Sri Vamana Mahapuranam    Chapters   

పదునాలుగవ అధ్యాయము

ఋషయ ఊచు :

అహింసా సతయమస్తేయం దానం క్షాంతి ర్దమఃశమః | అకార్పణ్యం చ శౌచంచ తపశ్చరజనీచర. 1

దశాంగోరాక్షసశ్రేష్ఠ ధర్మో7సౌ సార్వవర్ణికః | బ్రాహ్మణస్యాపి విహితా చాతురాశ్రమ్యకల్పనా. 2

సుకేశి రువాచ :

విప్రాణాం చాతురాశ్రమ్యం విస్తరాన్మే తపోధనాః | ఆచక్షధ్వం నమేతృప్తిః శ్రుణ్వతః ప్రతిపద్యతే. 3

ఋషుల వచనము : అహింస, సత్యం, అస్తేయం (అచౌర్యం) దానం క్షాంతి (సహనం) దమం (ఆత్మనిగ్రహం) శమం (శాంతి) , అలోభిత్వం, పవిత్రత, తపస్సు, ఈ పదీ సర్వవర్ణాల వారికి నిర్దేశింపబడిన ధర్మదేవతకు అంగములు. నాలుగాశ్రమాలకు విహితాలయిన బ్రాహ్మణులకు కూడ అనుష్ఠేయాలు.

సుకేశి వచనము : తపోధనులారా ! బ్రాహ్మణులు జీవితంలో నాలుగు దశ (ఆశ్రమము) ల యందు ఆచరించాల్సిన ధర్మవిధులు నాకు వివరంగా చెప్పండి. ఇంతవరకు విన్నదానితో నా జ్ఞాన తృష్ణ తీరలేదు.

ఋషయ ఉవాచ :

కృతోపనయనః సమ్యగ్‌ బ్రహ్మచారీ గురౌవసేత్‌ | తత్ర ధర్మో7స్యయస్తంచ కథ్యమానం నిశామయ. 4

స్వాధ్యాయో7థాగ్నిశుశ్రూషా స్నానంభిక్షాటనంతథా | గురోర్నివేద్యతచ్చాద్య మనుజ్ఞాతేన సర్వదా. 5

గురోఃకర్మణి సోద్యోగః సమ్యక్‌ ప్రీత్యుపపాదనమ్‌ | తేనాహూతంపఠేచ్చైవ తత్పరో నాన్యమానసః . 6

ఏకంద్వౌసకలాన్‌ వాపి వేదాన్‌ ప్రాప్య గురోర్ముఖాత్‌ | అనుజ్ఞాతోవరందత్త్వా గురవే దక్షిణాంతతః. 7

గార్హాస్థ్యాశ్రమకామస్తు గార్హస్థ్యాశ్రమ మావసేత్‌ | వానప్రస్థాశ్రమంవా 7పి చతుర్థంస్వేచ్ఛయాత్మనః. 8

తత్రైవవాగురోర్గేహే ద్విజోనిష్ఠామవాప్నుయాత్‌ | గురోరభావేతత్పుత్రే తచ్ఛి ష్యేతత్సుతంవినా. 9

శుశ్రూషన్‌ నిరభీమానో బ్రహ్మచర్యాశ్రమంవసేత్‌ | ఏవంజయతిమృత్యుం సద్విజః శాలకటంకట. 10

ఉపావృత్తస్తతస్తస్మాత్‌ గృహస్థాశ్రమకామ్యయా | అసమానర్షికులజాం కన్యా ముద్వహేతనిశాచర. 11

స్వకర్మణాధనం లబ్ద్వా పితృదేవతిథీనపి | సమ్యక్‌ సంప్రీణ యేద్భక్త్యా సదాచారరతోద్విజః. 12

ఋషులన్నారు : ఉపనయనమైన పిదప బ్రహ్మచారి గురుకులావాసం చేస్తూ అక్కడి విధులన్నీ పాటించాలి. వినుము.

వేదాధ్యయనం, అగ్నిసేవనం, స్నానం, భిక్షాటనం, తెచ్చిన భిక్ష గురువుకు నివేదించి, ఆయన అనుజ్ఞతో భుజించుట, ఉత్సాహంతో గురువుగారికి అన్నివిధాల శుశ్రూష చేస్తూ ఆయన ప్రేమకు పాత్రుడు కావడం, గురువు పిలిచి నప్పుడు భక్తిశ్రద్ధలతో వెళ్ళి ఆయన చెప్పే పాఠాలు వినడం, ఒకటో రెండో, లేక నాలుగు వేదాలను గురుముఖతః అభ్యసించి, గురువుకు తగిన దక్షిణ యిచ్చి, ఆయన అనుజ్ఞతో తన యిష్టప్రకారం గృహస్థాశ్రమాన్ని కానీ, వానప్రస్థ, సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించడం, లేక గురువు ఇంట్లోనే ఉండి నైష్ఠిక జీవితం గడపడం, ఆయన తర్వాత ఆయన కుమారుని, కానీ, కుమారులు లేని పక్షాన ఆయన శిష్యులను కాని ఏమాత్రం గర్వాభిమానాలు లేకుండా సేవించడం, బ్రహ్మచర్యాశ్రమ విధులు. ఈ విధంగా నడుచుకొనే బ్రాహ్మణుడు మృతయువును జయిస్తాడు. రాక్షసవరా ! గృహస్థుగా నుండ గోరినవాడు గుర్వాశ్రమం వదలి, తనకన్నను భిన్న గోత్ర ఋషిపరంపరకు చెందిన ఉత్తమకుల వధువును భార్యగా స్వీకరించాలి. తన విధ్యుక్త ధర్మానుసారం ధనోపార్జన చేసి, పితృదేవాతిథును భక్తితో సంతృప్తి పరుస్తూ చక్కని నడవడి కలిగి ఉండాలి.

సుకేశి రువాచ :

సదాచారో నిగదితో యుష్మాభి ర్మమసువ్రతాః | లక్షణం శ్రోతుమిచ్ఛామి కథయధ్వం తమదయమే. 13

ఋషయ ఉవాచ :

సదాచారో నిగదిత స్తవయో7స్మాభిరాదరాత్‌ | లక్షణం తస్యవక్ష్యామ స్తచ్ఛృణుష్వనిశాచరః. 14

గృహస్థేనసదాకారయ మాచారపరిపాలనమ్‌ | నహ్యాచారవిహీనస్య భద్రమత్ర పరత్రచ. 15

యజ్ఞదాన తపాంసీహ పురుషస్యనభూతయే | భవంతియఃసముల్లంఘ్య సదాచారం ప్రవర్తతే. 16

దురాచారోహి పురుషో నేహనాముత్రనందతే | కార్యోయత్నః సదాచారే ఆచారో హన్త్యలక్షణమ్‌. 17

తస్యస్వరూపంవక్ష్యామః సదాచారస్య రాక్షస | శ్రుణుషై#్వకమనాస్తచ్చ యది శ్రేయో7భివాంఛసి. 18

ధర్మో7స్యమూలం ధనమస్యశాఖా పుష్పంచకామఃఫలమస్యమోక్షః |

అసౌసదాచారతరుః సుకేశిన్‌ సంసేవితో యేనస పుణ్యభోక్తా | 19

బ్రాహ్మేముహూర్తేప్రథమం విబుద్ధ్యే దనుస్మరేద్దేవవరాన్‌ మహర్షీన్‌|

ప్రాభాతికంమంగళ##మేనవాచ్యం యదుక్తవాన్‌ దేవపతి స్త్రినేత్రః. 20

సుకేశి రువాచ :

కింతదుక్తం సుప్రభాతం శంకరేణ మహాత్మనా | ప్రభాతే యత్పఠన్మర్త్యో ముచ్యతే పాపబంధనాత్‌. 21

ఋషయ ఉవాచ :

శ్రూయతాం రాక్షసశ్రేష్ఠ సుప్రభాతంహరోదితమ్‌ | శ్రుత్వాస్మృత్వాపఠిత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే. 22

సుకేశి అన్నాడు : సదాచరణం, మంచి నడవడి అన్నారు గదా. ఆ మంచి నడవడి అనగానేమో దయచేసి వివరించండి.

ఋషులన్నారు : నీమీద గల ఆదరంతో నీకు సదాచరణమును వివరించాము. రాక్షసపతీ ! దానిని గురించి వివరంగా వినుము. గృహస్థు ఎల్లప్పుడు ఆచారవంతుడు ఉండాలి. ఆచార హీనునకు ఇహపరాల్లో గూడ మేలుకలుగదు. సదాచారోల్లంఘన చేయువానికి, యజ్ఞం దానం తపోవ్రతాదుల వల్ల మంచి కలుగదు. దుష్టాచరణం చేయువానికి యిహ పరాల్లో సుఖం కలుగదు. కాబట్టి గట్టిగా ప్రయత్నించి మానవుడు సదాచరణం చేయాలి. సదాచరణ చెడుగును నశింప చేస్తుంది. దానవా ! ఆ సదాచరణ స్వరూపాన్ని చెబుతున్నాం. శ్రద్ధగా వినుము. ధర్మం సదాచార వృక్షానికి, మొదలు, ధనం శాఖలు, కామం పుష్పం, మోక్షం ఫలం. ఇలాంటి సదాచార వృక్షాన్ని సేవించిన వాడే పుణ్యాత్ముడు. బ్రాహ్మీ ముహూర్తాననే నిద్ర లేచి దేవస్మరణం ఋషిస్మరణం చేయాలి. తర్వాత శంకర ప్రోక్తమైన ప్రాభాతిక మంగళస్తోత్రం పఠించాలి.

సుకేశి వచనం : పాపబంధ విముక్తికై పరమశివుడనుగ్రహించిన ఆ సుప్రభాత స్తోత్రమెట్టిది ?

ఋషులన్నారు : రాక్షస శ్రేష్ఠా ! శంకరుడనుగ్రహించిన సుప్రభాతం వినుము. దీనిని విన్నా, చదివినా అనుస్మరణం గావించినా సరే సర్వపాప విముక్తి కలుగుతుంది.

బ్రహ్మామురారిస్త్రిపురాంతకారీ భానుఃశశీభూమిసుతోబుధశ్చ |

గురుశ్చశుక్రఃసహభానుజేన కుర్వంతుసర్వే మమసుప్రభాతమ్‌. 23

భృగుర్వసిష్ఠః క్రతురంగిరాశ్చ మసుఃపులస్త్యఃపులహఃసగౌతమః|

రైభ్యోమరీచిశ్చ్యవనోఋభుశ్చ కుర్వంతుసర్వేమమసుప్రభాతమ్‌. 24

సనత్కుమారఃసనకఃసనందనః సనాతనో7ప్యాసురిపింగళౌచ |

సప్తస్వరాః సప్తరసాతలాశ్చ కుర్వంతుసర్వేమమసుప్రభాతమ్‌. 25

పృథ్వీసగంధాసరసాస్తథా77పః స్పర్శశ్చవాయుర్జ్వలనఃసతేజాః |

నభఃసశబ్దంమహతాసహైవ యచ్ఛంతుసర్వే మమసుప్రభాతమ్‌. 26

సప్తార్ణవాః సప్తకులాచలాశ్చ సప్తర్షయోద్వీపవరాశ్చసప్త|

భూరాదికృత్వా భువనానిసప్త దదంతుసర్వేమమసుప్రభాతమ్‌. 27

ఇత్థంప్రభాతే పరమంపవిత్రం పఠేంస్మరేద్వాశృణుయాచ్చభక్త్యా|

దుఃస్వప్ననాశో7నఘ సుప్రభాతం భ##వేచ్చసత్యం భగవత్ర్పసాదాత్‌. 28

బ్రహ్మ, మురారి, త్రిపురాంతకుడు, సూర్య చంద్రులు, అంగారక బుధులు, గురు శుక్రులు, శ##నైశ్చరుడు వీరంతా నాకు సుప్రభాతం అనుగ్రహింతు గాక : భృగువు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసులు, మనువు, పులస్త్యుడు పులహ గౌతములు, రైభ్య మరీచులు, చ్యవనబుభులు నాకుసుప్రభాత మొసగుదురుగాక! సనకసనందనసనత్కుమార సనాతనులు, ఆసురి పింగళులు, సప్తస్వరాలు, సప్తరసాతలాలు నాయీ ప్రభాతాన్ని కల్యాణమయం గావింతురు గాక ! గంధ గుణంగల పృథ్వి రసాత్మకమగు జలములు, స్పర్శ గుణాత్మకమగు వాయువు, తేజో రూపము గల అగ్ని, శబ్ద గుణకమగు నాకాశము, మహత్తుతో కూడి ఈ ప్రొద్దు నాకు శుభములు చేకూర్చు గాక ! సప్త భువనాలు వీరందరూ నాకు సుప్రభాత మనుగ్రహింతురు గాక! ఉదయం నిద్ర నుండి లేవగానే ఈ సుప్రభాత పఠనం శ్రవణం లేక స్మరణం చేసినచో అంతకుముందు రాత్రి సంభవించిన దుస్వప్న దోషాలు తొలగి భగవత్కృప వల్ల మానవుడు శుభాలు పొందుతాడు. ఇందులో సందేహము లేదు.

తతఃసముత్థాయ విచింతయేత ధర్మంతథార్థం చ విహాయశయ్యామ్‌ |

ఉత్థాయ పశ్చాద్ధరిరిత్యుదీర్య గచ్ఛేత్తదోత్సర్గవిధింహికర్తుమ్‌. 29

న దేవగోబ్రాహ్మణవహ్నిమార్గే నరాజమార్గేన చతుష్పథేచ|

కుర్యాదథోత్సర్గమపీహగోష్ఠే పూర్వాపరంచైవ సమాశ్రితోగామ్‌. 30

తతస్తుశౌచార్థ ముపాహరేన్మృదం గుదేత్రయంపాణితలేచసప్త |

తథోభయోఃపంచ చతుస్తథైకాంలింగేతథైకాంమృదమాహరేత. 31

నాంతర్జలాద్రాక్షసః మూషికస్థలాత్‌ శౌచావశిష్టాచరణాత్‌ తథాన్యా |

వల్మీకమృచ్చైవహిశౌచనాయ గ్రహ్యాసదాచారవిదానరేణ. 32

ఉదఙ్‌ ముఖఃప్రాఙ్‌ ముఖోవాపివిద్వాన్‌ ప్రక్షాల్యపాదౌభువిసంనివిష్టః|

సమాచరేదద్భిర ఫేనిలాభి రాదౌపరిమృజ్యముఖంద్విరబ్భిః. 33

తతఃస్పృశేత్ఖాని శిరఃకరేణ సంధ్యాముపాసీతతతఃక్రమేణ |

కేశాంస్తు సంశోధ్యచ దంతధావనం కృత్వాతథాదర్పణదర్శనంచ. 34

కృత్వాశిరఃస్నాన మథాంగికంవా సంపూజ్యతో యేనపితౄన్‌ సదేవాన్‌|

హోమంచకృత్వాలభనం శుభానాం కృతవాబహిర్నిర్గమనంప్రశస్తమ్‌. 35

దూర్వాదధీ సర్పిరథోదకుంభం ధేనుంసవత్సాంవృషభంసువర్ణమ్‌|

మృద్గోమయం స్వస్తికమక్షతాని లాజామధుబ్రాహ్మణకన్యకాంచ. 36

శ్వేతానిపుష్నాణ్యథశోభనాని హుతాశనం చందనమర్కబింబమ్‌|

అశ్వత్థవృక్షంచ సమాలభేత తతస్తుకుర్యా న్నిజజాతిధర్మమ్‌. 37

దేశానుశిష్టంకులధర్మమగ్ర్యం స్వగోత్రధర్మం నహిసంత్యజేత |

తేనార్థసిద్ధింసముపాచరేత నాసత్ర్పలాపం నచసత్యహీనమ్‌. 38

ననిష్ఠురంనాగమశాస్త్రహీనం వాక్యంవదేత్సాధుజనేనయేన |

నింద్యోభ##వేన్నైవ చధర్మభేదీ సంగం నచాసత్సునరేషుకుర్యాత్‌. 39

సంధ్యాసువర్జ్యం సురతందివా న సర్వాసు యోనీషు పరాబలాసు|

అగారశూన్యేషు మహీతలేషు రజస్వలాస్వేవ జలేషువీర. 40

వృథా7టనంవృథాదానం వృథాచ పశుమారణమ్‌ నకర్తవ్యం గృహస్థేన వృథాదారపరిగ్రహమ్‌. 41

వృథా7టనా న్నిత్యహాని ర్వృథాదాన ద్దనక్షయః | వృథాపశుఘ్నః ప్రాప్నోతి పాతకం నరకప్రదమ్‌. 42

సంతత్యాహానిరశ్లాఘ్యా వర్ణసంకరతోభయమ్‌ ః భేతవ్యంచ భ##వేల్లోకే వృథాదారపరిగ్రహాత్‌. 43

అలా భగవత్స్మరణతో శయ్య నుంచి లేచి, ధర్మార్థ చింతన పూర్వకంగా శ్రీహరినామం స్మరించి నిత్య విధుల కుపక్రమింపవలెను. దేవగోబ్రాహ్మణాగ్ని మార్గాలను, రాజవీథులను, చతుష్పథాలను, గోశాలలను వదలి తూర్పు పడమర దిక్కులను వదలి మలమూత్రాదులు వదలాలి. మలోత్సర్జనం తర్వాత వట్టితో గుదస్థానాన్ని ముమ్మారు, ఎడమ అరచేతిని ఏడు పర్యాయాలు, తర్వాత నా రెండింటినీ పది పర్యాయాలు, లింగాన్ని ఒక పర్యాయం శుభ్రం చేసుకోవాలి. ఓ రాక్షసా! సదాచారంతెలిసినవాడు ఈ మృత్తికను, నీళ్ళలో నుంచి కాని, ఎలుక బొరియల నుంచి కాని, పాము పుట్టల నుండి గాని ఒక పర్యాయం ఉపయోగించి వదలినది కాని, లేక యింటిలో నుంచి కాని తీసుకోరాదు. తెలిసిన వ్యక్తి తూర్పు ముఖంగా కాని, ఉత్తర ముఖంగా కాని తిరిగి కూర్చొని మొదట రెండుమార్లు ముఖం కడుగుకొని నురుగులేని నీళ్ళతో పుక్కిలించవలెను. అనంతరం చేతితో పంచేద్రియాలను, శిరస్సును స్పృశించి, దంత ధావనం చేసి, తల దువ్వుకొని అద్దంలో ముఖం చూచుకొని యథావిధిగా సంధ్యా వందనం చేయవలెను. ఆపైన శిరఃస్నానం గాని అంగ స్నానం గాని చేసి, దేవ పితృజల తర్పణం విడిచి, హోమం చేసి మంగళ ద్రవ్యం ముట్టుకొని అనంతరం బయటకు వెళ్ళుట ప్రశస్తం. ఈ మంగళ ద్రవ్యములలో దూర్వా (గరిక), పెరుగు, నెయ్యి, జలకుంభం, దూడతో ఉన్న ధేనువు. వృషభం, బంగారం, మృత్తిక, ఆవుపేడ, స్వస్తికం అక్షతలు, పేలాలు, తేనె, బ్రాహ్మణ కన్య, తెల్లనిపూలు, అగ్ని, చందనం, సూర్యబింబం, రావిచెట్టు ముఖ్యమైనవి. వీనిలో ఏ యొక దానినైననుస్పృశించి యితర పనులుచూచుకోవలెను దేశ కాలాదులననుసరించి తన కులధర్మం గోత్రవిధులు వదలకుండా నిర్వర్తించుకోవలెను. ఆ విధంగా అర్థ సిద్ధిని పొందుతూ, అనవసర విషయాలు, అసత్య వచనాలు, పరుషవచనాలు, వేద శాస్త్ర విరుద్ధ విషయాలు మాటడకుండా కాలయాపన చేయాలి. లేనిచో సజ్జనుల నిందకు గురికావలసి వచ్చును. సదాచారశీలున కేనాడును ధర్మభంగం చేయడం కాని దుష్టులతో సహవాసం కాని విహితాలు కావు. ఉభయ సంధ్యలలో గాని పగటివేళ కాని స్త్రీ సంగమం పనికిరాదు. పరస్త్రీలతో అసలే పనికిరాదు. ఇండ్లులేని బయలు ప్రదేశాలలో గాని, నీళ్ళలో గాని స్త్రీ సంగమం చేయకూడదు. ఋతుకాలాల్లో స్త్రీలను కూడరాదు. ఓ వీరాగ్రణీ ! ప్రయోజనం లేని తిరుగుడు, అర్థంలేని దానం, పశు హింస అక్రమంగా దారపరిగ్రహణం గృహమేధి చేయరాదు. వృథా పర్యటనం వల్ల నిత్యనైమిత్తిక కర్మలకు అంతరాయం, వ్యర్థపు దానంవల్ల ధన నష్టం సంభవిస్తాయి. ఉబుసుపోకకు పశుహింస చేయువాడు నరకానికి పోతాడు. ఇక అక్రమ దార గ్రహణం వల్ల సంతానహాని అమంగళకరమైన వర్ణసాంకర్య భయం సంభవిస్తాయి.

పరస్వేపరదారేచ నకార్యాబుద్ధిరుత్తమైః | పరస్వంనరకాయైవ పరదారాశ్చమృత్యవే. 44

నేక్షేత్‌పరస్త్రియంనగ్నాం నసంభాషేతతస్కరాన్‌ | ఉదక్యాదర్శనంస్పర్శం సంభాషంచవివర్జయేత్‌. 45

నైకాసనేతథాస్థేయం సోదర్యాపరజాయయా | తథైవస్యాన్నమాతుశ్చ తతాస్వదూహితుస్త్వపి. 46

నచస్నాయీత వైనగ్నో నశయీతకదాచన | దిగ్వాససో7పి నతథా పరిభ్రమణమిష్యతే.

భిన్నాసనంభాజనాదీన్‌ దూరతః పరివర్జయేత్‌. 47

నందాసునాభ్యంగ ముపాచరేత క్షౌరంచరిక్తాసు జయాసు మాంసమ్‌ |

పూర్ణాసుయోషిత్పరివర్జయేత భద్రాసుసర్వాణిసమాచరేత. 48

నాభ్యంగమర్కేన చ భూమిపుత్రే క్షౌరంచశుక్రే రవిజేచమాంసం |

బుధేషుయోషిత్‌ నసమాచరేత శేషేషు సర్వాణిసదైవ కుర్యత్‌. 49

చిత్రాసుహస్తే శ్రవణచతైలం క్షౌరం విశాఖాస్వభిజిత్సువర్జ్యమ్‌|

మూలేమృగే భాద్రపదాసుమాంసం యోషిన్మసూకృత్తికయోత్తరాసు. 50

సదైవవర్జ్యంశయనముదక్శిర స్తథాప్రతీచ్యాం రజనీచరేశ |

భుంజీతనైవేహచ దక్షిణాముఖో నచప్రతీచ్యా మభిభోజనీయమ్‌. 51

దేవాలయంచైత్యతరుం చతుష్పథం విద్యాధికంచాపి గురుం ప్రదక్షిణం |

మాల్యాన్నపానం వసనానియత్నతో నాన్యైర్ధృతాంశ్చాపిహిధారయేద్‌ బుధః. 52

స్నాయాచ్ఛిరః స్నానతయాచనిత్యం నకారణం చైవవినానిశాసు|

గ్రహోపరాగే స్వజనాపయాతే ముక్త్వాచజన్మర్షగతేశశాంకే. 53

నాభ్యంగితం కాయముపస్పృశేచ్చ స్నాతో నకేశాన్‌ విధునీతచాపి |

గాత్రాణిచైవాంబరపాణినాచ స్నాతో విమృజ్యాద్‌ రజనీచరేశ. 54

వసేచ్చదేశేషుసురాజకేషు సుసంహితేష్వేవజనేషునిత్యం |

అక్రోధనా న్యాయపరా అమత్సరాః కృషీవలాహ్యోషధయశ్చయత్ర. 55

నతేషుదేశేషువసేత బుద్ధిమాన్‌ సదానృపోదండరుచిస్త్వశక్తః |

జనో7పి నిత్యోత్సవబద్ధవైరః సదాజిగీషుశ్చ నిశాచరేంద్ర. 56

ఇతి శ్రీవామన మహాపురాణ చతుర్థశో7ధ్యాయః.

ఉత్తములగు వారు పరధనానికి పరుల భార్యలకు ఆశపడరు. వానిలో మొదటిది నరక ద్వారమైతే రెండవది మృత్యువుకు హేతువు. వివస్త్రలుగా ఉన్న పరస్త్రీలను చూడరాదు. చోరులతో సంభాషిప రాదు. ఋతు కాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు, తాకరాదు. వారితో సంభాషించ గూడదు. తోబుట్టువులతో గాని, యితరుల భార్యలతో గాని, తన తల్లితో కాని వయసు వచ్చిన కూతులతో గాని ఒకే ఆసనం మీద కూర్చోకూడదు. దిగంబరంగా పరుండరాదు. స్నానం చేయరాదు. అటునిటు తిరుగరాదు. పగిలిపోయిన ఆసనాల (పీటల)ను గాని పాత్రలను గాని దూరంగా వదలివేయాలి. శుక్ల పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులలో తైలాభ్యంజన మాచరించరాదు. చతుర్థి నవమి చతుర్దశీలలో క్షౌరం చేసుకోకూడదు. శుక్ల పంచమి, దశమి పూర్ణిమలలో స్త్రీ సంగమం పనికిరాదు. అయితే శుక్ల విదియ, సప్తమి ద్వాదశీ తిథుంలో పైవన్నియూ చేయవచ్చు ఆదివారం, మంగళవారములలో తలంటిస్నానం శుక్రవారాల్లో క్షౌరం, శని వారాల్లో మాంసాహారం వర్జించాలి బుధవారాలలో స్త్రీ సంగమం కూడదు. మిగతా దినాలలో ఏదైన ఎప్పుడైన చేయవచ్చు. చిత్ర, హస్త శ్రవణ నక్షత్రాల్లో అభ్యంజనం, విశాఖ అభిజిత్తులలో క్షౌరం, మూల మృగశిర భాద్రపదలలో మాంసభక్షణం, మఖకృత్తిక ఉత్తరనక్షత్రాలలో స్త్రీ సంగమం చేయకూడదు. పశ్చిమ ఉత్తర దిశగా తలపెట్టుకు ఏనాడూ నిద్రించరాదు. రాక్షసేశ్వరా! దక్షిణ దిశగా గాని పడమట దిక్కుగా గాని కూర్చొని భోజనం చేయరాదు. దేవాలయాలను, దారి ప్రక్కన, దారులు కలిసేచోట (చతుష్పథాలు) ఉండే చెట్లను, విద్యాధికులను, గురవులను కుడివైపు నుండి ప్రదక్షిణించకూడదు. తెలిసినవాడు యితరులుపయోగించిన, పూమాలలను, అన్నపానీయాలను, వస్త్రాలను తాను ఉపయోగించకూడదు. రోజూ శిరఃస్నానం చేయాలి; విశేష కారణం లేకుండా రాత్రివేళల చేయరాదు. అనగా గ్రహణ పర్వాలలో గాని, బంధువులు మరణించినప్పుడు కాని, జన్మ నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించినప్పుడు కాని రాత్రుల్లో శిరస్నానం చేయవచ్చు. రాక్షస రాజా! తలంటుకొనిన వానిని తాకకూడదు. తలార స్నానం చేసిన వెంటనే వెండ్రుకలను విదిలించరాదు. వెంటనే విడిచిన గుడ్డతో గాని చేతితో గాని శరీరం తుడుచుకోకూడదు. చక్కని రాజ్యపాలనలో ఉన్న దేశంలో ఐక్యమత్యంతో కలిసికట్టుగా ఉన్న సమాజంలో, క్రోధనులు న్యాయప్రియులు అయిన జనులమధ్య కష్టపడి సేద్యముచేయు రైతులు, అనేక విధాల ధాన్యపుపంటలు కలిగి సమృద్ధమైన చోట నివాసమేర్పరచుకోవాలి. అశక్తుడు ప్రజలను దండించే వాడునైనరాజు ఉన్నచోటున పరస్పర వైరంతో, అమోద ప్రమోదాల్లో మునిగి తేలే ప్రజానీకం ఉన్న చోట బుద్ధిమంతుడగు వాడుండరాదు. సుకేశీ! ఈ విషయాలు మరువరాదు సమా!

ఇదీ శ్రీ వామన మహా పురాణమందలి పదునాలుగవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters