Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఐదవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

శివోగురుః శివోదేవః శివోబంధుః శరీరిణాం | శివ ఆత్మా శివోజీవః శివాదన్యన్న కించన || 1 ||

శివముద్దిశ్య యత్కించిద్దత్తం జప్తం హుతంకృతం | తదనంత ఫలం ప్రోక్తం సర్వాగమ వినిశ్చితం || 2 ||

భక్త్యాని వేదితం శంభోః పత్రంపుష్టం ఫలంజలం | అల్పాదల్పతరంవాపి తదానంత్యాయ కల్పతే || 3 ||

విహాయ సకలాన్‌ ధర్మాన్‌ సకలాగమనిశ్చితాన్‌ | శివమేకం భ##జేద్యస్తు ముచ్యతే సర్వబంధనాత్‌ || 4 ||

యాప్రీతి రాత్మనః పుత్రేయాకలత్రేధనేపిసా | కృతాచేచ్ఛివ పూజాయాంత్రాయతీతికి మద్భుతం || 5 ||

తస్మాత్‌ కేచిన్మహాత్మానః సకలాన్‌ విషయాసవాన్‌ | త్యజంతి శివపూజార్థే స్వదేహమపి దుస్త్యజం || 6 ||

సాజిహ్వాయాశివంస్తౌతి తన్మనో ధ్యాయతే శివం | తౌకర్ణౌ తత్కథా లోలౌతౌహస్తౌతస్యపూజకౌ || 7 ||

తేనేత్రే పశ్యతః పూజాం తచ్ఛిరః ప్రణతంశివే | తౌపాదౌ¸° శివక్షేత్రం భక్త్యా పర్యటతః సదా || 8 ||

యస్యేంద్రియాణి సర్వాణి వర్తంతే శివకర్మను | సనిస్తరతిం సంసారం భుక్తింముక్తిం చవిందతి || 9 ||

శివభక్తియుతో మర్త్యః చాండాలః పుల్కసోపిచ | నారీనరోవా షంఢోవాసద్యోముఛ్యేత సంసృతేః || 10 ||

కింకులేనకిమాచారైః కింశీలేనగుణనవా | భక్తిలేశయుతః శంభోః సవంద్యః సర్వదేహినాం || 11 ||

ఉజ్జయిన్యామభూద్రాజా చంద్రసేన సమాహ్వయః | జాతో మానవరూపేణ ద్వితీయ ఇవవాసవః || 12 ||

తస్మిన్‌ పురే మహాకాలం వసంతం పరమేశ్వరం | సంపూజయత్యసౌ భక్త్యా చంద్రసేనో నృపోత్తమః || 13 ||

తస్యాభవత్స ఖారాజ్ఞః శివపారిష దాగ్రణీః | మణిభద్రోజితా భద్రః సర్వలోక నమస్కృతః || 14 ||

తసై#్య కదామహీభర్తుః ప్రసన్నః శంకరానుగః | చింతామణిం దదౌదివ్యం మణిభద్రోమహామతిః || 15 ||

సమణిః కౌస్తుభ ఇవద్యోత మానోర్క సన్నిభః | దృష్టః శ్రుతో వాధ్యాతో వానృణాం యచ్ఛతి చింతితం || 16 ||

తస్యకాంతి లవస్పృష్టం కాంస్యం తామ్రమయస్త్రవు | పాషాణాదిక మన్యద్వానద్యోభవతి కాంచనం || 17 ||

స తంచింతామణిం కంఠే బిభ్రద్‌ రాజా సనంగతః | రరాజరాజా దేవానాం మధ్యే భానురివ స్వయం || 18 ||

సదాచింతామణి గ్రీవంతం శ్రుత్వా రాజసత్తమం | ప్రవృద్థతర్షా రాజానః సరవేక్షుబ్థ హృదో7భవన్‌ || 19 ||

స్నేహాత్కేచి దయాచంత ధార్‌ష్ట్యాత్‌కే చనదుర్మదాః | దైవలబ్ధమజానంతో మణిం మత్సరిణోనృపాః || 20 ||

తా || సూతులిట్లన్నారు - శివుడు గురువు. శివుడు దేవుడు, శివుడు బంధువు. శరీరధారులకు శివుడు ఆత్మ శివుడు జీవము. శివుని కన్న మరొక్కటి లేదు (1) శివుని ఉద్దేశించి ఏ కొంచం దానంచేసిన జపం, హోమంచేసినా అది అనంతఫలదమని చెప్పబడింది. అన్ని ఆగమములతో నిశ్చయింపబడింది (2) శివునకు భక్తితో పత్రమో పుష్పమో, ఫలమో, జలమో ఇస్తే, అల్పాల్పమైనా అది అనంతాన్నిస్తుంది. (3) సకలాగమములందు నిశ్చితమైన సకల ధర్మములను వదలి, శివుని భజించినవాడు అన్ని బంధనములనుండి ముక్తుడౌతాడు (4) తన కొడుకు యందు ఎంత ప్రీతో, భార్య యంద ధనమందెంత ప్రీతో అంత ప్రీతి శివపూజయందు చూపిస్తే శివుడు రక్షిస్తాడు. అనే దానిలో ఆశ్చర్యమేముంది. (5) అందువల్ల కొందరు మహాత్ములు అన్ని విషయములను మత్తు పదార్థాలను శివపూజకొరకు విడిచి పెడ్తారు దుస్త్యజమైన తమ దేహాన్ని విడుస్తారు (6) శివుని స్తుతించే నాలుకే నాలుక శివుని ధ్యానించే మనస్సే మనస్సు. శివుని కథను వినడంలో ఆసక్తి చూపే చెవులే చెవులు. అతనిని పూజించే చేతులే చేతులు (7) ఆతనిని చూచే కళ్ళే కళ్ళు పూజయందు శివునకు నమస్కరించే శిరస్సే శిరస్సు. శివక్షేత్రములకు భక్తితో తిరిగే పాదములే పాదములు (8) ఎవని ఇంద్రియములన్ని శివ కర్మలందు ఉంటాయో ఆతడు సంసారం నుండి ముక్తుడౌతాడు భుక్తిని ముక్తిని పొందుతాడు (9) శివభక్తి కలిగిన మర్త్యుడు చండాలుడుకాని పుల్కసుడు కాని ఆడది కాని మగవాడు కాని షండుడుకాని వెంటనే సంసారం నుండి ముక్తులౌతారు (10) కులంతో కాని ఆచారంతో కాని శీలంతో కాని గుణంతో కాని పనిలేదు. శివుని యందు భక్తిలేశ మాత్రమై నా కల్గినవాడు ప్రాణులందరికి నమస్కరించ తగినవాడు (11) ఉజ్జయినిలో చంద్రసేనుడను రాజు ఉండేవాడు. ఇంద్రుడే రెండవ రూపంతో మానవ రూపంలో జన్మించాడా అన్నట్లుండేవాడు (12) ఆ పురంలో ఉండే మహాకాల పరమేశ్వరుని ఈ చంద్రసేన రాజు భక్తితో పూజించేవాడు (13) ఆ రాజునకు సఖుడుగా శివ పరిషత్తు యందలి శ్రేష్ఠుడు ఉండేవాడు. జితాభద్రుడు మణిభద్రుడు అందరిచే నమస్కరింపబడేవాడు (14) ఆ రాజునకు శంకరానుగుడైన మణిభద్రుడు ప్రసన్నుడై ఆ మహామతి దివ్యమైన చింతామణి నిచ్చాడు (15) ఆ మణి కౌస్తుభమణి వలె ప్రకాశిస్తోంది. సూర్యునిలా వెలుగుతోంది. దాన్ని చూచినా, దాని గూర్చివిన్నా, దాన్ని ధ్యానించినా అది మనుష్యుల ఆలోచనలను తీర్చేది (16) దాని కాంతి లేశము తగులగానేకాంస్యము రాగి రూపంగా ఉన్నది. రాళ్ళు మొదలగునవి ఇతరమైనవి. వెంటనే బంగారముగా మారసాగాయి (17) ఆ చింతామణిని ఆరాజు కంఠమందు కట్టుకొని సింహాసనము దగ్గరకు వెళ్ళాడు. రాజు దేవతల మధ్యలో సూర్యునిలా వెలుగసాగాడు (18) ఎప్పుడూ కంఠమందు చింతామణిని ధరించే రాజును గూర్చివిని పెరిగిన తృష్ణ కలవారై రాజులందరు హృదయ క్షోభగలవారైనారు (19) స్నేహంతో కొందరు అడిగారు రత్నాన్ని. కొందరు దుర్మదులు ధార్ష్‌ట్యంతో అడిగారు. మత్సరం గల ఆ రాజులు ఆ మణి దైవలబ్ధమని గ్రహించలేదు (20).

మూ || సర్వేషాంభూభృతాంయాచ్ఞాయదావ్యర్థీకృతామునా | రాజానఃసర్వదేశానాంసరంభంచక్రిరేముదా || 21 ||

సౌరాష్ట్రాః కైకయాః శాల్వాః కలింగశకమద్రకాః | పాంచాలా వంతిసౌ వీరాః మాగధామత్స్య సృంజయాః || 22 ||

ఏతేచాన్యేచ రాజానః నహాశ్వరథ కుంజరాః | చంద్రసేనం మృధే జేతుముద్యమం చక్రురోజసా || 23 ||

తేతు సర్వే సుసంరబ్ధాః కంపయంతో వసుంధరాః | ఉజ్జయిన్యాః చతుర్ద్వరం రురుధుఃబహుసైనికాః || 24 ||

సంరుధ్యమానాం స్వపురీం దృష్ట్వా రాజభిరుద్ధతైః | చంద్రసేనో మహాకాలం తమేవశరంణం య¸° || 25 ||

నిర్వికల్పో నిరాహారో నరాజా దృఢనిశ్చయః | అర్చయా మానగౌరిశం దివాసక్త మనస్యధీః || 26 ||

ఏతస్మిన్నంతరే గోపీకా చిత్తత్పుర వాసినీ | ఏకపుత్రా భర్తృహీనా తత్రైవాసీ చ్చిరంతనా || 27 ||

సాపంచ హాయనం బాలం వహంతీగత భర్తృకా | రాజ్ఞాకృతాం మహాపూజాం దదర్శగిరిజాపతేః || 28 ||

సాదృష్ట్వా సర్వమాశ్చర్యం శివపూజామహోదయం | ప్రణిపత్యస్వ శిబిరం పునరేనాభ్య పద్యత || 29 ||

ఏతత్సరవమశేషేణసదృష్ట్వా వల్లనీసుతః | కుతూహలేన విదధే శివపూజాం విరక్తిదాం || 30 ||

ఆనీయ హృద్యం పాషాణం శూన్యేతు శిబిరోత్తమే | నాతిదూరే స్వశిబిరాత్‌ శివలింగమ కల్పయత్‌ || 31 ||

యానికానిచ పుష్పాణి హస్తలభ్యానిచాత్మనః | ఆనీయ స్నాప్య తల్లింగం పూజయామాన భక్తితః || 32 ||

గంధాలంకార వాసాంసి ధూపదీపాక్షతాదికం | విధాయ కృత్రిమైర్దివ్యైః నైవేద్యం చాప్యకల్పయత్‌ || 33 ||

భూయోభూయః సమభ్యర్చ్యపత్రైఃపుషై#్పఃమనోరమైః | నృత్యంచవివిధం కృత్వాప్రణనామపునఃపునః || 34 ||

ఏవం పూజాం ప్రకుర్వాణాం శివస్యానస్యమాననం | సాపుత్రం ప్రణయాద్గోపీ భోజనాయ సమాహ్వయత్‌ || 35 ||

మాత్రాహూతో పి బహుశః నపూజాసక్తమానసః | బాలోపిభోజనం నేచ్ఛత్తదామాతా స్వయంయ¸° || 36 ||

తంవిలోక్య శివస్యాగ్రే నిషణ్డంమీలితేక్షణం | చకర్ష పాణిం సంగృహ్య కోపేన సమతాడయత్‌ || 37 ||

అకృష్టస్తాడితో వాపినాగచ్ఛత్‌ స్వసుతోయదా | తాంపూజాం నాశయామానక్షిప్త్వాలింగం విదూరతః || 38 ||

హాహెతి రుదమానంతం నిర్భర్స్య స్వసుతంతదా | పునర్వివేశస్వ గృహం గోపీరోష సమన్వితా || 39 ||

మాత్రావినాశితాం పూజాం దృష్ట్వా దేవస్య శూలినః | దేవదేవేతి చుక్రోశ ని పపాత సబాలకః || 40 ||

ప్రసష్ట సంజ్ఞః సహసా బాష్పపూర పరిప్లుతః | లబ్థనం జ్ఞోముహూర్తే స చక్షుషీ ఉదమీలయత్‌ || 41 ||

తా || రాజులందరి యాచనను ఈ రాజు వ్యర్థం చేశాక, అన్ని దేశాల రాజులు అప్పుడు హడావిడి చేశారు. (21) సౌరాష్ట్రులు, కైకయులు, శాల్వులు, కలింగ శకమద్రకులు పాంచాల అవంతి సౌవీరులు మాగధ మత్స్య సృంజయులు (22) వీరు ఇతరులైన రాజులు, గుఱ్ఱములు, రథములు, ఎనుగుసైన్యం కలవారై చంద్రసేనుని యుద్ధంలో జయించటానికి పరాక్రమంతో ఉద్యమించారు (23) వారంతా చక్కని సంరంభము కలవారై భూమని కంపింపచేస్తూ అధికసైన్యం కలవారై ఉజ్జయిని యొక్క నాల్గు ద్వారాలను అడ్డగించాడు (24) ఉద్ధతులైన రాజులు తన పట్టణాన్ని అడ్డగించటాన్ని రాజు చూచి ఆ చంద్రసేనుడు ఆ మహాకాలునే శరణు వేడాడు (25) నిర్వికల్పుడై నిరాహారుడై ఆ రాజు దృఢనిశ్చయం గలవాడై రాత్రింబగళ్ళు, మరో ఆలోచన లేకుండా గౌరీశుని పూజించసాగాడు (26) ఈ మధ్యలో ఆ పట్టణంలో ఉండే ఒక గోపిక ఒకే కొడుకు గలది, భర్తలేనిది చాలాకాలం అక్కడే ఉండి (27) ఆమె ఐదు సంవత్సరాల బాలుని తీసుకొని, భర్తలేనిది, రాజుచేసే గిరిజాపతి పూజను చూచింది (28) అంతా ఆశ్చర్యకరమైన శివపూజా మహోదయమును ఆమె చూచి నమస్కరించి తిరిగి తన శిబిరానికి వెళ్ళింది (29) ఇదంతా ఏమీ వదలకుండా ఆగొల్ల వనిత కుమారుడు చూచి విరక్తినిచ్చే శివపూజను కుతూహలంతో ఆచరించాడు (30) శూన్యమైన శిబిరోత్తమంలోనికి అందమైన పాషాణాన్ని తెచ్చి తన శిబిరానికి కొద్ది దూరంలో శివలింగాన్ని కల్పించాడు (31) తన చేతులతో ఏవో కొన్ని పూలు తెచ్చి, ఆ లింగానికి స్నానం చేయించి, భక్తితో పూజించాడు (32) గంధ అలంకార వస్త్రములను ధూపదీప అక్షతలు మొదలగు వానిని కృత్రిమంగా ఏర్పరచి దివ్యమైన నైవేద్యాన్ని కూడా కల్పించాడు (33) మనోరమమైన పత్రపుష్పములతో మరల మరల పూజించి, వివిధమైన నృత్యముచేసి తిరిగి తిరిగి నమస్కరించాడు. (34) ఈ రకంగా శివుని పూజిస్తున్న అనన్యమనస్కుడైన పుత్రుని ఆగోపిక చూచి ప్రేమతో భోజనానికి పిలిచింది (35) అనేకసార్లు తల్లి పిలిచినా ఆతడు పూజయందే మనస్సు గలవాడై బాలుడు కూడా భోజనాన్ని ఇష్టపడలేదు. అప్పుడు తల్లే స్వయంగా వచ్చింది (36) శివుని ఎదుట కళ్ళుమూసుకొని కూర్చున్న ఆతనిని చూచి చేయిబట్టిలాగింది. కోపంతో కొట్టింది (37) లాగినా కొట్టినా తన కొడుకు రాకపోతే ఆమె లింగాన్ని దూరంగా పారవేసి ఆ పూజను నాశనం చేసింది (38) హా! హా! అని ఏడుస్తున్న తన కొడుకును భయపెట్టి అప్పుడు ఆ గోపి కోపంతో తిరిగి తన ఇంట్లోకి వచ్చింది (39) తల్లి తన శివ పూజను పాడు చేయటం చూచి దేవ! దేవ! అని ఏడ్చాడు. ఆ బాలుడు పడిపోయాడు. (40) స్మృతి నశించి త్వరగా కన్నీరు దొరలగా స్మృతిని పొంది క్షణంలో కళ్ళు తెరిచాడు (41).

మూ || తతోమణిస్తంభవిరాజమానంహిరణ్మయద్వారకపాలతోరణం

మహార్హనీలామలవజ్రవేదికంతదేవజాతం శిబిరం శివాలయం || 42 ||

సంతప్తహెమకలశైః బహుభిర్వచిత్రైః ప్రోద్థాసితస్పటిక సౌధతలాభిరామం

రమ్యంచతచ్ఛివ పురంపర పీఠమధ్యే లింగంచ రత్న సహితం సదదర్శబాలః || 43 ||

సదృష్ట్వా సహసోత్థాయ భీత విస్మిత మానసః | నిమగ్న ఇవసంతోషాత్‌ పరమానందసాగరే || 44 ||

విజ్ఞాయ శివపూజాయామాహాత్మ్యం తత్ర్పభావతః | సనామదండవద్భూమౌ స్వమాతురఘుశాంతయే || 45 ||

దేవక్షమ స్వదురితం మమమాతురుమావతే | మూఢాయాః త్వామ జానంత్యాః ప్రసన్నో భవశంకర || 46 ||

యద్యస్తి మయియత్కించిత్‌పుణ్యంత్వద్భక్తిసంభవం | తేనాపిశివమేమాతాతపకారుణ్యమాప్నుయాత్‌ || 47 ||

ఇతి ప్రసాద్య గిరిశం భూయోభూయఃప్రణమ్యచ | సూర్యేచాస్తంగతే బాలో నిర్జగామ శివాలయాత్‌ || 48 ||

అథాపశ్యత్‌ స్వశిబిరం పురందర పురోవమం | సద్యోహిరణ్మయీ భూతం విచిత్ర విభవోజ్జ్వలం || 49 ||

సోంతః ప్రవిశ్య భవనం మోదమానోనిశాముఖే | మహామణి గణా కీర్ణం హెమరాశి సముజ్జ్వలం || 50 ||

తత్రాపశ్యత్‌ స్వజననీం స్మరంతీమకుతోభయాం | మహార్హరత్న పర్యం కేసి తశయ్యామధిశ్రితాం || 51 ||

రత్నాలంకార దీప్తాంగీం దివ్యాంబర విరాజినీం | దివ్యలక్షణ సంపన్నాం సాక్షాత్పుర వధూమివ || 52 ||

జవేనోత్థాపయామాన సంభ్రమోత్ఫుల్లలోచనః | అంబజాగృహి భద్రంతే పశ్యేదం మహదద్భుతం || 53 ||

ఇతిప్రబోధితా గోపీ స్వపుత్రేణ మహాత్మనా | తతో7పశ్యత్‌ స్వజననీ స్మయన్తీ ముకుటోజ్జ్వలా || 54 ||

నసంభ్రమం సముత్థాయ తత్సర్వం ప్రత్యవైక్షత | అపూర్వమివచాత్మాన మపూర్వమివ బాలకం || 55 ||

అపూర్వంచ స్వసదనం దృష్ట్వా సీత్సుఖ విహ్వలా | శ్రుత్వా పుత్రముఖాత్సర్వం ప్రసాదం గిరిజాపతేః || 56 ||

రాజ్ఞే విజ్ఞాపయామానయోభజత్యనిశం శివం | సరాజా సహసాగత్య సమాప్తనియమోనిశి || 57 ||

దదర్శగోపికాసూనోః ప్రభావం శివతోషజం | హిరణ్మయం శివస్థానం లింగం మణిమయం తథా || 58 ||

గోపవధ్వాశ్చసదనం మాణిక్య వరకోజ్జ్వలం | దృష్ట్వా మహీపతిః సర్వం సామాత్యః సపురోహితః || 59 ||

ముహూర్తం విస్మిత ధృతిః పరమానంద నిర్భరః | ప్రేవ్ణూ బాష్పజలంముంచన్‌ పరిరేభేత మర్ఛకం || 60 ||

ఏవమత్యద్భుతా కారాత్‌ శివమాహాత్మ్యకీర్తనాత్‌ | పౌరాణాం సంభ్రమాచ్చైవ సారాత్రిః క్షణతామగాత్‌ || 61 ||

తా || పిదప మణిస్తంభములతో వెలిగిపోతూ బంగారు ద్వారము తలుపులు తోరణము కలిగి, మహాయోగ్యమైన నీలమైన అమలమైన వజ్రవేదిక గలిగి ఆ శిబిరమే శివాలయముగా మారింది (42) తపింపచేయబడిన అనేక బంగారు కలశములు విచిత్రమైనవిగా కలిగి వెలిగిపోతున్న స్ఫటిక భవన ప్రదేశంవలె మనోహరమై రమ్యమైన ఆ శివపురమును, శ్రేష్ఠమైన పీఠం మధ్యలో రత్నములతో కూడిన లింగమును ఆ బాలుడు చూచాడు (43) ఆతడు చూచి త్వరగా లేచి భయము ఆశ్చర్యము కల్గిన మనస్సు కలవాడై పరమ ఆనందసాగరమందు సంతోషంతో నిమగ్నుడైనట్లు (44) తెలుసుకొని శివ పూజమాహాత్మ్యాన్ని తెలుసుకొని ఆ ప్రభావం వల్ల తనతల్లి యొక్క పాపశాంతి కొరకు దండమువలె భూమిపై బడి నమస్కరించాడు (45) ఓ ఉమాపతి! దేవ! మాతల్లి యొక్క దురితాన్ని క్షమించండి. మూఢురాలైన తమను తెలుసుకొనని ఆమెను క్షమించి ఓ శంకర! నీవు ప్రసన్నుడవుకమ్ము (46) నీ భక్తివల్ల కలిగిన ఏదైనా పుణ్యమునాలో ఉంటే దానివల్ల కూడా, ఓశివ! నాతల్లి నీదయను పొందని (47) అని ప్రార్థించి గిరీశుని మాటిమాటికి నమస్కరించి, సూర్యుడు అస్తమించాక బాలుడు, శివాలయము నుండి వెళ్ళిపోయాడు (48) ఆ పిదప తన శిబిరాన్ని పురందరుని (ఇంద్రుని) పురంవలె ఉన్నదానిని చూచాడు. వెంటనే బంగారుమయమైన విచిత్ర వైభవముతో వెలగిపోతున్న దానిని చూచి (49) ఆతడు భవనంలో పలికి ప్రవేశించి ఆ రాత్రి ఆనందిస్తూ, మహామణి గణములతో నిండిన, బంగారు రాసులతో వెలుగుతున్న (50) భవనంలో తన తల్లిని, ఏ భయములేని దానిని, స్మరిస్తున్న దానిని, మహా విలువగల రత్నపర్యంక మందు తెల్లని పడకను అధివసించిన దానిని, (51), రత్న అలంకారములతో వెలిగిపోతున్న అవయవములు కలదానిని, దివ్యమైన వస్త్రములతో ప్రకాశిస్తున్న దానిని, దివ్య లక్షణములు కలదానిని, సాక్షాత్తు దేవతా స్త్రీవలె ఉన్నదానిని (52) చూచి వేగంగా సంభ్రమముతో విప్పారిన కళ్ళు గలవాడై, ఆమెను లేపసాగాడు. అమ్మ! మేలుకో. నీవు క్షేమమే కదా. ఈ గొప్ప అద్భుతాన్ని చూడు (53) అని మహాత్ముడైన తన పుత్రునితో మేల్కొలుపబడ్డది ఆగోపిక. ఆ తల్లి నవ్వుతోంది. కిరీటంతో వెలిగిపోతుంది. ఆమెను చూచాడు. (54) ఆమె త్వరగా లేచి అదంతా చూచింది. తాను అపూర్వంగా కన్పించింది. బాలుకుడు కొత్తగా కన్పిస్తున్నాడు (55) తన ఇల్లు కొత్తగా కన్పిస్తోంది. ఇదంతా చూచి సుఖంతో విహ్వలురాలైంది. పుత్రుని ముఖం నుండి శివుని అనుగ్రహం అంతావిని (56) నిరంతరము శివుని ఆరాధించే రాజుకు తెలిసింది. నియమాన్ని పూర్తిచేసి ఆ రాత్రి ఆ రాజు త్వరగా వచ్చి (57) శివుని సంతోషపెట్టిన గోపకుమారుని ప్రభావాన్ని చూచాడు. శివుని స్థానము బంగారుమయమైంది. లింగము మణులతో కూడింది (58) అట్లాగే గొల్లస్త్రీ యొక్క, మాణిక్య శ్రేష్ఠములతో వెలిగే ఇంటిని అంతా చూచిరాజు మంత్రులు పురోహితులు (59) కొద్ది క్షణాలు ఆశ్చర్యపడ్డారు. రాజు పరమానందభరితుడైనాడు. ఆనందంతో (ప్రేమ) కన్నీళ్ళు వదులుతూ ఆ పిల్లవానిని కౌగిలించుకున్నాడు. (60) ఇట్లా అత్యద్భుతమైన శక్తిగల శివమాహాత్మ్యాన్ని కీర్తించినందువల్ల పౌరుల సంభ్రమముతోను ఆ రాత్రి ఒక పండుగలా గడిచింది (61).

మూ || అథప్రభాతేయుద్ధాయపురంసంరుంధ్యసంస్థితాః|రాజానఃచారవక్త్రేభ్యఃశుశ్రువుఃపర మాద్భుతం || 62 ||

తేత్యక్తవైరాః సహసారాజానశ్చకితా భృశం | న్యస్తశస్త్రా నివి విశుఃచంద్రసే నానుమోదితాః || 63 ||

తాంప్రవిశ్య పురీం రమ్యాం మహాకాలం ప్రణమ్యచ | తద్గోపవని తాగే హమాజగ్ముః సర్వభూభృతః || 64 ||

తేతత్ర చంద్రసేనేన ప్రత్యుద్గమ్యాభిపూజితాః | మహార్ష విష్టరగతాః ప్రీత్యా నందన్‌ సువిస్మితా || 65 ||

గోపమానోః ప్రసాదాయ ప్రాదుద్భూతం శివాలయం | లింగంచవీక్ష్య సుమహచ్ఛివేచక్రుః పరామతిం || 66 ||

తసై#్మగోపకుమారాయ ప్రీతాస్తే సర్వభూభుజః | వాసోహిరణ్యరత్నాని గోమహిష్యాదికంధనం || 67 ||

గజనశ్వాన్‌ రథాన్‌ రౌక్మాన్‌ ఛత్రయాన పరిచ్ఛదాన్‌ | దాసాన్‌దాసీరనే కాశ్చదదుఃశివః కృపార్థినః || 68 ||

యేయే సర్వేషు దేశేషు గోపాస్తిష్ఠంతి భూరిశః | తేషాంతమే పరాజానం చక్రిరే సర్వపార్థివాః || 69 ||

అథాస్మిన్నంతరే సర్వైఃత్రిదశైరభి పూజితః | ప్రాదుర్భ భూవతేజస్వీ హనుమాన్వానరేశ్వరః || 70 ||

తస్యాభిగమనాదేవ రాజానోజాత సంభ్రమాః | ప్రత్యుత్థాయ సమశ్చక్రుః భక్తినమ్రాత్మమూర్తయః || 71 ||

తేషాంమధ్యే సమాసీనః పూజితః ప్లవగేశ్వరః | గోపాత్మజం సమాశ్లిష్యరాజ్ఞోవీక్ష్యేదమ బ్రవీత్‌ || 72 ||

సర్వే శృణుత భద్రంవోరాజానోయే చదేహినః | శివపూజామృతేనాన్యా గతిరస్తి శరీరిణాం || 73 ||

ఏషగోపసుతో దిష్ట్వా ప్రదోషేమందవాసరే | అమంత్రేణాపి సంపూజ్య శివం శివమవాస్తవాన్‌ || 74 ||

మందవారే ప్రదోషో7యం దుర్లభః సర్వదేహినాం | తత్రాపిదుర్ల భతరః కృష్ణపక్షే సమాగతే || 75 ||

ఏషపుణ్యత మోలోకే గోపానాం కీర్తవర్థనః | అస్యవంశే7ష్ఠమో భావీనందో నామ మహాయశాః

ప్రాప్స్యతే తస్యపుత్రత్వం కృష్ణో నారాయణః స్వయం || 76 ||

అద్యప్రభృతి లోకేస్మిన్నేష గోపాలనందనః | నామ్నాశ్రీకర ఇత్యుచ్చైః లోకేఖ్యాతిం గమిష్యతి || 77 ||

సూత ఉవాచ -

ఏవముక్త్వా జనీసూనుః తసై#్మగోపకసూనవే | ఉపదిశ్య శివాచారం తత్రైవాంతర ధీయత || 78 ||

తేచ సర్వేమహీపాలాః సంహృష్టాః ప్రతిపూజితాః | చంద్రసేనం సమామంత్ర్య ప్రతిజగ్ముర్యథా గతం || 79 ||

శ్రీకరో7పి మహాతేజా ఉపదిష్టో హనూమతా | బ్రహ్మాణౖః సహధర్మజ్ఞైః చక్రేశంభోః సమర్హణం || 80 ||

కాలేన శ్రీకరః సో7పి చంద్రసేనశ్చ భూపతిః సమారాథ్య శివం భక్త్యా ప్రాపతుః పరమంపదం || 81 ||

ఇదం రహస్యం పరమం పవిత్రం యశస్కరం పుణ్యమహర్థి వర్ధనం || 82 ||

ఆఖ్యాన మాఖ్యాత మఫ°ఘనా శనంగౌరీశ పాదాంబుజ భక్తి వర్థనం

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే గోపకుమార చరిత వర్ణనం నామ పంచమో7ధ్యాయః || 5 ||

తా || పిదప ఉదయమందు యుద్ధం కొరకు పట్టణాన్ని అడ్డగించి ఉన్నారు. రాజులు చారుల ద్వారా పరమ అద్భుతాన్ని విన్నారు (62) ఆరాజులు వైరాన్ని విడిచి త్వరగా, అతిగా చకితులై, శస్త్రములు పారవేసి, చంద్రసేనునితో అనుజ్ఞపొంది నగరంలో ప్రవేశించారు (63) అందమైన ఆనగరంలో ప్రవేశించి మహాకాలునికి నమస్కరించి ఆ రాజులంతా ఆ గొల్లస్త్రీ గృహమునకు వచ్చారు (64) అక్కడ చంద్రసేనుడు ఎదుర్కొని వారిని పూజించాడు. చాలా విలువైన ఆసనములందు కూర్చుండి, ప్రీతితో చాలా ఆశ్చర్యంతో కూడి ఆనందించారు (65) గోపకుమారునిపై అనుగ్రహంతో ఆ శివాలయము ఏర్పడింది. దాన్ని మహాలింగాన్ని చూచి తమబుద్ధిని శివుని యందు నిలిపారు (66) ఆ గోపకుమారునిపై ప్రేమ గలవారై ఆ రాజులంతా అతనికి ధనము, బంగారము రత్నములు గోమహిషములు మొదలగు ధనమును (67) ఏనుగులు, గుఱ్ఱములు రథములను బంగారు ఛత్రములు పల్లకి కప్పుకునేవాటిని దాసులను దాసీలను అనేకమైన వాటిని, శివుని కృపను యాచించినవారై ఇచ్చారు (68) అన్ని దేశములలో ఎక్కువగా ఏ ఏగోపకుమారులున్నారో వారందరికి ఈ గోపబాలునే రాజుగా చేశారు, ఆ రాజులంతా కలిసి (69) ఇక ఇంతలో దేవతలందరితో పూజింపబడి, తేజస్వి వానరేశ్వరుడు హనుమంతుడు కన్పించాడు (70) అతని రాకతో రాజులంతా తొట్రుపాటునొంది ఎదురేగి, భక్తితో వంగిన తమతమ ఆకారము గలవారై నమస్కరించారు (71) వారిమధ్యలో కూర్చుండి హనుమంతుడు పూజింపబడ్డాడు. గోపకుమారుణ్ణి కౌగిలించుకొని రాజును చూచి ఇట్లా పలికాడు (72) అందరూ వినండి, రాజులు ఏ ఇతర ప్రాణాలున్నారో, మీకందరికి క్షేమకరము. శరీరధారులకు శివపూజ తప్ప మరో గతిలేదు (73) ఈ గోపసుతుడు అదృష్టవశాత్తు శనివారం ప్రదోష సమయమందు శివుణ్ణి మంత్రం లేకుండానే పూజించి మంగళమును పొందాడు. (74) శనివారం ప్రదోష సమయం లభించటము ప్రాణులకు దుర్లభము. అక్కడ కూడా కృష్ణ పక్షంలో లభించటము ఇంకా దుర్లభతరము (75) ఈతడు లోకంలో పుణ్యతముడు. గోపకుల కీర్తిని ఇనుమడింపచేసేవాడు. ఈతని వంశంలో ఎనిమిదవవాడు నందుడనువాడు గొప్ప కీర్తి గలవాడు కలుగబోతాడు. ఆతనికి నారాయణుడు స్వయముగా కృష్ణుడై పుత్రుడౌతాడు. (76) నేటినుండి వీడు ఈ లోకంలో గోపాలనందనుడు. శ్రీకరుడను పేరుతో లోకంలో గొప్పకీర్తిని పొందుతాడు (77) సూతుడిట్లన్నాడు - ఈవిధముగా అంజనీసుతుడు ఆ గోపకుమారునితో పలికి శివపూజా విధానాన్ని ఉపదేశించి అక్కడే అదృశ్యడైనాడు (78) ఆరాజులంతా ఆనందించి పూజించారు. చంద్రసేనునితో చెప్పి రాజులు వచ్చిన చోటికి వెళ్ళారు. (79) మహాతేజస్సు గల శ్రీకరుడు కూడా హనుమంతునితో ఉపదేశింపబడి, ధర్మమెరిగిన బ్రాహ్మణులతో కూడి శంభుని పూజచేశాడు (80) కొంతకాలానికి ఆ శ్రీకరుడు ఆచంద్రసేన రాజు శివుని భక్తితో పూజించి పరమ, పదమును చేరారు (81) ఇది పరమ రహస్యమైనది. పవిత్రమైనది. కీర్తినిచ్చేది, పుణ్యకరమైనది గొప్ప వృద్ధిని చేకూర్చేది. పాప సమూహమను నశింపచేసేది. గౌరీశ పాదాంబుజములందు భక్తిని పెంచేది. ఈ కథను మీకు చెప్పాను. (82) అని శ్రీ స్కాందే మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మోత్తర ఖండమందు గోపకుమార చరిత వర్ణన మనునది ఐదవ అధ్యాయము || 5 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters