Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏబదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సంప్రపక్ష్యామి సేతు మాధవ వైభవం | శృణుధ్వం మునయోభక్త్యా పుణ్యం పాపహరం పరం || 1 ||

పురాపుణ్యనిధిర్నామ రాజాసోమకులోద్భవః | మధురాం పాలయామా సహాలాస్యేశ్వర భూషితాం || 2 ||

కదాచిత్స మహాపాలశ్చతురంగ బలాన్వితః | సాంతః పురపరీవారో మధురాయాం నిజం సుతం || 3 ||

స్థాపయిత్వా రామసేతుం ప్రయ¸° స్నాన కౌతుకీ | తత్రగత్వా ధనుష్కోటౌ స్నాత్వా సంకల్ప పూర్వకం || 4 ||

అన్వేష్వపిచ తీర్థేషు తత్రత్యేషు నృపోత్తమః | సస్నౌ రామేశ్వరం దేవం సిషేవేచ సభక్తికం || 5 ||

ఏవంస బహు కాలంవై తత్రైవస్యవసత్సుఖం | రామసేతౌ వసన్పుణ్య గంధమాదన పర్వతే || 6 ||

విష్ణుప్రీతికరం యజ్ఞం కదాచిదకరోన్పృపః | యజ్ఞావసానే రాజాసౌముదా వభృథకౌతుకీ || 7 ||

సస్నౌ రామధనుష్కోటౌ సదారః స పరిచ్ఛదః | సేవిత్వా రామనాథంచ నవేశ్మ ప్రయ¸°ద్విజాః || 8 ||

ఏవం నివనమానేస్మిన్‌ రాజ్ఞి పుణ్యనిథౌతదా | కదాచిద్ధరిణా లక్ష్మీః వినోదకలహాకులా || 9 ||

హరిణా సమయం కృత్వానృప భక్తిం పరీక్షితుం | విష్ణునా ప్రేషితా లక్ష్మీః వైకుంఠాత్కమ లాలయా || 10 ||

అష్టవర్షవయోరూపా ప్రయ¸° గంధమాదనే | తత్రాగత్య ధనుష్కోటౌ తస్థౌ సాకమలాలయా || 11 ||

తస్మిన్నవసరే రాజాయ¸° గుణ నిధిర్ద్విజాః | స్నాతుం రామధనుష్కోటౌ సదారః సహసైనికః || 12 ||

తత్రగత్వానరాజాయం స్నాత్వా నియమపూర్వకం | తులాపురుషముఖ్యాని కృత్వా దానానికృత్స్నశః || 13 ||

ప్రయాతు కామోభవనం కన్యాం కాంచిద్దదర్శనః | అతీవరూప సంపన్నామష్టవర్షాం శుచిస్మితాం || 14 ||

దృష్ట్వానృపస్తాం పcప చ్ఛకన్యాం చారువిలోచనాం | చారుస్మితాం చారుదతీం బింబోష్ఠీం తనుమధ్యమాం || 15 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఇక ఇక్కడి నుండిసేతు మాధవుని వైభవాన్ని చెబుతాను. మిక్కిలి పుణ్యప్రదమైనది పాపమును హరించేది ఐన దీనిని ఓ మునులార ! భక్తితో వినండి. (1) పూర్వం పుణ్యనిది యను రాజు సోమకులమందు పుట్టినవాడు హాలాస్యేశ్వరునితో అలంకరింప బడ్డ మధురను పాలించసాగాడు (2) ఒకసారి ఆరాజు చతురంగ బలముతో కూడినవాడై అంతఃపుర పరివారముతో కూడి మధుర యందు తన కుమారుని (3) ఉంచి స్నానం చేయట మందు కుతూహలము కలవాడై రామసేతువునకు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ధనుష్కోటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేసి (4) అక్కడ ఉన్న ఇతర తీర్థములందు ఆ మహారాజు స్నానం చేశాడు. భక్తి పూర్వకముగా రామేశ్వర దేవుని సేవించాడు కూడా (5) ఈ విధముగా ఆతడు చాలా కాలము సుఖముగా అక్కడే నివసించాడు. పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు రామసేతువు యందు (6) ఉంటూ ఒకసారి రాజు విష్ణువునకు ప్రీతికరమైన యజ్ఞమాచరించాడు. యజ్ఞము యొక్క అవసానమందు ఈ రాజు సంతోషంతో అపభృథస్నానము యందు కుతూహలము కలవాడై (7) ఆదరంతో, పరివారంతో కూడి, రామ ధనుష్కోటి యందు స్నానం చేశాడు. రామనాథుని సేవించి ఆతడు తన గృహాన్ని వ్రవేశించాడు. ఓ ద్విజులార ! (8) ఈ విధముగా ఈ పుణ్యనిధియైన రాజు నివసిస్తుండగా అప్పుడు ఒకసారి లక్ష్మి విష్ణువుతో వినోదమునకైన తగాదాతో వ్యాకులయై (9) విష్ణువుతో ఒప్పందము చేసి రాజు భక్తిని పరీక్షించుటకై లక్ష్మి కమలాలయ వైకుంఠమునుండి విష్ణువుతో పంపబడి (10) ఎనిమిది సంవత్సరముల వయస్సు కలిగిన రూపం కలదై గంధమాదనమునకు బయలుదేరింది. అక్కడికి వచ్చి ఆకమలాలయ ధనుష్కోటి యందు నివసించింది. (11) ఓ ద్విజులార ! ఆ సందర్భముయందు గుణ నిది యైన ఆరాజు రామధనుష్కోటి యందు స్నానం చేసి భార్యతో సైనికులతో కూడి వెళ్ళాడు (12) అక్కడికి వెళ్ళి ఆ రాజు నియమ పూర్వకముగా స్నానం చేసి తులా పురుషము మొదలగు ముఖ్య దానములన్ని సంపూర్తిగా చేసి (13) భవనమునకు వెళ్ళదలచిన ఆతడు ఒక కన్యను చూచాడు. మంచి రూపం కలది ఎనిమిది సంవత్సరములు కలది స్వచ్ఛని చిరునవ్వు గలది (14) రాజు ఆమెను అందమైన కళ్ళు గలదానిని కన్యను, అందమైన చిరునవ్వు గల దానిని, చక్కని పలువరుస గలదానిని, దొండపండువంటి పెదవి గల దానిని, సన్నని నడుము గల దానిని చూచి ఇట్లా అడిగాడు (15)

మూ|| పుణ్యనిధి రువాచ -

కాత్వం కన్యే సుతాకస్యకుతో వాత్వమిహాగతా | అత్రాగమేన కింకార్యం తవవత్సే శుచిస్మితే || 16 ||

ఏవంనృపస్తాం పప్రచ్ఛకన్యాముత్పలలోచనాం | ఏవం పృష్టాతదాకన్యా నృపంతమవదత్‌ ద్విజాః || 17 ||

నమేమాతాపితానాస్తిన చమే బాంధవాస్తథా | అనాథాహం మహారాజ భవిష్యామి చతేసుతా || 18 ||

త్వద్గృహేహం నివత్స్యామి తాతత్వాం పశ్యతీసదా | హఠాత్కృష్యతియోవామాం గ్రహీష్యతి కరేణతం || 19 ||

యది శాసిష్యసేభూపతదాహం తవమందిరే | వత్స్యామితే సుతా భూత్వా పితర్గుణ నిధే చిరం || 20 ||

ఏవముక్తస్తదాప్రాహ కన్యాం గుణనిధిర్‌ నృపః | అహం సర్వం కరిష్యామి త్వదుక్తం కన్యకే శుభే || 21 ||

మమాపి దుహితా నాస్తి పుత్రోస్త్యేకః కులోద్వహః | తపయస్మిన్‌రుచిర్‌ భ##ద్రేత్వాంతసై#్మప్రదదామ్యహం || 22 ||

ఆ గచ్ఛమ ద్గృహం కన్యే మమచాంతః పురేవన | మద్భార్యాయాః సుతాభూత్వాయథాకామమనిందితే || 23 ||

ఇత్యుక్తాసానృపేణాథ కన్యాకమలలోచనా | తథాస్త్వితి నృపంప్రోచ్యతేన సాకంయ¸° గృహం || 24 ||

రాజాస్వభార్యాహస్తేతాం ప్రదదౌ కన్యకాంశుభాం | అబ్రవీచ్చ స్వకాం భార్యాం రాజా వింధ్యా వలింతదా || 25 ||

ఆవయోః కన్యకా చేయం రాజ్ఞి వింధ్యా వలేశుభే | రక్షేమాం సర్వథాత్వంవై పురుషాంతరతః ప్రియే || 26 ||

ఇతీరితా నృపేణా సౌభార్యావింధ్యావలిస్తదా | ఓమిత్యుక్త్వాథ తాంకన్యాం పుత్రీం జగ్రాహపాణినా || 27 ||

పోషితా పాలితా రాజ్ఞా సుతవత్‌ కన్యకాచసా | న్యవాసీత్సు సుఖం రాజ్ఞో భవనే లాలితా సదా || 28 ||

అథవిష్ణుర్జగన్నాథో లక్ష్మీ మన్వేష్టు మాదరాత్‌ | ఆ రూఢ వినతానందో వైకుంఠాన్ని ర్య¸°ద్విజాః || 29 ||

వినిర్గత్య సవైకుంఠాత్‌ విలంఘిత వియత్పథః | బబ్రామచ బహూన్‌ దేశాన్‌ లక్ష్మీం తత్రసదృష్టవాన్‌ || 30 ||

రామసేతు మథాగచ్ఛత్‌ గంధమాదన పర్వతే | అన్విష్య సర్వతో రామసేతుం బభ్రామ చేందిరాం || 31 ||

తా || పుణ్యనిధి వచనము - ఓకన్య ! నీవెవరు. ఎవరి కూతురవు. ఎక్కడి నుండి నీవు ఇక్కడికి వచ్చావు. ఓ బాలిక, స్వచ్ఛమైన నవ్వు గలదాన, నీవిక్కడికి ఏమి పనికై వచ్చావు (16) ఈ విధముగా ఆ రాజు ఆ కన్యను కలువకన్నుల దానిని అడిగాడు.ఇట్లా అడుగబడి అప్పుడు ఆ కన్య రాజుతో ఇట్లా అంది (17) నాకు తల్లి లేదు. తండ్రిలేడు. నాకు బంధువులు లేరు. ఓ మహారాజా నేను ఆనాధను నేను నీకూతురునౌతాను (18) ఓ తండ్రి నిన్నెప్పుడు చూస్తూ నీ ఇంట్లోనే నుంటాను. నన్ను బలవంతంగా ఆకర్షించిన నా చేతిని గ్రహించిన వానిని నేను స్వీకరిస్తాను. (19) ఓ రాజ, నీవు శాసిస్తే నేను నీ ఇంట్లో నీ కూతురునై ఉంటాను. చాలాకాలము, ఓ గుణనిధి, ఓ తండ్రి (20) అని ఆమె అనగా అప్పుడు ఆ కన్యతో గుణ నిధి రాజు ఇట్లా అన్నాడు. ఓ కన్యక, శుభ##మైన దాన, నీవు చెప్పినదంతా నేను చేస్తాను. (21) నాకొక కొడుకున్నాడు, కులముద్ధరించేవాడు కాని నాకు కూతురులేదు. ఓ భద్రప్రదురాల, నీకిష్టమైన వానికి నిన్ను నేనిచ్చి వివాహం చేస్తాను. (22) ఓ కన్య నా ఇంటికి రా నా అంతః పురంలో నివసించి ఓ అనిందిత, నా భార్యకు కూతురువై స్వేచ్ఛగా ఉండు (23) అని రాజనగా ఆ కమలలోచనియైన కన్య అట్లాగే కానిమ్మని రాజుతో పలికి అతనితోపాటు ఇంటికి వెళ్ళింది (24) శుభ##మైన ఆ కన్యకను రాజు తన భార్యచేతికిచ్చాడు. అప్పుడు రాజు వింధ్యావలియను తన భార్యతో ఇట్లా అన్నాడు. (25) ఓ శుభ! వింధ్యావలి, రాణి ఈమె మన కన్యక, ఓ ప్రియ, నీవు ఇతర పురుషుల నుండి అన్ని విధముల ఈమెను రక్షించు (26) అని రాజుపలుకగా ఆ భార్య వింధ్యావలి అప్పుడు అట్లాగే, సరే అని అంగీకరించి ఆ కన్యను పుత్రిగా చేతితో స్వీకరించింది (27) రాజుతో ఆకన్యక కూతురులాగ పోషింపబడి పాలింపబడి, రాజు భవనంలో ఎప్పుడు లాలింపబడుతూ చాలా సుఖంగా వసించింది. (28) పిదప జగన్నాథుడైన విష్ణువు ఆదరంతో లక్ష్మిని వెదుకుటకు గరుడుని అధిరోహించి వైకుంఠమునుండి బయలుదేరాడు. ఓ ద్విజులార ! (29) ఆతడు వైకుంఠమునుండి బయలు దేరి దాటి ఆకాశమార్గమును దాటి, అనేక దేశములు తిరిగాడు.కాని అక్కడ లక్ష్మిని చూడలేదు (30) గంధమాదన పర్వతమందు రామసేతువునకు వచ్చాడు. రామసేతు వంతట ఇందిరను వెతుకుతు తిరిగాడు (31).

మూ || ఏతస్మిన్నే వకాలేసా పుష్పా పచయకౌతుకాత్‌ | సఖీభిః కన్యకాయాసీ ద్భవనోద్యాన పాదపాన్‌ || 32 ||

పుష్పాణ్యవచినోతిస్మసఖీభిః సహకాననే | తత్రాగత్యతతోవిష్ణుః విప్రరూపధరోద్విజాః || 33 ||

గంగాంభోవిదధత్‌ స్కంధే వహన్‌ ఛత్రం కరేణచ | గంగాస్నాయి ద్విజస్యేవ రచయన్‌ వేషమాత్మనః || 34 ||

ధారయన్‌ దక్షిణ పాణౌకుశ గ్రంధి పవిత్రకం | భస్మోద్ధూలిత సర్వాంగః త్రిపుండ్రా వలిశోభితః || 35 ||

ప్రజవన్‌ శివనామాని ధృతరుద్రాక్ష మాలికః | సోత్తరీయః శుచిర్విప్రాః సమాయాతో జనార్దనః || 36 ||

తమాగతం ద్విజం దృష్ట్వాస్తబ్ధాతిష్ఠతకన్యకా | అపశ్యదష్టవర్షాంతాం వల్లభాం పుష్పహారిణీం || 37 ||

దృష్ట్వాసత్వర యావిప్రః కన్యాం మధుర భాషిణీం | హఠాత్‌ కృత్యకరేణాసౌ జగ్రాహగరుడధ్వజః || 38 ||

తదాచుక్రోశసాకన్యాసఖీభిః సహకాననే | తమాక్రోశం సమాకర్ణ్య రాజా సతుసమాగతః || 39 ||

ప్రయ¸° భవనోద్యానం వృతః కతిపయైర్భటైః | గత్వాపప్రచ్ఛతాంకన్యాం తత్సభీరపి భూపతిః || 40 ||

కిమర్థం మధునాకృష్టం సఖీభిః సహకన్యకే | త్వయాతు భవనోద్యానే తత్రకారణముచ్యతాం || 41 ||

కేనత్వం పరిభూతాసి హఠాత్కృష్యసుతేమమ | ఇతి పృష్టాతమాచష్టకన్యాగుణనిధిం నృపం

బాష్ప పూర్ణాననాఖిన్నా రుషితా భృశకాతరా || 42 ||

కన్యోవాచ -

అయం విప్రోహఠా త్కృత్య జగృహెపాండ్యనాథమాం || 43 ||

తాతాత్రవృక్షమూలోసౌ సతిష్ఠత్యకుతోభయః | తదాకర్ణ్య వచస్తస్యా రాజాగుణనిధిః సుధీః || 44 ||

జగ్రాహతరసా విప్రం అవిద్యాంస్తద్బలం హఠాత్‌ | రామనాథాలయంనీత్వానిగృహ్యచహఠాత్తదా || 45 ||

బద్థ్వానిగదపాశాభ్యాం అనయన్‌మండపంచతం | ఆత్మపుత్రీంసమాశ్వాస్యశుద్ధాంతమసయన్నృపః || 46 ||

స్వయంచప్రయ¸°రమ్యంభవనంనృపపుంగవః | తతోరాత్రౌస్వవన్రాజాస్వప్నేవిప్రందదర్శతం || 47 ||

తా || ఈకాలంలోనే ఆమెపూలుతేవాలనేకోరికతోసఖులతోకూడి ఆకన్యకభవనోద్యానంలోనిపాదపములనుచేరింది. (32) చెలులతోపాటు అడవిలోపూలుతెంపసాగింది. ఓద్విజులారా! ఆపిదపవిష్ణువువిప్రరూపముధరించిఅక్కడికి వచ్చి (33) భుజము పై గంగాజలమును వహించి చేతియందుఛత్రముధరించి,గంగాస్నానంచేసేద్విజునివలెతనరూపాన్నిధరించి (34) కుడిచేతి యందు కుశగ్రంథులపవిత్రనుధరించి, శరీరంనిండాభస్మముపూనుకొనిత్రిపుండ్రములతోశోభిస్తూ (35) శివనామములు జపిస్తూ రుద్రాక్షమాలనుధరించి, ఉత్తరీయముకలిగిశుచియైజనార్థనుడువచ్చాడు, ఓవిప్రులార! (36) వచ్చిన ఆబ్రాహ్మణుని చూచి ఆకన్యకస్తబ్‌ద్ధురాలైనిలబడింది. పుష్పములనుతెంపుతున్న, మనోహరమైన ఎనిమిది సంవత్సరములవయస్సుగల ఆమెను చూచాడు (37) చూచి ఆవిప్రుడు త్వరగామధురభాషిణియైన ఆకన్యనుబలవంతము చేసిఈ గరుడధ్వజుడు చేతితో గ్రహించాడు (38) అప్పుడుకన్యకచెలులతోపాటు అడవిలోఆక్రోశించింది. ఆ ఆక్రోశమునువినిరాజువచ్చాడు. (39) కొద్దిమందిభటులతో పరివేష్ఠింపబడిభవనోద్యానమునకు వెళ్ళాడు. వెళ్ళి,ఆకన్యను, ఆమెచెలి కత్తెలనురాజుఅడిగాడు (40) ఓకన్యకచెలులతో కూడినీవిప్పుడుఎందుకుఏడ్చావు నీవు భవన ఉద్యానవనంలోదుఃఖించేకారణంచెప్పు. (41) పట్టుదలతోలాగబడి, ఓనాకూతుర! ఎవరితోఅవమానింపబడ్డావు. అనిఅడుగగా ఆకన్య ఆగుణధియనురాజుతో బాష్పములు నిండినముఖము గలదైభిన్నురాలై కోపంతో మిక్కిలిభయపడుతూఇట్లాపలికింది (42) కన్యకవచనములు- ఓపాండ్యనాథ నన్నుఈబ్రాహ్మణుడుబలవంతంగా పట్టుకున్నాడు. (43) ఓతండ్రిఈచెట్టుమొదట్లో ఆతడు ఏమాత్రం భయం లేకుండా కూర్చున్నాడు. ఆమెమాటలనుబుద్ధిమంతుడైనగుణనిధిరాజువిని (44) ఆతని బలంతెలుసుకోకుండా త్వరగా ఆవిప్రునిపట్టుకున్నాడు. రామనాథాలయమునకు తీసుకొనిపోయి బలవంతంగా పట్టుకొని (45) సంకెలతోతాళ్ళతోబంధించి ఆతనినిమండపమునకుతీసుకు వచ్చాడు. తనకూతురును ఓదార్చి రాజు ఆమెను అంతఃపురమునకుతీసుకువెళ్ళాడు (46) రాజుస్వయముగాతనఅందమైన భవనమునకువెళ్ళాడు. అక్కడ రాత్రి నిద్రపోయి రాజుకలలోఆవిప్రునిచూచాడు (47)

మూ || శంఖచక్రగదాపద్మవనమాలావిభూషితం | కౌస్తుభాలంకృతోరస్కంపీతాంబరధరంహరిం || 48 ||

కాలమేఘచ్ఛవింకాంతంగరుడోపరిసంస్థితం | చారుస్మితంచారుదంతంలసన్మకరకుండలం || 49 ||

విష్వక్సేనప్రభృతిభిఃకింకరైరుపపేవితం| శేషపర్యంకశయనంనారదాదిమునిస్తుతం || 50 ||

దదర్శచస్వకాంకన్యాంవికాసికమలస్థితాం | ధృతపంకజహస్తాంంతానీలకుంచితమూర్థజాం || 51 ||

విష్ణువక్షస్థలావాసాంసమున్నతపయోధరాం | దిగ్గజైరభిషిక్తాంగీంశ్యామాంపీతాంబరావృతాం || 52 ||

స్వర్ణపంకజనంక్లుప్తమాలాలంకృతముర్థజాంత | దివ్యాభరణశోభాఢ్యాంచారుహారవిభూషితాం || 53 ||

అనర్ఘరత్న సంక్లుప్తనాసాభరణ శోభితాం | సువర్ణనిష్కాభరణాంకాంచీసూపురరాజితాం || 54 ||

మహాలక్ష్మీందదర్శాపౌరాజారాత్రౌస్వకాంసుతాం | ఏవందృష్ట్వానృపఃస్వప్నేవిప్రంతంస్వసుతామపి || 55 ||

ఉత్థితఃసహసాతల్పాత్‌కన్యాగృహమవావచ | తథైవదృష్టవాస్కన్యాయంథాస్వప్నేదదర్శతాం || 56 ||

అథోదితేనవితరికన్యామాదాయభూమిపః | రామనాథాలయంప్రాపబ్రాహ్మణంన్యస్తవాన్యతః || 57 ||

సమండపవరేవిప్రందదర్శహరిరూపిణం | యథాదదర్శన్వప్నేతంవనమాలాదిచిన్హితం || 58 ||

విష్ణుంవిజ్ఞాయతుష్టావనృపతిర్‌హరిమీశ్వరం

పుణ్యనిధిరువాచ |

నమస్తేకమలాకాంతప్రసీదగరుడధ్వజ || 59 ||

శార్‌ఙ్గపాణనమస్తుభ్యమపరాధంక్షమన్వమేత | నమస్తేపుండరీకాక్షచక్రపాణశ్రియఃపతే || 60 ||

కౌస్తుభాలంకృతాంకాయనమఃశ్రీవత్సలక్ష్మణ | నమస్తేబ్రహ్మపుత్రాయదైత్యసంఘవిదారిణ || 61 ||

అశేషభువనావాసనాభిపంకజశాలినే | మధుకైటభసంహర్త్రేరావణాంతకరాయతే || 62 ||

ప్రహ్లాధరక్షిణతుభ్యంధరిత్రీపతయేనమః | నిర్గుణాయాప్రమేయాయవిష్ణవేబుద్ధిసాక్షిణ || 63 ||

నమస్తేశ్రీనివాసాయజగద్ధాత్రేపరాత్మనే | నారాయణయదేవాయకృష్ణాయమధువిద్విషే || 64 ||

నమఃపంకజనాభాయనమఃపంకజచక్షుషే | నమఃపంకజహస్తాయాఃపతయేపంకజాంఘ్రయే || 65 ||

త భూయోభుయోజగన్నాథనమఃపంకజమాలినే | దయామూర్తేనమస్తుభ్యమపరాధంక్షమస్వమే || 66 ||

మయానిగడపాశాభ్యాంయఃకృతోమధుసూదన | అనయస్త్వత్స్వరూపమవిదిత్వాకృతఃప్రభో || 67 ||

అతోమదపరాధోయంక్షంతవ్యోమధుసూదన | ఏవంస్తుత్వామహావిష్ణుంరాజాపుణ్యనిధిర్ద్విజాః || 68 ||

తా||శంఖచక్రగదాపద్మవనమాలలతోఅలంకరింపబడినవానిని, కౌస్తుభమణితోఅలంకరింపబడినవక్షఃస్థలముకలవానిని పీతాంబరముధరించినవానినిహరిని (48) ప్రళయకాల (వర్షాకాల) మందలిమేఘమువంటికాంతిగలవానిని, మనోహరమైన వానిని, గరుడునిపై కూర్చున్నవానిని అందమైననవ్వు, అందమైనపలువరుసకలవానిని, మకరకుండలములతో ప్రకాశించు వానిని (49) విష్వక్సేసుడుమొదలగుకింకరులతోసేవించబడుతున్నవానిని, ఆదిశేషునిపడకయందునిద్రించినవానిని నారదాదిమునులతోపొగడబడువానిని, (50) వికసించినకమలమందున్నతనకూతురునుచూచాడు. చేతతామరపూవును ధరించినదానిని, నల్లనివంకరతిరిగినశిరోజములు కలఆమెను (51) విష్ణువుయొక్కవక్షఃస్థలముస్థానముగాకలదానిని, ఎత్తైన ఉరోజములుకలదానిని, దిగ్గజములతోఅభిషేకింపబడే శరీరముకలదానినిశ్యామలవర్ణముకలదానినిపీతాంబరముకప్పబడిన దానిని (52) బంగారుతామరలతోకూర్చబడినమాలతోఅలంకరింపబడినశిరోజములుకలది, దివ్యమైన ఆభరణములశోభతో కూడినది. అందమైనహారములతోఅలంకరింపబడినది (53) అమూల్యమైనరత్నములతో కూర్చబడినముక్కెరతోశోభించునది.బంగారుపతకముల ఆభరణముగలది. మొలనూలు, కాలిఅందెలతో వెలుగొందునది (54) అగుమహాలక్ష్మిని తనకూతురునుఈరాజురాత్రియందుచూచాడు. ఈవిధముగారాజుకలలో ఆబ్రాహ్మణునితన కూతురునుకూడాచూచి (55) త్వరగాపడకనుండిలేచికన్యాగృహమునకుచేరాడు. కలలోఆమెనుఎట్లాగైతేచూచాడో అట్లాగే ఉన్నకన్యనుచూచాడు (56)సూర్యోదయంకాగానేరాజుఆకన్యనుతీసుకొని, బ్రాహ్మణుడున్నరామనాథాలయమునకువచ్చాడు. (57) ఆతడుమండపంలో హరిరూపియైన విప్రుని చూచాడు. వనమాలా దిచిహ్నములు కలిగి కలలో చూచినట్టి ఆతని రూపాన్నే చూచి విష్ణువని తెలుసుకొనిరాజుఈశ్వరుడైనహరినిస్తుతించాడు. (58) పుణ్యనిధివచనము - కమలాకాంత నమస్కారము గరుడధ్వజ అనుగ్రహించు (59)శార్‌ఙ్గపాణినీకునమస్కారము. నాఅపరాథమునుక్షమించు. ఓచక్రపాణి, శ్రియఃపతి, పుండరీకాక్ష నమస్కారము. (60) కౌస్తుభఅలంకారముచిహ్నముగాగల, శ్రీవత్సముచిహ్నముగాల నీకునమస్కారము. బ్రహ్మసుపుత్రునిగా గల, దైత్యసంఘమునునాశన మొనర్చిననీకునమస్కారము (61) అశేషభువనములకు వాసస్థానమైన నాభియందు తామరపూవునుకలిగినవాడ, మదుకైటభసంహారి, రావణనాశకనీకునమస్కారము (62) ప్రహ్లాదుని రక్షించినవాడ, ధరిత్రికిభర్తయైనవాడనీకునమస్కారమునిర్గుణ, అప్రమేయ, విష్ణు బుద్ధి సాక్షినమస్కారము (63)శ్రీనివాస, పరమాత్మ, జగత్తునుసృజించేవాడ, నారాయణ, దేవ, కృష్ణ, మధుద్వేషి (64)పంకజనాభనీకునమస్కారము. పంకజముల వంటికన్నులుకలవాడనమస్కారము. పకంజములనుహస్తమందు గలలక్ష్మిపతియైనవాడ, పంకజములవంటి పాదములు గలవాడనీకు నమస్కారము. (65) జగన్నాథపంకజములనుమాలగాగలవాడ మరలమరల నమస్కారము. ఓదయామూర్తి నీకునమస్కారము. నాఅపరాధమునుక్షమించు (66) ఓమధుసూదననేను సంకెలతో త్రాళ్ళతోనిన్నుబంధించాను. నయహీను డనైనీస్వరూపమునుగుర్తెరుగకచేశానుప్రభూ!(67) అందువల్లఓమధుసూదననా అపరాధాన్ని క్షమించు. అనిఈవిధంగా పుణ్యనిదియైనరాజుమహావిష్ణువునుస్తుతించి, ఓద్విజులార ! (68)

మూ || లక్ష్మీంతుష్టావజనీంసర్వేషాంప్రాణినాంముదా | నమోదేవిజగద్ధాత్రివిష్ణువక్షఃస్థలాలయే || 69 ||

నమోబ్ధిసంభ##వేతుభ్యంమహాలక్ష్మిహరిప్రియే | సిద్ధైపుషై#్యస్వధాయైచస్వాహాయైనతతంసమః || 70 ||

సంధ్యాయైచప్రభాయైచధాత్ర్యైభూత్యైనమోనమః | శ్రద్ధాయైచైవమేధాయైసరస్వత్యైనమోనమః || 71 ||

యజ్ఞవిద్యేమహావిద్యేగుహ్యవిద్యేతిశోభ##నే | ఆత్మవిద్యేచదేవేశిముక్తిదే సర్వదేహినాం || 72 ||

త్రయీరూపేజగన్మాతఃజగద్రక్షావిధాయిని | రక్షమాంత్వంకృపాదృష్ట్యాసృష్టిస్థిత్యంతకారిణి || 73 ||

భూయోభూయోనమస్తుభ్యంబ్రహ్మమాత్రేమహేశ్వరి | ఇతిస్తుత్వామహాలక్ష్మీంప్రార్థయామానమాధవం || 74 ||

యదజ్ఞానాన్మయావిష్ణోత్వయిదోషఃకృతోధునా | పాదేనిగడబంధేననద్రోహః క్షమ్యతాంత్వయా || 75 ||

లోకాస్తేశిశవః సర్వేత్వంపితాజగతాంహరే | సుతాపరాధః పితృభిః క్షంతవ్యో మధుసూదన || 76 ||

అపరాధినాంచ దైత్యానాం స్వరూప మపిదత్తవాన్‌ | భవాన్విష్ణోమమాపీమమపరాధం క్షమస్వవై || 77 ||

జిఘాంసమామపి భగవన్నాగతాం పూతనాం పురా | అనయస్త్వత్పదాంభోజం తన్మాంరక్షకృపానిధే

లక్ష్మీకాంత కృపాదృష్టిం మయిపాతయకేశవ || 78 ||

శ్రీసూత ఉవాచ -

ఇతి సంప్రార్ధితో విష్ణూరాజ్ఞాతేన ద్విజోత్తమాః | ప్రాహగంభీరయావాచా నృపం పుణ్యనిధింతతః || 79 ||

విష్ణురువాచ -

రాజన్నభీస్త్వయా కార్యామ ద్బంధన నిమిత్తజా || 80 ||

భక్తవశ్యత్వమధునా తవ ప్రతిహితంమయా | మమప్రీతికరం యజ్ఞమకరోద్యద్భవానిహ || 81 ||

అతస్త్వంమమభక్తోసి రాజన్పుణ్యనిధేధునా | తేనాహంతపవశ్యోస్మి భక్తిపాశేన యంత్రితః || 82 ||

భక్తావరాధం సతతం క్షమామ్యహమరిందమ | త్వద్భక్తింజ్ఞాతుకామేన మయాసంప్రేరితాత్వియం || 83 ||

లక్ష్మీర్మమప్రియారాజన్‌ త్వయా సంరక్షితాధునా తేనాహం తపతుష్టోస్మి మత్స్వరూపాత్వియం సదా || 84 ||

తా || సమస్త ప్రాణుల ఆనందము కొరకు లక్ష్మిని స్తుతించాడు ఇట్లా - జగత్తులను ధరించేదాన, విష్ణువుయొక్క వక్షఃస్థలము స్థానముగా కలదాన, దేవి నమస్కారము (69) సముద్రమందు ద్భవించినదాన, మహాలక్ష్మి, హరికి ప్రియమైన దాన, నీకు నమస్కారము. సిద్ధి,పుష్ఠి (ఈడేర్చుదాన, సమృద్ధికలిగించుదాన) స్వధ, స్వాహ నీకు ఎల్లప్పుడు నమస్కారము (70) సంధ్య, ప్రభ, ధాత్రి రూపిణి, ఐశ్వర్యకారి నీకు నమస్కారము శ్రద్ధ, మేధ, సరస్వతి ఐనదాన నీకు నమస్కారము (71) యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్యవిద్య, అతిశోభన, ఆత్మవిద్యైనదానసర్వప్రాణులకు ముక్తినిచ్చుదాన, ఓదేవేశి (72) త్రయిరూప, జగన్మాత జగద్రక్షణచేసేదాన, సృష్టిస్థిత్యంతకారి, నీవుకృపాదృష్టితోనన్నురరక్షించు (73) బ్రహ్మనుగన్న తల్లి, మహేశ్వరి నీకు మరి మరి నమస్కారములు అని మహాలక్ష్మిని ప్రార్థించి మాధవుని ప్రార్థించసాగాడు (74) ఓ విష్ణు! అజ్ఞానం వల్ల నేను నీ విషయంలో ఇప్పుడు చేసిన దోషాన్ని పాదమందు సంకెలలు వేసిన ఆ ద్రోహాన్ని నీవు క్షమించు (75) ఈ లోకములన్ని నీకు సంతానము. ఓ హరి ఈ జగత్తునకు నీవు తండ్రివి. ఓ మధుసూదన ! కొడుకుల అపరాధాన్ని తండ్రులు క్షమించాలి (76) అపరాధులైన రాక్షసులకు నీరూపాన్ని కూడా ఇచ్చావు. ఓ విష్ణు! నీవు నా ఈ అపరాధాన్ని కూడా క్షమించు (77) ఓ భగవాన్‌ ! చంపటానికి వచ్చిన పూతనను నీ పాదాంబుజములందు చేర్చుకున్నావు. అందువల్ల ఓ కృపానిధి నన్ను రక్షించు. ఓ లక్ష్మీకాంత, కేశవ నీ కృపాదృష్టిని నా మీద ప్రసరింప చేయి (78) శ్రీ సూతులిట్లన్నారు - ఓద్విజులార ! ఆ రాజు విష్ణువును ఇట్లా ప్రార్థించాక విష్ణువు గంభీరమైన మాటలతో పుణ్యనిధి అనురాజుతో ఇట్లా అన్నాడు. (79) విష్ణువచనము - ఓ రాజ! నన్ను బంధించిన కారణముగా నీవు భయపడొద్దు. (80) నీవిప్పుడు భక్తివశుడవు. నీవు నాకు దగ్గరి వాడవైనావు. నీవిక్కడ నాకానందదాయకమైన యజ్ఞం చేశావు (81) కనుక, ఓ పుణ్యనిధిరాజా ! ఇప్పుడు నీవు నా భక్తుడవైనావు. అందువల్ల నేను భక్తి పాశముతో బంధింపబడి నీవశుడనైనాను (82) ఓ శత్రునాశక ! నేను భక్తుల అపరాధమును ఎల్లప్పుడు క్షమిస్తాను. నీ భక్తిని తెలుసుకునే కొరకు నేను ఈమెను ప్రేరేపించాను (83) ఓ రాజ! లక్ష్మినాకు ప్రియమైనది. ఇప్పుడు నీవు ఆమెను రక్షించావు. అందువల్ల నేను నీ విషయంలో సంతుష్టడనైనాను. ఈమె ఎల్లప్పుడు నా స్వరూపమే (84).

మూ|| అస్యాంయోభక్తిమాన్‌లోకే సమద్భక్తోభిదీయతే | అస్యాంయోవిముఖోరాజన్‌సమద్ద్వేషిన్మృతఃసదా || 85 ||

త్వమిమాం భక్తి సంయుక్తో యస్మాత్పూజిత వానసి | మత్పూజాపికృతా తస్మాన్మదభిన్నాత్వియం యతః || 86 ||

అతస్త్వయానాపరాధః కృతమయినరేశ్వర | కింతుపైజైవ విహితాతాం త్వయార్చయతామమ || 87 ||

త్వయామద్భార్యయాసాకం సంకేతోకారియత్పురా | తత్సంకేతాభిగుప్త్యర్థం మాంయద్బంధిత వానసి || 88 ||

తేనప్రీతోస్మితే రాజన్‌లక్ష్మీః సంరక్షితాధునా | మత్స్యరూపాచ సాలక్ష్మీః జగన్మాతా త్రయీమయీ || 89 ||

తద్రక్షాం కుర్వతాభూపత్వయాయద్బంధనంమమ | తత్ర్పియంమమరాజేంద్ర మాభయంక్రియతాంత్వయా || 90 ||

ఇయంలక్ష్మిస్తవసుతాసత్యమే వనసంశయః | ఇతీరితేథ హరిణా లక్ష్మీః ప్రోవాచ భూపతిం || 91 ||

లక్ష్మీరువాచ -

రాజన్ర్పీతాస్మితే చాహం రక్షితా యద్గృహెత్వయా | త్వద్భక్తిశోధనార్థం వా అహం విష్ణురుభావపి || 92 ||

వినోద కలహవ్యాజాదాగతా విహ భూపతే | తవయోగేన భక్త్యాచ తుష్టావాహం పరంతప || 93 ||

ఆవయోః కృపయారాజన్‌ సుఖంతే భవతాత్‌ సదా | సర్వభూమండలైశ్వర్యం నదాతే భవతుధ్రువం || 94 ||

ఆవయోః పాదయుగలే భక్తిర్భవతుతేధ్రువా | దేహాంతే మమసాయుజ్యం పునరావృత్తి వర్జితం || 95 ||

నిత్యం భవతుతేరాజన్‌ మాభూత్తే పాపధీస్తథా | సదాధర్మే భవతుధీః విష్ణుభక్తి యుతాతవ || 96 ||

ఏవముక్త్వానృపం లక్ష్మీః విష్ణోః వక్ష స్థలయ¸° | అథవిష్ణురువా చేదం రాజానం ద్విజపుంగవాః || 97 ||

యథాత్వ యాత్రబద్థోహం నిగడేన నృపోత్తమ | తద్రూపే ణౖవ వత్స్యామి సేతుమాథవ సంజ్ఞతః || 98 ||

మయైవకారితః సేతుః త ద్రక్షార్థమహంనృప | భూతరాక్షస సంఘేభ్యో భయానాముపశాంతయే || 99 ||

బ్రహ్మపిసేతు రక్షార్థం వసత్యత్ర దివానిశం | శంకరోరామ నాథాఖ్యో నిత్యం సేతౌ వసత్యథ || 100 ||

ఇంద్రాది లోకపాలాశ్చ వసంత్యత్రముదాన్వితాః | అతోహ మత్రవత్స్యామి సేతుమాధవ సంజ్ఞయా || 101 ||

తా || ఈమె యందు భక్తి కలవాడు నా భక్తుడుగా చెప్పబడుతాడు. ఈమె యందు విముఖుడైన వాడు నా ద్వేషిగా ఎల్లప్పుడు స్మరింపబడుతాడు. (85) నీవు ఈమెను భక్తితో పూజించావు కనుక నా పూజ కూడా చేసిన వాడివైనావు. ఎందుకంటే ఈమె నాకన్నా భిన్నమైంది కాదు కనుక(86) అందువల్ల ఓ మహారాజ! నా విషయంలో నీవు అపరాధం చేయలేదు. పైగా ఆమెను నీవు పూజించటంవల్ల నా పూజ చేసినట్లైంది. (87) నీవు నా భార్యతో మొదట చేసిన ఒప్పందం ప్రకారము ఆ ఒప్పందాన్ని రక్షించే కొరకు నన్ను బంధించావు (88) కనుక ఓ రాజా! నీ వినయంతో సంతుష్టుడనైనాను. నీవు ఇప్పుడు లక్ష్మిని రక్షించావు. ఆ లక్ష్మి నా స్వరూపురాలు, జగన్మాత, వేదమయి (89) ఓ భూప! నీవు ఆమెను రక్షించటం కొరకు నాకు వేసిన ఈ బంధనము ఇష్టమైంది. ఓ రాజేంద్ర నీవు భయపడవద్దు (90) ఈ లక్ష్మి నీ కూతురు ఈవిషం సత్యమే. అనుమానం లేదు. అని విష్ణువు చెప్పాక, లక్ష్మిభూపతితో ఇట్లా అంది. (91) లక్ష్మివచనము - ఓ రాజ! నీ విషయంలో నేను సంతుష్టురాలనైనాను. నీ గృహంలో నీవు రక్షించావు కనుక. నీ భక్తిని పరీక్షించే కొరకు నేను విష్ణువు ఇద్దరము కూడ (92) ప్రణయ కలహం నెపంగా ఇక్కడికి వచ్చాము. ఓ భూపతి ఓ పరంతప ! నీ సహవాసంతో, భక్తితోను మేమిద్దరము సంతుష్టులమైనాము (93) ఓ రాజ! మా దయవల్ల ఎల్లప్పుడు నీకు సుఖం కలగనీ, సర్వ భూమండల ఐశ్వర్యము నీకు తప్పకుండా ఎల్లప్పుడు కలగని (94) మా పాదయుగళమందు నీకు శాశ్వతమైన భక్తి కలగని. దేహాంతమందు పునరావృత్తిలేని నా సాయుజ్యము (95) ఓ రాజ!నీకు ఎప్పుడు కలగని అట్లాగే నీకు పాపబుద్ధి కలగకపోని. విష్ణుభక్తి కలిగి నీబుద్ధి ఎల్లప్పుడు ధర్మమందు ఉండనీ (96) ఇట్లా రాజుతో పలికి లక్ష్మి విష్ణువు యొక్క వక్ష స్థలమునకు వెళ్ళింది. ఓ ద్విజ శ్రేష్ఠులార ! పిదప విష్ణువు రాజుతో ఇట్లా అన్నాడు. (97) ఓ రాజ! నీవు సంకెలలతో నన్నిక్కడ బంధించావు గదా అదే రూపంతో సేతు మాధవుడను పేరు గలిగి ఇక్కడ ఉంటాను. (98) ఓ రాజ! ఈ సేతువును నేను ఏర్పరచాను. దాన్ని రక్షించే కొరకు నేను ఉంటాను. భూతరాక్షస సంఘములనుండి భయము ఉపశమించే కొరకు నేను ఉంటాను (99) బ్రహ్మ కూడా రాత్రింబగళ్ళు సేతురక్షయందు నివసిస్తాడు శంకరుడు రామనాథుడను పేరుతో ఎల్లప్పుడు సేతువుయందు నివసిస్తాడు. (100) ఇంద్రాది లోకపాలురు ఆనందంతో ఇక్కడ నివసిస్తున్నారు. అందువల్ల నేనిక్కడ సేతుమాధవుడను పేరుతో నివసిస్తాను (101).

మూ || సేతు సంరక్షణార్థంవై సర్వోపద్రవశాంతయే | సర్వేషా మిష్ట సిద్ధ్యర్థం సర్వపాపోపశాంతయే || 102 ||

త్వయానిగడబద్ధంమాంసేవంతే యేత్రమానవాః | తేయాంతి మమ సాయుజ్యం సర్వాభీష్టం తథానృప || 103 ||

మమలక్ష్మ్యాస్తవ తథా చరితంయే పఠంతివై | నతేయాస్యంతి దారిద్ర్యం కింత్వైశ్వర్యం ప్రజంతితే || 104 ||

త్వత్కృతం యదిదం స్తోత్రం మమలక్ష్మ్యావిశాంపతే | యే పఠంతి చ శృణ్వంతి లిఖంతిచముదాన్వితాః || 105 ||

నతేషాం పునరావృత్తిర్మమలోకాత్కదాచన | ఇత్యుక్త్వా సహరిస్తత్ర నృపం పుణ్యనిధింతదా || 106 ||

తత్రైవ పూర్ణరూపేణ సన్నిధత్తేన్మ సర్వదా | నృపః పుణ్యనిధి ర్విప్రాః సేతుమాధవ రూపిణం || 107 ||

విష్ణుం ప్రణమ్య భక్త్యాతు మహాపూజాం విధాయచ | సేవిత్వా రామనాథంచ స్వమేవభవనం య¸° || 108 ||

యావజ్జీవ మసౌతత్రసేతౌన్యవసదుత్తమే | మధురాయాం నిజం పుత్రం స్థాపయామాసపాలకం || 109 ||

తత్రైవనివనన్రాజాదేహాంతే ముక్తిమాప్తవాన్‌ | వింధ్యా వలిశ్చతత్పత్నీ తమేవానుమమారసా

పతివ్రతా పతిప్రాణా ప్రయ¸°సాపి సద్గతిం || 110 ||

శ్రీ సూత ఉవాచ -

యేత్ర భక్తియుతా నిత్యం సేవంతే సేతుమాధవం || 111 ||

నతేషాం పునరావృత్తిః కైలాసాజ్జాతుజాయతే | సేతుమాధవ సేవాంయే సకుర్వంత్యత్రమానవాః || 112 ||

నతేషాం రామానాథస్య సేవాఫలవతీభ##వేత్‌ | గృహీత్వాసైకతం సేతోః గంగాయాం నిక్షిపేద్యది || 113 ||

విభజ్య మాధవపురే వైకుంఠే నివసేన్నరః | గంగాజిగమిషుర్విప్రాః సేతుమాధవసన్నిధౌ || 114 ||

సంకల్ప్య గంగాం నిర్గచ్ఛేత్‌ సాయాత్రా సఫలా భ##వేత్‌ | అనీయ గంగా సలిలం రామేశ మభిషిచ్యచ || 115 ||

సేతౌ నిక్షివ్యతద్భారం బ్రహ్మప్రాప్నోత్య సంశయః | ఇతి పః కథితం విప్రాః సేతుమాధవ వైభవం || 116 ||

ఏతత్పఠన్‌ వాశృణ్వన్‌ వా వైకుంఠే లభ##తే గతిం || 117 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే సేతుమాధవ ప్రశంసాయాం పుణ్యనిధి చరిత కథనం నామ పంచాశత్తమోధ్యాయ || 50 ||

తా || సేతు సంరక్షణ కొరకు, సర్వ ఉపద్రవముల ప్రశాంతికొరకు, అందరి ఇష్టసిద్ధి కొరకు సర్వపాపముల ప్రశాంతి కొరకు నేనిక్కడుంటాను (102) నీవు సంకెలతో బంధించిన నారూపాన్ని సేవించిన మానవులు నా సాయుజ్యాన్ని పొందుతారు. ఓ నృప! అన్ని అభీష్టములను వారు పొందుతారు (103) నాయొక్క, లక్ష్మియొక్క నీ యొక్క చరిత్రను చదివిన వారు దారిద్ర్యాన్ని పొందరు. అంతేకాక, వారు ఐశ్వర్యాన్ని పొందుతారు (104) ఓ రాజ! నీవు చేసిన, లక్ష్మి యొక్క నాయొక్క ఈ స్తోత్రాన్ని చదివిన వారికి విన్న వారికి సంతోషంతో వ్రాసినవారికి (105) నా లోకం నుండి పునరావృత్తి ఎప్పుడు కూడా కలగదు. అని పుణ్యనిధి యను రాజుతో అప్పుడు ఆ హరి అక్కడ పలికి (106) అక్కడే పూర్వరూపంతో ఎల్లప్పుడు సన్నిధానంలో ఉంటాడు. పుణ్యనిధియను ఆ రాజు సేతుమాధవ రూపియైన (107) ఆ విష్ణువును భక్తితో నమస్కరించి, మహాపూజను ఆచరించి, రామనాథుని సేవించి తన భవనమునకు వెళ్ళాడు (108) ఈతడు ఉత్తమమైన ఆ సేతువు యందు జీవితాంతము నివసించాడు. మధుర యందు తన పుత్రుని పాలకునిగా ఉంచాడు (109) అక్కడే ఉండి రాజు దేహాంతమందు ముక్తిని పొందాడు. ఆతని భార్య వింధ్యావలి కూడా ఆతనితో పాటు మరణించింది. పతివ్రత, పతియే ప్రాణముగా గలది, ఆమెకూడా సద్గతిని పొందింది. (110) శ్రీ సూతులిట్లన్నారు - భక్తియుక్తులై ఎల్లప్పుడు ఇక్కడ సేతుమాధవుని సేవించిన వారికి (111) కైలాసము నుండి పునరావృత్తి ఎప్పుడూ కలగదు. ఇక్కడ సేతుమాధవ సేవను చేయని నరులకు (112) రామనాథుని సేవ ఫలవంతముకాదు. సేతువు ఇసుకను విడిగా తీసుకొని గంగలో వేసిన యెడల (113) ఆ నరుడు మాధవ పురమందు, వైకుంఠ మందు ఉంటాడు. గంగకు వెళ్ళాలనుకునే విప్రులు సేతుమాధవుని సన్నిధియందు (114) సంకల్పము చేసి గంగకు బయలుదేరిన ఆయాత్ర సఫలమౌతుంది. గంగా సలిలమును తీసుకొచ్చి రామేశ్వరుని అభిషేకించి (115) సేతువు యందు ఆ భారమును ఉంచిన యెడల పరబ్రహ్మను పొందుతాడు, అనుమానం లేదు. అని ఓ విప్రులార ! మీకు సేతు మాధవ వైభవాన్ని చెప్పాను (116) దీనిని విన్న చదివిన వైకుంఠంలో స్థానాన్ని పొందుతారు (117) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతుమాహాత్మ్య మందు సేతుమాధవ ప్రశంస యందు పుణ్యనిధి చరిత కథన మనునది ఏబదవ అధ్యాయము || 50 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters