Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏడవ అధ్యాయము

మూ || వ్యాసఉవాచ -

సంప్రాప్యధర్మవాస్యాంచయః కుర్యాత్‌ పితృతర్పణం | తృప్తిం ప్రయాతిం పితరోయాపదింద్రాశ్చతుర్దశ || 1 ||

పితరశ్చాత్రపూజ్యాశ్చ స్వర్గతాయేచ పూర్వజాః | పిండాంశ్చనిర్వపేత్తేషాం ప్రాప్యేమాం ముక్తిదాయికాం || 2 ||

త్రేతాయాం పంచదివసైః ద్వాపరేత్రిదినేనతు | ఏకచిత్తేన యోవిప్రాః పిండం దద్యాత్కలౌయుగే || 3 ||

లోలుపామానవాలోకేసంప్రాప్తేతుకలౌయుగే | పరదారరతాఃలోకాఃస్త్రియోతిచపలాఃపునః || 4 ||

వరద్రోహరతాః సర్వేపరనారీ నపుంసకాః | పరనిందాపరానిత్యం పరచ్ఛిద్రోపదర్శకాః || 5 ||

పరోద్వేగకరాసూనం కలహామిత్రభేదినః | సర్వేతేశుద్ధతాం యాంతి కాజేశాః స్వయమబ్రువన్‌ || 6 ||

ఏతదుక్తం మహాభాగధర్మారణ్యస్యవర్ణనం | ఫలంచైవాత్రసర్వంహియదుక్తం శూలపాణినా || 7 ||

వాఙ్మనః కాయశుద్ధాశ్చ పరదారపరాఙ్‌ముఖాః | అద్రోహాశ్చసమాః క్రుద్ధాః మాతాపితృపరాయణాః || 8 ||

అతౌల్యాలోభరహితాః దానధర్మపరాయణాః | అస్తికాశ్చైవ ధర్మజ్ఞాః స్వామి భక్తిరతాశ్చయే || 9 ||

పతివ్రతాతుయానారీ పతిశుశ్రూషణరతా | అహింసకాః అతిథేయాః స్వధర్మనిరతాః సదా || 10 ||

శౌనక ఉవాచ -

శృణుసూతమహాభాగ సర్వధర్మవిదాంపర | గృహస్థానాం సదాచారః శ్రుతశ్చ త్వన్ముఖాస్మయా || 11 ||

ఏకం మనేప్సితం మేద్యతత్కథయస్వసూతజ | పతివ్రతానాం సర్వాసాం లక్షణం కీదృశం వద || 12 ||

సూత ఉవాచ -

పతివ్రతాగృహయస్య సఫలం తస్య జీవనం | యస్యాంగచ్ఛాయ యాతుల్యాయత్కథాపుణ్యకారిణీ || 13 ||

పతివ్రతాస్త్వరుంధత్యాసావిత్ర్యావ్యనసూయయా | శాండిల్యాచైవసత్యాచ లక్ష్మ్చాచ శతరూపయా || 14 ||

మేనయాచసునీత్యాచ సంజ్ఞయా స్వాహయాసమాః | పతివ్రతానాం ధర్మాహిమునినాచ ప్రకీర్తితాః || 15 ||

భుంక్తేభుక్తే స్వామినిచ తిష్ఠతి త్వనుతిష్ఠతి | వినిద్రితేయానిద్రాతి ప్రథమం పరిబుధ్యతి || 16 ||

అనలంకృతమాత్మానం దేశాంతే భర్తరిస్థితే | కార్యార్థం ప్రోషితే క్వాపి సర్వమండలసవర్జితా || 17 ||

భర్తుర్నామనగృహ్ణాతి హ్యాయుషోన్యహివృద్ధయే | పురుషాంతరనామాపి నగృహ్ణాతి కదాచన || 18 ||

తా || వ్యాసుని వచనము - ధర్మవాపికి వచ్చి పితృతర్పణము చేసిన వాని పితరులు పదునాలుగురు ఇంద్రులున్నంతకాలము తృప్తిని పొందుతారు (1) ఇక్కడ ఉన్న పితరులు పూజ్యులు స్వర్గానికి వెళ్ళిన పూర్వజులు పూజించతగినవారు. ముక్తినిచ్చే ఈ ధర్మవాపికి వచ్చి వారికి పిండములను ఇవ్వాలి (2) త్రేతాయుగమందు ఐదుదినములు, ద్వాపరమందు మూడు రోజులు, కలియుగమంద ఏకాగ్రచిత్తంతో బ్రాహ్మణులు పిండదానము చేయాలి (3) కలియుగంవస్తే మానవులు, లోకంలో లోలుపులౌతారు. లోకులు పరదారరతులౌతారు. ఆడవారు అతిచపలులౌతారు (4) అందరు పరద్రోహమందాసక్తి చూపుతారు, నరులు స్త్రీలు, నపుంసకులు అందరూ ఎప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటారు. ఇతరుల తప్పులను ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు. (5) ఇతరులను ఉద్వేగ పరుస్తుంటారు. తగాదాలు పెడ్తారు. మిత్రభేదమాచరిస్తారు. వారందరు ఇక్కడ శుద్ధిని పొందుతారు. కాజేశులు స్వయంగా చెప్పారు (6) ఓ మహాభాగ! ధర్మారణ్య వర్ణనను దీనిని మీకు చెప్పాను. శూలపాణి ఇక్కడ చెప్పిన ఫలాన్నంతా చెప్పాను. (7) వాక్‌ మనః కాయశుద్ధులౌతారు. పరదారవరాఙ్‌ ముఖులౌతారు. ద్రోహబుద్ధి లేని వారౌతారు. (కుద్ధులు సమస్వభావులౌతారు. మాతా పితృవరాయణులౌతారు (8) లౌల్యం లేని వారు, లోభరహితులు, దాన ధర్మపరాయణులౌతారు. ఆస్తికులు, ధర్మజ్ఞులు, స్వామిభక్తి కలవారౌతారు (9) పతివ్రతయైన స్త్రీ పతి శుశ్రూషకలదౌతుంది. అహింసకులు, అతిథిమర్యాదపరులు స్వధర్మనిరతులు ఔతారు (10) శౌనకుని వచనము - ఓ మహాభాగ! సర్వధర్మ విదులలో శ్రేష్ఠుడ! సూతవిను. నీవు చెప్పగా నేను గృహస్థుల సదాచారమును గూర్చి విన్నాను. (11) ఓ సూతజ! నా కోరిక ఒకటుంది. నాకీవేళ దానని చెప్పండి. పతివ్రతలందరి లక్షణములేవో నాకు చెప్పండి. అనగా (12) సూతుడిట్లన్నాడు. - గృహంలో పతివ్రత కలవాని జీవనము సఫలమైంది. ఆమె కథ ఆమె అంగ ఛాయవలె పుణ్యము కల్గించేది, దానితో సమానమైంది (13) పతివ్రతలు, అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిలి, సతి, లక్ష్మి, శతరూప (14) మేన, సువీతి, సంజ్ఞ, స్వాహా, వీరితో సమానమౌతారు. పతివ్రతల ధర్మములు ముని కీర్తించాడు (15) భర్త తింటే తాను తింటుంది. ఆతడు నిల్చుంటే తాను నిల్చుంటుంది. ఆతడు నిద్రిస్తే తాను నిద్రిస్తుంది. ఆతని కన్న తొలుతే మేల్కొంటుంది. (16) భర్తదేశాంతరమందుంటే తనను అలంకరించుకోదు. పనిమీద భర్తదేశాంతరగుతుడైతే అలంకార ములన్నీ తీసేస్తుంది (17) అతని ఆయుస్సు వృద్ధి చెందే కొరకు భర్త పేరును ఉచ్చరించదు. ఎప్పుడుకూడా పరపరుషుని పేరు ఉచ్ఛరించదు (18).

మూ|| ఆ కృష్టాపిచ నాక్రోశేత్‌ తాడితాపి ప్రసీదతి | ఇదంకురుకృతం స్వామిన్‌ మనయతామితివక్తిచ || 19 ||

అహూతాగృహకార్యాణి త్యక్త్వాగచ్ఛతి సత్వరం | కిమర్థం వ్యాహృతానాథ నప్రసాదోవిధీయతాం || 20 ||

సచిరం తిష్ఠతి ద్వారి సద్వారమువసేవతే | అతా తవ్యం స్వయం కించిత్‌ కర్హిచిన్నదదాత్యపి || 21 ||

పూజోపకరణం సర్వమనుక్తాసాధయేత్స్వయం | నియమోదక బర్హీంషియత్రపుష్పాక్ష తాదికం || 22 ||

ప్రతీక్షమాణాచవరం యథాకాలోచితం హియత్‌ | తదుపస్థాపయేత్సర్వం అనుద్విగ్నాతిహృష్టవత్‌ || 23 ||

సేవతే భర్తురచ్ఛిష్టమిష్టమన్నం ఫలాదికం | దూరతో వర్జయే దేషా సమాజోత్సపదర్శనం || 24 ||

సగచ్ఛేత్తీర్థయాత్రాది వివాహప్రేక్షణా దిషు | సుఖసుప్తం సుఖాసీనం రమమాణం యదృచ్ఛయా || 25 ||

అంతరాయేపి కార్యేషు పతింనోత్థాపయేత్క్వచిత్‌ | స్త్రీ ధర్మిణీ త్రిరాత్రంతు స్వముఖంనైవదర్శయేత్‌ || 26 ||

స్వవాక్యం శ్రావయేన్నాపియావత్‌ స్నాత్వానశుద్ధ్యతి | సుస్నాతా భర్తృపదన మీక్షేతాస్యస్యన క్వచిత్‌

అథవామనసిధ్యాత్వా పతింభానుం విలోకయేత్‌ || 27 ||

హరిద్రాం కుంకుమం చైవ సింధూరం కజ్జలంతథా | కూర్పాసకంచతాంబూలంమాంగల్యాభరణంశుభం || 28 ||

కేశసంస్కార కంచైవ కరకర్ణాది భూషణం | భర్తురాయుష్యమిచ్ఛంతి దూరయేన్న పతివ్రతా || 29 ||

భర్తృవిద్వేషిణీం నారీం నైషా సంభాషతే క్వచిత్‌ | నైకాకినీక్వచిద్భూయాన్ననగ్నాస్నాతిచక్వచిత్‌ || 30 ||

నోలూఖలేనమునలేన వర్ధన్యాం దృషద్యపి | నయంత్రకేన దేహల్యాం సతిచోపవిశేత్క్వచిత్‌ || 31 ||

వినావ్యవాయసమయాత్‌ ప్రాగల్భ్యం సక్వచిచ్చరేత్‌ | యత్రయత్ర రుచిర్బర్తుః తత్రప్రేమవతీసదా || 32 ||

ఇదమేవవ్రతం స్త్రీణాం అయమేవ పరోవృషః ఇయమే వచ పూజాచ భర్తుర్వాక్యం నలంఘయేత్‌ || 33 ||

క్లీబం వాదురవస్థం వా వ్యాధితం వృద్ధమేవవా | సుస్థిరం దుఃస్థిరం వాపి పతిమే కం నలంఘయేత్‌ || 34 ||

సర్పిర్లవణ హింగ్వాది క్షయేపిచ పతివ్రతా | పతిం నాస్తీతిన బ్రూయాదాయసీషు న భోజయేత్‌ || 35 ||

తీర్థస్నానార్థినీచైవ పతిపాదోదకం పిబేత్‌ | శంకరా దపివావిష్టోః పతిరేవాధికః స్త్రియః || 36 ||

తా || ఆకర్షించి నా (లాగినా) ఏడవదు. కొట్టినా ప్రసన్నంగా ఉంటుంది. ఇది చేయి అంటే చేవాను. స్వామి అని అంటుంది. ఐ పోయిందే అనుకోండి చెప్తుంది (19) భర్త పిలువగానే ఇంటి పనులను వదలి త్వరగా వెళ్తుంది. ఓ నాథ! ఎందుకు పిలిచారో దానిని అనుగ్రహించండి. (చెప్పండి) అంటుంది (20) ద్వారంలో చాలాసేపు ఉండదు. ద్వారాన్ని ఆశ్రయిస్తూ ఉండదు. ఇవ్వతగని దానిని స్వయంగా ఏ కొంచము గాని ఏ సమయమందు గాని ఇవ్వదు కూడ (21) పూజకు అవసరమైన సామగ్రిని అంతా చెప్పకుండానే స్వయంగా సాధిస్తుంది నియమంగా నీరు దర్భలు పూలు అక్షతలు కూరుస్తుంది (22) ఎదిరిచూస్తూ, ఆయా సమయములకు తగినట్లు శ్రేష్ఠమైనదానిని అంతా సిద్ధంగా ఉంచుతుంది. సంతోషంగా ఉద్వేగం లేకుండా (23) భర్త ఎంగిలిని తింటుంది. తనకు ఇష్టమైన అన్నము పండ్లు మొదలగు వానిని దూరంగా వదులుతుందీమె. సమాజ ఉత్సవ దర్శనంను వదులుతుంది (24) తీర్థ యాత్రాదులకు వివాహ ప్రేక్షాదులకు వెళ్ళదు. హాయిగా నిద్రిస్తున్న, సుఖంగా కూర్చున్న స్వేచ్ఛగా ఆనందిస్తున్న భర్తను (25) పనులకు అంతరాయమైనా ఎప్పుడూ లేవదు. స్త్రీ ధర్మ మందున్నపుడు (ముట్టు) మూడు రాత్రులు తన ముఖాన్ని చూపించదు (26) స్నానం చేసి శుద్ధి అయ్యే వరకు తన మాటను వినిపించదు భర్తకు. స్నానం చేసి భర్త ముఖాన్నే చూస్తుంది. ఇతరులది ఎప్పుడూ చూడదు. లేదా భర్తను మనసులో ధ్యానించి సూర్యుని చూడాలి (27) హరిద్ర, కుంకుమ, సింధూరము, కాటుక, తాంబూలము, రవిక, మాంగల్య ఆభరణము ఇవి శుభ##మైనవి (28) కేశముల సంస్కారము, చేతుల మరియు చెవుల ఆభరణములు వీటిని భర్త ఆయుష్యమును కోరే పతివ్రత నిందించరాదు (29) భర్తను ద్వేషించే స్త్రీతో ఈమె ఎప్పుడూ మాట్లాడదు. ఎక్కడా ఒంటరిగా ఉండదు. ఎక్కడా నగ్నంగా స్నానం చేయదు (30) పతివ్రత, రోటిపై,రోకలిపై, కత్తి పీటపై, సానపై ఇసురాయిపై, గడపపై ఎప్పుడూ కూచోరాదు (31) గ్రామ ధర్మములు కాక ఎక్కడ ఆప్రాగత్భ్యములు (నాగరికత) చూపదు. భర్తకు దేని మీద అభిరుచో అక్కడే ఈమెకు ప్రేమ ఉంటుంది. ఎప్పుడు (32) స్త్రీలకు ఇదే వ్రతము. ఇదే పరమ ధర్మము. ఇదే పూజ. భర్త వాక్యమును దాటదు (33) నపుంస కుడైనా, చెడు అపస్తయందున్నవాడైనా రోగగ్రస్తుడైనా, వృద్ధుడైనా, సుస్థిరుడైనా, దుఃస్థిరుడైనా (బుద్ధిలో) పతి ఒక్కణ్ణి దాటరాదు (34) నేయి, ఉప్పు, ఇంగువాదులు ఐ పోయినా, పతివ్రత! భర్తతో లేవు అని చెప్పదు. (భోజన సమయంలో) లోహ పాత్రలందు భుజించదు (అన్నం ఉంచదు) (35) తీర్థ స్నానం కోరేదైనా పతిపాదముల జలమును తాగుతుంది. శంకరుడు, విష్ణు వీరికన్న స్త్రీకి పతియే అధికము. (36)

మూ|| ప్రతోపవాసనియమం పతిముల్లంఘ్యయా చరేత్‌ | ఆయుష్యం హరతేభర్తుఃమృతానిరయమృచ్ఛతి || 37 ||

ఉక్తాప్రత్యుత్తరం దద్యాన్నారీయాక్రోధతత్పరా | నరమాజాయతే గ్రామే శృగాలీనిర్జనేవనే || 38 ||

స్త్రీణాం హి పరమశ్చైకో నియమః సముదాహృతః | అభ్యర్చ్య చరణౌ భర్తుఃభోక్తవ్యం కృతనిశ్చయా || 39 ||

ఉచ్చానసంనసేవేత నవ్రజేత్పరవేశ్మను | తత్ర పారుష్యవాక్యాని బ్రూయాన్నైవకదాచన || 40 ||

గురూణాం సన్నిధౌవాపినోచ్చైఃబ్రూయాన్నవాహయేత్‌ || 41 ||

యాభర్తా రంపరిత్యజ్యరహఃచరతి దుర్మతిః | ఉలూకీ జాయతే క్రూరా వృక్షకోటరశాయినీ || 42 ||

తాడితా తాడయేచ్చేత్తం సావ్యాఘ్నీ వృషదంశికా | కటాక్షయతి యాన్యంవైకేకరాక్షీతు సాభ##వేత్‌ || 43 ||

యాభర్తారం పరిత్యజ్య మిష్టమశ్నాతికేవలం | గ్రామేసాసూకరీ భూయాద్వల్గులీవాథలిడ్‌భుజా || 44 ||

హుంత్వం కృత్యాప్రియం బ్రూతే మూకాసాజాయతేఖలు |

యాసపత్నీం సదేర్ఘ్యేత దుర్భగాసాపునః | దృష్టిం విలుప్యభర్తుర్యాకంచి దస్యం సమీక్షతే || 45 ||

కాణాచ విముఖావాపి కురూపాపిచజాయతే | బాహ్యాదాయాంత మాలోక్యత్వరితా చజలాసవైః

తాంబూలైం వ్యజనైశ్చైవ పాదసంవాహనాదిభిః || 46 ||

తథైవచారువచనైః స్వేదసంనోదనైఃపరైః | యాప్రియం ప్రీణయేత్ర్పీతా త్రిలోకి ప్రీణితా తయా

మితందదా తిహిపితా మితం భ్రాతా మితం సుతః || 47 ||

అమితస్య హిదాతారం భర్తారంకాన పూజయేత్‌ | భర్తాదేవో గురుర్‌ భర్తా ధర్మతీర్థ ప్రతానిచ

తస్మాత్సర్వం పఠిత్యజ్య పతిమేకం సమర్చయేత్‌ || 48 ||

జీవహీనోయథాదేహీక్షణాదశుచితాంప్రజేత్‌ | భర్తృహీనాతథాయోషిత్‌ సుస్నాతా ప్యశుచిః సదా || 49 ||

అమంగలేభ్యః సర్వేభ్యో విధవాస్యాదమంగలా | విధవాదర్శనాత్‌సిద్ధిః క్వాపి జాతునాజాయతే || 50 ||

విహాయమాతరం చైకాం సర్వామంగలవర్జితాః | తదాశిషమపిప్రాజ్ఞః త్యజేదాశీవిషోషమాం || 51 ||

కన్యావివాహ సమయేవాచయేము రితిద్విజాః | భర్తుః సహచరీ భూయాత్‌ జీవతోజీవతోపివా || 52 ||

అనప్రజం తీ భర్తారంగృహాత్‌ పితృవనం ముదా | పదేపదేశ్వమేధస్య ఫలంప్రాప్నోత్యసంశయం || 53 ||

వ్యాల గ్రాహీయథావ్యాలం బలాదుద్ధరతేబిలాత్‌ | ఏవముత్‌ క్రమ్యదూతేభ్యః పతింస్వర్గం ప్రజేత్సతీ || 54 ||

యమదూతాః పలాయంతే తమాలోక్య పతివ్రతాం | తపనః తప్యతేసూనం దహనోపిచ దహ్యతే || 55 ||

తా || భర్తను కాదని, వ్రత ఉపవాస నియమములను ఆచరించే స్త్రీ భర్త, ఆయుష్యమును హరిస్తుంది. చనిపోతే నరకమునకు పోతుంది (37) భర్త చెప్పగానే క్రోధంతో ప్రత్యుత్తరమిచ్చే స్త్రీ గ్రామమందు ఆడకుక్కగా పుడ్తుంది. జనంలేని అడవిలోనైతే ఆడనక్కగా పుడ్తుంది (38) స్త్రీలకు పరమైనది ఒక నియమం చెప్పబడింది. భర్తపాదములను పూజించి, నిశ్చయమైన మనస్సుతో భుజిస్తుంది (39) ఉచ్చమైన ఆసనంపై కూర్చోరాదు. ఇతరుల ఇంటికి పోరాదు. అక్కడ కఠిన వాక్యములను ఎప్పుడూ పలుకరాదు (40) గురువుల సన్నిధి యందైనా పెద్దగా మాట్లాడరాదు. మాటలను చేర్చరాదు (ఇక్కడివక్కడ చెప్పటం) (41) భర్తను వదలి రాత్రిపూట చరించే దుర్మతి గల స్త్రీ చెట్టు తొర్రలో నిద్రపోయే క్రూరమైన ఆడగుడ్లగూబగా జన్మిస్తుంది (42) భర్తకొడ్తే తిరిగి భర్తను కొట్టేదైతే ఆమె ఆడపులి ఎద్దులను తినేది ఔతుంది. ఇతర పురుషుని అనుగ్రహించే (ప్రేమించే)స్త్రీ మెల్లెకన్నుగలదిగా ఔతుంది (43) భర్తను వదలి తానే మధుర పదార్థములతినే స్త్రీ గ్రామంలో పందిగానూ ఔతుంది మలము తినేదో లేదా, ఎగిరే నక్కనో ఔతుంది (44) హుం అని పలకటం ద్వారా అప్రియంచేస్తే స్త్రీ మూగ దౌతుంది. సవతిని చూచి ఎప్పుడూ ఈర్ష్యపడే స్త్రీ మాటిమాటికి దుర్భగ (గయ్యాళి) ఔతుంది. భర్తకన్ను గప్పి మరొకనిని అన్యుని చూచేస్త్రీ (45) విముఖ, కురూప, ఒంటికంటిది ఔతుంది. బయటి నుండి వస్తున్న భర్తను చూచి, త్వరగా నీటితో, ఆసనముతో తాంబూలముతో, విసనకర్రతో కాళ్ళు పిసకటము మొదలగు వానితో (46) మంచి మాటలతో, చెమటను తొలగించే ఇతర క్రియలతో భర్తను సంతోషపరిచే స్త్రీ ఉందో ఆమె సంతోషపడితే ఆమె వల్ల ముల్లోకములు ప్రీతిని పొందినట్ల. తండ్రి మితంగా ఇస్తాడు. అన్నదమ్ములు, కొడుకు వీరు కూడామితంగానే ఇస్తారు (47) అమితంగా ఇచ్చే భర్తను ఎవతె పూజించదు. భర్తదైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతములు భర్తయే. అందువల్ల అన్ని వదలి భర్త నొక్కనినే పూజించాలి (48) జీవహీనుడైన దేహి క్షణంలో అశుచియైనట్లు, భర్తృహీనమైన స్త్రీ బాగా స్నానం చేసినా ఎప్పుడూ అశుచియే (49) అమంగలములన్నింటి కంటే విధవ ఇంకా అమంగల మైనది. విధవ దర్శనం వల్ల కార్యసిద్ధి ఎక్కడ ఎప్పుడూ జరుగదు (50) ఒక్కతల్లిని వదలి అందరూ అమంగల కరమైనవారే. ఆమె ఆశీస్సును కూడా ప్రాజ్ఞుడు వదలాలి, ఆమె ఆశీస్సు సర్పవిషము వంటిది (51) బ్రాహ్మణుడు కన్యావివాహా సమయమందు అనిపిస్తాడిట్లా ఆమెతో భర్తకు సహచరి కావాలి. అతడు బ్రతికి ఉన్నా మరణించినా కూడా (52) భర్తను గృహము నుండి పితృవనము వరకు సంతోషంగా అనుసరిస్తుంది. అట్లాచేస్తే అడుగడుగున అశ్వమేధయాగ ఫలమును పొందుతుంది, అనుమానములేదు. (53) పాములు పట్టేవాడు పామును పుట్టనుండి బలవంతంగా లాగినట్లుగా యమ దూతలను దాటి వెళ్ళి స్వర్గమందున్న పతిని చేరుతుంది సతి (54) అపతివ్రతను చూచి యమదూతలు, పరుగెత్తిపోతారు. పతివ్రత యొక్క గొప్పతనాన్ని (తేజస్సును) చూచి సూర్యుడు మండిపోతారు. అగ్ని బూడిదైపోతుంది (55).

మూ || కంపతేసర్వతే జాంసిదృష్ట్వాపాతివ్రతంమహః | యావత్‌ స్వలోమసంఖ్యాస్తితావత్‌ కోట్యయుతానిచ || 56 ||

భర్త్రా స్వర్గ సుఖంభుంక్తే రమమాణా పతివ్రతా | ధన్యాసాజననీ లోకేధన్యోసౌ జనకఃపునః || 57 ||

ధన్యః సచపతిః శ్రీమాన్‌ యేషాంగేహ పతివ్రతా | పితృవం శ్యామాతృవంశ్యాః పతివంశ్యాః త్రయస్త్రయః

పతివ్రతాయాః పుణ్యన స్వర్గసౌఖ్యాని భుంజితే || 58 ||

శీలభంగేసదుర్వృత్తాఃపాతయంతికులత్రయం | పితుఃమాతుఃతథాపత్యుఃఇహాముత్రచదుఃఖితాః || 59 ||

పతివ్రతాయాశ్చరణోయత్రయత్ర స్పృశేత్‌ భువం | సాతీర్థభూమిర్మాన్యేతినాత్రభారోస్తి పావనః || 60 ||

బిభ్యత్‌ పతివ్రతా స్పర్శం కురుతే భానుమానపి | సోమో గంధర్వ ఏవాపి స్వపావిత్ర్యాయ నాస్యథా || 61 ||

ఆపః పతివ్రతా స్పర్శమఖిలష్యంతి సర్వదా | గాయత్ర్యాఘ వినాశోనో పాతివ్రత్యేన సోఘనుత్‌ || 62 ||

గృహ గృహ నకిం నార్యో రూపలావణ్య గర్వితాః | పరం విశ్వేశభ##క్త్యైవలభ్యతే స్త్రీ పతివ్రతా || 63 ||

భార్యామూలం గృహస్థస్య భార్యామూలంసుఖన్యచ | భార్యధర్మఫాయైవ భార్య సంతాన వృద్ధయే || 64 ||

పరలోకస్త్వయంలోకోజీయతే భార్యయాద్వయం | దేవపిత్రథీనాంచ తృప్తిః స్యాద్భార్యయా గృహ

గృహస్థ ః సతువిజ్ఞేయో గృహయస్య పతివ్రతా || 65 ||

యథా గంగావగాహన శరీరం పావనంబభ##వేత్‌ | తథాపతివ్రతాం దృష్ట్వా సదనం పావనం భ##వేత్‌ || 66 ||

పర్యంకశా యినీ నారీ విధవా పాతయేత్పతిం | తస్మాద్భూశయనం కార్యం పతిసౌఖ్య సహీహ యా || || 67 ||

నైవాంగోద్వర్తనం కార్యంస్త్రియా విధవ యాక్వచిత్‌ | గంధద్రవ్యస్య సంభోగో నైవకార్యస్తయాక్వచిత్‌ || 68 ||

తర్పణం ప్రత్యహం కార్యంభర్తుః కుశతిలోదకైః తత్పితుస్తత్పితుశ్చాపి నామగోత్రాది పూర్వకం || 69 ||

విష్ణోః సంపూజనం కార్యం పతిబుద్ధ్యాన చాన్యథా | పతిమేవ సదాధ్యాయేత్‌ విష్ణురూప ధరం హరిం || 70 ||

యద్యదిష్టతమంలోకేయద్యత్‌పత్యుః సమిహితం | తత్తత్‌ గుణవతే దేయంపతి ప్రీణన కామ్యయా || 71 ||

వైశాఖే కార్తికే మాసే విశేష నియమాంశ్చరేత్‌ | స్నానం దానం తీర్థయాత్రాం పురాణ శ్రవణం ముహుః || 72 ||

తా || అన్ని తేజస్సులు పతివ్రతా గొప్పతనం ముందు కంపిస్తాయి. తన రోమముల సంఖ్య ఎంత ఉందో అన్ని పదివేల కోట్ల సంవత్సరాలు (56) పతివ్రత, భర్తతో సుఖిస్తూ స్వర్గసుఖాన్ని అనుభవిస్తుంది. ఆతల్లి ధన్యురాలు, లోకంలో ఆ తండ్రి ధన్యుడు (57) ఆ భర్త ధన్యుడు, ఎవరి ఇంట్లో పతివ్రత ఉందో తండ్రి వంశమువారు, తల్లి వంశమువారు, భర్తవంశమువారు, మూడేసి మూడేసి తరములు పతివ్రత పుణ్యంతో స్వర్గసూఖాన్ని అనుభవిస్తారు (58) శీలభంగముతో చెడునడవడిక గల స్త్రీలు మూడు కులముల వారిని పతితుల జేస్తారు. తండ్రికి, తల్లికి, భర్తకు ఇక్కడ పైలోకంలో దుఃఖాన్ని కల్గిస్తారు (59) పతివ్రత పాదాలు భూమిని ఎక్కడెక్కడ స్పృవిస్తాయో, ఆ ప్రదేశాన్ని పవిత్రమైన తీర్థ భూమిగా గౌరవించాలి ఆ అడుగులు భారములు కావు (60) సూర్యుడు, చంద్రుడు, గంధర్వులు కూడా తమ పవిత్రత కొరకు పతివ్రత స్పర్శను భరిస్తారు. మరోరకంగా కాదు (61) నీళ్ళు ఎల్లప్పుడు పతివ్రతా స్పర్శను కోరుకుంటాయి. గాయత్రితో పాపనాశనము లేదు. పాతివ్రత్యంతో ఆమె పాపాన్ని నశింప చేస్తుంది (62) ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు లేరా. రూపలావణ్యములతో అహంకరించేవాళ్ళు. కాని స్త్రీ పతివ్రతయైనది, విశ్వేశ్వరుని అనుగ్రహం వల్లనే లభిస్తుంది (63) గృహస్థునకు భార్యమూలము. సుఖమునకు భార్య మూలము. ధర్మఫలము కొరకే భార్య. సంతానవృద్ధి కొరకు భార్య. (64) పరలోకము ఈ లోకము ఈ రెండు భార్యవల్లనే జీవిస్తున్నాయి. గృహంలో భార్య ఉంటే స్త్రీ దేవపితృ అతిథులకు తృప్తి కల్గించవచ్చు. ఎవడి ఇంటిలో పతివ్రతయైన భార్య ఉంటుందో ఆతడు గృహస్థు అని తెలుసుకోవాలి. (65) గంగలో మునగటంవల్ల శరీరం పావనమైనట్లుగా పతివ్రతను చూచి గృహము పావనమౌతుంది (66) మంచముపై పడుకునే విధవయైన స్త్రీ భర్తను అధఃపతితుణ్ణి చేస్తుంది. అందువల్ల పతికి సౌఖ్యం కలిగే కొరకు భూమి యందు పరుండాలి (67) విధవయైన స్త్రీ ఎప్పుడూ తలంటు స్నానమ చేయరాదుసున్నిపిండి వగైరాలతో వళ్ళురుద్దుకోవటం వగైరాలు ఆమె ఎప్పుడూ సుగంధద్రవ్యములను అనుభవించ రాదు. (68) భర్తకు దర్భలు, నువ్వులు నీటితో ప్రతి రోజు తర్పణం చేయాలి. నామ గోత్రాదులు చెప్తూ అతని తండ్రికి, ఆతని తండ్రి తండ్రికి కూడా తర్పణ చేయాలి (69) పతిని మదిలో తలచి, విష్ణు పూజ చేయాలి. మరోరకంగా కాదు. విష్ణురూప ధరుడైన హరిని చూస్తూ ఎల్లప్పుడూ పతినే ధ్యానించాలి (70) పరలోకంలో భర్తకు సంతోషం కలిగే కొరకు, ఈ లోకంలో ఉన్నప్పుడు భర్తకు ఏదేది బాగా ఇష్టమో, ఏదేది తన భర్తకు ఇష్టంగా ఉండేదో అవన్ని గుణవంతుడైన వానికి దానం చేయాలి (71) వైశాఖము, కార్తికము ఈ మాసాలలో విశేష నియమాలను పాటించాలి. స్నానము, దానము, తీర్థయాత్ర మాటిమాటికి పురాణ శ్రవణము ఇవి ఆచరించాలి (72)

మూ || వైశాఖే జలకుంభాశ్చ కార్తికే ఘృతదీపకాః | మాఘేధాస్య తిలోత్సర్గః స్వర్గలోకే విశిష్యతే || 73 ||

ప్రాకార్యాచ వైశాఖే దేవేదేయా గలంతికా | ఉశీరం వ్యజనం ఛత్రం సూక్ష్మ నాపాంసి చందనం || 74 ||

నకర్పూరం తాంబూలం పుష్పదానం తథైవచ | జలపాత్రాణ్యనేకాని తథాపుష్పగృహాణిచ || 75 ||

పానానిచ విచిత్రాణి ద్రాక్షారం భాఫలానిచ | దేయాని ద్విజముభ్యేభ్యః పతిర్మేప్రీయతామితి || 76 ||

ఊర్జేయ వాన్నమశ్నీయాత్‌ ఏకాన్న మధవాపునః | వృన్తాకం సూరణంచైవశూకశింబీంచవర్జయేత్‌ || 77 ||

కార్తికే వర్జయే తైలం కాస్యం చాపి వివర్జయేత్‌ | కార్తికే మౌననియమే చారుఘంటాం ప్రదాపయేత్‌ || 78 ||

పత్రభోజో కాంస్య పాత్రం ఘృతం పూర్ణం ప్రయచ్ఛతి | భూమిశయ్యావ్రతే దేయాశయ్యా శ్లక్ణా సతూలికా || 79 ||

ఫలత్యాగే ఫలం దేయం రసత్యాగే చతద్రసః | ధాన్యత్యాగే చతద్ధాన్యం అథవాశాలయః స్మృతాః

ధేనుందద్యాత్‌ ప్రయత్నేన సాలం కారాం సకాం చనాం || 80 ||

ఏకతః సర్వదానాని దీపదానం తథైకతః | కార్తికేదీపదానస్య కలాం నార్హంతిషోడశీం || 81 ||

ఇత్యాది విధవానాంచనియమాః సంప్రకీర్తితాః | తేషాం ఫలమిదం రాజన్‌ నాన్యేషాం చకదాచన || 82 ||

ధర్మవాపీం సమాసాద్య దానం దద్యాత్‌ విచక్షణః | కోటిధావర్ధతే నిత్యం బ్రహ్మణోవచనం యథా || 83 ||

తిలధేనుం చయోదద్యాత్‌ ధర్మేశ్వర పురః స్థితః | తిలసంఖ్యాని వర్షాణి స్వర్గేలోకే మహీయతే || 84 ||

ధర్మక్షేత్రే తుసంప్రాప్యశ్రాద్ధం కుర్యాదతంద్రితః | తస్య సంవత్సరం యావత్‌ తృప్తాః స్యుః పితరోధ్రువం || 85 ||

యేచాన్యే పూర్వజాః స్వర్గేయే చాన్యే నరకౌకనః | యే చతిర్యక్‌త్వమాపన్నాయే చభూతాది సంస్థితాః || 86 ||

తాన్‌ సర్వాన్‌ ధర్మకూపేవైశ్రాద్ధం కుర్యాద్యథావిధి | అత్రప్రకిరణం యత్తు మనుషై#్యః క్రియతే భువి

తేనతే తృప్తిమాయాంతియే పిశాచత్వమాగతాః || 87 ||

యేషాంతు స్నాన వస్త్రోత్థం భూమౌపతతి పుత్రక | తేనయే తరుతాం ప్రాప్తాః తేషాం తృప్తిః ప్రజాయతే || 88 ||

తా || వైశాఖ మందు జల కుంభములు కార్తీకంలో నేయి దీపములు దానం చేయాలి. మాఘమందు ధాన్యము, నువ్వులు ఇవ్వాలి. ఇవి స్వర్గలోకంలో ప్రధానమైనవి (73 ) వైశాఖంలో పానీయశాల ఏర్పరచాలి. దేవునకు గలంతికనివ్వాలి (శివాలయంలో శివుని తలపై ఒక పాత్ర ఉంటుంది. దాని నుండి ఒక్కొక్క చుక్క నీరు శివుని తలపై పడ్తుంటుంది. అది గలంతిక) వటవ్రేళ్ళు, విసనకర్ర, గొడుగు, సన్నని వస్త్రములు, చందనము (74 ) కర్పూరము వేసిన తాంబూలము, అట్లాగే పూలదానము ఇవన్ని వైశాఖంలో చేయాలి. అనేక జలపాత్రములు అట్లాగే పుష్పగృహములు (75) విచిత్రములైన (రకరకాలైన) పానములు, ద్రాక్ష ఫలములు, అరటిపండ్లు బ్రాహ్మణులకు దానంచేయాలి. నా భర్త ఆనందపడని అని (76) కార్తీక మందు యవల అన్నమును తినాలి. లేదా ఒంటిపూట అన్నంతినాలి. వంకాయ, కందగడ్డ, దూలగొండి (గడ్డ) వీటిని తినొద్దు. (77) కార్తీక మందు నూనెను వదలాలి. కాంస్య పాత్రను వదలాలి (వాడొద్దు) కార్తీక మందు మౌనంగా ఉండే నియమమందు మంచి గంటను దానం చేయాలి (78) ఆకులో భోంచేసే వ్రతమందు నేయితో నింపిన కాంస్య పాత్రను దానం చేయాలి. భూమి శయ్యావ్రత మందు దూది గల అందమైన పడకను దానం చేయాలి. (79) ఫలమును వదలి పెడ్తే దానిని దానం చేయాలి. రుచులలో దేనిని వదిలితే ఆ రుచి గల వస్తువును దానం చేయాలి. ధాన్యమును త్యాగం చేస్తే ఆ ధాన్యాన్ని దానం చేయాలి లేదా వడ్లు దానం చేయాలి. అలంకరించిన బంగారము గల ఆవును శ్రమించియైనా దానం చేయాలి (80) అన్ని దానములు ఒక ఎత్తు, దీపదానము ఒక ఎత్తు కార్తీకంలో దీపదానం యొక్క పదహారవ కళను గూడా ఇతర దానములు పొందలేవు. (81) ఈ విధముగా ఇవి మొదలుగా గల నియమములు విధవలకు చెప్పబడ్డాయి. ఓరాజ! వీటి దానం యొక్క ఈ ఫలము ఇతర దానముల వల్ల ఎప్పుడూ రాదు (82) విచక్షణుడు ధర్మవాపికి వచ్చి దానం చేయాలి. రోజుకోటి విధముల వృద్ధి చెందుతుంది. అని బ్రహ్మవాక్కు (83) ధర్మేశ్వరుని ముందుండి నువ్వులు, ఆవు వీటిని దానం చేస్తే (నువ్వులంత నల్లని మచ్చలుగల ఆవు కావచ్చు)నువ్వు లెన్నున్నాయో అన్ని సంవత్సరముల కాలము స్వర్గలోకమందు వెలిగిపోతాడు (84) ధర్మక్షేత్రమునకు వచచి శ్రద్ధగా శ్రాద్ధం చేస్తే, అతని పితృదేవతలు వారి సంవత్సరకాలము తృప్తిగా ఉంటారు. ఇది నిశ్చయము. (85) ఇతరులైన స్వర్గమందున్న వాని పూర్వులు, నరకమందున్న వారు తిర్యక్త్వమును పొందియున్నవారు, భూతాదులుగా ఉన్నవారు (86) వారందరి నుద్దేశించి యథావిధిగా ధర్మకూపమందు శ్రాద్ధము చేయలా. ఇక్కడ మనుష్యులు, భూమిమీద శ్రాద్ధాది తర్పణం వదిలితే, దానితో వారు, పిశాచత్వమును పొందినవారు అక్కడ తృప్తిని పొందుతారు. (87) ఓ పుత్రక! స్నాన వస్త్రంతో పుట్టిన నీరు భూమిపై పడి, ఆ నీటితో, వృక్షరూపము నందినవారికి తృప్తి కలుగుతుంది (88).

మూ || యావైయ వానాంకనికాః పతంతి ధరణీతలే | తాభిరాప్యాయనం తేషాం యేతుదేవత్మమాగతాః || 89 ||

ఉద్ధృతే ష్వథ పిండేషు యావాన్నకణికాభువి | తాభిరాప్యాయనం తేషాం యేచ పాతాల మాగతాః || 90 ||

యేవా వర్ణాశ్రమాచార క్రియాలోపాహ్యసంస్కృతాః | విపన్నాస్తే భవంత్యత్ర సంమార్జన జలాశినః || 91 ||

భుక్త్వావాచమనం యచ్చ జలం పతతి భూతలే | బ్రాహ్మణానాం తథైవాన్యే తేనతృప్తిం ప్రయాంతివై || 92 ||

ఏవంవోయజమానశ్చయచ్చతేషాం ద్విజన్మనాం | క్వచిఇజ్జలాన్న విక్షేపః శుచిరస్పృష్ట ఏవచ || 93 ||

యేచాన్యేనరకే జాతాః తత్రయోన్యం తరంగతాః | ప్రయాంత్యాప్యాయనంవత్ససమ్యక్‌ శ్రాద్ధక్రియావతాం || 94 ||

అన్యాయో పార్జితైర్‌ ద్రవ్యైః శ్రాద్ధం యత్ర్కియతే నరౌః | తృప్యంతితేనచండాలపుల్కసాదిషుయోనిషు || 95 ||

ఏవమాప్యాయితా వత్సతేన చానేక బాంధవాః | శ్రాద్ధం కర్తుమశక్తిశ్చేత్‌ శాకైరపిహిజాయతే || 96 ||

తస్మాచ్ఛ్చాద్ధం నరోభక్త్యా శాకైరపి యధావిధి | కురుతే కుర్వతః శ్రాద్ధం కులం క్వచిన్న సీదతి || 97 ||

పాపం యదికృతం సర్వం పాపం చవర్ధతే ధ్రువం | కుర్వాణోనరకే ఘోరే పచ్యతే నాత్ర సంశయః || 98 ||

యథాపుణ్యం తథాపాపం కృతం కర్మశుభాశుభం | తత్సర్వం వర్థతే సూనం ధర్మారణ్య నృపోత్తమ || 99 ||

కామికం కామదం దేవం యోగినాం ముక్తి దాయకం | సిద్ధానం సిద్ధిదం ప్రోక్తం ధర్మారణ్యం తుసర్వదా || 100 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మాణ్య క్షేత్రే మాహాత్మ్యే ధర్మాచార వర్ణనం నామ సప్తమోధ్యాయః || 7 ||

తా || భూమి యందు పడిన యవల గింజలతో దేవత్వమందిన వారికి తృప్తి కలుగుతుంది. (89) పిండములను ఎత్తుతూ ఉంటే భూమిపై పడిన అన్నకణములతో, పాతాళమును పొందిన వారికి తృప్తి కలుగుతుంది (90) వర్ణ ఆశ్రమ ఆచారక్రియలలో లోపమాచరించినవారు, అసంస్కృతులైనవారు, విపన్నులు వారంతా ఇక్కడి సమ్మ్యార్జన జలమును ఆశించేవారు (కడిగిననీరు) (91) భుజించాక ఆచమనం చేస్తే అప్పుడు క్రిందపడిన బ్రాహ్మణుల జలముతో, ఇతరులైన వారు తృప్తిని పొందుతారు (92) యజమానుని యొక్క బ్రాహ్మణుల జల అన్నముల నిక్షేపము (క్రిందపడ్డ అన్నము వగైరా) ఇతరులు తాకనిది శుచియైనదే (93) నరకంలో పుట్టినవారు, అక్కడ ఇతర యోనులలో జన్మించిన వారు (ఉన్నవారు) ఇక్కడ శ్రాద్ధమును నిర్వర్తిస్తే తృప్తిని పొందుతారు. ఓ వత్స! (94) అన్యాయంగా సంపాదించిన ద్రవ్యంతో నరులు శ్రాద్ధం చేసినచో, దానితో చండాల పుల్కసాది యోనులలో నున్నవారు తృప్తి నందుతారు (95) అతడు అనేక మంది బంధువులను ఈ విధంగా తృప్తిపరచాడు. శ్రాద్ధం చేయటానికి శక్తిలేకపోతే శాకములతోనైనా (కూరగాయలతో) ఫరవాలేదు (96) అందువల్ల నరుడు భక్తితో శాస్త్రప్రకారము శాకములతో శ్రాద్ధము చేస్తాడు. శ్రాద్ధం చేస్తున్న వాని కులము ఏ మాత్రమూ నశించదు (97) పాపమచారిస్తే, ఆపాపమంతా తప్పకుండా వృద్ధి చెందుతుంది. పాపం చేసిన వారి పాపము నరకమందు ఫలిస్తుంది. ఇందులో అనుమానంలేదు. (98) పుణ్యముగాని పాపము గాని తాను చేసిన శుభాశుభకర్మము అందతా ధరర్మారణ్యంలో వృద్ధి చెందుతుది, నిశ్చయము, ఓ మహారాజశ్రేష్ఠ! (99) కాములకు కామముల నిచ్చేది యోగులకు ముక్తినిచ్చేది సిద్ధులకు సిద్ధినిచ్చేది. ధర్మారణ్యము అని, ఎల్లప్పుడూ చెప్పబడుతోంది. (100) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య క్షేత్ర మాహాత్మ్య మందు ధర్మారణ్యవర్ణన మనునది ఏడవ అధ్యాయము || 7 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters