

మృతః సుయోధనోరాజా మహాబలపరాక్రమః || 58 ||

శుద్ధకర్మాహతః పార్ధైః బహుభిః క్షుద్రకర్మభిః | భీమేనాతినృశంసేన శిరోరాజ్ఞః వదాహతం || 59 ||

తతోద్యరాత్రౌ పార్థానాం సమేత్యపటమండపం | సుఖసుప్తాన్‌హ నిష్యామః శ##సై#్త్రర్నానా విధైర్వయం

కృపః ప్రోవాచ తత్రైనమితిశ్రుత్వా ద్విజోత్తమాః | || 60 ||

కృప ఉవాచ -

సుప్తానాం మరణం లోకే నధర్మోన చపూజ్యతే || 61 ||

తథైవత్యక్తశస్త్రాణాం సంత్యక్త రథ వాజినాం | శృణుమే వచనం వత్స ముచ్యతాం సాహసంత్వయా || 62 ||

వయంతుధృతరాష్ట్రంచ గాంధారీంచ పతివ్రతాం | పృచ్ఛామోవిదురం చాపి తదుక్తం కరవామహే

ఇత్యుక్తః స తదాద్రౌణిః కృపంప్రోవాచ వైపునః || 63 ||

అశ్వత్థామోవాచ -

పాండవైశ్చపురాయన్మే ఛలాద్యుద్ధే పితాహతః || 64 ||

తన్మే సర్వాణి మర్మాణిని కృంతతిహి మాతుల | ద్రోణ హంతాహమిత్యేతత్‌ ధృష్టద్యుమ్నన్య యద్వచః || 65 ||

కథంజనసమక్షే తద్వచనం సంశృణోమ్యహం | తైరేవపాండవైః పూర్వం ధర్మసేతుర్నిరాకృత || 66 ||

సమక్షమేవయుష్మాకంసర్వేషామేవభూభృతాం | త్యక్తాయుధో మమపితా ధృష్టద్యుమ్నేన పాతితః || 67 ||

తథాశాంతనవోభీష్మః త్యక్తచాపోనిరాయుధః | శిఖిండినం పురోధాయ నిహతః సవ్యసాచినా || 68 ||

ఏవమన్యేపి భూపాలాః ఛలేనైవహతాస్తు తైః తథైవాహం కరిష్యామి సుప్తానాం మారణం నిశి || 69 ||

ఏవముక్త్వా తదాద్రౌణిః సంయుక్త తురగం రధం| ప్రాయాదభిముఖః శత్రూన్‌ సమారుహ్య క్రుధాజ్వలన్‌ || 70 ||

తా || ఋజుమార్గంలో యుద్ధంచేస్తే నా ప్రాణాలు పోతాయి. నెపంతో యుద్ధం చేసినవానికి జయము కల్గుతుంది. అతని శత్రువులు నశిస్తారు (52) లోకంలో అందరు నిందించే కార్యమును క్షత్ర ధర్మాన్ని అనుసరించేవాడు ఆ పనిని తప్పకుండా చేయాలి (53) పార్థులుకూడా సుయోధనుని విషయంలో నెపంగానే కార్యం నిర్వర్తించారు. ఈ విషయంలో పూర్వవిదులు చెప్పిన శ్లోకాలున్నాయి (54) శత్రుబలం అలిసినప్పుడు, చీల్చబడినప్పుడు, భుజిస్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు, చొచ్చుకొస్తున్నప్పుడు సంహరించాలి, అనుమానం వద్దు (55) అర్థరాత్రియందు నిద్రతో బాధపడుతున్నపుడు, యుద్ధమందు ఆయుధం వదలినవానిని భిన్నమైన యోధులు కల బలమునంతను, శత్రువులు సంహరించాలి (56) నిద్రిస్తున్న వారిని చంపే పనిని, నియమంగా చేసుకొని అతడు ఆ సాహసి రాత్రియందు నిద్రిస్తున్న భోజకృపులను మేల్కొలిపాడు. అశ్వత్థామ క్షణమాలోచించి ఆ ఇద్దరితో ఇట్లా అన్నాడు. (57) అశ్వత్థామమాట - మహా బలపరాక్రమవంతుడైన సుయోధనుడు మరణించాడు. (58) పార్థులు చాలా క్షుద్రకర్మలు చేసి శుద్ధకర్ముని చంపారు. అతి నృశంసుడైన భీముడు రాజుగారిని తలను తన్నాడు (59) అందువల్ల ఈ రాత్రి పార్థుల పటమంటపానికి (డేరా) వెళ్ళి, సుఖంగా నిద్రిస్తున్న వారిని నానావిధములైన శస్త్రములతో మనము చంపుదాము. అని అన్నమాటలను విని ఇతనితో కృపుడు ఇట్లా అన్నాడు (60) కృపుని మాట - నిద్రిస్తున్న వారిని చంపటం లోకంలో ధర్మకార్యంగా భావించబడదు. పూజార్హముకాదు (61) అట్లాగే శస్త్రములు త్యజించిన, రథమును గుఱ్ఱములను వదలిన వారిని చంపటం కూడా. ఓ వత్స! నా మాట విను. నీవు సాహసాన్ని వదులు (62) మనము ధృతరాష్ట్రుని, పతివ్రతయైన గాంధారిని, విదురుని అడుగుదాము, వాళ్ళుచెప్పింది చేద్దాము. అని అనగా అప్పుడు అశ్వత్థామ కృపునితో ఇట్లా అన్నాడు. (63) అశ్వత్థామ వచనం - పాండవులు పూర్వం నెపంతో యుద్ధంలో నా తండ్రిని చంపారు (64) ఓ మాతుల ! అందువల్ల నా మర్మములన్ని తెగిపోతున్నాయి. ద్రోణున్ని చంపినవాణ్ణి నేను అని పలికిన ధృష్టద్యుమ్నుని మాటను (65) జనుల సమక్షంలో నేను ఎట్లా వినగలను. ఆ పాండవులే తొలుత ధర్మ సేతువును నిరాకరించారు (66) మీ ఎదురుగా, రాజులందరి ఎదురుగా, ఆయుధం వదలిన నా తండ్రిని ధృష్టద్యుమ్నుడు పడవేశాడు (67) శాంతనపుడైన భీష్ముడు ధనస్సును వదలి ఆయుధాలు లేకుండా ఉండగా శిఖండిని ముందుంచుకొని సవ్యసాచి చంపాడు (68) ఈ విధముగా ఇతర రాజులను కూడా వారు నెపంతోనే చంపారు. అట్లాగే నేను చేస్తాను. రాత్రి నిద్రిస్తున్న వారిని చంపుతాను (69) ఇట్లా పలికి అప్పుడు అశ్వత్థామ గుర్ఱములు పూన్చిన రథమును ఎక్కి కోపంతో మండిపోతూ శత్రువులకు అభిముఖంగా వెళ్ళాడు (70).

మూ|| తయాంత మన్వగాతాంతౌ కృతవర్మకృపాపుభౌ | యయుశ్చశిబిరే తేషాం సంప్రసుప్తజనంతదా || 71 ||

శిబిరద్వార మాసాద్యద్రోణ పుత్రోవ్యతిష్ఠత | రాత్రౌతత్ర సమారాధ్య మహాదేవం ఘృణానిధిం || 72 ||

అవాపవిమలం ఖడ్గం మహాదేవాత్‌ వరప్రదాత్‌ | తతోద్రౌణి రవస్థాప్య కృతవర్మ కృపాపు భౌ || 73 ||

ద్వారదేశే మహావీరః శిబిరాంతః ప్రవిష్టవాన్‌ | ప్రవిష్టే శిబిరే ద్రౌణౌ కృతవర్మ కృపాపుభౌ || 74 ||

ద్వారదేశేవ్యతిష్ఠేతాం యత్తౌపరమధన్వినౌ | అథద్రౌణిః సునంక్రుద్ధః తేజసాప్రజ్వల న్నివ || 75 ||

ఖడ్గం విమల మాదాయ వ్చచరచ్ఛిబిరేనిశి | తతస్తు ధృష్టద్యుమ్నస్య శిబిరం మందమాయ¸° || 76 ||

ధృష్టద్యుమ్నాదయస్తత్ర మహాయుద్ధేసకర్షితాః | సుషుపుర్నిశి విశ్వస్తాః స్వప్నసైన్య సమావృతాః || 77 ||

ధృష్టద్యుమ్నస్య శిబిరం ప్రవిశ్య ద్రౌణి రస్త్రవిత్‌ | తంసుప్తంశయనే శుభ్రేద దర్శారాన్మహా బలం || 78 ||

పాదే నాఘాతయత్‌ రోషాత్‌ స్వపంతం ద్రోణ నందనః | సబుద్ధశ్చరణాఘాతా దుత్థాయ శయనాదథ || 79 ||

వ్యలోకయత్తదావీరో ద్రోణ పుత్రం పురః స్థితం | సముత్పతంతం శయనాత్‌ ద్రోణాచార్యసుతో బలీ || 80 ||

కేశేష్వా కృష్యబాహుభ్యాం నిష్పిపేష ధరాతలే | ధృష్టద్యుమ్నస్తదాతేన నిష్పిష్టః సభయాతురః || 81 ||

నిద్రాంధః పాదఘాతార్తో సశశాక విచేష్టితుం | ద్రౌణి స్త్వాక్రమ్య తస్కోరః కంఠం బధ్వాధనుర్గుణౖః || 82 ||

నదంతం విస్ఫురంతం తం పశుమారమమారయత్‌ | తస్యసైన్యాని సర్వాణి న్యవధీచ్చత థైవనః || 83 ||

యుధామన్యుం మహీవీర్యం ఉత్తమౌ సమేవచ | తథైవ ద్రౌపదీపుత్రాన్‌ అవశిష్టాం శ్చ సోమకాన్‌ || 84 ||

శిఖండి ప్రముఖానన్యాన్‌ ఖడ్గేనామార యద్బహూన్‌ | తద్భయాద్ద్వార నిర్యాతాన్‌ సర్వానేవచ సైనికాన్‌ || 85 ||

ప్రాపయామాన తుర్‌ మృత్యుం కృతవర్మ కృపాపుభౌ | ఏవంనిహతసైన్యంతచ్ఛిబిరం తైర్మహాబలైః || 86 ||

తత్‌క్షణ శూన్యమభవత్‌ త్రిజగత్ర్పలయే యధా | ఏవం హత్వాతతః సర్వాన్‌ ద్రోణపుత్రాద యస్త్రయః || 87 ||

సరగుఃశిబిరాత్తస్మాత్‌ పార్థభీతా భయాతురాః | సర్వే పృథక్‌ పృథక్‌ దేశాన్‌ దుద్రువుః శీఘ్రగామినః || 88 ||

తా || కృతవర్మ కృపులు ఇద్దరు వెళ్తున్న అతనిని అనుసరించారు. బాగా నిద్రించిన జనులు గల వారి శిబిరానికి వెళ్ళారు. (71) శిబిర ద్వారం చేరాక అశ్వత్థామ నిలిచాడు. ఆ రాత్రి అక్కడ దయగలిగిన శివుని ఆరాధించి (72) వరమిచ్చే శివుని నుండి నిర్మలమైన కత్తిని పొందాడు. పిదప అశ్వత్థామ కృతవర్మ కృపులను ఇద్దరిని ద్వారమందు ఉంచి (73) మహావీరుడు శిబిరంలో పలికి ప్రవేశించాడు. అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాక కృతవర్మ కృపుడు ఇద్దరు (74) గొప్ప ధనుర్ధారులైన వారిద్దరు ద్వారదేశంలో ఉన్నారు. పిదప అశ్వత్థామ బాగా కోపంతో తేజస్సుతో మండిపోతున్నవాడిలా (75) విమలమైన ఖడ్గమును తీసుకొని రాత్రియందు శిబిరంలో తిరిగాడు. పిదప ధృష్టద్యుమ్నుని శిబరంను మెల్లగా సమీపించాడు (76) ధృష్టద్యుమ్నాదులు అక్కడ మహాయుద్ధంతో కృశించిపోయి తమ తమసైన్యములతో కూడి విశ్వాసంతో రాత్రియందు నిద్రించారు (77) అస్త్రము కలిగిన అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని శిబిరం ప్రవేశించి శుభ్రమైన పడక యందు నిద్రించిన ఆ మహా బలవంతుని దూరంనుండి చూచాడు. (78) నిద్రిస్తున్న అతనిని అశ్వత్థామ కోపంతో కాలితోతన్నాడు. కాలిదెబ్బతో మేల్కొని అతడు పడకనుండి లేచి (79) ఆ వీరుడు ముందున్న అశ్వత్థామను చూచాడు. వక నుండి పైకి వస్తున్న అతనిని బలవంతుడైన అశ్వత్థామ (80) చేతులతో వెంట్రుకలను లాగి అతనినిభూమియందు పడవేశాడు. అప్పుడు అతనితో పడవేయబడ్డ ఆ ధృష్టద్యుమ్నుడు భయాతురుడై (81) నిద్రాంధుడు, పాదఘాతంతో బాధపడుతున్నవాడు ఏమి చేయటానికి సమర్థుడు కాలేదు. అశ్వత్థామ అతని వక్షఃస్థలాన్ని ఆక్రమించి, ధనస్సు గుణములతో(వారి) అతనికంఠాన్ని బంధించి (82) అరుస్తున్న, కదులుతున్న అతని పశువును చంపినట్టు చంపాడు. అట్లాగే ఆతడు ఆతనిసైన్యమునంతా చంపాడు. (83) మహావీరుడైనయుధామస్యుని, ఉత్తమౌజసుని, ద్రౌపది పుత్రులను, మిగిలిన సోమకులను (84) శిఖండి ప్రముఖులైన ఇతరులను అనేకులను ఖడ్గంతో చంపాడు. ఆ భయంతో ద్వారం నుండి బయటికి వచ్చిన సైనికులందరిని (85) కృతవర్మ కృపుడు వీరిద్దరు మృత్యువు దరికి చేర్చారు. ఆ మహాబలులతో చనిపోయిన సైన్యము గల ఆశిబిరము (86) త్రిజగత్ర్పలయమందు ఐనట్లుగా ఆ క్షణంలో శూన్యమైంది. అశ్వత్థామ మొదలుగా ముగ్గురు అందరిని చంపి (87) పార్థునకు భయపడిన భయాతురులై ఆ శిబిరం నుండి వెడలిపోయారు. త్వరగా వెళుతూ వారు వేరువేరు ప్రదేశములకు పరుగెత్తారు (88).

మూ|| అథద్రౌణిః య¸° విప్రాః రేవాతీరం మనోరమమ్‌ |తత్రహ్యనేక సాహస్రాఋషయో వేదవాదినః || 89 ||

కథయంతః కథాః పుణ్యాః తపశ్చ క్రురసుత్తమం | తత్రాయం ప్రయ¸°ద్రౌణిః ఋషీణా మాశ్రమేష్వథ || 90 ||

ప్రవిష్టమాత్రే తస్మింస్తు మునయో బ్రహ్మవాదినః | ద్రౌణః దుశ్చరితం జ్ఞాత్వా ప్రాహుర్యోగబలేసతం || 91 ||

సుప్తమారణకృత్పాపీ ద్రౌణత్వం బ్రహ్మణాధమః | త్వద్దర్శనే సహ్యస్మాకం పాతిత్యం భవతి ధ్రువం || 92 ||

తత్సంభాషణ మాత్రేణ బ్రహ్మహత్యా యుతం భ##వేత్‌ | అతోస్మ దాశ్రమే భ్యస్త్వం నిర్గచ్ఛపురుషాథమ || 93 ||

ఇత్యబ్రుపంస్తదాద్రౌణిం తత్రత్యా మునయోద్విజాః| ఇతీరితస్తతో ద్రౌణిః మునిభిర్‌ బ్రహ్మవాదిభిః || 94 ||

లజ్జితోనిరగాత్త స్మాత్‌ ఆశ్రమాన్ముని సేవితాత్‌ | ఏవం కాశ్యాదితీర్థేషు పుణ్యషు స్రయ¸°చనః || 95 ||

తత్ర తత్ర ద్విజైః సర్వైః నిందితోసౌ మహాత్మభిః | వ్యాసం శరణ మాపేదేప్రాయశ్చిత్త చికీర్షయా || 96 ||

తతో బదరికారణ్య సహా సీసం మహామునిం | ద్వైపాయనం సమాగమ్య ప్రణనామ సభక్తికం || 97 ||

తతో వ్యాసోబ్రవీదేనం ద్రోణాచార్య సుతంమునిః | త్వమస్మాదాశ్రమా ద్ద్రౌణ నిర్యాహిత్వరయాత్వితి || 98 ||

సుప్తమారణ దోషేణ మహా పాతక వాన్‌ భవాన్‌ | అతోమే భవతాలాపాన్‌ మహత్పావం భవిష్యతి

ఇత్యుక్తఃసతదాద్రౌణిఃప్రోవాచేదంపచోమునిః || 99 ||

అశ్వత్థామోవాచ -

భగవన్నిందిత స్సర్వైః త్వామస్మి శరణం గతః || 100 ||

బ్రవీతి చేత్త్వ మప్యేవం కోస్యమేశరణం భ##వేత్‌ కృపాంకురుమయి బ్రహ్మన్‌ సాథవోదీన వత్సలాః || 101 ||

సుప్తమారణహోమస్య శాంత్యర్థం భగవన్మమ | ప్రాయశ్చిత్తం విధేహిత్వం సర్వజ్ఞసి భవాన్యతః

ఇత్యుక్తో ద్రౌణినా వ్యాసః చిరంధ్యాత్వా తమబ్రవీత్‌ || 102 ||

తా || పిదప అశ్వత్థామ మనోరమమైన రేవాతీరమునకు వెళ్ళాడు. అనేక వేల మంది వేదములను చదివే ఋషులు అక్కడ (89) పుణ్యమైన కథలు చెప్పుకుంటూ ఉత్తమమైన తపస్సు చేస్తున్నారు. అక్కడ ఈ ద్రౌణి ఋషుల ఆశ్రమములకు వెళ్ళాడు (90) అతడు ప్రవేశించగానే బ్రహ్మవాదులైన మునులు యోగబలంతో అశ్వత్థామ దుశ్చరితాన్ని తెలుసుఏకొని అతనితో ఇట్లా అన్నారు (91) ఓ ద్రౌణి! నిద్రించిన వారిని చంపే పాపివి. నీవు బ్రాహ్మణాథముడవు. నీ దర్శనం వల్ల మాకు పాతిత్యం తప్పకుండా వస్తుంది. (92) నీతో సంభాషించినంత మాత్రం చేత పదివేల బ్రహ్మహత్యలు చేసినట్టౌతుంది. అందువల్ల! ఓ పురుషాధమ! మా ఆశ్రమములనుండి నీవు వెళ్ళిపో. (93) అని బ్రౌణితో అక్కడున్న మునులన్నారు. బ్రహ్మవాదులైన మునులు ద్రౌణితో ఇట్లన్నాక, అతడు (94) సిగ్గుపడి మునులు సేవించే ఆ ఆశ్రమంనుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆతడు పుణ్యప్రదములైన కాశ్యాది తీర్థములకు వెళ్ళాడు (95) అక్కడక్కడ మహాత్ములైన బ్రాహ్మణులందరితో నిందింపబడి ఈతడు ప్రాయశ్చిత్తం చేసుకునే కొరకు వ్యాసుని శరణు వేడాడు (96) బదరి కారణ్యంలో ఆసీనుడైన ఉన్న మహామునిని, ద్వైపాయనుని సమీపించి భక్తి పూర్వకముగా నమస్కరించాడు (97) అప్పుడు ఈ ద్రోణాచార్య సుతునితో వ్యాసముని ఇట్లా అన్నాడు. ఓ ద్రౌణి! నీవు ఈ ఆశ్రమం నుండి త్వరగా బయటికి వెళ్ళు అని (98) నిద్రించిన వారిని చంపుటతో నీవు మహా పాతకుడవైనావు. అందువల్ల నేను నీతో మాట్లాడటం వల్ల నాకు చాలా పాపం వస్తుంది. అని అనగా అప్పుడు ద్రౌణి మునితో ఇట్లా అన్నాడు (99) అశ్వత్థామోక్తి - అందరితో నిందింపబడి నిన్ను శరణు వేడాను ఓ భగవాన్‌ ! (100) మీరు కూడా ఇట్లాగే అంటే నాకు వేరెవరు శరణుగా ఉన్నారు. ఓ బ్రహ్మన్‌ నా యందు దయ చూపండి. సాధువులు దీనుల యందు దయగల వారు కదా ! (101) నిద్రించిన వారిని చంపిన పాపశాంతి కొరకు ఓ భగవాన్‌ ! నాకు మీరు ప్రాయశ్చిత్తం విధించండి. మీరు సర్వజ్ఞులు కదా. అని ద్రౌణి అనగా వ్యాసుడు చాలా సేపు ధ్యానించి ఆతనితో ఇట్లా అన్నాడు (102)

మూ || వ్యాస ఉవాచ -

ఏతత్పావస్య శాంత్యర్థం ప్రాయశ్చిత్తం స్మృతౌనహి || 103 ||

తథాప్యుపాయం వక్ష్యామి తవైతద్దోష శాంతయే | దక్షిణాం బునిధౌ పుణ్యరామసేతౌ విముక్తిదే || 104 ||

ధనుష్కోటిరితిఖ్యాతం తీర్థమస్తి మహత్తరం | అస్తి పుణ్యతమంద్రౌణ మహాపాతక నాశనం || 105 ||

స్వర్గమోక్ష ప్రదం పుంసాం బ్రహ్మహత్యాదిశోధకం | సర్వమంగళ మాంగల్యం సర్వాభీష్ట ప్రదాయకం || 106 ||

పవిత్రాణాం పవిత్రంచ తీర్థాంనాం చతథోత్తమం | దుః స్వప్న నాశనం పుణ్యం నరకక్లేశ నాశనం || 107 ||

అకాల మృత్యుశమనం పుంసాం విజయవర్ధనం | దారిద్ర్యనాశనం పుంసాం ఆయుర్వర్ధన కారణం || 108 ||

చిత్తశుద్ధి ప్రదం నౄణాం శాంతి దాంత్యాది కారణం | తత్ర గత్వా ధనుష్కోటౌ రామసేతౌ విముక్తిదే || 109 ||

స్నానం కురుష్వ ద్రౌణత్వం మాసమాత్రం నిరంతరం | సుప్తమారణ దోషాత్త్వం సద్యః పూతో భవిష్యసి || 110 ||

కురుష్వ వచనం శీఘ్రం మమత్వం ద్రోణనందన | ఏవముక్తస్తదా ద్రౌణిః వ్యాసేన పరమర్షిణా || 111 ||

రామసేతుం సమాసాద్య ధనుష్కోటిం పవిత్రదాం | సస్నౌసంకల్ప పూర్వంతు మా సమేకం నిరంతరం || 112 ||

త్రిసంధ్యం రామనాధంచ సిషేవే సదినేదినే | తతః త్రింశద్దినే తోయ స్నానాత్‌ ద్రోణాత్మజస్తదా || 113 ||

జ జాపచ ధనుష్కోట్యాం మంత్రం పంచాక్షరం తదా | అకార్షీదుపవాసంచ ద్రోణ పుత్రస్తు తద్దినే || 114 ||

అకరోజ్జాగరం రాత్రౌ రామనాథస్య సన్నిధౌ | అపరేద్యుః ధనుష్కోటౌ స్నాత్వా సంకల్ప పూర్వకం || 115 ||

సిషే వే రామనాథంచ సుత్వా భక్తి పురః నరం | సనర్త పురతః శంభోః ఆనం దాశ్రు పరిప్లుతః || 116 ||

తతః ప్రసన్నో భగవాన్‌ ప్రాదురాసీత్తదగ్రతః | దృష్ట్వాతత్ర మహాదేవం తుష్టావ పరమేశ్వరం || 117 ||

తా || వ్యాసులు ఇట్లా అన్నారు. ఈ పాప శాంతికి ప్రాయశ్చిత్తము స్మృతిలో లేదు (103) ఐనా ఈ నీ దోష శాంతి కొరకు ఉపాయం చెబుతాను. దక్షిణ సముద్రమందు పుణ్యమైన రామసేతువుయందు ముక్తినిచ్చేది (104) మహత్తరమైనది, ధనుష్కోటి అని ప్రసిద్ధి చెందిన తీర్థముంది. పుణ్యతమమైనది మహాపాతకముల నశింపచేసేది. ఓ ద్రౌణి ఒక తీర్థముంది (105) పురుషులందరికి ముక్తి నిచ్చేది. బ్రహ్మ హత్య మొదలగు వాని నుండి శుద్ధిని కల్గించేది, మంగళములన్నింటి కంటే మంగళ ప్రదమైంది అన్ని కోరికలనిచ్చేది (106) పవిత్రమైన వానికంటే పవిత్రమైంది తీర్థములలో ఉత్తమమైంది. దుః స్వప్నముల నశింపచేసేది. పుణ్యమైనది, నరకక్లేశాన్ని నశింపచేసేది (107) అకాల మృత్యువును శమింప చేసేది. విజయమును వృద్ధిపొందించేది. దారిద్ర్యాన్ని నశింపచేసేది. ఆయుర్వర్ధన కారణమైనది (108) నరులకు చిత్తశుద్ధిని కల్గించేది. శాంతిదాంత్యాదులకు కారణమైనది. ముక్తినిచ్చే, ధనుష్కోటిలోని రామసేతువునకు వెళ్ళి (109) ఓ ద్రౌణి ! నెలరోజులు మాత్రము అంతరాయం కలగకుండా నీవు స్నానం చేయి. సుప్త మారణ దోషం నుండి నీవు వెంటనే పవిత్రుడవవుతావు (110) ఓ ద్రోణుని కుమార ! నీవు తొందరగా నా మాటను పాటించు. వ్యాసు ఋషి అనగానే అప్పుడు అశ్వత్థామ (111) పవిత్రతను ఇచ్చే ధనుష్కోటి యందలి రామసేతువునకు చేరి, సంకల్ప పూర్వకముగా నెలరోజులు అంతరాయం లేకుండా స్నానం చేశాడు (112) ప్రతిరోజు మూడు సంధ్యలందు రామనాధుని సేవించాడు. పిదప ముప్పదవ రోజు ఆ నీటి స్నానం తరువాత అశ్వత్థామ (113) ధనుష్కోటి యందు పంచాక్షర మంత్రాన్ని జపించాడు. ఆ రోజు ద్రోణ పుత్రుడు ఉపవాసం కూడా చేసాడు (114) రామనాథుని సన్నిదియందు రాత్రి జాగరం కూడా చేశాడు. తరువాతి రోజు ధనుష్కోటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేసి (115) భక్తి పూర్వకముగా రామనాధుని స్తుతించి సేవించాడు. ఆనందాశ్రువులతో పొంగిపోయి శివుని ఎదుట నాట్యం చేశాడు. (116) అప్పుడు భగవానుడు ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమైనాడు అక్కడ మహాదేవుని చూచి, పరమేశ్వరుని స్తుతించాడు (117).

మూ || ద్రౌణిరువాచ -

నమస్తే దేవదేవేశ కరుణాకరశంకర | ఆపదంబుధి మగ్నానాం పోతాయిత పదాంబుజ || 118 ||

మహాదేవకృపామూర్తే ధూర్జటే నీలలోహిత | ఉమాకాంత విరూపాక్ష చంద్రశేఖర తే నమః || 119 ||

మృత్యుం జయత్రినేత్రత్వం పాహిమాం కృపయాదృశా | పార్వతీపతయే తుభ్యం త్రిపురఘ్నాయ శం భ##వే || 120 ||

పినాకపాణయే తుభ్యంత్య్రంబకాయనమోనమః |అనంతాది మహానాగహార భూషణ భూషిత || 121 ||

శూలపాణ నమస్తుభ్యం గంగాధర మృడావ్యయ | రక్షమాం కృపయాదేవ పాపసంఘాత పంజరాత్‌

ఇతిస్తుతో మహాదేవో ద్రౌణి ప్రోవాచహర్షితః || 122 ||

మహాదేవ ఉవాచ -

సుప్తమారణ దోషస్తే ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ || 123 ||

అశ్వత్థామన్‌ వినష్టోభూ ద్వరం పరయువ్రత | మయిప్రసన్నే లోకేషు కిమల భ్యం భ##వేన్పృణాం || 124 ||

అతోభీష్టం పృణీష్వత్వం మత్తో ద్రోణాత్మజాధునా | ఇత్యుక్తః శంభునా ద్రౌణిః ప్రాహతం పరమేశ్వరం || 125 ||

తవాద్యదర్శనే నాహం కృతార్థోస్మి మహేశ్వర | త్వద్దర్శన మపుణ్యానాం అలభ్యం జన్మకోటిభిః || 126 ||

అతోయుష్పత్పదాంభోజే నిశ్చలా భక్తి రస్తుమే | ఇమమేవ వరందేహి మహ్యం శంభోనమోస్తుతే || 127 ||

ఉక్త్వాతథాస్త్వితి ద్రౌణిం దేవదేవో మహేశ్వరః | పశ్యతో ద్రోణ పుత్రస్య తత్రైవాంతరధీయత || 128 ||

అశ్వత్థామాపి విప్రేంద్రా ధూత పాపోని నిర్మలః | రామచంద్ర ధనుష్కోటౌ స్నాన మాత్రేణ తత్‌క్షణ || 129 ||

ధూత పాపమిమంద్రౌణిం సర్వేచాపి మహర్షయః | శుద్ధం ప్రత్య గ్రహీషుస్తే తదాప్రభృతి నిర్మలం || 130 ||

ఏవం వః కథితం విప్రా ద్రౌణి పాప విమోక్షణం | రామచంద్ర ధనుష్కోటి స్నాన వైభవ మాత్రతః || 131 ||

యః పఠేదిమ మధ్యాయం శృణుయాద్వాసమాహితః | సవిధూయేహ పాపాని శివలోకే మహీయతే || 132 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం అశ్వత్థామ సుప్తమారణ దోషశాంతి వర్ణనం నామ ఏకత్రింశోధ్యాయః || 31 ||

తా || ద్రౌణి ఇట్లన్నాడు. దేవదేవశ ! కరుణాకర ! శంకర ! నీకు నమస్కారము. ఆపద అనే సముద్రంలో మునిగిన వారికి నావగా మారే అంబుజములవంటి పాదములు గలవాడ (118) మహాదేవ ! దయామూర్తి ! ధూర్జటి ! నీలలోహిత! ఉమాభర్త ! విరూపాక్ష ! చంద్రశేఖర ! నీకు నమస్కారము (119) మృత్యుంజయ త్రినేత్ర ! నీ దయగల చూపుతో నన్ను రక్షించు. పార్వతీపతి ! త్రిపురఘ్న! శంభు ! నీకు నమస్కారము (120) పినాకపాణి ! త్ర్యంబక ! నీకు నమస్కారము. అనంతాది మహానాగులనే హార భూషణములతో అలంకరింపబడినవాడ ! (121) శూలపాణి ! గంగాధర ! మృడ ! అవ్యయ ! నీకు నమస్కారము. ఓ దేవ ! పాపసమూహమనే పంజరం నుండి నన్ను దయతో రక్షించు. అని ద్రౌణి మహాదేవుని స్తుతించగా సంతోషంతో మహాదేవుడన్నాడు (122) మహాదేవుని వచనము. నీ సుప్తమారణ దోషము ధనుష్కోటిలో స్నానం చేసిందువల్ల (123) అశ్వత్థామ ! నశించి పోయింది. ఓ సువ్రత ! వరం కోరుకో. నేను ప్రసన్నుడపైతే లోకంలో నరులకు లభించనిదేముంటుంది. (124) అందువల్ల ద్రోణుని కుమార ! నన్ను నీవు నీ కిష్టమైన వరము కోరు. అని శంభుడనగా ద్రౌణి పరమేశ్వరునితో ఇట్లన్నాడు (125) ఓ మహేశ్వర ! ఈ వేళ నీదర్శనంతో నేను కృతార్థుడనైనాను కోటి జన్మలకైనా నీ దర్శనము పుణ్యము చేయని వారికి లభించదు. (126) అందువల్ల నీ పాదాంబుజమందు నాకు నిశ్చలమైన భక్తి కలగని ఈ వరాన్నే ఇవ్వు నాకు ఓ శంభు ! నీకు నమస్కారము (127) అని అనగా అట్లాగే కానిమ్మని దేవదేవుడు మహేశ్వరుడు పలికి, ద్రోణపుత్రుడు చూస్తుండగా అక్కడే అంతర్థానమైనాడు (128) అశ్వత్థామ కూడా పాపములు తొలగి రామచంద్ర ధనుష్కోటి యందు స్నానమాత్రంతో ఆక్షణమందే నిర్మలుడైనాడు (129) మహర్షులందరు, పాపములు తొలగిన ఈ ద్రౌణిని, నిర్మలుని శుద్ధుని నాటినుండి స్వీకరించారు (130) ఈ విధంగా మీకు ద్రౌణి పాపవిమోక్షణమును గూర్చి చెప్పాను. రామ చంద్ర ధనుష్కోటి స్నాన వైభవ మాతరం చేతనే ముక్తి కల్గింది (131) ఈ అధ్యాయాన్ని చదివిన వారు, శ్రద్ధగా విన్నవారు ఇక్కడ పాపములను తొలగించుకొని శివలోకమందు వెలుగుతారు. (132) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమౌన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంస యందు అశ్వత్థామ సుప్తమారణదోష శాంతి వర్ణనమనునది ముప్పది ఒకటవ అధ్యాయము సమాప్తము

Sri Scanda Mahapuranamu-3    Chapters