Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఆరవ అధ్యాయము

మూ|| నారద ఉవాచ -

అతఃపరంకిమభవత్‌తన్మేకథయసువ్రత | పూర్వంచతదశేషేణశంసమేవదతాంపర || 1 ||

స్థిరీభూతం చతత్‌స్థానంకియత్కాలంవదన్వమే | కేనవైరక్షమాణంచకస్యాజ్ఞావర్తతేప్రభో || 2 ||

బ్రహ్మోవాచ -

త్రేతాతో ద్వాపరాంతచ యావత్కలి సమాగమః | తావత్‌ సంరక్షణ చైకోహనుమాన్‌ పవనాత్మజః || 3 ||

సమర్థోనాస్యథాకోపి వినాహనుమతాసుత | లంకా వింధ్వంసితాయేన రాక్షసాః ప్రబలాహతాః || 4||

స ఏవరక్షతేతత్ర రామాదేశేన పుత్రక | ద్విజాస్యాజ్ఞాప్రవర్తేత శ్రీమాతాయాస్తథైవచ || 5 ||

దినేదినే ప్రహర్షో భూజ్ఞనానాం తత్రవాసినాః | పఠంతిస్మ ద్విజాస్తత్ర ఋగ్యజుః సామలక్షణాన్‌ || 6 ||

అథర్వణమపి తత్ర పఠంతి స్మదివానిశం | వేదనిర్ఘోషజః శబ్దః త్రైలోక్యే సచరాచరే || 7 ||

ఉత్సవాస్తత్ర జాయంతే గ్రామేగ్రామే పురేపురే | నానాయజ్ఞాః ప్రవర్తంతే నానాధర్మ సమాశ్రితాః || 8 ||

యుథిష్ఠిర ఉవాచ -

కదాపితస్య స్థాన స్యభంగోజాతోథవాసవా | దైత్యైః జితం కదా స్థానమథవా దుష్టరాక్షసైః || 9 ||

వ్యాస ఉవాచ -

సాధుపృష్టంత్వయారాజన్‌ ధర్మజ్ఞ స్త్వం సదాశుచిః | ఆదౌ కలియుగేప్రాప్తేయద్వృత్తంతచ్ఛ్రుణష్వబోః || 10 ||

లోకానాంచహితార్థాయ కామాయచ సుఖాయచ | యజ్ఞంచ కథయిష్యామి తత్సర్వం శృణు భూపతే || 11 ||

ఇదా నీంచ కలౌప్రాప్తే ఆమోనామ్నా బభూవహ | కాస్యకుబ్జాధిపః శ్రీమాన్‌ ధ్మజ్ఞోనీతి తత్పరః || 12 ||

శాంతో దాంతో సుశీలశ్చ సత్యధర్మపరాయణః | ద్వాపరాంతే నృపశ్రేష్ఠ అనాగతే కలౌయుగే || 13 ||

భయాత్‌ కలివిశేషేణ అధర్మస్య భయాదిభిః | సర్వదేవాః క్షితిం త్యక్త్వానైమిషారణ్య మాశ్రితాః || 14 ||

రామోపి సేతు బంధంహిస సహాయోగతో నృప || 15 ||

యుధిష్ఠిర ఉవాచ -

కీ దృశంహి కలౌప్రాప్తే భయంలోకేసుదుస్తరం | యస్మిన్‌ సురైః పరిత్యక్తా రత్నగర్భావసుంధరా || 16 ||

వ్యాస ఉవాచ -

శృణుష్వకలి ధర్మాస్త్వం భవిష్యంతి యథానృప | అసత్యవాది నోలోకాః సాధునిందా పరాయణాః || 17 ||

దస్యుకర్మరతాః సర్వేపితృభక్తి వివర్జితాః | స్వగోత్ర దారా భిరతాః లౌల్యధ్యాన పరాయణాః || 18 ||

బ్రాహ్మవిద్వేషిణః సర్వేపరస్పర విరోధినః | శరణాగతహంతారో భవిష్యంతి కలౌయుగే || 19 ||

వైశ్యాచారరతావిప్రా వేదభ్రష్టాశ్చమానినః | భవిష్యంతి కలౌప్రాప్తే సంధ్యాలోప కరా ద్విజాః || 20 ||

తా || నారదుడిట్లాన్నాడు - ఆ తరువాత ఏమైందో నాకు తెలియజేయండి. ఓ సువ్రత! ఓ (కథలు) చెప్పేవారిలో శ్రేష్ఠుడ! మొదటి నుండి చివరదాకా అదంతా నాకు చెప్పండి (1) ఆ స్థానము ఎంతకాలం స్థిరంగా ఉందో నాకు చెప్పండి. ఎవరితో రక్షింపబడింది. అక్కడ ఎవరి ఆజ్ఞ నడిచింది. అనగా (2) బ్రహ్మఇట్లన్నాడు - త్రేతాయుగం నుండి ద్వాపరాంతం వరకు, కలియుగం వచ్చే వరకు పవనాత్మజుడు, హనుమంతుడొక్కడే రక్షకులు (3) ఓసుత! హనుమంతుడు కాక మరొకడు సమర్థుడుకాడు. లంకను ధ్వంసము చేసినవాడు, ప్రబల రాక్షసులను చంపినవాడు (4) ఓ పుత్రక! రాముని ఆజ్ఞతో ఆతడే రక్షిస్తున్నాడు. బ్రాహ్మణుల ఆజ్ఞ. అట్లాగే శ్రీమాత ఆజ్ఞ నడుస్తుంది (5) అక్కడున్న జనులకు ప్రతిరోజు ఎంతో ఆనందమైంది. అక్కడ ద్విజులు ఋక్‌, యజున్‌, సామవేదములను చదువసాగారు. (6) రాత్రింబగళ్ళు అథర్వణ వేదం కూడా అక్కడ చదువసాగారు. సచరాచరమైన ముల్లోకములందు వేద నిర్ఘోషము నుండిపుట్టిన శబ్దమే (7) ప్రతిగ్రామమందు ప్రతిపురమందు అక్కడ ఉత్సవములౌతున్నాయి. నానా ధర్మముల నాశ్రయించి రకరకాల యజ్ఞములౌతున్నాయి (8) యుధిష్ఠిరుడిట్లన్నాడు - ఎప్పుడైనా ఆ స్థానానికి భంగమేర్పడిందా ఏర్పడలేదా, దైత్యులు, దుష్టరాక్షసులు దానినెప్పుడు జయించారు అని అనగా (9) వ్యాసులిట్లన్నారు - ఓ రాజ! నీవు బాగా అడిగావు. నీవు ధర్మజ్ఞుడవు. ఎల్లప్పుడు శుచివి. తొలత కలియుగం వచ్చినప్పుడు ఏం జరిగిందో దాన్ని విను (10) లోకముల హితము కొరకు, కోరిక కొరకు, సుఖం కొరకు యజ్ఞం కూడా చెప్తాను. ఓ రాజ! అదంతా విను (11) ఇప్పుడు కలియుగం రాగా ఆముడని ఉండేవాడు. ఆతడు కాన్యకు బ్జాధిపతి.శ్రీమాన్‌, ధర్మజ్ఞుడు, నీతి తత్పరుడు (12) శాంతుడు, దాంతుడు, సుశీలుడు, సత్యధర్మపరాయణుడు, ఓనృపశ్రేష్ట! ద్వాపరాంతమందు, కలియుగం రాకముందు (13) అధర్మభయంవల్ల కలి విశేషం వల్ల భయాదులతో, దేవతలందరు భూమిని వదలి నైమిశారణ్యాన్ని ఆశ్రయించారు. (14) రాముడు కూడా తన సహాయులతో కూడి సేతు బంధమునకు వెళ్ళాడు (15) యుధిష్ఠిరుడిట్లన్నాడు - కలివస్తే లోకంలో సుదుస్తరమైన భయమెట్టిది. ఎప్పుడు (కలిలో) సురలు రత్న గర్భయైన వసుంధరను వదిలారు అనగా (16) వ్యాసులిట్లన్నారు. ఓ నృప! కలిధర్మాలు ఎట్లాఔతాయో వాటిని నీవు విను. లోకులు అసత్యవాదులు, సాధునిందా పరాయణులు (17) దొంగపనులందు ఆసక్తి కలవారు, అందరు పితృభక్తి లేనివారు. తమగోత్రపు భార్యలందే ఆసక్తి కలవారు. చంచల ధ్యానముకలవారు (18) అందరు బ్రహ్మద్వేషులు, పరస్పర విరోధులు, శరణాగతులను చంపేవాళ్ళౌతారు, కలియుగంలో (19) బ్రాహ్మణులు వైశ్యుల ఆచారములందు ఆసక్తి కలవారౌతారు. కలియుగం వస్తే ద్విజులు సంధ్యాలోపం చేసే వారౌతారు (20)

మూ || శాంతౌ శూరాభ##యే దీనాః శ్రాద్ధతర్పణ వర్జితాః | అసురాచారనిరతాః విష్ణ/భక్తి వివర్జితాః || 21 ||

పరవిత్తాభిలాషాశ్చ ఉత్కోచ గ్రహణరతాః | అస్నాత భోజినోవిప్రాః క్షత్రియారణ వర్జితాః || 22 ||

భవిష్యంతి కలౌప్రాప్తే మలినాదుష్టవృత్తయః | మద్యపానరతాః సర్వేప్య యాజ్యానాంహి యాజకాః ||23 ||

భర్తృ ద్వేషకరా రామాః పితృద్వేషకరాః సుతాః | భ్రాతృద్వేషకరాః క్షుద్రాః భవిష్యంతి కలౌయుగే || 24 ||

గప్యవిక్రయిణస్తే వైబ్రాహ్మణా విత్తతత్పరాః | గావోదుగ్థం నదుహ్యంతే సంప్రాప్తేహి కలౌయుగే || 25 ||

ఫలంతే నైవవృక్షాశ్చ కదాచి దపి భారత | కన్యావిక్రయ కర్తారో గోజా విక్రయ కారకాః || 26 ||

విషవిక్రయ కర్తారో రసవిక్రయ కారకాః | దేవ విక్రయ కర్తారో భవవిష్యంతి కలౌయుగే || 27 ||

నారీగర్భం సమాధత్తే హాయనైకాదశేసహి | ఏకాదశ్యుపవాసస్య విరతాః సర్వతోజనాః || 28 ||

సతీర్థసేవనరతా భవిష్యంతి చవాడవాః | బహ్వా హారాభవిష్యంతి బహునిద్రానమాకులాః || 29 ||

జిహ్మవృత్తిపరాన్సర్వేవేదనిందాపరాయణా ః | యతినిందా పరాశ్చైవ ఛద్మకారాః పరస్పరం || 30 ||

స్పర్శదోషభయంనైవ భవిష్యతి కలౌయుగే | క్షత్రియారా జ్యిహీనాశ్చవ్లుెచ్ఛో రాజాభవిష్యతి || 31 ||

విశ్వాస ఘాతినః సర్వే గురుద్రోహ రతాస్తథా | మిత్రద్రోహరతా రాజన్‌ శిశ్నో దర పరాయణాః || 32 ||

ఏకవర్ణాభవిష్యంతి వర్ణాశ్చత్వార ఏవచ | కలౌప్రాప్తే మహారాజనాన్యథా వచనం మమ || 33 ||

ఏతచ్ఛ్రుత్వా గురోరేవ కాన్యకుబ్జాధిపోబలీ | రాజ్యం ప్రకురుతే తత్ర ఆమోనామ్నాహి భూతలే || 34 ||

సార్వభౌమత్వ మాపన్నః ప్రజాపాలనతత్పరః | ప్రజానాం కలినాతత్ర పాపేబుద్ధిరజాయత ||35 ||

వైష్ణవం ధర్మముత్సృజ్యబౌద్ధ ధర్మముపాగతాః | ప్రజాస్తమను వర్తిన్యః క్షపణౖః ప్రతిబోధితాః || 36 ||

తస్యరాజ్ఞో మహాదేవీ మామానామ్న్యతి విశ్రుతా | గర్భందధార సారాజ్ఞో సర్వలక్షణ సంయుతా || 37 ||

సంపూర్ణే దశ##మే మాసిజాతాతస్యాః సురూపిణీ | దుహితా సమయే రాజ్ఞ్యా పూర్ణచంద్ర నిభాననా || 38 ||

రత్నగంగేతి నామ్నాసామణి మాణిక్య భూషితా | ఏకదాదైవ యోగేన దేశాంత రాదు పాగతః || 39 ||

నామ్నాచైవేంద్ర సూరిర్వై కాన్యకుబ్జకే | షోడశాబ్దాచ సాకన్యా నోపనీతా నృపాత్మజా || 40 ||

తా || శాంతుని యందు శూరులు, భయుని యందు దీనులు, శ్రాద్ధ తర్పణములు లేనివారు, అసుర ఆచారములందు ఆసక్తి కలవారు, విష్ణుభక్తి లేనివారు (21) ఇతరుల ద్రవ్యమందు అభిలాషకలవారు, లంచముయందు (ఉత్కోచము) ఆసక్తి కలవారు. విప్రులు స్నానం చేయకుండా భుజించేవారు. క్షత్రియులు యుద్ధం విడిచినవారు (22) కలియుగంవస్తే మలినులు, దుష్టవృత్తి గలవారు ఔతారు. అందరు మద్యపానరతులు ఔతారు. యజింపతగని వానికి యాజకులౌతారు (23) స్త్రీలు భర్తలను ద్వేషించేవారౌతారు. కొడుకులు పితృద్వేష కరులౌతారు. అన్నదమ్ముల ద్వేషకులు క్షుద్రులు ఔతారు, కలియుగంలో (24) ఆవుపాలు మొదలగునవి అమ్మేవారౌతారు. బ్రాహ్మణులు ధనాసక్తి గలవారౌతారు. ఆవులు పాలివ్వవు, కలియుగంవస్తే (25) ఓ భారత! వృక్షములు ఎప్పుడూ ఫలించవు. కన్యలను అమ్మేవారు, లేగదూడలను అమ్మేందుకు కారకులు ఔతారు (26) విషవిక్రయకర్తలు, రసవిక్రయకారకులౌతారు. వేదం విక్రయించేసేవారు కలియుగంలో కలుగుతారు (27) పదకొండు రోజులకే స్త్రీ గర్భం ధరిస్తుంది. అంతట జనులు ఏకాదశి ఉపవాసం నుండి విరతులౌతారు (28) బ్రాహ్మణులు తీర్థ సేవనరతులుకారు. బహు ఆహారవరులు బహునిద్రా సమాకులులు ఔతారు (29) అందరు కుటిల వృత్తి గల వారౌతారు. వేద నిందాపరాయణులౌతారు. యతినిందా పరులౌతారు. పరస్పరము మోసగించుకునే వారౌతారు. (30) కలియుగంలో స్పర్శ దోషభయము కలుగదు.క్షత్రియులు రాజ్యహీనులౌతారు. వ్లుెచ్ఛుడు రాజౌతాడు (31) అందరు విశ్వాసఘాతులౌతారు, అట్లాగే గురుద్రోహరతులౌతారు. మిత్రద్రోహ రతులౌతారు. శిశ్న ఉదర పరాయణులౌతారు (పొట్టనింపుకోవటం) (32) నాల్గు వర్ణములవారు ఏకవర్ణులౌతారు. ఓ మహారాజ! కలియుగంవస్తే ఇట్లా ఔతుంది. నామాట మరోరకంగా కాదు (33) దీనినివిని బలవంతుడైన కాన్యకుబ్జరాజు గురువు యొక్క రాజ్యమునే చేస్తున్నాడు. ఆతనిపేరు ఆముడు అని అంటారు (34) సార్వభౌమత్వమును పొంది ప్రజాపాలన తత్పరుడైనాడు. కలివల్ల ప్రజలకు పాపము యందు బుద్ధికలిగింది (35) వైష్ణవ ధర్మాన్ని వదలి బౌద్ధధర్మాన్ని ఆశ్రయించారు. బౌద్ధసన్యాసులతో బోధింపబడిప్రజలు వారి ననుసరించసాగారు (36) ఆ రాజు మహారాణి భామ అను పేరుతో ప్రసిద్ధమైంది. అన్ని లక్షణములతో కూడి ఆమె రాజు గర్భమును ధరించింది (37) పదిమాసములు నిండాక ఆమెకు మంచి రూపము గల కన్యక జన్మించింది. రాజ్ఞికి పూర్ణచంద్రుని వంటి కాంతిగల కూతురు సకాలంలో జన్మించింది (38) ఆ అమ్మాయి రత్న గంగ అను పేరు గలిగినది. మణి మాణిక్యములతో అలంకరింపబడింది. ఒకసారి అదృష్టవశాత్తు దేశాంతరము నుండి ఒకరు వచ్చారు. (39) ఇంద్రసూరి అని ఆతని పేరు. ఈ కాన్యకుబ్జానికి వచ్చాడు. ఆ అమ్మాయికి పదహారేళ్ళు ఆ రాచకుతురు వివాహమాడలేదు (40)

మూ || దాస్యాం తరేణమిలితా ఇంద్రసూరిశ్చ జీవితః | శాబరీం మంత్ర విద్యాంచ కథయామా సభారత ||41 ||

ఏకచిత్తా భవత్సాతు శూలికర్మ విమోహితా | తతస్సామోహమాపన్నాతత్త ద్వాక్యపరాయణా || 42 ||

క్షపణౖః బోదితా వత్సజైన ధర్మపరాయణా | బ్రహ్మావర్తాధిపతయే కుంభీపాలాయధీమతే || 43 ||

రత్నగంగాం మహాదేవీం దదౌతా మితి విక్రమీ | మోహారకం దదౌత సై#్మవివాహేదైవమోహితః || 44 ||

ధర్మారణ్యం సమాగత్య రాజధానీకృతాతదా | దేవాంశ్చ స్థాపయామాన జైనధర్మప్రణీతకాన్‌ || 45 ||

సర్వేవర్ణాస్తథా భూతాజైనధర్మసమాశ్రితా ః | బ్రాహ్మణానైవపూజ్యంతేన చశాంతికపౌష్టికం || 46 ||

సదదాతి కదాదానం ఏవం కాలః ప్రవర్తతే | లబ్ధశాసనకావిప్రాలుప్త స్వామ్యా అహర్నిశం || 47 ||

సమాకులిత చిత్తాస్తే నృపమామం సమాయయుః | కాన్యకుబ్జ స్థితం శూరం పాఖండైః పరివేష్టితం || 48 ||

కాన్యకుబ్జపురం ప్రాప్యకతి భిర్వా సరైః | గంగోపకంఠేస్య వనన్‌ శాంతాస్తే మోఢవాడవాః || 49 ||

చారైశ్చకథితాస్తేచ నృపస్యాగ్రే సమాగతాః | ప్రాతరాకారితా విప్రా ఆ గతా నృప సంసది || 50 ||

ప్రత్యుత్థానాభివాదాదీన్‌న చక్రే సాదరం నృపః | తిష్ఠతో బ్రాహ్మణాన్‌ సర్వాన్‌ పర్యపృచ్ఛదసౌతతః || 51 ||

కిమర్థ మాగతా విప్రాః కింస్విత్‌ కార్యం బృవంతుతత్‌ || 52 ||

విప్రా ఊచుః -

ధర్మారణ్యాదిహాయాతాః త్వత్సమీ పంనరాధిప | రాజంస్తవ సుతాయాస్తు భర్తా కుమార పాలకః || 53 ||

తేన ప్రలుప్తం విప్రాణాం శాసనం మహదద్భుతం | వర్తతా జైన ధర్మేణ ప్రేరితే నేంద్ర సూరిణా || 54 ||

రాజోవాచ -

కేనవై స్థాపితా యూయం అస్మిన్మో హెరకేపురే | ఏతద్థి వాడవాః సర్వంబ్రూత వృత్తంయథాతథం || 55 ||

విప్రాఊచుః -

కాజేశైః స్థాపితాః పూర్వం ధర్మరాజేన ధీమతా | కృతాచాత్రశుభే స్థానే రామేణ చతతః పురీ || 56 ||

శాసనం రామచంద్రస్య దృష్టవ్‌ఆన్యైశ్చైవరాజభిః | పాలితం ధర్మతో హ్యత్ర శాసనం నృపసత్తమ || 57 ||

ఇదానీంత వజామాతా విప్రాన్పాలయతేనహి | తచ్ఛ్రుత్వా విప్రవాక్యం తురాజా విప్రానధాబ్రవీత్‌ || 58 ||

యాంతుశీఘ్రంహిభోఃవిప్రాఃకథయంతుమమాజ్ఞయా | రాజ్ఞేకుమారపాలాయదేహిత్వంబ్రహ్మణాలయం || 59 ||

శ్రుత్వావాక్యం తతోవిప్రాః పరం హర్షముపాగతాః | జగ్ముస్తతోతి ముదితా వాక్యం తత్రనివేదితం || 60 ||

తా || ఇంద్రసూరి (బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాడు) ఆతనిని రాకుమారి దాసిని మధ్యగా ఉంచుకొని కలిసింది శాబరిని మంత్రవిద్యను ఆతడు చెప్పాడు (41) శూలికర్మ విమోహితురాలై ఆమె ఏకచిత్తురాలైంది. ఆమె మోహాన్ని పొంది ఆతని మాటలను ఆచరింపసాగింది (42) ఓ వత్స! క్షపణులతో బోధింపబడి ఆమె జైన ధర్మ పరాయణురాలైంది. బ్రహ్మావర్తాధిపతియైన బుద్ధిమంతుడై కుంభీపాలనకు (43) మహాదేవియైన రత్నగంగను ఇచ్చాడు. ఆతడు పరాక్రమవంతుడు అని. వివాహంలో దైవమోహితుడై ఆతనికి మోహెరకము గ్రామం /ఇచ్చాడు (44) ఆ పిదప ధర్మారణ్యమునకు వచ్చి రాజధానిని ఏర్పరచాడు. జైన ధర్మము ఏర్పరచి దేవతలను స్థాపించాడు (45) అన్ని వర్ణముల వారు జైన ధర్మాన్ని ఆశ్రయించిన వారైనారు. బ్రాహ్మణులు పూజింపబడటంలేదు. శాంతిక పౌష్టిక యాగాలు ఆచరింపబడటం లేదు. (46) ఎప్పుడూ దానం ఇవ్వటంలేదు. ఇట్లా కాలం గడుస్తోంది. శాసనాన్ని పొందిన బ్రాహ్మణుల అధికారమును కోల్పోయి రాత్రింబగళ్ళు (47) వ్యాకులమైన చిత్తం గల వారైవారు ఆమహారాజు దగ్గరకు వచ్చారు కాన్యకుబ్జమందున్న శూరుడైన, పాఖండులతో చుట్టబడి రాజును చేరారు. (48) కాన్యకుబ్జం చేరాక కొన్ని రోజులకు, ఆ మూఢ బాడబులు శాంతంగా గంగ ఒడ్డులో ఉన్నారు (49) చారులు వెళ్ళి చెప్పగా, వారు రాజు ఎదురుగా వచ్చారు. రాజుచే పిలువబడ్డ బ్రాహ్మణులు రాజు సభకు ఉదయం వచ్చారు (50) ఎదుర్కొనుట నమస్కరించుట మొదలగునవి రాజు ఆదరంతో చేయలేదు. పిదప నిల్చున్న బ్రాహ్మణులందరిని రాజిట్లా అడిగాడు (51) ఓ విప్రులార! ఎందుకోసం వచ్చారు. ఏదైనా కార్యముంటే దాన్ని చెప్పండి అని అనగా (52) బ్రాహ్మణులిట్లన్నారు ఓ నరాధిప ! ధర్మారణ్యము నుండి నీ దగ్గరకు ఇక్కడికి వచ్చాము. ఓ రాజ! నీ కూతురు భర్త కుమార పాలకుడు (53) ఆతనివల్ల అద్భుతమైన బ్రాహ్మణుల శాసనములుప్తమైంది. ఇంద్రసూరి జైన ధర్మాన్నిc పేరేపిస్తున్నాడు. (54) అనగారాజు ఇట్లన్నాడు - మిమ్మల్ని మోహెరక పురంలో ఎవరు స్థాపించారు.దీనినంతా ఓ బాడబులార! వృత్తాంతమంతా ఉన్నదున్నట్లుగా చెప్పండి (55) అనగా బ్రాహ్మణులిట్లన్నారు. పూర్వము బ్రహ్మవిష్ణు మహేశ్వరులు మమ్ముల స్థాపించారు. బుద్ధిగల ధర్మారాజు కోరిక మేరకు. ఈ శుభ##మైన స్థానంలో రాముడు పిదప నగరాన్ని ఏర్పరచాడు (56) రామచంద్రుని శాసనాన్ని చూచి ఇతర రాజులు కూడా ధర్మపూర్వకముగా దీనిని పాలించారు. ఓ రాజ! శాసనాన్ని అనుసరించారు (57) ఇప్పుడు నీ అల్లుడు బ్రాహ్మణులను పాలించటంలేదు. ఆ బ్రాహ్మణుల మాటలను విని రాజు విప్రులతో ఇట్లన్నాడు (58) ఓ బ్రాహ్మణులార! మీరు త్వరగా వెళ్ళండి. నా ఆజ్ఞగా ఇట్లా చెప్పండి, రాజుకుమారపాలునితో బ్రాహ్మణుల ఆలయాలను ఇచ్చేయి అని (59) ఈ మాటవిని ఆ పిదప విప్రులు చాలా ఆనందపడ్డారు. పిదప చాలా ఆనందంతో వెళ్ళి ఆ మాటను ఆతనితో చెప్పారు (60).

మూ || శ్వశురస్యవచః శ్రుత్వా రాజా వచనమబ్రవీత్‌|

కుమారపాల ఉవాచ -

రామస్యశాసనం విప్రాః పాలయిష్యామ్యహం నహి || 61 ||

త్యజామిబ్రాహ్మణాన్‌ యజ్ఞే పశుహింసాపరాయణాన్‌ | తస్మాద్ధిహింస కానాంతునమే భక్తిర్భవేద్ద్విజాః || 62 ||

బ్రాహ్మణా ఊచుః -

కథం పాఖండ ధర్మేణలుప్త శాసనకోభవాన్‌ | పాలయస్వనృపశ్రేష్ఠ మాస్మపాపే మనః కృధాః || 63 ||

రాజోవాచ -

అహింసా పరమోధర్మో అహింసాచ పరంతపః | అహింసా పరమం జ్ఞానం అహింసా పరమంఫలం || 64 ||

తృణషు చైవ వృక్షేసు పతంగేషు నరేషుచ | కీటేషు మత్కుణాద్యేషు అజాశ్వేషుగవేషుచ || 65 ||

లూతాసుచైవసర్పేషు మహిష్యాదిషువై తథా | జంతవః సదృశావిప్రాః సూక్ష్మషుచ మహత్సుచ || 66 ||

కథం యూయం ప్రవర్తథ్వేవిప్రాహింసాపరాయణాః | తచ్ఛ్రుత్వా వజ్రతుల్యంహివచనంచ ద్విజోత్తమాః || 67 ||

ప్రత్యూచుః వాడవాః సర్వేక్రోథరక్తే క్షణాదృశ || 68 ||

బ్రాహ్మణా ఊచుః -

అహింసా పరమోధర్మః సత్యమేతత్‌ త్వయోదితం | పరంతథాపి ధర్మో7స్తి శృణుషై#్వకాగ్రమాననః || 69 ||

యావేద విహితా హింసా సానహింసేతి నిర్ణయః | శ##స్త్రేణా హస్యతే యచ్చపీడా జంతుషు జాయతే || 70 ||

సేవాధర్మ ఏ వాస్తి లోకే ధర్మవిదాంపర | వేదమంత్రై ర్విహన్యంతే వినా శ##స్త్రేణ జంతవః || 71 ||

జంతుపీడాకరానైవసాహింసా సుఖదాయినీ | పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం || 72 ||

వేదోదితాం విధాయాపి హింసాం పాపైర్నలిప్యతే | విప్రాణాం వచనం శ్రుత్వా పునర్వచనమ బ్రవీత్‌ || 73 ||

రాజోవాచ -

బ్రహ్మాదీనాం పరంక్షేత్రం ధర్మారణ్య మనుత్తమం | బ్రహ్మవిష్ణు మహెశాద్యానేదానీమత్ర సంతితే || 74 ||

వధర్మో విద్యతే వాత్ర ఉక్తో రామః సమానుషః | క్వవాపి లంబపుచ్ఛో7సౌ యోముక్తో రక్షణా యవః || 75 ||

శాసనం చేన్నదుష్టంవో నైవ తత్పాలయామ్యహం | ద్విజాః కోపసమావిష్టాః దదుః ప్రత్యుత్తరం తదా || 76 ||

ద్విజా ఊచుః -

రేమూఢత్వం కథం వేత్థం భాషసే మదలోలువః సదైత్యానాం వినాశాయ ధర్మ సంరక్షణాయచ || 77 ||

రామః చతుర్భుజః సాక్షాత్‌ మానుషత్వం గతోభువి | అగతీనాం చగతిదః సవైధర్మపరాయణః

దయాలుశ్చ కృపాలుశ్చ జంతూనాం పరిపాలకః || 78 ||

రాజోవాచ -

కుతో7ద్యవర్తతే రామః కుతో వైవాయునందనః | భ్రష్టా భ్రమివ తేసర్వేక్వ రామోహనుమానితి || 79 ||

పరంతు రామో హనుమాన్‌ యదివర్తేత సర్వతః | ఇదానీం విప్రసాహాయ్య ఆగమిష్యతి మేమతి ః || 80 ||

దర్శయధ్వంహనూమంతంరామంవాలక్ష్మణం తథా | యద్యస్తి ప్రత్యయుః కశ్చిత్‌సనోవిప్రాఃప్రదర్శ్యతాం || 81 ||

ఉక్తంతైః రామదేవేన దూతంకృత్వాం జనీసుతం చతుశ్చత్వారింశ దధికం దత్తంగ్రామశతంనృప || 82 ||

తా || మామగారి మాటను విని రాజు ఇట్లన్నాడు. కుమారపాలుని వచనము - రాముని శాసనమును నేను పాలించను ఓ విప్రులార! (61) పశుహింసా పరాయణులైన బ్రాహ్మణులను యజ్ఞంలో వదులుతాను. అందువల్ల హింసకుల మీద నాకు భక్తిలేదు. ఓ ద్విజులార! (62) అనగా బ్రాహ్మణులిట్లన్నారు - నీవు పాఖండ ధర్మంతో శాసనాన్ని లోపింపచేస్తావా ఓ రాజ! మంచిగా పాలించు కోపంతో పాపమందు మనసుంచకు (63) అనగా రాజిట్లాన్నాడు అహింస పరమధర్మము అహింస గొప్పతపస్సు. అహింస పరమజ్ఞానము, అహింస ఉత్తమ ఫలము (64) గడ్డి పోచలమీద, చెట్లమీద, పక్షులమీద, నరులమీద, పురుగులమీద, నల్లులమీద ఇతరమైన వాటిమీద, మేకలమీద, గుఱ్ఱములమీద, గజముల మీద (65) సాలె పురుగుల మీద పాములమీద, అట్లాగే మహిషము (బర్రె) మొదలగు వానిమీద దయచూపాలి. సూక్ష్మమైన వాటితోను, గొప్పవాటితోను జంతువులు సమానమైనవి. ఓ విప్రులార! (66) మీరు విప్రులు హింసా పరాయణులై ఎట్లా ప్రవర్తిస్తున్నారు. వజ్రతుల్యమైన ఆమాటను విని ఆ బ్రాహ్మణులు (67) క్రోథంతో ఎర్రనైన చూపులుగలవారై వారంతా ఇట్లన్నారు. (68) బ్రాహ్మణుల వచనము - అహింస ఉత్తమ ధర్మము. నీవు చెప్పినది ఇది సత్యము. ఐనా ఉత్తమ ధర్మముంది. ఏకాగ్రత మానసుడవై విను (69) వేద విహితమైన ఏహింనుందో అదిహింసకాదు. అని నిర్ణయము. శస్త్రంతో ఏదిచంపబడుతుందో, అప్పుడు జంతువులలో ఏ పీడకలుగుతుందో (70) అదే అధర్మముగా లోకంలో ఉంది, ఓ ధర్మవిదులలో శ్రేష్టుడ! శస్త్రంలేకుండా జంతువులు, వేదమంత్రములతో చంపబడుతాయి (71) ఆ హింస జంతుపీడాకరమైనది కాదు, సుఖం కల్గించేది. పరులకుపకారం చేయటం పుణ్యం, పరులను పీడించటం పాపం (72) వేదోదితమైన హింసను చేసి కూడా పాపముల పాలుగాడు. బ్రాహ్మణుల మాటలను విని తిరిగి ఇట్లన్నాడు (73) రాజు వచనము - ఉత్తమమైన ధర్మారణ్యము బ్రహ్మాదులకు ఉత్తమ క్షేత్రమ. బ్రహ్మవిష్ణు మహెశాదులు వారు ఇప్పుడిక్కడ లేరు (74) మనుష్యుడైన రాముడు చెప్పిన ధర్మము ఇక్కడలేదు. మీరక్షణ కొరకు విడువబడ్డ ఆ వానరుడు ఎక్కడున్నాడో (75) మీ శాసనాన్ని చూడలేదు. దానిని నేను పాలించటంలేదు. అనగా అప్పుడు బ్రాహ్మణులు కోపావిష్టులై ప్రత్యుత్తరమిచ్చారు (76) బ్రాహ్మణుల వచనము - ఓరిమూఢ! మదలోలువుడవైన నీవు ఇట్లా మాట్లాడుతున్నావురా. రాక్షసుల వినాశనం కొరకు ధర్మరక్షణకొరకు (77) ఆ రాముడు చతుర్భుజుడు, భూమిపై మనిషిగా జన్మించాడు. గతిలేని వారికి గతి కల్పించేవాడు. ఆతడు ధర్మపరాయణుడు దయాళువు.కృపాలుడు ప్రాణుల పరిపాలించేవాడు (78) అనగా రాజిట్లన్నాడు - ఇప్పుడు రాముడెక్కడున్నాడు, వాయునందనుడెక్కడున్నాడు. విడిపోయిన మేఘాల్లా వాళ్ళంతా పోయారు. హనుమంతుడెక్కడ, రాముడెక్కడ (79) ఒకవేళ రాముడు, హనుమంతుడు అంతటా ఉన్నట్టైతే, ఇప్పుడ బ్రాహ్మణుల సహాయం కొరకు వస్తాడని నేననుకుంటున్నాను (80) హనుమంతుణ్ణి కాని రాముణ్ణికాని చూపించండి. మీకేమైనా నమ్మకం ఉంటే, దానిని నాకు చూపండి, ఓ బ్రాహ్మణులార (81) అప్పుడు వారిట్లన్నారు, రాముడు హనుమంతుని దూతగా చేశాడు. నలుబది నాలుగు నూర్లకంటే ఎక్కువగా గ్రామములను ఇచ్చాడు ఓరాజ! (82).

మూ || పునరాగత్యస్థానే7స్మిన్దత్తాగ్రామాస్త్రయోదశ | కాశ్యప్యాంచైవగంగాయాంమహాదానని షోడశ || 83 ||

దత్తాని విప్రముఖ్యేభ్యో దత్తాగ్రామాఃసుశోభనాః | పునః సంకల్పితా వీర షట్‌ పంచాశకసంఖ్యయా || 84 ||

షట్‌త్రింశచ్చ సహస్రాణిగోభూజాజజ్ఞిరేవరాః | సపాదలక్షావణిజోదత్తా మాండలికాభిధాః || 85 ||

తేనోక్తం వాడవాః సర్వే దర్శయధ్వంహిమారుతిం | యస్యాభిజ్ఞాన మాత్రేణ స్థితింపూర్వాదదామ్యహం || 86 ||

విప్రవాక్యం కరిష్యామి ప్రత్యయో దరశ్యతేయది | తతః సర్వే భవిష్యంతి వేద ధర్మ పరాయణాః || 87 ||

అస్యధాజిన ధర్మేణ వర్తయధ్వం హి సర్వశః | నృపవాక్యంతుతే శ్రుత్వా స్వేస్వేస్థానే సమాగతాః || 88 ||

వాడవాః భిన్నమనః క్రోధేనాంధీకృతాభువి | నిశ్వాసాన్ముంచమానాస్తే హాహెతి ప్రవదంతి || 89 ||

దంతాన్‌ ప్రాఘర్షయన్‌ సర్వాన్‌ అపీడంశ్చ కరైః కరాన్‌ | పరస్పరంభాషమాణాఃకథంకుర్మోవయంత్వితః || 90 ||

మిలిత్వాబాడవాః సర్వేచక్రుస్తేమంత్ర ముత్తమం | రామవాక్యం హృదిధ్యాత్వాధ్యాత్వాచైవాంజనీసుతం || 91 ||

ద్విజమేలా వకంచక్రుః బాలావృద్ధతమాఅపి | తేషాం వృద్ధ తమోవిప్రో వాక్యమూచేశుభం తదా || 92 ||

చతుష్టష్టిశ్చగోత్రాణా మస్మాకం యేద్విసప్తతిః | స్వస్వగోత్రస్యావటంకా ఏకగ్రామాభి భాషిణః || 93 ||

ప్రయాతుస్వస్వవర్గస్య ఏకోహ్యెకోద్విజఃసుధీః | రామేశ్వరం సేతుబంధం హనుమాంస్తత్రవిద్యతే || 94 ||

సర్వేప్రయాంతుతత్రైవ రామపార్శ్వే నిరామయాః | నిరాహారాజిత క్రోధామాయయా వర్జితాః పునః || 95 ||

ఏకాగ్రమానసాః సర్వేస్తుత్వాధ్యాత్వాజపంంతుతం | తతోదాశరథీ రామోదయాం కృత్వాద్విజన్మసు || 96 ||

శాసనంచ ప్రదాస్యతి అచలంచయుగేయుగే | మహాతాపసాతుష్టః ప్రదాస్యతి సమీహితం || 97 ||

యస్యవర్గన్యయో విప్రోసప్రయాస్యతి త్రతవై | సచవర్గాత్‌ పరిత్యాజ్యః స్థానధర్మాన్న సంశయః || 98 ||

పణిగ్‌వృత్తే న సంబంధే న వివాహె కదాచన | గ్రామవృత్తే న సంబంధః సర్వస్థానే బహిష్కృతాః || 99 ||

సభావాక్యంచ తచ్ఛ్రుత్వాతస్మధ్యేవాడవఃశుచిః | వాగ్మీదక్షః సుశబ్దశ్చ త్రిరవైః శ్రాపయన్‌ ద్విజాన్‌ || 100 ||

ప్రతివాక్యం దత్తతాలం తిష్ఠన్నే తద్వచో7బ్రవీత్‌ | అసత్య వాదినాం యచ్చ పాతకం పరినిందకే

నరదారాభిగమనే పరద్రోహరతే నరే || 101 ||

మద్యపేషు చయత్పావంయత్పాహోమహారిషు | తత్సాపంచభ##వేత్తన్యగమనేయః పరాఞ్‌ముఖః

అథకింబహునోక్తేనయాంతు సత్యం ద్విజోత్తమాః || 102 ||

తా || తిరిగి వచ్చి ఈ స్థానమందు పదమూడు గ్రామములనిచ్చాడు. కాశ్యపి యందు గంగ యందు పదహారు మహాదానములిచ్చాడు (83) బ్రాహ్మణులకు, సుశోభనమైన గ్రామములనిచ్చాడు. తిరిగి ముప్పది ఆరువేల ఏబది ఆరునూర్ల శ్రేష్ఠులైన వైశ్యులు జన్మించారు (84) మాండలికులు అనే పేరుతో లక్షపాతిక పణిజులను ఇచ్చాడు. (85) ఆ రాజన్నాడు. ఓబాడబులార:! మీరంతా కలిసి ఆ మారుతిని చూపండి అని. ఆయన కన్పించినంత మాత్రంలో పూర్వస్థితిని కల్పిస్తాను (86) నమ్మకం కల్గిస్తే నేను బ్రాహ్మణుల మాటను ఆచరిస్తాను. అప్పుడందరూ వేద ధర్మ పరాయణులౌతారు (87) లేని పక్షంలో అతటా జిన ధర్మంతో ఉండండి అనగా వారంతా రాజు మాటవిని తమతమ స్థానములకు తిరిగి వచ్చారు (88) బాడబులు భిన్నమనస్సులై ఇక్కడ కోపంతో గుడ్డివాళ్ళైనారు. ఉచ్ఛ్వాసని శ్వాసములు వదుల్తూ (నిట్టూర్పులు) హా! హా! అని అరుస్తున్నారు. (89) పండ్లు కోరుకుతున్నారు. అందరూ చేతులు పిసుక్కుంటున్నారు. ఇక పిదప ఏం చేద్దాము అని ఎట్లా చేద్దామని పరస్పరము మాట్లాడు కుంటున్నారు. (90) బాడబులంతా కూడి ఉత్తమమై ఆలోచన చేశారు. రాముని మాటను మనసులో స్మరించి, అంజనీసుతుని ధ్యానించి (91) బాలులు, చాలా వృద్ధులైన వారుకూడా కూడి బ్రాహ్మణమేల చేశారు. వారిలో అందరికన్న వృద్ధుడైన బ్రాహ్మణుడు శుభ##మైన మాటనన్నాడప్పుడు (92) మనము అరువదినాల్గుగోత్రముల వారము డెబ్బది రెండు ఉన్నామో మనము తమతమ గోత్రమునకు ప్రతినిథియైఒక్క గ్రామము వారమై (93) తమతమ వర్గమునకు ఒక్కొక్కడు బుద్ధిమంతుడు బ్రాహ్మణుడు వెళ్ళాలి. రామేశ్వరము సేతుబంధమునకు వెళ్ళాలి. అక్కడ హనుమంతుడున్నాడు (94) అందరూ అక్కడికే వెళ్ళండి. ఆ రాముని పార్శ్వానికే రోగములు లేకుండా ఆహారం వదలి క్రోథమును విడిచి, మాయ నుండి విడివడి (95) ఏకాగ్రమనస్కులై అందరూ ఆయనను స్తుతించండి, ధ్యానించండి, జపించండి. పిదప దశరథరాముడు బ్రాహ్మణుల యందు దయచూపి (96) ఆచలమై యుగయుగమందుండే శాసనాన్ని ఇస్తాడు. గొప్పతపస్సుతో తుష్టుడై అనుకున్నది (కోరింది) ఇస్తాడు (97) ఏ వర్గానికి చెందిన ఏ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళడో వాణ్ణి వర్గం నుండి వెలివేయాలి. స్థాన ధర్మముల నుండి వదలాలి అనుమానంలేదు (98) పణిక్‌ వృత్తితో వానికి సంబంధములేదు. వానితో వివాహ సంబంధము వద్దు. గ్రామ విషయంలో సంబంధమువద్దు. అన్ని చోట్ల ఆతడు బహిష్కృతుడే (99) ఆ సభా వాక్యమును విని వారిమధ్యలో శుచియైన ఒక బ్రాహ్మణుడు, మాటచతురుడు, దక్షుడు, శబ్ద శక్తినెరిగినవాడు బ్రాహ్మణులకు మూడు ధ్వనులు విన్పిస్తూ (పాట, ఆట, వాద్యం) (100) ప్రతి మాటకు తాళం వాయిస్తూ నిలబడి ఈ మాటలన్నాడు. అసత్యవాదులకు, ఇతరులను నిందించే వారికి ఏ పాపం వస్తుందో, పరదారలను పొందితే, పరద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో నరునకు (101) మద్యం తాగితే బంగారం దొంగిలిస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం, పోవటానికి వెనుకాడిన వాడికి వస్తుంది. ఎక్కువగా చెప్పి ఏంలాభం. ఓ ద్విజోత్తములార! నిజంగానే వెళ్ళండి (102).

మూ || తచ్ఛ్రుత్వాదారుణంవాక్యంగమనాయమనోదధే | గచ్ఛతస్తాన్‌ద్విజాన్‌శ్రుత్వారాజాకుమారపాలకం || 103 ||

సమాహూయ కృషేః కర్మభిక్షాటన మథాపివా | నానాగోత్రే భ్యో బ్రాహ్మణభ్యోప్రాపయిష్యేన సంశయః || 104 ||

తచ్ఛ్రుత్వా వ్యథితాః సర్వేకిం భవిష్యత్యతః పరం | తథాత్రీణి సహస్రాణి ప్రబంథంచక్రికేతదా || 105 ||

గమిష్యామోవయంసర్వేరామం ప్రతిన సంశయః | హస్తాక్షర ప్రదానంవై అన్యోన్యంతుకృతం ద్విజైః || 106 ||

కృతాంజలి పుటావిప్రాః వాక్యమే తదథాబ్రువన్‌ | నశ్యతే7cతత్రయీ విద్యాత్రయీ మూర్తిః ప్రకుప్యతి || 107 ||

తస్మాత్తత్రైవ గంతవ్యం అష్టాదశ సహస్రకైః | తతః సవణిజః సర్వాన్‌ సమాహూయచ గోభుజాన్‌ || 108 ||

వాక్యమూచేనృపశ్రేష్ఠోవారయథ్వంద్విజానితి || 109 ||

వ్యాస ఉవాచ -

సజైన ధర్మేయేలిప్తా గోభుజావణిగుత్తమాః | వృత్తి భంగభయాత్త త్రమౌనమేవ సమాచరన్‌ || 110 ||

వారయామకథం విప్రాన్‌ వహ్నిరూపాన్‌ దహంతితే | శాపాగ్నినానరవతే ద్విజామృత్యుపరాయణాః || 111 ||

అడాలయేషుయేజాతాః శూద్రాఆహూయతాన్న్పపః | నివార్యంతా మితి ప్రాహవాడవాగమనోద్యతాః || 112 ||

తేషాంమధ్యే కతిపయాజైన ధర్మసమాశ్రితాః | గతావాడవ పుంజేషు రాజాదేశాన్నివారణ || 113 ||

కేచిచ్ఛూద్రాఊచుః -

క్వరామో లక్ష్మణోపేతః క్వచ వాయుసుతోబలీ | వర్తమానేన కాలేన వక్తవ్యం ద్విజసత్తమాః || 114 ||

వ్యాఘ్రసింహాకులే దుర్గేవనే వన గజాశ్రితే | పరిత్య జ్యప్రియాన్‌ ప్రాణాన్‌ పుత్రాన్‌ దారాన్‌ నికేతనాన్‌ || 115 ||

కిమర్థంగమ్యతే విప్రారాజ్యే వైదుష్టశాసనే | తచ్ఛ్రుత్వా వాడవాః కేచిత్‌ వాక్యే న మనసా7స్మరన్‌ || 116 ||

పంచదశ సహస్రాస్తే వాడవా నృపసత్తమాత్‌ | భయాల్లోఖాచ్చ దానాచ్ఛ తత్సర్వం భవతామితి || 117 ||

వృత్తోపకల్పనేనైవ కరిష్యామః కదాచన | కృషికర్మకరిష్యామోభిక్షాటన మథాపివా || 118 ||

తతశ్చతే పంచదశ సహస్రా ద్విజ సత్తమాః | దారుణం వాక్యమూచుస్తాన్‌ యాంతుచాన్యేయుథోచితం || 119 ||

శాసనం భవతా మస్తు రామదత్తంన సంశయః | త్రయివిద్యాస్తువిఖ్యాతాః సర్వేవాడవ పుంగవాః || 120 ||

సహస్రాణిచత్రీణ్యవత్రైవిద్యా అభవన్‌ధ్రువం || 121 ||

రోజోవాచ :-

చతుర్థాంశేనరాజ్యంచకించిద్ధత్తావసుంధరా | తస్మాచ్చతుర్విధేత్యేపంజ్ఞాతిబంధమతఃపరం || 122 ||

తా || ఆ దారుణమైన మాటను విని వెళ్ళటానికి మనస్సు నిర్ణయించింది. వెళ్తున్న ఆ బ్రాహ్మణుల గూర్చి రాజు కుమార పాలకుడు విని (103) వారిని పిలిచి కృషికర్మగాని భిక్షాటనంగానిన ఆనా గోత్రులైన బ్రాహ్మణులకు కలుగచేస్తాను. అనుమానంలేదు (104) ఆ మాటను విని అందరు బాధపడి ఇంతకన్న ఇంకే జరుగుతుంది. అని మూడు వేల మంది అప్పుడు ఏకమైనారు. (105) మనం అంతా కలిసి రాముని దగ్గరకు వెళ్దాము అనుమానం లేదు. బ్రాహ్మణులు పరస్పరము హస్తాక్షర ప్రదానం చేసుకున్నారు (106) చేతులు జోడించి బ్రాహ్మణులు ఈ వాక్యం పలికారు. ఇక్కడ వేదవిద్య నశిస్తోంది. వేదమూర్తికోపిస్తాడు. (107) అందువల్ల పద్దెనిమిది వేల మందిమి అక్కడికే వెళ్ళాలి. అప్పుడు వణిజుడు అందరు గోభుజులను పిలిచి (108) ఇట్లన్నాడు. నృపశ్రేష్ఠుడు బ్రాహ్మణులను వారించాలి అని (109) వ్యాసుని వచనము - జైన ధర్మమందు తగులని గోభుజులు, ఉత్తమ వణిజులు, వృత్తికి భంగం కల్గుతుందనే భయంతో మౌనంగానే ఉండిపోయారు. (110) ఈ బ్రాహ్మణులను ఎట్లా వారించాలి. వారువహ్నిరూపులు. వారు కాల్చివేస్తారు శాపాగ్నితో. ఓ నరపతి ద్విజులు మృత్యుపరాయణులు (111) అడాలయమందుపుట్టిన శూద్రులను పిలిచి రాజు, బయల్దేరటానికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణులను వారించమని చెప్పాడు (112) వారి మధ్యలో కొందరు జైన ధర్మమాశ్రయించినవారు. రాజాజ్ఞ ప్రకారం వారు బ్రాహ్మణుల మధ్యకు వారించటానికి వెళ్ళారు (113) కొందరు శూద్రులిట్లన్నారు - లక్ష్మణునితో కూడిన రాముడెక్కడున్నాడు. బలవంతుడైన ఆంజనేయుడెక్కడ. ఓ బ్రాహ్మణులార! ఈ కాలాన్ననుసరించి మాట్లాడాలి. (114) వెళ్ళశక్యం కాని వ్యాఘ్రములతో సింహములతో కూడిన వనగజములు గల అడవిలోకి పుత్రులను బార్యలను, ఇళ్ళను, ప్రియమైన ప్రాణములను వదలి (115) ఎందుకు వెళ్తున్నారు. దుష్టశాసనం గల రాజ్యంలో వారిని వదుల్తారా ఓ బ్రాహ్మణులార! అనగా దానిని బాడబులు విని కొందరు ఆ వాక్యంతో మనస్సులో స్మరించారు (116) ఇట్లా అనుకున్నారు. పదిహెను వేల మంది బ్రాహ్మణులు రాజు నుండి భయంవల్ల లోభం వల్ల దానంవల్ల అదంతా అట్లాగే కాని అని అనుకున్నారు. (117) వృత్తి కల్పనతోనే గడుపుదాము. కృషి కర్మచేద్దాము లేదా భిక్షాటన చేద్దాము (118) పిదప ఆ పదిహేనువేలమంది బ్రాహ్మణులు దారుణమైన మాట అన్నారు వారితో, ఇతరులు ఇష్టం వచ్చినట్లు వెళ్ళని (119) రాముడిచ్చిన శాసనము మీకుండని, అనుమానంలేదు. త్రయివిద్యులైన బాడబులందరు విఖ్యాతులు (120) మూడు వేలమందే త్రయివిద్యులు ఐనారు (121) రాజిట్లన్నాడు - నాల్గవ భాగం రాజ్యపు భూమిని ఇస్తున్నాను. అందువల్ల జ్ఞాతి బంధము ఇకముందు నాల్గు విధములే అని (122)

మూ || చ్యవనోదాస్యతేకన్యాంయూయంకన్యామవాప్నుత | సవృత్తిర్నచసంబంధోభవతాంస్యాత్కదాపివా || 123 ||

ఇతితస్యవచః శ్రుత్వాత్రమీ విద్యాశ్చ వాడవాః | స్వేస్వేస్థానేగతాః సర్వే సంకేతాదని వృత్యచ || 124 ||

పంచదశ సహస్రాణి తతస్తు ద్విజపుంగవాః | యధాగతం గతాః సర్వే చాతుర్విద్యా ద్విజోత్తమాః || 125 ||

తద్దినే అతి వాహ్యాథ చింతా విష్టేన చేతసా | వార్యమాణాః స్వపుత్రైస్తె దారైశ్చవినయా న్వితైః || 126 ||

ఏకాగ్రమానసాః సర్వేన నిద్రాముపలేఖిరే | బ్రాహ్మముహుర్తే చోత్థాయమాయాంత్యక్త్వాహిలౌకికీం || 127 ||

పరిత్యజ్య ప్రియాన్‌ పుత్రాన్‌ దారాన్‌ సనిలయానపి | గ్రామోపాంతేషుమిలితాః సర్వేవాడవ పుంగవాః || 128 ||

సహస్రాణి తదాత్రీణి కృతనిత్యాహ్నిక క్రియాః | విప్రేభ్‌యో దక్షిణాందత్వా సంపూజ్య కులమాతరం || 129 ||

విఘ్నసంఘవినాశాయ దక్షిణ ద్వార సంస్థితః | సింధూర పుష్పమాలాభిః పూజితోగణనాయకః || 130 ||

పూజితో వకుల స్వామిసూర్యః సర్వార్థసాధకః | ఆదరాచ్చ మహాశక్తి ః శ్రీమాతా పూజితాం తథా || 131 ||

శాంతాం చైవనమస్కృత్య జ్ఞానజాం గోత్రమాతరం | గమనే నోద్యమా నాస్తే పరం హర్షముపాయయుః || 132 ||

చాతుర్విద్యా ద్విజాశ్చైవ పునరామంత్ర్యతాస్ర్పతి | ప్రపచ్ఛ్రుశ్చముహుః సర్వం సమాగమన కారణం || 133 ||

విప్రాఊచుః -

సగంతవ్యం భవద్భిర్వై గత్వావా7యాంతు సత్వరాః || 134 ||

యథారామప్రదత్తంహి ఉపకల్పయసే7చిరాత్‌ | శ్రుత్వా పునరథో చుస్తే చాతుర్విద్యాద్విజోత్తమాః || 135 ||

సస్థానే న ద్విజైర్వాపి నచ వృత్యాం కథంచన | వయంనైవాగమిష్యామః కథనీయం నవైపునః || 136 ||

రఘూద్వహెన దత్తావై వృత్తి ర్వోద్విజసత్తమాః | తాంవృత్తిం ప్రతియాస్యామోజ పహోమార్చనాదిభిః || 137 ||

తేపంచదశ సాహస్రాః పునస్తానూచురాదరాత్‌ | అస్మాభిరత్ర స్థాతప్యం అగ్నిసేవార్థ తత్పరైః || 138 ||

యుష్మాభిస్త త్రగంతవ్యం సర్వేషాం కార్యసిద్ధయే|అన్యోన్యం సర్వసాహాయావృత్తిం యామనసంశయః || 139 ||

త్యక్తస్వకీయ వచనావృత్తి హీనా భవిష్యథ | తతః తస్మధ్యతః కశ్చిత్‌ చాతుర్విద్య ఉవాచహ || 140 ||

చాతుర్విద్య ఉవాచ -

పూర్వంహి వృత్తిమస్మాకం రామో వైదత్తవాన్‌ ద్విజాః | చాతుర్విద్యామహా సత్వాః స్వధర్మ ప్రతిపాలకాః || 141 ||

యాజనాథ్యయనాయుక్తాః కాజేశేనవి నిర్మితాః | దానందత్వాతు రామేణ ఉక్తంహి భవతాం పునః || 142 ||

స్థానం త్యక్త్వానగంతవ్యం ఇత్థం హిని యమఃకృతః | ఆపత్కాలేతుస్మర్తవ్యోవాయుపుత్రోమహాబలః || 143 ||

తా || చ్యవనుడు మీకు కన్యనిస్తాడు. మీరు కన్యను పొందండి. వృత్తిగాని సంబంధంగాని మీకు ఎప్పుడూ ఉండదు. (123) అని అనగా ఆ రాజు మాటను విని త్రయివిద్యులైన బాడబులు సంకేతము నుండి మరలకుండా తమ తమ స్థానములకు వెళ్ళారు. (124) పదిహేను వేలమంది బ్రాహ్మణులు చాతుర్విద్యులైన బ్రాహ్మణులు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళారు. (125) ఆ రోజును చింతా విష్టమైన మనస్సుతో ఏలాగో గడిపి, తమ పుత్రులతో, వినయంగల భార్యలతో నివారింపబడుతూ కూడా (126)అందరూ ఏకాగ్రమనస్కులై నిద్రించలేదు. బ్రాహ్మముహూర్తమందు లేచి,లౌకిక మాయను వదలి (127) ప్రియమైన పుత్రులను, భార్యలను, గృహములను వదలి, బాడబపుంగవులందరు గ్రామంచివర కలిశారు (128) మూడువేలమంది నిత్యాహ్నిక క్రియలు నిర్వర్తించిన వారై, విప్రులకు దక్షిణనిచ్చి కులమాతనుపూజించి (129) విఘ్నసంఘముల నాశం కొరకు, దక్షిణ ద్వారమునకు వచ్చి అక్కడున్న గణనాయకుని సింధూరపూలమాలతో పూజించి (130) బకుల స్వామిని సర్వార్థ సాధకుని సూర్యుని పూజించి, ఆదరంతో మహాశక్తియైన శ్రీమాతను పూజించి (131) జ్ఞానమునిచ్చే గోత్రమాతయైన శాంతకు నమస్కరించి, వెళ్ళటానికి సిద్ధమైన వారై, వారు పరమానందాన్ని పొందారు (132) చాతుర్విద్యద్విజులు తిరిగి పిలిచి, వారితో తిరిగి కలుసుకోవటానికి కారణమేమిటో అడిగారు (133) విప్రులిట్లన్నారు - మీరు వెళ్ళొద్దు. వెళ్ళినా త్వరగా రండి (134) రాముడిచ్చింది త్వరలో ఏర్పరుస్తాము అని అనగా చాతుర్విద్యాద్విజోత్తములు దానిని విని ఇట్లన్నారు (135) ద్విజులకు స్థానంతో కాని వృత్తితోకాని పనిలేదు. మేము తిరిగి రాము. తిరిగి చెప్పొద్దు (136) రఘూద్వహుడు మీకు వృత్తి నిచ్చాడు. ఓ ద్విజసత్తములార! జపహోమఅర్చనాదులతో ఆ వృత్తికి పోదాము (137) ఆ పదిహేను వేల మంది తిరిగి వారితో ఆదరంగా ఇట్లన్నారు. అగ్ని సేవార్థతత్పరులమైమేమిక్కడుండాలి (138) అందరి కార్యసిద్ధి కొరకు మీరక్కడికి వెళ్ళాలి. పరస్పరము అందరికి తోడ్పడుతూ వృత్తిని గుడుపుదాము అనుమానంలేదు (139) మీ మాటలను వదలి వృత్తి హీనులుకండి. అప్పుడు వారి మధ్య నుండి ఒక చాతుర్విదుడు ఇట్లన్నాడు (140) చాతుర్విద్యుని వచనము - ఓ ద్విజులార! పూర్వము మనకు రాముడు వృత్తినిచ్చాడు. చాతుర్విద్యులు మహాసత్వులు. స్వధర్మంపాలించే వారు (141) యాజన అధ్యయనములు కలవారు కాజేశులు నిర్మించారు. దానమును ఇచ్చి రాముడు మీతో ఇట్లన్నాడు (142) స్థానాన్ని వదలి పోరాదు. అని నియమం చేశాడు.ఆపత్కాలమందు మహాబలవంతుడైన వాయుపుత్రుని స్మరించాలి అని (143).

మూ || ఇతిరామేణపూర్వంహిస్వేస్థానే స్థాపితాస్తదా | రామవాక్యమన్యథా తత్కృత్వా గచ్ఛేత్కథం పునః || 144 ||

తస్మాద్యుష్మాన్‌వయంబ్రూమోగచ్ఛతః కార్యసిద్ధయే | భవతాం కార్యసిద్ధ్యర్థంవయంహోమార్చనాదిభిః || 145 ||

ఝటితికార్యసిద్ధిం స్యాత్‌ సత్యంసత్యంస సంశయః | ఇతివాక్యంతతః శ్రుత్వాతే ద్విజాగమనంప్రతి || 146 ||

ప్రస్థానంచ విధాయాదౌ గమనాయమనోదధుః | త్రిసాహస్రాః తదాతస్మాత్‌ ప్రస్థితా ద్విజసత్తమాః || 147 ||

దేశాద్దే శాంతరంగత్వావనాచ్చైవవనాంతరం | తీర్థేతీర్థే కృత శ్రాద్ధాః సుసంతర్పిత పూర్వజాః || 148 ||

ధ్యాయంతో రామరామేతి హనుమంతేతివైపునః | ఏకాశనా ః సదాచారాః ద్విజాజగ్ముఃశ##నైఃశ##నైః || 149 ||

త్యక్త ప్రతిగ్రహాః శాంతాః సత్యవ్రత పరాయణాః | తేగతా దూరమ ధ్వానం హనుమద్దర్శనార్థినః || 150 ||

సంధ్యాముపానతేనిత్యం త్రికాలంచైకమానసాః | ఏవంతు గచ్ఛతాంతేషాం శకునా అభవన్‌ శుభాః || 151 ||

ఏవంతు గచ్ఛతాంతేషాం పాథేయం తృటితంతదా | శ్రాంతాగ్లానింగతాః సర్వేపదం పరమ మాస్థితాః || 152 ||

క్రమిత్వాకియతీం భూమిం పదంగంతుం సతుక్షమాః | మనసానిశ్చయం కృత్వా ధృఢీకృత్యస్వమాననం || 153 ||

హనుమంత మదృషై#్వవనయాస్యామోవయం గృహాన్‌ | త్రైవిద్యాస్తుగతాస్తత్రయత్ర రామేశ్వరోహరిః || 154 ||

దృఢవ్రతాః సత్యపరాః కందమూల ఫలాశనా | ధ్యాయంతో రామరామేతి హనూమాంతే తివైపునః ||155 ||

గృహీత్వానియమంతే7పి త్యక్త్వాచాన్నంతధోదకం | తృషార్తాశ్‌చ క్షుధార్తాశ్చయయుర్ర్వతపరాయణాః || 156 ||

ఏవంతుక్లిశ్యమానానాం ద్విజానాం భక్తిభాజనః | ఉద్విగ్నమానసోరామో హనూమంతమథా బ్రవీత్‌ || 157 ||

శీఘ్రం గచ్ఛద్విజార్థేత్వం పవనాత్మజ ధర్మవిత్‌ | క్లిశ్యంతే వాడవాః సర్వేధర్మారణ్యని వాసినః || 158 ||

దహ్యతే మాననంమేద్యనాన్యధాశాంతి రస్తిమే | విప్రాణాం దుఃఖ కర్తాచ శాస్తవ్యోనాత్ర సంశయః || 159 ||

యేనవైదుఃఖితా విప్రాప్తే నాహందుఃఖితః కపే | యాహి శీఘ్రం హిమాంత్యక్త్వా విప్రాణాం పరిపాలనే || 160 ||

రామస్యవచనం శ్రుత్వా నమస్కృత్యచ రాఘవం | కృపయాపరయావిస్టః ప్రాదురాసీద్థరీశ్‌పరః || 161 ||

వృద్ధబ్రాహ్మణరూపేణ పరీక్షార్థం ద్విజన్మనాం | ఉవాచ పరయాభక్త్యా బ్రాహ్మణాన్‌ శ్రమదుర్బలాన్‌ || 162 ||

కుతాంజలి పుటోభూత్వాకరాన్ముక్త్వాకమండలుం | సర్వాన్‌ ప్రత్యభివాద్యాధ వచనంచే దమబ్రవీత్‌ || 163 ||

కుతః స్థానాదిహ ప్రాప్తా గంతుకామాశ్చ వైకుతః | కిమర్థం వైభవద్భిశ్చ గమ్యతే దారుణం వనం || 164 ||

తా || అని రాముడు పూర్వంమీమీస్థానమందుంచాడుగదా. రాముని వాక్యాన్ని కాదని ఎట్లావెళ్తారు. (144) అందువల్ల మీకుమేముచెప్పేదేమంటేకార్యసిద్ధికొరకువెళ్లండి. మీకార్యసిద్ధికొరకుమేముహోమార్చనాదులుచేస్తాము. దానితో (145) త్వరగామీకుకార్యసిద్ధిఔతుంది. నిజం, నిజం, అనుమానంలేదు. అనే మాటను విని ఆబ్రాహ్మణులువెళ్ళటానికి (146) సన్నాహమారం భించిమొదటవెళ్ళటానికి మనస్సులోఅనుకున్నారు. అప్పుడు అక్కడినుండి మూడువేలమంది బ్రాహ్మణులుబయలుదేరారు. (147) దేశంనుండి మరోదేశానికి, వనంనుండి మరోవనానికి ప్రతి తీర్థమందు శ్రాద్ధంచేస్తూ పూర్వజులను బాగాతృప్తిపరుస్తూ (తర్పిస్తూ), (148) రామ, రామ అని తలుస్తూ హనుమంతఅనితలుస్తూ, ఒకపూట భుజిస్తూ, సదాచారులైబ్రాహ్మణులుమెల్లమెల్లగావెళ్ళారు. (149) దానస్వీకారాన్నివదలి, శాంతులైనసత్యవ్రతపరాయణులై హనుమద్దర్శనార్థులైవారు చాలామార్గంవెళ్ళారు. (150) ఏకాగ్రమనస్సుతో మూడుకాలములందురోజుసంధ్యను ఉపాసిస్తు న్నారు. ఈరకంగావెళ్తున్నవారికిశుభశుకనములైనాయి. (151) ఈరకంగా వెళ్తున్నవారికి బాటబత్తెముజారిపోయింది. (ఐపోయింది) వారు శ్రాంతులైనారు. గ్లానిని పొందారు. అంతా గొప్పదీనస్థితికివచ్చారు. (152) కొద్దిదూరంవెళ్ళి ఆపిదప ఒక్కడుగువేయటానికి కూడా అసమర్థులైనారు. మనస్సులతోనిశ్చయించుకొని, తమమనస్సును దృఢపరచుకొని (153) హనుమంతుని చూడకుండామేముగృహములకువెళ్ళము. త్రైవిద్యులు, రామేశ్వరహరిఉన్నచోటికివెళ్ళారు. (154) దృఢ నిష్ఠగలవారు,సత్యవరులుకందమూలఫలములుభోజనములుగాగలవారు. రామ, రామహనుమంతఅనిధ్యానిస్తున్నారు. (155) వారునియమంస్వీకరించి, అన్న ఉదకములువదలి, దప్పితో, ఆకలితోపీడింపబడుతూవ్రతపరాయణులైవెళ్ళారు. (156) ఈరకంగాబాధపడుతున్న ద్విజులభక్తికి స్థానమైన రాముడు ఉద్విగ్నమైనమనస్సుకలవాడైహనుమంతునితో ఇట్లన్నాడు (157) ధర్మముతెలిసిన ఓపనవాత్మజ! నీవు బ్రాహ్మణులకొరకు త్వరగావెళ్ళు. ధర్మారణ్‌యమందున్నవాడ బులందరు బాధపడుతున్నారు. (158) నామనస్సుకాలిపోతుంది. మరోవిధంగా నాకుశాంతిలేదు. విప్రులకు దుఃఖంకల్గించేవానిని శాసించాలి. అనుమానంలేదు. (159) బ్రాహ్మణలుబాధపడినందువల్లనేను కూడాబాధపడినాను, ఓకపి. నన్నువదిలి విప్రులను రక్షించేకొరకుత్వరగావెళ్ళు. (160) రాముని మాటనువిని, రాఘవునకునమస్కరించిచాలాదయగలవాడైహనుమంతుడు వచ్చాడు. (161) బ్రాహ్మణులపరీక్షించేకొరకువృధ్ధ బ్రాహ్మణరపంలోవచ్చాడు. శ్రమతోదుర్బలులైన బ్రాహ్మణులతో పరమ భక్తితోఇట్లన్నాడు. (162) చేతినుండికమండులువునువదలి, చేతులుజోడించి, అందరికి నమస్కరించి ఇట్లాఅన్నాడు. (163) ఎక్కడినుండిఇక్కడికివచ్చారు. ఎక్కడికివెళ్ళదలిచారు. ఎందుకువెళ్తున్నారు. ఈ దారుణమైన అడవిలో అని అనగా (164)

మూ || విప్రాఊచుః -

ధర్మారణ్యాత్‌ సమాయాతా నిజదుఃఖం నివేదితుం | రామస్య దర్శనార్థంహి గంతుకామావయం ద్విజాః || 165 ||

సేతుబంధ మహా తీర్థం సర్వకామ ప్రదాయకం | నియమస్థాః క్షీణదేహాః రామంద్రష్టుం సముత్సుకాః || 166 ||

యత్రరామేశ్వరోదేవః సాక్షాద్వాయుసుతఃకపిః | తచ్ఛ్రుత్వా సద్విజః ప్రాహాక్వరామః క్వ చవాయుజః || 167 ||

క్వసేతు బంధరామేశో దూరాద్దూరతరోద్విజాః | వ్యాఘ్రసింహాకులంచోగ్రం వనంఘోరతరం మహత్‌ || 168 ||

గత్వాయస్మాన్నవర్తంతే తదుగ్రమనుజీవినః | నివర్త ధ్వం మహాభాగా యది కార్యంహిమద్వచః || 169 ||

అథవాగమ్యతాం విప్రాః చిరంజీవ సుఖీభవ | వృద్ధస్యవాక్యంతచ్ఛ్రుత్వా వాడవాశ్చైకమానసాః || 170 ||

విప్రగచ్ఛామహసర్వే రామపార్శ్వమసంశయ | మ్రియతేయ దిమార్గే7స్మిన్‌ రామలోకమవాప్నుయాత్‌ || 171 ||

జీవవస్వృత్తిమవాప్నోతి రామాదేవనసంశయః | అన్నథా శరణం నాస్తి అస్మాకం రాఘవంవినా || 172 ||

ఇత్యుక్త్వా నిర్గతాః సర్వే రామదర్శన తత్పరాః | దినాంతమతివాహ్యాథ ప్రభాతేవిమలే పునః || 173 ||

హనుమాన్‌ బ్రహ్మరూపీసవృద్ధః పూర్వగుణాన్వితః | కమండలు ధరోధీమాన్‌ అభివాదనతత్పరః || 174 ||

కుత్రస్థానాదిహప్రాప్తాః సర్వేయూయంహి వాడవాః | కుత్రాస్తి వామహాలాభో వివాహోత్సవ ఏవవా || 175 ||

ఇతితస్యవచః శ్రుత్వా వాడవావిస్మయంగతాః | ప్రణామపూర్వాం విజ్ఞప్తిం కథయామానురాదృతాః || 176 ||

అస్మాకంతు పురావృత్తం మహాదాశ్చర్య కారకం | భూమిదేవ శృణుష్వత్వం దయాలుః దృశ్యసేయతః || 177 ||

ఆదౌసృష్టి సమారంభే స్థాపితాకేశ##వేనచ | శివేన బ్రహ్మణా చైవ త్రిమూర్తి స్థాపితావయం || 178 ||

శ్రీరామేణతతః పశ్చాత్‌ జీర్ణోద్ధారేణ స్థాపితాః | గ్రామాణాం వేతనం దత్తం హరిరాజేన చాదరాత్‌ || 179 ||

చతుశ్చత్వా రింశదధిక చతుఃశత మితాత్మనాం | గ్రామాస్త్ర యోదశార్చార్థం సీతాపుర సమన్వితాః

షట్‌త్రింశచ్చ సహస్రాణి వణిజోద్విజపాలనే | గోభూజ సంజ్ఞాస్తే శూద్రాః తేభ్యః సపాదలక్షకాః || 181 ||

తేచజాతాః త్రిధాతాత గోభూజాడాలజాస్తథా | మాండలీయాస్తథాచైతేత్రివిధాశ్చమనోరమాః || 182 ||

వృత్త్యర్థంతేన దత్తావైహ్యనర్ఘ్యారత్నకోటయః ||

తదాతే మోఢ18000 గోభూజా 18000 మాండలీయా 125000 అడాలజాః 18000 || 183 ||

అధునా వాడవశ్రేష్ఠ అమోనామమహీపతిః | శాసనం రామచంద్రస్య సమానయతి దుర్మతిః || 184 ||

జాయాతాతస్య దుష్టోవై నామ్నాకుమార పాలకః | పాషండై ర్వేష్టితో నిత్యం కలి ధర్మేణ సంమతః || 185 ||

తా || బ్రాహ్మణులిట్లన్నారు - ధర్మారణ్యం నుండి మా దుఃఖం నివేదించే కొరకు వచ్చాము. మేము రాముని దర్శనంకొరకు వెళ్తున్నాము (165) అన్ని కోరికలిచ్చే మహాతీర్థమైన సేతుబంధం వెళ్తున్నాము. నియమమందున్నాము మా దేహాలు క్షీణించాయి. రాముని చూడాలని ఉత్సాహపడుతున్నాయి (166) రామేశ్వరదేవుడెక్కడున్నాడో, వాయుసుతుడు కపి ఎక్కడున్నాడో అని అనగా దానిని విని బ్రాహ్మణుడు ఇట్లన్నాడు. రాముడెక్కడ, వాయుజుడెక్కడ (167) సేతుబంధ రామేశుడెక్కడ, ఓ ద్విజులార! చాలా దూరం. వ్యాఘ్ర సింహములతో నిండింది, ఇది ఉగ్రవనము చాలా ఘోరతరమైనది (168) ప్రాణులు అక్కడికి వెళ్ళి తిరిగి రారు. అది అంత ఉగ్రమైంది. ఓ మహాభాగులార తిరిగివెళ్ళండి. నామాటవినండి. (169) లేదావెళ్ళండి ఓ విప్రులార! చిరంజీవులుకండి. సుఖంగా ఉండండి., వృద్ధునిఆమాటలనువినిబాడబులుఒకేమనస్సు కలవారై (170) ఓవిప్రుడమేమంతారామపార్శ్వమునకువెళ్తాము, అనుమానంలేదు. ఒక వేళమార్గమధ్యంలో మరణిస్తే రామలోకముపొందుతాము. (171) బ్రతికితేరామునివల్లవృత్తినిపొందుతాము అనుమానంలేదు. మాకురాఘవుడు కాకుండా మరోమరొక శరణులేదు. (172) అని పలికిఅందరు రామదర్శనతత్పరులైవెళ్ళారు. సాయంకాలాన్ని గడిపిస్వచ్ఛమైన ప్రభాతమందు (173) బ్రహ్మరూపియైనహనుమంతుడువృద్ధుడుపూర్వగుణములుకలవాడు కమండలువు ధరించిన వాడు, బుద్ధిమంతుడు, అభిదనతత్పరుడు (174) ఓ బాడబులార! మీరంతా ఏ స్థానంనుండి ఇక్కడికివచ్చారు. మహాలాభము ఎక్కడుంది.వివాహఉత్సవముకాని ఎక్కడుంది. (175) అనిఅనగాఆతనిమాటనువిని బాడబులు ఆశ్చర్యపడ్డారు. ఆదరంతోప్రణామపూర్వకముగావిజ్ఞప్తిచేశారు. ఇట్లాచెప్పారు (176) మాపూర్వవృత్తాన్నివినండి. మహాఆశ్చర్యకరమైనది. ఓ బ్రాహ్మణ! నీవు దయగలవాడవుగా కన్పిస్తున్నావు (177) తొలుత సృష్ట్యారంభమందు కేశవుడు స్థాపించాడు. శివుడు, బ్రహ్మ వీరితో త్రిమూర్తులతో మేము స్థాపింపబడ్డాము (178) పిదప శ్రీరాముడు జసీర్ణోద్ధార రూపంలో స్థాపించాడు. ఆదరంతో హరి రాజు గ్రామములు బ్రతుకు తెరువు కల్పించాడు. (179) నాలుగువందల నలుబదినాలుగు సంఖ్యగలవారికి పదమూడు గ్రామములను పూజకొరకు సీతాపురంతో కలిపి ఇచ్చాడు. (180) ద్విజులపాలన కొరకు ముప్పది ఆరువేల వైశ్యులను ఏర్పరచాడు. వారికి గోభూజులని పేరు వారికి లక్షపాతిక మంది శూద్రుల కల్పించాడు (181) వారుమూడు రకాలుగా జన్మించారు వారు గోభూజ అడాలజ, మాండలీయులని మూడు విధాలు (182) వృత్తి కొరకు అమూల్యమైన రత్నకోటులను ఆతడు వారికిచ్చాడు. అప్పుడ వారు మోఢ 18000 వేలు, గోభూజులు 18000వేలు మాండలీయులు 1,25,000 అడాలజులు 18,000వేలు (183) ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ ఇప్పుడు ఆముడను రాజు రామచంద్రుని శాసనాన్ని దుర్మతియై మన్నించటంలేదు (184) ఆతని అల్లుడు దుష్టుడు. కుమారపాలకుడని పేరు. ఎప్పుడూ పాషండులు ఆతని చుట్టూ ఉంటారు. ఆతడు కలిధర్మం కలవాడు (185).

మూ || ఇంద్రసూత్రేణ జైనేన ప్రేరితో బౌద్ధ ధర్మిణా | శాసనంతేన లుప్తంహి రామదత్తంనసంశయః || 186 ||

వాణిజః తాదృశాఃకే7పి తన్మసస్కాబభూవిరే | నిషేధయంతి రామంతే హనుమంతం మహామతిం || 187 ||

ప్రత్యయంతు వినావిప్రాన దాస్యామీతినిశ్చితం | తంజ్ఞాత్వాతు ఇమేవిప్రారామం శరణమాయయుః || 188 ||

హనుమంతం మహావీరం రామశాసన పాలకం | తస్మాద్గచ్చామహేసర్వం రామం ప్రతి మహామతే || 189 ||

ఆంజనేయో యదాస్మాకం సదాస్యతి సమీహితం | అనాహారవ్రతేనైవప్రాణాం స్త్యక్ష్యామహేతవయం || 190 ||

అస్మాభిస్తే విశేషేణ కథితం పరివృచ్ఛతే | స్నేహ భావం విచింత్యాశు నిజవృత్తిం ప్రకాశయ || 191 ||

హనుమానువాచ -

ప్రాప్తే కలియుగే విప్రాః క్వదేవదర్శనం భ##వేత్‌ | నివర్త ధ్వంహి విప్రేంద్రా యదీచ్ఛధ సుఖంమహత్‌ || 192 ||

వ్యాఘ్రసింహాకులేశూన్యే వనే వనగజాశ్రితే | బహుదావ సమావిష్టే ప్రవేష్టుంనైవశక్యతే || 193 ||

విప్రాఊచుః -

అతీతేది వసేవిప్ర ఏకం కథితం వానిదం | అద్యైపత్వం సమాగమ్య ఏవమేవ ప్రభాషసే || 194 ||

కస్త్వం వాడవరూపేణ రామోవాప్యథవాయుజః | సత్యం కథయనః స్వామిన్‌దయాంకృత్వామహాద్విజ || 195 ||

హనుమాన్‌ కథయామాన గోపితం యద్ద్విజాగ్రతః | హనుమానిత్యహం విప్రాబుధ్యధ్వంనిశ్చితాహిమాం || 196 ||

స్వరూపం ప్రకటీకృత్యలాంగూలం దర్శయన్‌ మహత్‌ || 197 ||

హనుమానువాచ -

అయమంభోనిధిః సాక్షాత్‌ సేతుబంధోమనోరమః | అయంరామేశ్వరో దేవో గర్భవాసవినాశకృత్‌ || 198 ||

ఇయంతునగరీ శ్రేష్ఠాలంకానామేతివిశ్రుతా | యత్రసీతామయాప్రాప్తా రామశోకా వహారిణీ || 199 ||

తర్జన్యగ్రే ద్విజశ్రేష్ఠా అగమ్యామాం వినాపరై ః సాసువర్ణమయీభాతి యస్యాంరాజ్యేవిభీషణః || 200 ||

స్థాపితో రామదేవేన సేయం లంకామహాపురీ | నియమస్థైః సాధువృందైః తీర్థయాత్రా ప్రసంగః || 201 ||

ఆనీయగంగా సలిలం రామేశమభిషేచ్యచ | క్షిప్తా ఏతేమహాభారా దృశ్యంతే సాగరాంతరే || 202 ||

నిష్పాపాస్తేన సంజాతాః సాధవస్తే దృఢవ్రతాః | సూనంపుణ్యోదయే వృద్ధిః పాపేహానిశ్చజాయతే || 203 ||

స్థానభ్రష్టాః కృతాః పూర్వంచాతు ర్విద్యాద్విజాతయః | జీర్ణోద్ధారేణ రామేణ స్థాపితాః పునరేవహి

పూర్వజన్మనిభో విప్రా హరిపూజాకృతామయా || 204 ||

సాంవ్రతం నిశ్చలాభక్తిః భవత్సే వాహిదృశ్యతే | తేన పుణ్య ప్రభావేణ తుష్టోదాస్యామివోవరం || 205 ||

ధన్యోహం కృతకృత్యోహం సుభాగ్యోహం ధరాతలే | అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం || 206 ||

యదహం బ్రాహ్మణానాంచ ప్రాప్త వాంశ్చరణాంతికం || 207 ||

వ్యాస ఉవాచ -

దృష్టైవ హనుమంతంతే పులకాంకిత విగ్రహాః | సగద్గదంయధోచుస్తే వాక్యంవాక్య విశారదాః || 208 ||

ఇతిశ్రీస్కాందేమహాపురాణఏకాశీతిసాహస్ర్యాసంహితాయాంతృతీయేబ్రహ్మఖండే ధర్మారణ్య మాహాత్మ్యేహను మత్సమాగమోనామషట్‌త్రింశో7ధ్యాయః || 36 ||

తా || బౌద్ధధర్మంగల ఇంద్రసూరిఅనేజైనునితోప్రేరేపింపబడి, రాముడిచ్చిన శాసనాన్ని, ఆతడు లుప్తంచేశాడు. అనుమానంలేదు. (186) కొందరు వణిజులు అట్టివారేఆతని యందుమనస్సుగల వారైనారు. వారు రాముని, మహామతియైన హనుమంతుని నిషేధిస్తున్నారు (187) నమ్మకం కలగకుండా ఇవ్వను అని నిశ్చయించాడు దానిని తెలుసుకొని బ్రాహ్మణులు రాముని శరణువేడవచ్చారు (188) హనుమంతుడు, మహావీరుడు, రామాజ్ఞ పాలించేవాడు. అందువల్ల ఓ మహామతి మేమంతా రాముని దగ్గరకు వెళ్తున్నాము (189) ఆంజనేయుడు మాకు మా కోరికను ఇవ్వని పక్షంలో, మేము ఆహారం లేక వ్రతమందుండి ప్రాణాలను వదుల్తాము. (190) మేము మీకు చాలా చెప్పాము, మీరడిగారు. స్నేహభావాన్ని గమనించి త్వరగా మీ వృత్తి ఏమిటో చెప్పండి (191) హనుమంతుడిట్లన్నాడు - ఓవిప్రులార! కలియుగంవస్తే దేవదర్శన మెక్కడౌతుంది. ఓ విప్రులార! కలియుగం వస్తే దేవదర్శనమెక్కడౌతుంది. ఓ విప్రులార! మంచి సుఖం కావాలంటే వెనక్కి వెళ్ళండి (192) వ్యాఘ్ర సింహములతో నిండిన, వనగజము లాశ్రయించిన శూన్యవనమందు, అధికంగా దావాగ్నికల వనంలో ప్రవేశించటం శక్యంకాదు (193) అనగా విప్రులన్నారు - దివసంగడిచాక ఇట్లా చెప్పావు, ఓ విప్ర! ఈ రోజే వచ్చి నీవు ఇట్లాగే మాట్లాడుతున్నావు (194) నీవెవరు, బ్రాహ్మణరూపంలో ఉన్న రాముడివా కాక వాయుజునివా. ఓ స్వామి! మహాద్విజ! దయచేసి మాకు నిజం చెప్పండి. (195) అనగా బ్రాహ్మణుని ఎదుట తాను దాచిన దానిని హనుమంతుడు చెప్పసాగాడు. ఓ విప్రులార! నేను హనుమంతుణ్ణి అని నన్ను నిశ్చంగా తెలుసుకోండి. ఓ విప్రులార! (196) తననిజరూపమును ప్రకటించి, గొప్ప తోకను చూపిస్తూ అన్నాడు (197) హనుమంతుడిట్లన్నాడు. ఇది సముద్రము. ఇది మనోరమమైన సేతుబంధమే సాక్షాత్తుగా ఈతడు రామేశ్వర దేవుడు గర్భవాసాన్ని నశింపచేసేవాడు (198) ఇది శ్రేష్ఠమైన నగరము. లంక అని ప్రసిద్ధమైంది. రాముని శోకమును హరించే సీత నాకు ఇక్కడ లభించింది (199) ఓ ద్విజుశ్రేష్ఠులారా! నేనుకాకుండా ఇతరులు తర్జని అంతదూరం దాటి ముందుకు వెళ్ళలేరు. అది బంగారుమయంగా వెలుగుతోంది. ఆ రాజ్యమందు విభీషణుడున్నాడు. (200) రాముడు స్థాపించాడు ఆతనిని. ఇది లంక అనే మహానగరము నియమమందున్నవారు సాధుబృందములు తీర్థయాత్ర ప్రసంగంలో (చేసేప్పుడు) (201) గంగా సలిలమును తెచ్చి రామేశుని అభిషేకించి ఈ మహాభారములను వేశారు. సాగరం మధ్యలో కన్పిస్తున్నాయి (202) దృఢ వ్రతులైన ఆ సాధువులు దానితో నిష్పాపులైనారు. పుణ్యోదయమందు వృద్ధి పాపమందుహాని కల్గుతుంది. (203) పూర్వము చాతుర్విద్యులైన ద్విజాతులు స్థానభ్రష్టులు చేయబడ్డారు. తిరిగి జీర్ణోద్ధారము పేరుతో రాముడు వారిని స్థాపించాడు. ఓ విప్రులార! పూర్వజన్మలో నేను హరిపూజ చేశాను (204) ఇప్పుడు నిశ్చలమైన భక్తితో మీసేవ కన్పిస్తోంది. ఆపుణ్యప్రభావంతో సంతుష్టణ్ణౖమీకు వరమిస్తాను (205) ఈ భూమియందు నేను ధన్యుణ్ణి. కృతకృత్యుణ్ణి. సుభాగ్యుణ్ణి. ఈ రోజునా జీవితం సఫలమైంది. నా జీవితము సుజీవనమైంది. (206) నేను బ్రాహ్మణుల పాదముల సమీపానికి చేరాను (207) వ్యాసులిట్లన్నారు. హనుమంతుని చూస్తూనే వారు పులకాంకిత శరీరులై గద్గదమైన గొంతుకతో, వాక్యవిశారదులైనవారు ఇట్లా పలికారు (208) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు హనుమత్‌ సమాగమ మనునది ముప్పది ఆరవ అధ్యాయము || 36 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters