Sri Scanda Mahapuranamu-3    Chapters   

తృతీయ అధ్యాయము

మూ || రాజోవాచ -

కిందృష్టం భవతా బ్రహ్మన్నాశ్చర్యం పథికుత్రవా|తన్మహాఖ్యాహియేనా హంకృతకృత్యత్వమాప్నుయాత్‌ || 1 ||

గౌతమ ఉవాచ -

గోకర్ణాదహమాగచ్ఛన్‌ క్వాపిదేశే విశాంపతే | జాతేమధ్యాహ్న సమయే లబ్థవాన్‌ విమలంనరః || 2 ||

తత్రోపస్పృశ్య సలిలం వినీయచ వధిశ్రమం | సుస్నిగ్థ శీతలచ్ఛాయంస్యగ్రోధం సముపాశ్రయం || 3 ||

అథావి దూరే చాండాలీంవృద్థామంధాంకృశాకృతిం | శుష్యస్ముఖీం నిరాహారాం బహురోగని పీడితాం || 4 ||

కుష్ఠవ్రణ పరీతాంగీముద్యత్‌ కృమికులాకులాం | పూయశోణిత సంసక్త జరత్‌ పటల సత్కటీం || 5 ||

మహాయక్ష్మగలస్థేన కంఠసం రోధవిహ్వలాం | వినష్టదంతా మవ్యక్తాం విలుంఠతీం ముహుర్ముహుః || 6 ||

చండార్క కిరణ స్పృష్ట ఖరోష్ణ రజసాప్లుతాం | విణ్మూత్ర పూయదిగ్థాంగీ అసృగ్గంధదురాసదాం || 7 ||

కఫరోగబహుశ్వాస శ్లథన్నాడీబహువ్యథాం | విధ్వస్త కేశావ యవాం అవశ్యం మరణోన్ముఖీం || 8 ||

తాదృగ్వ్యధాంచతాం వీక్ష్యకృపయాహం పరిప్లుతః | ప్రతీక్షన్‌ మరణం తస్యాః క్షణంత త్రైవ సంస్థితః || 9 ||

అథాంతరిక్ష పదవీం సించంతమివరశ్మిభిః | దివ్యం విమాన మానీతమద్రాక్షం శివకింకరైః || 10 ||

తస్మిన్‌ రవీందు వహ్నీనాం తేజసామివపంజరే | విమానే సూర్య సంకాశాన పశ్యం శివకింకరాన్‌ || 11 ||

తేవైత్రిశూల ఖట్వాంగ టంకచర్మాసి పాణయః | చంద్రార్థ భూషణాః సాంద్రచంద్రకుందోరువర్చనః || 12 ||

కిరీటకుండలభ్రాజత్‌ మహాహివలయోజ్జ్వలాః | శివానుగామయా దృష్టాశ్చత్వారః శుభలక్షణాః || 13 ||

తానాపతత ఆలోక్య విమానస్థాన్‌ సువిస్మితః | ఉపనృత్యాంతికేవేగాత్‌ అపృచ్ఛంగగనే స్థితం || 14 ||

నమోనమోవస్త్రిదశోత్తమేభ్యఃత్రిలోచనశ్రీచరణానుగేభ్యః |

త్రిలోకరక్షావిధిమావహద్భ్యఃత్రిశూలచర్మాసిగధాధరేభ్యః || 15 ||

విదితాహి మయా యూయం మహేశ్వర పదానుగాః | ఇయం వోలోకరక్షార్థాగతిరామోవినోదజా || 16 ||

ఉతసర్వ జనాఫ°ఘవిజయాయ కృతోద్యమాఃబ్రూత కారుణ్యతో మహ్యంయస్మాద్యూయమిహాగతాః || 17 ||

శివదూతా ఊచుః -

ఏషాగ్రే దృశ్యతే వృద్ధాచాండాలీ మరణోన్ముఖీ | ఏతామానే తుమాయాతాః సందిష్టాః ప్రభుణావయం || 18 ||

ఇత్యుక్తే శివదూతైసై#్తః అపృచ్ఛం పునరవ్యహం | విస్మయా విష్టచిత్తస్తాన్‌ కృతాంజలి రవస్థితః || 19 ||

అహోపాపీయసీఘోరా చాండాలీ కథమర్హతి | దివ్యం విమాన మారోఢుం శునీవాధ్వర మండలం || 20 ||

తా || రాజిట్లనెను - ఓ బ్రహ్మన్‌ ! మీరు మార్గంలో ఆశ్చర్యకరమైనది ఏమి చూచారు. ఎక్కడ చూచారు. దానిని నాకు చెప్పండి దానిని విని నేను కృతకృత్యుడనౌతాను. అనిఅనగా (1) గౌతముడిట్లన్నాడు - ఓరాజ! గోకర్ణంనుండి నేను వస్తూ ఒకచోట, మధ్యాహ్నాసమయంకాగా స్వచ్ఛమైనసరస్సునుచూశాను (2) అక్కడనీటిని ముట్టిప్రయాణపు బడలికను తీర్చుకొనిదట్టమైనచల్లనినీడగల మఱ్ణివృక్షాన్ని ఆశ్రయించాను (3) అక్కడికి కొద్దిదూరంలోచండాలస్త్రీని. వృద్ధురాలినిగుడ్డి, దానిని, కృశించిన ఆకారంగల దానిని వాడినముఖంగలదానిని, ఆహారంలేనిదానిని, అనేకరోగములతో పీడింపబడిన దానిని, అనేకరోగములతో పీడింపబడిన దానిని (4) శరీరమంతా కుష్ఠురోగపు పుండ్లుగల దానిని, పైకి వస్తున్న పురుగులతో ఆకులమైనదానిని, చీము, నెత్తురుకలిగిన ముసలితనంగలిగిన నడుముగలదాన్ని (5) క్షయతోకూడినందునగొంతుతడబడిబాధపడుతున్న దానిని, రాలిపోయినపండ్లుగలదానిని, అవ్యక్తురాలిని, మాటిమాటికిపొర్లుతున్నదానిని (6) ఉగ్రుడైన సూర్యుని కిరణములతో తాకబడిన తీక్ణమైన దుమ్ముతోకప్పబడినదానిని, మలమమూత్రముచీమువీటితోపూయబడిన శరీరంగల దానిని, రక్తపువాసనతోచేరరానిదానిని (7) కఫరోగంతోఅతిఉచ్ఛ్వాసంతోపడిపోయిననాడిగలదానిని అనేక భాదలు గల దానిని, జారిపోయిన వెంట్రుకలు, అవయవములుకలదానినిమరణమునకు దగ్గరలో ఉన్నదానిని చూచాను (8) అటువంటి బాధగల ఆమెను చూచి నేను దయగల వాడనైనాను. ఆమెమరణముకై ఎదిరిచూస్తూ క్షణకాలంఅక్కడేఉన్నాను. (9) తనకిరణములతో అంతరిక్షస్థానాన్ని తడుపుతున్నట్లుగాఉన్న, శివకింకరులు తీసుకువస్తున్నదేవవిమానాన్నిచూచాను (10) అందులో సూర్యచంద్రులు అగ్నివీరితేజస్సుల వలె పంజరంలో విమానంలో సూర్యునిలాగా వెలిగే శివకింకరులను చూచాను (11) వారుత్రిశూలము, ఖట్వాంగము, (కపాలము) కత్తి, ఒర, చర్మము (డాలు) కత్తిచేతధరించిఉన్నారు. సగము చంద్రుని భూషణముగాధరించారు. దట్టమైనచంద్రకుందములవంటికాంతులుగలవారు (12) కిరీట కుండల ములతోవెలిగిపోతున్నారు. సర్పమునువలయముగాకలిగిఉన్నారు. శివునిఅనుచరులు. శుభలక్షణములు గలవారిని నలుగురినినేనుచూచాను (13) విమానమందున్నకిందికివస్తున్నవారినిచూచినేను చాలా ఆశ్చర్యపడ్డాను. వేగముగావారిని సమీపించి ఆకాశమందున్నవారినిఅడిగాను (14) మీకుత్రిదశోత్తములకునమస్కారము త్రిలోచనునిశ్రీచరణములను అనుసరించేమీకు నమస్సులు త్రిలోకరక్షావిధిని వహించేవారు. త్రిశూలము, డాలు, కత్తి, గదధరించినవారుమీరు (15) మీరుమహెశ్వరునిపాదములను అనసరించు వారనితెలిసిందినాకు. లోకరక్షణ కొరకైనదామీప్రయాణముకాక ఆనందాన్నికల్గించేందుకా (16) కాకసర్వజనులపాపరాశిని నశింపచేసేందుకుప్రయత్నిస్తున్నారా. మీరిక్కడికెందు కొచ్చారోదయతో నాకుచెప్పండి (17) అని అనగా శిదూతలుఇట్లన్నారు -ఈమె, ముందరకన్పిస్తున్నది ముసలిస్త్రీ. చండాలస్త్రీ. చావసిద్ధంగా ఉంది.ఈమెనుతీసుకుపోవటానికివచ్చాము, ప్రభువుమమ్ములను ఆజ్ఞాపించాడు (18) అని శివ దూతలు అనగాతిరిగినేనిట్లాఅడిగాను. మనస్సంతా ఆశ్చర్యంతోనిండిపోగా, వారికెదురుగాచేతులుజోడించినిలిచి ఇట్లన్నాను (19) ఈమె పాపాత్మురాలు. ఘోరమైనది, చండాలస్త్రీ, ఈమెఎట్లాఅర్హురాలు. యజ్ఞవేదిపైకి అధ్వర్యులమధ్యకు, కుక్కలాగా ఈమెవిమానము ఎక్కుటకు ఎట్లాఅర్హురాలు (20)

మూ || ఆజన్మతో7శుచిప్రాయాంపాపాంపాపానుగామినీం| కథమేనాందురాచారాంశివలోకాంనినీషద || 21 ||

అస్యానాస్తిశివజ్ఞానంనాస్తిఘోరతరంతపః | సత్యంనాస్తిదయానాస్తికథమేనాంనినీషథ || 22 ||

పశుమాంసకృతాహారంవారుణీపూరితోదరాం| జీవహింసారతాంనిత్యంకధమేనాంనినీషథ || 23 ||

నచపంచాక్షరీజప్తానకృతంశివపూజనం | సధ్యాతోభగవాన్‌శంభుఃకధమేనాంనీనిషధ || 24 ||

నోపోషితాశివతిధిఃసకృతంశివపూజనం| భూతసౌహృదంసజానాతినచబిల్వశివార్పణం

నేష్టాపూర్తాదికంవాపికధమేనాంనినీషధ || 25 ||

సచస్నాతానితీర్థానినదానానికృతానిచ | సచవ్రతానిచీర్ణానికధమేనాంసనీషథ || 26 ||

ఈక్షణపరిహర్తవ్యాకిముసంభాషణాదిషు| సత్సంగరహితాంచండాంకధమేనాంనినీషధ || 27 ||

జన్మాంతరార్జితంకించిత్‌అస్యాఃసుకృతమస్తివా| తత్కధంకుష్ఠరోగేణకృమిబిఃపరిభూయతే || 28 ||

ఆహోఈశ్వరచర్యేయందుర్విభావ్యాశరీరిణాం| | పాపాత్మానో7పినీయంతేకారుణ్యాత్పరమంపదం || 29 ||

ఇత్యుక్తాస్తేమయాదూతాదేవదేవవస్యశూలినః| | ప్రత్యూచుర్మామధప్రీత్యాసర్వసంశయంభేదినం || 30 ||

శివదూతాఊచుః -

cబహ్మన్‌సుమహదాశ్చర్యంశృణుకౌతూహలంయది| ఇమాముద్దిశ్యచాండాలీంయదుక్తంభవతాధునా || 31 ||

ఆసీదియంపూర్వభ##వేకాచిద్ర్బాహ్మణకన్యకా| | సుమితరానామనంపూర్ణసోమబింబసమాననా || 32 ||

ఉత్ఫుల్లమల్లికాదామనుకుమారాంగలక్షణా | కైకేయద్విజముఖ్యస్యకన్యచిత్తనయాసతీ || 33 ||

తాంసర్వలక్షణోపేతాంరతేర్మూర్తిమివావరాం|వర్థమానాం పితుర్గేహెవీక్ష్యాసన్విస్మితాజనాః || 33 ||

దినేదినేవర్థమానాఃబంధుభిర్లాలితాభృశం| సాశ##నైఃయవ్వనంభేజేస్మరస్యేవమహాధనుః || 34 ||

అధసాబంధువర్షైశ్చసమేతేనకుమారికా | పిత్రాప్రదత్తాకసై#్మచిద్విధినాద్విజసూనవే || 35 ||

సాభర్తామనుప్రాప్యనవ¸°వ్వనశాలినీ | కంచిత్కాలంశుభాచారారేమేబంధుభిరావృతా || 37 ||

అధకాలపశాత్తస్యాఃపతిఃతీవ్రరుజార్దితః | రూప¸°వనకాంతోపిపంచత్వమగమన్మునే || 38 ||

మృతేభర్తరిదుఃఖేనవిదగ్థహృధయానతీ | ఉవాసకతిచిన్మాసాన్‌సుశీలావిజితేంద్రియా || 39 ||

అథ¸°వనభారేణజృంభమాణసనిత్యశః| బభూవహృదయంతస్యాఃకందర్పపరికంపితం || 40 ||

తా || పుట్టినప్పటినుండిఅశుచిప్రాయురాలు. పాపిని. పాపులనుఅనుసరించేది. దురాచారురాలైన ఇటువంటిఈమెను శివలోకానికిఎట్లాతీసుకెళతారు (21) ఈమెకుశివజ్ఞానములేదు. ఘోరమైనతపస్సుచేయలేదీమె. సత్యముదయ ఈమెకు లేవు. ఈమె నెట్లాతీసుకెళతారు. (22) పశుమాంసమును ఆహారంగాతీసుకుంటోంది. కల్లుతోకడుపునింపుకుంటోంది. జీవహింసచేసేదిరోజు, ఈమెనెట్లాతీసుకెళుతారు (23) పంచాక్షరీజపంఈమెచేయలేదు. శివపూజచేయలేదు. శివునిధ్యానించ లేదు. ఈమెనెట్లాతీసుకెళుతారు. (24) శివతిధిన ఉపవసించలేదు. శివపూజచేయలేదు భూతదయ అంటేఈమెకుతెలియదు.శివునకుబిల్వపత్రాన్నిఅర్పించటం ఈమెకుతెలియదు. ఇష్టాపూర్తాదియాగములుతెలియవు. మరిఈమెనెట్లా తీసుకెళుతారు. (25) తీర్థములలోస్నానంచేయలేదు. దానాలుచేయలేదు. వ్రతాలు ఆచరించలేదు. ఈమెనెట్లా తీసుకెళతారు. (26) చూడటమేతగదు ఈమెను మాట్లాడటం అంతకన్నతగదు. సత్సంగంలేని, చండాలురాలైన ఈమెనుఎట్లాతీసుకెళతారు. (27) పూర్వజన్మలలోసంపాదించిన పుణ్యం ఏమైనాఉందా అట్లాగేతే కుష్ఠురోగంతో పురుగులతో ఎందుకుభాదింపబడుతోంది (28) ఇదిఈశ్వరచర్య. శరీరధారులుతప్పించుకోరానిదిది. పాపాత్ములుకూడాదయతో పరమపదానికి తీసుకు పోబడుతారా (29) అనినేను వారితోఅనగా, ఆదేవ దేవుడైన శివుని దూతలునాతోఅన్నిసంశయములుభేదిస్తూ ప్రేమతోఇట్లన్నారు (30) శివదూతలవచనము -ఓ బ్రహ్మన్‌! నీకు వినాలనేకుతూహలముంటేచాలా ఆశ్చర్యకరమైనదానినివిను. ఈచండాలిని ఉద్దేశించినీ విప్పుడు ఏమిఅన్నావోగదా (31) పూర్వజన్మలోఈమెఒకబ్రాహ్మణకన్యక సుమిత్ర అనిపేరు. సంపూర్ణచంద్రునివలెముఖంగలది. (32) వికసించిన మల్లెపూలమాలవలె సుకుమారమైన అంగములుకలది. కైకేయద్విజునకుతనమ ఈమె ఈస్త్రీ (33) అన్ని లక్షణములు గల ఈమెను అపరరతీదేవివలెఉన్నదానిని, తండ్రి ఇంటిలో పెరుగుతున్న దానిని జనులుచూచిఆశ్చర్యపడ్డారు (34) రోజురోజుకు పెరుగుతూ, బంధువులతో బాగాలాలింపబడుతూ ఆమెమెల్లగా మన్మధునిధనస్సులాగా ¸°వ్వనాన్ని పొందింది (35) బంధువర్గంతోకూడిన ఆకుమారికనువిధివశాత్తు ఒక బ్రాహ్మణకుమారునకు తండ్రిఇచ్చాడు (36) నవ¸°వ్వనంగల ఆమె భర్తనుపొంది శుభాచారంగలదైబంధువులు కూడి ఉండగా సుఖించింది (37) కౌలవశంవల్ల- ఆమెభర్త తీవ్రమైన రోగంతోబాధపడి, రూప¸°వ్వనములతో అందగాడైనా చనిపోయాడు, ఓ ముని! (38) భర్తచనిపోగా దుఃఖంతో హృదయం దగ్థంకాగా సుశీలగావిజితేంద్రియగాకొన్ని మాసములు ఉంది (39) ఇక ¸°వనంతో ప్రతిరోజు పెరిగిపోతూన్న ఆమె హృదయంమన్మథునితో కంపించిపోయింది (40)

మూ ||సాగుప్తాబంధువర్గేణ శాసితాపిమహోత్తమైః| నశశాకమనోరోద్ధుంమదనాకృష్టమంగనా || 41 ||

పాతీవ్రమన్మధావిష్టారూప¸°వనశాలినీ | విధవాపివిశేషేణజారమార్గరతాభవత్‌ || 42 ||

నజ్ఞాతాకేనచిదపిజారిణీతివిచక్షణా | జుగూహాత్మడురాచారం కంచిత్కాలమసత్తమా || 43 ||

తాందోహదసమాక్రాంతాంఘననీలముఖస్తనీం| కాలేనబంధువర్గోపిబుబోధవిటదూషితాం || 44 ||

ఇతి భీతోమహాక్లేశాత్‌ చింతాంలేభేదురత్యయాం| స్త్రియఃకామేననశ్యంతిబ్రాహ్మణాహీనసేవయా || 45 ||

రాజానోబ్రహ్మదండేనయతయోభోగసంగ్రహాత్‌| లీఢంశునాతదైవాన్నంసురయావార్పితంయః || 46 ||

రూపంకుష్ఠురుజావిష్టంకులనశ్యతికుస్త్రియా | ఇతిసరర్వేసమాలోచ్యసమేతాః వతిసోదరాః || 47 ||

తత్యజుఃగోత్రతోదూరంగృహీత్వాసకచగ్రహం|నఘటోత్సర్గము త్సృష్టాసానారీసర్వబంధుభిః || 48 ||

విచరంతీచశూద్రేణరమమాణారతిప్రియా| సాయ¸°స్త్రీబహిర్‌గ్రామాత్‌దృష్టాశూద్రేణకేనచిత్‌ || 49 ||

సతాందృష్ట్వావరారోహాంపీన్నోసతపయోధరాం| గృహంనినాయసామ్నాచవిధవాంశూద్రనాయకః

సానారీతస్యమహిషీభూత్వాతేనదివానిశం || 50 ||

రమమాణాక్విచిద్దేశేస్యవసత్‌గృహవల్లభా | తత్రసాపిశితాహారానిత్యమాపీతవారుణీ || 51 ||

లేభేసుతంచశూద్రేణరమమాణారతిప్రియా | కదాచిద్భర్తరిక్వాపియాతేపీతసురాతుసా || 52 ||

ఇయేషపిశితాహారంమదిరామదవిహ్వలా | అధమేషేషుబద్ధేషుగోభిఃసహబహిర్‌వ్రజే || 53 ||

య¸°కృపాణమాదాయసాతమోంథేనిషాముఖే| అవిమృశ్యమదావేశబుద్ధ్యామిషప్రియా || 54 ||

ఏకంజఘానగోవత్సంక్రోశంతనిశిదుర్భగా| నిహతంగృహమానీయజ్ఞాత్వాగోవత్సమంగనా || 55 ||

భీతాశివశివేత్యాహకేనచిత్పుణ్యకర్మణా | సాముహూర్తమితిధ్యాత్వాపిశితాసవలాలసా || 56 ||

ఛిత్వాతమేవగోవత్సంచకారాహారమీప్సితం | గోవత్సార్థశరీరేణకృతాహారాధసాపునః || 57 ||

తదర్థదేహంనిక్షిప్యబహిశ్చుక్రోశ##కైతవాత్‌| అహోవ్యాఘ్రేణభగ్నో7యంజగ్థోగోవత్సకోవ్రజే || 58 ||

ఇతితస్యాఃసమాక్రందఃసర్వగేహెషుశుశ్రువే| అధసర్వేశూద్రజనాఃసమాగమ్యాంతికేస్థితాః || 59 ||

హంతగోవత్సమాలోక్యవ్రాఘ్రేణతిశుచంయుయుః | గతేషుతేషుసర్వేషువ్యుష్టాయాంచతతోనిశి || 60 ||

తా||మహోత్తములైనబంధువర్గంఆమెనురహస్యంగాశాసించినామదనునితోఆకర్షింపబడ్డ ఆస్త్రీ తనమనసును అరికట్టుకోలేకపోయింది. (41) రూప¸°వనములుగల ఆమె తీవ్రంగా మన్మధావిష్ఠురాలై విశేషించి విధవ ఐనా జార మార్గాన్న సుసరించింది (42) విచక్షణగల ఆమెజారిణీ అని ఎవ్వరితో గుర్తింపబడలేదు. అసత్తమురాలామె కొంత కాలంవరకు తన దురాచారాన్ని కప్పిపుచ్చుకొంది (43) దోహదములు (గర్భిణిలక్షణాలు) ఆమెనాక్రమించాయి. ముఖముస్త నములు మేఘం వలెనల్లబడ్డాయి. కొంతకాలానికిబంధువర్గం కూడాఆమెను విటదూషితురాలుగా తెలుసుకున్నాయి (44) బంధువర్గము భయపడిమహాక్లేశంతో ఎడతెగని దుఃఖాన్ని పొందింది. స్త్రీలు కామంతోనశిస్తారు. బ్రాహ్మణులు హీనసేవతో నశిస్తారు (45) రాజలుబ్రహ్మదండనతో నశిస్తారు. యతులుభోగములను కూర్చుకొనటంవల్లనశిస్తారు. కుక్కముట్టిన అన్నము, నురతోకలిసిన పాలు (46) కుష్ఠురోగంతోకూడిన రూపముచెడిపోతాయి. అట్లాగేకుస్త్రీలతో కులమునశిస్తుంది. అని అందరు ఆలోచించి పతి సోదరులంతా ఏకమై (47) ఆమెను కొప్పుపట్టిఈడుస్తూ ఆమెను గోత్రం నుండిదూరంగా వదిలారు. ఘటోత్సర్గంతో పాటు (ఒకకర్మ) ఆమెబంధువులందరితో విడువబడి (48) తిరుగుతూ రతిప్రియై శూద్రునితో పాటురమించసాగింది. ఆమెగ్రామంనుండి బయటకువెళ్ళింది.ఆమెను మరొకశూద్రుడుచూచాడు (49) వాడు బలిసిన ఎత్తైన రొమ్ములుగల ఆవరారోహనుచూచి ఆ శూద్రనాయకుడు ఆవిధవను మంచి మాటలతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె అతని పెద్ద భార్యయై (రాణీ)వానితో రాత్రింబగళ్ళు (50) రమిస్తూ గృహమునకు అధికారిణియైఒకచోటఉంది. అక్కడ ఆమె మాంసంభుజిస్తూ రోజుకల్లుతాగుతూ 51) రతిప్రియయై అశూద్రునితో రమిస్తూ ఒకకొడుకునుకన్నది. ఒకసారిభ##ర్తెక్కడికోవెళ్ళగా ఆమెకల్లుతాగి (52) మదిరామదంతో చంచలయై మాంసాన్ని ఆహారంగాకావాలనుకొంది బహిఃప్రదేశంలో (కొట్టంలో) ఆవులతో పాటుమేకలను కట్టేసిఉంచితేచూచి (53) ఆచిమ్మ చీకట్లోరాత్రిపూట, ఆమెకత్తి తీసుకొనివెళ్ళింది. మదావేశంతోఆలోచించకుండా మాంసమందలిప్రేమతో మేకఅనుకొని (54) ఒక ఆవు దూడను ఎడుస్తున్నదాన్నిచంపింది, రాత్రిపూట ఆదుర్భగ చంపినదాన్ని ఇంటికి తీసువచ్చి దానినిలేగగా ఆమెగ్రహించి (55) భయపడిఏదోకొంచంపుణ్యంకర్మఉన్నం దువల్లశివశివఅనిపలికింది. ఆమె కొంచంసేపు ఆలోచించి, మాంసము రక్తమువీటిపైఆశతో (56) ఆగోవత్సమునేచీల్చితనకిష్ట మైనఆహారంగా చేసుకుంది లేగ యొక్క సగం శరీరంతోఆమె ఆహారాన్నిచేసుకొని (57) ఆలేగమిగిలినసగం శరీరాన్ని అక్కడ పెట్టిబయటికెళ్ళి కపటంగా ఆరవ సాగింది. ఒకపులికొట్టంలోని ఈలేగదూడను చంపివేసింది అని (58) ఆమెఅరుపుఅందరి ఇళ్ళల్లోకి వినిపించింది. ఆపిదప శూద్రులంతా వచ్చి ఆమెదగ్గర నిలబడ్డారు (59) గోవత్సమును చూచి పులిదీన్ని చంపేసిందని దుఃఖించారు. వాళ్ళంతా వెళ్ళాక ఆరాత్రిగడిచాక (60)

మూ||తద్భర్తాగృహమాగత్యదృష్టవాన్‌గృహవిడ్వరం| ఏవంబహుతిధేకాలేగతేసాశూద్రవల్లభా || 61 ||

కాలస్యవశమాపన్నాజగామయమమందిరం| యమోపిధర్మమాలోక్యతస్యాఃకర్మచపౌర్వికం || 62 ||

నిర్వర్త్యనిరయావాసాత్‌చక్రేచండాలజాతికాం| సాపిభ్రష్టాయనుపురాత్‌చండాలీగర్బమాశ్రితా || 63 ||

తతోబభూవజాత్యంధాప్రశాంతాంగారమేచకా| తత్పితాకోపిచాండాలోదేశేకుత్రచిదాస్థితః || 64 ||

తాంతాదృశీమపిసుతాంకృపయాపర్యపోషయత్‌| అభోజ్యేసకదన్నేనశునాలీఢేనపూతినా || 65 ||

అపేయైశ్చరసైర్మాత్రాపోషితాసాదినేదినే | జాత్యంధాసాపికాలేనబాల్యుకుష్ఠరుజార్దితా || 66 ||

ఊఢానకేనచిద్వాపిచాండాలేనాతిదుర్భగా | అతీతబాల్యేసాకాలేవిధ్వస్తపితృమాతృకా || 67 ||

దుర్భగేతిపరిత్యక్తాబంధుభిశ్చసహోదరైః | తతఃక్షుధార్దితాదీనాశోచన్తీవిగతేక్షణా || 68 ||

గృహీతయష్టిఃకృచ్ఛ్రేణసంచబాలసలోష్టికా| పత్తనేష్విపిసర్వేషుయాచమానాదినేదినే || 69 ||

చాండాలోచ్ఛిష్టపిండేన జఠరాగ్నిమతర్పయత్‌| ఏవంకృచ్ఛ్రేణమహతానీత్వాసుబహులంవయః || 70 ||

జరయాగ్రస్తసర్వాంగీదుఃఖమాపదురత్యయం | నిరన్నపానవననాసాకదాచిన్మహాజవాన్‌ || 71 ||

ఆయాస్యంత్యాశివతిథౌగచ్ఛతోబుబుధే7ధ్వగాన్‌|తస్యాంతుదేవయాత్రాయాందేశ##దేశాంతయాయినాం || 72 ||

విప్రాణాంసాగ్రిహోత్రాణాంనస్త్రీకాణాంమహాత్మనాం| రాజ్ఞాంచసావరోధానాంసహస్తిరధవాజినాం || 73 ||

సపరీవారఘోషాణాంయానఛత్రాదిశోభినాం| తధాన్యేషాంచవిట్‌శూద్రసంకీర్ణానాంసహస్రశః || 74 ||

హనతాంగాయతాంక్వాపినృత్యతామధిధావతాం| జిఘ్రతాంపిబతాంకామాద్గచ్ఛతాంప్రతిగర్జతాం || 75 ||

సంప్రయాణమనుష్యాణాంసంభ్రమఃసుమహానభూత్‌| ఇతిసర్వేషుగచ్ఛత్సుగోకర్ణంశివమందిరం || 76 ||

పశ్యంతిదివిజాఃసర్వేవిమానస్థాఃసకౌతుకాః| అధేయమపి చాండాలీవననాశనతృష్ణయా || 77 ||

మహాజనాన్‌యాచయితుంచచాలచశ##నైఃశ##నైః| కరావలంభేనాన్యస్యాఃప్రాగ్జన్మార్జితకర్మణా

దినైఃకతిపయైర్యాంతీగోకర్ణంక్షేత్రమాయ¸° || 78 ||

తతోవిదూరేమార్గస్యనిషణ్ణావివృతాంజలిః| యాచమానాముహుఃపాంధాన్‌బభాషేకృపణంవచః || 79 ||

పాగ్జన్మార్జితపాపౌఘైఃపీడితాయాశ్చిరంమమ| ఆహారమాత్రదానేనదయాంకురుతభోజనాః || 80 ||

తా||ఆమెభర్తింటికివచ్చిగృహమందలివిటశ్రేష్టురాలినిచూచాడు.కొంతకాలంగడిచాకఆశూద్రస్త్రీ (61) కాలాధీనమై యముని మందిరానికివెళ్ళింది. యముడుధర్మాన్నిచూసి ఆమెపూర్వకర్మనుచూసి(62 )నరకంనుండి విడిచిపుచ్చి చండాల జాతి దానినిగాచేశాడు. ఆమెభ్రష్టయైయమపురంనుండి వచ్చి చాండాలిగర్భాన్నిఆశ్రయించింది (63) ఆపిదపజాత్యంధు రాలైంది. (పుట్టుగడ్డి) చల్లారినఅగ్నిలా నల్లగాఐంది. ఆమెతండ్రిఒకచండాలుడు దేశంలోఎక్కడోఉన్నాడు (64) అటువంటిదాన్నైనా ఆబిడ్డనుదయతో పోషించింది తల్లి. తినతగనిచెడిపోయిన కుక్కముట్టినదుర్గంధమైన అన్నంతో(65) తాగరానిచారుమొదలగు వానితో తల్లి ఆపిల్లనుపోషించింది. పుట్టుగుడ్డి ఆమె చిన్నతనం నుండే కుష్టు వ్యాధితో బాధపడసాగింది. (66) ఏచండాలుడు ఆమెనుపెళ్ళిచేసుకోలేదు. అతిదుర్భగ ఆమె, ఆమెబాల్యంగడిచాక ఆమెతలిదండ్రులనువదిలిపెట్టింది (67) దుర్భగ అని బంధవులుసహోదరులు ఆమెనువదిలారు. పిదప ఆకలితో దీనురాలై దుఃఖిస్తూచూపులేనిదై (68) చేతకట్టెప్టుకొని చేతమట్టిపాత్రధరించి కష్టంమీదతిరగసాగింది. పట్టణాల్లో కూడా ప్రతిరోజుయాచిస్తూ తిరుగసాగింది. (69) చండాలులు ఇచ్చిన ఎంగిలిపిండంతోఆకలినితృప్తిపరచింది. ఇట్లా చాలా కష్టంమీద చాలాజీవితాన్ని గడిపి (70) ముసలితనంతోఅన్ని అవయవములు ఆక్రమింపబడగా ఎడతెగని దుఃఖాన్ని పొందింది.అన్నపానవస్త్రములులేకుండా ఆమె ఒకసారి మహాజనులను (71) ఆయాసపడుతూ శివతిథి యందు(గోకర్ణమునకు)వెళ్ళే అధ్వగులనుగూర్చి తెలసుకొంది. ఆదేవయాత్రయందు దేశ##దేశాంతరములనుండి వెళ్ళేవారనిచూచింది (72) వారువిప్రులు, అగ్నిహోత్రంకలవారు, ఆడవాళ్ళు తోడున్నారు. మహాత్ములు, రాజులు అంతఃపుర స్త్రీలతో నున్నారు.ఏనుగులు రధములు గుఱ్ఱములతోడున్నాయి (73) పరివారఘోష ఉంది. యానచ్ఛత్రాదులతో శోభిస్తున్నారు. అట్లాగే విట్‌ శూద్రులు ఇతరులు అన్నిరకాలవారువేలకొలది ఉన్నారు (74) వారంతా నవ్వుతూ పాడుతూ నాట్యంచేస్తూ, పరుగెత్తుతూ ఉన్నారు. వాసనచూస్తూ, తాగుతూ, స్వేచ్ఛంగావెళ్తూప్రతిగర్జనచేస్తూ ఉన్నారు. (75) ఈప్రయాణంలో మనుషులసందడిచాలాఎక్కువైంది అని అంతా గోకర్ణానికివెళ్తుంటే శివమందిరానికివెళ్తుంటే (76) దేవతలంతా విమానాల్లోకూర్చొని కౌతుకంతో చూస్తున్నారు. ఇకచండాలికూడా వస్త్రము, భోజనము, దప్పికతో బాధపడుతూ (77) ఈమహాజనాన్ని యాచించటానికి మెల్లమెల్లగా కదిలింది. మరోస్త్రీ చేతిసాయంతో పూర్వజన్మలో చేసిన కర్మవశంవల్లకొన్నిరోజులువెళ్తూవెళ్తూ గోకర్ణక్షేత్రానికిచేరింది (78) మార్గానికికొద్ది దూరంలో కూర్చొని చేతులు చాచియాచిస్తూ మాటిమాటికిబాటసారులతో దీనంగామాట్లాడసాగింది (79) పూర్వజన్మలో సంపాదించిన పాపసమూహంతో చాలానాళ్ళనఉండి పీడింపబడ్డనాకు ఆహారాన్నిచ్చినామీద దయచూపండి ఓ జనులార! (80)

మూ||త్రాతారఃపరమార్తానాందాతారఃపరమాశిశాం| కర్తారోబహుపుణ్‌యానాందయాంకురుతభోజనాః || 81 ||

వననాశనహీనాయాంస్వపితాయాంమహీతలే| మహాపాంసునిమగ్నాయాందయాంకురుతభోజనాః || 82 ||

మహాశీతాతపార్తాయాంపీడితాయాంమహాఋజా|అంధాయాంమయివృద్ధాయాందయాంకురుతభోజనాః || 83 ||

చిరోపవానదీప్తాయాంజఠరాగ్నివివర్థనైః| నందహ్యమానసర్వాంగ్యాందయాంకురుతభోజనాః || 84 ||

అనుపార్జితపుణ్యాయాంజన్మాంతరశ##తేష్వపి| పాపాయాంమందభాగ్యాయాందయాంకురుతభోజనాః || 85 ||

ఏవమభ్యర్థయంత్యాస్తుచాండాల్యాః ప్రనృతేం7జలౌ|ఏకఃపుణ్యతమఃపాంధఃప్రాక్షిపద్బిల్వమంజరీం || 86 ||

తామంచలౌనిపతితాంసావిమృశ్యపునఃపునః| అభ##క్ష్యేత్యేవమత్వాథదూరేప్రాక్షివదాతురా || 87 ||

తస్యాఃకరేణననిర్ముక్తారాత్రౌసాబిల్వమంజరీ | పపాతకస్యచిద్దిష్ట్యాశివలింగస్యమస్తకే || 88 ||

సైవంశివచతుర్దశ్యాంరాత్రౌపాంధజనాన్ముహుః| యాచమానాపియత్కించిత్‌నలేభేదైవయోగతః || 89 ||

తత్రోషితానయారాత్రిఃభద్రకాల్యాస్తుపృష్టతః|కించిదుత్తరతః స్థానంతదర్ధేనాతిదూరతః || 90 ||

తతఃప్రభాతేభ్రష్టాశాశోకేసమహతాప్లుతా | శ##నైఃనివవృతేదీనాస్వేదేశాయైవకేవలా || 91 ||

శ్రాంతాచిరోపవాసేననిపతంతీపదేపదే | క్రందతీబహురోగార్తావేపమానాభృశాతురా || 92 ||

దహ్యమానార్కతాపేననగ్నదేహాసయష్టికా | అతీత్యైతావతీంభూమింనిపపాతవిచేతనా || 93 ||

అథవిశ్వేశ్వరఃశంభుఃకరుణామృతవారిధిః | ఏనామానయతేత్యస్మాన్‌యుయు జేసవిమానకాన్‌ || 94 ||

ఏషాప్రవృత్తిఃచాండాల్యాఃతవేహపరికీర్తితా | తధాసందర్శితాశంభోః కృపణషు కృపాలుతా || 95 ||

కర్మణః పరిపాకోత్థాం గతింపశ్య మహామతే | అధమాపిపరంస్థానం ఆరోహతి నిరామయం || 96 ||

యదేతయా పూర్వభ##వేనాన్న దానాదికం కృతం క్షుత్పిపాసాదిభిః క్లేశైః తస్మాదిహనిపీడ్యతే || 97 ||

యదేషే మదవేగాంధా చక్రేపాపంమహోల్బణం | కర్మణాతేనజాత్యంధా బభూవాత్రైవ జన్మని || 98 ||

అపివిజ్ఞాయగోవత్సం యదేషా7భక్షయత్పురా | కర్మణాతేన చాండాలీ బభూవేహ విగర్హితా || 99 ||

యదేషార్య పథంహిత్వా జారమార్గరతాపురా | తేనపాపేనకేనాపి దుర్వృత్తా దుర్భగాపివా || 100 ||

తా || పరమార్తులనురక్షించేవారా! పరమ ఆశీస్సులనుఇచ్చేవారా! బహుపుణ్యములకుకర్తలైనవారా ! ఓ జనులార! దయచూపండి(81) వస్త్రములు, తిండిలేనిదాన్ని భూమిపై పడున్నదాన్ని, దుమ్ములోకొట్టుకుపోతున్నదాన్ని, ఓ జనులారా!నాపైదయచూపండి (82) గొప్పచలి ఎండవీటితో బాధపడుతున్నదాన్ని గొప్పరోగంతోపీడింపబడినదాన్ని, గుడ్డిదాన్ని, వృద్ధురాలిని అట్టినాపైజనులార! దయచూపండి (83) చాలానాళ్ళనుండి ఉపవాసంవల్లనాజఠరాగ్నిదీప్తయైపెరుగతోంది. అవయవాలన్నీ మండిపోతున్నాయి. అట్టినాపై ఓజనులార ! దయచూపండి (84) నూర్లకొలది జన్మలలో కూడా పుణ్యము సంపాయించని, పాపురాలిని మందభాగ్యురాలిని, అట్టినాపైదయజూపండి, ఓ జనులార ! (85) ఈ విధముగా అభ్యర్థిస్తూచాండాలి, చేతులుచాచగా ఒకపుణ్యాత్ముడైనబాటసారిబిల్వమంజరినిపారవేశాడు (86) తనకొంగులో పడ్డదానినిఆమెమాటిమాటికి స్పృశించి తినేవస్తువనిభావించిపిదప తొందరగా దూరంగావిసిరేసింది (87) ఆమేచేతినుండి విడువబడి రాత్రిపూట ఆ బిల్వమంజరి ఒక శివలింగపుతలలో అదృష్టవశాత్తు పడింది (88) ఆమె ఈ విధంగా శివచతుర్దశిరాత్రి యందు బాటసారులను మాటిమాటికి యాచిస్తూన్నా కూడా దైవయోగంవల్ల ఏమీపొందలేకపోయింది (89) భద్రకాళివెనుక ఆమె ఆరాత్రి నివసించింది. కొద్దిగా ఉత్తరదిక్కులో ఒక స్థానంలో ఆవిగ్రహానికి సగంలో కొద్దిదూరంలో ఉంది (90) ఆపిదప తెల్లవారి ఆశలన్ని నశించి అతి దుఃఖంతో బాధపడుతూ స్వదేశమునకు దీనంగా మెల్లగా మరలింది (91) చాలా ఉపవాసంతో అలసిపోయింది అడుగడుగునా పడిపోసాగింది. ఏడుస్తూ, అనేకరోగాలతో బాదపడుతూ, వణుకుతూ, మిక్కిలితో ట్రుపడ సాగింది (92) సూర్యునివేడిమితో బాధపడిపోతూ శరీరంనగనంకాగా చేతకట్టెధరించి కొంతదూరం వచ్చి చైతన్యంలేకుండా పడిపోయింది. (93) ఆపిదప విశ్వేశ్వరుడు శంభువు దయకుఅమృతవారిధి, ఈమెనుతీసుకురండిఅని విమానంతో పాటుమమ్ములనునియమించాడు (94) ఇది ఈ చాండాలి యొక్క నడక నీకీవిషయం ఇక్కడచెప్పాను. ఇట్లాకృపణులయందు కృపశివునికృపచూపబడింది. (95) ఓ మహామతి! కర్మపరిపాకంవల్లకల్గినగతినిచూడు. అధమయైనా,నిరామయమైన ఉత్తమస్థానాన్ని చేరుతుంది (96) ఈమెపూర్వజన్మలో అన్నదానంచేయలేదు. అందువల్ల ఇప్పుడు ఆకలిదప్పులతో బాదపడు తోంది (97) ఈమెమదవేగంత గుడ్డిదైచాలా ఘోరమైన పాపంచేసింది. అందువల్లనే జాత్యంధురాలైంది, ఈ జన్మలో (98) గోవత్సమనితెలిసికూడా ఈమె ఇదివరలో భక్షించింది ఆకర్మతో ఈజన్మలో నిందింపబడిన చాండాలిగా జన్మించింది. (99) ఈమెపూర్వము సజ్జనుల మార్గాన్ని జారమార్గాన్ని అనుసరించింది. ఆకారణంగా చెడు నడవడిక కలిగి దుర్భగ ఐంది (100)

మూ || యదాశ్లిష్యమదావిష్టాజారేణవిధవాపురా | తేనపాపేనమహతా బహుకుష్ఠవ్రణాన్వితా || 101 ||

కామార్తాయదియంసై#్వరం శూద్రేణరమితావురా | మహాసృక్‌ పూయకృమిభిః పీడ్యతేతేనపాప్మనా || 102 ||

సువ్రతానినచీర్ణానినేష్టాపూతాదికంకృతం | సర్వభోగవిహీనేయందూయతేతేనపాప్మనా || 103 ||

యదేతయాపూర్వభ##వేసురాపీతావిమూఢయా | మహాయక్షార్తిహృచ్ఛూలైః పీడ్యతేతేనపాప్మనా || 104 ||

అత్రైవసర్వమర్త్యేషుపాపచిహ్నానికృత్స్నశః | లక్ష్యంతేమునిశార్దూలసవివేకైః మహాత్మభిః || 105 ||

అత్రయేబహురోగార్తాయేపుత్రధనవర్జితాః | || 106 ||

యేచదుర్లక్షణక్లిష్టాయాచకావిగతహ్రియః| వాసోన్నపానశయనభూషణాభ్యంజనాదిభిః || 107 ||

హీనావిరూపానిర్విద్యావికలాంగాఃకుభోజనాః| యేదుర్భాగ్యానిందితాశ్చయేచాన్యేపరసేవకాః || 108 ||

ఏతేపూర్వభ##వేసర్వేసుమహత్పాపకారిణః| ఏవంవిమృశ్యయత్నేనదృష్ట్వాలోకజనస్థితిం || 109 ||

బుధోనకురుతేపాపంయదికుర్యాత్పఆత్మహా| దేహో7యంమానుషోజంతోఃబహుకర్మైకభాజనం || 110 ||

సదాసత్కర్మసేవేతదుష్కర్మసతతంత్యజేత్‌|పుణ్యంసుఖార్థీకుర్వీత దుఃఱార్థీపాపమాచరేత్‌ || 111 ||

ద్వయోరేకతరోలోకేగృహీతేకుశలోజనః | ఇబంమానుషమాశ్రిత్యదేహంపరమదుర్లభం || 112 ||

యఆత్మహితవాన్‌ కశ్చిత్‌దేవమేకంసమాశ్రయేత్‌ | అధపాపానిసర్వాణికుర్వన్నపినదానరః || 113 ||

శివమేకమతిర్‌ధ్యాయేత్‌ససంతరతిపాతకం| మృతాపూర్వభ##వేత్వేషాయదాప్రాప్తాయమాలయే || 114 ||

తదావితర్కఃసుమహాన్‌ఆసీద్యమసభాసదాం | యద్యపిబ్రాహ్మణీత్వేషాసత్కులాచారదూషితా || 115 ||

అతో7స్మాభిరిహానీతానిరయంయాతువాసవా | అనయాసాధితోబాల్యేపుణ్యలేశో7స్తివానవా || 116 ||

అధాపినువిమృశ్యైవంధార్యోదండో7త్రనాన్యధా | బహుజన్మసహస్రేషుకృతపుణ్యవిపాకతః || 117 ||

నృణాంబ్రహ్మకులేజన్మలభ్యతేహికధంచన|అతోస్యాఃపూర్వ పూర్వేషుకృతాఘంనాస్తిజన్మను || 118 ||

అన్యధాసత్కులేజన్మకథమేషాప్రవద్యతే| అత్రైవజన్మన్యసయాకృతమంహోదురత్యయం || 119 ||

అధాపినరకావాసంప్రాయశోనేయమర్హతి|కింతుగోవత్సకం హత్వావిమృశ్యాగతసాధ్వసా || 120 ||

ఏషాశివ శివేత్యాహప్రాగ్జన్మార్జితకర్మణా || 121 1/2 ||

తా || మదంతో ఆవేశంపొంది విధవగా పూర్వంజారుణ్ణికౌగిలించుకొంది. ఆగొప్పపాపంతోగొప్పకుష్ఠువ్యాదిని పొందింది. (101) కామార్తయైఈమెపూర్వముశూద్రునితోస్వేచ్ఛగారమించింది.బాగారక్తముచీము పురుగులతోఆపాపంతోపీడింపబడింది (102) మంచివ్రతములుచేయలేదు.ఇష్టాపూర్తాదియాగములుచేయలేదు.ఆకారణముగా ఆపాపంతో ఏభోగములు లేకుండా ఈమెదూషించబడింది (103) విమూఢయైన ఈమె పూర్వజన్మలోకల్లుతాగింది. ఆపాపంకారణంగా క్షయరోగం భాదతో హృయదశూలంతోపీడింపబడింది(104) ఇక్కడేమర్త్యులందరిలోఅన్ని విధములా పాపచిహ్నములే వివేకులైన మహాత్ములు చూస్తున్నారు, ఓమునిశార్దూల ! (105) ఇక్కడ అధికరోగములతో బాధపడేవారు ఎవరున్నారో పుత్రధనములు లేనివారు ఎవరున్నారో (106) దుర్లక్షణములతోక్లిష్టమైనవారెవరున్నారో, సిగ్గులేనివారు యాచకు లెవరున్నారో, వాసము, అన్నము, పానము, శయనము, భూషణములు, అభ్యంజనాదులులేని వారుఎవరున్నారో (107) విరూపులు, నిర్విద్యులు, వికలాంగులు, కుభోజనులు ఎవరున్నారో దుర్భాగ్యులు, నిందితులు, వరసేవకులు ఎవరున్నారో (108) వీరంతా పూర్వజన్మ లోచాలా పాపంచేసినవారు అని ఆలోచించి ప్రయత్నపూర్వకంగా లోకజనస్థితినిచూచి (109) బుధుడు (పండితుడు) పాపంచేయడు. ఒకవేళ చేస్తేవాడు ఆత్మనుచంపుకున్నవాడే. ఈమానవదేహము ప్రాణికిఅనేకకర్మలకు స్థానము (110) ఎప్పుడూ సత్కర్మలనేచేయాలి. దుష్కర్మను ఎల్లప్పుడు వదలాలి. సుఖమును కోరేవాడు పుణ్యంచేయాలి. దుఃఖం కోరేవాడు పాపమాచరించాలి. (111) కుశలుడైనజనుడు లోకంలో రెంటిలో ఒకటిగ్రహిస్తాడు. పరమదుర్లభ##మైన ఈమానుష దేహాన్ని ఆశ్రయించి (112) ఆత్మహితాన్ని కోరేనరుడు ఒకదేవుని ఆశ్రయించాలి నరుడుఎల్లపుడూఅన్ని పాపములుచేసినా (113) శివుని ఏకాగ్రచిత్తంతోధ్యానించాలి. అతడు పాతకాలను దాటుతాడు. పూర్వజన్మలో మరణించిన ఈమె యమాలయానికి వచ్చినప్పుడు (114) యమసభాసదులకు చాలా చర్చ వచ్చింది. ఈమెబ్రాహ్మణియైనా సత్కులా చారంతో దూషితమైంది. (115) అందువల్లమేము ఇక్కడికితీసుకవచ్చాము నరకానికివెళ్ళాలా వద్దా. ఈమెబాల్యంలోసంపాదించిన పుణ్యలేశముఉందాలేదా (116) చాలాబాగావిచారించి శిక్షను విధించండి. మరొరకంగా కాదు బహూజన్మసహస్రములలో చేసిన పుణ్యపరిపాకంవల్ల (117) నరులకు బ్రాహ్మణకులంలో ఏదో విధంగా జన్మ లభిస్తుంది. అందువల్ల ఈమె పూర్వజన్మలలో పాపంచేయలేదు (118) లేకపోతే ఈమెకు సత్కులంలో జన్మ ఎట్లా లభిస్తుంది. ఈజన్మలోనే ఈమెదాటరాని పాపంచేసింది (119) ఐనా ఈమెనరకని వాసమునకు తరచుగా అర్హముకాదు. ఈమె గోవత్సకమును చంపింది. ఆలోచించి భయంతో (120) పూర్వజన్మలో సంపాదించిన కర్మవల్ల ఈమె శివశివ అని పలికింది (1201/2)

మూ || యదేషా పాపవిచ్ఛిత్యైసకృదప్యురుమంగలం || 121 ||

శివనామవదేద్భక్త్యాతర్హిగచ్చేత్పరంపదం ఏకజన్మకృతస్యాస్యదారుణస్యాపియత్ఫలం || 122 ||

క్రమేణానుభవత్వేషాభూత్వాచాండాలజాతికా | అస్మాదన్యతమఃకోవానరకో7స్తినృణామిహ || 123 ||

అనేకక్లేశసంఘాతైఃయన్ముహుఃపరిపీడనం | దుష్కులేజన్మదారిద్ర్యంమహావ్యాధిర్విమూఢతా || 124 ||

ఏకైక ఏవనరకఃసర్వేవాబాధకింపునః | ప్రాగ్జన్మపుణ్యభారేణయన్నామవివశా7బ్రవీత్‌ || 125 ||

తేనైషాన్యభ##వేభూరిపుణ్యమంతేకరిష్యతి | తేనపుణ్యనమహతానిస్తీర్యాఫ°ఘయాతనాః || 126 ||

నీతాతత్పురుషైరంతేప్రయాస్యతివరంపదం | ఏతాదృశానాం మర్త్యానాంశాస్తారోనవయంక్వచిత్‌

విచార్యస్వయమేవేశోయద్యుక్తంతత్కరోతునః || 127 ||

ఏవంవైవస్వతపురేసర్వైర్యమపురోగమైః | విమృశ్యచిత్రగుప్తాద్యైఃఇయంముక్తా7వతద్భువి || 128 ||

ఆదౌయదేషాశివనామ నారీప్రమాదతోవాప్యనతీజగాద |

తేనేహభూయఃసుకృతేనశంభోఃబిల్వాంకురారాధన పుణ్యమాప || 129 ||

శ్రీగోకర్ణేశివతిధావుపోష్యశివమస్తకే | కృత్వాజాగరణంహ్యేషాచక్రేబిల్వార్పణంనిశి || 130 ||

అకామతఃకృతస్యాస్యపుణ్యసై#్యవచయత్ఫలం | అద్యైవభోక్ష్యతేసేయంపశ్యతస్తవనోమృషా || 131 ||

గౌతమ ఉవాచ -

ఇత్యుక్త్వాశివదూతాస్తేతస్యాఃచాండాలయోషితః | జీవలేశంసమాకృష్యయయుజుః దివ్యతేజసా || 132 ||

తాందివ్యదేహసంక్రాంతాం తేజోరాశిసముజ్జ్వలాం | విమానేస్థాపయామానుఃప్రీతాస్తేశివకింకరాః || 133 ||

అథసాపరమోదారరూపలావణ్యశాలినీ | దివ్యభూషణదీప్తాంగీదిప్యాంబరవిధారిణీ || 134 ||

దేహెనదివ్యగంథేన దివ్యతేజోవికాశినా | దివ్యమాల్యావతంసేనవిరరాజవిమానగా || 135 ||

రత్నచ్ఛత్రపతాకాద్యైః గీతవాదిత్రనిఃస్వనైః | మధ్యేసాశివదూతానాంమోదమానా వరాననా ||136 ||

అనుభూతానిజన్మానిష్పృత్వా స్ప్మత్వాపునఃపునః | భీతాత్రస్తాదృఢాశ్చశ్యందృష్ట్వాస్వప్నమివోత్థితా | || 137 ||

కాహంకే7మీమహాసిద్ధాఃకోయంలోకోమనోరమః | క్వగతంమేవపుఃకష్టంచండచాండాలగోత్రజం || 138 ||

అహోసుమహాదాశ్చర్యందృష్టంమాయావిలానజం | యన్మేభవసహస్రేషు భ్రాంతం భ్రాంతంపునఃపునః || 139 ||

అహోఈశ్వరపూజాయాఃమాహాత్మ్యంవిస్మయావహం | పత్రమాత్రేణసంతుష్టోయోదదాతినిజంపదం || 140 ||

తా || ఈమెతన పాపవిచ్ఛిత్తి కొరకు ఒక్కసారైనా గొప్పమంగళాన్నిచ్చే (121) శివనామముఒకసారిభక్తితోపలికితే పరమ పదానికిపోతుంది. ఒకజన్మలోచేసిన ఈదారుణపాపానికిఏఫలముందో దానిని (122) ఈమెచండాలజాతిస్త్రీ ఐ క్రమంగా అనుభవించనీ దీనికన్నమరోవేరైన నరకం నరులకు ఇక్కడ ఉంది. (123) అనేకదుఃఖములసమూహముతో మాటిమాటికి పీడింపబడటంకన్నదుష్కులంలో జన్మ. దారిద్ర్యము, మహావ్యాధి విమూఢత్వము (124) ఒక్కొక్కటేనరకము. అన్ని ఏకమైతే ఇంకాచెప్పేదేముంది. పూర్వజన్మలోని పుణ్యభారంవల్ల వివశ##యైఏపేరుపలికిందో (125) దానితో ఈమెమరోజన్మలో చాలా పుణ్యాన్నిజన్మాంతరంలోచేస్తుంది. ఆగొప్పపుణ్యంతో పాపసమూహముల యాతన నుండి విముక్తురాలై (126) ఆపురుషులతో తీసుకుపోబడి, అంతమందుపరమపదానికివెళ్తుంది. ఇటువంటి నరులకు మేముశానకులముగాదు విచారించి, శివుడు, స్వయంగా ఏదిచెప్తే అదిచేయని (127) ఈ విధముగా వైవస్వతపురమందు యముడు మొదలుగా అందరు చిత్రగుప్తాదులు ఆలోచించి ఈమెను వదిలారు. ఈమె భూమిపై పడింది (128) తొలుత ఈమె శివనామాన్ని అసతి ఐ ఉండీ ప్రమాదవశాత్తు పలికిందో దానివల్లఇప్పుడు ఆగొప్పసుకృతంతో తిరిగిశివునియొక్కబిల్వాం కురారాధనపుణ్యాన్నిపొందింది. (129) శ్రీగోకర్ణ మందు శివతిథియందు ఉపవసించి శివుని తలపైబిల్వార్పణచేసి ఈమె జాగారణంచేసిందారాత్రి (130) కోరికలేకుండానే చేసిన ఈపుణ్యానికే ఏఫలముందోదానిని ఆమెఈవేళేనీవు చూస్తుండగా అనుభవిస్తోంది. అబద్ధంకాదు (131) గౌతముని వచనము - అని పలికి ఆశివదూతలు ఆచండాలయోనినుండి జీవలేశాన్ని తీసుకొని దివ్వతేజస్సుతో కలిపారు (132) ఆ దివ్యదేహంతో కలిసిన తేజోరాశితో వెలిగిపోయే ఆమెను ఆశివకింకరులు ప్రీతులైవిమానంలో ఉంచారు (133) ఇక ఆమె పరమ ఉదారమైన రూపలావణ్యములు గలది, దివ్యభూషణములతో వెలిగే శరీరంగలది, దివ్య అంబరములధరించేది (134) దివ్యగంధముగల దివ్యతేజస్సుతో ప్రకాశించే దేహంతో, దివ్యమైన మాలలు తలలో గలిగి విమానంలో వెళుతూ ఆమె ప్రకాశించింది. (135) రత్నఛత్రముపతాకాదులతో గీతవాదిత్రనిస్వనములతో ఆపరాసన శివదూతల మధ్యలో ఆమె ఆనందిస్తూ (136) అనుభవించిన జన్మలను మాటిమాటికి స్మరిస్తూ స్మరిస్తూ, భయపడి, భయపడి ధృఢమైన ఆశ్చర్యాన్ని చూచి స్వప్నంలోవలె లేచి (137) నేనెవరు, వీరెవరు మహాసిద్ధులు, ఈ అందమైన లోకమేది, నా శరీరం ఎక్కడికి పోయింది, చండచండాల గోత్రజమైన కష్టమైన శరీరమేది (138) మాయా విలాసంవల్ల కలిగిన గొప్ప ఆశ్చర్యాన్ని చూచాను. నాజన్మ సహస్రములలో మాటిమాటికి తిరిగింది (139) ఓహో! ఈశ్వరపూజా మాహాత్మ్యము ఆశ్చర్యాన్ని కల్గించేది. పత్రమాత్రంతో సంతుష్టుడై ఎవరు తన స్థానాన్ని ఇచ్చారో (140).

మూ || ఇతితాంజాతనిర్వేదాం స్మరంతీం భగవత్పదం | దివ్యం విమాన మారోప్యతే మహెశ్వర కింకరాః || 141 ||

ఆలోకయత్సు సర్వేషు లోకేశెషు సవిస్మయం | ఆంమత్య్రతామథానిన్యుః పరమేశ్వర సన్నిధిం || 142 ||

రాజన్‌ సుమహదాశ్చర్య మాఖ్యాతం గిరిజాపతేః | మాహాత్మ్యం భక్తిలేశస్య సర్వాఫ°ఘ వినాశనం || 143 ||

రాజోవాచ -

భగవాన్‌ పరమేశస్య కీదృశోలోక ఉత్తమః | తస్యమే లక్షణం బ్రూహి యద్యస్తి మయితే దయా || 144 ||

గౌతమ ఉవాచ -

బ్రహ్మాది సురనాథానాం లోకేష్వపి సుదుర్లభః | య ఆనందః సదాయత్రసలోకః పారమేశ్వరః || 145 ||

సర్వాతి గమనం యత్రజ్యోతిర్యత్ర ప్రతిష్ఠితం | క్వాపి నాస్తితమోయోగః సలోకః పారమేశ్వరః || 146 ||

గుణవృత్తిం వినిస్తీర్య సంప్రాప్తాయత్రయోగినః | నపతేయుః పునన్సర్వే సలోకః పారమేశ్వరః || 147 ||

యత్రవాసంస కుర్వంతి క్రోధలోభ మదాదయుః | యత్రావస్థాన జన్మాద్యాః సలోకః పారమేశ్వరః || 148 ||

సర్వేషాం నిగమానాంచ యదేకం క్షేత్రముచ్యతే | తస్మాన్నాస్తి వరంవిత్తతత్పదం పారమేశ్వరం || 149 ||

ప్రత్యాహారాసన ధ్యాన ప్రాణ సంయమానాదిభిః | యత్రయోగవదైః ప్రాప్తుం యతంతే యోగినః సదా || 150 ||

యత్రదేవః సదానంద నిర్మలజ్ఞాన రూపయా | అస్తిదేవ్యా సహక్రీడన్‌ సలోకః పరమేశ్వరః || 151 ||

జన్మానేక సహస్రేషు సంభృతైః పుణ్యరాశిభిః | ఆరూఢాః పురుషానార్యః క్రీడంతే యత్రసంగతాః || 152 ||

తేజోరాశౌ సమాలీనా దుర్విభావ్యే మనోరమే | అహోరాత్రాది సంస్థానం సవిందంతి కదాచన || 153 ||

సలోకః పరమేశస్యదుర్లభోహి కుయోగినః | ఏతద్భక్తి సుపూర్ణాయే తైరేవ ప్రతిపద్యతే || 154 ||

యేతత్కథా శ్రవణ కీర్తన జాతహర్షాయే సర్వభూత హృదయః ప్రశ##మైక నిష్ఠాః

సంసార చక్రమ తివాహ్యనిరస్తమోహాస్తే శాంకరం పదమ వాప్యసుఖం రమంతే || 155 ||

తథాత్వమపి రాజేంద్ర గోకర్ణం గిరిశాలయం | గత్వా ప్రశమితాఫ°ఘః కృతకృత్యత్వ మాప్నుహి || 156 ||

తత్ర సర్వేషు కాలేషు స్నాత్వా భ్యర్చ్య మహాబలం | కృత్వాశివ చతుర్దశ్యాం ఉపవాసం సమాహితః || 157 ||

కృత్వాజాగరణం రాత్రౌ బిల్వైరభ్యర్చ శంకరం | సర్వపాప వినిర్ముక్తః శివలోకమ వాప్స్యసి || 158 ||

ఏషతే విమలోరాజన్‌ ఉపదేశోమయాకృతః | స్వస్తి తేస్తు గమిష్యామి మిథవాథి పతేః పురీం || 159 ||

ఇత్యామంత్ర్యమునిః ప్రీత్యాగౌతమోమిథిలాంయ¸°|సో7పి హృష్టమనారాజా గోకర్ణం ప్రత్యపద్యత || 160 ||

తత్రదృష్ట్వా మహాదేవం స్నాత్వా భ్యర్చ్య మహాబలం | నిర్ధూతా శేష పాపౌఘో లేభేశంభోః పరం పదం || 161 ||

యఇమాం శృణుయాన్నిత్యం కథాంశైవీంమనోహరాం | శ్రావయే ద్వాజనోభక్త్యాసయాతి పరమాంగతి || 162 ||

శ్రద్ధధానః సకృద్వాపి యఇమాం శృణుయాత్కథాం | త్రిః సప్తకులజైః సార్థం శివలోకమవాప్నుయాత్‌ || 163 ||

ఇతి కథిత మశేషం శ్రేయసామాది బీజం | భవశత దురితఘ్నం ధ్వస్తమోహాంధకారం

చరిత మమర యోగం మన్మథా రేరుదారం | సత తమసి నిషేవ్యం స్వస్తి మద్భిశ్చలోకైః || 164 ||

ఇతి శ్రీ స్కాదే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తరఖండే శివచతుర్దశీ గోకర్ణమాహాత్మ్య వర్ణనం నామ తృతీయో7ధ్యాయః || 3 ||

తా || అని వైరాగ్యముకలిగిన భగవత్పదమును స్మరిస్తున్న ఆమెను వారు దేవ విమానముపై ఎక్కించి ఆమహేశ్వర కింకరులు (141) అందరు లోకేశులు ఆశ్చర్యంతో చూస్తుండగా ఆమెను ఆహ్వానించి పరమేశ్వర సన్నిధికి తీసుకెళ్ళారు (142) ఓరాజ! గిరిజాపతి యొక్క గొప్ప ఆశ్చర్యమును చెప్పాను. భక్తి లేశము యొక్క మాహాత్మ్యము అన్ని పాపసమూహములను నశింపచేసేది (143) రాజిట్లన్నారు - ఓ భగవాన్‌ ! పరమేశుని యొక్క ఏలోకము ఉత్తమమైంది. నామీద మీకు దయఉంటే దాని లక్షణాన్ని నాకు చెప్పండి (144) అని అనగా గౌతములిట్లన్నారు - బ్రహ్మాది సురనాథుల లోకమందును దుర్లభ##మైనట్టి ఆనందముఎల్లప్పుడు ఎక్కడుంటుందో ఆలోకము పరమేశ్వరము (145) అంతా అధికం గానే ఉంటుంది. అక్కడ జ్యోతి ప్రతిష్ఠింపబడింది. అక్కడ చీకటి యోగంలేదు. అదే పారమేశ్వర లోకము (146) గుణవృత్తిని దాటి యోగులు ఎక్కడికి వచ్చారో, తిరిగి అందులోపడరో అదే పరమేశ్వర లోకము (147) లోభక్రోధ మదాదులు ఎక్కడ ఉండవో, జన్మాది అవస్థలు ఎక్కడ లేవో అది పరమేశ్వరలోకము (148) నిగమములన్నింటికి ఏది ఒకే క్షేత్రంగా చెప్పబడుతుందో, ఏదానికంటే ఉత్తమమైన ధనములేదో ఆ పదమే పరమేశ్వరము (149) ప్రత్యాహార, ఆసన, ధ్యాన, ప్రాణసంయమనాదులతో యోగమార్గములతో యోగులు సదాపొందటానికి ఎక్కడ ప్రయత్నిస్తారో (150) ఎక్కడ దేవుడు ఎల్లప్పుడు ఆనందనిర్మల జ్ఞాన రూపంలోఉంటాడో దేవితో సహక్రీడిస్తూ ఉంటాడో ఆలోకము పరమేశ్వరము (151) అనేకవేల కొలది జన్మలలో కూర్చుకున్న పుణ్యరాశులతో పురుషులు స్త్రీలు అధిరోహించి అంతా కలిసి ఎక్కడ ఆడుకుంటున్నారో (152) అధికమైన కాంత గలిగి, మనోరమమైన తేజోరాశి యందు మునిగిపోయి అహోరాత్రములు ఉనికిని ఎప్పుడూ గుర్తించరో(153) అది పరమేశుని లోకము. కుయోగులకు అది దుర్లభము. భక్తి మపూర్ణులైన వారెవరో వారే దానిని పొందుతారు (154) ఎవరు ఆకథాశ్రవణ కీర్తనములతో ఆనందం కలిగినవారైనారో, ఎవరు సర్వభూతములకు స్నేహితులో, శమమందు నిష్ఠగలవారో, సంసార చక్రమును దాటి, మోహం తొలగినవారై వారు శంకర పదవిని పొంది సుఖంగా ఆనందిస్తారు (155) అట్లాగే ఓ రాజేంద్ర! నీవు కూడా గిరీశుని ఆలయమైన గోకర్ణమునకు వెళ్ళి, పాపముల సమూహమును తగ్గించుకొని కృతకృత్యత్వాన్ని పొందు (156) అక్కడ అన్ని కాలములలో స్నానముచేసి మహాబలుని పూజించి శివచతుర్దశి యందు చక్కగా ఉపవాసంచేసి (157) రాత్రిపూట జాగరణ చేసి, బిల్వములతో శంకరుని పూజించి, అన్ని పాపముల నుండి ముక్తుడవై శివలోకాన్ని పొందుతావు (పొందు). (158) ఓరాజ! స్వచ్ఛమైన ఈ ఉపదేశాన్ని నేను నీకు చేశాను. నీకు మేలుజరుగని. మిథిలాథిపతి నగరానికి నేను వెళ్తాను (159) అని పోయివస్తానని చెప్పి ప్రీతితో గౌతమముని మిథిలకు వెళ్ళాడు. ఆ రాజుకూడా ఆనందించి గోకర్ణమునకు చేరుకున్నాడు (160) అక్కడ మహాదేవునిచూచి స్నానంచేసి మహాబలుని పూజించి, పాపములన్ని తొలగినవాడై శంభువి, పరమైన స్థానాన్ని పొందాడు (161) ఈ కథను ఎవరు నిత్యం వింటారో, శివసంబంధమైన మనోహరమైన కథను భక్తితో వినిపిస్తారో అతడుపరమమైన స్థానమునకు వెళ్తాడు (162) శ్రద్ధతో ఈ కథను ఒకసారి విన్నవాడైనా ఇరువది ఒక్కమంది కులజులతోపాటు శివలోకాన్ని పొందుతాడు (163) శ్రేయస్సుల కన్నింటికి తొలిబీజమైన, నూరుపుట్టుకలలోని పాపములను నశింపచేసేది, మోహాంధకారమును నశింపచేసేది ఈ చరిత్ర. దేవతలు దీన్ని పాడుతారు. మన్మథుని శత్రువైన శివుని కథ ఇది. ఉదారమైన ఈ కథను క్షేమంగా ఉన్న లోకులైనా ఎల్లప్పుడూ సేవించాలి. అని ఈ కథనంతా చెప్పాను (164) అని ఇది శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మోత్తర ఖండమందు శివచతుర్దశి గోకర్ణ మాహాత్మ్య మర్ణన మనునది మూడవ అధ్యాయము || 3 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters