Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

అతః పరం శృణుధ్వంహి లోహానురవిచేష్టితం | బలే ః పుత్ర శతస్యాపి కథయిష్యామి విశ్రుతం ||1 ||

యధాసౌభ్రాతరౌ వృద్ధౌ ప్రాపతుః స్థానముత్తమం | తదా ప్రభృతి వైరాగ్యం దైత్యోలోహసురేదధౌ || 2 ||

కింకరోమిక్వగచ్ఛామి తవసే స్థానముత్తమం | యస్యపారంనజానంతి దేవతామునయోనరాః || 3 ||

కోమయా7రాధ్యతాం దేవోహృదిచింతయతే భృశం | ఇతిచింతయతస్తస్యమతి ర్జాతామహాత్మనః || 4 ||

దధౌగంగాం స్వశీర్షేణ పుష్పవంతౌ చనేత్రయోః | హృదానారాయణం దేవం బ్రహ్మాణంకటి మండలే || 5 ||

ఇంద్రాద్యా దేవతా స్సర్వేయద్దేహె ప్రతిబింబితాః | ప్రవశ్యంతి తదాత్మానం భాస్కరః సలిలేయథా || 6 ||

తమేవారాథయిష్యామి నిరంజసమకల్పషః | ఏవంకృత్వామతిందైత్యః తపస్తేపేసుదుష్కరం

భీతోజన్మ భయాద్ఘోరాత్‌దుష్కరంయన్మహాత్మభిః || 7 ||

అంబుభక్షౌ వాయుభక్షః శీర్ణపన్ణాశనస్తథా | దివ్యం వర్షశతం సాగ్రం యదాతేపేమహత్తవః

తతస్తుతోషభగవాన్‌ త్రిశూలవరధారకః || 8 ||

ఈశ్వర ఉవాచ -

పరం పృణీష్వ భద్రంతే మనసాయద భీప్సితం | లోహాసుర మయాదేయం తవనాస్తి తపోబలాత్‌ || 9 ||

ఇత్యుక్తో దాన వస్తత్ర శంకరాగ్రేవచో7బ్రవీత్‌ || 10 ||

లోహోసుర ఉవాచ -

యదితుష్ఫో సిదేవేశ పరమేకం పృణోమ్యహం | శరీర స్యాజరత్వంచ మామృత్యోదపిమేభయం || 11 ||

జన్మన్యస్మిన్‌ ప్రభోభూయాత్‌ స్థాతప్యం హృదయేమమ | ఏవమస్తుశివః ప్రాహతత్ర తం దాన వేశ్వరం || 12 ||

శర్వలబ్ధవరోదైవాత్‌ పునస్తేపే మహత్తవః | రమ్యే సరస్వతీ తీరే తరణాయ భవార్జవాత్‌ || 13 ||

వత్సరాణాం సహస్రాణి ప్రయుతాన్యర్బుదానిచ | శంకతే భగవానింద్రో భీతస్తస్య తపోబలాత్‌ || 14 ||

మామేపదచ్యుతిర్భూయాత్‌దైత్యాల్లోహానురాత్క్వచిత్‌ | మఘవాన్‌గుప్తరూపేణ సమేత్యా శ్రమకాననం || 15 ||

తపోభంగం ప్రకురుతే కంపయిత్వా మహాసురం | తాడయంతి శరీరేతం ముష్ఠిభిః తీక్ణకర్కశైః || 16 ||

అధతేనచదైత్యే ధ్యాన ముత్సృజ్యవీక్షితం | ఇంద్రేణ తత్కృతం సర్వంతపోబలవినాశనం || 17 ||

తస్యతైరభ్యవద్యుద్ధంఇంద్రాద్యైరధకర్కశైః | ఏకస్యబహుభిఃసార్థందేవాస్తేతేనసంయుగే || 16 ||

రుధిరాక్లిన్నదేహావైప్రహారైః జర్జరీకృతాః | కేశవంశరణం ప్రాప్తాత్రాహిత్రాహీతిభాషిణః || 19 ||

తా || సూతులిట్లన్నారు - ఇకముందు, లోహాసురుని చేష్టలను వినండి. బలియొక్క నూరుగురు పుత్రుల గురించి వివరంగా చెబుతాను (1) ఎప్పుడైతే వృద్ధులైన ఆఅన్నదమ్ములు ఉత్తమస్థానాన్నిపొందారో, నాటినుండిదైత్యుడైనలోహసురునిలో వైరాగ్యమేర్పడింది. (2) ఏంచేయను ఎక్కడికివెళ్ళను ? తపస్సుకు ఉత్తమస్థానమేది. దేవతలు, మునులు,నరులు తెలసుకోలేని అంతముగల తత్వమేది (3) నేను ఏదేవుని ఆరాధించాలి, ఎవనిని మిక్కిలిగా హృదయంలో ధ్యానించాలి. అని ఆలోచిస్తున్న ఆమహాత్మునకుఇట్లాబుద్ధిపుట్టింది (4) తలలో గంగను ధరించిన సూర్యచంద్రులను కళ్ళుగాగలిగిన, హృదయంలో నారాయణుని, కటిమండలమందుబ్రహ్మను (5) ఇంద్రాదిదేవతలనందరిని తనదేహమందు ప్రతిబింబించు కున్న వానిని అట్టిఆత్మను (పరమాత్మను) నిరంజనమును, అకల్మషమైన మనస్సుతోద్యానిస్తాను. ఆఆత్మను నీటిలో సూర్యబింబ మునువలె మహాత్ములు చూడగలుగుతున్నారు గదా. (6) ఆనిమనస్సులో అనుకొని ఆరాక్షసుడు చాలాదుష్కర మైన తపస్సును ఆచరించాడు. ఘోరమైన జన్మభయంతో భయపడిమహాత్ములకుదుష్కరమైన తపమాచరించాడు. (7) నీరును భక్షిస్తూ, వాయువుభక్షిస్తూ, ఎండినఆకులుతింటూ, నూరుసంవత్సరాలు దివ్యమైన, ఉగ్రమైనగొప్పతపస్సును ఆచరించగానే, త్రిశూలమును ధరించిన భగవంతుడు ఆనందపడ్డాడు (8) ఈశ్వరునివచనము - నీమనస్సుకిష్టమైననీకు క్షేమకరమైన వరమునుకోరుకోఓలోహాసుర! నీ తపోబలంవల్లనేనునీకివ్వగలిగిందిఏమీలేదు(9) అనిఅనగాఆదానవుడుశివునిఎదుట ఇట్లాపలికాడు (10) లోహాసురునివచనము - ఓవేదేశ! ఒకవేళనీవుసంతుష్టుడవైతే నేనొకవరంకోరుతాను, నా శరీరం ముసలిదికాకూడదు. నాకుమృత్యువునుండిభయంఉండకూడదు (11) ఓప్రభు! ఈజన్మలో ఇదిజరగాలి. నాహృదయంలో నీవువుండాలి అనిఅనగా, శివుడు ఆరాక్షసునితో అట్లాగేకానిమ్మనిఅన్నాడు (12) అదృష్టవశాత్తూ శివునినుండి వరముపొందిన ఆతడు తిరిగి గొప్పతపమాచరించాడు సంసారరసాగరంనుండి తరించేకొరకు అందమైనసరస్వతీ తీరమందుతపమాచరించాడు. (13) వేలకొలదిఅర్బుదములతో కూడిన సంవత్సరాలుగడిచాయి ఆతనితపోబలంతో భయపడిభగవానింద్రరుడుఅనుమానించ సాగాడు (14) దైత్యుడైనలోహాసురునివల్ల ఎట్టిస్థితిలోపదచ్యుతి కారాదు. ఇంద్రుడు మారురూపంతోఆశ్రమమందలిఅడవికి వచ్చి (15) మహాసురుని కదిలించి తపోభంగం ఆచరించాడు. తీక్షణమైన కర్కశపిడికిటిగుద్దులతో ఆరాక్షసునిశరీరంపై కొట్టాడు (16) అప్పుడు ఆరాక్షసుడు ధ్యానాన్నివిడిచిచూచాడు. ఇంద్రుడు అదంతాతపోబలనాశనంకొరకుచేశాడు.(17) వానికికర్కశులైన ఇంద్రాదులతో యుద్ధంజరిగింది. ఒక్కనికిఅనేకమందితోయుద్ధంజరిగింది. వానితోయుద్ధంలోఆదేవతలు (18) రక్లసిక్తశరీరులైదెబ్బలతో శిథిలమైనశరీరం కలవారైత్రాహి త్రాహిరక్షించుఅని అంటూకేశవునిశరణువేడారు. (19)

మూ || సూతఉవాచ -

దేవానాంవాక్యమాకర్ణ్యవాసుదేవోజనార్దనః | యుయుధేకేశవస్తేనయుద్ధేవర్షశతంకిల || 20 ||

తతోనారాయణంతత్రజిగాయనవరోర్జితః | అధనారాయణోదేవోజితోలోహానురేణతు || 21 ||

మంత్రయామానరుద్రేణబ్రహ్మణాచపునఃపునః | మీమాంసిత్వాత్రయోదేవాఃపునర్యుద్థసముద్యమం || 22 ||

లోహాసురస్యదైత్యస్యవపుర్‌దృష్ట్వాపునర్నవం | మహాదాసీత్పునర్యుద్ధందైత్యకేశవయోస్తతః || 23 ||

సమమారయదాదైత్యోవిష్ణునాప్రభవిష్ణునా | తరసాతంకేశవో7పి పాతయామానభూతలే || 24 ||

ఉత్తాసంపతితందృష్ట్వాపినాకీపరమేశ్వరః | దధారహృదయేతస్యస్వరూపంరూపవర్జితః || 25 ||

కంఠేతస్థౌతతోబ్రహ్మాతస్యలోహానురస్యచ | చరణౌపీడయామానస్వస్థిత్యాపురుషోత్తమః || 26 ||

అధదైత్యఃసముత్తస్థౌభృశంబద్థోపిభూతలే | దృష్టోత్థితంతతోదైత్యంపాతయంతసురోత్తమాన్‌ || 27 ||

ఉవాచదివ్యయావాచావిరించిఃకమలాసన || 28 ||

బ్రహ్మోవాచ -

లోహానురసదారక్షవాచోధర్మభీక్ణశః | త్వయాయత్ర్పార్థితంరుద్రాత్‌తదేవసముపస్థితం || 29 ||

అహంవిష్ణుశ్చరుద్రశ్చత్రమో7మీనురస్తమాః | త్వదేహముపవేక్ష్యామోమావదాభూతసంప్లవం || 30 ||

దానవేశశివప్రాప్తిఃభావభ##క్త్యైవజామతే | శివంచాలాయితుంబుద్ధిఃకథంతపభవిష్యతి || 31 ||

అచలాంశ్చలద్యేద్యస్తుప్రాసాద్యాబ్రాహ్మణాపురాన్‌ | అచీరేణౖవకాలేనసాతకేనైవతిప్యతే || 32 ||

శ్మశానవత్పరీత్యాజ్యఃసత్యధర్మబహిష్కృతః | సత్యవాగసిభద్రంతేమావిచాలమదేవతాః || 33 ||

యేనమాతాస్తుపితరోమేనమాతాఃపితామహాః | తేనమార్గేణగంతప్యంనచోల్లంఘ్యోసతాంగతిః || 34 ||

దానవేశపితాతేహిదదేలోకత్రయంహరేః | వాక్పాశబద్ధఃపాతాలేరాజ్యంచక్రేమహీపతిః || 35 ||

తతాత్వమసివాక్పాశాచ్ఛివభక్తిసమన్వితః | భూతలేతిష్ఠదైత్యేంద్రమావాగ్వైకల్యమాప్నుహి || 36 ||

పరాంస్తేచప్రదాస్యామోమావిచాల్యామీదేవతా || 37 ||

తా || సూతులిట్లన్నారు :- వాసుదేవుడైన జనార్దనుడుదేవతలమాటనువినికేశవుడునూర్లసంవత్సరాలువానితోయుద్ధం చేశాడు. (20) వరములతో అధికుడైన ఆరాక్షసుడునారాయణునిజయించాడు. లోహాసురునితో జయించబడిన నారాయణుడు (21) బ్రహ్మతోరుద్రునితో చాలాసార్లుఆలోచనచేశాడు. ముగ్గురుదేవతలుచర్చించుకొనితిరిగియుద్ధప్రయత్నంచేశారు. (22) దైత్యుడైన లోహాసురుని నిత్యనూతనమైన శరీరాన్నిచూచాకతిరిగిదైత్యకేశవులకు గొప్పయుద్ధంజరిగింది (23) విష్ణువు ప్రభ విష్ణువుఆరాక్షసుని చంపలేకపోయాడు. కేశవుడు ఆతనినిభూమిపై పడవేసాడు (24) పడిలేవబోతున్నవానినిచూచిపినాకీ పరమేశ్వరుడు వాని హృదయమును రూపరహితమైనతనరూపముతో బంధించాడు (25) బ్రహ్మ ఆరాక్షసుని కంఠమందు ఉన్నాడు పురుషోత్తముడుతాను నిల్చొని ఆతనిపాదములను పీడించసాగాడు. (26) ఆపిదప దైత్యుడు, భూమి యందు గట్టిగా బంధింపబడ్డా లేచాడు. లేచిన దేవతలను పడవేస్తున్న ఆరాక్షసునిచూచి (27) దివ్యవాణితో కమలాసనుడు విరించి ఇట్లా అన్నాడు (28) బ్రహ్మవచనము :- ఓలోహాసుర! మిక్కిలిగాధర్మవాక్కులనుఎప్పుడూ రక్షిస్తూ ఉండు. నీవు రుద్రుని ఏదిప్రార్థించావో అదేనీకులభించింది (29) నేను విష్ణువురుద్రుడు ముగ్గురముదేవతోత్తములను. ప్రాణికోటి ప్రలయంజరిగేదాకనీశరీరమందుంటాము (30) ఓదానవేశ! భావభక్తితోనేశివప్రాప్తి కల్గుతుంది. శివున్నికదిలించాలనే బుద్ధినీకెలాకల్గుతుంది. (31) కదిలికలేనివాటినిప్రాసాదములనుబ్రాహ్మణులనుపురములను కదిలించేవాడు త్వరలోనే పాతకములకులోనౌతాడు. (32) శ్మశానంలాగా ఆతనినివిడిచిపెట్టాలి. ఆతడు సత్యధర్మ బహిష్కృతుడు. నీవు సత్య వాక్యుడవు. నీకు క్షేమంకలగని. దేవతలనుకదిలించకు (33) పితరులు ఏమార్గంలో వెళ్ళారో పితామహులు ఏమార్గంలో వెళ్లారో ఆమార్గంలోవెళ్ళాలి. సజ్జనులమార్గాన్నివిడువరాదు (34) ఓ దానవేశ! నీ తండ్రి ముల్లోకములను హరికి ఇచ్చాడు. మాటకుబద్ధుడైన ఆరాజు పాతాళంలో రాజ్యంచేశాడు. (35) అట్లాగేనీవు కూడా వాక్కుఅనే పాశముతో శివభక్తికలవాడవై భూమియందు ఉండు. ఓ దైత్యేంద్ర! వాక్‌వైకల్యమునుపొందవద్దు. (36) నీకువరములను కూడాఇస్తాము. దేవతలను కదల్చరాదు. (37)

మూ || వ్యాస ఉవాచ -

తచ్ఛ్రుత్వాబ్రహ్మణోవాక్యంసతుష్టోదానవేశ్వరః | ప్రాహప్రసన్నయావాచాబ్రహ్మాణంకేశసంహరం || 38 ||

లోహాసురఉవాచ -

వాక్పాశబద్ధంతిష్ఠామినపునర్భవతాంబలే | బ్రహ్మావిష్ణుశ్చరుద్రశ్చత్రయో7మీనురసత్తమా || 39 ||

స్థాస్యంతిచేచ్ఛరీరేమేకింసలబ్ధంమయాతతః | ఇదంకలేవరంమేహిసమారూఢంత్రిభిఃసురైః || 40 ||

భూమ్యాంభవతువిఖ్యాతం మత్ర్పభావాత్‌సురోత్తమాః || 41 ||

లోహాసురస్యవాక్యేనహర్షితాఃత్రిదశాస్త్రయః | దదుఃప్రత్యుత్తరంతసై#్మబ్రహ్మశిష్ణుమహేశ్వరాః || 42 ||

సత్యవాక్పాశతోదైత్యోససత్యాచ్చలితోయతః | తేనసత్యేనసంతుష్టాదాస్యామస్తేమనీప్సితం || 43 ||

బ్రహ్మోవాచ -

యథాస్నానంబ్రహ్మజ్ఞానందేహత్యాగోగయతలే | ధర్మారణ్యతధాదైత్యధర్మేశ్వరపురఃస్థితే || 44 ||

కూపేతర్పణకంశ్రాద్ధంశంసంతిపితరోదివి | సంతుష్టాపిండదానేనగయాయాంపితరోయథా || 45 ||

వాంఛంతితర్పణంకూపేధర్మారణ్యవిశుద్ధయే | దానవేంద్రశరీరంతుతీర్థంతవభవిష్యతి || 46 ||

ఏకవింశతివారాంస్తుగయాయాంతర్పణకృతే | పితృణాంయాపరాతృప్తిఃజాయతేదానవాధిప || 47 ||

ధర్మేశ్వరపురస్తాత్సాత్వేకదాపితృతర్పణాత్‌ | స్యాద్వైదశగుణాతృప్తిఃసత్యమేవనసంశయః || 48 ||

పితృణాంపిండదానేనఅక్షయ్యాతృప్తిరస్త్విహ | శివరూపాంతరాలేవైధర్మారణ్యధరాతలే || 49 ||

శ్రద్ధయైవహికర్తవ్యాఃశ్రాద్ధపిండోదకక్రియాః | తథాంతరాలేచాస్మాకంశ్రాద్ధపిండౌవిశేషితః || 50 ||

తథాశరీరేక్వాపిస్తాంచింతాసత్యాసిసువ్రత | త్రిషులోకేషుద్రుష్ప్రావంసత్యంతేదివినంస్థితం || 51 ||

అస్మద్వాక్యేనసత్యేనతత్తధా7సురసత్తమ | గయాసమధికంతీర్థంతవజాతంధరాతలే || 52 ||

అస్మాకంస్థితిరవ్యగ్రాతవదేహేనసంశయః | సత్యపాశేనబద్ధాఃస్మదృఢమేవత్వయానఘ || 53 ||

గయాప్రయాగస్యాపిఫలసమధికంస్మృతం | చతుర్దశ్యామమావాస్యాంలోహయష్ట్యాం పిండదానతః || 54 ||

బలిపుత్రస్యసత్యేసమహతీతృప్తిరత్రహి | మాకురుష్వాత్రసందేహంతవదేహెస్థితాన్వయం || 55 ||

సరస్వతీపుణ్యతోయా బ్రహ్మలోకాత్ర్పయాత్యుత | ప్లావయిష్యంతిదేహాంగంమయానహనుసంగతా || 56 ||

యధావైద్వారకావాసదేవస్తత్రమహెశ్వరః | విరంచిర్యత్రతీర్థానిత్రీణ్యతానిధరాతలే || 57 ||

భవిష్యతిచపాతాలేస్వర్గలోకేయమక్షయే | విఖ్యాతాన్యసురశ్రేష్ఠపితృణాంతృప్తిహెతవే || 58 ||

అధాన్యత్సంప్రవక్ష్యామిగాధాంపితృకృతాంపరాం | అజ్ఞారూపాంహిపుత్రాణాంతాంశృణుష్వమమానఘ || 59 ||

తా || వ్యాసుని వచనము - : దానవేశ్వరుడు బ్రహ్మవాక్యమునువినిసంతుష్టుడై ప్రసన్నమైనవాక్కులతోబ్రహ్మకేశ వుడు శివుడు వీరితో ఇట్లన్నాడు (38) లోహాసురుని వచనము - మీబలంతో కాకుండా వాక్పాశబద్ధుణ్ణౖఉంటాను. బ్రహ్మ విష్ణువుశివుడుఈముగ్గురు సురసత్తములు (39) వీరునాశరీరంలోఉండేట్లైతేఆపిదపనాకులభించనిదేముంది. ఈ నా శరీరము ముగ్గురుదేవతలతోఅధిష్ఠించబడింది (40) ఓసురోత్తములార! నాప్రభావంతో (పేరుతో) భూమియందు ప్రసిద్ధిచెందని (41) అని అనగా లోహాసురుని వాక్యంతో సంతోషించిన ముగ్గురు దేవతలు బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆతనికిట్లా ప్రత్యుత్తరమిచ్చారు (42) దైత్యుడుసత్యవాక్పాశముతో సత్యంనుండిద కదలలేదు. కనుక దానితో సత్యంతో, సంతుష్టలమై మేమునీకుమనోభీప్సితమును ఇవ్వదలిచాము (43) బ్రహ్మవచము - గయాప్రదేశమందు స్నానముబ్రహ్మజ్ఞానము దేహా త్యాగము ఎట్లాగో అట్లాంటిదే ఓ దైత్య! ధర్మేశ్వరపురమందున్న (ముందున్న) ధర్మారణ్యమందున్న (44) కూపమందు తర్పణము, శ్రాద్ధము ప్రశస్తమనిస్వర్గమందుపితరులంటారు. గయయందు పిండదానముతో పితరులేట్లాతృప్తులౌతారో. (45) అట్లాగే విశుద్ధమైన ధర్మారణ్యకూపమందు తర్పణమునుకోరుతారు. ఓదానవేంద్ర! నీ శరీరము ఒక తీర్థమౌతుంది. (46) ఇరువదిఒక్కమారులు గయయందుతర్పణంచేస్తే. పితురులకు ఏతృప్తికలుగుతుందో, ఓ దానవాధిప ! (47) ధర్మేశ్వరుని ముందున్న కూపంనుండి ఒకసారి పితృతర్పణంచేస్తే ఆతృప్తిపదింతలుకల్గుతుంది. నిజమేఅనుమానంలేదు. (48) పితరులకు ఇక్కడపిండదానంతోఅక్షయ్యమైనతృప్తికలుగుతుంది. శివరూపంమధ్యలోగల ధర్మారణ్యప్రదేశమందు (49) శ్రాద్ధపిండోదకక్రియలకుశ్రద్ధతోచేయాలి. అట్లాగేఆంతరాలప్రదేశమందు మాకుశ్రాద్ధపిండములువిశేషించిఇవ్వాలి. (50) అట్లాగే శరీరమందెక్కడైనానీవుచింతనలోసత్యమేగలవాడవుఓసువ్రత. ముల్లోకములందు పొందరానిసత్యమునీది అని దేవలోకమందుభావిస్తారు. (51) మావాక్యంతోసత్యంతోఅదిఅట్లాగేకానిఓఅసురసత్తమ. నీతీర్థముభూమియందుగయతో సమానమైనఅధికమైనతీర్థమైంది. (52) నీ శరీరమందుమేముఉండటముతప్పదు అనుమానంలేదు. నీ సత్యపాశంతో గట్టిగాబంధింపబడ్డాము ఓ పుణ్యాత్మ! (53) విష్ణువచనము! గయ ప్రయాగలకన్నఅధికమైనఫలమని చెప్పారు. లోహాయష్టి యందుచతుర్దశియందుఅమావాస్యయందు పిండదానము వల్లగయాధిక్యఫలము (54) ఇక్కడబలిపుత్రునిసత్యంతోగొప్ప సంతృప్తికల్గుతుంది. ఇందులోఅనుమానంలేదు నీశరీరంలో మేమున్నాము. (55) పుణ్యమైన నీరుగల సరస్వతినది బ్రహ్మలోకంనుండి వస్తుంది. నాతోకలిపి ఉండినదైదేహ అవయవములను తడుపుతాయి (56) ద్వారకావాసుడైన దేవుడెట్లాగోఅట్లాగేమహేశ్వరుడు. బ్రహ్మఎక్కడుంటారో ఈమూడుఅవి ఈ భూమి పై తీర్థముఔతాయి (57) పాతాలమందు స్వర్గలోకమందుయమక్షయమందుప్రసిద్ధమౌతుంది. ఓ అసురశ్రేష్ఠ! పితరుల తృప్తిహెతువులుగా ప్రసిద్ధమైనాయి (58) ఇక పితృకృతమైనుత్కృష్టమైనమరోగాధనుచెబుతాను పుత్రులకు నా అజ్ఞారూపమైనది. ఓ పుణ్యాత్మ! దానిని విను (59)

మూ || పితరఊచుః -

శంకరస్యాగ్రతఃస్థానంరుద్రలోకప్రదంనృణాం | పాపదేహవిశుద్ధర్థ్యంపాపేనోవహతాత్మనాం || 60 ||

తస్మింస్తిలోదకేనాపినద్గతింయాంతితర్పితాః | పితరోనరకాద్వాపిసుపుత్రేణసుమేధసా || 61 ||

గోప్రదానంప్రశంసతితత్తత్రపితృముక్తయే | పిత్రాదికాన్‌సముద్దిశ్యదృష్ట్వారుద్రంచకేశం || 62 ||

తిలపిణ్యాకపిండేనవరాంతృప్తింయాస్యామహె | చతుర్దశ్యామమావాస్యాంతథాచపితృతర్పణం || 63 ||

అజ్ఞాతగోత్రజన్మానః తేభ్యఃపిండాంస్తునిర్వపేత్‌ | తేపియాంతిదివంసర్వేపిండేదత్తఇతిశ్రుతిః || 64 ||

సర్వకార్యాణిసంత్యజ్యమానవైపుణ్యమీప్నుభిః | ప్రాప్తేభాద్రపదేమాసేగంతవ్యాలోహయిష్టకా

అజ్ఞాతగోత్రనామ్నాతుపిండమంత్రమిమంశృణు || 65 ||

పితృవంశేమృతాయేచమాతృవంశేతథైవచ | అతీతగోత్రజాస్తేభ్యఃపిండోయమునతిష్ఠతు || 66 ||

విష్ణురువాచ -

అనేనైవతుమంత్రేణమమాగ్రేసురసత్తమ | క్షీణచంద్రేచతుర్దశ్యాంసభ##స్యేపిండమాహరేత్‌ || 67 ||

పితౄణామక్షయాతృప్తిఃభవిష్యతినసంశయః | తిలపిణ్యాకపిండేనపితరోమోక్షమాప్నుయుః || 68 ||

క్షణత్రయవినిర్ముక్తామానవాజగతీతలే | భవిష్యంతినసందేహూలోహయష్ట్వాంతిలతర్పణ || 69 ||

స్నాత్వాయఃకురుతేచాత్రపితృపిండోదకక్రియాః

పితరఃతస్యతృప్యంతియావదద్బ్రహ్మదివానిశం || 70 ||

అమావాస్యాదినంప్రాప్యమాసిభాద్రపదేనరః | బ్రహ్మణోయష్టికాయాంతుయఃకుర్యాత్‌పితృతర్పణం || 71 ||

పితరఃతస్యతృప్తాఃన్యుః యావదాభూతసంప్లవం | తేషాంప్రసన్నోభగవాన్‌ ఆదిదేవోమమేశ్వరః || 72 ||

అస్యతీర్థస్యయాత్రాంమతిర్యేషాంభవిష్యతి | గోక్షీరేణతిలైః శ్వేతైః స్నాత్వాసారస్వతేజలే || 73 ||

తర్పయేదక్షయాతృప్తిఃపితౄణాంతస్యజాయతే | cశాద్ధంచైవప్రకుర్వీతసక్తుభిఃపయసానహ || 74 ||

అమావాస్యాదినంప్రాప్యపితౄణాంమోదమిచ్చుకః | రుద్రతీర్థేతతోధేనుఃదద్యాత్‌వస్త్రాణియమతీర్థకే || 75 ||

విష్ణుతీర్థేహిరణ్యంచపితౄణాంమోక్షమిచ్ఛుకః | వినాక్షతైః వినాధర్భైః వినాచాసనమేవచ

వారిమాత్రాల్లో హయష్ట్యాంగయాశ్రాద్ధఫలంలభేత్‌ || 76 ||

తా || పితరులవచనము - శంకరునిముందరిస్థానమునరులకురుద్రలోకమునిచ్చేది. పాపముతో కొట్టబడిననరులకు పాపదేహవిశుద్ధికొరకు (60) దానియందుతిలోదకమిచ్చినా, దానితో తర్పితులై సద్గతిని పొందుతారు. నరకమందున్న పితరులు మేథస్సుగల పుత్రునితో తర్పితులైనసద్గతినందుతారు (61) ఇక్కడ, పితృముక్తి కొరకుగోదానముశ్రేష్ఠమనిఅంటారు. రుద్రునికేశవునిచూచిపితరులనుద్దేశించి (62) నువ్వులు, తెలికపిండి పిండముతో మేము గొప్పతృప్తినిపొందుతాము చతుర్దశియందు, అమావాస్యయందు అట్లాగేపితృతర్పణం చేయాలి (63) అజ్ఞాతగోత్ర జన్మగలవారికిపిండములువదలాలి. వారుకూడా, పిండమును ఇవ్వగానే (పొందగానే) అందరు స్వర్గానికి చేరుతారు. అని శ్రుతి. (64) మానవులు పుణ్యం కోరేవారు భాద్రపదమాసంవస్తే అన్నిపనులు వదిలి లోహయిష్టమునకువెళ్ళాలి. అజ్ఞాతగోత్రనామములుగలవారికి పిండమంత్రమిది, విను (65) పితృవంశమందు మరణించిన వారు అట్లాగే మాతృవంశ మందుమరణించినవారు గడచినగోత్రమందుజన్మించినవారువారందరికీఈపిండముచేరని (66) విష్ణువువ చనము - ఓ సురసత్తమ! నా ఎదుట ఈ మంత్రముతోచంద్రుడుక్షీణించాక చతుర్దశియందుభాద్రపదమందుపిండంవదలాలి (67) పితరులకు అక్షయతృప్తికలుగుతుంది. అనుమానంలేదు. నువ్వులు, తెలికపిండిపిండముతో పితరులుమోక్షమందుతారు. (68) క్షణ త్రయంలో, ఈభూమి యందుమానవులునిర్ముక్తులౌతారు. లోహయష్టియందుతిలతర్పణంవల్లముక్తులౌతారు. అనుమానంలేదు (69) స్నానంచేసి ఎవరైతేఇక్కడపితరులపిండోదకక్రియలాచరిస్తారోవారిపితరులు బ్రహ్మఉన్నంతవరకురాత్రింబగళ్ళు తృప్తులౌతారు. (70) భాద్రపదమాసంలోనిఅమావాస్యరోజుఈసరస్సుకువచ్చిబ్రాహ్మణుడుయష్టికమందుపితృతర్పణ మాచిరంచినఅతని (71) పితరులు ప్రళయకాలందాకాతృప్తులౌతారు. వారికిభగవాన్‌ ఆదిదేవుడైనమహేశ్వరుడు ప్రసన్నుడౌతాడు. (72) ఈ తీర్థానికివెళ్ళాలనిఎవరనుకుంటారో వారికి ఈశుడుప్రసన్నుడు. ఆవుపాలుతెల్లనువ్వులువీటితోతర్పణంను, సారస్వతజలమందుస్నానంచేస్తేవానిపితరులకు (73) అక్షయమైనతృప్తికలుగుతుంది. సక్తుతో (పేలపిండి) పాలతోసహశ్రాద్ధ మాచరించాలి (74) పితరులకు ఆనందాన్ని కోరేవారు అమావాస్య రోజున అట్లాచేయాలి. రుద్ర తీర్థమందు ధేనువును దానం చేయాలి. యమ తీర్థమందు వస్త్రములివ్వాలి (75) పితరులముక్తి కొరకు విష్ణు తీర్థమందు హిరణ్‌య దానంచేయాలి. అక్షతలు లేకున్నా దర్భలు లేకున్నా ఆసనంలేకున్నా నీటి మాత్రంతో లోహయుష్టియందు శ్రాద్ధము గయాశ్రాద్ధఫలాన్నిస్తుంది (76)

మూ || సూత ఉవాచ -

ఏతద్వః కథితం విప్రాః లోహాసుర విచేష్టితం | యచ్ఛ్రుత్వా బ్రహ్మహా గోఘ్నోముచ్యతే సర్వపాతకైః || 77 ||

ఏకవింశతి వారంతుగయాయాం పిండపాతనే | తత్ఫలం సమవాప్నోతి సకృదస్మిన్‌ శ్రుతే సతి || 78 ||

చతుష్కోటి ద్విలక్షంచ సహస్రం శతమేవచ | ధేనవస్తేన దత్తాన్యుః మాహాత్మ్యం శృణుయాత్తుయుః || 79 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే లోహాసురమాహాత్మ్య సంపూర్తిర్నామ ఏకోన త్రింశోధ్యాయః || 29 ||

తా || సూతుని వచనము - ఓ విప్రులార ! నేను మీకు లోహానురవిచేష్టితమును చెప్పాను. దీనినివిన్న బ్రహ్మఘాతి, గోహంతకుడు అన్ని పాపముల నుండి ముక్తులౌతారు (77) ఇరువది యొక్కమార్లు గయలో పిండదానంవల్ల వచ్చే ఫలితాన్ని ఒక్కసారి దీనినివిన్నవారు పొందుతారు (78) నాలుగు కోట్ల రెండులక్షల ఒకవేయి నూరు గోవులను దానంజేసిన వాడౌతాడు, ఈ మాహాత్మ్యాన్ని విన్నవాడు (79) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు లోహాసుర మాహాత్మ్య సంపూర్తి అనునది ఇరువది తొమ్మిదవ అధ్యాయము || 29 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters