Sri Scanda Mahapuranamu-3    Chapters   

నాలుగవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

అతః పరం ప్రవేక్ష్యామి ధర్మరాజస్య చేష్టితం | యచ్ఛ్రుత్వా యమదూతానాం న భయం విద్యతే క్వచిత్‌ || 1 ||

ధర్మరాజేన సా దృష్టా వర్థనీ చపరాప్సరా | మహత్యరణ్యకాహ్యాషా సుందరాంగ్యతి సుందరీ || 2 ||

నిర్మానుషవనం చేదం సింహవ్యాఘ్ర భయానకం | ఆశ్చర్యం పరమం జ్ఞాత్వా ధర్మరాజోబ్రవీదిదం || 3 ||

ధర్మరాజు ఉవాచ -

కస్మాత్త్వం మానినిహ్యెకా వనేచరసి నిర్జనే | కస్మాత్‌ స్థానాత్‌ సమాయాతా కస్యపత్నీ సుశోభ##నే || 4 ||

సుతాత్వం కస్యవామోరు అతిరూపవతీశుభా | మానుషీనాథ గంధర్వీ అమరీవాథకింనరీ || 5 ||

అప్సరావక్షిణీ వాథ అథవావనదేవతా | రాక్షసీవాఖేచరీవాకస్యభార్యాచ తద్వద || 6 ||

సత్యంచ వదమే సుభ్రూరి త్యాహార్కసుతస్తదా | కిమిచ్ఛసిత్వయాభ##ద్రేకింకార్యం వావదాత్రవై || 7 ||

యదిచ్ఛసిత్వంవామోరుదదామితపవాంఛితం || 8 ||

వర్ధన్యువాచ -

ధర్మేతిష్ఠతి సర్వంవై స్థావరం జంగమం విభో | స ధర్మోదుష్కరం కర్మ కస్మాత్‌ త్వంకురుషేనఘ || 9 ||

యమ ఉవాచ -

ఈశానస్యచ యద్రూపంద్రష్టుమిచ్ఛామిభామిని | తేనాహంత వసాయుక్తః శివయాసహశంకరం || 10 ||

యశఃప్రాప్స్యే సుఖం ప్రాప్స్యె కరోమిచ సుదుష్కరం | యుగేయుగే మమఖ్యాతిః భ##వేదితిమతిర్మమ || 11 ||

కల్పేకల్పేమహాకల్పే భూయాఃఖ్యాతిః భ##వేదితి | ఏతస్మాత్కారణాత్‌ సుభ్రూః తప్యతేపరమంతపః || 12 ||

వర్ధన్యువాచ -

తవసైవత్వయా ధర్మభయభీతోదివస్పతిః | తేనాహం నోదితాచాత్ర తపోవిఘ్నస్యకాంక్షయా || 14 ||

ఇంద్రాసన భయాద్భీతా హరిణా హరిసన్నిధౌ | ప్రేషితాహం మహాభాగ సత్యంహి ప్రపదామ్యహం || 15 ||

సూత ఉవాచ -

సత్యవాక్యేన చతదాతోషితో రవినందనః | ఉవాచైనాం మహాభాగ్యో పరదోహం ప్రయచ్ఛమే || 16 ||

యమోహం సర్వభూతానాందుష్టానాంకర్మకారిణాం | ధర్మరూపోహిసర్వేషాం మనుజానాం జితాత్మనాం || 17 ||

| సధర్మోహం వరారోహ దదామి తవదుర్లభం | తత్సర్వం ప్రార్ధయ త్వంమే శీఘ్రం చాప్సర సాంవరే || 18 ||

తా || వ్యాసుని వచనము - ఇకముందు ధర్మరాజు చేసిన దానిని చెబుతాను. దానిని వింటే యమదూతల భయము ఎక్కడా ఉండదు. (1) ధర్మరాజు వర్ధని అను ఆ ఉత్తమ అప్సరసను చూచాడు. మహారణ్యంలో ఈమె ఎవరు. సుందరమైన అవయవములు గలది, అతిసుందరి (2) ఈ వనము నిర్మానుషమైనది. సింహ వ్యాఘ్రములతో భయానకమైనది. ఈపరమాశ్చర్యమును గమనించి ధర్మరాజు ఇట్లా అన్నాడు. (3) ధర్మరాజు వచనము - ఓ మానిని ఎందువల్ల ఒంటరిగా జనములేని అడవిలో తిరుగుతున్నావు. ఎక్కడి నుండి వచ్చావు. ఓసు శోభన! నీవెవరి భార్యవు (4) ఓ సుందరమైన ఊరువులు గలదాన! నీవెవరి కూతురవు.ఓ శుభ నీవు అతిరూపవతివి. మనుష్యస్త్రీవా, గంధర్వస్త్రీవా, దేవతాస్త్రీవా, కిన్నరస్త్రీవా (5) అప్సరసవా కాక పక్షిజాతివా, కాక వనదేవతవా, రాక్షసివా, ఖేచరివాఎవరి భార్యవు అది చెప్పు. (6) ఓ సుభ్రు! నాకు సత్యం చెప్పు అని అప్పుడ అర్కసుతుడు అన్నాడు నీకేం కావాలి ఓభ##ద్రే! నీవిక్కడేం చేయాలి అది చెప్పు (7) ఓ వామోరు! నీవిష్టపడితే నీకు కావలసిన, కోరికనిస్తాను (8) అనగా వర్థని ఇట్లా అంది - ఓ విభు! స్థాపర జంగమమంతా ధర్మంలోనే ఉంది. ఆ ధర్మమనేది దుష్కరమైన కర్మ. ఓ పుణ్యాత్ముడ! దాన్ని నువ్వెందుకు చేస్తున్నావు. (9) యముని వచనము - ఈశానుని రూపాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాను, ఓ భామిని. అందువల్ల నేను తపస్సు చేస్తున్నాను. పార్వతితో కూడిన శంకరుని చూడదలిచాను (10) కీర్తిని, సుఖాన్ని పొందుతాను. అందుకే ఇట్టి దుష్కరకర్మను చేస్తున్నాను. ప్రతి యుగంలో నాకు ఖ్యాతి కలగాలని నా కొరిక (11) ప్రతి కల్పమందు, మహాకల్పమందు మళ్ళీ ఖ్యాతి కలగాలని నా కోరిక. ఈ కారణంగానే ఓ సుభ్రు! పరమమైన తపస్సును నేనాచరిస్తున్నాను (12) ఓ భ##ద్రే! ఎక్కడి నుండి నీ వొచ్చావో ఉన్నదున్నట్లుగా చెప్పు. ఏమిపని, ఎవని కారణంగా వచ్చావు, నిజాన్ని చెప్పు అని అనగా (13) వర్ధని వచనము - నీ తపస్సుతోనే ఇంద్రుడు భయభీతుడైనాడు. అతనితో నేను పంపబడ్డాను. ఇక్కడ నీ తపస్సుకు విఘ్నం కల్గించే కొరకు వచ్చాను (14) ఇంద్రాసన భయముతో భీతుడై ఇంద్రుడు, నీ సన్నిధికి నన్ను పంపించాడు. ఓ మహాభాగ! నేను సత్యం చెబుతున్నాను (15) అని అంది. సూతుని వచనము- అప్పుడు ఆమె సత్యవాక్యముతో ఆనందించిన యముడు ఆ మహాభాగ్యుడు ఆమెతో ఇట్లా అన్నాడు. నేను నీకు వరమివ్వదలిచాను (16) సర్వభూతములకు చెడుపనులు చేసే వారికి నేను యముడను. జితాత్ములకు అందరు నరులకు ధర్మరూపుడను (17) అట్టి ధర్ముడను నేను. ఓ వరారోహ! నీకు, దుర్లభ##మైన వరాన్ని ఇస్తాను. అదంతా నీవు నన్ను త్వరగా అడుగు, ఓ అప్సరసలలో వరమైనదానా! (శ్రేష్ఠం) (18).

మూ|| వర్ధన్యువాచ -

ఇంద్రస్థానే సదారమ్యే సుస్థిరత్వం ప్రయచ్ఛమే | స్వామిన్‌ ధర్మభృతాం శ్రేష్ఠలోకానాం చహితాయవై || 19 ||

యమ ఉవాచ -

ఏవమస్త్వితి తాంప్రాహ చాస్యం వరయ సత్వరం | దదామి పరము త్కృష్టం గానేన తోషితోస్మ్యహం || 20 ||

వర్ధన్యువాచ -

అస్మిన్‌ స్థానే మహాక్షేత్రే మమతీర్థం మహామతే | భూయాచ్చసర్వపాపఘ్నం మన్నామేతిచ విశ్రుతం || 21 ||

తత్రదత్తం హుతంతప్తం పఠితం వాక్షయం భ##వేత్‌ | పంచరాత్రం నిషేవేత వర్ధమానం సరోవరం || 22 ||

పూర్వజాః తస్యతుష్యేరన్‌ తర్ప్యమాణాదినేదినే | తథేత్యుక్త్యాతు తాంధర్మోమౌన మాచష్టసంస్థితః

త్రిఃపరిక్రమ్యతం ధర్మం సమస్కృత్యది వంయ¸° || 23 ||

వర్ధన్యువాచ -

మా భయంకురుదేవేశ యమస్యార్కసుతస్యచ | అయంస్వార్థపరోధర్మః యశ##సేచ సమాచరేత్‌ || 24 ||

వ్యాస ఉవాచ -

వర్ధనీపూజితాతేన శ##క్రేణ చ శుభాసనా సాధుసాధుమహాభాగే దేవకార్యం కృతం త్వయా || 25 ||

నిర్భయత్వం వరారోహ సుఖవాసశ్చతేసదా | యశః సౌఖ్యంశ్రియం రమ్యాం ప్రాప్యసిత్వం శుభాననే || 26 ||

తథేతిదేవాస్తామూచుః నిర్భయానంద చేతసా | సమస్కృత్యచ శక్రం సాగతాస్థానం స్వకం శుభం || 27 ||

సూత ఉవాచ -

గతేప్సరసి రాజేంద్ర ధర్మః తస్థౌయధావిధి | తపస్తేపే మహాఘోరం విశ్వస్యోద్వేగదాయకం || 28 ||

పంచాగ్నిసాధనం శుక్రే మాసి సూర్యేణ తాపితే | చక్రేసుదుఃసహం రాజన్‌ దేవైరపి దురాసదం || 29 ||

తతోవర్షశ##తేపూర్ణే అంతకోమౌసమాస్థితః | కాష్ఠభూతఇవాతస్థౌ వాల్మీక శతసంవృతః || 30 ||

నానా పక్షిగణౖస్తత్ర కృతనీడైః సధర్మరాట్‌ | ఉపవిష్టేవ్రతం రాజన్‌ దృశ్యతే నైవకుత్రచిత్‌ || 31 ||

సంస్మరంతోథ దేవేశము మాపతిమనిందితం | తతో దేవాః సగంధర్వాః యక్షాశ్చో ద్విగ్నమానసాః

కైలాస శిఖరం భూయ ఆజగ్ముః శివ సన్నిధౌ || 32 ||

దేవా ఊచుః -

త్రాహిత్రాహి మహాదేవ శ్రీ కంఠ జగతః పతే | త్రాహినోభూత భ##వ్యేశ త్రాహినో వృషభధ్వజ

దయాలుస్త్వం కృపానాథ నిర్విఘ్నం కురుశంకర | || 33 ||

ఈశ్వర ఉవాచ -

కేనా వరాధితాః దేవాః కేన వామాన మర్దితాః | మర్త్యే స్వర్గేథవానాగే శీఘ్రం కథయతాచిరం || 34 ||

అనేనైవత్రిశూలేన ఖట్వాంగే నాథవాపునః | అథపాశుపతేనైవ నిహనిష్యామితం రణ

శీఘ్రంవై వదతాస్మాకమత్రా గమన కారణం || 35 ||

దేవా ఊచుః -

కృపాసిధోహి దేవేశ జగదానంద కారక | నభయం మానుషాదద్యసనాగాద్దేవ దానవాత్‌ || 36 ||

మర్త్యలోకేమహాదేవోప్రేతనాథోమహాకృతిః | ఆత్మకార్యం మహాఘోరం క్లేశ##యేదితి నిశ్చయః || 37 ||

ఉగ్రేణ తపసాకృత్వాక్లిశ్యదాత్మాన మాత్మనా | తేనాత్రవయ ముద్విగ్నాదేవాః సర్వేసదాశివ || 38 ||

శరణం త్వామను ప్రాప్తాయదిచ్ఛసి కురుష్వతత్‌

తా || వర్ధని వచనము - ఎల్లప్పుడు రమ్యమైన ఇంద్ర స్థానమందు నాకు సుస్థిరత్వాన్ని కల్గించు. ఓ ధర్మభృతులలో శ్రేష్ఠుడ. స్వామి! లోకముల క్షేమము కొరకు నాకీ వరమివ్వు (19) అనగా యముని వచనము - అట్లాగే కానిమ్మని ఆమెతో అన్నాడు. ఇంకొక వరాన్ని త్వరగా కోరుకో. ఉత్కృష్టమైన వరాన్ని ఇస్తాను. నేన నీ గానంతో సంతుష్టుడనైనాను (20) వర్ధనివచనము - ఈ స్థానమందు, మహాక్షేత్రమందు ఓ మహామతి! నా పేర ఒక తీర్థము కావాలి. అది అన్ని పాపములను నశింపచేసేది కావాలి. నా పేరుతో ప్రసిద్ధం కావాలి. (21) అక్కడ చేసిన దానము, హోమము, తపము, పఠనము అక్షయము కావాలి. వర్ధమాన సరోవరాన్ని ఐదు రాత్రులు సేవించినవారి (22) పూర్వజులు ప్రతిరోజుతర్పణములు ఇవ్వబడి ఆనందించాలి. ఆమెతో ధర్ముడు అట్లాగే అని పలికి నిలబడి మౌనంగా ఉండిపోయాడు. ఆ ధర్మునకు మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆమె దినమునకు వెళ్ళింది (23) వర్ధనివచనము - ఓ దేవేశ! భయపడవద్దు. అర్కసుతుడైన యముని ఈ తపస్సు స్వార్థపరమైనది. ధర్మము కొరకు యశస్సు కొరకు ఆచరిస్తున్నాడు (24) వ్యాస వచనము - వర్థని, అశూభానన, ఆ ఇంద్రునితో పూజింపబడి, మంచిది, మంచిది, ఓ మహాభాగే! నీవు దేవతల కార్యాన్ని చేశావు (25) ఓవరారోహ! నీవు నిర్భయురాలవు. నీవు ఎప్పుడు సుఖంగా జీవించు యశస్సు, సౌఖ్యమును రమ్యమైన శ్రియమును నీవు పొందుతావు ఓ శుభాననే! (26) దేవతలు నిర్భయముగా ఆనందించిన మనస్సులతో అట్లాగే అని ఆమోతో అన్నారు. ఇంద్రునకు నమస్కరించి ఆమె తన శుభ##మైన స్థానమునకు వెళ్ళిపోయింది. (27) సూతుని వచనము -అప్సరసవెళ్ళి పోయాక ఓ రాజేంద్ర! ధర్ముడు యథావిధిగా ఉన్నాడు. మహాఘోరమైన, లోకములకు ఉద్వేగాన్ని కల్గించే తపమాచరించాడు. (28) జ్యేష్ఠ మాసమందు సూర్యుడు తపింపచేస్తుండగా పంచాగ్నులమధ్య, చాలా దుఃసహమైన, దేవతలు కూడా ఆచరించలేని తపస్సును చేశాడు, ఓరాజ (29) పిదప నూరు సంవత్సరాల వరకు యముడు మౌనంగా ఉన్నాడు. నూర్లకొలది పుట్టలతో చుట్టబడి కట్టెవలె ఉన్నాడు (30) అనేక పక్షుల సమూహములు అక్కడ గూళ్ళు కల్పించుకోగా ఆ యముడు కూర్చోగా ఎక్కడా వ్రతము (ప్రతి) కన్పించటం లేదు, ఓరాజ! (31) దేవేశుడు, అనిందితుడు ఐన ఉమాపతిని స్మరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు యక్షులు చెదరిన మనస్సు కలవారై కైలాస శిఖరమునకు శివుని సన్నిధికి తిరిగి వచ్చారు. (32) దేవతల వచనము - ఓ మహాదేవ ! రక్షించు, రక్షించు. ఓ శ్రీకంఠ! జగత్పతి, భూతమునకు భవ్యమునకు (జరుగబోయేది) ఈశుడ, మమ్ములను రక్షించు. ఓ వృషభధ్వజ! మమ్ముల రక్షించు. ఓ కృపానాథ! నీవు దయ గలవాడవు. ఓ శంకర, విఘ్నం కలగకుండా చూడు (33) ఈశ్వరుని వచనము - దేవతలకు ఎవరు అపకారం చేశారు. ఎవరు దేవతల మానాన్ని మర్దించారు. భూలోకంలో స్వర్గంలో నాగలోకంలో, ఆలస్యం చేయకుండా, ఎక్కడ అపకారం జరిగిందో త్వరగా చెప్పు (34) ఈ త్రిశూలంతోనే లేదా ఈ కపాలముతోనే లేదా ఈ పాశుపతముతోనే వానిని యుద్ధంలో సంహరిస్తాను. ఇక్కడికెందుకొచ్చారో నాకు త్వరగా చెప్పండి (35) అనగా దేవతల వచనము - ఓ కృపాసింధు! దేవేశ, లోకములకు ఆనందదాయి. ఈ వేళ భయము మనిషి నుండి కాదు, నాగుల నుండి కాదు(36) ఓ మహాదేవ! భూలోకంలో మహా ఆకృతి గల ప్రేతనాథుడు మహా ఘోరమైన ఆత్మకార్యము నందున్నాడు. అది అతనిని బాధపెడుతుంది. అనుమానము లేదు (37) గొప్ప తపస్సు ఆచరిస్తూ తనను తానే బాధపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ కారణముగా ఇక్కడ మేమందరము దేవతలము ఉద్విగ్నంగా ఉన్నాము. ఓ సదాశివ! నిన్ను శరణువేడాము. ఏం చేయదలిచావో అది చేయి అని అన్నారు (38).

మూ || సూత ఉవాచ -

దేవానాం వచనం శ్రుత్వా వృషారూఢో వృష ధ్వజః | ఆయుధాన్‌ పరిసంగృహ్య కవచం సుమనోహరం

గతవానథ తందేశం యత్ర ధర్మోవ్యవస్థితః || 39 ||

ఈశ్వర ఉవాచ -

అనేక తపసాధర్మ సంతుష్టం మమమాననం | వరం బ్రూహి వరంబ్రూహి వరం బ్రూహీత్యువాచహ || 40 ||

ఇచ్ఛసేత్వం యథాకామాన్‌ యథాతేమనసి స్థితాన్‌ | యంయం ప్రార్థయసే భద్ర దదామితవసాంప్రతం || 41 ||

సూత ఉవాచ -

ఏవం సంభాషమాణంతు దృష్ట్వా దేవం మహశ్వరం |

వాల్మీకా దుత్థితోరాజన్‌ గృహీత్వాకర సంపుటం | తుష్టావ వచనైః శుద్ధైః లోకనాథమరిందమం || 42 ||

ధర్మ ఉవాచ -

ఈశ్వరాయనమస్తుభ్యం నమస్తే యోగరూపిణ | నమస్తే తేజోరూపాయ నీలకంఠనమోస్తుతే || 43 ||

ధ్యాతౄణా మనురూపాయ భక్తి గమ్యాయతే నమః | నమస్తే బ్రహ్మరూపాయ విష్ణురూప నమోస్తుతే || 44 ||

నమః స్థూలాయ సూక్ష్మాయ అణురూపాయవైనమః నమస్తే కామరూపాయ సృష్టిస్థిత్యం తకారిణ || 45 ||

నమోనిత్యాయసౌమ్యాయ మృడాయహరయేనమః | ఆతపాయనమస్తుభ్యం నమః శీతకరాయచ || 46 ||

సృష్టిరూపనమస్తుభ్యంలోకపాలనమోస్తుతే | నమ ఉగ్రాయ భీమాయ శాంతరూపాయతేనమః || 47 ||

నమశ్చానంతరూపాయ విశ్వరూపాయతే నమః | నమో భస్మాంగలిప్తాయ నమస్తే చంద్రశేఖర

నమోస్తు పంచవ క్త్రాయత్రినేత్రాయ నమోస్తుతే || 48 ||

నమస్తే వ్యాలభూషాయకక్షావటధరయచ |

నమోంధక వినాశాయ దక్షపాపాపహారిణ | కామనిర్దాహినే తుభ్యం త్రిపురానమోస్తుతే || 49 ||

చత్వారింశచ్చనామాని మయోక్తాని చయఃపఠేత్‌ | శుచిర్భూత్వాత్రికాలంతు పఠే ద్వాశ్రుణుయాదపి || 50 ||

గోఘ్నశ్చైవ కృతఘ్నశ్చ సురాపోగురుతల్పగః | బ్రహ్మహా హేమహారీచ హ్యథవావృషలీపతిః || 51 ||

స్త్రీ బీలఘాతకశ్చైవ పాపీచానృతభాషణః | అనాచారీ తథాస్తేయీ పరదారాభిగస్తథా || 52 ||

పరవవాదీ ద్వేషీచ వృత్తిలోపకరస్తథా |

అకార్య కారీకృత్యఘ్నో బ్రహ్మద్విట్‌ బాడబాధమః | ముచ్యతే సర్వపాపేభ్యః కైలాసంసగచ్ఛతి || 53 ||

తా || సూతుని వచనము - వృషభమును ఎక్కిన వృషభమును ధ్వజమందు గల దేవతల మాటను విని ఆయుధములు తీసుకొని మనోహరమైన కవచమును ధరించి ధర్మదేవత ఉన్నచోటకి వెళ్ళాడు, శివుడు (39) ఈశ్వరుని వచనము - ఈనీ తపస్సుతో ఓ ధర్ముడ! నా మనస్సు సంతుష్టమైంది. వరమడుగు, వరమడుగు, వరమడుగు అని అన్నాడు (40) నీ వెటువంటి కోరికలను కోరుతున్నావో, నీమనసులో ఎటువంటి కోరికలున్నాయో అడుగు. ఓ భద్రుడ! నీవు దేన్ని దేన్ని అడిగితే అవన్నీ నీకిప్పుడిస్తాను. (41) అని సూతుని వచనము - ఇట్లా మాట్లాడుతున్న మహశ్వరుని, దేవుని చూచి, ఓరాజ! పుట్ట నుండి లేచి చేతులు జోడించి లోకనాథుడు, అరిందముడు ఐన శివుని శుద్ధమైన వాక్కులతో స్తుతించాడు (42) ధర్మరాజు వచనము - ఓ ఈశ్వర నీకు నమస్కారము. యోగరూపి నీకు నమస్కారము. ఓ తేజోరూప, నీలకంఠ నీక నమస్కారము. (43) ధ్యానించేవారికి తగినవిధమైన రూపం గలవాడ, భక్తిచే లభించేవాడ నీకు నమస్కారము. బ్రహ్మరూప, విష్ణురూప నీకు నమస్కారము (44) స్థూలుడ, సూక్ష్ముడ, అణురూపుడ నీకు నమస్కారము. ఓ కామరూపుడ, సృష్టి స్థితి అంతములను చేసేవాడ నీకు నమస్కారము. (45) నిత్యుడ, సౌమ్యుడ,మృడుడ హరి నీకు నమస్కారము. వేడి స్వరూపుడ, చల్లని కిరణముల వాడ నీకు నమస్కారము (46) సృష్టిరూప, లోకపాల నీకు నమస్కారము నీకు నమస్కారము. ఉగ్రుడ, భీముడ, శాంతరూప నీకు నమస్కారము (47) అనంతరూప, విశ్వరూప నీకు నమస్కారము. శరీరమందు భస్మము ధరించినవాడ నీకు నమస్కారము. చంద్రశేఖర నీకు నమస్కారము. ఐదు ముఖములవాడ, మూడు కన్నుల వాడ నీకు నమస్కారము, నమస్కారము (48) సర్పము ఆ భరణంగా కలవాడ గోచిని ధరించినవాడ, అంధకుని సంహరించినవాడ,దక్షుని పాపమును తొలగించినవాడ నీకు నమస్కారము కాముని దహించినవాడ, త్రిపురారి నీకు నమస్కారము. నమస్కారము (49) నేను చెప్పిన ఈ నలుబది నామములను చదివిన వారు శుచియై మూడుకాలములందు చదివిన వారు,విన్నవారు (50) గోహత్య చేసినవారైనా, కృతఘ్నుడైన సురను తాగే వారైనా, గురుతల్పగుడైన, బ్రాహ్మణ హంత ఐన, బంగారపు దొంగ ఐనా శూద్ర స్త్రీ భర్తఐనా (51) స్త్రీలను బాలురను చంపేవాడైనా పాపియైన అబద్ధమాడే వాడైనా, అనాచారుడైనా, దొంగయైనా, పరుల భార్యలను పొందేవాడైనా (52) పరులను నిందించేవాడైనా, ద్వేషించేవాడైనా, వృత్తి లోలోపంచేసేవాడైనా, చేయకూడనిది చేసేవాడైనా, చేసిన దాన్ని చెరచేవాడైనా, బ్రహ్మద్వేషి, బ్రాహ్మణాథముడైనా వీరెవరైనా సర్వపాపముల నుండి ముక్తులౌతారు. వారు కైలాసమునకు వెళ్తారు (53).

మూ || సూత ఉవాచ -

ఇత్యేవం బహుభిరాక్యైః ధర్మరాజేన వైముహుః ఈడితోపి మహద్భక్త్యా ప్రణమ్య శిరసాస్వయం || 54 ||

తుష్టః శంభుః తదా తస్మాత్‌ ఉవాచేదం వచః శుభం | వరం పృణుమహాభాగయత్తే మనసి వర్తతే || 55 ||

యమ ఉవాచ-

యదితుష్టోసి దేవేశ దయాం కృత్వామమోవరి | తంకురుష్వమహాభాగత్రైలోక్యం సచరాచరం || 56 ||

మన్నామ్నా స్థానమే తద్థిఖ్యాతం లోకేభ##వేదితి | అచ్ఛేద్యం చాప్యభేద్యంచ పుణ్యం పాపప్రణాశనం || 57 ||

స్థానం కురు మహాదేవ యది తుష్టాసిమేభవ | శివేన స్థానకం దత్తం కాశీతుల్యం తదానృప

తద్దత్వాచపునః ప్రాహ అన్యం పరయనత్తమ || 58 ||

ధర్మ ఉవాచ -

యదితుష్టోసిదేవేశ దయాంకృత్వామమోవరి

తంకురుష్వ మహాభాగత్రైలోక్యం సచరాచరం | వరేణౖవం యథాఖ్యాతిం గమిష్యామియుగేయుగే || 59 ||

ఈశ్వర ఉవాచ -

బ్రూహికీ నాశతత్సర్వం ప్రకరోమిత వేష్పితం | తపసాతోషితోహం వైదదామి పరమీప్సితం || 60 ||

యమ ఉవాచ -

యదిమేవాంఛితం దేవదదాసి తర్హిశంకర | అస్మిన్‌ స్థానే మహాక్షేత్రే మన్నామ్నాభవసర్వదా || 61 ||

ధర్మారణ్య మితిఖ్యాతిః త్రైలోక్యే సచరాచరే | యథా సంజాయతే దేవతథాకురుమహేశ్వర || 62 ||

ఈశ్వర ఉవాచ -

ధర్మారణ్య మిదం ఖ్యాతం సదాభూయాద్యుగే యుగే | త్వన్నామ్నా స్థాపితం దేవఖ్యాతిమే తత్‌ గమిష్యతి

అథాన్యదపియత్కించిత్‌ కరోమ్యేష పదస్వతత్‌ || 63 ||

యమ ఉవాచ -

యోజనద్వయ విస్తీర్ణం మన్నామ్నా తీర్థముత్తమం | ముక్తేశ్చ శాశ్వతం స్థానం పావనం సర్వదేహినాం || 64 ||

మక్షికాః కీటకాశ్చైవ పశుపక్షిమృగాదయః | పతంగాభూతవేతాలా పిశాచో రగరాక్షసాః || 65 ||

వారీవాథనరోవాథమత్‌ క్షేత్రే ధర్మ సంజ్ఞకే | త్యజతేయః ప్రియాన్‌ ప్రాణాన్‌ ముక్తిర్భవతు శాశ్వతీ || 66 ||

ఏవ మస్త్వితి సర్వోపి దేవా బ్రహ్మాదయస్తథా | పుష్పవృష్టి ప్రకుర్వాణాః పరంహర్షమవాప్నుయుః || 67 ||

దేవదుందుభయోనేదుః గంధర్వ పతయోజగుః | వపుఃపుణ్యాః తథా వాతాననృతుశ్చాప్సరోగణాః || 68 ||

సూత ఉవాచ -

యమేన తపసాభక్త్యా తోషితో హి సదాశివః | ఉవాచ వచనం దేవం రమ్యం సాధుమనోరమం || 69 ||

అనుజ్ఞాం దేహిమేతాతయధా గచ్ఛామి సత్వరం | కైలాసం పర్వత శ్రేష్ఠం దేవానాం హిత కామ్యయా || 70 ||

తా || సూతుని వచనము - ఈ విధముగా అనేక వాక్యములతో ధర్మరాజు మాటి మాటికి స్తుతించి, మహా భక్తితో తలవంచి నమస్కరించగా,స్వయముగా (54) అప్పుడు శివుడు ఆనందపడ్డాడు. అప్పుడు శుభ##మైన ఈ మాటను శివుడు పలికాడు. ఓ మహాభాగ! నీ మనసులో ఉన్న వరాన్ని కోరుకో, అని అనగా (55) యముని వచనము - ఓ దేవేశ! నా మీద దయతలచి నీవు ఆనందుడవైతే, ఓ మహాభాగ, సదాచరమైన ముల్లోకములలో (56) ఈ స్థానము నా పేరుతో ప్రసిద్ధమయ్యేట్టు లోకంలో (దాన్ని) చేయండి. ఛేదించరాని, భేదించరాని పుణ్యము ఇచ్చే పాపనాశకముగా (57)ఈ స్థానమును చేయండి. ఓ మహాదేవ! నా వల్ల మీరు సంతుష్టి నందితే అప్పుడు ఓరాజ! ఆ స్థానము కాశీతుల్యమయ్యేట్టుగా శివుడు వరమిచ్చాడు. ఆవరమిచ్చి, మళ్ళా ఇట్లా అన్నాడు శివుడు. ఓ సత్తముడ! ఇంకో వరాన్ని కోరుకో అని (58) ధర్ముని వచనము- ఓదేవేశ! నా మీదదయతలచి సంతుష్టినందితే ఇట్లా చేయండి, ఓ మహాభాగ! సచరాచరమైన ముల్లోకములలో, యుగ యుగములలో కీర్తిని పొందేట్టుగా వరమీయండి (59) అనగా ఈశ్వరుని వచనము - ఓ యమ! నీ కోరికంతా చెప్పు, చేస్తాను. నీ తపస్సుతో నేను సంతోషించాను. నీకీప్సితమైన వరాన్ని ఇస్తాను. అని అనగా (60) యముని వచనము - ఓ దేవ ! శంకర ! నా వాంఛితమును ఇచ్చేట్లైతే ఈ స్థాన మందు, మహాక్షేత్రమందు ఎల్లప్పుడు నా పేరుతో వసించు (61) ధర్మారణ్యమనే పేరును సచరాచరమైన ముల్లోకములలో కలిగేట్టుగా చేయి, ఓదేవ, మహేశ్వర (62) అని అనగా ఈశ్వరుని వచనము - యుగ యుగములలో ఎల్లప్పుడూ ధర్మారణ్యమనే పేరుతో ఇది ఖ్యాతిని పొందని ఓదేవ! నీ పేరుతో స్థాపించబడి ఇది ఖ్యాతిని పొందుతుంది. ఇంకా ఇంకేదైనా ఏ కొంచెం ఉన్నాదాన్ని చెప్పు. దాన్ని కూడ చేస్తాను అనగా (63) యముని వచనము- రెండు యోజనముల విస్తీర్ణము గలిగి నా పేరుతో ఉత్తమమైన తీర్థము కావాలి. అది ముక్తికి స్థానము, శాశ్వతము సర్వదేహూలను పవిత్రీకరించేది కావాలి (64) ఈగలు, పురుగులు, పశు పక్షి (చిలుకాదులు) మృగాదులు, పక్షులు(పెద్దవి) భూత బేతాళురు, పిశాచ ఉరగ రాక్షసులు (65) స్త్రీ పురుషులు, ఎవరైనా కాని నా పేరుగల ధర్మడను పేరు గల క్షేత్ర మందు తమ ప్రియమైన ప్రాణములను వదిలితే వారికి శాశ్వతమైన ముక్తికలుగని అని అనగా (66) ఇట్లాగే కానిమ్మని బ్రహ్మాది దేవతలందరు పలికి పుష్ప వర్షాన్ని కురుపిస్తూ చాలా ఆనందాన్ని పొందారు (67)దేవదుందుభులు మ్రోగాయి. గంధర్వపతులు గానం చేశారు. పవిత్రమైన గాలులు వీచాయి. అప్సరసల గణములు నాట్యంచేశారు (68) సూతుని వచనము - యముని తపస్సుతో, భక్తితో సంతోషించిన సదాశివుడు యమునితో రమ్యమైన, మంచిదైన మనోరమమైన మాటనన్నాడు (69) ఓ తండ్రి! (ప్రేమతో సంబోధన) నా కనుజ్ఞ ఇవ్వు. త్వరగా వెళ్ళాలి. దేవతలకు హితం చేసే కొరకు శ్రేష్ఠమైన కైలాస పర్వతానికి వెళ్ళాలి అనగా (70).

మూ|| యమ ఉవాచ-

సమేస్థానం పరిత్యక్తుం త్వయాయుక్తం మహశ్వర | కైలాసాదధికం దేవజాయతే వచనాదిదం || 71 ||

శివ ఉవాచ-

సాధుప్రోక్తం త్వయాయుక్తం ఏకాంశేనా త్రమేస్థితిః | సమయాత్యజితం సాధుస్థానం తపసునిర్మలం || 72 ||

విశ్వేశ్వరం మహాలింగం మన్నామ్నాత్ర భవిష్యతి | ఏవముక్త్వా మహాదేవః తత్రైవాంతర ధీయత || 73 ||

శివస్యవచ నాత్తత్ర తదాలింగం తదద్భూతం | తందృష్ట్వాచ క్షురైస్తత్ర యథాజామానుకీర్తనం || 74 ||

స్వంస్వంలింగం తదా సృష్టం ధర్మారణ్య సురోత్తమైః | యస్యదేవస్య యల్లింగం తన్నామ్నా పరికీర్తితం || 75 ||

సూత ఉవాచ -

ధర్మేణ స్థాపితం లింగం ధర్మేశ్వర ముపస్థితం | స్మరణాత్‌ పూజనాత్తస్య సర్వపాపైః ప్రముచ్యతే || 76 ||

యద్ర్బహ్మయోగినాంగమ్యం సర్వేషాం హృదయే స్థితం | తిష్ఠతేయస్యలింగంతుస్వయంభుపమితిస్థితం || 77 ||

భూతనాథంచ సంపూజ్యవ్యాధిభిర్ముచ్యతేజనః | ధర్మవాపీంతతశ్చైవ చక్రేతత్ర మనోరమాం || 78 ||

ఆహత్యకోటి తీర్థానాం జలం వాప్యాం ముమోచహ | యమతీర్థస్వరూపంచ స్నానం కృత్వా మనోరమం || 79 ||

స్నానార్థం దేవతానాంచ ఋషీణాం భావితాత్మనాం | తత్రస్నాత్వాచ పీత్వాచ సర్వపాపైః ప్రముచ్యతే || 80 ||

ధర్మవాప్యాం నరః స్నాత్వా దృష్ట్వా ధర్మేశ్వరం శివం | ముచ్యతే సర్వపాపేభ్యో సమాతుర్గర్భమావిశేత్‌ || 81 ||

తత్రస్నాత్వానరోయస్తు కరనోతి యమతర్పణం | వ్యాధిదోష వినాశార్థం క్లేశ దోషోపశాంతయే

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ | వైవస్వతాయ కాలాయ దఘ్నాయ పరమేష్ఠినే || 82 ||

పృకోదరాయ వృకాయ దక్షిణశాయతేనమః | నీలాయ చిత్రగుప్తాయ చిత్రవైచిత్రతేనమః || 83 ||

యమార్థంతర్పణం యోవైధర్మవాప్యాంకరిష్యతి | సాక్షతైః నామభిశ్చైతైః తస్యనోపద్రవోభ##వేత్‌ || 84 ||

ఏకాంతరః తృతీయస్తు జ్వరః చాతుర్థికస్తథా | వేలాయాం జాయతే యస్తుజ్వరః శీతజ్వరస్తథా || 85 ||

పీడయన్తిన చైతన్య యసై#్యవోమతిరీ దృశీ | రేవత్యాది గ్రహాదోషాడాకినీశాకినీ తథా || 86 ||

ధనధాన్య సమృద్ధిః స్యాత్‌ సంతతి ర్వర్థతేనదా | భూతేశ్వరంతు సంపూజ్య సుస్నాతో విజితేంద్రియః || 87 ||

సాంగంరుద్ర జపం కృత్వా వ్యాది దోషాత్ర్పముచ్యతే | అమావాస్యాం సోమదినే వ్యతీపాతేచ వైధృతౌ

సంక్రాంతౌ గ్రహణచైవతత్రశ్రాద్ధంస్మృతం నృణాం || 88 ||

తా || యముని వచనము - ఓ మహశ్వర ! నా స్థానమును నీవు వదలి పెట్టటం తగదు. మీ మాటవల్ల ఇది కైలాసము కన్న అధికమౌతుంది, ఓదేవ! (71) శివుని వచనము- నీవు బాగా చెప్పావు. ఒక అంశతో, నేనిక్కడ ఉండటం యుక్తము. నీ మంచి స్థానమును, సునిర్మలమైన దానని నేను విడువలేదు (72) నా పేరుతో ఇక్కడ విశ్వేశ్వర మహా లింగము కల్గుతుంది. అని పలికి మహాదేవుడు అక్కడే అంతర్థానమైనాడు. (73) శివుని మాట వలన అక్కడ అప్పుడు అద్భుతమైన లింగము కలిగింది. దాన్నిచూచి దేవతలు ఏ పేరు ఉందో ఆ పేరుతో పిలిచారు (74) ధర్మారణ్యమందు సురోత్తములు తమ తమ పేర్లతో అప్పుడు లింగాన్ని సృష్టించారు. ఏ దేవునిది ఏ లింగమో అది ఆ దేవుని పేరుతో పిలువ బడింది (75) సూతుని వచనము- ధర్ముడు స్థాపించిన లింగము ధర్మేశ్వర మనబడింది. దానిని స్మరిస్తే, పూజిస్తే సర్వపాపముల నుండి ముక్తులౌతారు (76) ఏ బ్రహ్మ యోగులకు గమ్యస్థానమో, ఏ బ్రహ్మ అందరి హృదయాల్లో ఉన్నాడో, ఎవని లింగము స్వయంభువమని ఉందో అట్లా ఉన్నదానిని (77) భూతనాథుని పూజిస్తే జనులు వ్యాధుల నుండి ముక్తులౌతారు. అక్కడ ఆ పిదప మనోరమమైన ధర్మ వాపిని ఏర్పరచాడు (78) కోటి తీర్థముల నీటిని తీసుకొని వచ్చి ఈ బావి యందు విడిచాడు. ఇది యమ తీర్థ స్వరూపము. ఈ మనోరమమైన దానిలో స్నానం చేయాలి. (79) దేవతలు, పరమాత్మను ధ్యానించే ఋషుల స్నానము కొరకు ఇది ఏర్పరచారు. అక్కడ స్నానంచేసి, ఆ నీరు తాగి సర్వపాపముల నుండి ముక్తులౌతారు (80) నరుడు ధర్మవాపి యందు స్నానం చేసి ధర్మేశ్వర శివుని చూచిన సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. తల్లి గర్భంలో ప్రవేశించడు (81)అక్కడ స్నానం చేసి నరుడు యమతర్పణం చేసిన వ్యాధి దోషములు నాశనమౌతాయి. క్లేశ (కోపం) దోషములు ఉపశమిస్తాయి. యమునకు, ధర్మరాజునకు, మృత్యువునకు, వైవస్వతునకు, కాలునకు, దధ్నునకు (ధరించే వానికి) పరమేష్ఠికి (82) వృకోదరునకు, వృకునకు(అగ్ని), దక్షిణశునకు ఇటువంటి నీకు నమస్కారము నీలునకు, చిత్రగుప్తునకు, చిత్రునకు, వైచిత్రునకు నీకు నమస్కారము (83) ఈ విధముగా చెప్పి యముని కొరకు ధర్మవాపి యందు తర్పణం చేసిన వారికి అక్షతలతో, ఈ నామములతో తర్పణ చేసినవారికి ఉపద్రవము కలగదు (84) రోజు విడిచి రోజువచ్చే జ్వరము, మూడు రోజుల కోసారి, నాలుగు రోజులకోసారి వచ్చే జ్వరము ఒక వేళలో వచ్చే జ్వరము అట్లాగే శీత జ్వరము (85) ఇవన్ని నరుని పీడించవు. ఈతని బుద్ధి ఇట్టిదై ఆ వైపు ఉంటే (యమునిపై) రేవతి మొదలగు గ్రహములు, దోనములు, డాకిని, శాకినులు (86) పీడించవు. ధనధాన్య సమృద్ధి కల్గుతుంది. ఎల్లప్పుడు సంతతి వృద్ధి ఔతుంది. స్నానం చేసి భూతేశ్వరుని పూజించి, ఇంద్రియముల జయించి (87) అంగములతో కూడి రుద్ర జపము చేస్తే వ్యాధి దోషముల నుండి ముక్తులౌతారు. అమావాస్య, సోమవారము, వ్యతీపాత యోగము, వైధృతి యోగము, సంక్రాంతి, గ్రహణము ఈ పై వాని యందు నరులు అక్కడ శ్రాద్ధము చేయాలి అని అన్నారు (88)

మూ|| శ్రాద్ధం కృతం తేన సమాః సహస్రం | నిరస్యచైతత్‌ పితరస్త్వదంతి

పానీయమేవాపితిలైర్విమిశ్రితం | దదాతి యోవై ప్రథితో మనుష్యః || 89 ||

ఏక వింశతివారైస్తు గయాయాం పిండదానతః | ధర్మేశ్వరే సకృద్దత్తం పితౄణాంచా క్షయం భ##వేత్‌ || 90 ||

ధర్మేశాత్‌ పశ్చిమేభాగే విశ్వేశ్వరాంతరేపివా | ధర్మవాపీతి విఖ్యాతా స్వర్గసోపాన దాయినీ || 91 ||

ధర్మేణ నిర్మితా పూర్వం శివార్థం ధర్మబుద్ధినా | తత్రస్నాత్వాచ పీత్వాచ తర్పితాః పితృదేవతాః || 92 ||

శమీపత్ర ప్రమాణంతు పిండం దద్యాచ్చయోనరః | ధర్మవాప్యాం మహాపుణ్యాం గర్భవాసంసచాప్నుయాత్‌ || 93 ||

కుంభీపాకాన్మహారౌద్రాత్‌ రౌరవాన్నరకాత్పునః | అంధతా మిన్రకాద్రాజన్‌ ముచ్యతే నాత్ర సంశయః || 94 ||

సూత ఉవాచ -

ఏక వర్షం తర్పణీయం ధర్మవాప్యాం నరోత్తమః | ఋతౌమాసేచ పక్షేచ విపరీతంచజాయతే || 95 ||

బర్హిషదోగ్నిష్వాత్తాశ్చ ఆజ్యపాః సోమపాస్తథా | తృప్తిం ప్రయాంతి పరమాంవాప్యాం వైతర్పణనతు || 96 ||

కురుక్షేత్రాదిక్షేత్రాణి అయోధ్యాది పురస్తథా | పుష్కరాద్యాని సర్వాణి ముక్తినామాని సంతివై || 97 ||

తాని సర్వాణి తుల్యాని ధర్మకూపోధికో భ##వేత్‌ | మంత్రోవేదాస్తథా యజ్ఞాః దానానిచ వ్రతానిచ || 98 ||

అక్షయాణి ప్రజాయంతే దత్వాజప్త్వానరేశ్వర | అభిచారాశ్చయే చాన్యే సుసిద్ధా ధర్మవేదజాః || 99 ||

తేసర్వే సిద్ధిమాయాంతి తస్మిన్‌ స్థానే కృతా అపి | ఆదితీర్థం నృపశ్రేష్ఠకాజేశైరుపసేవితం || 100 ||

సిద్ధిస్థానం సుసౌమ్యంచ బ్రహ్మాద్యైరపిసేవితం | కృతేతుయుగ పర్యంతం త్రేతాయాం లక్షపంచకం || 102 ||

ద్వాపరేలక్షమేకంతు దినైకేన ఫలంకలౌ | ఏతదుక్తం మయా బ్రహ్మన్‌ ధర్మారణ్యస్య వర్ణనం

ఫలంచై వాత్ర సర్వం హి ఉక్తం ద్వైపాయనేవతు || 102 ||

సూత ఉవాచ -

అతః పరం ప్రవక్ష్యామి ధర్మవాక్యం మనోరమం | దేవానాం హిత కామాయ ఆజ్ఞాప్యచ యదుక్తవాన్‌ || 103 ||

ధర్మ ఉవాచ -

అస్మిన్‌ క్షేత్రే ప్రకుర్వంతి విష్ణుమాయా విమోహితాః | పారదార్యం మహా దుష్టం స్వర్ణస్తేయాదికం తథా || 104 ||

అస్యచ్చ వికృతం సర్వం కుర్వాణోనరకం ప్రజేత్‌ | అన్యక్షేత్రేకృతం పాపం ధర్మారణ్య వినశ్యతి || 105 ||

ధర్మారణ్య కృతం పాపం వజ్రలేపో భవిష్యతి | యథాపుణ్యం తథా పాపం యత్కించిచ్చశుభాశుభం || 106 ||

తత్సర్వం వర్ధతేనిత్యం వర్షాణి శతమిత్యుత | కామినాం కామదం పుణ్యం యోగినాం ముక్తిదాయకం || 107 ||

సిద్ధానాం సిద్ధిదంప్రోక్తం ధర్మారణ్యంతు సర్వదా | అపుత్రోలభ##తే పుత్రాన్‌ నిర్ధనోధనవాన్భవేత్‌ || 108 ||

ఏతదాఖ్యానకర పుణ్యం ధర్మేణ కథితం పురా | యః శృణోతినరోభక్త్యానారీవాశ్రావయేత్తుయః

గోసహస్ర ఫలంతస్య అంతేహరిపురం వ్రజేత్‌ || 109 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే క్షేత్ర స్థాపనం నామ చతుర్థోధ్యాయ || 4 ||

తా || వేయి సంవత్సరములు శ్రాద్ధం చేసిన దానిని, నిరసించి ఇక్కడ చేసిన పువ్వులతో కూడిన ఉదకతర్పణాన్నైనా పితరులు తింటారు. కనుక ఇక్కడ మనుష్యుడు తిలతర్పణం చేయాలి (89) ఇరువది ఒక్కమారులు గయలో పిండ దానం కన్నా ధర్మేశ్వరంలో ఒక్కసారి ఇచ్చిన పితరులకు అక్షయమౌతుంది (90) ధర్మేశునకు పశ్చిమ భాగంలో విశ్వేశ్వరుని అంతరంలో ధర్మవాపిని ప్రసిద్ధమైంది ఉంది. అది స్వర్గమునకు మెట్లను కల్గిస్తుంది. (91) శివుని కొరకు ధర్మబుద్ధి కలిగిన ధర్మునితో పూర్వం నిర్మింపబడింది. అక్కడ స్నానం చేసి జలపానం చేసి పితృదేవతలకు తర్పణ చేస్తే (92) శమీపత్ర మంత ప్రమాణంతో నరుడు పిండదానం చేస్తే మహాపుణ్‌యమైన ధర్మవాపి యందు చేస్తే తిరిగి గర్భవాసాన్ని పొందడు (93) ఓ రాజ! కుంభీపాకనరకము, మహా రౌద్రమైన రౌరవ నరకం నుండి, ఆంధ తామిస్ర నరకం నుండి ముక్తుడౌతాడు. ఇందులో సంశయం లేదు (94) సూతుని వచనము - ఉత్తమ నరుడు ధర్మవాపి యందు ఒక సంవత్సరం తర్పణ చేయాలి. ఋతువు, మాసము పక్షములందు తర్పణ చేయాలి. లేనిచో ఫలించదు (95) బర్హిషదులు (కుశలపై కూర్చునేవారు) అగ్నిని భుజించేవారు (ఉదరాగ్ని, కోపాగ్ని) ఆజ్యపులు, సోమవులు, వీరంతా ఈ వాపి యందు తర్పణ చేస్తే ఉత్తమమైన తృప్తిని పొందుతారు (96) కురుక్షేత్రము మొదలగు క్షేత్రములు, అయోద్యాది పురములు, పుష్కరాదులు (తీర్థము) ఇవన్ని ముక్తికి మారుపేర్లుగా ఉన్నాయి (97) అవన్నీ సమానమైనవి. కాని ధర్మకూపము వాటన్నిటికన్న అధికము, మంత్రము, వేదములు, యజ్ఞములు, దానములు,వ్రతములు (98) ఇవన్నీ ఇక్కడ ఆచరిస్తే అక్షయమౌతాయి. ఇక్కడ జపిస్తే, దానం చేస్తే ఓ నరేశ్వర! అది అక్షయమౌతుంది. అధర్వ వేదములో సుసిద్ధమైన అభిచారము, ఇంకా, ఇతరమైనవి (99) అవన్నీ ఆ స్థానంలో చేస్తే సిద్‌ధిని పొందుతాయి. ఓ నృపశ్రేష్ఠ! ఆది తీర్థమును కాజేశులు (క,అజ, ఈశ) సేవించారు (100) అది సిద్ధికి స్థానము సుసౌమ్యము బ్రహ్మాదులు దానిని సేవించారు. కృతయుగంలో యుగమ కాలమునకు త్రేతా యుగమందు ఐదు లక్షల సంవత్సరముల కాలమునకు (101) ద్వాపరమందు ఒక లక్షకాలమునకు కలియందు ఒక దినమునకు ఫలం లభిస్తుంది. ఓ బ్రహ్మ! ధర్మారణ్‌య వర్ణనను దీనిని నేను చెప్పాను. ఇక్కడ ఫలమంతా ద్వైపాయనుడిట్లా చెప్పాడు (102) సూతుని వచనము - ఇక ముందు మనోరమమైన ధర్మవాక్యాన్ని చెబుతాను. దేవతల హితం కొరకు ఆజ్ఞాపించి చెప్పిన దానిని చెబుతాను (103) ధర్ముని వచనము - ఈ క్షేత్రమందు విష్ణుమాయా మోహితులై మహా దుష్టమైన పరదారగమనము, స్వర్ణస్తేయాదులు (104) వికృతములైనవి ఇతరములన్ని ఆచరించినవారు నరకానికి పోతారు. ఇతర క్షేత్రములంద చేసిన పాపము ధర్మారణ్య మందు నశిస్తుంది (105) ధర్మారణ్య మందు చేసిన పాపము వజ్రపు పూతలా ఉంటుంది. పుణ్యము, అట్లాగే పాపము శుభాశుభ##మైనది ఏ కొంచమైన (106) అదంతా రోజూ పెరుగుతుంది. సంవత్సరాలు, నూర్లు అని అట్లా కాములకు కామములను ఇచ్చేది. యోగులకు ముక్తి నిచ్చేది (107) సిద్ధులకు సిద్ధి నిచ్చేది, ధర్మారణ్యము అని ఎప్పుడూ చెప్పబడింది. సంతానహీనుడు సంతానాన్ని పొందుతాడు. ధనహీనుడు ధనవంతుడౌతాడు (108) పుణ్యమైన ఈ అభ్యాసమును పూర్వం ధర్ముడు చెప్పాడు. భక్తితో విన్న నరుడు కాని నారికాని, వినిపించిన వారు వీరికి గోసహస్ర దాన ఫలము లభిస్తుంది. చివర ఆతడు హరి పురమునకు వెళ్తాడు (109) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు క్షేత్ర స్థాపన మనునది నాలుగవ అధ్యాయము || 4 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters