Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఆరవ అధ్యాయము

మూ || ఋషయ ఊచుః -

యదుక్తం భవతా సూత మహదాఖ్యాసమద్భుతం | శంభోర్మాహాత్మ్య కథనం అశేషా ఘహరం పరం || 1 ||

భూయోపి శ్రోతు మిచ్ఛామః తదేపసు సమాహితః | ప్రదోషే భగవాన్‌ శంభుః పూజితస్తు మహాత్మభిః || 2 ||

సంప్రయచ్ఛతి కాంసిద్ధిం ఏతన్నో బ్రూహిసువ్రత | శ్రుతమప్యసకృత్‌ సూత భూయ స్తృష్ణా ప్రవర్థతే || 3 ||

సూత ఉవాచ -

సాధుపృష్టం మహాప్రాజ్ఞా భవద్భిర్లో కవిశ్రుతైః అతోహం సంప్రవక్ష్యామి శివపూజా ఫలంమహత్‌ || 4 ||

త్రయోదశ్యాంతి థౌ సాయం ప్రదోషః పరికీర్తితః | తత్రపూజ్యో మహాదేవో నాన్యోదేవః ఫలార్థిభిః || 5 ||

ప్రదోష పూజామాహాత్మ్యం కోనువర్ణయితుంక్షమః | యత్రసర్వే7పి విబుధాః తిష్ఠంతి గిరిశాంతికే || 6 ||

ప్రదోష సమయేదేవః కైలాసే రజతాలయే | కరోతినిత్యం విబుధైః అభిష్ఠుత గుణోదయః || 7 ||

అతః పూజా జపోహోమః తత్కథాస్తద్గుణస్తవః | కర్తవ్యో నియతంమర్త్యైః చతుర్వర్గ ఫలార్థిభిః || 8 ||

దారిద్ర్యతి మిరాంధానాం మర్త్యానాం భవభీరుణాం | దుఃఖశోక భయార్తానాం ప్లవో7యం పారదర్శనః || 9 ||

దుఃఖ శోక భయార్తానాం క్లేశనిర్వాణ మిచ్ఛతాం | ప్రదోషే పార్వతీశస్య పూజనం మంగలాయనం || 10 ||

దుర్భుద్ధిర పినీచోపి మందభాగ్యః శఠో7పివా | ప్రదోషే పూజ్యదేవేశం వి పద్భ్యః సప్రముచ్యతే || 11 ||

శత్రుభిః హన్యమానో7పి దశ్యమానోపి పన్నగైః | శైలైరాక్రమ్యమాణో7పి పతితో7పి మహాంబుధౌ || 12 ||

ఆవిద్ధకాలదండో7సినానారోగహతో7పివా | నవినశ్యతి మర్త్యో7సౌ ప్రదోషే గిరిశార్చనాత్‌ || 13 ||

దారిద్ర్యంమరణం దుఃఖంఋణభారంనగోపమం | సద్యోవిధూయ సంపద్భిః పూజ్యతే శివపూజనాత్‌ || 14 ||

అత్రవక్ష్యేమహాపుణ్యం ఇతిహాసంపురాతనం | యంశ్రుత్వామనుజాః సర్వే ప్రయాంతి కృతకృత్యతాం || 15 ||

ఆ సీద్విదర్భ విషయేనామ్నా సత్యరథోనృపః | సర్వధర్మరతో ధీరః సుశీలః సత్యసాగరః || 16 ||

తస్యపాలయతో భూమి ధర్మేణ మునిపుంగవాః | వ్యతీయాయ మహాన్‌ కాలఃసుఖేనైవ మహామతేః || 17 ||

అథతస్య మహాభర్తుః బభూవుః శాల్వ భూభుజః | శత్రవశ్చోద్థత బలాదుర్మర్షణ పురోగమాః || 18 ||

కదాచిదథతేశాల్వాఃసంసద్థ బహుసైనికాః | విదర్భనగరీం ప్రాప్య రురుధుః విజిగీషనః || 19 ||

దృష్ట్వానిరుధ్య మానాంతాం విదర్భాదిపతిఃపురీం | యోద్దుమభ్యాయ¸°తూర్ణం బలేన మహాతావృతః || 20 ||

తా || ఋషులిట్లన్నారు - ఓసూత - మీరు గొప్పదైనా అద్భుతమైన ఏ అఖ్యానాన్ని చెప్పారో అది శంభువు యొక్క మాహాత్మ్యాన్ని తెల్పేది. పాపములనంతా హరించేది పరమమైనది (1) తిరిగి మేము జాగ్రత్తగా అట్టి దానినే వినదలిచాము. మహాత్ములు శివుని ప్రదోషకాలమందు పూజిస్తే ఆ భగవానుడు (2) ఏ సిద్ధిని ఇస్తాడో దానిని మాకు చెప్పండి, ఓ సువ్రత. ఒకసారి విన్నా ఓసూత! మాకు మళ్ళా కుతూహలం పెరుగుతోంది (3) అని అనగా సూతులవచనము - మహా ప్రాజ్ఞులార! లోక విశ్రుతులైన మీరు బాగా అడిగారు. అందువల్ల నేను గొప్పదైన శివపూజా ఫలమును గూర్చి చెపుతున్నాను. (4) త్రయోదశి తిథి సాయంకాలము ప్రదోషమన బడుతుంది. ఫలంకోరేవాడు అప్పుడు మహాదేవుని పూజించాలి. మరోదేవుణ్ణికాదు (5) ప్రదోష పూజా మహాత్మ్యాన్ని వర్ణించటానికి ఎవడు సమర్థుడు. అప్పుడు పండితులంతా శివుని దగ్గర కూర్చుంటారు (6) ప్రదోష సమయమందు దేవుడు కైలాసంలో రజత ఆలయమందు, గుణముల ఉదయాన్ని పొగుడుతుండగా విబుధులతో పాటునృత్యం చేస్తాడు (7) అందువల్ల పూజ, జపము, హోమము, ఆయన కథలు, ఆతని గుణస్తుతి వీటిని చతుర్వర్గఫలాన్ని కోరే నరులు తప్పకుండా ఆచరించాలి (8) దారిద్ర్యమనే చీకటితో గుడ్డివారైన, పుట్టుకవల్ల భయమునొందే నరులకు భవసాగరమగ్నులకు ఒడ్డును చేర్చే తెప్పఇది (9) దుఃఖ శోక భయములతో ఆర్తులైన వారికి, క్లేశముల నుండి ముక్తిని కోరే వారికి ప్రదోష కాలమందు పార్వతీశుని పూజ మంగళములను కూరుస్తుంది (10) దుర్భుద్ధి గలవాడు, నీచుడు, మందభాగ్యుడు శరుడు వీరంతా ప్రదోషకాల మందు దేవేశుని పూజిస్తే వారు ఆపదలనుండి ముక్తులౌతారు (11) శత్రువులతో చంపబడేవాడు. పాములతో కరువబడేవాడు. పర్వతములతో ఆక్రమింపబడేవాడు, సముద్రమందు పడినవాడు (12) కాలదండంతో కొట్టబడినవాడు, అనేక రోగములతో బాధపెట్టబడినవాడు వీరంతా ప్రదోషకాలమందు గిరిఈశుని అర్చించిన నశించరు (13) దారిద్ర్యము, మరణము, దుఃఖము, ఋణభారము ఇవన్ని పర్వతముల వంటివి. శివపూజ వలన వెంటనే వీటిని తొలగించుకొని సంపదలతో పూజింపబడుతాడు (14) ఇప్పుడు మహాపుణ్యమైన ప్రాచీనమైన ఒక ఇతిహాసాన్ని చెబుతాను. దీనిని విన్న మనుజులంతా కృతకృత్యత నందుతారు (15) విదర్భదేశ మందు సత్యరథుడను పేరుగలరాజు ఉండేవాడు. సర్వధర్మములందు నిరతుడు ధీరుడు సుశీలుడు సత్యసంగరుడు (16) ఆతడు ధర్మం ప్రకారం భూమిని పాలిస్తుండగా చాలా కాలము ఆ మహామతికి సుఖంగానే గడిచిపోయింది. ఓముని పుంగవులార! (17) ఆరాజుకు శాల్వరాజులు, అధిక బలంగలవారు దుర్మర్షణుడు మొదలుగువారు శత్రవులేర్పడ్డారు (18) ఒకసారి ఆ శాల్వులు అనేక సైన్యం కలవారై విదర్భ నగరానికి వచ్చి, దాన్ని జయించాలనే కోరికతో దాన్ని అడ్డగించారు (19) విదర్భాధిపతి తననగరాన్ని శత్రువులు అడ్డగిస్తుండటం చూచి, చాలా సైన్యంతో కూడి త్వరగా యుద్ధం చేయటానికి వచ్చాడు (20).

మూ || తస్యతై రభవద్యుద్థం శాల్వై రపిబలోద్ధతైః | పాతాలే పన్నగేంద్రస్య గంధర్వై రివదుర్మదైః ||21 ||

విదర్భనృపతిః సో7థ కృత్వాయుద్థం సుదారుణం | ప్రనష్టోరుబలైః శాల్వైః నిహతో రణ మూర్థని || 22 ||

తస్మిన్‌ మహారతథేవీరే నిహతే మంత్రిభిః సహ దుద్రువుః సమరే భగ్నా హతశేషాశ్చ సైనికాః || 23 ||

అధయుద్ధే భివిరతే నదత్సరిపు మంత్రిషు | నగర్యాం యుద్థ్యమానాయాం జాతే కోలాహలే రవే || 24 ||

తస్యసత్యర్థ సై#్యకా విదర్భాధిపతేః సతీ | భూరిశోక సమావిష్టాక్వచిద్యత్నాద్వి నిర్య¸° ||25 ||

సా నిశాసమయే యత్నాత్‌ అంతర్వత్నీ నృపాంగనా | నిర్గతా శోకసంతప్తా ప్రతీచీం ప్రయ¸°దిశం || 26 ||

అథప్రభాతే మార్గేణ గచ్ఛంతీ శనకైః సతీ | అతీత్య దూరమధ్వానం దదర్శ విమలంనరః || 27 ||

తత్రాగత్య వరారోహాతప్తాతాపేన భూయసా | విలసంతం సరస్తీరే ఛాయా వృక్షం సమాశ్రయత్‌ || 28 ||

తత్రదైవ వశాద్రాజ్ఞే విజనే తరుకుట్టిమే | అసూత తనయం సాధ్వీ ముహూర్తే సద్గుణాన్వితే || 29 ||

అథసారాజమహిక్షీ పిపాసాభిహతాభృశం | సరో7వతీర్ణాచార్వంగీ గ్రస్తాగ్రాహెణ భూయసా || 30 ||

జాతమాత్రః కుమారో7పి వినష్టపితృమాతృకః | రురోదోచ్చైః సరస్తీరే క్షుత్పిపాసార్దితో7బలః || 31 ||

తస్మిన్నేవం క్రందమానే జాతమాత్రేకుమారకే | కాచిదభ్యాయ¸° శీఘ్రం దిష్ట్వా విప్రవరాంగనా || 32 ||

నాప్యే కహాయనం బాలముద్వహన్తీనిజాత్మజం | అథునాభర్తృ రహితాయా చమానాగృహే గృహే || 33 ||

ఏకాత్మజా బంధుహీనా యాచ్ఞా మార్గవంశంగతా | ఉమానామద్విజనతీ దదర్శనృపనందనం || 34 ||

సాదృష్ట్వారాజ తనయం సూర్యబింబమివచ్యుతం | అనాథమేనం క్రందంతంచింతయామాసభూరిశః || 35 ||

అహోసుమహదాశ్చర్య మిదందృష్టంమయాధునా | అచ్ఛిన్న నాభిసూత్రో7యం శిశుర్మాతా క్వవాగతా || 36 ||

పితానాస్తిన చాన్యోస్తి నాస్తి బంధుజనో7పివా | అనాథఃకృపణో బాలః శేతే కేవలభూతలే || 37 ||

ఏష చాండాలజో వాపి శూద్రజో వైశ్య జోపివా | విప్రాత్మజో వా నృపజో జ్ఞాయతే కథమర్భకః || 38 ||

శిశుమేనంసముద్ధృత్య పుష్ణామ్యౌరన వద్థ్రువం | కింత్వ విజ్ఞాత కులజం నోత్సహె స్ర్పష్టు ముత్తమం || 39 ||

ఇతి మిమాంస మానాయా తస్యాంవిప్రవరస్త్రియాం || 40 ||

తా || బలోద్ధతులైన శాల్వులతో ఆతనికి యుద్ధం జరిగింది. పాతాళంలో పన్నగేంద్రునకు దుర్ముదులైన గంధర్వులకు జరిగినట్లుగా (21)విదర్భనృపతి చాలా భయంకరముగా యుద్ధముచేసి అధికసైన్యంగల శాల్వుల చేతిలో యుద్ధమందు నష్టాన్ని పొంది, చచ్చిపోయాడు. (22) ఆ మహారధుడైన వీరుడు మంత్రులతో గూడా చంపబడగా యుద్ధమందు చావగా మిగిలిన సైనికులు భగ్నులైనవారు పరుగెత్తారు (23) యుద్ధం సమాప్తి చెందాక శత్రురాజుల మంత్రులు ఆనందిస్తుంటే నగరమందు యుద్ధం జరుగుతుండగా కోలాహలంగా ధ్వనికాగా (24) ఆవిదర్భాధిపతి, సత్యరథుని ఒక భార్య చాలా దుఃఖంపొందినదై ప్రయత్నించి అంతపురిలోని ఒకచోటి నుండి బయటపడింది (25) ఆమె, రాత్రిపూట గర్భిణియైన ఆ రాజు భార్య ప్రయత్నంగా యబటపడి దుఃఖిస్తూ పడమటి దిక్కుగా బయలుదేరింది (26) తెల్లవారాక మెల్లగా దారి వెంటపోతూ ఆమె చాలా మార్గాన్ని దాటి ఒక విమలమైన సరస్సును చూచింది (27) ఆవరారోహ అక్కడికి వచ్చి, అధికమైన తాపంతో తపించినదై సరస్తీరమందున్న నీడగల చెట్టును ఆశ్రయించింది (28) అక్కడ ఎవరూలేని చెట్ల ప్రదేశమందు దైవవశాత్తు రాణి మంచిగుణములు గల ముహూర్తమందు ఆ సాధ్వి ఒక కొడుకును ప్రసవించింది (29) ఆరాజు భార్య చాలా దప్పిక గలదై సరస్సులోకి దిగి ఆసుందరాంగి పెద్ద మొసలితో మింగబడింది. (30) పుట్టుకతోనే తలిదండ్రులను పోగొట్టుకున్న ఆ కుమారుడు ఆకలిదప్పులతో బాధపడుతూ బలహీనుడై సరస్తీరమందు గట్టిగా ఏడ్చాడు (31) పుట్టగానే ఆకుమారుడు ఇట్లా ఏడుస్తుంటే తొందరగా అదృష్టవశాత్తు ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చింది (32) ఆమెకూడా ఒక్క సంవత్సరం పిల్లవాణ్ణి తన కొడుకును ఎత్తుకొని ఉంది. ధనంలేనిది భర్తలేనిది. ఇంటింటికి యాచించేది (33) ఒక కొడుకు గలది, బంధువులు లేనిది. యాచిస్తూ మార్గంలో వస్తూ ఉమ అనుపేరుగల ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ రాకుమారుణ్ణి చూచింది (34) సూర్యబింబింలా పడి ఉన్న ఆ రాకుమారుని చూచి, అనాథుడై ఏడుస్తున్న వీణ్ణి గూర్చి చాలాసేపు ఆలోచించింది (35) చాలా ఆశ్చర్యకరమైన దాన్ని చూశాను. నేనిప్పుడు నాభిసూత్రం తెగిపోలేదింకా వీని తల్లి ఎక్కడికి వెళ్ళిఉంటుంది (36) తండ్రిలేడు మరొకడు లేడు బంధుజనులు లేరు. అనాథకృపణుడు, బాలుడు, కేవలం భూమిపై పడుకొని ఉన్నాడు (37) వీడు చండాలజుడో, శూద్రజుడో, వైశ్యకు కల్గినవాడో, బ్రాహ్మణునికొడుకో రాజుకొడుకో, ఈ పిల్లవాణ్ణి గురించి ఎట్లా తెలుసుకోను? (38) ఈ పిల్లవాణ్ణి ఎత్తుకొని ఔరసపుత్రునివలె పోషిస్తాను, తప్పకుండా. కాని కులం తెలియకుండా ముట్టుకోవటానికి ఉత్సహించలేక పోతున్నాను. ఉత్తమంకాదు (39) అని చింతిస్తుండగా ఆవిప్రస్త్రీ దగ్గరకు (40).

మూ || కశ్చిత్సమాయ¸°భిక్షుఃసాక్షాద్దేవః శివః స్వయం | తామాహభిక్షువర్యోధవిప్రభామిని మాభిదః || 41 ||

రక్షైనం బాలకంసుభ్రూః వినృజ్యహృది సంశయం | అనేన పరమశ్రేయుః ప్రాప్స్యసేహ్య చిరాదిహ || 42 ||

ఏతావదుక్త్వాత్వరితోబిక్షుః కారుణికోయ¸° | అథతస్మిన్‌ గతేభిక్షౌ విన్రబ్ధా విప్రభామినీ || 43 ||

తమర్భకంసమాదాయ నిజమేవ గృహంయ¸° | భిక్షువాక్యేన విశ్రబ్థా సారాజతన యంసతీ || 44 ||

ఆత్మపుత్రేణ సదృశం కృపయాపర్యపోయత్‌ | ఏకచక్రాహ్వయే రమ్యే గ్రామేకృతనికేతనా || 45 ||

స్వపుత్రం రాజపుత్రంచ భిక్షాన్నే నవ్యవర్థయత్‌ |బ్రాహ్మణీ తనయశ్చైవ సరాజతనయస్తథా || 46 ||

బ్రాహ్మణౖః కృతసంస్కారౌ పవృథాతే సుపూజితౌ | కృతోపనయనౌ కాలేబాలకౌని యమేస్థితౌ || 47 ||

భిక్షార్థం చేరతుస్తత్ర మాత్రా సహదినేదినే | తాభ్యాం కదాచిద్బాలాభ్యాం సావిప్రవనితా సహ || 48 ||

బైక్ష్యం చరంతీ దేవేన ప్రవిష్టా దేవతాలయం | తత్రవృద్ధైః సమాకీర్ణే మునిభిః దేవతాలయే || 49 ||

తౌదృష్ట్వా బాలకౌ దీమాన్‌ శాండిల్యోమునిర బ్రవీత్‌ | అహోదైవ బలంచిత్రం అహోకర్మదురత్యయం || 50 ||

ఏషబాలో7స్య జననీంశ్రితో భైక్ష్వేణ జీవతి | ఇమామేవ ద్విజవధూం ప్రాప్యమాతర ముత్తమాం || 51 ||

సహైవద్విజ పుత్రేణ ద్విజ భావం సమాశ్రితః | ఇతిశ్రుత్వామునే ర్వాక్యం శాండిల్య స్యద్విజాంగనా || 52 ||

సావ్రణమ్య సభామధ్యే పర్యపృచ్ఛత్సవిస్మయా | బ్రహ్మన్నే షోర్భకోనీతో మయాభిక్షోః గిరాగృహం || 53 ||

అవిజ్ఞాత కులోద్యాపి సుతవత్పరి పోష్యతే | కస్మిన్‌ కులే ప్రసూతో7యం కామాతా జనకోస్యకః || 54 ||

సర్వం విజ్ఞాతుమిచ్ఛామి భవతోజ్ఞాన చక్షుశః || 55 ||

ఇతి పృష్టోమునిః సోథజ్ఞాన దృష్టిః ద్విజస్త్రియా | ఆచఖ్యౌతస్య బాలస్య జన్మకర్మచ పౌర్వికం || 56 ||

విదర్భరాజపుత్రస్తు తత్పితుః సమరేమృతిం | తన్మాతుర్న క్రహరణం సాకల్యేన స్య వేదయత్‌ || 57 ||

అథసావిస్మితా నారీపునః వప్రచ్ఛతం మునిం సరాజా సకలాన్‌ భోగాన్‌ హిత్వాయుద్థేకథం మృతః || 58 ||

దారిద్ర్యమస్య బాలస్య కథం ప్రాప్తం మహామునే | దారిద్ర్యం పునరుద్థూయ కథం రాజ్యమవాస్స్యతి || 59 ||

అస్యాపి మమపుత్రస్య భిక్షాన్నే నైవజీవతః | దారిద్ర్యశమనోపాయం ఉపదేష్టుం త్వమర్హసి || 60 ||

తా || ఒక భిక్షువు సాక్షాత్తు దేవుడు స్వయంగా శివుడే వచ్చాడు. ఆ బిక్షువర్యుడు ఆమెతో ఇట్లన్నాడు. ఓ విప్రభామిని ఏడవొద్దు (41) ఓ సుభ్రు! మనసులోని అనుమానాన్ని వదలి ఈ బాలుణ్ణి రక్షించు. ఈ పిల్లవానితో, త్వరలో ,ఇక్కడ గొప్ప శ్రేయస్సును పొందుతావు (42) ఇంత మాత్రం పలికి కారుణికుడైన భిక్షువు త్వరగా వెళ్ళిపోయాడు. ఆ భిక్షువు వెళ్ళిపోయాక నమ్మకం కలిగిన ఆ విప్రస్త్రీ (43) ఆ పిల్లవాణ్ణి తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. భిక్షువు వాక్యంపై నమ్మకం కలిగిన ఆమె రాకుమారుని (44) దయతో తన కుమారునితో సమానంగా పోషించింది. ఏకచక్రం అనుపేరుగల అందమైన గ్రామంలో ఇల్లు ఏర్పరచుకొని (45) తన పుత్రుని, రాజపుత్రుని భిక్షాన్నముతో పెంచింది. బ్రాహ్మణికొడుకు, ఆ రాకుమారుడు (46) బ్రాహ్మణులతో సంస్కారాన్ని పొంది బాగా గౌరవింపబడి పెరుగసాగారు. సకాలంలో ఉపనయనములు చేయబడి ఆ బాలకులు నియమమందున్నారు (47) తల్లితో పాటు ప్రతిరోజు భిక్షకోసం తిరుగసాగారు. ఆ పిల్లలతో ఒకసారి ఆ విప్రవనిత (48) భిక్షంచేస్తూ అదృష్టవశాత్తు ఆమె దేవాయంలోకి ప్రవేశించింది. వృద్ధులైన మునులతో కూడిన ఆ దేవాలయమందు (49) ఆ పిల్లలను చూచిన శాండిల్యుడు బుద్ధిశాలి మునిఇట్లన్నాడు. దైవబల ముచిత్రమైంది. కర్మ తప్పించిరానిది (50) ఈ పిల్లవాడు మరోతల్లిని ఆశ్రయించి భిక్షమెత్తి జీవిస్తున్నాడు. ఈ ద్విజస్త్రీని ఉత్తమమైన దానిని తల్లిగా పొంది జీవిస్తున్నాడు. (51) ద్విజపుత్రుని కూడి ద్విజభావాన్ని పొందాడు. అనే శాండిల్య ముని మాటలను విని ఆ బ్రాహ్మణ స్త్రీ (52) సభా మధ్యంలో నమస్కరించి ఆశ్చర్యంతో అడిగింది. ఓ బ్రహ్మన్‌! ఈ పిల్లవానిని భిక్షువు మాటల ప్రకారము నేను ఇంటికి తెచ్చాను (53) ఇప్పటికీ ఈతని కులమేమిటో నాకు తెలియదు. కొడుకులా పోషిస్తున్నాను. ఏ కులంలో పుట్టాడు వీని తల్లెవరు, తండ్రెవరు (54) జ్ఞానచక్షువు గల మీద్వారా అంతా తెలుసుకోవాలని కోరుతున్నాను (55) అని అడుగగా ఆముని జ్ఞానదృష్టి గలవాడు బ్రాహ్మణ స్త్రీతో ఆ బాలుని పూర్వపు కర్మ, జన్మల గూర్చి చెప్పాడు (56) ఈతడు విదర్భరాజు పుత్రుడు. ఆతని తండ్రి యుద్ధంలో మరణించాడు. వాని తల్లిని మొసళ్ళు మింగాయి. అని అంతా చెప్పాడు (57) పిదప ఆ స్త్రీ ఆశ్చర్యపడి ఆ మునిని మరలా ఇట్లా అడిగింది. ఆ రాజు సకల భోగములను వదలి యుద్ధంలో ఎట్టా మరణించాడు. (58 ) ఓ మహాముని! ఈ బాలునికి దరిద్రము ఎట్లా వచ్చింది. దారిద్ర్యాన్ని పోగొట్టుకొని తిరిగి రాజ్యాన్ని ఎట్లా పొందుతాడు. (59 ) వీనికి నాకొడుక్కూ భిక్షాన్నంతోనే జీవనము. దారిద్ర్యం తగ్గిపోయే ఉపాయమును ఉపదేశించటానికి మీరు తగుదురు అనగా (60).

మూ || శాండిల్య ఉవాచ -

ఆ ముష్యబాలస్యపితాస విదర్భ మహీపతిః | పూర్వజన్మ నింపాండ్యే శోబ భూపనృపసత్తమః || 61 ||

సరాజాసర్వధర్మజ్ఞఃపాలయన్‌ సకలాం మహీం ప్రదోషే సమయే శంభుంకదాచిత్‌ ప్రత్యపూజయత్‌ || 62 ||

తస్యపూజయతో భక్త్వా దేవంత్రి భువనేశ్వరం | ఆ సీత్కల కలారావః సర్వత్ర నగరే మహాన్‌ || 63 ||

శ్రుత్వా సముత్కటం శబ్దం రాజాత్యక్త శివార్చనః | నిర్య¸° రాజభవనాత్‌ నగర క్షోభశంకయా || 64 ||

ఏతస్మిన్నే వనమయేతస్యామాత్యో మహాబలః | శత్రుం గృహీత్వా సామంతం రాజాంతి కముపాగమత్‌ || 65 ||

అమాత్యేన సమానీతం శత్రుం సామంత ముద్థతం | దృష్ట్వా క్రోథేన నృపతిః శిరచ్ఛేదమకారయత్‌ || 66 ||

సతథైవమహీపాలో వినృజ్య శివపూజనం | అసమాప్తాత్మని యమః చకారనిశిభోజనం || 67 ||

తత్పుత్రోపితథాచక్రే ప్రదోష సమయేశివం | అనర్చయిత్వామూఢాత్మా భుక్త్వా సుష్వాపదుర్మదః || 68 ||

జన్మాంతరే సనృపతిః విదర్భక్షితిపో7భవత్‌ | శివార్చనాంతరాయేణ వరైర్భోగాంతరేహతః || 69 ||

తత్ఫుత్రోయః పూర్వభ##వే సోస్మిన్‌ జన్మని తత్సుతః | భూత్వాదారిద్ర్య మాపన్నః శివపూజావ్యతి క్రమాత్‌ || 70 ||

అస్యమాతా పూర్వభ##వే సపత్నీంఛద్మనాహనత్‌ | తేనపాపేన మహతా గ్రాహెణాస్మిన్‌ భ##వేహతా || 71 ||

ఏషాప్రవృత్తిరే తేషాం భవత్యై సముదాహృతా | అనర్చిత శివామర్త్యాః ప్రాప్నువంతి దరిద్రతాం || 72 ||

సత్యంబ్రవీమి పరలోకహితం బ్రవీమి | సారం బ్రవీమ్యు పనిషద్ధృదయంబ్రవీమి

సంసారముల్బణ మసారమవాప్యజంతోః | సారోయమీశ్వర పదాంబురుహస్యసేవా || 73 ||

యేనార్చయంతి గిరిశం సమయే ప్రదోషే | యేనార్చితం శివమపి ప్రణమంతిచాన్యే

ఏతత్కథాంశ్రుతి పుటైః నపి బంతి మూఢాః | తేజన్మ జన్మ సుభవంతి సరాదరిద్రాః || 74 ||

యేవై ప్రదోష సమయే పరమేశ్వరస్య | కుర్వంత్య నన్య మనసోం7ఘ్రిం సరోజ పూజాం

నిత్యం ప్రవృద్థ ధనధాన్య కలత్రపుత్ర | సౌభాగ్య సంపదధికాస్త ఇహైవలోకే || 75 ||

కైలాస శైలభవనే త్రిజ గజ్జనిత్రీం | గౌరీం నివేశ్యకనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ | దేవాః ప్రదోష సమయే7ను భజంతి సర్వే || 76 ||

వాగ్దేవీ ధృతవల్లకీశ తమభోవేణుం దధత్‌ పద్మజః | తాలోన్నిద్ర కరోరమాభగవతీ గేయ ప్రయోగాన్వితా

విష్ణుఃసాంద్రమృదంగవాదనపటుఃదేవాఃసమంతాత్‌ స్థితాః | సేవంతేతమసుప్రదోషసమయేదేవం మృడానీపతిం || 77 ||

గంధర్వయక్షపతగోరగసిద్ధసాధ్యావిద్యాధ రామర పరాప్సర సాంగణాశ్చ |

యే7న్యేత్రిలోక నిలయాః సహ భూతవర్గా ః ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థాః || 78 ||

అతః ప్రదోషే శివఏక ఏవ పూజ్యో7థ నాన్యే హరిపద్మ జాద్యాః

తస్మిన్‌ మహెశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాధాః || 79 ||

ఏషతేతనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః | ప్రతిగ్రహైః వయోనిన్యే సయజ్ఞాద్యైః సుకర్మభిః || 80 ||

అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని | తద్దోష పరిహారార్థం శరణం యాతు శంకరం || 81 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మోత్తర ఖండే ప్రదోష మాహాత్మ్య వర్ణనం నామ షష్ఠోధ్యాయః || 6 ||

తా || శాండిల్యుని వచనము - ఈ పిల్లవాని తండ్రి ఆ వాదర్భరాజు. ఆ రాజు పూర్వజన్మలో పాండ్యరాజుగా ఉండేవాడు (61)ఆ రాజు సర్వధర్మజ్ఞడు.. భూమినంతా పాలిస్తూ, ప్రదోష సమయమందు ఒకసారి శివుని పూజించాడు (62) భక్తితో దశివుని పూజిస్తున్న ఆరాజు నగరంలో అంతటా గొప్ప కలకలారావము ఏర్పడింది. (63) ఆ ఎక్కువైన ధ్వనిని విని ఆ రాజు శివార్చనను వదలి, నగరమునుకు క్షభకల్గుతుందనే అనుమానంతో రాజభవనం నుండి బయటికొచ్చాడు (64) ఇంతలో ఆతని మంత్రి మహాబలుడు శత్రువును పట్టుకొని ఆ సామంతునితో రాజు దగ్గరకువచ్చాడు. (65) మంత్రి తెచ్చిన సామంతుడైన ఉద్థతుడైన శత్రువును చూచి రాజు కోపంతో శిరచ్ఛేదం చేయించాడు (66) రాజు అట్లాగే శివపూజను వదలి, తన నియమమును సమాప్తి చేయకుండానే ఆ రాత్రిభుజించాడు (67) ఆతని కొడుకు గూడా ప్రదోష సమయ మందు శివుని అట్లాగే చేశాడు. శివుని పూజించకుండా ఆమూఢాత్ముడు దుర్మదుడు తిని నిద్రపోయాడు (68) మరో జన్మలో ఆరాజు విదర్భరాజైనాడు. శివార్చన అంతరాయంవల్ల ఇతరులతో సుఖముల మధ్యలోనే చపంబడ్డాడు (69) పూర్వజన్మ మందు ఆతని కొడుకు ఎవడో వాడే ఈ జన్మలో ఆతని సుతుడై శివపూజను ఈతిక్రమించి నందువల్ల దరిద్రాన్ని పొందాడు. (70) ఈతని తల్లి పూర్వజన్మలో సవతిని మోసంగా చంపింది. ఆపాపం కారణంగా ఈ జన్మలో మొసలితో చంపబడింది (71) వీళ్ళ నడవడికను నీకు చెప్పాను. శివుని పూజించని నరులు దరిద్ర్యాన్ని పొందుతారు. (72) సత్యం చెప్తున్నాను. పరలోకంలో మేలును చెబుతున్నాను. సారం చెబుతున్నాను. ఉపనిషత్తుల హృదయాన్ని చెబుతున్నాను. అధికమైన సంసారము అసారమైంది. దీనిని పొందిన ప్రాణి సారమైన ఈశ్వర పాదాంబుజ సేవను చేయాలి (73) ప్రదోష సమయమందు శివుని ఆరాధించనివారు, అర్చించిన శివుని నమస్కరించని ఇతురులు, ఈ కథను చెవులతో వినని మూఢులు వారంతా ఆనరులంతా జన్మజన్మలలో దరిద్రులౌతారు (74) ప్రదోష సమయమందు పరమేశ్వరుని పాద సరోజ పూజను ఏకాగ్రచిత్తంతో ఎవరు చేస్తారో, వారు రోజు పెరిగిన ధనము, ధాన్యము, కలత్రము, పుత్రులు, సౌభాగ్యము, సంపదలు ఈ లోకంలేనే అధికంగా కలవారౌతారు (75) కైలాస పర్వత భవనంలో త్రిజగత్తులను సృష్టించే గౌరిని కనకంతో చేసిన రత్న పీఠమందుంచి శూలపాణి నృత్యం చేయటానికి ఇష్టపడుతాడు. ఆ ప్రదోష సమయమందు దేవతలంతా అతనిని సేవిస్తారు (76) వాగ్దేవి వీణను, శతమఖుడు వేణువును, పద్మజుడు (బ్రహ్మ) తాళములు ధరించగా లక్ష్మీదేవి గేయప్రయోగం చేయగా, విష్ణువు మృదంగమును వాయించగా, దేవతలు ఎదురుగా నిలబడగా, ప్రదోష సమయంలో వీరంతా దేవుడైన మృడానీపతిని సేవిస్తున్నారు (77) గంధర్వులు, యక్షులు, పతగ, ఉరగ, సిద్ధులు సాధ్యులు, విద్యాధరులు, అమరపరులు, అప్సరసగుణములు, ఇతరులు త్రిలోకములందున్న భూత వర్గమంతా ప్రదోష సమయంవస్తే వీరంతా హరుని పార్శ్వ మందుంటారు (78) అందువల్ల ప్రదోష మందు శివుణ్ణి ఒక్కణ్ణ పూజించాలి. ఇతరులైన హరిబ్రహ్మ మొదలగు వారిని పూజించరాదు. ఆ మహేశుడు విధిప్రకారం పూజింపబడుతుంటే దేవతలంతా అనుగ్రహిస్తారు (79) ఈ నీకుమారుడు పూర్వజన్మలో బ్రాహ్మణోత్తముడు. వయస్సునంతా దానములు స్వీకరించటంతో గడిపాడు. యజ్ఞాది సుకర్మలు చేయలేదు (80) అందువల్ల దరిద్రాన్ని పొందినాడు నీకుమారుడు ఓ బ్రాహ్మణ వనిత. ఆ దోష పరిహారం కొరకు శంకరుని శరణు వేడని (81) అని శ్రీ స్కాందే మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు మూడవదైన బ్రహ్మోత్తర ఖండమందు ప్రదోష మాహాత్మ్య వర్ణన మనునది ఆరవ అధ్యాయము || 6 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters