Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది నాల్గవ అధ్యాయము

మూ|| వ్యాస ఉవాచ -

ఏవం రామేణ ధర్మజ్ఞ జీర్ణోద్ధారః పురాకృతః | ద్విజానాంచహితార్థాయ శ్రీమాతుర్వచనేనచ || 1 ||

యుధిష్ఠిర ఉవాచ -

కీదృశం శాసనం బ్రహ్మన్‌ రామేణ లిఖితంపురా | కథయస్వ ప్రసాదేన త్రేతాయాంసత్యమందిరే || 2 ||

వ్యాస ఉవాచ -

ధర్మారణ్యవరేదివ్యే బకులార్కే స్వధిష్ఠితే | శూన్యస్వామిని విప్రేంద్ర స్థితే నారాయణ ప్రభౌ || 3 ||

రక్షణాధి పతౌ దేవే సర్వజ్ఞే గుణనాయకే | భవసాగర మగ్నానాం తారిణీ యత్ర యోగినీ || 4 ||

శాసనం తత్ర రామస్య రాఘవస్య చనామతః | శృణుతామ్రాశ్రయం తత్రలిఖితం ధర్మశాస్త్రతః || 5 ||

మహాశ్చర్య కరంతచ్చ హ్యనేకయుగ సంస్థితం | సర్వోధాతుః క్షయంయాతి సువర్ణం క్షయమేతిచ || 6 ||

ప్రత్యక్షందృశ్యతే పుత్ర ద్విజశాసనమక్షయం | అవినాశోహితామ్రస్యకారణంతత్ర విద్యతే || 7 ||

పదోక్తం సకలం యస్మాత్‌ విష్ణురేవహి కథ్యతే | పురాణషుచ వేదేషు ధర్మశాస్త్రేషుభారత || 8 ||

సర్వత్ర గీయతే విష్ణుః నానాభావ సమాశ్రయః | నానాదేశేషు ధర్మేషు నానాధర్మనిషేవిభిః || 9 ||

నానాభేదైస్తు సర్వత్ర విష్ణురే వేతి చింత్యతే | అవతీర్ణః సవై సాక్షాత్‌ పురాణ పురుషోత్తమః || 10 ||

దేవవైరివినాశాయ ధర్మసంరక్షణాయచ | తేనేదం శాసనం దత్తం అవినాశాత్మకంసుత || 11 ||

యస్యప్రతాపాత్‌ దృషదః తారితా జలమధ్యతః | వానరైః వేష్టితా లంకా హెలాయా రాక్షసాహతాః || 12 ||

మునిపుత్రం మృతం రామోయమలోకాదుపానయత్‌ | దుందుభిః నిహతోయేన బంధో7భిహతస్తథా || 13 ||

నిహతా తాడకాచైవ సప్తతాలా విభేదితాః | ఖరశ్చ దూషశ్చైవ త్రిశిరాశ్చ మహాసురః || 14 ||

చతుర్దశ సహస్రాణి జనేనని హతారణ | తేనేదం శాసనం దత్తమక్షయంన కథం భ##వేత్‌ || 15 ||

స్వవంశ వర్ణనం తత్ర లిఖిత్వా స్వయమేవతు | దేశకాలాదికం సర్వం లిలేఖవిధి పూర్వకం || 16 ||

స్వముద్రా చిహ్నితం తత్రత్రైవిద్యేభ్యః తదాదదౌ | చతుశ్చత్వారింశవర్షో రామోదశరధాత్మజః || 17 ||

తస్మిన్‌ కాలే మహాశ్చర్యం సందత్తం కిలభారత | తత్ర స్వర్ణో పమంచాపి రౌప్యో పమమథాపిచ || 18 ||

ఉవాహ సలిలంతీర్థే దేవర్షి పితృతృప్తిదం | స్వవం శనాయక స్యాగ్రే సూర్యేణ కృతమే పతత్‌ || 19 ||

తద్దృష్ట్వా మహాదాశ్చర్యం రామో విష్ణుం ప్రపూజ్యచ | రామలేఖ విచి త్రైస్తు లఖితం ధర్మశాసనం || 20 ||

తా || వ్యాసులిట్లన్నారు - ఈ విధముగా ధర్మజ్ఞుడైన రాముడు పూర్వము జీర్ణోద్ధారాన్ని చేశాడు. శ్రీ మాతవచనంలో బ్రాహ్మణుల హితం కొరకు (1) యుధిష్ఠిరుని వచనము - ఓ బ్రహ్మన్‌! రాముడు పూర్వము ఏలాంటి శాసనాన్ని వ్రాశాడు. త్రేతాయుగమందు సత్యమందు చేసిన శాసనమేది, దయతో చెప్పండి అనగా (2) వ్యాసుడిట్లన్నాడు - శ్రేష్ఠమైన దివ్యమైన బకులార్కుడు అధిష్ఠించిన ధర్మారణ్యమందు, శూన్యస్వామియైన నారాయణ ప్రభువుండగా (3) సర్వజ్ఞుడైన గణ నాయకుడు రక్షణాధిపతియై యుండగా, భవసాగరమందు మగ్నులైన వారిని తరింపచేసే యోగిని ఉండగా (4) అక్కడ రామశాసనము, రాఘవుని పేరుతో ధర్మశాస్త్ర ప్రకారము వ్రాయబడిన తామ్ర శాసనమును గూర్చి విను (5) అది మహాశ్చర్యకరమైనది. అనేక యుగముల నుండి ఉన్నట్టిది. ధాతువులన్ని నశిస్తాయి. సువర్ణము నశిస్తుంది (6) ద్విజశాసనము అక్షయము. అక్కడ ప్రత్యక్షంగా కన్పిస్తోంది. తామ్రశాసనము నాశనంకాకపోవడానికి అక్కడ కారణం ఉంది. (7) వేదోక్తమైనదంతా విష్ణువే చెప్పాడు. పురాణములందు, వేదములందు ధర్మశాస్త్రములందు (8) అంతట అనేక భావములతో కూడిన విష్ణువు పొగడబడుతున్నాడు. అనేక దేశములందు, ధర్మములందు, అనేక ధర్మములను ఎరిగినవారు (9) అనేక భేదములతో అంతట విష్ణువే ఉన్నాడని అంటున్నారు. ఆ పురాణ పురుషోత్తముడు సాక్షాత్తుగా అవతరించాడు. (10) దేవతల శత్రువులను నశింపచేసే కొరకు, ధర్మరక్షణ కొరకు, అవతరించాడు. ఓ సుత! ఆతడు ఈ అవినాశాత్మకమైన శాసనాన్ని ఇచ్చాడు (11) ఆతని ప్రతాపంవల్ల రాళ్ళు జలమధ్యం నుండి దాటించాయి. లంక వానరులతో చుట్టబడింది. అవలీలగా రాక్షసులు చంపబడ్డారు (12) మృతుడైన ముని పుత్రుని రాముడు యమలోకం నుండి తెచ్చాడు. ఆతడు దుందుభిని చంపాడు. కబంధుని కూడా అట్లాగే చంపాడు. (13) తాటక చంపబడంది. ఏడుతాటి వృక్షములు పడగొట్టబడ్డాయి. ఖరుడు, దూషణుడు త్రిశిరుడు, మహాసురుడు (14) చతుర్దశ సహస్ర రాక్షసులువేగంగా యుద్ధంలో చంపబడ్డారు. ఆతడిచ్చిన ఈ శాసనము అక్షయం కాకుండా ఎట్లా ఉంటుంది (15) స్వయంగా తన వంశవర్ణనను వ్రాసి, విధి పూర్వకముగా దేశకాలాదికమంతా వ్రాశాడు (16) తన ముద్రగలిగిన దానిని వేదవిదులకు (త్రైవిద్యావిదులకు) ఇచ్చాడు. నలుబది నాలుగు సంవత్సరాల రాముడు ధశరథాత్మజుడు ఇచ్చాడు (17) ఆ కాలమందు మహాఆశ్చర్యము జరిగింది, ఓ బారత అక్కడ బంగారువంటి అట్లాగే వెండివంటి (18) నీరు తీర్థమందు ప్రవహించింది. దేవఋషి పితరులకు తృప్తినిచ్చేది. తమ వంశనాయకుడైన రాముని ఎదుట అది సూర్యునిచే చేయబడింది (19) ఆ మహాశ్చర్యాన్ని చూచి రాముడు విష్ణువును పూజించాడు. రాముని విచిత్ర లేఖనములతో ఈ ధర్మశాసనము వ్రాయబడింది (20).

మూ || యద్దృష్ట్వాథ ద్విజాః సర్వే సంసార భయబంధనం | కుర్వతౌనైవ యస్మాచ్చతస్మాన్నిఖిల రక్షకం || 21 ||

యేపాపిష్ఠా దురాచారా మిత్రద్రోహరతాశ్చయే | తేషాం ప్రబోధ నార్థాయ ప్రసిద్ధి మకరోత్పరా || 22 ||

రామలేఖ విచిత్రైస్తు విచిత్రే తామ్రపట్టకే | వాక్యానీమాని శ్రూయంతే శాసనేకి లనారద || 23 ||

ఆస్ఫోటయంతి పితరః కథయంతి పితామహాః | భూమిదో7స్మ త్కులే జాతఃసో7స్మాన్సంతారయిష్యంతి || 24 ||

బహుభిః బహుధా భుక్తా రాజభిః పృథివీత్వియం | యస్యయస్య యదాభూమిః తస్యతస్యతదాఫలం || 25 ||

షష్టివర్ష సహస్రాణి స్వర్గే వసతి భూమిదః | ఆచ్ఛేత్తాచానుమంతాచ తాన్యేవ నరకం ప్రజేత్‌ || 26 ||

సందంశైః తుద్యమానస్తుముద్గరైః వినిహత్యచ | పాశైః సుబధ్యమానస్తురోరవీతి మహాస్వరం || 27 ||

తాడ్యమానః శిరేదండైః నమాలింగ్య విభావనుం | క్షురిక యాఛిద్యమానో రోరవీతి మహాస్వనం || 28 ||

యమదూతైః మహాఘోరైః బ్రహ్మవృత్తి విలోపకః | ఏవం విధైః మహాదుష్టైః పీడ్యంతే తేమహాగణౖః || 29 ||

తతస్తి ర్యక్త్వమాప్నోతి యోనిం వా రాక్షసీం శునీం | వ్యాలీం శృగాలీం పైశాచీం మహాభూతభయంకరీం || 30 ||

భూమే రంగుల హర్తాహి నకథం పాపమాచరేత్‌ | భూమే రంగుల దాతాచ నకథం పుణ్యమాచరేత్‌ || 31 ||

అశ్వమేథ సహస్రాణాం రాజసూయ శతస్యచ | కన్యాశత ప్రదానస్యఫలం ప్రాప్నోతి భూమిదః || 32 ||

ఆయుర్యశః సుఖం ప్రజ్ఞా ధర్మోధాన్యం ధనం జయఃసంతానం వర్థతేనిత్యం భూమిదః సుఖమశ్నుతే || 33 ||

భూమే రంగులమేకంతుయే హరంతి ఖలానరాః | వంధ్యాటవీష్వతో యానుశుష్క కోటరవాసినః || 34 ||

కృష్ణ సర్పాః ప్రజాయంతే దత్తదాయాపహారకాః | తడాగానాం సహస్రేణ అశ్వమే ధశ##తేనవా

గవాంకోటి ప్రదానేన భూమిహర్తా విశుధ్యతి || 35 ||

యానీహదత్తానిపునర్ధనానిదానాని ధర్మార్థయ శస్కరాణి | ఔదార్యతోవిప్రనివేదితానికోనామ సాధుః పునరాదదీత || 36 ||

చల దలదలలీలా చంచలేజీవలోకే | తృణల వలఘు సారే సర్వ సంసారసౌఖ్యే

అపహరతి దురాశః శాసనం బ్రాహ్మణానాం | నరక గహన గర్తా వర్తపాతోత్సుకోయః || 37 ||

యోపాస్యంతి మహీ భుజః క్షితి మిమాం యాస్యంతి భుక్త్వాఖిలాం |

నోయాతానతుయాతియాన్యతినవాకేనాపిసార్థంపురా

యత్కించిద్భువితద్వినాశినకలంకీర్తిఃపరంస్థాయినీ | త్వేవంనైవసుధాపియైరుకృతాలోప్యానసత్కీర్తయుః || 38 ||

ఏకైవ భగినీలోకే సర్వేషామేవ భూభుజాం | న భోజ్యా న కరగ్రాహ్యావి ప్రదత్తా వసుంధరా || 39 ||

దత్వాభూమిం భావినః పార్థివేశాన్‌ | భూయో భూయో యాచతే రామచంద్రః

సామాన్యో7యం ధర్మసేతుః నృపాణాం | స్వేస్వే కాలే పాలనీ యో భవద్భిః || 40 ||

తా || ద్విజులందరు దానిని చూచి సంసారభయ బంధనము దీనివల్ల కలుగదని ఇది సర్వరక్షకమని భావించారు. (21) పాపిష్ఠులు, దురాచారులు, మిత్రద్రోహరతులు వారికి హెచ్చరిక కొరకు ప్రసిద్ధమైంది పూర్వము (22) రామలేఖ విచిత్రములతో విచిత్రమైన రాగి పట్టకమందు శాసనమందు ఈ వాక్యములున్నాయి కన్పిస్తున్నాయి. ఓ నారద (23) పితరలు చెబుతున్నారు. పితామహులు చెబుతున్నారు. భూమిదుడుమావంశంలో జన్మించాడు. ఆతడు మమ్ములను తరింపచేస్తాడు (24) ఈ భూమి అనేకమంది రాజులతో అనేక విధములుగా అనుభవింపబడింది. ఎవనెవనికి ఎప్పుడీ భూమి ఉందో అప్పుడప్పుడ వానిని ఆ ఫలము (25) భూమినిచ్చువాడు అరవై వేల సంవత్సరాలు స్వర్గమందుంటాడు. దానిని ఛేదించేవాడు, దాని కంగీకరించేవాడువీరిద్దరు అన్ని సంవత్సరాలే (60వేల) నరకమందుంటారు (26) పట్టుకారులతో ఒత్తబడుతూ సమ్మెటలతో కొట్టబడుతూ పాశములతో బాగా బంధింపబడుతు గొప్ప స్వరముతో అరుస్తారు (27) దండములతో తలపై కొట్టబడుతూ, అగ్నిని కౌగిలించుకొని, చిన్నకత్తితో ఛేదించబడుతూ గొప్ప గొంతుతో అరుస్తాడు (28) మహాఘోరమైన యముని దూతలు బాధిస్తారు. బ్రాహ్మణ వృత్తి విలోపకుడైతే ఈ విధముగా మహాదుష్టులైన మహాగణములతో వారు పీడింపబడుతారు (29) పిదప తిర్యక్‌ యోనిని పొందుతాడు.రాక్షస యోనిని కాని కుక్క యోనిని కాని పొందుతాడు. సర్పము ఆడపులి,ఆడ నక్క, పిశాచ స్త్రీ, మహా భూతములకు భయంకరమైన యోనినందుతాడు (30) భూమిని అంగుళముహరించినవాడు ఎంతో పాపం చేసినట్లు, భూమిని అంగుళము దానం చేసినవాడు ఎంతో పుణ్యమాచరించినట్లు (31) వేయి అశ్వమేద యాగములు, నూరు రాజసూయయాగములు, నూరుగురుకన్యల దానము ఒనరించినవాడు పొందే ఫలితమును భూమిదానం చేసిన వాడు పొందుతాడు (32) ఆయుస్సు, కీర్తి, సుఖము, ప్రజ్ఞ, ధర్మము, ధాన్యము, ధనము, జయము,సంతానము ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. భూదానం చేసినవాడు ఎల్లప్పుడు సుఖమునందుతాడు (33) భూమిని ఒక్క అంగుళ##మైన హరించిన నరులు, వ్యర్థమైన అడవులలో నీరులేనిచోట, ఎండిన తొర్రలలో నివసిస్తారు. ఇచ్చిన దానిని తిరిగి హరించువారు నల్లపాములై జన్మిస్తారు (34) వేయి తటాకములతో నూరు అశ్వమేథములతో, కోటి గోవుల దానములతో భూమిని హరించిన వాడు శుద్ధుడౌతాడు (35) ఇక్కడ ఇచ్చిన వాటిని ధనమును ధర్మ అర్థయశస్కరమైన దానములను, ఔదార్యంగా బ్రాహ్మణులకు ఇచ్చిన వాటిని సాధువైన వాడెవడు తిరిగి తీసుకుంటాడు (36) కదులుతున్న అధికమైన ఆకులవలె చంచలమైన జీవలోకంలో, తృణలవంవలె లఘుసారం గలిగి సంసార సౌఖ్యం ఉండగా, దురాశాపరుడై, బ్రాహ్మణ శాసనమును ఎవడు అపహరిస్తాడు. నరకమనే గహనమైన గుంతలోని సుడిలో పడడానికి ఎవడుత్సుకపడుతాడు (37) ఈ మహిని ఏ రాజులు పొందారో వారు దీనినంతా వదలి (అనుభవించి) వెళ్ళారు. ఎవ్వనితో కూడ ఈ భూమి గతంలో వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళటంలేదు. భవిష్యత్తులోనూ వెళ్ళదు. ఈ భూమియందున్న దంతా నశించేది, కీర్తి ఒక్కటే స్థిరమైనది. ఈ విధముగా భూమిని ఉపయోగించినవారైనా, కీర్తిని పొగొట్టుకోరాదు. (38) రాజులందరికి ఒక్కతే చెల్లెలు ఈ లోకంలో, బ్రాహ్మణునికిచ్చిన భూమిని అనుభవించరాదు. దానిమీద పన్ను తీసుకోరాదు (39) భూమిని ఇచ్చి రాబోయే రాజులను, రామచంద్రుడు మళ్ళీ మళ్ళీ ఇట్లా యాచిస్తున్నాడు. ఇది ధర్మసేతువు. రాజులందరికి సమానమైనదే. మీ మీ కాలములలో మీరు దీనిని పాలించాలి (40).

అస్మిన్‌ వంశేక్షితౌ కోపి రాజా యది భవిష్యతి | తస్యాహం కరలగ్నో స్మి మద్దత్తం యదిపాల్యతే || 41 ||

లిఖిత్వాశాసనం రామః చాతుర్వేద్య ద్విజోత్తమాన్‌ | సంపూజ్య ప్రదదౌధీమాన్‌ వసిష్ఠస్యచ సన్నిధౌ || 5 ||

తేవాడవా గృహీత్వా తంపట్టం రామాజ్ఞయాశుభం | తామ్రంహై మాక్షర యుతంధర్మంధర్మవిభూషణం || 43 ||

పూజార్థం భక్తి కామార్థాః తద్రక్షణమ కుర్వత | చందనేన చదివ్యేన పుష్పేణ చనుగంధినా || 44 ||

తథాసువర్ణపుష్పేణ రూప్య పుష్పేణ వాపునః | అహన్యహని పూజాంతే కుర్వతే వాడవాః శుభాం || 45 ||

తదగ్రే దీపకం చైవ ఘృతేన విమలేనహి | సప్తవర్తి యుతం రాజన్‌ అర్ఘ్యం ప్రకుర్వతే ద్విజాః || 46 ||

నైవేద్యం కుర్వతేనిత్యం భక్తి పూర్వం ద్విజోత్తమాః | రామరామేతి రామేతి మంత్రమప్యుచ్చరంతిహి || 47 ||

అశ##నేశయనే పానే గమనేచోపవేశ##నే | సుఖేవా వ్యథ వాదుఃఖే రామమంత్రం సముచ్చరేత్‌ || 48 ||

సతస్యదుఃఖ దౌర్భాగ్యం నాధివ్యాధి భయం భ##వేత్‌ | ఆయుఃశ్రియం బలంతస్య వర్ధయంతిదినేదినే || 49 ||

రామేతి నామ్నాముచ్యేత పాపాద్వై దారుణాదపి | నరకం నహి గచ్ఛేత గతింప్రాప్నోతి శాశ్వతీం || 50 ||

వ్యాస ఉవాచ -

ఇతి కృత్వాతతో రామః కృతకృత్యమ మన్యత | ప్రదక్షిణీ కృత్య తదా ప్రణమ్యచ ద్విజాన్‌ బహూన్‌ || 51 ||

దత్వాదానం భూరితరం గవాశ్వమహిషీరథం | తతః సర్వాన్ని జాంస్తాం శ్చ వాక్యమేత దువాచహ || 52 ||

ఆత్రైవస్థీయతాం సర్వైః యావచ్చంద్ర దివాకరౌ | యావన్మేరు మహీవృష్ఠే సాగరాః సప్తేవచ || 53 ||

తావదత్రైవ స్థాతవ్యం భవద్భిర్హి న సంశయః | యదాహి శాసనం విప్రానమన్యంతే నృపాభువి || 54 ||

అథవా వణిజః శూరా మదమాయా విమోహితాః | మదాజ్ఞాంన ప్రకుర్వంతి మన్యంతే వానతేజనాః || 55 ||

తదావై వాయుపుత్రస్య స్మరణం క్రియతాం ద్విజాః | స్మృతమాత్రో హనుమాన్వై సమాగత్య కరిష్యతి || 56 ||

సహసాభస్మతాన్సత్యం వచనాన్మేన సంశయః | యిదం శాసనం రమ్యం పాలయిష్యతి భూపతిః || 57 ||

వాయుపుత్రః సదాతస్యసౌఖ్యమృద్ధింప్రదాస్యతి | దదాతిపుత్రాన్‌పౌత్రాంశ్చసాధ్వీంపత్నీంయశోజయం || 58 ||

ఇత్యేవం కథయిత్వాచ హనుమంతం ప్రభోధ్యచ | నివర్తితో రామదేవః నసైన్యః సపరిచ్ఛదః || 59 ||

వాదిత్రాణాం న్వనైః విష్వక్‌సూచ్యమానశుభాగమః | శ్వేతాతపత్రయుక్తోసౌ7చామరైః వీజితో నరైః

అయోధ్యాం నగరీం ప్రాప్యచిరం రాజ్యంచ కారహ || 60 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే బ్రహ్మనారద సంవాదే శ్రీరామేణ బ్రాహ్మణభ్యః శాసన పట్ట ప్రదాన వర్ణనంనామ చతుస్త్రింశో7ధ్యాయః || 34 ||

తా || భూమి యందు ఈ వంశమందు ఏ రాజైనా జన్మిస్తే ఆతడునేను చెప్పిన దానిని పాలిస్తే ఆతనికి నేను స్వాధీనుణ్ణి (41) రాముడు శాసనాన్ని వ్రాసి చతుర్వేద పారగులైన బ్రాహ్మణులను పూజించి బుద్ధిమంతుడు, వసిష్ఠుని సన్నిధిలో వారికిచ్చాడు (42) ఆ బ్రాహ్మణులు రాముని ఆజ్ఞతో శుభ##మైన ఆశాసనాన్ని తీసుకొన్నారు. అదిరాగిది బంగారు వర్ణములు గలది ధర్మమైనది ధర్మమునకు అలంకారమైనది (43) భక్తి కాములై పూజకొరకు దానిని రక్షించారు. దివ్యమైన చందనముతో, వాసనగలపూలతో (44) అట్లాగే బంగారు పూలతో, అట్లాగే వెండిపూలతో, శుభ##మైన దానిని ఆ బ్రాహ్మణులు పూజించారు. (45) దాని ఎదుట స్వచ్ఛమైన నేయితో దీపం పెట్టారు. దానిలో ఏడు వత్తులు వేశారు. ద్విజులు ప్రతిరోజు అర్ఘ్యము ఇచ్చేవారు. ఓ రాజ (46) బ్రాహ్మణులు, భక్తి పూర్వకముగా ప్రతిరోజు నైవేద్యము పెట్టేవారు. రామ, రామ, రామ అని మంత్రాన్ని కూడ ఉచ్చరిస్తున్నారు (47) భుజించేటప్పుడు, నిద్రించేటప్పుడు, తాగేటపుడు, వెళ్ళేప్పుడు, కూర్చున్నప్పుడు, సుఖమందు లేదా దుఃఖమందు రామ మంత్రాన్ని ఉచ్చరించేవారు (48) వానికి దుఃఖ దౌర్భాగ్యము కాని ఆధివ్యాధి భయము కాని లేదు. ప్రతిరోజు ఆతని ఆయుస్సు శ్రీ బలము పెరుగుతున్నాయి. (49) రామనామముచ్చరిస్తే చాలు దారుణమైన పాపం నుండైన ముక్తుడౌతాడు. నరకానికి వెళ్ళడు. శాశ్వత గతిని పొందుతాడు. (50) వ్యాసులిట్లన్నారు అని పలికి రాముడు తనను కృతకృత్యునిగా తలిచాడు. అప్పుడు ప్రదక్షిణంచేసి అనేక మంది బ్రాహ్మణులకు నమస్కరించి (51) అధికమైన దానము గోవులు, అశ్వము, బఱ్ఱలు రథము మొదలగునవి ఇచ్చాడు. పిదప తనవారిని అందరిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు (52) సూర్యచంద్రులున్నంత వరకు మీరందరు ఇక్కడే ఉండండి. భూమిమీద మేరు పర్వతం ఉన్నంతకాలము, ఏడు సముద్రములు ఉన్నంతకాలము (53) మీరిక్కడే ఉండాలి, అనుమానంలేదు. ఎప్పుడైతే బ్రాహ్మణులు,రాజులు ఈభూమిపై ఆ శాసనాన్ని గౌరవించరో (54) లేదా శూరులైన వణిజులు మదమాయ విమోహితులై నా ఆజ్ఞను పాటించరో, నా మాటను తలచరో (55) ఓ బ్రాహ్మణులార అప్పుడు వాయుపుత్రుని స్మరించండి. స్మరించినంత మాత్రంతో హనుమంతుడు వచ్చి (56) వారిని త్వరగా భస్మంచేస్తాడు. నామాట ప్రకారం చేస్తాడు. ఇది సత్యము, అనుమానంలేదు. ఈ రమ్యమైన శాసనమును ఏరాజుపాలిస్తాడో (57) వానికి వాయుపుత్రుడు ఎల్లప్పుడు సౌఖ్యాభివృద్ధిని కల్గిస్తాడు. పుత్రులను పౌత్రులను ఇస్తాడు. సాధ్వియైన పత్నిని, యశస్సును, జయమును ఇస్తాడు (58) అని పలికి హనుమంతుని ప్రబోధించి రామదేవుడు సైన్యంతో, పరిజనంతో కూడి తిరిగి వెళ్ళాడు (59) వాదిత్రముల శబ్దములతో అంతట తన శుభ ఆగమనాన్ని సూచిస్తూ, తెల్లని గొడుగు కలిగి,నరుల చామరములు వీవగా అయోధ్యా నగరిని చేరి చాలా కాలం రాజ్యం చేశాడు (60) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు బ్రమ్మనారద సంవాదమందు శ్రీరాముడు బ్రాహ్మణుల కొరకు శాసనపట్ట ప్రదాన వర్ణన మనునది ముప్పది నాల్గవ అధ్యాయము || 34 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters