Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది రెండవ అధ్యాయము

నారద ఉవాచ :

పులస్త్యకథ్యతాం తావ ద్దేవ్యాభూయః సముద్బవః |

మహత్‌ కౌతూహలం మే7ద్య విస్తరా ద్బ్రహ్మవిత్తమ. 1

శ్రుయతాం కథయిష్యామి భూయో7స్యాః సంభవంమునే | శుంభాసురవధార్థాయ లోకానాం హితకామ్యయా.

యాసాహిమవతః పుత్రీ భ##వేనోఢాతపోధనా | ఉమానామ్నాచతస్యాః సాకోశాజ్జాతాతు కౌశికీ. 3

సంభూయ వింధ్యం గత్వా చ భూయో భూతగణౖర్వృతా | శుంభం చై వనిశుంభంచ వధిష్యతి వరాయుధైః

నారద ఉవాచ :

బ్రహ్మంస్త్వయా సమాఖ్యాతా మృతా దక్షాత్మజాసతీ | సాజాతాహిమవత్పుత్రీత్యేవం మేవక్తు మర్హసి. 5

యథాచ పార్వతీ కోశాత్‌ సముద్భూతాహి కౌశికీ | యథాహతవతీశుంభం నిశుంభం చ మహాసురమ్‌ . 6

కస్యచేమౌసుతౌ వీరౌఖ్యాతౌ శుంభనిశుంభకౌ | ఏతద్విస్తరతఃసర్వం యథావ ద్వక్తుమర్హసి. 7

నారద వచనము : బ్రహ్మశ్రేష్ఠుడవగునో పులస్త్యమునీ ! శ్రీదేవి తర్వాతి జన్మను గురించి వినుటకు కుతూహలంగా ఉంది. ఆ కథసవిస్తరంగా చెప్పగలరు. అందురు పులస్త్యుడిట్లనెను. నారదా ః శుంభనిశుంభలనే రాక్షసుల సంహరించుటకు అదేవి గైకొనిన తర్వాతి జన్మను గురించి చెబుతున్నాను వినుము. హిమవంతుని పుత్రిగా జన్మించి ఆమె శంకరుని పెండ్లాడినది. ఆ తపోధనురాలి పేరు ఉమ. ఆమె కోశాన్నుంచి కౌశికి జన్మించినది. జన్మించినంతనే ఆమె భూతగణాలతో వింధ్య మూలానికి వెళ్ళి తన ఉత్తమ ఆయుధాలతో శుంభనిశుంభులను వధించగలదు. అంతట నారదుడిట్లడిగెను బ్రహ్మర్షే! నీవు మొదట దక్షుని కుమార్తె సతీదేవి మృతి జెందినదని చెప్పితివి. ఆమె ఏ విధంగా హిమవంతునింట జన్మించెనో చెప్పగోరెదను. ఆ పర్వత పుత్రికోశాన కౌశికి జన్మించిన వైనం, శుంభనిశంభులను రాక్షస వీరులెవరైనది వివరంగా చెప్పవలయును.

పులస్త్య ఉవాచ :

ఏతత్తేకథయిష్యామిపార్వత్యాఃసంభవంమునే|శ్రుణుష్వావహితోభూత్వాస్కందోత్పత్తించ

శాశ్వతీమ్‌. 8

రుద్రఃసత్యాం ప్రణష్టాయాం బ్రహ్మచారి వ్రతేస్థితః | నిరాశ్రయత్వమాపన్న స్తపస్తప్తుం వ్యవస్థితః. 9

సచాసీద్దేవసేనానీ ర్దైత్యదర్పవినాశనః | శివరూపత్వమాస్థాయ

సైనాపత్యంసముత్సృజత్‌. 10

తతోనిరాకృతాదేవాః సేనానాథేన శంభునా | దానవేంద్రేణవిక్రమ్య మహిషేణ పరాజితాః . 11

తతోజగ్ముఃసురేశానం ద్రష్టం చక్రగదాధరమ్‌ | శ్వేతద్వీపే మహాహంసంప్రపన్నాః శరణంహరిమ్‌. 12

తానాగతాన్‌ సురాన్‌ దృష్ట్వా తతః శక్రపురోగమాన్‌ | విహస్యమేఘగంభీరంప్రోవాచ పురుషోత్తమః. 13

కింజితాస్త్వసురేంద్రేణ మహిషేణ దురాత్మనా | యేన సర్వేసమేత్యైవం మమపార్శ్వ ముపాగతాః. 14

తద్యుష్మాకం హితార్థాయ యద్వదామి సురోత్తమాః | తత్కురుధ్వం జయోయేన సమాశ్రిత్య భ##వేద్దివః. 15

యయేతేపితరోదివ్యా స్త్వగ్నిష్వాత్తేతి విశ్రుతాః | అమీషాంమానసీ కన్యామేనానామ్నా7స్తిదేవతాః. 16

తామారాధ్య మహాతిథ్యాం శ్రద్ధయా పరయా7మరాః | ప్రార్థయధ్వం సతీంమేనాంప్రాలేయాద్రేరిహార్థతః

తస్యాం సారూపసంయుక్తా భవిష్యతి తపస్వినీ | దక్షకోపాద్యయాముక్తం మలవజ్జీవితం ప్రియమ్‌.

సాశంకరాత్‌ స్వతేజో7శం జనయిష్యతియంసుతం | సహనిష్యతిదైత్యేంద్రం మహిషం సపదానుగమ్‌. 19

తస్మాద్గచ్ఛతపుణ్యం తత్కురుక్షేత్రం మహాఫలమ్‌ | తత్రపృథూదకేతీర్థే పూజ్యంతాం పితరో7వ్యయాః. 20

మహాతిథ్యాంమహాపుణ్య యది శత్రుపరాభవమ్‌ | జిహాసతాత్మనః సర్వేఇత్థంవై క్రియతామితి. 21

పులస్త్యుడిట్లనెను : ఓ మునీ! నీకిప్పుడు పార్వతి జన్మ వృత్తాంతమును కుమారసంభవ పురాతన గాథను చెబుతున్నాను. శ్రద్ధగా వినుము. సతీదేవి మరణానంతరం నిరాశ్రయుడైన శంకరుడు బ్రహ్మచర్య దీక్ష గ్రహించి కఠోర తపశ్చర్యలో మునిగెను. ఆ విధంగా దైత్య దర్పవినాశకుడైన ఆదేవసేనాధ్యక్షుడు శివుడు తన దేవసేనాపతిత్వాన్ని విసర్జించెను. ఆ విధంగా సేనానాయకుడైన శంభుని పోగొట్టుకొనిన దేతలు మహిషాసురునిచే ఓడింపబడి, శ్వేత ద్వీపవాసీ మహాహంసస్వరూపుడునైన చక్రగదా పాణి శ్రీహరిని శరణు జొచ్చిరి. దేవేంద్రుని నాయకత్వంలో తన్నాశ్రయించిన ఆ దేవతలను చూచి నవ్వి పురుషోత్తముడైన హరి మేఘ గంభీర ధ్వనితో యిలా అన్నాడు. 'దురాత్ముడైన మహిషాసురుడు మిమ్ములనోడించెనాయేమి? మీరందరు కలిసి కట్టుగా నాదగ్గరకు వచ్చినారు. అలాగైతే మీమేలుకోరి నేను చెప్పునట్లు చేయుడు. దానితో మీకు విజయం తప్పక లభిస్తుంది. అగ్నిష్వాత్తులను పితృదేవతలున్నారు గగా. వార మానస పుత్రిక మేనాకన్య ఉన్నది. ఓ దేవతలారా ! మహాతిథినాడు ఆమెను పరమ శ్రద్ధాభక్తులతో నారాధించి ఆమహాసతిని హిమవంతుని పెండ్లాడునట్లు ప్రసన్నురాలిని గావించుకొనండి. దక్షునిపై కోపించి తన అపవిత్ర శరీరాన్ని విసర్జించిన మహా తపస్విని ఆమె గర్భమున జన్మించగలదు ఆ సౌందర్యవతిని పార్వతి శంకరుని తేజోంశం గలిగిన కుమారుని కనును. అతడు దైత్యేశ్వరుడైన మహిషుని సపరినారంగా సంహరిస్తాడు. కనుక మీరందరు మహాఫలదాయకమైన కురక్షేత్రానికి వెళ్ళి పృథూదక తీర్థంలో పవిత్రమైన మహాతిథినాడు పితరుల నారాధించండి. మీరు శ్రత్రువుల నందరనోడించి సుఖించనెంచిన ఈ విధంగా చేయండి. మరొకదారిలేదు.

పులస్త్య ఉవాచ :

ఇత్యుక్తావాసుదేవేన దేవాః శక్రపురోగమాః | కృతాంజలిపుటాభూత్వా పప్రచ్ఛుః పరమేశ్వరమ్‌. 22

దేవా ఊచుః :

కో7యం కురుక్షేత్రఇతి యత్ర పుణ్యం పృథూదకమ్‌ | ఉద్భవంతస్య తీర్థస్య భగవాన్‌ ప్రబ్రవీతు నః. 23

కేయంప్రోక్తామహాపుణ్యా తిథీనా ముత్తమాతిథిః | యస్యాంహిపితరోదివ్యాః పూజ్యా7స్మాభిః ప్రయత్నతః.

తతః సురాణాంవచనా న్మురారిః కైటభార్దనః | కురుక్షేత్రోద్బవంపుణ్యం ప్రోక్తవాంస్తాంతిథీమపి. 25

శ్రీ భగవానువాచ :

సోమవంశోద్భవో రాజా ఋక్షోనామ మహాబలః | కృతస్యాదౌసమభవ దృక్షాత్సంవరణో7భవత్‌. 26

సచపిత్రానిజేరాజ్యే బాలఏవాభిషేచితః | బాల్యే7పి ధర్మనిరతో మద్భక్తశ్చ

సదా7భవత్‌. 27

పురోహితస్తు తస్యాసీ ద్వశిష్ఠో వరుణాత్మజః | సచాస్యాధ్యాపయామాస సాంగాన్‌ వేదానుదారధీః . 28

తతోజగామచారణ్యం త్వనధ్యాయే నృపాత్మజః | సర్వకర్మసునిక్షిప్యవసిష్ఠం తపసాం నిధిమ్‌ . 29

తతోమృగయావ్యాక్షేపాద్‌ ఏకాకీ విజనం వనమ్‌ | వైభ్రాజంసజగామాథ అథోన్మాదన మభ్యయాత్‌. 30

తతస్తుకౌతుకావిష్టః సర్వర్తుకుసుమే వనే | అవితృప్తఃసుగంధస్య నమంతా ద్వ్యచరద్వనమ్‌. 31

సవనాంతంచదదృశే పుల్లకోకనదావృతమ్‌ | కల్హారపద్మకుముదైః కమలేందీవరైరపి. 32

తత్రక్రీడంతి సతత మప్సరో7మరకన్యకాః | తాసాంమధ్యేదదర్శాథ కన్యాం సంవరణో7ధికామ్‌. 33

దర్శనాదేవసనృపః కామమార్గణపీడితః | జాతః సాచతమీక్ష్యైవ

కామబాణాతురా7భవత్‌. 34

ఉభౌతౌపీడితౌ మోహం జగ్మతుః కామమార్గణౖః | రాజాచలాసనో భూమ్యాం నిపపాత తురంగమాత్‌.

తమభ్యేత్య మహాత్మానోగంధర్వాః కామరూపిణః |

సిషిచు ర్వారిణా7భ్యేత్య లబ్దసంజ్ఞో7భవత్‌ క్షణాత్‌. 36

సాచాప్సరోభిరుత్పాత్య నీతా పితృకులం నిజమ్‌ | తాభిరాశ్వాసితా చాపి మధురైర్వచనాంబుభిః. 37

సచాప్యారుహ్యతురగం ప్రతిష్ఠానం పురోత్తమమ్‌ | గతస్తుమేరుశిఖరం కామచారీ యథా7మరః. 38

పులస్త్యుడిట్ల నియె: శ్రీవిష్ణువు మాటలు విని ఇంద్రుని నేతృత్వంలో ఆ దేవతలు చేతులు జోడించుకొని ఆయన నిలా ప్రశ్నించారు. ఓ దేవదేవా ! ఆ కురుక్షేత్రమననేమి ? పృథూదక తీర్థమెలా ఆవిర్భవించింది. వానిని గురించి మాకు వివరింపదగును. పితరులను శ్రద్ధాభక్తులతో పూజింపదగిన ఆ పుణ్యతిథి మహాతిథి ఏనాడు సంభవించునో తెలియజేయుము ! దేవతల ప్రశ్నలువిని కైటభమర్దనుడైన మురారి పవిత్రమైన కురుక్షేత్ర గాథను మహాతిథిని యిలా వివరించాడు. కృతయుగారంభంలో సోమవంశోద్భవుడైన ఋక్షుడను రాజు మహాపరాక్రమశాలి గలడు. అతడి పుత్రుడు సంవరణుడు. చిన్న తనాన్నే ఋక్షుడాతనిని రాజును గావించెను. అతడు కూడ బాల్యం నుండీ నాకు భక్తుడుగా ధర్మనిరతుడై రాజ్యం చేయుచుండెను. వరుణపుత్రుడైన వసిష్ఠుడాతని పురోహితుడు. ఆ రాజు ఆతనివద్ద సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు. ఒక అనధ్యయన దినాన ఆ రాజు రాజాకార్యాలన్నీ వసిష్ఠునకు వదలి వేటకై వెళ్ళెను. వైభ్రాజమనే అరణ్యంలో వేటాడుతూ ఒంటరిగా ఆ రాజు అందలి వివిధ పుష్పపరిమళాలతో తృప్తిపడక చాలసేపు విహరించెను. ఆవనాంత ప్రదేశం, బాగా వికసించిన కోకనద, కల్హార, పద్మ, కమల, యిందీ వరకు ముదాది వివిధజల పుష్పాలతో నిండి ఉంది. అచట నిరంతరం దేవకామినులు అప్సరసలు క్రీడిస్తూ కనిపించారు. ఆ సుందరులమధ్య నాయకమణిలాంటి ఒక అందాలబరిణలాంటికన్యను చూచి రాజు వెంటనే కామపీడితుడయ్యెను. ఆ బాలకూడ దర్శన మాత్రాన్నే మన్మథబాణాలకు గురియై రాజుమీద మరులు గొనెను. ఆ క్షణంలో మోహాతిశయంతో రాజుమూర్ఛ చెంది గుర్రం మీదనుండి క్రిందబడి పోయెను. అదిచూచి కామ రూపి ణులైన ఆ గంధర్వ స్త్రీలు ఆయన మీద నీళ్ళు చిలకరించి సేదదేర్చిరి. మోహంతో మూర్ఛిల్లిన ఆ బాలికను గూడ సేదదేర్చి అప్సరసలు ఆమె తండ్రి యింటికిచేర్చి తియ్యని మాటలతో శాంపింపజేశారు. స్పృహ వచ్చిన రాజు, గుర్రము నెక్కి తన రాజధాని ప్రతిష్ఠాన పురానికి మేరుశిఖరానికి వెళ్ళే కామచారియగు దేవతవలె చేరుకున్నాడు.

యదాప్రభృతి సాదృష్టా ఆర్షిణా తపతీగిరౌ | తదాప్రభృతినాశ్నాతి దివా స్వపితి నోనిశి. 39

తతః సర్వవిదవ్యగ్రో విదిత్వా వరుణాత్మజః | తపతీతాపితంవీరం పార్థివం తపసాం నిధిః. 40

సముత్పత్యమహాయోగీ గగనం రవిమండలమ్‌ | వివేశ##దేవంతిగ్మాంశుం దదర్శ స్యందనేస్థితమ్‌. 41

తందృష్ట్వా భాస్కరం దేవం ప్రాణమద్ద్విజసత్తమః | ప్రతిప్రణమితశ్చాసౌ భాస్కరేణావిశద్‌ రథే. 42

జ్వలజ్జటాకలాపో7సౌ దివాకరసమీపగః| శోభ##తే వారుణిః శ్రీమాన్‌

ద్వితీయఇవభాస్కరః 43

తతఃసంపూజితో7ర్ఘ్యాద్యైఃభాస్కరేణ తపోధనః | పృష్టశ్చాగమనే హేతుం ప్రత్యువాచ దివాకరమ్‌. 44

సమాయాతో 7స్మిదేవేశ యాచితుం త్వాం మహాద్యుతే | సుతాం సంవరణస్యార్థే తస్య త్వం దాతుమర్హసి.

తతోవసిష్ఠాయదివాకరేణనివేదితాసాతపతీతనూజా |

గృహాగతాయద్విజపుంగవాయ రాజ్ఞో7ర్థతః సంవరణస్య దేవాః . 46

సావిత్రిమాదాయతతోవసిష్ఠః స్వమాశ్రమంపుణ్యముపాజగామ |

సాచాపిసంస్మృత్యనృపాత్మజంతంకృతాంజలిర్వారుణమాహదేవీ. 47

గిరి ప్రదేశాన తపతిని కండ్లతో చూచినది మొదలా రాజు నిద్రాహారాలు మానివేశాడు. ఆ విషయం అంతా గ్రహించిన తపోనిధి వరుణ పుత్రుడు, రాజు మనోగతం తెలిసినవాడై వెంటనే గగనమండలాని కెగసి రథం మీద ఆసీనుడైన సూర్యభగవానుని దర్శించి ప్రణామం చేశాడు. సూర్యుడుగూడనా వసిష్ఠునకు ప్రతినమస్కారం చేసిసగౌర వంగా తన రథం మీద కూర్చండబెట్టుకున్నాడు. ప్రకాశించుచున్న జటలతో సూర్యుని ప్రక్కన కూర్చున్న ఆ మహర్షి రెండవ సూర్యునివలె తేజరిల్లెను. ఆర్ఘ్యపాద్యాలతో సూర్యుడాయనను పూజించి వచ్చిన కారణమడుగగా ఆవరుణాత్మజుడిలా అన్నాడు." మహాతేజస్వివైననో దేవేశ్వరా ! రాకుమారుడగు సంవరణునకై నీ పుత్రికను అర్థింపవచ్చితిని ఆమెను నీవియ్యదగుదువు. దేవతలారా ! తనయింటికేతెంచిన ఆవిప్రోత్తమునకు, సంవరణునకు భార్యగా, సూర్యుడు తనకూమార్తెయగు తపతిని, అప్పగించెను. ఆమెను తీసికొని వసిష్ఠుడు తనపుణ్యాశ్రమానికి చేరుకొనగా నా తపతి తను చూచిన రాకుమారుడు గురుతురాగానే చేతులు జోజించుకొని ఇట్లనెను.

తపత్యువాచ :

బ్రహ్మన్‌ మయాభేదము పేత్య యోహి సహా7ప్సరోభిఃపరిచారికాభిః|

దృష్టోహ్యరణ్య7మరగర్భతుల్యో నృపాత్ముజో లక్షణతో7భిజానే. 48

పాదౌశుభౌచక్రగదాసిచిహ్నౌ జంఘే తథోరూ కరిహస్తతుల్యౌ|

కటిస్తథాసింహకటిర్యథైవ క్షామం చ మధ్యంత్రివళీనిబద్ధమ్‌. 49

గ్రీవా7స్యశంఖాకృతిమాదధాతి భుజౌచపీనౌకఠినౌసుదీర్ఘౌ |

హస్తేతథాపద్మదశోద్భవాంకౌ ఛత్రాకృతి స్తస్యశిరోవిభాతి. 50

నీలాశ్చ కేశాః కుటిలాశ్చ తస్య కర్ణౌసమాంసౌసుసమాచనాసా |

దీర్ఘాశ్చతస్యాంగుళయఃసుపర్వాః పద్భ్యాంకరాభ్యాందశనాశ్చశుభ్రాః. 51

సమున్నతఃషడ్భిరుదారవీర్య స్త్రిభిర్గభీరస్త్రిషుచ ప్రలంబః|

రక్తస్తథాపంచసురాజపుత్రః కృష్ణశ్చతుర్భిస్త్రిభిరానతో7పి. 52

ద్వాభ్యాంచశుక్లః సురభిశ్చతుర్భిః దృశ్యంతిపద్మానిదశైవచాస్య |

వృతఃసభర్తాభగవన్‌ హిపూర్వం తంరాజపుత్రం భువిసంవిచింత్య. 53

దదస్వమాంనాథతపస్వినే 7సై#్మ గుణోపపన్నాయసమీహితాయ |

నేహాన్యకామాంప్రవదంతి సంతో దాతుంతథా7న్యస్యవిభో క్షమస్వ. 54

ఆదేవర్షితో తపతి యిలా అన్నది - భగవన్‌ ! నేనొక పర్యాయం అప్సరసలతో పరిచారికలతోకూడి ఒక కుమారుని చూచి భేదపడ్డాను. దేవతుల్యుడగు నాతని లక్షణాలు చూడగానతడొక రాజకుమారుని తోచెను. చక్క గదా అసి చిహ్నాలతో అతని పాదాలు అందంగా ఉన్నయి. ఏనుగు తొండముల వంటి జంఘలు ఊరువులు, సింహం లాంటి సన్నని నడుము, త్రివళులు, శంఖంలాంటి మెడ, పుష్టంగా లావుగా బలిష్ఠంగా ఉన్న ఆజానుబాహులు కమల చిహ్నాలతోకూడిన అరచేతులు, ఛత్రంలాంటి శిరస్సు, నల్లని వంపులు తిరిగిన కేశాలు, మాంసలమై సమంగాఉన్న కర్ణ నాసికలు, పొడవైనవ్రేళ్ళు, తెల్లని దంతాలు అన్నీ సలక్షణంగా ఉన్నాయి. అతడు ఆరింటిలోఉదారవీర్యుడు. మూడింటిలోగంభీరుడు, మూడింటిలో ప్రలంబుడు. ఐదింట రక్తవర్ణుడు. ఆ రాకుమారుడు నాలుగింట కృష్ణుడు (నలుపు) మూడింట ఆవనతుడు, రెండింట పరిమళుడు, అతడి పది లక్షణాలు పద్మాలను పోలియుంటమి. ఓ బ్రహ్మర్షే ! అలాంటి సుందరుడైన రాజకుమారుని నేనిదివరకు భర్తగా వరించియున్నాను. ప్రభో ! సర్వగుణ సంపన్నుడైన ఆతనికే నన్నిచ్చి వివాహం చేయండి. ఒకరిని వరించిన స్త్రీని మరొకరి కిచ్చుట అనుచితమని పెద్దల వాక్యము. తపోధనా ! నన్ను క్షమించుము.

దేవదేవ ఉవాచ :

ఇత్యేవముక్తః సవితుశ్చపుత్ర్యా ఋషిస్తదాధ్యానపరోబభూవ |

జ్ఞాత్వాచతత్రార్క సుతాంసకామాం ముదా యుతో వాక్యమిదంజగాద. 55

న ఏవపుత్రి నృపతేస్తనూజో దృష్టః పురాకామయసేయమద్య |

సఏవచాయాతిమమాశ్రమం వై ఋక్షాత్మజః సంవరణో హి నామ్నా. 56

అథాజగామసనృపస్యపుత్ర స్తమాశ్రమం బ్రాహ్మణపుంగవస్య ||

దృష్ట్వావసిష్ఠంవ్రణిపత్యమూర్ధ్నా స్థితాత్వపశ్యత్తపతీం నరేంద్రః. 57

దృష్ట్వాచతాం పద్మవిశాలనేత్రాం తాంపూర్వదృష్టామితి చింతయిత్వా |

పప్రచ్ఛ కేయంలలనాద్విజేంద్ర సవారుణిః ప్రాహనరాధిపేంద్రమ్‌. 58

ఇయంవివస్వద్దుహితానరేంద్ర నామ్నా ప్రసిద్ధా తపతీ పృథివ్యామ్‌ |

మయాతవార్థాయదివాకరో7ర్థితః ప్రాదాన్మయా త్వాశ్రమమానినిన్యే. 59

తస్మాత్సముత్తిష్ఠనరేంద్రదేవ్యాః పాణింతపత్యా విధివద్‌ గృహాణ|

ఇత్యేవముక్తోనృపతిః ప్రహృష్టో జగ్రాహ పాణిం విధివత్‌ తపత్యాః. 60

సాతంపతింప్రాప్య మనోభిరామం సూర్యాత్మజాశక్రమప్రభావమ్‌ |

రరామతన్వీభవనోత్తమేషు యథామహేంద్ర దివిదేవకన్యా. 61

ఇతి శ్రీవామన మహాపురాణ ద్వావింశో7ధ్యాయః.

శ్రీహరి యిట్లాఅన్నాడు - "సూర్యపుత్రిక మాటలు వింటూనే ఆ మహర్షి ధ్యానంలో మునిగి ఆమెకూడ మోహితురాలని తెలిసికొని సంతోషించి యిలా అన్నాడు. "బిడ్డా! నీవరణ్యంలో చూచి కామించినవాడు నిజంగా రాజపుత్రుడే. అతడే ఋక్షుని కుమారుడు సంవరణుడు. నా ఆశ్రమానికి వస్తూ ఉంటాడు". అంతటనా రాజపుత్రుడా విప్రోత్తముని ఆశ్రమానికి వచ్చి మహర్షికి తలవంచి ప్రణామం చేసికూర్చున్నాడు. అచటనేఉన్న పద్మవిశాలాక్షి తపతినిచూచి తానుపూర్వం చూచిన సుందరాంగియని తలచి ఆమె ఎవ్వరని వరుణాత్మజుని అడిగెను. అపుడా వసిష్ఠుడు" రాజా! ఈమె సూర్యపుత్రి తపతి" యను కన్యగా విఖ్యాతిగాంచినది. నీ కొరకై సూర్యుని అర్థించి ఈమెను నాఆశ్రమానికి తీసికుని వచ్చితిని. కాబట్టి నీవు వెంటనే విధిపూర్వకంగా ఈతపతీ కన్యాపాణిగ్రహణం చేయుము. " అని ఆదేశించెను. సంవరణుడు మహదానందంతో విర్యుక్త విధానాన ఆ సుందరిని పెండ్లియాడెను. దేవేంద్ర సమప్రభావుడు, మనోభిరాముడునగునా నృపతిని ఆ సూర్యకుమారి పెండ్లాడి, దేవలోకంలో యింద్రునితో విహరించే దైత్యకాంతలాగ ఉత్తమ భవనాల్లో రమించెను.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని యిరువది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters