Sri Vamana Mahapuranam    Chapters   

పదమూడవ అధ్యాయము

నుకేశిరువాచ :

భవద్భిరుదితా ఘోరా పుష్కరద్వీపసంస్థితిః | జంబూద్వీపస్య సంస్థానం కథయంతు మహర్షయః. 1

ఋషయః ఊచుః:

జంబూద్వీపస్య సంస్థానం కథ్యమానం నిశామయ | నవభేదం సువిస్తీర్ణం స్వర్గమోక్షఫలప్రదమ్‌. 2

మధ్యేత్విలావృతో వర్షో భద్రాశ్వః పూర్వతో7ద్భుతః | పూర్వ ఉత్తరతశ్చాపి హిరణ్యో రాక్ష సేశ్వర. 3

పూర్వదక్షిణతశ్ఛాపి కింనరో వర్షఉచ్యతే | భారతో దక్షిణ ప్రోక్తో హరిర్థక్షిణపశ్చిమే. 4

పశ్చిమే కేతుమాలశ్చ రమ్యకః పశ్చి ఘోత్తరే | ఉత్తరేచ కురుర్వర్షః కల్పవృక్షసమావృతః. 5

పుణ్యారమ్యానవైవేతే వర్షాః శాలకటంకట | ఇలా వృతాద్యాయే చాష్టౌ వర్షం ముక్త్వైవ భరతమ్‌. 6

నతేష్వస్తియుగావస్థా జరామృత్యుభయం నచ | తేషాం స్వాభావికీ సిద్ధిః సుఖప్రాయా హ్యయత్నతః.

విపర్యయోనతేష్వస్తి నోత్తమాధమమధ్యమాః. 7

యదేతద్‌ భారతంవర్షం నవద్వీపం నిశాచర | సాగరాంతరితాః సర్వే ఆగమ్యాశ్చ పరస్పరమ్‌. 8

సుకేశి వచనం : మహర్షులారా ! పుష్కర ద్వీపములోని ఘోరపరిస్థితులు మీరు వర్ణించారు. ఇక జంబూ ద్వీప స్థితి గతులు చెప్పండి. ఋషులన్నారు-రాక్షసపతీ ! ఇక నవ విభాగాత్మకమై సువిశాలమై స్వర్గ మోక్షాలను ప్రదానం చేయగల జంబూద్వీప వృత్తాంతం వినుము. అది మధ్యలో ఇలావృత వర్షం, తూర్పున అద్భుతమైన భద్రాశ్వ వర్షం ఈశాన్యాన హిరణ్యవర్షం ఆగ్నేయాన కింనర వర్షం, దక్షిణాన భారత వర్షం, నైరుతి భాగాన హరివర్షం, పశ్చిమాన కేతుమాల వర్షం, వాయవ్యాన రమ్యక వర్షం, ఉత్తరాన కురువర్షంగా తొమ్మిది వర్షాలలో విభక్త మైనది. ఈ తొమ్మిది భూభాగాలు పవిత్రమైనవి రమణీయమైనవీను. వీనిలో కురువర్షం కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. భారతవర్షం మినహా యిస్తే యిలా వృతాదులు ఎనిమిది వర్షాల్లో యుగ విభాజనం గని జరామరణ భయంగాని ఉండవు. అక్కడి వారలకు అప్రయత్నంగానే సుఖంగా సిద్ధి లభిస్తుంది. అది సహజ సిద్ధం. వారిలో ఉత్తమాధమత్వాది విపక్షగాని ఎలాంటి విపర్య యాలు గాని ఉండవు. ఇక భారత వర్షమో తొమ్మిదవది. ఇవన్నీ సముద్రాలచే వేరుచేయబడి పరస్పరం అగమ్యాలుగా ఉన్నాయి.

ఇంద్రద్వీపః కసేరుమాం స్తామ్రవర్ణోగభస్తిమాన్‌ | నాగద్వీపః కటాహశ్చ సింహలో వారుణస్తథా. 9

అయంతునవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః | కుమారాఖ్యః పరిఖ్యాతో ద్వీపో7యందక్షిణోత్తరః. 10

పూర్వేకిరాతా యస్యాంతే పశ్చిమేయవనాః స్థితాః | ఆంధ్రాదక్షిణతో వీర తురుష్కాస్త్వపి చోత్తరే. 11

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చంతరవాసినః | ఇజ్యాయుద్ధవణిజ్యాద్యైః కర్మభిః కృతపావనాః.

తేషాం సంవ్యవహారశ్చ ఏభిః కర్మభిరిష్యతే | స్వర్గాపవర్గప్రాప్తిశ్చ పుణ్యం పాపం తథైవచ. 13

మహేంద్రోమలయః సహ్యః శుక్తిమాన్‌ ఋక్షపర్వతః | వింధ్యశ్చపారియాత్రశ్చ సప్తాత్రకులపర్వతాః. 14

తథాన్యేశతసాహస్రా భూధరా మద్యవాసినః | విస్తారోచ్ఛ్రాయిణోరమాయా విపులాః శుభసానవః. 15

కోలాహలః సవైభ్రాజోఃమందరోదర్దురాచలః | వాతంధమో వైద్యుతశ్చ మైనాకః సరసస్తథా 16

తుంగప్రస్థోనాగగిరి స్తథా గోవర్థనాచలః | ఉజ్జాయనః పుష్పగిరి రర్భుదోరైవత స్తథా. 17

ఋష్యమూకః సగోమంత శ్చిత్రకూటః కృతస్మరః | శ్రీపర్వతః కొంకణశ్చ శతశో7న్యే7పి పర్వతాః . 18

తైర్విమిశ్రాజనపదా వ్లుెచ్ఛా ఆర్యాశ్చ భాగశః | తై ఃపీయంతే సరిచ్ఛ్రేష్ఠా యాస్తాః సమ్యజ్‌ నిశమయ. 19

సరస్వతీ పంచరూపా కాళిందీసహిరణ్వతీ | శతద్రుశ్చంద్రికానీలా వితసై#్తరావతీ కుహూః. 20

మధురాహారరావీచ ఉశీరా ధాతుకీ రసా | గోమతీధూతపాపాచ బాహుదా సద్బషద్వతీ. 21

నిశ్చిరా గండకీ చిత్రా కౌశికీచవధూసరా | సరయూశ్చ సలౌహీత్యా హిమవత్పాదనిఃసృతాః. 22

ఇక భారత వర్షం - యింద్ర ద్వీపం, కసేరుమాన్‌, తామ్రవర్ణం, గభస్తిమాన్‌ నాగద్వీపం, కటాహం, సింహళం, వారుణం, కుమారం అనే తొమ్మిది ద్వీపాలుగా విభక్తమైంది. వానిలో యిది దక్షిణోత్తర దిశలో సముద్రం చేత చుట్టబడియున్న కుమార ద్వీపం. ఓ వీరుడా ! దీనికి తూర్పున కిరాతులు, పడమట యవనులు, దక్షిణాన ఆంధ్రులు ఉత్తర సీమన తురుష్కులు ఉన్నారు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర జాతులవారు యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యం, గోపాలనం మొదలయిన విద్యుక్తధర్మాలను నిర్వహిస్తూ పవిత్రులైనారు వారల పరస్పర ఆచరణలు, స్వర్గమోక్ష సంపాదనము, పుణ్య పాపాలు, కర్మాచరణాన్న ననుసరించి నిర్ణయింప బడుతవి. అక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్‌, ఋక్ష, వింధ్య పారియాత్రములనే సప్తకుల పర్వతాలున్నవి. ఈ ప్రధాన గిరులు కాక వందలు వేల సంఖ్యలో విస్తార వైశాల్యాలు గలిగి రమణీయాలయిన యితర పర్వతాలు కూడ ఉన్నవి. కోలాహలం వైభ్రాజం, మందరం, దుర్దురం వాతంధమం వైద్యుతం, మైనాకం, సరసం, తుంగప్రస్థం, నాగగిరి, గోవర్ధనాచలం, ఉజ్జాయనం, పుష్పగిరి, అర్బుదం, రైవతం, ఋష్యమూకం, గోమంతం, చిత్రకూటం, కృతస్మరం, శ్రీపర్వతం, కొంకణం వానిలో కొన్ని. ఈ పర్వత ప్రదేశాలతో కలిసి వ్లుెచ్ఛ ఆర్యజనపదాలెన్నో వెలిశాయి. వీనికి జల ప్రదానం గావించే శ్రేష్ఠ నదులను గురించి చెబుతున్నాము. జాగ్రత్తగా వినుము. సరస్వతి, పంచరూప, కాళింది, హిరణ్వతి, శతద్రు, చంద్రిక, నీల, వితస్త ఐరావతి, కుహూ, మధురా, హారరావీ, ఉశీర, ధాతుకి, రసా, గోమతి, ధూతపాపా, బాహుద, దృష ద్వతి, నిశ్చిరా, గండకి, చిత్ర, కౌశికీ, వధూసరా, సరయూ, లౌహిత్య ఈ నదులు హిమవత్పాద భూమినుంచి ఉద్గమిస్తాయి.

వేదస్మృతి ర్వేదసినీ వృత్రఘ్నీ సింధురేవచ | పర్ణాశానందినీచైవ పావనీచ మహితథా. 23

పారాచర్మణ్వతీ లూపివిదిశా వేణుమత్యపి | సిప్రాహ్యవంతీచతథా పారియాత్రాశ్ర యాఃస్మృతాః. 24

శోణోమహానదశ్చైవ నర్మదాసురసా కృపా | మందాకినీదశార్ణాచ చిత్రకూటాపవాహికా. 25

చిత్రోత్పలావైతమసా కరమోదా పిశాచికా | తథాన్యాపిప్పల శ్రోణీ విపాశావంజులావతీ. 26

నత్సంతజాశుక్తిమతీ మంజీష్ఠా కృత్తిమావసుః | ఋక్షపాదప్రసూతాచ తథాన్యా బలవాహినీ. 27

శివా పయోష్ణీనిర్వింధ్యా తాపీ సనిషధావతీ | వేణాపైతరణీ చైవ సినీవాహుః కుముద్వతీ. 28

తోయాచైవ మహాగౌరీ దుర్గంధావా శిలాతథా | వింధ్యపాదప్రసూతాశ్చ నద్యః పుణ్యజలాః శుభాః. 29

గోదావరీ భీమరథీ కృష్ణావేణా సరస్వతీ | తుంగభద్రా సుప్రయోగా వాహ్యా కావేరిరేవచ. 30

దుగ్ధోదానలినీరేవా వారిసేనా కలస్వనా | ఏతాస్త్వపిమహానద్యః సహ్యపాదవినిర్గతాః. 31

కృతమాలాతామ్రపర్ణీ వంజులా చోత్పలావతీ | సినీచైవసుదామాచ శుక్తిమత్ర్పభవాస్త్విమాః. 32

సర్వాః పుణ్యాః సరస్వత్యః పాపప్రశమనాస్తథా | జగతోమాతరః సర్వాః సర్వాః సాగరయోషితః. 3

అన్యాః సహస్రశశ్చాత్ర క్షుద్రనద్యో హి రాక్షస | సదాకాలవహాశ్చాన్యాః ప్రావృట్కాలవహాస్తథా.

ఉదఙ్‌ మధ్యోద్భవా దేశాః పిబంతిస్వేచ్ఛయాశుభాః. 34

వేదస్మృతి, వేదసినీ, వృత్రఘ్ని, మహీ. పారా, చర్మణ్వతి, లూపి, విదిశా , వేణుమతి, సిప్ర, అవంతీ అనే నదులు పారియాత్రగిరి నాశ్రయించియున్నవి. శోణా మహానది, నర్మద, సురస, కృపా, మందాకిని, దశార్ణ, చిత్ర కూటా, అపవాహిక, చిత్రోత్పల, తమసా, కరమోద, పిశాచిక, పిప్పలశ్రోణి, విపాశ, వంజులావతి, సత్సంతజ, శుక్తిమతి, మంజిష్ఠా, కృత్తిమా, వస, తదితర నదులు ఋక్షగిరి నుంచి ప్రభవించినవి. శివ, పయోష్ణి, నిర్వింధ్య, తాపి, నిషధావతి, వేణా, వైతరణీ, సినీబాహు. కుముద్వతి, తోయా, మహాగౌరీ, దుర్గంధా, వాశిలా, యీ పవిత్ర నదులువింధ్య పాద మూలాన ప్రభవించినవి. గోదావరి, భీమరథీ, కృష్ణా, వేణా, సరస్వతి, తుంగభద్ర, సుప్రయోగా, వాహ్యా, కావేరి, దుగ్ధోద. నళినీ, రేవా, వారిసేన, కలస్వనా, ఈ మహాతరంగిణులు సహ్యాద్రి కుమారికలు. కృతమాల, తామ్ర పర్ణి, పంజుల, ఉత్పాలావతి, సినీ, సుదామ, యివి శుక్తిమత్పర్వత పుత్రికలు. ఈ నదులన్నీ పరమ పవిత్రాలు, సాగర పత్నులు. రాక్షసవరా ! యింకా ఎన్నో వేలాది క్షుద నదులున్నవి. కొన్ని అన్ని ఋతువుల్లో ప్రవహించేవి కాగా యితరాలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ తమకందుబాటు గల ప్రదేశాలకు పుష్కలంగా జలప్రదానం చేస్తాయి.

మత్స్యఃకుశట్టాః కుణికుండలాశ్చ పాంచాలకాశ్యాః సహకోసలాభిః. 35

వృకాఃశబరకౌవీరాః సభూలింగాజనాస్త్విమే | శకాశ్చైవసమశకా మధ్యదేశ్యాజనాస్త్విమే. 36

బాహ్లీకావాటధానాశ్చ ఆభీరాః కాలతోయకాః | అపరాంతాస్తథాశూద్రాః పహ్లవాశ్చసఖేటకాః. 37

గాంధారాయావనాశ్చైవ సింధుసౌవీరమద్రకాః | శాతద్రవాలలిత్థాశ్చ పారావతసమూషకాః. 38

మాఠరోదకధారాశ్చ కైకేయా దశమాస్తథా | క్షత్రియాః ప్రాతివైశ్యాశ్చ వైశ్యశూద్రకులానిచ. 39

కాంబోజాదరదాశ్చైవ బర్బరాహ్యంగలౌకికాః | చీనాశ్చైవతుషారాశ్చ బహుధా బాహ్యతోదరాః. 40

ఆత్రేయాఃసభరద్వాజాః ప్రస్థలాశ్చదశేరకాః | లంపకాస్తావకారామాః శూలికాస్తంగణౖఃసహ. 41

ఔరసశ్చాలిమద్రాశ్చ కిరాతానాంచజాతయః | తామసాఃక్రమమాసాశ్చ సుపార్శ్వాః పుండ్రకాస్తథా. 42

కులూతాః కుహుకా ఊర్ణా స్తూణీపాదాః సకుక్కుటాః | మాండవ్యా మాలవీయాశ్చ ఉత్తరాపథవాసినః. 43

మత్స్య,కుశట్ట, కుణి, కుండల, పాంచాల, కాశీ, కోసల, వృక, శబర, కౌవీర, సభూలింగ, శక, సమశక, జనపదాలు మధ్యదేశం లోనివి. వాహీక, వాటధాన, అభీర, కాలతోయక, అపరాంత, శూద్ర, పహ్లవ, ఖేటక, గాంధర,

వా. పు. 9

యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రవ, లలిత్థ, పారావత, మూషక, మఠర, ఉదకధార, కైకేయ, దశమజన పదస్థులు క్షత్రియ వైశ్య శూద్ర కులాలవారు వైశ్యుల స్థానంలోను, కాంబోజ, దరద, బర్బర, అంగలౌకిక, చీన, తుషార తదితరుల, జనపదాలకు వెలుపలను ఉందురు. ప్రస్థలులు, ఆత్రేయులు, భరద్వాజులు, దశేరకులు, లంపకుల, తాపకులు రామలు, శూలికలు, తంగణులు, ఔరసులు, అలిమద్ర, కిరాత జాతులవారు, తామసుల, క్రమమాసలు, సుపార్శ్వులు, పుండ్రకులు, కులూతుల, కుహుకుల, ఊర్ణులు, తూణిపాదులు, కుక్కటుల, మాండవ్యులు, మాలవీయులు వీరంతా ఉత్తరాపథవాసులు.

అంగావంగా ముద్గరవా స్త్వంతర్గిరిబహిర్గిరాః | తథాప్రవంగా వాంగేయా మాంసాదా బలదంతికాః . 44

బ్రహ్మోత్తరాఃప్రావిజయా భార్గవాః కేశవర్వరాః | ప్రాగ్జ్యోతిషాశ్చ శూద్రశ్చ విదేహా స్తామ్రలిప్తకాః. 45

మాలామగధగోనందాః ప్రాచ్యాజనపదాస్త్విమే | పుండ్రాశ్చ కేరళాశ్చైవ చౌడాః కుల్యాశ్చ రాక్షస. 46

జాతుషామూషికాదాశ్చ కుమారాదామహాశకాః | మహారాష్ట్రామాహిషికాః కాళింగాశ్చైవ సర్వశః. 47

ఆభీరాఃసహనైషీకా ఆరణ్యః శబరాశ్చయే | వలింధ్యావింధ్యమౌళేయా వైదర్బా దండకైః సహ. 48

పౌరికాఃసౌశికాశ్చైవ ఆశ్మకాభోగవర్దనాః | వైషికాః కుందలా ఆంధ్రా ఉద్భిదానలకారకాః. 49

సూర్పారకాఃకారివన దుర్గాస్తాలీకటైఃసహ | పులీయాః ససినీలాశ్చ తాపసాస్తామసాస్తథా. 50

కారస్తరాస్తురమినో నాసిక్యాంతర నర్మదాః | భారకచ్ఛాః సమాహేయాః సహసారస్వతైరపి. 51

వాత్యేయాశ్చ సురాష్ట్రాశ్చ ఆవంత్యాశ్చార్బుదైః సహ | ఇత్యేతే పశ్చిమామాశం స్థితా జానపదాజనాః. 52

కారుషాశ్చైకలవ్యాశ్చ మేకలాశ్చోత్కలైస్సహ | ఉత్తమర్ణాదశార్ణాశ్చ భోజాఃకింకవరైఃసహ. 53

తోశలాఃకోశలాశ్చైవ త్రైపురాశ్చైల్లికాస్తథా | తురుసాస్తుంబరాశ్చైవ వహనా నైషధైఃసహ. 54

అనూపాస్తుండికేరాశ్చ వీతహోత్రాస్త్వవంతయః | సుకేశే వింధ్యమూలస్థా స్త్విమేజనపదాఃస్మృతా. 55

అథోదేశాన్‌ ప్రవక్ష్యామః పర్వతాశ్రయిణస్తుయే | నిరాహారాహంసమార్గాః కుపథాస్తంగణాఃఖశాః. 56

కథప్రావరణాశ్చైవ ఊర్ణాః పుణ్యాః సహూహూకాః | త్రిగర్తాశ్చ కిరాతాశ్చ తోమరాః శిశిరాద్రికాః. 57

ఇమేతవోక్తావిషయాః సవిస్తరాత్‌ ద్వీపేకుమారేరజనీచరేశ |

ఏతేషు దేశేషు చ దేశధర్మాన్‌ సంకీర్త్యమానాన్‌ శృణుతత్త్వతోహి. 58

ఇతి శ్రీ వామనమహాపురాణ త్రయోదశో7ధ్యాయః.

అంగ, వంగ, ముద్గరవ, అంతర్గిరి, బహిర్గిరి, ప్రవంగ, వాంగేయ, మాంసాద, బలదంతిక, బ్రహ్మోత్తర ప్రావిజయ, భార్గవ, కేశబర్బర, ప్రాగ్జ్యోతిష, శూద్ర, విదేహ, తామ్రలిప్తక, మూల, మాగధ, గోనందులు తూర్పుజనపదాలు. రాక్షసేశ్వరా ! పుండ్ర, కేరళ, చౌడ, కుల్య, జాతుష, మూషికాద, కుమారాద, మహాశక, మాహారాష్ట్ర మాహిషక, కళింగ, అభీర, నైషీక, అరణ్య, శబర, బలింధ్వ, వింధ్య, మౌళేయ, వైదర్భ, దండక, పౌరిక, సౌశిక, అశ్మక, భోగవర్ధన, వైషిక, కుందల, ఆంధ్ర, ఉద్భిర, నలకారక, జనపదాలు దక్షిణ దిశన గలవు. సూర్పారక, కారివన, దుర్గ, తాళీకట, పుళీయ, ససినీల, తాపస, కారస్కర, రమిన, నాసిక్యాంతర, నర్మద, భారకచ్చ, మాహేయ, సారస్వత, వాత్సేయ, సౌరాష్ట్ర, అవంత్య, అర్బుద - యివి పశ్చిమాన గల జనపదాలు. అక్కడ జనులు కారుష, ఏకలవ్య, మేకల, ఉత్కల, ఉత్తమర్ణ, దశార్ణ, భోజ, కింకవర, తోసల, కోసల, త్రైపుర, చైల్లిక (ఇల్లిక?) తురుస, తుంబర, వహన, నైషధ, అనూప, తుండికేర, వీతిహోత్ర, అవంతి, ఓ సుకేశీ ! ఈ జనపదాలు వింధ్యాద్రిపాద మూలాన ఉన్నవి. ఇక పర్వత ప్రదేశాలలోని జనపదాలు యివి - నిరాహార, హంసమార్గ, ఊర్ణ, పుణ్య, కుపథ, తంగణ, ఖశ, కుథప్రావరణ, హూహుక, త్రిగర్త, కిరాత, తోమర, హిమవన్నగ ప్రదేశాలు.

రజనీచరవరా ! కుమార ద్వీపంలోని జనపదాలను గురించి విపులంగా చెప్పితిమి. ఇక ఈ ప్రదేశాలలో ఆచరించబడే ధర్మాచారాలను వివరించెదము వినుము.

ఇది శ్రీ వామనమహాపురాణంలో త్రయోదశాధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters