Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఎనిమిదవ అధ్యాయము

మూ || ఋషయ ఊచుః-

నూత కద్రూః కథం ముక్తా క్షీరకుండ ని మజ్జనాత్‌! ఛలంకథం కృతవతీ నవత్న్యాం పాపనిశ్చయా ||1

కన్యపుత్రీచ సాకద్రూః నవత్నీ సాచకన్యవై ! కిమర్థమజయత్కద్రూః స్వసపత్నీం ఛలేనతు ఏతన్నః శ్రద్ద ధానానాం బ్రూహినూతకృపానిధే 2

శ్రీ నూత ఉవాచ -

శృణు ధ్వంమునయస్సర్వే ఇతి హాసం మహాఫలం ! పురాకృతయుగే విప్రాః ప్రజాపతి సుతే ఉభే 3

కద్రూశ్చ వినతా చేతి భగిన్యౌనంబ భూవతుః ! భార్యేతే కశ్యపస్యాస్తాం కద్రూశ్చ వినతాతథా 4

వినతా నుషువే పుత్రా వరుణం గరుడం తథా భర్తుస్సకాశాత్కద్రూశ్చలే భే నర్పాన్‌ బహూన్‌ నుతాన్‌ 5

అనంతవాసుకిముఖాన్‌ విషదర్పనమన్వితాన్‌! ఏకదాతు భగిన్యౌతే కద్రూశ్చ వినతా తథా 6

ఆవశ్యతాం సమాయాంతముచ్చేః శ్రవసమంతికాత్‌ ! విలోక్యకద్రూస్తురగం వినతామిదమబ్రవీత్‌ 7

శ్వేతో శ్వ వాలోనీలోవా వినతే బ్రూహితత్వతః | ఇత్యుక్త్వా వినతా విప్రాః కద్రూంతా మిదమ బ్రనీత్‌ 8

తురగః శ్వేతవాలోమే ప్రతిభాతి సుమధ్యమే! కింవాత్వం మన్యసే కద్రూః ఇతితాం వినతా బ్రవీత్‌ 9

వృష్ట్యైవం వినతా క ద్రూర్భభాషే న్వమతం చసా ! కృష్ణవాల మహంమన్యే హయమేనమనిందితే 10

తతః పరాజయే కృత్వాదాసీ భావం పణం మిధః! వ్యతిష్టేతాం మహాభాగే నవత్న్యౌ తేద్విజోత్తమాః 11

తతః కద్రూర్ని జ నుతాన్వాసుకి ప్రముఖానహీన్‌ ఔ తస్యానాహం యథాదాసీత థాకురుత పుత్రకాః 12

తస్యాభీప్సిత సిద్ధ్యర్ధ మిత్యవోచర్భృశాతురా ! యుష్మాభిరుచ్చైః శ్రవసోవాలః ప్రచ్చాద్యతామితి 13

నాంగీచ క్రుర్మతం తస్యానాగా ః కద్రూరుషాతదా! అశపత్కుపితావుత్రాన్‌ జ్వలంతీ దోషమూర్ఛితా 14

పరీక్షిత వ్యసర్వేద్దా యూయం సత్రేమరిష్యథ! ఇతి శాపేకృతే మాత్రాత్రస్తః కర్కోట క్తస్తదా 15

ప్రణమ్య పాదయోః కద్రూం దీనో వచనమ బ్రవీత్‌ ! అహముచ్చైః శ్రవోవాలం విధాస్యామ్యం జనప్రభం 16

మా భీరంబ త్వయాకార్యేత్య వాదీచ్చా వవిక్లవః ! శ్వేతముచ్చైః శ్రవోవాలం తతః కర్కోటకోరగః 17

ఛాదయిత్వాస్వభోగేన వ్యతనోదం జనద్యుతిం !

తా|| ఋషులిట్లనిరి - ఓ సూత ! కద్రువ క్షీరకుండ నిమజ్జనము వలన ఎట్లా ముక్తురాలైంది. పాపా నిశ్చయురాలై నవతి యందు కవటమెట్లా ఆచరించింది. (1) ఆ కద్రువ ఎవరి కూతురు, ఎవరికి నపవతి, తన నవతిని నెపంతో కద్రువ ఎందుకు జయించింది. సూత! కృపానిధి! శ్రద్ధ గలిగిన మాకు దీనిని చెప్పండి. (2) అనగా శ్రీ సూతులిట్లన్నారు. ఓమునుల్లారా ! మీరంతా మహా ఫలమునిచ్చే ఈ ఇతిహాసాన్ని వినండి. పూర్వం కృతయుగమందు ప్రజాపతి సుతులు ఇద్దరు (3) కద్రువ వినత అని అక్కాచెల్లెండ్రు ఉండేవారు. కద్రువ వినత వారిద్దరు కశ్యవునకు భార్యలుగా ఉండిరి (4) వినత అరుణుని, గరుడుని ప్రసవించింది. భర్త దగ్గర నుండి కద్రువ సర్పములను చాలా మంది సుతులను పొందింది (5) అనంత వాసుకి మొదలుగా గల విషదర్ప సమన్వితులైన వారిని పొందింది. ఒకసారి అక్కాచెల్లెండ్రైన ఆ కద్రువినతలు (6) సమీపం నుండి వస్తున్న ఉచ్చైశ్రవ మను గుణ్ణాన్ని చూచారు. కద్రువ గుఱ్ఱాన్ని చూచి వినతతో ఇట్లా అంది . (7) ఓ వినత ! గుఱ్ఱముతోక తెలుపా నలుపా నిజంగా చెప్పు అని అనగా ఓవిప్రులార! వినత కద్రువతో ఇట్లా అంది (8) ఓ సుమధ్‌య ! గుఱ్ఱముతోక తెల్లగా నాకు కన్పిస్తోంది. మరి ఓ కద్రువ ! నీవేమనుకుంటున్నావు. అని ఆమెను వినత అడిగింది. (9) కద్రువ ఇట్లా వినతను అడిగి ఆమె తన అభిప్రాయాన్ని ఇట్లా చెప్పింది. ఓ అనిందిత ! ఈ గుఱ్ఱముతోక నల్లనిదని నేను భావిస్తాను. అని (10) పిదప ఓడినచో దాసీ భావము పణముగా పరస్పరము ఏర్పరచుకొని ఆ నవతులు ఉన్నారు. ఓ బ్రహ్మణులారా ! (11) పిదప కద్రువ వాసుకి ప్రముఖులైన సర్పములను తన సుతులను పిలిచి, ఓపుత్రులారా ! ఆమెకు నేను దాసీకాకుండా చూడండి. అనికోరింది (12) తన అభీష్ట సిద్ధికొరకు మిక్కిలి ఆతురురాలై ఇట్లా అంది మీరు. ఉచ్చైః శ్రవము యొక్కతో కనుకప్పండి, అని (13) ఆమె అభిప్రాయమును పాములు అంగీకరించలేదు. అప్పుడు కద్రువ కోపంతో, మండిపోతూ రోషమూర్ఛితయై శపించింది. (14) పారీక్షితుని సత్రయాగమందు మీరంతా చావండి అని తల్లి శాపం పెట్టగా భయపడి కర్కోటకుడప్పుడు (15) కద్రువ పాదములకు నమస్కరించి దీనుడై ఇట్లా అన్నాడు. నేను ఉచ్చైః శ్రవము యొక్క తోకను కాటుకవలె మెరిసేట్టుగా చేస్తాను (16) ఓ అమ్మ! నీవు భయపడొద్దు. అని శాపమునకు భయపడి పలికాడు. తెల్లనైన ఉచ్చైః శ్రవముతోకను కర్కోటకుడను పాము (17) తన పడగతో కప్పి కాటుక కాంతికలిగేట్టుగా చేశాడు.

మూ|| అథతేవినతా కద్ర్వౌదాస్యేకృతపణఉభే 18

దేవరా జహయంద్రష్టుంనంరంభాదభ్యగచ్ఛతాం ! శశాంకశంఖమాణిక్యముక్తై రావతకారణం 19

యుగాంతకాలశయనం యోగనిద్రాకృతోహారేః ! అతీత్యక ద్రూవినతే సముద్రం నరితాంవతిం 20

దదృశతుర్హయం గత్వా దేవరాజస్యవాహనం ! కృష్టవాలం హయందృష్ట్యా వినతాదుఃఖితాభవత్‌ 21

దుఃఖితాంవినతాంకద్రూః దాసీకృత్యేన్యముంక్తసా! ఏతస్మిన్నంతరేతార్‌క్ష్యోవ్యండముద్భిద్యవహ్నివత్‌ || 22 ||

ప్రాదుర్భభూవనిప్రేంద్రా గిరిమాత్ర శరీరవాన్‌ | దృష్ట్యాతద్దేహమాహాత్మ్య మభూత్త్రస్తం జగత్త్రయం || 23 ||

తతస్తం తుష్టువుర్దేవా గరుడం వక్షిణాం వరం | దృష్ట్యాతద్దేహ మహాత్మ్యం త్రస్తం స్యాధ్య్బవనత్రయం || 24 ||

ఇత్యాలోచ్చోవసంహృత్యదేహమత్యంతభీషణం | అరుణం వృష్ఠమారోవ్యమాతురంతిక మభ్యగాత్‌ || 25 ||

అథాహవినతాం కద్రూః ప్రణతామతి విహ్వలాం | చేటినాగాలయం గంతుముద్యోగో మమవర్తతే || 26 ||

త్వత్పుత్రో గరుడో తోమాం మత్సుత్రాంశ్చవహత్వితి | తతశ్చవినతాపుత్రం గరుడం ప్రత్యభాషత || 27 ||

అహం కద్రూ మిమాంవక్ష్యేత్వం సర్పన్వహతత్సుతాన్‌ ! తథేతి గరుడోమాతుః ప్రత్యగృహ్ణద్వచోద్విజాః || 28

అవహద్విన తాకద్రూం సర్వాం స్తాన్గరుడో వహత్‌ | రవి సామీప్యగాః నర్పాస్తత్రరై రాహతాస్తదా || 29 ||

అస్తౌషీ ద్వజ్రిణం కద్రూః నుతానాం తావశాంతయే | సర్వతాపం జలాసారైః దేవరాజోవ్యశామయత్‌ || 30 ||

నీయమానస్త దానర్పాః గరుడేన బలీయసా | గత్వాతం దేశమచిరాదపదన్వినతాసుతం || 31 ||

వయం ద్వీపాంతరం గంతుం సర్వేద్రష్టుం కృతత్వరాః | వహత్వమస్మాన్గరుడ చేటీసుతతతః క్షణాత్‌ || 32 ||

తతో మాతర మప్రాక్షి ద్వినతాం గరుడోద్విజాః | అహంకస్మాద్వహా మీమాంస్త్వం చే మాంపహసేనదా || 33 ||

చేటీపుత్రేతిమామేతే కింభణంతి నరీసృపాః | సర్వమేతత్‌ పదత్వం మేమాతః తత్వేన పృచ్ఛతః || 34 ||

తా || పిదప ఆ వినత కద్రువలు ఇద్దరు దాస్యము పణంగా గలిగి (18) దేవతల రాజు గుఱ్ఱాన్ని చూడటానికి తొందరగా వెళ్ళారు. చంద్రుడు, శంఖము, మాణిక్యములు, ముత్యములు, ఐరావతము వీటికి కారణమైన (19) యోగనిద్ర యందున్న హరికి యుగాంతకాలమందు పడకయైన సరిత్పతియైన సముద్రమును కద్రూని సతలు దాటి (20) వెళ్ళి దేవరాజు వాహనమైన గుఱ్ఱమును చూచారు. నల్లని తోక గల గుఱ్ఱాన్ని చూచి వినత దుఃఖిత ఐంది. (21) దుఃఖితయైన వినతను కద్రుప దాసీ కృత్యమందు నియోగించింది. ఇంతలో తార్‌క్ష్యుడు గుడ్డును ఛేదించుకొని అగ్నివలె (22) జన్మించాడు. ఓ బ్రాహ్మణులార ! అతని శరీరం ఒక పర్వతమంత ఉంది. అతని దేహ మాహాత్మ్యాన్ని చూచి ముల్లోకములు భయపడ్డాయి. (23) ఆ పిదప దేవతలు పక్షులలో శ్రేష్ఠుడైన ఆ గరుడునిస్తుతించారు. అతని దేహమాహాత్మ్యాన్ని చూచి ముల్లోకములు భయపడ్డాయి. (24) అని ఆలోచించి అత్యంత భయంకరమైన తన దేహాన్ని ఉపసంహరించుకొని అరుణున్ని వీపుపై కూర్చోపెట్టుకొని తల్లి దగ్గరకు వచ్చాడు (25) అప్పుడుకద్రువ నమస్కరిస్తున్న మిక్కిలి చలించిపోతున్న వినతతో ఇట్లా అంది. ఓ చేలి!: నాకు నాగాలయం పోవాలనే ఆలోచన ఉంది (26) అందువల్ల నీ పుత్రుడైన గరుడుడు నన్ను నాపుత్రులను మోయాలి అని. అప్పుడు వినత, పుత్రుడైన గరుడునితో ఇట్లా అంది. (27) నేను ఈ కద్రువను మోస్తాను. ఆమె కొడుకులైన సర్పములను నీవు మోయి అని. అట్లాగే అని గరుడుడు తల్లి మాటలను అంగీకరించాడు. (28) వినత కద్రువను మోస్తోంది. మిగిలిన అందరిని గరుడుడు మోసాడు. అప్పుడు సూర్యుని సమీపం నందున్న సర్పములు అతని కిరణాలతో కొట్టబడినారు (29) కొడుకుల తాపశాంతి కొరకు కద్రువ ఇంద్రుని స్తుతించింది. దేవరాజు అందరి తాపమును నీటి ధారతో శమింపచేశాడు (30) బలవంతుడైన గరుడుడు సర్పములను తీసుకు వెళుతుంటే ఆ పాములు వినతాసుతునితో అన్నాయి. ఆ దేశమునకు తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళు (31) మేము ద్వీపాంతరం వెళ్ళటానికి, అందరం చూడటానికి తొందరపడుతున్నాము. నీవు మమ్ములను క్షణంలో మోయి ఓగరుడ! చేటీ సుత! అని (32) అప్పుడు గరుడుడు తన తల్లియైన వినతను అడిగాడు. నేను వీరిని ఎందుకు మోస్తున్నాను. నీవు ఈమెను ఎప్పుడూ మోస్తున్నావు. ఎందుకొరకు (33) ఈ పాకేవాళ్ళు నన్ను చేటీపుత్ర అని ఎందుకంటున్నారు. నిజంగా అడుగుతున్న నాకు నీవు ఇదంతా చెప్పు తల్లి, అని (34).

మూ || పృష్టైవం జననీతేన గరుడం ప్రాబ్రవీత్సుతం | భగిన్యాక్రూరయాపుత్రఛలేనాహం పరాజితా || 35 ||

తస్యాదాసీభవామ్యద్యచేటీపుత్రస్తతోభవాన్‌ | అతస్త్వం వహసేసర్పాన్‌ వహామ్యేనామహం సదా || 36 ||

ఇత్యాది సర్వవృత్తాంతమాదితోసై#్మన్యవేదయత్‌ | అథతాం గరుడోవాదీన్మాతరం వినతాసుతః || 37 ||

అస్మాద్దాస్యాద్విమోక్షార్థం కింకార్యంతే మయాధునా | ఇతి పృష్టాసుతే నాథ వినతా తమ భాషత || 38 ||

సర్పాన్పృచ్ఛస్వ గరుడ మనుమాతృవిమోక్షణ | యుష్మాకం మాతుః కింకార్యం మమేతి వదతాధునా || 39 ||

ఇతిమాత్రానముదితోగరుడః పన్నగాన్ర్పతి | గత్వాపృచ్ఛద్ద్విజశ్రేష్ఠాస్తేప్యేన మవదంస్తదా || 40 ||

యదాహరిష్యసే శీఘ్రంసుధాం త్వమమ రాలయాత్‌ | దాస్యాన్ముక్తా భ##వేన్మాతా వైనతేయతరవాద్యహి || 41 ||

తతో మాతరమాగమ్యగరుడః ప్రణతోబ్రవీత్‌ | సుధామంబ మమానే తుంగచ్ఛతో భక్ష్యమర్పయ || 42 ||

ఇతీరితా సుతం ప్రాహ మాతాతం వినతాసుతం | సముద్రమధ్యే వర్తంతే శబరాః కతిచిత్సుత || 43 ||

తాన్భక్ష యిత్వా శబరాసమృతం త్వమిహానయ | తత్ర కశ్చిత్‌ ద్విజః కామీ శబరీ సంగకౌతుకీ || 44 ||

త్యజతం బ్రాహ్మణం కంఠం దహంతం బ్రహ్మతేజసా | పక్షాదీనితవాం గాని పాంతుదేవా మరున్ముఖాః || 45 ||

ఇతిస్వమాతురాశీర్భిః గరుడో వర్థితో య¸° | శబరాలయ మభ్యత్యతస్యభక్షయతోముఖం || 46 ||

ఆవృతం ప్రవిశన్వ్యా ధావయాం నీపదరీంగిరేః | అథనబ్రాహ్మణోప్యాగాత్తత్కంఠం మునిపుంగవాః || 47 ||

కంఠం దహంతం విప్రంతమువాచ వినతాసుతః | విప్రపాపోప్య వధ్యో హి నిర్యాహిత్వమతోబహిః || 48 ||

ఏవముక్తస్తదా విప్రోగరుడం ప్రత్యభాషత | కిరాతీమమభార్యాపి నిర్గతవ్యామయాసహ || 49 ||

ఏవమస్త్వితి తంవ్రి పము వాచవతగేశ్వరః తతః సగరుడో విప్రముజ్జగార సభార్యకం || 50 ||

విప్రోప్య భీప్సితాన్దేశాన్ని షాద్యాసహనిర్య¸° | శబరాన్భక్షయిత్వాథ గరుడః పక్షిణాం పరః || 51 ||

ఆత్మనః పితరం వేగాత్కశ్యపంసముపేయివాన్‌ || 51 1/2 ||

తా || గరుడుడు తల్లిని ఇట్లా అడుగగా తల్లి సుతునితో ఇట్లా అంది. ఓపుత్ర! క్రూరురాలైన సోదరితో నెపంతో ఓడింపబడ్డాను (35) అందుకే ఈ వేళ ఆమెకు దాసీనయ్యాను. నీవు అందుకే చేటీ పుత్రుడవైనావు. అందుకే నీవు సర్పాలను మోస్తున్నావు. ఎప్పుడూ ఈమెను నేను మోస్తున్నాను (36) అని మొదలుగా వృత్తాంతాన్నంతా మొదటి నుండి ఈతనికి నివేదించింది. పిదప ఆ తల్లితో వినతాసుతుడైన గరుడుడు ఇట్లా అన్నాడు (37) ఈ దాస్యం నుండి విముక్తి కొరకు నీకు నేను ఇప్పుడేం చేయాలి అని సుతుడడుగగా వినత అతనితో ఇట్లా అంది. (38) ఓ గరుడ! నేను మరి నాతల్లి విమోక్షణ కొరకు మీకు, మరి మీతల్లికి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి అని సర్పములనడుగు (39) అని తల్లి చెప్పగా గరుడుడు పాముల దగ్గరకు వెళ్ళి అడుగగా, ఆపాములు అప్పుడు అతనితో ఇట్లా అన్నాయి (40) నీవు అమరాలయంనుండి అమృతమును త్వరగా తెచ్చిన వెంటనే నీతల్లి దాస్యం నుండి ముక్తురాలౌతుంది. ఓ వైనతేయ అని (41) పిదప తల్లి దగ్గరకు వచ్చి గరుడుడు నమస్కరించి ఇట్లా అన్నాడు. ఓతల్లి! అమృతాన్ని తేవటానికి పోతున్న నాకు ఆహారాన్ని ఇవ్వు (42) అని అనగా తల్లి ఆ వినతాసుతినితో ఇట్లా అంది. ఓ కుమార! సముద్రమధ్యలో కొందరు శబరులున్నారు (43) ఆ శబరులను తిని అమృతాన్ని నీవు ఇక్కడికి తీసుకురా అక్కడ శబరస్త్రీ సంగమమందు ఉత్సాహం కల కామిద్విజుడు ఎవడైనా ఉంటే (44) వానిని తన బ్రహ్మతేజస్సుతో కంఠమును కాలుస్తున్న వాణ్ణి ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టు. రెక్కలు మొదలగు నీ అవయవములను మరుత్తు మొదలగు దేవతలు రక్షించని (45) అని తల్లి ఆశీస్సులు పొంది గరుడుడు పెద్దగా పెరిగి వెళ్ళాడు శబరాలయమునకు వచ్చి భుజిస్తున్న ఆతని ముఖంలోకి (46) తెరచిన నోటిలో వ్యాధులు ప్రవేశించారు. ఓ మునిశ్రేష్ఠులార ! (47) కంఠంను కాలుస్తున్న విప్రునితో వినతాసుతుడిట్లన్నాడు. బ్రాహ్మణుడు పాపియైనా చంపతగనివాడు. అందువల్ల నీవు బయటకిరా (48) అని అనగా అప్పుడు బ్రాహ్మణుడు గరుడునితో ఇట్లా అన్నాడు. నాతోపాటు నా భార్యయైన కిరాతికూడా బయటకి రావాలి అని (49) అట్లాగే కానిమ్మని ఆ బ్రాహ్మణునితో పక్షిరాజు అన్నాడు. అప్పుడు గరుడుడు భార్యతో కూడా ఆ బ్రాహ్మణుని వదిలాడు (50) విప్రుడుకూడా తన కిష్టమైన ప్రదేశములకు నిషాదితో కూడా వెళ్ళాడు. పక్షిపరుడైన గరుడుడు శబరులను తిని పిదప (51) తన తండ్రియైన కశ్యపుని దగ్గరకు వేగంగా చేరాడు.

మూ|| కుత్రయాసీతి తత్పృష్టో గరుడస్తమభాషత || 52 ||

మాతుర్దాస్య విమోక్షాయ సుధామాహర్తుమాగమం | బహూన్‌ కిరాతాన్‌ జగ్ధ్యాపి తృప్తిర్మమనజాయతే || 53 ||

అపర్యంతక్షుధాబ్రహ్మన్‌ బాధతే మామహర్నిశం | తన్నివృత్తి ప్రదం భక్ష్యం మ మార్పయతపోధన || 54 ||

యేనాహం శక్నుయాంతాతసుధామాహర్తమోజసా | ఇతీరితః సుతం ప్రాహకశ్యపో వినతోద్భవం || 55 ||

కశ్యప ఉవాచ -

మునిర్విభావ సుర్నామ్నా పురాసీత్తస్యసానుజః | సుప్రతీక ఇతి భ్రాతా తాపుభౌవంశ##వైరిణౌ || 56 ||

అన్యోన్యం శేవతు ర్విప్రామహాక్రోధసమాకులౌ | గజోభవత్సుప్రతీకః కూర్మోభూచ్చ విభావసుః || 57 ||

ఏవం విత్తవివాదాత్తౌ శేవత్తుర్‌భ్రాత రౌమిథః | గజః షడ్యోజనోచ్ఛ్రాయో ద్విగుణాయామ సంయుతః || 58 ||

కూర్మస్త్రియోజనోచ్ఛ్రాయో దశయోజనవిస్తృతః | బద్థవైరావుభావేతౌ సరస్యస్మి న్విహంగమ || 59 ||

పూర్వవైరమనుస్మృత్య యుధ్యేతే జేతుమిచ్ఛయా | ఉభౌతౌ భక్షయిత్వాత్వం సుధామాహరతృప్తిమాన్‌ || 60 ||

ఏవంపిత్రేరితః పక్షీగత్వాతద్గజకచ్ఛపౌ | సముద్ధృత్యమహాకా¸°మహాబలపరాక్రమౌ || 61 ||

వహన్నఖాభ్యాం సంతీర్థం విళం బా భిధమభ్యగాత్‌ | తత్రాగతం సమాలోక్య పక్షిరాజ ద్విజోత్తమాః || 62 ||

తత్తీరజోమహావృక్షో రోహిణాభ్యో మహోచ్ఛ్రయః | వైనతేయమిదం ప్రాహామహాబలపరాక్రమం || 63 ||

ఏవమారుహమచ్ఛాఖాం శతయోజనమాయతాం | స్థిత్వాత్రగజకూర్మే త్వం భక్షయన్వఖగోత్తమ || 64 ||

ఇత్యుక్తస్తరుణావక్షీ సతత్రాస్తే మనోజవః | తద్భారాత్సాతరోః శాఖాభగ్నాభూద్ద్విజసత్తమాః || 65 ||

వాలఖిల్యమునీంస్తస్మిన్‌ లంబమానానధోముఖాన్‌ | దృష్ట్వాతత్సాతశంకావాంస్తాంశాఖాంగరుడోగ్రహీత్‌ || 66 ||

గజకూర్మౌచతాంశాఖాంగృహీత్వాయాంతమంబరే | పితాతస్యాబ్రవీత్త త్రగరుడం వినతాసుతం || 67 ||

త్యజే మాం నిర్జనేశైలే శాఖాంతాం వినతోద్భవ | ఇత్యుక్తః సతథాగత్వా శాఖాం నిష్పురుషేనగే || 68 ||

విన్యస్యాభక్షయత్పక్షీతౌతదాగజకచ్ఛపౌ | అథోత్పాతః సమభవత్‌ తస్మిన్నవనరేదివి || 69 ||

తా || ఎక్కడికి వెళుతున్నావని తండ్రి అడుగగా గరుడుడు అతనితో ఇట్లా అన్నాడు. (52) తల్లి దాస్య విమోచనం కొరకు అమృతం తేవటానికి వచ్చాను. అనేకమంది కిరాతులను తిని కూడా నాకు తృప్తి కలగటంలేదు (53) నన్ను రాత్రింబగళ్ళు ఎడతెగని ఆకలిబాధిస్తోంది. ఓ బ్రహ్మన్‌ ! తపోధన! దానిని తొలగించగలిగే ఆహారమును నాకు సమర్పించు (54) దానితో నేను సమర్థుడనై తేజస్సుతో అమృతమును తెస్తాను. అని సుతుడనగా కశ్యపుడు వినతోద్భవునితో ఇట్లా అన్నాడు (55) కశ్యపవచనము - తమ్మునితో కూడి విభావనువను పేరుగల ముని ఉండేవాడు. అతనికి సువ్రతీకుడని సోదరుడు ఉండేవాడు వాళ్ళిద్దరు వంశ శత్రువులు (56) మహా కోపంకలవారై వారు పరస్పరము శపించుకున్నారు. సువ్రతీకుడు ఏనుగుఐనాడు. విభావసువు తాబేలు ఐనాడు. (57) ఈ రకంగా ధనమూలకమైన వివాదం వల్ల ఆ అన్నదమ్ములు పరస్పరం శపించుకున్నారు. గజము ఆరు యోజనముల ఎత్తురెట్టింపు పొడవు గలది (58) తాబేలు మూడు యోజనములు ఎత్తు పదియోజనముల విస్తృతి గలది. ఈ రెండు బద్ధవైరము గలవై ఈ సరస్సులో ఉన్నాయి. ఓ విహంగమ (59) పూర్వవైరాన్ననుసరించి జయించాలని కోరికతో కొట్టాడుతున్నాయి. ఆ రెంటిని నీవుతిని తృప్తి మంతుడవై అమృతాన్ని తీసుకురా (60) ఈ విధముగా తండ్రితో చెప్పబడి పక్షిరాజు గజకచ్ఛపముల సమీపమునకు వెళ్ళి పెద్ద కాయము, మహాబలపరాక్రమము గల వాటిని ఎత్తి (61) గోళ్ళతో వాటిని ధరిస్తూ విలంబమను పేరుగల సంతీర్థమునకు వెళ్ళాడు. అక్కడికి వచ్చిన పక్షిరాజునుచూచి (62) దాని తీరంలో ఉండే ఎత్తైన రోహిణమను పేరుగల మహా వృక్షము మహా బలపరాక్రమ వంతుడైన వైన తేయునితో ఇట్లా అంది (63) శతయోజనమాయతమైన నా ఈశాఖను అధిరోహించు. ఇక్కడ ఉండి ఓ ఖగరాజా ! నీవు గజకూర్మములను భక్షించు (64) అని అనగా మనోవేగముగల ఆ తరుణపక్షి అక్కడ ఉంది. ఓ బ్రాహ్మణులార ! ఆతని భారముతో ఆ చెట్టు యొక్క కొమ్మ విరిగింది (65) ఆ కొమ్మకు వేలాడుతున్న అధోముఖులైన వాలఖిల్యమునులను చూచి వారు పడిపోతారనే అనుమానంతో ఆ కొమ్మను గరుడుడు గ్రహించాడు (66) గజ కూర్మములను ఆ శాఖను తీసుకొని ఆకాశంఓ వెడుతున్న ఆతనిని చూచి అప్పుడు ఆతని తండ్రి వినతాసుతుడైన గురుడునితో ఇట్లా అన్నాడు (67) ఓ వినతోద్భవ! ఈ కొమ్మను నిర్జనమైన శైలమందు వదులు అని అనగా ఆతడు అట్లాగే వెళ్ళి కొమ్మను నిష్పురుషసగమందు (68) ఉంచి అప్పుడు ఆ గజకచ్ఛపములను ఆ పక్షిరాజు భక్షించాడు. అప్పుడు ఆ సందర్భమందు దేవలోకమందు ఉత్పాతము కలిగింది (69).

మూ || దృష్టోత్పాతం బలారాతిః వప్రచ్ఛన్వపురోహితం | ఉత్పాత కారణం జీ వకిమత్రేతిపునః పునః

బృహస్పతిస్తదాశుక్రం ప్రోవాచద్విజసత్తమాః || 70 ||

బృహస్పతిరువాచ -

కాశ్యపోహిమునిః పూర్వం అజయత్ర్కతునాహరే || 71 ||

సర్వాన్‌ఋషీ స్సరాన్సిద్ధాన్‌ యక్షాన్‌ గంధర్వకిన్నరాన్‌ | యజ్ఞసంభారసిద్ధ్యర్థం ప్రేషయామానసద్విజాః || 72 ||

వాలిఖిల్యాన్‌ సనంభారాన్‌ హ్రస్వానం గుష్ఠమాత్రకాన్‌ | మజ్జతో గొష్పదజలే దృష్ట్వా హసితావాన్భవాన్‌ || 73 ||

భవతావమతాః క్రుద్ధాః వాలఖిల్యాస్తదాహరే | జుహుపుర్యజ్ఞవహ్నౌతే క్రోధేన జ్వలితాసనాః || 74 ||

దేవేంద్ర భయదః శత్రుః కశ్యపస్యసుతోస్త్వితి | తస్యపుత్రోద్యగరుడః సుధాహరణ కౌతుకీ || 75 ||

సమాగచ్ఛతి తద్ధేతు రయముత్పాత ఆగతః | ఇత్యుక్తః సోబ్రవీదింద్రో దేవానగ్ని పురోగమాన్‌ || 76 ||

సుధామాహర్తుమాయాతి పక్షీసారక్ష్యతామితి | ఇతీంద్రప్రేరితాదేవా రరక్షుః సాయుధాః సుధాం || 77 ||

పక్షిరాజ్తదాభ్యాగాత్‌ దేవానాయుధధారిణః | మహాబలంతే గరుడం దృష్ట్వాకం పంతవైనురాః || 78 ||

గరుడస్య సురాణాంచ తతోయుద్ధమభూన్మహత్‌ | అఖండిపక్షితుండేన భౌవనోమృత పాలకః || 79 ||

తదానిజఘ్నుర్గరుడం దేవాఃశ##సై#్త్రరనేకశః అతీవగరుడోదేవై ర్బాధితః శస్త్ర పాణిభిః || 80 ||

పక్షాభ్యామాక్షివద్దూరే దేవానగ్ని పురోగమాన్‌ | తత్పక్ష విక్షతా దేవాస్తదా పరమకోపనాః || 81 ||

నారాచాన్భింది పాలాంశ్చ నానాశస్త్రాణి చాక్షిపన్‌ | తతస్తు గరుడో వేగాద్దేపదృష్టివిలోపినీం || 82 ||

ధూలిముత్థావయామానపక్షాభ్యాం వినతాసుతః | వాయునా శమమామానుఃతాన్పాం సూంస్త్రిదశోత్తమాః || 83 ||

రుద్రాన్వసూంస్తథాదిత్యాన్మరుతోన్యాన్సురాంస్థథా | గరుడః పక్షతుండాభ్యాం వ్యథితానకరోద్ద్విజాః || 84 ||

పలాయితేషుదే వేషుసోద్రాక్షీ జ్జ్వలనం పురః | జ్వలంతం పరితస్త్వగ్నిం శమాపయితుముద్య¸° || 85 ||

ససహస్ర ముఖోభూత్వా తైః పిబన్‌ శతశోనదీః | తమగ్నిం నాశయామానతైహివయోభిస్త్వరాన్వితః || 86 ||

సితధారంభ్రమచ్ఛక్రం సుధారక్షకమంతికే | దృష్ట్వా తదరిరంధ్రేణ సంక్షిప్తాం గోంతరావిశత్‌ || 87 ||

తతోదదర్శద్వౌసర్పౌ వ్యక్తా స్యౌభీషణాకృతీ | యాభ్యాందృష్టోపిభస్మస్యాత్తౌసర్పౌగరుడస్త దా || 88 ||

ఆచ్ఛిద్య పక్షతుండాభ్యాం గృహీత్వా మృతముద్య¸° || 88 1/2 ||

తా || ఇంద్రుడు ఉత్పాతమును చూచి తన పురోహితుని అడిగాడు. ఓ జీవ! (గురు) ఇక్కడ ఉత్పాతమునకు కారణమేమిటని మాటిమాటికి అడిగాడు. ఓ బ్రాహ్మణులార ! బృహస్పతి అప్పుడు ఇంద్రునితో ఇట్లా అన్నాడు (70) బృహస్పతి వచనము - ఓ ఇంద్ర! పూర్వం కాశ్యపముని క్రతువుతో పూజ చేశాడు (71) అందరు ఋషులను, సురలను సిద్ధులను, యక్ష గంధర్వకిన్నరులను ఆతడు యజ్ఞ సంభారసిద్ధికొరకు పంపాడు (72) పొట్టిగా అంగుష్ఠమాత్రులై సంభారములతో కూడిఉన్న వాలఖిల్యులను గోష్పద జలమందు స్నాన మాడుతున్న వారిని చూచి నీవు నవ్వావు (73) ఓ ఇంద్ర! నీతో అవమానింపబడి క్రుద్ధులైన వాలఖిల్యులు అప్పుడు కోపంతో జ్వలించిన ముఖాలుగల వారు యజ్ఞవహ్ని యందు హోమం చేశారు (74) దేవేంద్రునకు భయం కల్గించే శత్రువు కశ్యపునకు, సుతుడుగా కలగని అని ఆతని కొడుకే ఈ వేళ గరుడుడు అమృతమును తీసుకుపోవాలనే ఉత్సాహముతో (75) వస్తున్నాడు. ఆ కారణంగానే ఈ ఉత్పాతము వచ్చింది. అని అనగా అగ్ని మొదలుగా గల దేవతలతో ఇంద్రుడు ఇట్లా అన్నాడు. (76) ఆ పక్షి అమృతమును ఎత్తుకు పోవటానికి వస్తున్నాడు. దానిని రక్షించండి. అని ఇంద్రునితో ప్రేరేపింపబడి దేవతలు సాయుధులై అమృతమును రక్షించారు (77) పక్షిరాజు అప్పుడు ఆయుధములను ధరించిన దేవతలను సమీపించాడు. మహాబలుడైన ఆ గరుడుని చూచి దేవతలు వణికారు (78) గరుడునకు దేవతలకు గొప్ప యుద్ధం జరిగింది. అమృతపాలకుడైన విశ్వకర్మను పక్షి తన తుండంతో (ముక్కు) ఖండించింది (79) అప్పుడు దేవతలు శస్త్రములతో అనేక విధములుగా గరుడుని కొట్టారు. శస్త్ర పాణులైన దేవతలు అధికంగా గరుడుని బాధించారు (80) అగ్నిమొదలగు దేవతలను రెక్కల ద్వారా దూరంగా పారవేశాడు. ఆతని రెక్కలతో పారవేయబడిన దేవతలు అప్పుడు పరమకోపనులై (81) వారు నారాచములను భింది వాలములన నానాశస్త్రములను విసిరారు. పిదప గరుడుడు వేగంగా దేవతల దృష్టిలోపించునట్లుగా (82) తనరెక్కలతో వినతాసుతుడు దుమ్మును లేపాడు. త్రిదశోత్తములు ఆ దుమ్మును గాలితో శమింపచేశారు (83) రుద్రులను వసువులను ఆదిత్యులను మరుత్తులను అట్లాగే ఇతర దేవతలను కూడా గరుడుడు రెక్కలతో ముక్కతో బాధించాడు. (84) దేవతలు పరుగెత్తాక ఆతడు తన ఎదుట అగ్నిని (మంటను) చూచాడు). చుట్టూ మండుతున్న అగ్నిని చల్లార్చటానికి ప్రయత్నించాడు (85) ఆతడు సహస్రముఖుడై ఆ ముఖములతో నూర్లకొలది నదులనీరుతాగి, ఆ నీటితో వేగంగా ఆ అగ్నిని నశింపచేశాడు (86) తీష్ణమైన అంచులు గల తిరుగుతున్న చక్రాన్ని సమీపంలో అమృతాన్ని రక్షిస్తున్న దాన్ని చూచి ఆ చక్రము రంధ్రముగుండా శరీరమును సంక్షేపించుకొని లోపలికి ప్రవేశించాడు. (87) పిదప నోరు తెరచి ఉన్న భీషణ ఆకారము గల రెండు పాములను చూచాడు. అవి అతనిని చూడగానే ఆ సర్పములు భస్మమైనాయి. గరుడుడు అప్పుడు (88) పక్షతుండములతో కప్పి అమృతమును తీసుకొని పైకి ఎగిరాడు.

మూ ||యంత్రముతాఎట్యచోద్యంతంగరుడంప్రాహమాధవః || 89 ||

తపతుష్టోస్మిపక్షీశవరంపరయసువ్రత | అథపక్షీ తమాహస్మకమలానాయకంహరిం || 90 ||

తవోపరిస్థితిర్మేస్యా మాభూతాంచ జరామృతీ | తథాస్త్వితి హరిః ప్రాహవరం మద్ర్వియతామితి || 91 ||

ఇత్యుక్తస్తం హరిః ప్రాహ మమత్వం వాహనం భవ | స్యందనో పరికేతుశ్చ మమత్వం వినతాసుత || 92 ||

తథాస్థ్వితి ఖగోప్యాహ కమలాపతి మచ్యుతాం | హృతామృతం ఖగం శ్రుత్వాతత అఖండలోజవాత్‌ || 93 ||

అభిద్రుత్యాశుకులిశం పక్షేచిక్షేప పక్షిణః | తతో విహస్యగరుడః పాకశాసన మబ్రవీత్‌ || 94 ||

కులిశస్యనిపాతాన్మే సహరే కాపివేదనా | సఫలో వజ్రపాతస్తే భూయాచ్చసుర నాయక || 95 ||

ఇతీరయన్పత్ర మేకం వ్యసృజత్పక్ష తస్తదా | శోభనం పర్ణమస్యేతి సువర్ణితిసోభవత్‌ || 96 ||

తస్మిన్‌ సుపర్ణేహెమాభేసర్వే విస్మయమాయయుః | తతస్తు గరుడః శక్రమ బ్రవీద్ద్విజ పుంగవాః || 97 ||

భవతా సాకమఖిలంజగదే తచ్చరాచరం | దేవేంద్ర సతతతం వోఢుమమోఘాశక్తి రస్తిమే || 98 ||

నాఖండల సహస్రంమే రణలభ్యంహరే భ##వేత్‌ | ఇతి బ్రువాణం గరుడమబ్రవీత్పాకశాసనః || 99 ||

కింతేమృతేన కార్యంస్యాద్దీయతా మమృతంమమ | ఇమాం సుధాం భవాన్దద్యాద్యేభ్యోహి వినతోద్భవ || 100 ||

తేధునామృతా పానేన జరామరణ వర్జితాః | అస్మ ద్భ్యోధిక వీర్యాః స్యుర్బాధేరం స్త్రిదశాంస్తథా || 101 ||

ఇతిబ్రువంతం దేవేంద్రం గరుడోప్యబ్రవీద్ద్విజాః | యత్రైతత్‌స్థాపయిష్యామి తత్రాగత్యభవానిదం || 102 ||

గృహ్ణాతు ఝటితీ త్యుక్తో గరుడం ప్రాహవృత్రహా | ప్రీతోహంతవ దాస్యామి వరం వృణుమహామతే || 103 ||

ఇత్యుక్త వంతం గరుడః పాకశాసనమబ్రవీత్‌ | దాస్యేఛలప్రయోక్తారో మమమాతుః సరీనృపాః || 104 ||

భక్ష్యాభవంతునిత్యంమే పాకశాసన వృత్రహన్‌ | ఇతితేనేరితః శక్రః తథాస్త్విత్యపదచ్చతం || 105 ||

అథాయంగరుడో విప్రాధారయన్నమృతంయ¸° | యాంతం తమను యాతిస్మగరుడం పాకశాసనః || 106 ||

వేగేన సద్విజశ్రేష్ఠాః సుధాహరణ కౌతుకీ | మాతురభ్యాశమాగత్య సర్పాన్ర్పాహసపక్షిరాట్‌ || 107 ||

కుశేషున్యస్యతే సర్పాస్సుధైవ మధునామయా | స్నాత్వాతద్‌భుజ్‌ధ్వమమృతంశుచయఃసుసమాహితాః || 108 ||

మోక్షోపి మమమాతుఃస్యాద్దాసీభౄవాద్ధిపన్నగాః | తథాస్త్విత్యవదన్సర్పాః గరుడంవినతాసుతం || 109 ||

ముక్తాతదైవ వినతాదాసీ భావాద్ద్విజోత్తమాః | సర్పాస్తేమృతభక్షార్థం స్నాతుం సర్వేయయుస్తదా || 110 ||

తస్మిన్నవసరే శక్రస్తామాదాయసుధాం య¸° | స్నాత్వా గత్యభుజంగాస్తే తత్రాదృష్ట్వాతదాసుధాం || 111 ||

జిహ్మాభిర్లిలిహుః దర్భానేషున్య స్తానుధేతిహి || 111 1/2 ||

తా || యంత్రమును పెకిలించి పై కెగురుతున్న గరుడునితో మాధవుడిట్లన్నాడు (89) ఓ పక్షీశ ! నీవల్ల సంతోషం కలిగింది. ఓ సువ్రత ! వరం కోరుకో. కమలానాయకుడైన హరితో పక్షిరాజు ఇట్లా అన్నాడు (90) మీ పైన నేనుండాలి (ధ్వజంలో) జరమృతి కలగకూడదునాకు నాకీవరం ఇమ్ము అని అనగా అట్లాగే కానిమ్మని హరి అన్నాడు (91) అని పలికి హరి అతనితో ఇట్లన్నాడు. నాకు నీవు వాహనం కమ్ము. ఓ వినతాసుత ! నారథంమీద జండాలోకూడా నీవే (92) అట్లాగే కానిమ్మని పక్షికూడా కమలాపతియైన అచ్యుతునితో పలికింది. అమృతమును ఖగము తీసుకువెళ్ళిందని విని పిదప అఖండలుడు వేగంగా (93) పరుగెత్తి తొందరగా వజ్రాయుధాన్ని పక్షిరెక్కలపై విసిరాడు. పిదప గరుడుడు నవ్వి పాకశాసనునితో ఇట్లా అన్నాడు. (94) ఓ ఇంద్ర వజ్రాయుధం వేయటం వలన నాకు బాధలేదు. ఓ సురనాయక! నీ వజ్రపాతం కూడా సఫలమౌతుంది కూడా (95) అని పలుకుతూ తన రెక్కనుండి ఒక ఈకను వదిలాడు. శోభనమైన రెక్కలు (వర్ణము) ఈతనివి అని ఆతడు సువర్ణుడైనాడు (96) బంగారుమయమైన ఆ సువర్ణుని చూచి అందరు ఆశ్చర్యపడ్డారు. ఓ బ్రాహ్మణులార ! అప్పుడు గరుడుడు శక్రునితో ఇట్లా అన్నాడు. (97) మీతోపాటు ఈ చరాచరమైన జగత్తునంతాను ఎప్పుడూ మోయటానికి అమోఘమైన శక్తి ఉంది నాకు. ఓ దేవేంద్ర ! (98) ఓ ఇంద్రా! యుద్ధంలో వేయిమంది ఇంద్రులు నాకు ఈడుకారు. అని పలుకుతున్న గరుడునితో పాకశాసనుడిట్లా అన్నాడు. (99) అమృతంతో నీకేం పని ఉంది. అమృతంను నాకు ఇచ్చేయి. అని ఓ వినతపుత్ర ఈ అమృతమును నీవు ఎవరికిస్తావో వారిప్పుడు (100) ఈ అమృతాన్ని తాగి జరామరణ వర్జితులై మాకన్న అధిక పరాక్రమ వంతులౌతారు. అట్లాగే దేవతలను బాధిస్తారు (101) అని పలుకుతున్న దేవేంద్రునితో గరుడుడు ఇట్లా అన్నాడు. నేను దీన్ని ఎక్కడ పెడతానో అక్కడికి నీవు వచ్చి దీనిని (102) త్వరగా తీసుకో అని అనగా గరుడునితో వృత్రహా (వృత్రహంత) ఇట్లన్నాడు. నేను సంతోషించాను. నీకు వరమిస్తాను. ఓ మహామతి! వరం కోరుకో (103) అని అనగా గరుడుడు ఇంద్రునితో ఇట్లన్నాడు. సరీనృపములు నాతల్లి దాస్య విషయంలో ఛలాన్ని ప్రయోగించారు (104) ఓ పాకశాసన ! వృత్రహంత! వారు నిత్యము నాకు ఆహారంకాని అని ఆతడనగా అట్లాగేకాని అని ఇంద్రుడు అతనితో అన్నాడు (105) పిదప ఈ గరుడుడు అమృతమును తీసుకొని వెళ్ళాడు. వెళుతున్న ఆ గరుడుని ఇంద్రుడు అనుసరించసాగాడు (106) ఓ ద్విజశ్రేష్ఠులార ! ఆతడు వేగంగా అమృతాన్ని తీసుకుపోదలచి తల్లి దగ్గరకు వచ్చి ఆ పక్షిరాజు సర్పములతో ఇట్లన్నాడు. (107) ఓ సర్పములార ! ఇప్పుడు నేను అమృతాన్ని కుశములపై ఉంచుతున్నాను. స్నానం చేసి శుచులై నిశ్చలబుద్ధిగలవారై అమృతాన్ని భుజించండి (108) ఓ పన్నగులార ! దాసీ భావం నుండి నా తల్లికి ముక్తి కలగని అని అనగా పాములు వినతాసుతుడైన గురుడునితో అట్లాగే కానిమ్మని అన్నాయి (109) ఓ బ్రాహ్మణులార! దాసీ భావం నుండి అప్పుడే వినత ముక్తురాలైంది. ఆ సర్పములు అమృత భక్షణ కొరకు స్నానం చేయటానికి అప్పుడే అన్ని వెళ్ళాయి (110) ఆ సందర్భంలో ఆ అమృతమును తీసుకొని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. పాములు స్నానం చేసి వచ్చి అక్కడ అమృతమును కానక (111) నాలుకలతో దర్భలను నాకాయి. వీటిపైనే గదా అమృతం ఉంచాడు అని.

మూ || తదాప్రభృతి సర్పాణాం జిహ్మాదర్భాగ్రపాటితాః || 112 ||

ద్విధాభవన్మునిశ్రేష్ఠా ద్విజిహ్మాస్తేనతేమృతాః సుధాసంయోగతోదర్భాః ప్రయయుశ్చపవిత్రతాం || 113 ||

మోచయిత్వాచ గరుడో దాసీభావాత్స్వమాతరం | శశాపకుపితః కద్రూం ఛద్మనా జితమాతరం || 114 ||

కద్రూస్త్వం జనీంయన్మే ఛలేన జితపత్యసి | భర్తుస్త్వం పరిచర్యాయాం అతో నార్హా భవిష్యసి || 115 ||

శ##షై#్త్వవం గరుడః కద్రూం ప్రయ¸° సయథేచ్ఛయా | కద్రూశ్చవినతాచోభేయయతుర్భర్తురంతికం || 116 ||

కశ్యపో విముస్తత్ర కద్రూం కోపాదధాబ్రవీత్‌ | యస్మాచ్ఛలేన వినతాం కద్రూర్నిర్జిత పత్యసి || 117 ||

అతో మత్పరిచర్యాయాంస యోగ్యాసిదురాత్మికే | స్త్రియం వాపురుషం వాపి నారీవాపురుషోపివా || 118 ||

ఛలాద్విజయతేయోసౌ సమహాపాతకీ భ##వేత్‌ | ఛలా ద్విజయినా సార్ధం సంభాష్య బ్రహ్మహాభ##వేత్‌ || 119 ||

స్తేయీ సురాపీ విజ్ఞేయో గురుదార రతశ్చనః | సంసర్గదోష దుష్టశ్చమునిభిః పరికీర్త్యతే || 120 ||

త్వయా సంభాషణా ద్దోషో మమస్యాన్నరక ప్రదః | తస్మాత్ర్పయాహికద్రూస్త్వం మత్సమీపాద్ధిదారుణ || 121 ||

ఛలజేత్రాన పంక్తౌయో భుంజితమనుజోభువి | తేనసంభాషణాత్సద్యః పతేద్ధినరకార్ణవే || 122 ||

విలోక్యఛలజేతారం తస్యపావస్య శాంతయే | ఆదిత్యం వాజలం వాపి పావకం వావిలోకయేత్‌ || 123 ||

ఛలజేతాయత్ర తిష్ఠేత్‌ ఆశ్రమేపి గృహేపివా | వస్తవ్యంసహిత త్రాన్యైర్వసన్నరకమశ్నుతే || 124 ||

అతో నిర్యాహినిర్యాహి మమత్వం దృష్టి మార్గతః | స్వాశ్రమాత్సరలామేనాం వినతాం జితపత్యసి || 125 ||

ఇతిధిక్కృత్యసహసాకద్రూంతాం కశ్యపస్తదా | వినతాం స్వచ్ఛశీలాంతాం స్వీచకారమహామతిః || 126 ||

కద్రూరిత్థం సపరుషం కథితా కశ్యపేనసా | పదంతీభృశదుః ఖార్తా పాదయోస్తస్య చాపతత్‌ || 127 ||

పతితాం పాదయోర్‌ దృష్ట్వా కశ్యపోముని పుంగవాః|న జగ్రాహైవ కద్రూంతాం స్మరన్‌ పాపంతయా కృతం || 128 ||

తతః ప్రణమ్య వినతా కశ్యపం వాక్యమబ్రవీత్‌ | భగవన్భగినీ మేనాం స్వీకురుష్వకృపానిధే || 129 ||

అజ్ఞానాత్‌ ముగ్ధయా పాపం కద్రూః యదధునాకృతం | క్షంతుమర్హుసి తత్సర్వం దయాశీలాహిసాధవః || 130 ||

జన్యాగరుడసై#్యవం కథితః కశ్యపోమునిః | ఉవాచ వినతేనైనాం వినాపాపస్య నిష్కృతిం || 131 ||

గ్రహీష్యామి దురాచారాం త్రిస్త్వాం శపథయామ్యహం | కశ్యపస్యవచః శ్రుత్వా వినతా పునరబ్రవీత్‌ || 132 ||

భగిన్యామమ పాపస్య బ్రహ్మంస్త్వం బ్రూహినిష్కృతిం | యేనేయం పరిచర్యాయాం తపయోగ్యా భవిష్యతి || 133 ||

తయైవ ముదితో విప్రాః మారీచః కశ్యపస్తదా | ధ్యాత్వా ముహూర్తం మనసా పశ్చాదిదమభాషత || 134 ||

తా || నాటినుండి సర్పముల నాలుకలు దర్భాగ్రములతో చీలిపోయాయి (112) ఓ మునిశ్రేష్ఠులార ! రెండుగా ఐనాయి. అందువల్ల అవి ద్విజిహ్మలనబడ్డాయి. సుధానం యోగం వల్ల దర్భలు పవిత్రతను పొందాయి. (113) గరుడుడు తన తల్లిని దాసీభావం నుండి విడిపించి నెపంతో జయించిన తల్లిని కద్రువను కోపంతో శపించాడు (114) ఓ కద్రువ ! నీవు నా తల్లిని మోసంతో జయించావుగదా. అందువల్ల నీవు భర్తపరిచర్యయందు అర్హురాలవు కావు (115) ఈ విధముగా గరుడుడు కద్రువను శపించి యధేచ్ఛగా వేళ్ళి పోయాడు. కద్రువినతలు ఇద్దరు తమ భర్త సమీపానికి వెళ్ళారు. (116) విముఖుడైన కశ్యపుడు కద్రువతో కోపంగా ఇట్లా అన్నాడు. ఓ కద్రువ! వినతను మోసంతో జయించావు కాబట్టి (117) ఓ దురాత్మిక ! నా పరిచర్యకు నీవు యోగ్యురాలవు కావు స్త్రీకాని పురుషుడు కాని స్త్రీనికాని పురుషునికాని (118) ఛలంతో జయించిన యెడల వాడు మహాపాతకి ఔతాడు. ఛలంతో జయించిన వానితో సంభాషించిన వాడు బ్రహ్మ హంతకుడు ఔతాడు. (119) దొంగ, సురతాగే వాడు, గురదారరతుడుగా అతనిని గ్రహించాలి. మునులు అతనిని సంసర్గ దోష దుష్టునిగా చెప్పారు (120) నీతో మాట్లాడటం వల్ల నాకు నరకమునిచ్చే దోషం కల్గుతుంది. కనుక ఓ కద్రువ! దారుణమైన దాన! నీవు నా దగ్గర నుండి పో (121) ఛలజేతతో సంపంక్తిలో భోజనం చేసిన నరునితో సంభాషణ వల్ల వెంటనే నరకార్ణవంలోపడతాడు (122) ఛలజేతను చూచిన పాపశాంతి కొరకు సూర్యుని గాని నీటిని గాని అగ్నిని కాని చూడాలి (123) ఛలజేత ఉన్న ఆశ్రమంలో కాని గృహంలో కాని ఇతరులుండరాదు. ఒకవేళ ఉంటే నరకాన్ని పొందుతాడు (124) అందువల్ల నా దృష్టి మార్గం నుండి తొలగిపో తొలగిపో నా ఆశ్రమంనుండి సరళ స్వభావురాలైన ఈ వినతను జయించావు (125) అని త్వరగా ఆ కద్రువను ధిక్కరించి కశ్యపుడు అప్పడు ఆ మహామతి ! స్వచ్ఛశీలురాలైన ఆ వినతను స్వీకరించాడు. (126) ఈ విధముగా కఠినంగా కశ్యపుడు కద్రువతో అనగా ఆమె ఏడుస్తూ మిక్కిలి దుఃఖంతో బాధపడుతూ అతని పాదములపై పడింది (127) పాదముల యందు పడిన ఆమెను చూచి మునిపుంగవుడు కశ్యపుడు ఆమె చేసిన పాపాన్ని స్మరించి ఆమెను స్వీకరించలేదు (128) అప్పుడు వినత కశ్యపునకు నమస్కరించి ఇట్లా అంది. ఓ కృపానిధి ! భగవాన్‌ ! ఈ నా సోదరిని స్వీకరించు (129) అజ్ఞానం వల్ల, అమాయకురాలైన కద్రువ చేసిన పాపాన్ని అంతా మీరు క్షమించండి. సాధువులు దయాశీలురు కదా (130) గరుడుని తల్లి ఈ విధంగా అనగా కశ్యపముని ఈమె పాపమునకు విముక్తి లేకుండా ఓ వినత! ఈమెను గ్రహించను అని అన్నాడు (131) దురాచారులైన నిన్ను నేను మూడుసార్లు శపిస్తున్నాను. కశ్యపుని మాటలను విని వినత తిరిగి ఇట్లా అంది. (132) నా సోదరి యొక్క పాపమునకు నిష్కృతిని ఓ బ్రహ్మన్‌! మీరు చెప్పండి. దాని వల్ల ఈమె మీ పరిచర్యలో యోగ్యురాలౌతుంది (133) ఆమె ఇట్లా అనగా మారీచుడైన కశ్యపుడు మనస్సుతో ముహూర్తకాలము ధ్యానం చేసి పిదప ఇట్లా అన్నాడు (134).

మూ || దక్షిణాంబునిధే స్తీరే పుల్లగ్రామే విముక్తిదే | అస్తి క్షీర సరోనామ తీర్థం పాప వినాశనం || 135 ||

తత్తీర్థ స్నానమాత్రేణ దోషశ్చాస్యా వినశ్యతి | ప్రాయశ్చిత్త యుతే నాపి తత్తీర్థే మజ్జనం వినా || 136 ||

సనశ్యత్యేష దోషాస్యాస్త దేషాయాతు తత్సరః | భ##ర్త్రైవ ముదితే కద్రూస్తం ప్రణమ్య ద్విజోత్తమమ్‌ || 137 ||

తత్‌క్షణాత్ర్పయ¸° క్షీరం నరఃపుత్రసహాయినీ | సాకద్రూః పుత్రసహితా గత్వాకతిపయైర్దినైః || 138 ||

ప్రాప్యక్షీరసరః పుణ్యం ప్రయతా విజితేంద్రియా | సస్నౌ నియమపూర్వంచ సంకల్ప్య క్షీరకుండకే || 139 ||

ఉపోష్య త్రిదినం సస్నౌ తస్మిన్‌ క్షీరనరోజలే | చతుర్థేది వసే తస్యాం కుర్వత్యాం స్నాన మాదరాత్‌

అదేహావ్యోమగావాణీసముత్తస్థౌద్విజోత్తమాః || 140 ||

అశరీరిణ్యువాచ -

కద్రూస్త్వం మజ్జనాదత్రఛలజేతృత్వ దోషతః || 141 ||

విముక్తా భర్తృ శుశ్రూషా యోగ్చాచాసి ససంశయః | శాపోపి గరుడోక్తస్తేలయం యాతోత్రమజ్జనాత్‌ || 142 ||

గచ్ఛభర్తృసకాశం త్వం సోపిత్వాం స్వీకరిష్వతి | ఇత్యుక్త్వా విరరామాధ వ్యోమవాగశరీరిణి || 143 ||

తసై#్యవాచేనమస్కృత్య కద్రూః సాప్రీతమానసా | తీర్థం ప్రదిక్షిణీకృత్యనత్వాపుత్రసమన్వితా || 144 ||

ప్రయ¸° భర్తురభ్యాశం తచ్ఛుశ్రూషణ కౌతుకాత్‌ | ఆ గతాంతాం సమాలోక్యస్నాతాం క్షీర సరోజలే || 145 ||

జ్ఞాత్వా విధూత పాపాంచ కశ్యపః ససమాధినా | అంగీచకారపత్నీం తామాత్మశుశ్రూషణోచితాం || 146 ||

ఏవంవః కథితం విప్రాః కద్రూపాపవిమోక్షణం | మజ్జనాన్ముక్తిదంపుంసాం పుణ్య క్షీరసరోజలే || 147 ||

యః శృణోతీమ మధ్యాయం పఠతేవాపి మానవః | సక్షీరకుండస్నానస్యలభ##తే ఫలముత్తమం || 148 ||

అశ్వమేధాది యజ్ఞానాం సమగ్రం ఫలమశ్నుతే | గంగాది సర్వతీర్థేషు సస్నాతో భవతి ధ్రువం || 149 ||

యః పఠేదిమమధ్యాయం క్షీరకుండ ప్రశంసనం | గోసహస్ర ప్రదాతౄణాం ప్రాప్నోత్య వికలం ఫలం || 150 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమహాత్మే క్షీరకుండ ప్రశంసాయాం కద్రూకృతచ్ఛల దోషశాంతి కథా వర్ణనం నామాష్ట త్రింశోధ్యాయః || 38 ||

తా || దక్షిణ సముద్ర తీర మందు ముక్తినిచ్చే పుల్లగ్రామమందు పాపనాశకమైన క్షీరసరమను పేరుగల తీర్థముంది (135) ఆ తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత ఈమె దోషం నశిస్తుంది. ఆ తీర్థంలో స్నానం చేయకుండా పదివేల ప్రాయశ్చిత్తములు చేసినా (136) ఈమె ఈ దోషం నశించదు. అందువల్ల ఈమె ఆ సరస్సుకు వెళ్ళాలి. భర్త ఇట్లా చెప్పగా కద్రువ ఆ ద్విజోత్తమునకు నమస్కరించి (137) వెంటనే పుత్రుల సహాయంతో క్షీర సరస్సునకు బయలుదేరింది. ఆ కద్రువ పుత్రులతో కలసి కొద్దిరోజులు ప్రయాణించి (138) పుణ్యమైన క్షీర సరమునకు చేరి, శుచియై, ఇంద్రియముల జయించి సంకల్పించి క్షీరకుండ మందు నియమ పూర్వకముగా స్నానం చేసింది (139) ఆ చోట మూడు రోజులు ఉపవాసముండి ఆ క్షీర సరోజలమందు స్నానం చేసింది. నాల్గవ రోజు ఆమె ఆదరంగా స్నానం చేస్తుండగా శరీరం లేని ఆకాశవాణి విన్పించింది. ఓ బ్రాహ్మణులార ! (140) అ శరీరవాణి మాట - ఓ కద్రువ నీవు ఇక్కడ స్నానం చేయటం వల్ల ఛలజేతృత్వం దోషంనుండి (141) విముక్తురాలవై భర్తృ శుశ్రూషకు యోగ్యురాలైనావు. అనుమానం లేదు. ఇక్కడ స్నానం చేయటం వలన గరుడుడు చెప్పిన నీ శాపం కూడా లయమైంది (142) నీవు నీ భర్త సకాశమునకు పో అతడు కూడా నిన్ను స్వీకరిస్తాడు. అని అశరీరవాణి ఆకాశవాణి పలికి విరమించింది. (143) ఆమాటకు కద్రువ నమస్కరించి సంతుష్టమానసయై తీర్థమునకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి పుత్రులతో కూడి (144) భర్త సమీపమునకు వెళ్ళింది. ఆతనికి శుశ్రూష చేయాలనే కుతూహలంతో వచ్చిన ఆమెను క్షీరసరోజలమందు స్నానమాడిన దానిని చూచి (145) సమాధితో పాపములు తొలగిన దానినిగా ఆమెను గ్రహించి కాశ్యపుడు ఆమెను తనకు శుశ్రూష చేయుటకు తగిన దానినిగా ఆ భార్యను అంగీకరించాడు (146) ఈ విధంగా మీకు కద్రూ పాపవిమోక్షణము గురించి చెప్పాను ఓ విప్రులార! పుణ్యమైన క్షీర సరోజలమందు స్నానం వల్ల ముక్తి లభిస్తుంది(147) ఈ అధ్యాయమును విన్న లేదా చదివిన నరుడు క్షీరకుండ స్నానం వల్ల కలిగే ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. (148) అశ్వమేధాది యజ్ఞముల సంపూర్ణ ఫలాన్ని పొందుతాడు. గంగాది సర్వతీర్థములందు ఆతడు స్నానం చేసిన వాడౌతాడు నిశ్చయము (149) ఈ క్షీరకుండ ప్రశంస రూపమైన అధ్యాయాన్ని చదివినవాడు సహస్ర గోవులను దానం చేసిన వారి నశించని ఫలమును పొందుతాడు. (150) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు క్షీరకుండ ప్రశంసయందు కద్రువ చేసిన ఛలదోష శాంతి కథ వర్ణనమనునది ముప్పది ఎనిమిదవ అధ్యాయము || 38 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters