Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది రెండవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

తతశ్చ రామదూతాస్తే సత్వా రామమథాబ్రువన్‌ | రామరామ మహాబాహో పరనారీ శుభాననా || 1 ||

సువస్త్రభూషాభరణాం మృదువాక్యపరాయణాం | ఏకాకినీంక్రందమానాం దృష్ట్వాతాం విస్మితావయం || 2 ||

సమీపవర్తి నోభూత్వా వృష్టా సా సుర సుందరీ | కాత్వందేవి పరా రోహె దేవీ వాదానవీనుకిం || 3 ||

రామః పృచ్ఛతి దేవిత్వాం బ్రూహి సర్వంయథాతథం | తచ్ఛ్రుత్వా వచనంరామాసోవాచ మధురంపచః || 4 ||

రామంప్రేషయత భద్రంవోమమదుఃఖా పహంపరం || 5 ||

తదాకర్ణ్యతతో రామః సంభ్రమాత్త్వరితోయ¸° | దృష్ట్వాతాం దుఃఖ సంతప్తాం స్వయం దుఃఖమవాపనః

ఉవాచ వచనం రామః కృతాంజలి పుటస్తథా || 6 ||

శ్రీరామ ఉవాచ -

కాత్వంశుభేకస్యపరిగ్రహోవాకేనావధూతావిజనేనిరస్తా | ముష్టంధనంకేనచతావకీసమాచక్ష్వ మాతః సకలంమమాగ్రే || 7 ||

ఇత్యుక్త్వా చాతి దుఃఖార్తో రామోమతి మతాంపరః | ప్రణామందండ వచ్చక్రే చక్రపాణిరివా పరః || 8 ||

తయాభి వందితో రామః ప్రణమ్యచ పునః పునః | తృష్ణయా పరయా ప్రీత్యాస్తుతో మదురయాగిరా || 9 ||

పరమాత్మన్‌ పరేశాన దుఃఖహారిన్‌ సనాతన | యదర్థమవతారస్తే తచ్చకార్యం త్వయాకృతం || 10 ||

రావణః కుంభకర్ణశ్‌చ శక్రజిత్‌ ప్రముఖాస్తథా | ఖరదూషణ త్రిశిరోమారీచాక్షకుమారకాః || 11 ||

అసంఖ్యానిర్జితా రౌద్రా రాక్షసాః సమరాంగణ || 12 ||

కింవచ్మిలోకేశ సుకీర్తి మద్యతే | వేధాస్త్వదీయాంగజ పద్మ సంభవః

విశ్వం నివిష్టం చ తతోదదర్శ | వటస్యపత్రేహి యథావటోమతః || 13 ||

ధన్యోదశరథోలోకేకౌశల్యాజనీతప | యయోర్జాతో గోవింద జగదీశ పరః వుమాన్‌ || 14 ||

ధన్యం చతత్కులం రామయత్రత్వమాగతః స్వయం | ధన్యా7యోధ్యాపురీరామధన్యోలోకస్త్వదాశ్రయః || 15 ||

ధన్యః సో7పి హివాల్మీకిః యేన రామాయణంకృతం | కవినావిప్రముఖ్యేభ్యః ఆత్మబుద్ధ్యాహ్యనాగతం || 16 ||

త్వత్తో7భవత్‌ కులంచేదం త్వయాదేవసుపావితం || 17 ||

సరవతిరితిలోకైః స్మర్యతే వైష్ణవాంశః | స్వయమసిరమణీయైః త్వంగుణౖః విష్ణురేవ

కిమపి భువనకార్యం యద్విచింత్యావ తీర్య | తదిహఘటయతస్తే

వత్సనిర్విఘ్నమస్తు || 18 ||

తా || వ్యాసులిట్లన్నారు - ఆ పిదప రాముని దూతలు రామునకు నమస్కరించి ఇట్లన్నారు ఓరామ! మహాబాహు ఉత్తమ స్త్రీ, శుభ ఆసన (1) మంచి వస్త్రములు భూషణములు ఆభరణములుగలది, మృదువాక్యముల పల్కునది, ఒంటరిది, దుఃఖిస్తున్నది అట్టి ఆమెను చూచి మేము ఆశ్చర్యపోయాము (2) మేము దగ్గరగా వెళ్ళి అసురసుందరిని అడిగాము. ఓ దేవి! నీవెవరు. దేవతాస్త్రీవా, దానవస్త్రీవా, ఓవరారోహ! (3) ఓదేవి! రాముడు నీ గూర్చి అడుగుతున్నాడు ఉన్నదున్నట్లుగా అంతా చెప్పు అని. దానినివిని ఆమె మధురమైన వాక్కులతోఇట్లా అంది (4) మీకు క్షేమం కలగని. నా అధికమైన దుఃఖాన్ని తొలగించగల రాముని పంపండి, అని (5) దానినివిని రాముడు తొందరగా త్వరగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. దుఃఖసంతప్తురాలైన ఆమెనుచూచి రాముడు స్వయంగా దుఃఖితుడైనాడు. అప్పుడు రాముడు చేతులు జోడించి ఇట్లా పలికాడు (6)రాముని వచనము - ఓ శుభే! నీవెవరవు ఎవనిభార్యవు. ఎవరిచేత తిరస్కరింపబడి నిర్జన ప్రదేశంలో వదిలిపెట్టబడ్డావు. నీధనాన్ని ఎవరపహరించారు ఓతల్లి! అదంతా నాకు చెప్పు (7) అని పలికి మతి మంతులలో శ్రేష్ఠుడు రాముడ అతి దుఃఖితుడై మరోచక్రపాణివలె దండములవలె ప్రణామమాచరించాడు (8) ఆమె రామునకు నమస్కరించింది. రాముడు తిరిగి ఆమెకు నమస్కరించాడు. మిక్కిలి ప్రీతితో ఆనందించిన ఆమె మధురమైన వాక్కులతో ఆతనిని స్తుతించింది (9) ఓ పరమాత్మ, పరఈశాన, దుఃఖహారి,సనాతన,నీవెందుకవతరించావో ఆకార్యాన్ని నీవు నిర్వర్తించావు (10) రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రిజిత్తు ప్రముఖులు, ఖరదూషణ త్రిశిరులు మారీచుడు అక్షయకుమారుడు (11) అసంఖ్యాకులైన రౌద్రులైన రాక్షసులుయుద్ధంలో నీతో జయించబడ్డారు. (12) ఓ లోకేశ! నీమంచి కీర్తిని ఈ వేళ ఏంచెప్పాలి. బ్రహ్మ, నీ అంగం నుండి పుట్టిన పద్మం నుండి జన్మించాడు. ఆ పిదప నీవు ఉంచిన విశ్వాన్ని చూచాడు. వటపత్రమందు బాలకుడెట్టా ఉన్నాడో చూచాడు. (13) లోకంలో దశరథుడు ధన్యుడ. నీతల్లి కౌసల్య ధన్యురాలు. వారికి నీవు పరమపురుషునిగా పుట్టావు గదా ఓ గోవింద, జగదీశ (14) ఏ కులంలోనీవు జన్మించావో ఆకులం ధన్యమైంది. అయోధ్య ధన్యమైంది. నన్నాశ్రయించిన లోకం ధన్యమైంది (15) ఆ వాల్మీకి ధన్యుడైనాడు. ఆతడు రామాయణం వ్రాశాడు కదా. ఆత్మబుద్ధితో కవి వి ప్రముఖ్యుల కొరకు, రానటువంటి (జరగబోయే) రామాయణం వ్రాశాడు. (16) నీవల్ల ఈ కులము పవిత్రం చేయబడింది. ఓదేవ (17) లోకమంతా నిన్ను రాజు అని అనుకుంటుంది. నీవు స్వయంగా విష్ణ్వంశవు. రమణీయమైన గుణములతో నీవు స్వయంగా విష్ణువువే. ఏదో ఒకలోక ప్రయోజనాన్ని ఆలోచించి, అవతరించి దాన్ని ఇక్కడ నిర్వర్తించే నీకు ఓవత్స! విఘ్నములేకుండుగాక (18).

మూ || స్తుత్వావాచాథరామంహి త్వమినాథేను సాంప్రతం|శూన్యావర్తే చిరంకాలం యథాదోషస్తథైవహి || 19 ||

ధర్మారణ్య స్యక్షేత్రస్య విద్ధిమామధి దేవతాం | వర్షాణి ద్వాదశేహై వజాతాని దుఃఖితా స్మ్యహం || 20 ||

నిర్జనత్వం మమాద్యత్వం ఉద్దర స్వమహామతే | లోహా సురభయాద్రామ విప్రాః సర్వేది శోదశ || 21 ||

గతాశ్చపణిజన్సర్వే యథాస్థానం సుదుఃఖితాః | సదైత్యో ఘాతితో రామదేవైః సురభయంకరః || 22 ||

ఆక్రమ్యాత్రమహామాయో దురాధర్షో దురత్యయః | సతే జనాః సమాయాంతి తద్భయాదతి శంకితాః || 23 ||

అద్యవైద్వాదశ సమాః శూన్యాగారమనాథవత్‌ | యస్మాచ్చ దీర్ఘి కాయాంమే స్నాన దానాద్యతో జనః || 24 ||

రామతస్యాం దీర్ఘికాయాం నిపతంతి చనూకరాః | యత్రాంగనా భర్తృయుతా జలక్రీడా పరాయణాః || 25 ||

చిక్రీడుస్తత్ర మహిషాని పతంతి జలాశ##యే | యత్రస్థానే సుపుష్పాణాం ప్రకరః ప్రచురో7భవత్‌ || 26 ||

తద్రుద్థంకంటకైఃవృక్షైఃసింహవ్యాఘ్ర సమాకులైః | సంచిక్రీడుఃకుమారాశ్‌చయస్యాంభూమౌనిరంతరం || 27 ||

కుమార్యః చిత్ర కాణాంచ తత్ర క్రీడంతి హర్షితాః | అకుర్వన్‌ వాడ వాయత్ర వేదగానం నిరంతరం || 28 ||

శివానాంతత్రఫేత్కారాఃశ్రూయంతే7తిభయంకరాః|యత్రధూమో7గ్ని హోత్రాణాందృశ్యతేవైగృహేగృహే || 29 ||

తత్రదావాః సధూమాశ్చదృశ్యంతే7త్యుల్బణా భృశం | నృత్యంతే నర్తకాయత్ర హర్షితాహిద్విజాగ్రతః || 30 ||

తత్రైవ భూత వేతాలా ప్రేతాః నృత్యంతి మోహితాః | నృపాయత్ర సభాయాంతు న్యషీదన్‌మంత్రతత్పరాః || 31 ||

తస్మిన్‌ స్థానే నిషీదంతి గవయాఋక్షశల్లకాః | ఆవాసాయత్ర దృశ్యంతే ద్విజానాం వణిజాంతథా || 32 ||

కుట్టిమ ప్రతిమారామ దృశ్యంతే త్రబిలానివై | కోటరాణీహ వృక్షాణాం గవాక్షాణీహ సర్వతః || 33 ||

చతుష్కాయజ్ఞవేదిర్‌ హిసోచ్ఛ్రాయాహ్య భవత్పరా | తే7త్ర వల్మీకనిచయైః దృశ్యంతే పరివేష్ఠితాః || 34 ||

ఏవం విధంనివాసంమే విద్ధిరామనృపోత్తమ | శూన్యంతు సర్వతో యుస్మాత్‌ నివాసాయ ద్విజాగతాః || 35 ||

తేనమే సుమహద్దుఃఖం తస్మాత్త్రాహి సరేశ్వర | ఏతచ్ఛ్రుత్వావచో రామ ఉవాచ వదతాం పరః || 36 ||

తా || వాక్కులతో రాముని స్తుతించి, నీవు ఇప్పుడ నాథుడవై ఉండగా నేన చాలా కాలము శూన్యంగా ఉన్నాను. దోషం ఎట్లాగుందో అట్లాగే ఉంది. (19) ధర్మారణ్య క్షేత్రమునకు నేను అధి దేవతను పన్నెండు సంవత్సరాలు గడిచాయి. నేను దుఃఖిస్తునే ఉన్నాను. (20) ఇదంతా నిర్జనము ఓ మహామతి! దీనిని ఉద్ధరించు ఓ రామ! లోహాసురుని భయంవల్ల విప్రులందర పదిదిక్కులకు (21) వెళ్ళిపోయారు. పణిజులందరు చాలా దుఃఖితులై యథాస్థానములకు వెళ్ళారు. ఓ రామ! సురభయంకరుడైన ఆ రాక్షసుని దేవతలు చంపారు. (22) మహామాయ, దురాధర్షుడు, దురత్యయుడు ఆ రాక్షసుడు దీన్ని ఆక్రమించి ఉన్నాడు. భయంతో అతిశంకితులై ఆ జనులు తిరిగి రావటంలేదు (23) ఇప్పటికి పన్నెండు సంవత్సరాల నుండి ఇది శూన్యాలయము. నేను అనాథవలె ఉన్నాను. నా కొలను యందు జనులు స్నానదానములాచరించేవారు (24) అట్టిదానిలో ఓరామ! ఇప్పుడు పందులు పడ్తున్నాయి. భర్తలతో కూడి స్త్రీలు జలక్రీడాపరాయణులయ్యేవారు ఈ కొలనులో (25) అక్కడ జలాశయంలో దున్నపోతులు పడ్తున్నాయి. ఆడుకుంటున్నాయి. మంచి పుష్పముల సమూహము ఎక్కువగా ఇది వరలో ఉన్న ఈ చోట (26) ఇప్పుడు సింహవ్యాఘ్రములతో కూడి ముండ్ల చెట్లతో త్రోవ అడ్డగింపబడుతోంది. ఎక్కడైతే పిల్లలు నిరంతరం ఆడుకున్నారో (27) ఆడపిల్లలు (పులిఆట) (చిత్త) చిత్రకమనే ఆట ఆడేవారో, ఎక్కడ బ్రాహ్మణులు నిరంతరము వేదగానం చేశారో (28) అక్కడ ఈ వేళ అతి భయంకరమైన నక్కకూతలు విన్పిస్తున్నాయి. ఎక్కడ అగ్నిహోత్ర ధూమము ప్రతి ఇంట్లో ఇదివరలో కన్పించేదో (29) అక్కడ ఈ వేళ ఎక్కువగా మిక్కిలిగా పొగతో కూడిన దావాగ్ని కన్పిస్తోంది. ఎక్కడ బ్రాహ్మణుల ఎదుట నర్తకులు ఆనందంతో నాట్యం చేసేవారో (30) అక్కడే ఈ వేళ భూతభేతాళములు ప్రేతములు మోహంతో నాట్యంచేస్తున్నాయి. మంత్ర (రాజకీయం) తత్పరులై ఏ సభలో రాజులు కూర్చునేవారో (31) ఆ స్థానంలో ఈ వేళ గవయమృగములు, ఎలుగుబంట్లు, ఏదు పందులు కూర్చుంటున్నాయి. ఎక్కడ బ్రాహ్మణుల, పణిజుల ఆ వాసములుండేవో (32) అక్కడ రాతి గోడలలో బిలములు కన్పిస్తున్నాయి. వృక్షముల కోటరములు ఇక్కడ అంతటాగవాక్షములలో ఉన్నాయి (33) నాల్గు మూలల యజ్ఞవేదిక ఇదివరలో చాలా ఎత్తుగా ఇక్కడ ఉండేది. అక్కడ ఈ వేళ పాముల పుట్టలతో నిండిపోయి కన్పిస్తున్నాయి (34) ఓ నృపోత్తమ! రామ! నా నివాసము ఇలా ఉందని తెలుసుకో. బ్రాహ్మణులు నివాసంకొరకు విడిచివెళ్ళిన ఈ ప్రదేశము అంతా శూన్యంగా ఉంది (35) అందువల్ల నాకు చాలా దుఃఖః కల్గుతోంది. అందువల్ల ఓ నరేశ్వర! నన్ను రక్షించు అనగా దీనిని విని రాముడు మాటకారి రాముడు ఇట్లా అన్నాడు (36).

మూ || శ్రీరామ ఉవాచ

నజానే తావకాన్‌ విప్రాన్‌ చతుర్ధిక్షు సమాశ్రితాన్‌ | నతేషౄం వేద్మ్యహంసంఖ్యాం నామగోత్రే ద్విజన్మనాం || 37 ||

యథాజ్ఞాతిః యథాగోత్రం యథా తథ్యం నివేదయ | తతానీయతాన్‌ సర్వాన్‌ స్వస్థానేవాసయామ్యహం || 38 ||

శ్రీ మాతో ఉవాచ -

బ్రహ్మవిష్ణు మహశైశ్చ స్థాపితాయే సరేశ్వర | అష్టాదశ సమస్రాణి బ్రాహ్మణా వేదపారగాః || 39 ||

త్రయీవిద్యాసువిఖ్యాతా లోకే7స్మినప్నమితద్యుతే | చతుష్షష్టిక గోత్రాణాం వాడవాయే ప్రతిష్ఠితాః || 40 ||

శ్రీమాతా దాత్త్రయీ విద్యాం లోకే సర్వే ద్విజోత్తమాః | షట్‌ త్రింశచ్చ సహస్రాణి వైశ్యాధర్మ పరాయణాః || 41 ||

ఆర్యవృత్తా స్తువిజ్ఞేయా ద్విజశుశ్రూషణరతాః | బహులార్కా నృపోయత్ర సంజ్ఞయా సహరాజతే || 42 ||

కుమారా వశ్వినౌ దేవౌధనదో వ్యయపూర్వకః | అధిష్ఠా త్రీత్వహం రామనామ్నా భట్టారికా స్మృతా || 43 ||

శ్రీ సూత ఉవాచ -

స్థానాచారాశ్చయేకేచిత్‌ కులాచారాస్తథైవచ | శ్రీమాత్రా కథితం సర్వం రామస్యాగ్రే పురాతనం || 44 ||

తస్యాస్తు వచనం శ్రుత్వా రామోముదమవాపహ|సత్యంసత్యం పునః సత్యంసత్యంహి భాషితంత్వయా || 45 ||

యస్మాత్‌ సత్యంత్వ యాప్రోక్తంతన్నామ్నానగరం శుభం | వాసయామి జగన్మాతః సత్యమందిరమేవచ || 46 ||

త్రైలోక్యేఖ్యాతి మాప్నోతు సత్యమందిరముత్తమం || 47 ||

ఏతదుక్త్వాతతో రామః సహస్ర శతసంఖ్యయా | స్వభృత్యాన్‌ ప్రేషయామాన విప్రాన యనసహెతవే || 48 ||

యస్మిన్‌ దేశే ప్రదేశస్త్ర వావనేవా పరితస్తటే | పర్యంతేవా యథాస్థానే గ్రామే వాతత్ర తత్రచ || 49 ||

ధర్మారణ్య నివాసాశ్చయాతాయత్ర ద్విజోత్తమాః | అర్ఘపాద్యైః పూజయిత్వా శీఘ్ర మానయతాత్రతాన్‌ || 50 ||

అహమత్రతదా భోక్ష్యేయ దాద్రక్ష్యే ద్విజోత్తమాన్‌ || 51 ||

తా || శ్రీరాముని వచనము - నాల్గుదిక్కులకు వెళ్ళిన నీ బరాహ్మణులను నేను గుర్తెరుగను. వారెంతమందో నాకు తెలియద. ఆ బ్రాహ్మణుల నామ గోత్రముల నాకు తెలియదు (37) ఎట్లా గుర్తించాల గోత్రమేమిటో ఉన్నదున్నట్లు తెలుపుము. అక్కడి నుండి వారందరిని తీసుకొని వచ్చి తమతమ స్థానములందు వారిని ఉంచుతాను (38) అనగా శ్రీ మాత ఇట్లా అంది. - ఓ నరేశ్వర ! విష్ణు బ్రహ్మ మహెశ్వరులతో ఏ బ్రాహ్మణులు స్థాపించబడ్డారో వారు పదునెనిమిది వేలు బ్రాహ్మణులు, వేదపారగులు (39) ఈ లోకమందు వేద విద్య యందు వారు ప్రసిద్ధులు, ఓ అమితద్యుతి గల రామ! అరువది నాలుగు గోత్రముల బ్రాహ్మణులు ఎవరైతే ప్రతిష్ఠింపబడ్డారో (40) వారికి శ్రీమాత త్రయి విద్యను ఇచ్చింది. ధర్మపరాయణులైన వైశ్యులు ముప్పది ఆరువేలు ఏర్పరుచబడ్డారు (41) వారు మంచి నడవడిక డలవారు. బ్రాహ్మణుల శుశ్రూషయందు ఆసక్తి కలవారు. బహులార్కుడను రాజు తన పేరుతో సహా వెలిగిపోతున్నాడు (42) అశ్విని కుమారులు దేవతలు, కుబేరుడు ఖర్చును నింపేవాడు. నేను అధిష్ఠాత్రిని. నన్ను భట్టారిక అని అంటారు (43) శ్రీ సూతులిట్లన్నారు - కొందరు స్థానాచారులు, కొందరు కులాచారులు. శ్రీఱాముని ఎదుట పురాతనమైన దీనిని శ్రీమాత అంతా చెప్పింది. (44) ఆమె మాటను విని రాముడు ఆనందాన్ని పొందాడు. నిజము నిజము మరి మరి నిజము నీవు నిజం చెప్పావు. (45) నీవు నిజం చెప్పావు కనుక ఆ పేరుతో నే శుభ##మైన నగరము ఏర్పడుతుంది. ఓ జగన్మాత! ఆ సత్యమందిరంలో నిన్ను వసింపచేస్తాను. (46) ఈ ఉత్తమమైన సత్యమందిరముముల్లోకములలో ఖ్యాతిని పొందని (47) అని పలికి రాముడు నూరువేల కొలది తన భృథ్యులను బ్రాహ్మణులను తిరిగి తెచ్చేకొరకు పంపించాడు (48) ఏదేశానికి, ప్రదేశానికి, అడవికి, నదీతీరానికి దగ్గరిచోటికి యధా స్థానమందుగాని గ్రామమందుగాని అక్కడక్కడగాని (49) ధర్మారణ్య నివాసులైన బ్రాహ్మణ/లు ఎక్కడెక్కడికి వెళ్ళారో వారందరిని అర్ఘ్యపాద్యములతో పూజించి ఇక్కడికి వారిని తీసుకురండి (50) ఇక్కడ నేను బ్రాహ్మణులను ఎప్పుడు చూస్తూ ఉంటానో అప్పుడే భుజిస్తాను (51).

మూ || విమాన్య చద్విజానేతా నాగమిష్యతి యోనరః | సమేవథ్యశ్చ దండ్యశ్చనిర్వాస్యో విషయద్బహిః || 52 ||

తచ్ఛ్రుత్వా దారుణం వాక్యం దుఃషహందుఃప్రధర్షణం | రామాజ్ఞా కారిణో దూతాః గతాః సర్వేదిశోదశ || 53 ||

శోధితా వాడవాః సర్వేలబ్థాః సర్వే సుహర్షితాః | యథోక్తేన విధానేన అర్ఘపాద్యై ర పూజయన్‌ || 54 ||

స్తుతించక్రుశ్చ విధివత్‌ వినయాచారపూర్వకం | ఆ మంత్ర్యచ ద్విజాన్‌సర్వాన్‌రామవాక్యంప్రకాశయన్‌ || 55 ||

తతస్తే వాడవా న్సర్వే ద్విజాఃసే వక సంయుతాః | గమనాయోద్యతాః సర్వేవేదశాస్త్ర పరాయణాః || 56 ||

ఆగతారామ పార్శ్వంచ బహుమాన పురఃనరాః | సమాగతాన్‌ ద్విజాన్‌దృష్ట్వా రోమాంచిత తనూరుహః || 57 ||

కృతకృత్యమివాత్మానం మేనే దాశరథిర్‌నృపః ససంభ్రమాత్‌ సముత్థాయ పదాతిః ప్రయ¸° పురః || 58 ||

కరసంపుట కంకృత్వా హర్నాశ్రు ప్రతి ముంచయన్‌ | జానుభ్యాం అవనింగత్వా ఇదం వచన మబ్రవీత్‌ || 59 ||

విప్రప్రసాదాత్‌ కమలావరో7హం | విప్ర ప్రసాదార్థరణీధరో7హం

విప్రప్రసాదాత్‌ జగతీ పతిశ్చ విప్రప్రసాదా న్మమ రామనామ || 60 ||

ఇత్యేవముక్త్వారామేణ వాడవాస్తే ప్రహర్షితాః | జయాశీర్భిః ప్రపూజ్యాథ దీర్ఘాయురితిచాబ్రువన్‌ || 61 ||

ఆవర్జితాస్తే రామేణ పాద్యార్ఘ్య విష్టరాదిభిః | స్తుతించకార విప్రాణాం దండవత్ర్పణి పత్యచ || 62 ||

కృతాంజలి పుటః స్థిత్వాచక్రేపాదాభివందనం | ఆసణాని విచిత్రాణి హైమాన్యా భరణానిచ || 63 ||

సమర్పయామా సతతోరామో దశరథాత్మజః | అంగులీయక వాసాంసి ఉపవీతాని కర్ణకాన్‌ || 64 ||

ప్రదదౌని ప్రముఖ్యే భ్యోనానావర్ణాశ్చధేనవః |ఏకైక శతసంఖ్యాకా ఘటోధ్నీశ్చ సవత్సకాః || 65 ||

సవస్త్రా బద్ధ ఘంటాశ్చ హెమశృంగ విభూషితాః | రూప్యఖురాః తామ్రపృష్ఠీః కాంస్యపాత్ర సమన్వితాః || 66 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహత్మ్యే బ్రహ్మనారద సంవాదే సత్యమందిర స్థాపన వర్ణనో నామద్వాత్రింశో7ధ్యాయః || 32 ||

తా || ఈ బ్రాహ్మణులను అవమానించి ఎవరువస్తారో ఆతనిని నేను చంపుతాను. శిక్షిస్తాను. నగరం నుండి బయటికి బహిష్కరిస్తాను (52) ఆ దారుణమైన దుఃసహమైన దుష్ర్ప ధర్షణమైన మాటను విని రామాజ్ఞను పాలించే దూతలు అందరు పదిదిక్కులకు వెళ్ళారు. (53) బ్రాహ్మణులనంతా వెతికారు. అందరూ లభించారు ఆనందించారు. చెప్పిన ప్రకారము అర్ఘపాద్యములతో పూజించారు. (54) వినయ ఆచార పూర్వకముగా విధి ప్రకారము స్తుతించారు. రాముని మాటను వివరిస్తూ ఆ బ్రాహ్మణులనందరిని ఆహ్వానించారు. (55) ఆ పిదప ఆ బ్రాహ్మణులందరు తమ సేవకులతో కూడి వేద శాస్త్ర పరాయణులైన వారందరు బయల్దేరటానికి ప్రయత్నించారు. (56) బహుమాన పురస్సరముగా రాముని దగ్గరకు వచ్చారు. వచ్చిన బ్రాహ్మణులను చూచి రాముడు పులకించిన శరీరం కలవాడై (57) దాశరథియైన ఆ రాముడు తనను కృతకృత్యునిగా తలిచాడు. త్వరత్వరగా ఆతడు లేచినాడు. ముందు పదాతిసైన్యం వెళ్ళింది (58) చేతులను జోడించి ఆనందబాస్పముల వదులుదూ మోకాళ్ళమీద భూమిపై వంగి ఇట్లా అన్నాడు (59) బ్రాహ్మణుల అనుగ్రహంవల్ల నేను కనులా వరుడను. విప్ర ప్రసాదం వల్ల ధరణీధరుడనునేను. బ్రాహ్మణుల అనుగ్రహంవల్ల జగతీపతిని నేను. బ్రాహ్మణుల అనుగ్రహం వల్ల నాకు రాముడనే పేరు (60) అని పలికిన ఆ రాముని మాటలతో ఆ బ్రాహ్మనులు ఆనందపడి జయాశీస్సులతో పూజించి దీర్ఘాయువుకమ్మని పలికారు (61) వారు రామునితో ఆకర్షింపబడి పాద్యము, అర్ఘ్యము, ఆసనము మొదలగు వానితో గౌరవింపబడిరి. దండములా నమస్కరించి బ్రాహ్మణులను ఆతడు స్తుతించాడు (62) చేతులు జోడించి నిలబడి వారికి పాదాభివందనము చేశాడు. విచిత్రమైన ఆసనములను బంగారు ఆభరణాలను (63) వారికిచ్చాడు. దశరథాత్ముజుడైన రాముడు ఉంగరాలు, వస్త్రములు, యజ్ఞోపవీతములు, కర్ణాభరణములు వారికిచ్చాడు (64) రకరకముల రంగులు గల ధేనువులను బ్రాహ్మణశ్రేష్ఠుల కిచ్చాడు. ఒక్కొక్క నూరు ఆవులు కుండెడు పాలిచ్చేవి. దూడలు గలవి అట్టి ఆవుల నిచ్చాడు (65) వస్త్రములు కలిగి, మెడలో గంటగలిగి బంగారు కొమ్ములతో అలంకరింపబడ్డవి ఆ ఆవులు. వెండిగిట్టలు, రాగివృష్ఠములు గలవి. కాంస్య పాత్రలతో కూడా కూడిన వానిని ఇచ్చాడు (66) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రహ్మనారద సంవాదమందు సత్యమందిర స్థాపన వర్ణన మనునది ముప్పది రెండవ అధ్యాయము || 32 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters