Sri Scanda Mahapuranamu-3
Chapters
శ్రీ స్కంద మహాపురాణము ఆంధ్రానువాద సహితము తృతీయఖండము (బ్రహ్మఖండము) అనువాదకులు డా|| కిడాంబి నరసింహాచార్య ఎం.ఎ.పి.హెచ్.డి. (తెలుగు) బి.ఓ.ఎల్ (సంస్కృతం) ప్రకాశకులు శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ గురుకృప 1-10-140/1, అశోక్‌నగర్, హైదరాబాద్ - 500 020. సర్వస్వామ్యములు
ప్రకాశకులవి ప్రథమ
ముద్రణము : 1999 ప్రతులు :
1000 మూల్యము
: రూ. 150/- ఇంటింట దేవతామందిరములందు
పూజింపవలసినవి ఆడపడుచులు
అత్తవారింటికి వెళ్ళునపుడు సారెపెట్టవలసినవి ఆచంద్రార్కము
మనమల మునిమనమల ఆయురారోగ్య భాగ్యసౌభాగ్యసమృద్ధికి ధర్మము
ధనము భోగము మోక్షమునుకోరి చదివి
చదివించి విని
వినిపించవలసినవి వేదవేదాంతరహస్యసుభోధకములైనవి వ్యాసప్రోక్తఅష్టాదశ
(18) మహాపురాణములు. ______________________________________________ వానిని సంస్కృతమూల
- సరళంధ్రానువాద - పరిశోధనలతో శ్రీ వేంకటేశ్వర
ఆర్షభారతి ట్రస్టు ముద్రించి అందించుచున్నది ప్రతులకు :
లేజర్ టైప్ సెట్టింగ్ : ముద్రణ : శ్రీ వేంకటేశ్వర
ఆర్షభారతి ట్రస్ట్ సమంతా గ్రాఫిక్స్ శ్రీ కళాప్రింటర్స్ గురుకృప,
1-1-751, గాంధీనగర్, 1-1-781/సి/1, గాంధీనగర్, 1-1-140/1, అశోక్‌నగర్,
హైదరాబాద్ - 500 080. హైదరాబాద్ - 500 080. హైదరాబాద్
- 500 020. ఫోన్ : 7670949 ఫోన్ : 7611864 శ్రీః ఉపోద్ఘాతము అష్టాదశ
మహాపురాణములలో అతివిస్తృత ప్రమాణమైనది
స్కంధమహాపురాణము. దాదాపు (81,000) శ్లోకాలుండటంచేత
దీనిని ''ఏకాశీతి సాహస్రీ సంహిత'' అని
ఆయా అధ్యాయాంతాలలో పేర్కొనడము జరిగింది. స్కందపురాణంలో
ఏడు ఖండాలున్నాయి. మొదటిది ''మాహేశ్వరఖండము''
ఈఖండంలో కేదారఖండము, కౌమారికాఖండము,
అరుణాచలమాహాత్మ్యము - పూర్వార్థము, అరుణాచలమాహాత్మ్యము
- ఉత్తరార్థం అని నాలుగు భాగాలున్నాయి. రెండవది
వైష్ణవ ఖండము. దీనిలో వేంకటాచల
మాహాత్మ్యము, పురుషోత్తమ (జగన్నాథ)
క్షేత్రమాహాత్మ్యము బదరికాశ్రమ మాహాత్మ్యము,
కార్తీకమాస మాహాత్మ్యము, మార్గశీర్ష మాహాత్మ్యము,
భాగవత మాహత్మ్యము, వైశాఖమాస మాహాత్మ్యము,
అయోధ్య మాహాత్మ్యము అనే ఎనిమిది
భాగాలున్నాయి. మూడవది బ్రాహ్మఖండము.
దీనిలో సేతు మాహాత్మ్యము, ధర్మారణ్య
ఖండము, బ్రాహ్మణోత్తర ఖండం అనే
మూడు విభాగాలున్నాయి. నాల్గవది కాశీఖండం.
దీనిలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు విభాగాలున్నాయి.
అయిదవది ఆవన్త్య ఖండము దీనిలో ఆవన్త్యక్షేత్ర
మాహాత్మ్యము అవంతిలోని ఎనభైనాలుగు
భాగాల మాహాత్మ్యం రేవాఖండం అని మూడు
విభాగాలున్నాయి. ఆరవది నాగరఖండం. ఏడవది
ప్రభాసఖండం. దీనిలో ప్రభాస క్షేత్రమాహాత్మ్యం,
వస్త్రాపథక్షేత్రమాహాత్మ్యం, అర్బుదఖండం.
ద్వారకామాహాత్మ్యం అనే నాలుగు విభాగాలున్నాయి.
ఈ విధంగా భారతదేశంలోని వివిధ క్షేత్రాల
మాహాత్మ్యాలతో తత్తద్దేవతా విభూతి
వర్ణనలతో, అనేకమైన అఖ్యానోపాఖ్యానాలతో
వివిధ ధర్మోపదేశాలతో, తత్తత్సంప్రదాయ
ప్రతిపాదనలతో భరితమైన ఈ స్కందపురాణానికి
భారతదేశాఖండత్వాన్ని చాటే ఒక మహాపురాణంగా
ప్రత్యేకత ఉంది. శ్రీ
వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటికే
కొన్ని పురాణాలు ఆంధ్రానువాదంతో ప్రకటింపబడి
ఉన్నాయి. ఈ స్కందపురాణం పద్నాలుగు సంపుటాలలో
ప్రకటించవలెనని ట్రస్టువారి సంకల్పం. వాటిలో
మూడవదైన బ్రాహ్మఖండంను డా|| కిడాంబి
నరసింహాచార్య గారి ఆంధ్రానువాదంతో ముద్రించి
ఆస్తికుల కరకమలాలలో ఉంచుతున్నందుకు
సంతోషిస్తున్నాము. చక్కని ఆంధ్రానువాదం సమకూర్చిన
డా|| కిడాంబి నరసింహాచార్యగారికి మా కృతజ్ఞతలు
తెలుపుతున్నాం. పండితుల సహాయంతో మిగిలిన
స్కందపురాణ సంపుటాలు ఇతర పురాణాలు కూడా అనతి
కాలంలో భారతీయ సంస్కృతి ప్రియులకు అందజేయగలమని
ఆశిస్తున్నాము. ప్రమాధినామ
సం||ర దీపావళి,
1999 శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు