Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఐదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అధాన్యత్సం ప్రవక్ష్యామి తీర్థమాహాత్మ్య ముత్తమం | ధర్మారణ్య యథా7నీతా సత్యలోకాత్సరస్వతీ || 1 ||

మార్కండేయం సుఖాసీనం మహాముని నిషేవితం | తరుణాదిత్య సంకాశం సర్వశాస్త్ర విశారదం || 2 ||

సర్వతీర్థ మయం దివ్యం ఋషీణాంప్రవరంద్విజం | ఆసనస్థం సమాయుక్తంధన్యంపూజ్యందృఢవృతం || 3 ||

యోగాత్మానం పరంశాంతం కమండలు ధరంవిభుం | అక్షసూత్ర ధరం శాంతం తథాకల్పాంతవాసినం || 4 ||

అక్షోభ్యం జ్ఞానినం స్వస్థం పితామహ సమద్యుతిం | ఏవం దృష్ట్వా సమాధిస్థం ప్రహర్షో త్ఫుల్లలోచనం || 5 ||

ప్రణమ్యస్తుతి భిర్యుక్త్యా మార్కండం మునయో7బ్రువన్‌ | భగవన్నై మిశారణ్య సత్రే ద్వాద శవార్షికే || 6 ||

త్వయావతారితా బ్రహ్మన్‌ నదీయా బ్రహ్మణఃసుతా | తథాకృతం చతత్రైవ గంగావతరణంక్షితౌ || 7 ||

గేయమానేకులపతేః శౌనకస్యమునేః పురః | సుతేసమునినాఖ్యాత మన్యేషా మపిశృణ్వతాం || 8 ||

తచ్ఛ్రుత్వామహదాఖ్యానం అస్మాకం హృదిసంస్థితం | పాపఘ్నీపుణ్య జననీ ప్రాణినాం దర్శనాదపి || 9 ||

మార్కండేయ ఉవాచ -

ధర్మారణ్య మయావిప్రాః సత్యలోకాత్సరస్వతీ | సమానీతా సురేఖాద్రౌ శరణ్యా శరణార్థినాం || 10 ||

భాద్రపదేసితే పక్షే ద్వాదశీ పుణ్యసంయుతా | తత్ర ద్వారావతీ తీర్థే మునిగంధర్వసేవితే || 11 ||

తస్మిన్‌ దినే చతత్తీర్థే పిండదానాది కారయేత్‌ | తత్ఫలం సమవాప్నోతి పితౄణాం దత్తమక్షయం || 12 ||

మహదాఖ్యాన మఖిలం పాపఘ్నం పుణ్యదంచయత్‌ | పవిత్రంయత్‌ పవిత్రాణాం మహాపాతక నాశనం || 13 ||

సర్వమంగళ మాంగల్యం పుణ్యంసారస్వతంజలం | ఊర్ధ్వంకిందివి యత్పుణ్యంప్రభాసాంతేవ్యవస్థితం ||14 ||

సారస్వత జలంనౄణాం బ్రహ్మహత్యాం వ్యపోహతి | సరస్వత్యాం నరాఃస్నాత్వా సంతర్ప్య పితృదేవతాః || 15 ||

పశ్చాత్పిండ ప్రదాతారోనభవంతిస్తసంధయాః | యథాకామ దుఘాగావో భవంతీష్ట ఫలప్రదాః

తధాస్వర్గాపవర్షై కహెతు భూతా సరస్వతీ || 16 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే సరస్వతీ మాహాత్మ్య వర్ణనం నామ పంచవింశో7ధ్యాయః || 24 ||

తా || సూతుని వచనము - ఇంకా ఇంకో ఉత్తమమైన తీర్థమాహాత్మ్యాన్ని చెబుతాను. ధర్మారణ్యమునకు సత్యలోకము నుండి సరస్వతి ఎట్లా వచ్చిందో చెబుతాను (1) సుఖంగా కూర్చున్న, మహామునులతో సేవించబడుతున్న మార్కండేయుని, బాలసూర్యుని వంటి కాంతిగలవానిని, సర్వశాస్త్రములలో విశారదుని (2) సర్వతీర్థమయుని, దివ్యుని ఋషులలో శ్రేష్ఠుని, ద్విజుని, ఆసనమందున్న వానిని, మంచియోగిని, ధన్యుని, పూజ్యుని, దృఢవ్రతుని (3) యోగాత్ముని, వరుని, శాంతిని, కమండలుధరుని, విభుని, అక్షసూత్రధరుని శాంతుని, అట్లాగే కల్పాంతమందు ఉండేవాడిని (4) కలతలేనివానిని, జ్ఞానిని, స్వస్థుని, పితామహునితో సమానమైన ద్యుతిగలవానిని, సమాధియందున్నవానిని, ఆనందంతో వికసించిన కళ్ళు గల వానిని, ఇట్టి వానిని (5) చూచి నమస్కరించి, స్తుతించి, తగిన విధముగా మార్కండేయునితో మునులిట్లా అన్నారు. ఓ భగవాన్‌! నైమిషారణ్యమందు, ద్వాదశ వార్షిక సత్రమందు (యాగం) (6) మీరు అవతరింపచేసిన నది, బ్రహ్మసుతయైనది సరస్వతి అక్కడే ఆ భూమి యందే అట్లాగే గంగావతరణము చేయబడింది కదా (7) కులపతియైన శౌనకముని ఎదుట చెప్పబడుతుండగా , ఇతరులు కూడా వింటుండగా సూతముని చెప్పాడు గదా. (8)ఆ మహా ఆఖ్యానము విన్నాక అది మా హృదయములో నిలిచిపోయింది. అది పాపఘ్ని పుణ్యములు కల్గించేది. దర్శన మాత్రంచేతనే ప్రాణులకు పుణ్యదాయి (9) అనగా మార్కండేయుని వచనము - ధర్మారణ్య మందు నేను సత్యలోకము నుండది సరస్వతిని తీసుకొచ్చాను. ఓ బ్రహ్మణులార! సురేఖాద్రి యందు ఆనది శరణార్థులక శరణీయమైనది (10) భాద్రపద శుక్లపక్ష ద్వాదశిన పుణ్యవంతమైనది. మునులు గంధర్వులు సేవించే ద్వారవతితీర్థమందు (11) ఆ రోజు ఆ తీర్థమందు పిండ దానాదులు చేయాలి. చేస్తే ఆ ఫలం వస్తుంది. పితరులకు ఇచ్చింది అక్షయమౌతుంది. (12) మహత్‌ అభ్యాసము ఇదంతా పాపనాశిని, పుణ్యదాయిని, పవిత్రములన్నింటికన్న పవిత్రమైనది. మహాపాతకముల నశింపచేసేది (13) సర్వమంగళములకు మంగళ ప్రదము పుణ్యమైనది. ఈ సరస్వతి జలము. ప్రభాసాంతమందు స్వర్గమందు ఏ పుణ్యముందో దానికన్న ఊర్థ్వమైనదది చెప్పేదేమి. (14) సారస్వత జలము నరుల బ్రహ్మహత్య పాపమున తొలగిస్తుంది. నరులు సరస్వతిలో స్నానంచేసి పితృదేవతలకు తర్పణచేసిన, పిదప పిండదానము చేసినవారు తిరిగి స్తనంధయులు (రొమ్ముపాలు తాగేవారు) కారు (జన్మించరు) (15) కోరికలనిచ్చే గోవు (కామధేనువు)లు ఇష్టమైన ఫలముల నిచ్చినట్లు అట్లాగే సరస్వతినది స్వర్గ అపవర్గములకు ఒకే కారణమైనట్టిది. (16) అని శ్రీ స్కాంద మహాపురాణము నందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు సరస్వతీ మాహాత్మ్య మర్ణనమనునది ఇరువది ఐదవ అధ్యాయము || 25 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters