Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఆరవ అధ్యాయము

మూ || వ్యాసఉవాచ -

ఉపకారాయసాధూనాంగృహస్థాశ్రమవాసినాం | యథాచక్రియతే ధర్మోయథావత్కథయామితే || 1 ||

వత్సగార్హాస్థ్యమాస్థాయనరఃసర్వమిదంజగత్‌ | వుష్ణాతితేనలోకాంశ్చనజయత్యభివాంఛితాన్‌ || 2 ||

పితరోమునయోదేవాభూతానిమనుజాస్తథా | క్రిమికీటపతంగాశ్చవయాంసిపితరోసురాః || 3 ||

గృహస్థముపజీవంతి తతస్తృప్తిం ప్రయాంతిచ | ముఖం వాస్య నిరీక్షంతే అపోనోదాస్యతీతిచ || 4 ||

సర్వస్యాధారభూతాయే వత్సధేనుస్త్రయీమయీ | అస్యాం ప్రతిష్ఠితం విశ్వం విశ్వహెతుశ్చయామతా || 5 ||

ఋక్‌పృష్ఠాసౌ యజుః సంధ్యాసామకుక్షిపయోధరా | ఇష్టాపూర్తవిషాణాచ సాధునూక్తతనూరుహా || 6 ||

శాంతిపుష్ఠిశకృన్మూత్రా వర్ణపాద ప్రతిష్ఠితా | ఉపజీవ్యమానాజగతాం పదక్రమజటాఘనైః || 7 ||

స్వాహా కారస్వధాకారౌ వషట్‌కారశ్చ పుత్రక | హంతకారఃతథైవాస్యః తస్యాఃస్తనచతుష్టయం || 8 ||

స్వాహా కారస్తనం దేవాః పితరశ్చ స్వధామయం | మునయశ్చవషట్‌కారం దేవభూతసురేశ్వరా || 9 ||

హంతకారం మనుష్యాశ్చ పిబంతిసతతంస్తనం | ఏవమధ్యాపయే దేవవేదానాం ప్రత్యహంత్రయీ || 10 ||

తేషాముచ్ఛేదకర్తాయః పురుషోనంత పాపకృత్‌ | సతమస్యంధ తామిస్రేనరకేహినిమజ్జతి || 11 ||

యస్త్వేనాంమానవోధేనుం స్వర్‌ వత్పైరమదాదిభిః పూజయత్యుచితేకాలేసన్వర్గాయోపపద్యతే || 12 ||

తస్మాత్పుత్రమనుష్యేణ దేవర్షిపితృమానవాః | భూతానిచానుదివనం పోష్యాణిన్వతనుర్యథా || 13 ||

తస్మాత్‌స్నాతఃశుచిర్భూత్వాదేవర్షిపితృతర్పణం | యజ్ఞస్యాంతేతథైవాద్భిః కాలేకుర్యాత్సమాహితః || 14 ||

సుమనోగంధపుషై#్పశ్చదేవానభ్యర్చ్యమానవః | తతోగ్నేస్తర్పణం కుర్యాద్దద్యాచ్చాపిబలీంస్తథా || 15 ||

సక్తం చరేభ్యోభూతేభ్యోబలిమాకా శతోహరేత్‌ | పితౄణాం నిర్వపేత్తద్వద్దక్షిణాభిముఖస్తతః || 16 ||

గృహస్థస్తత్పరోభూత్వాసుసమాహితమానవః | తతస్తోయముపాదాయతేష్వేవార్పణసత్క్రియాం || 17 ||

స్థానేషునిక్షిపేత్‌ ప్రాజ్ఞోనామ్నాతూద్దిశ్యదేవతాః | ఏవంబలింగృహెదత్వాగృహెపతిఃశుచిః || 18 ||

ఆచమ్యచతతః కుర్యాత్‌ ప్రాజ్ఞోద్వారావలోకనం || 18 1/2 ||

తా || వ్యాసుని వచనము - సాధువులకు ఉపకారము కొరకు, గృహస్థాశ్రమ వాసుల ధర్మమును వారెట్లా చేస్తారో దానిని ఉన్నదున్నట్లుగా నీకు చెబుతాను (1) ఓ వత్స! నరుడు గృహస్థానమందుండి ఈ జగత్తునంతా పోషిస్తున్నాడు. దానితోనే తన కోరుకున్న లోకములను జయిస్తున్నాడు (2) పితరులు, మునులు, దేవతలు, భూతములు, మనుష్యులు, క్రిములు, కీటకములు, పక్షులు, పితరులు, అసురులు (3) వీరంతా గృహస్థుని ద్వారా బ్రతుకుతున్నారు. అతని నుండే తృప్తిని పొందుతున్నారు. ఇతని ముఖాన్ని చూస్తుంటారు. మాకు నీళ్ళు ఇస్తాడు అని (4) సర్వమునకు ఆధార భూతమైనది, వేదమయమైన గోమాత, ఓవత్స. ఈ గోమాత యందు విశ్వమంతా ఉంది. విశ్వమునకు హేతువుగా భావింపబడింది. గోమాత (5) ఋక్‌ వృష్ఠభాగము, యజుస్సు సరిహద్దు భాగములు (సంధి భాగములు) సామము కడుపు(పొదుగు) రొమ్ములు. ఇష్టా పూర్తము కొమ్ములు సాధువుల సువచనములు (సాధుసూక్తము) వెంట్రుకలు (6) శాంతి పుష్టులు మలమూత్రములు, వర్ణములు పాదములు వాటిపై నిలిచి ఉంది. పదక్రమ జటఘనములతో, లోకాలను బ్రతికిస్తోంది. (7) ఓ పుత్రక! స్వాహాకార స్వధాకారములు, పషట్‌కారము హస్తకారము అట్లాగే ఇతరమైనది ఆమె నాలుగు చనుమొనలు (స్తనములు) (8) స్వాహాకారస్తనమును దేవతలు. పితరులు స్వధాకారమును మునులు పషట్‌కారమును అట్లాగే దేవభూతసురేశ్వరులు (9) హస్తకారమును మనుష్యులు ఎల్లప్పుడు ఈ స్తనములను తాగుతున్నారు. ఈ విధముగా ప్రతిరోజు మూడు వేదములను చదివించాల్సిందే. (10) వాటిని నశింపచేసే పురుషుడు అనంత పాపములను చేసినవాడౌతాడు. ఆతడు అంధతామిన్రనరకంలో చీకట్లో మునుగుతాడు (11) ఏ మానవుడు ఈ ధేనువును స్వర్గంలోని అమరాదులైన దూడలతో సహ ఉచిత కాలమందు పూజిస్తాడో ఆతడు స్వర్గమునకు తగినవాడౌతాడు. (వెళ్తాడు) (12) అందువల్ల ఓ పుత్ర! మనుష్యుడు, దేవఋషి పితృమానవులను భూతములను ప్రతిరోజు పోషించాలి. తన శరీరాన్ని తాను పోషించుకున్నట్లుగా (13) అందువల్ల స్నానం చేసి శుచియైన దేవ ఋషి పితృతర్పణము చేయాలి (బ్రహ్మ) యజ్ఞం అయ్యాక, నీటితో సకాల మందు చక్కగా తర్పణ చేయాలి. (14) మల్లెపూలతో గంధపుష్పములతో దేవతలను పూజించి మానవుడు పిదప అగ్నితర్పణ చేయాలి. అట్లాగే బలులను ఇవ్వాలి (15) సక్తంచరులైన భూతములకు బలిని ఆకాశం నుండి ఇవ్వాలి. పితరులకు దక్షిణాభిముఖుడై అట్లాగే ఇవ్వాలి (16) గృహస్థుడు, దాని యందు శ్రద్ధ కలవాడై, చక్కగా ఉంచబడిన మనస్సు కలవాడై పిదప నీటిని తీసుకొని వాటియందే అర్పణ సత్కారమును చేయాలి (17) ఆయా దేవతలను పేరుపేరున ఉద్దేశించి వారివారి స్థానములందు (నీరు) ఉంచాలి, ప్రాజ్ఞుడు. ఈవిధముగా బలిని గృహమందు ఇచ్చి, గృహమందు గృహాపతిశుచియై (18) పిదప ఆచమించి ప్రాజ్ఞుడు ద్వార అవలోకనము చేయాలి. (18 1/2)

మూ ||ముహూర్త స్యాష్టమంభాగంఉదీక్షేతాతిథింతతః || 19 ||

అతిధింతత్ర సంప్రాప్తం అర్ఘ్య పాద్యోదకేనచ | ఋభుక్షుమాగతం శ్రాంతం యామానమకించనం || 20 ||

బ్రాహ్మణం ప్రాహురతిధిం సంపూజ్యశక్తితోబుదైః | నవృచ్ఛేతతత్రాచరణం స్వాధ్యాయంచాపిపండితః || 21 ||

శోభనాశోభనాకారం తంమన్యేత ప్రజాపతిం | అనిత్యంహిస్థితోయస్మాత్తస్మాదతిథిరుచ్యతే || 22 ||

తసై#్మదత్వాతుయోభుంక్తే సతుభు క్తేమృతంసరః | అతిధిర్యన్యభగ్నాశోగృహాత్‌ ప్రతినివర్తతే

సదాత్వాదుష్కృతం తసై#్మ పుణ్యమాదాయగచ్ఛతి || 23 ||

అపివాశాకదానేన యద్వాతోయప్రదానతః | పూజయేత్తం నరఃశక్త్యాతేనైనాతోవిముచ్యతే || 24 ||

యధిష్ఠిర ఉవాచ -

వివాహా బ్రాహ్మదైవార్షాః ప్రాజాపత్యాసురౌతథా | గాంధర్వో రాక్షసశ్చాపి పైశాచోష్టమ ఉచ్యతే || 25 ||

ఏతేషాం చవిధింబ్రూహితథాకార్యంచ తత్వతః | గృహస్థానాంతథా ధర్మాన్‌ బ్రూహిమేత్వం విశేషత: || 26 ||

పరాశర ఉవాచ -

సబ్రాహ్మో పరమాహూయ యత్రకన్యాస్వలంకృతా | దీయతే తత్సుతః పూయాత్‌ పురుషానేక వింశతిః || 27 ||

యజ్ఞస్థాయర్త్విజే దైవః తజ్జః పాతిచతుర్దశ | వరాదాదాయ గోద్వంద్వంమార్షస్తజ్జః పునాతిషట్‌ || 28 ||

సహోభౌచరతాం ధర్మం ప్రాజాపత్యః సఈరితః | పరవధ్వోః స్వేచ్ఛయాచగాంధర్వోన్యోన్యమైత్రతః

ప్రసహ్యకన్యాహరణాద్రాక్షసోనిందితః సతాం || 29 ||

ఛలేన కన్యాహరణాత్‌ పైశాచోగర్హితోష్టమః | ప్రాయఃక్షత్రవిశోరుక్తా గాంధర్వానురరాక్షసాః || 30 ||

అష్టమస్త్వేషపాపిష్టః పాపిష్ఠానాంచసంభవః | సవర్ణయాకరోగ్రాహ్యఃధార్యః క్షుత్రియయాశరః || 31 ||

ప్రతోదోవైశ్యయాధార్యోవాసోంతఃశూద్రయాతథా | అసవర్ణాస్వేషవిధిః స్మృతౌదృష్టశ్చ వేదనే || 32 ||

సవర్ణాభిస్తు సర్వాభిః పాణిర్‌గ్రాహ్యస్త్వయంవిధిః | ధర్మ్యేవివాహేజాయంతే ధర్మ్యాఃపుత్రాఃశతాయుషః || 33 ||

అధర్మ్యాద్ధర్మరహితా మందభాగ్యధనాయుషః | కృతకాలాభిగమనే ధర్మోయం గృహిణః పరః || 34 ||

స్త్రీణాం పరమనుస్మృత్య యధాకామ్యథవాభ##వేత్‌ | దివాభిగమనం పుంసాం అనాయుష్యం పరంమతం || 35 ||

శ్రాద్ధాహః సర్వపర్వాణి సగంతవ్యానిధీమతా | తత్రగచ్ఛన్‌స్త్రియం మోహాత్‌ ధర్మాత్‌ ప్రచ్యపతే పరాత్‌ || 36 ||

ఋతుకాలాభిగామీయః స్వదారనిరతశ్చయః | సనదాబ్రహ్మచారీహివిజ్ఞేయః సగృహాశ్రమీ || 37 ||

తా || పిదప ముహూర్తకాలములో ఎనిమిదవ భాగ సమయం వరకు (ముహూర్తం = 48 నిమిషాలు) అతిథి కొరకు ఎదురు చూడాలి) (19) అక్కడికి వచ్చిన అతిథిని అర్ఘ్య పాద్య ఉదకంతో పూజించాలి. ఆకలి గొన్నవాడు, వచ్చినవాడు, శ్రాంతుడు యాచిస్తున్నవాడు, అకించనుడు (20) ఐన బ్రాహ్మణుని అతిథి అని అనాలి. బుధుడు శక్తి కొలది ఆతనిని పూజించాలి. పండితుడు, అతడి ఆచారాన్ని గూర్చి అడగొద్దు. వేదాధ్యయనమును గూర్చి అడగొద్దు (21) అందమైన ఆకారమున్నా అనాకారియై ఆతణ్ణి ప్రజాపతి అని భావించాలి. ఆతని స్థితి అనిత్యము (నిత్యంకాదు). అట్లా ఉంటాడు కాబట్టే అతనిని అతిథి అంటాడు (22) అతనికి పెట్టి తినే నరుడు, అమృతం తింటున్నాడు. ఎవని ఇంటి నుండి అతిథి ఆశలు భగ్నమై మరల పోతాడో (23) అతడు దుష్కృత్యమును ఇంటి వానికి ఇచ్చి, పుణ్యమును తీసుకొని వెళ్తున్నాడు. శాకదానం ఇచ్చో నీటిని ఇచ్చో అతనిని నరుడు శక్తికొలది పూజించాలి. దానితోనే దాని నుండి ముక్తుడౌతాడు (24) యుధిష్ఠిరుని వచనము - వివాహములు, బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని ఎనిమిది విధములు (25) వీటి విధానమును చెప్పండి. అట్లాగే చేయాల్సింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. అట్లాగే గృహస్థుల ధర్మములను నాకు మీరు విశేషించి చెప్పండి, అని అనగా (26) పరాశరుని వచనము - బ్రహ్మవివాహమనగా - వరుని పిలిచి, కన్యనలంకరించి ఇవ్వటం. ఆతని పుత్రుడు ఇరువది ఒక్క తరముల పురుషులను పవిత్రులను చేస్తాడు. (27) దైవ వివాహమనగా - యజ్ఞమందున్న ఋత్విజునకు కన్య నిచ్చుట. ఆతని పుత్రుడు పదునాల్గు తరముల వారిని పవిత్రులను చేస్తాడు. ఆర్షమనగా వరుని దగ్గర రెండు ఆవులను తీసుకొని కన్య నిచ్చుట. ఆతడి పుత్రుడు ఆరుతరముల వారిని పవిత్రులచేస్తాడు (28) ప్రాజాపత్యమనగా, ఇద్దరు కలిసి ధర్మమును ఆచరించుట. వరుడు వధువు తమ ఇష్టపూర్వకముగా పరస్పరం మిత్రభావంతో వివాహమాడుట గాంధర్వము. రాక్షస మనగా బలవంతముగా కన్యనెత్తుకొని పోవుట. సజ్జనులు దీనిని నిందించారు. (29) మోసంతో కన్యను హరించుట పైశాచము. దీనిని నిందించారు. ఇది ఎనిమిదివది. తరుచుగా క్షత్రియులకు వైశ్యులకు గాంధర్వ అసుర రాక్షస వివాహములు చెప్పబడ్డాయి. (30) ఈ ఎనిమిదవది పాపిష్టమైనది. పాపిష్ఠులకు సంభవమైనది. సవర్ణమైన స్త్రీతో వివాహంలోచేతిని గ్రహించాలి. శరమును క్షత్రియ స్త్రీతో ధరించాలి. (కత్తికి వివాహాం) (31) మునుగోల (గుఱ్ఱాన్ని కొట్టేది)ను వైశ్య స్త్రీతో ధరించాలి. వస్త్రపు చివరిభాగమును శూద్రస్త్రీతో ధరించాలి. అసవర్ణులైన స్త్రీలతో వివాహం అయ్యే సందర్భంలో పైది విధించబడింది. వివాహ సందర్భంలో స్మృతులందు చూడబడింది ఇది (32) అన్ని వర్గముల వారు సవర్ణులతో వివాహంతో పాణినే (చేతినే) గ్రహించాలి. ఇది విధి. ధర్మ్యమైన వివాహమందు, నూరు సంవత్సరాల ఆయుస్సుగల ధర్మ్యమైన పుత్రులు జన్మిస్తారు. (33) అధర్మ్యం వలన ధర్మరహితులైన మందభాగ్యులు, ధనము, ఆయుస్సులేని వారు పుడ్తారు. కాలమును గమనించి భార్యను చేరటం అనేది గృహస్థుల యొక్క ఉత్తమ ధర్మము (34) లేదా స్త్రీల కోరిక ననుసరించి పొందాలి. లేదా కామము కల్గిన రీతిలో పొందాలి. పురుషుడు పగటిపూట స్త్రీని పొందుట మిక్కిలి ఆయుఃక్షీణకరమని అన్నారు (35) బుద్ధిమంతుడు శ్రాద్ధపు దినమందు అన్ని పర్వదినములలో భార్యను పొందరాదు. అట్లా మోహం వల్ల స్త్రీని పొందితే ఉత్తమమైన ధర్మము నుండి చ్యుతుడౌతాడు. (36) ఋతుకాలంలో మాత్రమే భార్యను పొందేవాడు, తన భార్యను మాత్రమే పొందేవాడు, వాడు ఎల్లప్పుడు బ్రహ్మచారి అని గ్రహించాలి. అతడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నిజంగా (37)

మూ|| అర్షేవివాహ గోద్వంద్వం యదుక్తం తత్రశస్యతే | శుల్క మణ్వపికన్యాయాః కన్యావిక్రయ పాపకృత్‌ || 38 ||

అపత్యవిక్రయాత్కల్పం వసేత్‌ విట్‌కృమిభోజనే | అతోనాణ్వపికన్యాయాః ఉపజీవ్యం సరైర్ధనం || 39 ||

తత్రతుష్టామహాలక్ష్మీః నివసేద్దానవారిణా | వాణిజ్యం నీచసేవాచ వేదానధ్యనం తథా || 40 ||

కువివాహఃక్రియాలోపః కులేపతనహేతవః | కుర్యాద్వైవాహికేచాగ్నౌ గృహ్యకర్మాన్వహంగృహీ || 41 ||

పంచయజ్ఞక్రియాంచాపివక్తిందైనందినీమపి | గృహస్థాశ్రమిణః పంచసూనాకర్మదినేదినే || 42 ||

కండనీపేషణీచుల్లీహ్యుదకుంభీతుమార్జనీ | తాసాంచపంచసూనానాం నిరాకరణ హేతవః

క్రతవః పంచనిర్దిష్టాః గృహిశ్రేయోభి వర్ధనాః || 43 ||

పఠనం బ్రహ్మయజ్ఞః స్యాత్‌ తర్పణం చపితృక్రతుః హోమోదైవోబలిర్భౌత అతిథ్యం నృక్రతుఃక్రమాత్‌ || 44 ||

వైశ్వదేవాంతరేప్రాప్తః సూర్యోఢోవాతిధిః స్మృతః | అతిథేరాదితోప్యేతేభోజ్యానాత్రవిచారణా || 45 ||

పితృదేవమనుష్యేభ్యోదత్వాశ్నాత్యమృతంగృహీ | అదత్వాన్నంచయోభుంక్తేకేవలం స్వోదరంభరిః || 46 ||

వైశ్వదేవేనయేహీనాః ఆతిధ్యేసవివర్జితాః | సర్వేతేవృషలాజ్ఞేయాః ప్రాప్తవేదాఅపిద్విజాః || 47 ||

అకృత్వావైశ్వదేవంతు భుంజతేయేద్విజాధమాః | ఇహలోకేన్నహీనాఃన్యుఃకాకయోనింప్రజంత్యథో || 48 ||

వేదోక్తం విదితం కర్మనిత్యం కుర్యాదతంద్రితః | యదికుర్యాద్యథాశక్తి ప్రాప్నుయాత్సద్గతింపరాం || 49 ||

షష్ఠ్యష్టమ్యోః వసేత్సావంతైలేమాంసేనదైవహి | చతుర్దశ్యాంపంచదశ్యాం తథైవచక్షురేభ##గే || 50 ||

ఉదయస్తంసవీక్షేతనాస్తంయంతంసమస్తకే | స రాహుణోపస్పృష్టంచ నాండస్థం వీక్షయేద్రవిం || 51 ||

నవీక్షేతాత్మనోరూపమప్నుధావేన్నకర్దమే | సనగ్నాంస్త్రియ మీక్షేతసపనగ్నో జలమావిశేత్‌ || 52 ||

దేవతాయతనం విప్రం ధేనుం మధుమృదంతథా | జాతివృద్ధం వయోవృద్ధం విద్యావృద్ధం తథైవచ || 53 ||

అశ్వత్థంచైత్యవృక్షంచ గురుంజలభృతంఘటం | సిద్ధాన్నం దధిసిద్ధార్థం గచ్ఛన్‌ కుర్యాత్ర్పదక్షిణం || 54 ||

తా || ఆర్ఘవివాహంలో ఆవులు అని ఏది చెప్పామో అది అక్కడ ప్రశస్తమైంది (ఇతరత్రకాదు) కన్య నుండి శుల్కమును ఏ కొంచమూ (అణువు) తీసుకోరాదు. కన్యను విక్రయించే పాపాన్ని చేసినవాడౌతాడు (38) అపత్యమును అమ్మటం వలన కల్పకాలముమల మందలి పురుగులను భుజిస్తూ ఉంటాడు. అందువల్ల నరులు కన్యయొక్క ధనమును అణువైనా తీసుకొని బ్రతుకరాదు (39) అట్టి చోట ఆనందపడి మహాలక్ష్మి దానజలంతో వసిస్తుంది. వాణిజ్యము, నీచసేవ, వేదములను చదువకపోవటం (40) కువివాహము క్రియాలోపము ఇవన్ని కులంలో పతనానికి కారణాలు. వివాహాగ్ని యందు గృహ్యకర్మను ప్రతిరోజు గృహస్థు ఆచరించాలి (41) పంచయజ్ఞ క్రియలను నిత్యం చేసే వంటను చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రతిరోజు పంచసూనకర్మలు చేయాలి (42) రోలు, నూరేరాయి, పొయ్యి, నీటికుండ, చీపురు కట్ట. ఈ ఐదు సూనములన తొలగించే కారణాలుగా ఐదు క్రతువులు చెప్పబడ్డాయి. గృహస్థు యొక్క శ్రేయస్సును పెంచేవి (43) పఠనం బ్రహ్మ యజ్ఞము ఔతుంది. తర్పణము పితృక్రతువుఔతుంది. హోమము దేవయజ్ఞము ఔతుంది భూత బలిభూతయజ్ఞమౌతుంది. అతిథి పూజ నృయజ్ఞమౌతుంది (44) వైశ్వదేవం మధ్యలో వచ్చిన అతిథి, సూర్యుడు తెచ్చిన అతిథి(సాయంకాలపుఅతిథి) అని అంటారు. అతిథికన్న ముందే వీళ్ళు భుజించొచ్చు. ఇందులో సంశయించాల్సింది లేదు (45) పితృదేవ, మనుష్యులకు ఇచ్చాక తింటే గృహస్థు భుజించినట్లు. అన్నాన్ని ఇవ్వకుండా తింటే కేవలము తన ఉదరాన్ని నింపుకునేవాడు (46) వైశ్వదేవం చేయని వారు అతిథ్యాన్ని వదలినవారు, ద్విజులు వేదాలు వచ్చిన వారైనా వారంతా వృషలులు అని గ్రహించాలి (చండాలురు) (47) వైశ్వదేవం చేయకుండా తినే బ్రాహ్మణాధములు, ఈ లోకంలో అన్న హీనులై పిదప కాకియోనిని పొందుతారు. (48) వేదొక్తమైన తెలిసిన కర్మను ప్రతిరోజు, జాగ్రత్తగా చేయాలి. శక్తి కొలది చేస్తే ఉత్తమమైన సద్గతిని పొందుతాడు (49) షష్ఠి అష్టములలో పాపము, నూనె యందు మాంసమందు ఎప్పుడూ ఉంటుంది. చతుర్దశి యందు, పదునైదవదిదనమందు (పంచదశి) (పూర్ణిమఅమావాస్య) కత్తియందు, భగమందు పాపముంటుంది. (50) ఉదయిస్తున్న సూర్యుణ్ణి, అస్తమిస్తున్న సూర్యుణ్ణి, నడినెత్తి సూర్యుణ్ణి చూడరాదు. రాహువు ముట్టిన (గ్రహణంలో) సూర్యుణ్ణి, వృత్తాకారంలో ఉన్న సూర్యుణ్ణి చూడరాదు (51) తన రూపాన్ని నీటిలో చూచుకోరాదు. బురదలో పరుగెత్తరాదు. నగ్నంగా ఉన్న స్త్రీని చూడరాదు. నగ్నంగా ఉండి నీళ్ళలోకి దిగరాదు. (52) దేవాలయము, బ్రాహ్మణుడు, వసంతము, భూమి, ఆవు, వీటిని, జాతి వృద్ధుడు, వయో వృద్ధుడు, విద్యా వృద్ధుడు ఐనవానిని (53) అశ్వత్థము, పవిత్ర స్థలంలో ఉన్న అత్తిచెట్టు, గురువు, నీటితో నిండినకుండ, సిద్ధాన్నము, పెరుగు, సిద్ధార్థుడు, వీరిని చూస్తే వెళ్తూ వెళ్తూనే ప్రదక్షిణం చేసి వెళ్ళాలి (54).

మూ || రజస్వలాం నసేవేత నాశ్నీయాత్‌ సహభార్యయా | ఏకవాసా స భుంజీత, స భుంజీతోత్కటాననే || 55 ||

నాశుచింస్త్రియ మీక్షేతతేజస్కామోద్విజోత్తమః | అనంతర్ప్యపితౄన్‌ దేవాన్‌ నాద్యాదన్నం చకుత్రచిత్‌ || 56 ||

పక్వాన్నంచాపినోమాం సందీర్ఘకాలంజిజీవిషుః | సమూత్రణం ప్రజేకుర్యాత్‌న వల్మీకేసభస్మని || 57 ||

నగర్తేషు సనత్వేషు సతిష్టన్‌స ప్రజన్నపి | బ్రాహ్మణం సూర్యమగ్నించ చంద్రృక్షగురూనపి || 58 ||

అభివశ్యన్నకుర్వీత మలమూత్ర విసర్జనం | ముఖేనో పథమేన్నాగ్ని నగ్నాంనేక్షేతయోషితం || 59 ||

నాంఘ్రీప్రతాపయేదగ్నౌ సవస్తుఅశుచిక్షిపేత్‌ | ప్రాణిహింసాంసకుర్వీతనాశ్నీయాత్‌ సంధ్యయోర్ద్వయోః || 60 ||

న సంవిశేచ్చసంధ్యాయాంప్రాతఃసాయంక్వచిత్‌బుధః | నాచక్షీతధయంతీంగాం నేంద్రచాపంప్రదర్శయేత్‌ || 61 ||

నైకః సుప్యాత్‌ క్వచిత్‌శూన్యే సశయానం ప్రబోధయేత్‌ | పంథానంనైకలోయాయాత్‌ సవార్యంజలినాపిబేత్‌ || 62 ||

నదివోద్ధృతసారంచ భక్షయేద్ధధినోనిశి | స్త్రీ ధర్మిణీం నాభివదేత్‌ నాద్యాదాతృప్తి రాత్రిషు || 63 ||

తౌర్యత్రి కప్రియోనస్యాత్‌ కాంస్యేపాదౌనధావయేత్‌ | శ్రాద్ధం కృత్వాపరశ్రాద్ధయేశ్నీయాత్‌ జ్ఞానవర్జితః || 64 ||

దాతుఃశ్రాద్ధఫలంనాస్తిభోక్తాకిల్బిషభుక్‌భ##వేత్‌ | సధారయేదన్య భుక్తంవానశ్చోపాసహావపి || 65 ||

నభిన్నభాజినే7శ్నీయాత్‌ నాసీతాగ్న్యాదిదూక్షితే | ఆరోహణంగవాం వృష్ఠేప్రేతథూమం సరిత్తటం ||66||

బాలాతపందినాస్వాపం త్యజేద్దీర్ఘం జిజీవిషుః | స్నాత్వాసమార్జయేద్గాత్రం వినృజేన్నశిఖాంపథి || 67 ||

హస్తౌశిరోనధుసుయాత్‌ నాకర్షేదానసంపదా | కరేణ నోమృజేద్గాత్రం స్నాన వస్త్రేణ వాపునః || 68 ||

శునోచ్ఛిష్టం భ##వేద్గాత్రం పునః స్నానేన శుద్ధ్యతి | నోత్పాటయేల్లోమనఖందశ##నేన కదాచన || 69 ||

కరజౌఃకరజచ్ఛేదం వివర్జయేచ్ఛుభాయతు | యదాయత్యాం త్యజేత్తన్నకుర్యాత్కర్మప్రయత్నతః || 70 ||

తా || రజస్వలను సేవించరాదు. భార్యతో కలిసి తినరాదు. ఒంటి వస్త్రముతో తినరాదు. ఎత్తైన ఆసనమందు కూర్చుండి భుజించరాదు (55) అశుచియైన స్త్రీని చూడరాదు, తేజస్కాముడైన ద్విజోత్తముడు. పితరులను దేవతలను సంతృప్తి పరచకుండ ఎక్కడా అన్నము తినరాదు (56) దీర్ఘకాలము జీవించాలని కోరేవాడు పక్వాన్నమును (మాడింది) మాంసమును తినరాదు (అపక్వం తినాలి) మార్గంలో మూత్రం చేయరాదు. పుట్టపైన బూడిదలో కూడా చేయరాదు (57) ప్రాణులున్న పల్లపు ప్రాంతములందు, నిలబడి, వెళ్తూ వెళ్తే మూత్రం చేయరాదు. బ్రాహ్మణుని, సూర్యుని, అగ్నిని, చంద్రుని, నక్షత్రాలను, గురువులను (58) బాగా చూస్తూ మల మూత్రవిసర్జన చేయరాదు. అగ్నిని ముఖంతో ఊదరాదు. స్త్రీని నగ్నంగా ఉన్నదానిని చూడరాదు (59) పాదములను అగ్ని యందు కాపరాదు. వస్తువును అశుచి యందు వేయరాదు. ప్రాణి హింసను చేయరాదు. రెండు సంధ్యాకాలములందు భుజించరాదు (60) ప్రాతః సాయం సంధ్యల యందు బుధుడు ఎక్కడికి వెళ్ళరాదు. పాలు కుడుపుతున్న ఆవును చూడరాదు. ఇంద్ర చాపమును చూపరాదు (61) శూన్యంలో ఒంటరిగా ఎక్కడో ఒంటరిగా నిద్రించరాదు. నిద్రిస్తున్న వాణ్ణి లేపరాదు. ప్రయాణం ఒంటరిగా చేయరాదు. (దారిలో ఒకడే వెళ్ళరాదు). దోసిలితో నీరు త్రాగరాదు. (62) పగలు సారం తీసిన పెరుగును (చల్ల) తినరాదు. రాత్రి పెరుగును తినరాదు. స్త్రీ ధర్మము గల దానికి నమస్కరించరాదు. రాత్రులందు తృప్తి కలిగే వరకు తినరాదు (63) నృత్యగీతవాద్యములందు అతి ప్రేమ పనికిరాదు. కాంస్యపాత్ర యందు కాళ్ళు కడుగరాదు. తాను శ్రాద్ధము చేసి, జ్ఞానం లేనివాడై పరశ్రాద్ధంలో తిన్నవాడు (64) ఐతే దాతకు శ్రాద్ధ ఫలము లేదు. భోక్తపాపమును తిన్నవాడౌతాడు. ఇతరులు వాడే వస్త్రమును, చెప్పులను ధరించరాదు (65) పగిలిన పాత్రలో తినరాదు. అగ్ని మొదలగు వానితో దూషితమైన దానిపై కూర్చోరాదు. గోపృష్ఠ మందు ఎక్కటం, cపేత ధూమము. నదుల ఒడ్డు (66) బాల ఆతపము, పగటి నిద్ర వీటిని దీర్ఘకాలము జీవించదలచిన వాడు వదలాలి. స్నానం చేసి గాత్రమును తోముకోరాదు (కడుగుకొను) శిఖను దారిలో విప్పరాదు (67) చేతులు శిరస్సు కదల్చరాదు. ఆసనమును కాళ్ళతో లాగరాదు. చేతితోగాని స్నానవస్త్రంతో గాని గాత్రాన్ని తుడువరాదు (68) శరీరమును కుక్కనాకితే మళ్ళీ స్నానం చేస్తే శుద్ధమౌతుంది. పండ్లతో ఎప్పుడు గాని వెంట్రుకలు, గోళ్ళు పీకరాదు. (69) శుభము కొరకు గోళ్ళతో గోళ్ళను తీయటం వదలాలి. రాబడి కాలంలో ఒకపనిని వదలాల్సివస్తే ఆ పని ప్రయత్న పూర్వకంగా మళ్ళీ చేయరాదు (70).

మూ || అద్వారేణసగంతవ్యం స్వవేశ్‌ఆపికదాచన | క్రీడాన్నాజ్ఞేః సహాసీతనధర్మఘ్నైః సరోగిభిః || 71 ||

నశయీత క్వచిన్నగ్నః పాణౌ భుంజీతనైవచ | ఆర్ద్ర పాదకరాస్యోశ్నన్‌ దీర్ఘకాలంనజీవతి || 72 |

సంవిశేన్నార్‌ర్దచరణోనోచ్ఛిష్టః క్వచిదావ్రజేత్‌ | శయనస్థోనచాశ్నీయాత్‌ నపిబేచ్చజలంద్విజః || 73 ||

సోపానత్కోనోపవిశేన్నజలంచోత్థితఃపిబేత్‌ | సర్వమావ్లుమయం నాద్యాత్‌ ఆరోగ్యస్యాభిలాషుకః || 74 ||

సనిరీక్షేత విణ్మూత్రేనోచ్ఛిష్టః సంస్పృశేచ్ఛిరః | నాధితిష్ఠేత్తుషాంగార భస్మకేశకపాలికాః || 75 ||

పతితైః సహ సంవాసః పతనాయైవజాయతే | దద్యాదుర్ధ్వాసనం మంచం నశూద్రాయ కదాచన || 76 ||

బ్రాహ్మణ్యాద్ధీయతే విప్రః శూద్రోధర్మాచ్చహీయతే | ధర్మోపదేశః శూద్రాణాం స్వశ్రేయః ప్రతిఘాతయేత్‌ || 77 ||

ద్విజశుశ్రూషణం ధర్మః శూద్రాణాంహిపరోమతః | కండూయనం హిశిరసః పాణిభ్యాం నశుభం మతం || 78 ||

ఆదిశేద్వైదికం మంత్రంస శూద్రాయకదాచన | బ్రాహ్మణ్యాద్ధీయతే విప్రః శూద్రోధర్మాచ్ఛహీయతే || 79 ||

ఆతాడనం కరాభ్యాంచక్రోశనం కేశలుంచనం | అశాస్త్ర వర్తనం భూయోలుబ్థాత్‌ కృత్వాప్రతిగ్రహం || 80 ||

బ్రాహ్మణః సచవైయాతి నరకానేకవింశతిం | అకాలమేఘస్తనితేవర్షర్తౌపాంసువర్షణ || 81 ||

మహాబాలధ్వనౌరాత్రావనధ్యాయాః ప్రకీర్తితాః | ఉల్కాపాతేచ భూకంపే దిగ్దాహ మధ్యరాత్రిషు || 82 ||

సంధ్యయోః వృషలోపాన్తే రాజ్యహారేచ సూతకే | దశాష్టకాసుబూతాయాం శ్రాద్ధాహప్రతిపద్యపి || 83 ||

పూర్ణిమాయాం తథాష్టమ్యాం విడ్వరేరాష్ట్ర విప్లవే | ఉపాకర్మణి చోత్సర్గే కల్పాదిషు యుగాదిషు || 84 ||

అరణ్యకమధీత్యాపి బాణసాభ్రోరపిధ్వనౌ | అసధ్యాయేషుచైతేషు చాధీయీత న వైక్వచిత్‌ || 85 ||

భూతాష్టమ్యోః పంచదశ్యోః బ్రహ్మచారీసదాభ##వేత్‌ | అనాయుష్యకరంచేహ వరదారోపసర్పణం

తస్మాత్తద్దూరతః త్యాజ్యం వైరిణాం చోపసేవనం || 86 ||

తా ||తన ఇంటికైన దొడ్డి దారి గుండా ఎప్పుడూ ప్రవేశించరాదు. ఆట తెలియని వారితో ఆడరాదు. ధర్మాన్ని చెడగొట్టే వారితో కలిసి కూచోరాదు. రోగులతో కలిసి కూచోరాదు (71) ఎక్కడా నగ్నంగా పడుకోరాదు. చేతిలో భుజించరాదు. తడిసిన పాదములు చేతులు ముఖము కలిగి భుజిస్తే ఆతడు ఎక్కువ కాలము జీవించడు (72) తడిసిన పాదాలతో నిద్ర పోరాదు. ఎంగిలితో ఎక్కడికి కదలరాదు. పడకలో భుజించరాదు, బ్రాహ్మణుడు పడకలో నీరు కూడా తాగరాదు (73) చెప్పులతో కూర్చోరాదు నిల్చొని నీరు తాగరాదు. అంతా పులుసుతో తినరాదు. ఆరోగ్యం కావాలనుకునే వారు (74) మలమూత్రముల చూడరాదు. ఎంగిలితో శిరస్సును తాకరాదు. ఉముక, నిప్పుకణికలు, బూడిద, వెంట్రుకలు, పుఱ్ఱలు వీటిచోట అదిష్ఠించి ఉండరాదు (75) పతితులతో సహవాసము పతనము కొరకే ఔతుంది. శూద్రునకు ఎత్తైన ఆసనాన్ని మంచమును ఎప్పుడూ ఇవ్వరాదు (76) ఇస్తే బ్రాహ్మణుడు బ్రాహ్మణ్యము నుండి హీనుడైపోతాడు. శూద్రుడు ధర్మము నుండి హీనుడై పోతాడు. శూద్రులకు ధర్మోపదేశం చేస్తే అది తన శ్రేయస్సునే నశింపచేస్తుంది (77) శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూష పరమధర్మమన్నారు. తలను చేతులతో గోక్కోవటము మంచిదికాదు (78) శూద్రునకు వైదికమంత్రాన్ని ఎప్పుడూ బోధించరాదు. విప్రుడు బ్రాహ్మణ్యము నుండి, శూద్రుడు ధర్మమునుండి హీనులౌతారు. అట్లాచేస్తే (79) చేతులతో కొట్టటం (చప్పట్లు) ఎడవటము, వెంట్రుకలు తెంపటము (ఇవన్నీ అకారణంగా చేయటం), శాస్త్రమున0కు భిన్నంగా నడవటం మాటి మాటికి, లుబ్థుని నుండి దానం తీసుకోవటం (80) ఇవన్నీ చేసే బ్రాహ్మణుడు ఇరువది ఒక్క నరకములకు పోతాడు. అకాల మేఘ గర్జనము, వర్షృతువు యందు దుమ్ము వర్షించటము (81) రాత్రిపూట మహాబాల ధ్వనులు (లేదా సుడిగాలి) వీటిని అసధ్యాయముగా గమనించాలి. తోకచుక్క పడటము, భూకంపము, మధ్యరాత్రులలో దిక్కులు తగలబడటము (82) సంధ్యలు, వృషలుడు సమీపమందు ఉండటము, రాజ్యము పోవుట, సూతకము పది అష్టకములు (పూర్ణిమతరు వాతి సప్తమి, అష్టమి, నవములు, అష్టకములు ) బహుళ చతుర్దశి, శ్రాద్ధదినము, ప్రతి పద (83) పూర్ణిమ, అష్టమి, విటశ్రేష్ఠుడు, రాష్ట్రవిప్లవము, ఉపాకర్మ, ఉత్సర్గము, కల్పాదులు, యుగాదులు. (వేదములు చదవటంను మానటం. ఇది ఆరునెలలకొక సారి చేస్తారు. అదే ఉత్సర్గము) (84) అరణ్యకములు చదువుట ఐనాక, బాణముల ధ్వని విన్నాక, సాభ్రముల ధ్వని విన్నాక (తూర్పునందలి ఆడ ఏనుగ) ఇవన్నీ పైవి అసధ్యాయ దినములు ఈ అసధ్యాయ దినములందు ఏ కొంచెము, ఎక్కడా చదువరాదు (85) బహుళ చతుర్దశి, అష్టమి, పంచదశి (పూర్ణిమ, అమావాస్యలు) ఈ రోజులలో ఎప్పుడు బ్రహ్మచారిగా ఉండాలి. ఇతరుల భార్యను పొందుట ఆయుష్యము లేకుండా చేస్తుంది. అందువల్ల దానిని దూరంగానే వదలాలి. వైరిసేవను కూడా వదలాలి (86).

మూ || పూర్వర్ధిభిఃపరిత్యక్తమాత్మానంనావమానయేత్‌ | సదోద్యమవతాంయస్మాత్‌ శ్రియోవిద్యాఃసదుర్లభాః || 87 ||

సత్యంబ్రూయాత్‌ప్రియంబ్రూయాత్‌సత్యమప్రియం | ప్రియంచనానృతంబ్రూయాత్‌ఏషధర్మోవిధీయతే || 88 ||

వాచోవేగం మనోవేగంజిహ్మావేగంచవర్ణయేత్‌ | గుహ్యజాస్యపిలోమానితత్‌స్సర్శాదశుచిర్భవేత్‌ || 89 ||

పాదధౌతోదకం మూత్రముచ్ఛిష్టాన్యుదకానిచ | నిష్ఠీవనంచ శ్లేష్మాణం గృహాద్దూరం వినిక్షిపేత్‌ || 90 ||

అహర్నిశంశ్రుతే ర్ణాస్యాత్‌ శౌచాచారనిషేవణాత్‌ | అద్రోహ పత్యాబుద్ధ్యాచ పూర్వజన్మస్మరేద్ద్విజః || 91 ||

వృద్ధాన్ర్పయత్నాద్వం దేతదద్యాత్తేషాం స్వమాసనం | ఇనమ్ర కంధరోభూయాత్‌ అసూయాయాత్తతశ్చతాన్‌ || 92 ||

శ్రుతిభూదేవదేవానాంనృపసాధుతపస్వినాం | పతివ్రతానాం వారీణాం విందాంకుర్యాన్నకర్హిచిత్‌ || 93 ||

ఉద్ధృత్య పంచమృత్పిండాన్‌ స్నాయాత్పరజలాశ##యే | శ్రద్ధయాపాత్రమాసాద్యయత్కించిద్దీయతేవను || 94 ||

దేశేకాలేచవిధివాతదా సం త్యాయకల్పతే | భూప్రదోమండలాధీశః సర్వత్రసుభితోన్నదః || 95 ||

తోయదాతాసురూపఃస్యాత్‌ పుష్టశ్చాన్న ప్రదోభ##వేత్‌ | ప్రదీపదోనిర్మలాక్షోగోదాతార్యసులోకభాక్‌ || 96 ||

స్వర్ణదాతాచ దీర్ఘాయుః తిలదః స్యాచ్చసుప్రజః | వేశ్మదోత్యుచ్చసౌధేశో వస్త్రదశ్చంద్రలోకభాక్‌ || 97 ||

హయప్రదోదివ్యదేహో లక్ష్మివాన్‌ వృషభప్రదః సుభార్యః శిబికాదాతా సుపర్యం కప్రదోపిచ || 98 ||

శ్రద్ధయాప్రతిగృహ్ణాతి శ్రద్ధయాయః ప్రయచ్ఛతి | స్వర్గిణౌతాపుభౌస్యాతాం పతతోశ్రద్ధయాత్వధః || 99 ||

ఆనృతేసక్షరేద్యజ్ఞః తపోవిస్యయతఃక్షరేత్‌ | క్షరేత్కీర్తిర్వినా దానమాయుర్విప్రాపమానతః || 100 ||

గంధం పుష్పంకుశాగావఃశాకంమాంసంపయోదధి | మణిమత్స్యగృహంధాన్యం గ్రాహ్యమే తదుపస్థితం || 101 ||

మధూదకం ఫలంమూలమేధాంస్యభయదక్షిణా | అభ్యుద్యతానిగ్రాహ్యాణి త్వేతాన్యపినికృష్టతః || 102 ||

దాననాపితగోపాలకులమిత్రార్థసీరిణః | భోజ్యాన్నాః శూద్రవర్గేమీతథాత్మవినివేదకః || 103||

ఇత్థమాచార ధర్మోయం ధర్మారణ్య నివాసినాం | శ్రుతిస్మృత్యుక్తధర్మోయం యుధిష్ఠిర నివేదితః || 104 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మాణ్య మాహాత్మ్యే సదాచార లక్షణ వర్ణనం నావషష్టోధ్యాయః || 6 ||

తా || పూర్వీకులతో వదులబడిన తనను అవమాననపరుచుకోరాదు. ఎప్పుడూ ఉద్యమించేవానికి శ్రీ, విద్యలు దుర్లభములుకావు. (లభిస్తాయి) (87) సత్యం పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలుకరాదు. ప్రియమైన అబద్ధాన్ని పలుకరాదు. ఇది ధర్మముగా విధించబడింది (88) వాగ్వేగమును, మనోవేగమును, నాలుకవేగమును విడిచి పెట్టాలి. రహస్యంగా ఉండేవెంట్రుకలనైనా, వాటిని ముడ్తే అశుచి¸°తాడు (89) కాళ్ళు కడిగిన నీరు, మూత్రము, ఎగింలి నీరు, ఉమ్మి, శ్లేష్మ రోగి వీరిని గృహానికి దూరంగా పారవేయాలి (90) రాత్రింబగళ్ళు శ్రుతులను జపించటమువలన, శుచి ఆచారములను ఆచరించుటవలన, ద్రోహంలేని బుద్ధితోను బ్రాహ్మణుడు పూర్వజన్మను స్మరించాలి. (చవచ్చు) (91) ప్రయత్న పూర్వకముగా పెద్దలకు నమస్కరించాలి. వారికి తన ఆసనమును ఇవ్వాలి. వినయంతో భుజములు వంచి నిలబడాలి. పిదప వారిని అనుసరించాలి. (92) వేదములు, బ్రాహ్మణులు, దేవతలు, రాజు, సాధుజనులు, తపస్వులు, పతివ్రతాస్త్రీలు వీరలను ఎప్పుడూ నిందించరాదు (93) ఐదు మట్టి పిండములను (ముద్దలు) తీసుకొని, ఇతరుల జలాశయములందు స్నానం చేయాలి. శ్రద్ధతో, యోగ్యుని చేరి ఆతనికి ఏదో కొంచము ధనమును (94) శాస్త్ర ప్రకారము దేశకాలములందు ఇస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది. భూదానం చేసేవాడు మండలాధీశుడౌతాడు. అన్నం పెట్టే వాడు అంతటా సుఖంగా ఉంటాడు (95) నీరు దానం చేసేవాడు మంచి రూపం గలవాడౌతాడు. అన్నం ఎక్కువగా ఇచ్చేవాడు ఆరోగ్యవంతుడౌతాడు. దీపం దానం చేసేవాడు నిర్మలమైన కళ్ళు గలవాడౌతాడు. గోదానం చేసేవాడు సూర్యలోకానికి వెళ్తాడు (96) బంగారం దానం చేసేవాడు దీర్ఘాయుష్మంతుడౌతాడు నువ్వులు దానం చేసేవాడు మంచి సంతానవంతుడౌతాడు. గృహం దానంచేసేవాడు, చాలా పెద్ద భవనంనకు ప్రభువౌతాడు. వస్త్రదానం చేసేవాడు చంద్రలోకానికి వెళ్తాడు (97) గుఱ్ఱము దానం చేసేవాడు దివ్యమైన దేహం కలవాడౌతాడు. వృషభమును ఇచ్చేవాడు లక్ష్మీవంతుడౌతాడు. పల్లకి దానం చేసేవాడు మంచి భార్యకలవాడౌతాడు. మంచి పర్యంకమునిచ్చేవాడు కూడా సుభార్యుడౌతాడు (98) శ్రద్ధతో స్వీకరించేవాడు శ్రద్ధతో ఇచ్చేవాడు వీరిద్దరు స్వర్గానికి వెళ్తారు. అశ్రద్ధకలవారు అధఃపతితులౌతారు. (99) అబద్ధం వల్ల యజ్ఞము నాశనమౌతుంది. ఆశ్చర్యం వల్ల తపస్సు నాశనంమౌతుంది. దానం లేకపోతే కీర్తి నశిస్తుంది. బ్రాహ్మణులను అవమానం చేస్తే ఆయుస్సు నశిస్తుంది. (100) గంధము, పుష్పము, దర్భలు, ఆవుల, శాకము, మాంసము, పాలు,పెరుగు, మణులు, చేపలు, ఇల్లు, ధాన్యము వీనిని వచ్చిన దానిని (లభిస్తే) స్వీకరించాలి. (101) తేనె, నీరు, పండు, గడ్డలు, కట్టెలు, అభయము, దక్షిణ వీటిని గూడ ని కృష్ణుని నుండి వచ్చిన వానిని గ్రహించాలి (102) దాసుడు, మంగలి, గోపాలుడు, కులమిత్రుడు, వ్యవసాయంచేసే రైతు, వీరు శూద్రవర్గంవారైనా వీరికి భోజనం పెట్టాలి. అట్లాగే తన ఆత్మను నివేదించుకునే వానికి భోజనం పెట్టాలి (103) ఈ విధముగా ఈ ఆచార ధర్మము ధర్మారణ్యనివాసులకు చెప్పబడింది. శ్రుతిస్మృతులలో చెప్పబడిన ఈ ధర్మము యుధిష్ఠురునకు చెప్పబడింది. (104) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు సదాచార లక్షణ వర్ణన మనునది ఆరవ అధ్యాయము || 6 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters