Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఐదవ అధ్యాయము

మూ|| నారద ఉవాచ -

భగవన్‌ దేవదేవేశ సృష్టి సంహార కారక | గుణాతీతో గుణౖర్యుక్తో ముక్తీనాం సాధనంపరం || 1 ||

సంస్థాప్య వేద భవనం విధివత్‌ ద్విజసత్తమాన్‌ | కించక్రే రఘునాథస్తు భూయో7యోధ్యాంగతస్తదా || 2 ||

స్వస్థానే బ్రాహ్మణాస్తత్ర కాని కర్మాణి చక్రిరే || 3||

బ్రహ్మోవాచ -

ఇష్టాపూర్తరతాః శాంతాః ప్రతిగ్రహ పరాఙ్‌ముఖాః || 3 ||

రాజ్యం చక్రుర్వనస్యాస్య పురోధా ద్విజసత్తమః | ఉవాచ రామ పురతః తీర్థమాహాత్మ్య ముత్తమం || 4 ||

ప్రయాగస్యచ మాహాత్మ్యం త్రివేణీ ఫలముత్తమం | ప్రయాగ తీర్థమహిమా శుక్లతీర్థస్య చైవహి || 5 ||

సిద్ధక్షేత్రస్య కాశ్యాశ్చ గంగాయాః మహిమా తథా | వసిష్ఠః కథయా మాసతీర్థాన్యన్యాని నారద || 6 ||

ధర్మారణ్య సువర్ణాయాః హరిక్షేత్రస్య తస్యచ | స్నానాదానాదికం సర్వం వారాణస్యాయ వాధికం || 7 ||

ఏతచ్ఛ్రుత్వారా మదేవః నచమత్కృతమాననః | ధర్మారణ్య పునర్యాత్రాం కర్తుకామః సమభ్యగాత్‌ || 8 ||

సీతయా సహధర్మజ్ఞో గురుసైన్యపురఃనరః | లక్ష్మణన సహభ్రాత్రా భరతేన సహాయవాన్‌ || 9 ||

శత్రుఘ్నేన పరివృతో గతో మోహరకేపురే | తత్రగత్వా వసిష్ఠంతు వృచ్ఛ తే7సౌ మహామనాః || 10 ||

రామ ఉవాచ -

ధర్మారణ్య మహాక్షేత్రే కింకర్తవ్యం ద్విజోత్తమ | దానంవానిమయో వాథ స్నానంవా జపముత్తమం || 11 ||

ధ్యానంవాధక్రతుం వాధ హోమంవాజపముత్తమం | దానంవాని యం వాథస్నానం వాతప ఉత్తమం || 12 ||

యేనవైక్రియ మాణన తీర్థే7స్మిన్‌ ద్విజసత్తమ | బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే తద్ర్బవీహిమే || 13 ||

వసిష్ఠ ఉవాచ -

యజ్ఞం కురుమహా భాగ ధర్మారణ్యత్వ ముత్తమం | దినేదినే కోటి గుణంయావద్వర్షశతం భ##వేత్‌ || 14 ||

తచ్ఛ్రుత్వాచైవ గురుతో యజ్ఞారంభంచ కారనః | తస్మిన్నవ సరే సీతా రామం వ్యజ్ఞాపయన్‌ముదా || 15 ||

స్వామిన్‌ పూర్వం త్వయావిప్రా వృతాయే వేదపారగాః | బ్రహ్మవిష్ణుమహేశేన నిర్మితాయే పురాద్విజాః || 16 ||

తా || నారదుని వచనము - ఓ భగవాన్‌ ! దేవదేవేశ ! సృష్టి నంహారకారక, గుణములకతీతుడవు. గుణముక్తుడవు. ముక్తికి ఉత్తమ సాధనమువు (1) వేద భవనాన్ని ఏర్పరచి, విధి పూర్వకముగా బ్రాహ్మణులనేర్పరచి, రఘునాథుడు అయోధ్యకు వెళ్ళి తిరిగి ఏం చేశాడు (2) తమ స్థానమందు బ్రాహ్మణులు అక్కడ ఏంపనులు చేశారు అనగా బ్రహ్మ ఇట్లన్నాడు - వారంతా ఇష్టాపూర్వకమందు ఆసక్తి గలవారు, శాంతులు, ప్రతిగ్రహమందు(దాన స్వీకరణం) పరాఙ్‌ముఖులు (3) ఈ వనమునకు పురోధుడు వసిష్ఠుడు ద్విజసత్తముడు, రాజ్యం చేశాడు. రాముని ఎదుట ఉత్తమమైన తీర్థ మాహాత్మ్యమును చెప్పాడు (4) ప్రయాగ మాహాత్మ్యము, ఉత్తమమైన త్రివేణీ ఫలము. ప్రయాగ తీర్థమహిమ శుక్ల తీర్థమహిమ (5) సిద్ధక్షేత్రము, కాశి, గంగ, వీని మహిమ ఇతర తీర్థముల మహిమ, వసిష్ఠుడు చెప్పసాగాడు, ఓ నారద (6) ధర్మారణ్యమందలిసువర్ణ యొక్క హరిక్షేత్రం యొక్క మహిమ అక్కడ స్నాన దానాదికము అంతా వారణాసికన్న ఒక యవగింజంత అధికమే (7) దీన్ని విని రాముడు ఆశ్చర్యకరమైన మనస్సు కలవాడై ధర్మారణ్యమును గూర్చి తిరిగి యాత్ర చేయదలచి, వచ్చాడు (8) సీతతో కూడి పెద్దసైన్యం ముందుండగా ధర్మజ్ఞుడు లక్ష్మణునితో కూడి, భరతుడు సహాయంకాగా (9) శత్రుఘ్నునితో కలిసి మోహెరకపురానికి వెళ్ళాడు. అక్కడికివెళ్ళి ఈతడు వసిష్ఠునిట్లా అడిగాడు. (10) రాముని వచనము - ఓ ద్విజోత్తమ ధర్మారణ్య మహాక్షేత్రమందు ఏమి చేయాలి. దానమా, నియమమా, ఉత్తమతవమా (11) ధ్యానమా క్రతువా, హోమమా, ఉత్తమ జపమా (12) ఓ ద్విజసత్తమ ఈ తీర్థమందు ఏది ఆచరిస్తే బ్రహ్మహత్యాది పాపముల నుండి ముక్తుడౌతాడు. అది నాకు చెప్పండి (13) అనగా వసిష్ట వచనము - ఓ మహాబాగ, నీవు ధర్మారణ్యమందు ఉత్తమమైన యజ్ఞాన్ని ఆచరించు దినదినము కోటి గుణితముగా నూరు సంవత్సరముల పరకాచరించు (14) గురువు నుండి ఆ మాటను విని, అతడు యజ్ఞమారంభించాడు. ఆ సంధర్భంలో సీత రామునితో ఆనందంగా ఇట్లా చెప్పింది (15) ఓ స్వామి పూర్వం మీరు వేద పారగులైన బ్రాహ్మణులను వరించారు. వారు పూర్వం బ్రహ్మవిష్ణు మహేశులతో నిర్మింపబడ్డారు (16)

కృతేత్రేతాయుగే చైవ ధర్మారణ్య నివాసినః | విప్రాస్తాన్వై వృణుష్వత్వం తైరేవసాధకోధ్వరః 17

తచ్ర్ఛుత్వా రామదేవేన ఆహూతా బ్రాహ్మణాస్తదా | స్థాపితాశ్చ యదాపూర్వం అస్మిన్‌ మోహేరకే వురే 18

తైస్త్వష్టాదశ సంఖ్యాకైః త్రైవిద్యైః యేహి వాడవైః యజ్ఞఃచ కార విధివత్‌ తైరే వాయథబుద్దిభిః 19

కుశికః కౌశికోవత్స ఉపమన్యుశ్చ కాశ్యవః | కృష్ణాత్రేయో భరద్వాజో ధారిణః శౌనకోవరః 20

మాండవ్య భార్గవః పైం గ్యోవాత్య్సో లౌ గాక్షేవచ || గాంగాయ నోథ గాంగేయః శునకః శౌనకస్తథా 21

బ్రహ్మోవాచ - ఏభిర్విపై#్రః క్రతుంరామః సమాప్యవిధివస్పృపః | చకారాష భీథం రామో విప్రాన్‌ సంపూజ్య భక్తితః 22

యజ్ఞంతే సీతయారామో విజ్ఞప్తః సువినీతయా | అస్యావధ్వరస్య సంపత్తౌ దక్షిణాం దేహి సువ్రత 23

మన్నామ్నాచ పురంతత్ర స్థాప్యతాం శీఘ్రమేవచ | సీతాయా వచనం శ్రుత్వాతథాచవ్రే నృపోత్తమః 24

తేషాం చ బ్రాహ్మణానాంచ స్థానమే కంసునిర్భయంద్రత్తం రామేణసీతాయాః సంతోషాయమహీభృతా 25

సీతాపురమితిఖ్యాతం నామచక్రే తదాకిల | తస్యాధి దేవ్యౌ వర్తేతే శాంతా చైవసుమంగలా 26

మోహేరకస్య పురతో గ్రామద్వాదశకం పురః దదౌవిప్రాయ విదుషే సముత్థాయ ప్రహర్షితః 27

తీర్థాంతరం జగామాశు కాశ్యపీ సరితస్తటే | వాడవాః కేపి నీతాస్తే రామేణసహ ధర్మవిత్‌ 28

ధర్మాలయేగతః సద్యో యత్రమాలాకమండలుః పురాధర్మేణ సుమహాత్‌ కృతం యత్రతపోమునే 29

తదారభ్య సువిఖ్యాతం ధర్మాలయమితిశ్రుతం | దదౌదాశరథిస్త్ర మహాదానానిషోడశ 30

యేవం చాశత్తదాగ్రామాః సీతాపురసమన్వితాః | సత్యమందిరవర్యంతా రఘునాథేన వైతదా 31

సీతాయావచనాత్తత్ర గురువాక్యేన చైవహి | ఆత్మనో వంశవృధ్థ్యర్థం ద్విజేభ్యో దాద్రఘూత్తమః 32

అష్టాదశ సహస్రాణాం ద్విజానామ భవత్‌ కులం | వాత్య్సాయన ఉపమన్యు: జాతూ కర్ణ్యోథపింగలః 33

భరద్వాజస్తథావత్సః కౌశికః కుశేవచ, శాండిల్యః కశ్యపశ్చైవ గౌతమశ్చాందసస్తథా 34

కృష్ణాత్రేయస్తథా వత్సోవసిష్ఠో ధారణస్తథా | భాండిలశ్చైవ విజ్ఞేయో ¸°వనాశ్వః తతఃపరం 35

కృష్ణాయ నోవమన్యూచ గార్గ్య ముద్గలమైఖకాః | పుశిః వరాశరశ్చైవ కైండిన్యశ్చతతః పరం 36

తా|| కృతయుగ మందు త్రేతా యుగమందు ధర్మారణ్యమందు నివసించి ఉన్న ఆ విప్రులనే నీవు రక్షించు. వారితో యజ్ఞాన్ని నిర్వహించు (17) అనగా దానిని విని రామదేవుడు అప్పుడు బ్రాహ్మణులను పిలిచాడు. పూర్వం మాదిరి మోహేరక పురమందు వారిని స్థాపించాడు (18) వారు పద్దెనిమిది మంది త్రైవిద్య నెరిగినవారు మేహి బాడబులు. వారితోనే, ఆయత బుద్దులతో విధి ప్రకారము యజ్ఞము చేయించాడు (19) కుశికుడు, కౌశికుడుడైన వత్సుడు, ఉపమన్యవు, కాశ్యపుడు, కృష్ణాత్రేయుడు, భరద్వాజుడు, ధారిణుడు, వరు శౌనకుడు (20) మాండవ్యుడు, భార్గవుడు, పైంగ్యుడు, వాత్య్సుడు, లౌగాక్షుడు, గాంగాయనుడు, గాంగేయుడు, శునకుడు, శౌనకుడు (21) బ్రహ్మఇట్లన్నారు - ఈ బ్రహ్మణులతో రాముడు శాస్త్ర ప్రకారము క్రతువును సమాప్తిచేసి, విప్రులను భక్తితో పూజించి రాముడు అపభృథము చేశాడు (22) యజ్ఞాంత మందు సువినీతురాలైన సీత రామునకు ఇట్లా విజ్ఞప్తి చేసింది. ఈ అధ్వర్యం యొక్క సంపత్తి నుండి దక్షిణనివ్వు ఓ సువ్రత ! (23) త్వరగా నాపేరుతో అక్కడ పురాన్ని నిర్మించండి. నృపోత్తముడు సీత మాటను విన అట్లాగే చేశాడు (24) ఆ బ్రాహ్మణులకు నిర్భయమైన ఒక స్థానాన్ని సీత సంతోషం కొరకు రాజైన రాముడిచ్చాడు. (25) దానికి సీతాపురమని పేరు పెట్టాడు. దానికి అధి దేవతగా శాంత, సుమంగల ఇద్దరున్నారు (26) మోహేరక పురం ఎదుట పన్నెండు గ్రామములను విద్వాంసుడైన విప్రునకిచ్చాడు.ఆనందంతో లేచి (27) కాశ్యపినది తీరమునకు తీర్థతీరమునకు త్వరగా వెళ్ళాడు. కొందరు బ్రాహ్మణులను తీసుకెళ్ళాడు.ధర్మమెరిగిన రాముడు. (28) మాలా, కమండలు వున్నచోటికి ధర్మాలయమునకు వెంటనే వెళ్ళాడు. అక్కడ పూర్వము ధర్ముడు గొప్ప తపస్సు చేశాడు (29) నాటి నుండి ఆది ధర్మాలయమని ప్రసిద్ది చెందింది. అక్కడ రాముడు పదహారు మహా దానములు చేశాడు (30) సీతాపురముతో కూడినవి ఏబది గ్రామములు, సత్యమందిరము వరకు రఘునాథుడు నిర్మించి (31) సీత వచనాన్ననుసరించి, గురువాక్యాన్ననుసరించి, తన వంశ శుద్ది కొరకు రాఘవుడు బ్రహ్మాణులకిచ్చాడు (32) బ్రాహ్మణులది పద్దెనిమిదివేల కులమైంది. వాత్య్యాయనుడు, ఉపమన్యుడు, జాతూకర్ణి, పింగలుడు (33) భారద్వాజుడు, వత్సుడు, కౌశికుడు, కుశుడు, శాండిల్యుడు, కశ్యపుడు, గౌతముడు, ఛాందనుడు (34) కృష్టాత్రేయుడు, వత్సుడు, వసిష్టుడు, ధారణుడు, భాండిలుడు, ¸°వనాశ్వుడు (35) కృష్ణాయన, ఉపమన్యవులు, గార్గ్యముద్గల మౌఖకులు పుశి. పరాశరులు, కౌండిన్యుడు (36)

మూ || పంచపంచాశద్గ్రామాణాం నామన్యేవంయథాక్రమం | సీతాపురంశ్రీక్షేత్రంచముషలీముద్గలీతథా 37

జ్యేష్టా శ్రేయస్థానంచ దంతా లీపట పత్రకా | రాజ్ఞః పురం కృష్ణవాటం దేహంలోహంచయ సస్థనం 38

మహోధం శమోహోరలీ గోవిందణం ధలత్యజం | చారణ సిద్దం సోద్గీత్రాభాజ్యజం పటమాలికా 40

గోధరం మారణజం చైవమాత్రమధ్యంచ మాతరం | బలవతీ గంధవతీ ఈ ఆవ్లీుచ రాజ్యజం 41

రూపావలీ బహుధనం చత్రీటం వంశజంతథా | జాయా సంరణంగోతికీచ, చిత్రలేఖంతథైవచ 42

దుగ్థావలీహం సావీలిచ వైహోలంచైల్లజంతథా | నాలావలీ ఆసావలీసుహాలీకామతః పరం 43

రామేణ పంచపంచాశత్‌ గ్రామాణి వసనాయచ | స్వయం నిర్మాయ దత్తాని ద్విజేభ్యస్తేభ్య ఏవచ 44

తేషాం శుశ్రూషణార్థాయ వైశ్యావ్రామోస్య వేదయత్‌ |

షట్‌ త్రింశచ్చ సహస్రాణి శూద్రాంస్తేభ్యశ్చతుర్గుణాన్‌ 45

తేభ్యోదత్తాదానాని గనాశ్వవసనానిచ | హిరణ్యం రజతం తామ్రం శ్రధ్దయా వరయాముదా 46

నారద ఉవాచ - అష్టాదశ సహస్రాస్తే బ్రాహ్మణా వేదపారగాః కథంతే వ్యభ జన్గ్రామాన్‌ గ్రామోత్పన్నంతథావసు వస్త్రాద్యం భూషణాద్యం చతన్మే కథయ సుప్రతం 47

బ్రహ్మోవాచ -

యజ్ఞాంతే దక్షిణాయావత్‌ సర్‌త్వగ్భిః స్వీకృతా సుత | మహాదానాదికం సర్వంతేభ్య ఏవసమర్చితం 48

గ్రామాః సాధారణాదత్తా మహాస్థానానివై తదా | యేవ సంతిచయత్రైవ తానితేషాం భవంత్వితి 49

వసిష్ట వచనాత్తత్ర గ్రామాస్తే విప్రసౌత్కృతాః | రఘూద్వహేన ధీరేణ నోద్వనంతియథాద్విజాః 50

ధాన్యంతేషాం వ్రదత్తంహి విప్రాణాంచామితం వసు | కృతాంజలిస్తతో రామో బ్రాహ్మణాని దమ బ్రవీత్‌ 51

యథాకృతయుగే విప్రాః త్రేతాయాంచ యథాపుర | తథాచాద్యైవ వర్తవ్యం మమరాజ్యేన సంశయః 52

తా|| అని మొ|| నవి కులములు వారి ఏబది ఐదు గ్రామాలను ఏర్పరచాడు. వాటి పేర్లిట్లా సీతాపురము, శ్రీ క్షేత్రము. ముశలి, ముద్గలి (37) జ్యేష్ఠల, శ్రేయస్థానం , దంతాలి, పటపత్రక, రాజపురము, కృష్ణవాటము, దేహము, లోహము, చనస్థనము (38) కోహేచము, చందనక్షేత్రము, ధలముహస్తినాపురము, కర్పటము, కంసజన్హవీ, వనోఢ, ఫనఫావలీ (39) మోహోధం, శమోహోరలీ, గోవిందణం, థలత్యజము, చారణసిద్దము, సోద్గీత్రాభాజ్యజం, వటమాలికా (40) గోధరం , మారణజం, మాత్రమధ్యం, మాతరం , బలవతి, గంధపతి, ఈఅవ్లీు, రాజ్యజం (41) రూపావలీ, బహుధనం, చత్రీటం, వంశంజం, జాయాసంరణం,గోతికీ, చిత్రలేఖం (42) దుగ్థాపలీ, హంసౌవలీ, వైహోలం, చైలజ్జం, నాలావలీ, ఆసావలీ, నుహాలీ, కామతఃపరము (43) రాముడు పంచపంచాశత్‌

గ్రామములను వస్త్రములకొరకు ఇచ్చాడు. అద్విజుల కొరకు స్వయంగా నిర్మించిఇచ్చాడు (44) వారి శుశ్రూషణ కొరకు వైశ్యులను రాముడు ఏర్పరచాడు. ముప్పది ఆరువేల మందిని వైశ్యులను వీరికి నాల్గింతలుగా శూద్రులను ఇచ్చాడు. (45) వారికిచ్చిన దానములు గోవులు అశ్వములు, వసనములు, బంగారము, వెండి, రాగి వీటిని శ్రధ్ధతో ఆనందంతో ఇచ్చాడు (46) నారదుడిట్లన్నాడు - పద్దెనిమిదివేల ఆ బ్రాహ్మణులు వేదపారగులు. వారు గ్రామముల నెట్లా పంచుకున్నారు. ఆగ్రామములలో పుట్టిన ధనాన్ని ఎట్లా పంచుకున్నారు. వస్త్రాదులు, భూషణాదులు ఎట్లా పంచుకున్నారో దానిని నాకు చెప్పండి (47) అనగా బ్రహ్మ ఇట్లన్నాడు - ఓ సుత! యజ్ఞాంతమందు ఎంతవరకు ఋత్విక్కులు దానం స్వీకరించారో, మహా దానాదికము గూడా అంతా వారికే ఇవ్వబడింది (48) సాధారణ గ్రామములు, మహాస్థానములు ఇచ్చాడు. ఎవ్వరెక్కడున్నారో అవి వారికే ఔతాయి అని (49) వసిష్ఠుని వచన ప్రకారము అక్కడ గ్రామములను బ్రాహ్మణాధీనము చేశాడు. ధీరుడైన రాముడు ద్విజులక ఉద్వాసన కలుగకుండవాటినే ఇచ్చాడు (50) వారికి ధాన్యమును, అమితమైన ధనమును ఇచ్చాడు. రాముడు చేతులు జోడించి ఆపిదప బ్రాహ్మణులతో ఇట్లా అన్నాడు (51) పూర్వం కృతయుగమందు బ్రాహ్మణులు ఎట్లా ఉన్నారో త్రేతయందెట్లున్నారో, అట్లాగే ఇప్పుడు కూడా నా రాజ్యంలో మీరుండాలి, అనుమానంలేదు (52).

మూ || యత్కించిద్థనధాన్యంవాయానంవాపసనానివా | మణయఃకాంచనాదీంశ్చహెమాదీంశ్చ తథావసు || 53 ||

తామ్రాద్యంరజతాదీంశ్చప్రార్థయథ్వం మమాధునా | అధునానా భవిష్యే వాభ్యర్థనీయం యథోచితం || 54 ||

ప్రేషణీయంవాచికంమేసర్వదార్దిజసత్తమాః | యంయంకామంప్రార్థయథ్వంతంతందాస్యామ్యహంవిభో || 55||

తతోరామః సేవకాదీనాదరాత్‌ ప్రత్యభాషత | విప్రాజ్ఞా నోల్లంఘనీయా సేవసీయా ప్రయత్నతః || 56 ||

యంయంకామం ప్రార్థయంతే కారయధ్వం తతస్తతః | ఏవంసత్వాచవిప్రాణాం సేవనంకురుతేతుయః || 57 ||

నశూద్రః స్వర్గమాప్నోతి ధనవాన్‌ పుత్రవాన్‌ భ##వేత్‌ | అన్యథానిర్థసత్వం హిలభ##తే నాత్రసంశయః || 58 ||

యవనోవ్లుెచ్ఛజాతీయోదైత్యో వారాక్షసోపివా | యోత్రవిఘ్నం కరోత్యేవ భస్మీ భవతి తత్‌ క్షణాత్‌ || 59 ||

బ్రహ్మోవాచ -

తతః ప్రదక్షిణీ కృత్య ద్విజాన్‌ రామో7తిహర్షితః | ప్రస్థానాభిముఖో విపై#్రః ఆశీర్భిర భినందితః || 60 ||

ఆ సీమాంతమను ప్రజ్యస్నేహ వ్యాకులలోచనాః | ద్విజాన్సర్వే వినిర్వృత్తా ధర్మారణ్య విమోహితాః || 61 ||

ఏవం కృత్వా తతో రామః ప్రతస్థే స్వాంపురీంప్రతి | కాశ్యపాశ్చైవ గర్గాశ్చ కృతకృత్యా దృఢ ప్రతాః || 62 ||

గుర్వాసన సమావిష్టాః సభార్యాసనుహృత్‌సుతాః | రాజధానీంతదాప్రాపరామో7యోధ్యాంగుణాన్వితాం || 63 ||

దృష్ట్వా ప్రముదితా ః సర్వే లోకాః శ్రీ రఘునందనం | తతోరామః సథర్మాత్మా ప్రజాపాలన తత్పరః || 64 ||

సీతయా సహధర్మాత్మా రాజ్యం కుర్వంస్తదాసుధీః | జానక్యాంగర్భ మాదత్త రవి వంశోద్భవాయచ || 65 ||

ఇతిశ్రీ స్కాందేమహాపురాణ ఏకాశీతిసాహిస్ర్యాంసంహితాయాంతృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్యమాహత్మ్యే శ్రీరామచంద్రకృతధర్మారణ్యతీర్థక్షేత్రజీర్ణోద్ధారవర్ణనంనామపంచత్రింశో7ధ్యాయః || 35 ||

తా || కొంత ధనధాన్యములుయానములు వస్త్రములు మణులు బంగారు మొదలగునవి వెండి మొదలుగునవి ఐశ్వర్యము (53) వెండి, రాగి మొదలగునవి ఇచ్చినన్నిప్పుడు ప్రార్థించండి. ఇప్పుడు కాని భవిష్యత్తులోకానిమీకిష్టమైనది కోరండి (54) నాకు మాటమాత్రంగా తెలియజేయండి ఎప్పుడైనాసరే ఓ బ్రాహ్మణులార! ఏకోరికప్రార్థిస్తారోఆఆకోరికనిస్తాను నేను ఓ విభు (55) ఆపిదప సేవకులుమొదలగువారితోఆదరంతోమాట్లాడాడు. బ్రాహ్మణుల ఆజ్ఞనుదాటరాదు. వారిని ప్రయత్నపూర్వకంగాసేవించాలి. (56) వారు ఏ ఏ కోరికలను కోరితే వెంటవెంటనేవాని చేయండి. ఈ విధంగా నమస్కరించి విప్రులకుఎవరుసేవచేస్తారో (57) అట్టిశూద్రులుఅన్ని పొందుతారు ధనవంతులు, పుత్రవంతులౌతారు.లేని పక్షంలో నిర్థ సత్వము లభిస్తుంది, అనుమానంలేదు (58) యవనుడుకాని వ్లుెచ్ఛజాతీయుడుకాని, దైత్యులుకాని, రాక్షసులుకాని,విఘ్నం చేసినవారెవరైనా ఆక్షణంలోనే భస్మమౌతారు. (59) బ్రహ్మవచనము- పిదప బాగాఆనందపడి రాముడు బ్రాహ్మణులకు ప్రదక్షిణంచేసి,బ్రాహ్మణుల ఆశీర్వాదములతో అభినందింపబడి బయల్దేరడానికి సిద్ధమైనాడు (60) సీమాపరిధివరకు అనుసరించి,స్నేహంతో, చంచలమైనకనులుగలవారైవిమోహితులైబ్రాహ్మణులందరు ధర్మారణ్యమునకుతిరిగి వచ్చారు. (61) ఇట్లాచేసిన పిదపరాముడుతననగరానికిబయల్దేరాడు కాశ్యపులు, గర్గులు దృఢవ్రతులుకృతకృత్యులైనారు (62)భార్యలతో, స్నేహితులు సుతులతో గుర్వాసనసమావిష్టులైనారు. ఆపిదపరాముడుగుణాన్వితమైన అయోధ్యకురాజధానికి వచ్చాడు. (63) శ్రీరఘునందనునిచూచిప్రజలంతా ఆనందపడ్డారు. ఆపిదపధర్మాత్ముడైనరాముడు ప్రజాపాలనతత్పరుడు (64) ధర్మాత్ముడు బుద్ధిమంతుడు, సీతతోకలిసిరాజ్యపాలనచేశాడు. రవివంశోద్భవుని కొరకు సీతయందురాముడు గర్భముధరించాడు (65) అనిశ్రీస్కాంద మహాపురాణమందు ఏకాశీతిసహస్రసంహితయందుతృతీయబ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్యమహాత్మ్య మందు శ్రీరామచంద్రుడుచేసినధర్మారణ్యతీర్థక్షేత్రజీర్ణోద్ధారవర్ణమనునది ముప్పదిఐదవ అధ్యాయము ||35 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters