Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

సద్గురూ!
(బాబర్టు వాల్సెర్‌)

సద్గురూ!

మీతో గడపిన ముపై#్పనిముషాలు మనస్సులో మొదలుతూనేవుంది. భారతదేశానికి మూడుమార్లు వచ్చాను. దేశమంతా తొమ్మిదినెలలు తిరిగాను. నేను చూచిన వారిలో కెల్లా, నామనస్సు చూరగొనినది. మీరొక్కరే. మీలో ఏదో అనిర్వచనీయమయిన మహత్త్వం ఉండటంచేతనే మిమ్ములను మీ అనుచరులందరూ అంత గౌరవంగా చూడగల్గుతున్నారు. మిమ్ములను వదలిపెట్టగానే ఏదో నాకు తెలియని క్రొత్త ప్రేమ నన్ను ఆవేశించింది. మీ అనుగ్రహమూ ప్రస్ఫుటంగా గోచరించింది. మీరు ప్రశ్నలు అడుగవలసిన అక్కర లేక పోయింది. నన్ను చూడకపూర్వమే నా గూర్చి మీకు తెలిసియుండవలె. అందుచేతనే నాకు మీ దర్శనం ఇవ్వడానికి అంగీకరించారు. మీదర్శనం నా జీవితంలో ఒక గొప్ప ఘట్టం. భారతదేశంలో మీబోటివారు ఇంకా మరికొందరు వుంటే ఎంత బాగుండేది?

నేను భారతదేశం వదలి యూరోపుకు వెళ్ళిపోతున్నా. విమానంలో ఎక్కడానికి ముందు మీకు వ్రాస్తానని మాట ఇచ్చారుకదూ! అది చెల్లించుకొంటున్నా. భారతదేశంలో నాకు వేరే గురువు-బాహిరంగా-కనబడలేదు. కాని నా అంతర్యామి నా ఆంతరంగిక గురువు మేల్కొన్నాడు. 'ఈశ్వరుడి కోసం హిందూదేశంలో వెదకాను. నేనే ఈశ్వరుణ్ణి అని గ్రహించగలిగాను' నాగురువు నాలోనే ఉన్నాడు. అతని కోసం నేను ఎక్కడా వెదుకుతూ వెళ్ళనక్కరలేదు. నేను నా గురువుతోనే ఉన్నా. అందుచేత విఫలమనోరథంతో నేను ఈ దేశంనుంచి వెళ్ళటంలేదు. ఒక దివ్యానుభూతిని పొంది, నాఐశ్వర్యాన్ని నాతోబాటు తరలించుకొని, మరి వెడుతున్నా.

'నీవు దేనిని ఆచరిస్తున్నావో, అనుసరిస్తున్నావో దానినే ఆచరించు, అనుసరించు' అన్న మీబోధ ఎంత ఉత్తేజకరంగావుంది? ఔను. భగవంతుని సారధ్యంతో నేను తప్పుత్రోవలకు వెళ్ళనన్న ధైర్యం కలుగుతూవుంది. భగవానుడుమిమ్ములను సదా రక్షించుగాక. నేను ఎక్కడ ఉన్నా, మీ మనోనేత్రం నాపై ఉంచండి. నాలక్ష్యాన్ని చేరుకొనుటకు మీరు అనుగ్రహించండి. నా భవిష్యత్తు ఏలావుంటుందో నాకు తెలియదు. నా జీవితంలో నేను ఏకార్యాలు చేయాలో కూడ నిర్ణయించుకోలేదు. కానీ భగవంతుడు అడుగడుగుకూ తోడునీడయై దారిచూపుతాడన్న ధైర్యం నాకు కలిగింది. మీరు ఏదైనా అనుగ్రహించి సలహాఇచ్చారంటే అది తప్పక పాటిస్తాను. అది మంచి సలహాగా ఉంటుందన్న నమ్మకం నాలో రూఢిగావుంది. నేను ఏంచేయాలో నాకు తెలపండి.

నా వందనాలు అందుకోండి-

రాబర్టు వాస్లెరు

(రాబర్టు వాస్లెర్‌, యోగాస్కూల్‌ - జ్యూరిచ్‌, స్విట్జర్లాడు.)


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page