Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఎనిమిదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

గోవత్సాన్నైఋతేభాగే దృశ్యతే లోహయష్టికా | స్వయంభులింగరూపేణ రుద్రః తత్రస్థితః స్వయం

శ్రీ మార్కండేయ ఉవాచ -

మోక్షతీర్థే సరస్వత్యానభ##స్యే చంద్ర సంక్షయే | విప్రాన్‌ సంపూజ్య విధివత్‌తే భ్యోదత్వాచ దక్షిణాం || 1 ||

ఏకవింశతివారాంస్తుభక్త్యా పిండస్యయత్ఫలం | గయాయాంప్రాప్యతేపుంసాంధ్రువంతదిహతర్పణాత్‌ || 2 ||

లోహయిష్ట్వాం కృతేశ్రాద్ధేన భ##స్యే చంద్రసంక్షయే | ప్రేతయోనివినిర్ముక్తాః క్రీడంతి పితరోదివి || 3 ||

అపినః సంకులే భూయాత్‌ యోవైదద్యాత్తిలోదకం | పిండంవాప్యుదకం వాపిప్రేతపక్షే విధూదయే || 4 ||

లోహయష్ట్యాం అమావస్యాం కార్యం భాద్రపదేజనైః | శ్రాద్ధంవైమునయః ప్రాహుః పితరోయదివల్లభాః || 5 ||

క్షీరణతుతిలైః శ్వేతైః స్నాత్వాసారస్వతే జలే | పితౄస్తర్పయతే యస్తుతృప్తాస్త త్పితరోధ్రువం || 6 ||

తత్రశ్రాద్ధాని కుర్వీత సక్తుభిః వయసా సహ | అమావాస్యాదినం ప్రాప్య పితౄణాం మోక్షమిచ్ఛకైః || 7 ||

రుద్రతీర్థేతతోధేనుం దద్యాత్‌ వస్త్రాది భూషితాం | విష్ణుతీర్థేహిరణ్యం చ ప్రదద్యాత్‌ మోక్షమిచ్ఛుకః || 8 ||

గయాయాం పితృరూపేణ స్వయమేవజనార్దనః | తంధ్యాత్వా పుండరీకాక్షం ముచ్యతేచఋణత్రయాత్‌ || 9 ||

ప్రార్థయేత్తత్రగత్వాతం దేవదేవం జనార్దనం | ఆగతో7స్మిగయాం దేవ పితృభ్యః పిండదిత్సయా

ఏషపిండోమయాదత్తస్తవహస్తే జనార్దన || 10 ||

పరలోకగతేభ్యశ్చ త్వం హిదాతా భవిష్యసి | అనేనై వచమంత్రేణ తత్ర దద్యాత్‌ హరేః కరే || 11 ||

చంద్రేక్షీణ చతుర్దశ్యాంస భ##స్యే పిండమాహరేత్‌ | పితౄణా మక్షయా తృప్తిః భవిష్యతిన సంశయః || 12 ||

ఏకవింశతి వారంశ్చగయాయాంపిండ పాతనైః | భక్త్యాతృప్తి మవాప్నోతి లోహయష్ట్వాం పితృతర్పణ || 13 ||

వారిదస్తృప్తి మాప్నోతి సుఖమక్షయ్యమత్రహి | సుఖప్రదః సుతాన్‌ భక్తానారోగ్యమభయప్రదః ||14 ||

విత్తం న్యాయార్జితం దత్తం స్వల్పంతత్ర మహాఫలం | స్నానేనా పిహి తత్తీర్థే రుద్రస్యానుచరోభ##వేత్‌ || 15 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్య్యే సంక్షేపతః తీర్థమాహాత్మ్య వర్ణనం నామ అష్టావింశో7ధ్యాయః || 28 ||

తా || వ్యాసుని వచనము - గోవత్సమునకు నైఋతి భాగంలో లోహయష్టిక కన్పిస్తుంది. స్వయం భులింగరూపంలో అక్కడ స్వయంగా రుద్రుడున్నాడు. శ్రీ మార్కండేయుల వచనము - భాద్రపద మాసమందు కృష్టపక్షమందు సరస్వతి యొక్క మోక్షతీర్థమందు బ్రాహ్మణులను విధి ప్రకారముగా పూజించి, వారికి దక్షిణను ఇవ్వాలి (1) ఇరువదొక్కమారులు గంగలో భక్తితో పిండ ప్రదానంచేసినందువల్ల వచ్చే ఫలము ఇక్కడ ఒక్కసారి తర్పణము వల్ల నరులకు లభిస్తుంది. నిశ్చయము (2) లోహయష్టి యందు భాద్రపదం కృష్ణపక్షంలో శ్రాద్ధంచేస్తే పితరులు ప్రేతయోని, వినిర్ముక్తులై స్వర్గంలో ఆనందిస్తారు (3) మాకు అందరికి కలిపి తిలోదకమివ్వాలి. కృష్ణ పక్షమందు చంద్రోదయమందు పిండముకాని ఉదకముకాని ఇవ్వాలి (4) లోహయష్ఠి (స్థలం) యందు, భాద్రపద అమావాస్య యందు జనలు శ్రాద్ధం చేయాలి. పితరులు ఇష్టమైతే వారి కొరకు శ్రాద్ధాచరణ అని మునులన్నారు (5) సారస్వత జలమందు స్నానంచేసి పాలతో, తెల్ల నువ్వులతో పితృతర్పణ చేసిన వాని పితరులు తృప్తులౌతారు నిశ్చయము (6) అక్కడ శ్రాద్ధమును సత్తుతో (పిండి) పాలతో సహ చేయాలి. ఆమావాస్యరోజు, పితరులకు మోక్షం కోరేవారు చేయాలి (7) వస్త్రాది భూషితమైన ధేనువును రుద్రతీర్థమందు ఇవ్వాలి. మోక్షాన్ని కోరేవాడు విష్ణుతీర్థమందు బంగారం దానంచేయాలి. (8) గయలో పితృరూపంతో జనార్దనుడు స్వయంగా ఉన్నాడు. ఆ పుండరీకాక్షుణ్ణి ధ్యానిస్తే ఋణత్రయం నుండి ముక్తుడౌతాడు (9) అక్కడికి వెళ్ళి ఆ దేవదేవుని జగత్పతిని ప్రార్థించాలి. ఓదేవ! పితరులకు పిండమిచ్చే కొరకు గయకు వచ్చాను. ఈ పిండాన్ని నేను నీచేతికిస్తున్నాను. ఓ జనార్దన. (10) పరలోకమునకు వెళ్ళిన వారికి నీవేదాతవు. ఈ మంత్రంతోనే హరిచేతియందు ఇవ్వాలి, అక్కడ (11) భాద్రపదం కృష్ణపక్షం చతుర్దశి యందు పిండమివ్వాలి. పితరులకు అక్షయతృప్తి లభిస్తుంది. అనుమానంలేదు (12) ఇరువై ఒక్క మారులు గయయందు పిండం భక్తితో ఇవ్వటం వలన తృప్తిని పొందుతారు. లోహయష్టి యందు భక్తితో, పితృతర్పణం వల్లనే తృప్తిని పొందుతారు. (13) ఇక్కడ నీటి తర్పణమిస్తే తృప్తిని పొందుతారు. అక్షయ్య సుఖాన్ని పొందుతారు. ఫలప్రదుడు సుతులను, భక్తులను ఆరోగ్యమున ఇస్తాడు. (14) అక్కడ న్యాయంగా సంపాదించిన డబ్బు కొంచెం ఇచ్చినా మహా ఫలాన్ని ఇస్తుంది. ఆ తీర్థంలో స్నానం చేయటంవల్లనైనా సరే రుద్రుని అనుచరుడౌతాడు (15) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు సంక్షేపముగా తీర్థ మాహాత్మ్య వర్ణనమనునది ఇరువది ఎనిమిదవ అధ్యాయము || 28 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters