Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది ఐదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

ఏవంప్రతిష్ఠితే లింగే రామేనా క్లిష్టకారిణా | లింగం వరం సమాదాయ మారుతిః సహసాయ¸° || 1 ||

రామందాశరథిం వీరమభివాద్య సమారుతిః | వైదేహీలక్ష్మణౌ పశ్చాత్సుగ్రీవం ప్రణనామచ || 2 ||

సీతాసైకత లింగంతత్పూజయంతం రఘూద్వహం | దృష్ట్వాథమునిభిః సార్థంచుకోపపవనాత్మజః || 3 ||

అత్యంతంభేదభిన్నస్సన్‌ పృథాకృత పరిశ్రమః | ఉవాచ రామం ధర్మజ్ఞ హనుమానంజనాత్మజః || 4 ||

హనుమానువాచ -

దుర్జాతోహం పృథారామలోకే క్లేశాయకేవలం | భిన్నోస్మి బహుశో దేవరాక్షసైః క్రూరకర్మభిః || 5 ||

మాస్మసీమంతినీకాచిత్‌ జనయే న్మాదృశం సుతం | యతోసు భూయాతేదుఃఖ మనంతం భవసాగరే || 6 ||

ఖిన్మోస్మి సేవయాపూర్వం యుద్ధేనాపితతోధికం | అనంతందుఃఖమధునాయతో మామవమన్యసే || 7 ||

సుగ్రీవేణచ భార్యార్థం రాజ్యార్థం రాక్షసేనచ | రావణావరజేనత్వం సేవితోసిరఘాద్వహ || 8 ||

మయానిర్హేతుకం రామసేవితోసి మహామతే | వానరాణామనేకేషుత్వయాజ్ఞప్తోహమద్యవై || 9 ||

శివలింగం సమానేతుంకైలాసాత్పర్వతోత్తమాత్‌ | కైలాసం త్వరితో గత్వానచాపశ్యం పినాకినం || 10 ||

తపసాప్రీణయిత్వాతం సాంబవృషభవాహనం | ప్రాప్తలింగోరఘువతే త్వరితః సముపాగతః || 11 ||

అస్యలింగం త్వమధునా ప్రతిష్టాప్యతుసైకతం | మునిభిర్దేవ గంధర్వైః సాకం పూజయ సేవిభో || 12 ||

మయానీతమిదం లింగం కైలాసాత్పర్వతా ద్వృథా | అహోభారాయమే దేహో మందభాగ్యన్యజాయతే || 13 ||

భూతలస్య మహారాజ జానకీ రమణ ప్రభో | ఇదం దుఃఖ మహం సోఢుం నశక్నోమిరఘూద్వహ || 14 ||

కింకరిష్యామి కుత్రాహం గమిష్యామినమేగతిః | అతః శరీరం త్యక్ష్యామిత్వయాహమవమానితః || 15 ||

శ్రీసూత ఉవాచ -

ఏవం సబహుశోవిప్రాః క్రుశిత్వా పవనాత్మజః | దండవత్ర్పణతో భూమౌ క్రోధశోకాకులోభవత్‌ || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - సులభంగా పనులనాచరించే రాముడు ఈ విధముగా లింగమును ప్రతిష్ఠించగా శ్రేష్ఠమైన లింగమును తీసుకొని మారుతి త్వరగా వచ్చాడు (1) వీరుడైన దశరథ రామునకు నమస్కరించి ఆ మారుతి పిదప సీత లక్ష్మణులకు పిదప సుగ్రీవునకు నమస్కారం చేశాడు (2) సీత నిర్మించిన సైకత లింగమును పూజిస్తున్న రాముని చూచి హనుమంతుడు మునులతో సహా అందరిని కోపగించాడు (3) వ్యర్థంగా పరిశ్రమించినట్లు భావించి ఖేదంతో మిక్కిలి భిన్నుడై ధర్మజ్ఞుడైన రామునితో అంజనాత్మజుడైన హనుమంతుడు ఇట్లా పలికాడు (4) హనుమద్వచనము - నా పుట్టుక చాలా చెడ్డది. నేను వ్యర్థుణ్ణి. ఓ రామ ! నేను ఈ లోకంలోకష్టం కొరకే జన్మించాను. ఓదేవ ! క్రూరకర్ములైన రాక్షసులతో చాలాఖిన్నుడనై ఉన్నాను. (5) ఏ స్త్రీ కూడా నాలాంటి కొడుకును కనగూడదు. ఎందువల్లనంటే భవసాగరమందు అనంతమైన దుఃఖం అనుభవిస్తున్నాను (6) పూర్వము సేవతోఖిన్నుడైనాను. అంతకన్న ఎక్కువగా యుద్ధంతో ఖిన్నుడనైనాను. ఇప్పుడు అనంతమైన దుఃఖము, నన్ను అవమానించావు కాబట్టి (7) సుగ్రీవుడు భార్యకొరకు, రాక్షసుడు రాజ్యం కొరకు సేవించారు. రావణుని తమ్ముడు నిన్ను రాజ్యంకై సేవించాడు (8) ఓ మహామతి ! రామ ! నేను ఏ కారణం లేకుండా నిన్ను సేవించాను. అనేక మంది వానరులలో ఈ వేళ నీవు నన్ను ఆజ్ఞాపించావు (9) పర్వతోత్తమమైన కైలాసం నుండి శివలింగాన్ని తేవటానికి చెప్పావు. కైలాసమునకు వేగంగా వెళ్ళాను పినాకిని చూడలేదు (10) వృషభవాహనుడైన ఆసాంబుని తపస్సుతో సంతుష్ట పరచి లింగమును పొంది ఓ రఘుపతి ! త్వరగా వచ్చాను (11) ఇసుకతో చేసిన మరో లింగాన్ని స్థాపించి నీవిప్పుడు మునులతో దేవ గంధర్వులతో కలిసి పూజిస్తున్నావు. ఓ విభు ! (12) నేను కైలాస పర్వతం నుండి తెచ్చిన ఈ లింగము వ్యర్థము. మంద భాగ్యుడనైన నాకు ఈ శరీరము బరువుగా అన్పిస్తోంది (13) ఓ జానకీరమణ ! ప్రభు ! మహారాజ ! ఇది భూమికి భారము. ఓ రఘుకుమార ఈ దుఃఖాన్ని సహించటానికి నాకు శక్తిలేదు (14) ఏం చేయను. ఎక్కడికి వెళ్ళను. నాకు గతి లేదు. నీతో అవమానింపబడ్డనేను ప్రాణానని విడుస్తాను (15) శ్రీ సూతులిట్లనిరి - ఇట్లా అనేక విధముల ఆ హనుమంతుడు ఏడ్చి క్రోధశోకముతో వ్యాకులుడైనాడు. దండమువలె నమస్కరిస్తూ భూమిపై పడినాడు (16).

మూ || తందృష్ట్వారఘునాథోపిప్రహసన్నిదమబ్రవీత్‌ | సశ్యతాం సర్వదేవానాం మునీనాం కపి రక్షసాం

సాంత్వయన్మారుతిం తత్ర దుఃఖ చాస్య ప్రమార్జయన్‌ || 17 ||

శ్రీరామ ఉవాచ -

సర్వం జానామ్యహం కార్యం ఆత్మనోపి పరస్యచ || 18 ||

జాతస్య జాయమానస్యమృతస్యాపినదాకపే | జాయతే మ్రియతేజస్తురేక ఏవస్వకర్మణా || 19 ||

ప్రయాతి నరకం చాపి పరమాత్మాతు నిర్గుణః | ఏవంతత్వం వినిశ్చిత్య శోకం మాకురువానర || 20 ||

లింగత్రయ వినిర్ముక్తం జ్యోతిరేకం నిరంజనం | నిరాశ్రయం నిర్వికార మాత్మానం పశ్యనిత్యశః || 21 ||

కిమర్థంకురుషేశోకం తత్వజ్ఞానస్యబాధకం | తత్వజ్ఞానేనదానిష్ఠాం కురువానరసత్తమ || 22 ||

స్వయంప్రకాశమాత్మానం ధ్యాయస్వ సతతం కపే | దేహాదౌమమతాం ముంచ తత్వజ్ఞానవిరోధినీం || 23 ||

ధర్మం భజస్వసతతం ప్రాణిహింసాం పరిత్యజ | సేవస్వసాధుపురుషాన్‌ జహిసర్వేంద్రియాణిచ || 24 ||

పరిత్యజస్వసతతమన్యేషాం దోషకీర్తనం | శివశిష్ట్వాది దేవానాం అర్చాంకురుసదాకపే || 25 ||

సత్యం వదస్వసతతం పరిత్యజ శుచంకపే | ప్రత్యగ్ర్బహ్మైకతాజ్ఞానం మోహవస్తుసముద్గతం || 26 ||

శోభనాశోభనాభ్రాంతిఃకల్పితాస్మిన్యథార్థవత్‌ | అధ్యాస్తేశోభనత్వేనవదార్థేమోహావైభవాత్‌ || 27 ||

రోగావిజాయితేనౄణాం భ్రాంతానాంకపిసత్తమః | రోగద్వేషబలాద్బద్థాః ధర్మాధర్మవశంగతాః || 28 ||

దేవతిర్యఙ్‌మనుష్యాద్యానిరయంయాంతిమానవా ః | చందనాగరుకర్పురప్రముఖాఅతిశోభనాః || 29 ||

మలంభవంతియత్స్పర్శాత్తచ్ఛరీరంకథంసుఖం | భక్ష్యభోజ్యాదయన్సర్వేవదార్థాఅతిశోభనాః || 30 ||

విష్ఠౌభవతియత్సంగాత్తచ్ఛరీరంకథంసుఖం | సుగంధిశీతలంతోయంమూత్రంయత్సంగమాద్భవేత్‌ || 31 ||

తత్కథంశోభనంపిండంభ##వేద్‌బ్రూహికపేధునా | అతీవధవలాఃశుద్ధాః పటాఃమత్సంగమేసహి || 32 ||

భవంతిమలినాః స్వేదాత్తత్కథం శోభనం భ##వేత్‌ | శ్రూయతాంపరమార్థోమేహనుమన్వాయునందన || 33 ||

అస్మిన్సంసారగర్తేతుకించిత్సౌఖ్యం సవిద్యతే | ప్రథమంజంతురాప్నోతిజన్మబాల్యంతతఃపరం || 34 ||

పశ్చాద్యౌవ్వనమాప్నోతితతోవార్ధక్యమశ్నుతే | పశ్చాన్మృత్యుమవాప్నోతిపునర్జన్మతదశ్నుతే || 35 ||

అజ్ఞానవైభవాదేవ దుఃఖమాప్నోతిమానవః | తదజ్ఞాననివృత్తౌతుప్రాప్నోతిసుఖముత్తమం || 36 ||

తా || ఆతనినిచూచిరఘునాధుడు కూడా నవ్వుతూఇట్లాపలికాడు. దేవతలుమునులుకవులు, రాక్షసులు అందరు చూస్తుండగామారుతినిఓదారుస్తూ. ఆతనిదుఃఖాన్ని కడిగివేస్తూ (17) శ్రీరామునివచనము - నావానియొక్క, ఇతరుల యొక్క పనులనన్నింటినినేనెరుగుదును. (18) పుట్టిన, పుట్టబోయే, చచ్చినవారందరికర్మఎల్లప్పుడూనేనెరుగుదును. ప్రాణితనకర్మతో నేఒంటరిగానే జన్మిస్తాడు, మరణిస్తాడు. (19) నరకానికికూడా వెళ్ళుతాడు. పరమాత్మనిర్గుణుడు. ఈవిధముగాయథార్థాన్ని నిశ్చయించుకొనిఓకపి! దుఃఖించవద్దు. (20) మూడులింగములులేని నిరంజనమైనొకజ్యోతిని, నిరాశ్రయము, నిర్వికారము ఐననిన్నునిత్యునిగాగ్రహించు (21) తత్వజ్ఞానమునకు బాధకమైనశోకమునుఎందుకుసహిస్తున్నావు. ఓవానరోత్తమ ! ఎప్పుడుపరమాత్మజ్ఞానమందునిష్ఠనుంచు (22) ఓ కపి! ఎల్లప్పుడు స్వయంప్రకాశకమైన ఆత్మనుధ్యానించుతత్వజ్ఞానము నకు విరోధకమైన దేహాదులయందు మమతనువదలు (23) ఎప్పుడూధర్మమునుభజించు. ప్రాణిహింసనువదలు. సాధుపురుషులనుసేవించు. సర్వింద్రియములను (ఆసక్తిని) వదులు (24) ఇతరులదోషములనుపొగడటంఎల్లప్పుడూ వదిలిపెట్టు. ఓకపి! శివవిష్ణ్వాదిదేవులఅర్చననుఎప్పుడూచేయి (25) ఓకపి! ఎప్పుడూసత్యముపలుకు. శోకమునువదలు. ప్రత్యగ్‌బ్రహ్మతో ఏకత్వమనేజ్ఞానముమోహవస్తువులవల్లకల్గినట్టిది (26) శోభనము అశోభనము అనేభ్రాంతి కల్పితము ఇది యధార్థమనే భ్రాంతిని కల్గిస్తోంది. పదార్థమందు మోహావైభవంవల్లశోభనమనే అధ్యాసకల్గుతోంది. (27) ఓకపిసత్తమ! భ్రాంతులైననరులకు రోగంకల్గుతుంది. రాగద్వేషములనుశక్తులతోబద్ధులైధర్మాధర్మములకువశులై (28) దేవతిర్యక్‌ మనుష్యాదులుమానవులు నరకానికివేళుతారు. అతిశోభనమైనచందనఅగరుకర్పూరప్రముఖములు (29) శరీరస్పర్శవల్ల మలినమౌతున్నాయి. అట్లైనశరీరముసుఖకరమెట్లౌతుంది.భక్ష్యభోజ్యాదిసర్వపదార్థములుఅతిశోభనములు. (30) ఇవి శరీరసహవాసంవల్లమలమౌతున్నాయి. అట్టి శరీరము ఎట్లాసుఖకరమౌతుంది. వాసనగలచల్లనినీరుశరీరసంగమంవల్ల మూత్రమౌతోంది. (31) అందువల్ల ఓకపి! ఇప్పుడు చెప్పు, ఈశరీరంఎట్లా శోభనమౌతుంది. చాలాతెల్లనైనశుద్ధమైన వస్త్రములు శరీరసాంగత్యంవల్ల (32) చమటతోమలినమౌతున్నాయి. అందువల్లఇదిశోభనమెట్లాఔతుంది. అందువల్లవాయునందన! హనుమాన్‌ పరమార్థమైననామాటనువిను (33) ఈసంసారమనేగుంతలోకొంచెంకూడాసౌఖ్యం లేదు. మొదట ప్రాణిజన్మిస్తాడు. పిదపబాల్యావస్థనొందుతాడు. (34) పిదప¸°వ్వనాన్ని పొందుతాడు. పిదపముసలివాడౌతాడు. చివరమృత్యువునొందుతాడు. తిరిగి జన్మిస్తాడు (35) మానవుడుఅజ్ఞానవైభవంవల్లనేదుఃఖంపొందుతున్నాడు. ఆ అజ్ఞాననివృత్తి ఐతే ఉత్తమసుఖాన్ని పొందుతాడు (36).

మూ|| అజ్ఞానస్యనివృత్తిస్తుజ్ఞానాదేవనకర్మణా | జ్ఞానంనామపరంబ్రహ్మజ్ఞానంవేదాంతవాక్యజం || 37 ||

తత్‌జ్ఞానంచవిరక్తస్యజాయతేనేతరన్యహి | ముఖ్యాధికారిణఃసత్యమాచార్యస్యప్రసాదతః || 38 ||

యదాసర్వేప్రముచ్యంతేకామాయేస్యహృదిస్థితాః | తదామర్త్యోమృతోత్త్రైవపరంబ్రహ్మనమశ్నుతే || 39 ||

జాగ్రతంచస్వపంతంచభుంజంతంచస్థితంతధా | ఇమంజనంసదాక్రూరః కృతాంతఃపరికర్షతి || 40 ||

సర్వేక్షయాంతానిచయాః పతనాంతాసముచ్ఛయాః | సంయోగావిప్రయోగాంతామరణాంతంచజీవితం || 41 ||

యధాఫలానాంపక్వానాంనాన్యత్రపతనాద్భయం | యధానరాణాంజాతానాంనాన్యత్రపతానాద్భయం || 42 ||

యధాగృహందృఢస్తంభంజీర్ణంకాలేవినశ్యతి | ఏవంవినశ్యంతినరాజరామృత్యువశంగతాః || 43 ||

అహోరాత్రస్యగమనాత్‌ నృణామాయుర్వినశ్యతి | ఆత్మానమనుశోచత్వంకిమన్యదనుశోచసి || 44 ||

నశ్యత్యాయుఃస్థితస్యాపిధావతోపికపీశ్వర | సహైవమృత్యుర్‌ప్రజతిసహమృత్యుర్నిషీదతి || 45 ||

చరిత్వాదూరదేశంచసహమృత్యుర్నివర్తతే | శరీరేవలయఃప్రాప్తాఃశ్వేతాజాతాఃశిరోరుహాః || 46 ||

జీర్యతేజరయాదేహఃశ్వాసకాసాదినాతథా | యథాకాష్ఠంచకాష్ఠంచసమేయాతాంమహోదధౌ || 47 ||

సమేత్యచవ్యపేయాతాంకాలయోగేనవానర | ఏవంభార్యచపుత్రశ్చబంధుక్షేత్రధనానిచ|| 48 ||

క్వచిత్‌సంభూయగచ్ఛంతిపునరస్యత్రవానర | యథాహిపాంథంగచ్ఛంతంపథికశ్చిత్‌పథిస్థితః || 49 ||

అహమప్యాగమిష్యామిభవద్భిఃసాకమిత్యధ | కంచిత్కాలంసమేతౌతౌపునరస్యత్రగచ్ఛతః || 50 ||

ఏవంభార్యాసుతాదీనాంసంగమోనశ్వరఃకపే | శరీరజన్మనాసాకంమృత్యుఃసంజాయతేధ్రువం || 51 ||

తా || అజ్ఞాననివృత్తిజ్ఞానంవల్లనేఔతుంది. కర్మవల్లకాదు. జ్ఞానమనగాపరబ్రహ్మ జ్ఞానంవేదాంతవాక్యాలవల్ల కలిగేది (37) అజ్ఞానమువిరక్తునికికల్గుతుంది. ఇతరులకుకలుగదు. ముఖ్యాదికారులు ఆచార్యునిఅనుగ్రహంవల్లసత్యంను తెలుసుకుంటారు. (38) హృదయంలోఉన్నకామములన్నితొలగినమర్త్యుడుఅమృతుడౌతాడు. ఇక్కడేపరబ్రహ్మనుపొందుతాడు. (39) మేల్కొన్నవానిని, నిద్రిస్తున్నవానినితింటున్నవానిని, కూర్చొన్నవానిని ఈ జనాన్ని ఎల్లప్పుడూ క్రూరుడైన యముడులాగుతుంటాడు (40) సంపదలన్నిక్షయంతోసమాప్తమౌతాయి. ఔన్నత్యమంతాపతనాంతము. సంయోగములు వియోగాంతములు జీవితముమరణాంతము (41) పండినపండ్లకు మరోచోటపడతాయనే భయములేదు. పుట్టిన నరుల కుమరోచోటపడతామనే భయంలేదు. (42) ధృఢమైనస్తంభములుకలగృహముజీర్ణమైకాలమాసన్నమైనశిస్తుంది. అట్లాగే నరులుముసలితనము మరణమువీటికివశులైనశిస్తారు (43) రాత్రింబగళ్ళుగడుస్తూన్నాకొద్దీనరుల ఆయుస్సునశిస్తుంటుంది. పరమాత్మనుగూర్చి (నీగురించి) దుఃఖించునీవు ఇతరుల గూర్చిఎందుకుదుఃఖిస్తావు. (44) ఓకపీశ్వర! ఆయుస్సునరుడు నిల్చున్నాపరుగెత్తుతున్నానశిస్తూనే ఉంటుంది. మృత్యువుకూడా మనతోపాటేవెళ్తోంది. మనతో పాటే కూర్చుంటోంది (45) మనతో దూరదేశాలు తిరిగి మృత్యువు తిరిగి వస్తుంది. శరీరంలో ముడతలు పడ్డాయి. వెంట్రుకలు తెల్లబడ్డాయి (46) శరీరం ముసలి తనంతో జీర్ణించి పోతోంది. దేహము శ్వాసము దగ్గు మొదలగు వానితో జీర్ణమైంది. సముద్రమందు ఒక కట్టె మరొక కట్టేకలిశాయి. (47) కలిసి విడిపోయాయి. కాలయోగంతో ఓ వానర! అట్లాగే భార్యపుత్రుడు బంధుక్షేత్ర ధనములు (48) ఒక చోట కలిసి మరల వేరే చోటికి పోతారు. ఓ వానర ! దారిలో పోతున్న బాటసారితో దారిలో ఉన్న మరోబాటసారి (49) మీతో పాటు నేనూ వస్తాను అని పలికి కొంతకాలం ఇద్దరు కలిసి ప్రయాణం చేసి తిరిగి వేరే దిక్కులకు పోయినట్లు (50) అదే విధంగా భార్యాసుతాదులసంగమమునశ్వరము. ఓకపి! శరీరజన్మతోపాటుమృత్యువు కూడాపుడ్తుంది నిశ్చయము (51)

మూ || అవశ్యంభావిమరణసహిజాతు ప్రతిక్రియా | ఏతచ్ఛరీరపాతేతుదేహీకర్మగతింగతః || 52 ||

ప్రాప్యపిండాంతరంవత్సపూర్వపిండంత్యజత్యసౌ | ప్రాణినాంసనదైకత్రవాసోభవతివానర || 53 ||

స్వస్వకర్మవశాత్సర్వేవియుజ్యంతేపృథక్‌పృథక్‌ | యధాప్రాణిశరీరాణిపశ్యంతిచభవంతిచ || 54 ||

ఆత్మనోజన్మమరణనైవస్తఃకపిసత్తమ | అతస్త్వమంజనాసూనోవిశోకంజ్ఞాసమద్వయం || 55 ||

సద్రూపమమలంబ్రహ్మచింతయస్వదివానిశం | త్వత్కృతంమత్కృతంకర్మమత్కృతంత్వత్కృతంతధా || 56 ||

మల్లింగస్థాపనంతస్మాత్త్వంల్లింగస్థాపనంకపే | మహూర్తాతిక్రమాల్లింగంసైకతంసీతయాకృతం || 57 ||

మయాత్రస్థాపితంతస్మాత్కోపందుఃఖంచమాకురు | కైలాసాదాగతంలింగంస్థాపయాస్మిన్‌శుభేదినే || 58 ||

తపనామ్నాత్విదంలింగం యాతులోకత్రయేప్రధాం | హనుమదీశ్వరం దృష్ట్వాద్రష్టవ్యోరాఘవేశ్వరః || 59 ||

బ్రహ్మరాక్షసయూధానిహతానిభవతాకపే | అతఃస్వనామ్నాలింగస్యస్థాపనాత్త్వంప్రమోక్ష్యసే || 60 ||

స్వయంహరేణదత్తంతుహనూమన్నామకంశివం | సంసశ్యన్రామనాథంచకృతకృత్యోభ##వేన్నరః || 61 ||

యోజనానాంసహస్రేపిస్మృత్వాలింగంహనూమతః | రామనాథేశ్వరంచాపిప్మృత్వాసాయుజ్యమాప్నుయాత్‌ || 62 ||

తేనేష్టంసర్వయజ్ఞైశ్చతపశ్చాకారికృత్స్నశః | యేనదృష్టౌమహాదేవౌహనూమద్రాఘవేశ్వరౌ || 63 ||

హనూమతాకృతంలింగంయచ్చలింగంమయాకృతం | జానకీయంచయల్లింగంయల్లింగంలక్ష్మణశ్వరం || 64 ||

సుగ్రీవేణకృతంయచ్చసేతుకర్త్రానలేనచ | అంగదేనచనీలేనతథాజాంబవతాకృతం || 65 ||

విభీషణసయుచ్చాపిరత్నలింగంప్రతిష్ఠితం | ఇంద్రాద్యైశ్చకృతంలింగంయచ్ఛేషాద్యైఃప్రతిష్ఠితం || 66 ||

ఇత్యేకాదశరూపోయంశివఃసాక్షాద్విభాసతే | సదాహ్యేతేషులింగేషుసన్నిధత్తేమహేశ్వరః || 67 ||

తత్స్వపాపౌఘశుద్ధ్యర్థంస్థాపయస్వమహేశ్వరం |

తా || మరణం అనేదితప్పనప్పుడు దానికి ప్రతిక్రియలేదు. ఈశరీరంపతనమైనతరువాతప్రాణికర్మగతినిపొంది (52) మరొకపిండము (శరీరంను)పొంది పూర్వపిండాన్ని ఈతడువదిలిపెడ్తాడు! ప్రాణులకు ఎల్లప్పుడు ఒకేచోటనివాసము కుదరదు (53) తమతమకర్మలకు ఆధీనులైఅందరువిడివిడిగావినియోగింపబడుతారు. ప్రాణిశరీరములునశిస్తాయి. ఏర్పడుతాయి, (54) కాని ఆత్మకుజన్మమరణములు లేవు, ఓకపిసత్తమ! అందువల్ల ఓ అంజనాసుత ! నీవుశోకరహితమైన ఏకమైనజ్ఞానమును (55) సత్తురూపముగాగల, అమలమైన బ్రహ్మనురాత్రింబగళ్ళుచింతించు. నీవు చేసిన పనినేను, చేసినట్లే నేను చేసిన పని నీవు చేసినట్లే (56) నేనునా లింగాన్ని స్థాపించటము నీలింగాన్ని స్థాపించినట్లే, ఓకపి! ముహూర్తము దాటిపోతోంది కాబట్టి సీతచేసిన ఇసుకలింగాన్ని (57) నేనుఇక్కడస్థాపించాను. కనుకకోపంగాని దుఃఖంగానివద్దు. ఈశుభదిన మందు కైలాసము నుండివచ్చినలింగాన్నిస్థాపించు. (58) నీపేరుతోఈలింగములోకత్రయమందుకీర్తిని పొందనిహనుమంతుని - ఈశ్వరుని, చూశాకనే రాఘవుని - ఈశ్వరుని చూడాలి. (59) ఓకపి ! నీవుబ్రహ్మరాక్షసమూహములనుచంపావు. అందువల్ల నీపేరుతో లింగాన్నిస్థాపించటంవల్లనీవుముక్తుడవౌతావు (60) స్వయంగా శివుడిచ్చిన హనుమన్నామకమైన శివునిచూశాకనే రామనాథుని చూచిననరుడుకృతకృత్యుడౌతాడు. (61) సహస్రయోజనముల దూరమందున్నా హనుమంతుని లింగాన్నిస్మరించి, రామనాథే శ్వరునికూడాస్మరించి నరుడు సాయుజ్యమునుపొందుతాడు (62) ఆహనుమద్రాఘవేశ్వరులు స్థాపించిన మహాదేవుని చూచిన వారు అన్నియజ్ఞములు ఆచరించినట్టే. అన్నితపస్సులూ ఆచరించినట్టే. (63) హనుమంతుడు చేసిన లింగమునేను చేసిన లింగము సీతచేసినలింగము, లక్ష్మణుడుచేసినలింగము (64) సుగ్రీవుడుచేసిన, సేతుకర్తయైన నలుడు చేసిన, అంగదుడు నీలుడు, జాంబవంతుడుచేసిన (65) విభీషణుడుస్థాపించినరత్నలింగము, ఇంద్రాదులు చేసినలింగము శేషుడుమొదలగు వారు ప్రతిష్ఠించినలింగము (66) అనిపదకొండు విధములీశివుడు సాక్షాత్తుగా స్రకాశిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఈలింగములందు మహేశ్వరుడుసన్నిధిలోఉంటాడు. (67) అందువల్ల నీపాపసమూహముల శుద్ధికొరకు మహేశ్వరుని స్థాపించు.

మూ || అథచేత్త్వంమహాభాగలింగముత్పాదయిష్యసి || 68 ||

మమాత్రస్థాపితంపత్ససీతయాసైకతంకృతం | స్థాపయిష్యామిచతతోలింగమేతత్త్వయాకృతం || 69 ||

పాతాలసుతలంప్రాప్యవితలంచరసాతలం | తలాతలంచతదిదంభేదయిత్వాతుతిష్ఠతి || 70 ||

ప్రతిష్ఠితంమయాతింగంభేత్తుంకస్యబలంభ##వేత్‌ | ఉత్తిష్ఠలింగముద్వాస్యమయైతత్‌స్థాపితంకపే || 71 ||

త్వయాసమాహృతంలింగంస్థాపయస్వాశుమాశుచః | ఇత్యుక్తస్తంప్రణమ్యాథాజ్ఞాతసత్వోథవానరః || 72 ||

ఉద్వాసయామివేగేససైకతంలింగముత్తమం | సంస్థాపయామికైలాసాదానీతంలింగమాదరాత్‌ || 73 ||

ఉద్వాసనేసైకతస్యకియాన్భారోభ##వేన్మమ | చేతసైవంవిచార్యాయంహనుమాన్మారుతాత్మజః || 74 ||

పశ్యతాంసర్వదేవానాం మునీనాంకపిరక్షసాం | పశ్యతోరామచంద్రస్యలక్ష్మణస్యాపిపశ్యతః || 75 ||

పశ్యంత్యాఅపివైదేహ్యాలింగంతత్పైకతంబలాత్‌ | పాణినాసర్వయత్నేనజగ్రాహతరసాబలీ || 76 ||

యత్నేసమహతాచాయంచాలయన్నపిమారుతిః | నాలంచాలయితుంహ్యాసీత్సైకతంలింగమోజసా || 77 ||

తతఃకిలకిలాశబ్దంకుర్వన్వానరపుంగవః | పుచ్ఛముద్యమ్యపాణిభ్యాంనిరాస్థత్తన్ని ఔజసా || 78 ||

ఇత్యనేకప్రకారేణచాలయన్నపివానరః | నైవచాలయితుంశక్తోబభూవవపనాత్మజః || 79 ||

తద్వేష్ఠ యిత్వాపుచ్ఛేనపాణిభ్యాంధరణీంస్పృశన్‌ | ఉత్పపాతాథతరసావ్యోమ్నివాయుసుతఃకపిః || 80 ||

కంపయన్‌సధరాంసర్వాంసప్తద్వీపాంసపర్వతాం | లింగస్యక్రోశమాత్రేతుమూర్భితోరుధిరంవమన్‌ || 81 ||

వపాతహనుమాన్విప్రాఃకంపితాంగోధరాతలే | పతతోవాయుపుత్రస్యవక్త్రాచ్చనయనద్వయాత్‌ || 82 ||

నాసాపుటాచ్ఛ్రోత్రరంధ్రాత్‌ అపానాచ్చద్విజోత్తమాః | రుధిరౌఘః ప్రసుస్రావరక్తకుండమభూచ్చతత్‌ || 83 ||

తతోహాహాకృతంసర్వంసదేవాసురమానుషం | ధావంతౌకపిభిఃసార్థముభౌతౌరామలక్ష్మణౌ || 84 ||

జానకీసహితౌవిప్రాహ్యాస్తాంశోకాకులౌతదా | సీతయాసహితౌవీరౌవానరౌఐశ్చమహాబలౌ || 85 ||

రురుచాతేతదావిప్రాగంధమాదనపర్వతే | యథాతారాగణయుతౌరజన్యాంశశిభాస్కరౌ || 86 ||

దదర్శతుర్హసూమంతంచూర్ణీకృతకలేవరం | మూర్ఛితంపతితంభూమౌవమస్తంరుధిరంముఖాత్‌ || 87 ||

విలోక్యకపయఃసర్వేహాహకృత్వాపతన్భువి | కరాభ్యాంసదయంసీతాహనూమాంతంమరుత్సుతం || 88 ||

తాతతాతేతిపస్సర్శపతితంధరణీతలే | రామోపిదృష్ట్వాపతితంహనూమంతంకపీశ్వరం|| 89 ||

ఆరోప్యాంకంస్వపాణిభ్యామామమర్శకలేవరం | విముంచన్నేత్రజంవారివాయుజంచాబ్రవీద్ద్విజాః || 90 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామచంద్ర తత్వజ్ఞానోవదేశవర్ణనంనామ పంచచత్వారింశోధ్యాయః || 45 ||

తా || ఓమహాభాగనీవు (68) నేనుఇక్కడస్థాపించినసీతిసుకతోచేసినలింగాన్ని పెరికివేసినచోనీవుచేసిన ఈలింగాన్ని ఆపిదపస్థాపిస్తాను (69) పాతాలమును సుతలవితలరసాతలతలాతలములను ఈలింగముభేదించిఉంటుంది (70) నేను ప్రతిష్ఠించినఈలింగాన్ని భేదించటానికి ఎవరికిసాధ్యమౌతుంది. ఓకపి! నేను స్థాపించినీలింగాన్ని తొలగించితెమ్ము (71) నీవు తీసుకువచ్చినలింగాన్ని త్వరగాస్థాపించు, దుఃఖించకు. అనిఅనగా ఆతనికి నమస్కరించి, ఆవానరుడు, శక్తిని ఎరుగని వాడై (72) ఇసుకతోచేసినుత్తమలింగాన్ని వేగంగాతొలగిస్తాను. కౌలాసమునుండితెచ్చినలింగమునుఆదరంతోస్థాపిస్తాను. (73) సైకతలింగాన్నితొలగించటంలోనాకేంభారమౌతుంది. అనిమనస్సులోఅనుకొనిఈమారుతాత్మజుడైనహనుమంతుడు (74) దేవతలందరుచూస్తుండగా, మునులు, కవులు, రాక్షసులు చూస్తుండగా రామచంద్రడు, లక్ష్మణుడుకూడా చూస్తుండగా (75) సీతచూస్తుండగా ఆసైకతలింగాన్ని, బలంగావేగంగాబలవంతుడైన వానరుడు చేతితోఅన్ని ప్రయత్నములతో పట్టుకున్నాడు. (76) గొప్పప్రయత్నంతోఈమారుతికదలిస్తూగూడా, తనశక్తితో ఆసైకతలింగాన్ని కదిలించటానికిసమర్థుడు కాలేదు. (77) పిదపకిలకిలశబ్దాన్నిచేస్తూ ఆవానరపుంగపుడుతో కనెత్తితనతేజస్సుతో చేతులతో బాగాప్రయత్నించాడు. (78) ఇట్లాఅనేకవిధముల కదిలించదలచి కూడావానరుడు పవనాత్మజుడు కదిలించుటకు సమర్థుడు కాలేకపోయాడు (79) తోకతో లింగాన్నిచుట్టి చేతితోభూమిని అదిమిపట్టి వాయుసుతుడైన కపివేగంగా ఆకాశంలో ఎగిరాడు (80) ఏడుదీవులతో, పర్వతములతో భూమినంతనువణికిస్తూ లింగమునకు కోసుదూరంలో రక్తంక క్కూతు మూర్ఛపోయాడు (81) ఓవిప్రులారా ! శరీరంవణుకు తుండగాహనుమంతుడుభూమిపైపడ్డాడు. పడినవాయుపుత్రుని ముఖంనుండిరెండుకళ్ళనుండి (82) ముక్కురంధ్రముల నుండి, చెవిరంధ్రముల నుండి, అపానమార్గము నుండి రక్తపు సమూహము స్రవించింది. అది రక్తకుండమైంది (83) దేవతలు అసురులు, మనుష్యులు అందరూ హాహాకారాలు చేశారు. కోతులతో పాటు పరుగెత్తుతున్న ఆ రామలక్ష్మణులు(84) సీతతో కూడినవారై దుఃఖాకులులైనారు. ఆ వీరులు సీతతో కూడిన వారై ఆ మహా బలులు వానరులతో కూడా కూడిన వారై (85) గంధమాదన పర్వతమందు వెలిగారు, రాత్రియందు చంద్రుడు, సూర్యుడు వెలిగినట్లు వెలిగారు (86) శరీరమంతా చూర్ణమైన హనుమంతుని చూశారు. ముర్ఛపోయిన, భూమిపై పడిన ముఖం నుండి రక్తం కక్కుతున్న (87) వానిని చూచి కోతులందరు హాహాకారాలు చేసి భూమిపై పడ్డారు. దయగలిగిన సీత మరుత్సుతుడైన హనుమంతుని (88) భూమిపై పడిన వానిని నాయన! నాయన! (కుమార, కుమార!) అని చేతులతో స్పృశించింది. రాముడు కూడా పడిన కపీశ్వరుని, హనుమంతుని చూచి (89) కలేవరాన్ని తొడపై నుంచుకొని తన చేతులతో పరామర్శించాడు. కళ్ళనుండి వస్తున్న కన్నీళ్ళను వదులుతూ ఆ వాయుజునితో ఇట్లా అన్నాడు (90) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్యమందు రామచంద్ర తత్వజ్ఞానోపదేశ వర్ణన మనునది నలుబది ఐదవ అధ్యాయము || 45 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters