Sri Vamana Mahapuranam    Chapters   

పదిహేడవ అధ్యాయము

నారదా ఉవాచ :

యానేతాన్‌ భగవాన్‌ ప్రాహ కామిభిః శశినంప్రతి | ఆరాధనయాదేవాభ్యాం హరీశాభ్యాం వదస్వతాన్‌. 1

పులస్త్య ఉవాచ :

శృణుష్వకామిభిః ప్రోక్తాన్‌ వ్రతాన్‌ పుణ్యాన్‌కవిప్రియ | ఆరాధనాయశర్వస్య కేశవస్య చ ధీమతః. 2

యదాత్వాషాడీ సంయాతి వ్రజతేచోత్తరాయణం | తదాస్వపితిదేవేశో భోగిభోగే శ్రియః పతిః. 3

ప్రతిసుప్తేవిభౌతస్మిన్‌ దేవగంధర్వగుహ్యకాః | దేవానాంమాతరశ్చాపి ప్రసుప్తా శ్చాప్యనుక్రమాత్‌. 4

నారద ఉవాచ :

కథయస్వసురాదీనాం శయనే విధిముత్తమమ్‌ | సర్వమనుక్రమేణౖవ పురస్కృత్య జనార్దనమ్‌. 5

నారదవచనము - శివకేశవుల ప్రసన్నులను గావించుకొనుటకు చంద్రుడు గావించిన వ్రతారాధనము లెవ్వియో దయచేసి సెలవియ్యవలయును. పులస్త్యుడిట్లనెను. నారదా! శర్వకేశవులను ప్రసన్నుల గావించుకొనుటకుగా కాముకులు ప్రవచించిన పుణ్యవ్రతాలను గురించి వినుము. ఉత్తరాయణం వెళ్ళిపోయి ఆషాఢ మాసాగమనంతో దేవాధిదేవుడు లక్ష్మీపతి శేషశయనం మీద నిద్రించును. తమ ప్రభువు నిద్రించినతోడనే దేవ గంధర్వ యక్షులు వారల తల్లులు క్రమంగా గాఢ నిద్రలో మునిగిపోతారు. అప్పుడు నారదుడిట్లనెయె: మహర్షే! ఆదేవతల ఉత్తమశయన పద్దతిని క్రమంగా వినగోరెదను.

పుస్త్య ఉవాచ :

మిథునాభిగమనే సూర్యే శుక్లపక్షేతపోధన | ఏకాదశ్యాం జగత్స్వామీ శయనంపరికల్పయేత్‌. 6

శేషాహిభోగపర్యంకం కృత్వాసంపూజ్యకేశవమ్‌ | కృత్వోపవీతకంచైవ సమ్యక్‌ సంపూజ్యవైద్విజాన్‌. 7

అనుజ్ఞాం బ్రాహ్మణభ్యశ్చ ద్వాదశ్యాం ప్రయతఃశుచిః | లబ్ధ్వా పీతాంబరధరః స్వస్తినిద్రాం సమానయేత్‌. 8

త్రయోదశ్యాంతతః కామః స్వపతే శయనేశుభే | కదంబానాం సుగంధనాం కుసుమైః పరికల్పితే. 9

చతుర్దశ్యాంతతోయక్షాః స్వపంతి సుఖశీతలే | సౌవర్ణపంకజవృతే సుఖాస్తీర్ణోపధానకే. 10

పౌర్ణమాస్యాముమానాధః స్వపతే చర్మసంస్తరే | వైయాఘ్రేచ జటాభారం సమద్గ్రంథ్యాన్యచర్మణా. 11

తతోదివాకరోరాశిం సంప్రయాతిచ కర్కటమ్‌ | తతో7మరాణాంరజనీ భవతే దక్షిణాయనమ్‌. 12

బ్రహ్మా ప్రతిపది తథా నీలోత్పలమయే7నఘ | తల్పే స్వపితి లోకానాం దర్శయన్‌ మార్గముత్తమమ్‌. 13

విశ్వకర్మా ద్వితీయాయాం తృతీయాయాం గిరేఃసుతా | వినాయకశ్‌ చతుర్థ్యాంతు పంచమ్యామపి ధర్మరాట్‌.

షష్ఠ్యాంస్కందః ప్రస్వపితి సప్తమ్యాం భగవాన్‌ రవిః | కాత్యాయనీతథాష్టమ్యాం నవమ్యాం కమలాలయా. 15

దశమ్యాంభుఙగేంద్రశ్ఛ స్వపంతే వాయుభోజనాః |

ఏకాదశ్యాంతుకృష్ణాయాం సాధ్యాబ్రహ్మన్‌ స్వపంతిచ. 16

ఏషక్రమస్తేగదితో నాభాదౌ స్వపనేమునే | స్వపత్సుతత్రదేవేషు ప్రావృట్కాలః సమాయ¸°. 17

పులస్తుడిట్లనెను - ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించగా జగన్నాథుడు శయనమున కుపక్రమించును. పీతాంబరధారియై శుచియై ప్రయత్నశీలుడై నరుడు. శేషశయనము నేర్పరచి దానిపై కేశపునికి ఉపవీతాధారణం కావించి అర్ఘ్యపాద్యాదులతో చక్కగా పూజించి, ద్వాదశినాడు బ్రహ్మణ పూజచేసి, వారిచేత అనుజ్ఞ పొంది స్వామిని సుఖశయనుని గావింపవలెను. త్రయోదశినాడు కదంబ పుష్పశయ్య మీద మన్మథుడు నిద్రించును. చతుర్దశినాడు యక్షులు, బంగారు కమలాలు పరచినశీతల శయ్య మీద మంచి తలగడలమర్చుకొని నిద్రింతురు. పౌర్ణమినాడు పరమశివుడు తనజటాజూటాన్ని పులితోలుతో ముడివేసికొని వ్యాఘ్రాజినం మీద శయనించును. సూర్యుడు కర్కట రాశిలో ప్రవేశించుటతో దేవతలకు రాత్రి ఆరంభమగును. అదే దక్షిణాయనము. ఓ పవిత్రమునీ ! పాడ్యమినాడు వల్లకలు వలశయ్య మీద విరించి శయనించును. ప్రజలకు ఉత్తమమైన మార్గము చూపున. తర్వాత వరుసగా విదియనాడు దేవ శిల్పి విశ్వకర్మ తదియనాడు పార్వతీదేవి, చవితినాడు వినాయకుడు, పంచమినాడు యమధర్మరాజు, షష్ఠీనాడు కుమార స్వామి, సప్తమినాడు సూర్యుడు, అష్టమినాడు కాత్యాయని, నవమినాడు మహాలక్ష్మి, దశమినాడు వాయుభుక్కులు పన్నగులు, నిద్రింతురు. కృష్ణ పక్ష ఏకాదశినాడు సాధ్యులు నిద్రింతుడు. ఈ క్రమంలో దేవతలు శ్రావణమాసంలో నిద్రించగా అప్పటి నుండి వర్షాకాలము ప్రారంభమగును.

కంకాః సమంబలాకాభి రారోహంతి నగోత్తమాన్‌ | వాయసాశ్చాపికుర్వంతి నీడాని ఋసిపుంగవః.

వాయసావ్చ స్వపంత్యేతే ఋతౌ గర్భబరాలసాః. 18

యస్యాంతిథ్యాంప్రస్వపితి విశ్వకర్మా ప్రజాపతిః | ద్వితీయా సా శుభాపుణ్యా అశూన్యశయనోదితా. 19

తస్యాంతిథావార్చ్యహరిం శ్రీవత్సాంకం చతుర్భుజం | పర్యంకస్థం సమం లక్ష్మ్యా గంథపుష్పాదిఖిర్మునే.

తతో దేవాయశయ్యాయాం ఫలాని ప్రక్షిపేత్‌ క్రమాత్‌ | సురభీణినివేద్యేత్తం విజ్ఞాప్యో మధుసూదనః. 21

''యథాహిలక్ష్మ్యాన వియుజ్యసేత్వం త్రివిక్రమానంత జగన్నివాస |

తథాస్త్వశూన్యం శయనం సదైవ అస్మాకమేవేహ తవప్రసాదాత్‌. 22

యథాత్వశూన్యం తవదేవతల్పం సమంహి లక్ష్మ్యా వరదాచ్యుతేశ |

సత్యేనతేనామితవీర్యవిష్ణోః గార్హస్థ్యనాశో మమనాస్తు దేవ. 23

ఇత్యుచ్చార్యప్రణమ్యేశం వ్రసాద్యచపునఃపునః | నక్తం భుంజీత దేవర్షేః తైలక్షారవివర్జితమ్‌. 24

ద్వితీయేహ్ని ద్విజాగ్ర్యాయ ఫలాన్‌ దద్యాత్‌ విచక్షణః |

లక్ష్మీధరఃప్రీయతాంమే ఇత్యుచ్చార్య నివేదయేత్‌. 25

అనేనతువిధానేన చాతుర్మాస్యవ్రతం చరేత్‌ | యావద్‌ వృశ్చికరాశిస్థః ప్రతిభాతి దివాకరః. 26

తతోవిబుధ్యంతిసురాః క్రమశః క్రమశోమునే | తులాస్థేర్కేహరిఃకామః శివః పశ్చాద్విబుధ్యతే. 27

తత్రదానంద్వితీయాయాం మూర్తిర్లక్ష్మీధరస్యతు | సశయ్యాస్తరణో పీతాయథావిభవమాత్మనః. 28

ఏషవ్రతస్తుప్రథమః ప్రోక్తస్తవ మహామునే | యస్మింశ్చర్ణేవియోగస్తు నభ##వేదిహ కస్యచిత్‌. 29

నభ##స్యేమాసి చతతా యాస్యాత్కృష్ణాష్టమీశుభా | యుక్త్వామృగశిరేణౖవ సాతు కాలాష్టమీ స్మృతా. 30

గ్రద్దలు (కంకాః) కొంగలు, కాకులు, కొండకొమ్ముల మీద చేరుతని. కాకులు గూళ్ళు కట్టడం మొదలెడతాయి. ఈ ఋతువులో గర్భభారంతో ఉండే ఆడకాకులు వెళ్ళి ఆగూళ్లలో నిద్రిస్తని. నారదా! ప్రజాపతి విశ్వకర్మ నిద్రించిన రోజును పవిత్రమైన అశూన్యశయన ద్వితీయ అంటారు. ఆదినాన శ్రీ వత్సాంకుడు చతుర్భుజుడైన మహా విష్ణువును, మహాలక్ష్మితో గూడ శయనం మీద నుంచి గంధ పుష్పాదులతో పూజించ ఆ శయ్య మీద సువాసన గల ఫలాలు ప్రక్షేపించాలి. వానిని నివేదించి ఆ మధూసూదనుని యిలా ప్రార్థించాలి. - ''ఓత్రివిక్రమా! ఆనంతా ! జగన్ని వాసా! నీవే విధంగా క్షణ కాలం కూడ వదలకుండా లక్ష్మితో ఉంటావో అదే విధంగా నీ అనుగ్రహం వల్ల మాశయ్యలు గూడ ఒక క్షణకాలం కూడ శూన్యంగా ఉండకుండుగాక! మేము కూడ అశూన్యశయనుల మగుదుము కాక! ఓ అచ్యుతా! వరదా! లక్ష్మితో కూడి ఎట్లు నీ తల్పం అశూన్యంగా ఉంటుందో, అదేవిధంగా ఓఅమితవీర్యా! విష్ణూ! మాకుగార్హస్థ్య నష్టమే వాడును కలుగ కుండుగాక :

ఈ విధంగా ప్రార్థించి మరల మరల నమస్కారములు గావించి శ్రియఃపతిని ప్రసన్నుని గావించుకొని, ఆనాడు రాత్రివేళ మాత్రమే, నారదా! నూనె ఉప్పులేని భోజనం చేయలి. ఆ మరునాడు ఉత్తమ బ్రహ్మణునకొక పండును, తన శక్తి కొలది దక్షిణతో కూడ దానం చేయాలి. లక్ష్మీనాధుడు సంతోషించు గాక ! అని సంకల్పించుకొని అఫలదానం చేయాలి. ఈ విధంగ, సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించువరకు చాతుర్మాస్య వ్రతాచరణం చేయాలి. అంతట దేవతలోకరొకరుగా నిద్రనుంచి మేలుకుంటారు. మునే! సూర్యుడు తులారాశిలో చేరగానే శ్రీహరి నిద్రనుంచి లేస్తాడు. తర్వాత కాముడు శివుడు మేలుకుంటారు. అంతట విదియనాడు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తల్పం ఆస్తరణతో కూడ తన వైభవానికి తగిన రీతిలో దానం చేయాలి, ఈ విధంగా మొదటి వ్రతాన్ని నీకు తెలిపితిని. దీనినాచరించిన వారికి జీవితంలో ఎవరితో వియోగం ఎప్పుడు కలుగదు. ఇదే విధంగా మృగశిరా యుక్తమైన శ్రావణ కృష్ణ అష్టమి గూడ పవిత్రమైనది. దానిని కాలాష్టమి అంటారు.

తస్యాం సర్వేషు లింగేషు తిథౌస్వపితి శంకరః | వసతేసంవిధానేతు తత్రపూజాక్షయాస్మృతా. 31

తత్రస్నాయీతవై విద్వాన్‌ గోమూత్రేణజలేనచ | స్నాతఃసంపూజయేత్‌ పుషై#్ప ర్దత్తూరస్యత్రిలోచనమ్‌. 32

ధూపం కేసరనిర్యాసం నైవేద్యంమధుసర్పిషీ | ప్రీయతాంమే విరూపాక్ష స్త్విత్యుచ్చార్య చదక్షిణాం |

విప్రాయదద్యాన్నై వేద్యం నహిరణ్యం ద్విజోత్తమ. 33

తద్వదాశ్వయుజేమాసి ఉపవాసీ జితేంద్రియః | నవమ్యాంగోమయస్నానం కుర్యాత్పూజాం తు పంకజైః.

ధూపయేత్సర్జనిర్యాసం నై వేద్యంముదుమోదకైః.

కృతోపవానస్త్వష్టమ్యాం నవమ్యాంస్నానమాచరేత్‌ | ప్రీయతాంమేహిరణ్యాక్షో దక్షిణాసతిలాస్మృతా. 35

కార్తికేపయసాస్నానం కరవీరేణచార్చనమ్‌ | ధూపం శ్రీవాసనిర్యానం నై వేద్యంమధుపాయసమ్‌. 36

సనైవేద్యంచరజతం దాంతవ్యందానమగ్రజే | ప్రీయతాంభగవాన్‌ స్థాణు రితి వాచ్యమనిష్ఠురమ్‌. 37

కృత్వోపవాసమష్టమ్యాం నవమ్యాంస్నానమాచరేత్‌ | మాసిమార్గశిరేస్నానం దధ్నార్చా భద్రయాస్మృతా.38

ధూపం శ్రీవృక్షనిర్యానం నైవేద్యం మధునోదనమ్‌ | సంనివేద్యారక్తశాలి ర్ధక్షిణాపరికీర్తితా |

నమోస్తుప్రీయతాం శర్వ స్త్వితివాచ్యంచపండితైః. 39

పౌషేస్నానంచ హవిషా పూజా స్యాత్తగరైఃశుభైః | ధూపోమధుకనిర్యాసో నైవేద్యం మధుశష్కులీ. 40

సముద్గాదక్షిణాప్రోక్తా ప్రీణనాయ జగద్గురోః | వాచ్చంనమస్తేదేవేశ త్ర్యంబకేతి ప్రకీర్తయేత్‌. 41

మాఘేకుశోదకస్నానం మృగమదేన చార్చనమ్‌ | ధూపఃకదంబనిర్యాసో నైవేద్యం సతిలోదనమ్‌. 42

పయోభక్తంసనై వేద్యం సరుక్మం ప్రతిపాదయేత్‌ | ప్రీయతాంమేమహాదేవఃఉమాపతి రితీరయేత్‌. 43

ఏవమేవ సముద్దిష్టం షడ్బిర్మాసైస్తు పారణమ్‌ | పారణాంతేత్రినేత్రస్య స్నపనం కారయేత్ర్కమాత్‌. 44

ఆ తిథినాడు శంకరుడన్ని లింగములలోను నిద్రించును, ఆ సమయాన ఆయన నారాధించిన వాని పూజ అక్షయ ఫల దాయకమౌతుంది. అప్పడు విజ్ఞుడు గోమూత్ర జలాలతో స్నానం చేయించి ఉమ్మెత్తపూలతో త్రిలోచనుని పూజించాలి. కేసరసత్తు ధూపం వేసి, తేనె నేయి నై వేద్యం యిచ్చి ''విరూపాక్షుడు నా యెడ ప్రసన్నుడగు గాక!'' అని పలికి సువర్ణ సహితంగా నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణునకు దాన మివ్వవలెను. అదే విధంగా ఆశ్వయుజంలో ఉపవసించి జితేంద్రియుడై నవమినాడు గోమయ స్నానం చేయించాలి. కమలాలతో పూజ చేసి, ధూపం అర్పించి తేనె మిష్టాన్నం (కుడుములు) నై వేద్యం యివ్వాలి. అష్టమినాడుపవసించి నవమినాడు స్నానంచేయలి. హిరణ్యాక్షుడు నన్ననుగ్రహించు గాక ! యనుచు నువ్వులు దక్షిణ యివ్వాలి. కార్తీక మాసంలో పాలతో స్నానం చేయించి కరవీర పుష్పాలతో అర్చన చేయాలి. శ్రీగంధ దూపం వేసి తేనె పాయసం నివేదించాలి. రజత దక్షిణతో ఆ నైవేద్యం బ్రహ్మణునకిచ్చి సౌమ్య వచనాలతో ''భగవతంతుడగు స్థాణువునన్నను గ్రహించు గాక!'' అని నమస్కరించాలి . మార్గశీర్ష మాసంలో అష్టమినాడుపవసించి నవమి రోజున పెరుగుతో స్నానం చేయించి బద్ర పుష్పాలతో అర్చన చేయాలి. బిల్వవృక్షపు బెరడులతో ధూపం వేయలి. తేనెతో వండిన అన్నం నివేదనం చేసి, దానిని బ్రాహ్మణునకు ఎర్రబియ్యపు దక్షిణతో దానం యివ్వాలి. ''శ్రీశర్వునకు నమస్సులు! ఆ ప్రభువు ప్రీతుడగు గాక!'' అని ప్రార్తించాలి. పవిత్రమైన పుష్యమాసంలో నేతితో స్నానం చేయించి మంగళప్రదాలయిన తగరుపూలతో అర్చనం చేయాలి. మధూక చెట్టు బెరడు ధూపం వేసి మదువు శష్కులి (రొట్టె) నైవేద్యం పెట్టాలి. పెసలు దక్షిణగా ఆ నైవేధ్యం బ్రహ్మణునకు దానం చేసి, దేవాధి దేవా! త్ర్యంబకా! నీకు నమస్కారంః'' అని కీర్తించాలి. మాఘ మాసంలో దర్భలు వేసిన జలంతో స్నానం చేయించి కస్తూరితో పూజించాలి. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి. బంగారం పాయసాన్నం దక్షిణగా నివేదితాన్నాన్ని బ్రాహ్మణునకు యివ్వవలెను. ''ఉమాకాంతుడగు మహాదేవుడు ప్రీతుడగు గాక!'' అని సమర్పించవలెను. ఈ విధంగా ఆరు నెలల కాలంసాగే ఈ వ్రతపారణం జరుగుతుంది. పారణం (సమాప్తి) చివర త్రిలోచనునికి సక్రమంగా స్నానం చేయించాలి.

గోరోచనాయః సహితాగుడేన దేవం సమాలభ్యచపూజయేత |

ప్రీయస్వదీనోస్మి భవంతమీశ మచ్ఛోకనాశం ప్రకురుష్వ యోగ్యమ్‌. 45

తతస్తు ఫాల్గుణమాసి కృష్ణాష్టమ్యాం యతవ్రత | ఉపవాసంసముదితం కర్తవ్యం ద్విజసత్తమ. 46

ద్వితీయేహ్నితతః స్నానం పంచగవ్యేన కారయేత్‌ |

పూజయేత్కుందకుసుమైః ధూపయేత్‌ చందనం త్వపి. 47

నైవేద్యంసఘృతం దద్యాత్‌ తామ్రపాత్రే గుడోదనమ్‌ | దక్షిణాంచ ద్విజాతిభ్యో నైవేద్యసహితాం మునే |

వాసోయుగంప్రీణయేచ్చ రుద్రముచ్చార్య నామతః. 48

చైత్రేచోదుంబరఫలైః స్నానం మందారకార్చనమ్‌ | గుగ్గులుం మహిషాఖ్యంచ ఘృతాక్తం ధూపయేద్బుధః.

సమోదకం తథాసర్పిః ప్రీణనం వినివేదయత్‌ | దక్షిణాచసనై వేద్యం మృగాజిన ముదాహృతమ్‌. 50

''నాట్యేశ్వరః నమస్తేస్తు'' ఇదముచ్చార్య నారదః | ప్రీణనందేవనాథాయ కుర్యాచ్చ్రద్ధాసమన్వితః. 51

వైశాఖేస్నానముదితం సుగంధకుసుమాంభసా | పూజనంశంకరస్యోక్తం చూతమంజరిభి ర్విభో. 52

ధూపం సర్జాజ్యయుక్తంచ నై వేద్యం సఫలంగీతమ్‌ | నామజప్యమపీశస్య కాఘ్నేతి విపశ్చితా. 53

జలకుంభాన్‌సనై వేద్యాన్‌ బ్రాహ్మణాయ నివేదయేత్‌ | సోపవీతాన్‌సహాన్నాద్యాం స్తచ్చిత్తై స్తత్పరాయణౖః.

జ్యేష్ఠేస్నానంచామలకైః పూజార్కకుసుమై స్తథా | ధూపయేత్తత్త్రినేత్రంచ ఆయత్యాం పుష్టికారకమ్‌. 55

సక్తూంశ్చసఘృతాన్‌ దేవేదధ్నాక్తాన్‌ వినివేదయేత్‌ | ఉపానద్యుగళ చ్ఛత్రం దానం దద్యాచ్చ భక్తిమాన్‌.

నమస్తేభగనేత్రఘ్నః పూష్ణోదశననాశన | ఇదముచ్చారయేద్భక్త్యా ప్రీణనాయ జగత్పతేః. 57

ఆషాఢేస్నానముదితం శ్రీఫలై రర్చనంతథా | ధత్తూరకుసుమైః శుక్లై ర్ధూపయేత్‌ సిల్హకంతథా. 58

నైవేద్యాఃసఘృతాఃపూపాః దక్షిణా సఘృతాయవాః | నమస్తేదక్షయజ్ఞఘ్నః ఇదముచ్చైరుదీరయేత్‌. 59

శ్రావణమృగభోజ్యేన స్నానంకృత్వార్చయేద్ధరిమ్‌ | శ్రీవృక్షపత్త్రెః సఫలై ధూపందద్యాత్తథాగురుమ్‌. 60

నై వేద్యం సఘృతం దద్యాద్దధిపూపాన్‌ సమోదకాన్‌ |

దధ్యోదనం సకృసరం మాషధానాః సశష్కులీః. 61

దక్షిణాంశ్వేతవృషభం ధేనుంచ కపిలాంశుభాం | కనకంరక్తవసనం ప్రదద్యాత్‌ బ్రాహ్మణాయహి |

గంగాధరేతిజప్తవ్యం నామశంభోశ్చ పండితైః. 62

అమీభిః షడ్భిరపరైర్మాసైః పారణ ముత్తమమ్‌ | ఏవంసంవత్సరం పూర్ణం సంపూజ్య వృషభధ్వజమ్‌.

అక్షయాన్‌ లభ##తేకామాన్‌ మహేశ్వరవచో యథా. 63

ఇదముక్తంవ్రతంపుణ్యం సర్వాక్షయకరం శుభమ్‌ | స్వయంరుద్రేణదేవర్షే తత్తథా నతదన్యథా. 64

ఇతి శ్రీ వామనమహాపురాణ సప్తదశోధ్యాయః.

మహర్షే! గోరోజనం బెల్లం కలిపిన మిశ్రమంతో స్వామిని తాకి పూజించాలి. ''ఈశ్వరా! ఈ దీనునియెడ ప్రసన్నుడవుకమ్ము. నా శోకభాధలన్నింటిని నశింపజేయుము.ః '' అని ఆత్మ నివేదనము చేయవలె. తర్వాత ఫాల్గున మాసంలో కృష్ణ పక్షంలో అష్టమినాడు యథావిధిగ ఉపవసించాలి. ఆ మరునాడే దేవుని *పంచగవ్యములతో నభిషేకించాలి. మల్లెపూలతో పూజించి చందన ధూపం వేయాలి. రాగి పాత్రలో నేయి బెల్లముతో వండిన అన్నం నైవేద్యం చేయాలి. మునీ! రెండు వస్త్రాలు దక్షిణతో నైవేద్యం, బ్రహ్మణునకు రుద్ర నామోచ్చారణ చేస్తూ యివ్వాలి. చైత్ర మాసంలో ఉదుంబర (మేడి) ఫలరసంతో స్నానం చేయించి మందార కుసుమాలతో అర్చించాలి. మహిష గుగ్గిలం నేతితో తడిపి ధూపం వేయాలి. నేయి కుడుములు (లడ్లు) ప్రేమతో నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యంతో బాటు దక్షిణ క్రింద చర్మాన్ని బ్రహ్మణునకివ్వవలెను. నారదా! తదుపరి శ్రధ్ధా భక్తులతో ఆ దేవేశ్వరునకు ప్రీతిగొల్పునట్లుగ ''ప్రభో! నాట్యేశ్వరా! నీకు నమస్కారము!'' అని ప్రణమిల్లాలి. వైశాఖ మాసంలో సుగంధ కుసుమ వాసనలు గల నీటితో అభిషేకం చేసి శంకరునకు తియ్యమామిడి పుష్పగుచ్ఛాలతో అర్చన చేయాలి. నేతితో తడిపిన పాలవృక్షపు బెరడులు ధూలం వేసి ''కాలఘ్నా!'' (కాలాంతకాః) అని జపిస్తూ నేయి పండ్లు నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యదానంతో బాటు బ్రహ్మణునకు జల కుంభములు, యజ్ఞోపవీతాలు, భోజన సామగ్రి దక్షిణ యివ్వాలి. ఇక జ్యేష్ట మాసంలో స్వామికి ఆమలక జల స్నానం చేయించి అర్కపుష్పాలతో (జిల్లేడు పూలు) అర్చన చేయాలి. అభ్యుదయకాయగు సరళ వృక్ష బెరడుల ధూపంవేయాలి. నేయి పెరుగులతో తడిపిన సత్తు (పేలపిండి)ను నై వేద్యం చేయాలి. రెండు పాదరక్షలు గొడుగు దక్షిణగా యివ్వాలి. అనంతరం, జగత్పతి ప్రీతి సంపాదనకై ''భగుని నేత్రములడచిన ప్రభూ, నీకు నమస్సులు! పూషు (సూర్యు)ని పండ్లూడ గొట్టిన స్వామీ! నీకు ప్రణామము!'' లంటూ ఉచ్చరించాలి, భక్తి పురస్సరంగా. ఇక ఆషాడ మాసంలో బిల్వోదక స్నానం శ్వేత ధత్తూర (ఉమ్మెత్త) కుసుమార్చనం ప్రతిపాదింపబడినవి. సిల్హక (సాంబ్రాణి) ధూపం వేసి నేతితో వండిన పూపాలు (అప్పాలు) నైవేద్యం చేయాలి. నేయియవలు దక్షిణగా యివ్వాలి. ''దక్ష యజ్ఞనాశకా!'' అని బిగ్గరగా కీర్తించాలి. శ్రావణ మాసంలో భృంగరాజపత్ర (గుంటకరాకు) జలంతో స్నానం చేయించి మారేడుదళాలతో పూజించాలి. అగరుధూపం వేసి నేతితో వండిన పెరుగు వడలు, లడ్డూలు, పెరుగన్నం, అప్పములు నైవేద్యం చేయాలి. దక్షిణగా తెల్లని ఎద్దును, కపిల గోవును, బంగారం, ఎర్రని వస్త్రాలు బ్రహ్మణునకర్పించాలి. శివుని ''గంగాధర'' నామం కీర్తించాలి. ఈ విధంగా మరొక

__________________________________

* 1. పంచగవ్యములనగా - ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నేయి, గోమయము, గోమూత్రము.

ఆరు మాసాలు వ్రతంచేసి పారణ చేయాలి. ఇట్లు సంవత్సరం పాటు వృషభ##కేతనుని ఆరాధించిన వాడు అనంతమైన కోర్కెలను సిద్దింపజేసుకొనగలడని స్వయంగా మహేశ్వరుడే వక్కాణించాడు, ఓ దేవర్షీ! అన్ని విధాల అక్షయత్వాన్ని ప్రసాందించే ఈ ఉత్తమమమైన పుణ్యవ్రతాన్ని సాక్షాత్తు రుద్రుడే వివరించాడు. దీనికి తిరుగులేదు. సాటిలేదు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని పదిహేడవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters