Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది ఏడవ అధ్యాయము

మూ || ఋషయ ఊచుః -

రాక్షసస్యవధాత్సూత రావణస్యమహామునే | బ్రహ్మహత్యాకథమభూత్‌ రాఘవస్యమహాత్మనః || 1 ||

బ్రాహ్మణస్యవధాత్సూత బ్రహ్మహత్యాభిజాయతే | స బ్రాహ్మణోదశగ్రీవః కథంత ద్వదనోమునే || 2 ||

బ్రహ్మహత్యాభ##వేత్‌ క్రూరా రామచంద్రస్య ధీమతః | ఏతన్నః శ్రద్ధధానానాం వదకారున్యాతోధునా || 3 ||

ఇతిపృష్టస్తతః సూతోనైమిషారణ్యవాసిభిః | పక్తుంప్రచక్రమేతేషాం ప్రశ్నస్యోత్తరముత్తమం || 4 ||

శ్రీసూత ఉవాచ -

బ్రహ్మపుత్రో మహాతేజాః పులస్త్యో నామవైద్విజాః | బభూవతస్య పుత్రోభూద్విశ్రవా ఇతివిశ్రుతః || 5 ||

తస్యపుత్రః పులస్త్యస్య విశ్రమాముని పుంగవాః | చిరకాలం తపస్తేపే దేవైరపి సుదుష్కరం || 6 ||

తపఃకుర్వతితస్మింస్తు సుమాలీనా మరాక్షసః | పాతాలలోకాద్భూలోకం సర్వంవైవిచచారహ || 7 ||

హెమనిష్కాంగదధరః కాలమేఘ నిభచ్ఛవిః | సమాదాయసుతాం కన్యాం పద్మహీనామివశ్రియం || 8 ||

విచరన్స మహీవృష్ఠే కదాచిత్పుష్పక స్థితం | దృష్ట్వావిశ్వవనః పుత్రంకుబేరం వైథనేశ్వరం || 9 ||

చింతయా మానవిప్రేంద్రాః సుమాలీసతురాక్షసః | కుబేర సదృశః పుత్రోయద్యస్మాకం భవిష్యతి || 10 ||

వయం వర్ధామహేసర్వేరాక్షసాహ్యకుతోభయాః | విచార్యైవం నిజాసుతామ బ్రవీద్రాక్షసేశ్వరః || 11 ||

సుతే ప్రదాన కాలోద్యతవకైకసిశోభ##నే | అద్యతే ¸°వనం ప్రాప్తం తద్దేయాత్వం వరాయహి || 12 ||

అప్రదానేన పుత్రీణాం పితరోదుఃఖ మాప్నుయుః | కించ సర్వగుణోత్కృష్టా లక్ష్మీరివనుతేశుభే || 13 ||

ప్రత్యాఖ్యానభయాత్పుంభిఃనచత్వంప్రార్థ్యసేశుభే | కన్యాపితృత్వందుఃఖాయసర్వేషాంమానకాంక్షిణాం || 14 ||

నజానేహం పరః కోవా వరయేదితికన్యకే | సాత్వం పులస్త్య తనయం మునిం విశ్రపసం ద్విజం || 15 ||

పితామహకులోద్భూతం వరయస్వస్వయంగతా | కుబేర తుల్యాస్తనయాభ##వేయుస్తే నసంశయః || 16 ||

తా || ఋషులిట్లనిరి - ఓ మహాముని రాక్షసుడైన రావణుని వధమున మహాత్ముడైన రాఘవునకు బ్రహ్మహత్య ఎట్లా కలిగింది (1) బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది. దశగ్రీవుడు బ్రాహ్మణుడు కాడుగద. అదెట్లా ఓ ముని! మాకది చెప్పండి (2) ధీమంతుడైన రామచంద్రునకు క్రూరమైన బ్రహ్మహత్య ఎట్లా కలుగుతుంది. దీనిని శ్రద్ధకలిగిన మాకు దయతో ఇప్పుడు చెప్పండి (3) అని నైమిషారణ్య వాసులైన మునులడుగగా పిదప సూతుడు వారి ప్రశ్నకు ఉత్తమమైన ఉత్తరమును చెప్పుట కారంభించాడు (4) శ్రీ సూతుని వచనము - బ్రహ్మపుత్రుడు మహాతేజ సంపన్నుడు పులస్త్యుడు అని కలడు. అతినికి విశ్రవుడని ప్రసిద్ధిచెందిన పుత్రుడు కలిగాడు (5) ఓ ముని పుంగవులార పులస్త్యుని కొడుకు విశ్రవుడు దేవతలు కూడా ఆచరించలేని తపస్సును చాలా కాలం చేశాడు (6) ఆతడు తపస్సు చేస్తుండగా సుమాలి అనుపేరుగల రాక్షసుడు పాతాళ లోకమునుండి భూలోకమంతా తిరిగాడు (7) బంగారు పతకములు గల భుజకీర్తులు ధరించి, కాలమేఘమువంటి నల్లని శరీరకాంతి గలవాడై, పద్మము నుండి హీనమైన శ్రీవలె ఉన్న కన్యయైన తన సుతను తీసుకొని (8) ఆతడు భూమిపై తిరుగుతూ ఒకసారి పుష్టకమందున్న విశ్రవనుని పుత్రుడైన ధనేశ్వరుడైన కుబేరుని చూచి (9) సుమాలి అను ఆ రాక్షసుడు చింతించసాగాడు. కుబేరుని వంటి కొడుకు మాకు కలిగితే (10) మేము రాక్షసుల మంతా ఏ భయం లేకుండా వృద్ధి చెందుతాము. ఈ విధముగా ఆలోచించి రాక్షసేశ్వరుడు తన కూతురుతో ఇట్లా అనినాడు. (11) ఓ శోభన ! కైకసి ఇది నీకు ప్రదానము చేసే కాలము. ఇప్పటికి నీకు ¸°వ్వనం వచ్చినది. నిన్ను వరునకు ఇవ్వాలి (12) కూతురును ఇవ్వనందువలన తలిదండ్రులు దఃఖాన్ని పొందుతారు. ఇంకా నీవు సర్వగుణములతో ఉత్కృష్టురాలివి. ఓ సుత నీవు లక్ష్మివలె శుభ##మైన దానివి (13) నిరాకరిస్తావనే భయంతో పురుషులు నిన్ను ప్రార్థించటంలేదు. అభిమానం కోరుకునే అందరికి కన్యాపితృత్వము దుఃఖకారకము (14) ఓ కన్యక! నిన్నెవరు వరిస్తారో నాకు తెలియదు. నీవు పులస్త్యతనయుడు ముని ఐన విశ్రవసుని ద్విజుని (15) బ్రహ్మకులములో జన్మించిన వానిని స్వయముగా వెళ్ళి వరించు. నీకు కుబేరునితో సమానమైన పుత్రులు కల్గుతారు. అనుమానములేదు అని (16).

మూ || కైకసీతద్వచః శ్రుత్వాసాకన్యాపితృగౌరవాత్‌ | అంగీచకారతద్వాక్యం తథాస్త్వితి శుచిస్మితా || 17 ||

పర్ణశాలాం మునిశ్రేష్ఠాగత్వావిశ్రవసోమునేః | అతిష్ఠదంతికేతస్యలజ్జమానాహ్యధోముఖీ || 18 ||

తస్మిన్నవనరవిప్రాః పులస్త్యతనయః సుధీః | అగ్నిహోత్రము పాస్తేన్మజ్వలత్వాపక సన్నిభః || 19 ||

సంధ్యాకాలమతిక్రూరమవిచింత్యతుకైకసీ | అభ్యేత్యతం మునింసుభ్రూః పితుర్వచన గౌరవాత్‌ || 20 ||

తస్థావధోముఖీభూమిం లిఖత్యంగుష్ఠకోటినా | విశ్రావాస్తాం విలోక్యాథ కైకసీంతనుమధ్యమాం

ఉవాచసస్మితోవిప్రాః పూర్ణచంద్ర నిభాసనాం || 21 ||

విశ్రవా ఉవాచ -

శోభ##నేకస్యపుత్రీత్వం కుతోవాత్వమిహాగతా || 22 ||

కార్యం కింవాత్వముద్దిశ్య వర్తసేత్ర శుచిస్మితే | యథార్థతో పదస్వాద్య మమసర్వమనిందితే || 23 ||

ఇతీరికతాకైకసీసా కన్యాబద్ధాంజలిర్ద్విజాః | ఉవాచతంమునిం ప్రహ్మావినయేన సమన్వితా || 24 ||

తపః ప్రభావేన మునే మదభిప్రాయమద్యతు | వేత్తుమర్హుసి సమ్యక్త్వం పులస్త్యకులదీపన || 25 ||

అహంతుకైకసీనామ సుమాలి దుహితామునే | మత్తాతస్యాజ్ఞయా బ్రహ్మంస్తవాంతిక ముపాగతా || 26 ||

శేషంత్వం జ్ఞానదృష్ట్వాద్యజ్ఞాతుమర్హస్యసంశయః | క్షణం ధ్యాత్వామునిః ప్రాహవిశ్రవాః సతుకైకసీం || 27 ||

మయాతేవిదితం సుభ్రూర్మనోగతమభీప్సితం | పుత్రాభిలాషిణీసాత్వం మామగాః సాంప్రతం శుభే || 28 ||

సాయంకాలేధునాక్రూరేయస్మాన్మాంత్వముపాగతా | పుత్రాభిలాషిణీభూత్వాతస్మాత్త్వాం ప్రబ్రవీమ్యహం || 29 ||

శృణుష్వావహితారామేకైకసీత్వమనిందితే | దారుణాన్దారుణాకారాన్‌ దారుణాభిజనప్రియాన్‌ || 30 ||

జనయిష్యసి పుత్రాంస్త్వం రాక్షసాన్‌ క్రూరకర్మణః | శ్రుత్వాతద్వచనం సాతుకైకసీప్రణిపత్యతం || 31 ||

పులస్త్యతనయం ప్రాహకృతాంజలి పుటాద్విజాః | భగవన్నీ దృశాః పుత్రాస్త్వత్తః ప్రాప్నుంనయుజ్యతే || 32 ||

ఇత్యుక్తః సమునిః ప్రాహాకైక సీంతాం సుమధ్యమాం | మద్వంశానుగుణః పుత్రః పశ్చిమస్తే భవిష్యతి || 33 ||

ధార్మికః శాస్త్ర విచ్ఛాంతో నతురాక్షసచేష్టితః | ఇత్యుక్తాకైకసీ విప్రాః కాలేక తిపయేగతే || 34 ||

సుషువేతనయం క్రూరం రక్షోరూపం భయంకరం || 34 1 / 2 ||

తా || కైకసి ఆ మాటలను విని ఆ కన్య తండ్రి మీది గౌరవం కొలది స్వచ్ఛంగా నవ్వుతూ అట్లాగే కానిమ్మని ఆతని వాక్యాన్ని అంగీకరించింది. (17) ఓ మునిశ్రేష్ఠులార ! విశ్రవన ముని యొక్క పర్ణశాలకు వెళ్ళి, సిగ్గుపడుతూ, తలను పంచుకొని ఆతని సమీపంలో నిల్చుంది (18) ఆ సందర్భంలో బుద్ధిమంతుడైన ఆ పులస్త్య తనయుడు, మండుతున్న అగ్నిలా ఉన్న ఆతడు అగ్ని హోత్రాన్ని ఉపాసిస్తున్నాడు (19) కైకసి అతిక్రూరమైన సంధ్యాకాలాన్ని గమనించకుండా, ఆ సుభ్రు తండ్రి మాటలమీది గౌరవంతో ఆమునిని చేరి (20) బొటన వేలికొనతో భూమిని రాస్తూ, తల వంచుకొని ఉండింది. తమ మధ్యమైన కైకసిని విశ్రవసుడు చూచి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి గల ఆమెతో నవ్వుతూ ఇట్లన్నాడు. (21) విశ్రవుని మాటలు - ఓ శోభన ! నీవెవరి కూతురవు. ఎక్కడ నుండి నీవిక్కడికి వచ్చావు (22) ఓ శుచిస్మిత! ఏ పని కోసమని నీవిక్కడున్నావు. ఓ అనిందిత! ఉన్నదున్నట్లుగా నాకంతాచెప్పు (23) అని అనగా ఆకన్య కైకసి చేతులు జోడించి, వినయంతో ఉండి నమ్రంగా ఆమునితో ఇట్లా అంది (24) ఓముని! తపః ప్రభావంతో నా అభిప్రాయాన్ని మీరు బాగా తెలుసుకోవచ్చు. ఓ పులస్త్యకులదీవన ! (25) ఓముని ! నేను సుమాలి కూతురును కైకసి అని నాపేరు. నా తండ్రి ఆజ్ఞతో మీదగ్గర కొచ్చాను. ఓ బ్రహ్మ. (26) మిగిలిన విషయాన్ని ఈ వేళ మీరు జ్ఞాన దృష్టితో తెలుసు కోగలరు, అనుమానంలేదు. ఆ విశ్రవసముని క్షణం సేపు ధ్యానించి కైకసితో ఇట్లా అన్నాడు. (27) ఓ సుభ్రు! నీమనోగతమైన కోరికను నేను తెలుసుకున్నాను. ఓ శుభ##మైనదాన ! ఇప్పుడు నీవు పుత్రుని అభిలషిస్తూ నాదగ్గరి కొచ్చావు. (28) నా దగ్గరకు నీవు ఇప్పుడు క్రూరమైన సాయంకాలమందు వచ్చావు. పుత్రుల నభిలషిస్తూ వచ్చావు కనుక నీతో చెబుతున్నాను (29) ఓ రామ!(స్త్రీ) కైకసి ! అనిందిత ! నీవు శ్రద్ధగావిను. దారు ణులు, దారుణాకారులు, దారుణమైన వంశమందు (పొగడ్తలందు) ఇష్టమైన వారు (30) క్రూరకర్ములు ఐన రాక్షసులను పుత్రులను నీవు కంటావు. ఆ మాటలు విని ఆ కైకసి ఆతనికి నమస్కరించి (31) చేతులు జోడించి పులస్త్య తనయునితో ఇట్లా అంది. భగవాన్‌ ! ఇటువంటి పుత్రులను మీనుండి పొందటం తగదు (32) అని అనగా ఆముని సుమధ్య గల కైకసితో ఇట్లా అన్నాడు. చివర నా వంశమున కనుగుణమైన పుత్రుడు నీకు కల్గుతాడు. (33) ధార్మికుడు, శాస్త్ర మెరిగినవాడు, శాంతుడు, రాక్షస చేష్టలు లేనివాడు కల్గుతాడు అని కైకసితో అనగా కొంతకాలం గడిచాక ఆమె (34) క్రూరుడు రక్షోరూపుడు, భయంకరుడు ఐన పుత్రుని ప్రసవించింది.

మూ || ద్విపంచ శీర్షం కుమతిం వింశద్బాహుం భయానకం || 35 ||

తామ్రోష్ఠం కృష్ణవదనం రక్తశ్మశ్రుశిరోరుహం | మహాదంష్ట్రం మహాకాయంలోకత్రానకరంసదా || 36 ||

దశగ్రీవాభిదః సోభూత్తథా రావణ నామవాన్‌ | రావణానంతరం జాతః కుంభకర్ణాభిధః సుతః || 37 ||

తతః శూర్ఫణఖానామ్నాక్రూరాజజ్ఞేచ రాక్షసీ | తతోబభూవకైకస్యావిభీషణ ఇతిశ్రుతః || 38 ||

పశ్చిమస్తనయోధీమాన్థార్మికోవేదశాస్త్రవిత్‌ | ఏతేవిశ్రపనః పుత్రాదశగ్రీవాదయోద్విజాః

|| 39 ||

అతోదశగ్రీవ వధాత్కుంభకర్ణవధాదపి | బ్రహ్మహత్యాసమభవత్‌ రామస్యాక్లిష్టకర్మణః || 40 ||

అతస్తచ్ఛాంతయే రామోలింగం రామేశ్వరాభిధం | స్థాపయామాన విధినా వైదికేనద్విజోత్తమాః || 41 ||

ఏవం రావణఘాతేన బ్రహ్మహత్యాసముద్భవః | సమభూద్రామచంద్రస్యలోకకాంతస్యధీమతః || 42 ||

తత్సహైతుకమాఖ్యాతం భవతాం బ్రహ్మఘాతజం | పాపంయచ్ఛాంతయేరామోలింగం ప్రాతిష్ఠిపత్స్యయం || 43 ||

ఏవలింగం ప్రతిష్ఠాప్య రామచంద్రోతి ధార్మికః | మేనేకృతార్థమాత్మానం ససీతా పరజోద్విజాః || 44 ||

బ్రహ్మహత్యాగతాయత్ర రామచంద్రస్య భూపతేః | తత్రతీర్థమభూత్కించి ద్ర్బహ్మహత్యావిమోచనం || 45 ||

తత్రస్నానం మహాపుణ్యం బ్రహ్మహత్యావినాశనం | దృశ్యతే రావణోద్యాపి ఛాయారూపేణ తత్రవై || 46 ||

తదగ్రేనాగలోకస్యబిలమస్తిమహత్తరం | దశగ్రీవవధోత్పన్నాం బ్రహ్మహత్యాం బలీయసీం || 47 ||

తద్బిలం స్రావయామాన జానకీరమణోద్విజాః | తస్యోపరిబిలస్యాథకృత్వామండపముత్తమం || 48 ||

భైరవం స్థాపయామాస రక్షార్థం తత్రరాఘవః | భైరవాజ్ఞాపరిత్రస్తాబ్రహ్మహత్యాభయంకరీ || 49 ||

నాశక్నోత్తద్బిలా దూర్థ్వం నిర్గంతుం ద్విజసత్తమాః | తస్మిన్నే పబిలేత స్థా బ్రహ్మహత్యాని రుద్యమా || 50 ||

తా || పదితలలు, కుమతి, ఇరువది చేతులు, భయానకుడు (35) ఎర్రని పెదవులు, నల్లని ముఖము ఎర్రని మీసములు తలవెంట్రుకలు గల, పెద్ద కోరలు, పెద్దశరీరము, ఎప్పుడూ లోకములకు భయం కల్గించే (36) దశగ్రీవుడను పేరుగల సుతుడు కల్గినాడు. అట్లాగే రావణుడని పేరు కల్గింది. రావణుని తరువాత కుంభకర్ణుడను పేరుగల సుతుడు కలిగారు (37) ఆ పిదప శూర్పణఖ అను పేరుగల క్రూరురాలైన రాక్షసి కలిగింది. ఆ పిదప కైకసికి విభీషణుడని ప్రసిద్ధమైన పుత్రుడు కలిగాడు. (38) చివరి కుమారుడు బుద్ధిమంతుడు, ధార్మికుడు, వేదశాస్త్రముల నెరిగినవాడు, వీరు దశగ్రీవాదులు విశ్రవసుని పుత్రలు (39) అందువలన దశగ్రీవుని వధవలన కుంభకర్ణుని వధవలన ఏ పనినైనా సులభంగా చేయగల రామునకు బ్రహ్మహత్య దోషం కలిగింది (40) అందువలన దాని శాంతి కొరకు రాముడ రామేశ్వరమను పేరు గల లింగమున వైదిక విధి ప్రకారము స్థాపించాడు (41) ఈ విధంగా రావణుని వదతో బ్రహ్మహత్య పుట్టుక, లోక కాంతుడైన ధీమంతుడైన రామచంద్రునకు కలిగింది (42) ఆ బ్రహ్మ ఘాతము వలన కల్గిన దానిని గూర్చి మీకు సకారణంగా వివరించాను. ఆ పాపశాంతి కొరకే రాముడు లింగమును స్వయంగా రాముడు ప్రతిష్ఠించాడు. (43) అతి ధార్మికుడైన రామచంద్రుడు ఇట్లా లింగమును స్థాపించి సీతాలక్ష్మణులతో కలిసి రాముడు తనను కృతార్థునిగా భావించాడు (44) రామచంద్ర భూపతి బ్రహ్మహత్య పోయిన చోట బ్రహ్మహత్యా విమోచన మనే చిన్న తీర్థమైంది (45) అక్కడ స్నానం చేయటం మహాపుణ్య ప్రదము బ్రహ్మహత్యను నశింప చేసేది. రావణుడు నేటికికూడా అక్కడ ఛాయరూపంలో అక్కడ కన్పిస్తాడు (46) దాని ముందు నాగలోకమునకు మహత్తరమైన బిలముంది. దశగ్రీవ వధ వల్ల కలిగిన బలీయమైన బ్రహ్మహత్యను (47) జానకీ రమణుడు ఆ బిలంలోకి చేర్చాడు. పిదప ఆ బిలముపైన ఉత్తమమైన మండపాన్ని చేసి (48) రక్ష కొరకు రాఘవుడు భైరవుని స్థాపించాడు. భైరవుని ఆజ్ఞకు భయపడి భయంకరమైన బ్రహ్మహత్య (49) ఆబిలం నుండి సైకి రావటానికి శక్తురాలు కాలేదు. ఏ ప్రయత్నం లేకుండా బ్రహ్మహత్య ఆ బిలంలోనే ఉండిపోయింది. (50)

మూ || రామనాథ మహాలింగం దక్షిణ గిరిజాముదా | వర్తతే పరమానంద శివస్యార్థ శరీరిణీ || 51 ||

ఆదిత్యసో మౌవర్తేతే పార్శ్వయోస్తత్ర శూలినః | దేవస్యపురతో వహ్నీ రామనాథస్య వర్తతే || 52 ||

ఆస్తేశతక్రతుః ప్రాచ్యామాగ్నేయాంచ తథానలః | ఆస్తేయమోదక్షిణస్యాం రామనాథస్య సేవకః || 53 ||

నైర్‌ఋతే నిర్‌ఋతిర్‌ విప్రా వర్తతేశంకరస్యతు | వారుణ్యాం వరుణోభక్త్యా సేవతే రాఘవేశ్వరం || 54 ||

వాయవ్యేతు దిశోభాగే వాయురాస్తే శివస్యతు | ఉత్తరస్యాంచథనదో రామనాథస్య వర్తతే || 55 ||

ఈశాన్యేస్య చదిగ్భాగే మహేశోవర్తతే ద్విజాః | వినాయక కుమారౌచ మహాదేవ సుతావుభౌ || 56 ||

యథాప్రదేశం వర్తేతే రామనాథాలయేధునా | వీరభద్రా దయః సర్వే మహేశ్వర గణశ్వరాః || 57 ||

యథాప్రదేశం వర్తంతే రామనాథాలయే సదా | మునయః పన్నగాః సిద్ధాః గంధర్వాప్సర సాంగణాః || 58 ||

సంతుష్యమాణహృదయాయధేష్టం శివసన్నిధౌ | వర్తతే రామనాథస్య సేవార్థం భక్తి పూర్వకం || 59 ||

రామనాథస్యపూజసార్థంశ్రోత్రియాబ్రాహ్మణాన్బహూన్‌ | రామేశ్వరే రఘుపతిః స్థాపయామానపూజకాన్‌ || 60 ||

రామప్రతిష్ఠితాన్విప్రాన్‌ హవ్యకవ్యాదినార్చయేత్‌ | తుష్టాస్తేతోసితాః సర్వాః పితృభిః సహదేవతా || 61 ||

తేభ్యోబహుధనాన్గ్రామాన్‌ ప్రదదౌజానకీపతిః | రామనాథమహాదేవ నైవేద్యార్థమపిద్విజాః || 62 ||

బహూన్గ్రామాన్బహుధనం ప్రదదౌలక్ష్మణాగ్రజః | హారకేయూరకటక నిష్కాద్యా భరణానిచ || 63 ||

అనేకపట్ట వస్త్రాణి క్షౌమాణి వివిధానిచ | రామనాథాయదేవాయ దదౌ దశరథాత్మజః || 64 ||

గంగాచయమునా పుణ్యానరయూశ్చ సరస్వతీ | సేతౌ రామేశ్వరం దేవం భజంతే స్వాఘశాంతయే || 65 ||

ఏతదధ్యాయ పఠనాచ్ఛ్రవణా దపిమానవః | విముక్తః సర్వపాపేభ్యః సాయుజ్యం లభ##తేహరేః || 66 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామస్య బ్రహ్మహత్యోత్పత్తి హేతు నిరూపణం నామ సప్తచత్వారింశోధ్యాయ || 47 ||

తా || రామనాథ మహాలింగమునకు దక్షిణ భాగంలో సంతోషంగా గిరిజ, పరమానంద స్వరూపుడైన శివుని అర్థశరీరమైన గిరిజ ఉంది (51) శివునకు ఇరుప్రక్కల ఆదిత్య సోములున్నారు. దేవునకు ముందు భాగమున అగ్ని ఉన్నాడు. (52) రామనాధునకు తూర్పుదిక్కున ఇంద్రుడున్నాడు. ఆగ్నేయ మందు అగ్ని దక్షిణ మందు యముడు రామనాథ సేవకుడున్నాడు (53) నైఋతి యందు నిర్‌ ఋతి ఉన్నాడు. శంకరునకు వరుణదిక్కు యందు వరుణుడు రాఘవేశ్వరుని భక్తితో సేవిస్తున్నాడు (54) శివునకు వాయవ్య భాగమందు వాయువున్నాడు. ఉత్తరమందు రామనాధునకు కుబేరుడున్నాడు (55) ఈతనికి ఈశాన్యదిగ్భాగమందు మహేశ్వరుడున్నాడు. వినాయక కుమారులు మహాదేవుని కుమారులిద్దరు (56) రామనాథాలయమందు తగిన స్థానాల్లో ఉన్నారు. మహీశ్వర గణనాయకులు వీరభద్రాదులందరు (57) రామనాథాలయమందు యథాప్రదేశమందు ఉన్నారు. మునులు, పన్నగులు, సిద్ధులు, గంధర్వ అప్సరస గణములు (58) సంతోషించిన హృదయం కలవారై శివసన్నిధి యందు యథేష్టంగా రామనాథుని సేవకొరకు భక్తిపూర్వకముగా ఉన్నారు (59)రామనాథుని పూజకొరకు శ్రోత్రియులైన అనేకమంది బ్రాహ్మణులను రామేశ్వరమందు రఘుపతి పూజకులను గా నియమించాడు (60) రామప్రతిష్ఠితులైన వారిని విప్రులను హవ్యకవ్యాదులతో అర్చించాలి. వారు సంతోషిస్తే పితరులు, దేవతలు అందరు సంతోషిస్తారు (61) వారికి జానకీపతి భహుధనమును గ్రామములను ఇచ్చాడు. రామనాథ మహాదేవ నైవేద్యం కొరకు గూడా (62) బహు గ్రామములను బహుధనమును లక్ష్మణా గ్రజుడిచ్చాడు. హారకేయూర కటక నిష్కము మొదలగు ఆభరణములను (63) అనేక నార వస్త్రములను రకరకములైన పట్టువస్త్రములను దశరథాత్మజుడైన రాముడు రామనాథునకు ఇచ్చాడు. (64) గంగ యమున పుణ్యప్రదమైన సరయు సరస్వతి తమ పాపశాంతి కొరకు సేతువు యందు రామేశ్వర దేవుని సేవిస్తున్నాయి (65) ఈ అధ్యాయము పఠనం వల్ల శ్రవణం వల్ల మానవుడు సర్వపాపముల నుండి విముక్తుడై హరిసాయుజ్యమును పొందుతాడు (66) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు రాముని బ్రహ్మహత్యోత్పత్తి హేతుని రూపణమనునది నలుబది ఏడవ అధ్యాయము || 47 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters