Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఎనిమిదవ అధ్యాయము

మూ || వ్యాసఉవాచ -

ధర్మారణ్య కథాం పుణ్యాం శ్రుత్వాతీప్తి ర్నమేవిభో | యదాయదా కథయసి తథాప్రోత్సహతే మనః

అతః పరం కి మభవత్‌ పరం కౌతూహలం హిమే || 1 ||

వ్యాస ఉవాచ -

శృణు పార్థమహాపుణ్యాం కథాంస్కందపురాణజాం | స్థాణు నోక్తాంచస్కందాయ ధర్మారణ్యోద్భవాంశుభాం || 2 ||

సర్వతీర్థస్య ఫలదాం సర్వోపద్రవనాశినీం | కైలాసశిఖరాసీనం దేవదేవం జగద్గురుం

పంచవక్త్రం దశభుజం త్రినేత్రం శూలపాణినం || 3 ||

కపాల ఖట్వాంగకరం నాగయజ్ఞోపవీతినం | గణౖః పరివృతంతత్ర సురాసుర నమస్కృతం || 4 ||

నానారూపగుణౖ ర్గీతం నారదప్రముఖైర్యుతం | గంధర్వైశ్చాప్సరోభిశ్చ సేవితంత ముమాపతిం

తత్రస్థః చ మహాదేవం ప్రణి పత్యాబ్రవీత్సుతః || 5 ||

స్కంద ఉవాచ -

స్వామిన్నింద్రాదయోదేవాబ్రహ్మాద్యా శ్చైవ సర్వశః | తవద్వారే సమాయాతాః త్వద్దర్శనైకలాలసాః

కిమా జ్ఞాపయసే దేవ కరవాణి తవాగ్రతః || 6 ||

వ్యాస ఉవాచ-

స్కంద స్యవచనం శ్రుత్వా ఆసనాదుత్థితోహరిః | వృషభం సనమారూఢో గంతుకామోభవత్తదా || 7 ||

గంతుకామం శివం దృష్ట్వా స్కందో వాక్య మథాబ్రవీత్‌ || 8 ||

స్కంద ఉవాచ -

కింకార్యం దేవదేవానాం యత్త్వమాహూయసేత్వరం | వృషంత్యక్త్వోకృపాసింధో కృపాస్తియదిమేవద || 9 ||

దేవదానవయుద్ధంవాకింకార్యం వామహత్తరం || 10 ||

శివ ఉవాచ -

శృణుషై#్వకాగ్రమన సాయేనాహం వ్యగ్రచేతనః | అస్తిస్థానం మహాపుణ్యం ధర్మారణ్యంచ భూతలే || 11 ||

తత్రాపిగంతుకామోహం దేవైః సహషడాసన || 12 ||

స్కంద ఉవాచ -

తత్రగత్వామహాదేవ కింకరిష్యసి సాంవ్రతం | తన్మేబ్రూహి జగన్నాథ కృత్యం సర్వమశేషతః || 13 ||

శివ ఉవాచ -

శ్రూయతాం వచనం పుత్ర మనసోహ్లాద కారణం | ఆదితః సర్వవృత్తానాం సృష్టి స్థితి కరం మహత్‌ || 14 ||

పరంతు వ్రలయేజాతే సర్వతస్తమ సావృతం | ఆ సీదే కంతదా బ్రహ్మ నిర్గుణం బీజ మవ్యయం || 15 ||

నిర్మితం వైగుణౖరాదౌ మహద్ద్రవ్యం ప్రచక్ష్యతే || 16 ||

మహాకల్పేచ సంప్రాప్తే చరాచరేక్షయంగతే | జలరూపీజగన్నాధో రమమాణస్తులీలయా || 17 ||

చిరకాలేగతే సోపి పృథి వ్యాది సుతత్వకైః | వృక్షముత్పాదయామాసాయుత శాఖామనోరమం || 18 ||

ఫలైర్విశాలైరాకీర్ణం స్కంధ కాండాదిశోభితం | ఫలౌ ఘాడ్యో జటాయుక్తోన్య గ్రోధోవిటపోమహాన్‌ || 19 ||

తా || యుథిష్ఠురుని వచనము - ఓ విభు! పుణ్యమైన ధర్మారణ్య కథను వింటుంటే నాకు తృప్తి కలగటం లేదు. మీరు చెబుతున్న కొద్ది నా మనస్సు ఉత్సాహపడుతోంది. ఆ తరువాత ఏమైందో చెప్పండి. నాకు చాలా కుతూహలంగా ఉంది. అని అనగా (1) వ్యాసుని వచనము 6 ఓ పార్థ స్కంద పురాణమందున్న మహాపుణ్యమైన కథను విను. స్కందునకు శివుడు చెప్పిన శుభ##మైన ధర్మారణ్యమందు పుట్టిన కథను (2) సర్వతీర్థముల ఫలమునిచ్చే, సర్వ ఉపద్రవముల నశింపచేసే కథను విను. కైలాసశిఖరమందు కూర్చున్న దేవదేవుని జగద్గురువును, ఐదు ముఖముల వానిని, పదిభుజముల వానిని, మూడు కన్నుల వానిని శూలపాణిని (3) కపాలము ఖట్వాంగము చేత ధరించిన వానిని, నాగము యజ్ఞోపవీతముగా కలవానిని, ప్రమథ గణములతో చుట్టబడిన వానిని, సురలు, అసురులు వీరితో నమస్కరింపబడుతున్న వానిని (4) నానా రూపములుగా నానాగుణములు కలవానిగా కీర్తింపబడుతున్న వానిని, నారద ప్రముఖులతో కూడిన వానిని గంధర్వులతో, అప్సరసలతో సేవింపబడుతున్న వానిని ఐన ఆ ఉమాపతిని అక్కడ ఉన్న మహాదేవుని నమస్కరించి ఆతని సుతుడు ఇట్లా అన్నాడు. (5) స్కందుని వచనము-స్వామి! ఇంద్రాది దేవతలు బ్రహ్మాదులు అందరు నీ ద్వారమునకు వచ్చారు. నీ దర్శనమందే ఆసక్తులైనవారు ఓదేవ! ఏమి ఆజ్ఞాపిస్తున్నారు. మీ ముందున్నాను, చేయదలిచాను అని అనెను. (6) వ్యాసుని వచనము- స్కందుని మాటను విని ఆసనమునుండి లేచి హరుడు, వృషభమును ఎక్కకుండానే వెళ్ళదలచాడు (7) వెళ్ళదలచిన శివుని చూచి స్కందుడు ఇట్లా అన్నాడు (8) స్కందుని వచనము - ఓదేవ! దేవతల పని ఏమిటి? నిన్ను త్వరగా ఎందుకు పిలిచారు. ఓ కృపాసింధు ! వృషభమును వదలి ఎక్కడికెళ్తున్నావు. మీకు దయగలిగితే నాకు చెప్పండి (9) దేవదానవుల యుద్ధమా? ఇంకా మహత్తరమైన కార్యమేదైనా ఉందా (10) అనగా శివుని వచనము- నేనెందుకు ఆందోళన కలిగి ఉన్నానో ఏకాగ్రంగా విను. భూతల మందు, మహాపుణ్యమైన ధర్మారణ్యమనే స్థానముంది (11) ఓషడాసన! దేవతలతో కలిసి అక్కడికి వెళ్ళదలిచానునేను. (12) అనగా స్కందుని వచనము - ఓ మహాదేవ! ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏంచేస్తారు. ఓ జగన్నాథ! అక్కడ చేసేదేమిటో వివరంగా చెప్పండి అనగా (13) శివుని వచనము - ఓ పుత్ర! మనసునకు ఆహ్లాదాన్ని కలిగించే మాటను విను. అన్ని వృత్తములకు అది. సృష్టి స్థితికరమైనది. గొప్పది (14) ప్రళయం ఏర్పడ్డాక అంతట చీకటి ఆవరించింది. అప్పుడు నిర్గుణము, అవ్యయము, బీజము ఐన బ్రహ్మొక్కటే ఉండింది (15) గుణములతో మొదట మహత్‌ అనే ద్రవ్యం సృష్టించబడింది అని అంటారు (16) మహాకల్పం వచ్చాక చరాచరములు నశించాక, జలరూపియైన జగన్నాథుడు లీలగా ఆనందిస్తూ (17) చాలా కాలం గడిపాక ఆతడు పృథివి మొదలుగా గల తత్వములతో, పదివేల శాఖలతో మనోరమమైన చెట్టును పుట్టించాడు (18) విశాలంగా ఫలములతో నిండింది. స్కంధకాండ ములతో శోభించేది. పండ్ల సమూహం (చాలా పండ్లు) కలిగినట్టిది, జడలతో కూడింది. ఒక పెద్ద మర్రి చెట్టుఅది (19).

మూ|| బాలభావంతతః కృత్వావాసుదేవోజనార్దనః | శేతేసౌవటవత్రేషు విశ్వం నిర్మాతుముత్సుకః || 20 ||

సనాభి కమలేవిష్ణోః జాతో బ్రహ్మాహిలోకకృత్‌ | సర్వం జలమయం పశ్యన్నానాకారమరూపకం || 21 ||

తందృష్ట్వా సహసోద్వేగాద్ర్బహ్మాలోకపితామహాః | ఇదమాహతదాపుత్ర కింకరోమీతినిశ్చితం || 22 ||

భేజజానతతోవాణీ దైవాత్సాచాశరీరిణీ | తపస్తపవిధేధాతర్యథామే దర్శనం భ##వేత్‌ || 23 ||

తచ్ఛ్రుత్వావచనం తత్ర బ్రహ్మాలోకపితామహః | ప్రాతప్యత తపోఘోరం పరమందుష్కరం మహత్‌ || 24 ||

ప్రహసన్‌న తదా బాలరూపేణకమలాపతిః | ఉవాచ మధురాంవాచ కృపాలుః బాలీలయా || 25 ||

శ్రీ విష్ణురువాచ -

పుత్రత్వం విధినాచాద్యకురుబ్రహ్మాండగోలకే | పాతాలం భూతలం చైవసింధుసాగరకాననం || 26 ||

వృక్షాశ్చగిరయో ద్విపదాః వశవస్తథా | వక్షిణశ్చైవ గంధర్వాః సిద్ధాయక్షాశ్చరాక్షసాః || 27 ||

శ్వాపదాద్యాశ్చయే జీవాశ్చతురాశీతియోనయః | కురుత్వం సకలంచాశుఇత్యుక్త్వాం తరధీయత || 28 ||

ఏకవింశతి లక్షాణి ఏకైకస్యచయోనయః | కురుత్వం సకలంచాశుఇత్యుక్త్వాం తరధీయత

బ్రహ్మణానిర్మితం సర్వం బ్రహ్మాండం చయధోదితం || 29 ||

యస్మిన్‌పితా మహో జజ్ఞే ప్రభురేకః ప్రజాపతిః స్థాణుః సురగురుర్భానుః పరచేతాః ఫరమేష్ఠినః || 30 ||

యధాదక్షోదక్షపుత్రాస్తథా సప్తర్షయశ్చయే | తతః వ్రజానాం పతయః ప్రాభవన్నేకవింశతిః || 31 ||

పురుషశ్చాప్రమేయశ్చ ఏవంవంశ్యర్షయోవిదుః | విశ్వేదేవాస్తథాదిత్యావసవశ్చాశ్వినావపి || 32 ||

యక్షాః పిశాచాః సాధ్యాశ్చ పితరోగుహ్యకాస్తథా | తతః ప్రసూతాం విద్వాం సోహ్యష్టౌ బ్రహ్మర్షయోమలాః || 33 ||

రాజర్షయశ్చ బహవః సర్వేసముదితాగుణౖః | ద్యౌరాపః పృథివీ వాయురంతరిక్షం దిశస్తథా || 34 ||

సంవత్సరార్తవోమాసాః పక్షాహో రాత్రయః క్రమాత్‌ | కలాకాష్ఠముహూర్తాది నిమేషాదిలవాస్తథా || 35 ||

గ్రహచక్రం సనక్షత్రం యుగామన్వంత రాదయః | యచ్చాన్యదపితత్సర్వం సంభూతంలోకసాక్షికం || 36 ||

యదిదందృశ్యతే చక్రం కించిత్‌ స్థాపరజంగమం | పునఃసంక్షిప్యతే పుత్ర జగత్ర్పాప్తే యుగక్షయే || 37 ||

యథర్తావృతులింగాని నామరూపాణి పర్యయే | దృశ్యన్తే తానితాన్యేవ తథావత్సయుగాదికం || 38 ||

తా || పిదప జనార్దనుడు వాసుదేవుడు పిల్లవాడుగా మారి, విశ్వ నిర్మాణము చేయదలచి ఆతడు వటపత్రమందు శయనించాడు (20) అతని నాభికమలము నుండి లోకకర్తయైన బ్రహ్మ జన్మించాడు. అనేక ఆకారములతో ఒక రూపంలేని అంతా జలమయమైన దాన్ని చూచి (21) వేగంగా, ఉద్వేగముతో, లోకపితామహుడైన బ్రహ్మ ఓపుత్ర! అప్పుడు ఇట్లా అన్నాడు. ఏం చేయాలి అని (22) అప్పుడు దైవవశాత్తు అశరీరవాణి ఆకాశంలో పుట్టింది. ఓ విధి! ధాత! నా దర్శనమయ్యేటట్టుగా తపమాచరించు అని (23) బ్రహ్మ లోకపితామహుడు ఆ మాటను విని, ఘోరమైన, పరమదుష్కరమైన గొప్పతపస్సును ఆచరించాడు (24) అప్పుడు బాల రూపంలో ఉన్న ఆ కమలాపతి నవ్వి, దయతో, బాలుని చేష్టలతో మధురంగా ఇట్లా అన్నాడు (25) శ్రీ విష్ణు వచనము - ఓ పుత్ర! నీవు ఈ వేళ విధి ప్రకారము బ్రహ్మాండ గోళమును చేయి. పాతాళము, భూతలము, సింధు, సాగరకాసనము (26) వృక్షములు, గిరులు, రెండు కాళ్ళు, గలవి పశువులు, పక్షులు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, రాక్షసులు (27) వ్యాఘ్రములు మొదలగునవి. ఎనుబది నాలుగు యోసుల యందున్న జీవులు, తరుగుల్మాదులు, చెమట నుండి పుట్టినవి (పురుగులు), మాయువు నుండి పుట్టేవి, అండజములు (28) ఇరువది ఒక్క లక్ష యోనులు ఒక్కొక్క దానికి చెందినవి. అన్నీ నీవు త్వరగా సృష్టించు అని పలికి అంతర్థానమైనాడు. చెప్పబడినట్లుగా బ్రహ్మ బ్రహ్మాండమునంతా నిర్మించాడు. (29) ఆ బ్రహ్మ సృష్టించిన బ్రహ్మాండమందు - ప్రభువైన విష్ణువు ప్రజాపతి, స్థాణువు, సురగురువు, సూర్యుడు, ప్రచేతనుడు, పరమేష్ఠులు (30) దక్షుడు, దక్షపుత్రులు, సప్తర్షులు, ప్రజాపతులు ఇట్లా ఇరువది ఒక్కరు జన్మించారు. (31) అప్రమేయుడైన ఒక పురుషుడు అట్లాగే వంశ ఋషులు కలిగారు విశ్వేదేవులు ఆదిత్యులు, పసుపులు, అశ్వినీ దేవతలు, (32) యక్షులు, పిశాచులు, సాధ్యులు, పితరులు, గుహ్యకులు, పిదపవిద్వాంసులు, ఎనిమిదిమంది స్వచ్ఛమైన వారు బ్రహ్మర్షులు కలిగారు (33) రాజర్షులు అనేక మంది అన్ని మంచి గుణములు కలవారు, దివము, నీరు, పృథివి, వాయువు, అంతరిక్షము, దిక్కులు (34) సంవత్సరములు, ఋతువులు, మాసములు, పక్షములు, అహోరాత్రములు, కల, కాష్ఠ మూహూర్తాదులు,నిమేషాది భాగములు (35) నక్షత్రములతో కూడిన గ్రహచక్రము, యుగములు, మన్వంతరాదులు లోకంలో కన్పించేది. ఇతరమైన దంతా కల్గింది. (36) ఈ కన్పిస్తున్న స్థాపర జంగమాత్మకమైన చక్రమంతా, యుగక్షయము సంప్రాప్తించినపుడు ఈ జగత్తంతా తిరిగి సంక్షిప్త రూపాన్ని పొందుతుంది. ఓ పుత్ర! (37) మార్పు వచ్చినప్పుడు ఋతువు యందు ఋతు చిహ్నములు నామ రూపములు చూస్తామో అవి అవే అట్లాగే వత్స! యుగాదికము అవి అవే (పాతవే) (38).

మూ|| శివ ఉవాచ -

అతః పరం ప్రవక్ష్యామి కథాం పౌరాణికీం శుభాం | బ్రహ్మణశ్చ తథాపుత్ర వంశ##సై#్యవాసుకీర్తనం || 39 ||

బ్రహ్మణోమానసాః పుత్రాః విదితాః షణ్మహర్షయః | మరీచిరత్ర్యం గిరసౌ పులస్త్యః పులహః క్రతుః || 40 ||

మరీచేః కశ్యపః పుత్రం కశ్యపాచ్చరమాః ప్రజాః | ప్రజజ్ఞిరే మహాభాగా దక్షకన్యాస్త్ర యోదశ || 41 ||

అదితిర్దితిర్దనుః కాలాదనాయుః సింహికాతథా | క్రోధాప్రోవావసిష్ఠాచ వినతా కపిలా తథా || 42 ||

కండూశ్చైవ సునేత్రాచ కశ్యపాయదదౌతదా | అదిత్యాం ద్వాదశాదిత్యాః సంజాతాహి శుభాననాః || 43 ||

సూర్యాద్వైధర్మరాజట్‌జజ్ఞే తేనేదం నిర్మితం పురా | ధర్మేణ నిర్మితం దృష్ట్వా ధర్మారణ్య మనుత్తమం

ధర్మారణ్యమితి ప్రోక్తం యన్మయా స్కంద పుణ్యదం || 44 ||

స్కంద ఉవాచ -

ధర్మారణ్యస్య చాఖ్యానం పరమం తథా | శ్రోతు మిచ్ఛామి తత్సర్వం కధయస్వమహేశ్వర || 45 ||

ఈశ్వర ఉవాచ -

ఇంద్రాద్యాః సకలాదేవా అన్వయుర్ర్బహ్మణాసహ | అహంవైతత్రయాస్వామి క్షేత్రం పాపనిషూదనం || 46 ||

స్కంద ఉవాచ -

అహమప్యాగ మిష్యామి తంద్రష్టుం శశిశేఖర || 47 ||

సూత ఉవాచ -

తతః స్కందః తథారుద్రః సూర్యశ్చైవానిలోసలః | సిద్ధాశ్చైవనగంధర్వాః తథైవాప్సరసః శుభాః || 48 ||

పిశాచా గుహ్యకాః సర్వఇంద్రోవరుణ ఏవచ | నాగాః సర్వాః సమాజగ్ముః శుక్రోవాచ స్పతిస్తథా || 49 ||

గ్రహాః సర్వేసనక్షత్రా వసవోష్ఠౌధ్రువాదయః | అంతరిక్షచరాః సర్వేయే చాన్యేన గవాసినః || 50 ||

బ్రహ్మాదయః సురాః సర్వే వైకుంఠం పరయాముదా | మంత్రణార్థం తదాబ్రహ్మా విష్ణవేమితతేజసే || 51 ||

గత్వాతస్మింశ్చవైకుంఠే బ్రహ్మలోకపితామహః | ధ్యాత్వాముహూర్త మాచష్ట విష్ణుం ప్రతి సుహర్షితః || 52 ||

బ్రహ్మోవాచ -

కృష్ణకృష్ణ మహాబాహో కృపాలో పరమేశ్వర | స్రష్టాత్వం చైవ హర్తాత్వం త్వమేవ జగతః పితా || 53 ||

నమస్తే విష్ణవే సౌమ్య నమస్తే గరుడధ్వజ | నమస్తే కమలాకాంత నమస్తే బ్రహ్మరూపిణ || 54 ||

నమస్తే మత్స్యరూపాయవైనమః | నమస్తే దైత్యనాశాయ భక్తానామ భయాయచ || 55 ||

కంసఘ్నాయనమస్తే స్తుబలదైత్యజితేనమః | బ్రహ్మణౖవంస్తుతశ్చాసీత్‌ ప్రత్యక్షోసౌజనార్దనః || 56 ||

పీతాంబరోఘనశ్యామో నాగారికృతవాహనః | చతుర్భుజో మహాతేజాః శంఖచక్ర గదాధరః || 57 ||

స్తూయమానః సురైః సర్వైః సదేవోమితవిక్రమః | విద్యాధరైస్థథా నాగైః స్తూయమానశ్చ సర్వశః || 58 ||

ఉత్తస్థౌనతదాదేవో భాస్కరామిత దీప్తిమాన్‌ | కోటిరత్న ప్రభాభాస్వత్‌మకుటాది విభూషితః || 59 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే విష్ణు సమాగమోనామ అష్టమోధ్యాయః || 8 |

తా || శివుని వచనము - ఇక ముందు పౌరాణికమైన శుభ##మైన కథను చెప్తాను. పుత్ర! బ్రహ్మయొక్క వంశాను కీర్తనమే (39) బ్రహ్మయొక్క మానస పుత్రులు ఆరుగురు మహర్షులు. వారు అత్రి, మరీచి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతువు (40) మరీచికి కశ్యపుడు, కశ్యపుని నుండి చివరివారు ప్రజలు. దక్షునకు పదముగ్గురు కన్యలు అదృష్ట శాలులు కలిగారు (41) అదితి, దితి, దనువు, కాలా, దనాయు, సింహిక, క్రోథ,ప్రోవా, వసిష్ఠా, వినత కపిల (42) కండూ, సునేత్ర వారిని కశ్యపునికిచ్చి వివాహం చేశాడుఅదితి యందు పన్నెండు మంది ఆదిత్యులు, మంచి ముఖము గలవారు కలిగారు (43) సూర్యుని వలన ధర్మరాజు కలిగాడు. ఆతడు దీనిని పూర్వం నిర్మించాడు. ధర్ముడు నిర్మించిన ప్రధానమైన ఈ ధర్మారణ్యాన్ని చూచి దానిని నేను ధర్మారణ్యమని అన్నాను. ఓ స్కంధ! ఇది పుణ్యము నిచ్చేది. (44) స్కందుని వచనము 6 ధర్మారణ్య కథ పరమ పావనమైనది. ఓ మహేశ్వర! అదంతా వినదలిచాను. చెప్పండి అనగా (45) ఈశ్వరుని వచనము - ఇంద్రాది సకల దేవతలు, బ్రాహ్మణులు కూడా అన్వయించారు. నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ క్షేత్రము పాపముల నశింపచేసేది (46) స్కందుని వచనము - ఓ శశిశేఖర ! దానిని చూడటానికి నేను కూడా వస్తాను అనగా (47) సూతుని వచనము - పిదప స్కందుడు, రుద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, సిద్దులు, గంధర్వులు, శుభ##లైన అప్సరసలు (48) పిశాచులు, గుహ్యకులు అందరు, ఇంద్రుడు, వరుణుడు, నాగులు అందరు శుక్రుడు వాచస్పతి వచ్చారు (49) గ్రహములు, నక్షత్రములు, ఎనిమిది మంది పసుపులు ధ్రువాదులు, అంతరిక్షచరులందరు ఇంకా నాగవాసులితరులందరు వచ్చారు (50) బ్రహ్మాది దేవతలంతా మిక్కిలి ఆనందంతో వైకుంఠం వెళ్ళారు. అమిత తేజస్సుగల విష్ణువుతో సంభాషించే కొరకు వైకుంఠం వెళ్ళాడు. బ్రహ్మకూడా (51) ఆ వైకుంఠమునకు లోకపితామహుడైన బ్రహ్మవెళ్ళి, ముహూర్త కాలము ధ్యానించి, బ్రహ్మ ఆనందంతో విష్ణువుతో ఇట్లాఅన్నాడు (52) బ్రహ్మవచనము - కృష్ణ ! కృష్ణ ! ఓ మహాబాహు! కృపాశు, పరమేశ్వర నీవు సృష్టికర్తవు, లయకారుడవు. నీవు జగత్తులకు తండ్రివి (రక్షకుడవు) (53) ఓ విష్ణు! సౌమ్య! నమస్కారము గరుడధ్వజ! నీకు నమస్కారము. కమలాకాంత, బ్రహ్మరూపి నీకు నమస్కారము (54) విశ్వరూప, మత్స్యరూప నీకు నమస్కారము. దైత్యనాశక, భక్తులకు అభయమిచ్చే వాడ నీకు నమస్కారము (55) కంసుని సంహరించినవాడ నీకు నమస్కారము. బలదైత్యుని జయించిన వాడ నమస్కారము. బ్రహ్మ ఇట్లా స్తుతించగా ఆ జనార్దనుడు ప్రత్యక్షమైనాడు (56) పీతాంబరుడు, ఘనశ్యాముడు, పాముల శత్రువును వాహనంగా గలవాడు, చతుర్భుజుడు, మహాతేజుడు, శంఖచక్రగదాధరుడు (57) ఐన విష్ణువును దేవతలందరూ స్తుతించారు. అమిత విక్రముడైన ఆ దేవుడు విద్యాధరులతో నాగులతో అందరితో పొగడబడి (58) ఆ దేవుడు భాస్కరునికన్న అమితమైన తేజస్సుగలవాడు లేచాడు. కోటి రత్నముల కాంతితో వెలుగుతున్న కిరీట ఆభరణములతో అలంకరింపబడిన వాడు లేచాడు (59) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు విష్ణు సమాగమ మనునది ఎనిమిదవ అధ్యాయము || 8 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters