Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది ఆరవ అధ్యాయము

మూ || శ్రీరామ ఉవాచ -

పంపారణ్య పయం దీనాః త్వయావానర పుంగవ | ఆశ్వాసితాః కారయిత్వా సఖ్యమాదిత్య సూనునా || 1 ||

త్వాందృష్టవాపితరం బంధూన్‌ కౌసల్యాం జనీమపి | సస్మరామో వయం సర్వాన్మేత్వయో పకృతంబహు || 2 ||

మదర్థం సాగరస్తీర్ణో భవతాబహు యోజనః | తలప్రహారాభిహతో మైనాకోపినగోత్తమః || 3 ||

నాగమాతాచ సురసామదర్థం భవతాజితా | ఛాయాగ్రహాం మహాక్రూరా మవధీ ద్రాక్షసీం భవాన్‌ || 4 ||

సాయంసువేలమాసాద్యలంకామాహత్యపాణినా | అయాసీరావణగృహం మదర్థం త్వం మహాకపే || 5 ||

సీతామన్విష్యలంకాయాం రాత్రౌగత భయోభవాన్‌ | అదృష్ట్వాజానకీం పశ్చాదశోకవని కాంయ¸° || 6 ||

నమస్కృత్య చవైదేహీ మభిజ్ఞానం ప్రదాయచ | చూడామణీం సమాదాయ మదర్థం జానకీకరాత్‌ || 7 ||

అశోకవనికావృక్షాన భాంక్షీస్త్వం మహాకపే | తతస్త్వశీతి సాహస్రాన్కిం కరాన్నామ రాక్షసాన్‌ || 8 ||

రావణప్రతి మాన్యుద్ధేపత్యశ్వేభరథాకులాన్‌ | అవధీస్త్వం మదర్థేవై మహాబలపరాక్రమాన్‌ || 9 ||

తతః ప్రహస్త తనయంజంబుమాలిన మాగతం | అవధీన్మంత్రి తనయాన్సప్తసప్తార్చివర్చనః || 10 ||

పంచసేనాపతీన్సశ్చాదన యస్త్వంయమాలయం | కుమారమక్షమవధీస్తతస్త్వం రణమూర్ధని || 11 ||

తతః ఇంద్రజితానీతో రాక్షసేంద్ర సభాంశుభాం | తత్రలంకేశ్వరం వాచా తృణీకృత్యావ మన్యచ || 12 ||

అభాంక్షీస్త్వం పురీం లంకాం మదర్థం వాయునందన | పునః ప్రతినివృత్తస్త్వమృష్యమూకం మహాగిరిం || 13 ||

ఏవమాది మహాదుఃఖం మదర్థం ప్రాప్తవానసి | త్వమత్ర భూతలేశేషే మమశోకము దీరయన్‌ || 14 ||

అహంప్రాణాస్పరిత్యక్ష్యే మృతో సి యదివాయుజ | సీతయామమకింకార్యం లక్ష్మణ నానుజేనవా || 15 ||

తా || శ్రీరాముల వచనము 6 ఓ వానరపుంగవ ! పంపారణ్యమందు దీనులమైన మేము సుగ్రీవునితో స్నేహం నీచే చేయించబడి ఆశ్వాసింపబడినాము (1) నిన్ను చూచి తండ్రిని, బంధువులను తల్లియైన కౌసల్యను, వారందరిని మేము స్మరించటం లేదు. నీవు చాలా ఉపకారం చేశావు (2) నీవు బహు యోజనమైన సముద్రాన్ని మా కొరకు దాటావు. న గోత్తమమైనమైనాకుడు అరచేతి దెబ్బతో కొట్టబడ్డాడు (3) నాగమాతయైన సురసను నాకో సంనీవు జయించావు. మహాక్రూరమైన ఛాయాగ్రహాన్ని రాక్షసిని నీవు చంపావు (4) సాయంకాలమునకు సువేలను చేరి చేతితో లంకిణిని చంపి, ఓ మహాకపి ! నీవు నా కొరకు రావణ గృహానికి వెళ్ళావు (5) భయం లేకుండా నీవు రాత్రి యందు లంకలో సీతను వెదకి, సీతను కానక పిదప అశోకవనానికి వెళ్ళావు (6) సీతకు నమస్కరించి, అభిజ్ఞానమును ఇచ్చి నా కొరకు జానకి చేతి ద్వారా చూడామణిని తీసుకొని (7) ఓ మహాకపి! అశోక వనమందలి వృక్షములను విరగొట్టావు నీవు. పిదప ఎనుబదివేల కింకరులను పేరుగల రాక్షసులను (8) రావణునితో సమానమైన వాళ్ళను, పదాతి అశ్వగజరథములతో కూడిన వారిని, మహాబల పరాక్రమములు కలవారిని నా కొరకు నీవు చంపావు. (9) పిదప వచ్చిన ప్రహస్తుని కొడుకైన జంబుమాలిని, అగ్నివంటి వర్చస్సుగల మంత్రి తనయులను ఏడుగురుని (10) పిదప ఐదుగురుసేనా పతులను నీవు యమమందిరానికి పంపావు. పిదప యుద్ధంలో నీవు అక్షయ కుమారుని చంపావు (11) పిదప ఇంద్రజిత్తు నిన్ను శుభ##మైన రాక్షసేంద్రసభకు తీసుకువెళ్ళాడు. అక్కడ లంకేశ్వరుని మాటలతో తృణీకరించి, అవమానపరచి (12) నా కొరకు నీవు వాయునందన లంకానగరాన్ని ధ్వంసం చేశావు. తిరిగి ఋష్యమూక మహాపర్వతానికి వచ్చావు (13) ఈ విధముగా నా కొరకు మహాదుఃఖాన్ని నీవను భవించావు. నా దుఃఖాన్ని అధికం చేస్తూ నీవిక్కడ భూమిపై నిద్రిస్తున్నావు. (14) ఓ వాయుజ ! ఒకవేళ నీవు చనిపోతే నేను ప్రాణములను వదులుతాను. సీతతోగాని అనుజుడైన లక్ష్మణునితో గాని నాకేమిపని (15).

మూ || భరతేనాపి కింకార్యం శత్రుఘ్నేనశ్రియాపివా | రాజ్యేనాపినమేకార్యం పరేతస్త్వంకపేయది || 16 ||

ఉత్తిష్ఠహనుమన్వత్సకింశేషేద్యమహీతలే | శయ్యాం కురుమహాబాహోనిద్రార్థం మమవానర || 17 ||

కందమూల ఫలానిత్వం ఆహారార్థం మమాహర | స్నాతుమద్యగమిష్యామి శీఘ్రం కలశమానయ || 18 ||

అజినానిచవాసాంసిదర్భాంశ్చ సముపాహర | బ్రహ్మాస్త్రేణావబద్ధోహం మోచిత శ్చత్వయాహరే || 19 ||

లక్ష్మణన సహభ్రాత్రా హ్యౌషధానయనేనవై | లక్ష్మణ ప్రాణదాతాత్వం పౌలస్త్యమదనాశనః || 20 ||

సహాయేసత్వయాయుద్ధే రాక్షసాన్రావణాదికాన్‌ | నిహత్యాతి బలాన్వీరానవాపం మైథిలీమహం || 21 ||

హనూమన్నంజనాసూనో సీతాశోకవినాశన | కథమేవం పరిత్యజ్య లక్ష్మణం మాంచ జానకీం || 22 ||

అప్రాపయిత్వాయోధ్యాంత్వం కిమర్థం గతవానపి | క్వగతో సిమహావీర మహారాక్షస కంటక || 23 ||

ఇతిపశ్యన్ము ఖంతస్య నిర్వాక్యం రఘునందనః | ప్రరుదన్నశ్రుజాలేన సేచయా మానవాయుజం || 24 ||

వాయుపుత్రస్తతోమూర్ఛా మపహా యశ##నైర్ద్విజాః | పౌలస్త్యభయసంత్రస్తలోక రక్షార్థ మాగతం || 25 ||

ఆశ్రిత్య మానుషం భావం నారాయణ మజంవిభుం | జానకీ లక్ష్మణయుతం కపిభిః పరివారితం || 26 ||

కాలాంభోధర సంకాశం రణధూలి సముక్షితం | జటామండట శోభాఢ్యం పుండరీకాయతేక్షణం || 27 ||

భిన్నంచ బహుశోయుద్ధే దదర్శ రఘునందనం | స్తూయమానమమిత్రఘ్నం దేవర్షి పితృకిన్నరైః || 28 ||

దృష్ట్వాదాశరధిం నాసుంకృపాబహులచేతనం | రఘునాథకరస్పర్శ పూర్ణగాత్రః సవానరః || 29 ||

పతిత్వాదండ వద్భూమౌ కృతాంజలి పుటోద్విజాః | అస్తౌషీజ్జానకీ నాథం స్తోత్రైః శ్రుతి మనోహరైః || 30 ||

హనుమానువాచ -

నమో రామాయహరయే విష్ణవే ప్రభవిష్ణవే | ఆదిదేవాయ పురాణాయగదాభృతే || 31 ||

విష్టరే పుష్పకే నిత్యం ని విష్టాయ మహాత్మనే | ప్రహృష్టవానరానీక జుష్ట పాదాంబుజాయతే || 32 ||

తా || భరతునితో కాని శత్రుఘ్నునితో కాని శ్రీ తో కాని పనిలేదు. నాకు రాజ్యంతో కూడా పనిలేదు. ఓ కపి! నీవు మరణిస్తే (16) వత్స! హునుమాన్‌ ! లే. ఇవ్వాళ్ళ భూమిపై పడుకున్నావేమి. ఓ మహాబాహు ! వానర! నిద్ర కొరకు నన్ను పడకగా చేసుకో (17) నా కొరకు కందమూల ఫలములు నీవు ఆహారంగా తీసుకురా. ఈ వేళ స్నానానికి వెళ్తాను త్వరగా కలశం తీసుకొనిరా (18) జింక చర్మము, వస్త్రములు, దర్భలు తీసుకునిరా. నేను బ్రహ్మాస్త్రంతో కట్టుబడగా ఓ హరి! (కపి) నీవునన్ను విడిపించావు (19) ఔషధంతీసుకు రావటం ద్వారా భ్రాతయైన లక్ష్మణునితో పాటు నేను విడిపించబడ్డాను. లక్ష్మణునకు ప్రాణమిచ్చినవాడవు నీవు. పౌలస్త్యుని మదమును నశింపచేసిన వాడవునీవు (20) యుద్ధంలో నీ సహాయంతో రావణాది రాక్షసులను అతి బలవంతులను వీరులను చంపి సీతను నేను పొందాను (21) అంజనాసూను హనుమాన్‌! సీతాశోకనాశక ! ఈవిధంగా నన్ను లక్ష్మణుని జానకిని వదలి (22) అయోధ్యకు మమ్మల్ని చేర్చకుండానే నీవెందుకు వెళ్లావు. మహారాక్షసులకు ముల్లులాంటివాడవైన మహావీర ఎక్కడికి వెళ్ళావు. (23) అని వానరుని ముఖంచూస్తూ రఘునందనుడు మాట్లాడకుండా, ఏడుస్తూ కన్నీళ్ళతో హనుమంతుని తడువసాగాడు (24) ఓ ద్విజులార! ఆ పిదప వాయుపుత్రుడు మెల్లగా మూర్ఛను వదలి, పౌలస్త్యుని భయముతో బాగా భయపడిన లోకములను రక్షించుట కొరకు వచ్చిన (25) మానుష భావాన్ని ఆశ్రయించిన నారాయణుని, అజుని, విభుని, జానకి లక్ష్మణులతో కూడిన వానిని వానరులతో చుట్టబడిన వానిని (26) ప్రళయకాల మేఘమువలె నున్న వానిని యుద్ధపు ధూలి బాగా, పైన గల వానిని జటామండల శోభ గల వానిని, పుండరీకమువలె విశాలమైన కన్నులు గల వానిని (27) అనేక మార్లు యుద్ధమందు భిన్నమైన వానిని రఘునందనుని చూచాడు. దేవర్షి పితృకిన్నరులతో పొగడబడుతున్న శత్రుసంహారకుడైన (28) కృపాబాహుల్యము గల మనస్సు గల దశరథ రాముని చూచి రఘునాధుని కరస్పర్శతో పరిపూర్ణమైన శరీరము గల ఆ వానరుడు (29) ఓ ద్విజులార ! చేతులు జోడించి దండమువలె భూమిపై బడి చెవులకింపైన స్తోత్రములతో జానకీ నాథుని స్తుతించాడు (30) హనుమంతుని వాక్యము రామరూపుడైన హరునకు, విష్ణువునకు ప్రభవిష్ణువునకు, ఆది దేవునకు, పురాణ (ప్రాచీనమైన) దేవునకు, గదాధారికి నమస్కారము (31) వైకుంఠ మంద ఎల్లప్పుడు పుష్పకమందు ఉండే మహాత్మునకు, ఆనందించిన వానరుల సమూహంతో సేవింపబడే పాదాంబుజములు కలనీకు నమస్కారము (32).

మూ || నిష్పిష్ట రాక్షసేంద్రాయ జగదిష్ట విధాయినే | నమః సహస్ర శిరసే సహస్ర చరణాయచ || 33 ||

సహస్రాక్షాయ క్షుద్రాయ రాఘవాయచవిష్ణవే | భక్తార్తి హారిణతుభ్యం సీతాయాః పతయేనమః || 34 ||

హరయే నారసింహాయ దైత్యరాజవిదారిణ | నమస్తుభ్యం ప రాహాయ దంష్ట్రో ద్ధృత వసుంధర || 35 ||

త్రివిక్రమాయ భవతే బలియజ్ఞవిభేదినే | నమోవామనరూపాయ నమో మందర ధారిణ || 36 ||

నమస్తే మత్స్యరూపాయ త్రయీపాలన కారిణ | నమః పరశురామాయ క్షత్రియాంతకరాయతే || 37 ||

నమస్తే రాక్షసఘ్నాయ నమో రాఘవ రూపిణ | మహాదేవ మహాభీమ మహాకోదండభేదినే || 38 ||

క్షత్రియాంతకరక్రూర భార్గవత్రాసకారిణ | నమోస్త్వహల్యా సంతాపహారిణ చాపహారిణ || 39 ||

నాగాయుత బలోపేత తాటకాదేహ హారిణ | శిలాకఠిన విస్తార వాలిపక్షవిభేదినే || 40 ||

నమోమాయామృగోన్మాథ కారిణజ్ఞానహారిణ | దశస్యందనదుఃఖాబ్ధిశోషణాగస్త్య రూపిణ || 41 ||

అనేకోర్మి సమాధూత సముద్రమదహారిణ | మైథిలీ మానసాంభోజ భానవేలోక సాక్షిణ || 42 ||

రాజేంద్రాయనమస్తుభ్యం జానకీపతయేహరే | తారకబ్రహ్మణతుభ్యంనమోరాజీవలోచన || 43 ||

రామాయరామచంద్రాయ వరేణ్యా యనుఖాత్మనే | విశ్వామిత్రప్రియాయేదం నమః ఖరవిదారిణ || 44 ||

ప్రసీదదేవదేవేశ భక్తానామభయప్రద | రక్షమాం కరుణాసింధో రామచంద్ర నమోస్తుతే || 45 ||

రక్షమాంవేదవచ సామప్యగోచర రాఘవ | పాహిమాం కృపయారామశరణంత్వాముపైమ్యహం || 46 ||

రఘువీర మహామోహమ పాకురు మమాథునా | స్నానేచాచమనే భుక్తౌ జాగ్రత్స్వప్న షుప్తిషు || 47 ||

సర్వావస్థాసుసర్వత్ర పాహిమాం రఘునందన | మహిమానంతవస్తోతుంకః సమర్థోజగత్త్రయే || 48 ||

త్వమేవత్వన్మహత్వం వైజానాసి రఘునందన | ఇతిస్తుత్వా వాయుపుత్రోరామచంద్రం ఘృణానిధిం || 49 ||

సీతామప్యభితుష్టాపభక్తియుక్తేన చేతసా |

తా || రాక్షసేంద్రుని పొడిగా చేసిన, జగత్తుకు ఇష్టమును చేకూర్చిన, సహస్ర శిరస్సులు గలిగిన సహస్ర చరణములు కలిగిన నీకు నమస్కారము (33) సహస్రాక్షుడు, శుద్ధుడు విష్ణువు రాఘవునకు నమస్సులు. భక్తుల ఆర్తిని హరించే సీతాపతియైన నీకు నమస్కారము (34) దైత్యరాజును చీల్చిన నరసింహుడైన హరికి, కోరతో భూమిని పైకెత్తిన వరాహుడవైన నీకు నమస్కారము (35) బలియజ్ఞమును భేదించిన త్రివిక్రముడవైన నీకు వామనరూపుడైన వానికి నమస్సులు. మందరమును ధరించిన వానిని నమస్సులు (36) మత్స్య రూపమును ధరించి వేద రక్షణకు కారణమైన నీకు నమస్సులు. క్షత్రియులనంతమొనర్చిన పరశురాముడవైన నీకు నమస్కారము (37) రాక్షసులను చంపిన రాఘవ రూపుడవైన నీకు నమస్సులు. మహాదేవుని మహా భయంకరమైన మహా ధనస్సును భేదించిన (38) క్షత్రియాంతకుడైన క్రూర భార్గవునకు భయకారణమైన అహల్యా సంతాపమును హరించిన, ధనస్సును హరించిన నీకు నమస్కారము (39) పదివేల ఏనుగుల బలము గల తాటక దేహమును హరించినవాడ రాయివలె కఠినమైన విశాలమైన వాలి వక్షమును ఛేదించినవాడ, (40) మాయామృగమున సంహరించినవాడ, అజ్ఞానమును హరించినవాడ, రావణుడనే దుఃఖ సముద్రము ఎండుటకు ఆగస్త్యరూపియైన వాడ (41) అనేక అలలతో కదులుతున్న సముద్ర మదమును హరించినవాడ, మైథిలి మనస్సనే తామరపువ్వునకు సూర్యుడైన వాడ, లోకసాక్షి (42) జానకీపతి, హరి, రాజేంద్ర ! నీకు నమస్కారము. రాజీవలోచన ! (తామర) తారకబ్రహ్మ నీకు నమస్కారము (43) రామునకు, రామచంద్రునకు, శ్రేష్ఠునకు, సుఖమైన ఆత్మకలవానికి, విశ్వామిత్రునకు ప్రియమైనవానికి, ఖరసంహారికి, నీకిదే నమస్కారము (44) భక్తులకు అభయమిచ్చువాడ, దేవదేవేశ అనుగ్రహించు ఓ కరుణాసింధు నన్ను రక్షించు (45) వేదవాక్కులకు గూడా గోచరము కానివాడ, రాఘవ నన్ను రక్షించు రామ దయతో నన్ను రక్షించు నేను నిన్ను శరణు వేడుతున్నాను (46) రఘువీర ! నా మహా మోహమును ఇప్పుడు తొలగించు స్నానమందు ఆచమనమందు భుక్తి యందు మెలకువ యందు స్వప్నమందు సుషుప్తియందు (47) అంతట అన్ని అవస్థలయందు నన్ను రక్షించు ఓ రఘునందన నీ మహిమను స్తుతించుటకు ముల్లోకములలో ఎవడు సమర్థుడు (48) ఓ రఘునందన నీ మహత్తును నీవే గుర్తెరుగ గలవు అని వాయుపుత్రుడు దయానిథియైన రామచంద్రుని స్తుతించి (49) భక్తితో కూడిన మనస్సుతో సీతను కూడా స్తుతించాడు.

మూ || జానకిత్వాం నమస్యామి సర్వపాప ప్రణాశినీం || 50 ||

దారిద్ర్యరణ సంహర్త్రీం భక్తానామిష్టదాయినీం | విదేహరాజతనయా రాఘవానందకారిణీం || 51 ||

భూమేర్దుహితరం విద్యాం నమామిప్రకృతిం శివాం | పౌలసై#్త్యశ్వర్య సంహర్త్రీం భక్తాభీష్టాం సరస్వతీం || 52 ||

పతివ్రతా ధురీణాంత్వా నమామి జనకాత్మజాం | అనుగ్రహ పరామృద్ధిమనఘాం హరివల్లభాం || 53 ||

ఆత్మవిద్యాం త్రయీరూపాము మారూపాం నమామ్యహం | ప్రసాదాభిముఖీం లక్ష్మీం క్షీరాబ్థితనయాం శుభాం || 54 ||

నమామి చంద్ర భగినీం సీతాం సర్వాంగ సుందరీం | నమామి ధర్మనిలయాంకరుణాంవేదమాతరం || 55 ||

పద్మాలయాంపద్మహస్తాంవిష్ణువక్షస్థలాలయాం | నమామి చంద్రనిలయాం సీతాంచంద్రనిభాననాం || 56 ||

ఆహ్లాద రూపిణీం సిద్ధిం శివాంశివ కరీం సతీం

నమామి విశ్వజననీం రామచంద్రేష్టవల్లభాం 7 సీతాం సర్వాన వద్యాంగీం భజామి సతతం హృదా || 57 ||

శ్రీ సూత ఉవాచ -

స్తుత్వేవం హనుమాన్సీతా రామచంద్రౌసభక్తికం | ఆనందాశ్రు పరిక్లిన్న స్తూష్ణీమాస్తే ద్విజోత్తమాః || 58 ||

య ఇదం వాయుపుత్రేణ కథితం పాపనాశనం | స్తోత్రం శ్రీరామ చంద్రస్య సీతాయాః పఠతేన్వహం || 59 ||

సనరోమహదైశ్వర్య మశ్నుతే వాంఛితం సదా | అనేక క్షేత్ర ధాన్యానిగాశ్చ దోగ్థ్రీః పయస్వినీః || 60 ||

ఆయుర్విద్యాశ్చ పుత్రాంశ్చ భార్యామపిమనోరమాం | ఏతత్‌ స్తోత్రంనకృద్విప్రాఃపఠన్నాప్నోత్యసంశయః || 61 ||

ఏతత్‌ స్తోత్రస్యపాఠేన నరకం నైవయాస్యతి | బ్రహ్మహత్యాది పాపాని నశ్యంతి సుమహాంత్యపి || 62 ||

సర్వపాప వినిర్ముక్తో దేహాంతే ముక్తి మాప్నుయాత్‌ | ఇతిస్తుతో జగన్నాథో వాయుపుత్రేణ రాఘవః || 63 ||

సీతయాసహితో విప్రా హనూమంతమథా బ్రవీత్‌ || 64 ||

తా || ఓ జానకి ! సర్వపాప ప్రణాశినియైన నిన్ను నమస్కరిస్తున్నాను (50) దారిద్ర్యమనే యుద్ధమును ఉపసంహరించే దానిని, భక్తుల అభీష్టమును ఇచ్చే దానిని, విదేహ రాజతనయను రాఘవునకు ఆనందముకల్గించు దానిని (51) భూమికికూతురైన దానిని, విద్యను, మంగళకారిణిని, ప్రకృతి రూపిణిని నమస్కరిస్తున్నాను. రావణుని ఐశ్వర్యమును నశింపచేసిన దానిని భక్తులకు ఇష్టమైన దానిని సరస్వతిని (52) పతివ్రతలలో అగ్రగామియైనదానిని, జనకాత్మజను ఐన నీకు నమస్కరిస్తున్నాను. అనుగ్రహపరురాలను సమృద్ధి కలదానివి, పుణ్యాత్మురాలివి, హరివల్లభను (53) ఆత్మవిద్యను వేదత్రయరూపిణిని, ఉమారూపిణిని, నేను నమస్కరిస్తున్నాను. అనుగ్రహమునకు అభిముఖమైన దానిని లక్ష్మిని, క్షీరాబ్ధి తనయను, శుభకరమైన దానిని (54) చంద్రునకు సహోదరిని, సర్వాంగము లందు సౌందర్యము కలదానిని, ఐన సీతను నమస్కరిస్తున్నాను. ధర్మమునకు నిలయమైన దానిని కరుణారూపిణిని, వేదమాతను నమస్కరిస్తున్నాను. (55) పద్మాలయను, పద్మహస్తను, విష్ణువక్షః స్థనిలయను, సువర్ణస్థానమును, చంద్రునికాంతి వంటి ముఖము కలదానిని, ఐన సీతను నమస్కరిస్తున్నాను. (56) ఆనందస్వరూపిణిని, సిద్ధిని, శివను, శివకారిణిని, సతిని, విశ్వజననిని, రామచంద్రునికి ఇష్టమైన భార్యను నమస్కరిస్తున్నాను. సీతను అన్ని ఉత్తమమైన అవయవములు కలదానిని ఎల్లప్పుడు మనస్సుతో భజిస్తాను (57) శ్రీ సూతులిట్లనినారు - ఈ విధముగా హనుమంతుడు సీతారామచంద్రులను భక్తితో స్తుతించి (58) ఆనంద భాష్పములతో తడిసిపోతూ మౌనంగా ఉన్నాడు. ఓ ద్విజులార ! వాయుపుత్రుడు చెప్పిన పాపనాశకమైన ఈ (59) శ్రీరామ చంద్రుని మరియు సీతయొక్క స్తోత్రమును ప్రతిరోజు చదువుతాడో ఆ నరుడు, ఎల్లప్పుడు మహాదైశ్వర్యమును వాంఛితమును పొందుతాడు (60) అనేక క్షేత్రములను, ధాన్యమును ఈనిన పాలిచ్చే ఆవులను, ఆయుస్సును, విద్యను పుత్రులను మనోరమమైన భార్యను పొందుతాడు (61) ఈ స్తోత్రమును ఒక్క సారి చదివిన, పైవన్ని పొందుతారు అనుమానం లేదు. ఈ స్తోత్రాన్ని చదవటం వలన నరకమునకు వెళ్ళడు (62) గొప్పవైన బ్రహ్మహత్యాది పాపములు కూడా నశిస్తాయి. అన్ని పాపములనుండి నిర్ముక్తుడై దేహాంతమందు ముక్తిని పొందుతాడు (63) అని హనుమంతుడు జగన్నాథుని రాఘవుని స్తుతించగా సీతతో కూడి రాఘవుడు హనుమంతునితో ఇట్లనినాడు (64).

మూ || శ్రీరామ ఉవాచ -

అజ్ఞానాద్వానరశ్రేష్ఠ త్వమేదం సాహసంకృతం | బ్రాహ్మణా విష్ణునావాపి శక్రాది త్రిదశైరపి || 65 ||

నేదం లింగం సముద్ధర్తుం శక్యతే స్థాపితం మయా | మహాదేవాపరాధేన పతితోస్య ద్యమూర్చితః || 66 ||

ఇతః పరం మాక్రియతాం ద్రోహః సాంబస్యశూలినః | అద్యారభ్యత్విదం కుండం తపనామ్నాజగత్త్రయే || 67 ||

ఖ్యాతి ప్రయాతు యత్రత్వం పతితో వానరోత్తమ | మహాపాతక సంఘానాం నాశః స్యాదత్రమజ్జనాత్‌ || 68 ||

మహాదేవ జటాజాతాగౌతమీ సరితాంపరా | అశ్వమేధ సహస్రస్య ఫలదాస్నాయినాంనృణాం || 69 ||

తతః శతగుణాగంగాయమునాచ సరస్వతీ | ఏతన్నదీత్రయం యత్ర స్థలే ప్రవహతేకపే || 70 ||

మిలిత్వాతత్రతుస్నానంసహస్రగుణితంస్మృతా | నదేష్వేతాసుయత్స్నానాత్‌ఫలంపుసాంభ##వేత్కపే || 71 ||

తత్ఫలంతపకుండేస్మిస్నానాత్ర్పాప్నోత్యసంశయం | దుర్లభంప్రాప్యమానుష్యంహనుమత్కుండతీరతః || 72 ||

శ్రాద్ధంసకురుతేయస్తుభక్తియుక్తేసచేతసా | నిరాశస్తస్యపితరః ప్రయాంతికుపితాఃకపే || 73 ||

కుష్యంతి మునయోప్యసై#్మదేవాఃసేంద్రాఃసచారణాః | నదత్తంసహుతంతేనహనూమత్కుండతీరతః || 74 ||

వృథాజీవితేవాసావిహాముత్రచదుఃఖభాక్‌ | హనూమత్కుండనవిధేయేసదత్తంతిలోదకం

మోదంతేపితరస్తస్యఘృతకుల్యాఃపిబంతిచ || 75 ||

శ్రీసూత ఉవాచ -

శ్రుత్వైతద్వచనం విప్రా రామేణోక్తం నవాయుజః || 76 ||

ఉత్తరేరామనాథస్యలింగంస్వేనాహృతంముదా | ఆజ్ఞయారామచంద్రస్యస్థాపయామానవాయుజః || 77 ||

ప్రత్యక్షమేవ సర్వేసాం కపిలాంగూలవేష్టితం | హరోపితత్పుచ్ఛజాతంభి భర్తిచ వలిత్రయం

తదుత్తరాయాంకకుభి గౌరీంసంస్థాపయన్ముదా || 78 ||

శ్రీసూత ఉవాచ -

ఏవంవః కథితం విప్రా యదర్థం రాఘవేణతు | లింగం ప్రతిష్ఠితం సేతౌ భుక్తిముక్తి ప్రదంనృణాం || 79 ||

యఃపఠేదిమ మధ్యాయం శృణుయాద్వాసమాహితః | నవిధూయేహపాపాని శివలోకే మహీయతే || 80 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామనాథ లింగప్రతిష్ఠాకారణ వర్ణనం నామ షట్‌చత్వారింశోధ్యాయః || 46 ||

తా || శ్రీరాముడిట్లనెను - ఓ నరశ్రేష్ఠ అజ్ఞానం వల్ల నీవీ సాహసం చేశావు. బ్రహ్మకాని విష్ణువుకాని ఇంద్రాది దేవతలు కాని (65) నేను స్థాపించిన ఈ లింగాన్ని పెకిలించటం సాధ్యం కాదు. మహాదేవునికి అపరాధంచేసిన కారణంగా ఈవేళ నీవు మూర్ఛితుడవైనావు (66) ఇకముందు శూలియైన సాంబునకు ద్రోహమాచరించొద్దు. నేటి నుండి ఈకుండము నీ పేరుతో ముల్లోకములందు (67) ఖ్యాతి నొందని. ఓవానరోత్తమ నీవుపడ్డ ఈ చోట స్నానం చేస్తే మహాపాతక సంఘములు నాశనమౌతాయి (68) మహాదేవుని జడనుండి పుట్టిన సరిత్‌శ్రేష్ఠమైన గౌతమి తనలో స్నానం చేసిన నరులకు అశ్వమేథ సహస్రముల ఫలమిచ్చేది (69) అంతకంటే నూరురెట్లు అధికమైనది గంగ, యమున, సరస్వతులు, ఓకపి! ఈ మూడు నదులు ప్రవహించిన చోటకన్న (70) అవి కలిసినచోట స్నానము చేయుట వేయిరెట్లు ఎక్కువ ఫలాన్నిస్తుంది. ఓకపి! ఈ నదులలో స్నానం వల్ల నరులకు లభించే ఫలము (71) నీ ఈ కుండంలో స్నానం వల్ల నరులకు లభిస్తుంది. అనుమానంలేదు. దుర్లభ##మైన నరజన్మను పొంది హనుమత్కుండ తీరమున (72) భక్తిగల మనస్సుతో శ్రాద్ధం చేయని నరుని పితరులు కోపంతో నిరాశులై వెళ్ళి పోతారు (73) మునులు, ఇంద్రుడు ఆదిగా దేవతలు చారణులు ఇతనిపై కోపగిస్తారు. హనుమంతుడి తీరమందు దానం చేయని, హోమము చేయని వాని (74) జీవితము వ్యర్థము. ఆతడు ఇక్కడ పరలోకంలో దుఃఖభాజనుడౌతాడు. హనుమత్కుండము ఎదుట తొలోదకమిచ్చిన వాని పితరులు ఆనందిస్తారు. వారు నేతికాలువను తాగుతారు. (75) శ్రీ సూతులవచనము - ఓ విప్రులార ! రాముడు చెప్పిన ఈ మాటను విని హనుమంతుడు (76) ఆంనందంతో తాను తెచ్చిన లింగాన్ని రామనాధునకు ఉత్తర భాగంలో రామచంద్రుని ఆజ్ఞతో వాయుడు స్థాపించాడు. (77) అందరి ఎదురుగా కపిలాంగూలము చుట్టబడినది. శివుడు కూడా ఆతోక వలన ఏర్పడిన మూడు రేఖలను వహిస్తున్నాడు దానికి ఉత్తరదిగ్భాగమందు ఆనందంతో గౌరిని స్థాపించాడు. (78) శ్రీ సూతులవచనము- ఈవిధముగా మీకు రాఘవుడు నరులకు భక్తి ముక్తినిచ్చే సేతు యందు లింగము నెందుకు స్థాపించాడో చెప్పాను (79) ఈ అధ్యాయమును చదివినవారు, చక్కగా విన్నవారు ఇక్కడ పాపములన్ని పోగొట్టుకొని శివలోకంలో వెలుగొందుతారు (80) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్య మంద రామనాధలింగప్రతిష్ఠా కారణ వర్ణన మనునది నలుబది ఆరవ అధ్యాయము || 46 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters