ఈఆచార్య!
(రాబర్ట్ వాల్సెర్)
జినీవా
22-6-65
ఆచార్యా!
మీరు ఎ. రామస్వామి మూలంగా పంపిన ప్రసాదం అందినది. ఎంతో కృతజ్ఞుడిని. మిమ్ములను తరుచూ స్మరిస్తూ ఉంటారు. మరొక్కమారు ఉత్సాహం కల్గించే మీ సమక్షంలో ఉండాలని కాంక్షిస్తున్నా! నేను మళ్ళా దక్షిణభారతదేశానికి వస్తావా? మీకే తెలియాలి మరి!
నా జీవితం అంతఃకరణంలోని గురువు నిర్ణయించినట్లు క్రమక్రమంగా విప్పారుతున్నది. రోజురోజుకూ అనుభూతి గాఢతరం ఔతుందనీ, కృతకృత్యుణ్ణి ఔతాననీ ఎదురుచూపు. కాని, కంచికివచ్చి, మీ దర్శనం చేయాలన్న కాంక్షమాత్రం వదలటంలేదు. మీ మధురములైన దివ్వబోధలను వినాలన్న కుతూహలం పోవటం లేదు. మీరున్న ఆవరణ ఎంత ప్రశాంతంగా వుండినది. మీవద్దనున్న ఆ బ్రాహ్మణులుఎంత ఆదరణ చూపారని? దేవుడు వాళ్ళందరినీ రక్షింతురుగాక! మిమ్ములను చాలకాలం చిరంజీవులుగా ఉండునట్లు చేయుమని దేవుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తున్నా. ముముక్షువులగు మీజీవితం పరమార్థదాయకంకదా! భారతదేశపు నిజమైన సంపత్తి మీబోటివారే. ఉత్తేజకరంగా ఒక చిన్నమాట ఐనా చాలు, చెప్పండి. అది నాకు ఎంతో సహాయకరంగా వుంటుంది. నా ఆత్మని మీరు అవలోకించినట్లు ఇంతవరకు ఎవరూ చూడలేదు.
నా కృతజ్ఞతా, గౌరవమూ, ప్రేమనూ అందుకోండి-
రాబర్టు వాస్లెర్.
|