Sri Vamana Mahapuranam    Chapters   

రెండవ అధ్యాయము

బుషయ ఊచుః :

బ్రూమి వామనమాహాత్మ్య ము»R½ö¼½òLi¿RÁ „sZaP[xtsQ»R½M e ¸R…V´y ‡ÁÖÁLjiõ¸R…V„sV»][µR…»R½òLi LSÇÁùLiaRP»R½úNRP»][M. 1

లోమహర్షణ ఉవాచః

శృణుధ్వంమునయః ప్రీతావామనన్య మహాత్మనః | ఉత్పత్తించ ప్రభావంచ నివాసం కురుజాంగలే. 2

తదేవవంశందైత్యానాం శృణుధ్వం ద్విజసత్తమాః | యస్య వంశే సమభవద్బలి ర్వైరోచనిః పురా. 3

దైత్యానామాదిపురుషో హిరణ్యకశిపుఃపురా | తస్యపుత్రోమహాతేజాః ప్రహ్లోదోనామదానవః. 4

తస్మాద్వైరోచనోజజ్ఞే బలిర్జజ్ఞే విరోచనాత్‌ | హతేహిరణ్యకశిపౌ దేవానుత్సార్య సర్వతః. 5

రాజ్యంకృతంచతేనేష్టం త్రైలోక్యే సచరాచరే | కృతయత్నే షుదేవేషు త్రైలోక్యే దైత్యతాంగతే. 6

జయే తథా బలవతో ర్మయశంబరయోస్తథా | శుద్దాసుదిక్షుసర్వాసు ప్రవృత్తే ధర్మకర్మణి. 7

సంప్రవృత్తే దైత్యపథే ఆయనస్ధే దివాకరే | ప్రహ్లాదశంబరమయై రనుహ్రాదేన చైవహి. 8

దిక్షు సర్వాసుగుప్తాసు గగనే దైత్యపాలితే | దేవేషుమఖశోబాం చ స్వర్గస్థాం దర్శయత్సు చ. 9

ప్రకృతిస్థే తతోలోకే వర్తామనేచ సత్పథే | అభావేసర్వపాపానాం ధర్మభావే సదోత్థితే. 10

చతుష్పాదేస్తితే ధర్మే హ్యధర్మే పాదవిగ్రహే | ప్రజాపాలనయుక్తేషు బ్రాజమానేషు రాజసు.

స్వధర్మసంప్రయుక్తేషు తథాశ్రమనివాసిషు. 11

అభిషిక్తోసురైఃసర్వై ర్దైత్యరాజ్యే బలిస్తదా | హృష్టేష్వసురసం ఘేషు నదత్సు మదితేషు చ. 12

ఆథాభ్యుపగతా లక్ష్మీర్బలిం పద్మాంతరప్రభా | పద్మోద్యత కరాదేనీ వరదా సుప్రవేశినీ. 13

బుషులడిగిరి : ఓ మమర్షీ ! యిక వామన మాహాత్య్మం, ఆయన జన్మవిశేషం, బలిని నిగ్రహించి అతని రాజ్యాన్ని యింద్రున కిచ్చిన గాథ వినిపింపుడు. అందుకు లోమహర్షణుడు చెప్పనారంభించెను. ఓ మునులారా! మహాత్ముడగు వామన దేవుని ఉత్పత్తిని, గొప్పతనాన్ని ఈ కురుజాంగల భూమిలో నివాసం మొదలయినవి చెబుతాను. ప్రేమతో వినండి. ప్రాచీనకాలంలో విరోచన పుత్రుడు బలిరాజు ఆవిర్భవించిన దైత్యవంశానికి హిరణ్య కశిపుడు మూలపురుషుడు. ఆయన కుమారుడు మహాతేజస్వి ప్రహ్లాదుడను దానవుడు. ఆయన కొడుకు విరోచనుడు. బలి ఆ విరోచనుని పుత్రుడు. దేవతలనందరను జయించి హిరణ్యకశిపుడు మరణించిన ఆనంతరం ఆ వంశంవారు మూడు లోకాలను నిష్కంటకంగా పాలించసాగారు. వారలను నిర్జించుటకు దేవతలు చేసిన యత్నాలేవీ ఫలించలేదు. బలవంతులైన మయుడు, శంబరుడు విజేతలయ్యారు. దిక్కులన్నీ స్వచ్ఛమయ్యాయి ప్రజలంతా ధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు, దైత్యవిధానం సర్వత్రా వ్యాపించింది. సూర్యుడు ఆయన పథాన్ని చేరుకున్నాడు. ప్రహ్లాద మయ శంబర అమహ్లాదులు చతుర్థిక్కులను గగన వీథిని చక్కగా రక్షించసాగారు. వారి ఏలుబడిలో దేవతలు యజ్ఞశోభను నలువైపుల వెదజల్లసాగారు. ఈ విధంగా లోకాలన్నీ శాంతిసౌఖ్యాలలో సత్పథానధర్మాచరణం చేస్తుండగా పాపాలన్నీ హరించుకుపోయి ధర్మ ధేనువు నాలుగుపాదాలతో విస్తరించసాగినది. అధర్మం ఒంటికాలిమీద నిలిచిపోయింది. రాజులంతా ప్రజాపాలనం ధర్మయుక్తంగా ఆశ్రమవ్యవస్ధను పరిరక్షిస్తూ చేసేవారు. ప్రజలంతా తమతమ విధులు చక్కగా నిర్వహించేవారు. అలాంటి పరిస్థితులలో బలి దైత్యరాజ్యా భిషిక్తుడైనాడు. దైత్యగణాల్లో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి. అంతట కమల కోమల గర్భగౌరీ, వరదాయిని అయిన లక్ష్మీదేవి పైకెత్తిన చేతులలో పద్మములు పట్టుకుని మంగళప్రదమైన రాకతో బలిని సమీపించెను.

శ్రీరువాచ :

బలే బలవతాం శ్రేష్ఠ దైత్యరాజమహాద్యుతే | ప్రీతాస్మి తవ భద్రంతే దేవరాజపరాజయే. 14

యత్త్వయా యుధి విక్రమ్య దేవరాజ్యం పరాజితమ్‌ |

దృష్ట్వా తే పరమం సత్వం తతోహం స్వయమాగతా. 15

నాశ్చర్యం దానవవ్యాఘ్ర హిరణ్యకశిపోః కులే | ప్రసూతస్యాసురేంద్రస్య తవ కర్మేదమీదృశమ్‌. 16

విశేషతస్త్వయా రాజన్‌ దైత్యేంద్రః ప్రపితామహః | యేనభుక్తంహినిఖిలం త్రైలోక్య మిదమవ్యయమ్‌. 17

ఏవముక్త్వాతుసాదేవీ లక్ష్మీర్దైత్యనృపం బలిం | ప్రవిష్టావరదాసేవ్యా సర్వదేవమనోరమా. 18

తుష్టాశ్చదేవ్యఃప్రవరాః హ్రీః కీర్తిర్ధ్యుతిరేవచ | ప్రభాధృతింక్షమాభూతిర్‌ బుద్ధిర్దివ్యామహామతిః. 19

శ్రుతిః స్మృతిరిడాకీర్తిః శాంతిః పుష్టిస్తథాక్రియా | సర్వాశ్చాప్సరసోదివ్యా నృత్తగీతవిశారదాః. 20

ప్రపద్యంతేస్మ దైత్యేంద్రం త్రైలోక్యం సచరాచరమ్‌ | ప్రాప్తమైశ్వర్యమతులం బలినా బ్రహ్మవాదినా. 21

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే ద్వితీయోధ్యాయః.

శ్రీ లక్ష్మీదేవి యిలా అన్నది. : దైత్యేశ్వరుడవు మహాతేజస్వియగునో బలీ! బలవంతులలో వరిష్ఠుడవగు నీవు యింద్రుని జయించి నందులకు నేను ప్రీతురాలనైతిని. నీకు మేలగుకాక. యుద్ధంలో విక్రమించి దేవరాజును ఓడించావు. అలాంటి నీ ధైర్యసాహసాలు చూచి నేనేస్వయంగా వచ్చాను. అసురేంద్రుడైన హిరణ్యకశిపుని వంశంలో జన్మించిన నీ పట్ల ఈ అద్భుతకార్యం తగియేయున్నది. యిందులో ఆశ్చర్యంలేదు. నీ ప్రపితామహుని కీర్తికి నీవు ఈ విధంగా వన్నె తెచ్చావు. ఆ దైత్యేంద్రుడు ముల్లోకాలను ఆక్రమించి అనుభవించాడు. ఇలా ప్రశంసించి ఆ లక్ష్మీదేవి వరదాయిని సర్వదేవ సేవితురాలు సమస్త దేవసుందిరి దైత్య వల్లభుడగు నాబలిలో ప్రవేశించిరి. వెనువెంటనే హ్రీకీర్తి ద్యుతి ప్రభ ధృతి, క్షమ, భూతి బుద్ధి మహామతి శ్రుతి స్మృతి ఇడ శాంతి పుష్టి క్రియ మొదలగు శ్రేష్ఠదేవీగణం సంతోషంతో ఆమె ననుసరించారు. నృత్యగీతాల్లో ప్రవీణలైన అప్సరసలంతా ఆ బలిచక్రవర్తిని ఆశ్రయించారు. ఈ విధంగా బ్రహ్మనాదియగు నాదైత్యపతి ముల్లోకా ఐశ్వర్యాన్నంతటిని తనకు పాదాక్రాంతం చేసుకున్నాడు.

ఇది శ్రీ వామనమహాపురాణంలో సరోమాహాత్మ్యంలో రెండవ అధ్యాయం ముగిసింది.

Sri Vamana Mahapuranam    Chapters