Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సంప్రవక్ష్యామిమున యోలోకపావనం | గాయత్ర్యాచ సరస్వత్యాః మాహాత్మ్యం ముక్తిదంసృణాం || 1 ||

శృణ్వతాం పఠతాం చైవ మహాపాతక నాశనం | మహాపుణ్య ప్రదం పుంసాం నరకక్లేశనాశనం || 2 ||

గాయత్ర్యాంచసరస్వత్యాంయేస్నాంతిమనుజాముదా | సతేషాంగర్భవాసఃస్యాత్కింతు ముక్తిర్భవేద్ధ్రువం || 3 ||

సరస్వత్యాశ్చగాయత్ర్యా గంధమాదన పర్వతే | బ్రహ్మపత్న్యోః సన్నిధానాత్‌ తన్నామ్నాకథితేఇమే || 4 ||

ఋషయ ఊచుః -

గాయత్ర్యాశ్చ సరస్వత్యా గంధమాదన పర్వతే | కిమర్థం సన్నిధానం వై సూతాభూత్తద్వదస్వనః || 5 ||

సూత ఉవాచ -

ప్రజాపతిఃపురావిప్రాఃస్వాంవైదుహితరంముదా - వాజ్‌ నామ్నీంకాముకోభూత్వా స్పృహయామానమోహనః || 6 ||

అథప్రజాపతేః పుత్రీ స్మస్మిన్వై తస్యకామితాం | విలోక్యలజ్జితా భూత్వారోహిద్రూవందధారసా || 7 ||

బ్రహ్మాపిహరిణో భూత్వాతయారస్తుమనాస్తదా | గచ్ఛంతీ మనుయాతిస్మహరిణీ రూపధారిణీం || 8 ||

తందృష్ట్వా దేవతాస్సర్వాః పుత్రీగమన సాదరం | కరోత్య కార్యం బ్రహ్మాయం పుత్రీ గమన లక్షణం || 9 ||

ఇతి నిందంతి తం విప్రాః స్రష్టారం జగతాం పతిం | నిషిద్ధ కృత్య నిరతం తందృష్ట్వా పరమేష్ఠినం || 10 ||

హరః పినాకమాదాయవ్యాధరూపధరః ప్రభుః | ఆకర్ణ పూర్ణకృష్టేన పినాక ధనుషాశరం|| 11 ||

సంయోజ్యవేధనంతేన వివ్యాధనిశితేనసః | త్రిపురాంతక బాణన విద్ధోసౌన్య పతద్భువి || 12 ||

తస్యదేహాదథోత్థాయ మహజ్జ్యోతిర్మహాప్రభం | ఆకాశే మృగశీర్షాఖ్యం నక్షత్ర మభవత్తదా || 13 ||

ఆర్ద్రానక్షత్ర రూపీనన్‌ హరోప్యనుజగామతం | పీడయన్మృశీర్షాఖ్యం నక్షత్రం బ్రహ్మరూపిణం || 14 ||

అధునాపి మృగవ్యాధరూపేణ త్రిపురాంతకః | అంబరేదృశ్యతే స్పష్టం మృగశీర్షాం తికేద్విజాః || 15 ||

తా || శ్రీ సూతుల వచనము - పిదప ఇక్కడి నుండి ఓ మునులార ! లోక పావనమైన, నరులకు ముక్తినిచ్చే గాయత్రి సరస్వతుల మాహాత్మ్యాన్ని చెబుతాను (1) ఇది వినేవారి చదివేవారి మహా పాతకముల నశింపచేసేది. పురుషులకు మహాపుణ్యము నిచ్చేది. నరకక్లేశమును నశింపచేసేది (2) ఆనందంతో గాయత్రి సరస్వతుల యందు స్నానం చేసిన వారికి గర్భవాసముండదు. ముక్తి తప్పకుండా కల్గుతుంది (3) గంధమాదన పర్వతమందు గాయత్రి సరస్వతి బ్రహ్మపత్నులు దగ్గరలో ఉండటం వలన ఇవి ఆ పేరులతో పిలువబడ్డాయి (4) ఋషులిట్లన్నారు - గంధమాదన పర్వతమందు గాయత్రి సరస్వతుల సన్నిధానము ఎందుకు జరిగిందో ఓ సూత! దానిని మాకు చెప్పండి (5) అని అనగా సూతులిట్లన్నారు - ఓ విప్రులార ! పూర్వం తన కూతురును ఆనందంతో వాక్‌ అనుపేరుగల దాన్ని మోహనుడై కాముకుడై కోరాడు (6) ప్రజాపతిపుత్రి తనను ఆతడు కామిస్తున్నాడని గమనించి చూచి సిగ్గుపడి ఆమె జింక రూపమును ధరించింది (7) బ్రహ్మకూ కూడా హరిణ రూపం ధరించి అప్పుడు ఆమెతో రమింపదలచి, హరిణరూపమును ధరించి వెళ్ళుచున్న ఆమెను అనుసరించసాగాడు (8) పుత్రిని పొందాలని వెళ్తున్న ఆతనిని చూచి దేవతలందరు ఈ బ్రహ్మపుత్రిని పొందటమనే చెడ్డపనిని చేస్తున్నాడు (9) అని స్రష్ట జగత్పతి ఐన అతనిని నిందించసాగారు. నిషిద్ధమైన పనియందు ఆసక్తి గల ఆ బ్రహ్మను చూచి (10) ప్రభువు హరుడు పినాకమును చేత ధరించి వ్యాధరూపమును ధరించి, చెవిదాకా లాగిన పినాకధనస్సు యందు బాణమును (11) సంధించి ఆ నిశితమైన బాణంతో బ్రహ్మను కొట్టాడు. త్రిపురాంతకుని బాణంతో కొట్టబడి బ్రహ్మభూమిపై పడిపోయాడు (12) ఆతని దేహంనుండి గొప్పకాంతి గల గొప్ప జ్యోతి లేచి ఆకాశంలో మృగశీర్ష అను పేరు గల నక్షత్రంగా మారింది (13) ఆర్ద్రనక్షత్రరూపాన్ని ధరించి శివుడు ఆతనిని వెంటాడాడు. బ్రహ్మరూపమైన మృగశీర్ష అను పేరు గల నక్షత్రాన్ని పీడిస్తూ ఉన్నాడు. (14) ఇప్పటికి మృగములను వేటాడే వ్యాధుని రూపంలో శివుడు మృగశీర్ష నక్షత్ర సమీపంలో ఆకాశంలో స్పష్టంగా కన్పిస్తాడు, ఓ బ్రాహ్మణులార ! (15)

మూ || ఏవం వినిహతే తస్మిన్‌శం భునా పరమేష్ఠిని | అనంతరంతుగాయత్రీ సరస్వత్యౌశుచార్పితే || 16 ||

భర్తృహీనే మునిశ్రేష్ఠాః భర్తృ జీవనకాంక్షయా | కింకరిష్యా వహెహ్యావామిత్యన్యోన్యం విచార్యతు || 17 ||

స్వపతిప్రాణసిద్ధ్యర్ధం గాయత్రీచ సరస్వతీ | సర్వోత్కృష్టం శివస్థానం గంధమాదన పర్వతం || 18 ||

సర్వాభీష్టప్రదం పుంసాం తపః కర్తుం సముద్యతే | జగ్మతుర్నియమోపేతేతపః కర్తుంశివం ప్రతి || 19 ||

స్నానార్ధమాత్మనో విప్రా గాయత్రీచ సరస్వతీ | తీర్థద్వయంస్వనామ్నావై చక్రతుః పాపనాశనం || 20 ||

తత్రత్రిషవణస్నానం ప్రత్యహం చక్రతుర్ముదా | బహుకాలమనాహారే కామక్రోధాదివర్గితే || 21 ||

అత్యుగ్రనియమోపేతే శివధ్యాన పరాయణ | పంచాక్షర మహామంత్ర జపైక నియతే శుభే || 22 ||

స్వపతేర్జీవనార్థంవైగాయత్రీచ సరస్వతీ | మహాదేవం సముద్దిశ్యతప ఏవం ప్రచక్రతుః ||23 ||

తయోరథ తపస్పృష్టో మహాదేవో మహేశ్వరః | సన్నిధత్తే మహామూర్తిః తపసాం ఫలదిత్సయా || 24 ||

తతస్సన్నిహితం శంభుం పార్వతీరమణంశివం | గణశకార్తికేయాభ్యాం పార్శ్వయోః పరిసేవితం || 25 ||

దృష్ట్వాసంతుష్టచిత్తేతే గాయత్రీచ సరస్వతీ | స్తోత్రైః తుష్టు వతుః స్తుత్యం మహాదేవం ఘృణానిధిం || 26 ||

గాయత్రీ సరస్వత్యా పూచతుః -

నమో దుర్వార సంసారధ్వాంతధ్వంసైకహేతవే | జ్వలజ్జ్వాలావలీ భీమ కాలకూటవిషాదినే || 27 ||

జగన్మోహన పంచాస్త్ర దేహనాశైకహేతవే | జగదంతకరక్రూరయమాంతకనమోస్తుతే || 28 ||

గంగాతరంగ సంవృక్త జటామండలధారిణ | నమస్తేస్తు విరూపాక్ష బాలశీతాంశుధారిణ || 29 ||

ఫినాకభీమటంకారత్రాసిత త్రిపురౌకసే | నమస్తే వివిధాకారజగత్స్రష్టృ శిరశ్ఛిదే || 30 ||

శాంతామలకృపాదృష్టి సంరక్షిత మృకండుజ | నమస్తే గిరిజానాథ రక్షావాంశరణాగతే || 31 ||

మహాదేవ జగన్నాథ త్రిపురాం తక శంకర | వామదేవ మహాదేవ రక్షావాం శరణాగతే || 32 ||

ఇతితాభ్యాంస్తు తశ్శంభుః దేవదేవో మహేశ్వరః | అబ్రవీత్ర్పీతి సంయుక్తో గాయత్రీం చ సరస్వతిం || 33 ||

తా ||ఈ విధముగా శివుడు బ్రహ్మను చంపగా, పిదప గాయత్రి సరస్వతులు దుఃఖితులుకాగా, (16) భర్తృహీనలు కాగా భర్త జీవనాన్ని కోరుతూ మనం ఏం చేద్దామని పరస్పరం చర్చించుకొని (17 తమ పతి ప్రాణ సిద్ధి కొరకు గాయత్రి సరస్వతులు సర్వుత్కృష్టమైన మంగళ స్థానమైన గంధమాదన పర్వతమునందు (18) పురుషులకు అన్నికోరికల నిచ్చే చోట తపస్సు చేయటానికి సిద్ధమైనారు. నియమం కలవారై శివుని గూర్చి తపస్సు చేయటానికి వెళ్ళారు (19) గాయత్రి సరస్వతులు తమ స్నానం కొరకు పాపనాశకమైన రెండు తీర్థములను తమ పేరుతో ఏర్పరచారు (20) అక్కడ ప్రతిరోజు సంతోషంతో త్రిషవణ స్నానాన్ని త్రిసవనములు చేశారు. చాలా కాలము ఆహారం లేకుండా కామక్రోధాధులను వదలి (21) అతి ఉగ్రనియమములు కలవారై శివుని ధ్యానమందు ఆసక్తి కలవారై, పంచాక్షర మహామంత్ర జప మొక్కటే విధిగా కలవారై, శుభులైన (22) గాయత్రీ సరస్వతులు తమపతి జీవనము కొరకు మహాదేవునుద్దేశించి ఈ విధంగా తపస్సు చేశారు (23) వారి తపస్సుకు సంతుష్టుడైన మహాదేవుడు మహేశ్వరుడు, మహామూర్తి తపః ఫలితాన్ని ఇవ్వటం కొరకు వచ్చాడు (24) దరికివచ్చిన శంభుని పార్వతీరమణుని, శివుని గణశకార్తికేయులతో రెండువైపుల సేవించబడుతున్న వానిని (25) చూచి ఆ గాయత్రి సరస్వతులు సంతుష్ట చిత్తులై, దయానిధియైన మహాదేవుని స్తుతించతగిన వానిని స్తోత్రములతో స్తుతించారు. (26) గాయత్రి సరస్వతులు ఇట్లా పలికారు. వారింపశక్యముకాని సంసారపు చీకటిని ధ్వంసము చేయుటకు ఒకే కారణమైన వానికి మండుతున్న జ్వాలల సమూహముతో భయంకరమైన కాలకూట విషాన్ని భుజించిన వానికి (27) జగత్తును మోహింపచేసే పంచాన్త్రుని దేహమును నశింపచేయుటకు ఒకే కారణమైన జగదంతకుడైన క్రూరయముని నశింపచేసే నీకు నమస్కారము (28) గంగాతరంగములతో తడిసిన జటామండలాన్ని ధరించిన, బాల చంద్రుని ధరించిన, విరూపాక్షుడవైన నీకు నమస్కారము (29) పినాక ధనస్సు యొక్క భయంకరమైన ధ్వనితో భయపడిన త్రిపురౌకసులు కలవానికి, వివిధ ఆకారములతో జగత్తును సృష్టించే బ్రహ్మశిరస్సును ఛేదించిన నీకు నమస్కారము (30) శాంత అమలమైన కృపాదృష్టితో మృకండుజుని సంరక్షించిన వాడ, గిరిజానాధ నీకు నమస్కారము. మేము ఇద్దరము నిన్ను శరణు వేడినాము మమ్ములను రక్షించు (31) మహాదేవ ! జగన్నాథ ! త్రిపురాంతక! శంకర! వామదేవ! మహాదేవ! శరణాగతులమైన మమ్ముల రక్షించు (32) అని వారితో స్తుతింపబడ్డ శంభువు దేవ దేవుడు మహేశ్వరుడు ప్రీతితో కూడినవాడై గాయత్రి సరస్వతులతో ఇట్లా అన్నాడు(33).

మూ|| మహాదేవ ఉవాచ -

భోః సరస్వతి గాయత్రి ప్రీతోస్మియువయోరహం | పరంపరమతం మత్తోయద్వాం మనసివర్తతే || 34 ||

ఇత్యుక్తేతేతు గాయత్రీ సరస్వత్యౌహరేణవై | అబ్రూతాం పార్వతీకాంతం మహాదేవం ఘృణానిధిం || 35 ||

గాయత్రీ సరస్వత్యాపూచతుః -

భగవన్నావయోర్దేవభర్తారం చతురాసనం | సప్రాణం కురుసర్వేశకృపయాకరుణాకర || 36 ||

త్వమాపయోః పితాదేవత వాప్యావాం సుతేఉభే | రక్షావాం పతిదానేన తస్మాత్త్వంత్రిపురాంతక || 37 ||

స ఏవం ప్రార్థితః శంభుస్తాభ్యాం బ్రాహ్మణపుంగవాః ఏవమస్త్వితి సంప్రోచ్య గాయత్రీంచసరస్వతీం || 38 ||

తదేవ వేథనః కాయం శిరసాయోక్తు ముత్సుకః | తత్రైవ వేధనః కాయం శిరోభిః సహసువ్రతాః || 39 ||

భూతైరానాయ యామాససందిభృంగిముఖౌన్తదా | శిరాంసితాన్యనే కాని కాయేన సహశంకరః || 40 ||

క్షణాత్సంధారయామాన వాణీగాయత్రిసన్నిధౌ | సంధితోథ హరేణాసౌ చతుర్వక్త్రోజగత్పతిః || 41 ||

ఉత్తస్థౌతత్‌ క్షణాదేవసుప్తోత్థిత ఇవద్విజాః | తతః ప్రజాపతిర్‌ దృష్ట్వా శంకరం శశిభూషణం

తుష్టావ వాగ్భిరగ్ర్యాభిః భార్యా భ్యాంచ సమన్వితః || 42 ||

బ్రహ్మోవాచ -

నమస్తే దేవదేవేశ కరుణా కర శంకర || 43 ||

పాహిమాం కరుణాసింధో నిషిద్ధాచరణాత్ర్పభో | మమత్వత్కృపయాశంభో నిషిద్ధాచరణక్వచిత్‌ || 44 ||

మాప్రవృత్తిర్భవేద్భూయో రక్షమాంత్వంతథాసదా | తథైవాస్త్వితి సంప్రాహబ్రహ్మాణం గిరిజాపతిః || 45 ||

ఇతః పరం ప్రమాదంత్వం మాకురుష్వవిధేవునః | ఉత్పథం ప్రతిపన్నానాం పుంసాం శాస్తాస్మి సర్వదా || 46 ||

ఏవముక్త్వాచతుర్వక్త్రం మహాదేవో ద్విజోత్తమాః | సరస్వతీంచ గాయత్రీం ప్రోవాచ ప్రీణయన్‌ గిరా || 47 ||

తా || మహాదేవుడిట్లన్నాడు - ఓ సరస్వతి, గాయత్రి, మీపై నేను సంతుష్టుడనైనాను. నన్ను వరం కోరండి. మీ మనస్సులో ఏముందో కోరండి (34) హరుడు గాయత్రి సరస్వతులతో ఇట్లనగా వారు, పార్వతీ కాంతుడు, దయానిధి, మహాదేవుడు ఐన శివునితో ఇట్లన్నారు (35) గాయత్రీ సరస్వతుల మాట - ఓ భగవాన్‌ ! ఓ దేవ ! మా భర్తయైన బ్రహ్మను ప్రాణవంతునిగా చేయి ఓ సర్వేశ! కరుణాకర కృపతో చేయి (36) నీవు మాతండ్రివి. ఓ దేవ అట్లాగేనీకు మేమిద్దరము బిడ్డలము. అందువల్ల ఓ త్రిపురాంతక! నీవు మా పతిని దానం చేయటం ద్వారా మమ్ముల రక్షించు (37) అని వారిద్దరు శివుని ప్రార్థించగా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులార ! అట్లాగే కానిమ్మని వారితో పలికి (38) ఆ బ్రహ్మ శరీరమునే శిరస్సుతో కలుపనుత్సహించి, అక్కడే బ్రహ్మశరీరమును శిరస్సులతో సహ (39) భూతములతో సంది భృంగి మొదలగు వారితో తెప్పించాడు. ఆ అనేక శిరస్సులను శరీరంతో సహశంకరుడు (40) వాణి గాయత్రుల ఎదురుగా క్షణంలో కలిపాడు. శివుడు కలుపగానే జగత్పతి బ్రహ్మ (41) క్షణంలోనే నిద్రించిన వాడుమేల్కొన్నట్లుగా లేచాడు. అప్పుడు ప్రజాపతి శశిభూషణుడైన శంకరుని చూచి, భార్యలతోకూడి శ్రేష్ఠమైన మాటలతోస్తుతించాడు (42) ఓ ప్రభు! కరుణా సింధు! నిషిద్ధమైన ఆచరణము నుండి నన్ను రక్షించు. ఓ శంభు! నీ దయతో నాకు నిషిద్ధాచరణమందు ఎక్కడైన (44) తిరిగి ప్రవృత్తి కలగొద్దు. అట్లాగే కానిమ్మని బ్రహ్మతో గిరిజాపతి పలికాడు (45) ఓ బ్రహ్మ! తిరిగి ఇకముందు నీవు ప్రమాదపడవు. నేను తప్పుదారిని పోయే వారిని శాసించేవాణ్ణి నేను ఎల్లప్పుడూ (46) ఓ బ్రాహ్మణులార మహాదేవుడు బ్రహ్మతో ఇట్లా పలికి, సరస్వతి గాయత్రులను మాటలతో సంతోషపరుస్తూ ఇట్లా అన్నాడు (47)

మూ || మహాదేవ ఉవాచ -

ముదయోర్మత్ర్పసాదేన హెగాయత్రి సరస్వతి | అయంభర్తాసమాయాతః సప్రాణశ్చతురాననః || 48 ||

సహానేన బ్రహ్మలోకం యాతం మాభూద్విలంబతా | యువయోః సన్నిధానేన సదాకుండద్వయేత్రవై || 49 ||

భవిష్యతి నృణాం ముక్తిః స్నానాత్‌ సాయుజ్యరూపిణీ | యుష్మన్నామ్నాచ గాయత్రీ సరస్వత్యా వితిద్వయం || 50 ||

ఇదంతీర్థం సర్వలోకే ఖ్యాతం యా స్యతి శాశ్వతం | సర్వేషామపి తీర్థానాం ఇదం తీర్థద్వయం సదా || 51 ||

శుద్ధి ప్రదంతథా భూయాస్మహాపాతక నాశనం | మహాశాంతి కరం పుంసాం సర్వాభీష్ట ప్రదాయకం || 52 ||

మమప్రసాద జననం విష్ణుప్రీతికరం తథా | ఏతత్తీర్థద్వయనమంస భూతం న భవిష్యతి || 53 ||

అత్రస్నానాద్ధిసర్వేషాం సర్వాభీష్టం భవిష్యతి | ఇదం కుండద్వయంలోకే భవతీ భ్యాం కృతం మహత్‌ || 54 ||

యుష్మన్నామ్నా ప్రసిద్ధంచ భవిష్యతి విముక్తిదం | గాయత్ర్యుపాస్తి రహితా వేదాభ్యాస వివర్జితాః || 55 ||

ఔపాసనవిహీనాశ్చ పంచయజ్ఞ వివర్జితాః | యుష్మత్కుండద్వయే స్నానాత్‌ తత్తత్ఫల మవాప్నుయుః || 56 ||

అన్యేచయే పాతకినోనిత్యానుష్ఠాన వర్జితాః | స్నాత్వాకుండద్వయే తత్ర శుద్ధాః స్యుర్ద్విజ సత్తమాః || 57 ||

సరస్వతీంచ గాయత్రీం ఏవముక్త్వామహేశ్వరః | క్షణాదంతరధాత్తత్రసర్వేషామేవపశ్యతాం || 58 ||

పతింలబ్ధ్వాథగాయత్రీ సరస్వత్యౌముదాన్వితే | తేన సాకం బ్రహ్మలోకం జగ్మతుర్ద్విజసత్తమాః || 59 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవం వః కధితం విప్రా గంధమాదన పర్వతే | సన్నిధానం సరస్వత్యా గాయత్ర్యాశ్చ సహేతుకం || 60 ||

యః శృణోతీమమధ్యాయం పఠతేవాసభక్తికం | ఏతత్తీర్థద్వయస్నాన ఫలమాప్నోత్య సంశయః || 61 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే గాయత్రీ సరస్వతీ తీర్థ ప్రశంసాయాం గంధమాదనే గాయత్రీ సరస్వతీ సన్నిధాన కథనం నామ చత్వారింశోధ్యాయః|| 40 ||

తా || మహా దేవుడిట్లన్నాడు - ఓ గాయత్రి ! సరస్వతి! మీకు నా అనుగ్రహంవల్ల ప్రాణంతో కూడిన బ్రహ్మ ఈ భర్త తిరిగి వచ్చాడు (48) ఈతనితో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆలస్యం చేయకండి. ఇక్కడ ఈ రెండు కుండములలో ఎల్లప్పుడు మీరు ఉండడంవల్ల (49) ఇక్కడ స్నానం చేస్తే సాయుజ్యరూపమైన ముక్తి నరులకు లభిస్తుంది. గాయత్రి సరస్వతి అను మీ పేర్లతో ఈ రెండు (50) తీర్థములు సర్వలోకములలో శాశ్వతమైన కీర్తిని పొందుతాయి. అన్ని తీర్థములలో ఈ రెండు తీర్థములు ఎల్లప్పుడు (51) శుద్ధిప్రదము, అట్లాగే మహాపాతకనాశకములు ఔతాయి. మహాశాంతిని ఇచ్చేవి, నరులకు అన్ని కోరికలను తీర్చేవి (52) నా అనుగ్రహాన్ని కల్గించేవి, విష్ణువునకు సంతోషదాయకమైనవి. ఈరెండు తీర్థములతో సమానమైనవి గతంలో లేవు భవిష్యత్తులో రావు (53) ఇక్కడ స్నానం చేయటంవల్ల అందరికి అన్ని అభీష్టములు నెరవేరుతాయి. ఈ రెండు కుండములను మీరు ఈ లోకంలో ఏర్పరచి గొప్పపని చేశారు (54) మీ పేరుతో ప్రసిద్ధమై ముక్తిని కల్గిస్తాయి. గాయత్రి ఉపాసన లేనివారు, వేదాభ్యాసమును వదలినవారు (55) ఔపాసన రహితులు, పంచ యజ్ఞములు వదలినవారు, మీకుండములలో రెంటిలో స్నానం చేయటంవల్ల ఆయా ఫలములను పొందుతారు (56) నిత్యానుష్ఠాన వర్జితులైన ఇతర పాతకులు ఈ కుండ ద్వయ మందు స్నానం చేసి శుద్ధులౌతారు. ఓ బ్రాహ్మణులార ! (57) సరస్వతి గాయత్రులతో ఇట్లా పలికి మహేశ్వరుడు అందరు చూస్తుండగానే క్షణంలో అక్కడ అంతర్థానమైనాడు (58) భర్తను పొంది గాయత్రి సరస్వతులు సంతోషం కలవారై ఆ బ్రహ్మతో పాటు బ్రహ్మలోకమునకు వెళ్ళారు. ఓ బ్రాహ్మణులార ! (59) శ్రీ సూతులిట్లన్నారు. ఈ విధంగా మీకు గంధమాదన పర్వతమందు గాయత్రి సరస్వతులు ఉండటాన్ని సకారణంగా వివరించాను (60) ఈ అధ్యాయాన్ని విన్నవారు భక్తితో చదివినవారు, ఈరెండు తీర్థములలో స్నానం చేసిన ఫలాన్ని పొందుతారు. అనుమానంలేదు (61) అని శ్రీ స్కాంద మహాపురాణమందుఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మ ఖండమందు సేతు మాహాత్మ్యమందు గాయత్రి సరస్వతి తీర్థ ప్రశంస యందు గంధమాదనంలో గాయత్రి సరస్వతులసన్నిధానమును చెప్పుట అనునది నలుబదవ అధ్యాయము || 40 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters