Sri Scanda Mahapuranamu-3    Chapters   

ద్వితీయ అధ్యాయము

మూ|| సూత ఉవాచ -

అథాన్యదపి వక్ష్యామి మాహాత్మ్యం త్రిపురద్విషః | శ్రుతమాత్రేణ యే నాశుఛిద్యంతే సర్వసంశయాః || 1 ||

అతః పరతరం నాస్తి కించిత్పాపవిశోధనం | సర్వానంద కరం శ్రీమత్‌ సర్వకామార్థ సాథకం || 2 ||

దీర్ఘాయుర్విజయారోగ్యభుక్తిముక్తి ఫలప్రదం | యదన్యేన భావేన మహెశారాధనం పరం || 3 ||

ఆర్ద్రాణమపిశుష్కాణాం అల్పానాం మహతామపి | ఏతదేవవి నిర్దిష్టం ప్రాయశ్చిత్తమధోత్తమం || 4 ||

సర్వకాలేప్య భేద్యానాం అఘానాం క్షయకారణం | మహాముని వినిర్దిష్టేః ప్రాయశ్చిత్తైరధోత్తమైః || 5 ||

ఇదమేవ పరం శ్రేయః సర్వశాస్త్రవినిశ్చితం | యద్భక్త్యా పరమేశస్య పూజనం పరమోదయం || 6 ||

జానతా7జానతా వాపియేన కేనాపిహెతునా | యత్కించిదపిదేవాయకృతం కర్మవిముక్తిదం || 7 ||

మాఘేకృష్ణ చతుర్దశ్యాం ఉపవాసో7తి దుర్లభః | తత్రాపి దుర్లభం మన్యే రాత్రౌజాగరణంనృణాం || 8 ||

అతీవ దుర్లభం మన్యే శివలింగస్య దర్శనం | సుదుర్లభతరం మన్యే పూజనం పరమేశితుః || 9 ||

భవకోటి శతోత్పన్న పుణ్యరాశివిపాతకః | లభ్యతేవా పునస్తత్ర బిల్వపcతార్చనం విభోః || 10 ||

వర్షాణా మయుతం యేనస్నాతం గంగాసరిజ్జలే | సకృద్బిల్వార్చనే నైవతత్ఫలం లభ##తే నరః || 11 ||

యానాయానితుపుణ్యాని లీనానీహయుగేయుగే | మాఘే7సిత చతుర్దశ్యాం తాని తిష్ఠంతి కృత్స్నశః || 12 ||

ఏతామే వప్రశంసంతిలోకే బ్రహ్మాదయః సురాః | మునయశ్చ వసిష్ఠాద్యాః మాఘే7సిత చతుర్దశీం || 13 ||

అత్రోపవానః కేనాపి కృతః క్రతుశతాధికః | రాత్రౌజాగరణం పుణ్యం కల్పకోటి తపోథికం || 14 ||

తా || సూతులిట్లన్నారు - త్రిపుర ద్వేషియొక్క మరొక మాహాత్మ్యాన్ని కూడా చెబుతాను. విన్నంతలోనే త్వరలో అన్ని అనుమానములు తొలగిపోతాయి (1) పాపమునుశోధించేది దీనికన్నమించింది మరొకటిలేదు. అన్నివిధముల ఆనందాన్నిచ్చేది. శ్రీమంతమైనది సర్వకామఅర్థములసాధించేది (2) దీర్ఘాయుస్సు, విజయ ఆరోగ్య భుక్తిముక్తిఫలమునిచ్చేది. అనన్యచిత్తంతోమహెశునిఆరాధించటం, పరమైనది (3) ఆర్ధ్రమైన, ఎండిన, అల్పమైన లేదా గొప్పవైన పాపములన్నిటికి ఇదేఉత్తమమైనప్రాయశ్చిత్తముగా నిర్దేశించబడింది (4) అన్నికాలములందును ఛేదించరానికారణములన్నింటికి క్షయకారణము. మహామునులునిర్దేశించిన ఉత్తమమైనప్రాయశ్చిత్తములకన్న (5) ఇదేమిక్కిలిఉత్తమమైనది శ్రేయస్కరమైనది. అన్నిశాస్త్రములందునిశ్చయింపబడింది. భక్తితోపరమేశ్వరుని పూజించుటేపరమఉదయము (6) తెలిసికాని తెలియకకాని ఏదోఒకకారణంగా ఏకొంచంగాని, దేవునికొరకుచే సేకర్మముక్తినిచ్చేది (7) మాఘకృష్ణచతుర్దశియందు ఉప వాసముఅతిదుర్లభము. అక్కడకూడానరులకు రాత్రిపూటజాగరణదుర్లభము (8) శివలింగదర్శనము ఇంకాదుర్లభమనిభావిస్తాను. పరమేశుని పూజనుదుర్లభమని భావిస్తాను (9) నూరుకోట్లజన్మలలో కల్గిన పుణ్యరాశుల పరిపాకం వల్లఆరోజుప్రభువు యొక్కబిల్వపత్రార్చన లభిస్తుంది. (10) పదివేలసంవత్సరాలుగంగానది జలంలోస్నానంచేసినవానికి వచ్చిన ఫలము ఒక్కసారి బిల్వార్చనచేస్తే చాలు ఆఫలితమునరుడుపొందుతాడు (11) యుగయుగమందుఏఏపుణ్‌యములు ఇక్కడలీనమైనాయో అవన్నీ మాఘ కృష్ణచతుర్దశియందు ఉంటాయి. (12) దీనినేలోకంలో బ్రహ్మాదిదేవతలు ప్రశంసిస్తారు. వసిష్ఠాదిమునులు మాఘమాసంలో కృష్ణచతుర్దశిని ప్రశంసిస్తారు. (13) ఇక్కడ ఉపవాసంచేసినవారెవరైనా నూరుయజ్ఞములకన్న ఎక్కువచేసినట్లే. రాత్రిజాగరణ చేయటం పుణ్యప్రదము. కోటికల్పముల తపస్సుకన్నఅధికము (14).

మూ || ఏకేన బిల్వపత్రేణ శివలింగార్చనకృతం | త్రైలోక్యే తస్యపుణ్యస్యకోహిసాదృశ్యమిచ్ఛతి || 15 ||

అత్రాను వర్ణ్యతే గాథా పుణ్యా పరమశోభనా | గోపనీయాపి కారుణ్యాత్‌ గౌతమేన ప్రకాశితం || 16 ||

ఇక్ష్వాకువంశజః శ్రీమాన్‌ రాజాపరమధార్మికః | ఆసీన్మిత్ర సహోనామశ్రేష్ఠః సర్వధనుర్‌ భృతాం || 17 ||

సరాజాసకలాస్త్రజ్ఞః శాస్త్రజ్ఞః శ్రుతిపారగః | వీరో7త్యంత బలోత్సాహో నిత్యోద్యోగీ దయానిధిః || 18 ||

పుణ్యానామిహ సంఘాతః తేజసామివ పంజరః | ఆశ్చర్యాణా మివక్షేత్రం యస్య మూర్తి ర్విరాజతే || 19 ||

హృదయం దయయాక్రాం తంశ్రియాక్రాంతం చతద్వపుః|చరణౌయస్యసామంత చూడామణిమరీచిభిః || 20 ||

ఏకదామృగయాకేలిలోలుపః సమహీపతిః | వివేశ గహ్వరంఘోరం బలేన మహతావృతః || 21 ||

తత్రవివ్యాథవిశిబైఃశార్దూలాన్‌గవయాన్‌మృగాన్‌| రురూన్‌వరాహాన్‌మహిషాన్‌మృగేంద్రానపిభూరిశం || 22 ||

సరథీ మృగయాసక్తో గహనం దంశితశ్చరన్‌ | కమపి జ్వలనాకారం నిజఘాన నిశాచరం || 23 ||

తస్యానుజః శుచావిష్టోదృష్ట్వాదూరేతిరోహితః | బ్రాతరం నిహతం దృష్ట్వాచింతయామానచేతసా || 24 ||

నన్వేషరాజా దుర్దర్షో దేవానాం రక్షసామపి | ఛద్మనైవ ప్రజేత వ్యోమమశత్రుః నచాన్యతా || 25 ||

ఇతివ్యవసితః పాపో రాక్షసోమనుజాకృతిః | ఆససాదనృపశ్రేష్ఠం ఉత్పాత ఇవమూర్తిమాన్‌ || 26 ||

తం వినమ్రాకృతిం దృష్ట్వా భృత్యతాం కర్తుమాగతం | చక్రే మహాన సాధ్యక్ష మజ్ఞానాత్సమహీపతిః || 27 ||

అథతస్మిన్వనే రాజా కించిత్కాలం విహృత్యస | ని వృత్తో మృగయాంహి త్వాస్వపురీం పునరాయ¸° || 28 ||

తా || ఒక బిల్వ ప్రతంతో శివలింగార్చన చేస్తే ముల్లోకములలో ఆతని పుణ్యంతో సమానమైన వారు ఉండరు (15) ఇక్కడ పుణ్యమైన పరమశోభనమైన కథ చెప్పబడుతోంది. రహస్యంగా ఉంచతగిన దైనా దయతో గౌతములు తెలియజేశారు (16) ఇక్ష్వాకు వంశమందు పుట్టినవారు, శ్రీమాన్‌ పరమధార్మికుడు రాజు, ధనుర్థారులందరిలో శ్రేష్ఠుడు మిత్రసహుడు అనిపేరుగల రాజు ఉండేవాడు (17) ఆరాజుసకలఅస్త్రములనెరిగినవాడు, శాస్త్రజ్ఞుడు, శ్రుతిపారగుడు. వీరుడు మిక్కిలి బల ఉత్సాహములుకలవాడు, ఎప్పుడూ ఏదో ప్రయత్నంచేసేవాడు, దయానిధి (18) పుణ్యముల యొక్క సమూహమాతడు తేజస్సుకంతా పంజరము. ఆశ్చర్యములకు స్థానము ఆతని రూపము అట్లా ఉంది (19) ఆతని హృదయంను దయ ఆక్రమించింది. ఆతని శరీరాన్ని శ్రీ ఆక్రమించింది. ఆతని పాదములు సామంతరాజుల కిరీటమణుల కాంతితో ఆక్రమింపబడ్డాయి (20) ఒకసారి వేటాడాలనే కోరికతో ఆరాజు గొప్ప సైన్యంతో కూడి ఘోరమైన అడవిని ప్రవేశించాడు (21) అక్కడ బాణములతో పులులను గవయములను మృగములను వేటాడాడు. పందులను, దున్నపోతులను, నల్లచారల దుప్పులను మృగేంద్రములను కూడా చాలావేటాడాడు (22) ఆ రథశ్రేష్ఠుడు వేటయందాసక్తితో అడవిలో కవచము ధరించి తిరుగుతూ ఏదో ఒక అగ్నిలా రూపంకలిగిన ఒక రాక్షసుని చంపాడు. (23) ఆతని తమ్ముడు దుఃఖితుడై దూరం నుంచే చూచి అదృశ్యుడైనాడు. తన భ్రాతచనిపోయినాడని చూచి మనసులో ఇట్లా ఆలోచించసాగాడు (24) ఈ రాజును జయించటం కష్టం. దేవతలు, రాక్షసులు జయించలేరు. మోసంతోనే ఈతనిని జయించాలి. మరొరకంగా కాదు (25) అని నిశ్చయించుకొని పాపరాక్షసుడు మనుష్యరూపంధరించి, మూర్తీభవించిన అపశకునములా రాజును చేరాడు. (26) భృత్యత్వమునుచేయడానికి వచ్చిన ఆ వినమ్ర ఆకృతిని చూచి ఆరాజు అజ్ఞానంవల్ల వాడిని మహాసాధ్యక్షుని చేశాడు (వంటవాడు) (27) పిదప ఆ రాజు ఆ వనంలో కొంతకాలం విహరించి వేటను వదలి మరలి తిరిగి తన నగరానికి వచ్చాడు (28).

మూ || తస్యరాజేంద్రముఖ్యస్య మదయంతీతి నామతః | దమయంతీ నలస్యేవ విదితా వల్లభానతీ || 29 ||

ఏతస్మిన్‌ సమయే రాజా నిమంత్రముని పుంగవం | వశిష్ఠం గృహమానిన్యే సంప్రాప్తే పితృవానరే || 30 ||

రాక్షసా సూదరూపేణ సంమిశ్రిత నరామిషం | శాకామిషం పురః క్షిప్తం దృష్ట్వా గురురథాబ్రవీత్‌ || 31 ||

ధిఙ్‌దిఙ్‌న రామిషం రాజన్‌ త్వయైతత్‌ ఛద్మకారిణా | ఖలేనో పహృతంమే7ద్యఅతోరక్షభవిష్యసి || 32 ||

రక్షః కృతమ విజ్ఞాయశ పై#్వవం సగురుస్తతః | పునర్విమృశ్యతం శాపంచ కారద్వాదశాబ్దికం || 33 ||

రాజాపికోపితః ప్రాహయదిదంమేన చేష్టితం | న జ్ఞాతం చవృథాశప్తో గురుం చైవ శపామ్యహం || 34 ||

ఇత్యపోంజలి నాదాయగురుం శప్తుం సముద్యతః|పతిత్వా పాదయోస్తస్య మదయంతీస్య వారయత్‌ || 35 ||

తతోనివృత్తః శాపాచ్చ తస్యావచన గౌరవాత్‌ | తత్యాజ పాదయోరంభః పాదౌకల్మషతాం గతౌ || 36 ||

కల్పషాంఘ్రిరితిఖ్యాతః తతః ప్రభృతి పార్థివః | బభూప గురుశాపేన రాక్షసోవన గోచరః || 37 ||

సబిభ్రత్‌ రాక్షసంరూపం ఘోరం కాలాంతకోపమం|చఖాదవి విధాన్‌ జంతూన్‌ మానుషాదీన్‌ వనేచరః || 38 ||

సకదాచిద్వనే క్వాపి రమమాణౌ కిశోరకౌ | అవశ్యదంతకా కారోన వోఢౌ మునిదంపతీ || 39 ||

రాక్షసో మానుషాహారః కిశోరం మునినందనం | జగ్థుం జగ్రాహ శాపార్తో వ్యాఘ్రోమృగశిశుంయథా || 40 ||

రక్షోగృహీతంభర్తారం దృష్ట్వాభీతాథత త్ర్పియా | ఉవాచ కరుణం బాలా క్రందం తీభృశ##వేపితా || 41 ||

భోభో మామాకృధాః పాపం సూర్యవంశయశోధర మదయంతీ పతిస్త్వంహిరాజేంద్రోన తురాక్షసః || 42 ||

తా || ఆ రాజేంద్రముఖ్యునకు, నలునకు దమయంతివలె మదయంతి అనుపేరుగల భార్య సతిcపతివ్రత) ప్రసిద్ధమైనది ఉంది. (29) ఈ సందర్భంలో రాజుముని పుంగవుని, నిమంత్రణచేసి, తండ్రి శ్రాద్ధము వచ్చినపుడు వశిష్ఠుణ్ణి తన ఇంటికి తెచ్చాడు (30) రాక్షసుడు వంటవాడి రూపంలో ఉండినవాడు నరమాంసంతో కూడిన దానిని మాంసపు కూరను ముందుంచగా చూచి గురువుఇట్లన్నాడు (31) థిక్‌ థిక్‌ నరమాంసము, కపటమాచరించే నీవు ఉంచావు ఓరాజ! నాకు క్రూరంగా ఈవేళ దీనిని తెచ్చావు కనుక నీవు రాక్షసుడవౌతావు అని అన్నాడు (32) రాక్షసుడు చేసిన దీనిని గుర్తెరుగక గురువు ఈ విధంగా శపించాడు. తిరిగి ఆలోచించి ఆ శాపాన్ని పన్నెండు సంవత్సరాల వరకన్నాడు (33) రాజుగూడా కోపంతో ఇట్లన్నాడు - ఇది నాపనికాదు. తెలుసుకోకుండా అనవసరంగా శపించాడు కనుక గురువునే శపిస్తాను (34) అని నీటిని చేతులోకి తీసుకొని గురువును శపించటానికి సిద్ధమయ్యాడు. ఆతని పాదాలపై పడి మదయంతి ఆప్రయత్నాన్ని విరమింపచేసింది (35) ఆమె మాటలమీది గౌరవం కొలది శాపం పెట్టకుండా విరమించాడు. నీటిని పాదములపై వదిలాడు. కాళ్ళు కల్మషమైనాయి (36) నాటినుండి రాజు కల్మషాంఘ్రి (కల్మాషపాదుడు) అని ప్రసిద్ధు డైనాడు. గురుశాపంతో రాక్షసుడై అడవుల పాలైనాడు (37) వాడు ప్రళయకాలమందలి యమునిలా ఘోరమైన రూపాన్ని ఆ రాక్షసుడు ధరించి తిరుగసాగాడు. ఆవనేచరుడు వివిధ జంతువులను, మనుషులు మొదలగు వారిని తినసాగాడు. (38) వాడు ఒకసారి వనంలో ఒకచోట రమిస్తున్న పిల్లలుగా ఉన్న, కొత్తగా పెళ్ళైన మునిదంపతులను చూచాడు. యముడిలాగా ఐ పోయాడు (39) రాక్షసుడు మానుషాహారం గలవాడు. పిల్లవాడైన మునికుమారుని తినటానికి పట్టుకున్నాడు. శాపకారణంగా పెద్దపులి లేడిపిల్లన పట్టుకున్నట్టుగా (40) భర్తను రాక్షసుడు పట్టుకోగా భయపడిన ఆతని భార్య వణికిపోతూ ఏడుస్తూ ఆ బాలదయ కలిగేట్టుగా ఇట్లా అంది (41) సూర్యవంశపు కీర్తిని ధరించేవాడా పాపం చేయొద్దు. నీవు మదయంతికి భర్తవు. ఓ రాజా! నీవు రాక్షసుడవు కావు (42).

మూ || నఖాదమమనుభర్తారంప్రాణాత్‌ ప్రియతమం ప్రభో|ఆర్తానాం శరణార్తానాం త్వమేవహియతోగతిః || 43 ||

పాపానామిహ సంఘాతైః కిమేదుష్టైః జడాసుభిః | దేహేన చాతిభారేణ వినాభర్త్రా మహాత్మనా || 44 ||

మలీమసేన పాపేన పాంచభౌతేన కింసుఖం | బాలోయం వేదవిత్‌ శాంతః తపస్వీబహుశాస్త్ర విత్‌ || 45 ||

అతో7స్య ప్రాణదానేన జగద్రక్షాత్వయాకృతా|కృపాంకురు మహారాజ బాలాయా ంబ్రాహ్మణస్త్రియాం || 46 ||

అనాథ కృపణార్తేషు సఘృణాః ఖలుసాధవః | ఇత్థమభ్యర్థితః | సో7పి పురుషాదః ననిర్‌ ఘృణః || 47 ||

చ ఖాదశిర ఉత్‌ కృత్య విప్రపుత్రం దురాశయః | అథసాధ్వీకృశాదీనా విలప్యభృశదుఃఖితా || 48 ||

ఆహృత్యభర్తురస్థీని చితాంచక్రేవథోల్బణం | భర్తార మనుగచ్ఛంతీ సంవిశంతీ హుతాశనం || 49 ||

రాజానం రాక్షసాకారం శాపాస్త్రేణ జఘానతం | రేరే పార్థివ పాపాత్మన్‌ త్వయామే భక్షితః పతిః || 50 ||

అతఃపతివ్రతాయాన్త్వం శాపంభుం క్ష్వయథోల్బణం | అద్యప్రభృతి నారీషు యదాత్వమపి సంగతః

తదామృతిః తవేత్యుక్త్వా వివేశ జ్వలసంసతీ | || 51 ||

సో7పి రాజాగురోః శాపాముపభుజ్యకృతా వధిం|పునః స్వరూపమాదాయ స్వగృహం ముదితోయ¸° || 52 ||

జ్ఞాత్వా విప్రసతీ శాపం తత్పత్నీ రతిలాలసం | ఏతం నివార యా మాస వైధవ్యాదతి బిభ్యతీ || 53 ||

అసపత్యః స నిర్విణ్ణో రాజ్యభోగేషు పార్థివః | విసృజ్య సకలాం లక్ష్మీం య¸° భూయో7పికాననం || 54 ||

సూర్యవంశ ప్రతిష్ఠిత్యై వసిష్ఠో మునిసత్తమః | తస్యాముత్పాదయామాన మదయంత్యా సుతోత్తమం || 55 ||

వినృష్ట రాజ్యో రాజాపి విచరన్‌ సకలాంమహీం|అయాంతీం పృష్ఠతోప7శ్యత్‌ పిశాచీంఘోరరూపిణిం || 56 ||

తా || ఓ ప్రభు! ఈతడు నాకు ప్రాణములకన్నను ప్రియమైనవాడు. ఇట్టి నా భర్తను తినవద్దు. ఆర్తులకు శరణార్తులకు నీవేగతి (43) పాపముల సంఘాతము వంటి దుష్టమైన అసువులతో నాకేం ప్రయోజనముంది. మహాత్ముడైన భర్తలేకుండా అతి భారమైన ఈ దేహంతో పనేమిటి (44) మలినమైన, పాపకరమైన పాంచభౌతిక దేహంతో నాకేంపని. ఈతడు బాలుడు, వేదముల నెరిగినవాడు, శాంతుడు తపస్వి, బహుశాస్త్రముల నెరిగినవాడు (45) అందువల్ల ఈతనికి ప్రాణదానంచేస్తే నీవు జగత్తునే రక్షించినట్టు. ఓ మహారాజ! దయచూపు బాలనైన ఈ బ్రాహ్మణ స్త్రీ యందు (నాయందు) (46) సాధువులు, అనాథుల యందు, కృపణులయందు ఆర్తులయందు దయకలవారు గదా అని ప్రార్థించగా ఆతడు ప్రార్థించినా ఆ మానుషా హారి దయలేనివాడై (47) దురాశయుడై అవిప్రపుత్రుని తలను చీల్చితిన్నాడు. పిదప ఆసాధ్వి కృశించిదీనురాలై ఏడ్చి చాలా దుఃఖించింది (48) భర్త యొక్క అస్థికలను తీసుకొనిచితినేర్పరచుకొనినది తగినట్లుగా భర్తను అనుసరిస్తూ అగ్నిని ప్రవేశించింది (49) రాక్షసాకారుడైన ఆ రాజును శాపాస్త్రంతో

చంపింది. ఓరోరి! రాజా! పాపాత్ముడా నీవు నా భర్తను భక్షించావు (50) అందువల్ల పతివత్రనైన నాగొప్ప శాపాన్ని అనుభవించు. నేటినుండి నీవు స్త్రీలను కలుసుకుంటే, వెంటనే నీకు మృతివస్తుంది. అని పలికి ఆసతి అగ్నిలో ప్రవేశించింది. (51) ఆ రాజు గురువు శాపంను శాపాంతరమువరకు అనుభవించి, తిరిగి తన రూపాన్ని పొంది ఆనందముతో తన ఇంటికి వెళ్ళాడు(52) విప్రసతి శాపమును తెలుసుకొని అతని భార్యా, రతిలాలసుడైన తన భర్తను నివారించసాగింది. వైధవ్యం వస్తుందనే భయంతో (53) సంతానంలేని ఆరాజు రాజ్యభోగములందు విరాగి ఐనాడు. సమస్త లక్ష్మిని వదలి తిరిగి

ఆరాజు అడవికి వెళ్ళాడు. (54) సూర్యవంశం నిలిచే కొరకు మునియైన వసిష్ఠుడు ఆ మదయంతి యందు ఉత్తమపుత్రుణ్ణి పుట్టించాడు. (55) రాజ్యమును వదలిని ఆ రాజు కూడా భూమినంతా తిరిగి వెనుక వస్తున్న ఘోరరూపంకల పిశాచిని చూశాడు (56).

మూ||సాహిమూర్తియతీఘోరాబ్రహ్మహత్యాదురత్యయా|యదాసౌశాపవిభ్రష్టోమునిపుత్రమభక్షయత్‌ || 57 ||

తేనాత్మ కర్మణా యాంతీం బ్రహ్మహత్యాం సవృష్ఠతః | బుబుధేముని వర్యాణాముపదేశేన భూపతిః || 58 ||

తస్యానిర్వేశమన్విచ్ఛన్‌ రాజానిర్విణ్ణమానసః | నానాక్షేత్రాణి తీర్థాని చచారబహువత్సరం || 59 ||

యదాసర్వేషుతీర్థేషు స్నాత్వాపి చముహూర్ముహుః| నని వృత్తా బ్రహ్మహత్యామిథిలామాయ¸°తదా || 60 ||

బాహ్యోద్యానగతస్తస్యాః చింతయా పరయార్దితః || 60 ||

దదర్శమునిమాయాంతం గౌతమం విమలాశయం | హుతాశన మివాశేష తపస్విజనసేవితం || 61 ||

వివస్వంతమివాత్యంతం ఘనదోషత మోనుదం | శశాంక మివనిః శంకమవదాత గుణోదయం || 62 ||

మహెశ్వర మివశ్రీమద్ద్విజ రాజకలాధరం | శాంతంశిష్య గణోపేతం తపసామేక బాజసం || 63 ||

ఉపసృత్యన రాజేంద్రః ప్రణానామ ముహూర్ముహుః | గౌతమో7 పిమునిశ్రేష్ఠో రాజానం రవివంశజం || 64 ||

అభినంద్యమునిః ప్రీత్యానస్మితం సమభాషత || 65 ||

గౌతమ ఉవాచ -

కచ్చిత్తే కుశలం రాజన్‌ కచ్చిత్తే పదమవ్యయం || 66 ||

కుశిలస్యః ప్రజాః కచ్చిత్‌ అవరోథజనోపివా | కిమర్థమిహ సంప్రాప్తో వినృజ్య సకలాంశ్రియం || 67 ||

కించధ్యాయసిభోరాజన్‌ దీర్ఘముష్టంచ నిశ్న్వసన్‌ || 68 ||

సర్వేకుశలినో బ్రహ్మన్‌ వయంత్వదనుకంపయా | రాజ్ఞాముత్తమ వంశ్యానాం బ్రహ్మయత్తాహిసంపదః

కింనుమాంబాధతే త్వేషా పిశాచీ ఘోరరూపిణీ || 69 ||

అలక్షితా మదపరైః భర్త్సయంతీ పదే పదే | యన్మయా శాపదగ్థేన కృతమంహోదురత్యయం

నశాంతిర్జాయతే తస్య ప్రాయశ్చిత్త సహస్రకైః || 70 ||

తా || తప్పింప వీలుకాని, మూర్తి భవించిన ఘోరమైన బ్రహ్మహత్య ఆమె. ఈతడు శాపవిభ్రష్టుడైనపుడు ముని పుత్రుని భక్షించాడు (57) అందువల్ల తాను చేసిన పనితో వెనుక వస్తున్న బ్రహ్మహత్యనుగా ఆమెను గూర్చి మహర్షుల మాటల వలన ఆ రాజు తెలుసుకున్నాడు (58) ఆమెనిర్వేషమును తెలుసుకోదలచి రాజు వైరాగ్యంతో కూడిన మనస్సు కలవాడై అనేక సంవత్సరములు, అనేక క్షేత్రములకు తీర్థములకు తిరిగినాడు (59) అన్ని క్షేత్రములందు మాటిమాటికి స్నానం చేసికూడా ఆ బ్రహ్మహత్య తిరిగి పోలేదు. అప్పుడు మిథిలకు వచ్చాడు. ఆరాజు. బాహ్య ఉద్యానమందుండి మిక్కిలి బాధపడుతూ చింతించసాగాడు రాజు (60) విమలమైన ఆశయములు కలగౌతముని తనవైపు వస్తుండగా చూచాడు. అగ్నినివలె తపిస్విజనులందరు ఆతనిని సేవిస్తున్నారు (61) సూర్యునివలె మిక్కిలిగా అధికమైన దోషములనే చీకటిని తొలగించేవాడు. చంద్రునివలె ఏ మాత్రం అనుమానంలేకుండా స్వచ్ఛమైన గుణములు కలవాడు (62) శివునివలె శ్రీమత్‌ ద్విజుడనే రాజకళను (చంద్రుని ధరించినవాడు. శాంతం, శిష్యుల గణంతో కూడినవాడు తపస్సుకంతా ఓకేస్థానమాతడు (63) ఆతనిని సమీపించి ఆరాజు మాటిమాటికి నమస్కరించాడు. సూర్యువంశజుడైన ఆరాజును మునిశ్రేష్ఠుడైన ఆ గౌతముడు కూడా (64) అభినందించి నవ్వుతూ ఆముని ప్రేమతో ఇట్లన్నాడు (65) గౌతముడిట్లన్నాడు - ఓరాజ! నీవు కుశలమేనా.నీ స్థానము స్థిరంగా ఉందా (66) నీ ప్రజలు క్షేమంగా ఉన్నారా. అంతఃపురస్త్రీలుకూడా క్షేమంగా ఉన్నారా. సమస్త సంపదలను వదలి ఇక్కడికి ఎందుకొచ్చావు (67) ఓరాజ! దీర్ఘంగా వేడినిట్టూర్పులు విడుస్తూ ఏమి ఆలోచిస్తున్నావు. (68) అనగా రాజిట్లన్నాడు. - ఓ బ్రహ్మన్‌ నీ దయవల్ల మేమంతా క్షేమము. ఉత్తమ వంశస్థులైన రాజులందరికి సంపదలు బ్రహ్మయత్తములు. కాని నన్ను ఈ ఘోరరూపిణియైన పిశాచి బాధిస్తోంది. (69) లక్ష్యం లేకుండా గర్వంతో మాటిమాటికి భయపెడుతూంది. శాపదగ్ధుడనైననేను దాటరాని పాపం చేశాను. దానికి వేయి ప్రాయశ్చిత్తములతో కూడా శాంతి కలగటంలేదు (70).

మూ || ఇష్టాశ్చవి విధాయజ్ఞాః కోశ సర్వస్వ దక్షిణాః | సరిత్సరాంసిస్నాతాని యాని పూజ్యాని భూతలే

నిషేవితాని సర్వాణి, క్షేత్రాణి భ్రమతామయా || 71 ||

జప్తాన్యఖిల మంత్రాణి ధ్యాతాః సకలదేవతాః | మహావ్రతాని చీర్ణాని వర్ణమూల ఫలాశినా || 72 ||

తాని సర్వాణి కుర్వంతి స్వస్థం మాంసకదాచన | అద్యమే జన్మ సాఫల్యం సంప్రాప్తమివలక్ష్యతే || 73 ||

యతః త్వద్దర్శనాదేవ మమాత్మానంద భాగభూత్‌ | అన్విచ్ఛన్‌ లభ##తే క్వాపి వర్ణపూగైర్మనోరథం || 74 ||

ఇత్యేవంజనవాదో7పి సంప్రాప్తో మయిసత్యతాం | ఆజన్మంచితానాంతు పుణ్యానాముదయోదయే || 75 ||

యద్భవాన్‌ భవభీతానాం త్రాతా నయన గోచరః | కస్మాద్దేశాదిహాయాతో భవాన్‌ భవభయావహాః || 76 ||

దూరభ్రమణ విశ్రాంతం శంకేత్వామిహచాగతం | దృష్ట్వాశ్చర్య మివాత్యర్థం ముదితోసి ముఖశ్రియా || 77 ||

ఆనందయసిమేచేతః ప్రేవ్ణూసంభాషణా దివ | అద్యమే తవపాదాబ్జ శరణస్యకృతైననః

శాంతి కురుమహాభాగయేనాహం సుఖమాప్నుయాం || 78 ||

ఇతితేన సమాదిష్టో గౌతమః కరుణానిధిః సమాది దేశఘోరాణాం అఘనాం సాధునిష్కృతిం || 79 ||

గౌతమ ఉవాచ -

సాదురాజేంద్ర ధన్యో7సి మహాఘేభ్యో భయంత్యజ | || 80 ||

శివేత్రాతరిభక్తానాంక్వ భయం శరణౖషినాం | శృణురాజన్‌ మహాభాగక్షేత్రమన్యత్‌ ప్రతిష్ఠితం || 81 ||

మహాపాతక సంహారి గోకర్ణాఖ్యం మనోరమం | యత్ర స్థితిర్న పాపానాం మహద్భ్యోమహతామపి || 82 ||

స్మృతోహ్య శేషపాపఘ్నో యత్రసన్నిహితః శివః | యథాకైలాస శిఖలే యథా మందారమూర్థని || 83 ||

నివాసో నిశ్చితః శంభోః తథాగోకర్ణమండలే | నాగ్నివాన శశాంకేన సతారా గ్రహనాయకైః || 84 ||

తా || అనేక యజ్ఞములు చేశాను. నా ధనా గారము నంతా దక్షిణగా చేశాను. భూమి యందు పవిత్రమైన నదులు, సరస్సులలో స్నానం చేశాను. తిరుగుతూ నేను అన్ని క్షేత్రములను దర్శించాను. (71) అఖిలమంత్రములను జపించాను. దేవతలందరిని ధ్యానించాను. మహావ్రతము లాచరించాను. ఎండుటాకులు, గడ్డలు పండ్లు తింటూ ఉన్నాను (72) అవన్ని కూడా నన్ను ఎప్పుడూ స్వస్థంగా ఉంచలేదు. ఈనాటితో నా జన్మ సాఫల్యత నందినట్లు అన్పిస్తోంది (73) ఎందువల్లనంటే మీ దర్శనంతో నా మనస్సు ఆత్మానందాన్ని పొందింది. కొన్ని సంవత్సరాలకు వెదుకగా, ఎప్పుడో మనోరథాన్ని పొందుతాడు (74) అనే ప్రజల మాట నా విషయంలో సత్యమైంది. అనేక జన్మలనుండి సంపాదించిన పుణ్యము ఫలించినందువల్ల (75) భవభీతులను రక్షించేమీరు నా దృష్టి గోచరమైనారు. ఏ దేశం నుండి ఇక్కడికి వచ్చారు. మీరు సంసార భయనాశకులు (76) మీరాకను గమనిస్తే మీరు చాలా దూరం ప్రయాణించి అలసిపోయానట్లున్నారు. మీముఖంలోని ఆనందంచూస్తుంటే ఆశ్చర్యకరమైనదాన్ని చూపి ఆనందించినట్లుగా కన్పిస్తున్నారు. (77) ప్రేమతో సంభాషించినందువల్ల కలిగే ఆనందంవలె నా మనస్సును ఆనందపరుస్తున్నారు. పాపమాచరించిన నాకు మీ పాదములను శరణు వేడిన నాకు. ఈ వేళ ఓమహాభాగ! శాంతిని ప్రసాదించు. దానివల్ల నాకు సుఖం కలుగనీ (78) అని ఆతడనగా దయగల గౌతముడు ఘోరమైన పాపములకు చక్కని పరిష్కారమును చెప్పాడు. (79) గౌతముని వచనము - మంచిది. ఓ రాజేంద్ర ధన్యుడవైనావు. మహాపాపమునుండి భయపడొద్దు (80) రక్షకుడుగా శివుడుండగా శరణుకోరే భక్తులకు భయమెక్కడిది. ఓ రాజ! మహాభాగ! మరొక క్షేత్రం ప్రతిష్ఠితమైంది విను (81) మహాపాతకములను సంహరించేది మనోరమమైనది, గోకర్ణమను పేరుకలది అక్కడ ఉంటే గొప్పవాటికంటే గొప్పవైన పాపములకు కూడ నాశనమే (82) స్మరిస్తే చాలు పాపములన్నిటిని నశింపచేసేది. అక్కడ శివుడు సన్నిహితుడై ఉన్నాడు. కైలాస శిఖరమందెట్లా ఉన్నాడో, మందారమూర్ఖమందెట్లా ఉన్నాడో అట్లా (83) గోకర్ణమండలంలో శివుని నివాసము నిశ్చితమైంది. అగ్నికాని, చంద్రుడుకాని, నక్షత్ర గ్రహనాయకులుగాని (84)

మూ || తమోనిస్తీర్యతే సమ్యక్‌ యథాసవితృదర్శనాత్‌ | తథైవనేతరైఃతీర్థెః సచక్షేత్రైః మనోరమైః || 85 ||

సద్యః పాపవిశుధ్ధిస్స్యాత్‌ యధాగోకర్ణదర్శనాత్‌| అపిపాపశతం కృత్వాబ్రహ్మహత్యాదిమానవః || 86 ||

సకృత్ర్పవిశ్యగోకర్ణంనభిభేతి హ్యఘాత్‌ క్వచిత్‌ | తత్రసర్వే మహాత్మానః తపసాశాంతి మాగతాః || 87 ||

ఇంద్రోపేంద్ర విరించ్యాద్యైః సేవ్యతేసిద్ధికాంక్షిభిః | తత్రైకేన దినేనాపి యత్కృతః వ్రతముత్తమం || 88 ||

తదస్యత్రాబ్దలక్షేణ కృతం భవతి తత్సమం | యత్రేంద్ర బ్రహ్మవిష్ట్వాది దేవానాం హితకామ్యయా || 89 ||

మహాబలాభిధానేన దేవః సన్నిహితః స్వయం | ఘోరేణతపసాలబ్ధం రావణాఖ్యేన రాక్షసా || 90 ||

తల్లింగం స్థాపయామాన గోకర్ణే గణనాయకః | ఇంద్రో బ్రహ్మాముకుందశ్చ విశ్వే దేవా మరుద్గణాః || 91 ||

ఆదిత్యా వనవోదస్రౌ శశాంకశ్చది వాకరః | ఏతే విమానగతయో దేవాస్తే సహపార్షదైః

|| 92 ||

పూర్వద్వారం నిషేవన్తే దేవదేవస్యశూలినః | యోన్యోమృత్యుః స్వయం సాక్షాత్‌ చిత్రగుప్తశ్చ పాపకః || 93 ||

పితృభిన్సహరుద్రైశ్చ దక్షిణ ద్వారమాశ్రితాః | వరుణః సరితాం నాథోగంగాది సరితాంగణౖః || 94 ||

ఆ సేవతే మహాదేవం పశ్చిమ ద్వారమాశ్రితాః | తథావాయుః కుబేరశ్చదేవేశీభద్ర కర్ణికా || 95 ||

మాతృభిశ్చండికాద్యాభిః ఉత్తరద్వార మాశ్రితా | విశ్వావసుఃచిత్రరథః చిత్రసేనో మహాబలః || 96 ||

సహగంధర్వ వర్గైశ్చ పూజయంతి మహాబలం | రంభాఘృతాచీ మేనాచ పూర్వచిత్తి స్తిలోత్తమా || 97 ||

నృత్యంతి పురతః శంభోః ఉర్వశ్యాద్యాః సురస్త్రియః | వసిష్ఠః కశ్యపః కణ్వోవిశ్వామిత్రోమహాతపాః || 98 ||

తా || సూర్యునిలా చీకట్లను తొలగించలేనట్లుగా అట్లాగే ఇతర తీర్థములుగాని, మనోరమమైన ఇతరక్షేత్రములు కాని (85) పాపముల నుండి శుద్ధిని వెంటనే గోకర్ణక్షేత్రమువలె కల్గించలేవు. నూరు పాపములు చేసినా బ్రహ్మహత్యాదులు చేసినా మానవుడు (86) గోకర్ణంలో ఒకసారి ప్రవేశిస్తే చాలు పాపములనుండి ఎక్కడా భయపడడు. అక్కడ అందరు మహాత్ములు తపస్సు వల్ల శాంతిని పొందారు (87) సిద్ధిని కోరే ఇంద్ర ఉపేంద్ర విరించి మొదలగువారు దానిని సేవిస్తున్నారు. అక్కడ ఒక్కరోజైన సరే ఉత్తమవ్రతమేదైనా చేస్తే (88) అది వేరేచోట్ల లక్షసంవత్సరాలు చేసిన దానితో సమానమౌతుంది. బ్రహ్మవిష్ణ్వాది దేవతల హితము కొరకు (89) దేవుడు మహాబలుడు అను పేరుతో స్వయంగా సన్నిహితంగా ఉన్నాడు. రావణుడను రాక్షసుడు ఘోరతపస్సుతో పొందాడు. (90) ఆ లింగాన్ని గణనాయకుడు గోకర్ణంలో స్థాపించాడు. ఇంద్రుడు బ్రహ్మముకుందుడు విశ్వేదేవులు మరుద్గణములు (91) ఆదిత్యుల, వసువులు, అశ్వినులు (దన్రులు) శశాంకుడు, సూర్యుడు వీరంతా విమానాల్లో వెళుతూ, తమ పరివారంతో పాటు ఈ దేవతలు (92) దేవదేవుడైన శూలి యొక్క పూర్వద్వారాన్ని సేవిస్తారు. మృత్యువు, చిత్రగుప్తుడు, పావకుడు (93) పితృదేవతలతో రుద్రులతో కూడి దక్షిణ ద్వారాన్ని ఆశ్రియిస్తాడు.9 సరిత్తులకు నాథుడైన వరుణుడు గంగాది నదులతో కూడి (94) మహాదేవుణ్ణి పశ్చిమ ద్వార మాశ్రయించి సేవిస్తాడు. వాయువు కుబేరుడు దేవేశి భద్రకర్ణిక ! (95) మాతలతో చండిక మొదలగు వారితో కూడి ఉత్తర ద్వారాన్ని ఆశ్రయిస్తారు. విశ్వావసువు చిత్రరధుడు, చిత్రసేనుడను మహాబలుడు (96) వీరు గంధర్వులతో కూడి మహాబలుని పూజిస్తారు. రంభ, ఘృతాచి, మేనక, పూర్వచిత్తి తిలోత్తమ (97) ఊర్వశి మొదలగు దేవతాస్త్రీలు శంభుని ఎదుట నృత్యం చేస్తారు. వశిష్ఠ కశ్యప కణ్వ విశ్వామిత్రులు మహాతపస్సంపన్నులు (98)

మూ || జైమినిశ్చభరద్వాజోజాబాలిః క్రతురంగిరాః|ఏతేవయంచ రాజేంద్ర సర్వే బ్రహ్మర్షయో7మలాః || 99 ||

దేవం మహాబలం భక్త్యా సమంతాత్‌ పర్యుపాస్మహె | మరీచినా సహాత్రిశ్చ దక్షాద్యాశ్చమునీశ్వరాః || 100 ||

సనకాద్యా మహాత్మాన ఉపవిష్టా ఉపాసతే | తథైవ మునయుః సాధ్యా అజినాబంర ధారిణ || 101 ||

దండినోవ్రతముండాశ్చ స్నాత కాబ్రహ్మచారిణః | త్వగస్థి మాత్రావ యవాః తపసాదగ్థ కిల్బిషాః || 102 ||

సేవన్తే పరయా భక్త్యాదేవదేవం పినాకినం | తథాదేవాః సగంధర్వాః పితరః సిద్ధ చారణాః || 103 ||

విద్యాధరాః కింపురుషాః కిన్నరా గుహ్యకాఖగాః | నాగాః పిశాచా వేతాలా దైతే యాశ్చ మహాబలాః || 104 ||

నానావిభవ సంపన్నా నానా భూషణ వాహనాః | విమానైః సూర్య సంకాశైః అగ్ని వర్ణైః శశిప్రబైః || 105 ||

విద్యుత్పుంజనిభైరన్యైః సమంతాత్పరివారితం | ప్రస్తువంతి ప్రగాయంతి పఠంతి ప్రణమంతిచ || 106 ||

ప్రనృత్యంతి ప్రహృష్యంతి గోకర్ణే పృథివీపతే | లభంతే7భీప్సితాన్‌ కామాన్‌ రమంతే చయథాసుఖం || 107 ||

గోకర్ణ సదృశం క్షేత్రం నాస్తి బ్రహ్మాండ గోలకే | తత్రఘోరంతపస్తప్త మగస్త్యేన మహాత్మన || 108 ||

తథాసనత్కుమారేణ ప్రియవ్రతనుతైరపి | అగ్నినా దేవవర్యేణ కందర్పేణ చపార్థివ || 109 ||

తథాదేవ్యా భద్రకాల్యా శిశుమారేణ ధీమతా| దుర్ముఖేన ఫణీంద్రేణ మణినాగాహ్వయేనచ || 110 ||

ఇలావర్తాది భిర్నాగైః గరుడేన బలీయసా | రక్షసా రావణనాపి కుంభకర్ణాహ్వయేనతు || 111 ||

విభీషణన పుణ్యన తపస్తప్తం మహాత్మనా | ఏతేచాన్యేచ గీర్వాణాః సిద్ధ దానవమానవాః || 112 ||

తా || జైమిని, భారద్వాజుడు జాబాలిక్రతువు అంగిరుడు, వీరు మేము ఓ రాజేంద్ర! అందరు స్వచ్ఛమైన బ్రహ్మర్షులము. (99) మహాబలుడైన దేవుని భక్తితో అంతటా ఉపాసిస్తున్నాము మరీచితో కూడా అత్రి దక్షాదిమునీశ్వరులు (100) సనకాది మహాత్ములు కూర్చొని ఉపాసిస్తారు. అట్లాగే మునులు జింకచర్మము ధరించిన వారు సాధ్యులు (101) దండినులు, వ్రతులు, ముండులు, స్నాతకులు, బ్రహ్మచారులు, చర్మము బొక్కలు మాత్రమే మిగిలిన అవయవములవారు తపస్సుతో పాపములు కాలిపోయినవారు (102) వీరంతా దేవదేవుడైన పినాకిని మిక్కిలి భక్తితో సేవిస్తున్నారు. అట్లాగే దేవతలు, గంధర్వులు,పితరులు, సిద్ధచారణులు (103) విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, గుహ్యకులు ఖగులు (పక్షులజాతి), నాగులు, పిశాచులు, వేతాళులు, మహాబలులైనదైతేయులు (104) వీరంతా అనేక వైభవములతో కూడి, అనేక భూషణములు, వాహనములు కలవారై, సూర్యునిలా వెలిగే విమానములు, అగ్నివర్ణముగలవి, చంద్రుని లా కాంతిగలవి (105) మెరుపు తీగల వంటివి ఇతరములై నటువంటి వాటితో చుట్టూ చుట్టుముట్టి శివుని పొగుడుతున్నారు. శివునిగూర్చి పాడుతున్నారు. పఠిస్తున్నారు. శివుని నమస్కరిస్తున్నారు (106) నాట్యం చేస్తున్నారు. ఆనందిస్తున్నారు. ఓ మహారాజ! గోకర్ణమందు ఇట్లా చేస్తున్నారు. అభీప్సితమైన కోరికలను పొందుతున్నారు. సుఖంగా ఆనందిస్తున్నారు (107) బ్రహ్మాండగోళమందు గోకర్ణ క్షేత్రంతో సమానమైన క్షేత్రములేదు. అగస్త్యమహాముని అక్కడ ఘోరమైన తపమాచరించాడు (108) అట్లాగే సనత్కుమారుడు, ప్రియవ్రతనుతులు తపమాచరించారు ఓ రాజ! దేవవర్యుడైన అగ్ని కందర్పుడు తపమాచరించారు (109) దేవియైన భద్రకాళి, ధీమంతుడైన శింశుమారుడు, దుర్ముఖుడు, మణినాగాహ్వయుడను ఫణీంద్రుడు తపమాచరించారు (110) ఇలా వర్తుడు మొదలగు నాగులు, బలవంతుడైన గరుడుడు రాక్షసుడైన రావణుడు, కుంభకర్ణుడు కూడా తపమాచరించారు (111) మహాత్ముడైన పుణ్యుడైన విభీషణుడు కూడా తపమాచరించాడు. వీరు, ఇతర దేవతలు సిద్ధదానవ మానవులు తపమాచరించారు (112).

మూ ||గోకర్ణే దేవదేవేశం శివమారాధ్యభక్తితః | స్వనామాంకాని లింగాని స్థాపయిత్వా సహస్రశః || 113 ||

లేభిరే పరమాం సిద్థింతధా తీర్థాని చక్రిరే | అత్రస్థానాని సర్వేషాం దేవానాం సంతిపార్దివ || 114 ||

విష్ణోశ్చ దేవదేవస్య బ్రహ్మణః పరమేష్ఠినః | కార్తికే యస్యవీరస్యగజవక్త్రస్య చానఘ || 115 ||

ధర్మస్యక్షేత్రపాలస్య దుర్గాయాశ్చ మహామతే | గోకర్ణే శివలింగాని విద్యంతే కోటికోటిశః || 116 ||

అసంఖ్యాతాని తీర్థాని తిష్ఠంతిచ పదేపదే | బహునాత్ర కిముక్తేన గోకర్ణస్థాని పార్థివ || 117 ||

సర్వాణ్యశ్మానిలింగాని తీర్థాన్యం భాంసిసర్వశః | గోకర్ణే శివలింగానాం తీర్థానామపిభూరిశః || 118 ||

గీయతే మహిమా రాజన్‌ పురాణషు మహర్షిభిః | గోకర్ణే కోటి తీర్థంచ తీర్థానాం ముఖ్యతాంగతం || 119 ||

సర్వేశాం శివలింగానాం సార్వభౌమో మహాబలః | కృతే మహాబలః శ్వేతః త్రేతాయామతి లోహితః || 120 ||

ద్వాపరే పీతవర్ణశ్చ కలౌశ్యామోభవిష్యతి | ఆcకాంతం సప్తపాతాలం కుర్వన్నపి మహాబలః || 121 ||

ప్రాప్తే కలియుగే ఘోరే మృదుతాము పయాస్యతి| పశ్చిమాంబుధితీరస్థంగోకర్ణక్షేత్రముత్తమం || 122 ||

బ్రహ్మహత్యాది పాపాని దహతీతికిమద్భుతం | యేచాత్ర బ్రహ్మహంతారోయేచ భూతద్రుహఃశఠాః || 123 ||

యే సర్వగుణ హీనాశ్చ పరదారరతాశ్చయే | యే దుర్వృత్తా దురాచారాదుః శీలాకృపణాశ్చయే || 123 ||

లుబ్థాః క్రూరాః ఖిలాః మూఢాః స్తేణశ్చై వాతికామినః | తే సర్వేప్రాప్యగోకర్ణం స్నాత్వా తీర్థ జలేషుచ || 124 ||

దేవం మహాబలం దృష్ట్వా ప్రయాతాః శాంకరం పదం | తత్రపుణ్యాసుతిథిషు పుణ్యర్‌ క్షేపుణ్యవానరే || 126 ||

తా || గోకర్ణ మందు దేవదేవేశుడైన శివుని భక్తితో ఆరాధించి తనపేరుగల లింగములను వేల కొలది స్థాపించి (113) పరమమైన సిద్ధిని పొందారు. అట్లాగే తీర్థములను చేశారు. ఇక్కడ అందరు దేవతలకు స్థానములున్నాయి, ఓ రాజ! (114) విష్ణువునకు దేవదేవునకు బ్రహ్మకు పరమేష్ఠికి, వీరుడైన కార్తికేయునకు, గజవక్తృనకు (115) క్షేత్ర పాలుడైన ధర్మునకు, దుర్గకు గోకర్ణమందు కోట్లకోట్ల కొలది శివలింగములున్నాయి (116) అడుగడుగున లెక్కింపరాని తీర్థములున్నాయి. ఓ రాజ! గోకర్ణంలో ఉన్నవాటిని గూర్చి ఎక్కువగా చెప్పి ఏం ప్రయోజనము (117) అన్ని రాళ్ళు లింగములే అన్ని నీళ్ళు తీర్థములే. గోకర్ణంలో శివలింగముల మహిమ (118) ను ఎక్కువగా పురాణములలో మహర్షులు పాడుతున్నారు. గోకర్ణంలో కోటి తీర్థము తీర్థములన్నిటిలో ముఖ్యమైనదిగా చెప్పబడింది (119) అన్ని శివలింగములకు సార్వభౌమము మహాబలము. కృతయుగంలో మహాబలము శ్వేత వర్ణము, త్రేతాయుగమందు ఎరుపు వర్ణము (120) ద్వాపరమందు పీతవర్ణము, కలియుగ మందు నలుపు వర్ణంగా ఔతుంది సప్తపాతాళముల వరకు ఆక్రమించి ఉంది మహాబలము. (121) కలియుగంలో మృదుత్వాన్ని పొందుతుంది. పశ్చి సముద్ర తీరంలోని గోకర్ణము ఉత్తమమైనది (122) బ్రహ్మహత్యాదిపాపములను కాల్చివేస్తుంది అనటంలో ఆశ్చర్యమేముంది. ఇక్కడ బ్రహ్మహంతలు ఎవరున్నారో భూతద్రోహంచేసేశఠులున్నారో (123) అన్ని విధముల గుణహీనులెవరున్నారో, పరదారరతులున్నారో, చెడునడవడికవారు, దురాచారులు, దుశ్శీలులు, కృపణులు (124) లుబ్ధులు క్రూరులు, ఖలులు, మూఢులు, దొంగలు, అతికాములు, వాళ్ళం తాగో కర్ణానికి వచ్చి తీర్థజలములందు స్నానం చేస్తే (125) మహా బలదేవుని చూచిన, శంకరుని స్థానమును చేరుకుంటారు. అక్కడ పుణ్య తిథులందు పుణ్యన క్షత్రమందు, పుణ్యవానరమందు (126).

మూ||యే7ర్చయంతిమహేశానంతేరుద్రాఃస్యుఃనసంశయః|యదాకదాచిద్గోకర్ణంయోవాకోవాపిమానవః || 127 ||

ప్రవిశ్యపూజయే దీశం సగచ్ఛేత్‌బ్రహ్మణః ఫదం | రవీందు సౌమ్య వారేషు యదాదర్శోభవిష్యతి || 128 ||

తదాజలనిధౌ స్నానం దానంచ పితృతర్పణం | శివపూజాజపోహోమో వ్రతచర్యాద్విజార్చనం || 129 ||

యత్కించి ద్వాకృతం కర్మతదనంతఫలప్రదం | వ్యతీపాతాది యోగేషు రవిసంక్రమణషుచ || 130 ||

మహాప్రదోష వేలాసు శివపూజా విముక్తిదా | అదైకాంతే ప్రవక్ష్యామితిథిం పార్థివ ముక్తిదాం || 131 ||

యస్యాంకిలమహావ్యాధోలేభే శంభోః పరంపదం | మాఘమాసే మహాపుణ్యాయా సాకృష్ణ చతుర్దశీ || 132 ||

శివలింగం బిల్వపత్రం దుర్లభంహి చతుష్టయం | అహోబలవతీమాయా యయాశైవీ మహాతిధిః || 133 ||

నోపోష్యతేజనైర్మూడైః మహామూకైరివత్రయి | ఉపవాసోజా గరణం సన్నిధిః పరమేశితుః || 134 ||

గోకర్ణం శివలోకస్యనృణాం సోపాన పద్ధతిః | శృణు రాజన్నహమపి గోకర్ణాదధునాగతః || 135 ||

ఉపాసై#్యనాం శివతిథిం విలోక్యచమహోత్సవం | అస్యాం శివతి ధౌసర్వే మహోత్సవ దిదృక్షవః || 136 ||

ఆగతాః సర్వదేశేభ్యః చాతుర్వర్ణ్యా మహాజనాః | స్త్రియోవృద్ధాశ్చ బాలాశ్చ చతురాశ్రమ వాసినః || 137 ||

ఆగత్య దృష్ట్వా దేవేశం లేభిరే కృతకృత్యతాం | అథాహమప్యమీ శిష్యా ఋషయశ్చతథా7రే ||1 138 ||

రాజర్ష యశ్చరాజేంద్ర సనకాద్యాః సురర్షయః | స్నాత్వా సర్వేషు తీర్థేషు సముపాస్య మహాబలం || 139 ||

లబ్థ్వాచజన్మసాఫల్యం ప్రయాతాః సర్వతోదిశం | అమునాద్యనరేంద్రేణ జనకేన యియక్షుణా || 140 ||

నిమంత్రితో7హం సంప్రాప్తోగోకర్ణాచ్ఛివ మందిరాత్‌ ప్రత్యాగమం కిమప్యంగ దృష్ట్వాశ్చర్య మహంవథి

మహానందేన మనసా కృతార్థో7స్మి మహీపతే || 141 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే గోకర్ణ మహిమాను వర్ణనం నామ ద్వితీయో7ధ్యాయః || 2 ||

తా || మహెశుని అర్చించిన వారు రుద్రులౌతారు. అనుమానంలేదు. ఎప్పుడో ఒకప్పుడ ఎవడో ఒక మనిషి గోకర్ణమును (127) ప్రవేశించి, శివుని పూజిస్తే వాడు బ్రహ్మపదమును చేరుకుంటాడు. ఆది సోమ బుధవారములందు అమావాస్య ఏర్పడితే (128) అప్పుడు సముద్రమందు స్నాము దానము, పితృతర్పణము, శివపూజ, జపము, హోమము, వ్రతచర్యబ్రాహ్మణపూజ (129) ఏ కొంచమైనా చేసినకర్మ అనంతఫలాన్ని ఇస్తుంది. వ్యతీపాతయోగములందు, రవి సంక్రమణములందు (130) మహాప్రదోష సమయములందు శివపూజచేస్తే అదిముక్తినిస్తుంది. ఓ పార్థివ! ఇంకా ముక్తి నిచ్చే ఒక తిథిని గూర్చి నీకుచెబుతాను. (131) అతిథి యందు మహావ్యాథుడు శంభువుయొక్క ఉత్తమ స్థానాన్ని పొందాడు. మాఘమాసమందు మహాపుణ్యప్రదమైన కృష్ణచతుర్దశి యందు (132) శివలింగము బిల్వపత్రము ఈ నాల్గు దుర్లభములు. మాయమహా,బలవత్తరమైంది. శైవ తిథియందు (133) ఎవరు ఉపవసించరో వారు మూఢులు. మూగవారు వేదం వల్లించలేనట్లు, ఉపవాసము, జాగరణము పరమేశ్వరుని సన్నిధి (134) గోకర్ణము, ఇవి నరులకు శివలోకమునకు మెట్లు. ఓ రాజ! విను నేను ఇప్పుడు గోకర్ణం నుండే వచ్చాను (135) అతనిని ఉపాసించి, శివతిథి ఆచరించి, మహోత్సవమునుచూచి వచ్చాను. ఈ శివతిథి యందు అంతా మహోత్సవాన్ని చూడాలనుకునేవారే (136) వారంతా చాతుర్వర్ణ్యముల జనులు అన్ని దేశముల నుండి వచ్చారు. స్త్రీలు, వృద్ధులు, బాలురు, చతురాశ్రమ(నాల్గు) వాసులు (137) వచ్చి దేవేశుని చూచి తమనుతాము కృతకృత్యులైనట్లుగా భావించుకున్నారు. నేను కూడా, ఈశిష్యులూ, అట్లాగే ఇతర ఋషులు (138) రాజర్షులు, సనకాది సురర్షులు, వారంతా అన్ని తీర్థములో స్నానంచేసి మహాబలుని వద్ద ఉపవసించి (139) జన్మసాఫల్యాన్ని పొంది అన్ని దిక్కులకు వెళ్ళి పోయారు. ఈ వేళ యజ్ఞం చేయదలచిన ఈ జనకరాజుతో (140) నిమంత్రింపబడి, నేను శివమందిరమైన గోకర్ణము నుండి వచ్చాను. వస్తూదారిలో ఏదో ఒకటి చూచి చాలా ఆశ్చర్యపడ్డాను. ఓరాజ! మహానందమైన మనస్సుతో కృతార్థుడినైనాను. (141) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మోత్తర ఖండమందు గోకర్ణ మహిమ వర్ణనమనునది ద్వితీయో7ధ్యాయము || 2 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters