Sri Scanda Mahapuranamu-3    Chapters   

నాలుగవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

భూయో పిశివమాహాత్మ్యం వక్ష్యామి పరమాద్భుతం | శృణ్వతాం సర్వపాపఘ్నం భవపాశ విమోచనం || 1 ||

దుస్తరేదురితాంభోధే మజ్జతాం విషయాత్మనాం | శివపూజాం వినాకశ్చిత్‌ ప్లవోనాస్తినిరూపితః || 2 ||

శివపూజాం సదాకుర్యాత్‌ బుద్ధిమానిహ మానవః | అశక్తశ్చేత్కృతాం పూజాం వశ్యేద్భక్తి వినమ్రధీః || 3 ||

అశ్రద్ధయాపియః కుర్యాత్‌ శివపూజాం విముక్తిదాం | పశ్యేద్వాసోపికాలేన ప్రయాతి పరమంపదం || 4 ||

ఆసీత్కిరాత దేశేషు నామ్నారాజా విమర్దనః | శూరః పరమ దుర్థర్షో జితశత్రుః ప్రతాపవాన్‌ || 5 ||

సర్వదామృగయాసక్తః కృపణోనిర్‌ ఘృణోబలీ | సర్వమాంసాశనః | క్రూరః సర్వవర్ణాం గనావృతః || 6 ||

తథాపి కురుతేశంభోః పూజాం నిత్యమతంద్రితః | చతుర్దశ్యాం విశేషేణ పక్షయోః శుక్ల కృష్ణయోః || 7 ||

మహావిభవ సంపన్నాం పూజాం కృత్వా సమోదతే | హర్షేణ మహతా విష్టోనృత్యతిస్తౌతి గాయతి || 8 ||

తసై#్యవం వర్తమానస్య నృపతేః సర్వభక్షిణః | దురాచారస్య మహిషీ చేష్టితే నాస్వతప్యత || 9 ||

సావైకుముద్వతీ నామరాజ్ఞీశీలగుణాన్వితా | ఏకదాపతి మా సాద్య రహస్యేత దవృచ్ఛత || 10 ||

ఏతత్తే చరితం రాజన్‌ మహాదాశ్చర్య కారణం | క్వతే మహాన్‌దురాచారః క్వభక్తిః పరమేశ్వరే || 11 ||

సర్వదా సర్వభక్షస్త్వం సర్వస్త్రీ జనలాలసః | సర్వహింసాపరః క్రూరః కథంభక్తి స్తవేశ్వరే || 12 ||

ఇతివృష్టః నభూపాలో విమృశ్య సుచిరం తతః | త్రికాలజ్ఞః ప్రహసై#్యనాం ప్రోవాచ సుకుతూహలః || 13 ||

రాజోవాచ -

అహం పూర్వభ##వేకశ్చిత్‌ సారమే యోవరాననే | పంపానగర మాశ్రిత్య పర్యటామి సమంతతః || 14 ||

ఏవంకాలేషు గచ్ఛత్సు తత్రైవ నగరోత్తమే | కదాచి దాగతః సోహం మనోజ్ఞం శివమందిరం || 15 ||

పూజాయాం వర్తమానాయాం చతుర్దశ్యాంమహాతిథౌ | అవశ్యముత్సవందూరాత్‌ బహిర్ద్వారం సమాశ్రితః || 16 ||

అథాహం పరమక్రుద్ధైః దండహసై#్తః ప్రధావితః | తస్మాద్దే శాదవక్రాం తంప్రాణ రక్షా పరాయణాః || 17 ||

తా || సూతులిట్లనిరి - ఇంకా, పరమాద్భుతమైన శివమాహాత్మ్యాన్ని చెబుతాను. వినేవారి అన్ని పాపములను నశింపచేసేది. సంసార పాశమును తొలగించేది (1) దాటరాని పాపసముద్రమందు మునుగుతున్న, విషయములే ఆత్మగా గల వారికి శివపూజతప్ప మరొక నావ చెప్పబడలేదు. (2) బుద్ధిమంతుడైన మనిషి ఇక్కడ శివపూజను ఎప్పుడూ చేయాలి. చేతగాని పక్షంలో, చేసిన పూజను భక్తితో వినమ్రమైన బుద్ధితో చూడాలి (3) అశ్రద్ధతోనైనా ముక్తినిచ్చే శివపూజను ఎవరాచరిస్తారో, చూస్తారో వారు కాలక్రమంలో పరమ, పదానికి చేరుతారు. (4) కిరాతదేశములందు విమర్దనుడను పేరుగల రాజు ఉండేవాడు. శూరుడు, అణచశక్యంకానివాడు శత్రువులను జయించినవాడు, ప్రతాపవంతుడు (5) ఎప్పుడు వేటయందు ఆసక్తి కలవాడు కృపణుడు, దయలేనివాడు బలవంతుడు అన్ని మాంసములను తినేవాడు క్రూరుడు. అన్ని వర్ణముల స్త్రీలతో కూడినవాడు (6) ఐనా శివపూజను ప్రతిరోజు జాగ్రత్తగా చేసేవాడు. చతుర్దశి యందు విశేషించి శుక్లకృష్ణ పక్షములందు (7) మహా విభవముతో కూడిన పూజనాచరించి ఆతడు ఆనందపడేవాడు. మిక్కిలి ఆనందం కలవాడై నాట్యం చేసేవాడు స్తుతించేవాడు, పాడేవాడు (8) ఇట్లా ఉంటున్న అన్నీ భక్షించే, దురాచారుడైన ఆరాజు భార్యాఈతని చేష్టలతో బాగా తపించేది (9) ఆమె పేరు కుముద్వతి, రాణి శీలగుణములుకలది. ఒకసారి భర్తను సమీపించి రహస్యంగా దాన్ని అడిగింది (10) ఓ రాజ! ఈ నీచరిత్ర చాలా ఆశ్చర్యకరమైంది. నీ ఈ దురాచారమెక్కడ. పరమేశ్వరుని యందు ఈ భక్తి ఏమిటి (11) ఎప్పుడూ అన్నీతినేవాడివి. అందరు స్త్రీల యందు లాలసగలవాడివి. సర్వ హింసాపరుడవు. క్రూరుడవు. అట్టినీకు పరమేశ్వరుని యందు ఈ భక్తి ఏమిటి (12) అని అడుగగా ఆరాజు పిదప చాలా ఆలోచించి, త్రికాలజ్ఞుడై నవ్వి చాలా కుతూహలంతో ఆమెతో ఇట్లన్నాడు (13) రాజువచనము - ఓవరాసన! నేను పూర్వజన్మలో ఒక కుక్కను పంపా నగర మాశ్రయించి చుట్టూ తిరుగుతున్నాను (14) ఇట్లా కాలం గడుస్తుండగా ఆ నగరమందే ఒకరోజు నేను మనోజ్ఞమైన శివమందిరానికి వచ్చాను. (15) చతుర్దశి మహాతిథి యందు పూజజరుగుతుండగా, బహిర్‌ ద్వారాన్ని ఆశ్రయించి, దూరం నుండే ఉత్సవాన్ని చూశాను (16) అప్పుడు నేను పరమక్రుద్ధులై చేత దండము ధరించిన వారితో తరుమబడ్డాను. ప్రాణరక్షా పరాయణుణ్ణౖ. ఆ ప్రదేశం నుండి తొలగిపోయాను (17).

మూ || తతః ప్రదక్షిణీకృత్య మనోజ్ఞం శివమందిరం | ద్వారం దేశంపునః ప్రాప్యపునశ్చైవ నివేదితః || 18 ||

పునః ప్రదక్షిణీ కృత్య తదేవ శివమందిరం | బలిపిండాది లోభేన పునర్ద్వార ముపాగతః || 19 ||

ఏవం పునః పునస్తత్ర కృత్వాకృత్వా ప్రదక్షిణాం | ద్వారదేశే సమాసీనం విజఘ్నః నిశితైః శ##రైః || 20 ||

సవిద్ధగాత్రః సహసాశివద్వారిగతాసుకః | జాతో7న్మ్యహం కులే రాజ్ఞాం ప్రభావాచ్ఛివ సన్నిధేః || 21 ||

దృష్ట్వా చతుర్దశీ పూజాం దీపమాలా విలోకితాః | తేనపుణ్యన మహతాత్రికాలజ్ఞో స్మిభామిని || 22 ||

ప్రాగ్జన్మ వాసనాభిశ్చ సర్వభక్షో7 స్మినిర్‌ ఘృణః | విదుషామపి దుర్లంఘ్యా ప్రకృతి ర్వాసనామయీ || 23 ||

అతో7హమర్చయామీశం చతుర్దశ్యాం జగద్గురుం | త్వమపిశ్రద్ధ యాభ##ద్రే భజదేవం పినాకినం || 24 ||

రాజ్ఞ్యవాచ -

త్రికాలజ్ఞో7సి రాజేంద్ర ప్రసాదాద్గి రిజాపతేః | మత్పూర్వ జన్మచరితం వక్తుమర్హసితత్వతః || 25 ||

రాజోవాచ -

త్వంతు పూర్వ భ##వేకాచిత్‌ కపోతీ వ్యోమచారిణీ | క్వాపిలబ్థవతీకించి న్మాంస పిండం యదృచ్ఛయా || 26 ||

త్వద్గృహీత ఘధాలోక్యగృధ్రః కోప్యామిషంబలీ | నిరామిషః స్వయం వేగాత్‌ అభిదుద్రావభీషణః || 27 ||

తతస్తం వీక్ష్యవిత్రస్తా విద్రుతాసి వరాననే | తేనాను యాతా ఘోరేణ మాంసపిండజిఘృక్షయా || 28 ||

దిష్ట్యాశ్రీగిరి మాసాద్యశ్రాంతాతత్ర శివాలయం | ప్రదక్షిణం పరిక్రమ్య ధ్వజాగ్రే సమువస్థితా || 29 ||

అథాసునృత్య సహసా తీక్ణతుండో విహంగమః | త్వాంనిహత్య నిపాత్యాధోమాంసమాదాయ జగ్మివాన్‌ || 30 ||

ప్రదక్షిణ ప్రక్రమణాత్‌ దేవదేవస్య శూలినః | తస్యాగ్రే మరణాచ్చైవ జాతాసీహ నృపాంగనా || 31 ||

రాజ్ఞ్యువాచ -

శ్రుతం సర్వమశేషేణ ప్రాగ్జన్మ చరితం మయా | జాతంచ మహదాశ్చర్యం భక్తి శ్చమమచేతసి

అథాన్యత్‌ శ్రోతుమిచ్చామి త్రికాలజ్ఞ మహామతే | ఇదం శరీరముత్సృ జ్యయాస్యావః కాంగతింపునః || 32 ||

రాజోవాచ -

అతోభ##వేచ నిష్యే7హం ద్వితీయే సైంధవోనృపః || 33 ||

సృంజయేశ సుతాత్వంహిమామే వప్రతి వత్స్యసే | తృతీయేతు భ##వేరాజా సౌరాష్ట్రె భవితా7స్మ్యహం || 34 ||

తా || పిదప మనోజ్ఞమైన శివమందిరమునకు ప్రదక్షిణం చేసి ద్వారదేశం దగ్గరకు తిరిగివచ్చి తిరిగి వెళ్ళగొట్టబడ్డాను (18) తిరిగి అదే శివమందిరానికి ప్రదక్షిణంచేసి, బలిపిండాదుల మీది ఆశతో తిరిగి ద్వారం దగ్గరకొచ్చాను (19) ఇట్లా మాటిమాటికి అక్కడ ప్రదక్షిణలు చేసిచేసి ద్వారదేశమందు కూర్చున్న నన్ను తీక్ఞమైన బాణములతో చంపారు (20) అట్లా కొట్టబడిన శరీరంగలిగి త్వరగా శివద్వారమందు ప్రాణాలు కోల్పోయి, శివసన్నిధి ప్రభావంవల్ల నేను రాజకులంలో పుట్టాను (21) చతుర్దశీ పూజను చూచి, దీపమాలలను చూచాను. ఆ పుణ్యం మాహాత్మ్యంవల్ల ఓ భామిని నేన త్రికాలజ్ఞుణ్ణి ఐనాను (22) పూర్వజన్మ వాసనలతో దయలేకుండా అన్నింటినీ తింటున్నాను. వాసనమయమైన ప్రకృతి విద్వాంసులకు గూడ తప్పించుకోరానిది. (23) అందువల్ల చతుర్దశియందు జగద్గురువైన ఈశుణ్ణి నేను పూజిస్తున్నాను. ఓభ##ద్రే! నీవు కూడా శ్రద్ధతో దేవుడైన పినాకిని సేవించు. (24) అనగా రాజ్ఞి ఇట్లా అంది - ఓ రాజేంద్ర! గిరిజాపతి ప్రసాదంవల్ల త్రికాలజ్ఞడవైనావు. యథార్థంగా నా పూర్వజన్మ చరిత్రను చెప్పండి (25) అనగా రాజిట్లన్నాడు - ఓరాణి! నీవు పూర్వజన్మలో ఆకాశంలోతిరిగే ఒక పావురానివి. అనుకోకుండా నీకు ఎక్కడ కొద్దిమాంస పిండము లభించింది (26) నీవు తీసుకున్న మాంసాన్నిచూచి బలవంతురాలైన ఒకగద్ద, మాంసంలేనిదై, భయంకరంగా, వేగంగా స్వయంగా పరుగెత్తుకొచ్చింది. (27) పిదప పరానన ! దానిని చూచి, భయపడి నీవు పరుగెత్తావు. మాంసపిండం తీసుకోవాలనే కోరికతో ఘోరంగా అది నిన్ను అనుసరించగా (28) అదృష్టవశాత్తూ నీవు శ్రీ గిరికి వచ్చి అక్కడ శివాలయంలో విశ్రమించావు. ప్రదక్షిణ మాచరించి ధ్వజాగ్రమందు ఉన్నావు. (29) అప్పుడు నిన్ననుసరిస్తున్న తీక్ఞమైన ముక్కుగల ఆపక్షి వేగంగా నిమ్న కిందపడవేసి చంపి, మాంసం తీసుకొని వెళ్ళిపోయింది. (30) దేవదేవుడైన శూలికి ప్రదక్షిణ మాచరించినందువల్ల ఆతని ఎదుట మరణించినందువల్ల ఇక్కడ నృప అంగనగా జన్మించావు (31) అని అనగా ఆమె ఇట్లా అంది - నా పూర్వజన్మ చరిత్రను నేను అంతా పూర్తిగా విన్నాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నా మనస్సులో భక్తి కలిగింది. ఓ త్రికాలజ్ఞ! మహామతి! నేను మరొక్కటి మీవల్ల వినదలిచాను ఈశరీరాన్ని వదలి, తిరిగి ఏ గతిని పొందుతాము అని. (32) రాజిట్లన్నాడు - మరో రెండో జన్మలో నేను సైంథవ దేశపురాజుగా జన్మిస్తాను (33) నీవు సృంజయదేశపురాజు కూతురుగా జన్మించి, నన్నే పొందుతావు. మూడవ జన్మలో సౌరాష్ట్రంలో రాజుగా జన్మిస్తాను (34).

మూ || కలింగరాజ తనయాత్వంమేపత్ని భవిష్యసి | చతుర్థౌతు భవిష్యామి భ##వేగాంధార భూమిపః || 35 ||

మాగధీరాజ తనయా తత్రత్వం మమమోహినీ | పంచమే7వంతినాధో7హం భవిష్యామి భవాంతరే || 36 ||

దాశార్హరాజ తనయా త్వమేవమమవల్లభా | అస్మాజ్జన్మనిషష్ఠే7హమానర్తే భవితానృపః || 37 ||

యయాతి వంశజాకన్యా భూత్వామామేవయాస్యసి | పాండ్యరాజకుమారో7హం సప్తమే భవితాభ##వే || 38 ||

తత్రమత్పదృశోనాన్యో రూపౌదార్య గుణాదిభిః | సర్వశాస్త్రార్థ తత్వజ్ఞో బలవాన్‌ దృఢవిక్రమః || 39 ||

సర్వలక్షణ సంపన్నః సర్వలోక మనోరమః | పద్మవర్ణ ఇతిఖ్యాతః పద్మమిత్ర సమద్యుతిః || 40 ||

భవితాత్వంచ వైదర్భీ రూపేణా ప్రతిమాభువి | నామ్నావసుమతీఖ్యాతా రూపావయవశోభినీ || 41 ||

సర్వరాజ కుమారాణాం మనోనయన నందినీ | సాత్వంస్వయంవరే సర్వాన్‌ విహాయనృపనందనాం || 42 ||

వరంప్రాప్య సిమామేవదమయంతీవ నైషధం | సో7హం జిత్వానృపాన్‌ సర్వాన్‌ప్రాప్యత్వాంవరవర్ణినీం || 43 ||

స్వరాష్ట్రస్థో7ఖిలాన్‌ భోగాన్‌ భోక్ష్యే వర్షగణాన్బహూన్‌ | ఇష్ట్వాచవివిదైర్యజ్ఞైః వాజిమేధాదిభిః శుభైః || 44 ||

సంతర్ప్యపితృదేవర్షీన్‌ దానైశ్చ ద్విజసత్తమాన్‌ | సంపూజ్య దేవదేవేశం శంకరంలోకశంకరం || 45 ||

పుత్రే రాజ్యధురంన్యస్య గంతాస్మితవసేవనం | తత్రాగస్త్యాన్మునివరాత్‌ బ్రహ్మజ్ఞాన మవాప్యచ || 46 ||

త్వయాసహగమిష్యామి శివస్య పరమంపదం | చతుర్దశ్యాం చతుర్దశ్యామేవం సంపూజ్య శంకరం || 47 ||

సప్తజన్మసురాజత్వం భవిష్యతి వరాననే | ఇత్యేతత్‌సుకృతం లబ్థం పూజాదర్శన మాత్రతః

క్వసారమేయోదుష్టాత్మక్వేదృశీబతసద్గతిః | || 48 ||

సూత ఉవాచ -

ఇత్యుక్త్యా నిజనాథేన సారాజ్ఞీ శుభలక్షణా || 49 ||

పరంవిస్మయమాపన్నాపూజయామాన,తంముదా | సోపిరాజాతయాసార్ధంభుక్త్వా భోగాన్‌యథేప్సితాన్‌ || 50 ||

జగామసప్త జన్మాంతే శంభోః తత్పరమం పదం |

యఏతచ్ఛివపూజాయామాహాత్మ్యంపరమాద్భుతం | శృణుయాత్‌ కీర్తయేద్వాపినగచ్ఛేత్‌పరమంపదం || 51 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే చతుర్దశీ మాహాత్మ్య వర్ణనం నామచతుర్థో7ధ్యాయః || 4 ||

తా || నీవు కళింగరాజు తనయవైనాకు భార్యవౌతావు. చతుర్థజన్మలో నేను గాంధార దేశపురాజునౌతాను (35) అక్కడ నీవు మగథదేశపు రాజు తనయవై నాభార్యవౌతావు. ఐదవ జన్మలో నేను అవంతి నాథుడనౌతాను (36) నీవు దాశార్హరాజు కూతురువైనా భార్యవౌతావు. అరవ జన్మలో నేను ఆనర్తదేశపు రాజు నౌతాను (37) యయాతి వంశపురాజు కన్యవై నన్నే పొందుతావు. ఏడవ జన్మలో నేను పాండ్యరాజు కుమారుణ్ణౌతాను (38) అప్పుడు రూప ఔదార్యగుణములలో నాతో సమానమైన వాడు మరొకడుండడు. సర్వశాస్త్రార్థముల తత్వమెరిగినవాడను, బలవంతుడను దృఢవిక్రముడనౌతాను (39) అన్ని లక్షణములు గలవాడనౌతాను. సర్వలోకములకు మనోహరుడనౌతాను. పద్మవర్ణుడని నాపేరు. సూర్యుని వంటి కాంతి గలవాడనౌతాను (40) నీవు వైదర్భిగా జన్మిస్తావు. భూమిలోనీ అంత అందకత్తె ఉండదు. వసుమతి అని నీపేరు. రూప అవయవములతో శోభిస్తుంటావు (41) రాకుమారులందరి మనస్సులకు, కళ్ళకు ఆనందకూర్చే దానివౌతావు. నీవు స్వయంవరంలో రాకుమారులందరిని వదలి (42) దమయంతి నైషధునివలె నన్నే వరునిగా పొందుతావు. నేను రాజులందరిని జయించి, వరవర్ణినియైన నిన్ను పొంది (43) నా రాష్ట్ర మందుండి అనేక సంవత్సరాలు అనేక భోగములను అనుభవిస్తాను. రకరకాల యజ్ఞములు శుభ##మైన అశ్వమేధములుచేసి (44) పితరులను దేవర్షులను సంతర్పణల ద్వారా (నీళ్ళు వదలి) బ్రాహ్మణులను దానములచే తృప్తి పరచి, దేవదేవేశుడైన లోక శంకరుడైన శంకరుని పూజించి (45) పుత్రునిపై రాజ్యభారముంచి తపోవనమునకు వెళ్తాను. అక్కడ అగస్త్యముని ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది (46) నీతో కలిసి శివుని పరమస్థానమునకు వెళ్తాను. ఈ విధముగా ప్రతిచతుర్దశి యందు శంకరుని పూజించి (47) నందువల్ల ఏడు జన్మలలో రాజత్వము లభిస్తుంది, ఓ వరానన ! పూజను దర్శించినంత మాత్రంచేత ఈ సుకృతం లభించింది. దుష్టాత్మ గల సారమేయమెక్కడ. ఇటువంటి సద్గతి ఎక్కడ (48) సూతులిట్లన్నారు. అని అతని భర్తచెప్పగా శుభలక్షణములు గల ఆరాజ్ఞి (49) చాలా ఆశ్చర్యాన్ని పొంది అతనిని ఆనందంతో పూజించసాగింది. ఆ రాజుకూడా ఆమెతో కలిసి తనకిష్టమైన కోరికలను అనుభవించి (50) ఏడుజన్మల చివర శివుని యొక్క ఆపరమ,స్థానమునకు వెళ్ళాడు. పరమాద్భుతమైన ఈ శివపూజా మాహాత్మ్యాన్ని ఎవరు వింటారో, కీర్తిస్తారో వారు పరమ, పదమునకు వెళ్తారు (51) అని శ్రీ స్కాందే మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మోత్తర ఖండమందు చతుర్దశీ మాహాత్మ్యవర్ణన మనునది నాల్గవ అధ్యాయము || 4 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters