Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది నాల్గవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

ఏతత్తీర్థస్య మాహాత్మ్యం మయాప్రోక్తంతవాగ్రతః | అనేక పూర్వజన్మోత్థ పాతకఘ్నం మహీపతే || 1 ||

స్థానానా ముత్తమం స్థానం పరం స్వస్త్యయనం మహత్‌ | స్కందస్యాగ్రే పురాప్రోక్తంమహారుద్రేణధీమతా || 2 ||

త్వం పార్థ తత్ర స్నాత్వాహి మోక్ష్యసే సర్వపాతకాత్‌ | తచ్ఛ్రుత్వా వ్యాసవాక్యంహి ధర్మరాజోయుధిష్ఠిరః || 3 ||

ధర్మాత్మజస్తదాతాత ధర్మారణ్యం సమావిశత్‌ | మహాపాతక నాశాయ సాధుపాలన తత్పరః || 4 ||

విగాహ్యతత్ర తీర్థాని దేవతాయతనానిచ | ఇష్టాపూర్తాదికం సర్వం కృతంతేన యథేప్సితం || 5 ||

తతః పాప వినిర్ముక్తః పునర్గత్వాన్వకంపురం | ఇంద్రప్రస్థంమహాసేన శశాసవ సుధాతలం || 6 ||

ఇదంహిస్థాన మాసాద్యయే శృణ్వంతి నరోత్తమాః తేషాం భుక్తిశ్చముక్తిశ్చ భవిష్యతిన సంశయః || 7 ||

భుక్త్వాభోగాన్‌ పార్థివాంశ్చపరంనిర్వాణ మాప్నుయుః | శ్రాద్ధకాలేచ సంప్రాప్తే యే పఠంతి ద్విజాతయః || 8 ||

ఉద్ధృతాః పితరసై#్తస్తు యావచ్చం ద్రార్కమేదిని | ద్వాపరేచ యుగే భూత్వా వ్యాసేనోక్తం మహాత్మనా || 9 ||

వారి మాత్రే ధర్మ వాప్యాంగయాశ్రాద్ధ ఫలం లభేత్‌ | అత్రాగతస్యమర్త్యన్య పాపం యమపదేస్థితం || 10 ||

కథితం ధర్మపుత్రేణ లోకానాం హితకామ్యయా | వినా అన్నైర్వినాదర్భైర్వినాచాననమేవవా || 11 ||

తోయేన నాశమాయాతి కోటిజన్మకృతం త్వఘం | సహస్ర మురుశృంగీణాం ధేనూనాం కురుజాంగలే

దత్వాసూర్యగ్రహెపుణ్యం ధర్మవాప్యాంచ తర్పణాం | || 12 ||

ఏతద్వః కథితం సర్వం ధర్మారణ్యస్య చేష్టితం | యచ్ఛ్రుత్వా బ్రహ్మహాగోఘ్నోముచ్యతే సర్వపాతకైః || 13 ||

ఏన వింశతి వారైస్తు గయాయాం పిండపాతనే | తత్ఫలం సమవాప్నోతి సకృదస్మిన్‌ శ్రుతేనతి || 14 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య తీర్థ మాహాత్మ్యే ప్రభావ కథనం నామ చతుర్విం నామ వింశో7ధ్యాయః || 24 ||

తా || వ్యాసుని వచనము - ఈ తీర్థ మాహాత్మ్యాన్ని నేను మీ ఎదురుగా చెప్పాను. ఓ మహీపతి! ఇది అనేక పూర్వజన్మలలో కల్గిన పాతకముల నశింపచేసేది (1) స్థానములన్నింటిలో ఉత్తమస్థానము. మిక్కిలి గొప్ప క్షేమకర ప్రదేశము. స్కందుని ఎదురుగా పూర్వంధీమంతుడైన మహారుద్రుడు చెప్పాడు (2) ఓ పార్థ నీవక్కడ స్నానంచేసి అన్ని పాపముల నుండి ముక్తుడవౌతావు. ఆ వ్యాసవాక్యాన్ని విని ధర్మరాజు, యుధిష్ఠిరుడు (3) ధర్మాత్మజుడు అప్పుడు ధర్మారణ్యము ప్రవేశించాడు. మహాపాతకముల నాశనం కొరకు సాధుపాలన తత్పరుడై వచ్చాడు (4) అక్కడ తీర్థమలందు స్నానం చేసి, దేవాలయములను దర్శించి, ఇష్టాపూర్వము మొదలుగా అన్ని కార్యములు తనకు నచ్చిన రీతిలో చేసినవారు (5) పాపవి నిర్ముక్తులౌతారు. తిరిగి తమ ఇంటికి చేరిన వారు తమ రాజ్యాన్ని ఇంద్రప్రస్థమువలె శాసిస్తారు. ఓ మహాసేన (కుమారస్వామి) (6) ఇక్కడికివచ్చి దీనినివిన్న నరోత్తములు భుక్తిని ముక్తిని పొందుతారు. అనుమానములేదు (7) పార్థివభోగములన్ని పొంది పిదప నిర్వాణాన్ని పొందుతారు. శ్రాద్ధకాలం వచ్చినపుడు దీనిని చదివిన ద్విజాతులు (8) పితరులు చంద్రుడు, సూర్యుడు, భూమి ఉన్నంతకాలము ఉద్ధరింపబడతారు. మహాత్ముడైన వ్యాసుడిట్లా చెప్పాడు. ద్వాపరయుగమందైతే (9) నీటిమాత్రం చేతనే ధర్మవాపి యందు గయా శ్రాద్ధఫలము కలుగుతుంది అని. ఇక్కడికి వచ్చిన నరుని పాపము యమపాదమందుంటుంది (10) లోకముల హితము కొరకు ధర్మపుత్రుడిది చెప్పాడు. అన్నము లేకున్నా, దర్భలులేకున్నా, ఆసనము లేకున్నా (11) కోటి జన్మలలో చేసిన పాపము నీటితో నశిస్తుంది. మంచి శృంగములు గల ధేనువులను వేయింటిని కురుజాంగలమందు సూర్యగ్రహణమందు దానంచేస్తే కలిగే పుణ్యము ధర్మవాపి యందు తర్పణం చేస్తే కలుగుతుంది (12) నేన మీకు ఈ ధర్మారణ్య వృత్తాన్నంతా చెప్పాను. దీనిని విన్న బ్రహ్మహత్యా పాతకి, గోహత్య పాతకి సర్వపాపముల నుండి ముక్తుడైతాడు. (13) ఇరువది యొక్క మారులు గయలో పిండదానం చేయటంవల్ల వచ్చే పుణ్యము, దీనిని ఒక్కసారి వింటే లభిస్తుంది. (14) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య తీర్థ మాహాత్మ్య ప్రభావ కథనమనునది ఇరువది నాల్గవ అధ్యాయము || 24 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters