Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఏడవ అధ్యాయము

శ్రీ సూత ఉవాచ -

భోభోస్తపోధనాః సర్వే నైమిషారణ్య వాసినః | యావద్రామ ధనుష్కోటి చక్రతీర్థ ముఖానివః || 1 ||

చతుర్వింశతి తీర్థాని కథితాని మయాధునా | ఇతోన్య దద్భుతం యూయంకిం భూయః శ్రోతుమిచ్ఛథ || 2 ||

మునయ ఊచుః -

క్షీరకుండస్య మాహాత్మ్యం శ్రోతిమిచ్ఛామహేమునే | యత్స మీపేత్వ యాచక్రతీర్థమిత్యుదితం పురా || 3 ||

క్షీరకుండంచ తత్‌ కుత్రకీదృశం తస్యవైభవం | క్షీరకుండమితి ఖ్యాతిః కథం వాస్యసమాగతా || 4 ||

ఏతన్నః శ్రద్ధ ధానానాం విస్తరా ద్వక్తుమర్హసి |

శ్రీ సూత ఉవాచ -

బ్రవీమి మునయః సర్వేశృణుధ్వం సునమాహితాః || 5 ||

దేవీపురాన్మహా పుణ్యా త్ర్పతీచ్యాం దిశ్యదూరతః | పుల్లగ్రామమితి ఖ్యాతం స్థానమస్తి మహత్తరం || 6 ||

యత ఆరభ్యరామేణ సేతు బంధో మహార్ణవే | తద్ధిపుణ్యతమం క్షేత్రం పుల్ల గ్రామాభిధం పురం || 7 ||

క్షీరకుండంతుతత్రైవ మహాపాతక నాశనం | దర్శనాత్‌ స్పర్శనాత్‌ ధ్యానాత్‌ కీర్తనాచ్చాపిమోక్షదం || 8 ||

తస్యతీర్థస్య పుణ్యస్య క్షీరకుండమితి ప్రథాం | భవతాం సాదరం వక్ష్యేశృణుధ్వం శ్రద్ధయాసహ || 9 ||

పురాహి ముద్గలో నామమునిర్వేదోక్త మార్గకృత్‌ | దక్షిణాం బునిధే స్తీరే పుల్లగ్రామేతి పావనే || 10 ||

నారాయణ ప్రీతికర మకరోద్యజ్ఞముత్తమం | తస్యవిష్ణుః ప్రసన్నాత్మా యాగేన పరితోషితః || 11 ||

ప్రాదుర్బ భూవపురతో యజ్ఞవాటే ద్విజోత్మాః | తందృష్ట్వా ముద్గలో విష్ణుం లక్ష్మీశోభిత విగ్రహం || 12 ||

కాలమేఘ తనుంకాంత్యా పీతాం బరవిరాజితం | వినతానంద నారూఢం కౌస్తుభాలం కృతోరసం || 13 ||

శంఖచక్ర గదాపద్మరాజద్బాహు చతుష్టయం | భక్త్యా పరవశో దృష్ట్వా పులకాంకుర మండితః || 14 ||

ముద్గలః పరితుష్టావ శ##బ్దైః శ్రోత్ర సుఖావహైః

తా || శ్రీ సూతులిట్లనిరి - నైమిషారణ్యమందుండే అందరు తపోధనులార ! రామ ధనుష్కోటి చక్రతీర్థము మొదలుగా (1) ఇరువది నాలుగు తీర్థముల గూర్చి నేను ఇప్పుడు చెప్పాను. ఇంతకంటే అద్భుతమైన దేనిని గూర్చి మీరు వినదలిచారు (2) అని అనగా మునులిట్లనిరి - ఓ ముని! క్షీరకుండ మాహాత్మ్యమును విన దలిచాము. దీని దగ్గరే చక్రతీర్థముందని మీరు ముందు చెప్పారు గదా (3) క్షీరకుండమనేది ఎక్కడ ఉంది. దాని వైభవ మెలాంటిది. దానికి క్షీరకుండమనే పేరు ఎట్లా వచ్చింది (4) శ్రద్ధ గలిగిన మాకు ఈ విషయాన్ని వివరంగా చెప్పండి. అని అనగా శ్రీ సూతులిట్లనిరి - చెప్తున్నాను, అందరు మునులార ! చాలాశ్రద్ధగా వినండి (5) మహాపుణ్యప్రదమైన దేవీ పురం నుండి పశ్చిమదిక్కులో కొద్ది దూరంలోనే పుల్లగ్రామము అను పేరుగల ప్రసిద్ధమైన మహత్తర స్థానము ఉంది (6) అక్కడి నుండే ఆరంభించి రాముడు సముద్రమందు సేతుబంధం చేశాడు. పుల్లగ్రామమను పేరుగల ఆపురము పుణ్యతమమైన క్షేత్రము (7) క్షీరకుండము అక్కడే ఉంది. అది మహాపాతకముల నశింపచేసేది. దర్శనం వల్ల, స్పర్శవల్ల, ధ్యానం వల్ల, కీర్తన వల్లను ముక్తినిచ్చేది (8) ఆ పుణ్యతీర్థమునకు క్షీరకుండమనే పేరును గూర్చి మీకు ఆదర పూర్వకంగా చెబుతాను. శ్రద్ధతో వినండి (9) పూర్వం ముద్గలుడనే ముని ఉండేవాడు. ఆతడు వేదోక్తమార్గాన్ని ఆచరించేవాడు. దక్షిణ సముద్రతీరమందలి అతి పావనమైన పుల్లగ్రామమందు (10) నారాయణ ప్రీతికరమైన ఉత్తమ యజ్ఞాన్ని చేశాడు. ఆ యాగంతో సంతుష్టుడై ప్రసన్నాత్మ గలిగిన విష్ణువు (11) ఆయజ్ఞవాటమందు ఆతని ఎదురుగా ప్రత్యక్షమైనాడు. ఓ బ్రాహ్మణులార ! లక్ష్మీశోభిత విగ్రహుడైన ఆ విష్ణువును ముద్గలుడు చూచి (12) కాలమేఘం వంటి శరీరం కలిగిన, పీతాంబరముతో వెలిగిపోతూ, గరుత్మంతునది రోహించిన, వక్షఃస్థలమున కౌస్తుభమును ధరించిన (13) శంఖచక్ర గద పద్మములతో విరాజిల్లుతున్న నాల్గు చేతులు కలవానిని (చూచి) భక్తితో పరవశుడై పులకాంకురములు కలిగినవాడై శ్రోత్రములకు సుఖమును కల్గించే మాటలతో ముద్గలుడు విష్ణువును స్తుతించాడు (14).

మూ || ముద్గల ఉవాచ -

ప్రథమం జగతః స్రష్ట్రే పాలకాయ తతఃపరం || 15 ||

సంహర్త్రేచ తతః పశ్చాత్‌ నమోనారాయణాయతే | నమఃశఫరరూపాయ కమఠాయ చిదాత్మనే || 16 ||

నమోవరాహవవుషేనమః పంచాస్యరూపిణ | వామనాయనమస్తుభ్యం జమదగ్ని సుతాయతే || 17 ||

రాఘవాయ నమస్తుభ్యం బలభద్రాయతేనమః | కృష్ణాయ కల్కయే తుభ్యం నమోవిజ్ఞాన రూపిణ || 18 ||

రక్షమాం కరుణాసింధో నారాయణ జగత్పతే | నిర్లజ్జం కృపణం క్రూరం పిశునం దాంభికం కృశం || 19 ||

పరదార పరద్రవ్య పరక్షేత్రైకలోలువమ్‌ | అసూయావిష్టమననంమాంరక్షకృపయాహరే || 20 ||

ఇతిస్తుతో హరిః సాక్షాత్‌ ముద్గలేన ద్విజోత్తమాః | తమాహముద్గలమునిం మేఘగంభీరయాగిరా || 21 ||

శ్రీ హరి రువాచ -

ప్రీతోస్మ్యనేన స్తోత్రేణ ముద్గలక్రతునాచతే | ప్రత్యక్షేణ హవిర్భోక్తుం అహంతే క్రతుమాగతః || 22 ||

ఇత్యుక్తో హరిణాతత్ర ముద్గల స్తుష్టమానసః | ఉవాచాధోక్ష జంవిప్రో భక్త్యా పరమయాయుతః | || 23 ||

ముద్గల ఉవాచ -

కృతార్థో స్మి హృషీకేశ పత్నీమేధన్యతాం య¸° | అద్యమే సఫలం జన్మహ్యద్యమే సఫలం తపః || 24 ||

అద్యమే సఫలో వంశోహ్యద్యమే సఫలాః సుతాః | ఆశ్రమః సఫలోద్యైవ సర్వం సఫల మద్యమే || 25 ||

యద్భవాన్‌ యజ్ఞవాటంమేహ విర్భోక్తు మిహాగతః | యోగినో యోగనిరతాః హృధయే మృగయంతియం || 26 ||

తమద్యసాక్షాత్త్వాంపశ్యే సఫలోయంమమక్రతుః | ఇతీరయిత్వాతం విష్ణుం అర్చయిత్వాసనాదిభిః || 27 ||

చందనైఃకుసుమైరన్యైః దదత్వాచార్ఘ్యం సవిష్ణవే | ప్రదదౌ విష్ణవే ప్రీత్యా పురోడాశాది కం హవిః || 28 ||

స్వయమేవ సమాదాయ పాణినాలోకభావనః | హవిస్తద్బు భుజే విష్ణుః ముద్గలేన సమర్పితం || 29 ||

తస్మిన్‌ హవిషిభుక్తేతు విష్ణునా ప్రభవిష్ణునా | సాగ్నయస్త్రి దశాస్సర్వే తృప్తాః సమభవన్‌ ద్విజాః || 30 ||

ఋత్విజో యజమానశ్చతత్రత్యా బ్రాహ్మణాస్తథా | యత్కించిత్ర్పాణి లోకేస్మింశ్చరంవా యదివాచరం || 31 ||

సర్వమేవజగత్తృప్తం భుక్తేహవిషి విష్ణునా | తతోహరిః ప్రసన్నాత్మా ముద్గలం ప్రత్యభాషత || 32 ||

ప్రీతోహం పరదోస్మ్యే షవరం వరయసువ్రత | ఇత్యుక్తే కేశ##వేనాథ మహర్షిస్తమభాషత || 33 ||

తా || ముద్గలుని వచనము - మొదట జగత్‌ స్రష్టకు పిదప జగత్పాలనకు (15) ఆ పిదప జగత్‌ సంహర్తకు నారాయణుడవైన నీకు నమస్కారము. మత్య్స రూపునకు నమస్కారము. చితాద్ముడైన కూర్మరూపునకు (16) వరాహశరీరధారికి నమస్సులు. సింహరూపునకు నమస్సులు. వామనుడవైన నీకు నమస్కారము. జమదగ్ని సుతుడవైన నీకు నమస్సులు (17) రాఘవుడవైన నీకు నమస్సులు. బలభద్రుడవైన నీకు నమస్సులు. కృష్ణుడు కల్కి ఐన నీకు నమస్కారము. విజ్ఞాన రూపికి నమస్సులు (18) ఓ నారాయాణ ! జగత్పతి ! కరుణాసింధు! నన్ను రక్షించు నేను సిగ్గులేని వాడను లోభిని, క్రూరుణ్ణి, కొండెకాణ్ణి, దాంభికుణ్ణి, బలహీనుణ్ణి (19) వరులదార, ద్రవ్య,క్షేత్రముల యందే ఆసక్తి కలవాణ్ణి, అసూయతో నిండిన మనసు గలవాణ్ణి అట్టినన్ను ఓ హరి! దయతో రక్షించు (20) అని ముద్గలుడు స్తుతించగా హరి సాక్షాత్తు గా మేఘ గంభీరమైన వాక్కులతో ఆ ముద్గలమునితో ఇట్లా అన్నాడు. (21) శ్రీహరి వచనము - ఓ ముద్గల నీ ఈ స్తోత్రముతో ఈ నీక్రతువుతో సంతుష్టుడనైనాను. ప్రత్యక్షముగా హవిస్సును భుజించుటకు నేను నీ క్రతువునకు వచ్చినాను (22) అని హరి అనగా ముద్గలుడు సంతుష్ట మనస్కుడై పరమభక్తితో కూడినవాడై అధోక్షజునితో ఇట్లా అన్నాడు. (23) ముద్గల వచనము. ఓ హృక్షీకేశ ! నేను కృతార్థుడనైనాను. నా భార్య ధన్యత్వమందింది. నేటికి నా జన్మ సఫలమైంది. నేటికి నాతపస్సు సఫలమైంది (24) నేటికి నా వంశము సఫలమైంది. నేటికి నాసుతులు సఫలమైనారు. నా ఆశ్రమం సఫలమైంది. నేటి నాది అంతా సఫలమైంది (25) నీవు హవిస్సును భుజించుటకు నా ఈ యజ్ఞవాటమునకు వచ్చావు. యోగ నిరతులైన యోగులు హృదయంలో వెదికే (26) నిన్ను సాక్షాత్తుగా నేను చూస్తున్నాను. నా క్రతువు ఇది సఫలమైంది. అని ఆ విష్ణువుతో పలికి, ఆసనాదులతో ఆ విష్ణువునుపూజించి (27) చందనముతో పూలతో ఇతరమైన వాటితో విష్ణువునకు ఆతడర్ఘ్యమిచ్చి ప్రేమతో విష్ణువునకు పురోడాశాదికమైన

హవిస్సును ఇచ్చాడు (28) లోక భావనుడన విష్ణువు స్వయంగా తన చేతితో తీసుకొని ముద్గలుడు సమర్పించిన హవిస్సును భుజించాడు (29) ప్రభవిష్ణువైన విష్ణువు అహవిస్సు భుజించగా అగ్నులతో కూడిన దేవతలందరు తృప్తులైనారు (30) ఋత్విజులు యజమానుడు అక్కడున్న బ్రాహ్మణులు, ఈ ప్రాణిలోకమందున్న చరము ఆచరము అంతా (31) హవిస్సు విష్ణువు భుజించగా జగత్తంతా తృప్తమైంది. అప్పుడు హరి ప్రసన్నాత్ముడై ముద్గలునితో ఇట్లా అన్నాడు. (32) ఓ సువ్రత ! నేను ప్రీతుడినైనాను. నేను వరమివ్వదలిచాను. వరాన్ని వేడుకో. అని కేశవుడనగా అప్పుడు మహర్షి అతనితో ఇట్లా అన్నాడు. (33)

మూ|| ముద్గల ఉవాచ -

యత్త్వయామే హవిర్భుక్తంయాగే ప్రత్యక్షరూపిణా | అనే నైవకృతార్థోస్మి కిమస్మాదధికం వరం || 34 ||

తథాపి భగవన్విష్ణో త్వయిమే నిశ్చలానదా | భక్తిర్నిష్కవటాభూయాదిదంమే ప్రథమంవరం || 35 ||

మాధవాహం ప్రతిదినం సాయం ప్రాతరిహాగ్నయే | త్వద్రూ పాయతవ ప్రీత్యై సురభేః వయసాహరే || 36 ||

హేతు మిచ్ఛామివరద తన్మేదేహి వరాంతరం | వయసానిత్యహోమోహిద్వికాలం శ్రుతిచో దితః || 37 ||

నమేనురభయః నంతి తాపసస్యాధనస్యచ | ఇత్యుక్తే ముద్గలే నాథ దేవోనారాయణో హరిః || 38 ||

అహూయ విశ్వకర్మాణం త్వష్టారమృతాశినం | ఏకంనరః కారయిత్వాశిల్పినాతేన శోభనం || 39 ||

స్ఫటికాది శిలాభేదైః తేనాసౌ విశ్వకర్మణా | సమీచకార చపునః తత్ర్పాకారా ద్యలంకృతం

తత అహూయ భగవాన్‌ సురభిం వాక్యమ బ్రవీత్‌ || 40 ||

శ్రీ హరిరువాచ -

ముద్గలో మమభక్తోయంసురభేప్రత్యహంముదా || 41 ||

మత్ర్పీత్యర్థంపయోహోమంకర్తుమిచ్ఛతిసాంప్రతం | మత్ప్రీత్యర్థమితోదేవిత్వమతో మత్ర్పచోదితా || 42 ||

సాయంప్రాతరిహాగత్య ప్రత్యహం సురభే శుభే | వయసాత్వత్‌ప్రసూతేన నర ఏతత్ర్ప పూరయ || 43 ||

తేనాసౌ వయసానిత్యం సాయం ప్రాతశ్‌చహోష్యతి | ఓమిత్యుక్త్వాథసురభి రేవం నారాయణరితా || 44 ||

అథనారాయణో దేవో ముద్గలం ప్రత్యభాషత | సురభేః వయసానిత్యం అస్మిన్సరసితిష్ఠతా || 45 ||

సాయంప్రాతః ప్రతిదినం మత్ర్పీత్యర్థ మిహాగ్నయే | జుహుధిత్వం మహాభాగతేనప్రీణా మ్యహంతవ || 46 ||

మత్ర్పీత్యాతేఖిలాసిద్ధిః భవిష్యతిచ ముద్గల | ఇదం క్షీరనరోనామ తీర్థం ఖ్యాతం భవిష్యతి || 47 ||

అస్మిన్‌ క్షీరసరస్తీర్థే స్నాతానాం పంచపాతకం | అన్యాన్య పిచపాపానినాశం యాస్యంతి తత్‌ క్షణాత్‌ || 48 ||

ముద్గలత్వంచ మాంయాహి దేహాంతేముక్తబంధనః | ఇత్యుక్త్వా భగవాన్‌ విష్ణుఃతంసమాలింగయముద్గలం || 49 ||

నమస్కృతశ్చతే నాయం తత్రైవాంతరధీయత || 49 1/2 ||

తా || ముద్గలుడిట్లన్నాడు - యాగంలో ప్రత్యక్ష రూపంగా నాహవిస్సును నీవు తిన్నావు. దీనితోనే నేను కృతార్థుడినయ్యాను. ఇంతకన్న అధికమైన వరం ఏం కావాలి (34) ఐనా ఓ భగవాన్‌ ! విష్ణు ! నీ యందు నాకు నిశ్చల భక్తి నిష్కపటమైనది ఎల్లప్పుడు ఉండని ఇది నా తొలివరము (35) ఓ మాధవ ! నేను ప్రతిరోజు సాయంప్రాతః కాలములందు ఇక్కడ నీ రూపుడైన అగ్నిలో నీ ప్రీతికొరకు సురభి యొక్క పాలతో ఓ హరి ! (36) హోమము చేయదలిచాను. ఓ వరదుడ! అందువల్ల నాకు ఇదొక వరమును ఇవ్వు. శ్రుతి ప్రకారము రెండు కాలమలందు పాలతో నిత్య హోమము చేయాలి (37) నాకు సురభులు లేవు నేను తాపసుణ్ణి, అధనుణ్ణి. అని ముద్గలుడనగా దేవుడు నారాయణుడు ఐన హరి (38) అమృతాశియైన త్వష్టను విశ్వకర్మను పిలిచి ఆ శిల్పితో శోభనమైన ఒక సరస్సును చేయించి (39) ఆ విశ్వకర్మతో స్ఫలికాదిశిలా భేదములతో దానిని ప్రాకారాదులతో అలంకరింపబడేట్లు చేయించాడు. ఆ పిదప భగవంతుడు సురభిని పిలిచి దానితో ఇట్లా అన్నాడు (40) శ్రీహరి వచనము - ఓ సురభి! ఈ ముద్గులుడు నా భక్తుడు ప్రతిరోజు సంతోషంగా (41) నా ప్రీతి కొరకు పాలతో హోమమును ఇప్పుడు చేయదలిచాడు. ఓదేవి ! ఇప్పటినుండి నా ప్రీతికొరకు నీవు నాతో ప్రేరేపింపబడి (ఆజ్ఞ) (42) ఓ శుభ##మైన సురభి, ప్రతిరోజు సాయంకాలము ప్రొద్దుటి పూట ఇక్కడకు వచ్చి నీనుండి వచ్చే పాలతో ఈ సరస్సును పూరించు. (43) ఆ పాలతో ఈతడు ప్రతిరోజు సాయం ప్రాతః కాలములందు హోమం చేస్తాడు. అని నారాయణుడు చెప్పగా సురభి సరే అని అనగా (44) అప్పుడు నారాయణుడు ముద్గలునితో ఇట్లా అన్నాడు. ఈ సరస్సులో ఉండే సురభి పాలతో నిత్యము (45) సాయంప్రాతః కాలములందు నా ప్రీతికొరకు ఇక్కడ నీవు హోమం చేయి. ఓ మహాభాగ! దానితో నేను నీ యందు ప్రీతుడనౌతాను. (46) ఓ ముద్గల ! నా ప్రీతితో నీకు అన్ని సిద్ధులుకల్గుతాయి. (సిద్ధిస్తాయి) ఇది క్షీరసరమనే తీర్థంగా ఖ్యాతి వహిస్తుంది. (47) ఈ క్షీరసరస్సులో స్నానం చేసిన వారికి పంచ పాతకములు ఇతర పాపములు కూడా ఆ క్షణంలోనే నశిస్తాయి (48) ఓ ముద్గల ! దేహాంతమందు బంధవిముక్తుడవై నీవు నన్ను చేరుతావు అని పలికి భగవాన్‌ ! విష్ణువు! ఆ ముద్గలుని కౌగిలించుకొని (49) ఆతనితో నమస్కరింపబడి అక్కడే అంతర్థానమైనాడు (49 1/2)

మూ || ముద్గలోపిగతే విష్ణావనేక శత వత్సరం || 50 ||

సురభేః వయసాజుహ్మన్నగ్నయే హరితుష్టయే | ఉవాస ప్రయతోనిత్యం పుల్లగ్రామ విముక్తిదే

దేహాంతే ముక్తి మగమత్‌ విష్ణుసాయుజ్య రూపిణీం || 51 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవమే తద్ద్విజవరాః యుష్మాకం కథితం మయా || 52 ||

యథా క్షీరసరోనామ తీర్థస్యాస్య పురాభవత్‌ | ఇదం క్షీరనరః పుణ్యం సర్వలోకేషు విశ్రుతం || 53 ||

కాశ్యపస్యమునేః పత్నీ కద్రూర్యత్ర ద్విజోత్తమాః | స్నాత్వాస్వభర్తృవాక్యేన నోదితా నియమాన్వితా || 54 ||

ఛలేన మముచే సద్యః సపత్నీ జయదోషతః | అతోత్రతీర్థేయే స్నాంతి మానవాః శుద్ధమానసాః || 55 ||

తేషాం విముక్త బంధానాం ముక్తానాం పుణ్యకర్మినాం | కింయాగైః కిమువావేదైః కింవాతీర్థనిషేవణౖః || 56 ||

జపైర్వానియమైర్వాపి క్షీరకుండ విలోకినాం | క్షీరకుండన్య వాతేన స్పృష్టదేహోనరోద్విజాః || 57 ||

బ్రహ్మలోక మనుప్రాప్య తత్రైవ పరిముచ్యతే | నిమగ్నాః క్షీరకుండేస్మిన్నవమత్యాపి భాస్కరిం || 58 ||

తస్యమూర్థనితిష్ఠేయుః జ్వలంతః పాపకోపమాః | మగ్నానాం క్షీకుండేస్మిన్‌ శీతావైతరణీ నదీ || 59 ||

సర్వాణి నరకాణ్యాద్ధా వ్యర్ధాని చ భవంతి హి | కామధేను సమేతస్మిన్‌ క్షీరకుండే స్థితేప్యహో || 60 ||

యోస్యత్ర భ్రమతేస్నాతుం సనరోవిప్రసత్తమాః | గోక్షీరే విద్యమానేపి హ్యర్క క్షీరాయ గచ్ఛతి || 61 ||

స్నాతానాం క్షీరకుండే స్మి న్నాల భయం కించి దస్తిహి ! కరప్రాపై#్తవ ముక్తిః స్యాత్‌కి మన్యైర్బహుభాషణౖః|| 62

బ్రవీమిభుజముద్ధృత్య సత్యం బ్రవీమివః | యః వఠేదిమ మధ్యాయం శృణు యాధ్వాసమాహితః .

సక్షీరకుండస్నానస్యలభ##తే ఫలముత్తమం 63

ఇతి శ్రీ స్కాందే మహాపురాణఏకాశీతి సాహస్ర్యా సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమహాత్మ్యే క్షీరకుండ ప్రశంసాయాం క్షీరకుండ స్వరూప కథనం నామ సప్తత్రింశోధ్యాయః 37

తా|| విష్ణువు వెళ్ళాక ముద్గలుడు కూడా అనేక శతవత్సరములు (50) సురభి పాలతో హరితుష్ఠి కొరకు అగ్నిలో హోమం చేస్తూ ముక్తినిచ్చే పుల్లగ్రామమందు పరిశుధ్దుడై ఎప్పడూ దేహాంతమందు విష్ణు సాయుజ్యరూపమైన ముక్తిని పొందాడు. (51) శ్రీ సూతిలిట్లనిరి - ఓ ద్విజశ్రేష్ఠులార ! ఈ విధముగా దీనిని మీకు నేను చెప్పాను. (52) దీనికి క్షీరసరస్సు అనే పేరు పూర్వం ఎట్లా వచ్చిందో చెప్పాను. ఈ క్షీర సరస్సు పుణ్య ప్రదమైంది. సర్వలోకమములందు ప్రసిద్దమైనది. (53) ఓబ్రహ్మణులారా ! కాశ్యపముని కద్రువ తన భర్త వాక్యంతో ప్రేరేపింపబడి నియమంతో ఇక్కడ స్నానం చేసి (54) ఛలంగా సాధించిన నవత్నీ జయ దోషంనుండి వెంటనే ముక్తురాలైంది. అందువల్ల శుద్ద మనస్కులై ఈ తీర్థమందు స్నానం చేసిన మానవులకు (55) బంధవిముక్తులకు ముక్తులకు పుణ్య కర్ములకు యాగములతో వేదములతో, తీర్థనిషే వణములతో ఏమి పని (56) క్షీరకుండమును చూసిన వారికి జపములతో నియమములతో పనిలేదు. క్షీరకుండవు. గాలితో స్పృశింపబడిన శరీరం గల నరుడు (57) బ్రహ్మలోకుమును చేరి అక్కడే ముక్తుడౌతాడు. యముని అవమానించి కూడా క్షీరకుండమందు స్నానం చేస్తే (58) అతని శిరస్సు యందు అగ్నితో సమానమై(న) వెలుగులు ఉంటాయి. క్షీర కుండమందు మునిగిన వారికి వైతరిణి నది చల్లగా ఉంటుంది. (59) నరకములన్ని వ్యర్థమైతాయి. కామధేనువుతో సమానమైన ఆ క్షీరకుండ ముండగా కూడా (60) వేరేచోట స్నానం చేయటానికి తిరిగే నరుడు ఆవుపాలుండగా కూడా జిల్లేడు పాలకోసం పోయినట్టు(61) క్షీరకుండంలో స్నానం చేసిన వారికి అలభ్యమైనది ఏదీ లేదు. ముక్తిహస్తగతమైనట్టే. ఎక్కువగా చెప్పి ఏం లాభం (62) చేతులెత్తి చెప్తున్నాను. నిజం, నిజం చెప్తున్నాను మీకు ఈ అధ్యాయమును చదివిన వారు, చక్కగా ఉండి విన్నవారు క్షీరకుండ స్నానం వల్ల వచ్చే ఉత్తమ ఫలాన్ని పొందుతారు. (63) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మహత్మ్యమందు క్షీరకుండ ప్రశంస యందు క్షీరకుండ స్వరూపము చెప్పుట అనునది ముప్పది ఏడవ అధ్యాయము 37

Sri Scanda Mahapuranamu-3    Chapters